Contents
Devotion & Sacred Story
Home
Library
Find
Shelf
Settings
←
Leave
Sathya Sai Speaks 1978 · One Flame, Billion Lights
Tap a verse for its meaning
IAST
Telugu
Meaning
Continuous
One Flame, Billion Lights
10 November 1978, Dīpāvali, Prasanthi Nilayam
1
▾
Meaning
Keep
వేషభాషలందు
గర్వించరాదు
తనకు
తా
మెచ్చుకొనరాదు
పరుల
దూషించరాదు
ఇదియె
జ్ఞానంబనంగ.
ప్రేమస్వరూపులారా!
ప్రాచీనకాలమునుండి
భారతదేశములో
యుగయుగాలుగా
పర్వదినములు
విశిష్టమైన
అంతరార్థములతో
కూడి
ఆధ్యాత్మిక
సత్యములను
ప్రకటించునవిగా
ఉండుట
విదితమే.
కాని,
బాహ్య
ఆచారములు,
ప్రవర్తనలు
మనము
అలవరచుకొనుటచేత
వాటి
అంతర్భావములు,
అంతరార్థములు,
తత్వములు
విస్మరించుచున్నాము.
భారతదేశంలో
పాటించగలిగిన
వ్యక్తులకు
ప్రతిదినమూ
పర్వదినమే.
మాసమాసము
శివరాత్రి,
పదిహేను
దినములకు
ఒకసారి
ఏకాదశి
వ్రతము,
బాగా
విచారించిన
ప్రతిదినము
భారతీయులకు
పర్వదినముగానే
ఉండును.
కాని,
అన్ని
పర్వదినములకు
ఈనాటి
దీపావళి
పర్వదినమునకు
వ్యత్యాసము
అధికముగా
కనిపించును.
ఒక్క
భారతదేశములోని
అనేక
ప్రాంతములలో
దీనిని
అనేకవిధముల
అనుసరించి
ఆరాధిస్తున్నారు.
కొన్ని
ప్రాంతములందు
శ్రీరామచంద్రుడు
అయోధ్యను
వదలి,
పదునాలుగు
సంవత్సరములు
కష్టములకు
గురియై,
సీతను
కోల్పోయి,
కష్టములు
పడి,
అయోధ్యావాసులను
అంధకార
బంధురములో
పడద్రోసి,
రావణుని
హతమార్చి,
తదుపరి
అయోధ్యాపట్టణము
చేరి,
పురవాసుల
హృదయములను
పవిత్రముగా
దీవించి,
సీతామహాతల్లి
అయోధ్యలో
ప్రవేశించి
ఆనందదీపమును
వెలిగించిన
దినముగా
చేస్తున్నారు.
మరికొన్ని
ప్రాంతములందు
కృష్ణావతారములో
సత్యమును
ఆధారముగా
నరకుడు
అను
దుర్గుణములకు
ఆలవాలమైన
అసురుని
వధించి,
సాధుసత్పురుషులలో
దివ్యగుణములను
ప్రకాశింపజేసిన
పర్వదినముగా
చేస్తున్నారు.
మరికొన్ని
ప్రాంతములలో
భగవంతునకు
ఇచ్చిన
వాగ్దానమును
అనుసరించి
బలిచక్రవర్తి
ఏవిధముగా
వామనమూర్తికి
సిద్ధాశ్రమమున
ఆనందించెనో
మనస్సులో
ఉంచుకొని
పర్వముచేయుచున్నారు.
ఈవిధముగా
అనేక
ప్రాంతములలో
అనేక
కారణములు
పురస్కరించుకొని
అత్యంత
ఉత్సాహముగా
ఉత్సవములు
జరుపుకుంటున్నారు.
కాని,
ముఖ్యముగా
నరకచతుర్దశినాడు
నరకాసురుడు
అనగా
నరకమునకు
గొనిపోవు
అసురత్వము
అని
గ్రహించాలి.
ఈ
నరకాసురుని
ముఖ్యపట్టణము
ప్రాగ్జ్యోతిషపురము.
ప్రాక్
అనగా
ముందు,
జ్యోతి
అనగా
వెలుతురును,
షా
అనగా
మరచిపోవుట.
అనగా
ముందు
వెలుతురును
మరచిపోవు
కేంద్రమే
ఇతని
రాజ్యము.
అనగా
‘ముందుజ్యోతి’
,
‘ఆదిజ్యోతి’,
‘ఆత్మజ్యోతి’ని
మరచిన
ప్రదేశమే
ప్రాగ్జ్యోతిషాపురము.
