Contents
Devotion & Sacred Story
Home
Library
Find
Shelf
Settings
←
Leave
Sathya Sai Speaks 1980 · The three sorrows
Tap a verse for its meaning
IAST
Telugu
Meaning
Continuous
The three sorrows
13 July 1980, Brindavan, Whitefield
1
▾
Meaning
Keep
ప్రపంచములో
మానవుని
ఆవేశించిన
దుఃఖములు
మూడు—ఆధ్యాత్మికదుఃఖము,
ఆధిభౌతికదుఃఖము,
ఆధిదైవికదుఃఖము.
ఆధ్యాత్మికదుఃఖమనగ—మనోవికారమువలన,
రోగములవలన
బాధపడుట,
మానవదేహము
మలినపు
కొంప;
పురుగులు
క్రిమికీటాదుల
నివాసస్థానము.
దుర్గుణముల
చేతనే
మానసిక
అనారోగ్యము
సంభవించును.
దయాగుణమను
పవిత్రభావమును
పెంచితే,
ఆధ్యాత్మికదుఃఖమును
నివారణచేసేందుకు
అవకాశమున్నది.
ఎంత
తెలివితేటలున్నప్పటికినీ,
గుణవంతుడుకాక,
మానవత్వానికే
అర్హుడు
కాడు.
గుణమే
ప్రధాన
శోభ.
సద్గుణములను
ప్రకటింపజేసి
ప్రకాశింపజేసితే,
ఆరోగ్యముతో
పాటు
ఆనందమును
కూడ
అందుకొనవచ్చు,
రోగానికి
మూలకారణము,
దుర్గుణమే.
దుర్గుణముల
వలన,
వార్ధక్యము
కూడ
అతిత్వరగా
ఆక్రమించును.
సుగుణాలవలన
నిరంతర
పటుత్వము,
శక్తిసామర్థ్యములు,
యౌవనము,
అన్నీ
అభివృద్ధి
యగును.
విద్యార్థిదశలోనే
దుర్గుణములు
దుశ్చింతలు
దురలవాట్లను
చేరనీయక,
పవిత్రమైన
సద్గుణములనభ్యసించవలెను.
ఆనందంద్వారా
ఆరోగ్యం
సిద్ధమగును.
ఆరోగ్యహృదయం
ఆనందనిలయం.
యువకులు
జగదోద్ధారకులుగా
తయారుకావాలి.
వారు
సద్గుణములను
హృదయమందు
నింపుకోవలెను.
మితభాష,
మితాహారం
వీటిని
ఈ
చిన్నవయస్సులోనే
నిత్యజీవనమందు
పాటించాలి.
జైసే
అన్,
ఐసే
మన్,
అంటారు.
సాత్వికాహారమునే
భుజించుటకు
పూనుకోవాలి.
ఆహారం
ఎట్టిదో
అట్టి
భావము;
ఎట్టి
భావమో
అట్టి
బుద్ధి;
ఎట్టి
బుద్ధి,
అట్టి
సిద్ధి:
దైవసన్నిధి
అనే
పెన్నిధి
పొందుటకు
ఆహారవిహారములను
పరిశుద్ధపరచుకోవలెను.
ఆధిభౌతికదుఃఖమనగ—భూతములచేత
పీడింపబడుట,
అంటే,
క్రిమికీటాదులచే
పశుపక్షిమృగాదులచే
కలుగు
బాధలు.
వీటిని
నివారించుటకు
యోగమార్గముననుసరించాలి.
యోగమంటే,
చిత్తవృత్తి
నిరోధము.
చిత్తవృత్తులను
అరికట్టేది.
అపుడు
ఏబాధనూ
ఉండదు,
ఎవరు
దూషించినా,
ఎవరు
స్తోత్రము
చేసినా,
మనఃశాంతిని
మాత్రం
పోగొట్టుకొనకూడదు.
ఇంద్రియనిగ్రహము
చేకూరితే,
మనశ్శాంతిసిద్ధించును.
దీనికి
యోగసాధన
అవసరము.
మీకు
యోగాసనములను
నేర్పించుటకు
ఏర్పాటు
చేస్తున్నాము.
దానివలన
ఆరోగ్యము
ఉత్తమమగును;
బాధలను
నివారించే
శక్తికూడ
దొరకును.
ఆధిదైవికదుఃఖమును
దూరము
చేసుకొనుటకు
సమాధిస్థితిని
సంపాదించవలెను.
