Contents
Devotion & Sacred Story
Home
Library
Find
Shelf
Settings
←
Leave
Sathya Sai Speaks 1987 · The universe is the form of Viṣṇu
Tap a verse for its meaning
IAST
Telugu
Meaning
Continuous
The universe is the form of Viṣṇu
30 March 1987, Ugādi, Prasanthi Nilayam
1
▾
Meaning
Keep
His poems 197
కోటీశ్వరులకైన
కూడుగుడ్డయె
కాని
బంగారమును
తిని
బ్రతుకలేడు.
కాలమేగాకున్న
కఱ్ఱయె
పామగు
కలసి
వచ్చిన
మట్టి
కనకమగును
పండితుడొకచోట
పశువుగా
మారు
మూర్ఖుండొక
తరిని
మునిగమారు
ధనవంతునొక
పరి
దారిద్ర్యదేవత
ప్రేమించి
వానితో
వరుసలాడు
ప్రాకులాడుటెగాని
ప్రాప్తియేలేకున్న
దమ్మిడీయైనను
దరికిరాదు
వద్దురాబాబు
వద్దు
యే
ఆశ
హద్దు
మీరి
బుద్ధితో
మెలగుము
శ్రీసాయివద్ద.
ప్రేమస్వరూపులారా!
భగవంతుని
చూస్తూ
చూడటంలేదని
భావిస్తారు
మూర్ఖులు.
విశ్వమే
విష్ణు
స్వరూపము.
ఈ
సత్యాన్ని
గుర్తించుకొనలేక
మానవుడు
భగవంతుడు
యెక్కడో
వున్నాడని
వెతుకుతూ
తమ
గమ్యాన్ని
గుర్తించటానికి
ప్రయత్నిస్తున్నారు.
వీరు
ద్వైతమతమునకు
సంబంధించినవారు.
దైవత్వము
సర్వత్ర
వుండినప్పటికి,
దివ్యత్వమైన
ప్రకృతిరూపము
ధరించినప్పటికి
మానవుడు
దేహ
మనో
అభిమానములచేత
దైవం
తనకంటె
భిన్నముగా
వుండినట్లు
భావిస్తున్నాడు.
సర్వ
మతముల
ధర్మము
చిత్తనైర్మల్యము.
సర్వ
రసముల
సారము
కరుణారసమే.
సర్వ
సాధనల
గమ్యము
శాంతి
సౌధము.
సర్వ
జీవుల
ప్రేమనే
సర్వేశ్వర
భక్తి.
ఆరోగ్యమునకు
దేహశుద్ధి
యెంత
అవసరమో,
ఆనందమునకు
మనోశుద్ధి
అంత
అవసరము.
కనుక
చిత్తశుద్ధి
నిమిత్తమై
మానవుడు
చేయు
సమస్త
కర్మలందు
దివ్యత్వాన్ని
విశ్వసించి
పవిత్రమైన
తత్వాన్ని
అభివృద్ధి
పరచుకోవాలి.
మానవుడు
ఆడంబరములతో,
అహంకారముతో,
లౌకికమైన
భ్రాంతులతో
తన
జీవితమును
బంధింపచేసుకొనుచున్నాడు.
2
▾
Meaning
Keep
ఆడంబర,
అహంకారములు
వున్నంతవరకు
ఆనందమునకు
అతిదూరమై
వుంటాడు
మానవుడు.
మొక్క
రావలెనన్న
విత్తనమును
భూమిలో
నాటవలెను.
కానీ
విత్తనమును
బహిరంగముగా
అందరు
గుర్తింప
చేసుకొనే
నిమిత్తమై
ఒక
పెద్ద
రాతిపైన
పెట్టినప్పుడు
మొక్కరాదు.
అదే
విధముగా
అణకువే
ఆనందమునందించును
కానీ
ఆడంబరము
ఆనందానికి
అతిదూరము.
సముద్రము
తనయందు
విలువైనటువంటి
ముత్యములనుంచుకొని
విలువలేనటువంటి
నత్త
చిప్పలను
మాత్రమే
బయటకు
నెట్టివేస్తుంది.
అదే
విధముగా
మానవుడు
తనయందు
విలువైన,
పవిత్రమైన,
నిత్యశుద్ధసత్యమైన
ఆత్మతత్వాన్ని
గుర్తించుకొని,
దేహరూపములైన,
నామరూపములైన
యీ
భౌతికతత్వాన్ని
మనము
అలక్ష్యపరచాలి.
కానీ
యీనాటి
మానవుడు
గుండెబలము,
కండబలము
ఆధారము
చేసుకొని
బ్రతుకుతున్నాడే
కాని
ధర్మబలమును,
దైవబలమును
ఆధారముగా
ఆశించటంలేదు.
దైవమనగా
కేవలము
సమిష్టిస్వరూపుడనే
దీనికి
అర్థము.
అనగా
విశ్వస్వరూపుడైన
నారాయణుడే
దైవము.
సర్వత్రా,
సర్వరూపములయందును,
సమస్త
విషయములందు
దైవత్వము
వుంటున్నది.
సమస్త
సాధకులు
తాము
ఆచరించే
సాధనలన్నీ
ఆత్మను
తెలుసుకోటంకోసం
కాదు.
ఆత్మ
యెల్లప్పుడూ
వున్నదే.
అనాత్మను
తొలగించుకొనే
నిమిత్తమై
సాధనలు
సలుపుతున్నాడు.
తాను
యేదైవున్నాడో
ఆ
స్వరూపాన్ని
తాను
మరచిపోతున్నాడు.
తాను
కాని
స్వరూపాన్ని
తనదిగా
భావించి
మురిసిపోతున్నాడు.
ఆత్మను
మరచిపోతున్నాడు.
వున్నది
ఒక్కటే
సత్యము.
అదే
నేను.
ఈ
నేను
నేను
అనేది
యెల్లప్పుడునూ
వున్నది.
గాఢనిద్రలో
మానవుడు
యనేకవిధములైన
తలంపులను
మరచినప్పటికి
తాను
లేకుండా
వుండటంలేదు.
గాఢనిద్రయందు
తన
దేహముగానీ,
తన
భావములుకానీ,
తనగుణములుకానీ,
తన
నామములు
కాని
యేమాత్రము
వుండవు.
కాని
తాను
లేనని
మాత్రం
చెప్పుటకు
వీలుకాదు.
నేను
అనేది
గాఢనిద్రయందుకూడ
వున్నది.
ఆ
నేను
అనే
తత్వాన్ని,
వునికిని
గుర్తించటమే
సాధనలయొక్క
రహస్యము.
నేను
గోపాలుడు
మా
తండ్రిపేరు
భూపాలుడు.
మా
కుమారుని
పేరు
నేపాలుడు.
ఈ
విధముగా
తాను,
తన
తండ్రి,
తన
కుమారుల
తత్వాన్ని,
రూపనామాన్ని
హనుమంతుని
తోకవలె
అభివృద్ధి
గావించుకుంటూ
పోతున్నాడే
కాని
మానవుడు
తన
తత్వమేమిటో
తాను
గుర్తించటానికి
ప్రయత్నించటంలేదు.
ఈరూపనామము
లెవరివి?
మనో
కల్పితములు.
మనోదేహములుండినంత
వరకే
యీ
జగత్తు.
ఆత్మ
అనగా
హృదయమే.
హృదయము
స్వప్రకాశమైనది.
హృదయమునుండి
వెలుగు
మెదడునకు
ప్రసరిస్తూ
వుంటుంది.
ఆ
స్థానమే
మనోస్థానము.
ఈ
హృదయము
వెలుగు
మనస్సుపైన
ప్రసరించటంచేత
యీ
మనస్సు
జగత్తును
చూడగలుగుతున్నది.
మనసుపైన
హృదయము
వెలుగు
లేకుండిన
యీ
మనసు
జగత్తునేమాత్రంకూడ
చూడలేదు.
అనుభవించలేదు.
మనసే
లేకుండిన
యీ
జగత్తేలేదు.
మనోమూలమిదం
జగత్.
ఈ
మనసే
చంద్రుడు.
పగటివేళ
మనము
చంద్రుడేవిధముగా
అదృశ్యుడై
వుండునో
అదే
విధముగా
ఆత్మలక్ష్యమునందు
యీ
మనసు
అదృశ్యమై
వుంటుంది.
