Contents
Devotion & Sacred Story
Home
Library
Find
Shelf
Settings
←
Leave
Sathya Sai Speaks 1973 · Dharma Protects Those Who Protect It
Tap a verse for its meaning
IAST
Telugu
Meaning
Continuous
Dharma Protects Those Who Protect It
10 June 1973, Summer Course, Brindavan
Morning
Evening
1
▾
Meaning
Keep
వట్టిమాటల
చేతనెప్పుడు
/
సత్తు
చిత్తానంద
మొందదు
విత్తనంబులు
లేని
భూమిలో
/
మొత్తముగా
పంటేమి
పండదు
దివ్యాత్మ
స్వరూపులైన
విద్యార్థులారా!
‘రసోవైసః’
అన్న
వేదవాక్యమును
అనుసరించి
ఈ
విశ్వమంతయు
రసమయమైన
బ్రహ్మము
నుంచే
ఉద్భవించెనన్నమాట
చెప్పక
తప్పదు.
అట్టి
ప్రకృతి,
అట్టి
బ్రహ్మ,
ఇట్టి
విశ్వము
ఈ
మూడింటి
ఏకత్వము
అవినాభావ
సంబంధము.
ఏకమైన
రసమే
అనేక
స్థాయిలుగా
మనకు
కనిపిస్తూ
వుంటుంది.
అప్రాకృతమైన
ఈ
ప్రపంచమునందు
మూడు
విధములైన
ఖండములు
విభజింప
బడినవి.
వీటిని
ఖండములని
చెప్పవచ్చును
లేక
లోకములని
చెప్పవచ్చును.
ఈ
మూడు
రకములైన
ఖండములకు
మొదటిదానిని
ముక్తధామమని,
రెండవదానిని
వైకుంఠధామమని,
మూడవదానిని
గోలోకధామమని
వీటికి
సార్థకమైన
నామములు.
ఈ
మూడింటి
యందు
భక్తి,
జ్ఞాన,
మోక్షముల
యొక్క
తత్త్వానికి
సరియైన
స్థానములుగా
ఏర్పరచినటువంటివి.
ఈ
ముక్తిధామమనేది
కేవలం
నిత్యానిత్యవిషయ
పరిశీలన
సల్పటం
తద్వారా
ఈ
రూపనామములు
అనిత్యమని,
అశాశ్వతమని,
అసత్యమని
తాను
నిర్ణయించుకొని
సత్య,
నిత్య,
నిర్మలమైన
ఆత్మతత్వము,
నిరాకారతత్త్వము
అనే
సత్యమునందు
తాను
కొంతవరకు
జీవితమును
అనుభవించి
తద్వారా
నిత్యానంద
పరమానంద
యోగతత్త్వాన్ని
తాను
అనుసరించి
తద్వారా
ముక్తి
అనే
స్థానమును
పొందే
మార్గమునకు
ముక్తిధామము
అని
పేరు.
ఇంక
భక్తిమార్గమునందు
ప్రేమరసాను
భావము
చేత
తన్మయత్వుడై
ఉన్మత్తుడై
భగవంతుని
యొక్క
ప్రేమతత్త్వమును
అనుభవించే
ప్రయత్నమునకై
తనయొక్క
యావత్
జీవితమును
అంకితము
చేసి
తద్వారా
పరమాత్ముని
అనుగ్రహమునకు
పాటుపడేటువంటి
పాత్రుడయ్యే
నిమిత్తమై
చేసే
ప్రయత్నము
లన్నియు
వైకుంఠధామమునకు
చేరుతుంది.
మానవుని
జీవితమునందు
భావ
రూపమును
ధరించి
స్థూల,
సూక్ష్మ
కారణ
శరీరమునకు
అతీతమైన
రసమును
గ్రోలే
దివ్యమైన
విభూతులను
గోలోకధామము
అని
పిలుస్తుంటారు.
2
▾
Meaning
Keep
మానవత్వము
క్షణక్షణమునకు
మార్పు
చెందునటువంటిది.
ఇట్టి
క్షణ
క్షణమునకు
మార్పుచెందే
మానవత్వమందు
క్షణక్షణము
వికారముతో
కూడిన
మనస్సును
కూడటం
చేత
తద్వారా
భిన్నత్వమనే
భావములు
అనేకత్వమనే
చింతలు
మానవునియందు
ఉద్భవించి
మానవత్వాన్నికూడను
మరపింపజేసే
అహంకారమును
పెంపొందింపచేస్తుంది.
మానవునికి
ఒకవిధమైన
మార్పు
చెందటమే
ఒక
అభిరుచిగా
ఉంటుంది.
దీనికి
ఒక
చిన్న
ఉదాహరణము
ఎట్టి
ఉత్తమమైన
గాయకుడైననూ
ఒకే
పాటను
ఒకే
రాగమునందు
అనేక
పర్యాయములు
పాడటం
చేత
శ్రోతలకు
విసుగురాక
తప్పదు.
కంటికి
కనిపించని
గానమునందు
అనేక
రకములైన
రాగములు
కూడ
కూడియున్నవి.
ఒక్కొక్క
రాగమునకు
ఒక్కొక్క
విధమైన
రూపము
కూడను
ధరించి
వుంటుంది.