ఆ
దుఃఖమనగ
దైవమువలన
కలిగే
అతి
వృష్టి
అనావృష్టి
మొదలైనవి.
వీటివలన,
మానవుని
మనస్సులో
భయముత్పత్తియై,
వాడు
చాలా
బాధపడును.
సమాధి
అంటే
క్రిందపడటము,
తన్మయత్వములో
పడి
చేతులు
కాళ్లు
ఆడించటము,
అస్పష్టముగా
మాట్లాడటము
ఇవి
కావు.
ధీ
అంటే
బుద్ధి;
సమ
అంటే,
సమత్వముగా.
ఏరు
పేరు
లేకుండ,
క్రుంగక
పొంగక,
బుద్ధిని
సమత్వంగా
నిలుపుట,
అదే
నిజమైన
సమాధి.
2
▾
Meaning
Keep
దానిని
సంపాదించాలి.
ఈ
స్థితిని
నిర్వికల్పస్థితి
అనికూడా
చెప్పుదురు.
సంకల్ప
వికల్పములులేనిదే
నిర్వికల్ప
సమాధి.
గుణములకు
అతీతమైనపుడే
సమత్వ
భావన
దృఢమయ్యేది.
చీకటి
పోవాలంటే,
వెలుతురు
రావాలి;
పాపపరిహారానికి
పుణ్యకర్మలు
చెయ్యాలి.
అట్లనే,
శాంతి
సంపాదించుటకు
సంకల్పశూన్యుడు
కావాలి.
సంకల్పములే
మనోవికారమునకు
మూలకారణము;
మనస్సు
వికారమైనచో
మానవాకారమే
నాశనమగును;
మానవాకారము
కలుషితమైనచో
మాధవత్వం
సిద్ధించదు.
తనలో
మాధవత్వమున్నదనే
సత్యాన్ని
మరచిపోతాడు.
ఎట్టి
మూర్ఖులుకూడ
బంగారము,
వెండి,
వజ్రములు
వీటిని
ఇంటి
బయట
పారవేయడు.
ఇంటిలోపల
భద్రమైన
పెట్టెయందే
పెట్టి
కాపాడుదురు.
తట్ట
బుట్ట
కుండ
మొదలగు
వస్తువులుమాత్రం
బయటనే
ఉండును.
అట్లనే,
అమూల్యమైన
ఆత్మను
పవిత్రహృదయమందు
ఎవరికీ
సులభముగా
కనపడని
స్థలమందు
భగవంతుడు
ఉంచాడు.
దేహము
పాంచభౌతికము;
అది
కూలక
తప్పదు;
కాలక
తప్పదు.
దేహమే
దేవ
దేవుడు.
దేవుని
ఆశ్రయించిన,
దుఃఖముండదు.
ఆత్మయొక్క
విలువ
సిద్ధార్థ,
భగీరథ
వీళ్లకు
తెలుసు.
వారు
రాజ్యాధిపత్యమునే
విసర్జించి
అరణ్యమున
నివసించి
అనేక
విధములుగా
తపస్సునాచరించి,
ఆత్మదర్శనమునార్జించి
ఆనందమయులైనారు.
ఆత్మవిద్యా
విద్యానాం
అన్నారు.
లోకవ్యవహారముకొరకు
మీరు
ఫిజిక్స్,
కెమిస్ట్రీ,
బాటని
మొదలైన
విద్యలనభ్యసించే
తీరాలి.
వాటిని
చదువ
వద్దని
చెప్పటములేదు;
జీవనోపాధికి
అవి
అవసరమే.
అవన్నీ
ఆధేయమైన
కొమ్మలు
రెమ్మలు
ఆకులు
పుష్పములు
కాయలు.
వాటిపై
నీరు
పోసిన
ప్రయోజనముండదు.
కనిపించని
వేర్లకు
నీరు
పోసితే,
కనిపించు
కొమ్మలు
రెమ్మలు
బాగా
పెరుగును.
కాబట్టి,
మీరు
ఈవయస్సునందే,
దానినికూడ
తెలిసికొనుటకు
ప్రయత్నము
చేయవలెను.
నిత్యానందమునకు,
సమాధి
స్థితికి,
సమత్వదర్శనమునకు,
అదే
ముఖ్యమైన
సాధన.
Previous
←
Teaching in ancient India
Next
The saadhaka and the scholar
→