Contents
Devotion & Sacred Story
Home
Library
Find
Shelf
Settings
←
Leave
Sathya Sai Speaks 1987 · Sing of God, worship Him, remember Him, and cross over
Tap a verse for its meaning
IAST
Telugu
Meaning
Continuous
Sing of God, worship Him, remember Him, and cross over
26 September 1987, Gathering of vice-chancellors
1
▾
Meaning
Keep
సత్యధర్మ
అహింసయు
శాంతిప్రేమ
మానవుని
పంచప్రాణాలు
మహిని
యివియె
పంచప్రాణాలలో
ప్రేమ
యెంచ
హెచ్చు
కాన
హృదయాన
ప్రేమను
గట్టిపరచు.
నేటి
విద్యలన్ని
నిధి
సేకరణకౌను
పూర్ణవిద్యలన్ని
పూజ్యమయ్యె
పక్షి
పలుకులిడునె
బహువిధ
బోధనల్
సత్యమైన
బాట
సాయిమాట.
దివ్యాత్మ
స్వరూపులారా!
మానవ
సమాజములో
ప్రధానముగా
వుండవలసినది
మానవత.
మానవతయే
లేకుండిన
సమాజము
మానవునకు
గుదిబండగా
రూపొందుతుంది.
ఎన్ని
విద్యలను
అభ్యసించినప్పటికిని,
యెన్ని
పట్టములు
అందుకొన్నప్పటికి
అంతమాత్రముచేతనే
తృప్తిపడక
దానితోపాటు
మానవతనుకూడను
పెంచుకొనుటకుప్రయత్నించాలి.
మానవత
యెంత
పెరుగునో
సమాజము
దేశముకూడను
అంత
అభివృద్ధినొందుతుంది.
మానవత
యెంతపవిత్రమో
దానిని
పోషించుకోటంకూడను
అంత
పవిత్రమైన
కర్మ.
దీనికి
సమరసము,
సమన్వయము
అత్యవసరము.
వివిధ
పరిధులమధ్య
సామరస్యము,
సమన్వయము
వుండినప్పుడే
సమాజము
శోభిస్తుంది.
నిత్యజీవితములో,
నిత్యసత్యములుగా
ప్రకాశించే
ప్రాచీన
సాంప్రదాయములలో
కాలానుగుణ్యముగా
సంరక్షించుకొని
సమన్వయము
గావించుకొనటమే
యీనాటి
ప్రధానమైన
విద్య.
సామరస్య
సమన్వయములను
మానవత
అభివృద్ధి
గావింపజేస్తుంది.
మానవునియందలి
గుణములను
పోషిస్తుంది.
మానవత్వాన్ని
వికసింపజేస్తుంది.
మానవతను
మనము
కల్పించుకొనుటకు
వీలుకాదు.
కొత్తగా
మనము
సంపాదించుకొనే
పద్ధతికాదు.
ఇది
మన
స్వభావమైనది.
ఇది
మన
స్వరూపమైనది.
ఇట్టి
నిత్యసత్యమైన
మానవతను
మనము
యీనాడు
విస్మరిస్తూ
వస్తున్నాము.
ఇట్టి
మానవత్వాన్ని
మనము
అభివృద్ధి
గావించుకున్నప్పుడే
మనము
మానవుడని
పిల్చటానికి
ఒక
అధికారాన్ని
అందుకోగలము.
కుళ్లుచుండిన
పదార్థమును
మనము
యేవిధముగా
పారవేస్తామో
అదే
విధముగనే
కృశించిన
కర్మలు
ఆచరించిన
వ్యక్తులను
సమాజము
తీసిపారవేస్తుంది.
సమాజమునకు
మనకు
వుండిన
సంబంధబాంధవ్యము
యేమిటి?
సమాజనిమిత్తమై
మనము
యెందుకు
బ్రతకాలి?
సమాజమునకు
మనపై
వుండిన
పెత్తనము
యేమిటి?
2
▾
Meaning
Keep
అని
దీర్ఘముగా
విచారించినప్పుడు
సమాజజీవితమునందే
మన
జీవితము
సార్థకమవుతున్నాది.
కారణమేమనగా
సమాజమునందే
పుట్టి,
సమాజమునందే
పెరిగి,
సమాజమునందే
జీవించి,
సమాజమునందేఅంతమొందుచున్నాము.
సమాజమును
వదలి
మనము
క్షణమైనకూడను
జీవించలేము.
సమ్
అనగా
యేకత్వము.
ఆజ్
అనగా
గమనము.
సమత్వమును
గమనించటమే
సమాజమునకు
సరైన
అర్థము.
ఏకత్వమును
గమనించటమే
సమాజముయొక్క
లక్ష్యము.
అనేకులు
ఆర్జించిన
క్రియాఫలములు
ఒక్కచోటు
చేర్చిన
సంస్థకే
సమాజము
అని
పేరు.
ఈ
సమాజమునకు
సత్య,
ధర్మ,
శాంతి,
ప్రేమ,
అహింస
అన్నవే
పంచప్రాణములు.
అంతర్
బహిదేశముయొక్క
ఐక్యతలే
దీని
ఉచ్ఛ్వాసనిశ్వాసములు.
దీనినే
ప్రజ్ఞ
అనికూడ
పిలుస్తూవచ్చారు.
constant
Integrated
awareness
అని
అనగా
దీనియొక్క
తత్త్వము
శరీరమునందును,
మనసునందును,
అంతఃకరణయందును,
ఆత్మయందుకూడను
సమత్వముగా
ప్రకటిస్తూవున్నది.
ఇది
మానవుని
తత్త్వముతో
చేకూరినదే
కాని
అన్యముగాయిది
యేర్పడినదికాదు.
ఇది
ఒక
పుష్పము.
ఈ
పుష్పమును
ఆధారము
యేమిటి?
దీనికి
రేకలే
ఆధారము.
రేకలు
వుండినప్పుడే
పుష్పమునకు
అందము.
రేకలే
లేకుండిన
పుష్పములేదు.
అదే
విధముగనే
ప్రతివ్యక్తి
సమాజమునకు
ఒక
రేకవంటివాడు.
ఇలాంటి
వ్యక్తులయొక్క
సమూహమే
సమాజమనే
పుష్పము.
ఈ
వ్యక్తులయందు
పవిత్రమైన
దివ్యత్వమనేది
ప్రకటితము
కావాలి.
ఈసమాజ
రథమునకు
నాలుగు
చక్రములు.
ఒకటి
ఐకమత్యము.
రెండవది
స్వాధీనము.
మూడవది
జ్ఞానము.
నాల్గవది
శక్తి.
ఈ
నాలుగు
శక్తులతోకూడిన
చక్రములే
సమాజమును
నడుపుతూ
వస్తున్నవి.
ఇలాంటి
సమాజతత్త్వములోపల
మానవత్వమును
యేవిధముగా
పోషించుకోవాలి.
నిజముగా
యీ
సమాజమనేది
అనేక
రూపములతో
లేదు.
ఇది
ఒకే
రూపాన్ని
ధరించివుంది.
ఈ
సమాజమునకు
ప్రత్యేకించి
పంచభూతస్వరూపములేదు.
