Contents
Devotion & Sacred Story
Home
Library
Find
Shelf
Settings
←
Leave
Sathya Sai Speaks 1973 · God Alone Is Your True Guru
Tap a verse for its meaning
IAST
Telugu
Meaning
Continuous
God Alone Is Your True Guru
20 June 1973, Summer Course, Brindavan
1
▾
Meaning
Keep
His poems 47
సద్గురు
చరణాబ్జముపై
భక్తే
త్వరగా
ముక్తికి
చేర్చే
మార్గము
ఇంద్రియ
మానస
సాంద్రనియమమే
హృదయస్థుని
చూపించును
దేవుని
దివ్యాత్మస్వరూపులారా!
గురుచరణములయందు
నిశ్చలమైన
భక్తి,
సంసారమునుంచి
విరక్తి,
ఇంద్రియములయొక్క
నిగ్రహము,
మనస్సు
యొక్క
వశము,
ఈ
నాలుగు
గావించిన
వ్యక్తికి
తన
హృదయస్థానమున
నున్న
దైవత్వము
సాక్షాత్కరించవచ్చు
అనే
ఉద్దేశ్యముతో
శంకరులవారు
ఈ
కట్టకడపటి
శ్లోకమును
అందించి
కాశీ
నుంచి
తిరిగి
వాపసురావటం
ప్రారంభించాడు.
గురుచరణములందు
నిశ్చలమైన
భక్తి
ఉండాలని
మాత్రం
ప్రబోధించాడు
గాని,
ఇందులో
గురువు
ఎట్టివాడుగా
ఉండాలనే
విషయాన్ని
కూడను
మనము
మొట్టమొదట
యోచించుకోవాలి.
కోవగురు
హితోపదేశః
అనగా
హితమును
బోధించి,
మానవునియొక్క
మతతత్త్వమును
అభివృద్ధి
పరచి,
మతిని
వికసింపజేసి
శాస్త్రసమ్మతమైన
కర్మలను
ఆచరింపజేసి
హృదయ
స్థానము
నందున్న
ఆత్మజ్యోతిని
వెలిగింపజేయటానికి
తగిన
ఉపదేశమునందించే
వానిని
గురువు
అని
చెప్పవచ్చును.
అయితే
గురు-ఈ
రెండు
అక్షరములయందు
ఉండే
అంతరార్ధమును
కూడను
మనం
కొంత
విచారించాలి.
గుకారమనగా
అంధకారమని
రుకారమనగా
తన్నివారణమని
కూడని
ఇందుకొక
అర్ధము.
అనగా
అజ్ఞానము
అనే
చీకటిని
జ్ఞానమనే
జ్యోతితో
దూరము
గావించవచ్చు
అనే
ఉద్దేశ్యముతో
మనయందు
ఆవరించిన
అజ్ఞానమును
దూరము
చేసి
ప్రజ్ఞాన
తత్త్వమును
అందించి
తన
జ్యోతిర్మయమైన
ఆత్మతత్త్వములో
లీనమొనరింప
జేయటానికి
తగిన
ప్రయత్నము
గురువు
చేయటం.
2
▾
Meaning
Keep
అయితే,
ఇట్లు
చేయువారెవరు
అని
మనము
విచారము
సల్పినప్పుడు
గుకారోగుణాతీతః,
రుకారో
రూపవర్జితః
అని
గుణాతీతుడు,
రూపవర్జితుడైన
వాడే
ఇట్టి
ప్రయత్నమునకు
పూనుకోవటానికి
అర్హుడు
అని
కూడను
ఇందులో
నిర్ణయించబడింది.
గుణాతీతుడు
-
రూపవర్జితుడు,
ఒక్క
దైవము
తప్ప
అన్యులు
ఇందులో
కనిపించరు.
అయితే,
ఇప్పుడు
గురువు
అనే
పదముతో
చలాయించేవారంతా
కూడను
ఎట్టివారు
అని
మనము
అడగవచ్చును.
వీరందరు
ఏదో
సన్మార్గ
సంబంధమైన
విషయములు
తెలుపవచ్చును.
లేక
కొన్ని
రకములైన
సద్భోధలు
సలుపవచ్చును.
అంత
మాత్రమే
గాని
ఇట్టి
అజ్ఞానమును
దూరముచేసి
దివ్యమైన
దైవత్వములో
చేర్చే
ప్రయత్నము
ఒక్క
దైవత్వమునకు
మాత్రమే
సాధ్యంగాని
అన్యులకు
కానేరదు.
ఇట్టి
లోక
గురువులు
రెండు
భాగములుగా
ఉంటున్నారు.
ఒకరు
బోధ
గురువు
అని
రెండవ
వాడు
బాధ
గురువు
అని.
అనగా
తనను
ఆశ్రయించిన
వానిని
అనేక
రకములుగా
ఇక్కట్లు
పెట్టి,
తనయొక్క
ఆస్తిపాస్తులను
లాగుకొని
తదుపరి
ఉభయ
భ్రష్ఠునిగా
ఉప్పరసన్యాసిగా
మార్చే
గురువులు
కొంతమంది.
గురువు
అనేదానికి
మరొక
అర్ధము
కూడా
ఉంటున్నాది.
గు-అనగా
భారము.
ఇట్టి
గురువులులో
వానికి
భారమైన
గురువులని
చెప్పవచ్చును.
ఇంక
రెండవ
గురువులు
ఏదో
వారికి
తెలిసిన
జ్ఞానమును,
తనను
ఆశ్రయించిన
శిష్యులకు
బోధించి,
తద్వారా
తన
జీవితము,
తన
ద్వారా
శిష్యుని
యొక్క
జీవితము
ఉభయులు
కూడను
కొంత
అభివృద్ధి
పరచుకొనే
ప్రయత్నానికి
పూనుకోవటం
రెండవ
గురువుల
యొక్క
లక్షణం.
