Contents
Devotion & Sacred Story
Home
Library
Find
Shelf
Settings
←
Leave
Sathya Sai Speaks 1980 · Teaching in ancient India
Tap a verse for its meaning
IAST
Telugu
Meaning
Continuous
Teaching in ancient India
10 July 1980, Brindavan, Whitefield
1
▾
Meaning
Keep
సత్ప్రవర్తన,
సద్బుద్ధి,
సత్యనిరతి,
భక్తి,
క్రమశిక్షణ,
కర్తవ్య
దృష్టి—వీటిని
నేర్పు
వారే
గురువులు,
నేర్చుకొన్న
వారే
విద్యార్థులు.
ఈ
గుణములే
మానవునికి
ఇహపరములను
ప్రసాదించు
సాధనలు.
మనుజులను
దనుజులుగా
మార్చు
దుర్గుణములను
దూరము
చేసే
విద్య
ఇదియే.
విద్యావిధానముయొక్క
ఆదర్శములు
రెండు,
అని
అనేకులు
చాటుచున్నారు.
ఒకటి:
ప్రపంచమందు
సంఘమందు
కూడుగుడ్డలకు
ఇబ్బంది
లేక
అనుకూలములను
అందించే
విద్య.
రెండవది:
ప్రపంచ
సుఖదుఃఖములతో
సంబంధము
లేక,
ఆధ్యాత్మిక
పథమును
ప్రవేశపెట్టి,
సాక్షాత్కారమునందించే
విద్య.
అయితే,
ఇవి
రెండూ
భిన్నము
కావు;
అవినాభావముచే
బంధింపపడినవే.
దీనిని,
విద్యార్థులూ
గురువులూ
చక్కగా
గుర్తించవలెను.
మనిషి
చేతులు
కాళ్లు
మనస్సు
ఇంద్రియములు
వీటితో
తయారైన
ఒక
వస్తువు
కాదు.
దీనిని
ఆవరించి
అతీతమైన
ఒక
వ్యక్తిత్వమున్నది—అదే
ఆత్మ.
అది
చర్మచక్షువులకు
గోచరము
కాదు.
ఇతర
ఇంద్రియములకుకూడ
అగుపడేది
కాదు.
అది
దృశ్యములకతీతము.
ఇంద్రియగోచరమంతా
జగత్తు;
ఇది
జగత్తునకు
ఆధారమైనది.
కనుపించునవన్నీ
కనిపించని
ఆధారముపై
నిలిచియున్నవి.
వృక్షమునకు
వ్రేళ్లు
ఆధారము;
భవనమునకు
పునాది
ఆధారము.
ఆత్మ
అనే
ఆధారముపై,
జీవ
జగత్తులు
రెండూ
నిలిచియున్నవి.
మూడు
నాలుగు
శతకములక్రింద
విదేశీయులు
భారతమును
ప్రవేశించినపుడు
మన
విద్యావిధానమందు
ఏవో
కొన్ని
విశ్వవిద్యాలయాలు
మాత్రమే
ఉన్నవి.
వాటికి
అంద
చందములతో
కట్టబడిన
భవనాలు
లేవు.
మహాపండితులు
ఒకరి
గృహమే
కాలేజి.
పది
లేక
నాలుగైదు
విద్యార్థులు
మాత్రమే,
ఆయన
దగ్గర
విద్యనభ్యసించే
వారు,
పాఠప్రవచనములకు
కాలపరిమితి
నియమించటము
అనే
పద్ధతి
ఆనాడు
లేదు.
గురువుయొక్క
అనుగ్రహము,
శిష్యునియొక్క
ఆపేక్ష—వీటిని
పట్టి
విద్యాబోధ
జరుగుచుండెను.
ఏచోటో
ఏ
సమయమో
అర్ధరాత్రిసమయమందుకూడ,
ప్రశాంతవాతావరణము,
దొరికినపుడెల్ల
పాఠములు!
క్లాస్‌రూం
అనేది
ఏది?
దేవాలయప్రాంగణమో,
వృక్షఛాయనో,
వారికి
అదే
గది.
అట్టి
పవిత్రస్థళమందు
అభ్యాసముజరిగినప్పుడు
దేవాలయమునకు
వచ్చు
భక్తులూ,
వృక్షము
దగ్గరతిరుగాడు
పవిత్రహృదయములు
ప్రజలుకూడ
విషయములను
అందుకొనుటకు
అవకాశముండేది.
ఒక్కొక్క
విశ్వవిద్యాలయమందు
ఒక్కొక్క
విషయమును
ఆ
నాడు
ప్రత్యేకంగా
బోధించు
పద్ధతి.
కాశీ
విశ్వ
విద్యాలయముయొక్క
అభిమానశాస్త్రము,
వ్యాకరణము.
