Contents
Devotion & Sacred Story
Home
Library
Find
Shelf
Settings
←
Leave
Sathya Sai Speaks 1978 · The Lotus and the Petals
Tap a verse for its meaning
IAST
Telugu
Meaning
Continuous
The Lotus and the Petals
22 November 1978, 4th All India Seva Dal Conference, Prasanthi Nilayam
1
▾
Meaning
Keep
సర్వ
వ్యాపి
అయిన,
సర్వాంతర్యామి
అయిన,
శివస్వరూపుని
బాహ్యంతరములందు
సర్వత్ర
గుర్తించి,
వినయ
విధేయతలతో
సేవాదళ
సభ్యులందరూ
ఆ
విశ్వాసమును
అభివృద్ధి
పరచుకోవలెను.
అనేక
కల్పనలకు
గురియై,
ఊహలకు
బానిసలై,
సహనమును
కోల్పోవక,
వినయమును
వీడక,
సేవా
కైంకర్యమును
సాధించాలి.
దానముకానీ,
తపము
కానీ,
విజ్ఞానము
కానీ,
సనాతన
ధర్మాచరణ
కానీ,
సత్యధర్మాలు
కానీ,
మరే
దివ్యసేవకు
తోడురాదు
ఆధ్యాత్మిక
మార్గమందు.
అయితే,
ఆధ్యాత్మిక
మార్గమందు
పయనించు
వారికి
అంతరాయములు
అడ్డులు
కలిగేది
సహజము.
ఎంతవరకు
అహంకార
మమకారములను
దూరము
చేసిరి.
ఎంతవరకు
ఏకత్వభావము
దృఢమైనది,
ఎంతవరకు
సేవాసాధనలో
ఉత్తీర్ణులైరి.
అని
పరీక్షించుటకు
కష్టములను
కలుగజేయవలసియున్నది.
ఈ
పరీక్షలను
ఎదుర్కొని,
ఉత్సాహమును
తగ్గించక,
కర్తవ్యమును
విస్మరించక,
విజయమును
సాధించాలి.
అట్లుకాక,
రుజుమార్గమును
త్యజించి,
ధైర్యమును
కోల్పోయి,
అరి
షడ్వర్గముల
దాసులై,
అనర్హతను
సంపాదించి
జీవితమును
వ్యర్ధము
గావించకూడదు.
మీమీ
గృహములందే
కాదు,
సంఘములలోను,
దేశములో
కూడ,
వినయ
విధేయతలను
కాపాడుకొని
మెలగాలి.
అప్పుడు
మీ
కీర్తి
దేదీప్యమానముగా
జగమంతా
ఆవరించును.
సేవ
చేయుటకు
అర్హత
పొందాలంటే,
మొట్టమొదట
హృదయమును
సంస్కరింపజేయాలి.
ఈ
ప్రయత్నములో
విజయమును
సాధించినామా,
అని
మీకు
మీరే
పరికించి
తెలుసుకొనుటకు
వీలున్నది.
ఎట్టి
భావముతో,
ఏ
తలంపులవలన,
ఏ
ఉద్దేశమును
దృష్టియందుంచుకొని,
ఏ
ఆశయాల
ప్రేరణచే
సేవ
చేస్తున్నాము
అని
నిత్యమూ
పరీక్షించవలెను.
సేవయే
జీవితకర్తవ్యము.
జన్మసార్థకత,
త్యాగమే
దాని
లక్ష్యము
అని
విశ్వసించి
అట్టి
భావముల
నభివృద్ధి
చేసిన,
మాధుర్యము
ననుభవిస్తాము.
సేవాదళము
వారికి
నేనప్పుడప్పుడు
కొన్ని
సూక్తుల
నందిస్తుంటాను.
Work
is
Worship;
Duty
is
God
అనేది
ఒకటి!
Hands
in
Society;
Head
in
the
forest
అనేది
మరొకటి.