ఇట్టి
అవస్థలను
పురస్కరించుకొనియే
గురుర్
బ్రహ్మ
గురుర్
విష్ణుః
గురుర్దేవో
మహేశ్వరః
గురుస్సాక్షాత్
పరబ్రహ్మ
తస్మై
శ్రీ
గురవే
నమః
3
▾
Meaning
Keep
అన్నారు.
అయితే
ఈ
శ్లోకమునకు
ఈనాటి
గురువులు
తమకు
సంబంధించిన
అర్థములు
తాము
చెప్పుకుంటూ
నీ
గురువే
బ్రహ్మ,
నీ
గురువే
విష్ణువు,
నీ
గురువే
మహేశ్వరుడు,
నీ
గురువే
సాక్షాత్
పరబ్రహ్మ
అని
ఈ
శిష్యులకు
ప్రబోధించి
తమ
యొక్క
స్థానములు
తాము
ఆక్రమించుకోవటం
కూడను
జరుగుతున్నాది.
అయితే
గురువునకు,
టీచరునకు
చాలా
వ్యత్యాసం.
టీచరు
అనునతడు
తాను
ఆర్జించినటు
వంటి,
గ్రంథములందున్నటువంటివి
తాను
తిరిగి
చదువుకొని
వచ్చి
విద్యార్థులకు
బోధిస్తుంటాడు.
ఇది
కేవలము
తన
స్వార్థముతో
చేరిన
పరార్థమనే
రీతి
క్రింద
కూడా
చెప్పవచ్చు.
జీతము
పుచ్చుకుంటూ
స్కూలులో
చేరిన
విద్యార్థులకు
తాము
చెప్పవలసిన
పాఠములు
చెప్పటం
లోపల
అది
గొప్ప
ఆశ్చర్యమని
గాని,
ఇతనినే
గురువుగా
భావించటమని
కాదు.
మనకు
ప్రబోధించేవారు
కనుక
అతనిని
టీచరు
స్థానమునందు
మనము
తగిన
గౌరవాన్ని
అందించాలి.
ప్రతిఫలమును
ఆశించి
ప్రబోధించే
వ్యక్తి
టీచరు
కావచ్చు.
కాని
ప్రతిఫలాపేక్ష
లేక
తనయొక్క
స్వస్థానమైన
హృదయస్థానమును
వికసింపచేసుకునే
ప్రయత్నములో
సద్గురువు
అనే
వాడు
దైవ
స్వరూపకంగా
ఉంటుండి
తమలో
ప్రవేశించి
తమయొక్క
హృదయమును
వికసింపచేసే
ప్రబోధలు
స్వప్నమునందుగాని,
ప్రత్యక్షమునందుగాని,
ఏవిధమైన
మార్గమునందుగాని
ప్రబోధించటానికి
పూనుకుంటాడు.
మనయొక్క
కాలకర్మ
కారణ
కర్తవ్యాలు
చేరి
వచ్చినప్పుడు
సద్గురుడే
మనలను
వెతుక్కుంటూ
రావటానికి
పూనుకుంటాడు.
పరీక్షిత్
మహారాజు
అట్టి
సుసమయము
ప్రాప్తించిన
తక్షణమే
శుకులవారు
ఆ
ప్రదేశమునకు
చేరి
పరీక్షిత్
మహారాజుకు
ప్రబోధించి
ఏడు
దినములయందు
మోక్షప్రాప్తికి
అర్హుడుగా
గావించాడు.
ఇందులో
గురుబ్రహ్మ
అని
మొట్టమొదటి
పదము.
బ్రహ్మ
చేసే
పని
ఏమిటి?
పూర్వ
జన్మాంతర
సంస్కారమును
పురస్కరించుకొని
ఆయా
అర్హతలు,
ఆయా
కర్మఫలములు,
ఆయా
భావచిత్తములు
పురస్కరించుకొని
ఆయా
జన్మలందు
అతనిని
ప్రవేశింపజేసి
తద్వారా
ముందుజన్మకు
తగినటువంటి
లక్ష్యమును
చూచుకుంటూ
రావటము
బ్రహ్మ
యొక్క
కర్తవ్యము.
అదేవిధముగా
మనయొక్క
సంస్కారములు,
మనయొక్క
ప్రవర్తనలు,
మనయొక్క
అర్హతను
మనయొక్క
అభీష్టమును
పురస్కరించుకొని
ఏ
నామము
ఏవిధముగా
వీడు
ఆచరించినప్పుడు
ఎట్టి
సాధనలు
సల్పినప్పుడు
వీడు
ధన్యుడు
కాగలడు
అనే
విచారణ
సల్పి
అట్టి
నామమును,
అట్టి
కాలమును,
అట్టి
నియమమును
అందించేవాడు
గురుబ్రహ్మ
అని
చెప్పటంలో
ఎలాంటి
తప్పు
ఉండదు.
4
▾
Meaning
Keep
గురు
విష్ణుః
-
విష్ణువు
చేసే
పని
ఏమిటి?
బ్రహ్మ
సృష్టించినంత
మాత్రమున
అది
అభివృద్ది
కానేరదు.
మనము
ఈనాడు
భూమిలో
ఒక
మొక్కను
పెట్టినంత
మాత్రమున
అది
వృక్షముగా
అభివృద్ధి
కాదు.
పెట్టిన
మొక్కకు
పాదును
కట్టి,
నీరు
పెట్టి,
ఎరువును
వేసి,
రక్షణ
కట్టి
అనేకరకములుగా
దానిని
అభివృద్ధి
కార్యక్రమములోపల
కూడను
పాల్గొన్నప్పుడే
అది
ఒక
వృక్షముగా
తయారౌతుంది.
అదేవిధముగా
గురువులు
ఒక
నామమునిచ్చి
ఒక
నియమమును
చెప్పి
దానిని
అనుసరిస్తూ
ఉండమని
చెప్పినంత
మాత్రమున
ప్రయోజనము
ఉండదు.
