Contents
Devotion & Sacred Story
Home
Library
Find
Shelf
Settings
←
Leave
Sathya Sai Speaks 1985 · Without service to the people, no happiness and Śānti
Tap a verse for its meaning
IAST
Telugu
Meaning
Continuous
Without service to the people, no happiness and Śānti
23 November 1985, Sixtieth Birthday, Prasanthi Nilayam
1
▾
Meaning
Keep
His poems 53
Also in his talks
(1)
25 December 2003
Give up the illusion of the body, and you yourself are God
ఏ
గుణంబు
గణించి
యేతెంచెనో
నాడు
ప్రహ్లాదు
పాలింప
పరమ
పురుషు
డే
గుణంబు
గణించి
యేతెంచెనో
నాడు
కరిని
గాచెడి
తరి
కమల
నయను
డే
గుణంబు
గణించి
యేతెంచెనో
నాడు
పేద
కుచేలుని
బ్రోవ
వేదచరితు
డే
గుణంబు
గణించి
యేతెంచెనో
నాడు
ధ్రువకుమారుని
సాక
వైకుంఠవాసి
ఆ
గుణంబె
గణించి
ఆ
అమరవంద్యు
డార్త
జనుల
పాలించ
నవతరించె
అనాథనాథ
శ్రీనాథ
లోకనాథ
సచ్చిదానందమూర్తి
పుట్టపర్తి
సత్యసాయి
ఈశ్వరుడు
సకలైశ్వర్య
స్వరూపుడు.
శంకరుడనగా
శుభంకరుడు.
సర్వజ్ఞత్వము,
సర్వ
వ్యాపకత్వము,
సర్వశక్తిమయము
అయిన
దైవత్వానికి
లేనిది
ఈ
జగత్తులో
ఒకటికూడా
కానరాదు.
కాని,
మానవులు
భౌతికమైన
ఈ
జగత్తునకు
ఆధారమైన
దైవత్వాన్ని
విస్మరించి,
ప్రాకృత
వస్తు
వాహనాదులనే
విశ్వసించి
జీవితాన్ని
అర్థం
చేసుకోలేక
వ్యర్థం
చేసుకుంటున్నారు.
మానవుల
మనః
ప్రవృత్తి
కోరికల
మూట.
దీనినే
వేదాంత
పరిభాషలో
‘కామమ’న్నారు.
ఇది
జిజ్ఞాసా
మయమైనప్పుడు
విజ్ఞానపు
అవధులను
దాటి
నక్షత్ర
మండల
రహస్యాలను,
అనంత
సాగరంలోని
అద్భుతాలను
వెల్లడి
జేస్తుంది.
ప్రాకృతమైనప్పుడు
సంకుచిత
భావాలతో,
రాగద్వేషాలతో
దుఃఖాన్ని
అందిస్తుంది.
ఆధ్యాత్మికమైనప్పుడు
హృదయానందాన్ని
చేకూరుస్తుంది.
నిర్గుణం
నిరంజనం
సనాతనం
నికేతనం
నిత్య
శుద్ధ
బుద్ధ
ముక్త
నిర్మలస్వరూపమైన
ఆత్మతత్త్వాన్ని
ఒక్క
సాత్విక
గుణముతో
మాత్రమే
సాక్షాత్కరించుకోవడం
సాధ్యమవుతుంది.
మానవుని
ప్రవర్తనలోనే
దోషాలు
కనిపిస్తున్నవి
ధనంలో
దోషం
లేదు.
విద్యలో
దోషం
లేదు.
విజ్ఞానంలోనూ
దోషం
లేదు.
కాని,
మానవుని
ప్రవర్తనలోనే
ఈ
దోషాలు
కనిపిస్తున్నవి.
పరిశుద్ధమైన
జలమునకు
ఎటువంటి
రంగూ
ఉండదు.
నల్లని
సీసాలో
పోసినప్పుడు
నల్లగా
కనిపిస్తుంది.
ఎఱ్ఱని
సీసాలో
పోస్తే
ఎఱ్ఱగా
కనిపిస్తుంది.
పరిశుద్ధమైన
సీసాలో
పోస్తే
పరిశుద్ధంగా
కనిపిస్తుంది.
అదేవిధముగా,
ధనము,
ఐశ్వర్యములందుగాని,
విద్యావివేకములందుగాని
ఎట్టి
దోషమూ
లేదు.
రాజసిక
ప్రవృత్తి
గలవాని
హృదయంలో
చేరినప్పుడు
అవి
రాగ,
ద్వేష
స్వరూపాన్ని
ధరిస్తాయి.
తామసిక
ప్రవృత్తి
గలవాని
హృదయంలో
ప్రవేశించినప్పుడు
తమస్సు
రూపం
ధరించి
రాక్షసత్వంలోకి
ప్రేరేపిస్తాయి.
సాత్విక
హృదయంలోకి
ప్రవేశించినప్పుడు
లోక
కల్యాణానికి,
మానవ
జీవిత
ఆదర్శానికి
ఉపకరిస్తాయి.
కనుకనే,
ప్రతి
మానవుడు
సాత్విక
ప్రవృత్తిని
అభివృద్ధిపరచుకొని,
సత్యమైన
మార్గములో
ప్రవేశించి,
నిత్యమైన
గమ్యాన్ని
చేరడానికి
ప్రయత్నించాలి.
2
▾
Meaning
Keep
మానవత్వములో
దివ్యత్వమును
గుర్తించడానికి
కృషి
చేయడమే
మానవ
ధర్మం
మానవత్వానికి
ఆధారమైనది
దైవత్వమొక్కటే.
