Contents
Devotion & Sacred Story
Home
Library
Find
Shelf
Settings
←
Leave
Sathya Sai Speaks 1979 · Satya
Tap a verse for its meaning
IAST
Telugu
Meaning
Continuous
Satya
8 December 1979
1
▾
Meaning
Keep
సర్వత్ర
దైవము
తప్ప
అన్యము
లేదు,
దైవమొక్కటి
మాత్రమే
సత్యము.
కనుక,
ప్రతి
పదార్థమునందు
ఆధారరూపుడై
దివ్యప్రకాశమునందిస్తూ
బుద్ధిగ్రాహ్యముగా
వెలసే
ఆత్మతత్త్వము
అందరియందూ
ఉన్నదనే
సత్యాన్ని
గుర్తించాలి.
కానీ,
ఈ
నాడు
మానవుడు
సత్యము,
సత్యము,
అని
వేదికలపై
మాత్రము
ఉచ్చరిస్తున్నాడే
కానీ,
సత్యముయొక్క
స్వరూపాన్ని
గుర్తించుటకు
ప్రయత్నించడం
లేదు.
2
▾
Meaning
Keep
తనయందున్న
సత్యాన్నికూడ
తాను
గుర్తించడానికి
భయపడుతున్నాడు
మానవుడు!
కనుకనే
తన
ప్రవర్తన
కూడా
భిన్నమార్గమునవలంబిస్తున్నది.
సత్యమనగా
ఏమిటి?
చూచినది
చూచినట్లు,
విన్నది
విన్నట్లు,
చెప్పినది
చెప్పినట్లు
చెప్పడము
సత్యమా?
కాదు,
కాదు!—
సమాజమును
ఉద్ధరించే
నిమిత్తమై
ఆదర్శజీవితమును
అందించడమే
సత్యముయొక్క
స్వభావము.
మానవత్వమును
ఉద్దీపింపచేసే
ప్రకాశమే
సత్యము.
మానవుడు
మానవుడుగా
జీవించుటకు
తగిన
కృషి
సల్పడమే
అతని
సత్యజీవితము.
కేవలము
తెల్లవారినది
మొదలు
రాత్రి
పరుండువరకు
స్వార్థనిమిత్తమై
ఆచరించే
దుష్కర్మలామనుష్యుల
నిజతత్త్వము?
సమాజము
యొక్క
సత్యాన్ని
తన
సత్కర్మలద్వారా
నిరూపించాలి.
తనయందు
ప్రతిబింబించిన
ఆత్మతత్త్వాన్ని
సమాజముయొక్క
ప్రతిబింబముగా
నిరూపించాలి.
ఇదియే
సత్య
జీవితముయొక్క
లక్షణము,
మనసునందున్న
భావము,
మాటయందున్న
పలుకు,
క్రియయందున్న
ఆచరణ
—
మూడింటికీ
సన్నిహిత
సంబంధం
కావాలి;
మూడింటినీ
ఏకత్వం
చేయాలి.
తలంచుట
ఒక్కటి,
పలకడం
మరొకటి,
ఆచరించడం
ఇంకొకటి,
“మనస్యన్యత్,
వచస్యన్యత్,
కర్మణ్యన్యత్
దురాత్మనాం”
కనుక
మానవత్వమందు
దివ్యత్వము
ప్రకటము
కావాలంటే,
“మనస్యేకం,
వచస్యేకం,
కర్మణ్యేకం
మహాత్మనాం”
అనే
సూక్తిని
అనుసరించాలి.
ఈ
నాడు
లోకములో
కృత్రిమమును
ఆశిస్తూ
సత్యమును
విస్మరిస్తూ
వస్తున్నాడు,
మానవుడు.
సత్యనిత్యమైన
విషయములందు
మానవుడు
విరోధాన్ని
విజృంభిస్తున్నాడు.
దైవత్వము
సర్వులయందున్న
ఏకశక్తి,
“ఈశావాస్య
మిదం
సర్వం,”
అని,
గుర్తించినప్పుడే
సత్యప్రాప్తి.
ప్రతి
జీవియందు,
మానవునియందు,
ప్రతి
అణువునందు
కూడనూ,
దైవత్వము
స్వరూపము
ధరించి
యుండును.
ఒక
మఱ్ఱి
విత్తనమును
కోసి,
దానిని
అనేక
ప్రత్యేకమైన
అర్థములతో
పరీక్షించినప్పటికినీ,
ఆ
విత్తనములో
నున్న
మహాశక్తి
మనకు
గోచరించదు.
అయితే,
దానిని
పోషించినప్పుడు
బ్రహ్మాండమైన
వృక్షముగా
రూపొందుతున్నది.
పవిత్రమైన
భారతదేశమందు
ఏ
ఒక్క
ప్రదేశము
కూడనూ,
ఏయొక
అణువు
కూడనూ
సార్థకమైనదే,
దివ్యమైనదే,
అని
గుర్తించాలి.
ఇదియే
ఆస్తికుని
లక్షణము.
నేను
ఆస్తికుడు
కాదు,
నాస్తికుడు,
అని
చెప్పువాడు
కూడ,
లోలోపల
ఆస్తికుడే;
‘అస్తి’
ఉన్నది,
అనే
భావములేకుండ,
వాడు
నాస్తికుడు
కాలేదు.
ఇంక
నా
సత్యము
ఏమి?
సత్యసాయియొక్క
సత్యత్వమును
నిరూపించుటకు
ఎవ్వరికీ
సాధ్యం
కాదు.
సత్యసాయి
సంకల్పము
—
“యోగక్షేమం:
లోకాస్సమస్తాస్సుఖినో
భవన్తు”;
సర్వులూ
ఆనందంగా
ఉండాలి;
సర్వులూ
సౌఖ్యమనుభవించాలి;
అందరూ
తమ
కర్తవ్యాన్ని
నిర్వర్తించాలి;
అని
లోకానందమును
ఆశించడము,
సాధించడము,
తప్ప
స్వార్థానందమునకేమాత్రమూ
ప్రాకులాడుటలేదనే
సత్యమును
ప్రతి
ఒక్కడూ
గుర్తించాలి.
దివ్యత్వమును
గుర్తించేది
అంత
సులభంకాదు.
కానీ
కాల
కర్మల
కారణ
కర్తవ్యాలు
కలిసివచ్చినప్పుడు
ఈ
సత్యము
కూడనూ
అతి
త్వరలోనే
మీకు
అవగాహన
మగును.
Previous
←
Thirst for Ānanda
Next
Humanness
→