Contents
Devotion & Sacred Story
Home
Library
Find
Shelf
Settings
←
Leave
Sathya Sai Speaks 1987 · The Praṇava is another name for the Paramātma
Tap a verse for its meaning
IAST
Telugu
Meaning
Continuous
The Praṇava is another name for the Paramātma
1 October 1987
1
▾
Meaning
Keep
విశ్వహృదయమందు
వినిపించు
ప్రణవంబు
వినుడు
శ్రద్ధతోడ
వీనులలర
కామ్యముక్తులనిడ
కల్పకంబిదె
సుమ్ము
మరువబోకు
మిట్టి
మంచిమాట.
వేదానాం
సామవేదోస్మి.
వేదములయందు
సామవేదము
నేనే
అని
గీతాచార్యుడు
ప్రకటించాడు.
సామ్నా
ఉద్గీతో
రసః
అన్నది
చాందోగ్య
ఉపనిషత్తు.
సామవేదమునందు
రసస్వరూపమై,
ప్రేమస్వరూపమై,
దివ్యస్వరూపమై
ప్రకటితమవుతున్నది
యీ
సామవేదము.
ఉద్గీతమనగా
ప్రణవమే.
సామవేదమునకు
ప్రణవమే
రసము.
ప్రణవమే
ప్రాణము.
ఓంకారం
సర్వవేదానాం
సర్వవేదములయందు
ఓంకారము
ప్రధానమైన
దృష్టితో
ప్రకటితం
చేసింది.
దీనినిబట్టి
ఓంకారమనేది
యెంత
ఉత్కృష్టమైనది,
ఎంత
పవిత్రమైనది
ఎంత
ప్రధానమైనది
అర్థం
చేసుకోవాలి.
అక్షర
ప్రపంచమందు
ఏకాక్షరమైన
ఓంకారమే
సర్వాక్షరములను
నిరూపింపచేస్తున్నది.
ప్రణవము
పరమాత్మునియొక్క
పర్యాయపదము.
ఇట్టి
ప్రణవస్వరూపమైనదే
సామవేదము.
సామవేదమును
వ్యాసుడు
జైమినీ
మహర్షికి
మొదట
బోధించాడు.
అతడు
తన
శిష్యులకు,
ఆ
శిష్యులు
తమ
శిష్యులకు
యీ
శిష్యపరంపరగా
అభివృద్ధిగాంచి
యిది
యనేక
శాఖలుగా
రూపొందింది.
సహస్రశాఖలుగా
వెలసిన
యీ
సామవేదము
నేటికి
కాలగర్భములో
కలసిపోయి
కడకు
మూడు
శాఖలు
మాత్రమే
నిలచి
వున్నాయి.
కౌధిమ
అనేది
ఒక
శాఖ.
రాణాయని
అనేది
రెండవ
శాఖ.
జైమిని
అనేది
మూడవ
శాఖ.
ఈ
కౌధిమ
అనే
శాఖ
యీనాడు
గుజరాత్లో
నాగర
బ్రాహ్మణులయందు
యిమిడి
వుంటున్నది.
రాణాయని
అనే
శాఖ
మహారాష్ట్రమునందు
యిమిడి
వుంటున్నది.
ఇంక
మిగిలినది
జైమిని
శాఖ.
ఇది
కర్ణాటక
రాజ్యములో
ప్రకటితముగావించుతున్నది.
ఈ
కౌధిమ,
రాణాయని
యీ
రెండు
శాఖలలోపల
యెక్కువ
భేదములు
కన్పించవు.
హ,
ఉరా,
ని
అనే
పదమునకు
యిది
కౌధన
శాఖ
వల్లిస్తే.
రాణాయని
అనే
శాఖ
ఆ
ఆ
ఊ
రా.
నీ..అని
అన్నింటికిని
దీర్ఘమునిస్తూ
వస్తుంది.
దీర్ఘములతో
కూడినది
రాణాయని.
కొన్నింటికి
మాత్రమే
దీర్ఘమునిచ్చి
మరికొన్నింటికి
స్వల్పముగా
పలికేది
కౌధిమ.