కాశ్మీరములోని
సంస్థకు
అలంకారశాస్త్రముపై
అభిమానమెక్కువ;
తక్షశిలలో
ఆయుర్వేదముపై
ఎక్కువ
శ్రద్ధ;
ఉజ్జయినీ
విశ్వవిద్యాలయము
గణితశాస్త్రములో
ప్రత్యేక
ప్రసిద్ధి
పొందినది;
నవద్వీపమందు
న్యాయశాస్త్రపండితులు
బహుమంది.
తమ
తమ
అభిమానశాస్త్రమును
తాము
శ్రద్ధగా
బోధింతురు.
2
▾
Meaning
Keep
శ్రీరాముని
తమ్ముడు
భరతుడు
పరిపాలించిన
నగరము,
అమరావతి.
అక్కడ
విశ్వవిద్యాలయము
వైద్యశాస్త్రమును
అభిమానశాస్త్రముగా
ఏరుకొని
చరక
శుశ్రుతాదుల
పద్ధతులను
నేర్పించినది.
శాస్త్రవిషయములను
మాత్రమేకాక,
నీతి
నిజాయితీతో
జీవితమును
సాగించేదెట్లు,
భాషాశుద్ధితో
మాట్లాడేదెట్లు,
సౌభాగ్య
సౌశీల్య
స్వభావముగల
ఆదర్శములనెట్లు
నిత్యజీవితములో
ఆచరించేది,
వీటినికూడ
ఆచరణరూపమైన
ప్రచార
ప్రబోధములద్వారా
విద్యార్థులు
అందుకొనుటకవకాశముండెడిది,
మానవత్వమును
అభివృద్ధిపరచుటకు
దివ్యత్వమును
ప్రకటించి
ప్రకాశింప
జేసేదే
ఏకైక
మార్గము.
ఈ
లక్ష్యముపై
ఆనాటి
విశ్వవిద్యాలయాలు
ఎక్కువ
శ్రద్ధ
వహించినవి.
మరొకటి:
ఆనాటి
విశ్వవిద్యాలయాలు
…
బంధనలో
చిక్కక,
విద్యాభిమానుల
విద్వాంసుల
ఆశయాలను
మాత్రమే
గమనించి
కార్యరూపముగా
ఆచరించినవి.
సరస్వతీదేవి
స్వేచ్ఛావిహారము
చేసి
అందరినీ
ప్రోత్సహించినది.
ఆదేవి
అనుగ్రహించి
ఆకర్షించిన
విద్యార్థులను
వరించి
భరించి
తరింప
జేసే
కర్తవ్యమును
నేరవేర్చినవి.
ఆ
నాటి
విద్యాభిమానుల
లక్ష్యము
విద్యాసంస్థల
సువ్యవస్థ,
మరియు,
విద్యావిధానముపై
నిలిచినది:
ప్రథమపాఠశాల,
ఉన్నతపాఠశాల,
కళాశాల,
విశ్వవిద్యాలయం
అనే
సంస్థలలో,
వారి
శ్రద్ధ
ఎక్కువగా
ప్రాథమిక
పాఠశాలపై
పడినది.
లేత
హృదయములలో
నిర్మల
నిష్కల్మష
నిస్వార్థ
హృదయములలో
తియ్యని
భావాలను
పెంచవలెననేది
వారి
ఉద్దేశ్యము.
విద్యావిధానమును
నిర్ణయించు
సందర్భమందు
ఏకాలమందు,
ఎంతకాలము,
ఎలాటి
విషయము,
ఎలాంటి
గురువులు,
ఎట్టి
విద్యార్థులకు
శిక్షణ
నందించాలి
అని
వారు
గమనించిరి.
భిన్నభిన్నమైన
ఆశయాలు,
ఆశలు,
వాంఛలు
గల
విద్యార్థులకు
వేరు
వేరు
రీతిగా
విద్యనందించాలి
అని
వారు
సంకల్పించి
విద్యావిధానమును
తీర్చిదిద్దిరి,
వారి
వారి
అభిరుచిని
ఆకర్షణలను
పురస్కరించుకొని
బోధించే
వారు.
విద్యారంగములో
నిర్బంధమునకు
స్థానం
లేదు.
6
నుండి
10
మంది
మాత్రమే
విద్యార్థులు
కాబట్టి,
ఒకొకరికి
సూటిగా
నాటేరీతిగా
బోధన
జరుగును.
సందేహం
కలిగినపుడు
తక్షణమే
గురువుగారు
తానే
గుర్తించి,
పదే
పదే
బోధించి
అర్థమయ్యేవరకు
విషయమును
వదలరు.
గురువులకు
కర్తవ్యభావము;
శిష్యులకు
విద్యాభిమానము.
