Contents
Devotion & Sacred Story
Home
Library
Find
Shelf
Settings
←
Leave
Sathya Sai Speaks 1987 · Humanness is the blended form of Vijñāna, Prajñāna and Sujñāna
Tap a verse for its meaning
IAST
Telugu
Meaning
Continuous
Humanness is the blended form of Vijñāna, Prajñāna and Sujñāna
24 September 1987, Seminar of vice-chancellors
1
▾
Meaning
Keep
His poems 204
Also in his talks
(1)
21 November 1990
Seva that sanctifies
మానవత్వమనగ
మనసు
మాట
క్రియయు
అన్ని
ఒక్కగానే
అమరియుండు
మనసునందు
వేరు
మాటయు
క్రియయును
వేరువేరులైన
విలువ
యేమి?
విద్యాధికారులారా!
విద్యాబోధకులారా!
విద్యార్థులారా!
జీవితము
చాలా
పవిత్రమైనది.
విలువైనది.
జీవింపతగినది.
శరీరము,
మనసు,
ఆత్మల
కలయికయే
మానవత్వము.
కర్మలు
చేయునది
దేహము.
తెలుసుకొనునది
మనసు.
వున్నది
ఆత్మ.
ఈ
ఆత్మనే
మన
హృదయమునందు
వున్న
దివ్యత్వము.
చేయుట,
తెలుసుకొనుట,
వుండుట
అనే
త్రిశక్తులయొక్క
తత్త్వమును
వ్యక్తము
చేయుటమే
మన
జీవితము.
దీనియొక్క
తత్త్వాన్ని
మానవుడు
అర్థము
చేసుకొనటమే
మానవత్వముయొక్క
తత్త్వము.
చేయునది,
తెలుసుకొనునది,
వుండునది,
వేరువేరు
అయినప్పటికిని
యివన్నియు
చేరి
మానవుని
పూర్ణత్వముగా
రూపొందింపచేస్తుంది.
మనసు
వివిధ
గతులయందు,
వివిధ
మార్గములయందు,
వివిధ
కర్మలను
ఆచరించటంచేత
దీనినే
అంతఃకరణ
అనే
పేరుతో
పిలువబడుతూ
వచ్చింది.
సంకల్పవికల్పములతో
కూడటంచేత
దానిని
మనస్సనియు,
నిశ్చయాత్మకమనే
దీనివల్ల
బుద్ధి
అనియు
(discrimination)
చింతన
చేయటంవలన
చిత్తమనియు,
దివ్యత్వమును
వ్యక్తీకరింపచేయటంచేత
అహంకారమనియు,
మనసు
బుద్ధి,
చిత్తము,
అహంకారముయొక్క
స్వరూపమే
అంతఃకరణ
అనినిరూపిస్తూవచ్చింది.
మనసు
వుండటంచేతనే
మనిషి
అని
పేరు
వచ్చింది.
మనయేవ
మనుష్యాణాం
కారణం
బంధమోక్షయోః'
అని
యీమనసుయొక్క
సంకల్పముచేతనే
బంధనము,
స్వేచ్ఛ
అనుభవించకలుగుతున్నాడు
మానవుడు.
మనసు
యెట్టిదో
మనిషి
అట్టివాడు.
యద్భావం
తద్భవతి.
దీనినే
ఆంగ్లమునందుకూడను
So
think
as
the
man,
so
is
the
man.
కనుకనే
మానవత్వమనేటువంటిది
మనసుద్వారా
యేర్పడినది.
ఈ
అన్నింటికి
మూలాధారమైన
తత్త్వము
ఒకటి
కలదు.
దానినే
ప్రజ్ఞ
అని
చెప్పుతూ
వచ్చారు.
ప్రజ్ఞ
అనగా
వివేకమనియు,
తెలివితేటలనియు,
మేధస్సనియు
అనేక
విధములుగా
చెప్పబడుతూవచ్చింది.
కానీ
యిది
దీనికి
సరైన
అర్థములుకాదు.
ప్రజ్ఞ
అనగా
కేవలము
బ్రహ్మస్థానమే.
ప్రజ్ఞానం
బ్రహ్మ
అనియీవేదవాక్యమునందుకూడను
చెప్పబడుతువచ్చింది.
కనుక
యీప్రజ్ఞ
అనేది
శరీరమునందున్న
ధాతువునందు,
అంతఃకరణయందు,
ఆత్మయందు
సమత్వముగా
వుంటున్నది.
ప్రజ్ఞ
అనగా
constant
Integrated
awareness.
ఈ
constant
Integrated
awareness
అనేదానికేప్రజ్ఞ
అని
అంటారు.
ఈ
ప్రజ్ఞ
కల్గటమే
మానవత్వానికి
సరైన
విలువ.
ఈ
ప్రజ్ఞ
ప్రేమమయమైనదిగా
వుంటుంది.
ఇలాంటి
ప్రేమమయమైన
ప్రజ్ఞనుండి
వచ్చిన
(Resound)
రీసౌండేసత్యము.
దీనినే
ప్రతిధ్వని
అన్నారు.
ఈ
ప్రేమమయమైన
ప్రజ్ఞనుండి
వచ్చిన
ప్రక్రియయే
అనగా
కర్మలయొక్క
ఆచరణ
Reaction
అన్నారు.
2
▾
Meaning
Keep
ఇదే
ధర్మము
అని
చెప్పబడుతూ
వచ్చింది.
ఈ
Resound,
Reaction
యొక్క
మూలాధారతత్త్వమే
Reflection.
ఈ
Reflection
శాంతి.
ప్రేమమయమైన
ప్రజ్ఞయొక్క
Reflection
శాంతి.
ప్రేమమయమైన
రియాక్షనే
ధర్మము.
ప్రేమమయమైన
ప్రజ్ఞయొక్క
ప్రతిధ్వనే
సత్యము
ఈ
సత్యధర్మశాంతిప్రేమలు
సరైన
రీతిలో
అర్థము
చేసుకోటమే
అహింస.
కనుకనే
మానవుడు
తనయొక్క
ప్రజ్ఞానస్థానమునుండి
తన
కర్మలు
ప్రారంభించాలి.
ఈ
సత్యమనగా
యేమిటి?