ఇది
చిన్నశాఖయే
అయినప్పటికి
ప్రధానమైనది.
ఇది
రెండు
విధములుగా
వుంటున్నది.
అర్చని,
గానము
అని
రెండు
విధములు.
ఈ
గానములోపల
నాలుగు
విధములుంటున్నవి.
గ్రామీణగానము,
అరణ్యకగానము
అనగా
అరణ్యమునందు
గానము
చేసేది.
మూడవది
ఊహాగానము.
నాల్గవది
ఊహ్యగానము.
2
▾
Meaning
Keep
ఈపల్లెలయందు
పూర్వకాలము
నిత్యజీవితములోపల
పర్వదినములయందేకాక
మిగిలిన
దినములయందుకూడను
పంటలయందు,
కోలాటములయందు,
గొబ్బెళ్లయందు,
కలుపులయందు,
కోతలయందు
యీ
గానములను
పాడుతూ
ఆనందాన్ని
అనుభవించేవారు.
అరణ్యగానము.
అరణ్యగానములోపల
పశువులను
మేపుకుంటూ
నిర్భయముగా
కంఠమునెత్తి
పాడుకుంటూ
యీయొక్క
కాలమును
ఆనందముగా
అనుభవిస్తూ
వచ్చేవారు.
ఈ
అరణ్యములయందు
కేవలము
సహజమైన
శబ్దమునే
శృతిగా
భావించుకొని
యీయొక్క
చెట్లనే,
రాళ్లనే
ఒక
తాళముగా
విశ్వసించుకొని
అడవులయందు
స్వేచ్ఛగా
తాము
భగవంతుని
గానములను
చేసేవారు.
నాల్గవది
ఊహాగానము.
ఇవి
యీనాటి
సినిమా
గానములు.
సినిమాలో
యేడుస్తూ
వుండినట్లుగా
వూహించి
యీ
యేడుపు
పాటలలోపల
యెక్
యెక్..
అన్నట్లుగా
కొన్ని
యేడుపులు
ప్రకటింపచేసే
ప్రచరిస్తూ
వుంటుంటాయి.
నిజముగా
యేడుపు
లేదు.
ఏడుపుగా
వూహించి
యేడ్చినట్లుగా
విన్పించే
రీతిగా
మనము
చేయటము.
నవ్వినట్లుగా
వూహించి,
అది
కేవలం
కృత్రిమమైన
నవ్వుగా
యితరులకు
ప్రకటితంచేసేది.
ఉద్రేకించినట్లుగా
వూహించి,
ఆ
వుద్రేకము
పరులపైన
ప్రకటింపచేసేది.
నిజముగా
ఏడుపుగాని,
ఉద్రేకముగాని,
నవ్వుగాని
లేదు.
కేవలము
ఊహాగానములే.
ఊహాగానమనగా
తాను
అనుభవించి,
తాను
తాదాత్మ్యభావమును
పొంది,
తాను
ఆనందించి
తద్వారా
యితరులకు
కూడను
ఆనందపరచే
గానములు.
ఈ
నాల్గు
విధములైన
గానములను
యీ
సామవేదము
ప్రపంచమునకందించింది.
వీటన్నింటికి
ప్రధానమైనది
ప్రణవము.
ప్రణవములేని
స్థానము
లేదు.
ప్రణవము
వినని
కాలము
లేదు.
ఒక్క
క్షణమైనను
ప్రణవమును
విడచి
వుండలేము.
ప్రతి
జీవియొక్క
గళమందుకూడను
ప్రణవమే
వుంటున్నది.
సర్వత్రా
వున్నది
ప్రణవమే.
సర్వశబ్దములకును
ప్రణవమే
మూలము.
అట్టి
ప్రణవస్వరూపమే
బ్రహ్మమని
నిరూపించింది.
కనుక
దీనినే
యేకాక్షరం
బ్రహ్మ
అన్నారు.
ఆ
యేకాక్షరం
ఓం.
ఏకాక్షరం
బ్రహ్మ.
ఆ
ఓం
అనేదే
బ్రహ్మస్వరూపము.
