Contents
Devotion & Sacred Story
Home
Library
Find
Shelf
Settings
←
Leave
Sathya Sai Speaks 1979 · The Prema of the Ātma
Tap a verse for its meaning
IAST
Telugu
Meaning
Continuous
The Prema of the Ātma
14 August 1979, Kṛṣṇāṣṭamī, Prasanthi Nilayam
1
▾
Meaning
Keep
His poems 314
ఉ
॥
చక్కెర
కంటె
తీపి,
దధిసారము
కంటెను
రుచ్యమౌను
కెం
పెక్కిన
తేనెకన్న
అతి
తృప్తినిడున్
మరి
పల్క
పల్క
పెం
పెక్కుచునుంటచే
అమృతమే
యనిపించును
గాన
నిత్యమీ
చక్కని
దాని
మీరు
మది
సంస్మరియింపుడు
కృష్ణ
నామమున్
నిత్యమున్
మదిలో
స్మరియింపుడు
కృష్ణ
నామమున్.
ప్రేమ
స్వరూపులారా!
సువిశాల
జ్ఞానతత్త్వాన్ని
స్వీకరించలేని,
జీవిత
అంతరాంతరాలలో
ప్రవేశింపలేని
నేటి
మానవులు
విశ్వశ్రేయస్సును
సాధించుట
అసాధ్యమైన
కార్యము.
విశ్వశ్రేయస్కరము
సమాజశ్రేయస్కరముపై
ఆధారపడి
ఉంటుంది.
సమాజము
యొక్క
శ్రేయస్కరము
మానవునిపై
ఆధారపడి
ఉంటుంది.
ఏతా
వాతా
విశ్వశ్రేయస్సు,
సమాజ
శ్రేయస్సు,
వ్యక్తి
శ్రేయస్సు,
ఇదిత్రిమూర్తిస్వరూపాత్మకంగా
గోచరిస్తూ
ఉంటుంది.
అన్యోన్యాశ్రితము.
అవినాభావసంబంధము.
ప్రపంచము
యొక్క
శ్రేయస్కరము
కేవలము
మానవునిపై
ఆధారపడి
యుండటం
చేత
వ్యక్తిత్వము
యొక్క
దివ్యత్వాన్ని,
గుర్తించుకోవాలి.
ప్రపంచము
శ్రేయస్కరము
కానిదే
క్షేమంకరము
కానేరదు.
క్షేమంకరము
కానప్పుడు
శాంతి
లభించదు.
ఏనాడు
శాంతి
లభించదో,
ఆనందము
మనకు
అతిదూరము.
ఆనందము
అతిదూరమైన
వ్యక్తి
ఆత్మతత్త్వమును
ఏరీతిగా
గుర్తించగలడు?
ఈనాడు
లోకములో
శాంతివచనములు
చెపుతూ
అశాంతికి
సంబంధించే
కార్యములు
ఆచరించే
వ్యక్తిత్వము
అధికం
కావడం
చేతనే,
ఆధ్యాత్మిక
మార్గము
అత్యంతదూరముగా
ఉండవలసివచ్చింది.
జీవితములో
వివిధ
పరిధుల
మధ్య,
సామరస్యము
సమంజసము
ఉండినప్పుడే
జీవితము
అర్థవంతమవుతుంది.
ఎన్ని
పర్యాయములు
లెక్కించినప్పటికినీ,
పరమానందయ్య
శిష్యులకు
ఒక్కటి
తక్కువగానే
కనిపిస్తూవచ్చింది.
అటులనే
అంతా
తెలుసుకున్నామనే
వ్యక్తులు
ఆకాశమునకు
ఎగిరినప్పటికినీ.
అశాంతికి
గురికావటములో,
ఆనందాన్ని
కోల్పోవటములో
ఉన్న
రహస్యము
ఏమిటి?
ఇది
లెక్కలలోని
వ్యత్యాసమా?
చుక్కలను
లెక్కించినప్పటికినీ,
చంద్రుని
తాకినప్పటికినీ,
తనను
తాను
గుర్తించుకోలేని
వ్యక్తి
సమత్వాన్ని
ఏనాటికినీ
పొందలేడు.
సమర్థతను
ఏనాటికినీ
సాధించలేడు.
సమర్థత
అనేది
బాహ్యప్రపంచమునందు
దొరికేదికాదు.
అంతర్దృష్టియందే
లభ్యమౌతుంది.
సమర్థతను
మనం
సాధించినప్పుడే
నిజద్రష్టలు
కాగలము.
నిజద్రష్టకు
మాత్రమే
ఆనందము
ప్రాప్తించును.
ఈనాడు
లోకములో
బంధనలు
ఏమిటో
గుర్తించినప్పుడే
దాని
విముక్తికి
ఉపాయములు
వెతుక్కొనుటకు
అవకాశముంటుంది.
కానీ
ఈనాటి
మానవుడు
బంధనలంటే
ఏమిటో
తాను
గుర్తించుకోలేని
అవ్యక్తములో
తానుంటున్నాడు.
2
▾
Meaning
Keep
Also in his talks
(1)
23 November 1981
The principle of the Ātma: practice
ఆలుబిడ్డలు
బంధనలనీ,
ఆస్తిపాస్తులు
బంధనలనీ,
మమకార
అభిమానములు
బంధనలనీ
భావిస్తూఉన్నాడు.
కాదుకాదు.
ఇవి
బంధనలు
కావు.
ఇవియే
బంధనలైన,
వీనినుండి
తప్పుకొనుటకు
అంత
ప్రయత్నము
చేయనక్కరలేదు.
ఆలుబిడ్డలను
వదలుట
అంత
గొప్పకాదు.
ఆస్తిపాస్తులను
విసర్జించినవారు
అనేకులు
లోకములో
లేకపోలేదు.