వ్యక్తులయొక్క
గుణస్వరూపమే
యీ
సమాజముయొక్క
స్వరూపము.
ఈ
జగత్తునందు
జీవి,
పదార్థము
యీ
రెండింటియొక్క
సమన్వయము
మనము
నిరూపించాలి.
ఇవి
రెండు
భిన్నభేదములు
కావు.
ఈ
రెండింటియందు
యేకత్వాన్ని
మనము
సరైన
రీతిగా
గ్రహించినప్పుడే
యిందులో
దైవత్వము
రూపొందుతుంది.
దీని
అనుభూతినికూడను
మనము
అనుభవించాలి.
కనుక
అనుభవించునటువంటివాడు,
అనుభవించబడునటువంటిది,
అనుభవము
యిది
experiencer,
experienced,
experience.
దీనినే
seer
seen,
ఈ
మూడింటిని
మనము
మూడు
విధములుగా
భావించరాదు.
ఇవి
త్రిపుటికాదు.
ఇది
యేకత్వముతోకూడినది.
చూచుట,
చూడబడుట,
చూచేవానితో
యేకమైపోతుంది.
చూచేవాడు
లేకుండిన
చూపుకాని,
చూడబడునదిగాని
యేమాత్రము
విలువలేదు.
కనుకనేచూచునటువంటివాడే
కర్త.
ఆ
కర్తనే
ప్రజ్ఞ.
ఈ
ప్రజ్ఞనే
బ్రహ్మము
అన్నారు.
ఈ
ప్రజ్ఞనే
ఆత్మ
అన్నారు.
ఈ
ప్రజ్ఞనే
మానవుని
విలువ.
ఈ
ప్రజ్ఞనుంచి
ఆవిర్భవించే
ప్రతిక్రియకూడను
మానవతను
చేకూరుస్తుంది.
మానవుడు
యేకాకిగా
జీవించే
స్వభావుడుకాదు.
మానవకోటిమధ్య
ప్రేమ
బీజములు
నాటి
సహన
ప్రసూనములను
వికసింపజేసి,
శాంతి
ఫలములు
సమాజమునకు
అందించినవాడే
మానవుడు.
3
▾
Meaning
Keep
కనుకయిట్టి
పవిత్రమైన
మానవత్వాన్ని
మనము
విస్మరిస్తున్నాము.
దీనినే
ప్రాచీనకాలమందు,
వేదపరిభాషయందు
అష్టాంగయోగములందు
మొట్టమొదటిదియైన
యమ
అనుదానికి
పోల్చుకుంటూవచ్చారు.
యమ,
నియమ,
ఆసన,
ప్రాణాయామ,
ప్రత్యాహార,
ధారణ,
ధ్యాన,
సమాధి
యివి
అష్టాంగయోగములు.
ఇందులో
మొట్టమొదటిది
యమ.
యమ
అనగా
యేమిటి
అహింస,
సత్యము,
అస్తేయము
బ్రహ్మచర్యము,
అపరిగ్రహము.
ఈ
ఐదుకూడను
మానవునికి
వేదాంతపరిభాషయందు
మానవతావిలువలు.
ఇక్కడ
అహింస
అనగా
యేమిటి?
అహింస
అనగా
కేవలము
ఒకరిని
హింసించకుండా
వుండటమని.
మనము
భావిస్తున్నాము.
యేవిధముగా
మనము
యితరులను
హింసించకుండా
వుండటం.
ఈ
అహింస
అనే
దానికి
అర్థము
యేమిటి?
మనసుతో,
మాటతో,
దేహముతో
యీ
మూడింటితోకూడను
త్రికరణశుద్ధిగా
యితరులను
హింసించకుండుటయే
అహింస.
ఇది
ప్రధానమైన
మానవతావిలువ.
ఈ
విలువను
సంపాయించుకున్నవానికే
సత్యము
అనే
రెండవది
తాను
అనుభవించటానికి
అర్హుడౌతాడు.
సత్యము
అనగా
కేవలము
నాలుకతో
పలికినది
మాత్రమేకాదు.
ఇది
త్రికాలాబాధ్యమైనది.
ఇదికూడను
త్రిగుణశుద్ధితో
వుండవలసినది.
మనసునందుకాని,
చేతలతోకాని
అసత్యమును
ప్రకటించటానికి
ప్రయత్నించకూడదు.
కనుక
త్రికరణశుద్ధితో
మనము
పలికేటువంటిదానినే
మనము
యీనాడు
సత్యము
అని
భావిస్తున్నాము.
ఇది
రెండవ
మానవతాగుణము.
అస్తేయము
అనగా
పరులసొత్తును
మనము
అపహరించకుండా
వుండటమే.
కేవలము
చేతులతో
వారి
పదార్థములను
అపహరించటము
మాత్రమేకాదు,
మనసులోకూడను
పరవస్తువులను
అపహరించటానికి
తగిన
సంకల్పము
రాకూడదు.
వాక్కుతోకూడను
పరవస్తువులను
అపహరించమని
బోధించరాదు.
కనుక
త్రికరణశుద్ధితో
పరులసొత్తును
అపహరించకుండా
వుండటమే
అస్తేయము.
ఇది
మూడవ
మానవతావిలువ.
నాల్గవది
బ్రహ్మచర్యము.
కానీ
దీనిని
యనేక
విధములుగా
లౌకిక
మార్గమునందు
ప్రవేశపెట్టి
అనేక
అర్థములతో
మనము
వింటూ
వస్తున్నాము.
ఇది
సరైన
అర్థముకాదు.
బ్రహ్మచర్యమనగా
నిరంతరము
యే
పని
చేసినా,
యే
పలుకు
పలికినా,
యే
తలంపు
తలచినా,
యిది
బ్రహ్మభావమైన
తలంపుగా
వుండాలి.
కర్మగా
వుండాలి.
అనగా
బ్రహ్మభావముతో
ఆచరించేదే
బ్రహ్మచర్యము
అన్నారు.
ఈ
సర్వకర్మలు,
సర్వ
విధమైన
పలుకులు,
సర్వవిధమైన
భావములు
భగవదర్పితముగా
భావించాలి.
దీనినే
సర్వకర్మ
భగవత్ప్రీత్యర్థం
అని
పలుకుతూ
వచ్చింది.
కేవలము
ఒక్క
దేహముచేత
మాత్రమే
మనము
యీనాడు
ప్రపంచములో
వింటున్నచర్యలలో
మనము
పవిత్రముగా
వున్నంత
మాత్రమున
చాలదు.
దేహము
అనిత్యమైనది.
మన
కర్మలు
సత్యమైనవి.
మనసే
లేకుండిన
కర్మలేమాత్రము
చేయలేవు.
మనసుకు
కర్మలకు
సన్నిహిత
సంబంధబాంధవ్యము
వుంటుండాది.
కనుకనే
నిత్యసత్యమైన
మనోభావములతో
కూడిన
కర్మలు
భగవత్ప్రీత్యర్థంగా
వుంటుండాలి.
ఎప్పుడు
భగవత్భావము
యేర్పడుతుందో
అప్పుడు
తప్పు
మార్గములో
ప్రవేశించుటకు
వీలుకాదు.
4
▾
Meaning
Keep
సర్వకర్మలు
భగవంతునికే
అర్పితము.
