Contents
Devotion & Sacred Story
Home
Library
Find
Shelf
Settings
←
Leave
Sathya Sai Speaks 1974 · Sama-citta
Tap a verse for its meaning
IAST
Telugu
Meaning
Continuous
Sama-citta
25 October 1974, Dasara, Vijayadasami, Prasanthi Nilayam
1
▾
Meaning
Keep
సర్వ
భూతదయయే
అన్నిటికీ
ఉత్తమమైన
పుణ్య
కర్మము;
జీవహింసయే
పెద్ద
పాపము.
నారు
పెట్టిన
దైవము
నీరు
పోయక
పోడు.
ఈ
సత్యమును
తెలుసుకొని,
అందరిపై
ప్రేమను
ప్రసరించి
తాను
ఆనంద
పడి
ఇతరులకు
ఆనంద
మందించవలెను.
ఇదే
సార్థకమైన
జీవితమార్గము.
జగత్తునందు
మానవులు
సుఖదుఃఖముల
ననుభవించుటకు
వారి
దృష్టిలోని
దోషమే
మూలకారణము.
పరదోష
శ్రవణమునకు
చెవులు
సదా
సిద్ధముగా
నుండును;
దేనిని
గురించి
చింతించునో,
విచారించునో,
అదే
చిత్తమునందు
హత్తుకొనును
అని
ఆలోచించక,
దోషములనే
చింతించి
దోషభూయిష్ఠమైన
జీవితములనే
రూపొందించుకొని
బాధపడుచున్నారు.
సర్పములకు
రెండు
ప్రధాన
గుణములున్నవి.
ఒకటి
:
అది
తిన్నగా
నడువకుండ,
వంకర
టింకరగా
నడుచును.
రెండవది
:
అట్లు
సంచరించే
సమయమునందు,
ఏది
చిక్కిన
దానిని
కరుచుచూ
వెళ్లును.
మానవులూ
అంతే!
తమ
అభీష్టముల
ప్రాప్తికి
అడ్డము
వచ్చిన
వారందరినీ
హింసించు
స్వభావము,
భయము
పెట్టి
వారికి
బాధకలిగించడము,
మానవుల
సహజ
స్వభావము.
సర్పము
విషమయము;
మానవులు
విషయమయము!
విషయము
విషము
బింబ
ప్రతిబింబములు!
అని
రెండూ
కవలలు!
(Twins).
అయితే,
విషసర్పమును
నాగస్వర
గానముతో
పట్టవచ్చు!
అట్లనే,
విషయ
వాసనలో
పడిన
మానవులను
నామస్మరణ
వలన
పట్టవచ్చు!
ఆ
గానము
వలన
విషమణగిపోవును;
ఈ
స్మరణ
వలన
విషయ
వాంఛలు
నశించును.
విషమయమైన
మనస్సును,
అమృతమయముగా
మార్చుటే
అన్ని
సాధనలయొక్క
పరమ
లక్ష్యము.
దీనిని
సమచిత్తమును
సాధించుట.
అని
కూడా
చెప్పుదురు.
ప్రకృతి
పరిణామ
మయము,
నిరంతరము
మార్పు
చెందుచునే
వుండును.
వంట
చేసినప్పుడు
తీయగా
పవిత్రముగా
రుచివంతముగా
నుండు
పదార్థములు
కొంత
సమయము
గడచిన
తరువాత,
విషమయ
మగును;
కాలము
గడచు
కొలది
వాటి
స్వరూప
స్వభావములు
మార్పుచెందును.
అట్టి
మార్పులు
రావలెననే
మానవులు
నిరీక్షింతురు
కూడ!
ప్రకృతిలోని
వస్తువులలో
మార్పులు
సంభవించకుండిన
యెవరికీ
తృప్తియుండదు.
పుట్టిన
బిడ్డ
పెరుగకుండిన
తల్లిదండ్రులు
కంగారుపడి
వైద్యమును
నడుపుతారు.
నిజముగా
అపేక్షలు
అభీష్టముల
వలననే,
విషయాపేక్ష
అధికమగును;
వాంఛలు
పెరిగితే,
బాధలధికమగును;
ఆనందము
కరుగును.
పుట్టిన
బిడ్డకు,
ఆకలి
దప్పులు
తప్ప,
మరెట్టి
పిపాసలు
లేవు;
కాబట్టి
దానికెప్పుడూ
ఆనందమే!
అమృతపుత్రుడు.
కాబట్టి,
అది
ఆనందమునందే
తేలుచుండును.
దాని
చిత్తము
సమచిత్తముగానే
వుండును.
సమచిత్తమనగా,
లోకరీతిగా
కాక,
కష్టనష్టములను
సమముగా
భావించి
సుఖదుఃఖములకు
పొంగక
క్రుంగక
జీవించటమే!
అయితే,
సమము
అనే
పదమునకు
బ్రహ్మము
అనునట్టి
మరొక
అర్థమున్నది.