అభిమాన
మమకారములు
కోల్పోయిన
వ్యక్తులు
కోటానుకోట్లుగలరు.
వీరందరూ
బంధవిముక్తులేనా?
కాదు
కాదు.
ఇవి
కావు
మనకున్న
బంధనలు.
తానెవ్వరో
తానుతెలుసుకోకుండా
ఉండినంతవరకు
ఉన్న
తత్త్వము
బంధన.
తనను
తాను
తెలుసుకోలేనటువంటి
అవ్యక్తమే
బంధనము.
తనను
తాను
తెలుసుకోలేని
వ్యక్తిత్వము
ఇక
ఎంతవరకైననూ
ఈ
బంధనలో
ఇరుక్కొనుటకు
అవకాశముంటుంది.
ఈ
బంధము
ఉండినంతవరకు
దుఃఖము
తప్పనది
కాదు
దుఃఖముండినంతవరకూ
ఆనందము
లభ్యముకాదు.
అయితే
ఈ
దుఃఖమునకు
కారణము
ఏమిటి?
కేవలము
తనను
తాను
తెలుసుకొనలేకపోయినంతమాత్రాన,
దుఃఖమా?
కాదు.
ఈ
దుఃఖమనేది
అసత్తుచే
తమస్సుచే
మృత్యువుచే
ఏర్పడుచున్నటువంటిది.
కనుక
అసత్తు,
తమస్సు
మృత్యువు
ఈ
మూడింటి
ద్వారానే
మానవునకు
దుఃఖము
ప్రాప్తిస్తూ
ఉన్నది.
అసత్తును
ప్రకృతిని
సత్యముగా
భావించి,
నిత్యముగా
విశ్వసించి,
మనము
భ్రమించి,
దానికి
లోబడిపోతున్నాము.
ప్రకృతియందు
ఎంతకాలము
ఎన్నివిధముల
ప్రయత్నించినప్పటికినీ.
శాశ్వతమైన
పదార్థాన్ని
చూడలేకపోతున్నాము.
నిరంతరము
మార్పుచెందునవే
ఈ
వస్తువాహనాదులు
కానీ.
వ్యక్తిత్వము
కానీ,
గుణత్వము
కానీస్థిరముగా
ఏనాటికికనిపించడంలేదు
కనుక
అసత్తైనటువంటి
జగత్తు
మనకు
సత్యభావముచే
మనమున్నంతవరకునూ,
ఈ
దుఃఖము
మనకు
తప్పింది
కాదు,
కనుక
జగత్తనే
భావమును
మరవవలెను.
అప్పుడే
మనకు
దుఃఖము
నివృత్తియగును.
ఇంక
జీవుడనగా
ఎవరు?
ఈ
పంచభూతములచే.
పంచకోశములచే,
పంచప్రాణములచే,
పంచదృక్కులచే;
నిండియున్నంత
మాత్రమున
మనము
ఒక
జీవతత్త్వముగా
భావిస్తున్నాము.
ఇది
జీవతత్త్వము
కాదు.
కనుక
దీనికి
అతీతమైన
దివ్యత్వము
భవ్యత్వము
నవ్యత్వము
నిత్యసనాతనమైన
ఆత్మతత్త్వము
ఒకటి
ఉన్నది.
నిరంతరము
వికాసతత్త్వముతో
కూడిన
ప్రకాశతత్త్వము
ఒకటి
ఉన్నది
దివ్యత్వమైన
పవిత్రతతో
కూడినది
ఒకటి
ఉన్నది.
ఆధ్యాత్మికవికాసము
లేనటువంటి
జీవతత్త్వము
పశుత్వముతో
సమానము.
కనుక
ఇట్టి
పవిత్రమైన
జీవతత్త్వాన్ని
మనము
తెలుసుకునేంతవరకునూ,
మనకు
దుఃఖము
తప్పనది
కాదు.
ఇంక
దైవమనగా
ఏమిటి?
ఈమృత్యుత్వము
అనగా
ఏమిటి?
దేనికి
మృత్యువు.
కలుగుతున్నది?
ఈ
సత్యాన్ని
కూడ
మనం
విచారించాలి.
పుట్టినదే
గిట్టును.
జన్మించిన
దానికే
మృత్యువు
కనుక
జననమే
లేనటువంటి
దానికి
మరణమెక్కడినుండి
వస్తుంది?
చావు
పుట్టుకల్
లేనట్టి
శాశ్వతుండు.
ఆది
మధ్యాంత
రహితుం
డనాది
వాడు,
చావకయె
తాను
చంపక,
చంపబడక,
అంతటను
సాక్షియైయుండు
ఆత్మ
యెపుడు.
ఇట్టి
ఆత్మతత్త్వాన్ని
ఏనాడు
మనము
సంపాదించుకొందుమో
ఆనాడే
మనకు
దుఃఖ
నివృత్తి.
కనుకనే
అసత్తును
వదలటము
తమస్సును
గుర్తుంచుకోవడము,
శాశ్వతమైన
బ్రహ్మతత్త్వాన్ని
పొందడము.
మరవవలసిన
దాన్ని
మరచినప్పుడే
మనకు
దుఃఖ
నివృత్తి.
తెలుసుకోవలసినదాన్ని
తెలుసుకున్నప్పుడే
మనకు
ఆనంద
ప్రాప్తి.
3
▾
Meaning
Keep
చేరవలసిన
గమ్యాన్ని
చేరినప్పుడే
మనకు
ఆత్మానందము.
ఇట్టి
పవిత్రమైన
త్రిమార్గములను
గుర్తించుకునే
నిమిత్తమై
‘అసతోమా
సద్గమయా,
తమసోమా
జ్యోతిర్గమయా,
మృత్యోర్మా
అమృతం
గమయా,’
అనే
మూడు
విధములైన
ప్రార్థనలు
చేస్తూ
వస్తున్నాము.
