Contents
Devotion & Sacred Story
Home
Library
Find
Shelf
Settings
←
Leave
Sathya Sai Speaks 1974 · The Padmavyūha
Tap a verse for its meaning
IAST
Telugu
Meaning
Continuous
The Padmavyūha
23 October 1974, Prasanthi Nilayam
1
▾
Meaning
Keep
వ్యష్టి
జీవుడగును;
సమష్టి
ఈశ్వరుడు.
రెండూ
నశ్వరములే!
యెందుకనిన,
రెండూ
కార్యములే!
కారణ
స్వరూపుడైన
నిర్గుణ
బ్రహ్మము
మాత్రము
మార్పు
లేక,
నిశ్చలముగా
నిలచియుండును.
జీవులలోనూ
పారమార్థికము,
ప్రాతిభాసికము.
వ్యావహారికము
అని
మూడు
విధము
ఉన్నవి
అయితే,
ఇవి
మూడూ,
జాగ్రత్
స్వప్న
సుషుప్తి
అవస్థలవలె,
నీటిలోని
అలలు
నురుగులవలె,
బాగా
పరీక్షించునపుడు
ఏకస్వరూపముగనే
కనబడును.
నీటిని
విడిచి
అలలు
లేవు;
అలలను
విడిచి
నురుగు
ఉండదు
నీటిలో
అలలు
కల్పితము;
అలలో
నురుగు
కల్పితము
అట్లే,
పారమార్థికమునుంచి
ప్రాతిభాసికము,
ప్రాతిభాసికమునుంచి
వ్యావహారికము
ఒకటి
మరొకటికి
ఆధారము.
పారమార్థిక
జీవుడైన
కూటస్థుడు
ప్రాతిభాసికమునందు
ప్రతిబింబించును;
ప్రాతిభాసికము
వ్యావహారికములో
ప్రతిబింబించును.
కూటస్థుడు
అంటే,
యెట్టి
అవస్థలో
కూడనూ
మార్పు
చెందనివాడు.
అని
అర్థము.
ఆహార
నిద్రా
భయ
మైథునాదులను
దూరము
చేసి,
‘అహం
బ్రహ్మాస్మి’
అనే
నిత్యానంద
స్థితిలో
నిలచియుంటాడు.
ఇట్టి
పవిత్ర
స్థానమును,
ఇటువంటి
బ్రహ్మజ్ఞానమును
పొందే
నిమిత్తము
మానవుడు
అనుసరించవలసిన
కర్తవ్యమేమిటి?
అని
అందరూ
గుర్తించాలి.
దీనికే
సాధన
చతుష్టయమును
నిర్ణయించి
యున్నారు.
నిత్యానిత్య
విషయ
పరిశీలన,
ఇహాముత్ర
ఫల
భోగ
విరాగము,
శమదమాది
షట్సంపత్తి,
ముముక్షుత్వము.
ఇవి
నాలుగు
చేరి
సాధన
చతుష్టయమనబడును.
శ్రుతి
స్మృతి
శాస్త్రేతిహాస
పురాణాదులను
పఠించి,
వాటిలోని
నిత్య
సత్యములను
గ్రహించి,
స్వానుభవములో
బ్రహ్మ
సత్యం
జగన్మిథ్య
అనే
స్థితియందు
అంతఃకరణమును
స్థిరముగా
నిలపటమే
ఈ
పరిశీలనయొక్క
సార్థకత!
2
▾
Meaning
Keep
ఈ
లోకమందు
కానీ
మరోలోకమందు
కానీ
దొరకే
విషయానందము
తుచ్ఛము.
కేవలము
స్వప్న
దృశ్యములవలె
అనిత్యము
అని
గుర్తించగల
శక్తిని
పొందటమే
ఫలభోగవిరాగము.
కలలోని
మేడలు,
మిద్దెలు
కన్నులు
తెరచిన
తక్షణమే
లేవు
కదా!
కన్నులు
విప్ప
జాగ్రదవస్థలో
కనబడే
దృశ్యములు
కలలో
అసత్యమై
తోచును;
కలలోని
దృశ్యములు
జాగ్రత్తలో
అసత్యము.
