Contents
Devotion & Sacred Story
Home
Library
Find
Shelf
Settings
←
Leave
Sathya Sai Speaks 1980 · The gift I ask for
Tap a verse for its meaning
IAST
Telugu
Meaning
Continuous
The gift I ask for
23 November 1980, Fifty-fifth Birthday, Prasanthi Nilayam
1
▾
Meaning
Keep
His poems 74
Also in his talks
(1)
12 February 1989
Live nobly
ప్రేమస్వరూపులారా!
ప్రశాంతి
నిలయములోని
కార్యక్రమము
ఐదు
దినములనుండి
కూడను
నిర్విరామముగా
కొనసాగుతూ
వచ్చింది.
కాని,
ఈ
ఐదు
దినములూ
ఐదు
క్షణములవలె
గడచిపోయాయి.
కాలము
తెలియకనే
గడచిపోవుచున్నది.
కారణమేమిటి?
కాలాతీతుడైన
దైవముయొక్క
చింతన
యందు,
గాథలయందు,
కార్యక్రమమునందు
మనస్సు
లీనమగుటచేత
కాలము
తెలియకనే
గడచిపోవుచున్నది.
సముద్రముతో
కూడిన
నదులు
ఏవిధంగా
సముద్రముయొక్క
స్వరూపాన్ని
చెందుతున్నవో
అదేవిధంగా
దైవ
చింతనతోకూడిన
మనస్సు
దైవాకారమునే
పొందుతుంటాది.
ప్రపంచమంతయు
భగవంతుని
విశాలమైన
సమష్టి
స్వరూపము.
ప్రతి
వ్యక్తియందు
దైవత్వము
అగోచరమై,
అప్రమేయమై
ప్రకాశిస్తూ
ఉంటుంది.
మానవుని
యందు
గోప్యమై
ఉన్న
దివ్యత్వాన్ని,
పవిత్రతను
సత్సంగముద్వారా
వ్యక్తము
గావించుకొనుటయే
సాధనా
ఫలితము.
గుప్తముగా,
గూఢముగా
మానవుని
యందున్న
దివ్యత్వాన్ని
వ్యక్తము
గావించుకునే
ప్రయత్నమునందు
ఏనాడు
కాలమును,
కాయమును,
కర్మను
అంకితము
గావించుకొందుమో
ఆనాడే
వ్యక్తిత్వము
సార్థకమవుతుంది.
మానవత్వములోనున్న
దివ్యత్వాన్ని
ప్రతి
వ్యక్తి
కూడా
అనుభవించుటకు
సాధ్యమవుతుంది.
అంతర్ముఖమైన
ఆత్మతత్త్వమును
గుర్తించడానికి
ప్రయత్నించండి
కాని,
ఈనాడు
మానవుడు
దీనికి
విరుద్ధమైన
మార్గమును
అవలంబిస్తూ
వస్తున్నాడు.
అమెరికాలో,
ఇంగ్లాండులో
ఏమి
జరుగుతున్నదో
తెలుసుకొనుటకు
ప్రయత్నిస్తున్నాడు.
భూగోళమంటే,
ఖగోళమంటే
ఏమిటి
అనేది
కూడా
తెలుసుకోగలుగుతున్నాడు.
కాని,
తానెవ్వరో,
తన
తత్త్వమేమిటో,
తన
స్వరూపమేమిటో
గుర్తించుకోలేక,
తెలుసుకొనుటకై
ప్రయత్నించలేకపోతున్నాడు.
దీనికంతయు
విద్యావిధానమే
మూల
కారణము.
ఈనాటి
విద్యావిధానమునందు
నైతిక,
ధార్మిక,
ఆధ్యాత్మిక
భావములు
ఏమాత్రము
లేకపోవుటచేత
తన
మానవత్వమేమిటో
గుర్తించుకోవడానికి
ప్రయత్నించలేకపోతున్నాడు.