తాను
తిరిగి
విష్ణు
స్థానములో
చేరి,
దానికి
తగిన
పోషణాశక్తిని,
దాని
అభివృద్ధికి
తగిన
కార్యక్రమమును
కూడను
తాను
చూచుకోవటంలో
తగిన
లక్ష్యాన్ని
ప్రవేశపెట్టినప్పుడే
గురుఃవిష్ణుః
అని
చెప్పటానికి
ఆధారము
ఉంటుంది.
ఇంక
గురుదేవో
మహేశ్వరః.
మహేశ్వరుడు
చేసే
పని
ఏమిటంటే
లయ
మొనరించటము
అని
అర్థము.
లయమనగా
అనేకమంది
అనేక
రకముల
అర్థము
చెప్పటం
కద్దు.
నాశనమొనరించటమనిగాని,
కొన్ని
రకములుగా
ధ్వంసము
చేయటమనిగాని,
ప్రళయములో
రూపనామములు
లేకుండా
చేయటము
గాని
అని
అనేకమంది
చెప్పటం
కద్దు.
కాని
లయమునకు
ఇది
సరియైన
అర్థము
కాదు.
లయమనగా
లీనము.
“లీయతే
గమ్యతే
యితి
లింగః”
అన్నారు.
అనగా
ఏ
స్వస్థానమునుండి
బయలుదేరి
వచ్చిందో
తిరిగి
స్వస్థానమునకు
చేర్చే
ప్రయత్నము
మహేశ్వరునికి
ఎట్లా
కర్తవ్య
కర్మగా
ఉంటున్నాదో
అదేవిధముగా
మానవుడైన
తన
శిష్యునకు
ఎట్టి
గురువు
ఆత్మభావమును
అనుసరించి
తిరిగి
ఆత్మస్థానమును
అనుసరించి,
ఆత్మలక్ష్యములో
చేర్చే
ప్రయత్నానికి
పూనుకున్నప్పుడు,
ఈ
ప్రకృతికి
చెందిన
గురువు
మహేశ్వరునకు
సమానమైన
అర్థము
కూడను
మనము
చెప్పవచ్చును.
అనగా
ఇచ్చిన
నామమును
అభివృద్ధి
పరచే
రక్షణను
కల్పించి,
వృద్ధి
సంబంధమైన
దీనిలో
తనయొక్క
ఆనందమనే
ఫలమును
పండించి,
అట్టి
ఫలమును
వానికి
ఆరగింపజేసి
ఆ
బీజమునుండి
బయలుదేరిన
అమృతత్త్వమైన
సారమును
వారి
హృదయములో
చేర్చటానికి
తగిన
ప్రయత్నము
చేయటమే
ఈ
గురుబ్రహ్మ
గురువిష్ణు
గురుదేవో
మహేశ్వర
-
ఈ
ముగ్గురు
విడివిడి
కానేరరు.
5
▾
Meaning
Keep
ఈ
ఒక్కొక్క
కర్మయందు
ఒక్కొక్క
స్థానమందు,
క్రియ
ఆచరించటం
చేత
ఒక్కొక్క
పేరుతో
వారు
పిలువబడుతూ
వచ్చారు.
ఇంక
గురుదేవో
మహేశ్వరః
అని.
మహేశ్వరుడంటే
గానీ,
ఈశ్వరుడంటే
గానీ
ఉన్నటువంటి
అర్థము
ఏమిటి?
ఇందులో
నున్న
వ్యత్యాసము
ఏమిటి?
గురుసాక్షాత్
పరబ్రహ్మ
-
ఈ
మహేశ్వర
తత్త్వానికి,
ఈ
పరబ్రహ్మ
తత్త్వానికి
గురువిష్ణుః
గురుబ్రహ్మ
అనే
తత్త్వానికి
అనేక
రకముల
అర్థముంది.
మొట్టమొదట
గురుబ్రహ్మః
అన్నాడు.
కట్టకడపట
మహేశ్వరః
అన్నాడు.
తదుపరి
పరబ్రహ్మ
అన్నాడు.
పరబ్రహ్మకు,
బ్రహ్మకు
చాలా
వ్యత్యాసముంది.
బ్రహ్మ
అనగా
చతుర్ముఖ
బ్రహ్మ,
సృష్టికర్త
బ్రహ్మ,
శబ్దబ్రహ్మ
అనంత
బ్రహ్మ
నాలుగు
రకముల
బ్రహ్మలు
ఉంటుండగా
త్రిగుణములకు
అతీతమైన
తత్త్వాన్ని
పురస్కరించుకొనియే
పరబ్రహ్మ
పరసంబంధమైన
ప్రత్యేకంగా
రూపనామరహితమై
అనేక
రకములుగా
సర్వత్రా
వ్యాపించి
సిద్ధిస్తుంది.
ఇట్టి
బ్రహ్మ
పదమునకు
వివిధ
అర్థములు
లేకపోలేదు.
లోకమునకు
సృష్టి
కల్పించవలసిన
సమయము
ఏర్పడినప్పుడు
శబ్దము
అనే
దానినుండి
ఈ
చతుర్ముఖ
బ్రహ్మ
సృష్టిని
కల్పించాడు.
ప్రపంచములో
ఎట్టి
సృష్టి
జరగవలసినా
ఈ
శబ్దము
లేక
సృష్టి
జరగటానికి
వీలులేదు.
సృష్టి
జరిగినప్పుడు
ఒకవిధమైన
కంపము
ఏర్పడుతుంది.
కంపము
ఏర్పడినప్పుడు
శబ్దము
తప్పక
వస్తుంది.
కనుక,
ఈ
కంపము,
దీనికి
తగిన
కర్మ
రెండు
కూడను
ఒక
శబ్దముతో
పురస్కరించు
కొని
వస్తుంటాది.
మనము
కన్నుల
రెప్పలు
కొడుతున్నాము.
ఆ
రెప్పలు
కూడను
చలనముగా
ఉంటున్నాయి
కనుక,
అందులో
కూడ
శబ్దము
ఉంది.
కాని
అది
మనకు
వినిపించటం
లేదు.
