Contents
Devotion & Sacred Story
Home
Library
Find
Shelf
Settings
←
Leave
Sathya Sai Speaks 1979 · Thirst for Ānanda
Tap a verse for its meaning
IAST
Telugu
Meaning
Continuous
Thirst for Ānanda
23 November 1979, Birthday, Prasanthi Nilayam
1
▾
Meaning
Keep
మానవుని
హృదయము
తీవ్రమైన
ఒక
ఆపేక్ష
కలిగియుండును.
అది
అచంచలమైన,
స్థిరమైన
ఆనందాభీష్టము.
ఇట్టి
ఆనందమును
పొందుటకు
ప్రతి
మానవుడు
రాత్రింబవళ్ళు
విధివిరామము
లేకుండా
కృషి
సలుపుతున్నాడు.
కానీ
దానిని
అందుకోలేక
పోతున్నాడు.
కారణమేమిటి?
దేహేంద్రియములే
తానని
భావించి.
ఆనందమే
తాను
అనే
సత్యాన్ని
గుర్తించుకోలేక
పోతున్నాడు.
దీనినే
ఉపనిషత్తులు
చక్కని
ఉపమానము
చేత
ఈ
సందియమును
నివారణగావిస్తూ
వచ్చింది.
పిండియందు
బెల్లముచేరినప్పుడే
మాధుర్యముగా,
రుచిగామార్చుతున్నది;
ప్రపంచము
పిండి
వంటిది.
ఈ
పిండియందు
ఎక్కడ
దీనిమాధుర్యమును
చూపినప్పటికినీ
దివ్యత్వాన్ని
అనుభవించినప్పటికినీ,
ఇదికేవలము
దైవము
యొక్క
సంపదయే
కానీ
ప్రకృతియొక్క
సంపదకాదు.
భగవంతునికి
అప్రమేయుడు
అని
పేరు.
అప్రమేయుడనగా
ఎట్టిప్రమాణముల
చేతనూ
నిరూపించడానికి
వీలుకానివాడు
అని
అర్థము.
వేదములచేతనే
దీనిని
అర్థముగావించుకొనుటకు
వీలగును,
కనుకనే
ఇతనికి
‘వేదవిదుడు’
అని
మరొకపేరు.
ప్రమాణములు:—
మూడు
విధములైనటువంటి
ప్రమాణములు
కలవు.
ప్రత్యక్ష
ప్రమాణము,
అనుమానప్రమాణము,
శబ్ద
ప్రమాణము.
ప్రత్యక్షప్రమాణము;—
పాలు
తోడు
పెట్టగా
అది
పెరుగుగా
మారుచున్నది,
ఇది
ప్రత్యక్ష
ప్రమాణము,
దూరమునందున్న
పర్వతము
పైన
పొగను
చూచి,
నిప్పు
ఉన్నది
అని
సందేహించడం;
ఇది
అనుమానప్రమాణం.
ఇంక
శబ్దప్రమాణము:
ఈ
శబ్దప్రమాణమనగా
ప్రశాంతినిలయమును
చూచినట్టి
వ్యక్తి,
ప్రశాంతినిలయమును
చూడని
వ్యక్తిదగ్గరకు
పోయి
దానిని
వర్ణనలు
చేయడం
చేత,
ఆ
వ్యక్తి
కూడా
ప్రశాంతినిలయము
యొక్క
పరిస్థితిని
గుర్తించుతాడు.
ఈశబ్దప్రమాణమనేది
అనుభవించి
ఆనందించి
అందించే
పలుకుల
యొక్క
స్వరూపము.
ఇన్నివేలమందిలో
ఏదో
ఒకవ్యక్తి
అమెరికానుండి
వచ్చాడు,
అతను
సత్యసాయి
వరల్డ్కౌన్సిల్లో
ఒక
మెంబరు
డిగ్బాక్
అనే
వ్యక్తి.
అతనియొక్క
గుర్తులన్నియూ
విపులంగా
చెప్పటంచేత
అతనిని
గుర్తించడంకూడ
కష్టము.
అయితే,
శబ్దస్వరూపమైన
“డిగ్బాక్”
అని
నేను
పిలిచేసరికి
ఎక్కడ
ఉన్ననూ
ఆ
డిగ్బాక్
లేచి
నిలుస్తాడు,
అదేవిధముగనే
భగవంతునకు
శబ్దప్రమాణము.
వర్ణనల
చేత
అంతసులభంగా
చిక్కేవాడుకాదు.