కనుక,
రాగ,
తాళ,
భావములతో
కూడిన
తత్త్వములను
మానవుడు
నిరంతరము
అభిలషిస్తుంటాడు.
లోకము
ఒక్కటే
అయినప్పటికిని
త్రిగుణములతో
కూడటం
చేత
ఇందులో
ఒక
విధమైన
శబ్ద,
రూప,
రస,
గంధాదులు
అనేక
రకములైన
ఫలితమును
మనకు
అందిస్తున్నాది.
అదే
విధముగా
జీవుడు
ఒక్కడైనప్పటికి
అనేక
రకములైన
సంస్కారములతో
కూడటంచేత
తనయొక్క
ప్రవర్తనలు
తనకు
తెలియకనే
భిన్నమైన
మార్గములు
అవలంబిస్తుంటాయి.
కనిపించిన
దానినే
మనము
సత్యమనియు
కనిపించనివి
అన్నీ
అసత్యములనియు
మనము
విశ్వసించటము
మూఢత్వము.
కనిపించని
పదార్థమే
కనిపించే
తత్త్వమునకు
ఆధారమై
వుంటుంది.
ఒక
చిన్న
ఉదాహరణము
ఫలపుష్పములు
మనము
అనుభవిస్తుండినప్పటికిని
ఈ
కనిపించే
వృక్షమునకు
కనిపించని
వేర్లు
దీనికి
ఆధారమై
వున్నాయి.
కనిపించే
భవనమునకు
మనము
అనేక
రకములుగా
అందచందములు
తీర్చిదిద్దుతూ
ఉంటాము
కాని
ఈ
అందచందములుతో
తీర్చి
దిద్దబడే
గోడలకు
గాని
టాపుకు
గాని,
కనిపించని
పునాదులు
ఆధారమైనవని
తెలిసిన
విషయమే.
అనేక
అంగములతో
కూడిన
మానవస్వరూపమునకు
ఎట్టి
అంగములు
లేని
మనస్
తత్త్వము,
ప్రధానమైన
దివ్యత్వానికి
గాని,
అధమత్త్వానికి
గాని
మూలకారణమై
ఉంటున్నాది.
ఏయొక్క
వ్యక్తి
ఒక
గుండుపైన
నిల్చి
ఉన్నప్పుడు
తాను
నిల్చిన
గుండును
తాను
ప్రక్కకు
నెట్టటానికి
పూనుకోవటం
కేవలము
వెఱ్ఱి
తనమని
చెప్పవచ్చును.
తాను
నిల్చిన
గుండును
తాను
నెట్టటానికి
ఎట్టి
బలవంతునికైనా
సాధ్యము
కాదు.
పోనీ,
ఆవిధమైన
బలమును
సంపాయించుకొని
తాను
నిల్చిన
గుండునే
తాను
నెట్టటానికి
ప్రయత్నం
చేసినప్పుడు
తాను
కూడను
పడకతప్పదు.
3
▾
Meaning
Keep
కనుక
తాను
నిల్చిన
గుండును
తాను
నెట్టాలని
సంకల్పించుకున్న
వ్యక్తి
ప్రక్కకు
దిగి,
తన
బలమును
గుండుపైన
ఉపయోగపరచి
అప్పుడు
ఆ
గుండును
నెట్టటమనేది
లోకములో
సాధ్యమైన
విషయము.
బండిని
ఈడ్చే
గుఱ్ఱమును
బండిలో
కూర్చోబెడితే
అది
ఈడ్చగలదా!
కనుక,
ఏ
బండిని
ఈడ్చే
గుఱ్ఱము
ఉన్నదో
ఆ
గుఱ్ఱమును
బండికి
కట్టినప్పుడే
బండిని
ఈడ్చగలదు
గాని
బండిలో
ఆ
గుఱ్ఱమును
కూర్చుండపెట్టి
బండిని
ఈడ్చమంటే
ఈడ్చటానికి
సాధ్యము
కానట్టుగానే
మానవత్వమనే
దివ్యమైన
జీవతత్త్వము
ఈ
దేహమనే
బండిని
ఈడ్చే
నిమిత్తమై
పెట్టినదే
గాని,
ఈ
దేహమనే
బండిలో
దానిని
కూర్చుండబెట్టి
మనము
ఈ
బండిని
నడిపించటానికి
ప్రయత్నం
చేయటంలో
ఎంత
మూర్ఖత్వమో
మీరే
యోచించుకోవచ్చు.
కారులో
కూర్చున్నంత
మాత్రమున
తాను
కారు
కాదు.
కారును
నడిపేవాడు
కావచ్చుగాని
కారు
తాను
కానేరడు.
దేహము
అనే
గుండుపైన
నిల్చిన
మానవుడు
దేహము
పైననే
నిల్చుకొని,
దేహభ్రాంతి
యందే
తనయొక్క
జీవితమును
ఇమిడ్చి
ఆ
దేహము
అనే
గుండును
నెట్టటానికి
సాధ్యము
కాని
విషయము.
కనుక,
ఈ
దేహభ్రాంతి
అనే
గుండును
ప్రక్కకు
నెట్టే
ప్రయత్నములోనున్న
వ్యక్తి
దేహము
నుండి
రూపముగా
వుండినట్లు
భావించి
దేహభ్రాంతులు
యేమాత్రము
సంబంధము
లేనటువంటి
వ్యక్తిగా
తాను
తలంచి
అప్పుడు
ఆ
దేహమును
ప్రక్కకు
నెట్టటంలో
ఒక
సార్థకత
ఉంటున్నాది.