అనగా
ఆత్మజ్యోతిని
మరచిన
స్థానము,
ఈ
నరకాసురుని
ముఖ్యపట్టణము.
ఆత్మజ్యోతిని
మరచిన
ప్రతి
వ్యక్తి
నరకాసురుడే.
అంటే,
అజ్ఞాన,
అంధకార,
అహంకార,
అభిమానములచే
నిండిన
మానవత్వమే
తన
ఆత్మజ్యోతిని
మరచిపోయింది.
మానవునిలోని
దుర్గుణములు,
దురాచారములు,
దుష్కృతములు,
దురహంకారములు
అను
నరకాసురుడు
తనలోని
ఆత్మజ్యోతిని
మరచిపోతున్నాడు.
నరకాసురుని
తల్లి
భూదేవి.
ఈ
భూదేవి
నిరంతరమూ
భగవంతుని
ప్రార్థించెను.
ఏ
తల్లికూడను
తన
కుమారుని
మరణము
ఆశించదు,
సహించదు.
అట్టి
దుఃఖమును
భరించదు.
కాని,
నరకాసురుని
తల్లి
భూదేవి
భగవంతుని,
‘స్వామీ!
ఏనాడు
నా
కుమారుడు
అంతమొంది,
ఈ
భూమి
అంతా
జ్యోతిలో
ప్రకాశించునో
అట్టి
నా
కుమారుని
మరణదినము
ప్రపంచమంతా
ఆనందదినముగా,
బ్రహ్మముహూర్తములో
ప్రజలు
లేచి,
జ్యోతిని
వెలిగించి,
ఆనందోత్సాహములతో
గడుపుదురుగాక’
అని
ప్రార్థించెను.
అందుకే
నరకచతుర్దశి
అని
అభ్యంగనస్నానముచేసి,
నూతన
వస్త్రములు
ధరించి,
జ్యోతిని
వెలిగించి
పిన్నలు,
పెద్దలు
అందరూ
ఆనందముగానుందురు.
దీని
అంతరార్థము
భూదేవిపై
పుట్టిన
ప్రజలంతా
ఆమె
బిడ్డలే.
ఆ
తల్లికి
అయిష్టమైన
కృత్యములాచరించిన,
ఆ
తల్లి
కుమారుని
మరణము
ఆశించును.
తల్లియై
తన
పుత్రుని
మరణము
ఆశించుటకు
అతని
దుర్గుణములే
కారణము.
ఈ
నరకాసురుని
దుర్గుణములు-
అహంకార,
అసూయ,
క్రోధము.
ఈ
అసూయ,
అహంకారము,
క్రోధము
పైశాచిక
ప్రవృత్తులై
నరకాసురుని
హృదయములో
ప్రళయతాండవము
చేసెను.
ఇట్టి
దుర్గుణములను
దూరముచేయుటకు
ప్రయత్నము,
శ్రద్ధ
అవసరము.
‘శ్రద్ధావాన్
లభతే
జ్ఞానం’
ఈ
జ్ఞానము
లేకపోవుటచే,
ఈ
దుర్గుణములకు
ఆలవాలమై
ఉండుట,
మానవునకు
శ్రద్ధకు
మించిన
పుణ్యము,
సమానమైన
సుఖము
మరిలేదు.
శ్రద్ధవల్ల
అప్రాప్తమైన
వస్తువులు
మనకు
ప్రాప్తించును.
అశ్రద్ధవల్ల
లభ్యముకావలసిన
వస్తువులు
అలభ్యమగును.
ఏకలవ్యుని
గాధ
భారతీయులకు
తెలిసిన
విషయమే.
ఏకలవ్యుడు
ద్రోణాచార్యుని
విలువిద్య
కొరకు
ప్రార్థించగా,
ఒక్క
క్షత్రియునకు
మాత్రమే
నేర్పుదును,
అన్యులకు
లేదని
ద్రోణాచార్యుడు
చెప్పెను.
అప్పుడు
చేయునదిలేక
ఏకలవ్యుడు
అతి
శ్రద్ధతో,
దీక్షతో
మట్టితో
ద్రోణాచార్యుని
విగ్రహము
సృష్టించి,
అస్త్రశస్త్రవిద్యను
నేర్చుకొనెను.
అష్టవిద్యలతో
కట్టకడపటిదైన
శబ్దవేదినికూడ
సాధించెను.
అనగా
శబ్దము
బట్టియే
అస్త్రములు
ప్రయోగించు
విద్య.
