Contents
Devotion & Sacred Story
Home
Library
Find
Shelf
Settings
←
Leave
Sathya Sai Speaks 1973 · The Doing of Karma, and Discipline
Tap a verse for its meaning
IAST
Telugu
Meaning
Continuous
The Doing of Karma, and Discipline
27 May 1973, Summer Course, Brindavan
Morning
Evening
1
▾
Meaning
Keep
మానవదేహము
కర్మాచరణ
నిమిత్తమై
ఏర్పడినదిగాని
కేవలము
అలంకారమైన
గుడ్డలు
ధరించి,
పుష్టివంతమైన
ఆహారము
తీసుకొని,
జీవితమును
కేవలము
ఒక
ప్రదర్శన
స్వరూపముగా
నిరూపణ
చేయుటకు
కాదు.
“భిక్షాన్నం
దేహ
రక్షార్థం,
వస్త్రం
శీతనివారణం”
ఈ
రెండింటి
ద్వారా
దేహమును
పోషించుకొని,
తద్వారా
కాయమును
కర్మాచరణములో
అనుభవించటానికి
తగిన
ప్రయత్నము
సల్పాలి.
నైతిక,
భౌతిక,
ధార్మిక,
లౌకిక,
ఆధ్యాత్మిక
అన్ని
మార్గములందు
ఏ
విజయాన్ని
మనము
సాధించాలనుకొని
ఊహించుకున్నామో
ఆ
విజయమునకు
విశ్వాసము,
త్యాగము
రెండింటియొక్క
అనుభూతిలో
క్రమశిక్షణ
అత్యవసరము.
క్రమశిక్షణ
లేనప్పుడు
మానవుడు
కేవలము
తన
కర్తవ్యమేమిటో
కూడను
గుర్తించుకోటానికి
వీలుండదు.
ప్రవహించే
నదులకు
కట్టలు,
ఆనకట్టలు
కట్టి
తద్వారా
ఆ
జలమును
మన
పంటలకు
సక్రమమైన
రీతిగా
అందించటానికి
అవకాశము
కల్పించుకుంటున్నాము.
అదేవిధముగనే
కట్టయే
లేకపోయిన,
ఆనకట్టలే
కట్టకపోయిన
ప్రవాహము
మనకు
ఉపయోగవంతమైనదిగా
ఉండదు.
అదేవిధముగా
మన
జీవితమనే
ప్రవాహమునకు
డిసిప్లిన్
ఒక
ఆనకట్ట
వంటిది.
వృక్షమునకు
వేర్లు
ఆధారము.
వేరులకు
నీరుపోసి,
వేర్లుకు
ఎరువులు
పెట్టి
తగిన
విధముగా
అభివృద్ధి
పరచినప్పుడే
వృక్షముకూడను
పెరిగి
ఫలపుష్పాలను
అందిస్తుంది.
అదేవిధముగా
మానవునికి
యవ్వనత్వమనే
వయస్సు
వేర్లవంటివి.
ఈ
వేర్లు
తగినంత
భద్రతలో
ఉండినప్పుడే,
తగినంత
పోషణలో
ఉండినప్పుడే
జీవితము
అనే
వృక్షము
క్షేమంగా
ఉండటానికి
అవకాశము
ఉంటుంది.
అనేక
పర్యాయములు
చెప్పాను.
మన
జీవితము
ఒక
వృక్షముతో
పోల్చుకోవాలి.
ఈ
వృక్షమునకు
మన
తల్లి
తండ్రి
సోదర
సోదరిలు
కూడను
అనేకమంది
బంధుత్వాలు
కొమ్మలుగ
ఉంటుంటాయి.
ఈ
వృక్షములో
మన
స్నేహములన్నీ
ఆకులవంటివి.
అయితే
యీ
స్నేహములంతా
ఒక్కొక్కతూరి
రాలిపోతుంటాయి.
