Contents
Devotion & Sacred Story
Home
Library
Find
Shelf
Settings
←
Leave
Sathya Sai Speaks 1973 · The Destination and the Aim
Tap a verse for its meaning
IAST
Telugu
Meaning
Continuous
The Destination and the Aim
17 June 1973, Summer Course, Brindavan
Morning
Evening
1
▾
Meaning
Keep
గమ్యంలేని
జీవితం
అర్థరహితమైన
జీవితం
గడచిన
నెలదినములు
ఒక
విధమైన
మార్పు
మీలో
ఉండినట్లు
మీకేమైనా
విశ్వాసముందా?
ఇక్కడున్నంత
కాలము
మాత్రము
మీరు
ఈవిధమైన
మార్పును
అనుభవించటం,
తిరిగి
మీమీ
స్థానములు
చేరిన
తరువాత
భిన్నంగా
మార్పు
రావటం
అనేది
జరుగకూడదు.
ముఖ్యంగా
ఇన్ని
దినములు
ఇక్కడ
గడిపినందుకు
మీ
హృదయంలో
రెండు
విషయాలు
మాత్రం
భద్రం
చేసుకోవాలి.
ప్రతి
ఒక్క
వ్యక్తికి,
ప్రతి
యొక్క
కర్మకు
ప్రతి
ఒక్క
ఆశయానికి
ఒక
గమ్యము,
ధ్యేయము
అనేటువంటిది
ఉండాలి.
ఒక
ధ్యేయము,
గమ్యము
లేనప్పుడు
మన
జీవితమే
కేవలం
ఒక
అర్థరహితమైన
జీవితంగా
ఉంటుంది.
మనం
ఎన్ని
పనులు
చేసినా,
ఏవిధమైన
తలంపులు
తలంచినా,
ఏ
ప్రదేశమునందుండినా,
మన
ధ్యేయమన్నది
నిరంతరము
ఆత్మపైన
లక్ష్యపరచుకోవాలి.
ఎక్కడైనా
నది
ప్రవహిస్తుంటే
ఆ
నది
ఒడ్డున
మీరు
నిల్చుకొని
ఆ
నదిని
మీరు
కొన్ని
ప్రశ్నలు
వేయటానికి
పూనుకోండి.
ఆ
నది
ఏమైనా
మీకు
జవాబు
చెబుతుందా?
లేక
మీరు
పలకరిస్తున్నారని
మీ
వైపు
ఏమైనా
చూస్తుందా?
ఏమాత్రము
చూడదు.
‘ఓ
నదీ!
నీవు
ఎక్కడకు
ఇంత
త్వరగా
వెడుతున్నావు?
ఈ
ప్రయాణము
ఇంత
తీవ్రంగా
జరగటానికి
కారణం
ఏమిటి?
నీ
గమ్యము
ఏమిటి?
నీ
పరిస్థితి
ఏమిటి?
ఎక్కడ
నుంచి
వచ్చావు
అని
ఎన్ని
ప్రశ్నలు
వేసినప్పటికిని
నీ
ప్రశ్నలకు
గాని,
నీ
రూపమునకు
గాని
ఏమాత్రము
లక్ష్యముచేయక
అనేక
రకములుగా
తాను
ఉద్రేకపరచుకొని,
ఆవేదనతో
తన
ప్రయాణమును
ఏమాత్రము
నిలపకుండా
సలుపుతూనే
ఉంటుంది.
