Contents
Devotion & Sacred Story
Home
Library
Find
Shelf
Settings
←
Leave
Sathya Sai Speaks 1973 · Discipline, Mastery of the Senses
Tap a verse for its meaning
IAST
Telugu
Meaning
Continuous
Discipline, Mastery of the Senses
10 June 1973, Summer Course, Brindavan
Morning
Evening
1
▾
Meaning
Keep
రెండు
మూడు
వారములనుండి
మన
బృందావనంలో
పవిత్రమైన
ప్రబోధలతో
కాలము
గడుపుతూ
ఉంటున్నారు.
కాని
ఎట్టి
పవిత్రమైన
ప్రబోధలు
మీరు
శ్రవణం
చేస్తున్నారో,
ఎట్టి
దివ్యమైన
అనుభూతులను
మీరు
శ్రవణం
చేస్తున్నారో
ఆ
శ్రవణము
చేసిన
దానికి
తగినట్లుగా
మీ
యొక్క
నడవడికలు
కనిపించటం
లేదు.
ఇన్ని
రకములైన
ప్రబోధలుగాని,
ఇన్ని
రకములైన
అవకాశములు
మీకు
అందించటంగాని
ప్రత్యేకించి
ఒక
క్రమశిక్షణను
అభివృద్ధి
పరచుకునే
నిమిత్తం.
కాని,
ఆ
డిసిప్లిన్
విషయంలో
అనుకున్నంత
సంతృప్తి
మాకు
కలగటం
లేదు.
అందులో
ఈ
girls
మరింత
discipline
పాడుచేస్తున్నారు.
స్వామి
వచ్చే
సమయములోగాని,
పోయే
సమయములోగాని
sheep
మాదిరి
వచ్చేస్తున్నారు.
ఈ
విధమైన
క్రమశిక్షణవల్ల
మేము
మీకు
ఎన్ని
దినములు
సమ్మర్క్లాసులు
పెట్టినప్పటికిని
దానివల్ల
యేమీ
ప్రయోజనం
లేదు.
కనుక
మొట్టమొదట
క్లాసులలో
ఉండినా,
ఎక్కడికి
వెళ్లినప్పటికిని
మన
డిసిప్లిన్
యితరులకు
ఆకర్షణీయమైన
discipline
గా
చూపించాలి.
Too
much
talk
చాలా
చెడ్డది.
మీలో
మీరు
అవసరమైన
విషయాలుంటే
ఒకటి
రెండు
మాటలు
మాట్లాడాలి
గాని,
24
గంటలసేపు
అనవసరమైన
మాటల
లోపల
కాలమును
వ్యర్థము
చేయటముచేత
మీ
energy
ని
పాడుచేసుకుంటున్నారు.
ఇంతేకాకుండా
నవ్వడములు
కూడా
అధికమైపోతున్నాయి.
ఆడవారికి
నవ్వు
నాలుగు
విధముల
చేటుగా
కనిపిస్తుంది.
ద్రౌపదికూడా
నవ్వు
వలననే
పడరాని
అవస్థలకు
పాలై;
పడరాని
నిందలు,
పడరాని
అవమానములు
పడవలసి
వచ్చింది.
ప్రతి
ఒక్కదానికి
అనగా
అవసరమైనదానికి,
అనవసరమైనదానికి
నవ్వటం
కేవలము
పిచ్చివాళ్లు
మాత్రమేచేస్తారు.
మగవారుగాని,
ఆడవారుగాని
నవ్వటమనేది
చాలా
చెడ్డది.
కారణము
వచ్చినప్పుడు
ఏదైనా
తమాషా
చేసినప్పుడు,
జోక్
చేసినప్పుడు
నవ్వవచ్చును
కాని
ఆడవారు,
మగవారు
ఉండిన
ప్రదేశములో
నవ్వటమనేది
కేవలము
లూజ్
అయినవారే
చేస్తారు.
అది
కొన్ని
రకములైన
అపార్థములను
కలిగిస్తుంది.
కనుక,
ఇలాంటి
ప్రవర్తనలు
మన
విద్యార్థులు
జాగ్రత్తగా
పాటించాలి.
ఇంక
చూపులు
కూడను
అదుపులో
పెట్టుకోవటం
లేదు.
ఆడవారు
వస్తుంటే
మగవారు
చూడటం,
మగవారు
వస్తుంటే
ఆడవారు
చూడటం
యిది
కేవలము
ఒక
కాకి
చూపు
మాత్రమేగాని
మనిషి
చూపులు
కావు.