ఈ
శబ్దప్రమాణమనే
దానికి
రెండు
లక్షణములున్నాయి:
1.
తటస్థ
లక్షణము
2,
స్వరూప
లక్షణము,
తటస్థలక్షణమనగా
తాత్కాలికమైన
గుర్తును
నిరూపించి
శాశ్వత
స్వరూపాన్ని
చెప్పడం;
దీనికి
చక్కని
ఉదాహరణము
—
ఆకాకి
కూర్చున్న
ఇల్లు
ఫలానవారియిల్లు
అని
మనం
చెపుతాము.
అది
కేవలం
తాత్కాలికంగా
గుర్తును
చూపించేటువంటిదేకానీ
ఆ
కాకి
నిరంతరము
ఆ
గృహముపైనివసించదు.
కనుక
ఈ
తటస్థలక్షణములచేత
భగవంతుని,
రాముడు,
కృష్ణుడు,
ఈశ్వరుడు,
విష్ణువు,
అల్లా
అనే
స్వరూపములచేత
తాత్కాలికంగా
మనము
భావిస్తూ,
ఆరాధిస్తూ,
ఆనందిస్తూ
ఉంటున్నాము,
ఇవి
కేవలం
తటస్థలక్షణములు
అనగా
శాశ్వతమైన
స్వరూపములు
కావు.
2
▾
Meaning
Keep
ఇవి
లోకకల్యాణము,
ధర్మస్థాపన,
లోకసంరక్షణ
మానవాదర్శముల
నిమిత్తమై
ఏర్పడే
ఆకారములు
మాత్రమే.
స్వరూపలక్షణమనగా
“సత్యజ్ఞానమనంతంబ్రహ్మ
“సత్యం
బ్రహ్మ”,
“జ్ఞానం
బ్రహ్మ”,
“అనంతం
బ్రహ్మ”.
దేశకాలపాత్రలకు
అతీతమైన
స్వరూపములు
ఇవి.
అతీతమైనప్పటికినీ
దేశకాలపాత్రలందు
ప్రవేశించి,
ప్రకాశించి,
ప్రచురించి,
ఆనందస్వరూపము
నందిస్తున్నవి.
ప్రపంచమునందలి
ప్రతి
పదార్థమునందూ
ఐదు
లక్షణములుంటున్నవి.
ఈ
ఐదు
కూడనూ
అస్తి,
భాతి,
ప్రియ,
రూప,
నామములు.
అస్తి
అనగా
ఒక
వస్తువు
ఉన్నది
అని
నిరూపించడము,
అయితే
వస్తువు
ఉండినప్పటికినీ,
దానిని
నిరూపించుటకు
ప్రకాశము
అత్యవసరము,
ప్రకాశమే
లేకుండిన,
ఉన్నదని
నిర్ణయము
చేసుకొనలేము,
వస్తువు
ఉన్నది
అని
అనుకోవడము
కేవలము
‘అస్తి’
శబ్దము.
వస్తువును
ప్రకాశింప
చేయునది
‘భాతి’
అనేశబ్దము
సమయస్ఫూర్తిగా
మనము
ప్రేమిస్తున్నాము
కానీ
సర్వదా
సర్వత్రా
ప్రేమించడంలేదు.
ఆకలిసమయము
నందు
అన్నమును,
అతిగాప్రేమిస్తున్నాము.
పట్టెడు
అన్నము
పొట్టకు
చేరెనా
ఆకలి
తీరుతుంది.
తరువాత
అన్నమును
ఆశించము.
అయితే
ఆకలికిపూర్వము
ఉండిన
రుచియే
నీ
ఆకలి
తీరిన
తరువాతకూడా
ఆ
అన్నము
నందుంటున్నది.
కనుక
అన్నముయొక్క
స్వరూపతత్వము
ప్రియతత్వము!
ఈ
అస్తి,
భాతి,
ప్రియము
ఈ
మూడునూ
దైవలక్షణములు.
రూపనామములు
మాయాకల్పితములు.
ఈ
మాయాకల్పితమైన
రూపనామములయందు
కూడనూ
అస్తి,
భాతి,
ప్రియ
స్వరూపమైన
దైవత్వము
సర్వత్రా
ఇమిడియున్నది.
జగత్తునందు
ఏపదార్థమునకైననూ
ఒకకర్త
లేకుండా
అది
నిర్మాణం
అవడం
జరుగదు.
