Contents
Devotion & Sacred Story
Home
Library
Find
Shelf
Settings
←
Leave
Sathya Sai Speaks 1974 · A Warning
Tap a verse for its meaning
IAST
Telugu
Meaning
Continuous
A Warning
23 November 1974, Birthday, Prasanthi Nilayam
First talk
Second talk
1
▾
Meaning
Keep
పవిత్రాత్మ
స్వరూపులారా
!
నేడు
స్వామి
పుట్టిన
దినమని
అనేక
రకములైన
ఆనందములలో
మీరు
ఉత్సాహముగా
ఈలాంటి
కార్యక్రమములో
పాల్గొనవచ్చినారు.
కానీ,
నిజముగా
పుట్టిన
దినము
చేసుకోవటము
కాని
జన్మదినము
జరుపుకోవటము
కాని
ఏనాడూ
నా
కిష్టము
లేదు.
నేను
కేవలము
మానవునియొక్క
జీవిత
తత్వాన్ని,
మానవుని
రహస్యాన్ని,
స్వానుభవములో,
అనగా,
ఆచరించి
అందించే
నిమిత్తమై
వచ్చినవాడనే
కానీ
ఏదో
Birth
Day
జరుపుకోవటము,
ఆడంబరమైన
కార్యక్రమములు
జరుపుకోవటము,
దీనికంతా
ఈ
జీవితానికి
ఎప్పుడు
కూడను
ఏ
విధమైన
ఆశలూ
లేవు.
మీ
అందరు
కూడ
ఏనాడు
సత్యమైన
ఆనందమును
అనుభవింతురో
ఆనాడే
నాయొక్క
పుట్టిన
దినము,
అదే
నాకు
ఆనందము.
అంతే
కాని,
మీ
హృదయములు
ఎంతో
అల్లకల్లోలముగా
అనేక
కష్ట
నష్టములతో
దుఃఖములతో
విచారములతో
నిండిన
సమయములో
నాకు
పుట్టిన
దినము
అని
చెప్పుకోవటము
కేవలము
అర్థము
లేనట్టిదిగా
వున్నది.
దీనిలో
మరొక
విషయమును
కూడ
మిమ్ము
హెచ్చరించవలసినది
అత్యవసరము.
నా
విషయము
మీరు
తెలుసుకోవటములో
కాలహరణము
చేయకండి;
కాలమును
వ్యర్థము
చేయకండి.
కారణమేమనగా,
నాయొక్క
విషయము
తెలిసికోవటము
యెవరికీ
సాధ్యము
కాదు!
కనుక,
తెలుసుకోవటానికి
సాధ్యము
కాని
విషయమును
తెలుసుకొనే
ప్రయత్నమునకు
పూనుకొనిన
కాలహరణమే
కాకుండ,
కాయమును
కూడ
వ్యర్థము
చేసుకొన్నవారవుతారు.
మిమ్మలను
మీరు
ఏ
నాడు
తెలుసుకోగలరో,
ఆనాడే
నన్ను
తెలుసుకొనటానికి
సాధ్యమవుతుంది.
నాకు
ఈ
లోకములో
కావలసినది
ఏ
మాత్రమూ
లేదు.
నేను
ఏ
నాడు
కూడ
ఏ
కార్యమును
కానీ
ఏ
వస్తువును
కానీ
ఆశించిన
క్షణము
లేదు.
నేను
కేవలము
ఇచ్చుకోవటానికి
వచ్చినట్టివాడను
కానీ
పుచ్చుకోవటానికి
వచ్చినవాడను
కాను
నాకు
మీరు
ఇవ్వవలసినది
ఒక్కటే!
మీ
నిర్మలమైన
ప్రేమను
ఇచ్చినపుడు,
అదే
నాకు
తగినటువంటి
ఆనందము.
గడచిన
దసరాయందు
కొన్ని
రకములైన
ప్రకటనలను
చేసినారు.
అయితే,
వాటికి
స్వామికి
ఏమైనా
సంబంధమున్నదా
అని
మీరు
విచారించినపుడు
పేరు
మాత్రమే
సంబంధము
కాని,
స్వామికి
ఏలాంటి
సంబంధమూ
లేదు.
ఈ
నాడు
లోకములో
యువకులు
అనుసరించే
పెడమార్గములను
పురస్కరించుకొని,
సత్య
సాయి
సెంట్రల్
ట్రస్ట్
వారు
అనేక
ప్రాంతములందు
కాలేజీలు
స్థాపించి,
తద్వారా
అనేక
రకములైన
సంస్కారములను
వారలకు
కలిగింప
జేసి,
భారతీయ
సంస్కృతిని
నిలబెట్టి,
సర్వమత
సమ్మతమైన
సత్యాన్ని
ప్రబోధించే
నిమిత్తమై
వారుగా
సంకల్పించుకొన్నారు
దీని
నిమిత్తమై
స్వామియొక్క
50
వ
సంవత్సరము
పుట్టిన
పండుగ
అత్యంత
వైభవముగా
చేసుకోవాలని
భక్తులయొక్క
ఉత్సాహము
చేత,
వారు
కమిటీలో
కొన్ని
నిర్ణయములు
చేసుకొన్నారు.