కనుకనే
ఈ
అసత్తైన
జగత్తును
మనము
మరవవలెను.
ఇంకా
మనము
కనుక్కోవలసినదివుంది.
ఇది
జీవతత్త్వము
కాదు.
ఇది
బ్రహ్మతత్త్వముఅనే
సత్యాన్ని
గుర్తించవలెను.
ఇది
బ్రహ్మతత్త్వము
అనేది
గుర్తించుకున్న
తర్వాత
అందులో
ఐక్యము
అవుటకు
ప్రయత్నించవలెను.
దీనినే
‘అథాతో
కర్మజిజ్ఞాస,
అథాతో
బ్రహ్మజిజ్ఞాస’
అన్నారు.
కర్మ
జిజ్ఞాస
మొదలు,
ధర్మజిజ్ఞాస
రెండవది.
బ్రహ్మజిజ్ఞాస
మూడవది.
జిజ్ఞాసతత్త్వములనే
త్రిమూర్తులను
అనేక
విధములుగా
పండితోత్తములు
వాదోపవాదములు
చేసి
అనేక
విధములుగా
దీనిని
శోధిస్తూ
వచ్చారు.
కర్మ
జిజ్ఞాస
జరిగినప్పుడే
ధర్మజిజ్ఞాసలోని
రహస్యాన్ని
మనం
గుర్తించడానికి
వీలవుతుంది.
ధర్మజిజ్ఞాసను
గుర్తించినప్పుడే
బ్రహ్మజిజ్ఞాసకు
అపేక్ష
పడతాము.
వేదమునందు
మొదలు
కర్మకాండ,
రెండవది
ఉపాసనాకాండ,
మూడవది
జ్ఞానకాండ
అని
విభజిస్తూవచ్చారు.
కర్మ
ద్వారానే
జ్ఞానములభించును.
కర్మ
నిమిత్తమై
కాయము
ఏర్పడినది.
ధర్మ
జిజ్ఞాస
నిమిత్తమై
మనస్సు
ఏర్పడినది.
దీనినే
మనోవాక్కాయ
కర్మలు
అన్నారు.
మనస్సు
సంకల్పములకు
ప్రధానమైనటువంటిది.
అభిప్రాయములను
వెలిబుచ్చుటకై
వాక్కు
అత్యవసరము.
ఈ
రెండిటినీ
కార్యరూపములో
సాధించుటకై
క్రియ
ఆచరించవలసియున్నది.
కనుకనే
త్రికరణశుద్ధి
కూడ
మానవునికి
అత్యంత
అవసరము.
మనం
ఇంటిలో
నిత్యమూ
ఏదో
ఒకవిధంగా
భుజిస్తూ
ఉన్నాము.
ఈ
ఆహారమును
భుజించే
సమయములో,
ఒక
చట్నీని
నూరినామనుకోండి.
ఇది
నూరిన
తర్వాత
ఒక్కతూరి
నాలుకపైన
వేసుకుని
రుచిని
చూశాము.
ఈ
చట్నీలో
ఉప్పు
తక్కువగా
ఉందని
తెలుసుకున్నాము.
ఈ
ఉప్పు
తక్కువగా
ఉన్నప్పుడు
ఏం
చేస్తాం?
ఉప్పును
తిరిగి
కలుపుకోడానికి
ప్రయత్నిస్తాము.
చట్నిని
మనం
రెడీ
చేయుటయే
కర్మ
జిజ్ఞాస.
దీనిని
రుచి
చూడటమే
ధర్మ
జిజ్ఞాస.
ఇందులో
బ్రహ్మమనే
ఉప్పు
లేదని
తెలుసుకోవడం,
ఉప్పును
కలుపుకోవడమే
బ్రహ్మ
జిజ్ఞాస.
జన్మించడమే
ఒక
కర్మ
జిజ్ఞాస.
మన
జననమే
కర్మకు
మూలకారణము.
కర్మద్వారా
మనము
కొన్ని
ధర్మములు
ఆచరిస్తూ
వచ్చాము.
ఈ
ధర్మములో
ఆనందము
లభించలేదని
నిరాశకు
గురి
అయ్యాము.
ఈ
ఆనందమనేది
బ్రహ్మము
నుండి
చేర్చుకున్నప్పుడే
మనకు
పవిత్రంగా
ఆనందము
అనుభవించడానికి
అవకాశముందని
గుర్తించుకున్నాము.
కర్మను
ఆచరించినంతమాత్రమున
జన్మసార్థకము
గావించుకున్నామని
భావించరాదు.
కర్మ,
ధర్మ
స్వరూపంగా
నిరూపించాలి.
కర్మను
బ్రహ్మ
స్వరూపంగా
రూపొందింపచేసుకోవాలి.
ఇదియే
మానవుని
కర్తవ్యకర్మ.
కనుకనే
ఉపనిషత్తులు
‘కారుణ్యం
పరమం
తపం’
అన్నవి.
సర్వభూతములయందు
కారుణ్యమే
తపస్సు
అన్నారు.
ఇదియే
ఆత్మతత్త్వమని
కూడ
శ్రుతులు
బోధిస్తూవచ్చాయి.
ఈ
కారుణ్యతత్త్వమనేది
మానవుని
యొక్క
దైవత్వమునకు
ఎంతవరకు
మార్గంగా
ఏర్పడుతుందో
విచారించుకోవాలి
‘జంతూనాం
నరజన్మదుర్లభం’
జీవులన్నింటి
కంటే
ఉత్తముడు
మానవుడు
అన్నప్పుడు,
మానవుడు
ఎట్టి
జీవితము
గడపాలి?
ఎట్టి
సాత్త్వికాన్ని
అనుభవించాలి?
