Contents
Devotion & Sacred Story
Home
Library
Find
Shelf
Settings
←
Leave
Sathya Sai Speaks 1973 · Know Yourself!
Tap a verse for its meaning
IAST
Telugu
Meaning
Continuous
Know Yourself!
16 June 1973, Summer Course, Brindavan
1
▾
Meaning
Keep
His poems 36
Also in his talks
(11)
5 August 1981
See God, think God, talk God
23 November 1981
The principle of the Ātma: practice
29 July 1988
Creation is nothing but the expression of Īśvara's will!
24 November 1990
Share in Bhagavan's love
28 February 1995
God, master of the three
21 August 1996
The Five Elements Are the Very Forms of the Paramātma
22 September 1996
Though Forms and Names Differ, the Principle of Brahman Is One!
20 July 1997
Human values alone are true kin
22 November 2001
True education brings the wealth of character
24 July 2002
The Paramāṇu Itself Is the Paramātma
21 October 2003
I have come only to reveal your true nature
సూక్ష్మమైనట్టి
అణువున
సూక్ష్మమగుచు
మేటి
వస్తువునందున
మేటి
యగుచు
అంతటను
సర్వసాక్షియై
అలరునట్టి
ఆత్మయే
బ్రహ్మ
బ్రహ్మయే
ఆత్మయగును.
ఏది
తెలిసిన
సర్వంబు
తెలియనగునో
ఏది
తెలియక
ఏదియు
తెలియబడదో
ఏది
పర
అపర
విద్యలనుచు
తెలిసి
బోధించునతడె
సద్గురుడు
యగును
పవిత్రమైన
భారతీయ
ధర్మకర్మలన్నియు
వేద
శాసితములు.
వేదము
అపౌరుషేయము.
ఇది
కేవలము
భగవంతుని
వాక్స్వరూపమనే
చెప్పవచ్చును.
కాని,
అట్టి
అగమ్య
గోచరమైన,
అనంతమైన
వేదమును
అర్థముచేసుకొనటము
సామాన్యమైన
మానవులకు
ఇది
అసాధ్యమగుట
చేతనే
దీనిని
స్మృతిగాను,
పురాణ
ఇతిహాసములుగాను
విభజించి
మహనీయులు
తదేక
దీక్షతో
నిర్విరామ
కృషి
సల్పి
నిరంతర
తాపత్రయములతో,
అంతులేని
ఆశతో,
అర్థము
కాని
ఆవేదనతో
తాము
ఆర్జించినటువంటి,
తాము
వినినటువంటి
ఈ
శ్రుతిని
ఒక
పవిత్రమైన
స్మృతిగా
మార్చి,
పురాణముగా
మార్చి,
ఇతిహాసముగా
మార్చి
సామాన్యమైన
మానవులకు
సహజమైన
మార్గమున
అనుభవించుటకు
అనుకూలమైన
స్థితియందు
అందించారు.
వేదములు
ఒకరిచేత
వ్రాయబడినవిగాని,
లేక
ఒకరు
చెప్పినప్పుడు
దానిని
సరియైన
మార్గములో
లిఖించటంగాని
జరిగినవి
కాదు.
ఇది
అనాదికాలమునుండి
గురుశిష్యుల
పరంపరగా
వచ్చిన
పవిత్రమైన
శృతి.
అనగా
మహర్షులు
కేవలం
వారు
నిష్టాగరిష్టులై
ఉన్న
సమయమందు
వారు
శ్రవణము
చేసినది,
శృతి
కారణ
మగుటచే
దీనికి
శృతి
అనికూడనూ
ఒకపేరు.
పవిత్రమైన
వేదములు
ఎట్టివారు
మార్చుటకు
సాధ్యము
కాదు.
ఇతిహాసపురాణములకు
అనేకరకములుగా
వ్యాఖ్యానము
సల్పవచ్చు.
అనేకమంది
విద్యావంతులంతా
దీనిని
కొద్ది
తబ్బిబ్బు
గావింపవచ్చు.
2
▾
Meaning
Keep
ఇది
ఎంత
మహత్తరమైన
శక్తి
కలిగినదో
మీరే
యోచించుకొన
వచ్చును.
ఈనాటి
వరకు
వేదమునకు
వ్యాఖ్యానము
వ్రాసినటువంటివారు
గాని
లేక
వేదమునందున్న
శబ్దమును
మార్చటానికి
ప్రయత్నము
సల్పినవారు
గాని
ఈ
భారతదేశమందే
కాదు,
ప్రపంచమునందుకూడను
కానరాకున్నారు.
దీనిని
శబ్ద
బ్రహ్మమని
పిలువవచ్చును.
అయితే,
ఇట్టి
పవిత్రమైన
వేద
ప్రమాణమును
అనుసరించి,
వేద
విహితమైన
ధర్మము
నాచరించి
వేదమతమనే
రూపములో
మనము
భావించి,
వేదమతమునకు
సంబంధించినవారు
భారతీయులనేటువంటి
రీతిలో
గర్వించవలసిన
నేటి
భారతీయులు
దురదృష్టవశాత్తు
భారతీయ
సంస్కృతిని
విస్మరించి,
భారతీయ
మతమును
గర్హించి,
దేవాలయములను
తిరస్కరించి,
పుణ్యక్షేత్రములను
పుక్కిటి
పురాణములుగా
వ్రాసి
వాటికి
అనేక
రకములైన
అపోహలను
కల్పించేటువంటి
భారతీయులు
కూడను
నేటి
భారతదేశ
మందు
అభివృద్ధి
అవుతున్నారంటే
నిజముగా
ఇది
దురదృష్టమనే
చెప్పవచ్చు.
వేదమును
అర్థము
చేసుకొనుటకు
సామాన్య
మానవులకే
కాదు,
వేదములు
పూర్తి
అధ్యయనము
చేసిన
మహా
పండితులు
కూడను
రోడ్డు
ప్రక్కలో
గుంటలో
పడినటు
వంటి
మురికినీటిని
చూచి
మేఘములు
యొక్క
నీరు
ఈ
రీతిగానే
వుంటుందని
భ్రమించేటువంటి
మూర్ఖులు
కొన్ని
వేద
విహితమైన
కర్మలను
కొంత
గుర్తించి
తద్వారా
పవిత్రమైన
వేదములకు
కళంకము
కలిగించే
మాటలు
మాట్లాడటం
జరుగుతూ
ఉండవచ్చును.
