Contents
Devotion & Sacred Story
Home
Library
Find
Shelf
Settings
←
Leave
Sathya Sai Speaks 1973 · Karma, Bhakti, Jñāna
Tap a verse for its meaning
IAST
Telugu
Meaning
Continuous
Karma, Bhakti, Jñāna
3 June 1973, Summer Course, Brindavan
Morning
Evening
1
▾
Meaning
Keep
నిత్యము
మన
దేహమునకు
స్నానపానాదులను
ఆచరించటం
భారతీయుల
యొక్క
సర్వ
సామాన్య
సాంప్రదాయము.
అయితే,
భారతీయులు
అనిత్యమైన
దేహమునకు
మాత్రమే
స్నాన
సంధ్యాదులు
ఆచరించటమే
కాకుండా
మానసిక
సంబంధమైన
వృత్తులకు
ఒకవిధమైన
శౌచము
అనేటువంటి
స్నానము
ఆచరించటము
వుంది.
భారతీయ
పవిత్రమైన
ఆధ్యాత్మిక
సంస్కృతిని
పురస్కరించుకొని
ప్రతి
భారతీయుడు
నలుమూలల
నుంచి
యిట్టి
పవిత్రమైన
స్నానమును
ఆచరించే
నిమిత్తము
ప్రయాగ
చేరుతుంటారు.
దేశమునకు
north,
sourth,
east,
west
అనేటువంటి
దేశభాషలయందుగాని,
వారి
ఆచార
వ్యవహారములందుగాని
భాషలయందు
భేదములుండినప్పటికిని
యాత్ర
స్థానములు
మానవుని
యొక్క
ఏకత్వాన్ని
నిరూపణచేసే
పవిత్రమైన
దివ్య
ప్రదేశములుగా
భారతీయులు
విశ్వసించారు.
అంతవరకు
మనం
పోనక్కరలేదు.
ఇప్పుడు
భారత
దేశమునందు,
అన్ని
రాష్ట్రములనుండి
వచ్చినటువంటి
విద్యార్ధులు
యిక్కడ
ఒక
ఏకత్వమైన
మాతృతత్త్వాన్ని
ఒక
దివ్యత్వమైన
ఆత్మతత్త్వాన్ని,
సన్నిహితమైన
సోదరత్వాన్ని
మీరు
ఈ
ప్రదేశములో
అనుభవిస్తుండేది
మీకే
గుర్తు.
అయితే,
ఈ
ప్రయాగ
అనే
పేరు
ఏవిధముగా
వచ్చినదని
మనము
విచారించాలి.
పవిత్రమైన
మూడు
నదులు
చేరటంచేత
త్రివేణి
సంగమము
అని
ఒక
పేరు.
ఈ
త్రివేణి
అనేది
ఆడవారియందు
ప్రత్యేకించి
గుర్తించటానికి
అవకాశము
ఉంటుంది.
వారు
వేసుకునే
జడలోపల
మూడు
చేరి
ఒక
జడగా
తయారౌతుంది.
దీనిని
కూడా
త్రివేణి
అని
పేరు.
ఈ
త్రివేణి
యొక్క
ఏకత్వమే
ఏకవేణి
అని
పేరు.
ఆ
మూడు
చేరి
ఏకమైపోతున్నాయి.
కాని,
ఈనాడు
దురదృష్టవశాత్తు
ఆ
మూడింటిని
వారు
చేర్చకుండా
రాక్షసులవలె
విరబూసుకొని
వస్తుంటారు.
కాళికాదేవి
ఆ
రూపము
ధరిస్తుంది.
ఆ
విధమైనది
మన
భారతీయులకు
సగౌరవము
కానేరదు,
దీనికి
ఒక
చిన్న
ఉదాహరణము.
సీతాదేవి
అరణ్యములో
సంచరించే
సమయమందు
పతితో
ఉండినప్పుడు
తాను
రెండు
జడలుగా
వేసుకునేదట.
