Contents
Devotion & Sacred Story
Home
Library
Find
Shelf
Settings
←
Leave
Sathya Sai Speaks 1973 · Youth and the Tapas of Speech
Tap a verse for its meaning
IAST
Telugu
Meaning
Continuous
Youth and the Tapas of Speech
3 June 1973, Summer Course, Brindavan
Morning
Evening
1
▾
Meaning
Keep
ఇంద్రియంబుల
మనస్సు
నిల్పిన
అంధుడైనను
మోక్షమందును
ఇంద్రియంబుల
నిలకడ
లేనిది
చంద్రుడైన
బలము
నొందడు.
భజగోవిందం
గోవిందం
భజ
మూఢమతే
పవిత్రాత్మ
స్వరూపులైన
విద్యార్థులారా!
జగత్తునందు
సమస్త
పదార్థములు
భగవత్సంకల్ప
సృష్టి
అయినప్పటికిని
కొన్ని
పదార్థములను
మనము
అతిజాగ్రత్తగా
ఉపయోగించుకోవలసి
వస్తుంది.
తెలిసి
ఆ
పదార్ధములను
వినియోగించుకున్న
అవి
మనకు
ఉత్తమస్థితిని
అందించటమే
గాక
తద్వారా
మనకు
సుఖసంతోషములను
కూడ
కలిగింప
జేస్తుంది.
మనము
తెలియక
కొన్ని
పదార్థములను
ఉపయోగించుకున్న
అవి
మనకు
ప్రమాదములను
కూడను
సంభవింపజేస్తుంది.
కత్తి,
నిప్పు,
కరెంటు
యిత్యాది
పదార్థములను
తెలిసి
మనము
ఉపయోగించుకున్నప్పుడు
వాటివలన
మనకు
తగినటువంటి
ఫలితమే
కాకుండా
సుఖము
కూడను
మనకు
లభిస్తుంది.
వాటిని
మనము
తెలిసికొనక,
వినియోగించు
విధానము
గుర్తించుకొనక
ఉపయోగించుటకు
పూనుకున్న
కొంత
ప్రమాదము,
కొంత
అననుకూలము
కూడను
వచ్చును.
అదే
విధముగా
మానవుని
యందున్న
శబ్ద,
స్పర్శ,
రూప,
రస,
గంధముల
యొక్క,
ఇంద్రియముల
యొక్క
స్వభావములను
గుర్తించుకొని
వర్తించటం
చేత
పవిత్రమైన
శాంతి,
సుఖములను
పొందవచ్చు.
వాటి
యొక్క
తత్త్వములను
చక్కగా
గుర్తించుకొనక
విచ్చలవిడిగా
విజృంభింపచేసుకున్నప్పుడు
మనకు
ప్రమాదములేగాక
గౌరవ
మర్యాదలను
మంటపాలు
చేస్తుంది.
ఈ
ఇంద్రియముల
యందు
జిహ్వేంద్రియము
అతిప్రధానమైనది.
ఇందులో
ప్రత్యేకించి
ఒక
విశిష్టమైన
శక్తిగా
లోకమునందు
ప్రచురింపబడుచున్నది.
జిహ్వను
మనము
అరికట్ట
కొనకున్న
మన
జీవితమునే
వ్యర్థము
పాలు
చేస్తుంది.
2
▾
Meaning
Keep
జిహ్వ
కోరినవన్నీ
మనము
అందించుటకు
పూనుకోకూడదు.
దానిని
సంతృప్తి
పరచటానికి
మనము
పూనుకున్నప్పుడు
కట్టకడపటికి
దానికి
తృప్తిని
చేకూర్చలేము.
దీనికి
ఒక
ఉదాహరణము.
మనము
కళకళలాడుతూ
కిలకిల
నవ్వుతూ
జీవితమును
శోభాయమానముగా
తీర్చిదిద్దుకునే
నిమిత్తమై
దీనికి
వెన్న,
మీగడపాలు,
ఫలములు
యిలాంటి
ప్రత్యేకించిన
బలాహారములు
దీనికి
అందించటం
చేత
కట్టకడపటికి
జిహ్వకు
మిత్రులైనటువంటి
కామ,
క్రోధ,
లోభ,
మోహ,
అహంకార,
అసూయ
యిత్యాది
మిత్రులందరు
ఆ
జిహ్వకు
అతిమిత్రులై
పోతున్నారు.