ఇట్టి
దేహతత్వమును
సక్రమమైన
మార్గము
నందు
ఉపయోగపరచి
సత్యస్వరూపమైన
తన
నిత్యస్థానమును
పొందే
మార్గమును
తెలుసుకునే
నిమిత్తమై
భగవద్గీత
మనకు
అనేక
రకములైన
ఆదర్శములు
అందించింది.
కలకత్తా
స్టూడెంటు
తన
సందేహమును
తెలుపుతూ
‘భగవద్గీత
యందు
కృష్ణపరమాత్మ
పాత
దేహమును
వీడి
కొత్త
దేహమును
ధరించినట్టుగా
పాతవస్త్రమును
వీడి
కొత్త
వస్త్రము
ధరిస్తున్నాడు.
కనుక
దేహము
వస్త్రము
వంటిది.
కనుక
ఈ
పాతబడిన
వస్త్రమును
నీవు
యేమాత్రము
ఆశించనవసరము
లేదు,
ఆశించుటలో
నీకు
ఏమాత్రము
నీకు
సరైన
ఇది
లేదు
అనేరీతిగా
కృష్ణుడు
బోధించినట్లుగా
తెలిపాడు.
అయితే
ఈ
దేహమనేది
పాతవస్త్రముగా
వుండినప్పుడు,
విసర్జించటము
గాని
త్యాగము
చేయటము
మానవునికి
సరియైనదే.
ఈ
దేహము
నూతనముగా
ఉండినప్పుడు
అనగా
చిన్నవయస్సు
20
వర్షములు
లేక
15
వర్షములు,
9
వర్షములు
ఉన్నటువంటి
దేహము
పాతదా
కొత్తదా
అనేది
ఒక
ప్రశ్న.
4
▾
Meaning
Keep
విద్యార్థులారా!
భగవంతుని
ప్రబోధలు
అవాజ్మనస
గోచరములు.
మానవునకు
ఇది
అతీతమైన
స్థితియందు
అర్థము
నందిస్తుంది.
భగవంతుని
యొక్క
పలుకులు
అర్థము
చేసుకోవటం
చాలా
కష్టము.
ఇది
కేవలము
భగవద్విశ్వాసమును,
భగవంతుని
శక్తి
సామర్థ్యములను
గుర్తించుకున్న
వ్యక్తులకు
మాత్రమే
సాధ్యమౌతుంది
గాని
సామాన్య
మానవులు
యిది
కొత్త
వస్త్రమో,
పాత
వస్త్రమో
అనేటువంటి
పేర్లకు
అనేక
అర్థములు
తీసుకోవటం
కద్దు.
ఇందులో
వున్న
అర్థము
స్పష్టముగా
తెలుపుటకు
పూనుకుంటున్నాను.
నీవు
ఏదో
సమ్మర్లో
కాశ్మీరు
యాత్రకు
వెళ్లావు.
ఆ
కాశ్మీరు
వెళ్లినప్పుడు
ఒక
వులెన్
సూట్
క్లాత్
కొన్నావు.
అది
తెచ్చుకొని
బీరువాలో
పెట్టావు.
కాని
కొంతకాలము
మరచి
పోయావు.
అది
మూడు
నాలుగు
సంవత్సరముల
తరువాత
నీవు
సర్దుతుండగా
ఆ
క్లాత్‌ను
నీవు
చూస్తావు.
చూచిన
తక్షణమే
‘అయ్యో!
ఐదు
సంవత్సరములకు
పూర్వము
కాశ్మీర్లో
ఈ
సూట్
క్లాత్
కొన్నాను’
అని
తక్షణమే
టైలర్
దగ్గరకి
తీసుకువెడతావు.
టైలరు
ప్యాంట్
కోటు
కుట్టి
ఇస్తాడు.
రెండూ
వేసుకొని
ఒకనాడు
ఒక
పెండ్లికి
వెళ్లావు.
ఈనాడు
టైలరు
కుట్టి
ఇచ్చాడు.
మరునాడే
ప్యాంటు
కోటు
వేసుకువెళ్లావు.
ఏదో
ఒక
రకంగా
భోజనానికి
కూర్చోటానికి
వంగేటప్పటికి
ప్యాంటు
చిరిగిపోయింది.
చిరిగిపోయిన
తక్షణమే
నీవు
అంటున్నావు.
‘కొత్త
ప్యాంటు,
చిరిగిపోయిందే’
అని
కొత్త
ప్యాంటు
ఎట్లా
చిరిగిపోయిందని
చిరాకు
పడతావు.
కానీ
ప్యాంటు
కొత్తదే
గాని
stock
old
stock.
అదేవిధముగా
మన
దేహతత్త్వమనేది
టైలరు
కుట్టినట్లుగా
కాళ్లు
చేతులు
తల
stitch
చేసినట్లుగా
ఈ
దేహము
కొత్తదిగా
వచ్చింది.
కానీ
life
old
stock.