ఇందులో
చక్కని
సుగంధమునందించే
పుష్పములుంటుంటాయి.
ఆ
పుష్పములే
మన
సద్గుణములు.
ఈ
పుష్పముల
ద్వారానే
ఫలము
చిక్కుతుంది.
ఈ
ఫలమే
ఆనందము.
ఈ
ఫలములోని
తీయని
రసమే
శీలము.
ఈ
తీయని
రసమే
లేకపోతే
ఫలమును
లైక్
చేయము.
పైన
fruit
క్రింద
root.,
ఈ
రూటే
faith
in
God.
2
▾
Meaning
Keep
క్రింద
ఆత్మ
విశ్వాసమనే
root,
character
అనే
fruit
లేకపోతే
ఈ
వృక్షము
firewood
అయిపోతుంది.
Not
tree.
కనుక
మనము
పైన
fruit
ను
develop
చేసుకోవటానికి
root
ని
కాపాడుకోవడానికి
ప్రయత్నము
చేయాలి.
దీనియొక్క
ప్రతిబింబ
నిమిత్తమై
జగత్తుకు
సంబంధించిన
వృక్షములకు
వేర్లకు
నీరు
పోయటానికి
పూనుకోవాలి.
ఈనాడు
మనము
చేయబోయే
social
work
కి
కొన్ని
వృక్షముల
యొక్క
వేర్లకు
నీరుపోసే
ప్రయత్నము,
చక్కగా
నీరు
దిగటానికి
తగిన
భూసంస్కారము
రెండు
చేయవలసినటువంటిది.
ఏదో
కొన్ని
వృక్షాలకు
నీరు
పోస్తున్నామని
యీ
పనిలో
ప్రవేశించకూడదు.
జీవితమనే
వృక్షానికి
ఆత్మ
విశ్వాసమనే
ప్రేమను
మనము
ధారపోస్తున్నాము
అనేటువంటి
భావముతో
యీ
పనిలో
మనము
ప్రవేశించాలి.
సమాజ
సేవ
ద్వారా
హాలీడేస్
హోలీ
డేస్
గా
గడపాలి
ఈ
పవిత్రమైన
కర్మను
మన
జీవిత
పర్యంతము
మన
హృదయమునందు
భద్రము
చేసుకొని
ఏ
వ్యక్తికి,
ఏ
జీవికి
ఏ
సమయమునందు
ఏ
బాధలు,
ఏ
చింతలు,
ఏ
వికారములు
కలుగుతుంటాయో
ఆ
బాధలు,
దుఃఖములు,
విచారములు
సాధ్యమైనంత
మనము
నివారణ
చేయటానికి
పూనుకోవటమే
ప్రధానమైన
సమాజసేవ.
కేవలము
ఈనాడు
సమ్మర్
క్లాసులలో
చేరినామని
యిది
విధిగా
చేయవలసిన
నిర్బంధమని
మీరు
భావించుకోకూడదు.
మీ
జీవితమంతా
కూడను,
కాలము
చిక్కినప్పుడు,
సెలవలు
వస్తుంటాయి,
ఆ
సెలవులలో
మనము
హాలిడేస్‌ను
హోలీడేస్గా
గడపాలి.
ఈనాడు
అధికంగా
మీతో
మాట్లాడి
మనము
చేయవలసిన
కర్మకు
కాలమును
అధికముగా
తీసుకొని
తక్కువ
కర్మను
చేయటం
చక్కనైనది
కాదు.
మీరు
కర్మాచరణ
నిమిత్తమై
కాలమును
అధికముగా
తీసుకోటానికి
యిప్పటితో
నా
సంభాషణ
యింతటితో
ముగిస్తున్నాను.
సాయంకాలం
సమాజసేవ
గురించి,
సహజమైన
జీవితాన్ని
గురించి,
ఈ
దేహమునకు
పుష్టికరము,
తుష్టికరము,
ఆనందకరము
అయినటువంటి
బలమును
అందించే
విధానము
సాయంకాలము
సంప్రదించవచ్చును.