ఏదో
ఒక
ప్రదేశమునందు,
ఏదో
ఒకరూపమునందు
ఆ
పదార్థముయొక్క
కర్త
ఉండియే
ఉండవచ్చును.
ప్రాపంచిక
సంబంధమైన
పదార్థములకు
కర్త
ఎవరో
నిర్ణయించుకోవడానికి
సాధ్యమవుతుంది.
సూర్య
చంద్రాదులు
నక్షత్రములు,
భూమి,
సముద్రము,
వీటన్నిటికీ
ఎవరో
ఒకకర్త
ఉండి
తీరవలెనుకదా?
కనుక
సృష్టికి
పూర్వమే
ఒక
కర్త
అనే
దైవత్వము
ఉన్నదనే
సత్యమును
విశ్వసించక
తప్పదు.
ఉపాదాన
కారణము,
నిమిత్తకారణము
అని
రెండు
కారణములుంటున్నవి.
ఉపాదాన
కారణమనేది
ఉండినప్పుడే
నిమిత్తకారణము
ఏర్పడుటకు
వీలుంది.
ఇది
సిల్వర్
ప్లేటు.
ఈ
సిల్వర్
ప్లేటును
చేసినవాడు
కంసలి.
అయితే
ఈ
కంసలి
వెండియే
లేకుండిన
తట్టను
ఏవిధముగా
చేయగలడు?
కనుక
తట్టకు
పూర్వముండిన
సిల్వర్
ఉపాదానకారణము.
ఆ
సిల్వర్
ఉన్నప్పుడే
నిమిత్తకారకుడైన
కంసలి
దీనికొక
స్వరూపాన్ని
అందిస్తున్నాడు.
కనుక
అన్నిటికి
పూర్వమున్న
మూలాధారమైనదే
ఉపాదానకారణము.
ఈ
కారణమునకు
కర్తయే
దైవము.
కనుక
ఆనందమనేది
ప్రతి
పదార్థమునందు
ఉన్నది.
కేవలము
ఏదో
ఒక
ప్రదేశము
నందు,
ఒక
మార్గమునందు
మాత్రమే
ఆనందమును
అనుభవించగలమని
ఆశించడము
అజ్ఞానం.
ఏ
మానవుడైననూ
తనజీవితములో
ఆశించునది
రెండు
మాత్రమే!
మిగిలిన
వన్నియు
ఆరెండింటియందే
ఇమిడి
ఉంటున్నవి.
(1)
దుఃఖనివృత్తి
(2)
ఆనందప్రాప్తి.
దుఃఖనివృత్తిని
కోరనివాడు
ఎవడైనా
ఉన్నాడా?
ఆనందప్రాప్తిని
ఆశించని
వాడెవడైనా
ఉన్నాడా?
దీనికే
ముక్తిఅనిపేరు.
ముక్తి
అనగా
ఏదో
ప్రత్యేక
స్థానమనీ,
మార్గమనీ
భావించి,
మాకు
ముక్తి
అవసరములేదని
అనేకమంది
నాస్తికులు
వాదించవచ్చును,
ఆ
పదమునకు
సరియైన
అర్థమును,
భావమును
గుర్తించుకోలేనటువంటి
పరమ
మూర్ఖుడే
‘నాకు
ముక్తి
వద్దు’
అని
చెప్పును.
3
▾
Meaning
Keep
ముక్తి
అన్నటువంటిది
పూర్ణ
ఆనందం
యొక్కస్థాయియే.
ప్రాపంచికసంబంధమైన
విషయవాసనలే
సర్వంగా
భావించుకోవడం,
దుఃఖమునకు
హేతువు.
సర్వము
ఆత్మమయము
అనే
మార్గమును
అవలంబించడంచేత
నిరంతరము
ఆనందమే
ప్రాప్తిస్తుంది.
అనగా
ఆధారమైనటువంటి
దీనిని
అనుసరించడం
చేత,
ఆధేయమైన
తత్వము
మరుగుగా
ఉండి
ఆనందమే
మనకు
లభ్యమౌతుంది.
కనుక
మనము
ఏ
పదార్థము
నందైననూ
దైవత్వమైన
అస్తి,
భాతి,
ప్రియము
ఈ
మూడింటియొక్క
లక్ష్యమును
గుర్తుగా
ఉంచుకుని
తద్వారా
మనము
పదార్థమును
అనుభవించుకోవడం
చేత
నిత్యానంద
ప్రాప్తి
లభ్యమౌతుంది.
Previous
←
The Wish-Fulfilling Tree
Next
Satya
→