Contents
Devotion & Sacred Story
Home
Library
Find
Shelf
Settings
←
Leave
Sathya Sai Speaks 1980 · The saadhaka and the scholar
Tap a verse for its meaning
IAST
Telugu
Meaning
Continuous
The saadhaka and the scholar
27 July 1980, Guru Pūrṇimā, Prasanthi Nilayam
1
▾
Meaning
Keep
ప్రేమస్వరూపులారా!
ప్రతిప్రాణికీ
పరిపూర్ణత
నొందటమే
విధి.
ఎన్ని
జన్మలెత్తినా
ఏరీతి
జీవించినా,
చివరకు
ఆ
స్థితిని
పొందియే
తీరవలెను.
ఎపుడు
ఎట్ల
అనేది,
పూర్వజన్మ
కర్మలపై
ఆధారపడి
యున్నది;
ఆ
కర్మల
వెనుక
నున్న
భావాలపై
రూపొందును.
కర్మభావ
ఫలితమే
నేటి
పరిస్థితి.
నేటి
కర్మభావ
ఫలితము
భవిష్యత్తు.
మన
అదృష్టమునకు
మనమే
కర్తలము.
ఈ
అదృష్టనిర్మాణకార్యములకు
పరుల
సహాయము
అవసరమా?
పరిపూర్ణ
పారమార్థికస్థితి
ఉన్నతస్థాయిని
పొందుటకు
పరుల
సహాయమవసరమే.
అది
గ్రంథపఠనము
నుంచి
లభించునది
కాదు.
ఒక
హృదయమునుంచి
మరొక
హృదయమునకు
చేరవలసిన
సంబంధ
బాంధవ్యముల
వలన
కలిగే
అభివృద్ధి
అది.
గ్రంథావలోకనమువలన
తర్కవితర్కాలు
పెరుగును.
బుద్ధిచే
శక్తిసామర్థ్యములు
వృద్ధి
పొందుటకు
వీలున్నది;
కానీ,
ఆధ్యాత్మికములో
ముందంజవేయుటకు
అనుభూతులే
ప్రధానము.
ఇట్టి
అనుభూతులను
హృదయమందు
కలుగచేయుటకు,
కరడు
కట్టిన
అజ్ఞానమును
నిర్మూలం
చేయుటకు,
పారమార్థిక
దివ్యప్రభావము
నందుకొనుటకు,
గురువు
అత్యవసరము.
అది
ఒక
జీవత్వమునుంచి
మరొక
జీవత్వమునకు
నేరుగా
రావలసినదే.
పరిపూర్ణమైన
పవిత్రమైన
ఆత్మజ్ఞానము
గురువు
లేక
అందదు.
గురువులలో
అనేక
రకములున్నాయి,
దీక్షాగురు,
శిక్షాగురు
అని.
ఒక
మంత్రమునుపదేశించిన
వారు
గురువు
అని
చెప్పటము
ఆ
పదమును
అపార్థము
చేసుకొన్నట్లే.
అదొక
ప్రాచీన
సాంప్రదాయము.
మంత్రమును
ఉచ్చరిస్తున్నపుడు
బహుమంది
తమలోని
దివ్యత్వమును
విస్మరిస్తున్నారు.
అయితే,
తరతరాలనుంచి
కోటి
కోటి
కంఠాలు
స్తోత్రముచేయు
గురువు
శిష్యునికి
శిక్షణ
నందించి
తీర్చిదిద్ది,
వాని
అంధకారమును
నిర్మూలించిన
వారు.
‘గు’
అంటే
అజ్ఞానాంధకారం,
‘రు’
తన్నివారణం.
ఇదే
గురుపూర్ణిమయొక్క
అంతరార్థము.
పూర్ణిమ
అంటే
పూర్ణతత్వము.
ఆత్మతత్వమే.
ఆ
అతీతమైన
పూర్ణతత్వము.
పూర్ణమంటే,
గుణతత్వములోని
పూర్ణత్వము,
Quality
లో
పూర్ణత్వం.
చక్కెర
పెద్ద
ఖండము
తీపు;
అణువైననూ,
అదే
తీపు.