ఇహమును
జయింప
హేమతారక
విద్య,
పరమును
సాధింప
బ్రహ్మవిద్య—రెండూనూ
సమన్వయ
పరచిరి
వారు.
శ్రవణముద్వారా
పెద్దలు
అనుసరించే
విధానములను
పరికించి
తిలకించి
విద్యలను
వశము
చేసుకొనే
వారు.
కమ్మరి
కుమ్మరి
వడ్రంగి
విద్యలుమాత్రముకాదు.
వ్యవసాయం,
సంగీత,
సాహిత్య,
శిల్పచిత్రకళలును
కూడ
అంతే.
పుస్తకాలు
ఆనాడు
ప్రజలకు
లేవు.
దివ్యమైన
విద్యను,
భవ్యమైన
హృదయముతో
నవ్యమైన
మార్గమందు
నేర్చుకొనే
వారు,
నేర్పువారికి
కూడ,
శ్రవణమే
ప్రధానం.
భారతదేశము
ఈనాడు
సుందరమైన
ఒక
నందనవనము;
అనేక
రంగులుగల
పుష్పములు
వికసించి
హృదయానందము
నందించే
ఉద్యానము.
హిందువులు,
ముస్లీంలు,
క్రైస్తవులు,
బౌద్ధులు,
పార్శీలు,
జైన్లు
మొదలగు
పుష్పముల
నందనవనం.
అనేక
భాషలతో
మతాలతో
ఆధ్యాత్మికసాధనలతో
కళావంతమైన
దేశం.
సర్వ
మతముల
సమత్వమును
పోషించిన
దేశము.
3
▾
Meaning
Keep
…ంలు
అనేక
దేవతలను
ఆరాధిస్తున్నారు,
వారికి
దేవుడు
ఒకడే
అని
తెలియదు,
అనే
అపోహాలు
చాలా
పొరపాటు.
నిజముగా,
సర్వదేవతా
స్వరూపులైన
దేవుడు
ఒకడే,
అనే
శాసనము
భారతదేశమందే
అనాదికాలము
నుంచి
ప్రజల
విశ్వాసము.
వృత్తికొక
అధిష్ఠాన
దేవత,
కర్మకొక
అధిష్ఠాన
దేవత
అని
ప్రత్యేకించలేదు.
అన్ని
దేవతలు
ఒక
దైవముయొక్క
శక్తివిశేషములే
అని
నమ్మి
ఆరాధన
సలిపిరి.
దైవత్వాన్ని
చరాచరములలోనూ
జడవస్తువులలోనూ,
సకలప్రాణులలోనూ
మృగపక్షిక్రిమికీటాదులలోనూ
దర్శించిరి.
లారీ
నడిపించే
వాడు
స్టీరింగు
పట్టేముందు,
దానికి
నమస్కరించి,
అపాయము
లేకుండ
ప్రయాణము
జరుగవలెనని
దైవమును
ప్రార్థిస్తాడు.
వాని
మతము
ఏదైనాసరే,
దేవుని
వేడుకొనక,
ముందంజవేయడు.
కమ్మరి,
కుమ్మరి,
వడ్రంగి,
గాయకుడు,
శిల్పి,
పుస్తకాలువ్రాసే
సాహిత్యకవి,
పండితుడు
అందరూఅంతే,
ఆధ్యాత్మిక
భావమును
ప్రదర్శించే
వారే.
దీని
అంతరార్థమేమి?
ఆముష్మికము,
ముందు;
భౌతికము,
తరువాత!
ఇది
పాశ్చాత్యులకర్థం
కాదు.
వారు,
భారతీయులు
చెట్టు,
గుట్ట,
రాయిని
కాయితము
వీటిని
దైవమని
పూజింతురు
అని
పరిహసింతురు.
భారతీయులు
తెలివితక్కువ
వారు
కారు;
వారిది
మూర్ఖత్వం
కాదు,
పవిత్రభావమే,
పూర్ణజ్ఞానలక్షణమే.
రాయికూడ
దైవమని
వారి
భావము
కాని,
దైవము
రాయి
అని
కాదు.
‘ఈశావాస్యమిదం
సర్వం.’
సర్వమూ
దైవమే;
ఆ
విశ్వవిరాట్
స్వరూపముయొక్క
అంశములే,
అంగములే.
అన్ని
కర్మలూ,
కార్యములూ
దైవమునకర్పితమే;
దైవకృప
లేక
ఏదీ
జరగదు.
కాబట్టి,
ఏపని
మొదలు
పెట్టినా,
దైవారాధన
అగత్యముగా
ఆచరించేతీరాలి.
ఇంద్రియములు
మనస్సు
చిత్తము
బుద్ధి
అహంకారము
వీటన్నిటికీ,
అతీతమై
ఆత్మతత్వమే,
ఆధారము.