త్యాగ,
అహింస,
కరుణతో
ఉండవలసిన
మానవత్వము
కేవలము
స్వార్థము,
అహంకారము,
అసూయ
క్రోధముచేత
మృగములకంటే
హీనమయ్యే
పరిస్థితియందు
ఈనాడు
మానవుడు
సంచరిస్తున్నా…ంటే
ఇందులో
దోషమేమిటి?
4
▾
Meaning
Keep
లోపమేమిటి?
అంతరార్థమేమిటి?
మానవ
జీవితము
మొదటినుండీ
దయ,
ప్రేమ,
సహన,
కరుణ,
ఆనందములచే
కూడిన
దివ్యత్వముగా
రూపొందుతూ
వచ్చింది.
సాత్త్వికగుణములు
నిర్మూలమై,
దుర్మార్గమైన
గుణములు
నిర్మాణమై
మానవత్వాన్ని
నిర్మూలము
గావించుకునే
ఈ
తత్త్వానికి
రావడానికి
ఏది
కారణము?
ఆవుల
దొడ్డిలో
పులి
జొరపడినప్పుడు
ఆవుల
పరిస్థితి
ఏరీతిగా
ఉంటుంది?
అక్కడ
ఆవులు
బ్రతుకుటకు
వీలవుతుందా?
వీలుకాదు.
అదేవిధముగనే
సాత్త్వికగుణములతో
చేరిన
మానవుని
హృదయమనే
దొడ్డిలో
దుర్మార్గమైన
గుణములు
జొరబడినప్పుడు
సద్గుణములు
ఏమైపోతవి?
కనుక
ఈ
పవిత్రమైన
మానవుని
హృదయమునందు,
నిర్మల,
నిశ్చల,
నిస్వార్థమైన
మానవుని
మనస్సునందు,
దివ్యమైన
గుణములు
కలిగిన
చిత్తమందు
ఈ
దుర్గుణములైన
క్రూరమృగములు
ప్రవేశించడం
చేత
మానవత్వమును
కోల్పోయి
మృగత్వమును
అభివృద్ధి
పరుచుకోడానికి
అవకాశం
ఏర్పడుతూవచ్చింది.
కనుకనే
ఈ
భక్తి
ప్రపత్తులనేవి
ఎటువంటివి?
ఏ
నిమిత్తమై
మనకు
ఏర్పడినటువంటివి?
అనే
సత్యాన్ని
ఇప్పుడు
గుర్తించుకోవడం
అత్యవసరం?
భక్తి
అనగా
కేవలము
జప
భజనాదులతో
మాత్రమే
కాక,
ధ్యాననిష్ఠాదులతో
మాత్రమే
కాక,
అనుష్ఠాన
ఆచరణలతోనే
కాకుండా,
మనలో
ఉన్న
మృగతత్త్వాన్ని
దూరము
గావించుకునే
నిమిత్తమై
ఈ
యొక్క
భక్తిమార్గములో
ప్రవేశించాలి.
ఏతా
వాతా
భక్తియొక్క
అంతరార్థమేమనగా:
మానవునియందు
ప్రవేశించిన
పశుత్వాన్ని
దూరం
గావించుకుని,
పశుపతి
తత్త్వాన్ని
ప్రకాశింప
చేసుకోవడమే
భక్తి.
దివ్యత్వాన్ని
ఏనాడు
అభివృద్ధి
గావించుకొందుమో,
ఆనాడే
మానవత్వమనే
పేరు
సార్థకమవుతుంది.
కనుక
ఇట్టి
మానవత్వము,
దివ్యత్వము,
పశుత్వము
జీవతత్త్వములందు
విభాగములు
గావించే
నిమిత్తమై,
జననమరణాదులు
లేని
శక్తి,
మాయకు
అతీతమైన
శక్తి,
లీలామానుష
విగ్రహమైన
పురుషశక్తి,
పురుషోత్తమ
శక్తి,
మానవత్వంగా
లోకానికి
దిగిరావటం
ఏర్పడుతూ
వచ్చింది.
అదే
గోపాల
తత్త్వము
అన్నారు.
గోపాలుడనగా
గోవులను
పాలించువాడు
అని
సామాన్యమైన
అర్థము.
గో
వనగా
జీవులని
అర్థము.
గోపాలుడు
అనగా
జీవులను
పాలించుటకు
దిగివచ్చిన
నరాకారతత్త్వమే
ఈ
కృష్ణాష్టమి
యొక్క
అంతరార్థము.
నిర్గుణ
నిరాకార
తత్త్వము,
ఆకారముతో
గుణములతో
కూడిన
దివ్యత్వంగా
రూపొందింప
చేసుకున్నట్టి
ప్రకాశతత్త్వమే
ఈ
గోకులాష్టమి
యొక్క
అంతరార్థము.
మానవోత్తములై,
పురుషోత్తముడైన
శ్రీ
కృష్ణతత్త్వమును
సార్థకంగావించుకుని,
దివ్యత్వమైన
ముమ్మూర్తులనుకొలిచేటటువంటి
మానవత్వమే
ఈ
కృష్ణాష్టమి
యొక్క
అంతరార్థము.
తాను
ఎట్టి
బంధనలచేతకానీ,
ఎట్టి
భావములచేతకానీ,
ఎట్టి
మమకార
అభిమానముల
చేతకానీ,
కట్టుబడనివాడననే
సత్యాన్ని
గుర్తించడమే
కృష్ణభక్తులయొక్క
నిజమైన
పవిత్రత.
కృష్ణుడు
ఎన్ని
చెప్పినా,
ఏమి
చెప్పినా,
ఏమి
చేసినా,
ఏమి
చూపినా,
ఏమి
పలికినా,
అన్నియు
మానవోద్ధరణ
నిమిత్తమై,
ఈ
లోకోద్ధరణ
నిమిత్తమై,
ధర్మోద్ధరణ
నిమిత్తమై
తాను
ఆచరించిన
లీలలే.