చూచినది
చూచినట్లుగా,
చేసినది
చేసినట్లుగా,
విన్నది
విన్నట్లుగా
చెప్పటము
సత్యమా.
కాదుకాదు.
ఈ
విధమైన
సత్యములు
చాలా
ప్రమాదములు
కొని
తెస్తున్నవి.
ఇది
బాహ్యజగత్తునకు
మాత్రమే
సత్యమని
నిరూపిస్తూవచ్చింది.
నిజమైన
సత్యము
దేశకాల
పాత్రలకు
అతీతమైనది.
కనుక
యిట్టి
త్రికాలబాధ్యతమైన
సత్యాన్నిమనము
ఆచరణలో
నిరూపించుట
చాలా
కష్టము.
కనుకనే
దీనిని
వేదాంతము
ఋతము
అని
పేరు
పెడుతూ
వచ్చింది.
ఋతమనగా
transcendental
truth
అని.
ఈ
transcendental
truth
అనేది
మానవుని
fundamental
basis.
ఈ
సత్యమునాధారము
చేసుకొనియే
జగత్సంబంధమైన
truth
ను
హృదయపూర్వకముగా
మనము
ప్రకటితము
గావించాలి.
మనసుతో
అనగా
తలతో
ఒక
విషయాన్ని
చింతించిన
తక్షణమే
చేతితో
పని
ప్రారంభించకూడదు.
ఇదేప్రజ్ఞ.
హృదయముతో
దీనిని
పరిశీలన
గావించాలి.
ఈ
thought
సరియైనదా
కాదా
ఆచరించ
తగినదా,
ఆచరించతగనిదా
అని
విచారణ
చెయ్యాలి.
అప్పుడు
యీ
హృదయము
తృప్తి
అయినప్పుడే
మనము
చేతులతో
ఆచరించటానికి
ప్రయత్నించాలి.
ఇదే
నిజమైనటువంటి
విలువ.
అనగా
తలతో
మనము
విచారించినదానిని
హృదయముతో
పరిశీలన
చేసి
తదుపరి
చేతితో
మనము
ఆచరించాలి.
ఇదియె
విద్యయొక్క
ప్రధానమైన
అవసరము.
Human
value
అన్నారు.
EHV
అన్నారు.
ఇక్కడ
EHV
కాదు.
3HV.
Head
hand
and
Heart
are
3HV
చాలా
అవసరము.
తలతో
మనము
విచారించిన
దానిని,
హృదయముతో
పరిశీలన
సల్పి,
చేతితో
మనము
క్రియ
ప్రారంభించాలి.
దీనినే
వేదాంతము
త్రికరణశుద్ధి
అని
పేరు
పెట్టింది.
ఇలాంటి
త్రికరణ
శుద్ధితో
వుండిన
భావములు
రెండు
వుంటున్నాయి.
ఒకటి
క్రియా
భావము
రెండవది
శాస్త్రభావము
ఈ
క్రియాభావమనేదే
చాలా
అధికమైన
శక్తితో
వుంటున్నది.
Artistic
sense
and
scientific
sense.
Scientific
sense
కంటె
artistic
sense
చాలా
అధికముగా
వుంటుంది.
ఈ
sense
కే
చాలా
ప్రధానమైన
విలువ
యివ్వాలి.
దీనినే
భావము
అన్నారు.
ఈ
భావమునకు
యిచ్ఛాశక్తి
చేరాలి.
దీనికి
చక్కని
ఉదాహరణ.
ఒక
పెద్ద
శిల
వుంటున్నది.
శిల్పి
ఆ
శిలనుండి
సుందరమైన
విగ్రహము
తయారు
చెయ్యాలి.
కానీ
సుందరమైన
శిల్పము
శిలలో
వున్నదా.
లేదు.
తన
భావమునందున్నది.
ఈ
భావాన్ని
ఆ
శిలపైన
యిమిడ్చి
అనగా
యిచ్ఛాశక్తితో
ఆ
రూపాన్ని
ఆశిలనుండి
బయటుకు
తీస్తున్నాడు
ఆశిల్పి.
భావమే
శూన్యమైతే
యీ
సుందర
విగ్రహమే
తయారుకాదు.
కనుకనే
యద్భావం
తద్భవతి.
భావము
అత్యవసరము.
ఈ
భావనాశక్తిని,
యిచ్ఛాశక్తిని
చక్కగా
అర్థము
చేసుకోటం
అత్యవసరము.
ఈ
రెండింటియొక్క
సమ్మిళితమైన
ప్రజ్ఞను
అనుభవించాలి.
3
▾
Meaning
Keep
Also in his talks
(5)
14 January 1988
Strive to recognise the oneness within the many!
19 March 1988
No Learning Greater than Prema
27 April 1990
Give up selfishness: Cultivate unity
1 August 1996
The vyāvahārika lies merged in the pāramārthika
18 April 1998
The universe is the form of Viṣṇu
ఈనాడు
మానవుడు
కేవలము
భౌతికమైన
పరిశోధనలయందే
తన
కాలమును
వ్యర్థము
గావించుచున్నాడు.
కనుకఈపరిశోధనాశక్తి
అనేది
అవసరమా.
ఈ
పరిశోధనా
శక్తి
అనేది
కేవలము
object
కానే
పరిశోధనకు
ఆధారమైనది
ఒకటున్నది.
దీనినే
అంతర్దృష్టి
అన్నారు.
ఇదే
subject.
ఈనాడు
వైజ్ఞానికశాస్త్రము
దేశమంతా
విరివిగాసంచరిస్తూవచ్చింది.
ఈ
science
ప్రపంచములో
అత్యవసరమే.
కానీ
ఆధారమును
వదలి,
ఆధేయముకోసమే
ఆశించటముచేత
యిది
అనేక
విధములైన
అశాంతిని
కలిగిస్తూ
వుంటుంది.
ఈవిజ్ఞానమనేది
మానవునికి
మితిమీరిన
భాగాన్ని
అందింపచేస్తున్నాది.
ఈ
science
కు
ఆత్మ
భావముకానీ,
మనో
విశ్వాసముగాని
వుండదు.
పవిత్రమనే
దానిని
యేమాత్రము
చింతించదు.