చంద్రుడు
స్వప్రకాశకుడుకాదు.
సూర్యునియొక్క
కిరణములు
చంద్రునిపైన
ప్రసరించటంచేతనే
ప్రకాశిస్తున్నాడు.
3
▾
Meaning
Keep
కనుక
సర్వమునకు
ఆత్మయే
ఆధారము.
ఆత్మయే
మూలము.
ఆత్మయే
సర్వము.
కాని
అమాయకులైన
మానవులు
నా
దేహమందు
ఆత్మవున్నదని
భ్రమిస్తున్నారు.
దేహము,
మనసు,
విశ్వము
సర్వమూ
ఆత్మయందే
వున్నవికానీ
ఆత్మ
మరొక
దానియందులేదు.
సర్వము
ఆత్మమయమే.
సర్వము
ఆత్మస్వరూపమే.
సమస్త
చర్యలు
ఆత్మచర్యలే.
జపములు,
ధ్యానములు,
యజ్ఞములు
యాగములు
యిత్యాది
సాధనలన్నీకూడను
ద్వైతబుద్ధి
కలవారి
తత్వములే
తప్ప
నిజమైనవికావు.
దైవముకాని
లేక
ఆత్మకాని
భిన్నముగా
వున్నది
అనే
విశ్వాసము
కలవారే
యీ
చర్యలలో
పాల్గొంటారు.
దైవము
తనకంటె
భిన్నముగా
వున్నాడనే
భావన
కల్గినవాడే
మూర్ఖుడు.
దైవము
తనకంటె
భిన్నముగా
లేడు.
దైవమునకు
హృదయమున్నది.
ఆ
హృదయమే
ఆత్మ.
ఆత్మ
ప్రత్యేకముగా
వున్నదని
భావించేవారు
దైవానికి
హృదయంలేదని
భావించేవారే.
ఎన్ని
గ్రంథములు
చదివినప్పటికి,
యెన్ని
సాధనలు
ఆచరించినప్పటికి,
ఎందరు
మహనీయులను
దర్శించినప్పటికి
తన
తత్వాన్ని
తాను
గుర్తించుకొనకుండిన
తాను
పూర్తిమూర్ఖుడే.
ఆత్మలక్ష్యము
లేని
సమయమునందే
మనకు
భగవత్లక్ష్యము
కనుపించుచున్నది.
కనుక
మన
లక్ష్యమును
ఆత్మగా
వుంచుకున్నప్పుడే
యీ
జగత్తు
అదృశ్యంగా
వుంటుంది.
ముఖ్యంగా
మానవులు
చేసే
సమస్త
సాధనలు
మనసుతో
చేస్తున్నారు.
అదే
పెద్ద
పొరపాటు.
మనసుతో
చేసే
సాధనలన్నీ
మనసువైపుకే
మరల్చునుగానీ
ఆత్మవైపుకుకావు.
యతో
వాచా
నివర్తంతే
అప్రాప్య
మనసా
సహ.
మనసునకు
కానీ
వాక్కునకుకానీ
యేవిధమైన
దీనితో
యీఆత్మతత్వాన్ని
చెప్పుటకు
వీలులేదు.
దొంగ
యేనాటికి
దొంగను
పట్టించటానికి
ప్రయత్నించునా?
అదేవిధముగనే
మనసు
ఒక
దొంగ.
తనను
తాను
వశము
చేసుకొనుటకు
యేమాత్రం
ప్రయత్నించదు.
ఏ
విధంగా
మనసును
అరికట్టుటకు
వీలవుతుంది.
మనసును
ఆత్మవైపు
మరల్చినప్పుడు
మనసు
అప్రయత్నముగా
అరికట్టుకోటానికి
వీలవుతుంది.
అదృశ్యమైపోతుంది.
మనదృష్టిని
ఆత్మవైపు
మరల్చాలి.
ఈ
దృష్టి
అంటే
యేమిటి.
ఈ
చర్మ
చక్షువులచేత
బహిర్ముఖమైన
చూపునంతా
అంతర్ముఖము
గావించుకోటమా?
కాదుకాదు.
మన
దృష్టి
నిరంతరము
బహిర్దృష్టిగానే
వుంటుందికాని
దీనిని
అంతర్దృష్టిగా
మార్చుకొనుటకు
వీలుకాదు.
ఈ
చర్మచక్షువుల
స్వభావము
బహిర్దృష్టి.
అయితే
యీ
దృష్టిని
అంతర్దృష్టి
గావించుకోటమంటే
అర్థమేమిటి?
అనగా
జగద్భావమును
వీడి,
ఆత్మభావమును
స్మరించుకోటమే
దృష్టి
మార్చుకోటం.
ఒక
చిన్న
ఉదాహరణము.
అక్కడ
silver
statue
వుంది.
silver
అనేటువంటి
మెటీరియల్
మీద
మన
మనసు
వుండినంతవరకు
యీ
statue
మనకు
కన్పించదు.
స్వరూపము
పైన
మన
మనసును,
యిమిడ్చితిమా
silver
మనకు
కన్పించదు.
అదే
విధముగ
ఆత్మవైపు
మన
దృష్టిని
మరల్చినప్పుడు
మనభావమును
అమర్చినప్పుడు
యీ
జగద్భావము
అదృశ్యమైపోతుంది.
నేను,
నేను
అనే
తత్వము
సర్వత్రా
వుంటున్నది.
ముఖ్యంగా
మనము
దైవము
యేరీతిగా
వుంటుంది,
దైవముయొక్క
నామము
యేమిటి
అనే
విషయాన్ని
చక్కగా
లోతుకు
దిగి
విచారిస్తే
మొట్టమొదటి
పేరు
దైవమునకు
‘నేను’
అనేది.
ఈ
నేను
అనే
పేరు
వచ్చిన
తర్వాతనే
ప్రణవం
పేరు
వచ్చి
వుండవచ్చును.
4
▾
Meaning
Keep
ప్రణవంకంటె
ముందుది
‘నేను’.
సమస్త
సంకల్పములకంటె
‘నేను’
అనే
సంకల్పము
మొట్టమొదటు
ఆవిర్భవించినది.
‘నేను’
ను
‘నేను’గా
గుర్తించినప్పుడు
సర్వమును
గుర్తించినవాడౌతాడు.
ఎట్లనగా
ఆ
నేనే
సర్వత్రావున్నది.
నేనొక
question
అడుగుతాను.
ఎవరు
Vice
Chancellor?
షరాఫ్
నేను
I
అంటాడు.
చక్రవర్తి
యెవరు
అంటాను.
అతను
నేను
అంటాడు.
బైరాగిశాస్త్రి
యెవరు
అంటాను,
నేను
అంటాడు.
షరాఫ్
రూపనామములు,
భావములు,
సిద్ధాంతములు
వేరు.
చక్రవర్తి
రూపనామములు,
భావములు,
సిద్ధాంతములు
వేరు.
బైరాగిశాస్త్రి
రూపనామములు,
భావములు,
సిద్ధాంతములు
వేరు.
అయినప్పటికి
నా
ప్రశ్నకు
ముగ్గురినుండి
‘నేను’
అనేది
ఒక్కటిగానే
వచ్చింది.
I
is
everywhere.
దేశకాల
పరిస్థితులు
వేరుగా
వుండవచ్చు,
మనోభావములు
వేరుగా
వుండవచ్చు,
స్థితిగతులు
వేరుగా
వుండవచ్చు
కాని
అందరియందు
మాత్రము
‘నేను’
అనేది
సమత్వంగానే
వుంటున్నది.
కేవలం
మానవులయొక్క
భ్రాంతులు
మాత్రమే
మార్చుకుంటూ
వస్తున్నారు.
ఒక
చిన్న
ఉదాహరణము.
ఒక
వ్యక్తి
తాను
సంసారిగా
వుంటున్నప్పుడు
అనగా
కుటుంబముతోకూడి
వుండినప్పుడు
నేను
సంసారిని
అనుకుంటాడు.
అతనికి
యే
కష్టములో,
నష్టములో,
బాధలో
దుఃఖములో
సంభవించినపుడు
సంసారమును
విసర్జించి
ఋషీకేశము
వెళ్లి
సన్యాసము
పుచ్చుకుంటాడు.