2
▾
Meaning
Keep
అందువల్ల,
కళాశాలలు
స్థాపించే
నిమిత్తమై
దానికి,
ప్రపంచములో
ధనము
లేక
ఏ
చిన్న
కార్యము
కూడ
జరుగటానికి
వీలుండదు
కనుక,
వారు
ఒకొక
వ్యక్తి
జీవితమునకొక్క
పర్యాయము
50
రూపాయలు
ఇచ్చినప్పుడు,
దానినంతా
ఒక
ఫండుగా
చేసి
విద్యాసంస్థలను,
ఆరోగ్య
సంబంధమైన
సంస్థలను,
అభివృద్ధి
చేయవలెననే
ఉన్నత
భావాల
చేత
పవిత్ర
హృదయాల
చేత
నిర్ణయించుకొనినారు.
ఈ
విధమైన
నిర్ణయాన్ని
కమిటివారు
తెచ్చి
నా
దగ్గర
వప్పగించారు.
దానికి
నేను
ఈ
విధమైన
జవాబు
చెప్పినాను:
నాయనా
!
ఒకరికొకరు
కేవలము
ధనము
వస్తుంది
కదా
అనే
ఉద్దేశము
చేత
గుట్టుగా
వసూలు
చేయుటకు
పూనుకొనకండి;
బట్టబయలుగా
చెప్పి,
ప్రపంచానికి
గానీ,
ప్రభుత్వానికి
గానీ,
వ్యక్తులకు
గానీ,
ఎట్టి
సందేహములకు
కూడనూ
అవకాశము
లేని
మార్గమును
అవలంబించటము
మంచిది
అని
నేను
వారికి
ప్రబోధించినాను.
అందువలన,
వారు
ఆ
నాడు
(announcement)
ఒక
ప్రకటన
చేసినారు,
దీనిని
పురస్కరించుకొని,
అనేక
మంది,
అర్థాలును
కల్పించుకొని,
కేవలము
అనర్థాలనే
కల్పించుకొని,
స్వామియొక్క
పుట్టిన
పండుగ
ఆచరించుటకు
50
లక్షలు
ఖర్చు
పెట్టుతారు
అనే
ఒక్క
ప్రచారము
కూడ
కొనసాగించుకొనుచూ
పోయినారు.
నిజముగా
పుట్టిన
దినమునకు
గానీ
మరే
విధమైన
వ్యక్తి
సంబంధమైన
భోగమునకు
గానీ
50
లక్ష
రూపాయలు
వృథా
ఖర్చు
పెట్టుతున్నారంటే,
అంతకంటే
మహాపాపము
మరొకటి
ఉండదు.
లోకములో
అన్నము
లేక,
గృహములు
లేక,
అనేక
అవస్థలు
పడే
మానవులు
కోటానకోట్లున్న
సమయములో,
ఒక
వ్యక్తి
పుట్టిన
పండుగ
కోసము
50
లక్షలు
ఖర్చు
పెట్టుకొన్నారంటే,
ఇంతకంటే
మహా
పాపము,
ఇంతకంటే
మహా
దుర్వినియోగము
మరొకటి
ఉండదు
ఈ
లాంటిదానికి
నేను
ఏ
నాడు
కూడనూ
పాల్పడను.
ఇంతియే
కాదు,
ప్రశాంతి
నిలయములో
జరిగే
ఒక
శివరాత్రికి
గాని.
నవరాత్రికి
గానీ,
మా
ప్రశాంతి
నిలయము
తరపున
కొంతవరకు
కూడ
దుర్వినియోగము
ఏ
నాడూ
జరుగదు.
దసరా
మహోత్సవములో
ఇక్కడ
లక్షలు
ఖర్చయినాయి
అని
అనేకులు
అనుకోవచ్చు
కానీ,
అందరు
కూడనూ
హృదయపూర్వకముగా
దేహరీతిగా
ఆచరించే
పనులు
తప్ప,
ఒక
నయా
పైసా
కూడ
మాకు
ఖర్చు
లేదు.
వచ్చే
ఋత్విక్కులు
కానీ,
ఇచ్చే
ఉపన్యాసకులు
కానీ,
ప్రశాంతి
నిలయమునకు
కేవలము
ప్రేమతో
వచ్చినారు.
ఇట్లు
ఆచరించటము
వలన,
ఎవరికి
ఏ
విధమైన
అనుకూలము
జరిగే
దానిలో,
వాటినంత
సేవాదళము
వారు,
సేవాసమితి
వారు,
వాలంటీర్లు
హృదయపూర్వకముగా
తమ
దేహములను
అర్పితము
చేసి
పనులు
గావించటము
తప్ప
వారికి
నయాపైసా
కూడ
ఏ
మాత్రమూ
ఖర్చు
పెట్టటము
లేదు.