కారణమేమనగా
జిహ్వయొక్క
గృహమునందు
అతి
సుఖశాంతులు
లభించటంచేత,
సులభముగా
సుఖము
లభించునని
జిహ్వ
తన
మిత్రులను
ఆహ్వానించటానికి
పూనుకుంటుంది.
కనుక
మన
యింద్రియములకు
మూలకారణము
ఒక
జిహ్వయేయని
చెప్పక
తప్పదు.
మనము
టేస్టును
మాత్రమే
లక్ష్యమునందుంచుకుంటున్నాము
గాని
మన
జీవితము
ఎంత
వేస్ట్
అవుతున్నాదో
మనం
యోచించుకోవటం
లేదు.
మనము
తీసుకునే
ప్రతి
ఆహారముకూడను
స్థూల
రూపములో
మలమూత్రములుగా
మారి
జగత్తునకు
విరుద్ధమైన
పదార్ధములుగ
బయటకు
పోవుచున్నది.
ఇంక
సూక్ష్మరూపములోపల
ఆహారమే
రక్తముగను,
కండరములుగను
మారుతున్నది.
ఇంక
అతి
సూక్ష్మమైన
యీ
ఆహారము
మనస్సుగా
మారుతున్నది.
కనుక,
మన
మనస్సు
యొక్క
వికారములకు
గాని,
పవిత్రమునకుగాని
మనయొక్క
ఆహారమే
మూలకారణముగా
కనిపిస్తున్నది.
కనుకనే
పరమశాంతము,
సహనము,
సౌజన్యము,
ప్రేమ,
సత్యము
యిట్లాంటి
సద్గుణములు
అభివృద్ధి
పరచుకొనుటకు
ఆహారము
ప్రధానమైన
సూత్రముగా
మనకు
వేదము
ప్రబోధిస్తూ
వచ్చింది.
భారతీయ
వేదాంతము
సాత్త్విక
ఆహారముతోగాని,
యింద్రియ
నిగ్రహము
అనే
పేరుతోగాని
మోక్షప్రాప్తికి
తగిన
ద్వారములుగా
నిరూపిస్తూ
వచ్చింది.
ఇంద్రియములనే
నిగ్రహించలేకున్న
మానవునకు
ఈ
జగత్తునందేగాక
యింక
ఏ
యొక్క
జగత్తునందైన
కూడను
సుఖ
శాంతులు
లభించవు.
మనకు
సుఖశాంతులు
లభింపక
చేయటమే
కాకుండా
గౌరవ
మర్యాదలను
తీసివేయుచున్నవి
యీ
యింద్రియ
ఉద్రేకములు.
అందు
నిమిత్తమై
మన
భారతీయ
అనాది
ఋషులందరు
కూడను
మౌనమును
ధరించి
సాత్వికమైన
కందమూలాదులను
భక్షించి,
వేరుగడ్డలను
భుజించి
ప్రవహించే
జలమును
గ్రోలి
వారు
ఉత్తమమైన
చిత్తమును
భగవంతునికి
అర్పితము
చేయటానికి
పూనుకున్నారు.
3
▾
Meaning
Keep
యువకులైన
మీరు
ఈ
వయస్సునందు
జిహ్వను
కొంతవరకు
అరికట్టుటకు
ప్రయత్నించాలి.
ఈ
వయస్సునందే
మీరు
జిహ్వను
అరికట్టకున్న,
ఇంద్రియములను
అరికట్టకున్న
మీ
యొక్క
జీవితము
చాలా
దుఃఖములతో
నిండిపోవలసివస్తుంది.
దేశము
యొక్క
సౌభాగ్యముగాని,
దేశము
యొక్క
కళ్యాణముగాని
ఆకసమునుండి
కురువదు,
భూమి
నుండి
ఉద్భవించదు.
మనుష్యుల
యొక్క
ప్రవర్తన
నుండియే
లోకకళ్యాణము
ఏర్పడుతూ
ఉంటుంది.
దేశమంటే
మట్టికాదనియు,
మానవునియొక్క
ప్రవర్తనల
స్వరూపమే
దేశమనియు
మనము
చక్కగా
గుర్తించాలి.