అన్ని
రకములైన
భౌతిక
ప్రపంచముయొక్క
స్వరూపమును
గుర్తించడానికి
ప్రయత్నిస్తున్నాడు.
మేథమేటిక్సును
మరువక
జపియించు
గణిత
శాస్త్రము
వంక
చూడబోడు
అమెరికా
మార్గమ్ము
నరయ
చూచును
కాని
కాశికా
మార్గము
కానరాడు
ఆల్జిబ్రా
యంత
అరసి
చూచును
గాని
ఇంటి
వైశాల్యంబు
నెరుగబోడు
అనుదినమ్మును
డ్రిల్లు
ననుసరించును
గాని
పద్మాసనము
వేయ
బాధపడును
వృక్షశాస్త్ర
మెఱుగు
సమృద్ధిగాను
తులసి
ఉపయోగ
మెఱుగడు
మానవుండు
ఈనాటి
చదువులు
ఈవిధమైన
అస్తవ్యస్తముగా
మారిపోతున్నవి.
కనుక,
మనయొక్క
దివ్యత్వాన్ని
గుర్తించుకునే
నిమిత్తమై
ఆత్మవిద్యను
అభ్యసించడం
అత్యవసరము.
ఆత్మవిద్య
అనగా
ప్రత్యేకమైన
పరిశోధన,
పరిశ్రమ
కాదు.
2
▾
Meaning
Keep
భగవద్గీతయందు
భగవంతుడు
‘బీజం
మాం
సర్వ
భూతానాం’,
‘ఈ
కనిపించే
భౌతిక
ప్రపంచమునకంతయు
నేనే
బీజమై
ఉంటున్నాను’,
అన్నాడు.
విశ్వమునకంతా
భగవంతుడే
విత్తనము.
విశ్వమే
వృక్షము.
వృక్షముయొక్క
ఫలమే
మానవత్వము.
ఈ
మానవత్వమనే
దివ్యత్వాన్ని
చవి
చూడకుండా
మనము
ఈనాడు
కాలమును
వ్యర్థము
గావిస్తున్నాము.
ఏ
పవిత్ర
గ్రంథమో,
ఏ
ఖురానో
పరిశోధన
చేసినప్పటికీ,
మహనీయుల
సఖ్యత
పొందినప్పటికీ
‘జంతూనాం
నరజన్మ
దుర్లభం’
అని
ఆ
మహా
గ్రంథములు
బోధిస్తున్నాయి.
ఇట్టి
పవిత్రమైన
మానవజన్మ
ఎత్తి
కూడా
తన
తత్త్వమేమిటో
తాను
గుర్తించుకోలేకపోతే
మానవుడు
ఏమాత్రము
ఆనందమును
అనుభవించ
లేడు.
లౌకికమైన
సుఖసంతోషములకు,
భోగ
భాగ్యములకు
మానవుడు
అఱ్ఱులుజాచుచున్నాడుగాని,
అంతర్ముఖమైన
ఆత్మతత్త్వాన్ని
గుర్తించడానికి
ఏమాత్రము
ప్రయత్నించడం
లేదు.
త్యాగభూమి,
యోగభూమి
అయిన
ఈ
భారతభూమియందు
ఉద్భవించిన
మానవుడు
పాశ్చాత్య
నాగరికతా
ప్రభావమునకు
లోనై
తన
మాతృమూర్తి
యొక్క
స్వరూపమునుకూడను
మరచిపోతున్నాడు.
తల్లిని
ధిక్కరించి
ఇతరులను
ప్రేమించేటటువంటి
వ్యక్తి
తత్త్వము
ఇది.
ఎట్టి
అంద
విహీనమైన,
వికారస్వరూపమును
కలిగి
యున్నప్పటికీ
తన
తల్లి
తనకు
ఆనందస్వరూపముగానే
ఉంటుంది.
కాని,
ఈనాడు
అట్టి
మానవత్వము
కనుమరుగైపోయింది.