మానసిక
వికాసము,
ఆత్మ
విచారము
లేకపోవటంచేతనే
సైన్సు
ప్రమాదకరమైనదని
అనిపిస్తున్నది.
ఈ
సైన్సు
లోకాన్ని
స్వర్గముగా
మార్చగలదనే
విశ్వాసము
అందరియందు
అభివృద్ధిఅవుతుంది.
కాని
యిది
అసాధ్యము.
స్వర్గమంటే
యేమిటి?
లౌకిక
భోగములు
అనుభవించటము
స్వర్గమా.
ఇదే
మానవత్వాన్ని
ధ్వంసము
చేస్తున్నది.
మానవునియందు
వున్న
విలువనంతాకూడను
మరుగు
పరుస్తున్నది.
నిరంతరము
పరిశోధనా
లక్ష్యమే
దీనియొక్క
భావముగా
రూపొందుతూ
వస్తుంది.
పరిశోధనలోపల
గల్గిన
పరిశీలనయింతవరకు
ఫలితము
అందిస్తున్నది.
ఈనాడు
వైజ్ఞానికము
ప్రతి
ప్రశ్నకు
ఒక
answer
అందిస్తూనే
వుంటున్నది.
కానీ
యివన్నికూడను
సరైన
answers
గా
లేవు.
ఇది
క్రమక్రమేణా
అశాంతికి
మూలకారణంగా
రూపొందుతూ
వచ్చింది.
ఈ
శాంతిని
మనము
అనుభవించాలని
అనుకున్నప్పుడు
యీసైన్సును
మనము
సక్రమమైన
మార్గములో
మనము
అనుభవించాలి.
దీనికి
ఐకమత్యము
చాలా
అవసరము.
సామూహిక
కృషియే
మన
జీవిత
ఆధారము.
ఈ
మానవత్వములో
వున్న
సమత్వాన్ని
మనము
కొంతవరకు
అర్థము
చేసుకోవాలి.
సమత్వ
భావములను
అభివృద్ధి
పరచుకోవాలి.
కానీ
యీనాడు
ప్రాపంచికసంబంధమైన
ఐకమత్యము
అత్యవసరమని
అందురుకూడను
బోధిస్తూనే
వుంటున్నారు.
కానీప్రపంచముయొక్క
unity
కంటే
మొట్టమొదట
గృహముయొక్క
unity
అత్యవసరము.
ఈ
గృహముయొక్క
unity
అభివృద్ధి
పరచుకున్నప్పుడే
క్రమక్రమేణా
గ్రామమునందు
unity
అభివృద్ధి
గాంచగలదు.
National
Integration
అని
చెబుతున్నాము.
National
Integration
అన్న
దాంట్లో
యేమి
అర్థము.
ఏ
చైనావారో,
పాకిస్తానవారో
దేశముపైన
పడినప్పుడు
National
Integration
అంటున్నాము.
ఆకొంతపనినిలచిపోతూనే
ఆ
Integration
యేమైపోతుందో.
అదికాదు.
Integration
అనేది
మన
జీవితములో
ఒక
భాగముగా
నిలచిపోవాలి.
ఇది
మానవతా
విలువగా
మనము
భావించాలి.
దివ్యత్వము
ఆత్మతత్త్వముగా
మనము
విశ్వసించాలి.
అనేకత్వములో
వున్న
యేకత్వముగా
మనము
భావించాలి.
ఈ
unity
in
diversity
అనేది
మనము
చక్కగా
గుర్తించాలి.
Stars
are
many
but
sky
is
one
Bodies
are
many
but
life
is
one
Beings
are
many
but
breath
is
one
Nations
are
many
but
world
is
one
Religions
are
many
but
truth
is
one
4
▾
Meaning
Keep
ఇదే
నిజమైన
ఐకమత్యము.
కనుక
ఐకమత్యమనే
దానిని
మనము
హృదయపూర్వకముగా
అనుభవించటానికి
ప్రయత్నము
చేయాలి.
విజ్ఞానము
అత్యవసరము.
ఈ
విజ్ఞానమునందున్న
ప్రజ్ఞానముకూడా
మనము
విచారణ
చెయ్యాలి.
ఈ
ప్రపంచమునందున్న
సుజ్ఞానముకూడను
విచారణ
చెయ్యాలి.
విజ్ఞాన,
ప్రజ్ఞాన,
సుజ్ఞానముల
సమ్మిళితమైన
స్వరూపమే
మానవత్వము.
ఈ
మూడింటియందు
యేకత్వాన్ని
పొందటమే
నిజమైన
ప్రజ్ఞయొక్క
తత్త్వము.
ఇలాంటి
విద్యను
మనము
యీనాడు
అభ్యసించాలి.
నిరంతరము
మనము
అతి
జాగ్రత్తగా
మెలగాలి.
దీనినే
ABC
of
Life
అన్నారు.
A-always
B-be,
C-careful.
Always
be
careful
అని
దీనియొక్క
అర్థము.
ఇది
మన
నిజమైన
చదువు.
ఈ
నిజమైన
తత్త్వాన్ని
మనము
అలక్ష్యపరచి
నిరంతరము
careless
గా
జీవిస్తున్నాము.
జీవితము
చాలా
పవిత్రమైనది.
పవిత్రము
అనేది
Latin
భాషనుండి
వచ్చినది.
ఇది
విర్
అనే
దానినుండి
పుట్టినది.
విర్
అనగా
మానవుడు.
కనుక
మానవుడు
పవిత్రుడని
దీని
అర్థము.
పవిత్రమైన
మానవుడు
చేయు
ప్రతి
పనికూడను
పవిత్రమైనదిగానే
వుండాలి.
మానవునియొక్క
సర్వసంకల్పములు
పవిత్రముగానే
వుండాలి.
కానీ
యిలాంటి
పవిత్రత
యీనాడు
లోపం
అయిపోయింది.
ఈ
పవిత్రత
యీనాడు
యెక్కడనుకనుపించుటంలేదు
స్వార్థము,
స్వప్రయోజనము
తప్పు
సమత్వమనేది,
ఐకమత్యమనేది
అతిదూరమైపోతుంది.