కారణమేమనగా
ఆత్మనుండి
అహం
పుడుతూ
వున్నది.
ఈ
అహంనుండి
తలంపులు
పుడుతున్నాయి.
తలంపులనుండి
వాక్కు
పుడుతున్నాది.
కనుక
వాక్కుకు
ఆధారము
తలంపు.
తలంపుకు
ఆధారము
అహం.
అహంకు
ఆధారము
ఆత్మ.
కనుక
మనము
చేసే
సర్వకర్మలుకూడను
ఆత్మాధారముతోనే
చేస్తున్నాము.
సర్వకర్మలు,
సర్వ
పలుకులుకూడను
ఆత్మాధారముతోనేపలుకుతున్నాము.
సర్వసంకల్పములు
ఆత్మాధారముతోనే
సంకల్పిస్తున్నాము.
ఆత్మ
తండ్రి.
అహం
కొడుకు.
తలంపు
మనుమడు.
వాక్కు
మునిమనుమడు.
వీరందరు
ఒక
కుటుంబానికి
చెందినవారు.
కనుక
మన
వాక్కు
భగవత్
ప్రీత్యర్థంగా
వుంటుండాలి.
మన
thoughts
అంతా
భగవత్ప్రీత్యర్థంగా
వుంటుండాలి.
మన
అహంకూడను
భగవత్ప్రీత్యర్థంగా
వుంటుండాలి.
అప్పుడే
అహంబ్రహ్మాస్మి.
అదే
బ్రహ్మగా
మారుతుంది.
ఆ
బ్రహ్మమే
ప్రజ్ఞ.
కనుక
సమస్తము
ప్రజ్ఞనుండియే
ఆవిర్భవిస్తున్నాయి.
దీనినే
బ్రహ్మచర్యమన్నారు.
ఇది
నాల్గవ
మానవతావిలువ.
ఐదవది
అపరిగ్రహము.
అనగాఒకరిసొత్తును,
దానమును
ధర్మమును
మనము
అందుకోరాదు
అని
నేటి
భాషలో
మనము
యీ
జగత్తునందు
వుపయోగపెడుతున్నాము.
ఇది
దీనియొక్క
సరైన
అర్థము
కాదు.
అనగా
యే
పని
చేసినప్పటికిని
ఫలమును
ఆశించకుండా
ప్రతిఫలమును
మనము
కోరకుండా
యీ
కర్మలాచరించాలి
ప్రతిఫలాపేక్షలేని
కర్మలు
మనము
ఆచరించాలి.
అహంకారరహితమైన
కర్మలు
ఆచరించాలి.
అభిమాన,
మమకారరహితములైన
కర్మలు
ఆచరించాలి.
స్వార్థ
స్వప్రయోజన
రహితమైన
కర్మలు
మనము
ఆచరించాలి.
ఇదే
అపరిగ్రహము.
కానీ
యీనాడుస్వార్థముచేతను,
స్వప్రయోజనముచేతను
సమస్తకర్మలు
ఆచరిస్తున్నాము.
అభిమాన,
మమకారములచేత
కర్మలు
ఆచరిస్తున్నాము.
ఈ
అహంకారముచేత
మనము
యీ
కర్మలాచరిస్తున్నాము.
కనుకనే
యివి
మానవతాకర్మలు
కాలేకపోతున్నాయి.
కనుక
మానవతా
విలువలు
మనము
పోషించుకోవలెనన్న
యీ
విధమైన
త్రిగుణములతోకూడిన,
త్రికరణశుద్ధితోకూడిన
కర్మలను
ఆచరించాలి.
ఈ
ఫలరహితమైన
కర్మలు
మనము
ఆచరించాలి.
ఏ
పూజలు
చేసినా,
ఏ
వ్రతములుచేసినా,
యేయాత్రలు
వెళ్లినా
యేదో
ఒక
స్వప్రయోజన
నిమిత్తమై
ఆచరించే
కర్మలేగాని,
ఫలరహితమైన
పూజలుగాని,
ఫలరహితమైన
కర్మలుగాని,
ఫలరహితమైన
సాధనలుగాని
మనము
యీనాడు
చేయటంలేదు.
ఇది
మానవతావిలువకాదు.
కారణమేమనగా
మానవత్వమందు
దివ్యత్వమనే
దైవత్వము
వుండికూడను
పామరత్వములోమనముపడి,
ప్రాకృతసంబంధమైన
వాంఛలలో
మనము
మునిగి
ఆనందమును
కోల్పోతున్నాము.
జ్ఞానమనేది
కేవలము
త్యాగమయమై
వుంటుండాలి.
త్యాగమయమైనదే
జ్ఞానము.
రాగమయమైనది
జ్ఞానము
కానేరదు.
సీత
భూజాత.
ఈమె
బంగారు
లేడిని
చూచింది.
ఈమె
జ్ఞానమయమైనది.
కానీ
రాగము
ప్రారంభము
కాగానే
ధర్మము,
సత్యము,
రాములనుకూడను
దూరము
చేసుకుంది.
ఏనాడు
యీ
సీత
జ్ఞానమయము,
త్యాగమయముగా
మారిందో
ఆనాడే
రాములతో
చేరింది.
ఈ
జ్ఞానమయమైన
సీతను
కోల్పోటంచేత
రాములు
అనేకవిధములుగా
ఆ
జ్ఞానమును
సంపాయించుకొనుటకు
అనేక
ప్రయత్నములు
సాధనలు
చేశాడు.
5
▾
Meaning
Keep
వెదుకుతూ
వెదుకుతూ
కడపటికి
ఋష్యమూకము
చేరాడు.
ఋష్యమూకమనగా
యేమిటి
వైరాగ్యము.
ఎప్పుడు
వైరాగ్యమును
సాధించెనో
అప్పుడు
సీత
అతనికి
చేరింది
అనగా
యీ
జ్ఞానమయమైనది
యెక్కడ
లభిస్తుంది.
సీత
యెక్కడ
పుట్టిందో
జ్ఞానమక్కడ
పుట్టింది.
ఈ
జగత్తునందే,
సీత,
భూమియందేపుట్టింది.
కనుక
యిక్కడకూడను
జ్ఞానము
క్షేత్రమునందే
పుడుతున్నాది.
క్షేత్రమనగా
యేమిటి-
మన
హృదయ
క్షేత్రము.
ఆ
హృదయమనే
క్షేత్రమునందే
జ్ఞానము
సమృద్ధిగా
వుంటున్నాది.
పాలను
మథనము
చేసినప్పుడు
యే
విధముగా
మొదట
వెన్న
తగులుతుందో,
ఆ
హృదయాన్ని
మనము
మథనము
చేసినప్పుడు
అక్కడ
జ్ఞానమనే
వెన్న
చేజిక్కుతుంది.
ఈ
నవనీతము
అతి
పరిశుద్ధమైనది.
అతి
మధురమైనది.
అతి
మృదువైనది.
ఇలాంటి
జ్ఞానము
మనయందే
వుంచుకొని
అజ్ఞానముచేత
అనేక
వాంఛలను
మనముపెంచుకొని
మన
మానవత్వాన్నే
దానవత్వముగా
మార్చుకుంటున్నాము.