ఎంత
ధనమున్నా,
ఎంత
బలమున్నా,
విద్య
ఉన్నా,
వినయమున్నా
భక్తి,
ముక్తులకు
అవి
పనికి
రావు.
త్యాగమునందే
అమృతత్వము
ప్రాప్తిస్తుందిగాని,
లోభమునందు
కాదు.
దురదృష్టవశాత్తు
బాధలను
కలిగించే
లోభమందు
మాత్రమే
వాసనలను
అభివృద్ధిపరచుకొని,
మానవుడు
బంధితుడవుతున్నాడు.
కనుక,
మానవత్వంలోని
దివ్యత్వాన్ని
గుర్తించడానికి
సత్సంగంలో
చేరి,
సన్మార్గంలో
ప్రవేశించడానికి
కృషి
చేయాలి.
ఇదే
ప్రధానమైన
మానవ
ధర్మము.
“ధారణాత్
ధర్మ
మిత్యాహుః”,
ధరించేది
ధర్మము.
జగత్తునంతా
ధరించి,
భరించి
నడిస్తున్నది
ఈ
ధర్మమే.
అయితే,
మానవుడు
నిరంతరం
జారిపోయే,
పారిపోయే
మనస్తత్వం
కలిగి
ఉండడంచేత
సత్య,
నిత్యమైన
ధర్మతత్త్వాన్ని
గుర్తించడానికి
ప్రయత్నించడం
లేదు.
ప్రతి
పదార్థము
యొక్క
సత్యస్వరూపమును
నిరూపించే
తత్త్వమే
ఈ
ధర్మము.
వస్తువును
వస్తువుగా
నిరూపించి,
దాని
సత్యస్వరూపమును
ప్రకటించేదే
ధర్మము.
ఒక
చిన్న
ఉదాహరణము.
ఒక
కారున్నది.
కారుకు
రూపమున్నంత
మాత్రమున
ప్రయోజనం
లేదు.
కారుకు
స్టీరింగు,
బాల్
బేరింగు
రెండూ
చక్కగా
ఉండాలి.
ఇంతేకాదు,
టైర్లు,
వైర్లుకూడా
సరిగా
ఉండాలి.
ప్రయాణం
చేయడానికి
సరియైన
స్థితిలో
ఉన్నప్పుడే
‘కారు’
అనే
పేరు
దానికి
సార్థకమవుతుంది.
కారు
ధర్మమేమిటి?
గమ్యం
చేరేవరకు
ప్రయాణం
చేస్తూ
తన
కర్తవ్యాన్ని
సక్రమంగా
నిర్వహించడమే
కారు
ధర్మము.
అదేవిధముగా,
దివ్యత్వమనే
గమ్యాన్ని
చేరడంలో
ఎట్టి
దోషాలూ
లేకుండా
తన
కర్తవ్యాన్ని
సక్రమంగా
నిర్వహించడం
ప్రధానమైన
మానవధర్మము.
తత్త్వజ్ఞానము
ఎంత
సేకరించినా,
విజ్ఞాన,
ప్రజ్ఞాన,
సుజ్ఞానములలో
సార్థక
నామము
సంపాదించినా
మానవ
జన్మలో
తాను
సాధించిన
విలువలు
ఏమిటి?
అని
విచారించుకోవాలి.
నర,
నారాయణుల
సంబంధం
మానవజన్మ
పొంది
మానవుడనే
పదానికి
అర్థాన్ని
గుర్తించుకోలేని
స్థితిలో
మానవుడుంటే
మాటకేమి
విలువ
ఉంటుంది?
ఆకారము
కాదు,
ఆచరణ,
ప్రవర్తన
మానవత్వానికి
సరియైన
లక్షణాలు.
మానవునకు
దైవము
ఎంత
ప్రధానమో,
దైవానికి
మానవుడు
అంతే
ప్రధానము.
మానవుడే
లేకపోతే
దివ్యత్వ
ప్రకటనకే
అవకాశము
లేదు.
కుమారుడు
ఉన్నప్పుడే
తండ్రి
అనే
పదానికి
అర్థం
ఉంటుంది.
నరుడు
అనే
పదమున్నప్పుడే
నారాయణుడు
అనే
పదానికి
విలువ.
దైవము
మానవుని
ఏవిధంగా
సృష్టిస్తున్నాడో,
మానవుడుకూడా
సాధనరూపంలో
దైవాన్ని
సృష్టించుకోవాలి.
అదే
సాక్షాత్కారము.
తన
తత్త్వాన్ని
తాను
గుర్తించి,
సరియైన
మార్గములో
ప్రవర్తించినప్పుడే
తన
స్వరూపాన్ని,
తన
ఆకారాన్ని
తాను
గుర్తించడానికి
వీలౌతుంది.
దైవత్వాన్ని
గుర్తించడం
అందరికీ
సాధ్యం
కాదు.
కొన్ని
బలహీనతల
కారణంగా
మానవుడు
మూర్ఖత్వమును
పెంచుకుంటున్నాడు.
ఈ
మూర్ఖత్వముచేతనే
కృతఘ్నుడుగా
మారుతున్నాడు.
ఇసుకను
నూరి
తైలమును
తీయవచ్చు.
కుందేలు
తలపైన
కొమ్ములను
చూడవచ్చు.
ఎండమావులలో
నీరు
త్రాగవచ్చు.
కాని,
మూర్ఖునిలో
సుగుణాలను
చూడలేము.
సూర్యుడున్నచోట
చీకటి
ఉండదు.