స్వార్థ
స్వప్రయోజనములకుకూడను
స్వస్తి
చెప్పాలి.
విశిష్టమైన
unity
ని
మనము
అభివృద్ధిపరచాలి.
స్వాగతము
చెయ్యాలి.
ఈనాడు
విద్యార్థులు
నిత్యజీవితములో
యేమాత్రముకూడను
సరైనవిద్యను
అభివృద్ధి
గాంచటంలేదు.
విషయాన్ని
క్రోడీకరింపచేసుకొనే
నిమిత్తమై
విద్యనభ్యసిస్తున్నారేకాని
ఆత్మప్రబోధ
నిమిత్తమై
అనే
సత్యాన్ని
గుర్తించటంలేదు.
కాదు.కాదు.
విద్య
మనయొక్క
జీవితాధారము.
కనుకనే
యీ
ప్రజ్ఞాతత్త్వమును
మనము
చక్కగా
గుర్తించి
యీ
ప్రజ్ఞయందు
ఆవిర్భవించిన
సత్యధర్మశాంతిప్రేమలను
మనము
హృదయపూర్వకముగా
విశ్వసించి,
ఆచరణలో
పెట్టినప్పుడే
దీనియొక్క
ఆనందము
లభ్యమౌతుంది.
ఈమానవవిలువలు
మనముగ్రంథములో
అభ్యసించేవికావు.
కేవలము
బోధనచే
మనము
ప్రాప్తించేవికావు.
స్వశక్తితో
తన
ఆచరణయందే
దీనిని
అభివృద్ధి
పరచుకోవాలి.
ఈనాటిఉపన్యాసాలతో
మనిషి
ప్రవర్తనలో
పరివర్తన
జరుగుతుందనేది
తప్పు.
మానవునియొక్క
ప్రవర్తన
అత్యవసరము.
మానవుడనగా
మనసే.
మనసనగా
సంకల్పములే.
సంకల్పములనగా
నిత్యజీవితములో
వుండిన
పరిణామమే.
ఈ
పరిణామమునకు
ప్రవర్తనే.
యీనాడు
ప్రపంచము
వుండవలసిన
రీతిగా
వుండలేదంటే
దీనికిప్రవర్తన
సరియైనఆధారము.
మానవుడు
వుండవలసిన
రీతిగా
వుండటంలేదు.
కనుకయీప్రవర్తన
మార్చుకున్నప్పుడే
అందులో
సరియైన
విలువలను,
ఆనందమును
మనము
అనుభవించవచ్చును.
5
▾
Meaning
Keep
విద్యార్థులారా!.
ముఖ్యముగా
మీరు
హృదయాన్ని
పరివర్తన
చేసుకోవాలి.
మీ
సమస్త
కర్మలుకూడను
పవిత్రమైన
కర్మలుగా
రూపొందింప
చేసుకోవాలి.
మీ
మాటలు
మొదలు
మీనడతవరకుకూడను
పవిత్రమైనవిగా
వుండాలి.
దీనితో
అభ్యసించే
విద్యనే
సరైన
విద్య.
ఈ
విద్యయందు
వినయము
చాలా
అత్యవసరము.
ఆవిధమైన
వినయాన్ని
పెంచుకోటమే
మానవుని
ప్రధాన
కర్తవ్యము.
ఈ
విధమైన
పవిత్రమును
మనము
పెంచుకున్నప్పుడే
నిత్యసత్యమైన
స్థానాన్ని
మనము
సులభముగా
చేరవచ్చు
అందుకోవచ్చు.
కనుక
మొట్టమొదట
మన
శరీరాన్ని
వంచాలి.
ఇంద్రియాల్ని
నిగ్రహించుకోవాలి.
మనోనాశము
చేయాలి.
అప్పుడే
మనకు
సరైన
స్థానము
లభ్యమవుతుంది.
అప్పుడే
మనము
నిజమైన
ఆనందమును
పొందవచ్చు.
కనుక
Bend
the
body.
Mend
the
senses,
End
the
mind.
This
is
the
essential
way
to
attain
Immortality.
మనకు
Immortality
కావాలంటే
మనము
Immorality
ని
నిర్మూలము
చెయ్యాలి.
What
is
the
way
to
Immortality?
Removal
of
immorality
is
the
only
way
to
immortality.
విద్యార్థులు
అతి
జాగ్రత్తగా
వుంటుండి
తనయొక్కజీవితములోపల
దీనినిమనము
అభివృద్ధి
చెయ్యాలి.
యితరులకు
అందించాలి.
అప్పుడేవిద్యనుమనము
ఆదర్శప్రాయముగా
అనుభవించినవారము,
అందించినవారము
కాగలము.
విద్యార్థులే
కాకుండా
అధ్యాపకులుకూడను
యీ
సత్యాన్ని
గుర్తించి
ఒకరికి
ఒకరికి
సన్నిహిత
సంబంధబాంధవ్యమును
మనముపెంచుకోవాలి.
నిజముగా
మానవుని
విలువలనేవి
మనము
నేర్చుకొనేవికాదు.
అవి
సహజమైన
శక్తులు.
కేవలము
విద్యార్థులకేకాదు,
జగత్తునందు
వుద్భవించిన
ప్రతి
మానవునికి
యీ
మానవత్వము
అత్యవసరము.
ఏ
విధముగా
యితరులు
మనలను
గౌరవించాలని
ఆశిస్తున్నామో
ఆ
విధముగా
మనము
యితరులను
మొట్టమొదట
గౌరవించాలి.
కానీయితరులు
మనలను
గౌరవించాలని
ఆశిస్తున్నామేగాని
మనము
యితరులను
గౌరవించటములేదు.
కనుకయిది
one
way
traffic
కాదు.
give
and
take.
give
and
take.
ఇతరులకు
యే
విధముగా
వుంటుంటే
యిది
మనము
మంచిదని
భావిస్తామో
ఆ
మంచిని
మనలో
అభివృద్ధి
పరచుకోవాలి.
మనము
యితరులకు
చెప్పుటకు
పూర్వము
మొట్టమొదట
మనము
దానిని
ఆచరించాలి.
ఆ
ఆచరణ
ద్వారానే
ప్రచార
ప్రబోధములు
అధికమవుతుంది.