స్తుతి
నిందలకంతా
అతీతమైన
స్థితియందున్నది
వేద
మతము.
అయితే,
నేలపడిన
వర్షపు
బిందువు
గాలిచేత
ఆవిరిగా
మారిపోయి
నట్లుగా
స్తుతినిందలనేవి
మన
హృదయ
క్షేత్రముపై
పడినప్పుడు
ఇందులో
సుషుప్తి
అవస్థ
అనే
గాలులు
వీచటంచేత
ఇది
ఆవిరిగా
మారిపోవటం
కూడా
కద్దు.
సర్వమును
భరించి
వరించి
తరింప
జేసేటువంటి
సమత్వము
వేదము
యొక్క
తత్త్వము.
జఠరాగ్నియందు
ఎట్టి
పదార్ధము
వేసినప్పటికిని
భస్మమొనరించు
చున్నది.
జఠరాగ్నిలోనున్న
ప్రేగులను
గాని,
కండరములుగాని
ఈ
జఠరాగ్ని
భస్మము
చేయటం
లేదు.
అదేవిధముగా,
సర్వము
సమత్వమైన
భస్మ
స్వరూపాన్ని
ఆవరింప
జేసుకునే
వేదము
తమను
మాత్రము
తాము
కించిత్తు
పరచుకోవటానికి
ఏమాత్రము
పూనుకోదు.
ఈ
లోకము
యొక్క
పోకడగా
భావించుకొని,
ఇది
కేవలము
సామాన్యమైన
ప్రవర్తనగా
మనము
విశ్వసించి,
ఎట్టి
మూర్ఖులైనా
ఏదో
ఒక
విధమైన
ప్రశ్నలు
వేసేటువంటి
ప్రయత్నము
ఇది
భారతీయులలో
అభివృద్ధియైన
పెద్ద
బలహీనత
అనే
చెప్పవచ్చు.
3
▾
Meaning
Keep
దీనికి
ఒక
చిన్న
ఉదాహరణము.
నన్ను
రెండు
మూడు
దినములకు
పూర్వము
రాజకీయ
నాయకులు
కలుసుకోవటానికి
వచ్చారు.
వచ్చి
వారు
ప్రశ్నించిన
ప్రశ్నలు
కేవలము
అర్థశూన్యమైనవి.
ఇది
మీకు
కూడా
అర్ధంకావటం
మంచిదనే
ఉద్దేశ్యంతో
నేను
చెబుతున్నాను.
ఏదో
మాటల
సందర్భమునందు,
‘మీరు
ఎవరండి’
అని
ప్రశ్నించారు.
దానికి
సరియైన,
సూటైన
జవాబే
నేను
చెప్పాను,
‘పదిమంది
మగవారి
మధ్యలో
నేనెప్పుడు
మగవాడిని,
పదిమంది
ఆడవారి
మధ్యలో
నేనెప్పుడు
ఆడదానిని.
పదిమంది
పిల్లల
మధ్యలోనున్నప్పుడు
పిల్లవాడిని.
నేను
ఏకాంతముగా
నున్నప్పుడు
పరబ్రహ్మను’
అన్నాను.
నేనే
కాదు
మీరు
కూడను
పదిమంది
పెద్దవారితో
నుండినప్పుడు
పెద్దవారివలె
నటిస్తున్నారు.
పదిమంది
ఆడవారి
మధ్యలోనున్నప్పుడు
ఆడవారివలెనే
మీ
ధోరణి
వెళ్లిపోతుంది.
పదిమంది
పిల్లలతో
ఆడుకునే
సమయంలోపల
మంచి
సుప్రీంకోర్టు
ఛీఫ్
జస్టీస్
అయినా
తాను
మనుమని
ఆడించే
సమయములోపల
పిల్లవానివలె
తాను
కూడా
ఆడుతాడు.
కానీ
ఏకాంతముగా
నున్నప్పుడు
సర్వసాక్షిభూతుడుగా
తాను
భావించుకుంటున్నాడు.
బజారులో
వచ్చిన
పదార్థములను
కొనేవాడైనా,
కొనని
వాడైనా
వెల
అడగటం
ఈనాటి
అలవాటు.
కొనేశక్తి
ఉండినా
లేకపోయినా
దీని
వెల
ఎంతయ్యా
అని
హెచ్చరించటమో
లేక
ప్రశ్నించటమో
యీనాటి
అలవాటైన
పొరపాటు.
అదేవిధముగా
మీరు
దీనిని
పొందేటువంటి
యిచ్ఛ
వుండినా
లేక
పొందే
యిచ్ఛ
లేకపోయినా
దీనియొక్క
రూపనామములు
మీరు
అడుక్కోవటము
ఈనాటి
ఒక
మూర్ఖుడు
వేసే
ప్రశ్ననే
మీరు
వేశారు
అని
నేను
అన్నాను.
తనను
తాను
ఎరుగనటువంటి
వ్యక్తే
పరులను
నీవెవరు
అని
ప్రశ్నిస్తుంటారు.
మొట్టమొదట
తనను
తాను
తెలుసుకోవటానికి
ప్రయత్నించిన
వ్యక్తి
ఇతరులను
నీవు
ఎవరు
అనే
విచారణకు
పూనుకోడు.
పోనీ
ప్రాపంచిక
విషయములో
వానికేమైనా
తెలియదా
అంటే
సత్యసాయిబాబా
అని
తెలుసుకొనే
కదా
సిటీ
నుండి
ఇక్కడకు
వచ్చారు.
తెలియకుండా
రాలేదే.
ఏ
ధోరణిలో
మీరు
ఎవరు
అని
ప్రశ్న
వేశారు.
కనుక,
అది
తెలియనటువంటి,
చపలచిత్తమైన
మూర్ఖత్వమనే
చెప్పవచ్చు.
అనగా,
ప్రపంచమంతయు
ఇట్టి
పరిస్థితిలోపల
నడుస్తుంటున్నాది.