2
▾
Meaning
Keep
కనుక
మనము
దృష్టిని,
నవ్వును,
నాలుకను
అదుపులో
పెట్టుకోవాలి.
ఈవిధమైన
క్రమశిక్షణ
మొట్టమొదట
అలవర్చుకున్నప్పుడే
మనము
నేర్చుకున్నవిగాని,
విన్నటువంటివి
గాని
సార్ధకమవుతాయి.
ఇంతేకాక
మనము
పెద్దలైన,
ఉత్తములైనవారు
బోధలు
సల్పుతున్నప్పుడు
గౌరవముతోను,
మంచి
మనోభావములతో
శ్రవణము
చేయటానికి
పూనుకోవాలి.
ఏవిధమైన
నిగ్రహముతో
మనము
దానిని
శ్రవణము
చేస్తామో
దానికి
అన్ని
రకములైన
ఫలితము
మనకు
దక్కుతుంది.
కృష్ణుడు
అర్జునునకు
భగవద్గీత
బోధించుటకు
పూర్వము
‘ఏకాగ్రచిత్తుడవై
విను’మని
బోధించాడు.
ఆవిధమైన
ఏకాగ్రచిత్తముతో
వినుట
చేతనే
అర్జునునకు
విశ్వవిరాట
స్వరూపసందర్శనం
ప్రాప్తించింది.
మన
దేహము
గాని,
మన
అంగముల
లోపల
ఏ
అంగముగాని
అటు
యిటు
కదలించకుండా
వింటూ
ఉండాలి.
అట్లుకాకుండా
చాలామంది
front
లోనే
కూర్చుంటారు.
కూర్చోటం
కూడను
వికారమైన
రూపకంగా
కూర్చుంటారు.
అది
వినేటువంటి
వారి
లక్షణాలు
కావు.
సోంబేరుల
యొక్క
లక్షణాలు.
ఆవిధంగా
ముందు
కూర్చున్నవారు
సక్రమంగా
కూర్చోటానికి
చేతకానటువంటివారు
డ్రైనేజి
పైప్స్కాని
వుంటే
వెనుక
వైపే
కూర్చోవాలి
అంతేగాని
అలాంటివారు
వచ్చి
ముందర
కూర్చోటం
మహా
వికారమైన
రూపంగా
కూర్చుంటే
అది
విద్యార్ధులకు
సరియైనది
కాదు.
అవమానకరము.
ప్రతి
ఒక్కటి
మనము
కూర్చునేది,
చూచేది,
చదివేది,
ప్రతి
ఒక్కటికూడను
యితరులకు
ఆదర్శప్రాయంగా
మనము
చూపించాలి.
కాని,
అనేక
మంది
పెద్దలు
ముందు
కూర్చొని
ఈ
సమ్మర్
కోర్సులోపల
చేరిన
విద్యార్ధుల
అదృష్టమేమిటాయని
కాచుకొని
ఉంటారు.
అట్టి
సమయములో
ముందు
కూర్చున్న
వారు,
ఏదో
వికారమైన
రీతిగా
కూర్చుంటే
ఏమిటి
ఈ
పిల్లలు
అలక్ష్యంగా
కూర్చున్నారు,
ఏమిటి
ఈ
పిల్లలను
ఎలా
సెలక్ట్
చేశారు
అని
మా
సెలక్షన్
కమిటీకి
కూడా
పెద్ద
అవమానము.
కనుక,
ముఖ్యంగా
మాకు
డిసిప్లిన్
ముఖ్యం.
ఎం.ఏ.లు,
బి.ఏలు
తలభారమైన
డిగ్రీలు
తీసుకోవటం
మాకేమి
ఆనందం
లేదు.
ఏమి
ఈ
డిగ్రీలు
తీసుకొని
పొట్టకూటికోసం
ఉద్యోగాలకు
పోవాలి.
ఈ
ఉద్యోగ
మనేది
watch
man
కూడా
ఉద్యోగమే.
స్వీపర్కూడా
ఒక
ఉద్యోగమనే
అంటారు.
ఇలాంటివా
మనకు
కావలసింది.
డిసిప్లిన్
ఉండాలి.
పెద్దల
దగ్గర
గౌరవము
పెంచుకోవాలి.
అటువంటి
వారి
దగ్గర
మంచి
సత్కీర్తిని
అందుకోవాలి.