దీనిని
చూచి
ద్రోణాచార్యుడు
మహా
ఆశ్చర్యపడెను.
అర్జునుని
శక్తిసామర్థ్యముల
కంటె
ఏకలవ్యుని
శక్తిసామర్థ్యములు
ఎక్కువగా
కనిపించెను.
ఈ
శక్తిసామర్థ్యములకు
కారణము
శ్రద్ధయే.
శ్రద్ధ
కలిగినవానికి
అణుమాత్రము
నిప్పుతో
గొప్ప
అగ్గిగా
చేయగల
అవకాశముండును.
2
▾
Meaning
Keep
శ్రద్ధలేనివానికి
తట్టెడు
నిప్పులనిచ్చినా,
అన్నిటినీ
ఆర్పివేయును.
తన
ఇంటిలో
సర్వ
పదార్థములున్ననూ
శ్రద్ధలేనివాడు
ఆకలిని
తీర్చుకొనలేడు.
శ్రద్ధ
కలిగినవాడై
పది
ఇండ్లు
యాచించి
అన్నము
సంపాదించి,
ఆకలి
తీర్చుకొనును.
దీనికి
మూలకారణము
శ్రద్ధ.
అదృష్టముకూడ
శ్రద్ధ
అను
ద్వారమునుండియే
ప్రవేశించును.
సారవంతమైన
భూమి,
సకాలవర్షములుండిననూ,
శ్రద్ధగా
విత్తనములు
నాటకుండిన
ఫలితములేదు.
కారణము
శ్రద్ధ
లేకపోవుటయే.
ఇంత
చిన్నవిషయములకు
శ్రద్ధ
ఇంత
అవసరమైన
ఆధ్యాత్మిక
మార్గములో
ఎంత
అవసరమో
ఆలోచించాలి.
చెట్టు
కొమ్మలలో,
ప్రతి
కొమ్మలో
అగ్ని
అంతర్భూతముగా
ఉండును.
కాని,
కొమ్మకు
కొమ్మకు
రాపిడి
కలిగినప్పుడే
అగ్ని
పుట్టును.
పెరుగులోనే
వెన్న
ఉన్ననూ
చిలికినప్పుడే
వెన్న
మనకు
లభించును.
వెన్నలోనే
నెయ్యి
ఉండినప్పటికీ
మనము
కాచినప్పుడే
నెయ్యి
వచ్చును.
నువ్వులయందే
నూనె
ఉండును.
సరైన
ప్రయత్నము
చేసినప్పుడే
అది
మనకు
చిక్కును.
ఇవన్నీ
శ్రద్ధలేనియెడల
రావు.
మానవునియందే
దివ్యమైన
ఆత్మతత్త్వము
యిమిడియుండును.
ప్రతి
వ్యక్తీ
మోక్షార్హుడే.
కాని,
ఆ
అధికారమునకు
తగిన
సాధన
జరిపినప్పుడే
దానికి
అర్హత
వచ్చును.
‘సాధనమున
పనులు
సమకూరు
ధరలోన’.
సాధనాశక్తితో
మానవునిలోని
దివ్యత్వమైన
ఆత్మశక్తిని
అభివృద్ధిచేయు
ప్రయత్నముచేయాలి.
ఆ
ఆత్మశక్తి
మన
అంతరాంతరములలో
ఉండు
దివ్యభావమే.
అది
మనకు
కనిపించుట
కష్టము.
ప్రతి
మానవుడు
విలువైన
నగలు,
నోట్లు,
డైమండ్సు
భద్రమైన
పెట్టెలో
పెట్టి
జాగ్రత్తచేస్తాడు.
విలువలేని
బుట్ట,
చట్టి,
పెట్టె
బయట
పారేస్తాడు.
సముద్రముకూడా
విలువైన
ముత్యములను
తన
గర్భములో
దాచుకొని,
విలువలేని
నత్తగుల్లలను
బయటకు
విసిరివేయును.
అదేవిధముగా
మానవునిలోని
‘ఆత్మ’
అనునది
చాలా
విలువైనది
ఉన్నది.
కాని,
విలువలేని
రూపనామములు
బయటకు
కనిపించును.
విలువలేని
రూపనామములకే
ప్రాధాన్యత.
విలువగల
ఆత్మతత్త్వమునకు
విలువలేదు.
అదేవిధముగా
రూపనామములకు
ప్రాధాన్యతనిచ్చి,
అదే
సత్యమని
భావించువాడు
నరకాసురుడు.
రూపనామములు
సత్యముకావు.