కర్మాచరణ
వలనే
కాయము
కాలమూ
పరిశుద్ధమయ్యేది.
కాలమును
పవిత్రము
చేసే
సేవాకార్యములతో
ఆ
పవిత్రయాత్రలో
మీరు
ప్రవేశించాలి,
ఇదొక
కర్మక్షేత్రము;
ప్రతియొక
కాయము
కూడ
నిష్కామకర్మల
ద్వారానే
పవిత్రతను
పొందాలి.
సేవాదళ
సభ్యులలో
ఎవరు
ఎక్కువగా
చక్కగా
పనిచేశారు
అనేది
కాదు
నాకు
ముఖ్యము.
చేసినది
ఏ
చిన్న
పని
అయినా,
ఎట్టి
భావముతో
చేశారు,
ఎట్టి
హృదయముతో
చేశారు
అది
ముఖ్యము!
మీకు
మీ
మీ
కుటుంబములలో
సంఘములో
గ్రామములో
వేరువేరుగా
కర్తవ్యాలు
బాధ్యత
లుండవచ్చును:
వాటిని
ప్రక్కకు
బెట్టి,
మీరు
పరోపకారమందు
సేవలో
ప్రవర్తించుట
ధర్మము
కాదు;
అయితే,
స్వార్ధ
రహితమైన,
ఫలాపేక్ష
లేని
సేవా
కైంకర్యమందు
కాయమును
కాలమును
వినియోగించుట
అత్యవసరము.
2
▾
Meaning
Keep
ఈ
సాధనను
అభ్యసించి
అనుసరించి
ఆనందించుట,
మీకు
మీరు
చేయవలసిన
ప్రధానమైన
సేవ.
అభిమానము,
అధికార
మదము,
మమకారము
ఇవి
సేవాదళ
సభ్యులకు
చాలా
ప్రమాదము!
ఇవన్ని
ముళ్ళచెట్లు!
ముళ్ళచెట్లు
పెంచిన
వారికి
ముల్లుగుచ్చుట
తప్పదు.
కొంతమంది,
వినయ
విధేయతలను
ప్రకటించుట,
తమకు
తాముచేసె
అగౌరవము
అనుకుంటారు,
ఇంతటి
అధికారము,
బలము,
ధనమున్నవారు
పరుల
సేవలో
నిరతులయ్యేది
తప్పుకాదా,
అని
సందేహింతురు.
అయితే,
అధికారము
దేహబలము
ధనకనక
వస్తువాహనాదులు
కదలే
మేఘములువంటివి.
మీ
జంట
ఇంట
వెంట
వుండి
కాపాడేది
మీరు
జేసిన
సేవ
మాత్రమే.
మీ
మనస్సులో
అహంకారము
ఆడంబరము
ఏ
మాత్రమూ
వుండకూడదు.
ఎవరిపై
కూడ
ద్వేషము
కోపము
అసూయ
మీలో
వుండకూడదు.
అహంకారము
ఏకత్వమును
అనేకత్వముగా
చూపించి
మోసముగావించును.
అనేకత్వమును
మరచి,
అందరిలోనూ
ప్రకాశించుచున్న
దివ్యత్వమును
తెలుసుకొని
ఏకత్వమును
గుర్తించి
వర్తించటమే
సేవ
యొక్క
పరమోద్దేశము,
ఢిల్లీ
నుంచి
వచ్చిన
సేవాదళ
సభ్యుడు
రాజేశ్
ఖన్నా
ప్రతి
సభ్యుడుకూడా
తనతో
జేబిలో
ఒక
చిన్న
మందుల
పెట్టె
తీసుకొని
వెళ్ళాలి
అని
నిర్ణయము
చేసుకొమ్మన్నాడు.
ఆయన
అందించిన
ఆదర్శము
అత్యవసరమే:
ధర్మార్థకామ
మోక్షానాం
ఆరోగ్యం
మూల
ముత్తమం.
అనారోగ్యమునకు
ఏది
కారణము?