అది
మన
మనుష్యత్వానికి
తగిన
కీర్తి.
జయదేవ,
గౌరంగ,
రామకృష్ణపరమహంస,
తుకారాం
వీరందరు
ఏ
డిగ్రీలు
తీసుకున్నారు.
ఏ
యూనివర్శిటీకి
పోయినారు.
ఏ
పట్టములు
వారు
అందుకున్నారు.
3
▾
Meaning
Keep
ఏ
కాలేజీకి,
ఏ
స్కూలుకో
వారు
పోలేదు.
కాని,
వారి
కీర్తి,
పేరు
ప్రతిష్ఠలంతా
చిరస్తాయిగా
మన
భారతదేశములోనే
కాకుండా
మిగతా
ప్రపంచానికి
వ్యాపింపచేసుకునే
గుణమును
వారు
పెంచుకున్నారు.
అన్ని
కూడా
ప్రతిబింబముగా
తిరిగి
వస్తాయి
మనము,
ఇతరులదగ్గర
ఏవిధమైన
గౌరవాన్ని,
ఏవిధమైన
పేరు
ప్రతిష్ఠలను
అందుకోవాలని
మనము
ఆశిస్తున్నామో
దానికి
తగినట్లుగా
మనము
ప్రవర్తించాలి.
ఇతరులు
ఈరీతిగా
ఉండాలి,
ఆ
రీతిగా
ఉండాలని
మనం
కోరటము,
ఆరకమైన
స్వభావములు
మనలో
లేకపోవటము
యిది
ఒక
విధమైన
స్వార్థమే.
ఎవ్వరైనా
సరే
పిల్లలైనా,
పెద్దలైనా,
యింకొకరుగాని
ఎవ్వరు
కూడను
చెప్పిన
దానికి
తగిన
రీతిగా
నడచుకుంటున్నప్పుడే
తగిన
గౌరవము.
కనుక
మనము
సరియైన
దీనిని
అనుభవించి
తద్వారా
మన
మానవత్వాన్ని
కొంత
సార్థకమైన
మార్గములో
చూచుకోవాలి.
డిసిప్లినే
లైఫ్.
డిసిప్లిన్
లేకపోతే
లివింగ్
డెత్.
దీనికి
ఒక
చిన్న
ఉదాహరణము.
రామాయణమునందు
చిన్న
ఉదాహరణము.
సీతను
తాను
అందుకోవాలనే
ఉద్దేశ్యముతో
రావణుడు
అనేక
పన్నాగములు
పన్నినాడు
అయితే
ఆ
సీత
ఎందుకు
రావణునికి
దక్కలేదు?
ఆ
సీతకు
తగిన
గుణములే
కలిగిన
వాడైయుండిన
తప్పక
సీత
దక్కి
ఉండేది.
శూర్ఫణక
రాముని
దక్కించుకోవాలని
అనేక
ప్రయత్నాలు
చేసింది.
కాని
ఆ
శూర్ఫణఖకు
రాముడు
దక్కాడా,
చిక్కాడా?
కాని,
ఎవరికి
ఎవరు
దక్కుతారు.
రామునివంటి
రాముడైతే
సీత
వంటి
సీత
చిక్కుతుంది.
సీతవంటి
సీత
అయితే
రామునివంటి
రాముడు
చిక్కుతాడు.
అంతేకాని
రావణుని
వంటి
రాముడు,
శూర్పణఖవంటి
సీత
ఒకరికొకరికి
సంబంధం
కలగాలంటే
ఎప్పటికీ
కలగదు.
ఇందులో
మనము
మాత్రము
అంతే.
మనకు
కావలసినవారు
మాత్రము
మంచివారుగా
ఉండాలి,
ఉత్తముడుగా
ఉంటుండాలి,
నా
ఆజ్ఞ
మీరనివాడుగా
ఉంటుండాలి,
సీతవంటి
భార్య
చిక్కాలి
అని
పురుషులు
అడుక్కోవచ్చును.
ఆశించ
వచ్చును.
కానీ
సీతవంటి
భార్య
కావాలని
కోరేవాడు
రామునివంటి
వాడుగా
తయారు
కావాలిగాని,
రావణునివంటి
వాడుగా
తయారై
సీతవంటి
భార్య
కావాలంటే
యేనాటికీ
చిక్కదు.
ఆడవారుకూడా
అంతే.