లోకమును
తీర్చి
దిద్దటమంటే
మనయొక్క
ప్రవర్తనలు
ఉత్తమమైనవిగా
తీర్చిదిద్దటమే.
కనుక
మొట్టమొదట
ఇహమునకు
గాని,
పరమునకుగాని
నిగ్రహము
చేయటంచేత
తప్పక
మీరు
భగవదనుగ్రహానికి
పాత్రులౌతారనుటలో
ఎట్టి
సందేహము
లేదు.
ఏనాడో
సర్వేంద్రియములు
మెత్తబడి,
శిధిలమై
నిశ్శక్తి
స్థితిలోనున్నటువంటి
సమయములో
మనము
ఇంద్రియములను
నిగ్రహము
చేయటానికి
ప్రయత్నించటము
మానవత్వానికి
మహా
అవమానకరము.
అట్టి
సమయమందు
ఇంద్రియనిగ్రహము
జరగటంచేత
భగవదనుగ్రహం
చిక్కితే
చిక్కవచ్చు,
లేకపోతే
పోవచ్చు.
కాని
యువకులైన
మీ
యందు
యింద్రియనిగ్రహము
కలిగినప్పుడు
తప్పక
భగవదనుగ్రహము
లభించుననుటలో
ఎట్టి
సందేహము
లేదు.
దానికి
ఒక
చిన్న
ఉదాహరణము.
మీరు
తెల్లవారి
వెళ్లి
హోటలులోపల
మాకు
యీనాడు
భోజనం
కావాలి
అని
టిక్కెట్లు
తీసుకొని
book
చేసి
రావటంచేత
మీరు
12
గంటలకు
వెళ్లండి,
ఒంటి
గంటకు
వెళ్లండి,
తప్పక
భోజనము
చిక్కుతుంది.
అట్లుకాకుండా
సరిగా
పన్నెండు
గంటలకో
ఒంటిగంటకో
వెళ్లి
నాకు
అన్నము
కావాలంటే
మిగిలివుంటే
పెట్టవచ్చు,
లేదంటే
లేదని
చెప్పవచ్చు.
అదేవిధముగా
మీరు
యీ
వయస్సునందు
భగవదను
గ్రహమనేదానికి
యింద్రియ
నిగ్రహమనేది
book
చేసినారంటే
అనుగ్రహమనే
food
తప్పక
లభిస్తుంది.
భగవదనుగ్రహము
ఇంద్రియనిగ్రహము
ద్వారానే
లభిస్తుంది.
ఇంద్రియ
నిగ్రహమనేది
ఒక
విలువ.
మనకు
అందించేది
అనుగ్రహ
మనే
పదార్ధము
అదే
పరార్ధము.
ఇట్టి
ఇంద్రియనిగ్రహము
వలన
స్థితప్రజ్ఞ
లక్షణము
మనకు
చేకూరుతుంది.
అట్లుకాక
అనేక
గ్రంథములను
మనం
పఠించి,
పెద్దలయొక్క
బోధలను
శ్రవణముచేసి,
ఎన్నిరకములైన
book
knowledge
ని
సంపాదించినా
మనకు
భగవదనుగ్రహము
చిక్కుతుందనే
ధైర్యము
చాలా
తక్కువగా
ఉండవచ్చు.
4
▾
Meaning
Keep
అయితే
ఈనాడు
గ్రంథపఠనముచేత,
యుక్తికుయుక్తుల
చేత
యువకులు
అనేక
రకములైన
వాదోపవాదములకు
దిగటంకద్దు.
ఆత్మతత్వమునందు
మాత్రమే
అద్వైతాన్ని
గుర్తించాలి
ఒకానొక
సమయములో
శంకరుల
వారి
దగ్గరకి
22,
23
సం
॥
వాడు
వెళ్లాడు.
శంకరులవారు
తమ
శిష్యులకు
ఆధ్యాత్మిక
బోధ
చేయుచుండగా
మధ్యలో
ఈ
యువకుడు
లేచి,
‘స్వామీ!
ఈ
విశాలమైన
ప్రపంచములో
యింత
విశాలమైన
జీవులుగా
వున్న
తత్త్వంలో
అందరి
యొక్క
ఏకత్వాన్ని
మీరు
గుర్తించాలి
గాని
యిందులో
భేదమును
పాటించుట
యేమాత్రము
మంచిదికాదు
కదా!