ఆచరణలో
లేక
కేవలము
ప్రబోధలు
చేసినంత
మాత్రమున
యిది
కేవలము
హాస్యాస్పదము
అవుతుంది.
కనుక
మనము
యే
ఒక్కటి
రెండైనా
మనము
ఆచరించి
యితరులకు
ఆదర్శముగా
అందించుటకు
కృషి
చెయ్యాలి.
ఈ
ఆదర్శాన్ని
మనము
ముఖ్యముగా
దృష్టియందు
వుంచుకోవాలి.
ఈ
విద్యార్థులయందిది
అభివృద్ధి
గాంచినప్పుడు
క్రమక్రమేణా
విశ్వమంతా
యిది
ఆదర్శముగా
నిరూపించటానికి
అవకాశమవుతుంది.
చదివిన
చదువులు
కేవలము
జీవనోపాధి
నిమిత్తముకాదు;
జీవిత
పరమావధి
అనే
సత్యాన్నికూడ
గుర్తించాలి.
Education
should
be
for
life
not
for
living.
ఈ
సత్యాన్ని
మనము
చక్కగాక్షణక్షణము
చింతించాలి.
6
▾
Meaning
Keep
కనుక
విద్యావిధానమునందు
మొట్టమొదట
మనము
గుర్తించవలసినవి
రెండు.
నేను
మానవుడు
అనే
దానిని
విశ్వసించాలి.
ఇది
కేవలము
half
truth.
ఇంకొక
half
truth
వుంది
అది
యేమిటి.
నేను
పశువునుకాదు
అనేది.
I
am
not
animal
అనేది
half
truth.
I
am
human
అనేది
half
truth.
ఈ
రెండింటియొక్క
చేరికనే
మానవత్వము
పూర్ణత్వమవుతుంది.
నేను
మానవుడు
మానవుడు
అని
చెప్పుకుంటూ
animal
గామనముప్రవర్తించుకుంటే
మానవుడు
యెట్లా
కాగలడు,
కనుక
మనలో
చేరిన
పశుత్వాన్ని
దూరము
చెయ్యాలి.
ఆ
పశుత్వాన్ని
దూరము
చేయక
యెంతకాలము
యెన్ని
చదువులు
నీవుచదివినప్పటికి
యిదిప్రయోజనములేదు.
ఈ
education
లోపల
ప్రధానమైన
subjects
రెండు
commonsense
ఒకటి
General
knowledge
రెండవది.
ఈ
commonsense,
General
Knowledge
లేనప్పుడు
యెంతటి
వైజ్ఞానికుడైనప్పటికి
ఒక్కొక్కప్పుడు
కొంత
అశాంతికి
గురికావచ్చు.
పూర్ణజ్ఞాని
పూర్ణానందముగా
వుంటాడు.
ఒక
చిన్న
ఉదాహరణము.
భూమికి
ఆకర్షణశక్తి
కలదని
కనిపెట్టినవాడు
న్యూటన్.
యితడు
గొప్ప
సైంటిస్టు.
ఇతను
చాలా
ఉత్తముడు.
నిరంతరము
తన
పరిశోధనలంతాకూడను
ఒకే
angle
లో
జరుగుతూ
వుండేది.
లేబొరెటరీలోపలకూర్చొని
అదే
తన
లోకముగా
భావించుకొనేటువంటివాడు.
ఈ
ప్రపంచమునకు
సంబంధించిన
విషయాలలో
యేమాత్రము
అతనికిపరిచయములేదు.
కనుకయీవైజ్ఞానికమనేదికూడను
కేవలము
ఒకే
angle
లో
పోతే
ప్రయోజనములేదు.
Awareness
is
life.
అన్నింటియందున
తాను
గుర్తించాలి.
కనుకనే
కొన్ని
ప్రమాదములుకూడను
అధికమవుతూవస్తున్నాయి.
ఈన్యూటన్
అతి
ప్రీతిగా
ఒకపిల్లినిపెంచుకొనేవాడు.
ఆ
పిల్లితో
చాలా
యెక్కువ
సంబంధం
పెంచుకున్నాడు.
అతను
రూమ్‌లో
పోయి
యేదో
పరిశోధన
విషయం
గురించి
ఆలోచించే
సమయంలో
యీ
పిల్లి
తలుపువద్దకు
వచ్చి
మ్యావ్
మ్యామ్
మని
అరచేది.
ఆ
పిల్లి
అరచటంచేత
తనకి
కొంత
disturbance
గా
వుంటుందని
చెప్పి
దానిని
అరచినీయకుండా
వుంచేందుకై
తలుపుకి
ఒక
చిన్న
రంధ్రాన్ని
పెట్టించాడు.
దానికి
అవసరమైనప్పుడు
ఆ
రంధ్రముగుండా
దూరటం,
రూమ్‌లోకి
రావటం
యిక
అరచటం
మానివేసింది.
ఇతనికి
చాలావరకు
తృప్తి
కల్గింది.
కొన్ని
దినములైన
తరువాత
ఆ
పిల్లికి
రెండు
పిల్లలు
పుట్టాయి.
ఆ
పిల్లి
రావటానికి
ఒకే
రంధ్రము
వుంది
ఇంక
యీ
రెండు
పిల్లలు
రావటానికని,
carpenter
ని
పిలిపించి
యింకో
రెండు
రంధ్రములు
చేయించాలనుకొన్నాడు.
carpenter
వచ్చాడు.
ఎక్కడ
రంధ్రములు
పెట్టాలిసార్,
దేనికోసం
పెట్టాలి
అని
ప్రశ్నించాడు.
ఇంతకు
ముందు
ఒక
పిల్లి
పెద్దది
వుండేది.
ఇప్పుడు
దానికి
రెండు
పిల్లలు
పుట్టాయి.
కాబట్టి
రెండు
రంధ్రాలు
పెట్టమన్నాడు.
అప్పుడు
carpenter
చెప్పాడు
సార్,
వుండే
రంధ్రములోనే
మూడూరావచ్చుకదా.
ఒకటి
తర్వాత
ఒకటి
అన్నాడు.
అప్పుడు
న్యూటన్
అనుకున్నాడు.