ఏనాటికైననూ
భగవంతుని
కటాక్షమునకు
గురికాక
తప్పదు.
అట్టి
అనుగ్రహమునకు
మనలోని
దురహంకారము,
క్రోధము,
అసూయ
మొదలగు
దుర్గుణములను
దూరముచేసుకోనుటకు
ప్రయత్నముచేయాలి.
జీవితములో
ఎన్నో
దీపావళులు
గడచిపోవును.
కాని,
మనలోని
అంధకారము
పోవుటలేదు.
బయట
వెలుగును
చూచి
ఆనందిస్తున్నాకాని
లోన
చీకటిని
చూచి
విచారించుటలేదు.
అందుకే
గోపికలుకూడా,
‘మబ్బుగమ్మిన
మానసమ్మున
నీదు
తేజము
నిలుపరాదా!
నా
మానసిక
హృదయవీధి
చాలా
చీకటిగా
ఉంది.
అందుకే
నీ
నామమనే
జ్యోతితో
వెలుతురు
యియ్యి’
అని
ప్రార్థించారు.
ఈ
దీపావళికి
ఇంకో
అంతరార్థము.
మనము
అనేక
జ్యోతులు
పెట్టుదుము.
కాని,
అన్ని
జ్యోతుల
దగ్గరకుపోయి
నిప్పు
ముట్టించము.
ఒక
జ్యోతిని
వెలిగించి,
అన్ని
జ్యోతులను
దానితో
వెలిగింతుము.
అందుచే
అంటింపబడిన
అన్ని
జ్యోతులూ
జీవనజ్యోతులు.
అంటించిన
ఒక్క
జ్యోతి
పరంజ్యోతి.
అందుచే
పరంజ్యోతి
అను
వెలుతురులో
అన్ని
జ్యోతులు
వెలుగుచున్నవి.
ఆ
అంటించిన
పరంజ్యోతిని,
ఆదిజ్యోతిని
మనం
మరచిపోతున్నాము.
అందుచే
అందరూ
నరకాసురులే.
ఏనాడు
మనము
ఆదిజ్యోతిని
లక్ష్యములో
నుంచుకొందుమో,
ఆనాడు
ఆ
కృష్ణుని
అనుగ్రహమునకు
పాత్రులగుదుము.
అందుచే,
ఏనాడు
మనలోని
అజ్ఞాన
అంధకారమును
పారద్రోలుదుమో-‘తమసోమా
జ్యోతిర్గమయా’-
ఆనాడే
దీపావళి.
సీతారాముల
చింతలో,
వియోగంలో
అయోధ్య
దుఃఖంతో,
అంధకారములోనిండి,
సీతారాముల
ఆగమనంతో
జ్యోతులు
వెలిగించి
ఆనందించి,
ఆడిపాడిన
దినముగా
కొన్ని
ప్రాంతములవారు
అనుసరిస్తున్నారు.
‘రామ’
అను
పదమునకు
ఆత్మను
రమింపజేయువాడు-‘రమయతీతిరామః’
అని
ఒక
అంతరార్థముంది.
ఆత్మారామ
అంటాముగాని
ఆత్మకృష్ణ,
ఆత్మశివ
అనము.
కనుకనే,
ఈ
ఆత్మ
అను
రామతత్త్వమును
మరచిపోవుటచే
ఈ
హృదయము
అను
అయోధ్య
అంధకారములో
మునిగి
ఉంటున్నది.
ఈ
ఆత్మకు
ఒక
నీడ
ఉంది.
అదే
పరమశాంతమైన,
నిర్మలమైన,
నిరాకారమైన,
నిరుపమమైన
సీత.
ఈ
పవిత్ర
శీతలమైన
సీతను
మరచిపోవుటచే
అసూయాతత్త్వములు
చేరుటచే
మన
హృదయములు
మలినమైపోవుచున్నవి.
ఏనాడు
ఆత్మను
లక్ష్యమునందు
తలంచుదుమో,
ఆనాడే
అయోధ్యావాసులకు
కలిగిన
ఆనందము,
సౌభాగ్యము
కలుగును.
కనుక,
మన
హృదయము
అను
అయోధ్యలో
ఆత్మారాముని
ప్రవేశింపజేసి,
సీత
అను
శీతలమైన
ప్రాగ్జ్యోతిని
వెలిగింపజేయవలెను.
అదేవిధముగా
శ్రీకృష్ణుడు
సత్యభామా
సమేతుడై
నరకాసురుని
వధించుటకు
అర్థము.
హృదయభూమిని
సాగుచేయువాడు
కృష్ణుడు.