అగమ్యమైన
అగాధమైన
సముద్రముయొక్క
రుచి
తెలియుటకు
దానిని
పూర్తిగ
త్రాగనక్కర
లేదు;
ఒక
బిందువును
నోటిలోవేసుకొంటే
చాలు.
అగాధరూపములోనూ
అణురూపములోనూ,
పరమాత్మ
ఏకరీతిగా
సచ్చిదానంద
స్వభావమే.
ఇదే
సచ్చిదానందము;
దీనినుండి
తీసిన
బిందువుకూడ
అదే
సచ్చిదానందమే.
ఘనస్వరూపము.
అణుస్వరూపము—రెండూ
పూర్ణమే.
మానవులలోని
ఆత్మ,
పరమాత్మ
రెండూ
స్వరూపతః
పూర్ణమే.
ఈ
దినము
పౌర్ణిమ,
పూర్ణచంద్రునిలో
మచ్చ
కనబడదు.
తెల్లదనము
చల్లదనము
ప్రధానమై
యుండును,
అజ్ఞానం,
అంధకారం
అనే
మచ్చలు,
మనస్తత్వముయొక్క
ప్రతీకమైన
చంద్రునిలో
మనస్తత్వములోని
దివ్యత్వము
పూర్ణముగా
ఈ
నాడు
ప్రకాశించుటకు
వీలగును.
గురువు
ఎట్టివాడై
ఉండాలి
భక్తి
ప్రపత్తులతో
సహనశాంతులతో
పరిపూర్ణ
తేజస్సుతో
వెలగాలి.
2
▾
Meaning
Keep
ఆచరణరూపమైన
ప్రబోధతో
అజ్ఞానమును
నివారించే
వారే
గురువులు.
గ్రంథపఠనమువలన
చిత్తశుద్ధి
కావచ్చు,
కానీ,
విషయస్వరూపము
అర్థం
కాదు;
అందున్న
ఆత్మతత్వపరిజ్ఞానమునకు
కీలకం,
ధ్యానమువలన
లభించే
అనుభూతులే.
మహాపురుషుల
ప్రేమను
సంపాదించి
వారి
ప్రబోధలను
విని
మననము
చేసి
నిదిధ్యాసన
మొనర్చితే
మాత్రం
అది
సాధ్యము
ఈశ్వరుడే
గురువులకు
గురువు.
ఈశ్వరానుగ్రహమువలన,
గ్రుడ్డివాడు
దర్శించగలుగుతాడు;
కుంటివాడు
పర్వతమును
దాటగలుగుతాడు;
మూగివాడు
చక్కగా
మాట్లాడటానికి
అవకాశముండును.
స్పర్శద్వారా
కర్మఫలమైన
పాపములన్నిటినీ
నశింపజేసి
పవిత్రముగా
నిర్మలముగా
తీర్చి
దిద్దును.
అయితే,
ఈశ్వరుని
మానవరూపమందే
మానవులు
ఆరాధన
సలుపాలి.
మనలో
మానవత్వభావమున్నంతవరకూ
దానికతీతమైన
దానిని
కూడ
దర్శించుట,
అసాధ్యమైన
పని.
తన
స్థాయికి
అర్థంకాని,
ఊహించుటకు
సాధ్యంకాని
రూపమును
దర్శించుటకు
ప్రయత్నముచేసితే,
విఫలుడౌతాడు.
నిరాకార
నిర్గుణము
అంటే
ఏమి?
వివరించండి
అని
అడిగితే,
జవాబు
శూన్యం.
అద్భుత
ఉపన్యాసాలు
చెప్పవచ్చు.
తర్కవితర్కాలలో
విజయము
పొందవచ్చు;
అయితే,
అవన్నియూ
హాస్యాస్పదముగానే
మిగులును.
అట్టి
ప్రబోధలన్నియూ
సత్య
శూన్యం.
అవి
వారి
బుద్ధి
చాతుర్యమును
ప్రకటించే
ప్రయత్నములు.
మానవత్వమునందు
ఈశ్వరత్వమును
దర్శించేది,
చక్కని
రాజబాట.
ఆకారములో
మునిగియున్నవాడు
నిరాకారమును
ఎట్ల
నిరూపించగలడు?