కేవలము
బాహ్యమైన
జీవనాధారము
నిమిత్తమై
పరదేశాలకు
ప్రయాణమైపోతున్నారు,
విద్యార్థులు.
ఏదో
అంతో
ఇంతో
పాసు
చేసి
ఒక
డిగ్రీ
చేతబట్టి,
దానినొక
పెండెంటు
మాదిరి
మెడలో
వేసికొని
పరదేశాలకు
ధనమును
ఆర్జించే
నిమిత్తమై
ప్రయాణాలు
సల్పుతున్నారు.
నీ
విద్య,
నీ
శక్తి,
నీయొక్క
ఆత్మతత్త్వము,
బలము,
శౌర్యము
నీ
మాతృభూమి
యొక్క
ఉన్నతికై
వినియోగించడానికి
ప్రయత్నించక,
మాతృభూమికి
సేవలు
సల్పక,
పరదేశమునందు
పరాధీనమై
బిచ్చగాండ్రవలె
తయారు
కావడం
ఎంతటి
విచారకరమైన
విషయము!
మాతృదేశముయొక్క
పేరు,
ప్రతిష్ఠలను
నిలబెట్టడానికి
కృషి
చేయండి
త్రేతాయుగమునందు
రాముడు
లక్ష్మణ
సమేతుడై
లంకలో
ప్రవేశించి
రావణుని
హతమార్చి,
తిరిగి
అయోధ్యకు
ప్రయాణమైన
సమయమునందు
లక్ష్మణుడు
చెప్పాడు
రామునకు,
“అన్నా!
అయోధ్యకు
పోయినప్పటికీ
రాజ్యము
దక్కుతుందనే
నమ్మకము
నాకు
లేదు.
కైక
భరతునకు
రాజ్య
పట్టాభిషేకము
చేసి
ఉండవచ్చును.
లంకా
పట్టణమనేది
స్వర్గాన్ని
మించినదిగా
ఉంటున్నది.
లంకలో
నీవు
రాజ్యమును
అనుభవించి,
రాజ్యాధిపతిగా
ఉంటుండి,
ఇక్కడే
సుఖములను
అనుభవించవచ్చు
కదా!”
అప్పుడు
రాముడు,
“లక్ష్మణా!
తల్లి
ఎంత
కురూపి
అయినప్పటికీ
పరాయి
స్త్రీ
అందచందాలు
చూసి
ఆమె
నా
తల్లి
అని
భ్రమించే
వెఱ్ఱివాడను
కాను
నేను.
నా
భరతభూమియే
నా
నిజమైన
మాత.
లంకా
పట్టణమనే
మాత
ఎంత
అందచందములతో
సౌభాగ్యవంతముగా
ఉండినప్పటికీ,
ఎంత
వజ్ర
వైఢూర్య
మరకత
మాణిక్యములతో
శోభిల్లుతున్నప్పటికీ
ఆమెయొక్క
అందచందాలు
నాకు
అవసరం
లేదు”,
అన్నాడు.
కనుక,
మీరు
ఈ
పవిత్రమైన
భారతదేశమునందు
పుట్టి,
సాధ్యమైనంతవరకు
శక్తి,
సామర్థ్యములతో
సేవలు
సల్పి,
మాతృదేశముయొక్క
పేరును
సార్థకము
గావించుకోవడానికి
ప్రయత్నించక,
కేవలము
ధనమును
ప్రోగు
చేసుకునే
నిమిత్తమై
బిచ్చగాండ్రవలె
ఏ
ఇరానో,
ఇరాకో,
దుబాయో
బయలుదేరిపోతున్నారంటే,
నిజంగా
మీరంతా
బుద్ధిమంతులేనా?
విద్యావంతులేనా?
కాదు,
కాదు.
కేవలము
ధనమునకు
దాసులైన
మహా
పాపులనే
చెప్పవచ్చును.
భారతీయుల
పూర్వీకులు
‘దురాశ
దుఃఖమునకు
చేటు’
అన్నారు.
ఏమైంది?