అదేవిధముగా
మన
దేహము
యొక్క
ఆయువును
దేహము
యొక్క
వయస్సును
మనము
గుర్తిస్తున్నామే
గానీ
జీవుని
యొక్క
తత్త్వాన్ని
మనము
గుర్తించటానికి
సాధ్యము
కాదు.
కనుక,
భగవంతుడు
జీవతత్త్వము
గురించి
ఈ
జీవుడు
పాతవాడే
కనుక
ఇది
కొత్త
వస్త్రమును
ధరించుకొన్నట్టుగా
దివ్యమైనటువంటి,
ఉత్తమమైన
లోకములో
ఉద్భవించే
పరిస్థితికి
దీనిని
పాతదని,
దానిని
కొత్తదని
పేర్లు
ఉపయోగపెట్టారు.
ఇంక
మరొక
స్టూడెంటు
ధర్మరాజుల
వారు
‘అశ్వద్థామ
హతః
కుంజరః’
అనే
పదములు
ఉపయోగపెట్టి
నిష్కారణముగా
అశ్వద్థామ
అనే
కుమారుడు
చచ్చి
పోయాడని
ద్రోణాచార్యునికి
చెప్పటము
లోపల
ధర్మరాజు
మోసము
చేసినట్లుగా
కనిపిస్తున్నాది
కదా
ఇలా
చేయవచ్చునా
అని
మరొక
ప్రశ్న.
5
▾
Meaning
Keep
దీనిలో
రెండు
రకములైన
మార్గములను
మనము
చూడవలసి
వస్తుంది.
ఆనాడు
అశ్వద్థామ
అనే
పేరు
గలిగిన
ఏనుగు
చావటము
సత్యమే.
దానిని
పుత్ర
వాత్సల్యముతో
మునిగిన
ద్రోణాచార్యునకు
ఈ
వార్త
తెలపటంచేత
తనయొక్క
శక్తి
సామర్థ్యములు
కోల్పోవచ్చు
అనే
ఉద్దేశ్యముతో
లీలానాటక
సూత్రధారియైన
కృష్ణుడు
ధర్మజుని
ప్రోద్బల
పరచినదే
గాని
ధర్మజుడు
స్వబుద్ధితో
తాను
చెప్పటం
కాదు.
ధర్మజుడు
మహాపవిత్రమైన
హృదయము
కలిగినవాడు.
ఈ
విషయమునందు
కృష్ణునితో
అనేక
రకములుగా
వాదించాడు.
‘స్వామీ
నిష్కారణముగా
ఈవిధమైన
వార్తను
తెలిపి
ద్రోణాచార్యునికి
కొన్ని
రకములైన
ఇక్కట్లు
కల్గించటం
న్యాయం
కాదుకదా.
ఈవిధంగా
చెప్పటానికి
నా
మనస్సు
ఒప్పటం
లేదని
ధర్మజుడు
కృష్ణునితో
వేడుకొన్నాడు.
‘నీవు
అసత్యము
చెప్పనక్కరలేదు.
అయ్యా
ధర్మజా!
సత్యమే
చెప్పు.
అశ్వద్థామ
అనే
ఏనుగు
చచ్చిందనే
చెప్పు.
అయితే
కుంజరము
అనేది
మెత్తగా
చెప్పమన్నాడు.
గొంతు
మార్చమన్నాడు.
అందువల్ల
‘అశ్వద్థామ
హతః
కుంజరః’
అన్నాడు.
భారతయుద్ధానంతరం,
ధర్మరాజు
పశ్చాత్తాపంతో
కృష్ణునితో
ఇలా
అన్నాడు.
బావా
నాతో
ఎందుకు
అసత్యం
పలికించావు
అన్నాడు.
ధర్మజా
నేను
ఏది
చేసినా
దానిలో
న్యాయం
వుంటుంది,
ఒక
అర్థం
వుంటుంది
అని
అన్నాడు
శ్రీకృష్ణుడు.
దానికి
ఒక
ఉదాహరణగా
శ్రీకృష్ణుడు
ఇలాచెప్పాడు.
ధర్మజా
నీ
ఇంట్లో
ఒకదొంగ
రాత్రి
సమయంలో
ప్రవేశించి
విలువయిన
వస్తువులు
దొంగిలించి
ఒక
యిరుకయిన
ముండ్లతో
కూడిన
దారిలో
పారిపోతున్నాడనుకో
అపుడు
నీవు
ఏమి
చేస్తావు?
అతనిని
నీవు
పట్టుకోవాలంటే
నీవు
కూడా
అదే
మార్గంలో
వెంబడించి
పట్టుకోవాలి
కాని
వేరే
మంచిదారిలో
వెళ్తే
వాడు
దొరకడుకదా.
అలా
దొంగపోయిన
మార్గమును
నీవు
అనుసరించినప్పుడే
దొంగను
పట్టటానికి
వీలవుతుంది
గాని
నీవు
ఇంకొక
మార్గములో
చక్కనైన
రాజబాట
అని
పోతుంటే
నీకు
ఆ
దొంగ
చిక్కటానికి
వీలు
కాదు’
అని
అన్నాడు.
అదేవిధముగా
ద్రోణుడు,
బ్రాహ్మణుడు
కత్తి
పట్టటానికి
అధికారము
లేదు.
తాను
యుద్ధము
చేయకూడదు.