నిజముగా
మానవుడు
స్వార్థములో
మునిగిపోతున్నాడు.
తిన్నంత
మాత్రమున
తృప్తి
పడటంలేదు
మానవుడు.
ఇంకా
తరములకు
కావలసిన
సామగ్రిని
తానుప్రోగుచేసుకుంటున్నాడు.
దాని
నిమిత్తమై
ఆరాటపడుతున్నాడు.
ఆ
ఆరాటములోనే
అసంతృప్తిని
పొందుతున్నాడు.
ఆ
అసంతృప్తితో
యిక్కడ
యిహమునందు
పరమునందు
రెండు
సుఖములులేకుండా
అసంతృప్తిని
పొందుతున్నాడు.
పశుపక్షులు
తిని
తృప్తిపొందుతున్నాయి.
దానికి
స్వార్థము
యేమాత్రములేదు.
దాచుకొనే
స్వార్థము,
దోచుకొనే
దౌర్బల్యముగాని
ఆ
పశుపక్షులకు
లేవు.
ఈ
దాచుకోటము,
దోచుకోటము
కేవలము
మానవునియందే
దుర్బుద్ధులుగా
అభివృద్ధి
పొందుతున్నాయి.
పశుపక్షులలో
లేని
పాడుగుణములు
మానవులలో
ప్రవేశిస్తున్నాయి.
దీనికి
కారణంయేమిటి
పశుత్వము
మానవునియందు
శేషించి
వుండటమే
దీనికి
మూలకారణము.
ఈ
పశుత్వము
యెంతవరకు
వుండునో
అంతవరకు
మానవత్వము
అందులో
ప్రవేశించదు.
కనుక
మనయందున్న
పశుత్వాన్ని
మనము
పారవెయ్యాలి.
దీనిని
పారద్రోలినప్పుడే
దివ్యత్వమైన
మానవత్వము
మనలో
ప్రవేశిస్తుంది.
మానవత్వము
సంపాదించుకొనేదికాదు.
సహజముగా
మనలో
ఆవిర్భవించేది.
కాలముయొక్క
విలువను
మనము
గుర్తించుకోలేకపోతున్నాము.
ఈకాలాన్ని
మనముగుర్తించుకున్నప్పుడే
కాలస్వరూపుడుగా
మారతాడు.
సర్వము
కదలించెడి
కాలమూర్తికి
నమస్కారము
అన్నాడు
భృగు.
కానీ
మనము
కాలమును
అపవిత్రముగావిస్తున్నాము.
కాలము
దుర్వినియోగము
చేస్తున్నాము.
ఈ
కాలము
దుర్వినియోగము
చేయటమువలనే
జీవితము
దుర్వినియోగమై
పోతున్నది.
కనుక
మనము
యేమి
చేసినప్పటికిని
నిత్యానిత్యవిషయ
పరిశీలనాశక్తితో
మనము
దానిని
పరిశీలన
జరపాలి.
అలాంటి
ప్రజ్ఞను
మనము
యీనాడు
సంపాయించుకోవాలి.
దానిని
పోషించుకోవాలి.
ఇది
కేవలము
మానవతా
విలువలు.
ఇతరులచేత
అందుకొనేవి
కాదు.
గ్రంథాలు
చదివి
మనము
పోషించుకోటముకాదు.
గురువులనుండి
నేర్చుకొనేదికాదు.
మనము
స్వయముగా
ఆచరించి,
ఆనందించిఅనుభవించాలి.
నేను
మానవుడను,
నేను
మానవుడను
అనే
సంపూర్ణవిశ్వాసము
మనముపొందాలి.
6
▾
Meaning
Keep
మానవుడు
అనగా
నమ్మకము
కలిగినవాడు.
ఆ
నమ్మకముచేతనే
మనము
జయము
పొందాలి.
కానీ
యీనాటి
మానవునకు
నమ్మకమనేది
క్షీణించిపోయింది.
తనను
తానే
నమ్మలేకపోతున్నాడు.
తనను
నమ్మనటువంటివాడు
దేనిని
నమ్మగలడు.
ఇలాంటి
బలహీనుడు
మానవుడేకాదు.
త్రికరణశుద్ధితో
మనము
అన్ని
విధములైన
పవిత్రతలను
మనము
ఆచరించాలి.
మానవునియందు
ప్రధానమైనది,
విలువైనది
పలుకు.
మనము
యీయొక్క
పలుకును
వ్యర్థము
చేయకూడదు.
వాక్యాన్ని
అలక్ష్యము
చేసినప్పుడు
యింక
జీవితమే
వ్యర్థమైపోతుంది.
ప్రేమస్వరూపులారా!
ఈనాడు
మానవతావిలువలనేవి
జగత్తునకు
అత్యవసరము.
ఇవే
విద్యారంగములో
అభివృద్ధి
గావించాలని
ప్రయత్నిస్తున్నారు.
ఈనైతిక,
భౌతిక,
ధార్మిక,
లౌకిక
వైజ్ఞానిక
మార్గములందు
యిది
యేమాత్రము
అభివృద్ధి
గాంచలేదు.
కానీ
ఒక్క
ఆధ్యాత్మికమునందు
మాత్రమే
దీనిని
అభివృద్ధి
గావించవచ్చును.
భక్తిలేక
మానవత్వము
యేమాత్రముకూడను
అభివృద్ధి
పొందలేదు.
కనుకమొట్టమొదట
దైవవిశ్వాసాన్ని
మనము
అభివృద్ధి
గావించుకోవాలి.
కానీదైవము
వున్నాడా
లేడా
అనే
సందేహము.
కొందరు
కలడని
కొందరు
లేడని
వాదన.
నా
వుద్దేశ్యమేమనగా
కలడు
అనేవాడు,
లేడు
అనేవాడు
దానిని
చూచివుంటేనే
కలడు
లేడని
చెప్పటానికి
అర్హుడౌతాడు.
ఏదైనా
ఒక
పదార్థము
వున్నది
లేదని
చెప్పాలనుకుంటే
ఆ
పదార్థము
యొక్క
తత్త్వాన్ని
చక్కగా
మొట్టమొదట
గుర్తించి
వుండాలి.
ఎప్పుడైనా
ఒక
తూరి
యిది
గులాబి
పుష్పము
అని
చూచివుంటేనే
యిక్కడ
గులాబి
పుష్పము
వుంటుండాది
స్వామి
చేతులో
అని
చెప్పవచ్చు.
ఈ
గులాబి
పుష్పము
చూడనివాడు
యీ
పుష్పము
స్వామి
చేతులో
వుందని
యే
రీతిగా
చెప్పగలడు.
అదే
విధముగనే
దేవుడు
వున్నాడు
లేడు
అని
చెప్పటంకంటె
దేవుడంటేయెలాంటివాడు,
ఎవ్వడు
అనేది
తెలుసుకుంటే
కదా
వున్నాడు
లేడు
అని
చెప్పటానికి
అర్హుడౌతాడు.
లేనిదానిని
వున్నాడని
చెప్పటము
మూర్ఖత్వము.
ఎక్కడైనా
ఒక
వ్యక్తి
తప్పించుకు
పోయినప్పుడు
ఆ
వ్యక్తి
యెక్కడ
వున్నాడో
ఆ
చోటికి
పోయి
వెదికితే
ఆ
వ్యక్తి
మనకు
లభిస్తాడు.