ఛీ!
వాడికి
వున్న
బ్రెయిన్
నాకు
లేకపోయిందే
అతనికి
వున్న
General
Knowledge
నాకు
లేకపోయిందే
అని
అతనినుండి
గొప్ప
పాఠాన్ని
నేర్చుకున్నట్లుగా
విశ్వసించాడు.
కనుక
మనం
నేర్చుకోటమంటే,
గొప్పవారి
నుండేకాదు,
ప్రతివ్యక్తినుండి
మనంనేర్చుకోవలసినవి
యెన్నో
వుంటున్నాయి.
7
▾
Meaning
Keep
ఈనాడు
విద్య
అధికమైనతక్షణమే
నేను
గొప్ప
విద్యావంతుడనని
అహంకారముగా
వుంటుంటాము.
అది
చాలా
పొరపాటు.
మనయొక్క
చదువు
యెంతవరకు
పోతున్నాదంటే
Mathematics
దాని
తర్వాత
Physics,
తర్వాత
Chemistry
తర్వాత
Biology
యింతటితోనేమనచదువునిలచిపోతున్నది.
కాని
Theology
వరకు
మనంపోవటంలేదు.
ఆ
దైవత్వాన్ని
మనం
పొందాలి.
కనుకమనంకేవలంపదార్థమునుండి
వృక్షము.
వృక్షమునుండి
మానవునివరకు
పోయి
మనం
జీవితం
నిలిపివేస్తున్నాము.
అక్కడనుండి
దైవత్వాన్ని
చేరటానికి
మనంపూనుకోవాలి.
అదే
నిజమైన
చదువు.
మానవుని
మానవునిగా
చిత్రించటము
గొప్పతనము
కాదు.
మానవుని
ఆదర్శవంతమైన
మానవునిగా,
ఉత్తమ
మానవునిగా
మనము
అభివృద్ధిగావించుకోవాలి.
ఈనాడు
అనేక
సిద్ధాంతములు
మనముసాధించాము.
అనేక
పరిశోధనలతో
మనము
అనేకవిధములైనవి
తెలుసుకున్నాము.
గొప్ప
విజ్ఞానవేత్తగా
తయారైనాము.
కాని
మానవతావిలువలు
యెన్నినీవుసంపాయించుకున్నావు.
మానవత్వాన్ని
యెంత
నీవు
రక్షించుకున్నావు.
ఈ
questionకి
answer
లేదు.
దీనికి
answer
మనము
సంపాయించుకోవాలి.
మానవతావిలువలు
మనము
పోషించుకోటమే
నిజమైన
మానవత్వానికి
సరియైనఅర్థము.
కనుక
యీనాడు
విద్యాసంస్థలయందు
మానవతావిలువలు
తప్పనిసరిగామనము
అభివృద్ధిగావించటానికి
ఒక
స్పెషల్
సబ్జెక్ట్‌గా
పెట్టాలి.
ఈ
Human
value
అనేది
లేకపోవటంచేతనే
యీనాటి
విద్యావంతులంతా
కేవలం
రాక్షసులవలె
ప్రవర్తిస్తున్నారు.
కనుక
నిరర్థకమైన
జీవితము
పూర్తిగా
వ్యర్థమే.
మానవత్వంలో
వుండే
దివ్యత్వాన్ని
మనం
గుర్తించటానికి
మనం
ప్రయత్నం
చేయాలి.
ఈనాడుఅనేకమంది
ఉపకులపతులు
చేరివుంటున్నారు.
వీరందరుకూడను
యీ
విధమైన
నిర్ణయాన్ని
చక్కగా
సహృదయంతోదీనినిపోషించినప్పుడు
యెంతైనా
దీనినిమనము
అభివృద్ధిగావించినవారమవుతాము.
నావుద్దేశ్యమేమనగా
గొప్ప
గొప్ప
విద్యావంతులు
మన
భారతదేశములో
యెంతోమంది
వుంటున్నారు.
ఇలాంటి
వారందరు
చేరి
యీయొక్క
ఆదర్శవంతమైన
మానవత్వాన్ని
కొంతవరకు
పోషించటానికి
ఒక
సొసైటీని
స్టార్ట్
చెయ్యాలి.
ఈ
సంస్థ
ప్రభుత్వానికి
సంబంధం
లేకుండా
వుండాలి.
ఈ
ప్రభుత్వముతో
సంబంధముగా
వున్నప్పుడు
మన
భావములు
మన
వుద్దేశ్యములు
మన
ఆశయములు
యేమాత్రము
ఫలించలేవు.
విద్యాసంస్థలే
ఒక
ప్రత్యేకమైన
ఒక
సొసైటీగా
వుండాలి.
అప్పుడే
యీ
ఆశయాన్ని
చక్కగా
అభివృద్ధి
గావించవచ్చు.
కనుకయిదిప్రత్యేకమైన,
స్వతంత్రమైన
సంస్థగా
తయారుకావాలి.
ఈ
విధముగా
చేసినప్పుడే
మన
ఆశయాలు
మన
సిద్ధాంతాలు,
మన
పవిత్రతను
యెంతైన
మనము
ఆచరణలో
పెట్టి
ప్రచారం
చేయటానికి
అవకాశం
వుంటుంది.
విద్యావంతులకు
చాలా
గొప్ప
గొప్ప
భావాలుంటున్నాయి.
కాని
వారికి
స్వతంత్రము
లేకపోయింది.
వారికి
తగినంత
స్వతంత్రమునందించాలి.
ఈ
ఉపకులపతులందరుకూడను
యిటువంటి
స్వతంత్రమును
కోరాలి.
Responsibility
ని
మాత్రం
యిస్తున్నారే
గాని
Rights
యివ్వటంలేదు.
ఈ
Rights
and
Responsibilities
రెండు
వుంటున్నప్పుడే
light
and
shadow
మాదిరి
రెండు
వుంటుంటాయి.
Light
యెక్కడవుందో
అక్కడ
shadow
వుంటుంది.
8
▾
Meaning
Keep
Also in his talks
(2)
23 November 2000
My Prema Is Your Good Fortune
13 July 2003
I am not the body; I am the indweller
Shadow
యెక్కడవుందో
అక్కడ
light
వుంటుంది.
