Contents
Devotion & Sacred Story
Home
Library
Find
Shelf
Settings
←
Leave
Sathya Sai Speaks 1979 · The Flaw in Objects
Tap a verse for its meaning
IAST
Telugu
Meaning
Continuous
The Flaw in Objects
25 September 1979, Dasara 1979, Prasanthi Nilayam
First talk
Second talk
1
▾
Meaning
Keep
His poems 415
Also in his talks
(1)
27 September 1987
Sādhanas without Prema are fruits without juice!
ఎద్ది
లేదనుచుంటిమో
అద్దికలదు
!
ఎద్ది
కలదనుచుంటిమో
అద్ది
లేదు
!
ఉన్నదొక్కటె,
దైవంబు
ఎన్నటికినీ.
లేనిదయ్యెను,
విశ్వంబు
కానయ్య.
యత్
దృశ్యం
తన్నశ్యం:
కనిపించే
ప్రతిపదార్థము
కూడనూ
కాలగర్భములో
అంతమొందుచున్నది.
నామరూపాత్మకమైన
ఈ
జగత్తునందు
నిత్యశాంతిని
పొందగోరి
మానవుడు
అనేకప్రయత్నములకు,
అనేక
సాధనలకు
గురి
అవుచున్నాడు.
నిత్యసత్యమైన
ఆత్మతత్వాన్ని
దృశ్యకల్పితమైన
జగత్తునందు
వెతుకుటకు
ప్రయత్నిస్తున్నాడు.
సత్యము
శాంతి,
జగత్తునందు
కలదా?
లేక
తనయందు
ఉన్నదా?
అనేసత్యాన్ని
గుర్తించుకో
లేక
పోతున్నాడు
మానవుడు.
దృశ్యమును
బహిర్ముఖము
గావించుకున్నంతకాలమూ
దృశ్యమే
గోచరిస్తుంది
కానీ
దృక్
అనేటువంటి
సత్యతత్వము
గోచరించుటకువీలుకాదు.
కేవలము
ఈ
మాలను
చూచునంతవరకు
పుష్పములు
మాత్రమే
మనకు
తెలుస్తుంది
కానీ
ఇందులో
ఆధారమైన
దారము
గోచరించదు.
పైన
కనుపించే
పుష్పములయందు
పరిశోధనలు
సలిపినప్పుడే,
ఏ
ఆధారము
చేత
ఈపుష్పములు
నిలవగలిగినవి
అనే
విచారణశక్తిని
పెంపొందించుకుని
పరిశోధనలు
చేసినప్పుడే.
కొంతవరకు
అవ్యక్తమైన
దారము
వ్యక్తమౌతుంది.
అదే
విధముగనే
ఈ
దృశ్యకల్పితమైన
జగత్తునందు
లక్ష్యమును
ఇమిడ్చి,
ఇందులో
సుఖశాంతులు
లభిస్తాయని
ఒక
దురాశకు
లోనై
నిర్వికల్పమైన
తత్వాన్ని
దూరం
గావించుకుంటున్నాము.
దృశ్యకల్పితమైన
జగత్తు
మానవునికి
క్షణకాలసుఖమును
అందిస్తున్నది.
సంపదలన్నియు
కూడను
మించుమెరుపువలె
క్షణభంగురమై
చంచలత్వమును
పొందుచున్నవి.
బంధు
మిత్రాదులందరూ
కనులముందే
కాయమును
విసర్జించిపోవుచున్నారు
ఈ
దృశ్యకల్పితము
అందించే
ఆనందము
క్షణానందము.
శాశ్వతానందము
కోల్పోవడానికి
తగిన
మార్గమును
అవలంబిస్తున్నాము.
ఇంతియేకాదు.
దృష్టిని
అంతర్ముఖము
గావించుకోవడం
వల్లనే
నిజమైన
ఆనందం
లభించును,
అనే
సత్యాన్ని
కూడా
విస్మరిస్తున్నాము.
ఇది
భారతీయులైన
వారందరికినీ
ప్రత్యక్షప్రమాణము.
శివదేవాలయములో
శివునిముందు
నంది
ఉండటం
మనందరికీ
అనుభవమే.
రామమందిరము
వెళ్ళినప్పుడు
హనుమంతుడు
రామదర్శనమునిమిత్తమై
తనఎదురుగా
నిల్చున్నదృశ్యము
మనకు
గోచరిస్తుంటుంది.
విష్ణుమందిరము
పోయినప్పుడు
గరుడ
విష్ణువు
యొక్క
సన్నిధియందు
అతిభక్తితో
వినయవిధేయతలతో
తాను
ఆజ్ఞకై
బద్ధుడై
ఉంటుంటాడు.
కనుకనే
హనుమంతుని,
గరుడను,
నందిని,
భారతీయులు
పూజించడము
మనయొక్క
ఆచారరూపకంగా
అలవర్చుకుంటూ
వస్తున్నాము.
కారణమేమిటి?