ఈ
విశాల
జగత్తునందు
సర్వజీవులయందు
రక్తమే
ఉన్నదిగాని
పాలు
ప్రత్యేకించి
రావటం
లేదు
కదా!
కనుక,
అందరిని
సమానంగా
చూడటం
మీబోటి
పెద్దలకు
సరియైనది
కదా
అని
ప్రశ్నించాడు.
శంకరులవారు
నవ్వి
‘నాయనా!
నీయొక్క
యువకరక్తము
అతివేగంగా
ప్రవహిస్తున్నట్లుగా
వుంది.
నిత్యానిత్యవిషయ
పరిశీలన
లేక
కేవలము
ఒక
పదార్ధములందు
అద్వైతము
ప్రవేశపెట్టటము
సాధ్యము
కానిది.
కనుక,
భావాద్వైతమును
నీవు
తెలుపవచ్చును
గాని,
ఈ
లోకాద్వైతమును
తెలుపు
కొరకు
నీకు
కాదు,
నాకు
కాదు
ఎవ్వరికీ
సాధ్యము
కాదు’
అన్నాడు.
అది
నేను
ఒప్పుకోవటానికి
సాధ్యము
కాదని
వాదించాడు
ఈ
యువకుడు.
‘సర్వజీవులను
సమానమైన
భావముతో
చూడటము
చాలా
ఉత్తమమైనదిగా
నేను
గుర్తించు
కుంటున్నాను’
అన్నాడు.
ఈ
యువకునికి
ఈ
విధముగనే
యింకా
కాలమునిచ్చిన
మితిమీరిపోవచ్చు,
మతిచెడిన
మాటలు
మాట్లాడవచ్చునని
శంకరులవారు
గుర్తించి
తక్షణమే
యితని
నోరు
మూయించే
నిమిత్తమై
‘నాయనా!
ఆ
విషయము
తదుపరి
మాట్లాడుకోవచ్చును.
నీకు
తల్లి
ఉన్నదా’
అని
ప్రశ్నించాడు.
ఆ!
మా
తల్లిగారు
యింకా
జీవించియున్నారు.
నిత్యము
నేను
పూజిస్తున్నాను.
నమస్కరిస్తున్నాను’
అని
చెప్పాడు.
‘నాయనా!
నీకు
పెండ్లి
అయినదా’
అని
ప్రశ్నించాడు.
‘ఆ!
పోయిన
సంవత్సరము
పెండ్లి
అయింది.
నా
భార్య
కూడా
యిక్కడకు
వచ్చింది
క్యాంపులో’
అన్నాడు.
‘చాలా!
సంతోషము.
నీకు
అత్తగారు
కూడా
వున్నారా?
అడిగాడు
శంకరులవారు.
‘ఆ!
మా
అత్తగారు
కూడా
క్షేమంగా
ఉంటున్నారు’
అని
జవాబు
చెప్పాడు.
‘నీకు
సోదరి
ఉందా’
అడిగాడు
శంకరుల
వారు.
5
▾
Meaning
Keep
‘ఆ!
నాకు
యిద్దరు
సోదరిలు
ఉన్నారు’
అని
చెప్పాడు.
‘నీ
సోదరి,
నీ
తల్లి,
నీ
అత్తగారు
అంతా
ఆడవారేనా’
అన్నాడు.
‘ఆ!
అందరూ
ఆడవారు
కాక
మగవారు
ఎట్లా
అవుతారు’
అని
జవాబు
చెప్పాడు.
‘అయితే,
వీరందరిని
యింటిలో
సమానముగనే
చూచుకుంటున్నావా?’
అడిగాడు.
‘తల్లిని
భార్యగా,
భార్యను
తల్లిగా
నీవు
భ్రమిస్తున్నావా?’
అడిగాడు,
వాడు
నోరు
మూసుకున్నాడు.
అంతటితో
నిలిపివేశాడు
మాటలు.
కనుక,
సమానత్వమంటే
యేమిటో
అర్థముకాని
యువకులు
అన్నింటి
యందు
సమానత్వమని
పదమును
ఉపయోగపెట్టుకుంటూ
వీరు
విచ్చలవిడిగా
సంచరించటం
ఒక
వెఱ్ఱితలలు
వేసిన
గొఱ్ఱెలవంటి
వారనే
చెప్పవచ్చును.