అనగా
తాను
ఏ
యొక్క
స్థానమునుండి
ఉద్భవించిందో
ఆ
స్వస్థానము
చేరే
నిమిత్తమై
లక్ష్యమునంతా
స్వస్థానముపై
పెట్టుకోవటం
చేత
ఎవరి
ప్రశ్నలనుగాని,
ఎవరిని
గాని
లక్ష్యము
చేయక
తన
పతి,
తన
గతి
అయిన
సముద్రములో
చేరి,
అతని
ఒడిలో
చేరి
ఆనందమును
అనుభవించే
నిమిత్తమై
ఉఱ్ఱూతలూగుచు
ఎట్టి
విధముగను
కాలహరణము
చేయక,
కొండలపైన
పడి,
గుట్టలపైన
పడి,
నదులుగా
ప్రవహించి
వంకరులుగా
తిరిగి
అడవులలో
తిరిగి,
ముండ్లలో
తిరిగి,
గుండ్లలో
తిరిగి
అనేక
శ్రమలకంతా
తాను
ఓర్చి
ఎన్ని
కష్టములు,
ఎన్ని
నష్టములు,
ఎన్ని
దుఃఖములు
కలిగినప్పటికిని
తాను
లక్ష్యమును
వదలక
గమ్యము
అనే
సాగరమును
చేరుకుంటున్నాది.
2
▾
Meaning
Keep
అదే
విధముగా
ఈ
జగత్తులో
ఎన్ని
రకములైన
ఇబ్బందులు
కలిగినా,
ఎన్ని
రకముల
ఇక్కట్ల
పాలైనా,
ఎన్ని
రకముల
అశాంతులకు
గురియైనా
మన
మార్గములో
ఎన్ని
రకములైన
త్రోవలు
నడచినప్పటికిని,
అనగా
బ్రహ్మచర్య,
గృహస్థ,
వానప్రస్థ,
సన్యాస
అనేటు
వంటి
ఈ
మార్గములయందు
మనము
ప్రవేశించినప్పటికిని
లక్ష్యము,
గమ్యము
ఒక
ఆత్మపైననే
ఉంచుకోవాలి.
దీనికి
మరొక
ఉదాహరణము.
మీరు
ఈ
సమ్మర్
క్లాసులైన
తరువాత
22,
23
తేదీలలో
ఇక్కడినుండి
మీ
మీ
గ్రామాలకు
వెడుతున్నారు.
వెళ్లే
మార్గ
మధ్యములో
ఒక
సత్రములో
మీరు
దిగవచ్చును.
కొంతకాలము
ట్రైను
కోసమో,
ఇంక
దేనికోసమో
మీరు
wait
చేయవచ్చు.
మీరు
ఆ
rest
house
లో
దిగినప్పుడు
ఆ
rest
house
అధికారి
లేక
incharge
గా
వున్నవాడో
మిమ్మల్ని
ప్రశ్నించ
వచ్చును.
‘ఎవరండీ
మీరు?
ఎక్కడనుండి
వచ్చారు?
ఎక్కడికి
వెడుతున్నారు?
ఎన్ని
దినములుంటారు?’
అని.
మీరు
అందుకు
నేను
ఫలానా,
నేను
బెంగుళూరునుండి
వచ్చాను.
ఢిల్లీకి
వెడుతున్నాను
అని
చెప్పటం
ఇది
సహజంగా
వుంటుంది.
అదేవిధముగా
మనము
ఈనాడు
జనసంబంధమైన
మర్త్యలోకములో
వచ్చి
విశ్రాంతిగా
ప్రకృతి
అనే
సత్రములో
మనము
నివసిస్తున్నాము.
వేదం
నీవు
ఎవరు?
ఎక్కడ
నుండి
వచ్చావు?
ఎక్కడికి
వెడుతున్నావు?
అని
ప్రశ్నిస్తూ
ఉంటున్నాది.
అప్పుడు
నీవు
నేను
ఫలాని
రామయ్యనో,
ఫలాని
కృష్ణయ్యనో
అని
చెప్పినప్పుడు
ఈ
రామయ్య,
కృష్ణయ్య
ఇక్కడికి
రాలేదు.
రామయ్య,
కృష్ణయ్య
తల్లిదండ్రులు
పెట్టిన
పేరు.
లేక
నేను
ఢిల్లీ
నుంచి
వచ్చాను,
బొంబాయి
నుండి
వచ్చాను
అని
నీవు
చెప్పుకోవటానికి
ఈ
దేహము
పుట్టేటప్పుడు
ఢిల్లీనుండి
తల్లికడుపులో
చేరలేదు,
బొంబాయినుండి
వచ్చి
తల్లి
కడుపులో
చేరలేదు.