తాను
ధర్మమూర్తిగా,
అతని
దివ్యజీవితమే,
అతని
ఉపదేశముగా
భావించుకొంటూ
వచ్చినది
ఈ
కృష్ణ
చరిత్ర.
అందుకనే
His
life
is
His
Message.
తానుకర్మకాండను
స్వయముగా
ఆచరించి
అనుష్ఠించి
అందించినాడు.
పవిత్ర
కర్మయోగుల
ప్రధానమైన
స్వరూపుడు
కృష్ణుడు.
తానునిరంతరము
కర్మను
ఆచరిస్తూ,
అనుష్ఠిస్తూ
ఇతరులకు
ఆదర్శవంతమైన
జీవితాన్ని
అందిస్తూ
వచ్చాడు.
5
▾
Meaning
Keep
అహంకారమునకేమాత్రము
అవకాశము
లేక,
అసూయ
మమకారములకేమాత్రము
సందర్భము
కలిగించక,
తన
మానవత్వము
యొక్క
కర్తవ్యాన్ని
నిర్వర్తించుకుంటూ
వచ్చిన
ఆధర్మాన్ని
సామాన్య
మానవులకు
అందిస్తూవచ్చాడు.
తాను
చక్రవర్తిగా
ఉండినప్పటికినీ,
తనకు
ఎట్టికార్యములతోనూ
సంబంధము
లేకపోయినప్పటికినీ,
అర్జునకు
రథసారథిగా
నిలిచి
తాను
అనేక
కర్మలు
ఆచరించి,
అహంకారమునకు
ఏమాత్రమూ
అవకాశము
ఇవ్వనటువంటి
సహజ
జీవునివలే
చేస్తూవచ్చాడు.
అంతమాత్రమే
కాకుండా,
యుద్ధము
తదుపరి,
గుర్రములను
కడగటము,
అనేక
విధములుగా
గాయములు
తగిలినచోట
మందులు
పూయడము,
ఈ
విధమైన
కంపౌండరు
పని
కూడ
తానే
చేస్తూవచ్చేవాడు.
తనకు
ఎంత
శక్తి
సామర్థ్యములు
ఉండినప్పటికినీ,
సర్వ
సృష్టికూడ
తన
వాస్తవమునందు
ఇముడ్చుకొన్నప్పటికినీ,
తాను
ఏమాత్రమూ
అహంకారమునకు
అవకాశము
ఇవ్వక,
తాను
చిన్నకార్యము
మొదలు
పెద్దకార్యము
వరకును
స్వయముగా
ఆచరిస్తూవచ్చేవాడు.
తాను
కర్మమార్గమునకు
ఒక
ప్రత్యేకమైన
విశిష్టతను
అందిస్తూవచ్చాడు.
ఈ
విధమైన
కర్మను
మనము
ఆచరించే
నిమిత్తమై,
మానవుని
యందు
ఇచ్ఛాశక్తి
ప్రప్రథమముగా
అభివృద్ధి
పరచుకోవాలి.
ఇచ్ఛాశక్తి
ఉండినంత
మాత్రమున
మన
మనోభీష్టము
నెరవేరదు.
దీనికి
జ్ఞానశక్తి
కూడ
తోడుకావాలి.
జ్ఞానశక్తి,
ఇచ్ఛాశక్తి
రెండు
కూడ
కూడినంత
మాత్రమున
మన
మనోభీష్టము
నెరవేరదు.
ఇక్కడ
క్రియాశక్తి
కూడ
ఈ
మూడింటితో
కూడాలి.
కనుక
ఈ
త్రిగుణములు
కూడినప్పుడే,
త్రిపుటిగా
ఏర్పడినప్పుడే
త్రికరణశుద్ధి
కలిగినప్పుడే
మన
ఇచ్ఛాశక్తి
పూర్ణత్వాన్ని
పొందుతుంది.
దీ…కొక
చిన్న
ఉదాహరణము.
మనకేదో
ఒక
విధమైన
సంకల్పం
కలిగింది.
ఇచ్ఛకలిగింది.
కాఫీ
తాగాలనే
ఇచ్ఛ
కలిగింది.
కానీ
ఇచ్ఛకలిగినంత
మాత్రమున.
కాఫీ
మన
హస్తానికి
చేరడంలేదు.
ఈ
ఇచ్ఛతోనే
మనము
నిరాశకు
గురియైపోతున్నాము.
ఇక్కడ
జ్ఞానశక్తిని
మనం
ఉపయోగపెట్టాలి.
కాఫీ
కావాలనుకున్నప్పుడు
దీనికి
పాలుకావాలి,
చక్కెరకావాలి,
కాఫీపొడి
కావాలి,
స్టౌ
కావాలి,
నీరు
కావాలి,
ఇంకా
దానికి
అనేక
విధములైన
ప్రయత్నములు
చేసినప్పుడే
ఇది
కాఫీగా
తయారవుతుంది.
అని
ఈ
జ్ఞానశక్తితో
ఇచ్ఛాశక్తిని
కూర్చాలి
ఇవన్నికలసిఒక
జ్ఞానశక్తిగా
కూడుతుంది.
కానీ,
జ్ఞానశక్తి
కూడింది.
ఇచ్ఛాశక్తి
కూడింది.
ఈ
రెండూ
చేరినంత
మాత్రమున
కాఫీ
మన
చేతికి
వచ్చిందా?
ఇక్కడ
క్రియాశక్తి
చేరాలి.
కనుక
కాఫీ
కావాలనేది
ఇచ్ఛాశక్తి.
దీనికి
ఏమేమి
అవసరము
అనేటటువంటిది
జ్ఞానశక్తి.