అంధకారాన్ని,
అజ్ఞానాన్ని
దూరం
చేసేవాడు
సూర్యుడు.
సూర్యుని
‘తమఘ్నాయ
నమః
హిమఘ్నాయ
నమః
కృతఘ్నఘ్నాయ
నమః’
అని
ప్రార్థిస్తాము.
చీకటిని
రూపుమాపే
గుణము
సూర్యునకున్నది.
గడ్డ
కట్టిన
మంచు
సూర్యుడు
రాగానే
తన
అహంకారాన్ని
అణగద్రొక్కుకుని
నీరై
ప్రవహిస్తుంది.
తమస్సు,
హిమము
సూర్యుడు
రావడంతోటే
పటాపంచలైపోతాయి.
కృతఘ్నుని
చూస్తే
సూర్యుడు
ఏమాత్రము
ఓర్చుకోలేడు.
కృతఘ్నుని
దృష్టిని
కోల్పోయేటట్లు
చేస్తాడు.
జగత్తును
దర్శింపజేస్తున్నది
చక్షువులలో
సూక్ష్మరూపము
ధరించి
వున్న
సూర్య
తేజస్సే.
3
▾
Meaning
Keep
సాయికి
ఎవ్వరూ
శత్రువులు
లేరు
అన్ని
ఆకారాలకు
లోకములో
శత్రుత్వమున్నదిగాని,
సాయికి
మాత్రము
శత్రువులు
ఎక్కడా
కనిపించరు.
కొందరు
అపోహలను
అభివృద్ధి
పరచుకొని
బాహ్యచర్యలను
మాత్రమే
చూస్తూ
హృదయ
తత్త్వాన్ని
విస్మరించడంచేత
సాయికికూడా
శత్రువులు
వున్నట్లు
భావిస్తుంటారు.
వారి
దృష్టిలో
శత్రువులు
వున్నట్లు
కనిపించవచ్చుగాని,
నా
దృష్టిలో
శత్రువులు
ఎవ్వరూ
లేరు.
నాకు
అందరూ
ప్రియులే.
నాకున్న
సంపద,
ఐశ్వర్యము
లోకములో
మరెవ్వరికీ
లేదు.
నాకున్నంత
సంపద
ప్రపంచబ్యాంకులో
కూడా
లేదు.
చక్రవర్తులకు,
మహారాజులకుకూడా
లేదు.
ఏమిటా
సంపద?
ఏమిటా
ఐశ్వర్యము?
నిస్వార్థమైన,
నిర్మలమైన
ప్రేమ.
నిస్వార్థ,
నిర్మల
ప్రేమతో
జీవితము
గడపడంచేతనే
నా
శరీరముకూడా
ఎంతో
తేజోమయముగా
ఉంటున్నది.
అరవైయవ
దినోత్సవము
జరుపుకునేవారి
ఆకారము
చూసి
మీరే
విచారించుకోవచ్చు.
ఈనాడు
ఈ
శరీరము
ఆడుతూ
పాడుతూ
అరవైయవ
జన్మదినోత్సవము
జరుపుకుంటున్నది.
ఈనాడు
కూడా
ఆడగలను,
పాడగలను,
పరుగెత్తగలను,
చూడగలను,
వినగలను.
పదహారు
సంవత్సరాల
యువకునివలె
ఉన్నాను.
ఈ
దేహములో
ఎట్టి
బలహీనతలు
కూడా
లేవు.
దీనికి
కారణము
నా
పవిత్రమైన
గుణమే.
ఇట్టి
తత్త్వాన్ని
లోకులు
గుర్తించడానికి
ప్రయత్నించరు.
బాహ్య
చర్యలను
మాత్రమే
దృష్టి
యందు
ఉంచుకొని
బలహీనతలుగా
భావిస్తూ
మాట్లాడుతుంటారు.
భగవత్తత్త్వమును
విరుద్ధంగా
భావించుకోవడం
అజ్ఞాన
లక్షణం
సాయినుండి
ఎవరైనా
దూరమైనప్పుడు
“సాయిబాబానుండి
కొంతమంది
దూరమైనారు.
ఇంక,
సాయిబాబా
బలము
తగ్గిపోవచ్చును”
అని
భావిస్తుంటారు.
వారు
నాపైన
ఇష్టము
లేక
దూరము
కావడం
లేదు.
వారి
ఇష్టములు
నెరవేరకపోవడంచేత
దూరమైపోతున్నారు.
నాచెంత
ఉన్నంతవరకు
వారి
ఇష్టములు
జరగవేమోనని,
లౌకికమైన
జీవితము
గడపాలన్న
ఆశ
ఉన్నవారు
నన్ను
వదిలించుకొని
జగత్తులో
ప్రవేశిస్తున్నారు.
ఎవరైనా
ప్రశ్నించినప్పుడు
వారి
గౌరవాన్ని
కాపాడుకోవడానికి
సాయిబాబాపై
ఏవో
కొన్ని
అపోహలు
కల్పిస్తుంటారు.
నన్ను
దూషించడం
వలన
వారికి
గౌరవము
కలిగితే
అదికూడా
నాకు
సంతోషమే.
వారికి
ఆవిధంగా
గౌరవము
లభించడముకూడా
నావలన
ఉపకారమే.
నదులవలన
సముద్రమున్నదా?
లేక,
సముద్రమువలన
నదులు
ప్రవహిస్తున్నాయా?
అని
విచారిస్తే,
సముద్రమువలననే
నదులు
ప్రవహిస్తున్నాయని
మనకు
తెలుస్తుంది.