మన
చెవులు
అంత
సూక్ష్మమైన
శబ్దమును
వినేటట్లు
నిర్మించలేదు.
ఈ
శబ్దమునే
ఆకాశముగా
పోల్చుకున్నారు.
ఈ
ఆకాశము
ఎక్కడ
ఉన్నది
అని
ఎవరినైనా
ప్రశ్నించినప్పుడు
సామాన్యంగా
పైన
ఉన్నది
అని
చూపుతూ
ఉంటారు.
అది
కేవలము
విద్యారహితులైనవారు,
విషయ
రహితులైనవారు
ఈవిధంగా
చెప్పవచ్చును
గాని
నిజముగా
ఆకాశము
శబ్ద
గుణముతో
చేరినది
కనుక
సర్వత్రా
ఉంటున్నదనే
సత్యాన్ని
మనం
గుర్తించాలి.
ఇప్పుడు
ఆకాశమంటే
అక్కడ
అని
చెప్పటానికి
వీలుకాదు.
నేను
నోటినుంచి
పలుకుతున్నాను.
ఈ
శబ్దమంతా
ఆకాశము
యొక్క
లక్షణమే.
ఈవిధముగా
చిటిక
వేస్తే
ఇది
కూడా
ఆకాశము
యొక్క
లక్షణమే.
కనుక
ఆకాశము
అన్నది
ఎక్కడ
శబ్దమో,
అక్కడ
ఆకాశము
యొక్క
గుణము
ఉంటున్నది.
6
▾
Meaning
Keep
అయితే,
ఈ
ఆకాశము
లక్షణము
పురస్కరించుకున్నప్పుడు
భగవంతుడు
శబ్దమునకు
అతీతుడు
అనే
పదము
ఏర్పడుతూ
వచ్చింది.
దీనిని
పురస్కరించుకొనియే
భగవంతుడు
గుణాతీతుడు
అని
ఉపయోగపెడుతూ
వచ్చారు.
శబ్ద
స్పర్శ
రూప
రస
గంధములు
ఈ
ఐదింటియందు
కొన్ని
గుణములుంటున్నాయి.
అయితే,
ఇట్టి
గుణములకు
అతీతమైన
వాడే
పరబ్రహ్మ
అని
చెప్పబడుతూ
వచ్చింది.
దానికి
ఒక
చిన్న
ఉదాహరణ.
శబ్ద
స్పర్శ
రూప
రస
గంధములనే
ఈ
ఐదు
గుణములు
భూమి
యందుంటున్నవి.
అందువలననే
అతి
భారముగా
ఉండి
ఒక
ప్రదేశమునుండి
మరొక
ప్రదేశమునకు
ఎత్తి
పెట్టేటువంటి
అవకాశములో
ఇది
కనిపించటం
లేదు.
ఈ
పృధ్వియందు
ఐదు
గుణములుంటున్నవి.
రెండవ
భూతమైన
అగ్నియందు
శబ్ద
స్పర్శ
రూప
రసములు
మాత్రమే
ఉన్నవి
గాని,
గంధము
లేదు.
ఒక
గుణము
తగ్గిపోయింది.
అందువలననే
అగ్ని
కొంతవరకు
పైకి
లేవటానికి
ప్రయత్నం
చేస్తుంది.
ఇంక
మూడవది
జలము.
ఇందులో
శబ్ద
స్పర్శ
రూపము
మాత్రమే
ఉంటున్నాయి.
రస,
గంధములు
తగ్గిపోవటంచేత
ఈ
నీరుకు
మరింత
కదలిక
ఏర్పడింది.
ఇంక
వాయువు.
ఈ
వాయువులో
శబ్ద,
స్పర్శ
రెండు
మాత్రమే
ఉంటున్నాయి.
రూప
రస
గంధములు
తగ్గిపోవటం
చేత
గాలి
కొంతవరకు
వ్యాపించి
పోతున్నాది.
ఐదవదైన
ఆకాశములో
శబ్దము
మాత్రమే
నిల్చింది.
నాలుగు
గుణములు
తగ్గిపోవటం
చేత
ఆకాశము
సర్వత్రా
వ్యాపించి
పోయింది.
ఒక్క
శబ్దము
ఉండిన
ఆకాశమే
సర్వత్రా
వ్యాపించినప్పుడు
ఆ
శబ్దమునకు
అతీతుడైన
భగవంతుడు
సర్వత్రా
వ్యాపించక
ఏ
రీతిగా
హద్దులో
ఉంటాడు?
అందువలననే
అతనిని
గుణాతీతాయ
అంటున్నారు.
ఈ
ఐదూ
కొన్ని
గుణములచేత
భారముగా
ఉంటున్నాది.
గుణములు
లేవో
భారము
తగ్గిపోతుంది.
సర్వత్రా
గుణాతీతుడుగా
ఉంటున్న
తత్త్వము
మనకు
వ్యక్తమవుతుంది.
గుణాతీతుడైన
భగవంతుడు
సర్వత్రా
ఉంటున్నాడనే
ఇట్టి
ఆదర్శము
నిరూపణ
చేసినప్పుడు
ఏ
సైంటిస్టుగాని
'no'
అని
చెప్పటానికి
వీలు
లేదు.
కనుక,
భగవంతుడు
గుణాతీతుడుగా
ఉంటున్నాడంటే
ఇట్టి
భారమైన
గుణములు
తనలో
లేవు
కనుక
తాను
సర్వత్రా
వ్యాపించి
ఉంటున్నాడు.
అయితే
నీకు
ఇందులో
ఒక
సందేహము
కలగవచ్చును,
సర్వత్రా
ఉంటున్నాడు
భగవంతుడు
అని
చెబుతూ
గుణములున్నచోట
కూడను
తాను
లేడంటే
అప్పుడు
ఆ
ప్రదేశములో
లేడనే
గదా
అర్ధము.
7
▾
Meaning
Keep
కనుక
గుణములు
తనలో
లేనప్పటికిని
గుణములయందు
కూడనూ
తానున్నానని
వేదము
తిరిగి
బలపరుస్తూ
వచ్చింది.