అక్కడ
నేను
సన్యాసిని
అంటున్నాడు.
ఈ
సంసారి
అనుకోటంకాని,
సన్యాసి
అనుకోటంకానీ
వాని
భ్రాంతులే.
కాని
స్థితి
మారింది.
గతి
మారలేదు.
ఇక్కడ
నేను
సంసారి
అన్నాడు.
అక్కడ
నేను
సన్యాసి
అన్నాడు.
సంసారి
లోను
‘నేను’
వుంది.
సన్యాసిలోను
‘నేను’
వుంది.
నేను
మారలేదు.
ఈ
నేను
అనేదానికి
సంసారి,
సన్యాసి
అనేవి
మనము
తగిలించుకున్న
వేషాలు.
అదే
విధముగ
నేను
బ్రహ్మచారిని,
నేను
గృహస్థుడను
నేను
వానప్రస్థుడను,
నేను
సన్యాసిని
-
యివన్నీ
తగిలించుకొనేటువంటి
వేషాలు.
ఈ
బ్రహ్మచారి,
గృహస్థుడు
వానప్రస్థుడు,
సన్యాసిలలో
సమత్వంగా
వున్నది
నేను.
నేనే
బాలుడు,
నేనే
యవ్వనుడు,
నేనే
వృద్ధుడను,
నేనే
సర్వమును.
నేను
అనేది
సర్వరూపములయందు
వుంటున్నది
కనుక
ఆ
భిన్న
అవస్థలను
త్యజించి
ఆస్తికతత్వాన్ని
ఆత్మరూపంలో
భావించటమే
సరియైన
సాధన.
మనసు
వుండినంతవరకు
మానవుడు
సుఖదుఃఖములతోకూడి
వుంటాడు.
ఉదయించునది
అస్తమించునది,
కలియునది
విడిపోవునది,
వచ్చునది
పోవునది
అహమే
కాని
ఆత్మకాదు.
ఈ
అహం
ఆకారముతో
వుండిన
అహంకారముగా
మారిపోతుంది.
అహం
అనగా
నేనే.
ఆకారమును
త్యజించినప్పుడే
తాను
తానుగా
వుండగలడుగాని,
ఆకారమును
చేర్చుకున్నంతవరకు
తాను
తానుగా
వుండలేడు.
నిజమైన
ఆత్మస్వరూపము
నేను
ఆకారముతోకూడి
వుండటమే
అహం+ఆకారం=అహంకారం
అయిపోయింది.
అహంకారం
వుండరాదు.
దారితప్పి
నడచేటువంటి
వ్యక్తి
యెన్ని
ప్రమాదములకు
గురిఅవుతాడో,
నీతి
తప్పి
నడిచేటువంటి
వ్యక్తి
అన్ని
అవమానములకు
గురిఅవుతాడు.
ఆనీతియే
మానవజాతి.
ఆ
జాతియే
ఆత్మసంబంధమైన
జాతి.
అదియే
దివ్యత్వముతో
కూడినటువంటిది.
ఇట్టి
దివ్యత్వాన్ని
విస్మరించి,
అస్థిరమైన,
అశాశ్వతమైన,
అసుఖమునందించే
యీభౌతికమైన
రూపనామములతో
లీనమైపోతున్నాము.
కనుక
ప్రతి
మానవుడు
మనస్తత్వమనేటువంటి
దానిని
క్రమక్రమంగా
మాయరూపంలో
భావించాలి.
5
▾
Meaning
Keep
ఈ
మనసు
అనేది
కల్పితమైనది.
ఇది
ఒక్కొక్క
సమయములో
ఒక్కొక్కరూపాన్ని
ధరిస్తుంది.
ఇది
కేవలము
యింద్రియములను
మాత్రమే
అనుసరిస్తూవుంటుంది.
ఈ
యింద్రియముల
చేరికచేతనే
సుఖదుఃఖములను
అనుభవిస్తుంది.
సుఖదుఃఖములుకాని,
లాభనష్టములుకాని,
నిందాస్తుతులనుకాని
అనుభవించేది
మనసుకాని
ఆత్మకాదు.
కనుక
యివి
మనోకల్పితమైన
స్వరూపాలు.
మనస్తత్వాన్ని
మనము
కొంచెం
గమనించామంటే
ఆత్మతత్వం
మనకర్థమవుతుంది.
ఉన్నది
ఒక్కటే.
అదే
ఆత్మ.
సర్వత్రా
వున్నది
ఆత్మనే.
సర్వ
పదార్థములు
ఆత్మయే.
అట్టి
అద్వైత
దృష్టిని
మనం
కోల్పోటంచేతనే
యీ
ద్వైత
దృష్టితో
దుఃఖములకు
గురియైపోతున్నాము.
మానవుడు
ప్రతి
విషయంలో
మొట్టమొదటు
తనను
తాను
గుర్తించుకోటానికి
ప్రయత్నిస్తున్నాడు.
దేనికోసం
బ్రతుకుతున్నావంటే
నా
కోసం
నేను
బ్రతుకుతున్నానని
జవాబు
వస్తుంది.
ఇది
యేవిధంగా
నీవు
నాకోసం
నేను
బ్రతుకుతున్నానని
జవాబు
చెప్తున్నాడని
ప్రశ్నిస్తే
నా
నిమిత్తమై
నేను
నిద్రిస్తున్నాను,
నా
కోసం
నేను
భోజనం
చేస్తున్నాను.
నా
నిమిత్తమై
నేను
జీవిస్తున్నాను
అంటాడు.
మరొకరు
భుజిస్తే
నా
ఆకలి
తీరదు.
నా
కాలువిరుగుతే
మరొకరు
కట్టుకుంటే
నాకాలుసరిపోదు.
మేము
యిరువురం
ఒక
మంచంపైన
పరుండినప్పటికి
నా
కల
నాదే
వాని
కల
వానిదే.
దీనిని
పురస్కరించుకొని
ప్రతి
ఒక్కటి
నేనే
అనే
జవాబు
పలుకుతుంటాడు.
కొంతదూరం
ప్రయాణం
సల్పిన
తరువాత
యెక్కడైనా
ఒక
ఫ్రెండ్
కలసి
అయ్యా!
మనం
యెక్కడకైనా
ఒక
యాత్రగా
వెడదాం
రండి
అన్నప్పుడు
అయ్యో
నేను
ఆఫీసుకు
లీవు
పెట్టటానికి
వీలులేదు.
నా
యింటిలో
పిల్లలు,
భార్య
చాలా
అవస్థపడుతుంటారు.
ఎవరూ
వారిని
రక్షించటానికి
వీలుకాదు.
ఇప్పుడు
నేను
రావటానికి
వీలుకాదు
అంటాడు.
మరి
అదే
వ్యక్తిని
యెందుకు
వుద్యోగం
చేస్తున్నావని
ప్రశ్నించినప్పుడు
నా
ఆలుబిడ్డలను
నేనుపెంచుకోవాలి
అంటాడు.
ఇంతకు
పూర్వం
నా
కోసం
నేను
బ్రతుకుతున్నానన్న
వ్యక్తి
యిప్పుడు
నా
కుటుంబముకోసం
నేను
బ్రతుకుతున్నానంటాడు.
తనకోసం,
తన
కుటుంబంకోసం
తను
బ్రతుకుతున్నట్లుగా
చెప్తాడు.
చాలామంది
యీ
రెండు
సంబంధములతోనే
జీవితాన్ని
గమ్యంగా
అనుభవిస్తున్నామని
అనుకుంటారు.
కాదు.
కాదు.
మూడవది
మరొకటి
వుంటున్నది.
అదే
సమాజము.
అదే
ప్రపంచము.
ప్రపంచములో
యే
బాధలు
యెవరికి
సంభవించినప్పటికి
అది
నాకుకూడా
సంబంధంగావుంటుంది.
నా
దేశం
బాగున్నప్పుడే
నేను
బాగుంటాను.
నా
సమాజం
అనేక
విధములైన
అష్టకష్టములకు
గురియైనప్పుడు
నేనూ
ఆ
అష్టకష్టములలో
ఒకటిగావుంటాను.