రాముని
వంటి
భర్త
నాకు
కావాలి,
మంచి
గుణవంతుడుగా
ఉండాలి,
ఏకపత్నీవ్రతుడుగా
ఉండాలి
అని
కోరినప్పుడు
వారు
కూడా
సీతవంటివారుగా
తయారైనప్పుడే
రామునివంటి
భర్త
చిక్కుతాడు
కాని
రాముని
వంటి
భర్త
కావాలని
కోరుకోవటము,
శూర్ఫణఖ
వలే
తయారైతే
అలాంటి
భర్త
చిక్కుతాడా!
4
▾
Meaning
Keep
కనుక
ఎట్టి
దానిని
మనము
కోరతామో
అట్టి
దానికి
సంబంధించినట్టుగా
తయారుకావాలి.
విద్యార్థులారా!
మీకు
నిత్యము
విరక్తి
సంబంధమైన,
భద్రమైన
విషయాలను
మీకు
అందించటం
వలన
మీకు
కొంత
విసుగు
కలగవచ్చు.
కాని,
ప్రస్తుత
పరిస్థితులయందు
అవి
మీకు
కొంత
కష్టముగను,
విసుగుగను
మీకు
కనిపించవచ్చును.
కాని
నిత్యజీవితములో
ఈ
వయస్సులో
ఎలాంటి
మార్గములో
దీనిని
అరికట్టుకోవాలనేది
అవసరము.
కనుక
ఈ
వయస్సునందు
మీరు
విన్నటువంటివాటిపైన
విరక్తికిగాని,
విసుగునకుగాని
అవకాశము
యివ్వక
అతిశ్రద్ధతో
యిప్పుడు
మీరు
అనుభవించినారంటే
భవిష్యత్తులో
యివి
పవిత్రమైన
రీతిక్రింద
మీ
జీవితానికి
సహాయకారులుగా
నిలుస్తాయి.
దినము
చెప్పిన
విషయాలే
చెబుతున్నారే,
విన్నవి
వింటున్నామే
అనే
విసుగు
మీలో
రాకూడదు.
అయితే,
నిత్య
జీవితములో
మీరు
తిన్న
కడుపుకే
తింటున్నారు,
కడిగిన
ముఖాన్నే
కడుగుతున్నారు,
ఎందుకు
తినాలి,
ఎందుకు
కడగాలి?
కనుక
తిన్న
కడుపుకే
తింటము,
కడిగిన
ముఖాన్నే
కడుగుకోవటములో
ఎంత
పరిశుద్ధత
ఏర్పడుతుందో,
ఎంతబలము
ఏర్పడుతుందో
అదేవిధముగా
విన్న
విషయాలే
వినటము,
చెప్పిన
విషయాలే
తిరిగి
చెప్పటము
చేత
మన
హృదయములో
కూడా
భద్రముగా
నాటుకొని
పోవటానికి
ఒక
అవకాశము
ఉంటుంది.
ఇష్ట
అయిష్ట
భావములు
కేవలము
మన
ఇచ్ఛలపైన
ఆధారపడి
ఉంటుంది.
ఇప్పుడు
20
సం॥లు,
30
సం॥లు
మనము
విసుగులేకుండా
కాఫీలు
త్రాగుతున్నాము.
ఒక్క
ఐదు
నిముషములు
లేటైతే
తలనొప్పి
వస్తుంది.
ఆవిధంగా
త్రాగిన
కాఫీనే
మనం
త్రాగుతుండటంలోపల
ఏమాత్రము
మనకు
విసుగు
పుట్టటం
లేదు.
జ్వరమే
వచ్చి
మూడు
దినములు
క్వినైన్
మిక్చరు
త్రాగితే
నాల్గవ
దినము
దానిపై
విసుగు
పుడుతుంది.
కారణం
ఏమిటి?
క్వినైన్
మిక్చరుపైన
ఇష్టములేదు,
కాఫీపైన
యిష్టముంటున్నాది.
ఎంత
అయిష్టంగా
క్వినైన్
మిక్చరు
తీసుకుంటున్నామో
ఆ
క్వినైన్
మిక్చరే
మన
రోగాన్ని
నివారణ
చేసేది.
అదేవిధముగా
వున్నది
ఈనాటి
లోక
పరిస్థితి.
ఏది
మనలను
చెడుపుతుందో,
ఏది
మనలను
దుర్మార్గములో
ప్రవేశింపచేస్తుందో
ఏది
మనకు
చెడ్డ
పేరును
తెప్పిస్తుందో
దానిపై
మనకు
యిష్టంగా
ముందు
ముందుకు
జరిగిపోతున్నాము.