కనుక,
సర్వత్రా
ఉన్న
సత్యాన్ని
బుజువు
చేయాలనుకున్నప్పుడు
గుణములలో
కూడా
తాను
ఉండినప్పుడే
సర్వత్రా
ఉన్నాడని
బుజువు
చేయవచ్చును
గాని
గుణములో
తాను
లేను
అనుకున్నప్పుడు
సర్వత్రా
అనేది
అసత్యమై
పోతుంది.
గుణములు
కల్పితమైనవి.
అట్టి
కల్పితము
భగవంతుని
యందు
లేదు.
కనుక,
గుణములు
కల్గిన
మానవుని
imitation
is
human,
creation
is
divine.
అన్నింటికి
సృష్టి
కర్తగా
ఉన్నవాడు
divine
గాని,
గుణములతో
నున్నవాడు
imitation
లో
ఉంటాడు.
వారిని
చూచి
వీరు,
వీరిని
చూచి
వారు
అనేక
రకములుగా,
కొన్ని
రూప
నామములు
మార్చుకోవచ్చును,
ఇది
గుణ
సహితము,
అది
గుణ
రహితము.
అయితే
గుణములో
తానుండి
తనకో
గుణము
లేక,
ఒక
ఉదాహరణము
మనము
విచారించాలి.
మట్టితో
కుమ్మరి
కుండలు,
అలాంటి
కొన్ని
రూపములు
కల్పించవచ్చు.
అయితే
ఆ
పాత్రనిండుకు
మట్టి
ఉన్నదిగాని,
మట్టిలో
కుండలు
లేవు.
ఈ
కుండలు
కల్పితమైనవేగాని
సృష్టి
సహజముగా
మట్టిలోకుండలుగా
తయారై
రావటం
లేదు.
కనుక,
మట్టిలో
కుండలు
లేవుగాని,
కుండలో
మట్టి
వున్నది
అనే
సత్యము
ఎంత
మనకు
ఆదర్శముగా
ఉంటున్నాదో,
అదేవిధముగా
భగవంతునిలో
గుణములు
లేవు
గాని
గుణములలో
తానున్నాడు
అనే
సత్యము
మనకు
బుజువు
పరుస్తూ
వచ్చింది.
దీనినే,
శంకరులవారు
మరొక
ప్రదేశమునందు,
మరొక
స్థానమునందు
‘బ్రహ్మసత్యం
జగత్
మిధ్య’
అన్నారు.
మరొక
స్థానములో
’సర్వం
విష్ణుమయం
జగత్’
అన్నారు.
ఇట్టి
పదములు
ఈ
విద్యార్థులు
ఆధారము
చేసుకొని
ఏమిటి
యిదంతా
వట్టి
గ్యాస్
పదములు.
ఒకప్పుడు
బ్రహ్మసత్యం
జగత్
మిధ్య
అని
చెబుతూ
వస్తున్నాడు,
మరొక
ప్రదేశములో
సర్వం
విష్ణుమయం
జగత్
అని
చెబుతున్నాడు.
రెండూ
శంకరులు
చెప్పినవే
కదా,
రెండింటికి
పొత్తు
కుదరటానికి
వీలుకాదు,
నీటికి
నిప్పుకు
పొత్తు
కుదరనట్లుగా
ఉంటున్నాది.
అది
సత్యమైతే
ఇది
సత్యం
కాదు.
ఇది
సత్యమైతే
అది
సత్యం
కాదు
అని
వాదోపవాదములు
జరపటం
కూడను
కద్దు.
అయితే,
ఇందులో
అదీ
సత్యమే,
ఇదీ
సత్యమే
అనే
ఆదర్శాన్ని
ఇప్పుడు
విచారించాలి.
సత్యము
లేని
పలుకుల
పెద్దలు
పలుకరు.
8
▾
Meaning
Keep
వారు
సర్వ
స్వరూపాలను
విచారణ
సల్పి,
గుర్తించి
లోకానికి
సత్య
సూక్తులు
అందించే
మహనీయులు
అసత్యమునకు
ఏమాత్రము
చోటివ్వరు.
మనము
అర్ధము
చేసుకోవటం
లోపల
మనము
నానార్ధములు,
అనర్ధములు
గావించుకోవచ్చును
గాని
యదార్ధము
మహనీయులకే
గుర్తు.
నిత్యము
అనుభవించేవారు
యీనాటి
యువకులు,
దానిని
ఆధారము
చేసుకొనే
చక్కని
ఉదాహరణమందిస్తాను.
ఇందులో
ఉన్నటువంటి
99
3/4
మంది
సినిమాలకు
వెళ్లేవారుగా
ఉంటారు.
అయితే
ఈ
సినిమాకు
ముందువైపున
స్క్రీను
ఎక్కడ
ఉందో
అటువైపున
ముఖం
త్రిప్పటం,
ఎంతసేపు
చూసినా
స్క్రీనే
ఉంటున్నాది.
బొమ్మలు
రాలేదని
ఆత్రుత
పడటం
సహజం.
కొంతసేపు
అయిన
తరువాత
బొమ్మలు
వచ్చాయి.
బొమ్మలు
రాకపోతే
మనకు
అసంతృప్తి.
బొమ్మలు
వస్తే
చాలా
సంతోషము
అయి
నిద్ర
పోయే
వారిని
కూడా
లేపి
కూర్చోబెడతారు.
వచ్చిన
బొమ్మలు
అక్కడే
ఉంటున్నాయా
అంటే
ఉండటం
లేదు.
ఆ
బొమ్మలు
పోతున్నాయి
కొత్త
బొమ్మలు
వస్తున్నాయి.
వచ్చిన
బొమ్మలు
పోతున్నాయి.
తిరిగి
కొత్త
బొమ్మలు
వస్తున్నాయి.
ఈరకంగా
రావటం
పోవటం,
ఒకే
బొమ్మ
స్థిరంగా
అక్కడ
ఉండటం
లేదు.