అన్నిటినీ
చేర్చి
తయారు
చేయడమే
క్రియాశక్తి.
ఈ
మూడు
శక్తులు
కూడినప్పుడే
మన
అభీష్టము
నెరవేరుతుంది.
అదే
విధముగానే
ఈనాడు
మనకు
భగవంతుడు
కావాలి
అని
ఆశిస్తున్నాము.
అతని
సాక్షాత్కారాన్ని
పొందాలని
ఆశిస్తున్నాము.
ఇది
ఇచ్ఛాశక్తి.
ఈ
ఇచ్ఛాశక్తి
ఉన్నంతమాత్రాన
సాక్షాత్కారము
మనకు
ఫలిస్తుందని
ఏ
మాత్రము
కూడ
మనము
విశ్వసించకూడదు.
ఈ
ఇచ్ఛ
నెరవేరే
నిమిత్తమై
ఏ
మార్గాన్ని
అవలంబించాలి?
అనే
జ్ఞానశక్తిని
కూడ
మనం
తెలుసుకోవాలి.
అంతమాత్రంచేత
మనకు
ఈ
సాక్షాత్కారము
ప్రాప్తించడంలేదు.
ఈ
విధి
విధానాన్ని
తెలుసుకొని
దానిని
ఆచరణయందు
ఉంచాలి.
నిత్యానుష్ఠానములో
దీనిని
ప్రవేశపెట్టినప్పుడే
ఈ
ఇచ్ఛాశక్తి
జ్ఞానశక్తి,
క్రియాశక్తి
మూడింటిద్వారానే
సాక్షాత్కారప్రాప్తి
మనకు
లభిస్తుంది.
6
▾
Meaning
Keep
కాన
ఈనాడు
అనేకులు
99%
అంతాకూడ
కేవలం
ఇచ్ఛాశక్తిలోనే
కాలాన్ని
వ్యర్థం
గావిస్తున్నారు.
ఈనాడు
శుష్కవేదాంతముల
చేతనే
మనము
వాదోపవాదములు
జరుపుతూ
ఉంటున్నాము.
కానీ
దానిని
ఆచరణయందు
గానీ,
అనుష్ఠానము
సలుపుటయందుగానీ,
మనము
ఏ
మాత్రము
కూడ
ముందంజ
వేయడంలేదు.
సిద్ధాంతములను
మాత్రమే
మనము
వల్లెవేయుటకు
ప్రయత్నం
చేస్తున్నాముగానీ,
మనము
కూడ
ముందంజ
వేయడంలేదు.
సిద్ధాంతములను
మాత్రమే
మనము
వల్లెవేయుటకు
ప్రయత్నం
చేస్తున్నాముగానీ,
అనుష్ఠానములో
కొంతవరకైన
ఆచరించుటకు
ఏమాత్రమూ
పూనుకొనడము
లేదు.
సిద్ధాంతముల
యొక్క
ప్రతిపాదనలకంటె
అనుష్ఠానాన్ని
నిర్వర్తించడము
అత్యవసరము,
ఈనాడు
లక్ష్యములకంటె
కూడ
మన
సాధన
అత్యవసరము
లక్ష్యప్రాప్తికై
మనము
ఎంతవరకు
ప్రాకులాడుతున్నామో
అందులో
వెయ్యింట
ఒక
భాగమైనా
సాధనయందు
మనం
ఉండినప్పుడే
ఈ
యొక్క
లక్ష్యప్రాప్తి
మనకు
లభిస్తుంది.
ప్రతి
విద్యార్థి
కూడ
నేను
1st
Class
లో
పాసుకావాలి
అని
ఆరాటపడుతుంటాడు.
లక్ష్యాన్ని
స్మరిస్తూ
ఉంటాడు.
కానీ
ఆశిస్తున్నాడే
కానీ
ఫస్ట్క్లాసు
రావడానికి
తగిన
ప్రయత్నము
కృషి
తాను
సలుపుతున్నాడా?
కనుక
తాను
ఫస్ట్క్లాసు
రావాలి
అనే
ఆశతో
వెయ్యింట
ఒకభాగము
తన
సాధన
యందు
పెట్టినప్పుడు
తాను
ఫస్ట్క్లాసులో
రాగలడు
అదేవిధముగా
ఈనాడు
ఆస్తిక
లోకములో
పారమార్థిక
మార్గములో
పవిత్రమైన
భక్తిమార్గములో
ఆశలు
అమితంగా
పెరిగిపోవుచున్నవి
గానీ
ఆశలకు
సంబంధించిన
మార్గాన్ని
అవలంబించడం
లేదు.
ఈ
యొక్క
నిత్యకర్మానుష్ఠాన
నిమిత్తమై,
కృష్ణభగవంతుడు
అనేక
విధములుగా
భగవద్గీతయందు
మార్గదర్శకంగా
నిరూపిస్తూ
గీతనే
ప్రధానమైన
సూత్రంగా
ఊతకర్రగా,
వెన్నెముకగా
ప్రజలకు
అందిస్తూవచ్చాడు.
అయితే
మన
జీవితమందు
ఇతర
ప్రాణులను
హింసించుటకు
బాధించుటకు,
నొప్పించుటకు
అనేక
విధములుగా
ముందంజ
వేస్తున్నాము.
ఎవరి
హృదయము
కారుణ్యమయంగా
నిలుస్తుందో
అట్టివారి
హృదయమునందే
భక్తి
ప్రపత్తులనే
మొక్కలు
అభివృద్ధి
అవుతాయి.
చవిటి
భూమిలో
(
Salty
Soil
)
ఎంత
బలమైన
విత్తనములు
నాటినప్పటికిని,
అవి
మొక్కలుగా
రూపొందవు.