దేహమా?
మనసా?
దేహము,
నీటి
బుడగ:
మనసు
ఒక
పిచ్చికోతి!
మానవులు
బుద్ధి
తత్వమునకు
ఆధిపత్యమిచ్చి
దానినే
అనుసరించి
ఆచరించాలి.
రాజేశ్‌ఖన్నా
ఆ
పెట్టె
చూపించి,
దానిలో
వుండవలసిన
మాత్రలు,
మందులు,
పత్తి,
బ్యాండేజి,
వీటిని
చక్కగా
నిరూపించినాడు,
దానితో
పాటు,
మానసిక
చికిత్సకు
అవసరమైన
మరి
కొంత
మందులను
మీ
మీ
హృదయమనే
జేబునందు
మీరు
ఎప్పుడూ
పెట్టుకొని
యుండాలి.
“విచక్షణ”
అనే
మాత్రలు,
“ఇంద్రియనిగ్రహము”
అనే
మిక్స్చరు,
ప్రేమ
సహనము
వీటి
రెండింటిని
పొడి
చేసి
కొంత
పవుడరు—ఇవి
మీ
హృదయమందు
తయారుగా
వుండాలి.
ఇంద్రియనిగ్రహము
యోగులకు,
బైరాగులకు
అవసరమే
కానీ,
మనకెందుకు
అని
వాదించుట
చాలా
పొరపాటు!
ఇది
నా
కారు,
నా
పేరుతోనే
రిజిస్టరు
చేసినాను;
నేనే
డ్రైవర్
కూడ.
మరి,
ఇది
నాకెందుకు
ప్రమాదము
తెచ్చిపెట్టును?
అని,
దానిలో
బ్రేకులు
బాగున్నావా
అని
పరీక్షించక,
అహంకారముతో
ఆడంబరముగా
డ్రైవ్చేసిన,
అపాయము
తప్పదు
అందువలననే
ఈ
దేహమనే
దొక
కారు;
కన్నులే
హెడ్‌లైట్స్;
కడుపు
పెట్రోల్
ట్యాంకు;
నోరు
హార్న్;
మనస్సు
స్టీరింగ్,
ధర్మార్థ
కామమోక్షములే
టైర్లు;
వాటిలోని
గాలి:
Faith.
బుద్ధియే,
Switch.
ఇంద్రియ
నిగ్రహమే
బ్రేకు;
ఇంద్రియ
నిగ్రహము
కలిగిన,
చిత్తశుద్ధి.
చిత్తశుద్ధి
కలిగిన...జ్ఞానసిద్ధి!
సేవ
అంటే,
జీవారాధన;
జీవులందరూ
దైవస్వరూపమనే
భావముతో
వారిని
ఆరాధించుట.
నోటితో
పెద్దగ
ఉపన్యాసముల
నందించుట
కన్న,
పవిత్ర
హృదయముతో,
ప్రేమతో,
సహనముతో
కించిత్తు
చేసిన
చాలు.
కర్మాచరణయొక్క
కర్తవ్యమును
ప్రత్యేకించి
విచారించాలి.
కర్మము
ఫలితము
కోసము
కాకూడదు;
ఫలితమును
పొందుటయే
ముఖ్యమని
భావించువారు,
అధికారమును
దురుపయోగ
పరచి,
ప్రజలను
పెడమార్గము
పట్టింతురు.
3
▾
Meaning
Keep
భయభ్రాంతుల
చేత
విజయమును
సాధింతురు.
భయము
పెట్టి
బెదరించి
ప్రజలను
లొంగదీసి
బలముచేత
కార్యసిద్ధి
పొందుదురు.
ఈ
రీతిగా
జయము
సంపాదించిననూ,
అది
నిజముగా
అపజయమే
అగును.
క్రమమును
ఒదలక,
సత్యాన్ని
వీడక,
ధైర్యము
జారనీయక,
సాధించిన
విజయమే
శాశ్వతమగును.