కనుక,
మనము
కేవలము
కాలమునంతయు
వ్యర్థపరచి
అనేక
రకములుగా
శ్రమపడి,
కొన్ని
రకములైన
శ్రద్ధాభక్తులనభివృద్ధి
పరచి
అనేక
భగవద్విషయములంతా
మనము
గ్రోలి,
వేదశాస్త్ర
ఇతిహాస
పురాణములంతా
మనము
పఠించినప్పటికిని
మనలోనున్న
దివ్యత్వమనేది
గాని
లేక
సత్యసూక్తు
లనేవిగాని
ఆచరణరూపములో
మనము
ప్రకటించినప్పుడే
ఇది
సార్ధకమవుతుంది
గాని,
లేకున్న
మన
కాలము,
మన
కాయము
మనయొక్క
జీవితమును
కూడ
వ్యర్థము
చేసుకున్న
వారమైపోతాము.
4
▾
Meaning
Keep
గ్రంథములు
చదవటము,
దానిని
పరులకు
చెప్పుటకు
పూనుకోవటము
మనలో
ఆచరణ
లేకుండా
పోవటము
కేవలము
ఒక
విధమైన
వృత్తిగా
మనము
భావించుకోవచ్చు.
మీరు
ఈ
వయస్సునకు
ఎన్నియో
పుస్తకములు
చదివియుండవచ్చును.
ఎన్నియో
విషయములు
మీరు
తెలుసుకొని
వుండవచ్చు.
కాని
తెలుసుకున్నంత
తెలివి,
చదివినటువంటి
చదువు,
గ్రహించి
నటువంటి
గ్రహణశక్తి
నీయొక్క
ఆచరణలో
ఏమీ
కనిపించటం
లేదు.
దివ్యాత్మ
స్వరూపులైన
విద్యార్థులారా!
అనేక
గ్రంథములు
మీరు
పఠించ
నక్కరలేదు.
మీరు
ఏ
యొక్క
విషయమును
కొంతవరకు
గుర్తించి
విశ్వసించి
దానిని
అభివృద్ధిపరచుకోవాలని
ఆశిస్తున్నారో
ఆ
ఒక్క
విషయమునైనా
మీరు
ఆచరణయందుంచి
దానినైనా
మీరు
సక్రమమైన
మార్గమందు
అభివృద్ధిపరచు
కోవటానికి
పూనుకోవటంలో
ఎంతైనా
సార్ధకత
వుంటుంది.
అయితే,
ఈ
వయస్సు
అనేక
రకములైన
తబ్బిబ్బులలో
చేరి
కొన్ని
రకములైన
చపలతత్త్వము
లోపల
చలించి,
ఒక
స్థిరత్వమును
వ్యక్తపరచే
భావములు
మనలో
ఉద్రేకపరచటం
చేత
మనస్సు
మహాకోతిగా
తయారై
మనలను
కూడను
ఒక
కోతిగా
తీర్చిదిద్దటానికి
పూనుకుంటున్నది.
ఇది
ఒక
మర్కటము
వలె
తయారయిన
ఈ
మనసును
మనము
స్వాధీనపరచుకునే
ప్రయత్నము
లోపల
కొన్ని
రకములైన
సాధనలు
మనము
అనుసరించాలి.
మనసు
మహా
గయ్యాళి.
చెప్పినది
తప్ప
అన్నియు
చేయటానికి
పూనుకుంటుంది.
అలాంటి
గయ్యాళి
అయిన
మనస్సును
కొన్ని
రకములైన
సాత్విక
మార్గములోపల
కొంతవరకు
మన
త్రోవకు
వచ్చేటట్లుగా
ప్రయత్నము
సల్పాలి.
దీనినే
భగవద్గీతయందు
శనైః
అని
చాలా
నెమ్మదిగా
ఒకదారికి
తీసుకురా
అతి
తీవ్రముగా
వత్తిడి
చేయవద్దని
కూడను
భగవద్గీత
ప్రబోధించింది.
మన
ఇంటిలో
ఒక
దొంగ
గొడ్డు
ఉంటుందనుకోండి.
ఇలాంటి
గొడ్డు
తాడు
విడిచిన
తక్షణమే
ఏదో
ఒక
పంట
లోనికి
పోయి
ఆ
పంటనంతా
తింటానికి
పూనుకుంటుంది.
అలాంటి
గొడ్డు
సక్రమమైన
మార్గములోకి
రావటానికి
ఏమి
ప్రయత్నం
చేస్తాం?
ఏ
యొక్క
పంటను
తాను
ఆశిస్తున్నాదో
దానికంటే
ఉత్తమమైన
ఆహారమును
మన
ఇంటిలోపల
దానిని
కట్టి
అట్టి
ఆహారమును
మనము
అందించటానికి
పూనుకున్నప్పుడు
క్రమక్రమేణా
మన
ఇల్లును
వదిలి
పంటభూమికి
వెళ్లకుండా
సరైన
మార్గానికి
రావటానికి
ప్రయత్నం
చేస్తుంది.
5
▾
Meaning
Keep
అదేవిధముగా
మన
మనస్సు
పరిపరివిధములుగా
అటూ
ఇటూ
పరిగెత్తిపోవటానికి
పూనుకుంటుంది.
అలాంటి
సమయములో
ఆ
విషయ
సంబంధమైన
స్వరూపములకంటే
ఉత్తమమైన
భగవత్తత్త్వమును
మనము
అందించటానికి
పూనుకున్నప్పుడు
దానికి
తగిన
ధ్యాన
జపములు
మనం
ఆచరించటానికి
ప్రయత్నము
చేసినప్పుడు
ఈవిధముగా
విచ్చలవిడిగా
సంచరించటానికి
ఏమాత్రము
తాను
పూనుకోదు.
అయితే,
ఈనాడు
తుచ్ఛమైన
పదార్థములపైన,
తుచ్ఛమైన
విషయ
సంబంధమైన
వ్యామోహములపైన
మానవునియొక్క
మనస్సు
అనేకరకములుగా
జన్మజన్మాంతర
సంస్కారములను
పురస్కరించుకొని
ఈ
మనస్సును
ఎంత
అరికట్టినప్పటికిని
సాధ్యము
కాని
పరిస్థితిలో
మానవుడు
పరాభవాన్ని
పొందుతున్నాడు,
అపజయాన్ని
అందుకుంటున్నాడు.