రావణుడు
తీసుకుని
వెళ్లిన
తరువాత,
అశోక
వనములో
చేరిన
తరువాత
పతి
వియోగముచేత
తాను
ఏవిధమైన
సంస్కారము
చేసుకొనక
రెండు
జడలు
ఏకజడగా
ఏకమైపోయినాయట.
2
▾
Meaning
Keep
అయితే
సీతాన్వేషణ
నిమిత్తమై
హనుమంతుడు
వెళ్లిన
సమయంలో
రాముడు
సీత
గుర్తులు
కొన్ని
హనుమంతునితో
చెప్పి
పంపాడు.
ఎందుకనగా
హనుమంతుడు
పూర్వము
సీతను
చూడలేదు.
అప్పుడు
రాముడు
ఒక
light
yellow
చీర
కట్టుకుని
ఉంటుంది.
రెండు
జడలు
వుంటాయి.
ఆమె
అనేకరకములైన
దివ్యకళలతో
ఉట్టిపడుతూ
ఉంటుంది
అని
గుర్తులు
చెప్పాడు.
లంకలో
వెళ్లి
విచారణ
చేసినప్పుడు
రెండు
జడల
వ్యక్తి
తనకు
కనిపించలేదు
అక్కడ.
కారణము
ఏమనగా
రాక్షసులు
ఎప్పుడు
తలను
విరబోసు
కుంటారు.
వారికి
ఏకజడ
లేదు.
త్రివేణి
లేదు.
అందులో
ఒక్క
సీత
మాత్రమే
కనిపించింది
ఆవిధంగా
విరబోసుకోకుండా.
అయితే
రాముడు
చెప్పినట్టు
రెండు
జడలు
లేవు
ఒక్కటి
మాత్రమే
ఉంది.
అయితే
యీమె
సీత
కాదని
యింకా
అన్వేషణ
మొదలుపెట్టాడు.
అనగా
త్రివేణి
యొక్క
పవిత్రతను
మనము
గుర్తించుకునే
నిమిత్తమై
యిది
ఉదాహరణంగా
తీసుకోవలసి
వచ్చింది.
కర్మలను
పవిత్రం
గావించుకోవాలి
త్రివేణి
అనగా
గంగ,
యమున,
సరస్వతి
మూడు
నదులు
చేరిన
ప్రదేశమునకు
త్రివేణి,
అదే
పవిత్రమైన
ప్రయాగ
అనే
సార్ధక
నామాన్ని
అందుకుంది.
అయితే
ఈ
గంగ
యమున
సరస్వతి
విశిష్టత
యీ
మానవత్వములో
ఏవిధముగా
ఉంటున్నాది
అని
మనము
తెలుసు
కోవాలి.
మన
భక్తియే
గంగ,
కర్మయే
యమున,
జ్ఞానమే
సరస్వతి.
గంగ
అనగా
పవిత్రమైన
రీతిగా
మన
భావములు
పరమాత్మునిలో
యిమడ్చాలి.
యింక
యమున
-
యమున
ఎట్టిదనగా
తన
కర్తవ్యమును
నిర్వర్తించుకునే
దానిలో
క్రమశిక్షణ
యేమాత్రము
ఉల్లంఘించదు.
అయితే
ఈ
గంగ
యమునలు
మన
యొక్క
ఉచ్ఛ్వాస
నిశ్వాసములే.
ఈ
ఎడమవైపున
శ్వాస
గంగ,
కుడివైపుననున్న
శ్వాస
యమున.
ఎడమవైపున
దానికే
యిడ
అని,
కుడివైపున
దానికే
పింగళ
అని
పేరు.
ఇడ,
పింగళ
అనే
రెండు
చేరి
బ్రహ్మ
మధ్య
స్థానమనే
సరస్వతితో
కూడి
వుంటాయి.
