Contents
Devotion & Sacred Story
Home
Library
Find
Shelf
Settings
←
Leave
Sathya Sai Speaks 1979 · The Ugādi Message
Tap a verse for its meaning
IAST
Telugu
Meaning
Continuous
The Ugādi Message
28 March 1979, Ugādi, Hyderabad
1
▾
Meaning
Keep
“మంచికాలము
పదవులు
మంచి
బ్రతుకు,
కోరుచుందురు
మనుజులు
కోరబోరు
మంచి
బుద్ధులు
జ్ఞానంబు
మంచినడత;
ఇంతకన్నను
వేరెద్ది
యెరుక
పరతు
?”
“చెప్పుట
సులభంబు
చేయుట
కష్టంబు,
ధాతకైన
వాని
తాతకైన;
చెప్పుట
కంటెను
చేయుట
శ్రేయంబు,
ఉన్న
మాట
తెలుపుచున్న
మాట.”
పవిత్రాత్మ
స్వరూపులారా!
ఈనాడు
పవిత్రమైన
ఉగాది
పర్వదినము,
గతించిన
సంవత్సరానికి
వీడ్కోలు;
వచ్చిన
సంవత్సరానికి
పుష్పాంజలి
స్వాగతం.
ఈ
సిద్ధార్థిలో
మన
కాలం
కర్తవ్యం
సార్థకం
కావాలని
ఆకాంక్ష.
నవ
వసంతం
సమస్త
చరాచర
ప్రపంచానికి
ఆయురారోగ్యాలు
సద్బుద్ధులు
ఇవ్వాలెనని
ప్రార్థన.
కడచిన
సంవత్సరపు
మధురానుభూతులు
కొన్ని
విషాదగతాలు
కొన్ని
మానసంపైన
కదులుతునే
ఉన్నవి.
ఈ
అనుభూతులు
మనకు
చక్కని
గుణపాఠములు
నేర్పుతాయి.
ఎవరికి
వారు
కడచిన
సంవత్సరంగూర్చి
విచారిస్తే
ఆకాలంలో
ఎంత
స్వార్థానికి
ఉపయోగమైనది
సేవకెంత
వినియోగమైనది
తెలుస్తుంది.
ఈనాడు
మానవుడు
భౌతికంగా
వైజ్ఞానికంగా
కొంత
అభివృద్ధిని
సాధించినాడు
కాని
నైతికంగా
పతనమై
పోయినాడు.
2
▾
Meaning
Keep
స్వార్థంతో
అహంకారంతో
దిగజారిపోతున్నాడు.
ఇది
కేవలము
నిరుపయోగము.
ఈ
పతనానికి
కారణము
ఏమిటి?
స్వార్థము,
అజ్ఞానము,
అవిద్య
అనేవే
కారణములు.
మనిషియొక్క
ప్రతిమాటకు
క్రియకు
తలంపుకు
వెనుక
స్వార్థం
కదలాడుతున్నది.
విముక్తి
కోరేవారు
దీనిని
జ్ఞానాగ్నిచేత
దగ్ధంచేయాలి.
లేక
పోతే
మానవునికి
మనుగడయే
లేదు.
మానవుడంటే
ఎవరు?
మంచి
ఊహలు
జ్ఞాపకములు
భవిష్యత్తు
కలవాడు.
మంచి
భవిష్యత్తుకు
ఆధారం
మంచి
తలంపుల
పంట.
దీనిని
ఆత్మతత్త్వంలో
నిరూపించాలె.
కుర్చీ
కర్రలో
లేదు,
మనస్సులో
లేదు.
అట్లాగే
ఆత్మతత్త్వంకూడ
దేశకాలాలకు
అతీతమైనది.
అఖండమైన
యిట్టికాలాన్ని
దుర్వినియోగం
చేయవద్దు.
కాలమును
కర్మను
కర్తవ్యమును
మంచిగా
వినియోగించాలి.
కాలం
క్షణక్షణమూ
మారుతుంది.
జీవితం
నీటిబుడగవంటిది.
ఆయువు
చిల్లులకుండలోని
నీరువంటిది.
ఇది
గమనించక
పోవటం
అజ్ఞానానికి
మూల
లక్షణం.
మనలోని
లోపాలను
దిద్దుకోవటం
ఈనాడు
అత్యవసరము.
మానవ
జీవితంలో
నిత్య
సత్యమైనదానిని
గుర్తించి
కాలమును
సద్వినియోగం
చేయండి.
మన
భారతదేశంలో
56400
కుగ్రామాలున్నాయి.
ఈ
పల్లెల
పరిస్థితి
చాలా
విచారకరంగా
దయనీయంగా
ఉంది.