నిజముగా
ఈ
విషయ
సంబంధమైన
వాంఛలు
బలవత్తరమైన
వ్యామోహాన్ని
అభివృద్ధి
పరచటంచే
తమయొక్క
ప్రయత్నములు
పూర్తి
విఫలమైపోతున్నాయి.
ఇందులోనున్నది
మనస్సు
యొక్క
తత్త్వము
ఏమాత్రము
కాదు.
మనస్సు
యొక్క
సంకల్పము,
బుద్ధి
యొక్క
సంకల్పము
స్థిరమైనదిగా
వుంటున్నప్పుడు
మనము
ఎట్టి
అపవిత్రమునకు
ముందంజ
వేయటానికి
పూనుకోము.
ఇటువంటి
పరిస్థితియందు
మనము
ఏకాంతమైన
దేనినైనా
అనుభవించటానికి
పూనుకోవాలి
లేక
ఇలాంటి
సత్సంగములో
చేరి
పవిత్రమైన
శ్రవణమునైనా
చేయాలి.
ఈ
రకమైన
కొన్ని
అభ్యాసములు
మనము
చేయటంచేత
మనయొక్క
దుస్సంస్కారము
కొంతవరకు
క్షీణించటానికి
వీలుంటుంది.
అయితే
ఈనాటి
ఆధునికయుగమందు
ఈ
సత్సంగమనేది
కూడను
ఒకవిధమైన
వికారభావములతో
కొన్ని
అసభ్యమైన
పలుకులతో
ఇవి
చెలరేగుతూ
వస్తున్నవి.
క్రాఫులు
దువ్వుకోటానికి
కావలసినంత
టైము
ఇస్తున్నాము.
కాటుక
పెట్టుకోవటానికి,
జడలు
వేసుకోవటానికి,
టైలు
కట్టుకోవటానికిగాని,
ఫ్యాంటు
తొడుక్కోవటానికి
ఘడియలు
ఘడియలు
వ్యర్థము
చేస్తున్నాము.
అయితే,
ఒక్కొక్క
సమయమునందు
అయ్యా!
ఇన్ని
ఘడియలంతా
నీవు
అనిత్యము,
అశాశ్వతము,
అసత్యమైన
రూపానికి
ఇన్ని
విధములుగా
తీర్చిదిద్దుకోవటానికి
టైము
ఇస్తున్నావే,
ఐదు
నిముషములు
ధ్యానమో
లేక
ఐదు
నిముషములు
జపమో,
లేక
ఐదు
నిముషములు
భజనో
నీవు
చేయటానికి
పూనుకోకూడదా
అంటే
టైము
లేదు
అనే
పరిస్థితిలోపల
ఈనాటి
యువకులు
ఈరకంగా
కాలయాపనం
చేస్తూ
వస్తున్నారు.
6
▾
Meaning
Keep
ఇంకా
మరొక
విషయాన్ని
కూడను
మనం
చక్కగా
విచారణ
చేసుకోవచ్చు.
ప్రతి
యువకుని
యొక్క
జేబులో
అద్దము,
దువ్వెనా
ఉంటుంది.
బాలికల
దగ్గర
కూడను
ఒక
చిన్న
బుట్టలో
బజారంతా
కూడను
ఇముడ్చుకొని
వుంటుంటారు.
అయితే,
ఇదంతా
దేనికోసం
చేస్తున్నామంటే
అనిత్యము,
క్షణభంగురము
అయిన
మన
తల
ఏమైనా
లేస్తే
తక్షణము
దువ్వుకోటానికి
చూసుకుంటున్నాము.
మన
ముఖము
నిన్నటి
ముఖమే
కదాయనుకొని
క్షణక్షణము
తుడుచుకొని
దానిని
చక్కదిద్దు
కుంటున్నాము.
ఆనందానందములతో
చేరిన
ఆత్మకు
మనము
అనేక
వికారములంతా
కల్పిస్తున్నాము
గాని
అది
శాశ్వతమై
సత్యమై,
నిత్యమై,
నిర్మలమైన
స్వరూపాన్ని
చక్కదిద్దుకోవటానికి
తగిన
యిచ్ఛాశక్తిని
మనము
అభివృద్ధి
పరచు
కోవటం
లేదు.
దానియొక్క
అందచందములు
చూడటానికి
మన
దగ్గర
నిరంతరము
ఒక
దువ్వెన,
ఒక
అద్దము
పెట్టుకొని
ఉంటుండాలి.
ఆ
అద్దము,
ఆ
దువ్వెన
ఏమిటంటే
మన
నిర్మలమైన
ప్రేమయే
అద్దము.
నిత్యానిత్య
విషయములను
పరిశీలనగావించి
చిక్కులను
లేనటువంటి
దువ్వెనే
మహాజ్ఞానము.
ఈ
జ్ఞానము
అనే
దువ్వెన,
ఈ
భక్తి
అనే
అద్దము
దగ్గర
ఉండినప్పుడు
ఆత్మను
అంద
చందములతో
తీర్చిదిద్దుకోవటానికి
తగిన
ప్రయత్నము
సల్పుతాము.
దివ్యాత్మస్వరూపులారా!
ఎట్టి
వేదములు,
ఎట్టి
శాస్త్రములు,
ఎట్టి
ఉపనిషత్తులు
పఠించని
కేవలము
అమాయకులైన,
నిర్మలచిత్తులైన
గోప
గోపాలురంతా
కృష్ణుని
తమ
హస్తగతము
గావించుకోవటంలోనున్న
అంతరార్ధము
ఏమిటో
ఒకతూరి
గుర్తించాలి.
ప్రేమరసపూరిత
ఆనందమనే
హృదయమే
వారి
యొక్క
క్షీరసాగరముగా
భావించారు.
భగవంతుని
చింతన
చేసి
చేసి
తామెవరో
గుర్తించుకునే
తత్త్వము
లోపల
మిగిలిన
శేషమునే
శేషపాన్పుగా
అమర్చుకున్నారు.
ఈ
ఆనందములో
ఉండిన
చైతన్యమునే
మహావిష్ణువుగా
అందులో
పవళింప
చేసుకున్నారు.
తామే
లక్ష్మిగా
భావించుకొని
పాదములొత్తుతున్నారు.