నా
గ్రామం
బాగుండినప్పుడే
నేనూ
బాగుంటాను.
గ్రామం
యేమైనా
అయిపోనీ
నేను
మాత్రం
బాగుండాలి
అని
యే
వ్యక్తి
కోరటానికి
వీలులేదు.
కోరినప్పటికి
తాను
బ్రతుకలేడు.
సమాజమునందే
పుట్టి
సమాజమునందే
పెరిగి,
సమాజములో
జీవించే
వ్యక్తి
సమాజమును
దూరము
గావించుకొని
ఒక్క
క్షణమైననూ
జీవించటానికి
వీలు
కాదు.
సమాజము
నిమిత్తము
నేను
బ్రతుకుతున్నాను.
ఏతావాతా
సమాజము
బాగుండినప్పుడే
తన
కుటుంబము
బాగుంటుంది.
తన
కుటుంబము
బాగుండినప్పుడే
తాను
సంతోషిస్తూ
వుంటాడు.
6
▾
Meaning
Keep
కట్టకడపటికి
తను
బాగుండేది
యెప్పుడు.
తనయొక్క
కుటుంబము
బాగుండాలి.
తన
కుటుంబము
యెప్పుడు
బాగుంటుంది.
సమాజము
బాగుండినప్పుడే.
కనుక
సమిష్టిస్వరూపమైన
తత్వము
క్షేమముగా
వున్నప్పుడే
మనమందరము
క్షేమంగా
వుంటాము.
కనుకనే
భగవంతుడు
త్రిమూర్త్యాత్మకస్వరూపుడన్నారు.
వ్యష్టిస్వరూపం
ఒకటి.
కుటుంబస్వరూపం
రెండవది.
విశ్వస్వరూపం
మూడవది.
ఇదే
త్రిమూర్తిస్వరూపము.
ఈ
త్రిమూర్తులయందును
ఒకే
ఆత్మస్వరూపం.
అదే
దైవత్వము.
దైవ
అనే
పదమునకు
సమిష్టిస్వరూపమనిపేరు.
నా
చేతులు
వేరుగా
వుంటున్నాయి.
నా
కాళ్లు
వేరుగా
వుంటున్నాయి.
నా
చెవులు
వేరుగా
వుంటున్నాయి.
నా
కన్నులు
వేరుగా
వుంటున్నాయి.
నా
సర్వాంగములు
వేరుగా
వుంటున్నాయి.
అయితే
సర్వాంగములకు
సమానమైనటువంటి
తత్వము
నా
గుండె
ఒక్కటే.
ఒక్కొక్క
అంగమునకు
ఒక్కొక్క
గుండె
లేదు.
అదే
విధముగనే
ఒక్కొక్క
దేశము,
ఒక్కొక్క
గ్రామము,
ఒక్కొక్క
టౌను
యివి
వేరు
వేరు
అంగములుగా
వుండవచ్చును.
అన్ని
అంగములందును
సమిష్టిస్వరూపుడైన
దైవము
ఒక్కడే.
అతనే
గుండె.
అతనే
హృదయము.
ఈ
దేహమనే
దేశము
భగవంతునికొక
దేవాలయము.
ఈ
ప్రపంచము
భగవంతుని
విశాలమైన
వ్యక్తి
స్వరూపము
కనుక
భగవంతుని
చూడాలనుకొన్నప్పుడు
యీ
విశ్వస్వరూపాన్ని
మనం
భగవంతునిగా
దర్శించినప్పుడే
యిది
నిజమైన
భగవంతుని
దర్శనము.
సమస్తశాస్త్రములు,
సమస్త
ధర్మములు,
సమస్త
వేదములు,
సమస్త
యితిహాస
పురాణములు
యివన్నీ
ద్వైతభావములే.
ఈ
ద్వైతభావములో
వుండిన
ప్రతి
మానవునికి
కొంతకాలం
ద్వైతాన్ని
అనుసరించాలి.
తన
దృష్టి
సృష్టిపైన
వుండినంతవరకు
యీ
సృష్టిభావమే
తనయందు
ఆవిర్భవిస్తుంది.
జగద్భావమునందే
తాను
తాదాత్మ్యుడై
వుంటాడు.
కనుక
యీజగద్భావము
వున్నంతవరకే
యీ
శాస్త్రములు,
యీ
నూతన
వర్షములు,
యీ
జ్యోతిశాస్త్రము,
సర్వ
శాస్త్రములు
అత్యవసరమే.
కాలముతోకూడినది
యీ
జగత్తు.
కాలస్వరూపమే
యీ
జగత్తు.
కనుకనే
వేదము
కాలాయనమః,
కాలకాలాయనమః,
కాలాతీతాయనమః,
కాలదర్పదమనాయనమః,
కాలస్వరూపాయనమః,
అంతా
కాలమే
ప్రధానముగా
చూసుకుంటూ
వచ్చింది.
ఈ
కాలము
పంచేంద్రియములతో
కూడి
వుంటున్నది.
ఈ
పంచేంద్రియముల
ప్రభావమే
పంచాంగము
అని.
ఈ
పంచాంగము
జ్యోతిశాస్త్రముననుసరించి,
సూర్యచంద్రాదులననుసరించి,
కాలకర్మకర్తవ్యముననుసరించి
మారుతూ
వుంటాయి.
పంచాంగము
జరగబోయే
విషయమును
మాత్రమే
నిరూపిస్తుందిగానీ,
పంచాంగము
దాని
పరిహారాన్ని
పట్టుకొనిరాదు.
ఈ
పంచాంగములో
రేపటి
దినం
పదిదిక్కులు
వర్షం
కురుస్తుందని
వ్రాస్తారు
కాని
పంచాంగం
పిండితే
పది
చుక్కలైనా
నీరురాదు.
ఈ
పంచాంగతత్వమనేది
ప్రాకృతమైన
స్వరూపాన్ని
కొంతవరకు
చిత్రిస్తుంది.
ఈ
ప్రపంచమంతా
నవగ్రహములతోకూడి
వున్నదని
వారి
భావము.
ఈ
నవాధిపతులయందు
యీ
సంవత్సరము
యేడుమంది
అధిపతులు
చాలా
వుత్తమమైనటువంటి
వారుగా
వున్నారు.
రాజు,
మంత్రి-
చంద్రుడు,
కుజుడు
యీ
సంవత్సరం
చాలా
బలమైన
వారుగా
వున్నారు.
శనికి
యీ
సంవత్సరములో
యేమాత్రం
స్థానంలేదు.
కనుక
యీ
సంవత్సరం
యీ
జగత్తు
లోపల
తిండి
తీర్థాదులకు
యేమాత్రం
లోటు
లేకుండా
జరుగుతుంది.
7
▾
Meaning
Keep
నూటికి
యెనభైవంతులు
ఆహారము
అభివృద్ధి
అవుతుంది.
కాని
ప్రాకృతమైన
మార్పులు
యెంత
మంచివి
కల్గినప్పటికి
మానవుని
మనసు
పరివర్తన
చెందకపోతే
అన్నీ
నిరుపయోగమే
అవుతాయి.
కావున
యీనాడు
మానవుని
పరివర్తన
అత్యవసరమైనది.
ఈ
మనసును
పవిత్రమైన
మార్గమునందు,
ఆత్మతత్వమునందు,
విశాలమైన
రీతిగా
మార్చుకున్నప్పుడే
యీ
జగత్తు
నిరంతరం
సుభిక్షంగా
వుంటుంది.
చాలామంది
తపస్సు
చేస్తున్నామంటారు.
తపస్సంటే
యేమిటి?
తలక్రిందకుపెట్టి,
కాళ్లు
పైకిపెట్టి
యేదో
నామాన్ని
స్మరించటమా?
కఠినమైన
హృదయాన్ని
కరిగి
ప్రవహించేటువంటి
రీతిలో
మనము
మార్చుకోటమే
తపస్సు.
బాధలుపడేటువంటి
వ్యక్తులను,
దీనులను,
దిక్కులేనివారిని
చూచినప్పుడు
మన
మనసు
కరిగిపోవాలి.
మన
హృదయము
ద్రవించాలి.
అదే
తపస్సు
ఫలితము.
హృదయము
కఠినమైన
శిలగా
నుంచుకొని,
యెన్ని
సాధనలు
చేసినప్పటికి
యివి
కేవలము
నిరుపయోగమైనటువంటివే.