కాబట్టి
వచ్చిపోయే
బొమ్మలంతా
మిధ్యము.
స్థిరత్వము
అక్కడ
ఉండటం
లేదు
కనుక
అవి
మిధ్యముగా
మనకి
కనిపిస్తున్నాయి.
అయితే
స్క్రీను
వాటితోబాటు
రావటం
లేదు
పోవటం
లేదు.
Screen
సత్యంగానే
ఉంటున్నాది.
Screen
సత్యము,
బొమ్మలు
అనిత్యము
అనేది
స్పష్టమవుతున్నాది.
ఇంక
సర్వం
విష్ణుమయం
జగత్
అనేదానికి
దీనినే
మనం
ఆధారం
చేసుకుందాం.
ఇందులో
Screen
ను
బ్రహ్మంగా
విశ్వసించాము.
వచ్చేపోయే
బొమ్మలంతా
జగత్తుగా
విశ్వసించాము.
జగత్తు
మిధ్యమని,
screen
అనే
బ్రహ్మ
సత్యమని
నిర్ణయమైంది.
అయితే,
ఈ
బొమ్మలు
వచ్చినప్పుడు
ఆ
సత్యమైన
screen
ఎక్కడ
ఉంది?
బొమ్మలో
లీనమై
ఉంటున్నాది.
Screen
లేక
బొమ్మలు
మనకు
కనిపించవు.
అయితే,
బొమ్మలు
వచ్చినప్పుడు
స్క్రీను
బొమ్మల
లోపలనే
లీనమై
ఉంటున్నాది.
గాబట్టి
సర్వం
విష్ణుమయం
జగత్తు.
జగత్తనే
బొమ్మల
లోపల
బ్రహ్మ
అనే
తత్త్వము
లీనమై
ఉంటున్నాది
కనుక,
సర్వము
విష్ణుమయం
జగత్
అనే
సత్యాన్ని
విశ్వసించటంలో
ఎట్టి
అభ్యంతరము
ఉండదు.
కనుక
ఇట్టి
అంతరార్ధము
లతో
కూడిన
ఈ
పవిత్రమైన
వేదాంతమును
మనము
అర్ధము
చేసుకోలేని
పరిస్థితి
లోపల
దానిపై
దోషములు
కల్పించటానికి
మనం
పూనుకోవటంలో
మరింత
అజ్ఞానమనే
చెప్పవచ్చు.
9
▾
Meaning
Keep
నీకు
కనిపించనంత
మాత్రమున,
నీకు
వినిపించనంత
మాత్రమున,
నీకు
అర్ధము
కానంత
మాత్రమున,
దానిని
లేదని
వాదించటం
ఒక
మూర్ఖత్వము.
గుడ్డివానికి
పెద్ద
పవర్ఫుల్
లైటు
ముందు
పెట్టినా
వానికి
చీకటి
గానే
ఉంటుంది.
వాడు
ఎంత
పెద్ద
లైటును
చూపించినప్పటికిని
చీకటి
అనే
అంటాడు.
కారణము
ఏమిటి?
వానికి
ఆ
లైటును
చూచే
నేత్రములు
లేవు
కనుక
దానికి
నిరంతరము
చీకటిగానే
ఉంటుంది.
అదేవిధముగా
కొంతమంది
మూర్ఖులైన
వారికి
అవిశ్వాసమనే
కన్నులు
లేనివానికి
ఎంత
పవిత్రమైన
భగవత్
తత్త్వము
ప్రకటిస్తూ
కంటెదుట
నిల్చి
ఉన్నప్పటికి
దానిని
విశ్వసించలేని
పరిస్థితిలో
తాను
మూర్ఖాన్ని
వదల్లేకుండా
ఉంటాడు.
దీనికి
ఇంకొకటి.
మనకు
స్పష్టముగా
అర్ధము
కావచ్చును.
గుడ్డివానికి
కూడా
దేహము
ఉంటున్నాది.
కాని
తన
దేహమును
తాను
చూచుకోలేడు.
తనయొక్క
అవయవములను
తాను
వర్ణించు
కోలేడు.
అతని
యొక్క
వికారములుగాని
అందములుగాని
గుర్తించలేడు.
అయితే,
తాను
చూడకుండా
లేకపోయినంత
మాత్రము,
గుర్తించకుండా
లేకపోయినంత
మాత్రమున
తనకు
దేహము
లేదా?
తనకు
దేహమున్నది
గాని
చూచే
నేత్రములు
లేవు
కనుక
తన
దేహమునే
తాను
చూడలేకపోతున్నాడు.
అదేవిధముగ,
మనకు
దివ్యమైన
ఆత్మస్వరూపము,
పవిత్రమైన
ఆత్మస్వరూపము,
పరబ్రహ్మ
స్వరూపము
మనకు
ఉండినప్పటికి,
మనకు
wisdom
అనే
eye
లేకపోవటం
చేత
ఆ
స్వరూపాన్ని
మనం
చూడలేకుండా
పోతున్నాము.
తాను
చూడకుండా
లేకపోయినంత
మాత్రమున
పరబ్రహ్మ
లేడని
వాదించుటకు
వీలుకాదు.
‘తిని
చూచి
రుచి
చెప్పాలి,
దిగిచూచి
లోతు
చెప్పాలి’.
చెరువు
కట్టపై
కూర్చొని
లోతింత
అని
భ్రమించటము,
తట్టలో
పెట్టుకొని
దీని
రుచి
ఇట్లా
అని
విశ్వసించటము,
కేవలము
ఒక
imagination.
ఈనాడు
లోకములో
దైవ
విషయాన్ని
విశ్వసించక,
అనేక
రకముల
వాదోపవాదము
లాడేవారు
ఇట్టి
imagination
లో
చేరినవారే.
దీనికి
ఒక
చిన్న
కథ.
ఒక
గురువు
ఒక
గుహలో
కూర్చుని
ఉంటున్నాడు.