ఆ
పాదములను
ఆశ్రయించటం
చేతనే
ఆ
విష్ణుత్వము
సర్వవ్యాపకత్వమనగా
వారికి
గోచరించటానికి
ఒక
విధమైన
ఆదర్శాన్ని
నిరూపించారు.
లక్ష్మి
ఒక
స్త్రీగా
తాను
నిలచి,
విష్ణువును
పురుషునిగా
పెట్టుకొని
పాదసేవలు
చేసే
ఆనందమైన
శేషపాన్పుపైన
తత్త్వమునకు
చక్కని
అర్థముకూడను
లేకపోలేదు.
7
▾
Meaning
Keep
మనము
జడత్వమనే
దానిని
విసర్జించే
వరకు
మనము
స్త్రీలతో
సమానమే.
ఏనాడు
జడత్వము
మననుండి
దూరమౌతుందో
అప్పుడు
మనము
పురుషుని
లోపల
ఏకత్వము
పొందుతాము
గాని
అంతవరకు
కూడ
మనము
అబలత్వములోనున్న
జడస్వరూపమే.
మన
యొక్క
అభీష్టములు
సిద్ధింప
చేసుకోవటానికి
తగిన
ప్రయత్నములు
కూడను
ఈ
గోపికలు
అనేక
రకములైన
ఊహాభావములచేత
తమ
జీవితము
యొక్క
ధన్యతకు
తగిన
ఏర్పాట్లుగావించుకున్నారు.
బ్రహ్మ
ముహూర్త
కాలమందు
లేచి
మనము
ఏవిధముగా
ఓంకారము
సుప్రభాతము
చేస్తున్నామో
ఆవిధంగా
బ్రహ్మముహూర్తంలో
లేచి,
ఆనాడు
ఏదో
భగవంతునికి
సాక్షాత్కరింప
చేసుకునే
తపస్సు
ఆచరించినట్లుగా
వారు
కుదురును
పెట్టి
కుండను
పెట్టి
పాలను
పోసి
దానిని
చక్కగా
మధించి
భగవన్నామము
ఉచ్చరించుకుంటూ
కూడను
అనేక
రకములుగా
ఆనందమును
అనుభవిస్తూ
వచ్చారు.
ఒకానొక
సమయములో
నారదుడు
వెళ్లి
‘గోపికలారా!
బ్రహ్మముహూర్తములోపల
మీరు
చేయుచున్న
పని
ఏమిటి?
విషయసంబంధమైన
వాంఛతో
ఈ
వెన్నను
తీసే
మీ
సాధన
యింతేనా’
అని
ప్రశ్నించినప్పుడు
ఆ
గోపిక
ఫక్కున
నవ్విందట.
నారదా!
మేము
వెన్నను
తీసుకుంటున్నాము.
ఏ
వెన్న
తెలుసునా?
మా
వెన్న
నీకు
అర్థము
కాదు.
బ్రహ్మ
ముహూర్త
సమయమందు
భగవంతుడు
సాక్షాత్కరింపగా
అట్టి
ఆనందములో
మా
జీవితమును
మర్చిపోయి,
తన్మయత్వులైపోయి,
ఉన్మత్తులైపోయి,
ప్రేమోన్మత్తులైపోయి
భగవంతుని
చిత్తమునకు
హత్తుకొని
పోతున్నాము’
అన్నారు.
అయితే
ఇది
ఎట్లా
అని
మనము
సంశయించవచ్చు.
ఆ
గోపిక
వర్ణించింది.
వివేకమే
కుదురు.
వివేకమనే
కుదురును
కట్టి
దేహమనే
కుండను
పెట్టి,
కృష్ణ
బోధామృతమనే
పెరుగును
పోసి,
సుషుమ్న
అనే
కవ్వమును
పెట్టి
యిడ
పింగళ
తాడును
కట్టి
నామమును
స్మరించుకుంటూ
మేము
నామము
చేస్తుంటే
సాక్షాత్కారమనే
వెన్న
బయలుదేరుతున్నాది
నారదా’
అన్నారు.
కనుక
వారి
హృదయములు
ఇంత
పవిత్రమైన
తీవ్రమై
లోతునకు
దిగి
ఎంత
గాఢమైన
అంతరార్థమును
వారు
యోచిస్తున్నారో
మనము
ఎన్ని
వేదములు,
ఎన్ని
శాస్త్రములు
ఎన్ని
ఉపనిషత్తులు
చదివినప్పటికిని
మనయొక్క
బుద్ధియొక్క
తత్త్వము
అంత
అంతరార్థములోకి
దిగటము
సాధ్యముకాదు.
కేవలము
ప్రేమను
పురస్కరించుకొని
నిర్మలత్వమనే
దీక్షను
పురస్కరించుకొని
భగవంతుని
ఐక్యతను
ఆశించిన
చిత్తమునకే
ఇది
దక్కుతుందిగాని
అన్యులకు
ఇది
అసాధ్యము.
దీనికి
(భగవద్గీతయందుకూడను)
ఒక
నేపాల్
పండితుడు
ఒక
చక్కని
ఆదర్శమునందించాడు.
ఈ
భగవద్గీత
అంటే
ఏమిటి?
కౌరవులు,
పాండవులు
యిరువురూ
చేరి
ధర్మక్షేత్రమైన
కురుక్షేత్రములో
యుద్ధము
చేయటము,
దేని
నిమిత్తము
అని
విచారణ
చేసినప్పుడు
ఒక్క
హస్తినాపురరాజ్యాన్ని
ఇరువురు
సాధించుకునే
నిమిత్తమై
తగవులాటరావటము,
ఇది
బాహ్యమైన
అర్ధముగా
మనకు
బోధపడుతుంది.
8
▾
Meaning
Keep
అయితే,
ఈ
హస్తినాపురము
ఏమిటి?
ఈ
పాండవులు
ఎవరు?
కౌరవులు
ఎవరు?
ఈ
ధర్మక్షేత్రమేమిటి?
కురుక్షేత్రము
ఏమిటి?
ఇందులో
వీరు
పడేపాట్లు
ఏమిటి
అనే
దానిని
చక్కగా
విచారణచేసినప్పుడు
ఈ
అస్థిపంజరమే
హస్తినాపురముగా
చేసుకున్నారు.