దానిని
స్మరించి,
కర్మములను
సాధిస్తూ
పోవలెను.
ఆనాటి
విద్యావంతులనూ,
ఉపాధ్యాయులనూ,
ప్రజలే
పోషించిరి,
కేవలము
పొట్టకూటి
కోస్కరము
కాదు,
ఆత్మతత్వమును
నేర్పుటే
జన్మసార్థకము
అనుకొనే
వారు,
ఉపాధ్యాయులు
విద్యార్థులూ
అంతే.
దానినే
నేర్చుకోవాలి
అని
తహతహలాడే
వారు.
పండితులకు
అగ్రహారములనిచ్చి
ప్రోత్సహించే
రాజులు,
వారిని
గౌరవించి
వారి
సలహాలను
పొంది
ఆరీతిగనే
నడచే
ప్రజలు,
ఇట్టి
స్వార్థరహితమైన
జీవితము
ఆనాటిది.
తమ
కామపుత్రులకు
సమముగానే
శిష్యులైన
ప్రేమ
పుత్రులను
ప్రీతితో
చూచేవారు,
ఉపాధ్యాయులు.
వారందరూ
త్యాగశీలురు;
కష్ట
జీవులు;
వారిపై
ఎవరూ,
ప్రభుత్వముకూడ,
చర్యతీసుకోరు.
ఎందుకనగా,
వారికి
శ్రమయే
సంపద.
వారు
ఆనందమయులు;
కర్మశూరులు.
విద్యార్థులు
ఆనాడు
విద్యనాశించి
ఆర్జించేదికూడా
ఉద్యోగముకొరకుకాదు.
గుణధనము
పెరగాలి,
చిత్తశుద్ధి
సంపాదించాలి.
దేశమునకు
సంఘమునకు
కుటుంబమునకు
సేవనందించే
శక్తిసామర్థ్యములనార్జించాలి
అనేది
వారి
లక్ష్యము.
ఆశలకు
లొంగినవాడు
నిజముగా
దరిద్రుడు;
తృప్తి,
తుష్టి,
పొందినవాడు
శ్రీమంతుడు.
తల్లి
దండ్రులను
పోషించి
తృప్తిపరచే
విధానములను
విద్యార్థులు
ఈనాడు
తెలుసుకోవాలి.
వారిని
విద్యాశూన్యులు
అని
చిన్నపరచకూడదు,
పుస్తకపరిజ్ఞానము
వారికి
లేకుండవచ్చును.
అయితే
హృదయపరిజ్ఞానమున్నది.
వారిని
హింసించి
వారికి
బాధపెట్టి,
కంటినీరు
కురిపించకూడదు,
వారిని
ప్రేమించి
గౌరవించి
వారికి
సేవ
చెయ్యాలి.
వారిని
తిరస్కరించి
దూషించి
అగౌరవపరచకూడదు.
అందరితోనూ
వినయవిధేయతలతో
మెలగాలి.
4
▾
Meaning
Keep
అహంకారము
మిమ్ములని
ఏనాటికైనా
హీనపరచును,
శిక్షించును.
తన
హృదయమే
తన్నుహింసిస్తుంది,
ఎల్లప్పుడూ
రామ
కృష్ణ
గోవింద
అని
భగవన్నామస్మరణ
చేసిన,
అహంకారము
దూరమగును.
ఫుట్‌బాల్‌లో
నిండుగా
గాలి
ఉండేవరకు
దానికిదెబ్బలు
తప్పినది
కాదు,
కదా?
మన
జీవితమే
ఫుట్‌బాల్;
అహంకారమే
దానిలోని
గాలి.
ఆధ్యాత్మిక
సాధనలద్వారా,
అహంకారమునకు
మూలకారణము;
అహంకారము
నశించిన,
ఆత్మానందము
నందుకోవచ్చు.
దానికి
డిగ్రీలు
పనికి
రావు,
దైవానుగ్రహము
అత్యవసరం.
బహుళగ్రంథపఠనమక్కరలేదు.
దైవానుగ్రహము
దొరకుటకు
చిత్త
శుద్ధి
సేవాబుద్ధి,
కర్తవ్యనిష్ఠ,
ప్రేమాభివృద్ధి
కావాలి.
విద్యార్థులు
విద్యనార్జించే
సమయమందు,
మిగిలిన
రంగములలో
ప్రవేశించ
కూడదు.
అట్లు
చేస్తే,
విద్య
కుంటుబడును.
హృదయమును
పరిశుద్ధముగా
వుంచుకొని
సోదరమానవులను
ప్రేమించండి.
క్రమశిక్షణను
ఒక
సబ్జెక్టుగా
పరిగణించి,
ఆధ్యాత్మికమును
అతిశ్రద్ధతో
అభ్యసించండి.
Previous
←
Discipline
Next
The three sorrows
→