నన్ను
ఆశ్రయించడంచేత
వారి
గౌరవ
ప్రతిష్ఠలు
పెరుగుతున్నాయేగాని,
వారివలన
నా
గౌరవప్రతిష్ఠలు
పెరగడం
లేదు.
దండిగా
పండిన
ఒక
ద్రాక్షతోటను
చూసిన
నక్క
తోటలోనికి
చేరి,
ద్రాక్షపళ్ళకోసం
ఎన్నో
ప్రయత్నాలు
చేసింది.
కాని,
ఆ
నక్కకు
ద్రాక్ష
అందలేదు.
కట్టకడపటికి
విసుగు
చెంది
వస్తున్నది.
నక్కను
చూసిన
ఒక
కాకి,
“నక్కబావా!
నక్కబావా!
చక్కగా
తిన్నావా
ద్రాక్ష?”
అని
అడిగింది.
అప్పుడు
ఆ
నక్క,
“ఛీ,
ఆ
ద్రాక్ష
పుల్లగా
ఉన్నది.
అందుచేత
తినలేదు”,
అన్నదట.
తనకు
అందలేదు
కనుక
ద్రాక్ష
పుల్లనిది
అని
చెప్పింది
నక్క.
అదేవిధముగా,
నక్కబుద్ధి
గల
వ్యక్తులు
కొందరు
సాయి
తమకు
దక్కకపోయే
సరికి
విరక్తి
చెంది,
విరుద్ధభావాలు
పెంచుకుంటూ
పోతారు.
అంతేగాని,
సాయిలో
ఏ
కించిత్తైనా
దోషము
చూపడానికి
ఎవ్వరికీ
అధికారము
లేదు.
కారణమేమనగా,
నాది
నిస్వార్థ
భావము.
పరోపకార
దృష్టి
గల
హృదయము.
అందరి
యోగక్షేమాలను
కోరే
స్వభావము.
లోకానందమే
నా
ఆనందముగా
భావించే
హృదయము.
ఇట్టి
హృదయం
కనుకనే,
దినదిన
ప్రవర్ధమానమైన
ఆనందముతో
జీవితము
గడుపుతున్నాను.
నాలో
ఏ
క్షణమైనా
విచారమనేది
కనిపించదు.
ఇట్టి
గుణములను
మాత్రమే
నాలో
వెతకడానికి
ప్రయత్నించాలిగాని,
తుచ్ఛమైన
విషయాలను
ఆశించి,
భగవత్తత్త్వాన్ని
విరుద్ధంగా
భావించుకోవడం
అజ్ఞానానికి
మొదటి
లక్షణము.
4
▾
Meaning
Keep
సాయి
చేసే
పనులను,
సేవలను
చక్కగా
పరిశీలించితే,
గ్రహిస్తే,
వీరీవిధంగా
ప్రవర్తించరు.
సాయితత్త్వాన్ని
చక్కగా
గుర్తించాలంటే,
సాయిప్రేమను
అనుభవించడానికి
ప్రయత్నించాలి.
ఈ
ప్రేమను
ఒక్కదానిని
మీరు
గుర్తించుకుంటే
మీరుకూడా
దైవత్వముగా
మారిపోగలరు.
ఇదే
“బ్రహ్మ
విద్
బ్రహ్మైవ
భవతి”
అంటే.
బ్రహ్మత్వాన్ని
గుర్తించినవాడు
బ్రహ్మగా
మారిపోతాడు.
ఈ
లోకంలో
సాయికి
కావలసినది
ఏదీ
లేదు.
అయితే,
లోకసంబంధమైన
బాధ్యతలు
కొన్ని
వహించడంచేత,
సంస్థను
అభివృద్ధిపరచడంచేత,
పల్లెలసేవను
చేపట్టడంచేత
ప్రజల
మార్గములను,
ప్రభుత్వ
నిబంధనలను
కొంతవరకు
అనుసరించక
తప్పదు.
‘కోర్కెలపై
అదుపు’
కార్యక్రమముయొక్క
అంతరార్థమును
గుర్తించండి
పవిత్రమైన
భావముతో,
కోర్కెలపై
అదుపు
కార్యక్రమాన్ని
ప్రారంభించాము.
దీనిని
ప్రారంభించడంలో
గల
అంతరార్థాన్నికూడా
మీకు
తెలిపాను.
మితిమీరిన
కోర్కెల
కారణంగా
ఆర్థికంగా,
ఆరోగ్యరీత్యా
జీవితాన్ని
బలహీనం
చేసుకుంటున్నారు.
సామాన్యంగా
ప్రతి
మానవుడు
ధనమున్నప్పుడు
దానిని
దుర్వినియోగం
చేయడానికి
ఉత్సాహంగా
ముందంజ
వేస్తాడు.
కొన్ని
బీద
కుటుంబాలుకూడా
ఇట్టి
శ్రీమంతులను
అనుకరించి
చెడిపోతున్నాయి.
దుర్వినియోగాన్ని
అరికట్టాలనే
ఉద్దేశ్యంతోనే
కోర్కెలపై
అదుపు
కార్యక్రమాన్ని
ప్రారంభించాము.
ఒక
కూలీ
దినానికి
పది
రూపాయలు
సంపాదించుకుంటే,
రెండు
రూపాయల
సారాయి
త్రాగుతున్నాడు.
మూడు
రూపాయలు
సినిమాకి
ఖర్చు
పెడుతున్నాడు.
ఇంకో
రెండు
రూపాయలు
ఏవేవో
దురలవాట్లకు
ఖర్చు
చేస్తున్నాడు.