ఏది
సత్కీర్తిని
తెప్పిస్తుందో,
ఏది
మానవత్వాన్ని
నిలబెడుతుందో
ఏది
మంచి
గుణములు
పెంపొందిస్తుందో
అటువంటి
వాటిపై
మన
మోజు
యే
మాత్రము
ముందుకు
పోవటం
లేదు
కారణం
ఏమిటి?
మన
జన్మాంతర
కర్మలే
దీనికి
మూల
కారణం.
5
▾
Meaning
Keep
దుర్గుణములు
తీసివేసి
సద్భావములు
పెంచుకోండి
విద్యార్థులారా!
మీకు
కష్టమైనా,
కొంత
బాధ
కలిగినా
పవిత్రమైన
జీవితానికి
మీరు
తగిన
ప్రయత్నం
చేయండి.
ఇటువంటి
అవకాశము
చిక్కటము
చాలా
అదృష్టము.
ఇలాంటి
అదృష్టమును
మీరు
దుర్వినియోగపరచుకొనకుండా
వచ్చినందుకు
ఈ
నెలదినములు
మీ
భవిష్యత్తుకు
తగిన
భద్రమైన
భావములను
మీ
హృదయములోపల
స్థాపించుకొని
తద్వారా
మీ
మీ
స్థానములకు
వెళ్లి
దీనిని
తిరిగి
లోకములోనున్న
సహచరులకు
పంచి
తగిన
రీతిగా
మన
భారతదేశాన్ని
తీర్చిదిద్దుతారని
కూడను
నేను
ఆశిస్తున్నాను.
మనలోనున్న
చెడ్డను
మనము
మరుగు
పరచుకోవటానికి
ప్రయత్నము
చేయకూడదు.
అది
లోపల
వుండినప్పుడు
ఏనాడైనా,
ఏ
సమయమునందైనా
అవి
బయటకు
వచ్చి
మనలను
భ్రష్ఠులను
గావిస్తుంది.
మండోదరికూడను,
రావణుడు
గతించిన
తరువాత
అతని
కళేబరముపై
బడి
తాను
అతను
చచ్చిపోయాడే
అనే
బాధ
ఆమెను
దుఃఖింప
చేయలేదు,
కాని
అతని
యొక్క
ప్రాణము
కోతులద్వారా
పోయెనా
ఏమి
ఈ
ఖర్మ
యితను
చేసిన
పాపము
ఏమిటి,
ఆ
పాపమును
గురించి
తాను
ఆలోచిస్తూ
వచ్చింది.
అతను
మహాతపస్వి,
వేదశాస్త్ర
యితిహాస
పురాణములను
కూడను
చక్కగా
తెలిసినవాడు
అలాంటి
మహా
తపస్వి,
బ్రహ్మ
మానసపుత్రుడు
విద్వాంసుడు,
ఉపనిషత్
వాక్యములనంతా
ఆచరించేవాడు
అయినప్పటికి
ఈ
కోతుల
ద్వారా
ప్రాణము
పోవటమనేది
చాలా
అవమానకరము
అయినది
కనుక
మండోదరి
దీనిని
గురించి
చాలా
విచారించి
కట్టకడపటికి
తనయొక్క
హృదయములో
ఒకదానిని
నిర్ణయము
చేసుకుంది.
ఎటువంటి
శాస్త్రములుగాని,
ఇతిహాసములుగాని
పురాణములుగాని
పవిత్రమైన
రత్నములు
లోపల
వుండినప్పటికిని
అందులో
హృదయ
అడుగు
భాగమందు
విషయ
సంబంధమైన
దుర్వాంఛ
లోపల
ఉండటంచేత
అరికట్టలేని
పరిస్థితి
ఉండటంచేత
అపవిత్రమైన
మార్గములో
సీతాపహరణ
జరపటము,
తద్వారా
ఈ
కోతులవలన
అతని
ప్రాణము
పోవటము,
దీనికి
దుర్గుణమే
కారణముగాని,
చేసిన
తపఃశక్తి
కాదని
నిర్ణయము
చేసుకుంది.
కనుక,
మనలోనున్న
భావములు
తక్షణమే
తీసి
పారవేసి
సద్భావములు
నింపుకోవటానికి
మీరుపూనుకోండి.
ఇది
చక్కని
అవకాశము.