ఆకారమునే
ఆధారముగా
తీసుకొని,
క్రమక్రమముగా
నిరాకారమును
అర్థము
చేసుకొనుటకు
వీలున్నది.
అల్పబుద్ధులు
భక్తి
ప్రపత్తులు
రహితులు
మానవాకారమున
దివ్యత్వము
రాదు
అని
చెప్పవచ్చును
కానీ
అది
సత్యసూక్తి
కాదు.
దైవం
మానుషరూపేణ,
అని
అంటారు,
కదా?
దానికోసమే,
నరజన్మమును
శ్రుతి
స్మృతులు
అంతగా
వర్ణించును.
తన్ను
తాను
తెలుసుకోవటమే,
పరమార్థము,
పురుషార్థము.
దేహభ్రాంతిగలవారు,
బాలుడా
వృద్ధుడా,
స్త్రీయా,
పురుషుడా,
అని
విచారణ
చేయుదురు.
ఇట్టి
దేహభావమువదలి
బ్రహ్మభావము
రావాలి.
ఇదికాదు,
ఇది
కాదు,
అని
చివరకు
బ్రహ్మమేతాను,
అనితెలుసుకోవాలి.
దీనినే
“నేతి
నేతి
ఇతి
ఆత్మా”
అని
శ్రుతులు
చెప్పుచున్నవి.
జీవస్వరూపము
ఆత్మయొక్క
ప్రతిబింబమే.
జీవి
నిజముగా
అమృత
స్వరూపుడు.
ఈ
సత్యమును
శంకరాచార్యులు
ముచ్చటగా
మూడుపదాలతో
లోకానికి
ఉపదేశించినారు.
బ్రహ్మసత్యం,
జగన్మిథ్యా.
జీవో
బ్రహ్మైవ
నాపరా,
అని.
ఇదే
బహుముఖ్యమైన
ఆధ్యాత్మ
ప్రబోధ—జీవుడు
బ్రహ్మముగనేవున్నాడు.
రెండిటికీ
అవినాభావ
సంబంధము.
బ్రహ్మతత్వముతో
కూడిన
మానవత్వము
హీనము
కాదు,
అల్పముకాదు,
అపవిత్రముకాదు.
ఈ
సత్యమును
విశ్వసించక,
మానవుడు
అటు
ఇటు
కదలే
సమయములో,
జీవులకు
గురువు
అత్యవసరం,
అట్టి
గురువు
వ్యాసుడు.
వ్యాసుడు
అంటే
వ్యాప్తిగావించినవాడు.
ఆత్మతత్వమును
బోధించి
అఖిల
మానవులకు
అందించిన
వాడు,
అని
అర్థము.
ప్రపంచమంతా
ఆవరించియున్న
పరంజ్యోతిని
తెలుసుకొనే
ప్రయత్నమునకు
మానవులను
ప్రోత్సహించినవాడు,
వ్యాసుడు.
భారత
భాగవతాదులను
రచించి
పదునెనిమిది
పురాణములను
వ్రాసి,
మానవులకు
సుఖశాంతులు
అందించే
ఆరాధనా
మార్గమును
బోధించినాడు.
3
▾
Meaning
Keep
జగత్తును
సృష్టించినా
వాడే
అపుడపుడు
మానవాకారముతో
అవతరించిన
గాథలంతా
వ్యాసుడు
పురాణములందు
తెలియపరచినాడు.
తమోగుణము,
రజోగుణము,
సత్వగుణము
మూడూ
చేరి
మానవాకృతి
అయినది.
సాత్వికగుణముచే
దేవతలు,
రాజసగుణములచే
మానవులు.
తమోగుణములచే
దానవులు
రూపొందిరి.
మానవులకు
బుద్ధికుశలత
ఎక్కువ.
వారికి
తీక్ష్ణ
జ్ఞానసిద్ధి
లభించును.
తమదివ్యత్వమును
తెలుసుకొనే
అవకాశముకలదు.
సృష్టియొక్క
రహస్యము
గురించి
ఒక
కథ:
దేవతలు
ఈశ్వరుని
దగ్గరచేరి,
“ప్రభో!