ఆ
నంది,
ఆ
గరుడ,
ఆ
హనుమంతుడు
బహిర్దృష్టి
లేక
కేవలము
ఈశ్వరదృష్టియందే
తమ
చిత్తములను
అంకితం
గావించుకోవడం
చేత,
బహిర్ముఖమునకు
విరుద్ధమైనటువంటి
దృష్టిని
అమర్చుకోవడంచేత,
మరల్చుకోవడం
చేతనే,
వారు
పూజనీయులుగా
రూపొందుతూ
వచ్చారు.
2
▾
Meaning
Keep
కనుక
మనదృష్టిని
భగవత్
అభిముఖం
గావించుకున్నపుడే
మనము
పవిత్రమైన
మార్గమును
అవలంబించిన
వారమవుతాము.
కానీ
సర్వసామాన్యముగా
ప్రతిమానవుడు
తనదృష్టిని
బహిర్ముఖము
నందే
అభివృద్ధి
గావించుకోవడానికి
ప్రయత్నిస్తున్నాడు.
లోకములో
జ్ఞానము,
భోగము
రెండు
స్థితులు
మాత్రమే
ఉంటున్నవి.
ఏ
కొంతమంది
మాత్రమో
జ్ఞానదృష్టిచేత
దివ్యమైన
ఆత్మతత్వాన్ని
అనుభవిస్తూ
ఉంటారు;
అధికభాగము
భోగదృష్టిచేతనే
తమ
జీవితమును
నిరర్ధకం
గావించుకొంటుంటారు.
కానీ
భోగమువల్ల
కలిగే
ఫలితం
ఏమిటి?
ఈ
సుఖసంపదవల్ల
వచ్చే
ఆనందము
ఏమిటి?
బహిర్దృష్టివల్ల
లభించిన
సంతోషం
ఏమిటి?
ఇవి
క్రమక్రమేణా
మానవత్వాన్ని
మరపించి
కేవలం
పశుత్వంలో
ప్రవేశపెట్టి,
దివ్యత్వాన్ని
దూరం
గావించేటువంటివే!
దృశ్యకల్పితమైన
పదార్థమునందున్న
దోషమును
మనము
ఏమాత్రమూ
గుర్తించక
దానిని
మరుగుపరచే
ప్రయత్నమునకు
సంసిద్ధుల
మవుతున్నాము.
నిజముగా
పదార్థమునందున్న
దోషమునే
గుర్తించిన
ఆ
పదార్థమును
విసర్జించుటకు
మనము
ఎంతైనా
ప్రయత్నిస్తాము.
ఒక
సర్పమే
కనిపించినప్పుడు
ఈ
సర్పమునందు
విషలక్షణమున్నది,
దోషమున్నది
అని
గుర్తించిన
వ్యక్తి
ఆ
సర్పమునకు
అతిదూరమైపోతాడు.
ఒక
పులిని
మనం
చూచినప్పుడు
పులిలో
ఒక
క్రూరమైన
గుణము
ఉన్నదని
తెలుసుకున్నప్పుడు
అతిదూరంగా
ఉండుటకు
ప్రయత్నిస్తాము.
ఇదే
విధముగా
ప్రతి
వస్తువుయందున్న
దోషములను
మనం
గుర్తించినప్పుడు,
ఆ
వస్తువులలో
మనకు
సులభముగా,
అప్రయత్నముగా
వైరాగ్యము
సంభవిస్తుంది.
జగత్తునందున్న
ప్రతిపదార్థమునందు
కూడనూ
అనిత్యము.
అనే
దోషము,
అంతర్భూతమై
ఉంటున్నది.
అంతియేకాదు,
నిరంతరమూ
మార్పుచెందే
రోగము
కూడా
ఈ
పదార్థమునందుంటున్నది.
కనుక
మార్పుచెందే
పదార్థము,
మార్పు
చెందే
వ్యక్తికి,
మార్పుచెందని
ఫలితమును
ఏ
మాత్రమూ
అందించదు.
మానవుడు
ఎంత
అవివేకిగా
ప్రవర్తిస్తున్నాడు
అనేది
కూడా
ఇందులో
మనకు
అర్థమవుతుంది.
సుఖమును
అందించే
పదార్థమూ
అనిత్యమే.
అందుకొనే
వ్యక్తి
అనిత్యమే.
ఈ
ఇరువురూ
అనిత్యమైనపుడు
ఈ
సుఖమును
నిత్యమైన
సుఖముగా
ఎట్లుభావిస్తున్నారో,
ఇది
అర్థం
కావడంలేదు.
సత్యమైన
సుఖమును,
సత్యమైన
పదార్థమే
అందించును.
నిత్యమైన
పదార్థమే
నిత్యసుఖాన్ని
అందించును.
కనుక
ఈ
సత్యనిత్యమైన
పదార్థము
ఆత్మ
ఒక్కటియే.
ఈ
ఆత్మతత్వాన్ని
గుర్తించడానికి
మనము
తగిన
ప్రయత్నము
చేయడం
లేదు.
మనము
గాఢముగా
ప్రయత్నము
చేసినప్పుడు
ఆత్మతత్వాన్నే
కాకుండా,
ఆత్మానందాన్ని
కూడ
అనుభవించుటకు
అవకాశముండును.
Previous
←
Hinduism
Next
Discrimination and detachment
→