కేవలము
గురువుస్థానము
నందు
నిల్చి
శిష్యులకు
శస్త్రవిద్యలు
నేర్పించవచ్చునే
గాని
తాను
కత్తిని
బట్టి
యుద్ధభూమిలో
నిల్చటము
ఒక
అధర్మ
మార్గము.
అంతే
కాదు,
తన
శిష్యులైన
పాండవులతోనే
కత్తి
కట్టటము
అనేది
రెండవ
అధర్మ
మార్గము.
ఇట్టి
అధర్మ
మార్గములో
పోయే
ద్రోణాచార్యుని
మనము
కొట్టక
తప్పదు.
ధర్మసంస్థాపన
నా
సంకల్పము.
6
▾
Meaning
Keep
అధర్మములో
ప్రవేశించి,
సకల
విద్యలు,
సకల
శాస్త్రములు,
సకల
ఉపనిషత్తులు,
సర్వ
నియమములు
తెలిసిన
ద్రోణుడు
ఇంత
అపమార్గములో
పోవటము
చూచి
ఏరకంగానైనా,
ఆ
అపమార్గములోనే
అతనిని
పట్టటము
ధర్మమైనదే
గాని
అధర్మము
కాదు’
అన్నాడు.
ఇందులో
మీకు
ఒక
సందేహము
కొత్తగా
కలగవచ్చును.
గురువైన
ద్రోణాచార్యుడు
శిష్యులపైన
యుద్ధము
చేయటము
తప్పుకదా.
అదేవిధముగా
శిష్యులైన
పాండవులు
ద్రోణాచార్యునిపైన
యుద్ధము
చేయటము
అధర్మము
కాదాయని
ఒక
సందేహము
రావచ్చును.
కాని,
ఇందులో
పాండవులకు
అధర్మమనేది
వారి
తలకు
నెట్టటానికి
వీలుకాదు.
పాండవులు
మొట్టమొదటి
నుండి
పవిత్రమైన
మార్గమునే
అవలంభిస్తూ
వచ్చారు.
అంతే
కాదు
భగవదాజ్ఞను
వారు
శిరసావహిస్తూ
వస్తున్నారు.
భగవదాజ్ఞను
క్షణము
నందైనా
వారు
ఉల్లంఘించిన
వారుకాదు.
అలాంటి
పవిత్రమైన
పాండవులు
యుద్ధభూమి
యందు
చేరి
తక్షణమే
రెండు
పక్షముల
వారు
సంసిద్ధులై
శంఖములు
ఊదుతున్న
సమయములో
ధర్మజుడు
తనయొక్క
పాదరక్షలు,
కిరీటము,
కవచమును
విడచి
పక్కకు
పెట్టి
తాను
చేతులు
కట్టుకొని
ద్రోణాచార్యుని
దగ్గరకు
నేరుగా
కాలితో
నడచి
వెళ్లాడు.
ఈవిధముగా
ధర్మజుడు
చేతులు
కట్టుకొని
రెండు
పక్షముల
వారు
సంసిద్ధులై
చూస్తూ
వుండే
లోపల
కౌరవులవైపున
నడచి
వెళ్లటం
చూచి
కౌరవుల
వారంతా
కూడను
శరణాగతి
కోసం
వస్తున్నాడు
ధర్మజుడు,
వారికి
అపజయం
అయిపోయింది
అని
కేకలు
వేస్తున్నారు.
ఒకవైపున
నున్న
భీముడు,
అర్జునుడు
కండలు
కదలిస్తున్నారు,
గ్రుడ్లు
తిప్పుతున్నారు.
ఏమిటి
ఇంత
బుద్ది
తక్కువ
యుద్ధభూమి
యందు
వారిని
శరణాగతి
వేడుతున్నాడేయని
వారు
కూడా
అపార్థం
చేసుకున్నారు.
కాని,
కృష్ణునికి
అంతరార్థము
తెలుసును.
అందువలననే
కృష్ణుడు
చెప్పాడు,
‘అర్జునా,
భీమా
మొదటినుండియు
అన్నను
అనుసరించటము
అలవాటు,
ఈనాడు
కూడను,
మంచియో
చెడ్డయో
తరువాత
యోచించుకో
వచ్చును,
యిప్పుడు
అన్నను
అనుసరించటం
ధర్మము.
మీ
డ్రస్సును
ప్రక్కకు
పెట్టి
అన్నను
అనుసరించండి’
అన్నాడు.
కృష్ణుని
ఆజ్ఞ
మీరుటకు
వీలుకాదు.
అందువల్ల
‘ఈ
అన్న
సరి
వద్దంటే
జూదము
ఆడాడు.
అనేక
కష్టములకంతా
గురియైనాడు,
ఈనాడు
కూడా
ఈ
రకమైన
మార్గాన్ని
అనుసరిస్తున్నాడు.
ఏమైతేనేమి
కృష్ణుని
ఆజ్ఞ
శిరసా
వహిస్తున్నాము’
అన్నారు.
వారి
పాదరక్షలు,
కిరీటము,
కవచము
తీసి
అన్నవెంట
ఒకరి
వెంట
ఒకరు
ఐదుమంది
బయలుదేరారు.