ఎక్కడ
నుండి
వచ్చావో
నీవు
కనుక్కోవాలి.
పుట్టిన
తరువాత
నివసించిన
ప్రదేశమునుండి
రావచ్చునేగాని
ఈ
పుట్టుకకు
ఎక్కడ
నుండి
వచ్చావు?
కనుక
ఈవిధమైన
ప్రశ్నలు
వేస్తున్న
సమయంలో
మనము
ఎక్కడ
నుండి
వచ్చామని,
తదుపరి
ఎక్కడకు
వెడతామని
మనము
చెప్పలేని
పరిస్థితిలోపల
కన్నులు
మిటకరిస్తూ
కూర్చున్నాం.
3
▾
Meaning
Keep
కనుక,
మనము
ఎక్కడ
నుండి
వచ్చాము,
ఎక్కడికి
వెడతాము
అనే
ఈ
రెండు
విషయాలు
మనము
తెలుసుకోలేకుండా
పోతే
ఏమి
ప్రయోజనము
మన
జీవితము?
ఇదే
రీతిగా
ఒక
వ్యక్తి
ట్రైనులో
పోయి
కూర్చున్నాడట.
టిక్కెట్టు
తీసుకోలేదు.
ప్రక్కన
ఉన్నవాడు
ఎక్కడికి
వెడుతున్నారండి
అని
అడిగాడుట.
‘తెలీదు’
అన్నాడట.
ఎక్కడ
నుండి
వచ్చారు
అంటే
‘ఏమో
నాకు
తెలీదు’
అన్నాడుట.
వీనిని
పిచ్చాసుపత్రిలో
చేర్చాలి
అన్నాడట
ప్రక్కన
సీటులోని
వాడు.
మనము
ఇదేస్థితిలో
ఉంటున్నాము
కనుక
ఏదైనా
ఒక
సత్సంగము
అనే
మెంటల్
ఆసుపత్రిలో
చేరక
తప్పదు.
దీనికి
మరొక
నిత్యానుభవములో
నున్న
ఉదాహరణ.
మీరు
ఇక్కడనుండి
ఏదైనా
ఒక
లెటర్
వ్రాసారనుకోండి,
మీ
తండ్రికో,
అత్తమామలకో,
brother
కో,
వ్రాసే
సమయములో
to
అడ్రసు
వ్రాస్తాం.
మరికొంతమంది
వెనుకవైపున
from
అడ్రసు
వ్రాస్తారు.
ఈ
postal
department
to
అడ్రస్సుకు
ఇచ్చేస్తుంది.
To
అడ్రస్సువారు
అక్కడ
లేకపోతే
from
అడ్రసుకు
రీడైరెక్టు
అవుతుంది.
అయితే
ఈనాడు
to
అడ్రసు,
from
అడ్రసు
వ్రాయకుండా
పెద్ద
లెటర్సు
వ్రాసి
కవరులో
పెట్టి
పోస్టుబాక్సులో
వేస్తే
అది
ఎక్కడకు
పోతుంది?
From
అడ్రసు
లేదు,
to
అడ్రసు
లేదు.
అది
కేవలము
waste
paper
basket
లోనో,
dead
letter
basket
లోనో
పెట్టి
burn
చేస్తారు.
అదేవిధముగా
ఎక్కడ
నుండి
వచ్చామని
from
అడ్రసు
మన
దగ్గర
లేదు.
ఎక్కడకు
వెడతాము
అనే
to
అడ్రసు
లేదు.
ఏదో
శ్మశానంలో
burn
కావలసిందే.
దీనికోసమేనా
మనం
ఇంత
పెద్ద
దేహాన్ని
ధరించి
మానవత్వమనే
సార్ధకనామాన్ని
వహించి
ఈ
జగత్తుకు
రావటం,
వచ్చి
ఫలితమేముంటుంది?