ఆ
ఒక్క
అక్షరమే
బ్రహ్మస్వరూపమన్నది.
ఏతావాతా
ఓం
అనేది
బ్రహ్మమనేది
పర్యాయపదములే
కాని
రెండును
ఒక్కటే.
అభేదమైనవి.
ఆకాశ
యెట్లు
సర్వవ్యాపితమైనదో,
సర్వత్రా
నిండివున్నదో
అదే
విధముగనే
బ్రహ్మకూడను
సర్వత్రా
నిండి,
సర్వవ్యాపకుడై
వుంటున్నాడనే
సత్యాన్ని
మనం
గుర్తించాలి.
ఇది
యీ
విధముగానుండగా
అయమాత్మబ్రహ్మ
అనేది
మరొక
పదము
వచ్చింది.
ఈ
ఆత్మ
అనేదికూడను
బ్రహ్మస్వరూపమే.
కనుక
ఓం,
బ్రహ్మ,
ఆత్మ
యీ
మూడుకూడను
అభేదస్వరూపములే.
ప్రతి
మానవుడు
నిత్యజీవితములోపల
నాల్గు
అవస్థలు
అనుభవిస్తూ
వస్తున్నాడు.
అవి
స్వప్న,
జాగ్రత్,
సుషుప్తి,
తురీయము.
జాగ్రత్
అనగా
దృశ్యకల్పితమైన
యీ
జగత్తంతయు
పంచభూతములతో,
పంచప్రాణములతో,
శరీరముతో,
అంతఃకరణముతో
కూడినది.
మనస్సు
బుద్ధి,
చిత్తము,
అహంకారము.
ఈ
19
ముఖములతో
కూడి
వుంటున్నాది.
దీనికి
ఐదు
కోశములు
కూడా
కూర్చారు.
ఇరవైనాల్గు
తత్వములతో
కూడినదే
యీ
దృశ్యకల్పితమైన
ప్రపంచము.
అనగా
జాగ్రదవస్థయందు
స్థూలముగా
దృశ్యస్వరూపమై
వుంటున్నాది.
ఆత్మ
లేక
యీ
జగత్తుకాని,
స్థూలముగాని
అనుభవించుటకు
వీలుకాదు.
కనుకనే
యీ
ఆత్మకు
విష్ణుడు
అని
పేరు
పెట్టారు.
ఇంతియే
కాక
సర్వులయొక్క
వుదరమునందుకూడను
అన్నింటిని
భస్మము
గావించి,
అన్నింటిని
కాపాడి
అగ్నిహోత్రునిగా
నిలచి
యీయొక్క
వైశ్వానరునకుకూడను
ఆత్మ
అని
పేరుపెట్టారు.
3
▾
Meaning
Keep
విష్ణుడనియు,
వైశ్వానరుడనియు,
విరాటుస్వరూపుడనియుకూడా
వీనికి
పేరుపెట్టారు.
అనగా
అనేక
రూపనామములతో
కూడినదే
యీ
విరాట్స్వరూపము.
కృష్ణుడు
అర్జునునకు
విరాట్స్వరూపం
చూపినాడంటే
యేమిటి?
సర్వత్రా
సర్వకాలములయందు
సర్వస్థితులయందు
తాను
యీ
రూపాన్ని
ధరించి
వున్నాడనే
యీ
సత్యాన్ని
నిరూపించటమే.
ప్రపంచమంతయుకూడను
భగవంతునియొక్క
విశ్వస్వరూపమే.
దీనినే
విరాటుడు
అని
కూడను
పిలుస్తూ
వచ్చారు.
విరాటుస్వరూపమునందు
ఆత్మ
జాగ్రదవస్థలో
స్థూలరూపమును
ధరించి
వుంటున్నది.
అదియే
స్వప్నావస్థయందు
సూక్ష్మరూపమును
ధరించివుంటున్నాది.