ఇరాన్‌కు
వెళ్ళినటువంటివారు,
ఇరాక్,
దుబాయ్‌లకు
వెళ్ళినటువంటివారు
కట్టుగుడ్డలతో
అక్కడినుండి
తిరిగి
వస్తున్నారు.
ధనము
కదలిపోయే
మేఘములవంటిది.
Money
comes
and
goes
but
morality
comes
and
grows.
3
▾
Meaning
Keep
ఆశలున్నంతవరకు
ఆత్మసందర్శనము
లభించదు
మనయొక్క
నీతి,
నిజాయతీని,
మనయొక్క
గుణమును,
మన
దివ్యతత్త్వమును
పరదేశములకు
అమ్ముకొని
జీవించే
ఈ
తుచ్ఛమైన
బ్రతుకు
భారతీయులకు
తగదు.
నీ
రెండు
చేతులారా
ఈ
భరతభూమియందు
కష్టపడి
పనిచేస్తే
నీ
జేనెడు
పొట్టను
నింపుకోలేవా?
ఈ
దురాశలు
ఎందుకు
మనకు?
నిజముగా
ఈనాడు
మానవత్వాన్ని
మంటగలిపేది
దురాశయే.
అందువలన,
మానవులు
దీనిని
అదుపులో
పెట్టుకోవడానికి
ప్రయత్నించాలి.
ఆశలున్నంతవరకు
ఆత్మసందర్శనము
లభించదు.
కనుకనే,
పురుష
సూక్తమునందు
‘న
కర్మణా
న
ప్రజయా
ధనేన
త్యాగేనైకే
అమృతత్వ
మానశుః’
అని
చెప్పబడింది.
త్యాగము,
బలము,
జ్ఞానము
ఇవి
భగవంతుని
గుణములు.
నీ
ఆత్మ
బలమును
నీ
మాతృదేశమునకు
వినియోగించు.
తదుపరి
పరదేశములకు
కూడను
ఉపయోగించు.
ఇంట
గెలవక
రచ్చ
గెలవడానికి
ప్రయత్నం
చేస్తే
సాధ్యమయ్యే
విషయమా?
నీ
చదువు,
నీ
శక్తి,
నీ
వివేకము
నీ
దేశమునందే
అనుభవించలేనటువంటివాడవు
పరదేశములందు
ఏరీతిగా
అనుభవించ
గలవు?
కనుక,
దురాశలకు
ఏమాత్రము
గురి
కాకుండా
ఉండే
ప్రయత్నాన్ని
అవలంబించాలి.
స్వార్థమనే
పెనుభూతము
మానవునియందు
చేరడం
వలననే
దురాశతో
అతనికి
స్నేహం
ఏర్పడుతున్నది.
కనుక,
దురాశ
అనేది
కాని,
స్వార్థమనేది
కాని
తనలో
ఏమాత్రము
ప్రవేశించకుండా
మానవుడు
ప్రయత్నించాలి.
భగవంతుని
‘నిర్గుణం
నిరంజనం
సనాతనం
నికేతనం
నిత్య
శుద్ధ
బుద్ధ
ముక్త
నిర్మలస్వరూపిణం’
అన్నారు.
నిర్మలము,
నిస్వార్థము
రెండూ
మానవుని
రెండు
నేత్రములు
కావాలి.
నిస్వార్థముగా
జీవించే
మానవుడు
నిరంతరము
ఆనందముతోనే
ఉంటాడు.
దీనికి
నేనే
సాక్షి.
నా
వాంఛలన్నియు
లోకకల్యాణ
వాంఛలే!
దివ్యాత్మస్వరూపులారా!
మీరు
నమ్మవచ్చు,
నమ్మకపోవచ్చు.
మీ
నమ్మకములతో
నాకు
పనిలేదు.
నాయందు
అణుమాత్రమైనా
స్వార్థమనేది
లేదని
నేను
ఘంటాపథంగా
చెప్పగలను.