హస్తినాపురమునకు
నవ
ద్వారములు
కలవు,
అలాగే
ఈ
అస్థిపంజరమునకు
కూడను
నవద్వారములు
కలవు.
అయితే
నిర్గుణ
నిరాకార
పరబ్రహ్మతత్త్వమనే
ఒక్కడు
సాక్షిభూతుడై
ఉంటున్నాడు.
అట్టి
నిర్గుణ
నిరాకార
పరబ్రహ్మ
మాయ
అనే
దానిని
వరించాడు.
అందువలననే
పరబ్రహ్మ
మాయోపాధి
అంటున్నారు.
మాయకు
పరబ్రహ్మకు
చేరి
మనస్సు
అనే
కుమారుడు
పుట్టాడు.
ఈ
కుమారుడు
అనేక
రకములుగా
తల్లిని
అనుసరించటానికే
పూనుకుంటున్నాడు
గాని
తండ్రి
యొక్క
జాడలు
ఇతనికి
యేమాత్రము
పట్టుపడలేదు.
అనగా
మాయతత్త్వములే
ఇతనికి
ఇష్టముగా
వుంటున్నాయి
గాని
నిర్మలత్వమనే
తండ్రి
గుణములు
ఇతనికే
మాత్రము
రుచించలేదు.
అయితే
ఈ
మనస్సనే
కుమారుని
పెంచి
పెద్ద
చేసి
పెండ్లి
చేశారు.
అందులో
ఒకటి
కాదు
రెండు
పెండ్లిండ్లు
చేశారు.
అందులో
ఈ
మనస్సును
వరించిన
భార్యలు
ప్రవృత్తి,
నివృత్తి.
ప్రవృత్తి,
నివృత్తి
ఇద్దరూ
చేరి
మనస్సును
పెండ్లి
చేసుకున్నారు.
అయితే
ఈ
మనస్సుకు
ప్రవృత్తిపైనే
మక్కువ
గాని
నివృత్తిని
చూచి
చూడనట్లుగా
వెడుతుంటాడు.
అయితే
ఈ
ప్రవృత్తికి
పుట్టిన
బిడ్డలు
అసురులని,
ఈ
నివృత్తికి
పుట్టిన
ఐదుమంది
దైవస్వరూపులని,
దేవతలని
నిర్ణయించుకున్నారు.
ఇట్టి
ప్రవృత్తి
నివృత్తి
అనేవారే
పాండవులు,
కౌరవులుగా
మారారు.
నివృత్తి
బిడ్డలైన
ఐదుమంది
సత్య
ధర్మ
ప్రేమశాంతి
అహింస.
ఈ
ఐదు
మంది
దైవలక్షణములుగా
వుండటం
చేత
నివృత్తియొక్క
బిడ్డలని,
ఇంక
దుర్మార్గము,
దుర్గుణములు,
దురాలోచనలు
అన్ని
రకములైనవి
దుఃఖానికి
హేతువైనవి
కనుక
దుర్యోధన,
దుశ్శాసన,
దుశ్శల
అని
దుకారముతోనే
వారు
పేర్లు
పెట్టుకున్నారు.
అయితే
ఈ
ఇరువురు
చేరి
హృదయ
సామ్రాజ్యమును
అనుభవించే
నిమిత్తమై
ఈ
నిర్మలమైన
స్థానమున
హృదయక్షేత్రమనే
దానిపై
యుద్ధమునకు
పూనుకున్నారు.
హృదయక్షేత్రమును
ధర్మక్షేత్రమని,
బాహ్య
సంబంధమైన
వాంఛలతో
కూడిన
గుణము
కనుక
అక్కడ
కురుక్షేత్రమని,
ఈ
ధర్మక్షేత్రమైన
కురు
క్షేత్రమనే
హృదయమునందు
పాండవులు,
కౌరవులు
అనే
సద్గుణములు,
దుర్గుణములు
నిరంతరము
కూడను
నిత్యముకూడను
అక్కడ
పోట్లాటలు
జరుపుతునే
ఉంటున్నారు.
కనుక,
ఈ
మనస్సుకు
ప్రవృత్తిపైన,
ప్రవృత్తి
పిల్లలపైన
అభిమానము
ఉండటంచేత,
ఈ
మనస్సు
అనేవాడు
ఎలాంటివాడంటే
గుడ్డివాడట,
అతనే
ధృతరాష్ట్రుడు
అని.
9
▾
Meaning
Keep
తనది
కాని
దానిని
తనదిగా
విశ్వసించటమే
ధృతరాష్ట్రుని
యొక్క
తత్త్వము.
అట్టిదే
ఈ
మనస్సు
కూడను.
తనదికానటువంటిది
కావాలి,
కావాలి
అని
ఆశిస్తుంటుంది.
ఎవరైనా
ఒక
మంచి
గడియారము
వేసుకుంటే
అది
నాకు
కావాలి
అంటుంది.
ఎవరైనా
ఒకరు
మంచి
ఫ్యాంటు
కుట్టించుకుని
వేసుకుంటే
అది
నాకు
కావాలని
వీడు
ఆశిస్తుంటాడు.
ఈ
రకమైన
కోతి
ఆటలాడటంలోపల
మనస్సుకు
కోతికి
యేమాత్రం
హెచ్చు
తక్కువ
ఉండదు.
మనసు
ఎప్పుడూ
కుత్సితమైనవి,
అసహ్యమైనవి
ఆశిస్తుంది
కాని
మంచిదానిని
ఆశించటం
తనకు
అలవాటు
లేదు.
అదేవిధముగా
ధృతరాష్ట్రుడు
తనది
కానటువంటి
రాజ్యమును,
తనకు
కావాలని
ఆశించి,
తన
కుమారులు
ఎంత
దుర్మార్గులైనప్పటికిని
వారి
వైపుననే
తనయొక్క
తాళమును
వేసుకుంటూ
వెళ్లాడు.
కనుక
ఈ
ధృతరాష్ట్ర
అనే
మనస్సును
మనము
పరిపరివిధముల
పోనిచ్చినప్పుడు,
కుమారులయొక్క
దుస్థితికి,
హీనస్థితికి
తండ్రియే
కారణము
కాగలడని
ఈ
గీత
ప్రబోధిస్తూ
వస్తున్నాది.