ఆ
ప్రదేశము
దగ్గరకు
బాగా
ఆర్తుడై
భగవదన్వేషకుడైన
సాధకుడు
ఏదో
ఒక
విధముగా
మహనీయుని
దర్శించి
నాయొక్క
జ్ఞాననేత్రము
తెరిపించుకోవాలనే
ఉద్దేశ్యముతో
తాను
ఆ
గుహలో
ప్రవేశించాడు
ఆ
సాధకుడు.
పోతూపోతూ
ఉంటే
చాలా
దూరములో
చాలా
చిన్న
దీపం
కనిపించింది.
10
▾
Meaning
Keep
ఇతను
అనుకున్నాడు
ఏదో
క్రూరమృగముల
యొక్క
కన్నులా,
లేక
ఇందులో
ఎవరైనా
మహనీయుడు
నివసించాడా
అని
సందేహించాడు.
అయితే,
క్రూరమృగము
కన్నులైతే
రెండు
ఉండాలి,
ఒకటి
ఉండటానికి
వీలుకాదు.
లేక
ఒక
కన్ను
ఏమైనా
పోయిందో
ఏమిటో,
ఏదైతేనేమిటి,
మహనీయుడు
గాని
అక్కడ
ఉండుంటే
వారితో
బోధను
పొంది
తరిస్తాను.
క్రూరమృగమయితే
నన్ను
ఆ
క్రూరమృగం
వధించినా
ఈ
జన్మము
సార్ధకం
చేసుకుంటాను
అని
రెండింటికి
సిద్ధమై
ఆ
గుహలో
ప్రవేశించాడు.
సరే!
ఇతను
దగ్గర
దగ్గరకు
వెడతూ
వచ్చేటప్పటికి
ఆ
దీపము
ఆరిపోయింది.
చీకటిలో
చాలా
భయము
కలుగవచ్చు.
భయము
కలిగినప్పుడు
భగవచ్ఛింతన
అధికంగా
చేస్తుంటారు.
అప్పుడు
నమశ్శివాయ,
నమశ్శివాయ
అనుకుంటూ
గట్టిగా
ఉచ్ఛరించాడు.
అందులోని
మహనీయుడు
‘నాయనా!
ఎవరు
నీవు
అని
మనుష్య
శబ్దముతో
పలుకరించాడు.
‘ధన్యుడనైనానని
స్వామీ!
తమ
పాదసేవకుడను
అన్నాడు.
అయితే
ఇటురా!
కుడిప్రక్కన
తిరిగి,
కొన్ని
గుర్తులు
అతనికి
చెప్పటం
చేత
అతని
దగ్గరకు
వెళ్లాడు.
పాదములపై
పడ్డాడు.
ఇంతలో
తాను
ఏదో
అడగటానికి
ప్రయత్నం
చేసేటప్పటికి
అంతరాత్మను
గమనించిన
గురువు
కనుక,
అట్టి
భయంకరమైన
గుహలో
కూడా
తాను
ఉండ
గలుగుతున్నాడు.
గాలినే
ఆహారంగా
తీసుకుంటున్నాడు.
అలాంటి
వానికి
హృదయాన్ని
తెలుసుకునే
శక్తి
ఉండదా?
నాయనా!
నీ
పని
తరువాత
చూస్తాను.
ఆ
దీపాన్ని
ముట్టించి
రా
అని
ఒక
అగ్గిపెట్టె
ఇచ్చాడు.
అక్కడికి
వెళ్లాడు.
పెట్టెలో
నున్న
పుల్లలు
అన్నీ
గీసి
ముట్టించటానికి
పూనుకున్నాడు.
ఒక్కదానికైనా
దీపము
అంటుకోలేదు.
‘స్వామీ!
ఇది
అంటుకోలేదు.
ఈ
పుల్లలన్నీ
అయిపోయినాయి’
అని
చెప్పాడు.
అయితే
ఆ
దీపములో
నూనె
ఉందా,
నీరుందా
చక్కగా
గమనించు
అన్నాడు.
వేలు
పెట్టి
చూస్తే
జిడ్డు
లేదు.
నీరు
మాదిరి
ఉంటున్నాది.
ఇది
నూనె
కాదు
నీరు
అన్నాడు.
అయితే
ఇదుగో
ఆయిలు,
నీరు
క్రిందపోసి,
నూనె
వేసి
వెలిగించమన్నాడు.
గురువు
చెప్పినట్లుగా
అందులోని
నీరు
క్రిందపోశాడు,
ఆయిలు
వేసి
మరల
ముట్టించటానికి
ప్రయత్నం
చేశాడు.
చిటపట
అని
శబ్దం
చేస్తున్నదే
గాని
అది
అంటుకోలేదు.
నాయనా!
ఆయిలు
వేశావు
గాని
దీనికి
పూర్వమున్న
నీరు
వత్తిలో
చేరటంచేత
అది
అంటుకోలేదు.
ఈ
వత్తిని
బాగా
పిండి
ఎండలో
పెట్టి
తీసుకురా
అన్నాడు.
సరి,
గురువాజ్ఞ
ప్రకారము
బాగా
పిండి,
ఎండలో
పెట్టి
ఆ
నూనె
పీల్చుకున్న
తరువాత
ముట్టించాడు.
11
▾
Meaning
Keep
His songs 7
అది
చక్కగా
జ్యోతిగా
వెలిగింది.
స్వామీ!
నాకు
జ్ఞానజ్యోతిని
అందించండి.
తమరు
సర్వశక్తిమయులు
కదా!
జ్ఞానమును
ప్రసాదించండి’
అన్నాడు
శిష్యుడు.
‘అయ్యో!
పిచ్చివాడా!
ఇంత
వరకు
బోధించింది
అదేను’
అన్నాడు
గురువు.
ఏరీతిగా
బోధించిరో
నాకు
అర్ధం
కావటం
లేదు
స్వామీ!
స్పష్టంగా
ఈ
మూర్ఖునికి
అర్ధమయ్యే
రీతిలో
బోధించండని
ప్రార్ధించాడు.