సృష్టిరహస్యమును
మానవులూ
దానవులూ
గ్రహించిన,
మీ
దివ్యత్వానికి
హాని,
దానివలన
ఈ
జ్ఞానమును
ఆకాశములోనే
పెట్టుతాము,”
అని
చెప్పిరి.
కాబట్టి,
ఎవరూ
దానిని
గుర్తించలేదు,
మానవులు
ఆవేదనతో
ప్రార్థించగా,
దానిని
జలములో
దాచినారు.
చివరకు,
ఈశ్వరుడు
వారి
తపస్సుకు
ప్రత్యక్షమై,
అందరి
హృదయ
కమలములందు
నిలిపిరి.
అక్కడ,
పంచభూతముల,
పంచ
ప్రాణముల,
పంచకోశములలోపల
ఆతత్వమున్నది.
దానిని
సాధనద్వారా
అనుభూతికి
తెచ్చుకోవలెను.
విలువైన
సొమ్ములను
ఇంటిలోపల
భద్రం
చేస్తారు.
అట్లనే,
ఆత్మతత్వమును
అంతరంగములోనే
వెతుకాలి.
నౌకరిస్థితిలోవున్న
వారికి
అది
దొరకదు;
గృహయజమానుడుగా
తయారుకావాలి;
అపుడే,
ఆత్మరత్నమునకర్హుడు.
బహిర్దృష్టి
ఉన్నంతవరకూ
బానిసలే.
అంతర్
దృష్టి
సంపాదించిన
తక్షణమే,
గుహలోని
ఆత్మాకారమందు
జ్యోతిప్రకాశించి
ప్రకటమగును.
అహంకారము
అసూయ
ఆశలు
మొదలగు
మేఘాలు
ఆ
ఆకాశములో
సంచరించిన
జ్యోతి
మరుగుపడును.
గురుపూర్ణిమ
అంటే,
అంతర్ముఖమైన
మనస్తత్వము
సంకల్పరహితుడుగా
ప్రకాశించే
దినము.
నియమనిష్ఠలతో
కాలపరిమితముగా
సాధనలు
జరిపితే,
ఆత్మజ్యోతి
ప్రకాశించును.
కానీ,
చదువువలన
ఫలితముండదు.
నిజముగా,
అశాంతికారకులు
యెవరు?
చదువరులే
దీనికి
మూలకారణం.
అన్నిటినీ
విమర్శించడము,
అతిభాషలాడటం,
వాదోపవాదాలను
పెంచటం,
వీటివలన
శాంతిదూరమగును.
చదువుతో
ఆధ్యాత్మికవిద్యను
జోడించాలి.
ఆధ్యాత్మికమును
లక్ష్యమందుంచుకొని
ఐహికమును
నడపాలి.
అంటే,
దేవాలయమునకుపోయి
వ్యాపారములో
లాభంవచ్చిన
నీకు
అర్ధమిస్తాను,
అనిదేవునికి
మాటిచ్చేదికాదు;
ధ్యానమువలన
ఆశలను
తగ్గిస్తూ
పోవాలి,
ధ్యేయమునే
లక్ష్యముగా
పెట్టుకోవాలి.
‘నివేదితా’
తనకు
ధ్యానములో
ఏకాగ్రత
సిద్ధించటము
లేదని
వివేకానందుని
దగ్గర
సలహా
అడిగిందట.
ధ్యానమందు
మార్గరెట్
నోబిల్
అనే
వ్యక్తి
మధ్యలో
వస్తుంది.
(ఆమె
పూర్వపు
పేరు
అది).
ఆ
వ్యక్తిత్వమును
నిర్మూలంచేయాలి,
అని,
దైవత్వమునకు
నివేదితం
చెయ్యాలి
అని
ఉపదేశించినాడు.
విసుగు
ఆలస్యము
నిరాశ
దేనికీలొంగక,
మానవాకారములో
భగవంతుని
ధ్యానముచేసి,
సద్గుణవంతులైసర్వజీవులయందూ
ప్రేమదృష్టి
పెంచుకొని
ఆనందముననుభవించుటే,
గురుపూర్ణిమ
యొక్క
సందేశము.
Previous
←
The three sorrows
Next
The doctor's profession
→