కాలమును
వ్యర్థము
గావించేటువంటివే.
అనేకమంది
ధ్యానము,
ధ్యానము
అంటున్నారు.
ఏది
ధ్యానము.
ధ్యానమంటే
యేమిటి?
మన
జీవితమే
ఒక
ధ్యానము.
తెల్లవారిలేచినది
మొదలు
పరుండేవరకు
మనము
ధ్యానములోనే
వున్నాము.
లేచిన
తక్షణమే
బాత్రూమ్కి
పోవటము,
ముఖమును
clean
చేసుకోటం
యీ
ధ్యానములోనే
వుంటాము
మనము.
అవి
అయిపోయిన
తక్షణమే
కాఫీ
టిఫిన్
ధ్యానములోకి
పోతాము.
అది
అయిన
తక్షణమే
డ్రెస్
వేసుకొని
ఆఫీసు
ధ్యానములో
వుంటాము.
ఈ
ఆఫీసుకు
పోయేలోపల
రోడ్డుమీద
ఏ
బస్సు
వస్తుందో,
ఏ
కారు
వస్తుందో,
ఏ
ఏక్సిడెంటు
అవుతుందో
అని
మనము
ఏక్సిడెంటుపైన
ధ్యానములోనికి
పోతుంటాము.
ఆ
రోడ్డునకు
సంబంధించిన
ధ్యానమే
లేకపోతే
ఆఫీసుకు
మనం
చేరలేము.
మనము
కాలేజీకి
పోతే
చదువు
ధ్యానములో
వుంటాము.
Play
groundకి
పోతే
ఆట
ధ్యానములో
వుంటాము.
మార్కెట్టుకుపోతే
విషయాల
ధ్యానములో
వుంటాము.
యివన్నీ
ధ్యానములే
కదా.
ధ్యానమనేది
లేకపోతే
యే
చిన్న
పని
చేయలేము.
అనగా
ఒక్కొక్క
విషయంపైన
మనసును
మరల్చటమే
ధ్యానము.
ఈ
మనసునే
దైవము
వైపు
మరల్చినప్పుడు
దైవధ్యానమంటారు.
కనుక
ధ్యానమునకు
ఒక
ప్రత్యేకమైనటువంటి
కాలము
ప్రత్యేక
పద్ధతి
మనకు
అవసరము
లేదు.
ఈ
ధ్యానమునకు
అనేకమంది
అనేకరూపనామములు
కల్పించి
కడపటికి
నిజమైన
ధ్యానాన్ని
మరుగుపరుస్తున్నారు.
ఒక
చిన్న
ఉదాహరణము.
నేను
యిప్పుడు
మాట్లాడుతున్నాను.
స్వామి
మాట్లాడేది
యేమిటి
అని
దీనిపైన
ధ్యానమే
లేకపోతే
నేను
చెప్పినదేమిటో
మీకు
అర్థంకాదు.
ఇదికూడా
ధ్యానమే.
కనుక
ధ్యానమనే
దానికి
ఒక
రూపంలేదు.
చంచలమైన
యీ
మనసుతో
ధ్యానము
చేయటమనేది
ఎవ్వరికి
సాధ్యంకాదు.
ఇప్పుడు
ధ్యానం,
ధ్యానం
అనే
పేరుతో
కేవలం
అన్ని
విధాలా
స్టంట్సు
జరిగిపోతున్నాయి.
నీవు
గంట
రెండు
గంటలు
అనవసరంగా
యీ
చంచలమైన
మనసును,
కోతివంటి
మనసును
పట్టుకొని,
అనేక
విధములుగా
అశాంతికి
గురయ్యే
బదులు,
నీవు
యింటి
పనులు
చేసుకో
ఆఫీసు
పనులు
చేసుకో,
సమాజ
పనులు
చేసుకో.
అది
ధ్యానం
కాదా.
కాలమును
యెంత
వ్యర్థము
చేస్తున్నారు.
ఒక
గంట
కూర్చున్నప్పటికి
ఒక
సెకనైనా
మనసును
అరికట్టుకోటానికి
కాదు.
ఈ
ధ్యానం
పేరుతో
నీవు
ఒక
గంటను
వేస్టు
చేస్తున్నావు
కదా.
8
▾
Meaning
Keep
నీవు
ఆకాలమును
నీవు
గృహకృత్యములలో
ప్రవేశపెట్టు.
నీవు
అన్ని
పనులు
చేస్తూకూడా
దైవాన్ని
చింతించు.
ఇవన్నీ
దైవముయొక్క
స్వరూపాలుగానే
భావించు.
ఇది
యెంత
సులభముగా
వుంటుంది.
ఇంత
సులభమైన
మార్గాన్ని
వదలిపెట్టి
అనేక
శ్రమలకోర్చి
పెద్ద
కసరత్తు
చేసి
యేమేమో
బాధలకంతా
గురి
అవుతున్నారు.
Do
your
duty
sincerely.
నీ
కర్తవ్యాన్ని
నీవు
చక్కగా
ఆచరించు.
అది
ఆచరించటానికి
విరుద్ధంగా
టైమును
వ్యర్థం
చేసుకోటం,
ధనమును
వ్యర్థంచేసుకోటం.
అమూల్యమైన
కాలాన్ని
మనము
అరక్షణంకూడా
వ్యర్థం
చేయరాదు.
కనుక
ధ్యానము
అనేటువంటిది
కేవలం
ఒక్క
విషయానికి
మాత్రమే
సంబంధించినదికాదు.
సర్వ
విషయములందు
ధ్యానమును
సమత్వంగా
మనము
ప్రసరింప
చేసుకోవాలి.
ఇంకా
మరికొంతమంది
యేకాంతవాసము
జరపాలని
భావిస్తూ
వుంటారు.
ఏకాంతమంటే
యేమిటి?
ఒంటరిగా
కూర్చోటమా?
అది
సరియైనటువంటి
అర్థంకాదు.
అనేకమంది
నేను
యేకాంతవాసంగా
వుండాలి,
నేను
ఏ
అరణ్యాలకో
పోయి
కూర్చోవాలి
అని
భావించి
యేఋషీకేశ్కో,
ఏ
హరిద్వారమో
ఏ
తపోవనములోకో
పోయి
కూర్చుంటారు.
ఇది
యేకాంతతత్వాన్ని
అర్థం
చేసుకోలేని
వ్యక్తులే
యీ
విధమైన
వ్యర్థపు
పనులలో
ప్రవేశిస్తారు.
ఏకాంతమనగా
మనసును
స్తంభింప
చేయటమే.
నీవు
అరణ్యములో
కూర్చునికూడను
నీ
మనసు
ప్రపంచమంతా
సంచారము
చేస్తుంటే
యేకాంతవాసమెలా
అవుతుంది.
సంకల్పాలను
అరికట్టకుండా
యేస్థానంలో
పోయి
శరీరముతో
కూర్చుండినప్పటికి
యిది
యేకాంతం
కాదు.
సమాధిఅన్నా
అదే.
సంకల్పములను
నిరోధించటమే
సమాధి.
సంకల్పములు
లేకుండా
చేసుకోవాలి.
లేక
సంకల్పములుండికూడను
దైవసంకల్పములుగా
మన
సంకల్పములను
భావించాలి.
ఆ
సంకల్పముల
సమయమందు
యీ
సంకల్పములెప్పుడు
వస్తున్నాయి,
యే
విధముగా
వస్తున్నాయని
విచారణ
చేయాలి.
నేను,
నేను,
నేను
అనేటువంటి
సంకల్పము
వచ్చిన
తరువాత
యీ
సంకల్పములన్నీ
ప్రవేశిస్తున్నాయి.
కొంతమంది
యీ
జగత్తు
లోపల
ధ్యానమునందుగాని,
యోగమునందుగాని,
లౌకిక
జీవితమునందుగాని
సర్వసౌఖ్యములను
అనుభవిస్తున్నామని
ఆనందిస్తుంటారు.
వీరు
నిజమైన
ఆనందమేమిటో
గుర్తించుకోలేని
వారే.
ఈ
సౌఖ్యములంటే
యేమిటో
దాని
అర్థాన్ని
తెలుసుకోలేని
వారే.