అతను
లేని
ప్రదేశములో
యెంత
వెతికిననూ
మనకు
కనిపించడు.
అయితే
భగవంతుడు
యెక్కడ
వున్నాడు.
ఎక్కడికి
పోయి
వెతికేది.
ఈ
విషయమునకు
దానికి
సంబంధము
లేదు.
ఈవిషయము
విరుద్ధముగావుంటున్నాది.
అనగా
భగవంతుడు
సర్వత్రా
వుంటున్నాడు.
కనుక
యితనిని
వెతకనక్కరలేదు.
మనము
చూస్తున్నదంతా
పరమాత్మస్వరూపమే.
అంతా
పరమాత్మస్వరూపమే.
విశ్వం
విష్ణుస్వరూపం.
ప్రపంచాన్ని
భగవంతుని
స్వరూపములో
చూస్తున్నాము.
భగవంతుడు
లేడు
లేడు
అంటున్నాము
యింతకంటె
మూర్ఖత్వము
యెక్కడుంది.
సర్వము
భగవంతుడే.
భగవంతుడు
లేని
వస్తువుగాని,
స్థానముగాని
మరెక్కడనులేదు.
కనుకనే
మనము
సర్వము
భగవంతునియొక్క
స్వరూపకముగా
మనము
విశ్వసించాలి.
అలాంటి
విశ్వాసము
మనము
అభివృద్ధి
గావించుకున్నప్పుడే
నిజమైన
మానవత్వాన్ని
అభివృద్ధి
గావించుకోగలము.
సత్యము,
ధర్మము,
శాంతి,
ప్రేమ,
అహింస
అని
పేర్లు
చెప్పినంతమాత్రమున
మానవతావిలువలు
పోషించుకోలేము.
కేవలము
నోటితో
చెప్పవచ్చును.
కనుకనే
సత్యంవద
అన్నారు.
ధర్మంచర
అన్నారు.
ఆచరించు
అన్నారు.
అయితే
యీ
ధర్మమును
మర్మముగా
ఆచరించినప్పుడు
కర్మ
మనకు
చాలా
బాధ
పెడుతుంది.
7
▾
Meaning
Keep
ధర్మములో
మర్మము
వుండకూడదు.
ఏ
విధమైన
మర్మము
లేనిదే
ధర్మము.
మర్మముతో
కర్మలు
ఆచరించినప్పుడు
అది
మనకు
బంధనగా
యేర్పడుతుంది.
మర్మము
లేకుండా
వుండటానికి
సత్యముతో
ధర్మము
నాచరించాలి.
అందువలననే
వేదాంతము
సత్యంనాస్తి
పరోధర్మః
అన్నారు.
ధర్మమనేది
సత్యమనే
పునాదులపైన
ఆధారపడి
వుంటుండాది.
సత్యజీవితాన్ని
మనము
అభివృద్ధి
పరచుకోవాలి.
సత్యాధారముతోనే
ధర్మము
నాచరించాలి.
ఈ
ధర్మమయముతోనే
మనము
శాంతిని
పొందాలి.
ఈ
శాంతి
రూపముతోనే
శాంతిని
అనుభవించాలి.
ఈ
ప్రేమనే
అహింసగా
మార్చుకోవాలి.
ప్రేమ
యెక్కడ
వున్నదో
అక్కడ
హింస
చేయటానికి
వీలుండదు.
కనుక
యివన్నీకూడను
ఆచరణలో
నిరూపించవలసినవే
కాని
కేవలము
బోధనలతో
నిరూపించేటువంటిదికాదు.
కనుక
మనము
యీనాడు
బోధనలతో
బాటు
ఆచరణకూడను
అత్యవసరము.
ఇక్కడ
అనేకమంది
ఉపకులపతులు
వుంటున్నారు.
కానీ
వారియొక్క
భావములు
వేరు.
వారంతా
object
లో
ప్రయాణము
చేస్తున్నారు.
భౌతికమైన
ప్రాకృత
దృష్టితో
వారు
పోతున్నారు.
కానీ
నేను
Innerview
లో
వున్నాను.
నాది
subject,
వారిది
object.
దానికి
దీనికి
పొత్తు
కుదరదు.
నా
వుద్దేశ్యము
యేమంటే
యిదికేవలము
కాలేజీల్లోకాని
లేక
స్కూల్సులోగాని
యీ
మానవతావిలువలు
బోధించటమనేది
యిదిశాశ్వతమైనదికాదు.
ఏదో
తాత్కాలికముగా
యీ
అభివృద్ధిని
చూరగాన
వచ్చునేగాని
శాశ్వతముగా
నిలచేదికాదు.
బోధనలచేత
మనము
జగత్తును
మార్చలేము.
హృదయాన్ని
యే
విధముగా
పరివర్తన
గావించగలము.
ఆచరణతోనే
దీనిని
పరివర్తన
గావించాలి.
మనము
క్రమక్రమేణా
యేదిబోధించనక్కరలేదు.
మన
discipline
మనము
చక్కగా
నడచుకుంటే
దానిని
చూచి
జగత్తుదానిని
అనుసరిస్తూవస్తుంది.
ఒక
చిన్న
ఉదాహరణము.
ఒక
vice-chancellor
వున్నాడు.
ఆ
vice-chancellor
ప్రతి
దినము
8
గంటలకంతా
university
కి
చేరాలి.
ఆ
విధమైన
నిష్ఠప్రకారము
correct
గా8గంటలకు
ఆ
vice
chancellor
university
చేరుతూవుంటే
యీ
ఆధారమును
పిల్లలు
అనుసరిస్తారు.
ఒక
Time
Table
అనుసరించి
సక్రమముగా
ఆపనులను
ఆచరించాలి.
కర్తవ్యాన్ని
నిర్వర్తించాలి.
ఎనిమిది
గంటలకల్లా
పిల్లలు
ప్రవేశించాలని
పెట్టి
తాను
పది
గంటలకు
ఆ
విద్యాసంస్థకు
పోతే
పిల్లలు
యే
విధముగా
దానిని
ఆచరించగలరు.
కనుక
మొట్టమొదట
మనము
యీనాడుయీకాలములోపల
పిల్లలకు
మానవతావిలువలు
బోధించటానికి
వీలుకాదు.
మనము
ఆచరిస్తూవస్తే
దానిని
చూచి
వారు
అనుసరిస్తూవస్తారు.
మీరు,
తల్లితండ్రులు
ఆచరించినప్పుడే
పిల్లలు
వారిని
అనుసరిస్తూ
వస్తారు.
తల్లితండ్రులు
యెప్పుడు
చూచినా
అసత్యములాడుచుంటే,
పిల్లలను
సత్యము
చెప్పమంటే
యే
రీతిగా
చెప్పగలరు.
వారు
అధర్మమార్గములో
పోతూ
పిల్లలను
ధర్మంగా
నడచుకో
నాయనా
అంటే
యే
విధంగా
నడచుకోగలరు.