అదేవిధముగ
గంగ
యమున
రంధ్రములద్వారా
కనిపిస్తాయిగాని
సుషుమ్న
అనే
దానిని
మనము
చూడలేకుండా
పోతున్నాము.
అదేవిధముగా
గంగ
యమునలు
చూస్తున్నామేగాని
సరస్వతిని
చూడలేకపోతున్నాము.
అయితే,
ఏది
చూడలేకుండా
వున్నామో
అదే
చూచేందుకు
ఆధారమై
ఉన్నది.
మనము
ఇడ,
పింగళ
అనే
రెండు
ద్వారములకు
సుషుమ్న
అనే
చేరిక
లేకపోతే
యిడ
పింగళ
పనిచేయలేవు.
3
▾
Meaning
Keep
అదే
విధముగా
భక్తికర్మలు
రెండూ
లేకుండిన
జ్ఞానమనేది
లభించదు.
జ్ఞానమే
లేక
భక్తి
కర్మలు
నిష్ప్రయోజనము.
అదేవిధముగా
మీరు
సమ్మర్
క్లాసులో
ప్రవేశించి
ఆధ్యాత్మిక
సంబంధమై
ప్రబోధలు
చిత్తశుద్ధి
ద్వారా
మీరు
చేర్చుకుంటున్నారు.
అది
భక్తికి
లక్షణము.
అయితే
దానిని
కర్మాచరణయందు
వినియోగపెట్టుకున్న
జ్ఞానము
మనకు
లభించదు.
వారమంతయు
మీరు
శ్రవణంచేసి
ఆర్జించిన
పవిత్రమైన
భావములను
ఈ
sunday
అనే
రోజున
కర్మాచరణ
రూపములో
పవిత్రము
చేయాలి.
ఇట్టికర్మను
ఆచరించే
నిమిత్తమై
సామాజికసేవ
అని,
స్వయంకృషి
అని
దీనికి
ఉత్తమమైన
పేర్లు
మనము
కల్పించుకున్నాము.
జీవితమంతా
కర్మపైనే
ఆధారపడి
ఉంటున్నాది.
కర్మచేయక
క్షణమైనా
నిల్చటానికి
వీలుకాదు.
ఏ
పని
చేయక
నేను
కూర్చున్నాను
అనుకున్న
వాడు
కూడ
కర్మ
చేస్తున్నాడు.
ఉచ్ఛ్వాస
నిశ్వాసములే
కర్మ.
ఒకవైపుననున్నకాలు
మరొకవైపున
మార్చుకోటమే
కర్మ.
ఆకలిదప్పులే
కర్మ.
అన్నీ
కర్మతో
చేరినవే.
ఏది
చేయకపోయినా
కన్నులైనా
ఆడిస్తుంటాము
మనము.
అదికూడను
కర్మగానే
ఉంటుంది.
ఈ
దేహము
స్థంభింప
చేసినప్పటికి
మనసైనా
పరిపరి
విధముల
పరుగెత్తుతుంది.
అదికూడను
ఒక
కర్మయే.
కనుక
మనము
కర్మ
లేకుండా
ఈ
కాయమును
ఈ
లోకములో
ఉంచుకొనుట
అసాధ్యము
కాన,
కర్మాచరణే
మన
కాయమునకు
ప్రధాన
లక్ష్యముగా
మనము
విశ్వసించి
ఈ
కర్మయందు
పవిత్రమైన
కర్మగాను,
సామాజికమైన
కర్మగాను,
పరోపకార
సంబంధమైన
కర్మగాను,
ఆత్మ
తృప్తి
సంబంధమైన
కర్మగాను
ఆచరించటం
అత్యవసరం.
ఇది
భక్తి,
కర్మ,
జ్ఞానము
మూడు
కూడను
జన్మను
సార్ధకం
గావించుకునే
కోసం
ఆచరించే
పవిత్ర
మార్గములు.