ఈ
విషయవాసనలనే
జలమును
పెట్టుకోవటంచేత
అక్కడ
జ్యోతి
అనే
జ్ఞానము
వెలగలేదు
కనుక
ఈ
విషయ
వాసనలనే
నీరును
క్రింద
పారవేసి,
నామస్మరణ
అనే
నూనెను
అందులో
పోశావు.
కానీ
పూర్వపు
వాసనలు
ఈ
జీవునిలో
చేరి
ఉండటం
చేత
అది
తిరిగి
అంటుకోవటానికి
ప్రయత్నం
చేయటం
లేదు.
దీనిని
వైరాగ్యమనే
ఎండలో
పెట్టటం
చేత
తిరిగి
ఈ
నూనెను
తాను
పీల్చుకోవటంచేత,
జ్యోతి
ప్రకాశ
వంతముగా
వెలుగుతూ
వచ్చింది.
కనుక,
నీ
హృదయములోనున్న
పూర్వ
విషయ
వాసనలన్నీ
పూర్తిగా
గుమ్మరించు.
ఈ
జీవునిలోనున్న
పాత
సంకల్పములన్నీ
వైరాగ్యముతో
అనుభవించు.
తదుపరి
నా
దగ్గరకు
రా,
నీకు
జ్ఞానజ్యోతి
అనేటు
వంటిది
వెలిగించటానికి
ఏమాత్రము
అభ్యంతరము
ఉండదు
అన్నాడు.
జీవుడను
వత్తి
వేసి,
విషయవాసనలను
నీరు
పిండి
భక్తిసారమను
నూనె
వేసి,
ఆత్మజ్యోతి
వెలిగించి
నిర్భయశాంతి
ప్రదేశము
చేరండి.
దీనిని
మనము
ఈనాడు
చక్కగా
గుర్తించుకొని,
ఇట్టి
జ్ఞానము
అనే
జ్యోతిని
వెలిగించటానికి
మన
పాత
వాసనలంతాకూడను
దూరము
చేసుకొని
తిరిగి
మీరు
ఇలాంటి
వాతావరణము
అనుభవించిన,
మీరు
మీమీ
ప్రదేశములలోపల
ఈ
జ్ఞానజ్యోతిని
వెలిగించి
ఇతర
ప్రాంతముల
వారికి,
పరిసర
సోదరులకు
ఈ
జ్ఞానమును
మీరు
అందించి
మీరు
మరింత
పరిశుద్ధమైన
జీవితాన్ని
గడుపుతారని
కూడను
నేను
ఆశిస్తున్నాను.
ఈ
నెల
దినములు
మీరు
అనుభవించిన
విషయాలంతా
కూడను
కేవలము
అక్కడకు
వెళ్లిన
తక్షణమే
words
మీరు
use
చేయకుండా
work
లో
use
చేయటానికి
ప్రయత్నము
చేయాలి.
ఇక్కడ
చెప్పిన
కొటేషన్లు
అక్కడకు
తీసుకొని
వెళ్లి
పదములలోపల
మాత్రమే
ఉచ్ఛరించి,
గొప్ప
వేదాంతమని
మీరు
ఉచ్ఛరించటానికి
పూనుకుంటే
ఇది
ఒక
పెద్ద
హాస్యాస్పదానికి
గురియై
పోతుంది.
12
▾
Meaning
Keep
ఒక
సోంబేరి
సన్యాసి
ఒక
గ్రామానికి
వెళ్లాడట.
పొట్టలో
చాలా
ఆకలౌతున్నాది.
ఒక
చక్కని
ఇల్లు,
శ్రీ
వైష్ణవుల
ఇల్లు,
ఇంటికి
ముందుగానే
మూడు
నామములు
పెట్టి
పెట్టినారు.
దీనిని
చూచి,
వీరెవరో
చాలా
భక్తులుగా
ఉంటున్నారు.
ఈ
నామములు
ఇంటికి
వెడదాము,
మనకు
నామము
ఏమాత్రము
పెట్టరు
అని
విశ్వసించి
ఆ
నామాల
ఇంటికి
వెళ్లాడు.
‘భవతి
భిక్షాందేహి’
అన్నాడు.
ఆ
లోపల
నుంచి
ఇల్లాలు
వచ్చి,
‘నాయనా!
మీరు
సన్యాసిగా
ఉంటున్నారు.
ప్రక్కనే
కావేరి
నది
పారుతున్నాది.
కావేరి
నదికి
వెళ్లి
స్నానం
చేసుకురండి.
ఆకువేసి
వడ్డించి
పెడతాను.
జోలిలో
ఇంత
భిక్షం
వేస్తే
నాకు
తృప్తి
ఉండదు.
కనుక,
స్నానం
చేసిరండి’
అని
మంచి
మాటలతో
చెప్పింది.
ఈ
సోంబేరి
‘గోవిందేతి
సదాస్నానం’
అన్నాడు.
నాకు
గోవిందనామమే
స్నానము.
నాకు
స్నానము
అక్కరలేదు.
నాకు
త్వరగా
పెట్టండి
అన్నాడు.
ఆమె
ఏమాత్రం
తక్కువైనది
కాదు.
ఇతను
సోంబేరిగా
ఉంటున్నాడు.
‘రామనామామృతం
సదా
భోజనం’
వెళ్లిరా!
అంది.
ఈ
రీతిగా
మనం
పదములు
ఉపయోగపెడితే
మనకు
తప్పక
reaction
వస్తుంది.
కనుక
మనము
ఇక్కడ
నేర్చుకున్న
పదములంతా
కూడను
practical
లోపెట్టి,
మీరు
తరించి,
ఇతరులకు
ఆదర్శప్రాయంగా
మీరు
జీవిస్తారని
నేను
ఆశిస్తూ,
ఆశీర్వదిస్తూ
నా
ప్రసంగాన్ని
విరమిస్తున్నాను.
Previous
←
Friendship: Its Real Principle
Next
The Closing Message of the Summer Classes
→