కనుక
దేశములో
యీ
మానవతావిలువలు
యెవరు
కోరుతున్నారో
వారు
యీ
సత్య
శాంతి
ధర్మ
ప్రేమ
అహింసలను
అనుభవించి,
ఆచరించి
అందించటానికి
ప్రయత్నించాలి.
అట్లుకాకుండా
కేవలము
బోధనలచేతనే
మారుతుందంటే
యిది
సరైన
మార్పుకాదు.
8
▾
Meaning
Keep
చిన్న
చిన్న
పిల్లలనుండియే
అది
అభివృద్ధిగావించాలి.
విద్యావంతులైనవారందరు
యీ
విషయాన్ని
చక్కగా
గుర్తించటానికి
ప్రయత్నించాలి.
పవిత్రమైనదైవవిలువలను
మనము
ప్రచార
ప్రబోధలు
చేయవలెనంటే
ప్రభుత్వముతో
మనము
దూరముగా
వుంటుండాలి.
ప్రభుత్వముచేత
యీ
విధమైన
పవిత్రమైన
మార్గములు
యేనాటికి
విజయము
సాధించలేవు.
కనుక
యేదో
ఒక
పవిత్రమైన
హృదయము
గల్గినవారు
యీవిధమైన
కొన్ని
శాసనాలు
కొన్ని
సాధించవచ్చు.
ప్రభుత్వముక్షణక్షణానికి
మారుతూ
వుంటుంది.
ఇంకమన
values
యేమైపోతాయి.
ఈ
values
గతియేమిటి.
మన
పాదాలపైన
మనము
నిలబడాలిగానీ
మరొకరి
పాదాలపైన
మనము
ఆధారపడకూడదు.
ఆ
విధమైన
స్వతంత్రముతో
మనము
జీవించినప్పుడే
పవిత్రమైన
విలువలంతా
స్వతంత్రముగా
చాటటానికి
వీలవుతుంది.
దీనినిసాధించటానికి
సంకల్పము
కలిగిన
ప్రతి
ఉత్తమచిత్తుడుకూడను
దీనిని
క్రమక్రమేణా
ప్రభుత్వమునుండి
దూరముచేసి
విద్యావంతులు
ఒక
సొసైటీని
స్థాపించి
తద్వారా
యీ
Human
Values
ను
ప్రబోధ
చేయటానికి
తగిన
కృషి
చెయ్యాలి.
ఈ
vice
chancellor
కూడను
వారికియేవిధమైన
స్వాతంత్ర్యములేదు.
ఎందుకనగా
ప్రభుత్వముయొక్క
నిబంధనలో
వారు
బద్ధులైనారు.
దానినే
వీరు
అనుసరించవలసివస్తుంటాది.
అయితేయీ
vice
chancellors
అందరు
ఏకీభావముతో
కూడినప్పుడు
యెంతటి
ఘనకార్యమునైనా
సాధించవచ్చును.
ఐకమత్యముతో
సాధించలేనటువంటిది
లోకములో
వుండదు.
ఈ
vice
chancellors
లోనే
ఐకమత్యములేదు.
మన
కాలేజీల్లోనే
మనకు
ఐకమత్యములేదు.
పిల్లలకు
Teachers
కుఐకమత్యములేదు.
Teachers
కు
Professors
కుఐకమత్యములేదు.
ఇంక
National
Integration
అంటే
యే
రీతిగా
సాధించగలము.
మొట్టమొదట
మన
గృహాన్ని
సాధించండి.
ఇంటిలో
వున్న
తల్లి
తండ్రి
బిడ్డలు
ఐకమత్యముగాపెరగండి.
ఇంటిలోనే
లేదు
ఐకమత్యము.
ఒంటిలోనే
లేదు
ఐకమత్యము.
దేశములో
ఐకమత్యమనేది
ఒక
stunt
అని
చెప్పవచ్చును.
దీనిపైన
నాకు
యేమాత్రము
నమ్మకములేదు.
కానీ
యీ
vice
chancellors
చాలా
ఆశ
పడుతున్నారు.
చాలా
సహృదయులై
వుంటున్నారు.
కాని
వారు
మాత్రము
యేమి
చేయగలరు.
దీనికి
ప్రభుత్వము
అనేక
విధములైన
నిబంధనలు
వుంటున్నాయి.
మానవతావిలువలు
గవర్నమెంటు
స్వాధీనములో
యేమాత్రములేవు.
ఒక
ప్రోపర్టీ
గాని,
యింకొక
విధమైన
చట్టాన్నిగాని
వారు
స్వాధీనమునందు
వుంచుకోవచ్చునుగాని
మానవతావిలువలు
వారి
తరముగాదు.
దేవాలయములు,
దేవాలయము
ఆస్తులు
ప్రభుత్వము
ఆక్రమించుకోవచ్చును.
కానీ
భగవంతుని
యేమాత్రము
స్వాధీనము
చేసుకోలేరు.
మానవుని
కంట్రోల్
చేయవచ్చును
ప్రభుత్వము.
కానీ
మానవతాగుణములు
వారు
కంట్రోల్చేయలేరు.
కానీ
వారివారి
విద్యార్థులయందు
పవిత్రమైన
ఆధ్యాత్మిక
భావములు
అభివృద్ధిగావించాలి.
నైతిక,
ఆధ్యాత్మిక
విలువలు
విద్యార్థులయందు
ప్రవేశపెట్టినప్పుడు
సహజముగా
మానవతావిలువలు
పెరుగుతాయి.
ఇవి
రెండు
లేకుండా
కేవలము
మానవతావిలువలు
పెంచుకోండి,
పెంచుకోండి
అంటే
యే
విధముగా
పెంచుకొనేది.
9
▾
Meaning
Keep
ఎక్కడున్నాయని
చూచేది.
ఇవి
కనుపించేవి
కాదు.
ఇవి
వినిపించేవి
కాదు.
కర్మఫలములను
తినిపించేవి.
వీటిని
అంతర్దృష్టితో
చూచినప్పుడే
అగుపడుతాయిగాని
కేవలము
బహిర్దృష్టితో
కనుపించేవికాదు.
ఈనాడు
మనము
చక్కగా
తరిఫీదు
అవుతూ
వస్తున్నాము.
ఎక్కడ
చూచినా
Human
Values
develop
చెయ్యాలని
అంటున్నాము.
ఇదేదో
బయటినుంచి
తెచ్చి
పెంచే
మొక్కల
మాదిరి
అనుకుంటున్నారు
వాళ్లు.
కాదు
కాదు.
ఎక్కడనుంచో
తెచ్చేవికాదు.
మననుంచి
ఆవిర్భవిస్తున్నాయి.
ఈనాడు
భక్తి
యేవిధముగా
వుంటున్నాది.
సేవచేయునట్టి
సేద్యపు
పశువులు
చేరి
చితగగొట్టు
చిత్రముగను.
రాయి
పశువును
చూడ
తానె
రక్తితో
పూజించు.
చూశారా
రాతిగా
వుండిన
నందిని
చక్కగా
మ్రొక్కి
మ్రొక్కి
ప్రదక్షిణ
చేస్తున్నాము.
సజీవమైన
గోవును
పట్టుకొని
చితకకొడుతున్నాము.
ఈనాడు
సజీవమైన
మానవులను
ప్రేమించాలి.