7
▾
Meaning
Keep
సరి
ఈ
ఐదుమంది
భీష్మాచార్యుని
దగ్గరకు
వెళ్లారు.
ధర్మజుడు
భీష్మునికి
నమస్కరించి,
పితామహా!
మేము
చిన్ననాటనే
మాతండ్రిని
కోల్పోయినాము.
చిన్ననాటి
నుండి
మీరు
పెంచి
పెద్దచేసి
సర్వవిద్యలు
నేర్పించి
తండ్రి
సమానముగా
మమ్ము
పెంచారు.
తండ్రి
సమానమైన
మీతో
మేము
యుద్దము
చేయటానికి
పూనుకున్నాము.
అనుజ్ఞ
దయచేయమని
ప్రార్థించాడు.
అప్పుడు
భీష్ముడు
ధర్మజుని
ధర్మ
భావమును
గుర్తించి
కన్నులలో
నీరు
గిఱ్ఱున
తిరిగింది.
‘నాయనా!
ఇటువంటి
స్థితియందు
కూడను
ధర్మమార్గమును
యేమాత్రము
మీరక
నాయొక్క
ఆజ్ఞను
పొందటానికి
నీవు
వచ్చితివా.
నీవు
ధర్మమార్గమును
అవలంబిస్తున్నావు
కనుక
నీకు
దిగ్విజయమగు
గాక
అని
ఆశీర్వదించాడు.
తక్షణమే
ధర్మజుడు
గురువైన
ద్రోణాచార్యుని
దగ్గరకు
వచ్చి,
‘స్వామీ!
తమరు
మా
గురువు,
మేము
తమయొక్క
శిష్యులము.
ఆచార్యా!
మీకు
అశ్వద్ధామ
స్వంతపుత్రుడు.
మేముకూడా
మీపుత్ర
సమానులమే,
ఎందుకంటే
మీరు
మాకు
విద్యా
బుద్ధులు
నేర్పించి
స్వంతపుత్రులవలే
ప్రేమించి
పెద్దచేశారు.
కాని,
కాలకర్మకారణవశాత్తుగా
ఈనాడు
మీతో
యుద్దము
చేయవలసి
వచ్చింది.
కనుక
తమరు
అనుజ్ఞ
యివ్వాలని
ద్రోణాచార్యుని
ప్రార్థించినాడు.
ద్రోణాచార్యుడైన
గురువుకు
మనస్సు
కరిగిపోయింది.
తక్షణమే
ధర్మజుని
కౌగలించుకొని
‘ధర్మోరక్షతిరక్షితః’
అన్నాడు.
కనుక
ఏ
నిముషము
లోపల,
ఏక్షణము
లోపల
ఎవరి
ప్రాణం
పోతుందో
అనేటువంటి
భయంకరమైన
స్థితియందు
కూడను
పాండవులు
ధర్మమునే
అనుసరిస్తూ
వచ్చారు.
ఈ
ధర్మమును
అవలంబించటమే
కృష్ణుని
యొక్క
లక్ష్యముగా
పెట్టుకొని
తాము
చేసే
ప్రతి
పనియందు
ధర్మసంస్థాపన
అనేటువంటి
లక్ష్యాన్ని
నిరూపిస్తూ
వచ్చారు.
అలాంటి
పాండవులు
అధర్మ
మార్గము
పట్టారని
ద్రోణాచార్యునికి
అసత్యము
చెప్పారని
అనటంలో
ఏమాత్రము
ఆధారము
లేదు.
విద్యార్థులారా!
మీరు
చదివే
పురాణములయందు
గాని
మీరు
చదివే
భారత,
భాగవత,
రామాయణములందు
గాని
కొన్ని
రకములైన
అనుమానములు
తట్టవచ్చును,
కొన్ని
ఊహలు
రావచ్చును.
మీలో
వున్న
ఊహలకే
మీరు
తబ్బిబ్బై
అందులోనున్న
దోషములను
మాత్రమే
మీరు
తీసుకోటానికి
పూనుకోకూడదు.
భగవంతుని
యొక్క
కార్యములందు
గాని,
భగవంతుని
చరిత్రలయందు
గాని
కారణము
లేని
కార్యము
ఉండదనే
సత్యాన్ని
మీరు
గుర్తించుకోవాలి.
అంతరార్థములు
అనేకంగా
ఉంటాయి.
కానీ
మీరు
పదార్థము,
వాక్యార్థము,
బాహ్యార్థమును
మాత్రమే
తీసుకొని
యదార్థమును
మాత్రము
విసర్జించటంచేత
మీకు
సరైన
అర్థము
చిక్కదు.
8
▾
Meaning
Keep
కనుక
doubts
వచ్చినా
ఇది
భగవంతుని
యొక్క
చరిత్ర
ఏమాత్రము
doubt
లేదు
అనే
విశ్వాసమునకు
మీరు
పూనుకోండి.
లోకోద్ధార
నిమిత్తమై
జరిగే
కార్యములందు,
భగవంతుడు
కొన్ని
పరిస్థితుల
యందు
నాటకము
ఆడవలసి
వస్తుంది.
భక్త
రక్షణను
ఒకవైపునందుంచుకొని
ధర్మ
సంస్థాపనము
అనే
లక్ష్యము
మరియొక
స్థానమునందుంచుకొని
ఈ
మూడింటిని
దృష్టియందుంచుకొనియే,
మనకు
అర్థము
కాని
చేష్ఠలు
చేయుటకు
పూనుకుంటాడు.