అయితే
దీనికి
ఒక
చిన్న
కథ
చెప్పి
నా
ప్రసంగము
విరమిస్తాను.
భారతమునందు
శాంతి
పర్వమునందు
ధర్మరాజునకు
భీష్ముడు
ఒక
కథ
చెప్పాడు.
ఒక
కొలనులోపల
మూడు
చేపలు
వుండినాయట.
అందులో
ఒక
చేప,
రెండవ
చేప
దగ్గరకు
వచ్చి
‘సోదరులారా!
మనము
ఎంతకాలమని
జలములో
ఉండ
గలము.
ఈ
జలము
ఎండిపోయిన
తరువాత
ఏ
బెస్తవాడో
వచ్చి
మనలను
పట్టి
ప్రాణములు
తీస్తాడు.
కనుక,
ఈ
నీరు
ఎండిపోక
పూర్వమే
ఎక్కడైనా
శాశ్వతమైన
జలములో
చేరిపోవటానికి
ప్రయత్నం
చేయుట
మంచిదని
ఒక
చేప
చెప్పింది.
అందులో
రెండవ
చేప
చెప్పిందట
‘సోదరా!
అది
ఎండిపోయే
పరిస్థితి
ఏర్పడి
నప్పుడు
మనము
చూచుకుందాము,
యిప్పుడే
యోచన
ఎందుకు?’
4
▾
Meaning
Keep
అంది.
సరే.
మూడవ
చేప
చెప్పిందట.
‘నీరు
ఎండటము
ఒక
కల్ల,
బెస్తవాడు
పట్టటము
ఒక
కల్ల.
మనము
వాని
చేతిలో
చావటము
అసత్యమే.
మనము
యోచనే
చేయనక్కర
లేదు.
జీవించుదాం.
పో’
అని
మూడవది
గట్టిగా
బోధించిందట.
అయితే,
ఈ
మూడు
చేపలు
ఏమిటి?
సత్వ
రజో
తమో
అనే
మూడు
జీవులు
కూడను
సంసారమనే
కొలనులోపడి
పరితపిస్తుంటాయి.
అలాంటి
సమయములోపల
సంసార
మనే
ఆయువు
అనే
జలము
క్రమక్రమేణా
నశిస్తూ
వుంటుందట.
క్రమక్రమేణా
యీ
జలము
నశించి
పోతూరాగా
అందులో
యముడు
అనే
బెస్తవాడు
వచ్చి
పాశము
అనే
వలను
వేస్తాడట.
కనుక
ఈనీరు
ఎండిపోక
మునుపే,
బెస్తవాడు
వచ్చి
వలను
విసరక
పూర్వమే
మనము
శాశ్వతమైన
సముద్రమనే
మోక్షములో
చేరిపోవాలి
అని
మొదటి
చేప
బోధించింది.
భవిష్యత్తు
భద్రత
ప్రప్రధమంలోనే
యోచించి
విచారించి
దానికి
తగిన
మార్గము
వెతుక్కోవటం
సాత్వికము
యొక్క
లక్షణము.
ఇంక
రజస్సు
ఏమి
చెబుతుంది.
అది
వచ్చినప్పుడు
చూచుకుందాములే
అని
అలక్ష్యము
చేస్తుందట.
కనుక,
మనము
ఈ
యువకత్వముగానున్న
సమయ
మందు
మనము
జీవితమును
అలక్ష్యము
చేస్తున్నామంటే
నిజముగా
మనము
సాక్షాత్
రజోగుణములోనే
జీవిస్తున్నామన్నమాట.
అసలు
భవిష్యత్తునే
యోచన
చేయకుండా
అప్పటికప్పుడు
ఆనందాన్ని
అనుభవించుకొని
మన
జీవితము
ఎట్లా
అంత్యము
చేసుకుందామనే
యొక్క
పశుత్వంగా
మృగత్వంగా
మనం
పాటించటము.