నేను
ఏ
పని
చేసినప్పటికీ,
ఏవిధమైన
మార్గమును
అవలంబించినప్పటికీ
సర్వుల
ఆనందముకోసమే,
సంతోషముకోసమే,
సౌఖ్యముకోసమే
మరియు
సన్మార్గముకోసమే.
ఇంకేమైనా
వాంఛ
అనేది
నాయందున్నదా?
లేదు.
వాంఛ
అనేది
వేలమైళ్ళ
దూరం
కూడను
నా
కంటికి
కనిపించదు.
నా
వాంఛలన్నియు
లోకకల్యాణ
వాంఛలే.
నా
సంకల్పములన్నీ
లోకోద్ధరణకొరకే.
‘లోకాస్సమస్తా
స్సుఖినో
భవంతు’
అన్నదే
సాయియొక్క
ధ్యేయము.
మానసిక
పరిణామము
ఏర్పడినప్పుడే
లోకక్షేమము,
లోకకల్యాణము
ప్రణాళికలచేత
లోకోద్ధరణ
జరగడమన్నది
అసాధ్యము.
మానవుని
యందు
మానసిక
పరిణామము
ఏర్పడినప్పుడే
లోకక్షేమము,
లోక
కల్యాణము
సంభవిస్తుంది.
మనస్సు
పవిత్రమైనదిగా
లేక
ఎన్ని
ప్రణాళికలు
పెట్టినప్పటికీ
అవి
సత్ఫలితాలనివ్వవు.
యువకులు
భావి
భారతోద్ధారకులు.
కనుక,
వారిని
ఉద్ధరించి,
అభివృద్ధిపరచి,
వారికి
మానసిక
సంస్కారము
చేకూర్చి
తద్ద్వారా
భారతదేశముయొక్క
సౌభాగ్యమును
దేశదేశములలోనూ
అందించుట,
అనేదే
సాయియొక్క
ఉద్దేశ్యము.
నా
సిరిసంపదలన్నియు
నా
విద్యార్థులే!
నా
ఆశలన్నియు
విద్యార్థులపైననే
ఆధారపడి
ఉంటున్నాయి.
వారిని
చక్కదిద్ది
లోకానికి
సరియైన
ఆదర్శప్రాయులుగా
నిరూపించాలన్నదే
సాయియొక్క
సంకల్పము.
కాని,
సాయియొక్క
ప్రేమతత్త్వమును,
విశాలమైన
భావమును
గుర్తించుకోవడము
చాలా
కష్టము.
ఒక
చిన్న
ఉదాహరణ
చెబుతున్నాను.
పిల్లలను
తీసికొని
కాశ్మీరుకు
వెళ్ళినాము,
జమ్మూ
వెళ్ళినాము,
ఢిల్లీ
వెళ్లినాము,
ప్రయాగ
వెళ్లినాము.
4
▾
Meaning
Keep
ఎక్కడకు
వెళ్ళినప్పటికీ
పిల్లలకు
ఏమి
అవసరమో,
ఏది
ఇష్టమో
దానినే
నేను
అవలంబించుతూ
వచ్చాను.
మీ
ఆనందమే
నా
ఆనందము
అంతేకాదు.
అతిశయోక్తిగా
చెప్పడం
కాదు.
నా
ప్రేమతత్త్వమును
మీకు
వెల్లడి
చేసే
నిమిత్తమై,
విప్పి
చూపించే
నిమిత్తమై
మీకీ
తత్త్వాన్ని
తెలపడానికి
ప్రయత్నిస్తున్నాను.
ఇంత
గొప్ప
మహాసభ
జరుగుతున్న
సమయమునందుకూడా
మా
పుట్టపర్తి
విద్యార్థులకు,
అనంతపురం
విద్యార్థినులకు,
బెంగుళూరు
విద్యార్థులకు,
జైపూరు
మరియు
భోపాల్‌లోని
విద్యార్థినులకు
ఏమేమి
కావాలి,
అనే
విషయమునందే
నేను
నా
దృష్టిని
నిలిపాను.