చక్కగా
విచారించి
చూస్తే
సౌఖ్యములను
నీవనుభవిస్తున్నావా
లేక
నిన్నే
సౌఖ్యములనుభవిస్తున్నాయా
అని
యోచన
చేసుకో.
కాదుకాదు.
ఈసౌఖ్యములే
నిన్ను
అనుభవిస్తున్నాయి.
మానవుని
సర్వసౌఖ్యములను
అనుభవించి
దానివల్ల
యీ
శరీరమునందున్న
సమస్త
శక్తిని
గుంజుకొని
యీ
శరీరములో
రాగ
ద్వేష
అసూయ,
డంబాలనే
రోగములను
కల్పించిపోతుంది.
దేహముతో
అనుభవించే
సౌఖ్యములు
నిజముగా
సౌఖ్యములుకాదు.
సౌఖ్యములు
దేహాన్ని
అనుభవించి
దేహాన్ని
అన్ని
విధాలా
శిథిలము
గావిస్తున్నాయి.
నిజంగా
నీవు
సౌఖ్యములే
అనుభవిస్తే
దేహము
యెందుకు
శిథిలంకావాలి?
దేహమెందుకు
బలహీనం
కావాలి?
దేహమెందుకు
వార్థక్యములో
మునగాలి.
సౌఖ్యములు
యీ
దేహాన్ని
అనుభవించాయి
కనుక
దీనిని
పీల్చి
పిప్పిచేసి
కేవలము
వార్థక్యములో
ముంచి
పోతున్నాయి.
కనుక
నీవు
నీది
కానటువంటి
సౌఖ్యాన్ని
నీదిగా
భావించుకొని
నీవు
మురిసిపోతున్నావు.
నీ
తత్వాన్ని
నీవు
మరచిపోతున్నావు.
9
▾
Meaning
Keep
మొట్టమొదటు
ప్రతి
మానవుడుకూడను
నేనెవరు,
నేనెవరు
నేను
అనేటువంటి
తత్వాన్ని
గుర్తించాలి.
నేనే
సర్వత్రవున్నాను.
నేనే
సర్వస్వరూపాన్ని.
నేనే
ఆత్మను.
ఆత్మయే
హృదయము.
హృదయము
ఆత్మ
ప్రత్యేకముకావు.
ఈ
నేను
అనే
స్థానాన్ని
దాని
వునికిని
మనం
గుర్తించటానికి
ప్రయత్నించటమే
మన
సాధన.
ప్రతి
మానవుడు
యేదో
తెలియనటువంటి
మార్గములో
ప్రవేశించి
తద్వారా
అనేక
విధములైన
తికమకలలో
పడిపోయి
నిజమైన
ఆధ్యాత్మిక
మార్గాన్ని
కొంతవరకు
విస్మరిస్తున్నారు.
మనము
యీనాడు
చేసే
ప్రతి
సాధన
ద్వైతభావముతోనే
చేస్తున్నాము.
ఎంతకాలమైనా
మనం
ద్వైతంలోనే
వుంటుంటే
మన
జీవితము
వ్యర్థమే.
క్రమక్రమేణా
మన
దృష్టిని
మార్చుకుంటూ
రావాలి.
సృష్టి
తత్వమంతా
మన
కల్పనే
అన్న
సత్యాన్ని
మనం
అర్థం
చేసుకోవాలి.
మన
దృష్టి
వుండినప్పుడే
మన
సృష్టి
వుంటుంది.
మన
నేత్రము
వుండినంతవరకే
శాస్త్రము
మనను
శాసిస్తుంది.
కనుక
విశ్వం
విష్ణుస్వరూపం
అనేటువంటి
సత్యాన్ని
గుర్తించాలి.
మనం
అనేక
రకములుగా
సాధనలు
సల్పుతున్నాము.
భజనలు
చేస్తున్నాము.
జపములు
చేస్తున్నాము.
పూజలు
చేస్తున్నాము.
యజ్ఞములు
చేస్తున్నాము.
యాగములు
చేస్తున్నాము.
వీటికన్నింటికి
నేను
లభించేటువంటి
వాడను
కానని
భగవద్గీతయందు
11వ
అధ్యాయములో
48నుండి52వ
శ్లోకమువరకు
స్పష్టముగా
బోధిస్తూ
వచ్చింది.
యజ్ఞాలకు
నేను
చిక్కను.
యాగాలకు
నేను
వశముకాను.
జపధ్యానములకు
నేను
లభించను.
అయితే
యివన్నీ
విసర్జించమనికాదు.
ఇవి
యెంతవరకు
మనకు
అవసరము.
ద్వైతభావములో
వున్న
మానవునికి
యివి
అవసరము.
గీతను
విశ్వసించేవారంతా
యీ
విషయము
చక్కగా
గుర్తించాలి.
అనిత్యం
అసుఖం
లోకం
అని
బోధించింది.
ఇలాంటి
అనిత్యము
అసుఖము
అయిన
లోకములో
మనము
నిత్యసత్యమైన
సుఖశాంతులను
మనమేరీతిగా
సాధించగలము.
మనయందు
శాశ్వతమైన
సత్యమైన
తత్వమొకటుంది.
దానిద్వారా
మనము
శాశ్వతత్వాన్ని
సాధించాలి.
అదే
ఆత్మతత్వము.
సముద్రము
యెంత
విశాలమైనటువంటిది,
అగాథమైనటువంటిది
అయినప్పటికి
ఆ
సముద్రముకూడను
తనలో
విలువైన
ముత్యములుంచుకొని,
విలువలేని
నత్త
చిప్పలను
బయటకు
గెంటుతుంది.
కనుకనే
సాగరాన్ని
సంసారానికి
పోల్చారు.
సంసారంసాగరం
అన్నారు.
మన
సంసారంకూడను
అట్లే
వుండాలి.
విలువైన
ఆత్మతత్వాన్ని
మనం
భద్రపరచుకొని
విలువలేని
యీ
భావములు,
యీ
రూపములు,
యీ
నామములు
మనము
విసర్జించటానికి
ప్రయత్నించాలి.
ఎంతకాలమైనా
దేహభ్రాంతులు,
ఎంతకాలమైనా
దేహరూపాలుగానే
మనం
జీవిస్తూపోతే
యింక
దేహాతీతమైనటువంటి,
రూపాతీతమైనటువంటి,
భావాతీతమైనటువంటి
నిజతత్వాన్ని
యేనాడు
మనము
అనుభవించేది.
అట్లని
యీ
సర్వస్వాన్ని
త్యజించమనికాదు.
నీ
కర్తవ్యాన్ని
నీవు
నిర్వర్తించుకుంటూ
ఆత్మతత్వాన్ని
లక్ష్యమునందుంచుకోవాలి.
చేసేది
ఆత్మ.
చేయించేది
ఆత్మ.
అనుభవించేది
ఆత్మ.
సర్వమునూ
ఆత్మనే
అనే
విశాలభావాన్ని
మనం
అభివృద్ధి
పరచుకున్నప్పుడు
క్రమక్రమేణా
అది
ఆ
విశాలతత్వానికి
చేరుస్తుంది.
మనం
చేరటానికి
కష్టమైనప్పటికి
లక్ష్యం
పెట్టుకోవాలి.
ఉత్తమ
లక్ష్యం
మనయందు
వుండినప్పుడే
యీనాడు
కాకపోతే
యేనాడైనా
ఆ
గమ్యాన్ని
చేరవచ్చును.
10
▾
Meaning
Keep
దీని
గురించే
తెలుగువారు
ఒక
సామెత
చెప్తుంటారు.
వెంటబడి
కుంటినక్కను
కొట్టే
దానికంటే
గురితప్పినాసరే
పులినే
కొట్టరా
అన్నారు.
కనుక
యీ
చిన్న
చిన్న
దానిలో
మనం
యెంతశ్రమపడి
యిన్ని
అవస్థలకు
గురిఅయ్యేదానికంటే
నిజమైన
ఆత్మతత్వంపైన
లక్ష్యం
పెట్టుకోండి.
దాంట్లో
ఫెయిలైనా
పరవాలేదు.
విజయాన్ని
సాధించినవారమే
అవుతాము.