అనేది
సాక్షాత్
తమోగుణము
యొక్క
తత్త్వము.
కనుక
తమోగుణ
రజోగుణములలో
మన
జీవితము
అంకితము
చేసి
మానవత్వానికే
మసి
పూసే
ప్రయత్నానికి
మనం
పూనుకోకూడదు
దేహము
ఎంత
పెరుగుతూ
పెరుగుతూ
పోతున్నాదో
ఆయువు
అంత
తరుగుతూ
తరుగుతూ
దిగుతున్నది.
కనుక,
యిది
పూర్తిగా
నశించక
పూర్వమే
మనము
పవిత్రమైన
దివ్యతత్త్వాన్ని
అర్ధము
చేసుకొని
దానిని
వర్తించి
గమ్యమును
చేరే
ప్రయత్నము
చేయాలి.
మనము
ఈ
లేత
వయస్సందే
ఈ
ఆధ్యాత్మిక
మార్గముగాని,
దివ్యమైన
తత్త్వమునుగాని
మన
చిత్తములో
వుంచుకొని
దానికి
తగిన
ప్రయత్నాలు
చేయాలి.
కనుక
భక్తి
ప్రపత్తులతో
కొంతవరకు
కర్మలు
ఆచరించి
కర్మ
ప్రతి
ఒక్కటి
నా
ఆనంద
నిమిత్తమై
నేను
చేస్తున్నాను
అనే
భావములో
మనము
ఈనాడు
సామాజికసేవలో
పాల్గొనాలి.
5
▾
Meaning
Keep
యిక్కడేకాకుండా
తిరిగి
మీ
క్లాసులంతా
అయిన
తరువాత
sunday
ఏ
సినిమాలో,
ఏ
పిక్నిక్లో,
ఏ
అనవసరమైన
వాటిలో
కాలమును
అపవిత్రము
చేయకుండా
మీరు
గ్రామాలకు
వెళ్లి
ఒక
ఐదారుమందైనా
ఒక
కమిటీగా
చేర్చుకున్నప్పుడు
ఆ
గ్రామవాసులే
యింకా
పది
పన్నెండుమంది
చేరి
ఆ
గ్రామములో
పవిత్రమైన
సర్వీసును
అనుభవించిన
వారమవుతాము,
అందించిన
వారమవుతాము.
పవిత్రమైన
ఈ
మానవజన్మ
మనకు
సంప్రాప్తమైనప్పుడే
యీ
పిక్నిక్లకు
మనం
పోతుంటే
కట్టకడపటికి
యముడు
మనకు
పిక్నెక్
చేసేస్తాడు.
కనుక
మనము
కాలమును
వృధా
పరచకుండా
మనము
sunday,
sunday
అంటే
(తమిళనాడు
నుండి
ఎంతమంది
వచ్చారు)
తమిళములో
sunday
అంటే
fighting.
ఈ
sunday
యీ
విధమైన
జగడాలకు
మీరు
పూనుకోకండి.
అందరూ
చేరి
పవిత్రమైన
కార్యములోపల
జీవితాన్ని
సార్థకము
చేసుకోవాలని
నేను
ఆశిస్తూ
ఎక్కువ
ప్రసంగానికి
పోతే
పని
చాలా
తక్కువ
అయిపోతుంది.
మీరు
ఎక్కువ
పనిచేసి
తక్కువ
జీవితములో
ఆనందము
అనుభవించటానికి
పూనుకోండి.
దీనినే
simple
living
high
thinking
అన్నారు.
యింక
సమాజసేవకు
మీరు
లేచి
ఎట్టి
క్రమశిక్షణకు
భంగము
లేకుండా
మీ
కార్యక్రమములో
మీరు
పాల్గొనండి.
Previous
←
Vairāgya from Moha, and Serenity of Mind
Next
Youth and the Tapas of Speech
→