ఇదే
ఒక
రక్షణ
గురించి
కొన్ని
రకములైన
నాటకములాడిన
మరొక
ఉదాహరణము.
భారత
యుద్ధమునందు
కడపటి
దినమున
కౌరవులందరు
గతించారు.
ఆ
సమయములో
దుర్యోధనుడు
మిగిలాడు.
ఆ
దుర్యోధనుడి
మిత్రుడైన
అశ్వద్థామ
అతని
దగ్గరకు
వెళ్లాడు.
దుర్యోధనుడు
అశ్వద్థామను
గట్టిగా
కౌగలించుకొని
‘ఏమి!
ఈ
అంత్యములో
ప్రాణము
విడిచే
సమయము
లోపల
ఏమి
సహాయము
చేస్తావు.
ఏదైనా
సహాయము
చేయమని
ధైర్యమును
బోధించమని
ప్రార్థించాడు.
ఆ
సమయములో
అశ్వద్థామ
‘ఈ
ఒక్కరాత్రి
లోపలనే
నీకు
99మంది
సోదరులు
పోయినారు
కనుక
ఈ
పాండవులను
హతమార్చే
దీక్షను
నేను
పడతాను.
తెల్లవారే
లోపలనే
పాండవులను
హతమారుస్తానని
శపధము
చేసి,
తక్షణమే
దేవాలయమునకు
వెళ్లి
కాళికాదేవిని
ప్రార్థిస్తూ
వచ్చాడు.
కాళి
అశరీర
వాణితో
ఈ
అశ్వద్థామకు
చెప్పింది,
అశ్వద్థామా!
నీవు
పాండవులను
చంపటములో
ఏమాత్రము
జయము
పొందలేవు.
పాండవులు
మహా
ధర్మ
స్వరూపులు.
ధర్మమే
వారిని
రక్షిస్తున్నది.
వారిని
చంపటం
నీ
తరము
కాదు’
అని
ఉపదేశించింది.
కాని,
మూర్ఖపుపట్టిన
అశ్వద్థామ,
‘ఏరకమైనా
ఏమి,
నీ
ఆశీర్వాదము
లందించు’
అన్నాడు.
‘నా
ఆశీర్వాదములు
సర్వులకు
అందిస్తూనే
ఉన్నాను.
కాని
జయాప
జయములు
వారివారి
ధర్మముపై
ఆధారపడి
వుంటుంటాయి’
అని
అతనిని
పంపించింది.
కాని,
ఈ
అశ్వద్థామ
దుర్యోధనుని
కిచ్చిన
ప్రామిస్
ఒక
కృష్ణునికి
మాత్రమే
తెలుసు.
తాను
కొన్ని
రకములైన
నాటకము
లాడతలంచి
తక్షణమే
దుర్వాసుని
దగ్గరకు
వెళ్లాడు
కృష్ణుడు.
దుర్వాసుని
దగ్గరకు
వెళ్లేటప్పటికి
కృష్ణ
పరమాత్మ
తన
ఆశ్రమమునకు
వచ్చాడని,
‘పరమాత్మా!
నా
ఆశ్రమమునకు
వస్తివా’
అని
అనేక
రకములుగా
గౌరవించి
ఉచిత
ఆసనము
నందించి
స్వామి
రాకకు
ఏమిటో
కారణమని
కోరాడు.
9
▾
Meaning
Keep
‘ఈనాడు
నీతో
నాకు
పని
కావలసి
వచ్చింది.
నీవు
ఆపని
చేసిపెట్టక
తప్పదు’
అన్నాడు
కృష్ణుడు.
‘తమకు
ఏమిటి?
నాతో
పనిని
గావించుకోవటము
ఏమిటి?
ఇది
చాలా
ఆశ్చర్యముగా
ఉంటున్నాది.
తమ
ఆజ్ఞకు
నేను
బద్దుడను.
కనుక
మీ
ఆజ్ఞను
శిరసావహిస్తాను
కాని
అసత్యాన్ని
నేను
చెప్పను.
సత్యమే
నీస్వరూపము
కనుక
అట్టి
సత్యమునకు
నేను
సంసిద్దుడనే’
అన్నాడు.
‘నేను
మాత్రము
అసత్యమాడమని
ఏనాడూ
ఉపదేశించను.
సత్యమే
చెప్పవచ్చును.
కాని
సత్యము
లోపల
నేను
చెప్పిన
రీతిగా
నీవు
నటించాలి’
అన్నాడు
కృష్ణుడు.
అయితే
తాము
ఏమి
కోరుతున్నారో
సెలవివ్వమని
దుర్వాసుడు
కోరాడు.
అప్పుడు
కృష్ణుడు
‘ఈనాటి
రాత్రి
పాండవులను
నీవు
రక్షించాలి’
అన్నాడు.
‘ఏవిధంగా
నేను
రక్షించటం’
అని
దుర్వాసుడు
అడుగగా
‘అశ్వద్థామ
తెల్లవారేలోపు
పాండవులను
హతమారుస్తానని
దీక్ష
పూనినాడు’
కనుక
నీవు
ఈనాటి
రాత్రి
పాండవులను
నీ
చెంత
పెట్టుకోమన్నాడు
కృష్ణుడు.