కనుక,
ఈనాడు
మనము
మనస్సును
అరికట్టి,
ఈ
వయస్సునందు
చెలరేగే
ఉద్రేకములకుగాని,
ఉప్పొంగే
రౌద్రములకుగాని
ఏమాత్రము
అవకాశము
ఇవ్వక
వాటిని
శాంతిపరచి,
మనసునకు
బుద్ధిచెప్పి
మనసా
నీవు
నిత్య
అనిత్య
విషయములు
పరిశీలించే
ప్రయత్నానికి
పూనుకొంటివా
నిన్ను
నేను
అనుసరిస్తాను,
లేకపోయిన
తగిన
శిక్ష
ఇస్తానని
మనసునకే
బుద్ధి
చెప్పే
ప్రయత్నానికి
మనము
ఈనాడు
పూనుకోవాలి.
మనస్సు
ఒక
విష
సర్పమువంటిది.
పాము
ఎప్పుడు
straight
గా
తిన్నగా
నడవటానికి
పూనుకోదు.
అటూ
ఇటూ
తిరుగుతూ
వెడుతుంది,
వంకరమార్గం.
మన
మనస్సు
అట్లే
పోతున్నాది.
సరిగా
ఎప్పుడు
పోదు.
యువకులుగా
వున్నవారికి
యవ్వన
సన్నిపాతమని
చెప్పవచ్చు.
అది
జబ్బు.
60
అడుగుల
వెడల్పు
రోడ్డులోపల
ఇద్దరు
friends
నడవటానికి
చోటు
వుండదు.
సెంటరులో
వెడుతుంటారు.
ఇది
కేవలము
ఒకవిధమైన
అహంకారతత్త్వము,
అజ్ఞానము
యొక్క
చిహ్నమనే
చెప్పవచ్చును.
ఇంక
ఈ
పాముకు
రెండవ
దుర్గుణము
కూడా
ఉంటుంది.
అది
దగ్గరకు
వస్తే,
ఏది
తన
మూతికి
తగులుతే
దాన్ని
కఱచుకుంటూ
కఱచుకుంటూ
పోతుంటుంది.
అదేవిధముగా
మన
మనస్సునకు
చూచినవన్నీ
కావాలి
కావాలి
అని
పోతుంది.
సొట్టమార్గము
పోవటము
చూచినవన్నీ
కావాలని
కోరుకోవటము
ఈ
రెండింటికి
తగిన
భావములు
ఈ
సర్పమునకు
రెండు
విషదంతములుంటున్నాయి,
ఆ
రెండు
దంతములు
పాము
యొక్క
నోటియందున్నంతవరకు
విషపురుగు.
దాని
దగ్గర
పోవుటకు
భయము
వేస్తుంది.
కాని,
ఆ
రెండు
దంతములు
మనము
తీసిపారవేస్తిమా
ఆ
పామును
ఆడించి
పొట్టపోసుకునే
వానికి
ఉపకారిగా
నిల్చిపోతుంది.
ఆ
రెండు
దంతములు
మనకు
కూడా
ఉంటున్నాయి.
10
▾
Meaning
Keep
ఏవంటే
అభిమానము,
మమకారము
అనే
రెండు
దంతములు
మనకు
విషదంతములుగా
వుంటున్నాయి.
ఈ
రెండింటిని
మనము
తీసివేస్తిమా
యింక
మనతో
జగత్తుకు
ఉపకారము,
జగత్తుతో
మనకు
ఉపకారము
రెండింటిని
సమరసత్వాన్ని
పురస్కరించుకొని
లోక
కళ్యాణము
ఏర్పరచటానికి
ఒక
స్వార్థము
అనే
దాన్ని
దూరముచేసి
పరార్థమనే
విశాలమైన
భావాన్ని
అభివృద్ధి
చేసుకునే
అవకాశము
లభిస్తుంది.
దివ్యాత్మ
స్వరూపులైన
విద్యార్థులారా!
తల్లిదండ్రులకు
తగిన
ఆనందమునందించి
వారికి
తగిన
కృతజ్ఞతను
చేకూర్చి
తద్వారా
మన
జీవితములో
భవిష్యత్తుకు
తగిన
భద్రతను
కూడను
పవిత్రమైన
మార్గములో
అవలంబించి
భారతదేశ
సంస్కృతిని
తిరిగి
నిలబెట్టి
తద్వారా
మన
జగత్తుకు
తగిన
ఆదర్శాన్ని
యువకులు
అందించటానికి
సంసిద్ధులు
కావాలని
నేను
ఆశిస్తున్నాను.
మనయొక్క
భుజబలముగాని,
బుద్ధి
బలముగాని,
ధనబలము
గాని,
జనబలములుగాని
ఏ
బలములు
శాశ్వతమైన
బలములు
కానేరవు.
దైవబలమే
నిజబలము.
అట్టి
నిజబలమైన
దైవబలమును
మనము
అభివృద్ధి
చేసుకోవటానికి
తగిన
ప్రయత్నము
చేసినప్పుడే
మనకు
తగిన
సార్ధకత,
మానవత్వమనే
పవిత్రత
మనకు
లభిస్తుంది.
మీరు
చరిత్రయందు
అలెగ్జాండరు
సంగతి
తెలిసియే
ఉండవచ్చును.
అతను
భారతదేశముపై
దండెత్తి
వచ్చి
అనేక
రకములైన
ధనమును
ఆర్జించి,
తాను
ప్రోగుచేసుకొని
అన్నింటిని
కొల్లగొట్టి
కావలసినంత
ధనమును
అంతా
తీసుకుని
వెళ్లే
సమయములోపల
భారతీయులు
అడ్డుపడి
దానిని
దక్కించుకునేందుకు
తరుముకొని
వెళ్లారు.
మధ్య
మార్గములో
అలెగ్జాండరుకు
కొంత
ప్రమాదమైన
స్థితి
ఏర్పడింది.
ఆ
సమయములో
అలెగ్జాండరు
డాక్టర్లను
పిలిపించాడు.
డాక్టర్లు
కావలసినంతమంది
వుంటున్నారు.
అందరూ
చుట్టూ
చేరారు.
లక్షల
సైన్యము
అక్కడే
ఉంటున్నారు.
ఆ
సమయములో
డాక్టరు
చూచి,
‘ఇంక
కొన్ని
నిముషములలోపల
అలెగ్జాండరు
ప్రాణములు
విడిచిపెడతాడు’
అని
చాటినారు.