ఆకర్షించువాడు
కృష్ణుడు.
అక్కడ
రమించువాడు
రాముడు.
ఇక్కడ
ఆకర్షించువాడు
కృష్ణుడు.
అక్కడ
రమించు
రాముడు
శాంతము
అను
సీతాసహితుడు.
ఇక్కడ
ఆకర్షించు
కృష్ణుడు
సత్యాసమేతుడు.
కనుక,
దుర్మార్గమైన
దుర్గుణములను
వధించుటకు
సత్యముతో
వెళ్ళాడు
కృష్ణుడు.
కృష్ణుడు
సత్యసహితమైన
కృష్ణుడు.
శాంతి
సహితుడైన
రాముడు.
ఈ
రెండింటిని
ప్రేమసహితమైన
భావములో
అనుభవించాలి.
ఇట్టి
పవిత్రభావములు
అందించు
పర్వదినములు
భారతదేశములో
ఉన్నవి.
కాని,
వాటి
అంతరార్థములు
మరచి,
దీపములు
ముట్టించి
పటాసులు
పేల్చుట
అను
ఆచారమును
దీపావళినాడు
అనుసరిస్తున్నారు.
కాని,
పవిత్రత
లేదు.
మరి
కొన్ని
ప్రాంతములలో
ఈ
దుర్గుణములను
హతమార్చుటకు
లక్ష్మీపూజగా
చేస్తున్నారు.
లక్ష్మి
అనగా
ధనలక్ష్మి,
గజలక్ష్మి,
మహాలక్ష్మి
కాదు.
3
▾
Meaning
Keep
మన
హృదయలక్ష్మి,
పవిత్రమైన
గుణముల
లక్ష్మి.
మోక్షలక్ష్మి.
ఈ
మోక్షలక్ష్మిని
ఆరాధించు
నిమిత్తము
మొదటి
దినమున
దుర్గుణములను
దూరముచేసి,
రెండవ
దినమున
ఆ
పవిత్రమైన
లక్ష్మికొరకు
ప్రార్థన
చేయాలి.
ఈ
మోక్షలక్ష్మి
మానవునికి
ముక్తిశాంతము
అనుభవించు
నిమిత్తము
పవిత్ర
మార్గము
అవలంబించాలి.
ఈవిధమైన
పవిత్రమైన
అంతరార్థములు
పవిత్ర
భారతదేశములో
పర్వదినములకు
కలవు.
నేటినుండి
మన
హృదయములలో
ఆవేశించిన
దుర్గుణములను,
దుష్టలక్షణములను
పారద్రోలి
పవిత్రమైన,
నిర్మలమైన,
నిస్వార్థమైన,
ప్రేమమయమైన
భావములుగల
ఆత్మతత్త్వము
కొరకు
ప్రయత్నించాలని
ఆశిస్తున్నాము
కనుక,
ఏ
సాధన
చేసినా
మన
హృదయములను
పవిత్రముగా
చేయు
క్రియలుగా
భావించాలి.
దినమునకు
నాలుగు
పర్యాయములు
స్నానముచేసి
శరీరమును
శుభ్రపరచుటకంటె
ఒక్క
పర్యాయము
హృదయమును
శుద్ధము
చేసిన
చాలు.
ఈవిధముగా
చిత్తశుద్ధి
కొరకు
ఈ
పర్వదినములని
భావించాలిగానీ
పాయస
పరమాన్నములతో
పొట్టనింపుకొనుటకు
కాదు.
ఈనాడు
దుర్గుణములను
దూరముచేసుకొనబూను
దినము.
అప్పుడే
మనకీ
ఆత్మానందమునిచ్చు
సద్గుణములు
మనలో
చేరును.
ఈ
అన్నింటికీ
శ్రద్ధ
అవసరం.
దీనిని
పురస్కరించుకొనియే,
‘శ్రద్ధావాన్
లభతే
జ్ఞానం’
అని
అనేక
పర్యాయములు
గీతాచార్యుడు
నొక్కి
వక్కాణించెను.
శ్రద్ధ
లేనియెడల
ఏ
ఒక్క
చిన్న
కార్యమూ
సాధించలేరు.
ఆధ్యాత్మిక
మార్గములో
ఈ
శ్రద్ధను
మరికొంత
అభివృద్ధిచేసుకొని
ఆనందాన్ని
పొందుతారని
ఆశిస్తూ
ఆశీర్వదిస్తున్నాను.
Previous
←
Enemy number one
Next
The Lotus and the Petals
→