కనుక,
ఆత్మతత్వమునందు
మాత్రమే
అద్వైతమును
గుర్తించాలి
గాని
అన్య
విషయములందు
అద్వైతము
గుర్తించటానికి
ఈ
ద్వైతము
యొక్క,
ప్రకృతి
యొక్క
లక్షణములో
విరుద్ధమార్గము
నడచటానికి
వీలుకాదు.
మన
బల్బులలో
ఓల్టేజి
శక్తులు
విడివిడిగా
వుంటాయి.
కానీ
ఇందులో
వ్యత్యాసములు
బల్బులలోని
వ్యత్యాసములే
గాని
కరెంటులోని
వ్యత్యాసము
కాదనే
సత్యాన్ని
మనం
గుర్తించాలి.
ఈ
కరెంటు
యొక్క
తత్త్వమును
గుర్తించిన
వ్యక్తి
బల్బులలో
ఈ
వ్యత్యాసము
వున్నదిగా
కరెంటులో
లేదనే
సత్యాన్ని
తాను
స్పష్టంగా
చెప్పగలడు
కాని
కరెంటుతత్త్వము
తెలియని
మూర్ఖులు
యిక్కడ
తక్కువ
వెలుతురుంది,
అక్కడ
ఎక్కువ
వెలుతురు
ఉంది,
ఒకే
కరెంటు
అయితే
ఈ
వెలుతురులో
వ్యత్యాసములు
ఎందుకు
కలగాలి
అని
వాదించుకోటానికి
పూనుకుంటారు.
కనుక,
భగవశ్శక్తి
ఒక
కరెంటువంటిది.
మన
దేహములు
బల్బులవంటివి.
మన
ఆత్మవిశ్వాసము
బల్బులలో
కరెంటును
అందించే
సూక్ష్మకరణము
వంటిది.
కాని,
మన
బల్బులలో
నున్న
యీ
చిశ్శక్తిని
మనము
అభివృద్ధి
పరచుకోటానికి
ప్రయత్నం
చేసుకోవాలిగాని
కరెంటును
మార్చుటకు
ప్రయత్నం
చేయనక్కర
లేదు.
మన
విశ్వాసము
ఎంత
ఉండునో
దానియొక్క
వికాసము,
ప్రకాశము
దానికి
తగినట్లుగా
వుంటుంది.
సముద్రములో
కావలసినంత
జలము
ఉంటున్నాది
కాని
మనము
తీసుకొనివెళ్లిన
పాత్ర
ఎంతదో
అంత
జలము
మాత్రమే
మనము
తీసుకొని
రావటానికి
వీలవుతుంది.
మనము
ఈ
ఇంద్రియ
నిగ్రహము
చేయటంచేత
హృదయము
విశాలమైనదిగా
అభివృద్ది
అవుతుంది.
ఇంద్రియములకు
వశమైన
మన
హృదయవికాసము
చాలా
చిన్నదైపోతూ
వస్తుంది.
దీనికి
ఒక
చిన్న
ఉదాహరణము.
6
▾
Meaning
Keep
Also in his talks
(6)
22 May 1973
The Deluded Mind and the Liberated Mind
22 July 1994
The fullness of Prema
16 July 1996
Develop Virtues and Contemplate on God
5 September 1996
Saccidānanda Is Man's Very Nature!
5 February 1998
Samyak sādhana
12 October 1998
The True Place of God's Pādukās Is the Heart Itself
ఒక
బెలూన్
వుంటున్నాది.
ఆ
బెలూన్లో
గాలి
నింపినప్పుడు
క్రమేణా
అది
పెద్దదౌతూ
వస్తుంది.
అది
యింకా
పెద్దది
అవుతూ
అవుతూ
మరింత
అధికమైనప్పుడు
తన
స్వరూపమునే
ఛేదించి
తన
సర్వవ్యాపకత్వమైన
గాలిలో
చేరిపోతుంది.
అదేవిధముగా
సర్వవ్యాపకత్వమైన
ఆత్మ
స్వరూపము
సర్వత్రా
ఉండినప్పటికిని
మన
హృదయమనే
బెలూన్లోపల
మనయొక్క
విశ్వాసమును
క్రమక్రమేణ
పెంచుకుంటూ
వచ్చేకొలది
హృదయగ్రంథిని
ఛేదించి
సర్వవ్యాపకత్వమైన
ఆత్మలోపల
యిదికూడను
లీనమైపోతుంది.