ఈ
విధమైన
Rights
and
Responsibilities
తీసుకున్నప్పుడే
మనము
యీయొక్క
మానవతావిలువలను
యెంతైనా
పోషించవచ్చును.
ఈ
విధమైన
ఉద్దేశ్యాలతో,
ఐకమత్యముతో
మానవతా
విలువలు
పోషించినప్పుడు
భారతదేశము
యెంతైనా
ఆదర్శవంతమైన
దేశముగా
రూపొందుతుంది.
ప్రతివ్యక్తి
యిది
నా
స్వంత
పని
అనే
వుద్దేశ్యము
అభివృద్ధి
చేసుకోవాలి.
మనదేశముయొక్క
పోషణ
మనము
దృష్టిలో
పెట్టుకోవాలి.
కేవలము
నాది
నా
వారు
అనేదానివరకే
యిది
ప్రయాణము
కాకూడదు.
మనది
మనవారు
అనే
వుద్దేశ్యము
యిక్కడ
పెరగాలి.
ఈ
విధమైన
ఐకమత్యత,
పవిత్రత
దివ్యత్వము
యీఆత్మతత్త్వాన్ని
మనము
క్రోడీకరించినప్పుడే
సరైన
విలువలను
పోషించగలము.
ఆత్మవిచారణ,
మనోవికాసము
యీ
రెండును
అత్యవసరము.
ఈ
మానసిక
వికాసాన్ని
మనము
అభివృద్ధి
గావించుకోవాలి.
కానియీనాడు
చదువులు
అధికమైపోతున్నాయి
గాని
మనసు
చాలా
నేరో
అయిపోతున్నాది.
చాలా
సంకుచిత
మనస్సుగా
తయారౌతుంది.
కాదు
కాదు
విశాలమైన
భావాన్ని
పెంచుకోవాలి.
ఇదే
నిజమైన
విద్యయొక్క
సారము.
విద్యయొక్క
లక్ష్యము.
యీ
లక్ష్యాన్ని
మనము
చేరాలి.
పట్టిన
పట్టేదో
పట్టనే
పట్టితివి.
పట్టు
నెగ్గెడిదాక
అట్టెయుండు.
కోరినదేదియో
కోరనే
కోరితివి
కోర్కె
చెల్లెడుదాక
పోవకుండు.
అడిగినదేదియో
అడగనే
అడిగితివి
అడిగినదిడుదాక
విడవకుండు.
ఈ
పట్టుదల
మానవునిలో
వుంటుండాలి.
ఇలాంటి
పవిత్రమైన
విషయాలలో
పట్టుదల
మనకు
అత్యవసరము.
ఇది
నా
కోసము
కాదు
ప్రపంచ
నిమిత్తమై
చేసేది.
దేశమంతా
క్షేమంగా
వున్నప్పుడే
మనక్షేమందేశముతోచేరివుంటున్నాది.
నా
ఆనందము,
నా
సుఖమే
ప్రధానమనుకుంటే
యేమాత్రము
ప్రయోజనములేదు.
కనుక
దేశక్షేమాన్ని
మనము
లక్ష్యములో
పెట్టుకోవాలి.
పవిత్రమైన
భారతదేశముయొక్క
విశిష్టతను
మనము
పెంచుకోవాలి.
ఈప్రజ్ఞానముతోపాటు
ఆధ్యాత్మికప్రజ్ఞానముకూడను
జోడించాలి.
ఈ
రెండింటిని
negative,
positive
మాదిరి
మనము
చేర్చుకోవాలి.
ఈకలయికచేరినప్పుడే
సరియైన
ఆనందము
మనకు
లభిస్తుంది.
సైన్సు
ప్రత్యేకము,
ఆధ్యాత్మికము
ప్రత్యేకము
మనము
విభజించరాదు.
ఈ
రెండింటియొక్క
యేకత్వాన్నిచేసుకోవాలి.
మనమందరము
ఐకమత్యముగా
వుంటుండాలి.
సత్సంగాన్ని
పెంచుకోవాలి.
సత్సంగముచేతనే
సద్భావాలు
పెరుగుతూ
వుంటాయి.
ఈ
సద్భావములచేతనే
సత్కర్మలు
ఆచరించుటకు
వీలవుతుంది.
కనుకనే
యీనాడు
మనకు
సత్సంగము
చాలా
అవసరము.
కాని
దురదృష్టవశాత్తు
యెక్కడికి
పోయినప్పటికి
దుస్సంగము,
దుస్సంగము,
దుస్సంగమే.
ఐన్స్టీన్కూడను
అనేక
పర్యాయములు
చెప్పాడు.
Tell
me
your
company
I
shall
tell
you
what
you
are.
నీ
సంఘమును
బట్టి
నీవు
వుంటుంటావు.
9
▾
Meaning
Keep
ఈనాడు
దుస్సంగాన్ని
సులభముగా
మనము
పెంచుకుంటున్నాము.
దుర్భావములను
మనము
సులభముగా
పెంచుకుంటున్నాము.
దురుద్దేశాన్ని
మనము
సులభముగా
పెంచుకుంటున్నాము.
సద్భావాన్ని
సదుద్దేశాన్ని
మనము
యేమాత్రము
పెంచుకొనుటకు
ప్రయత్నించుటలేదు.
ఈ
bad
habits
అనేవి
క్షణములో
మనకు
ఆవరించి
పోతున్నాయి.
కాని
పవిత్రమైన
భావములు
యెంతమాత్రము,
యెంత
ప్రయత్నించినా
రాలేకపోతున్నాయి.
కారణమేమిటి?
నీ
సంకల్పము
పటుత్వమైనదిగా
లేకపోవటమే.
ఈనాడు
సైన్సుకు
మానవుని
జీవితముయొక్క
సమగ్రతను
పెంచే
అధికారము
లేదు.
ఒక్క
ఆధ్యాత్మికమునకు
మాత్రమే
యీ
సమగ్రతను
పోషించే
అధికారముంటుంన్నాది..
కనుకనే
మొట్టమొదట
మానవవిలువలకు
ఆధ్యాత్మికము
అత్యవసరము.