ఇట్టి
దుర్వినియోగముచేత
వారి
కుటుంబజీవితము
కుంటుపడుతున్నది.
కనుకనే,
సిగరెట్లు,
బీడీలు
త్రాగడం,
మద్యమాంసాలు
తీసుకోవడం
ఇటువంటివన్నీ
మానివేసి
ఆర్థికంగా
చక్కబడినప్పుడు
నిలువ
చేసుకున్న
ధనముతో
కొన్ని
కుటుంబాలనైనా
పోషించవచ్చుననే
ఉద్దేశ్యంతో
ఈ
కార్యక్రమాన్ని
ప్రారంభించాము.
కొంతమంది
దీని
యథార్థ
స్వరూపాన్ని
గుర్తించక
ఏదో
విధంగా
డబ్బు
సంపాదించడమే
సాయిసంస్థల
లక్ష్యమని
భావించారు.
సాయిసంస్థలు
ఏనాడుకూడా
ధనంకోసం
పాటుపడలేదు.
ప్రజలకు
తగిన
సేవ
చేయడం,
సరియైన
మార్గం
చూపించడం
సాయిసంస్థ
ప్రధాన
లక్ష్యం.
కాని,
దీనికి
విరుద్ధమైన
అర్థాలు
కల్పించుకొని,
సిగరెట్లు,
బీడీలు
త్రాగడం
మానలేదు.
మద్యపానాన్ని
మానుకోవడం
లేదు.
డబ్బు
మాత్రం
తెచ్చి
కడుతున్నారు.
ఈ
డబ్బు
నాకు
అక్కర్లేదని
స్పష్టంగా
చెప్పాను.
కోరికలను
అరికట్టుకోమని
కోరినామేగాని,
డబ్బును
ఆశించలేదు.
సంకల్పించినంతనే
సిద్ధించడం
సాయితత్త్వం
జగత్తులో
ధనము
అవసరమే.
ఎవరికి?
నాకోసం
కాదు.
నేను
ఏనాడూ
ధనమును
ఆశించను.
అయితే,
కొన్ని
సంస్థలు
స్థాపించి,
వాటి
బాధ్యతలు
వహించేవారు
కొందరున్నారు.
ధనమే
లేకపోతే
ఏ
కార్యక్రమం
చేపట్టడానికి
వీలుకాదు.
ఆరువేల
గ్రామములు
దత్తత
తీసుకున్నాము.
ఈ
గ్రామాలలో
విద్య,
వైద్య
సౌకర్యాలేగాక
రోడ్లు,
మంచినీటి
సౌకర్యాలు
కల్పిస్తున్నాము.
ఏనాడుకూడా
నాకు
ధనం
కావాలి,
అన్నమాట
నా
నోట
రాలేదు.
చేస్తున్న
సత్కార్యాలు
చూసి,
వ్యక్తులు
ముందుకు
వచ్చి
ఉదారంగా
త్యాగం
చేస్తున్నారు.
ఒక్క
వరిగింజ
భూమిలో
నాటితే
వంద
గింజలవుతాయి.
సంకల్పించినంతనే
సిద్ధించడం
సాయితత్త్వం.
కాలేజీ
నిర్మాణ
సంకల్పం
కలిగిన
తక్షణమే
రాజమాత
కాలేజీ
కట్టించింది.
భిక్షమడగలేదు.
ఆశయాల
అభివృద్ధి
ఈ
రూపం
దాల్చింది.
చిన్నతనము
నుండియే
పిల్లలను
చక్కగా
అభివృద్ధి
పరచడానికి
స్కూలు
పెట్టాలని
సంకల్పించడంతోటే
ఇటలీ
ప్రధాని
సోదరుడు
క్రాక్సీ
వచ్చి
ఈ
స్కూలు
నేను
కట్టిస్తానన్నాడు.
హైయర్
సెకెండరీ
స్కూలుకూడా
ఉంటే,
చిన్నప్పటినుండి
పిల్లలను
చక్కని
క్రమశిక్షణతో
పెంచవచ్చును
గదా,
అని
సంకల్పించుకున్నాను.
తక్షణమే
అమెరికానుండి
బొజానీ
అనే
ఆయన
వచ్చి
హైయర్
సెకెండరీ
స్కూలు
కట్టించాడు.
బెంగుళూరులో
హాస్టలు,
కాలేజీలు
కూడా
సంకల్పించుకున్న
తక్షణమే
కోవన్
సతీమణి
వచ్చి
వీటిని
పూర్తి
చేస్తానని
బాధ్యత
వహించింది.
5
▾
Meaning
Keep
సిద్ధి
జరిగే
రీతిగా
ఉంటేనే
సాయికి
సంకల్పము
కలుగుతుంది.
అలాంటి
సంకల్ప
బలము
ఉన్నందుననే
ఇలాంటి
కార్యములు
చేయడానికి
వీలౌతుంది.
దీనిని
మీరు
గుర్తించాలి.
మరొక
విషయం.
ప్రశాంతి
నిలయమునందు
గడచిన
ఏడు
దినముల
నుండి
ఉదయం,
మధ్యాహ్నం,
రాత్రి
చక్కగా
లక్షలాది
మందికి
భోజనాలు
పెడుతున్నారు.
పట్టుమని
పదిమందికి
అన్నం
పెడితే
తాటికాయంత
అక్షరాలతో
న్యూస్
పేపర్లో
వేసుకుంటారు.