అయితే
పరులయొక్క
బాధలుగానీ,
దుఃఖములుగానీ,
కష్టములుగానీ
మనం
గుర్తించవలెనంటే
మన
హృదయమును
పవిత్రమైన
అద్దముగా
రూపొందింప
చేసుకోవాలి.
హృదయమును
మాలిన్యపరుచుకుని,
దుర్గుణములతో
నింపుకుని
ఇతర
బాధలు
మనకు
కనిపించలేదంటే
ఏరీతిగా
కనిపించడానికి
వీలవుతుంది?
ఏనాడు
ఇతరుల
బాధలు
కష్టములు
చింతలు
మనము
గుర్తింతుమో
ఆనాడే
మన
చింతలను
భగవంతుడు
గుర్తించడానికి
ప్రయత్నిస్తాడు
జీవితము
కేవలము
స్వార్థముతోనే
అంతము
గావించుకోరాదు.
దివ్యమైన
సమత్వముతో
కూడినటువంటిదే
పరార్థము.
కాన
ఇట్టి
దివ్యమైన
మార్గములను
ప్రబోధించి
భవ్యమైన
మార్గములలో
నడిపించి
అనుగ్రహమైన
తత్త్వమును
తాను
ప్రబోధిస్తూ
వచ్చాడు
కృష్ణుడు.
ఇది
మన
కర్తవ్యం
అని
నిరూపిస్తూ
వచ్చాడు.
మనకు
ఇందులో
ఏ
విధమైన
ఫలితం
లేకపోయినప్పటికిని,
మనం
కర్మనాచరించే
నిమిత్తమై
ఈ
కాయము
జన్మించినదని,
ఈ
కాయమును
సార్థకం
గావించుకునే
నిమిత్తమై
కాలముకూడ
ప్రాప్తించినదని,
ఈ
మూటియొక్క
ముమ్ముచ్చటనూ
నిరూపిస్తూవచ్చాడు
కృష్ణుడు.
7
▾
Meaning
Keep
కృష్ణతత్త్వము
నిరంతరము
లీలామానుష
విగ్రహమే.
అనగా
పరులను
ఆనందపెట్టడము,
తాను
ఆనందించడము,
పరులను
నవ్వించడము
తాను
నవ్వడము,
పరులను
గౌరవించడము
తాను
గౌరవింపబడటము,
ఈనాడు
లోకములో
అందరూ
తనను
గౌరవించాలి
గానీ,
ఇతరులను
తాను
గౌరవించడానికి
పూనుకోడు.
తాను
ఆనందించాలి
కానీ
ఇతరుల
ఆనందం
చూసి
ఓర్చుకోలేడు.
మానవుడు
తన
సుఖమును
మాత్రమే
లక్ష్యమునందుంచుకొనును
కానీ
ఇతరుల
సుఖమును
ఏమాత్రమూ
లక్ష్యమునందుంచుకొనుటలేదు.
ఈ
మార్గములందు
స్వార్థపర
సుఖమార్గము,
స్వార్థపరార్థపర
సుఖమార్గము,
పరార్థసుఖమార్గమని
మూడు
మార్గములున్నవి
ఈనాడు
కేవలము
స్వార్థసుఖమార్గమే
అధికంగా
కనిపిస్తున్నది.
స్వార్థసుఖమార్గము
అంటే
కేవలము
ఒక
కాకివంటిది.
తన
సుఖమే,
తన
ఆనందమే,
తన
పొట్టనింపుకోవడమే
తాను
చూస్తుంది.
స్వార్థపరార్థ
సుఖమార్గమనగా
తాను
సుఖించాలి,
పరులను
సుఖపెట్టాలి
అనే
మధ్యేమార్గము.
పరార్థసుఖమార్గమనగా
తాను
ఏవిధమైన
బాధలకు
గురియైనప్పటికినీ,
ఇతరులను
సుఖపెట్టాలి.
ఇతరులను
బాగుపరచాలి,
ఇతరులు
ఆనందించాలి
అనే
దివ్యమైన
మార్గములో
ప్రవేశపెట్టడం.
ఈ
మూడు
కూడ
మూడు
విధములైన
జ్యోతులవంటివి.
స్వార్థసుఖమార్గమనగా
మనరూమ్లో
మనం
తగిలించుకున్న
దీపము
వంటిది.
అనగా
రూమునందున్న
జ్యోతి
ఆరూముకు
మాత్రమే
చేరుతుంది
తప్ప
మరి
బయట
ప్రదేశములకు
ప్రసరించదు.
స్వార్థపరార్థ
సుఖమార్గమనేటువంటిది
మూన్లైట్
వంటిది.
చంద్రుని
యొక్క
వెలుతురువంటిది.
సర్వత్రా
ఈ
వెలుతురున్నది.
కాని
సుస్పష్టంగా
మనకు
గోచరించడం
లేదు.
వస్తువుల
యొక్క
యథార్థస్వరూపాన్ని
గుర్తించటానికి
వీలుకానిదిగా
ఉంటుంది.
ఇంకా
పరార్థమార్గమనేది
సూర్యుని
యొక్క
కాంతి
వంటిది.
ఈ
సూర్యకాంతి
లోపల,
వెలుపల
అందరికి
కూడ
ప్రకాశాన్ని
అందిస్తుంది
కనుకనే
పరార్థమార్గాన్ని
సమర్థమైన
దివ్యత్వము
అన్నారు.
మూన్లైట్ను
అన్యోన్యమైన
సమంజస
భక్తి
అన్నారు.
ఇంక
స్వార్థమార్గము
కేవలము
అసత్యమైనది.
మానవత్వాన్ని
కూడ
నిర్మూలము
గావించేటటువంటిది,
కుత్సితమైనటువంటిది.
కేవలము
సంకుచితమైనది.