బ్రహ్మమందు
లగ్నమైన
చిత్తమునకు
సమచిత్తమని
పేరు
2
▾
Meaning
Keep
మానవుడు
అమృతమయుడుగా
పుట్టినను,
అనృతమయుడుగా
పెరిగి,
జీవితమును
పాడుచేసుకొనుచున్నాడు.
విషయవాసనలను
త్యాగము
గావించినచో
పరమాత్మ
తత్వముగా
తానే
వెలుగును.
ఇప్పుడు
అహం
అహం
అనే
పొగరు
బోతుతనము
మానవులను
దానవులుగా
తయారు
చేయుచున్నది.
అహం
అనే
పదముయొక్క
నిజార్థమును
తెలుసుకొని
దానికి
తగినట్లు
తన
నడకను
తీర్చి
దిద్దికోవటమే
మానవుని
కర్తవ్యము.
అస్యచ
హస్యచ
సమాహారం
అహః,
అని
శాస్త్రము
చెప్పుచున్నది.
అః
(విష్ణు)
హః
(శక్తి),
శక్తితో
కూడిన
విష్ణువునే
అహం
పదము
గుర్తించుచున్నది.
“మయాకృతం
ఇదం
సర్వం”,
నా
వలననే
ఈ
సృష్టి
స్థితి
లయములన్నీ
కలుగుచున్నవి
అని
దీనికి
అర్థము.
అంతా
తానే
అయినప్పుడు,
జీవులూ
బ్రహ్మమే!
కనుక,
మంచి
చెడ్డల
కేమాత్రమూ
స్థానము
లేదే?
అయితే,
మంచి
చెడ్డలు
కనిపించుచున్నవే?
అనుభవములోనికి
వచ్చుచున్నవే?
అని
కొందరు
సందేహ
పడవచ్చు.
అయితే,
అన్నియు
అతనే
అని,
వాసుదేవ
స్సర్వమిదం
అని
తెలుసుకొనిన
తరువాత
కదా,
సమత్వము
ఏర్పడేది?
దేహమే
తాను,
అని
అనుకోవటము
వలన,
ఇది
మంచి
ఇది
చెడు
అనిపించునే
కానీ,
ప్రహ్లాదునివలె,
నారాయణ
భావమును
అభివృద్ధి
చేసుకొనిన,
నామరూప
భావముల
నతిక్రమించిన,
ద్వైతమే
వుండదు.
ప్రహ్లాదునికి
ప్రపంచమంతా
పదమే
కానీ
పదార్థము
కాదు!
ప్రపంచమంతా
ఒక
పదమునుంచి
పుట్టినదే;
ఆ
పదమునకు
అర్థరూపములుగా
సృష్టియంతా
వివిధమై
వికసించినది.
అంతే!
పదము
పదార్థములుగా
కనిపించునది,
దృష్టి
దోషము
వలన
కాని,
వేరు
కాము
అన్నిటిలోనూ
ప్రసరించే
పరాశక్తి
ఒకటే.
దివ్యాత్మ
స్వరూపులారా!
నేడు
మానవుని
మనస్సు
ఉండవలసిన
రీతిగా
లేకపోవటమే
జగత్తుయొక్క
దుఃస్థితికి
మూలకారణము.
బ్రహ్మము
మారునట్టి
పదార్థము
కాదు,
మారునట్టి
శక్తి
కాదు.
కానీ,
బ్రహ్మమయమైన
ఈ
జగత్తునందు
అశాంతి
ఎందుకు
తాండవమాడుచున్నది?
బ్రహ్మములోనే
అశాంతి
ప్రారంభమైనదా?
అని
కొందరు
సంశయించ
వచ్చును.
అయితే,
ఇది
జగత్తుయొక్క
సమస్య
కాదు:
ఇది
వ్యక్తియొక్క
సమస్యే!
తనలో
శాంతి
లేనివానికి
జగత్తులోనూ
శాంతిలేదు.
కన్నులేనివాని
యెదుట
పెద్ద
బల్బు
వెలిగితే,
అతడు
ఇంకనూ
ఎప్పటివలె
చీకటిగానే
వున్నదని
చెప్పుతాడు!
అయితే
కన్నులున్నవారికి
అప్పుడు
ప్రకాశమే!
కనుక.
శాంతివంతులకు
జగత్తు
నిరంతరము
శాంతిమయముగనే
ఉండును.
అన్ని
రంగములలోనూ
ఈ
నాడు
మానవులు
చేయు
తప్పు
ఇదియే!
వ్యక్తి
గతమైన
సమస్యను
సమష్టిపై
పెట్టి,
జగత్తును
అపవిత్రము
గావించుచున్నారు.
నిజముగా
జగత్తునకు
అశాంతి
లేదు.
అది
నిరంతరము
శాంతిమయము,
ఆనందమయము.
అదే
రీతిగనే
జగత్తును
ఆనందమయముగా
శాంతిమయముగా
నొనర్చుకొనే
శక్తి
వ్యష్టిలో
లేదు,
వ్యష్టికి
ప్రాప్తి
లేదు.