ఇటువంటి
పవిత్రమైన
అవకాశము
మరల
చిక్కాలంటే
చిక్కటానికి
వీలుకాదు.
ఏదో
జన్మాంతర
అవకాశముచేత
యిట్టి
అవకాశము
చిక్కింది
కనుక
చిక్కిన
దానిని
దక్కించుకోవటానికి
ప్రయత్నం
చేయండి.
6
▾
Meaning
Keep
కనుక,
మీరు
నేటినుండి
ఈ
డిసిప్లిను
పాటించాలి.
ఆడపిల్లలు
వుండే
హాస్టలు
దగ్గర
చాలా
గట్టిగా
మాట్లాడుతుంటారు.
భోజనము
అయిన
తరువాత
యిక్కడ
వుండనక్కరలేదు.
చాలామంది
చెట్ల
క్రింద
కూర్చోటము,
రాత్రి
పొద్దుపోయేంతవరకు
వుండటము
ఈవిధమైన
అభ్యాసములు
చాలా
చెడ్డవి.
కనుక,
అట్టి
చెడ్డ
అభ్యాసములను
నేటి
నుండి
అరికట్టుకొని
సదభ్యాసములలోపల
మీరు
ప్రవేశిస్తారని
కూడను
ఆశిస్తున్నాను.
ఉదయం
యోగాభ్యాసము
చేసే
సమయంలో
ఇంద్రాదేవి
కొన్ని
పుస్తకములు
తెచ్చింది.
ఆ
బుక్కులు
యిస్తున్నప్పుడు
ఎట్లా
పోయి
చేరినారంటే
కోతులు
కూడను
అట్లా
చేరవు.
ఆ
రకముగా
బుక్కులు
పెరుక్కోవటం
కోసమని,
ఆ
బుక్కులు
యిప్పించుకోవటం
కోసమని
డిసిప్లిన్
మీరు
తప్పడం
చాలా
అవమానకరమైనది.
పాశ్చాత్య
దేశీయులు,
ఏమిటిరా
ఇండియన్సు
యీవిధమైన
డిసిప్లిన్
ప్రదర్శిస్తున్నారే
అని
అనుకోకూడదు.
మన
యొక్క
క్లాసులకు
అట్టెండ్
అయినవారు,
మనయొక్క
క్రమశిక్షణలోనున్న
వారు
కూడను
ఈవిధమైన
ప్రవర్తనలోనున్నారని,
వారు
మీ
ఎదురుగా
చెప్పకపోవచ్చును
కాని
హృదయములో
తలంచవచ్చు.
మీరు
వెళ్లే
ముందుగా
ప్రతి
ఒక్కరికి
దర్శన
మిచ్చి
నమస్కారమిచ్చి
వారిని
సంతృప్తి
పరచిపంపుతాను.
కాని,
ఇట్లు
ఆత్రుతతో
ఆవిధమైన
శాంతిని
వహించక
భోజనానికి
వచ్చినప్పుడు,
టిఫిన్‌కి
వచ్చినప్పుడు,
టీకి
వచ్చినప్పుడు,
విభూతి
పొట్లములందించటము,
పటములందించటము
యిది
కేవలము
ఒక
bad
habit
.
మీరు
పోయే
ముందుగా
వచ్చి
స్వామి
దగ్గర
అన్నీ
టచ్
చేయించుకొని
signature
చేయించుకొని,
ప్రసాదములు
యిప్పించుకొని
లక్షణంగా
మీరు
వెళ్లవచ్చును.
అలాంటి
అవకాశము
తప్పక
అందిస్తాను.
సమయముకాని
సమయములో
ఆ
విధమైనది
ప్రదర్శించటము,
విలేజర్సు
కూడా
ఆరకంగా
చేయరు.
చదువుకున్నవారు
కూడను
ఈ
రకంగా
ప్రవర్తిస్తున్నారంటే
చదువుకు
యేమీ
విలువలేనట్టుగా
ఉంటుంది.
సమయాన్ని
పురస్కరించుకొని
మీరు
మీయొక్క
ప్రవర్తనను
కొంతవరకు
ప్రవేశపెట్టాలి.
ఇప్పుడు
చిన్న
ఉదాహరణ.
హోటలుకు
వెడుతుంటారు.
హోటలుకు
వెళ్లి
‘ఇడ్లీ
ఉందా,
దోశ
ఉందా’
అని
అడగటానికి
ఒక
రీజను
ఉంటున్నాది.