మనం
ఒక్క
దానిలో
విజయాన్ని
సాధిస్తే
మిగిలిన
విజయాలంతా
మనకు
తమంతతామే
ఫాలో
అవుతాయి.
ఎప్పుడూ
యీ
అనిత్యమైన,
లౌకికమైన
దానిపైన
మనము
నిరంతరము
అపజయాన్ని
పొందుతుంటే
మనము
అపజయములోనే
మునిగిపోతాము.
విజయానికి
యేమాత్రం
ముందంజ
వేయలేము.
ప్రతి
మానవుడుకూడను
నేను
ఆత్మ
నేను
ఆత్మ
అనే
భావాన్ని
అభివృద్ధి
పరచుకోవాలి.
అయితే
I
am
Brahma.
I
am
Brahma
అనుకున్నప్పుడు
యీ
బ్రహ్మకు
ముందుగా
I
అనేటువంటిది
ఒకటుంది.
ఇక్కడకూడా
నేను
అనేటువంటిది
వుంది.
ఆ
నేను
యెవరు.
నేను
బ్రహ్మ
అనుకోటంలోకూడను
నేను
అనే
దానిని
అర్థం
చేసుకోవాలి.
దీని
అర్థమేమనగా
బ్రహ్మ
వ్యాపించటం.
నేను
అనేది
వ్యాపించటంతో
కూడినది.
కనుకనే
సర్వత్రా
వుండినటువంటిది
నేనే
అనే
తత్వం
అర్థమవుతుంది.
ఏమి
చేసినా,
యేమి
చెప్పినా,
యేమి
తలచినా,
అంతా
దైవ
భావముతో
కూడివుండినప్పుడే
తాను
నిజమైనటువంటి
I
ని
గుర్తించినవాడౌతాడు.
దేహభ్రాంతి
వుండినంతవరకే
యీ
జగత్తు.
నిత్యజీవితములో
మనం
అనుభవిస్తూనే
వున్నాం.
నిద్రలో
వున్నాము.
నిద్రలో
మనం
యేసామానులు
చూడటంలేదు.
ఏ
పదార్థాన్ని
మనం
ముట్టడంలేదు;
ఏ
ఆహారము
మనంభుజించటంలేదు.
ఏమీ
లేనటువంటి
స్తంభించిన
సమయములో
ఆనందాన్ని
అనుభవిస్తున్నాము.
ఆ
గాఢనిద్రలో
నీకు
శరీరముకాని
రూపముకాని,
భావముకాని
గుణముకాని
యేవీ
అక్కడకనుపించటంలేదు.
నీవు
మాత్రము
వున్నావు.
జాగ్రత్
స్వప్న
సుషుప్తులయందు
నీవు
వున్నావు.
స్థూల
సూక్ష్మ
కారణ
శరీరములందుకూడను
నీవు
అనేటువంటిది
వున్నది.
ఈ
అన్నిటియందు
మార్పుచెందనిది
యేది
వున్నదో
అదే
ఆత్మతత్వము.
దీనినే
వేదాంతము
నిర్గుణం,
నిరంజనం,
సనాతనం,
నికేతనం,
నిత్యశుద్ధ
బుద్ధ
ముక్త
నిర్మలస్వరూపం
అని
వర్ణిస్తూ
వచ్చింది.
ధ్యానముగానీ,
జపముగానీ
చేసేటువంటి
దేహము
నీటి
బుడగ.
దీనిని
ఆధారము
చేసుకొని
నడచే
మనసు
చూస్తిమా
పిచ్చికోతి.
ఈ
పిచ్చికోతి
వల్ల,
నీటి
బుడగవంటి
యీ
దేహమువల్ల
శాశ్వతమైన
ఆత్మను
నీవు
పొందటానికి
వీలవుతుందా.
ఇది
తాత్కాలికమైన
తృప్తే
తప్ప
యిది
సరియైన
ఆత్మానందముకాదు.
చెట్టు
ఆకునకు
కొన
భాగమున
వుండిన
నీటి
బిందువువలె
వుంటున్నాది
యీ
దేహము.
ఏ
క్షణములో
యీ
నీటి
బిందువు
రాలిపోతుందో.
ఇలాంటి
దానితో
శాశ్వతమైనటువంటి
ఆత్మను
పొందటానికి
యెట్లా
అవకాశము
చిక్కుతుంది.
భజనలు
చేయటంకాని,
ధ్యానము
చేయటంకాని,
పూజలు
చేయటంకాని,
తాత్కాలికముగా
యీ
మనసును
అరికట్టటానికి
చేసే
వుపాయములే
తప్ప
యివి
నిజమైనటువంటి
మార్గములుకాదు.
కాని
ఒక్కటి
మాత్రము
శాశ్వతము.
నేనెవరు
నేనెవరు
యీ
విచారణ
చేస్తూ
ఆ
నేను
అనేది
యెక్కడ
ప్రారంభమవుతుందో
అక్కడకు
పోయి
మనము
చేరాలి.
ఇది
నా
దేహము.
ఇది
నా
మనసు,
యిది
నా
బుద్ధి,
యిది
నా
చిత్తము,
నా
యింద్రియములు,
నా
అంతఃకరణ
నేనెవరు
అని
ప్రశ్న
వేసుకుంటూరావాలి.
11
▾
Meaning
Keep
ఇది
నా
దేహము.
దేహము
వేరు
నేను
వేరు.
ఇది
నా
వస్త్రము.
వస్త్రము
వేరు.
నేను
వేరు.
ఇది
నా
ఛైర్
ఛైర్
వేరు
నేను
వేరు.
కనుక
నా
మనసు,
నా
బుద్ధి,
నా
చిత్తము,
నా
యింద్రియములు,
నా
అంతఃకరణ
యివన్నీ
వేరు
నేను
వేరు.
కాబట్టి
యివన్నీ
నేను
కాదు
అని
కొంతవరకును
విచారణ
చేస్తూ
రావాలి.
ఈవిధముగానీవు
విచారణ
చేస్తూ
రావాలి.
ఎవరో
నిన్ను
తిట్టారు.
ఎవరో
నిన్ను
వర్ణించారు.
వర్ణన
యెవరికోసం.
దేహానికి.
ఆ
తిట్టింది
యెవరికోసం.
దేహానికి.
కాబట్టి
నీవు
రెండూ
కాదు.
ఆ
విధంగా
కూడను
త్యాగభావముతో
పోవాలి.
దేహమును
దేహము
దూషించటానికి
దేహమునకు
యేమి
అధికారముంది.
అదీ
జడము
యిదీ
జడము.
జడము
జడాన్ని
యేరీతిగా
దూషించగలదు.
యే
రీతిగా
పూజించగలదు.
కాదు
కాదు.
ఆత్మగా
ఆత్మను
దూషిస్తున్నారంటే
అక్కడా
ఆత్మే
యిక్కడా
ఆత్మే.
రెండువున్నది
ఒక
ఆత్మయే.
ఎవరిని
యెవరు
దూషించటము.
అదే
విధముగా
ఒకడు
దేవుడున్నాడంటాడు.
ఇంకొకడు
లేడు
అంటాడు.
లేడనేటువంటివాడు
దేవుడిని
చూశాడు.
దేవుడున్నాడనే
వాడు
దేవుడిని
చూశాడు.
దేవుడినే
చూడకుండిన
లేడని
చెప్పటానికి
వానికి
అధికారమేలేదు.
ఇక్కడొక
చిన్న
ఉదాహరణము.
ఇది
ఒక
Kerchief
అన్నారు.
లేక
యితను
ఒక
నంజుండయ్య
అని
పేరు
పెట్టారు.
ఈ
నంజుండయ్యను
చూసినటువంటివాడు
యితను
నంజుండయ్య
అని
గట్టిగా
చెప్తాడు.
ఇంకొకరిని
చూచినవాడు
యితను
నంజుండయ్యకాదు
అని
చెప్పవచ్చును.
చక్రవర్తిని
పిలచి
యితను
నంజుండయ్య
అంటే
అతను
నంజుండయ్య
కాదు
అతను
చక్రవర్తి
అంటాడు
వాడు.
కాబట్టి
నంజుండయ్య
కాడనేటువంటి
వాడు
కాని,
నంజుండయ్య
అవుననేటువంటివాడు
కాని
నంజుండయ్యను
చూసి
తీరాలి.