అదే
లీనము,
గమ్యము,
లయము
అని
చెప్పటానికి
వీలవుతుంది.
మన
హృదయమనే
బెలూన్
లోపల
విశ్వాసమనే
గాలిలేకుండా
వుంటే
అది
కేవలము
అట్టమాదిరి
కట్టుకొని
పోతుంది.
అది
తిరిగి
ఎంతకాలమైనా
ఛేదించి
సర్వవ్యాపకత్వమైన
గాలిలో
చేరటానికి
వీలుండదు.
కనుక,
మనము
ఆత్మవిశ్వాసము,
దానినే
self
confidence
అంటున్నాము,
దాన్ని
బలపరచుకోవటానికి
తగిన
ప్రయత్నము
చేయటంచేతనే
ఇంద్రియ
నిగ్రహమనేది
కూడను
తద్వారా
లభించి
మనయొక్క
జీవిత
తత్త్వములోపల
పవిత్రమైన
దివ్యత్వాన్ని
అనుభవించుకునే
ప్రాప్తి
లభిస్తుంది.
మన
దేహములో
నున్న
మిగిలిన
ఐదు
యింద్రియములు
కూడను
ఒక్క
జిహ్వేంద్రియమునకు
కట్టుబడి
వుంటాయి.
ఒక్క
జిహ్వను
నీవు
అరికట్టితివా,
అనగా
అధికంగా
తినటంగాని,
అధికంగా
మాట్లాడటంగాని
అనవసరమైన
పలుకులు
నీవు
అందులో
చేర్చటంగాని
లేకుండా
చేసుకున్నప్పుడు
నీ
యొక్క
ఆరోగ్యమే
కాకుండా
ఆనందముకూడను
అభివృద్ధి
అవటానికి
అవకాశము
వుంటుంది.
అందుకోసమే
శంకరులవారు
ఈ
జిహ్వకు
చక్కని
పాఠము
చెప్పాడు.
జిహ్వేరసజ్ఞే
మధుర
ప్రియేత్వం
సత్యం
హితం
త్వాం
పరమం
వదామి
ఆవర్ణయేథాం
మధురాక్షరాణి
గోవింద
దామోదర
మాధవేతి.
ఓ
రసము
నెరిగిన
నాలుకా!
సత్యము
పలికే
నాలుకా!
పవిత్రమైన
నాలుకా!
సర్వేంద్రియములకు
అధిపతియైన
నాలుకా!
నీకు
ఒక
హితమైన
వాక్యమును
బోధిస్తున్నాను.
దానితో
నీయొక్క
పవిత్రతను
కాపాడుకోమని
చెప్పాడు.
ఏమిటా
హితమంటే
గోవిందా,
దామోదరా,
మాధవా
అనే
పలుకులు
నీయొక్క
నాలుకపైన
నాట్యమాడించుకోమని
బోధించాడు.
7
▾
Meaning
Keep
విద్యార్ధులారా!
మన
ప్రసంగానికి
కొన్ని
క్రిములు
చాలా
అడ్డము
చేరుతుంటున్నాయి.
ఈ
క్రిముల
వల్ల
చేతులతో
నాట్యాలాడిస్తుంటున్నారు.
దీని
వలన
కొంత
అనానుకూలము
కలుగుతున్నది
కనుక
ముఖ్యంగా
ఈనాడు
తెలుసుకోవలసినది,
నేర్చుకోవలసినది
భజగోవిందము
యొక్క
తత్త్వములోపల
జిహ్వను
అరికట్టుకోవడం,
ఇంద్రియములకు
ప్రధానమైన
స్థానమైన
జిహ్వకు
తగిన
పవిత్రతను
అందించటము
మనయొక్క
ప్రధాన
లక్ష్యమని
మీరు
భావించి
నేటి
నుండి
అనవసరమైన
మాటలకు
గాని,
కొన్ని
రుచికరమైన
పదార్థములకు
గాని
మీ
జీవితమును
అంకితము
చేసి
మీయొక్క
పవిత్రతను
మీరు
కోల్పోకుండా
వుంటారని
ఆశిస్తూ
ఆశీర్వదిస్తూ
నా
ప్రసంగాన్ని
విరమిస్తున్నాను.