మనము
దేహరీతిగా
నిత్యము
ఏవిధముగా
శుభ్రము
చేసుకుంటున్నామో
అదేరీతిగా
బహిర్ముఖమైన
ప్రదేశములను
పరిశుద్ధముగా
పెట్టుకోవటం
అత్యవసరం.
దానికి
ఒక్క
చిన్న
ఉదాహరణ.
నిజముగా
సహజమైన
ధోరణి
మనము
అనుసరించినామంటే
స్నానముచేసిన
తక్షణమే
శుద్ధమైన
వస్త్రములు
వేసుకోవటం
పరిపాటి.
3
▾
Meaning
Keep
అట్లుకాకుండా
దేహమునకు
మాత్రమే
స్నానము
చేసి
తిరిగి
మురికి
వస్త్రములే
వేసుకుంటే
మనకు
అంత
సంతృప్తి
కరముగా
ఉండదు.
కాని
దేహమును
శుభ్రము
చేసుకొనిన
తరువాత
పరిశుభ్రమైన
వస్త్రములు
ధరించినప్పుడు
ఎంతో
ఉల్లాసము
నందిస్తుంది.
అదే
విధముగనే
మనలో
పరిశుద్ధమనేది
పెట్టుకొని
బయట
ప్రదేశము
అశుద్ధముగా
వుంటుంటే
పరిశుద్ధమైన
హృదయముకూడను
కొంత
మాలిన్యము
పొందుతుంది.
కనుక
ప్రకృతంతయు
మనము
ధరించిన
వస్త్రము
వంటిది.
దీనిని
ధారయతీతి
ధర్మః
అన్నారు.
మనము
ధరించిన
ప్రకృతి
కూడను
పరిశుద్ధముగా
ఉండినప్పుడు
మన
జీవితము
కూడను
శుద్ధమైన
చిత్తముగా
తయారౌతుంది.
కానీ
ఈనాడు,
మీరు
ఉన్న
నివాసమునకు
మీరు
ఉన్న
క్యాంప్
ప్రదేశము
కొంత
పరిశుద్ధమైన
రీతిగా
పెట్టుకొని
తద్వారా
ఈ
వృక్షమునకు
నీరును
యిముడ్చుకునే
పరిస్థితిగా
సంస్కరింపజేసి
ఈవిధమైన
సేవను
ప్రారంభించటానికి
హృదయపూర్వకంగా
చేసి,
ఏదో
ఈ
క్యాంపులో
ఒక
నిర్బంధమైన
సేవగా
నియమించారని
యీ
ఫోర్సుతో
మీరు
పోకుండా
ప్రేమతో
ఆ
సేవలో
మీరు
పాల్గొని
తద్వారా
యితరులయొక్క
ప్రేమకు
మీరు
గురి
అవుతారని
కూడను
విశ్వసిస్తూ
ఆశీర్వదిస్తూ
నా
ప్రసంగాన్ని
విరమిస్తున్నాను.
మనము
సేవ
చేసే
నిమిత్తమై
బయలు
దేరే
సమయములో
కూడను
మార్కెట్టులో
మాదిరి
గలాటాగా
బయలుదేర
కూడదు.
మెల్లగా
యిద్దరిద్దరు,
లైనుగా,
డిసిప్లిన్‌గా,
చూచే
జనానికి
డిసిప్లిన్
వారికి
టీచ్
చేసినట్లుగా
మీరు
భావించుకోవాలి.
నిశ్శబ్దముగా
లైనులో
మీ
మీ
పదార్ధములు
చేబట్టి
యీ
సేవలో
పాల్గొనండి.
లేచి
నలుగురు
నలుగురుగా
వెళ్లండి.
Previous
←
The Ātma Is True, the Body Is Transient
Next
Service to Man Is Itself Service to Mādhava
→