విద్యార్థులకు
ఏవిధంగా
ఆనందాన్ని
అందించాలి,
వారిని
ఏరీతిగా
సంతృప్తిపరచాలి,
వారిని
ఏవిధమైన
కట్టుబాట్లకు
అలవాటు
చేయాలి...
ఈవిధంగా
నా
ఆలోచనలన్నీ
సాగిపోతాయి.
అందరూ
కళకళలాడుతూ,
కిలకిల
నవ్వుతూ
ఉండాలి,
అనే
ఉద్దేశ్యముతో
పిల్లలకోసమై
నేనొక
యాభై
మంది
టైలర్లను
ఇక్కడికి
పిలిపించి,
రాత్రింబవళ్ళు
రెండు
నెలలపాటు
వారికి
గుడ్డలు
కుట్టించాను.
కాని,
నా
స్వంతానికి
ఒక
ఇంచి
గుడ్డ
అయినా
క్రొత్తది
నేను
కొనుక్కోలేదు.
ఈనాడు
నేను
ధరించినది
కూడను
‘కింగ్డమ్
ఆఫ్
సత్యసాయి’
విద్యార్థులు
తెచ్చి,
వాళ్ళు
బలవంతము
చేయడంచేత
నేను
ధరించాను.
ఆవిధంగానే,
ఆహార
విహారములందు
కూడను
‘అది
కావాలి,
ఇది
కావాలి’
అనే
ఆశ
నాకు
ఏనాడుకూడను
లేదు,
రాదు,
రాబోదు.
మీ
ఆనందమే
నా
ఆహారము.
అట్టి
ఆహారము
నేను
భుజించుటకై
అనేక
విధములైన
ప్లాన్లు
వేస్తుంటాను.
నాకు
ఆనందము
కావాలనుకున్నప్పుడు
మీకు
ఆనందాన్ని
అందించి
తద్ద్వారా
నేను
ఆనందాన్ని
పొందుతాను.
కనుకనే
అన్నాను,
My
life
is
My
message
అని.
ఇది
దైవముయొక్క
గుణము
మాత్రమే
కాని,
వేరొకటి
కానేరదు.
ఒక
చిన్న
ఉదాహరణము.
ఒక
విత్తనమును
నాటినాము.
అదొక
పెద్ద
వృక్షమయినది;
వేలకొద్దీ
ఫలములను
అందించినది.
అయితే,
ఒక్కొక్క
ఫలములోనూ
విత్తనము
చేరి
ఉంటున్నది.
అదేవిధముగనే,
దైవత్వమనే
విత్తనమునుండి
విశ్వమనే
విశాలమైన
వృక్షము,
తిరిగి
దానియందు
మానవత్వమనే
ఫలము
చేరి
ఉంటున్నవి.
ఈవిధంగా
నాటబడిన
విత్తనము
తిరిగి
అన్ని
ఫలములలో
చేరి
ఉంటున్నది.
కనుకనే,
‘ఈశావాస్య
మిదం
సర్వం’
అన్నారు.
అందరిలో
ఉండే
దైవత్వాన్ని
దర్శించడమే
మానవ
జీవితానికి
సార్థకత
దైవాన్ని
ఏ
దేవాలయమునందో,
క్షేత్రమునందో,
ధ్యానమునందో
చూస్తామనుకోవడం
కేవలము
భ్రమ.
సజీవమైన
మానవునియందే
దైవత్వాన్ని
చూడలేనివారు
నిర్జీవమైన
రాళ్ళయందు
ఏరీతిగా
చూడగలరు?
మానవునియందు
దైవత్వాన్ని
ప్రేమపూర్వకంగా
దర్శించినప్పుడే
మానవత్వము
ఆకర్షణీయంగా
రూపొందుతుంది.
