Contents
Devotion & Sacred Story
Home
Library
Find
Shelf
Settings
←
Leave
Sathya Sai Speaks 1979 · The Worship of Images
Tap a verse for its meaning
IAST
Telugu
Meaning
Continuous
The Worship of Images
6 February 1979, Brindavan
1
▾
Meaning
Keep
భగవంతుడు
సర్వ
వ్యాపకుడైననూ,
వ్యక్తిగతముగా
పొందే
నిమిత్తమై
అర్చన
ద్వారా
ఆరాధన
కర్మల
ద్వారా
మానవులు
ప్రయత్నింతురు.
కొన్ని
తెగలవారు.
భగవంతుడు
ఒక
గుడిలోపల
ఉంటారా?
రాయి,
కాయితములలో
వుంటారా
అని
వాదిస్తారు.
ఇది
సరికాదు.
అర్చన
పూజ
భజనల
వలన
భగవంతుని
పొందుటకు
వీలున్నది.
పూజ
నిజముగా
ప్రథమ
సోపానము.
ఆహార
నిద్రలను
మాని
అరణ్య
మధ్యమందు
తపస్సాచరించి
దాని
ఫలితముగా
భగవదనుగ్రహము
పొందినవారు
బహుమంది
యున్నారు.
అయితే,
పూజ,
అర్చన,
భజన,
సంకీర్తన
మొదలగు
ఆరాధనా
మార్గము
సులభమైన
మార్గము.
మీరాబాయి,
సక్కుబాయి,
సూరదాసు,
కబీర్దాసు,
శంకరాచార్య
వీరందరూ
ఈ
మార్గమునే
అనుసరించి
పరతత్వమును
అనుభవించి
ఆనందించిరి.
ఇవంతా
నిరుపయోగమైన
పనులు
దానికి
వినియోగించే
కాలము
వ్యర్థముఅనేవాదము
సరిఅయితే
వీరందరూ
సర్వవ్యాపకమైన
భగవత్
తత్వమును
ఒక
రూపమందు
ప్రత్యక్షముగా
ఎట్లుచూడగలిగారు
?
అర్చన,
పూజ,
జపము
లేక
ఇది
సాధ్యముకాదు.
ఇంగ్లీషు
భాషలోని
అన్ని
గ్రంథములలోను
కనబడేది
26
అక్షరాలే.
ఆ
అక్షరాలను
వ్రాయటము,
చదువటము,
చెప్పకుండా
నేర్చకుండా
ఒకరిని
ఎట్లు
విద్యావంతుడనేది?
అర్చన
చేసే
విగ్రహము
కానీ
చిత్రము
కానీ
దైవము
యొక్క
చిహ్నము
మాత్రమే.
దైవమును
రాయిగా,
కాయితముగా
మార్చరాదు.
సర్వవ్యాపకత్వమైన
భగవంతుని
హిందువులు
ఒక
విగ్రహములో
చూస్తారంటే
హాస్యాస్పదముగా
వున్నదని
ఆళ్వార్
మహారాజు,
స్వామి
వివేకానందుని
ఎదుట
వాదించినాడు.
వివేకానంద
దానిని
విని
పక్కున
నవ్వాడు.
మంత్రిని
పిలిచి,
గోడపై
వుండిన
ఆ
మహారాజు
యొక్క
పెద్ద
చిత్రమును
క్రిందకి
తీసిపెట్టమన్నారు.
“మంత్రి!
ఆ
చిత్రముపై
ఉమ్మివేయి.
క్యాన్వాస్
కలర్
తప్ప
ఇంకేమి
వున్నది
దానిలో?”
అన్నారు.
“అది
నీ
మహారాజు
కాదు”
అన్నారు.
అయితే
మంత్రిగారు
భయపడి
భక్తి
విశ్వాసములతో
దాని
యందలి
అంజలి
బద్ధుడై
నిలిచాడు.
అంతే!
ఆ
రూపము
మహారాజువలే
ఆదర్శనీయమే
అని
అందరూ
వివేకానందకు
తెలిపిరి.
సర్వవ్యాపకుడైన
భగవంతుడు
సర్వత్ర
వుండినప్పటికినీ
విగ్రహములను
ఆధారము
చేసుకుని,
ఆధేయమును
ప్రత్యక్షముగా
దర్శిస్తాము.
ఆధారమైన
రూపమును
పూజించి
ఆరాధించి
శాస్త్రరీతిగా
షోడశోపచారములతో
ప్రత్యక్ష
స్వరూపముగా
భావించితే,
తప్పక
చిత్తశుద్ధి
కలిగి
భగవంతుడు
అంతఃకరణములో
స్పష్టముగా
ప్రతిబింబిస్తాడు.