ఈ
నాడు
మా
ప్రశాంతి
నిలయములో
ఇంత
పరిశుద్ధ
ప్రదేశముగా
మీరు
అనుభవిస్తున్నారంటే
దీనికి
యెవరు
కారణము,
యెంత
మంది
స్వీపర్లను
పెట్టినాము?
యెంత
మంది
కూలీలను
పెట్టినాము?
యే
మాత్రమూ
లేదు.
యెవరెవరు
వారి
వారి
స్థానములను
ప్రదేశములను
వారే
పరిశుద్ధ
పరచుకొంటున్నారే
తప్ప.
3
▾
Meaning
Keep
దీనికి
నయాపైసా
ఏ
మాత్రమూ
ఖర్చు
లేదు.
ప్రశాంతి
నిలయములో
వినియోగింప
బడేటటువంటి
సద్వినియోగములు
ప్రపంచములో
యెక్కడకూడ
లేదని
చెప్పవచ్చు,
ప్రశాంతి
నిలయము
ఐహికముగా
ఆముష్మికముగా
కైవల్యముగా
నైతికముగా
భౌతికముగా
ధార్మికముగా
ఆధ్యాత్మికముగా
లౌకికముగా
రాజకీయముగా
కూడనూ,
ఆదర్శవంతమైన
దానినే
నిరూపిస్తున్నది
కానీ
అనర్థమైన
దానికి
ఏ
మాత్రమూ
చోటివ్వటానికి
వీలు
లేదని
గట్టిగా
చెప్పటములో
యే
మాత్రమూ
సందేహము
లేదు.
దివ్యాత్మ
స్వరూపులారా
!
కేవలం
మీకు
కొంత
దానధర్మము
చేయాలని
ఆశ
కలిగియున్నప్పుడు
విద్యా
విషయములందు
కాని
ఆరోగ్య
విషయములందు
కానీ
దీనులయందు
కానీ,
ఇట్టి
పవిత్ర
కార్యములో
మనస్సును
అభివృద్ధి
చేసుకొని
పాల్గొనటములో
యెట్టి
అభ్యంతరమూ
లేదు.
ఇక్కడే
కాదు.
ఎక్కడైనా
సరే,
బీదలకు
సహాయము
చేయుటకు
విద్యార్థులకు
సహాయము
చేయుటకు
అనారోగ్యులకు
తగిన
సహాయము
చేయుటకు
మన
సంస్థల
వారు
సంసిద్ధంగానే
వుండాలి.
అట్టి
కార్యమునే
మీరు
నాయొక్క
కార్యముగా
భావించుకోవాలి.
నాకు
యే
మాత్రమూ
…లేదు.
ఈ
లాంటి
సంస్థలలో
జరిగినట్టి
పరోపకార…మైన
ధర్మకార్యములలో
పాల్గొని
మీరు
జన్మ
సార్థకము
చేసుకోవటములో
ఎట్టి
అభ్యంతరమూ
లేదు.
మీ
కందరికి
తెలిసిన
విషయమే;
నేను
ఏ
మాత్రమూ
ఇక్కడ
ఒక
ఫలము
కాని
పుష్పము
కాని
ఒక
కొబ్బరికాయ
కానీ
ప్రవేశింప
చేయటము
లేదు.
కానీ,
కొంత
మంది
వారి
వ్యక్తి
ప్రపత్తుల
వలన,
వారి
ఉద్రేకములవలన,
వారి
ఉత్సాహము
వలన,
పోస్ట్
ద్వారా
లేక
ఇక్కడికి
వచ్చిన
తరువాత,
నాకు
వస్త్రములను
తెచ్చి
పెట్టుతూ
వుంటారు.
ఈ
నాటినుంచి
అవి
కూడ
యెవ్వరూ
తేకూడదని
నాయొక్క
ఆనతి
!
దీనిని
పెద్ద
ఆజ్ఞగా
భావించి,
మీరు
పాలించాలి.
ఎవరైనా
తెచ్చినారంటే
వాటిని
ప్రశాంతినిలయమందు
చేర్చటము
లేదు;
వారిని
స్వామి
ఆజ్ఞ
మీరినవారుగానే
చూస్తాము.
నాకు
ఇవ్వవలసినది
మీ
నిర్మల
ప్రేమ.
కాబట్టి
ఈ
నాటి
నుంచి,
పరోపకార
సంబంధమైన
కర్మలయందు
మీ
జీవితాలను
సార్థకము
చేసుకొంటారని
నే
నాశిస్తూ
ఆశీర్వదిస్తూ
నా
ప్రసంగాన్ని
విరమిస్తున్నాను.
Previous
←
Four steps to freedom
Next
The Rāga of the Heart
→