సేవాదళమువారు
యంత్రమును
పూజించి,
తాము
కూడ,
యంత్రమువలె
జడస్వభావము
పొందుచున్నారు
ఏ
సేవచేసిన,
దాని
అంతరార్థమేమి,
దానివలన
లభించే
ఆత్మోన్నతి
ఎంత,
సేవ
నందుకొనే
వానికి
లాభమేమి!
అని
విచక్షణతో
పరిశీలించాలి.
మంత్రములను
మంత్రార్థములనూ
ఆచరణలో
తెచ్చి
ఆనందించే
సుగుణ
వ్యక్తులు
కావాలి,
సభ్యులు!
ఎత్తు
పొడవు
లావు
అనేవి
Bamboo
కొనేటప్పుడు
గమనిస్తాము;
చెరుకు
కొనుకొనేటప్పుడు
దానిలోని
రసము
ఎంత
అని
గమనిస్తాము.
అట్లనే,
మనిషికి
గుణములవలనే
విలువ.
స్వయం
సాధన
వలన,
సద్గుణాభివృద్ధిగావించుకొని,
పరులకు
సేవజేసి,
తన్నుతానుద్ధరించుకోవటమే,
సేవాదళము
యొక్క
అంతరార్థము,
మరొక
“సూత్ర”మును
కూడ
నేనప్పుడప్పుడు
చెప్పుతుంటాను:
“You
cannot
always
oblige;
but
you
can
always
speak
obligingly”
అంటే
చేతినుంచి
మంచిపనిచేయుటకు
సాధ్యము
కాకపోయినా,
నోటితో
మంచి
పలుకులు
రావుటకు
ఏమి
అడ్డము?”
బాహ్యచరణలో
మీకూ
మీ
జిల్లా
కన్వీనర్లకూ
భేదాభిప్రాయాలు
రావచ్చు;
మీ
సలహాలను
వారు
పురస్కరించక
పోవచ్చు;
అయితే,
ఏ
ఏ
సంస్థల
వారు
వీటిని
తమకు
తామే
సమరసముగా
నిర్ణయించుకోవాలి
కానీ
నేను
అధికారి,
నా
మాట
జరిగేతీరాలి
అని
ఎవరూ
అహంకారముగా
ప్రకటించ
కూడదు.
పదివేల
మంది
సేవాదళ
సభ్యులు
ఇక్కడ
సమావేశమైనారే
కానీ,
ఈ
సంస్థ
యొక్క
అంతరార్థమును
పవిత్రతను
గుర్తించినవారు
చాలా
తక్కువ!
శ్రీసత్యసాయి
సేవసమితి,
శ్రీసత్యసాయి
మహిళా
విభాగ్,
శ్రీసత్యసాయి
సేవాదళము,
శ్రీసత్యసాయి
భజనా
మండలి
శ్రీ
సత్యసాయి
బాలవికాస్
—
అన్నిటిలో
శ్రీసత్యసాయి
ప్రాణస్వరూపముగా
వున్నాడు.
అదే
అన్నిటికిని
అంతర్సంబంధము,
ఒకే
హస్తమందు
బ్రొటినివ్రేలు
Thumb
అది
సేవాసమితి!
మిగిలిన
నాలుగు
సంస్థలతో
కలసిమెలసి
అందరి
యోగక్షేమమును,
అభివృద్ధిని,
కార్యకలాపాలను
ప్రోత్సహించే
జవాబ్దారి,
సమితికున్నది.
చూపుడువేలు
మహిళా
విభాగ్.
మధ్యనున్నది.
సేవాదళము
ఉంగరవ్రేలు
భజనా
మండలి,
అందరికీ
ఉల్లాసము,
ఉత్సాహములనిచ్చేది.
తరువాత,
అన్నిటికన్న
పొట్టి,
చిన్నది,
ఆ
వ్రేలే
బాలవికాస్.