ఇంటిలో
తన
గదిలో
తాను
పెట్టుకున్న
దీపము
వంటిదిగా
ఉంటుంది.
కనుక
భగవద్గీతకానీ
కృష్ణుని
ప్రబోధలు
కానీ
ఇలాంటి
పవిత్రమైన
పరార్థసుఖమార్గాన్ని
లేక
సమర్థ
మార్గాన్ని
అందించినవే.
కేవలము
కృష్ణ
జన్మోత్సవమని
మనం
ఉత్సవాలు
చేసుకుంటూ
పూజలు
గావించుకుంటూ
ఈ
కృష్ణ
జన్మాష్టమి
కోసం
అనేక
విధాలుగా
వైభవాలు
జరుపుకోవడం
చేతనే
కృష్ణ
జన్మాష్టమి
యొక్క
రహస్యాన్ని
మనం
గుర్తించుకోలేము.
కానీ
ఈనాడు
కృష్ణుని
మాత్రమే
ఆశిస్తున్నాము
కాని
కృష్ణుని
ఆదేశాలను
ఆశించడం
లేదు.
అనుష్ఠించడం
లేదు.
కృష్ణుడు
కానీ
కృష్ణుడి
వచనం
కానీ
వేరు
వేరైనవి
కావు.
కనుక
కృష్ణునికి
కృష్ణుని
వచనములకు
ఏ
మాత్రమూ
విరుద్ధములేదు.
కావు.
ఎవరు
కృష్ణుని
మాత్రమే
ఆశించి
కృష్ణ
వచనాన్ని
దూరం
చేస్తారో
వారు
కృష్ణ
ద్రోహులు
అనే
చెప్పవచ్చును.
కనుక
మనం
కృష్ణుని
ప్రేమించక
పోయినప్పటికినీ
కృష్ణ
వాక్యములను
అనుష్ఠానంలో
పెట్టుకోవడం
చేత
అవియే
మనకు
దివ్యదీపములుగా
వెలగొందుతూ
ఉంటాయి.
దివ్యమార్గాన్ని
నిరూపిస్తాయి.
పవిత్రమైన
సన్నిధిని
చేరుస్తాయి.
దైవ
సన్నిధిలో
ఉంపుతాయి.
కనుక
ఈ
ప్రేమ
తత్త్వాన్ని
మనం
ఈనాడు
అభివృద్ధి
గావించుకోవాలి.
కృష్ణుడు
ప్రేమ
స్వరూపుడు.
8
▾
Meaning
Keep
అతని
ప్రేమ
పెరిగి,
కరిగి
ప్రవహించడం
చేతనే
కరుణామయుడుగా
రూపొందాడు.
కనుక
ఈ
కృష్ణ
ప్రేమను
ఈనాడు
మనం
నిజమైన
తృష్ణగా
భావించుకోవాలి.
మానవునికి
ఉండవలసిన
తృష్ణ
కృష్ణప్రేమయే.
ఈ
ప్రేమలో
ఏమాత్రము
కూడ
స్వార్థమన్నది
ఉండదు.
సర్వులయందున్న
ప్రేమ
తత్త్వమే
కృష్ణుడు.
సర్వులయందు
కూడ
మనం
కరుణను
ప్రసరింప
చేసినప్పుడే
అదితపస్సు.
కానీ
ఈ
ప్రేమ
తత్త్వముచేత
మనం
తాపమును
పొందినతే,
అది
తపస్సుగా
మారుతుంది.
తపస్సనగా
కేవలం
అరణ్యములకు
వెళ్ళి
ముక్కు
మూసుకుని
డొక్కలు
కొట్టుకుంటూ
ఆకులలములు
మేసి
ఆహార
విసర్జనచేసి
అనేక
విధముల
పరితపించి
అనారోగ్యానికి
గురికావడమే
తపస్సయిపోదు.
కృష్ణ
ప్రేమ
కోసమై
తాపమును
పొందటమే
నిజమైన
తపస్సు.
ఈ
విధమైన
ప్రేమతత్త్వాన్ని
దినదినమూ
మనం
అభివృద్ధి
గావించుకుంటూ
దైవత్వములో
జీవత్వాన్ని
అంకితం
గావించుకోవడమే
నిజమైన
పరమ
భక్తి
యొక్క
లక్షణం
:
దివ్యాత్మ
స్వరూపులారా
!
మనము
అనేక
విధములుగా
సాధనలు
సలుపుతున్నాము.
ఈ
సాధనలయందున్న
అంతరార్థమేమో
గుర్తించుకోలేక
పోతున్నాము.
ఎన్ని
సాధనలు
చేసినప్పటికినీ
దివ్యమైన
ప్రేమలో
అవి
అంకితమయ్యేవే.
అనేక
పర్యాయములు
చెప్పాను
‘ఆధ్యాత్మిక
విద్యా
విద్యానాం’
అని,
కనుక
మన
సర్వ
సాధనలు
కూడ
ఏదో
చిన్న
చిన్న
నదులవంటివిగా
ప్రవహిస్తూ
వస్తున్నాయి.
భగవంతుని
ప్రేమ
అనే
సముద్రములో
ఇవన్నీ
చేరిపోయేటటువంటివే.
నదీనాం
సాగరోగతిః
అని.
అన్ని
నదులు
కూడ
సాగరములో
లీనమైనట్లుగా
అన్ని
మార్గములు
కూడ
భగవంతుని
ప్రేమ
తత్త్వములోనే
లీనమైపోతుంటాయి.
కనుక
ఈ
ప్రేమను
సర్వులయందున్న
ఆత్మ
ప్రేమగా
మనం
భావించి
అందరినీ
మనం
ప్రేమించడానికి
ప్రయత్నించాలి.
Previous
←
Measured Talk Is Great Ease
Next
The Kerala Onam
→