పెద్ద
లెటరు
వ్రాసి
కవరులో
పెట్టి
చేరవలసిన
స్థానానికో,
పొందవలసిన
స్థానానికో
రెండింటికి
చేరకుండా
వుండినప్పుడు
letter
వ్రాయుటకు
ఎంత
టైము
వేస్టు,
యింకు
ఎంత
వేస్టు,
పేపరు
వేస్టు
చిట్టచివరికి
లైఫే
వేస్టుగా
మారిపోతుంది.
కనుక
మనము
ఈ
నెలరోజులు
ఇక్కడ
ఉండినందుకు
ఈ
పెద్దలు,
ఉపనిషత్తులు,
వేదము,
ఇతిహాసము,
పురాణములు,
పెద్దలయొక్క
అనుభవములు
కూడను
ఇన్ని
రకములుగా
మీరు
వినటంచేత
మీరు
ఎక్కడనుండి
వచ్చారో,
ఆ
ఒక్క
ఆత్మస్థానమును
లక్ష్యము
నందుంచుకొని
తిరిగి
ఆత్మకే
వెడుతున్నాం
అనే
సత్యాన్ని
అనుభవపూర్వకముగా
తెలుసుకుని
దృఢశక్తితో
మీరు
ఉండినప్పుడే
ఈ
నెల
దినములు
మీరు
ఇక్కడ
శ్రవణము
చేసినది,
అనుభవించినది,
దానియొక్క
ఫలితము
మీరు
దక్కించుకున్నవారౌతారు.
4
▾
Meaning
Keep
ఈ
విధమైన
దృఢమును
మీరు
హృదయమునందు
కలిగించుకొని
తద్వారా
మున్ముందుకు
మీ
ప్రవర్తనలయందు
మార్పులే
తెప్పించుకొని
తిరిగి
మీకు
సహచరులుగా
నున్నవారియందు
మార్పు
తెప్పించి
తద్వారా
తిరిగి
భారతదేశము
యొక్క
ఉన్నత
స్థితిని
తిరిగి
మీరు
తీర్చి
దిద్దుతారని
నేను
ఆశిస్తున్నాను.
మరొక
చిన్న
ఉదాహరణము.
మన
ఇంటిలో
ఒక
డొక్కు
కారు
ఉంటుంది.
ఏవిధమైన
కండిషనులోను
లేని
కారుగా
ఉంటుంది.
దాన్ని
చక్కచేసి,
సరైన
parts
వేయించి
పీడను
తప్పించి
ఎవరినెత్తినైనా
కడదామని
ప్లాను
వేసుకున్నప్పుడు
దానిని
తీసుకొని
workshop
లో
వదలిపెడతాము.
ఏవిధమైన
ఉపయోగములేనప్పుడు,
మన
కాంపౌండులో
పిల్లలు
కూడను
కూర్చొని
ఆడుకోవటానికి
పనికిరాని
పరిస్థితిలో
ఉంది
కారు.
అలాంటి
దానిని
వర్క్‌షాపులో
పెట్టిన
తరువాత,
ఇక్కడ
అనేకరకములైన
కొత్త
parts
వేయటం
చేత
అది
ఒక
విలువైన
రీతిగా
చూచి
దానిని
ఎవరో
ఒకరు
ఆకర్షింపచేసుకొని
తీసుకొని
వెళ్లటానికి
పూనుకుంటారు.
అట్లుకాకుండా
మన
ఇంటినుండి
ఈ
కారుని,
ఏ
లారీకో,
ఏ
కారుకో
కట్టి
workshop
కి
తీసుకపోయి
తిరిగి
workshop
నుండి
ఏ
కారుకో,
లారీకో
కట్టి
తిరిగి
మన
ఇంటికి
తెచ్చుకుంటే
కారు
విలువ
ఏమున్నది.