పల్లెలలో
ఉండే
సోదర
మానవులను
ఆదుకొని
తమస్థాయికి
తీసుకరావటానికి
పట్టణవాసులు
సమాజసేవా
కార్యక్రమాలలో
నిమగ్నులు
కావాలె.
ఈనాడేది
చేసినా
ఏది
తలచినా
స్వార్థంతోనే.
వ్యర్థులమై
పోతున్నాము.
ఇక
పరార్థము
గుర్తించేది
ఎప్పుడు?
అనేక
ఆశలు
పెట్టుకొని
మోసపోతున్నాము.
వేదిక
ఎక్కి
ఉపన్యాసాలు
చేస్తున్నాము.
కాని
చెప్పినది
చేయటంలేదే.
“చెప్పవచ్చు
కోటి;
చేయరు
ఒక్కటి”.
అందుకే
“ఉత్తిష్ఠ
జాగ్రత
ప్రాప్య
వరాన్నిబోధత”
అన్నది
ఉపనిషత్తు.
వేదిక
ఎక్కి
సోదరీ
సోదరులారా
అంటున్నాము.
అందరం
సోదరుల
మనుకుంటున్నాము.
కాని
నిజమైన
సోదరులే
ఆస్తులకోసం
పోరాడుతూ
సుప్రీంకోర్టుల
వరకు
పోతున్నారు.
కనుక
వట్టి
మాటలుగా
సోదరులమనుకోవటం
కంటే
అంతకంటే
మిన్నయైన
ఆత్మభావం
పెంచుకోవాలి.
దైవ
పితృత్వమూ
మానవ
సోదరత్వమూ
అప్పుడే
సార్థకమౌతవి.
ఈనాడు
పవిత్రమైన
ఉగాది
దినం.
విందుభోజనాలు
చేయటం
కొత్తబట్టలు
కట్టుకోవటంతో
సరిపోదు.
నూతనసంవత్సరం
నూతనోద్యమం
ప్రారంభించండి.
పల్లెటూరి
వారు
అనేక
బాధలు
పడుతున్నారు.
వాళ్లకు
సరియైన
వైద్య
విద్యా
సౌకర్యాలు
లేవు.
త్రాగడానికి
మంచినీళ్లు
లేవు.
మరుగుదొడ్లు
లేవు,
తినడానికి
తిండిలేదు.
వాళ్ళకు
ఈ
సౌకర్యాలు
కల్పించే
సేవ
చేసి
దానిద్వారా
దైవత్వాన్ని
చూడండి.
ఈనాడు
శ్రమపడేవాడు
కావాలె.
వట్టిమాటలు
చెప్పేవాడుకాదు.
మనది
భరతభూమి.
కర్మభూమి.
శ్రమపడటమేకర్మ.
అప్పుడే
ఇది
కర్మభూమి
ఔతుంది.
భగవద్రతి
కలిగినదే
భరతభూమి.
కనుక
శ్రమించి
పల్లెసీమల
వారిని
ముందుకు
తీసుకవచ్చి
భగవద్రతిని
పొందండి.
ఈనాడు
మన
బ్రతుకులు
దారేషణ
ధనేషణ
పుత్రేషణ
అనే
ఈషణ
త్రయంతో
మలినమై
పోయినవి.
ధనం
మానవుని
మత్తుని
ఉన్మత్తుని
చేస్తుంది.
ధనం
అవసరమే.
కాని
దానికి
ఒక
హద్దుఉండాలె.
మితిమీరిన
ధనం
మతిహానిచేస్తుంది.
ధనం
సంపాదించటం
కంటే
సంపాదించిన
దానిని
కర్చుపెట్టడం
కష్టం.
మిగిలిన
ధనాన్ని
దాచటం
మరీకష్టం.
ఈ
కష్టాలలో
కొన్ని
సుఖాలు
లేక
పోలేదు.
కనుక
ఈ
ధనాన్ని
పల్లెసీమల
వారికి
దీనులకూ
వెచ్చించి
సద్వినియోగం
చేయండి.
ధన
మూలం
మిదం
జగత్
కాదు.
ధర్మమూల
మిదం
జగత్.
ధనం
పెరిగితే
పశువుకు
కొమ్ములు
పెరిగినట్లు
అశాంతి.
ధనం
వెంట
దుఃఖం
కూడా
పెరుగుతుంది.
ధనమున్న
వానిని
ఒకవైపు
ప్రభుత్వము
మరొకవైపు
బంధువులు
ఇంకొకవైపు
దొంగలు
బాధిస్తారు.
ధనమున్నవాడు
పడే
బాధ
దైవానికి
తెలుసు.
పుత్రులకోసం
ధనం
ప్రోగుచేసిన
వారు
పుత్రుల
మూలంగానే
బాధలు
పడుతున్నారు.
కనుక
దానధర్మాలు
చేసి
మీ
ధనమును
సార్థకం
చేసికొనండి.