చాటిన
లోపల
అలెగ్జాండరు
మహా
ధైర్యశాలి,
ధైర్యము
చేసుకొని
దగ్గరనున్న
మంత్రులకు
చెప్పాడు
‘మంత్రులారా!
నేను
ఇంక
దేహమును
వదలిపెట్టిపోతున్నాను.
దానికి
తగిన
ఔషధములు
లేవు.
ఎంతకాలము
ఉండినప్పటికి
దేహము
వదలిపెట్టక
తప్పదు.
అయితే
నా
వాంఛను
మీరు
అంగీకరించి
ఆవిధముగా
మీరు
చేయాలని
ప్రామిస్
తీసుకున్నాడు.
అది
ఏమని
డాక్టర్లు,
మంత్రులు
ప్రశ్నించినప్పుడు
చెప్పాడు,
నేను
కొన్ని
నిముషముల
లోపల
నాదేహమును
వదలి
నా
జీవుడు
వెడుతున్నాడు.
11
▾
Meaning
Keep
నా
దేహమును
మన
capital
కి
తీసుకువెళ్లి
నా
యొక్క
హస్తములు
పైకి
పెట్టి
తెల్లని
వస్త్రము
ఈ
దేహమునకు
చుట్టి
వీధి
వీధి
ప్రొసెషన్
చేయండీ
అన్నాడు.
అప్పుడు
మినిష్టరు
అడిగాడు,
‘చేతులు
రెండు
కఱ్ఱలు
కట్టి
పైకిపెట్టి
ఈ
కళేబరమునకు
తెల్లటి
వస్త్రము
చుట్టి
ఉత్సవముగా
తీసుకొని
పొమ్మన్నప్పుడు
ప్రజలంతా
ఎందుకు
అలెగ్జాండరు
చేతులు
ఇంతపైకి
పెట్టారు,
ఎందుకు
క్రిందకు
పెట్టకూడదు
అని
ప్రశ్నించినప్పుడు
మేము
ఏమని
జవాబు
చెప్పాలి’
అన్నాడు.
అలెగ్జాండరు
అనేక
రాజ్యములను
జయించాడు.
కావలసినంత
కోట్లకొలది
ధనరాసులను
కూర్చుకున్నాడు.
కావలసినంత
సైన్యమును
సంపాయించుకున్నాడు.
అయినను,
కట్టకడపటికి
దేహము
వదలిపెట్టేపోయే
సమయములో
వట్టిచేతులతో
పోయాడు’
అని
చాటండి
అన్నాడు.
ఎలాంటి
ధనవంతులైనా,
ఎలాంటి
బలవంతులైనా,
చక్రవర్తులు
కూడనూ
ఈ
దేహమును
వదలిపెట్టక
తప్పదు.
మనకు
కూడా
ఈనాడు
కాకపోయినా
ఏనాడైనా
అట్టి
స్థితి
సంప్రాప్తమవుతుంది.
కాని
మనము
తీసుకుని
వెళ్లవలసినదిగాని,
జగత్తుకు
అందించవలసినదిగాని
సత్యమైన
మార్గము.
నీతి
నిజాయితీలతో
కూడిన
జీవితాన్ని
మనము
అనుభవించిన
భవిష్యత్తులో
వచ్చేవారికి
మార్గదర్శకమైన
మంచి
గుణములు
మనము
అందించి
పోవటానికి
ప్రయత్నము
చేయాలి.
ఇవి
ఏవీ
శాశ్వతము
కాదు.
మన
సద్గుణములే
శాశ్వతము.
మనిషిపోయినా
గుణములు
సజీవంగా
నిల్చివుంటాయి.
ఈ
సజీవంగా
జీవించటం
చేతనే
మన
భారతదేశములో
అనేకమంది
మహర్షులు
యొక్క
పేర్లు,
అనేకమంది
సాధుసంత్ల
యొక్క
పేర్లు,
అనేక
మంది
మార్గదర్శకులైన
జయదేవ,
గౌరాంగ,
తుకారాం,
రామకృష్ణపరమహంస
ఇలాంటి
మహాత్యాగులైన
వారిపేర్లు
నేడు
కూడా
భారతదేశములో
సజీవంగా
ఒకవిధమైన
ప్రకాశవంతమైన
చుక్కలవలె
ఈ
లోకములో
సంచరిస్తున్నాయి.
సత్కీర్తిని
ఆర్జించిన
ప్రతి
వ్యక్తి
కూడను
సాక్షాత్
దైవసన్నిధియందే
సాయుజ్యములో
వుంటుండి
సంతోషముతో
తన
జీవితమును
పూర్తిగా
మరచి,
సాలోక్యభావముతో
తన
జీవితములో
సచ్చిదానందమును
అనుభవిస్తుంటారు.
విద్యార్థులారా!
ఎవ్వరికిని
దుఃఖమునివ్వక,
ఎవ్వరిని
అనానుకూలములో
ముంచక,
ఎవ్వరినీ
పరాభవము
చేయక
మనము
పవిత్రమైన
మాటలతో
పవిత్రమైన
నడకలతో,
పవిత్రమైన
ప్రవర్తనతో
మన
జీవితమును
అంత్యము
చేసుకోవటానికి
తగిన
ప్రయత్నం
చేయాలి.
12
▾
Meaning
Keep
తల్లిదండ్రులను
గాని
ఇంటిలోని
పెద్దలనుగాని,
కఠినమైన
మాటలతో
వారి
హృదయాన్ని
బాధ
పెట్టకూడదు.
లేక
కఠినమైన
చర్యలతో
వారి
హృదయాన్ని
బాధించకూడదు.
మనము
చేసినవి,
ఏదో
ఒక
ఉద్రేకములో
మనము
చేయవచ్చును
గాని,
భవిష్యత్తులో
అదే
తిరిగి
వచ్చి
మనలను
బాధించటానికి
పూనుకుంటాయి.
మనము
ఏది
చేసినా,
ఏది
చూచినా,
ఏది
చెప్పినా
reaction,
resound,
reflection
వుండక
తప్పవు.
Previous
←
The Bond of Prakṛti and the Paramātma
Next
The Destination and the Aim
→