వాంఛలన్నియూ
రోగములే
మనకు
తెల్లవారిందిమొదలు
రాత్రివరకు
మనము
చేసేటటువంటి,
తలచేటటు
వంటి
చూచేటటువంటి
ప్రతి
క్రియ
కూడ
ఒక
రోగ
సమానమే.
మనము
త్రాగటము,
తినటము
ఒక
రోగమే.
ఆకలి
అనే
రోగమునకు
అన్నము
అనే
ఔషధమును
వేస్తున్నాము.
దాహము
అనే
రోగమునకు
నీరును
అందిస్తున్నాము.
అదే
విధముగా
మన
వాంఛలన్నియు
కొన్ని
కొన్ని
రోగములు
కనుకనే
ఆ
వాంఛలకు
తగినటువంటి
కార్యములకు
మనము
పూనుకుంటూ
ఉంటున్నాము.
మనకు
మలేరియా
జ్వరము
వచ్చింది
అనుకున్నప్పుడు
ఒక
డాక్టరు
క్వినైన్
మిక్చరు
యిస్తుంటారు.
అది
చాలా
చేదుగా
వుంటుంది.
కాని
మనము
జ్వరము
పోవుటకు
ప్రయత్నము
చేస్తాము
గాని
ఔషధము
తీయగా
ఉండాలని
మనము
ఆశించము.
ఒకసారి
తీయని
మందు
నీకు
కావాలనుకున్నప్పటికిని
వ్యాధి
నివారణ
డాక్టరు
చూస్తాడు
గానీ
నీవు
కోరిన
రుచిని
నీకు
అందించడు.
అదేవిధముగా
మన
ఆకలి
అనే
రోగమునకు
ఆ
ఆకలి
తీరేకొరకు
ఆహారము
చేర్చుకోవాలిగానీ
ఉప్పు,
పులుపు,
కారము
చక్కగా
వుందా
అని
చూస్తూ
మనము
రోగమును
అభివృద్ధి
పరచుకుంటూ
అనేక
రకములైనవి
చేర్చుకొని
వాంఛ
అనే
రోగాన్ని
మరింత
అభివృద్ధి
చేసుకుంటున్నాం.
నాలుక
ఏమైనా
ఈనాడు
నేను
లడ్డూను
తినాలని
ఆశించిందనుకొండి.
తాను
కోరిన
లడ్డును
రెండు
నెలలు
రుచి
చూపించకుండా
కూర్చోండి.
తప్పక
ఆ
పైన
ఈ
లడ్డును
నాలుక
కోరదు.
అదేవిధముగా
నీ
నాలుక
ఎవరినైనా
దూషించాలని
కోరిందా
ఆ
దూషణ
అనే
పలుకులు
నీ
నాలుకకు
ఒక
నెల,
రెండు
నెలలు
చేర్చకుండా
ఉండు.
8
▾
Meaning
Keep
తప్పక
ఆ
నాలుక
యింక
మంచి
మాటలలోపల
బయలు
దేరుతుంది.
కోరినది
అందించటం
లేదు,
యింక
యేదో
ఒకటి
తిందామని
తాను
మెత్తబడి
సన్మార్గములోపల
ప్రవేశిస్తుంది.
అదేవిధముగా
మనము
మాటలు
చెప్పినా,
మరేవిధమైన
పలుకులు
పలికినా
పవిత్రమైనవా
కాదా
అని
విచారణ
చేసుకొని
అధికమైన
మాటలకు
పోకుండా
మితమైన
మాటలతో,
పవిత్రమైన
మాటలతో
కాలమును
జగత్తులో
గడపటానికి
ప్రయత్నం
సల్పటం
యువకులకు
అతి
ప్రధానమైనది.
ఈ
నాలుకవల్ల
వచ్చే
ప్రమాదములుగాని,
ఈ
నాలుకను
అరికట్టుకునే
విధానమునుగాని
యింకా
కొంత
మిగిలి
ఉంటున్నాది,
అది
రేపటి
దినము
చెబుతాను.
ఈనాటి
ప్రసంగమును
యింతటితో
విరమిస్తున్నాను.
Previous
←
Karma, Bhakti, Jñāna
Next
The Culture of Bhārata and Moral Values
→