మీరు
ఇంతకు
ముందు
తెలిసో
తెలియకనో
కొన్ని
parts
loose
చేసుకొని
కొన్ని
రకములైన
బోల్ట్సు,
నట్స్
లూజ్
చేసుకొని
ఏవిధముగా
పనికిరానివారివలే
ఉండవచ్చును.
అయితే,
అందరు
కాదు
కొంతమంది.
కాని
అది
సత్సంగము,
సమ్మర్క్లాసు
అనే
workshop
కి
రావటం
చేత
ఇక్కడ
కొత్త
bolts,
కొత్త
nuts
వేసుకొని
చక్కగా
పోయినప్పుడే
ఇది
సరైన
కారుగా
వచ్చిందని
చక్కని
విలువ
ఇవ్వటానికి
ఇంకొకరిని
ఆకర్షించటానికి
కూడను
ఒక
విధమైన
అవకాశము
ఉంటుంది.
అట్లా
లేకుండా
అక్కడినుండి
ఏ
రకమైన
కండిషన్లో
వచ్చారో,
తిరిగి
ఈ
workshop
లో
నుండి
అదే
కండీషన్లో
పోతే
విలువ
ఏమాత్రము
ఉండదు.
కారు
పూర్వము
ఇంటి
ముందు
ఉండేది.
ఇప్పుడు
ఇంటి
వెనుక
నెట్టివేసి
ఒక
టార్పాలిన్
కప్పేస్తారు.
5
▾
Meaning
Keep
జీవితమనే
కారును
నడపటానికి
దైవమే
సరి
అయిన
డ్రైవరు
అయితే,
ఈవిధమైన
ప్రశ్నకు
మీనుండి
ఇంకొక
విధమైన
ప్రశ్న
బయలు
దేరవచ్చు.
కారణం
ఏమిటి?
ఈ
కారు
తప్పేమిటి?
ఈ
workshop
వారు
సరిగా
చేయాలి
గాని,
కారు
తప్పు
కాదని
మీరు
ప్రశ్నించవచ్చు?
అయితే,
ఈ
workshop
లో
చక్కని
parts
వేశాము.
తగిన
సర్వీసు
అంతా
చేశాము.
కాని,
ఆ
కారు
పంపిన
ఓనరు
ఉంటున్నాడు
చూడండి,
ఓనరు
అనేవాడు
జీవుడు,
వెంట
పంపించింది
మనస్సు
అనే
డ్రైవరును.
ఆ
డ్రైవరు
ఆ
పార్టులను
మధ్యలో
అమ్ముకొని
పోతుంటాడు.
అది
workshop
తప్పు
కాదు.
కనుక,
ఈ
మైండ్
అనే
డ్రైవరును
సరియైన
వాడుగా
పెట్టుకోండి.
faithful
గా
ఉండేవాడిని
పెట్టుకోండి.
అప్పుడు
ఏవిధమైన
సర్వీసు
అయిందో
అదే
విధమైన
స్థితిలో
ఇంటికి
తీసుకుపోవటానికి
ఈ
డ్రైవరు
పూనుకుంటాడు.
యజమానుని
స్వాధీనములో
నున్న
డ్రైవరు
చక్కగా
భయభక్తులతో
ఉంటాడు.
యజమానుడే
ఈ
డ్రైవరుకు
వశమై
పోవటం
చేత
డ్రైవరు
యజమాని
నెత్తికెక్కి
యజమానుని
మార్చుకో
వచ్చును.
కనుక
మనస్సును
వశములో
నుంచుకొనిన
వాని
యొక్క
దేహము,
బుద్ధి,
చిత్తము
ఈ
విధమైన
సర్వ
parts
తో
జీవితము
సుక్షేమంగా
ఉంటుంది.
కానీ,
డ్రైవరుకు
ఓనరే
వశమైపోవటంచేత
ఇంక
వాడిష్టము
ప్రకారము
టాక్సీగా
వాడుకోవటానికి
కూడను
పూనుకుంటాడు.