కాని,
ఇన్ని
లక్షల
మందికి
ఆనందంగా,
తృప్తిగా
భోజనాలు
పెడుతున్నా
మాలో
ఏ
ఆడంబరమూ
లేదు,
ఏ
ఆరాటమూ
లేదు.
ఎవరికి
పెడుతున్నాము?
మావారికి
మేము
పెడుతున్నాము.
దీనికి
ప్రచారం
ఎందుకు?
దీనికికూడా
కొంతమందికి
సందేహము
కలుగవచ్చు.
ఇన్ని
విధాలుగా
పదార్థాలు
ఏవిధంగా
వచ్చినవి?
డబ్బు
పెట్టకపోతే
లభిస్తాయా?
అనుకోవచ్చు.
అదీ
సంకల్పమే.
ఈతూరి
60వ
జన్మదినోత్సవానికి
వచ్చినవారందరికీ
ఆహారాన్ని
అందించాలి;
అన్నదానముకన్న
అధికదానము
లేదు,
‘అన్నం
బ్రహ్మ’
అనే
సంకల్పము
భక్తుల
హృదయంలో
నాటుకున్నది.
నేను
కొడైకెనాల్లో
ఉండగా
తూర్పు,
పశ్చిమ
గోదావరి
జిల్లాలనుండి
డా
॥
భాస్కరరావు,
కారుణ్యానంద
కొడైకెనాల్కే
వచ్చి,
60వ
జన్మదినోత్సవ
సందర్భంగా
అందరికీ
సంతర్పణ
చేసే
మహాభాగ్యాన్ని
ప్రసాదించాలని
ప్రార్థించారు.
‘లక్షలలో
వస్తారు,
సాధ్యం
కాదు’
అని
నేను
వారించినా
‘స్వామి
అనుగ్రహం
ఉంటే
కోట్లమంది
వచ్చినా
భరించగలము’
అన్నారు.
ఇది
మహా
పవిత్రమైన
కార్యము
కనుక,
సరేనని
ఒప్పుకున్నాను.
తూర్పు,
పశ్చిమ
గోదావరులతోపాటు
కృష్ణా,
గుంటూరు,
నెల్లూరు
జిల్లాలనుండి
మొత్తం
5000
బస్తాల
బియ్యం
వచ్చాయి.
పంజాబునుండి
గోధుమలు,
గోధుమపిండి,
రవ్వ
బస్తాలు
వచ్చాయి.
చక్కెర
ఫ్యాక్టరీలనుండి
చక్కెర,
బెల్లం;
మద్రాసునుండి
పప్పులు
వచ్చేశాయి!
వలదన్నాకూడా
వచ్చి
కల్పవృక్షముముందు
చేరినట్లు
చేరిపోయాయి!
ఇవన్నీ
అడిగితే
లభించేవా?
మీరడిగి
చూడండి,
లభిస్తాయేమో!
దుడ్డు,
బ్లడ్డు
ఎప్పుడూ
ప్రవహిస్తూనే
ఉండాలి
అడుగకున్నా
ఇవన్నీ
వచ్చిపడడం...
అదే
సాయి
ప్రేమతత్త్వం.
ఎంతమంది
ధనవంతులు
ఈ
లోకంలో
లేరు!
అందరికీ
త్యాగబుద్ధి
పుడుతుందా?
ధనమున్నప్పుడు
దానిని
సద్వినియోగపరచుకునే
విధానాన్ని
గుర్తించాలి.
ధనం
కాలిబూట్ల
వంటిది.
బూట్లు
కాలికి
సరిగా
ఉంటేనే
నడవడానికి
వీలౌతుంది.
టైట్గాగాని,
లూజ్గాగాని
ఉంటే
నడవడానికి
సాధ్యం
కాదు.
అదేవిధంగా,
ధనము
అధికంగా
ఉన్నా
జీవితంలో
సుఖపడ
లేరు.
ఇది
ధనవంతులకు
సరిగా
అర్థమవుతుంది.
ధనము
లేకపోయినా
జీవితము
గడవదు.
ఎంతవరకో
అంతవరకే
ఉన్నప్పుడు
జీవితంలో
సుఖ
శాంతులను
అనుభవించగలుగుతారు.
నదిలో
నీరెంత
ఉన్నా,
కుక్క
గతుకుతుందేగాని
జుఱ్ఱుకోదు.
అట్లే,
కొంతమంది
ధనమెంత
ఉన్నా
గుంతలో
వేసిన
చెత్తవలె
మురగబెడతారు.
అది
క్రుళ్ళి
కంపుకొడుతుంది.
అదే
చెత్తను
పంటభూమిలో
చల్లినప్పుడు
ఎరువై
పంటను
పెంచుతుంది.
అందుకే,
ఉన్నవారిదగ్గరనుండి
ఈవిధంగా
పుచ్చుకుని
పల్లెలకు
సేవ
చేయాలనే
ఉద్దేశ్యంతో
ఈవిధంగా
సంకల్పించడం
జరిగింది.
ధనము
గుణాన్ని
పవిత్రం
చేయనప్పుడు
అది
నిష్ప్రయోజనమైపోతుంది.
దేహంలో
రక్తం
ప్రసరిస్తూ
ఉంటేనే
ఆరోగ్యంగా
ఉంటుంది.
అదేవిధముగా,
డబ్బుకూడా
చెలామణిలో
ఉంటేనే
దేశానికి
క్షేమం.
దుడ్డు,
బ్లడ్డు
రెండూ
ఎప్పుడూ
ప్రవహిస్తూనే
ఉండాలి.