సత్యసాయి
సంస్థలవారు
ప్రతి
పల్లె
తిరిగి
ఆ
పల్లెటూరివారి
జీవితాలను
బాగుచేయాలి.
సత్యసాయి
సంస్థలవారికి
ఇదొక
క్రొత్త
ఉద్యమము.
నేను
ప్రతి
పల్లెకు
వస్తాను.
3
▾
Meaning
Keep
ప్రభుత్వం
ఏమేమో
అంటుంది.
దానితో
ప్రమేయంలేకుండా
కుల
మత
జాతి
వర్గ
విచక్షణ
లేకుండా
సత్యసాయిసంస్థలు
ఈనాటి
నుండి
పల్లెసీమలనుద్ధరించే
కార్యక్రమాలు
చేపట్టి
ప్రతి
గ్రామం
వెళ్ళి
వారికి
విద్యా
వైద్య
సౌకర్యాలు
కల్పించవలెనని
కోరుచున్నాను.
ధ్యాన
తపములు
స్వార్థానికే
ఉపయోగపడుతాయి
కాని
త్యాగముచేత
లోకకల్యాణం
జరుగుతుంది.
“త్యాగే
నైకే
అమృతత్త్వ
మానశుః”
అని
త్యాగమును
అందుకే
ఉపనిషత్తులు
మోక్షకారణముగా
చెప్పినవి.
కాని
ఈనాటి
నుండి
సత్యసాయి
సంస్థలవారు
త్యాగం
ప్రదర్శించి
పల్లెవారికి
అనుకూలాలు
కల్పించవలెనని
కోరుతున్నాను.
అంతో
ఇంతో
నీతి
నిజాయితి
ఇప్పటికీ
పల్లెలలో
మిగిలిఉన్నది.
పట్టణాల్లోలేదు.
కనుక
డబ్బు
గల
వారంతా
ఈ
పల్లెటూరి
వారిని
అభివృద్ధి
పరుస్తారని
ఆశిస్తున్నాను.
పర్వదిన
మంటే
పాత
తోరణాలు
తీసివేసి
కొత్తవైన
పచ్చతోరణాలు
కట్టుకొనటంకాదు.
పాత
దుస్తులు
తీసివేసి
కొత్తబట్టలు
కట్టుకొనటంకాదు.
ఇంతమాత్రం
చాలదు.
పాతభావాలు
తీసివేసి
కొత్తభావాలకు
ప్రోది
చేయండి.
చేదు
తీపి
కలిపిన
ఉగాది
పచ్చడి
కష్టసుఖముల
సమత్వానికి
చిహ్నం.
పల్లెసీమల
సేవ
చేయడానికి
చిన్నప్పటి
నుండి
పిల్లలకు,
విద్యార్థులకు
తరిఫీదు
ఇవ్వాలి.
మన
దేశంలో
ఈనాడు
255000
మంది
పిల్లలున్నారు.
వీళ్ళల్లో
40
శాతం
బిచ్చమెత్తుకుంటున్నారు.
ఇట్టి
కష్ట
పరిస్థితుల్లో
మనం
ఊరకుండటం
మంచిది
కాదు.
జప
సాధనలు
కట్టిపెట్టి
మానవ
సేవే
మాధవ
సేవ
అనే
భావంతో
త్యాగంతో
శ్రమతో
వాళ్ళను
ఉద్ధరించవలె.
మీరంతా
రాజకీయ
కుల
మత
భేదాల
కతీతంగా
పవిత్రమైన
భావనతో
మీ
మీ
శక్త్యనుసారం
వీరికి
సేవ
చేయటమే
ఈ
నూతన
సంవత్సర
దీక్షగా
పూనండి.
ప్రతి
సంవత్సరానికి
స్వాగతమే.
ప్రతి
సంవత్సరానికి
వీడ్కోలే.
దుఃఖానికి
సుఖానికి
ఆత్మవిశ్వాసమే
రక్ష.
అది
లేకపోతే
మానవత్వం
క్షీణిస్తుంది.
ఈ
భావంతో
సేవ
చేస్తే
మన
దేశం
ఇతర
దేశాలకు
ఆదర్శవంతంగా
ఉంటుంది.
మేము
భారతీయులం
అని
చెప్పుకుంటాముగాని
భారతీయ
సంస్కృతిని
ఏమి
పోషిస్తున్నాము?
ఆధ్యాత్మికాభివృద్ధికి
ఆత్మవిశ్వాసమే
ముఖ్యం.
కనుక
పల్లెల
సేవే
దైవ
సేవగా
భావిస్తారని
ఆశిస్తూ
ఆశీర్వదిస్తున్నాను.
Previous
←
The Worship of Images
Next
Guardians – The Triad of D
→