విత్తనము
భూమిలో
పెట్టి
నీరుపోసినప్పుడే
మొక్కగాఅభివృద్ధి
అవుతుందిగాని
tin
లో
పెట్టి
నీరు
పోస్తే
కుళ్లిపోతుంది.
అదే
విధముగనే
మానవతావిలువలు
ఆధ్యాత్మికములో
పెట్టినప్పుడే
అది
అభివృద్ధి
కాగలదుగాని
కేవలము
సైన్సులోనే
పడితే
యేమాత్రము
అభివృద్ధి
కాదు.
కనుక
మానవతావిలువలు
పెరగటానికి
ఆధ్యాత్మికమనే
సాయము
చాలా
అవసరము.
ఆ
ఆధ్యాత్మిక
సహాయం
లేకపోతే
Human
value
artificial
human
value
అవుతాయికాని
artificial
వల్లవచ్చినప్రయోజనమేమిటి
Art
is
outside.
Heart
is
inside.
కనుక
heart
లో
…వు
అభివృద్ధి
కావాలి.
కనుక
మొట్టమొదట
ఆధ్యాత్మిక
భావాన్ని
మనము
అభివృద్ధి
గావించుకోవాలి.
అదే
మనకు
ఆధారము.
అదే
జీవితమునకు
గమ్యము.
అదేసులభముగా
brotherhood
of
man,
Fatherhood
of
god.
ఈరెండింటిని
develop
చెయ్యాలి.
భక్తియిదిఅత్యవసరము.
ఈ
devotion
లేకుండా
పోతే
కేవలం
ocean.
దానిలో
మునిగిపోతాము
మనము.
మన
సంసారము
అనేటువంటిది
యే
విధముగా
వుంటున్నాదంటే
సముద్రాన్ని
మధనము
చేసినప్పుడు
మొట్టమొదట
హాలాహలము
పుట్టింది.
తరువాతనే
అమృతము
వచ్చింది.
ఆ
విధముగనే
మన
జీవితము
అనే
దానిని
చక్కగా
మధిస్తే
వైరాగ్యము
అనేది
మొట్టమొదట
పుట్టాలి.
తరువాతనే
ఆనందమనేది.
లభ్యమవుతుంది.
వైరాగ్యము
లేకుండా
ఆనందము
మనకు
రాదు.
కనుక
మొదట
వైరాగ్యము
మనము
అభివృద్ధి
పరచుకోవాలి.
Deattachment
అంటే
యేమిటి?
ఇల్లు,
వాకిలి,
ఆలుబిడ్డలు
వదలి
అరణ్యమునకు
పోటంకాదు.
దుష్టభావాన్ని
విసర్జించటమే
వైరాగ్యము.
అదే
నిజమైన
వైరాగ్యము.
ఆ
విధమైన
భావాన్ని
విద్యార్థులం
పెంచుకొని,
సమరసమును,
సమత్వమును
అభివృద్ధి
గావించుకోటానికి
తగిన
కృషి
చెయ్యాలి.
విద్యార్థులారా!
కేవలముమానవత్వాన్ని
అభివృద్ధి
చేయలేని
విద్య
శ్మశానములో
వున్న
నక్కల
అరుపులవంటివే.
కనుకమొట్టమొదట
మనము
character
develop
చేసుకోవాలి.
అందువలననే
character
is
the
hallmark
of
man
అని
అన్నారు.
ఈ
పవిత్రతను
మనము
పెంచుకోవాలి.
అది
పవిత్రమైన
నడతలలోనే
మనకు
వస్తుంది.
మన
సంస్థయందు
వుండిన
విద్యార్థులు
కొన్ని
రకములైన
అభ్యాసములు
అభివృద్ధి
చేసినప్పుడు
యావత్ప్రపంచానికి
వీరివల్ల
ఆదర్శమును
నిరూపించవచ్చు.
కనుక
విద్యార్థులారా!
మీ
స్వార్థాన్ని
స్వప్రయోజనాన్ని
కొంతవరకు
త్యాగము
చేసి
పవిత్రతనువిశాలమైనజగత్తునకు,
సమాజమునకు
తోడునీడగా
వుండే
కర్మలు
మీరు
చేతబట్టాలి.
10
▾
Meaning
Keep
ఈనాడు
అనేకమంది
గొప్ప
గొప్ప
ఉపకులపతులు
చేరారు.
వీరందరు
యీ
మూడు
దినములు
సంప్రదించి
సరైనదీనినివీరుకొంతచాటుటానికి
సంసిద్ధులుగా
వుంటున్నారు.
ఈ
అవకాశమును
మీరు
సద్వినియోగము
చేసుకోండి.
ఈ
పవిత్రతను
మీరు
అందుకోండి.
ఈ
పెద్దల
వాక్యములను
మీరు
చక్కగా
ఆలకించండి.
ఈ
సమావేశములంతా
కేవలము
కాలము
వ్యర్థము
గావించుకొనే
నిమిత్తము
యేర్పడినటువంటివి
కాదు.
ఈ
Seminar
యొక్క
essence
ను
యావత్ప్రపంచానికి
అందించటానికి
మీరుఒకవిధమైన
messengers
గా
వుంటుండాలి.
ఈ
Seminar
కేవలము
మూడు
దినముల
ముచ్చటగా
కాలాన్ని
గడుపుకోటంకోసం
రాలేదు.
ఆ
గొప్ప
గొప్పవారి
గొప్ప
గొప్ప
భావాల్నంతా
యిందులో
యిమిడ్చి
దీనిని
పరిశుద్ధమైన,
పవిత్రమైన
రూపాలుగా
తయారుచేస్తున్నారు.
కనుక
యీ
సదవకాశమును
మీరుపురస్కరించుకుని
పవిత్రతను
మీరు
అభివృద్ధి
పరచుకొని
ఐకమత్యముచేత
యావత్
భారతదేశము,
సమాజముయొక్క
గౌరవాన్ని
మీరుకాపాడాలని
నేను
ఆశిస్తూ,
ఆశీర్వదిస్తూ
విరమిస్తున్నాను.
Previous
←
Today satsaṅga is what man needs most urgently
Next
Sing of God, worship Him, remember Him, and cross over
→