నిర్జీవమైన
శిలను
ప్రార్థించటము
కాదు.
ఈనాడు
ఉపకారము
చేసే
చెయ్యే
చాలా
గొప్పది.
కనుకనే
భగవత్నామము
భజించేటువంటి,
పరోపకారము
చేసేటువంటి
చేయి
చాలా
గొప్పది.
ప్రతి
మానవుడు
మానవతావిలువలను
తప్పనిసరిగా
పెంచుకోవాలి.
అది
తనయందే
వుంటున్నవి.
అయితే
దానిని
హెచ్చరించేవాళ్లు
ఒకరుండాలి.
నాయనా!
నీయందు
మానవతావిలువలు
వున్నవని
హెచ్చరించే
వ్యక్తి
కావాలి.
అది
గమనించటమే
నిజమైన
సమాజము.
ఏకత్వాన్ని
గమనించే
తత్త్వమే
సమాజము
అన్నారు.
ఒకరినొకరు
దూషణ
చేసుకోనక్కరలేదు.
ఒకరినొకరు
హింసించుకోకూడదు.
ఒకరినొకరు
బాధించుకోకూడదు.
అందరియందు
వుండిన
ఐక్యత
ఒక
దైవత్వమే.
ఆ
ఏకత్వాన్ని
మనము
భావించుకుంటే
మానవత్వము
మనయందే
అభివృద్ధిగాంచుతుంది.
కాని
యీనాడు
యెవరికి
వారే
యమునాతీరే.
మానవునికి
మానవునికి
మధ్య
అనేక
భిన్నభేదములు
యేర్పడుతున్నాయి.
ఐకమత్యాన్నే
మనము
పొందలేకపోతున్నాము.
లౌకికమైన
ఐకమత్యాన్నే
మనము
సాధించలేకపోతున్నాము.
అంతర్ముఖమైన
ఆనందము
మనకు
యేవిధముగా
లభిస్తుంది.
కనుక
యేదానికైనా
ఒక
ప్రమాణము
వుంటుండాది.
కానీ
భగవంతునికి
ప్రమాణము
లేదు.
అందువలనేఅతనికి
అప్రమేయుడు
అని
పేరు
వచ్చింది.
ఎట్టి
ప్రమాణములకు
చిక్కనివాడు
భగవంతుడు.
సముద్రాన్ని
measure
చేయవచ్చును.
దైవప్రేమనుగాని,
దైవసత్యముగాని
దైవధర్మముగాని,
దైవశాంతిగాని
కొలతలు
వేయటానికి
వీలులేదు.
ఎవరికి
తోచినట్లు
వారు
భావించుకోవచ్చు.
ఇవి
తనభావములు
గాని
దైవభావములు
కాదు.
దైవమునకు
యెవ్వరిపైన
యెట్టి
ద్వేషముగాని,
ఎట్టిఅసూయగాని,
యెట్టి
హింసలు
గాని
వుండవు.
అలాంటి
ప్రేమ
తత్త్వాన్ని
మనము
పొందాలి.
అది
పొందాలంటే
దైవమునుంచినే
రావాలి.
దైవమే
వీటన్నింటికి
Main
Stores.
దానినిపొంది
ఆఅనుగ్రహముచేత
మనము
అందుకోటానికి
సిద్ధముగా
వుండాలి.
దానితోపాటు
లౌకిక
మార్గమునందు
మన
జీవితాన్ని
సార్థకము
గావించుకోటానికి
ప్రయత్నంచేయాలి.
పలికేది
సత్యము
పలకండి.
నిజముగా
యీనాడు
సత్యము
పలకటము
చాలా
సులభము.
అసత్యము
చాలా
కష్టము.
కాని
యేమిటో
వారి
దురదృష్టము.
అసత్యము
చెప్పటం
కష్టమైనదానికే
ప్రయత్నం
చేస్తుంటారు.
10
▾
Meaning
Keep
అసత్యాన్నే
సులభముగా
చెప్పటానికి
ప్రయత్నిస్తున్నారు.
కష్టాన్నే
ఆశిస్తున్నారు.
కాని
సుఖంగా
లభించే
సత్యాన్ని
వారు
యేమాత్రము
నోచుకోలేకపోతున్నారు.
సత్యం
జన
విరోధాయ.
అసత్యం
జన
రంజనమ్.
ఈనాడు
అందరు
అసత్యాన్ని
ప్రేమిస్తున్నారు.
కాని
సత్యాన్ని
ప్రేమించటంలేదు.
సత్యాన్నిమోహించటంలేదు.
సత్యాన్ని
ప్రేమించటానికి
తగిన
కృషి
చేయండి.
సాధ్యమైనంతవరకు
నీ
capacity
యెంతవుందో
అంతవరకు
నిజము
చెప్పటానికి
ప్రయత్నించండి.
ఎలాంటి
పరిస్థితిలో
వుండినప్పటికి
అసత్యాన్ని
చెప్పకుండా
చూడండి.
ఎటువంటి
కఠినమైన
సమయమునందు
కానీ
నీ
ధర్మాన్ని,
నీ
కర్తవ్యాన్ని
విస్మరించకుండా
చూసుకో.
తప్పక
నీకు
సహజసిద్ధమైన
శాంతి
యేర్పడుతుంది.
అందరినీ
ప్రేమించు.
ప్రేమ
ఒకరి
సొత్తుకాదు.
అది
భగవంతునియొక్క
స్వరూపము.
అట్టి
భగవంతుని
ప్రేమను
అందరికి
అందించటానికిగాని,
నీవు
అందుకోటానికిగాని
అధికారముంటూవుండాది.
ఆ
ప్రేమలో
యింతో
అంతో
స్వార్థము
చేరినా
ఆ
ప్రేమ
మాలిన్యమైపోతుంది.
పరిశుద్ధమైన
అద్దమునుండియే
మన
ప్రతిబింబము
సుస్పష్టముగా
కనుపిస్తుంది.
మన
చిత్తమనే
అద్దమునందు
అపవిత్రమైన
భావములు,
అపవిత్రమైన
చింతనలు
అనే
యీ
మాలిన్యాన్ని
మసిని
పూసుకుంటే
నీ
ప్రతిబింబము.యేరీతిగా
కనుపిస్తుంది.
కనుకమొట్టమొదట
ఈకళాశాలయందుగాని,
విద్యాసంస్థలయందుగాని
పిల్లలకు
మొట్టమొదట
సత్యము
చెప్పేదానిని
బోధించాలి.
కర్తవ్యాన్నినిర్వర్తించుకునే
ధర్మాన్ని
బోధించాలి.
నిరంతరము
ప్రశాంతముగా
వుండమని
వారిని
ఆశించాలి.
కష్టములుగాని,
నష్టములుగాని,
దుఃఖములుగాని
వస్తూవుంటాయి,
పోతూవుంటాయి.
Passing
clouds.
కనుక
దీని
నిమిత్తమై
యేమాత్రము
worry
చేయనక్కరలేదు.
పరీక్షలో
Fail
అయిపోయినావా
worry
చేయవద్దు.
జయాపజయములు
జీవితమార్గములోపల
లభిస్తుంటాయి.
అద్భుతసలుతుంటాయి.