కనుక,
మంచిచెడ్డలకు
పొంగక,
క్రుంగక
నలుగురిలో
ఉండే
దైవత్వాన్ని
గుర్తించడానికి
ప్రయత్నం
చేసినప్పుడే
సాయిసంస్థలయందు
చేరినందుకు
మీ
జన్మ
సార్థకమవుతుంది.
ఆశయాలను
అనుసరిస్తూ,
సాయి
నిబంధనలను
శిరసావహించి,
సాయి
అడుగుజాడలయందు
జీవితాన్ని
గడపడానికి
ప్రయత్నించిన,
మీరు
తప్పక
ధన్యులవుతారు.
ఆత్మవిశ్వాసమున్నప్పుడే
ఆత్మానందము
ప్రేమస్వరూపులారా!
నమ్మకమనేదే
మానవునియొక్క
జీవితము.
నమ్మకమే
లేకపోతే
మీరు
ఒక్క
క్షణమైనా
లోకములో
ఉండడానికి
వీలుకాదు.
కాని,
మీకు
జీవితాన్ని,
లోకాన్ని
ఇచ్చి,
అన్ని
విధములైన
ఆదర్శాన్ని,
అనుకూలములను
ప్రసాదించిన
దైవముమీదనే
మీకు
ఈనాడు
నమ్మకము
పోతుండాది.
5
▾
Meaning
Keep
చిన్నచిన్న
చిల్లర
విషయాలయందు
నమ్మకాన్ని
బలపరచుకుంటున్నారుగాని,
పవిత్రమైన,
జీవితానికి
ఆధారమైన,
కీలకమైన
దైవత్వాన్ని
మాత్రము
విశ్వసించడానికి
మీరు
సిద్ధంగా
లేరు.
కనుక,
ప్రప్రథమంగా
ఆత్మవిశ్వాసం
అత్యవసరం.
ఆత్మవిశ్వాసమున్నప్పుడే
ఆత్మానందము.
అటువంటి
ఆత్మానందమును
పొందగలిగినప్పుడే
నీవు
సర్వసంగ
పరిత్యాగివి
కాగలవు.
సర్వసంగ
పరిత్యాగివి
అయినప్పుడే
సర్వేశ్వరత్వము
నీకు
ప్రాప్తిస్తుంది.
ప్రేమస్వరూపులారా!
ఈనాడు
నా
పుట్టిన
పండుగను
జరుపుకుంటూ
మీరానందమును
అనుభవిస్తున్నారు.
నిజానికి
నాకు
పుట్టిన
పండుగ
అన్నదే
లేదు.
మీ
ఆనందము
నిమిత్తమై,
మీ
ఆశల
నిమిత్తమై
నేను
ఏవో
కొన్ని
కార్యక్రమములు
జరుపుతూ
పోతుంటాను
కాని,
నాకు
రెండూ
లేవు.
పుట్టుక
ఉంటే
కదా
చావు;
చావుంటే
కదా
పుట్టుక.
నాకు
చావు,
పుట్టుకలు
రెండూ
లేవు.
దివ్యాత్మస్వరూపులారా!
పుట్టిన
పండుగకు
ఒక్క
కానుకను
నాకు
ఇవ్వడానికి
ప్రయత్నించండి.
ఈ
కానుకను
నేను
అడుగక
తప్పదు.
ఏ
కానుక
అది?
మీ
స్వార్థాన్ని
తగ్గించుకోండి.
దురాశను
తగ్గించుకోండి.
త్యాగాన్ని
అభివృద్ధిపరచుకోండి.
విశాల
హృదయులుగా
రూపొందండి.
దీని
కొరకు
మీరు
సాధనలు
సల్పితే
ఈ
పుట్టిన
పండుగకు
ఇక్కడకు
చేరినందుకు,
ఈ
మహాసభయందు
పాల్గొన్నందుకు
సరియైన
ఆనందాన్ని
మీరు
అనుభవించడానికి
అవకాశం
ఉంటుంది.
Previous
←
Live up to Sai ideals
Next
The search for fulfilment
→