నంజుండయ్యనే
చూడని
వానికి
నంజుండయ్య
కాదు
అనటానికి
అధికారంలేదు.
నంజుండయ్య
అవును
అనటానికి
అధికారంలేదు.
అదే
విధముగా
దైవాన్ని
చూసినటువంటివానికే
యితను
దైవంకాదు
అని
చెప్పటానికి
అధికారం
వస్తుంది.
కనుకనే
ప్రతి
మానవుడు
తెలిసీ
తెలియనటువంటి
మూర్ఖత్వములో
పడిపోతున్నాడు.
కనుక
యీ
అవును
కాదు
అనేది
మాటల
మ్యాజిక్.
పదములయొక్క
అలలు.
అంతేకాని
యిందులో
యేమాత్రంయదార్థంలేదు.
ఒకరు
అవునన్నా
ఒకరు
కాదన్నా
ఆ
మాటలు
వారి
భావములేకాని
పదార్థాన్ని
అవును
కాదనటానికి
యెవ్వరికినీ
అధికారంలేదు.
కనుక
యిరువురికినీ
దైవము
వున్నాడు.
ఉన్నది
ఒక్కడే.
ఏకంయేవ
అద్వితీయం
బ్రహ్మ.
అలాంటి
బ్రహ్మనే
ఆత్మ.
చాలామంది
అనుగ్రహం
కావాలి.
భక్తి
కావాలి.
ప్రేమ
కావాలి
అని
ఆశిస్తుంటారు.
ప్రేమ,
భక్తి,
వినయము
విశ్వాసము
యివన్నీఆత్మస్వరూపాలు.
విశ్వాసము
వేరు
దైవము
వేరు
కాదు.
దైవము,
విశ్వాసమూ
రెండూ
ఒక్కటే.
ప్రేమ,
భక్తి
వేరు
కాదు
ప్రేమే
భగవంతుడు.
భక్తే
భగవంతుడు.
భక్తి
అనగా
యేమిటి?
అవ్యక్తమైన
తత్వాన్ని
వ్యక్తీకరింపచేసుకోటానికి
వుపయోగించుకొనేది
కనుక
దీనిని
భక్తి
అన్నారు.
అన్నీ
దైవత్వానికి
చెందినటువంటివే.
దైవము
తప్ప
అన్యములేదు.
ఆ
విశ్వాసముతో
మనము
కర్మలు
ఆచరిస్తూపోయినప్పుడు
మనము
శాశ్వతతత్వాన్ని
గుర్తించటానికి
వీలవుతుంది.
అట్టి
శాశ్వతమైన
దానిని
లక్ష్యములో
పెట్టుకొని
అశాశ్వతమైన
కొన్ని
సాధనలు
ఆధారం
చేసుకొని
మనం
పోవాలి.
అనంతమైన,
అగాథమైన
సముద్రమును
దాటాలంటే
మనం
యేంచేస్తున్నాము.
12
▾
Meaning
Keep
చిన్న
పడవను
తీసుకొని
దానిలో
పోతున్నాము.
అదే
విధముగనే
అనంతమైన
దైవత్వాన్ని
మనం
అనుభవించాలనుకుంటే
ఏదో
ఒక
నామము
అనే
నావను
మనం
ఆధారం
చేసుకోవాలి.
ఇలాంటి
ఆధారాలు
ప్రారంభంలో
అవసరమే
కాని
జీవితమంతా
దీనితోనే
మనం
వ్యర్థము
చేయరాదు.
ఎవరు
యేసేవ
చేస్తున్నా
నేను
సమాజానికి
సేవ
చేస్తున్నాను
అని
ఆడంబరముగాని
అహంకారముకాని
పడటానికి
వీలులేదు.
నీ
సేవను
నీవు
చేసుకుంటున్నావు.
దైవానికి
నీవు
చేస్తున్నావు.
ఇతరులకు
చేస్తున్నామనే
భావము
దూరంగా
పోవాలి.
నేను
దైవానికే
సేవ
చేస్తున్నాను.
ఇంటిలో
పిల్లలకు
స్నానం
చేయిస్తున్నావనుకో
నేను
దైవానికి
అభిషేకం
చేస్తున్నానుకో.
భర్తకో,
పిల్లలకో
అన్నం
వడ్డిస్తున్న
సమయములో
నేను
భగవంతునికి
నైవేద్యం
చేస్తున్నాననుకో.
ఎవరో
ఒక
బిక్షగాడు
వచ్చాడు.
పట్టెడన్నం
పెట్టినప్పుడు
నా
భగవంతునికి
నేను
అన్నాన్ని
ఆరగింప
చేశాననుకో.
అడిగేవాడు
బెగ్గర్కాని
అనుభవించేవాడు
మాత్రం
ఆత్మనే.
నీవు
యింటిలో
కూరగాయలు
తరిగి
పులుసు
చేస్తున్నావనుకో
అయ్యో
నేను
కూరగాయలు
తరుగుతున్నానని
యెందుకనుకోవాలి.
నా
కామక్రోధములనే
దుర్గుణాలను
యీ
ఖడ్గమనే
జ్ఞానముతో
తరిగివేస్తున్నానుకో.
నీవు
నీ
యిల్లును
వూడ్చుకుంటున్నావనుకో.
అయ్యో
యీ
పాడు
యిల్లు
యెప్పుడు
శుభ్రం
చేసినా
యింతే
అవుతుందని
యోచించుకోనక్కరలేదు.
నా
హృదయాన్ని
పరిశుద్ధం
చేస్తున్నాననుకో.
మీ
యింటిలో
చపాతీ
చేస్తున్నావనుకో.
ఈ
పాడు
తిండి
ఎన్ని
చపాతీలు
తిన్నా
యీ
పొట్టనిండటంలేదే.
ఎప్పుడు
చూసినా
చపాతీలు
ప్రొద్దున్న
సాయంత్రము
చపాతీలే
ఆరీతిగా
నీవు
దూషించవద్దు.
నా
హృదయాన్ని
విశాలంచేసుకుంటున్నానుకో.
అదే
విధముగ
నిత్యజీవితములో
మనం
చేసే
ప్రతి
పనిని
దైవ
సేవగా
భావిస్తుంటే
యింతకంటె
వేరే
తపస్సెందుకు.
ఇంతకంటె
వేరు
ధ్యానమెందుకు.
ఇంతకంటెసాధనెందుకు.
కనుక
మనం
హృదయమే
ఆత్మగా
భావించుకొని,
హృదయాన్ని
కరగింపచేసే
మార్గములో
మనము
ప్రయాణంచెయ్యాలి.
ఆ
హృదయాన్ని
కరగించేది
ప్రేమ
ఒక్కటే.
నరసింహన్
చెప్పాడు
ఏఏ
దేశములనుండో,
ఏఏ
ప్రాంతములనుండో
ఇన్ని
వేలమంది
వస్తున్నారంటే
వీరికి
యే
ఇన్విటేషన్
పంపటంలేదు.
పేపర్లో
అడ్వర్టైజ్మెంటు
చేయటంలేదు.
ఆ
ప్రేమతత్వమే
వారి
హృదయాల్ని
కరగింపచేసి
యిక్కడకి
వచ్చేట్లు
చేస్తుంది.
ఆ
ప్రేమచేతనే
మనం
యెంతటి
దానినైనా
సాధించటానికి
అవకాశంవుంటుంది.
ఆ
ప్రేమతత్వమే
ఆత్మతత్వముగా
భావించండి.
హృదయం
మాత్రము
కరగకుండా
యెన్ని
సాధనలు
చేసినా,
యెన్ని
పలుకులు
పలికినా,
ఎన్ని
వుపన్యాసములిచ్చినా
యివన్నీ
కేవలం
అడవికాచిన
వెన్నెలవలె
నిరుపయోగమవుతుంది.
మనసాధనలతో
మన
హృదయం
కరగిపోవాలి.
ఆ
కరగిన
హృదయం
కదలిపోవాలి.
మన
హృదయవేదనను
పెంచాలి.
పదిమందికి
పంచాలి.
Previous
←
Learning without Viveka, knowledge without discernment, does not shine
Next
Born with Koham, one must end with Soham
→