శాంతితో
ముందు
నీయొక్క
జీవితాన్ని
అభివృద్ధి
పరచుకోమనాలి.
యీ
విధమైన
courage
encouragement
యివ్వాలి.
ఈ
విధమైన
బోధలచేత
పిల్లల
మనసును
మార్చాలి.
లేతమొక్కలను
యెంత
చక్కని
చెట్టుగానైనా
మనము
తయారుచేయవచ్చు.
బలిసిపోయిన
చెట్టును
వంచటానికి
వీలుకాదు.
వీరియందు
పాతవి
రోతవి
అంతా
వేరులతోకూడి
వుంటున్నాయి.
అలాంటివారిని
మనము
సరిదిద్దటము
యేమాత్రము
సాధ్యముకాదు.
ఇది
కాలమును
వ్యర్థము
చేసినవారమవుతాము.
మొట్టమొదటయీబాలవికాస్ను
అభివృద్ధి
చేయండి.
ఈ
Bal
vikas
ను
Primary
school
లో
ప్రారంభించండి.
వారికి
యీ
విధమైన
బోధనలు
చేస్తుంటే
కేవలము
భారతదేశము
Secular
State
అని
అనేకరకములైన
భావములలో
మనము
సందేహాలుపడుతున్నాము.
Secular
State
అంటే
యేమిటి
అన్ని
మతములవారిని
ఆదరించటమే.
ఏ
మతమును
ద్వేషించరాదు.
అయితేయీ
Secular
State
అంటే
నీవు
మాత్రము
మతరహితుడు
కాకూడదు.
నీవుమతమును
ఆశ్రయించు.
ఇతర
మతములను
మనము
యేమాత్రము
దూషించటముగాని,
తిరస్కరించటముగాని
చేయకూడదు.
కనుకనే
యిది
ఒక
మతమునకు
సంబంధించినదికాదు.
11
▾
Meaning
Keep
దీనికి
పూర్వము
చాలామంది
సత్యసాయి
స్కూల్సు,
Higher
Education
అంతాకూడను
ఒక
మతసంబంధమైనదని
అనేక
పిచ్చి
భావాలు
పొందినారు.
కాదుకాదు.
ప్రాపంచికసంబంధమైన
unity
తోకూడినది.
సర్వమత
సమన్వయమైనది.
సర్వమతసమ్మిళితమైనది.
హృదయముతోసంబంధించినది.
ఇలాంటి
సర్వమతసమ్మతమైన
ధర్మాన్ని
మనము
యీనాడు
ప్రబోధ
చెయ్యాలి.
ఆవిధమైన
ప్రేమభావాన్ని
పెంచుకోండి.
ఈ
ప్రేమభావముచేతనే
మనము
యెంతటి
కార్యమునైనా
సాధించవచ్చు.
ఈనాడు
యెన్నో
మనము
సాధిస్తున్నాము.
ఎన్నో
విద్యలు
నేర్పిస్తున్నాము.
కాని
ఆ
విద్యలు
మాత్రము
యీనాడు
పనికి
వస్తున్నాయా?
చాలామంది
chemistry,
botany,
zoology
యెన్నో
subjects
నేర్చుకుంటున్నారు.
కాని
చదివేది
ఒకటి
వారు
జీవితములో
అనుభవించేది
మరొకటి.
చాలామంది
MBBS
పాస్
చేస్తున్నారు
బస్డ్రైవరుగాపనిచేస్తున్నారు.
ఇంజనీరుగా
పాస్చేస్తున్నారు
హోటలుమేనేజరుగాపనిచేస్తున్నారు.
ఈ
చదువులు
కూడను
సార్థకము
కావటంలేదు.
మనముచదివేదాంట్లో
యీ
Human
Values
పెడితే
యేమి
ప్రయోజనము.
ఆచరణలో
పెట్టేవి
మాత్రము
మనము
చదవాలి.
కనుక
ప్రతి
ఒక్కటికూడను
సత్యము,
ధర్మము,
శాంతి,
ప్రేమ
అనేవి
ఆచరణలో
పెట్టండి.
ఈ
ఆచరణతోనే
అభివృద్ధి
చేసుకోవాలి.
సాధ్యమైనంతవరకు
పెద్దలు
చెప్పే
విషయాన్ని
మననం
చేసి
తద్వారా
మనయొక్క
మానవతావిలువలు
పెంచుకోవాలి.
ఎన్ని
చదువులు
చదివినా
దైవవిశ్వాసము
మాత్రము
దూరము
చేసుకోకండి.
దైవమునే
నీవు
వదలితివా
నీవు
జీవితమునే
వదలినవాడివౌతావు.
నీ
ప్రాణమే
దైవము.
నీ
జీవితమే
దైవము.
సర్వమూ
దైవమే.
దైవభావముతో
నీవు
యే
కర్మలు
ఆచరించినప్పటికిని
అవి
Human
Values
గా
అవుతాయి.
అవిలేకుండా
artificial
గా
యెన్ని
చేసినాగాని
ప్రయోజనములేదు.
అన్నీ
త్రికరణశుద్ధితో
చేయండి.
మనసు,
వాక్కు,
క్రియలతో
మీరు
ఆచరించండి.
ఈనాడు
యిక్కడ
చేరిన
ఉపకులపతులందరు
పవిత్రమైన
భావములతో
వారు
నిర్ణయాలు
చేశారు.
చాలా
పవిత్రమైన
హృదయులు.
మానవతావిలువలు
పెంచుకోవాలనే
పూర్ణ
విశ్వాసముంటుండాది.
సాధ్యమైనంతవరకు
వారు
వారి
సంస్థలలోపల
దీనిని
సరియైన
రీతిలో
వినియోగించాలని
ప్రయత్నముతో
వున్నారు.
కానీ
వారికి
పూర్ణస్వాతంత్ర్యములేదు.
సాధ్యమైనంతవరకు
వారు
యేమాత్రము
నిరుత్సాహపడకుండా
దానిని
సాధించటానికి
పూనుకోవాలని
నేను
ఆశిస్తున్నాను.
వారి
హృదయాల్లో
దైవము
ప్రతిష్ఠ
అయిపోయింది.
దానిని
వారు
ఆశ్రయించనీ.
దానిని
వారు
అనుసరించనీ.
తప్పక
వారి
అభీష్టాన్ని
సిద్ధి
గావించుకోగలరు.
చేరినప్రేమస్వరూపులారా!
మీరందరు
యిక్కడేకాదు
యెక్కడవుండినప్పటికి
మన
నిజమైన
విలువ
యేమిటంటే
మన
ప్రభువైన
భగవంతుని
మాత్రము
విశ్వసించాలి.
ఆ
విశ్వాసాన్ని
మీరు
బలపరచుకుంటే
అన్ని
విలువలు
అందులోనే
చేరివస్తాయి.
కష్టములయందు,
సుఖములయందు
దైవచింతన
మీరు
చేయండి.
ఎలాంటి
బలవత్తరమైన
బాధలుకూడను
జయించవచ్చును.
కనుక
భగవంతుని
భజించి,
పూజించి,
స్మరించి,
తరించండి.
Previous
←
Humanness is the blended form of Vijñāna, Prajñāna and Sujñāna
Next
Sādhanas without Prema are fruits without juice!
→