హోటలుకు
పోయి
‘ఏమయ్యా
నీదగ్గర
శారిడాన్
వుంటున్నాదా,
ఏస్‌ప్రో
ఉంటున్నాదా’
అని
అడిగితే
‘ఇతను
ఏమిటిరా,
హోటల్
పేరుచూడలేదేమో,
బుద్ధి
తక్కువ
మనిషి’
అనుకుంటారు.
7
▾
Meaning
Keep
ఇంకా
మనము,
మెడికల్
షాపుకు
పోతున్నాము,
ఆ
షాపుపేరు
చూడటం
లేదు.
‘దోశలున్నాయా’
అని
అడిగితే
ఎంత
బుఱ్ఱ
తక్కువ
వారుగా
ఉంటాము.
అదేవిధముగా
మనము
క్లాసుకి
attend
అయ్యేలోపల
విభూతి
ముట్టు,
signature
చేయి’
అంటే
క్లాసుకి
సంబంధించిన
విద్యలా
యివన్నీ.
విరుద్ధమైన
విద్యలు.
కనుక,
మీరు
ఊరికి
వెళ్లే
సమయములోపల
ఈ
రకమైన
వాంఛలతో
అడగండి
తప్పక
స్వామి
మీకు
సంతృప్తి
చేస్తారు.
ఇన్ని
రకములుగా
మీ
యోగక్షేమాన్ని
చూచుకున్న
స్వామి
మీరు
వెళ్లే
సమయములో
మిమ్ములను
సంతృప్తి
చేయకుండా
పంపుతాడా,
ఎప్పటికీ
పంపడు.
కర్తవ్య
కర్మలు
నిర్వర్తించాలి,
ఏఏ
సమయములందు,
ఏఏ
కాలమునందు,
ఏఏ
వ్యక్తియందు
ఏఏ
కర్మలుచేయాలని.
కర్తవ్యమును
మనము
నిర్వర్తించుకోటానికి
టైము
ప్రకారము
ఏఏ
సమయములో
ఏఏ
కార్యము
చేయాలో
ఆ
కార్యములో
మనం
పూర్తిగా
లీనముకావాలి.
ఈనాడు
మనము
సమాజసేవ
చేస్తున్నాము.
సమాజసేవలో
పవిత్రమైన
భావములోపల
మీకు
చెప్పినట్టుగా
మనము
హృదయ
పూర్వకంగా
సేవలు
సల్పి
సేవాభావమే
నీయొక్క
జీవితానికి
విలువనందిస్తుందనే
విశ్వాసముతో
ఈనాడు
ప్రతి
కర్మలో
మీరు
పాల్గొనండి.
నిజముగా
యిట్టి
మంచి
భావములను,
ఉత్తమమైన
మార్గములను
బోధించేవారు
చిక్కటమే
అరుదు.
మీలో
నున్న
దోషములను
ఎవరు
నిరూపిస్తారో
అట్టివారినే
మీరు
గురువుగా
విశ్వసించాలి.
అంతేగాని
మీ
దోషములను
cover
up
చేసేవారు
మీకు
హాని
చేసేవారే.
కనుక,
మనలోనున్న
దోషములను
చెప్పే
స్వామి
మాకు
చిక్కినాడే,
దీనివల్ల
మన
దోషములను
చక్క
చేసుకుని
సరైనరీతిలో
మేము
ప్రవేశించటానికి
అవకాశము
యిస్తున్నాడు
అని
మీరు
ఎంతో
సంతోషించవలసినదేగాని,
నిరుత్సాహమునకు
గాని,
ఏవిధమైన
విసుగుకు
గాని
మీరు
అవకాశము
నందించకూడదు.
ఇక్కడికి
వచ్చి
పవిత్రమైన
నెల
దినములు
ఈ
అభ్యాసములను
అభివృద్ధి
చేసుకున్న
తరువాత
మీరు
మీ
గృహములకు
వెళ్లినప్పుడు
మీ
తల్లిదండ్రులు
కూడను
మీ
ప్రవర్తనకు
ఎంతో
ఆనందిస్తారు.
అట్టి
ఆనందమును
వారికి
అందించటము,
ఇట్టి
సంతృప్తిని
మాకందించటము
మీ
జీవితములో
సౌభాగ్యమైన,
సంతోషమైన
జీవితమును
మీరు
గడుపుకోవటము
ఎంత
పవిత్రమైన
జీవితమో
మీరే
యోచించుకోవచ్చు.
విద్యార్థులారా!