కనుక,
ఈ
కాలములో
సరియైన
డ్రైవర్సు,
నమ్మకమైన
డ్రైవర్సు
చిక్కటము
చాలా
కష్టము
కనుక
ఈ
సమ్మర్
క్లాసు
నుండి
మీరు
వెళ్లిపోయే
సమయములో
మీ
జీవితమనే
కారును
డ్రైవ్
చేసుకోటానికి
మంచి
faithful,
అన్ని
రిపేర్లు
తెలిసిన
వాడు,
అన్ని
రకములైన
మెకానిజము
తెలిసినవారు
ఒక
డ్రైవరు
ఉంటున్నాడు.
ఇతనిని
మీరు
డ్రైవరు
క్రింద
తీసుకుపోండి,
తప్పక
మీ
కార్లకు
గాని,
మీ
జీవితమునకు
గాని
ఏవిధమైన
ఇబ్బందులు
లేకుండా
తప్పక
మీ
జీవితమనే
ప్రయాణాన్ని
సుక్షేమంగా
జరుపుకో
వచ్చు.
ఎట్టి
రోడ్డులోనైనా
ప్రమాదము
లేకుండా
డ్రైవు
చేస్తాడు.
ఏ
మధ్యలో
nuts,
bolts
పోయినప్పటికి
అప్పటికప్పుడే
వాటిని
తీసివేస్తాడు.
కనుక,
మీరు
నేర్చుకొని
పోవలసినది,
అన్నింటికంటే
ప్రధానమైనది
ఒకటి
ఉన్నది.
తన
జీవితానికి
అర్జునుడు
ఆనాడు
కృష్ణుని
డ్రైవరుగా
పెట్టుకున్నాడు,
ఈనాడు
మీ
విద్యార్థులందరు
సాయిని
డ్రైవరుగా
పెట్టుకుంటే
తప్పక
మీరు
ధన్యులైపోతారు,
తప్పక
కృతార్థులై
పోతారు.
సాయి
అనగా
సాయము
అందించే
వాడే
సాయి.
6
▾
Meaning
Keep
నిరంతరము
సాయంగా
ఉంటుంటాడు
ఈ
సాయి.
కనుక,
ఇది
మాత్రము
హృదయములోపల
భద్రము
చేసుకొని
హృదయపూర్వకమైన
విశ్వాసముతో
మీరు
దీనికి
అర్పితము
చేసి
దానిని
ఆనందంగా
అనుభవించటానికి
పూనుకోవటం
మీరు
నేర్చుకోవలసిన
మొదటి
విషయము.
మీకు
జీవితములో
ఐహికంగా
ఆముష్మికంగా
కైవల్యంగా
కూడను
మీ
జీవితము
పవిత్రమైనదే
కాకుండా
ఒక
ఆదర్శవంతమైన
జీవితముగా
అభివృద్ది
గావించుకోగలరని
నేను
ఆశిస్తూ
నా
ప్రసంగాన్ని
విరమిస్తున్నాను.
మీరు
వెళ్లి
సమాజసేవను
హృదయపూర్వక
భావముతో
సల్పండి.
తిరిగి
పోయిన
తరువాత
వచ్చే
ఆదివారములలో
ఇలాంటి
అవకాశములు
సంభవించినప్పుడు
మీరు
గ్రూపులుగా
పెట్టుకొని
అక్కడకూడను
సమాజసేవ
చేయటానికి
ప్రయత్నం
సల్పండి.
ఇక్కడ
జరిగిన
విషయాలంతా,
మీరు
కొన్ని
కొన్ని
గ్రూపులుగా
చేరుకొని
ఏఏ
టీచర్సు
ఏమేమి
చెప్పారని
మీరు
discuss
చేసి
ఏది
యదార్ధమైన
విషయమని
మీలో
మీరు
తేల్చుకుని
తద్వారా
మీ
అభివృద్ధిని
పొందటానికి
చూచుకోండి.
Previous
←
Know Yourself!
Next
Self-Confidence and the Vision of One's Own Svarūpa
→