ప్రపంచములోని
ఏ
సంస్థలూ
సత్యసాయి
సంస్థలకు
సాటిరావు
డబ్బును
పవిత్ర
కార్యాలకు
మళ్ళించాలని,
ఈవిధంగా
దేశాన్ని
ఆదర్శంగా
రూపొందించాలని
కోర్కెలపై
అదుపు
కార్యక్రమాన్ని
పెట్టాము.
అంతేగాని,
అది
ధనాశతో
చేసిన
పని
కాదు.
సంస్థల
అభివృద్ధికి
ధనము
అవసరమైనా
ఎవ్వరినీ
అడగడం
లేదు.
చేయాలని
ఎవరు
సంతోషంతో
వస్తారో
వారికి
మాత్రమే
బాధ్యతలనిస్తున్నాను.
6
▾
Meaning
Keep
సత్యసాయి
సంస్థల
తత్త్వాన్ని
సరిగా
అర్థం
చేసుకోవాలి.
ప్రపంచంలో
అనేక
సంస్థలు
ఉన్నాయి.
కాని,
సత్యసాయి
సంస్థల
ఆదర్శం
ఎందులోనూ
కానరాదు.
ఏవో
కొన్ని
పొరపాట్లు
ఉండవచ్చును.
కాని,
మొత్తంమీద
సత్యసాయి
సంస్థల
కార్యకర్తలు
ఎంతో
శ్రమించి
పని
చేస్తున్నారు.
హృదయపూర్వకంగా
చేస్తున్నారు.
ప్రశాంతి
నిలయం
వాతావరణం
చూస్తే
తెలుస్తుంది.
ఏనాడూ
ఎండ
కన్నెరుగని
స్త్రీలు
చెట్ల
క్రింద
ఉంటూ
చిరునవ్వుతో
అననుకూలాలను
అనుభవిస్తున్నారు.
ఎంతగా
భక్తిప్రపత్తులుంటే
ఈ
భావం
కలుగుతుంది!
రాత్రింబవళ్ళు
వండేవారు,
వడ్డించేవారు,
సేవాదళ్
వాలంటీర్లు
శ్రమ
అనేది
లేకుండా
పని
చేస్తున్నారు.
ఇన్ని
లక్షలమంది
చేరినా
ఒక్కరికైనా
ఒక్క
చీమైనా
కుట్టిందా?
వారి
భక్తిప్రపత్తులే
దీనికి
కారణం.
వచ్చిన
భక్తులు
గొప్ప
సహనాన్ని
ప్రదర్శించారు.
మొన్న
కస్తూరి
నావద్దకు
వచ్చి,
‘స్వామీ!
నెల్లూరు,
ఒంగోలువైపు
తుపాను
వస్తుందని
రేడియోలో
చెప్పారు.
రాయలసీమకుకూడా
తుపాను
వస్తుందట’,
అని
చెప్పాడు.
‘నీవేమీ
భయపడవద్దు
కస్తూరీ!
మన
భక్తులకు
ఏవిధమైన
అననుకూలమూ
జరుగదు.
వారి
భక్తే
వారికి
ఛత్రమువలె
కాపాడుతుంది’,
అన్నాను.
ఆ
తుపానే
వచ్చివుంటే
ప్రజలందరూ
ఎన్ని
అవస్థలకు
గురి
అయ్యేవారో!
ఇదంతా
స్వామి
చేశారా?
కాదు,
కాదు.
మీ
ప్రేమ
హృదయమే
స్వామిని
అట్లా
మార్చగలిగింది.
వెన్న
చేతిలో
పెట్టుకున్నంత
మాత్రాన
కరుగుతుందా?
వేడి
చూపాలి
కదా!
అదేవిధముగా,
స్వామి
హృదయం
వెన్నవంటిదైనప్పటికీ
భక్తిప్రపత్తులనే
వేడి
చూపినప్పుడే
అది
కరుగుతుంది.
రెండవ
దినము
చూస్తే
తుపాను
ఎక్కడికి
పోయిందో,
ఏమైనదో
ఎవరికీ
తెలియదు.
ఈ
పది
దినములు
వాతావరణము
ఎంత
పవిత్రంగా
వున్నదో,
ఎంత
దివ్యమైన
భావములతో
మీరు
కార్యక్రమములలో
పాల్గొన్నారో
మీకు,
స్వామికి
మాత్రమే
తెలుసు.
అన్యులకి
ఇది
అర్థమయ్యేది
కాదు.
సాయిప్రేమను
సాధించడమే
నిజమైన
తపస్సు
ప్రేమస్వరూపులారా!
మీ
భక్తిప్రపత్తులు
చాలా
ఉత్తమమైనవి.
మీ
సహనం,
శాంతము
ఇంత,
అంత
అని
చెప్పడానికి
సాధ్యం
కాదు.
అయితే,
నావారిని
నేను
పొగడడం
భావ్యం
కాదు.
ఎన్ని
దేశాలనుండో
వచ్చారు.
విదేశీయులు
ఎన్నో
అనుకూలములు,
సౌకర్యములు
అనుభవించినటువంటివారు.
కాని,
ప్రశాంతినిలయంలో
వారికి
అన్నీ
అననుకూలములే!
ఇట్టి
పరిస్థితులలో
సాయిప్రేమను
సాధించడమే
నిజమైన
తపస్సు.
ఈ
తపస్సును
దినదినాభివృద్ధి
గావించుకొని
మీ
ఆదర్శములను,
మీ
ప్రేమతత్త్వాన్ని
గ్రామగ్రామాల్లో,
వీధివీధిన
ప్రబోధించి,
ఆనందించి,
భారతదేశానికి
కీర్తి
తేవాలి.