ఈ
పుట్టుటకు
పూర్వము
యే
దేహములో
నివసించి
వానిని
చెప్పుటకు
వీలుకాదు;
గతించిన
తరువాత
ప్రాప్తించే
దేహము
యెట్టిదో
యెవరు
చెప్పగలరు?
కాన,
ఆ
యా
కాలములకు
ఆ
యా
అవస్థలు
సత్యము,
అని
మాత్రము
అర్థము
చేసుకోవాలి.
జగత్తునందు
దృశ్యకల్పితమైన
అనుభూతులు
కేవలము
మిథ్యా
స్వరూపమని,
లేక,
స్వప్న
స్వరూపమని
అర్థము
చేసుకోవలెను.
అంతవరకూ
పోనక్కరలేదు.
మీ
మీ
నిత్యానుభవమును
స్మరించితే
జగత్తు
మిథ్య
అనే
విషయము
స్పష్టమగును.
అనేక
మంది
ప్రత్యక్ష
ప్రమాణమును
అంగీకరించి
ఆదరింతురు.
అయితే,
వేదాంతము
ఇంద్రియముల
ప్రమాణమును
ఏ
మాత్రమూ
అంగీకరించదు
ఈ
నాడు
మీరందరూ
ఈ
ఆడిటోరియములో
కూర్చొని
స్వామియొక్క
మాటలను
పండితుల
మాటలను
శ్రవణము
చేసికొని,
హృదయముతో
అందుకొని,
ఇది
సత్యము.
అసత్యము
కాదు,
అని
విశ్వసించవచ్చు!
కొన్ని
గంటలు
గడచిన
తరువాత,
ఈ
సమావేశము
ముగించిన
తరువాత,
మీరు
భోజనము
చేసుకొని,
ఇదే
అడిటోరియమునందు
పవళించి
నిద్రించు
సమయమునందు
మీకు
ఒక
కల
వచ్చును.
మీ
దేహము
ఇచ్చటనే
నిద్రించుచున్నది
కానీ,
ఆ
కలలో
మీరు
కలకత్తా
నగరమందో
ఢిల్లీలోనో
బొంబాయిలోనో
తిరుగుచూ
షాపింగ్
చేయుచున్నటుగా
అనుభవమగును.
స్వప్నావస్థలో
కనుపించే
ఆ
దృశ్యము
సత్యము
కాదని
మీకే
మాత్రమూ
తోచదు.
జాగ్రదవస్థలో
ఆడిటోరియములో
అనుభవించినవన్నీ
సత్యమే!
స్వప్నావస్థలో
కలకత్తా
ఢిల్లీ
బొంబాయిలలో
తిరుగునది
కూడ
సత్యమే!
అది
ఎట్లు
అని
విచారణ
సలిపితే,
మీకే
స్పష్టమగును;
రెండవస్థలలోనూ
ఉండేది
మీరే.
కాబట్టి,
మీరే
సత్యము.
జాగ్రదవస్థలో
కనుపించినది
Day
dream
(దివా
స్వప్నము),
పగటి
కల.
నిద్రావస్థలో
కనిపించినది
Night
dream
(నిశా
స్వప్నము)
రాత్రికల.
అంతే
వ్యత్యాసము!
రెండిటియందును
రెండు
విధములుగా
ఉండునది
సత్యము
కాదు.
రెండిటియందును
ఒకే
రీతిగా
వుండినదే
సత్యము.
Truth
is
one,
not
two.
కనుకనే
సత్యమును,
మిథ్యను,
గుర్తించి,
ప్రబోధించి,
మానవులకు
నిత్యసూక్తులను
అందించి
నిత్యములో
చేర్చునిమిత్తము
శంకరుడు
తన
జీవితమును
అంకితము
చేసినాడు.
దీనిని
పురస్కరించుకొని,
“బ్రహ్మ
సత్యం,
జగన్మిథ్య”
అని
వారు
తెలుపుతూ
వచ్చినారు.
సత్యములోనూ
మిథ్యలోనూ
పరమాత్ముడున్నాడు!
అదే
పరమ
సత్యము.