నిర్మల
నిశ్చల
నిస్వార్ధహృదయములు
కలిగిన
లేతమనస్సులు!
అయితే,
దీనిని
గమనించండి:
ఎవరికైనా
బుద్ధిచెప్పాలంటే,
మనము
వారి
ఎదుట
చేయు
హెచ్చరికయందు
బాలవికాస్
వ్రేలే,
ముందు!
అంతే.
చిన్న
పిల్లలనుంచి
పాఠము
నేర్చుకొని
ద్వేషాసూయలను
మాని
స్వార్థమును
నెట్టివేయాలి,
అని
అర్థము
ఒకే
హస్తములోని
ఐదువ్రేళ్ళవలే,
ఈ
ఐదు
సంస్థలూ
ఏకం
కావాలి.
దళములన్నీ
కమలములో
మధ్యనున్న
‘కర్ణికా’నుంచి
వికసించి,
దానినుంచి
పోషింపబడి
యుండుటచేతనే,
అంత
అందముగా
ప్రకాశించేది.
కాబట్టి,
మీరందరూ
సత్యసాయి
ఆదర్శాలను
అర్థము
చేసుకొని,
అనుసరించి,
తరించాలి
అనేది,
నాఆశ.
ఆదర్శాలను
అనుసరించక
పోతే,
దళములు
విడివిడిగా
రాలిపోవును.
వేరే
భావములకు
చోటివ్వక,
భేదము
అసూయ
అహంకారము
వీటిని
దూరము
చేసుకొని,
ఒకతల్లి
బిడ్డలవలె,
ఏకోహం
బహుస్యాం
అనే
ఆదరము
నాదరించి,
ఒకే
ఆత్మస్వరూపము
అనేక
రీతిగా
మన
ముందు
కనబడుచున్నది
అనే
దృఢముతో
సేవలో
దిగండి.
4
▾
Meaning
Keep
మీకు
ఎన్నడు
విజయమే.
సత్యసాయి
సంస్థలో
ప్రేమయే
ప్రధాన
సాధన.
సభ్యులలో
అసూయ
కాని,
అశ్రద్ధ
కానీ
ఆడంబరము
కానీ
అంకురించిన,
అది
సంస్థకే
ద్రోహము
చేసినట్టు.
గడచిన
కాలము
గడచిపోయినది;
ఉన్నది
స్థిరము
కాదు;
రేపు
మనది
కాదు.
కాబట్టి,
గడచిన
దానికి
చింతించక,
ఈనాటి
నుంచి
అయినా,
అన్యోన్యత,
అనురాగము,
ప్రేమతత్వములను
పెంచుకొని,
కార్యక్షేత్రమును
ప్రవేశించండి,
పరుల
దోషములను
వెదకే
దెందుకు?
తన
దోషములను
వెతికితే,
దానికంటే
లాభము,
మంచి
ఫలితము.
పరులలో
దోషము
కనిపించిన,
అది
వారిలోనిది
కాదు,
మీలో
ఉన్న
దోషమే.
ఏ
దోషమూ
లేనివానికి,
ఎక్కడను
దోషమే
కనిపించదు.
మీరందరూ
చేయవలసిన
పనిని
చేస్తున్నారా,
అని.
నాకు
అనుమానమే!
ఇపుడు
గ్రామసేవ
అంటారు.
గ్రామములలో
రోడ్డులు
తీర్చిదిద్దడము,
మోరీలను
సరిచేయటము,
బజారులను
ఊడ్చటము,
ఉపన్యాసముల
నందించటము,
భజన
చేయించటము
ఇట్టి
పనులను
మీరు
చేయుచున్నారు.
నీరు
తాగే
టంబ్లరును
బయట
శుభ్రపరిచితే
చాలా?
సత్యసాయి
సంస్థలవారు
గ్రామప్రజలయందు
మనః
పరివర్తన
జరుగునట్టి
సేవాకార్యక్రమమును
ఏర్పరచుకోవాలి.