అంతే!
ఈ
కారణము
వలన,
అశాంతిని
రూపొందించుచూ
వస్తున్నాడు,
మృత్యుమయమైన
దేహమందు
అమృతత్వమున్నది;
మట్టిలో
మాణిక్యమున్నట్లు!
మాంసపు
ముద్దయందు
ప్రజ్ఞానమున్నది;
జీవరూపమందు
ఆత్మ
భావమున్నది,
దేహము
కూలిపోవును,
రాలిపోవును.
అయిననూ,
చంచలస్వరూపమైన
అభీష్టములకు
ఆశలకు
ఆలవాల
మగుచున్నాడు.
దేహమే
నేను
అనే
విశ్వాసము
నభివృద్ధి
చేసుకొని,
దురవస్థలో
పడిపోవుచున్నాడు
జీవితమంతా
వ్యర్థము
చేసుకొనుట
మాత్రమే
కాదు;
మరణ
క్షణమందు
కూడ,
దిగులు
విచారము
అశాంతి
మొదలైన
భావములతో
బాధపడుచున్నాడు.
3
▾
Meaning
Keep
దేహములోని
దేహికి
చావు
పుట్టుకలు
లేవు!
ఆ
దేహియే
ఆత్మ.
ఆత్మకు
యెట్టి
మార్పులూ
కూర్పులూ
ఉండుటకు
వీలులేదు.
దేహమునకు
అధిష్ఠానమైన
ఆత్మకు
దేహగుణము
లున్నవని
తలంచటము
కేవలము
అజ్ఞానమే.
దృశ్యము
వేరు,
దృక్కు
వేరు,
కనపడే
పదార్థములు
వేరు.
నేత్రము
కూడ
ఆత్మయొక్క
ప్రకాశము
వలననే
చూచును.
ఇంద్రియములు
అద్దమువంటివి.
అద్దముపై
ఆత్మ
ప్రకాశము
పడిననే
పదార్థములు
వాటిలో
గోచరమగును.
దేహము,
మనస్సు,
చిత్తము,
బుద్ధి,
ఇంద్రియములు
ఇవన్నీ
పవిత్ర
కర్మలకొరకు
మానవులకు
లభ్యమైనవి.
వాటిని
సత్కర్మలకొరకు
వినియోగించవలెను.
ఆ
కర్మలవలన
దొరకే
ఫలితముకొరకు
కాదు;
కర్మకు
మాత్రమే
నీవు
కర్తవు!
ఫలదాత
వేరు.
చేతిలో
కత్తి
తీసుకోని,
కూరగాయలను
కొయ్యవచ్చు.
ఆ
కూరగాయలను
కత్తి
తినదు.
ఫలములను
భుజించదు.
నీవు
ఆ
కత్తివలె
నిమిత్తమాత్రుడవు
కావలెను.
మరొక
చిన్న
ఉదాహరణము.
ఒక
కప్పులో
పండ్ల
రసము
పోసుకున్నాము.
దాని
రుచి
ఆ
కప్పుకు
యే
మాత్రమూ
తెలియదు.
నాలుకను
చేరినప్పుడు
కూడ,
దానికి
అది
పులుపా
తీపా
అని
అంత
మాత్రమే
తెలుసును
కానీ
ఆ
పండ్ల
రసమును
పూర్తిగా
అనుభవించుటకు
నాలుక
అసమర్థుడు!
కాబట్టి
అది
దాన్ని
ఆ
రసమును
జఠరము
లోనికి
పంపును
కడుపు
కూడ,
దానిని
తానే
అనుభవించక,
చక్కగా
జీర్ణించి
సర్వాంగములకూ
ఆ
శక్తిని
సప్లై
చేయును;
చిన్న
నరములు
పెద్ద
నరములు
దేహ
పర్యంతము
అన్ని
చోట్ల
ఆ
శక్తిని
ప్రసరింపజేయును
ఈ
ఉదాహరణమును
మీ
మీ
అనుభూతికి
తగినట్లుగా
మీరు
సమన్వయము
చేసుకోవాలి.
ఆ
కప్పే
దేహము.
దానిలో
దివ్యత్వమైన
మధురమైన
ఆత్మ
రసమున్నది.
దానిని
ఇంద్రియములనే
స్ట్రాలో
పీల్చిన,
బుద్ధి
అనే
నాలుక
నిత్యానిత్య
పరిశీలన
చేయును.
తరువాత,
అన్ని
అనుభవములనూ
ఆత్మకు
అర్పితము
గావించుచున్నది.
జఠరమనే
జీవతత్వము
దాని
సారమును
సర్వాంగములకూ
అందించి
జడమును
చిత్తుగా
మార్చును.
ఇదియే
ఆధ్యాత్మిక
జీవితముయొక్క
రీతి,
నీతి.
Previous
←
The Padmavyūha
Next
Four steps to freedom
→