మీరు
వాపసు
వెళ్లిన
తరువాత
మొట్టమొదట
ఇంటిలో
కనిపెడుతారు.
8
▾
Meaning
Keep
మా
పిల్లవాని
ప్రవర్తన
ఎట్లా
ఉందని,
పనిలో
ఏమైనా
మార్పు
కలిగించుకునే
ప్రయత్నానికి
పూనుకోవాలి.
లేకుండా
ఇక్కడున్నంతవరకు
మాత్రము
యిక్కడ
వుండి
అక్కడికి
పోతూనే
పాత
అభ్యాసములనే
నీవు
మొదలు
పెట్టినావంటే
‘మా
పిల్లవాడు
సమ్మర్
కోర్సుకుపోయి
ఏమి
ప్రయోజనము’
అని
తల్లిదండ్రులకు
కూడను
నిరుత్సాహము.
ఇంతేకాదు
మీ
పాత
ఫ్రెండ్స్
అంతా
వుంటారు.
విజిల్స్
వేసుకుంటూ
తిరగటము,
సినిమాలకు
తిరగటము,
బజార్ల
వెంబడి
కుక్కలవలే
తిరగటము
అలాంటి
స్నేహితులు
కూడా
‘వీడు
సమ్మర్
క్లాసుకు
వెళ్లి
వచ్చిన
తరువాత
ఎంతమార్పు
వచ్చింది’
అని
వారి
దగ్గర
కూడను
మీయొక్క
పవిత్రమైన
ప్రదర్శన
ప్రదర్శించాలి.
అంతేగాని
యిక్కడ
హలో
హలో
అని
అక్కడికిపోతూనే
కమాన్
కమాన్
అని
పోయిందంటే
మన
సమ్మర్క్లాసు
అంతా
ఒక్కతూరి
టైర్
పంక్చర్
అయినట్లుగా
మనలో
చేర్చుకున్న
పవిత్రత
అంతా
పాడై
పోతుంది.
ఆవిధంగా
మీరు
కాకుండా
చూచుకోండి.
యింక
లేచి
ఈనాటి
కార్యక్రమములో
పాల్గొనండి.
అధికంగా
మాట్లాడకుండా
మీరు
మీయొక్క
కార్యములందే
మీ
మనస్సును
లీనముచేసుకొని
ఆ
చేసే
కార్యమునందు
చక్కని
భావముతో
హృదయపూర్వకంగా
కర్మను
ఆచరించి,
ఈనాటినుండి
నేను
చెప్పిన
క్రమశిక్షణను
అనుసరిస్తూ
కొంతవరకు
స్వామికి,
మీకు
సంతృప్తి
అందించటానికి
పూనుకోండి.
ఒక్క
స్వామి
తృప్తి
అయినాడంటే
లోకమంతా
తృప్తి
అవుతుంది.
దానికి
మీరు
పూనుకోండి.
మీ
తుచ్చమైన
తృప్తికి
మీరు
పాటుపడకండి.
స్వామి
చెప్పేది
ప్రతి
ఒక్కటి
మంచికోసమే.
స్వామి
స్వార్థము
యిందులో
యేమీ
లేదు.
జీవితము
యొక్క
తత్త్వము
పురస్కరించుకొని,
మీ
భవిష్యత్తు
యొక్క
అభివృద్ధిని
పురస్కరించుకొని
మీ
జీవిత
ధన్యతను
పురస్కరించుకొని
స్వామి
యిన్ని
ప్రబోధలు
సల్పుతున్నాడు.
నాకు
కావలసినది
ఒక్కటీ
లేదు.
మీరు
ఒక్కొక్క
వ్యక్తి
ఒక్కొక్క
తల్లి
ప్రేమను
మాత్రమే
అనుభవించి
వుంటుంటారు.
కాని,
స్వామి
ప్రేమ-
వేయి
తల్లుల
ప్రేమవంటిది.
మీ
మంచిని,
మీ
అభివృద్ధిని,
మీ
క్షేమాన్ని
ఏ
తల్లిదండ్రులు
కూడా
యింతగా
కోరరు.
స్వామి
యిన్ని
రకములుగా
కోరుతున్నారు
అని
మీరు
హృదయపూర్వకంగా
భావించి
యింక
మున్ముందుకైన
చక్కగా
ఆచరించటానికి
పూనుకోండి.
లేవండి.
Previous
←
The Goal of Education: Equal Vision and Humility
Next
Dharma Protects Those Who Protect It
→