సత్యము
కానిది
మిథ్య.
కానీ,
మిథ్య
అని
వేరొక
పదార్థము
ఎక్కడా
లేదు!
చీకటి
అంటే,
వెలుతురుయొక్క
అభావమే,
కాని.
ప్రత్యేకమైన
మరొక
వస్తువు
కాదు.
ఉన్నదొక్కటే!
రెండవది
వట్టి
భ్రమ.
3
▾
Meaning
Keep
ఆ
ఒకటి
ఏ
రీతిగా
రెండుగా
మారినది
అనేదానిని
ముదిగొండ
పిచ్చయ్య
శాస్త్రిగారు
ఇపుడు
విశదీకరించినారు.
బొగ్గులో
అగ్ని
చేరితే,
ఏ
విధముగా
వేడి
ప్రకాశము
మొదలైన
గుణములు
చేరునో,
అట్లే
జీవియందు
అహము
చేరినప్పుడు,
గుణభూయిష్టముగా
కనుపించును,
అన్నారు
అయితే,
మీరు
మరొక
విషయమును
కూడ
గమనించవలెను.
ఆ
బొగ్గుకూడ
అగ్ని
చేరటము
వలననే
తయారయింది.
అదే
విధముగా
అహము
చేరుట
వలననే
(ఏకోహం
బహుస్యాం)
జగత్తు
జగత్తులోని
సమస్త
వస్తువులు
ఉద్భవించినవి.
అహం
చేరినందువలన,
జీవితమే
ఒక
పద్మవ్యూహముగా
మారినది,
అని
కూడ
శాస్త్రిగారన్నారు.
కుంభజుడు
పద్మవ్యూహమున
కురుక్షేత్రమందు
తయారు
చేయగా,
అర్జునుడు
లేని
సమయమందు
కుమారుడు
అభిమన్యుని,
దానిని
ప్రవేశించి
భేదించుటకు
ఆహ్వానించినారు,
కౌరవులు.
ఇట్టి
పిలుపును
నిరాకరించుట
క్షత్రియ
వీరులకు
తగదు.
తనను
ఆశీర్వదించి
పంపమని
కుమారుడు
తల్లిని
ప్రార్థించగా,
ఆమె,
“నీ
తండ్రి
ఇక్కడ
లేడు,
నీ
భార్య
గర్భవతి”
అని
రెండు
విధములైన
అడ్డులు
చెప్పినది.
ఆ
మాటల
గూఢార్థమేమనగా.
మమకారము,
అభిమానము
అనే
రెండు
ఆటంకములను
దాటితే
తప్ప,
కుంభజుడు
(ప్రజ్ఞానం)
పన్నిన
పన్నాగమును
నీవు
జయించుటకు
వీలు
కాదు,
అని.
అర్జునుడు
ఒకడు
మాత్రమే
పద్మవ్యూహమును
భేదించి
బయటకు
వచ్చుటకు
సమర్థుడు,
అని
మహాభారతములో
చెప్పబడియున్నది.
దీని
అర్థమేమనిన,
అర్జునుడు
అనగా
నిర్మలచిత్తుడు,
నిష్కళంకుడు,
చిత్తశుద్ధిగలవాడు;
కాబట్టి,
“ప్రజ్ఞానం
బ్రహ్మ”
అని
చెప్పబడే
బ్రహ్మమును
తెలుసుకొని.
బ్రహ్మవిద్
బ్రహ్మైవ
భవతి,
అనే
పవిత్ర
స్థానమును
చేరుటకు
చిత్తశుద్ధి
ప్రధానమైనది;
చిత్తశుద్ధి
వలననే
జ్ఞానశుద్ధి.
అయితే
భగవంతుని
మరచి,
లోకమునే
మతియందుంచుకొనిన
వారికి
ఎట్టి
శక్తిసామర్థ్యములుండినా,
ధన
బలము
భుజబలము
అధికారబలములుండినా,
అంతర్దృష్టిలో
మమత
అహంకారములుండుట
వలన,
అశాంతి
తప్పదు.
Previous
←
Honour your kith and kin
Next
Sama-citta
→