అట్లుకాక,
అది
కాయితము
అని
భావించిన,
ఫలితము
కూడ
అంతే.
మానవుడు
చిత్తశుద్ధికి
తగిన
కృషి
చేయవలెను.
మలిన
పాత్రయందు
మంచి
పదార్థము
పాకము
చేసినపుడు
దుర్వినియోగమగును.
మంచి
విత్తనమును
సారహీనమైన
భూమిలో
పాతిపెట్టితే
లాభము
లేదు.
2
▾
Meaning
Keep
చిత్తశుద్ధిలేని
పూజ
కాలము
వ్యర్థము
చేసిన
కర్తవ్యము.
అయితే
విశ్వాసము,
ప్రేమతోకూడిన
చిన్న
పూజా
విధానము
ననుసరించిన
ఫలితము
ఎక్కువ.
ఒక
గుమస్తాను
నియమించే
ముందు
ఆయన
అర్హతను
పరిక్షిస్తాము.
కలెక్టర్గారికి
కూడా
అనుభవము
ఐ.ఎ.ఎస్.
ఇత్యాది
పరీక్షలలో
పాస్
కావటము
మొదలైన
అర్హతలుండాలి.
అట్లనే
భగవత్
సాక్షాత్కారమునకు
చిత్తశుద్ధి
తప్పనిసరిగా
వుండి
తీరాలి.
తిరుత్తొండర్
అనే
ఆళ్వార్
చిత్తశుద్ధితో
తాను
విగ్రహారాధన
చేపట్టినట్లు
వెల్లడించి
యున్నాడు.
విగ్రహారాధన
చేయునపుడు
రూపమును
దర్శించాలి
కానీ,
ఏ
పదార్థము
అని
విచారణ
చేయకూడదు.
రూపమును
వదలివస్తువు,
వస్తువులేనిరూపము
వుండదు.
రాయిపై
దృష్టినిలిచితే
దైవము
కనబడదు.
దైవముపై
దృష్టి
నిలిచితే
రాయి
కనబడదు.
భారతీయులు
దైవమును
రాయిగా,
కాయితముగా
ఆరాధించుటలేదు.
వారి
భావము
దైవమే
ఆ
రాయి
అని
కాదు.
ఈ
రాయికూడా
దైవమే
అనేదే!
ఈ
తత్వమును,
ఇట్టి
సత్యమును
గుర్తించి
సర్వవ్యాపకమైన
దివ్యత్వమును
దక్షిణేశ్వర
కాళీ
విగ్రహమందు
సాక్షాత్కరించుటకు
రామకృష్ణ
పరమహంసకూడ
పూనుకున్నాడు.
ముఖ్యముగా
చిత్తశుద్ధి
సంపాదించుటకు
కాలమును
వ్యర్థముచేయక,
సత్సంగము,
సత్చింతన,
సద్భావములందే
గడపాలి.
నిజముగా
సత్కర్మలను
చేయుటయందే
ఆనందము.
గీతను
బోధించినపుడు
కృష్ణుడు
అర్జునుని
“కురునందన”
అనే
పేరుతో
పిలుస్తాడు.
“కురు”
అంటే
పనిచేయు
“నందన”
అంటే
ఆనందపడేవాడు
కురునందన
అంటే
పనిచేయుటలోని
ఆనందమును
అందుకునేవాడు.
పని
లేకపోతే
దుఃఖించేవాడు
అని
అర్థము.
మీకు
ఆదివారము
వచ్చినది
అంటే
ఆనందము.
ఆనందము
అయితే,
అది
Holiday
కాదు
Holy
day.
నిర్మల
చిత్తము
కలిగిన
భక్తులపేరు
స్మరించిన
చాలు.
పంచభూతములు
వశమగును.
పిడుగు
నివారించేకొరకు
అర్జునుని
తొమ్మిది
పేరులు
స్మరించేది
రూఢి.
దానికే
త్యాగరాజు,
కబీర్
మొదలైన
భక్తుల
ఆరాధన
చేస్తే
భగవంతునికి
ప్రీతి.
చిత్తశుద్ధితో
హృదయపూర్వకముగా
శరణాగతికి
పూనుకోవాలి.
అపుడే,
వాడు
నిజమైన
భక్తుడు.
అద్దము
ముందు
నిలుచుకుని,
మూడు
వ్రేళ్ళను
చూపిస్తే
దాని
లోపల
నుండి
మూడువ్రేళ్ళు
నీకు
కనిపించును.
“భగవంతుడా!
నీకు
నా
తనమనధనములంతా
అర్పితం”
అంటే
భగవంతుడుకూడా,
నీ
యోగ
క్షేమములను
తానే
వహిస్తాడు.
Previous
←
Work for peace
Next
The Ugādi Message
→