అప్పుడు
దుర్వాసుడు
చెప్పాడు,
‘అశ్వద్థామ
ఏదో
ఒక
రీతిగా
ఇక్కడికి
వచ్చి
పాండవులున్నారా
అంటే
ఏరీతిగా
లేరని
చెప్పటం,
అసత్యానికి
నేను
ఏమాత్రం
పూనుకోను’
అన్నాడు.
‘అసత్యము
ఆడనక్కర
లేదు.
దీనికి
ఒక
చక్కని
ప్లాను
చెబుతాను.
బాగా
ఒక
గుంటను
త్రవ్వు.
ఆ
గుంటలోపల
ఈ
పాండవులను
పెట్టు.
దానిపైన
ఒక
చెక్క
పరచి
దానిపైన
నీ
సింహాసనము
వేసుకొని
కూర్చో.
ఇంకో
మూడు
ఘడియల
సమయానికి
అశ్వద్థామ
వస్తాడు.
వచ్చి
పాండవులు
ఎక్కడ
అని
నిన్ను
ప్రశ్నించవచ్చును.
అప్పుడు
ఈ
రకంగా
మాట్లాడమని
చెవులో
ఏదో
చెప్పాడు.
సరే!
నేను
సిద్ధంగా
వున్నానన్నాడు
దుర్వాసుడు.
కృష్ణుడు
చెప్పినట్లుగానే
మూడుగంటలకు
అశ్వద్థామ
అన్నివైపులా
గాలించి,
ఎక్కడా
పాండవుల
చిక్కలేదని
కాలజ్ఞానియైన
దుర్వాసుడు
చెప్పగలడని
భావము
కొంత
వరకు
హెచ్చరించటం
చేత
ఈ
దుర్వాసుని
దగ్గరకు
వచ్చి
దర్శించాడు.
‘దుర్వాసుడు
కృష్ణుని
యొక్క
ఆజ్ఞ
ప్రకారము
సిద్ధంగా
వున్నాడు.
అశ్వద్థామ
వచ్చి
‘స్వామీ!
తాము
త్రికాలజ్ఞానులు,
పాండవులతో
నాకు
అత్యవసర
ముంటున్నాది.
కనుక
పాండవులు
ఎక్కడ
వున్నారో
చెప్పి
నన్ను
అనుగ్రహించాలి’
అడిగాడు.
ఈ
మాట
విన్న
తక్షణమే
కృష్ణుడు
చెప్పినటువంటి
మాటలు
తన
మనస్సునందు
ఉంచుకోవటం
చేత
తాను
శబ్దము
మార్చి
‘ఆ
పాండవులా
నాక్రింద
ఉన్నారు’
అన్నాడు.
ఈవిధముగా
శబ్దమును
మార్చి
సత్యమును
చెప్పటము
చేత
అశ్వద్థామ
‘దుర్వాసుడు
చాలా
కోపములో
వుంటున్నాడు.
10
▾
Meaning
Keep
ఈ
నిముషంలో
నన్నే
భస్మము
చేస్తాడో
ఏమోనని’
నమస్కారమని
వెళ్లిపోయినాడు.
కనుక,
సత్యమైనప్పటికి
ఒక్కొక్క
పర్యాయము,
భక్త
రక్షణ
నిమిత్తమై
గాని,
లేక
కొన్ని
రకములైన
రక్షణ
కోసమనిగాని
సత్యమును
చెబుతూ
శబ్దమును
మార్చవచ్చు.
కనుక
భగవంతుని
కార్యములందు
ఏఏ
అంతరార్థములు
తెలుసుకొనేటువంటి
శక్తి
సామర్థ్యములు
మీకు
వచ్చునంత
వరకు
కూడను
మీరు
అనుమానమునకు
గురికాక
విశ్వాసమును
మాత్రము
పెంచుకొని
పవిత్రమైన
దివ్యమైన
చరిత్రల
యందు
విశ్వాసముంచి
భారత,
భాగవత,
రామాయణాదుల
యందు
మీ
మనస్సును
లీనమొనర్చి
దానిని
అనుసరించటానికి
తగిన
ప్రయత్నములు
ఈనాడు
విద్యార్థులు
చేసినప్పుడు
మన
భారతదేశము
అనాది
వేద
హితమైన
పవిత్రస్థితిని
అందుకోవటంలో
యేమాత్రము
సందేహము
ఉండదని
ఈనాడు
రెండు
ప్రశ్నలకు
మాత్రమే
పూర్తి
మీ
doubts
పోయేటువంటి
నిమిత్తమై
అనేక
ఉపమానములతో
మీకు
అందించే
సంకల్పము
చేసుకోవటం
చేత
రెండు
ప్రశ్నలకే
యీనాడు
జవాబు
చెప్పగలిగినాను.
తదుపరి
మిగిలిన
వాటికి
చెబుతాను.
కాలము
ఎక్కువ
అయిపోవటం
చేత
నేను
ప్రసంగాన్ని
విరమిస్తున్నాను.
Previous
←
Discipline, Mastery of the Senses
Next
Karma Free of Desire for Its Fruit, and Its Practice
→