సంస్థల
అభివృద్ధికి
మీరు
తీసుకునే
చర్యలలో
ఎట్టి
దోషమూ
లేదు.
అయితే,
విరుద్ధ
మార్గాలలో
ప్రవేశించక,
దుర్వినియోగం
చేయక
సత్కర్మలలో
జీవితమును
గడుపుతూ
కర్మవీరుల
వలె
ముందుకు
సాగాలి.
సాయి
కోరేది
ఒక్కటే.
సోదర
మానవులను
ప్రేమించి,
సమాజ
సేవలు
చేసి,
మానవత్వానికి
సార్థకతను
సంపాదించుకోవాలి.
స్వార్థాన్ని
త్యాగం
చేయండి.
పరార్థంలో
ప్రవేశించండి.
పవిత్రతను
పెంచుకోండి.
దీనులను
ఆదుకోండి.
ఈనాటినుండి
మన
సత్యసాయి
సంస్థలు
ప్రతి
పట్టణంలో,
ప్రతి
గ్రామంలో
ప్రవేశించి,
వీధివీధిలో
వాతావరణాన్ని
పరిశుద్ధం
గావించి,
ప్రజలలో
సోదరత్వాన్ని
పెంచడానికి
ప్రయత్నిస్తాయని
ఆశిస్తున్నాను.
ఇదే
నా
పుట్టినరోజు
ఆనందము.
సత్యసాయివంటి
ప్రభువు,
సాయి
భక్తులవంటి
సేవకులు
వుంటే
ఎంతైనా
సాధించవచ్చు
60వ
జన్మదినోత్సవములో
ఒక
పరీక్షకూడా
ఉంది.
ఇందులో
జయించినవారే
నిజమైన
సాధకులు.
ఎన్ని
కష్టములకైనా,
ఎన్ని
నష్టములకైనా,
ఎన్ని
దుఃఖములకైనా,
నిందలకు,
నిష్ఠూరములకైనా
వెరువకుండా
దీనిని
సాధించడానికి
కంకణం
కట్టుకోండి.
పంట
పండించిన
రైతు
ధాన్యాన్ని
ఇంటికి
తెచ్చుకునే
సమయంలో
తూర్పార
పడతాడు.
అప్పుడు
గట్టిగింజలు
క్రింద
నిలుస్తాయి.
పొల్లు
గాలికి
కొట్టుకుపోతుంది.
అదే
విధముగా,
ఇందులో
గట్టిగింజలెన్నో,
ఒట్టి
గింజలెన్నో
తేలిపోతుంది.
7
▾
Meaning
Keep
నిజమైన
మానవత్వాన్ని,
వ్యక్తిత్వాన్ని
సాధించాలనుకున్నప్పుడు
సేవలో
ప్రవేశించవలసిందే!
స్వార్థాన్ని
త్యాగం
చేయవలసిందే!
దేశసేవను
ప్రధాన
లక్ష్యంగా
పెట్టుకోవలసిందే!
ఈ
లక్ష్యంతో
గమ్యం
చేరేంతవరకు
ప్రయాణం
సాగవలసిందే!
దీనికి
వయస్సు
పరిమితి
అని,
రిటైర్మెంటు
అని
లేదు.
కడపటి
శ్వాసనుకూడా
సేవలోనే
వదలాలి.
సేవయే
మన
జీవితానికి
గమ్యము.
ఇట్టి
ప్రభువు,
ఇట్టి
సేవకులు
ఉండడంచేత
ఎంతటి
కార్యాన్నైనా
సాధించవచ్చును.
సేవకులు
లేకపోతే
ప్రభువుకు
విలువ
లేదు.
ప్రభువు
లేకపోతే
సేవకులు
సక్రమ
మార్గాన్ని
అనుసరించరు.
అహల్యవంటి
రాయి,
రామపాదమువంటి
పాదము
రెండూ
చేరినప్పుడే
శాపవిమోచనం.
సత్యసాయివంటి
ప్రభువు,
సాయిభక్తులవంటి
సేవకులు
ఉన్నప్పుడు
ఎన్ని
కష్టాలైనా
నివారణ
కాగలవు.
మనకిరువురికీ
సన్నిహిత
సంబంధ
బాంధవ్యము
ఏర్పడింది.
సాయిని
వదలి
మీరుగాని,
మిమ్మల్ని
వదలి
సాయిగాని
ఉండడం
వీలుకాదు.
దీనిని
దృఢం
చేసుకుని
మీరు
సేవలో
ప్రవేశించండి.
మరొక
విషయం.
60
సంవత్సరముల
తరువాత
స్వామి
అందరికీ
చిక్కడని,
స్వామిలో
మార్పు
వస్తుందని
భక్తులు
ఆందోళన
పడుతున్నారు.
నాది
మారే
స్వభావము
కాదు.
స్వామి
భక్తులకు
దూరమవుతారని
అనుకుంటున్నారుగాని,
అట్లు
ఎన్నటికీ
జరుగదు.
ఇంకా
అధికంగా
స్వామి
సమీపమైపోతాడు.
మారేది
దైవత్వము
కాదు.
సత్యమైనది
సత్యసాయి
తత్త్వము.
కనుక,
నాలో
మార్పు
ఏనాటికీ
రాదు.
అపోహలను
దూరం
చేసుకొని
సేవలలో
పాల్గొనండి.
‘జనసేవ
బినా
సుఖశాంతి
నహీ....’
Previous
←
Cultivation of Love is the Greatest need
Next
Truth and Love - The goals
→