ఒక
పల్లెలో
1000
ప్రజలుంటే,
వారిలో
ఎంత
మంది
దురభ్యాసాలకు,
దురాచారాలకు,
దుర్గుణములకు
లోనైయున్నారని
తెలుసుకొని,
జూదం
త్రాగటము,
వీటిని
నిలుపుటకు
ప్రయత్నించాలి.
చక్కని
బోధనిచ్చి,
వాళ్ళ
ప్రీతి
గౌరవములను
సంపాదించి,
వాళ్ళ
దురభ్యాసాల
వలన
కుటుంబమున
కెంత
బాధ
అని
నచ్చచెప్పి,
వాళ్ళ
కాళ్ళు
పట్టుకొని
అయిన
సన్మార్గమునకు
తీసికొని
రావలెను.
రోడ్డులు,
ఆస్పత్రులు
నీరు
సప్లై
మొదలగువాటిని
ప్రభుత్వము
చూచుకొనును.
సత్యసాయి
సంస్థలు
చేయవలసినది
ఇది:
ప్రతి
గ్రామములోను
సత్య
ధర్మ
శాంతి
ప్రేమల
అభివృద్ధి!
ఇట్టి
దుర్భావములు
దుర్గుణములు
మీలో
కూడ
చేరక
జాగ్రత్తగా
వుండండి.
మీ
ఊహలు
తలంపులు
వేషములు
చూపులు
మాటలు
అన్నీ
పవిత్రముగా
వుండాలి.
అనుకరణములో
ప్రవేశించకూడదు.
బెల్‌బాటం
సైడోబర్న్స్
ఇట్టివి
పెట్టుకొని
సేవ
ఎట్లుచేస్తారు
దానిని
స్వీకరించే
వారెవరు?
మీ
హృదయమును
మీరు
అనుసరించండి;
follow
the
Master.
Master
అంటే,
మీలోని
ఆత్మారాముడే!
Face
the
Devil
Devil
అంటే
అరిషడ్వర్గాలు.
Fight
the
end.
ఏది
అడ్డువచ్చినా,
సత్సంకల్పమును
సడలించరాదు.
Finish
the
Game
నిత్య
సత్య
భక్తులుగా
తయారు
కావాలి.
మీలోని
శివత్వము
ఉచ్చ్వాస
నిశ్వాసమందు
ప్రతి
క్షణమూ
మీకు
“సోహం”
“సోహం”
అని
ఉపదేశించుచున్నది.
ఆ
సోహం
స్మరణ
నిలిచినపుడు,
జీవుడు
శవం
అయిపోతాడు!
“సోహం”
తత్వము
అన్ని
జీవులయందూవున్నది.
కాబట్టి
పరులకు
మోసముచేయక,
వారిని
నొప్పించక,
అందరియందూ
వెలుగుచున్న
పరంజ్యోతి
స్వరూపుడైన
పరమాత్ముని
ఆరాధించండి.
ఈ
సమావేశము
భవిష్యత్తుకు
చక్కని
పునాది
వేసియున్నది.
“అదిగో!
నా
ఆరాధనా
దైవము”
అని
అందరిని
స్వాగతించాలి.
మీ
State
President
లు
కానీ
ఎవరేకానీ,
తాము
నడచి
మీకు
త్రోవచూపించాలి.
5
▾
Meaning
Keep
వెనుకనుండి
నూకేవారు
కాకూడదు.
ఏదైనా
సమస్యలు
వచ్చిన,
మనలోనే
దర్శించుకొని
కూర్పులు
మార్పులు
చేసుకొనేది
ఉత్తమ
మార్గము.
ఈసంస్థలో
అన్నిటికీ
అందరికీ
ఒకే
మార్గము.
ప్రేమమార్గము
దానిననుసరించిన,
దుఃఖనివృత్తి,
ఆనంద
ప్రాప్తి.
Previous
←
One Flame, Billion Lights
Next
Faith Is the Foundation of the Spiritual Path
→