ఈ
జాగ్రదవస్థయందు
అనేక
యింద్రియములతో
కూడిన
యీయొక్క
ఆత్మ
అంతర్ముఖముగా
నిలచి
తనకు
తానే
సంకల్పించుకొని
ఏకోహం
బహుశ్యాం
అన్నట్లుగా
తనకు
తాను
సంకల్పించుకొని
అనేక
రూపములను,
అనేక
స్థితులను
తాను
అనుభవించినట్లుగా
నిరూపించింది.
ఈ
స్వప్నమునందు
రూపముగాని
రూపములు,
శబ్దముగాని
శబ్దములు
తిండిగాని
తిండి
యిలాంటివి
సృష్టించుకుంటూ
వున్నాది.
పరిమితముగాకూడ
వుంటున్నాది.
ఈ
సృష్టి
ఆ
స్వప్నావస్థకు
మాత్రమే
పరిమితము
కాని
తిరిగి
మరొక
అవస్థకు
పరిమితం
కాదు.
తిరిగి
వ్యాపించదు.
కాని
తనకు
తానే
సర్వమునూ
సృష్టించుకుని
తనకు
తానే
భీతిని,
ఆనందాన్ని
అనేక
విధములైన
కష్టములను,
నష్టములను,
సుఖములను
దుఃఖములను
అనుభవిస్తూ
వుంటుండాది.
అన్నింటికిని
ఆత్మనే
కారణము.
గదిలోపల
పదిమంది
పరుండినారంటే,
పదిమందికి
పది
విధములైన
స్వప్నములు
రావచ్చునే
కాని
ఒక
స్వప్నమునకు
మరొక
స్వప్నమునకు
యేమాత్రము
సంబంధముండదు.
అనగా
తనయొక్క
భావములచేతనే
తాను
సంకల్పించుకొని
ఒక
పరిమితమైన
అవస్థను
అనుభవిస్తూ
వుంటాడు
స్వప్నావస్థయందు.
అక్కడ
యేది
వీటి
అన్నిటికి
మూలాధారము
ఒక
వెలుగు
వుంటున్నాది.
ఈ
వెలుగునకే
తేజస్సు
అన్నారు.
తేజస్వరూపుడైన
ఆత్మకే
తైజసుడు
అని
పేరు
పెట్టారు.
స్వప్నావస్థయందు
తైజ
స్వరూపకంగా
వుంటున్నది
ఆత్మ.
ఒక
చిన్న
ఉదాహరణము.
మనము
స్వప్నమువరకు
పోనక్కరలేదు.
మీరు
కన్నులు
గట్టిగా
మూసుకుని
యేమి
చూస్తున్నామని
విచారణచేస్తే
యేమి
కన్పించటంలేదు.
పెద్ద
చీకటిగా
కన్పిస్తున్నాది
అంటాము.
అయితే
యీ
చీకటిని
చూస్తున్నది
యెవరు.
ఎవరు
అక్కడ
చూడకుండిన
యిది
చీకటి
అని
యెట్లు
నిర్ణయించగలము.
కనుక
కన్నులు
మూసుకున్నప్పటికిని
ఎవరో
ఒకరు
అక్కడ
చూస్తూ
వుండటంచేతనే
చీకటిగా
వున్నది
నల్లగా
వుంటున్నది
ఆ
నలుపును
చూసేవారు
ఎవరో
ఒకరున్నారు.
ఆ
చీకటిని
చూచేవారెవరో
ఒకరున్నారు.
అతనే
తేజస్వరూపుడు.
తైజసస్వరూపములో
స్వప్నావస్థలో
వుండినవాడే
అంతఃకరణయందు
సూక్ష్మరూపమును
ధరించి
వుంటున్నాడు.
ఇంక
మూడవది
సుషుప్తి.
అనగా
మంచి
నిద్ర.
జాగ్రత్తగానీ
స్వప్నముగానీ
యేమాత్రము
లేవు.
ఇందులో
కల్పనగాని
సృష్టిగాని
యేమాత్రము
కన్పించవు.
సర్వేంద్రియములుకూడను
మనసులో
లీనమై
పోయినవి.
4
▾
Meaning
Keep
ఇక్కడ
కేవలం
ప్రజ్ఞ
మాత్రమే
నిలచి
వుంటుంది.
ఈ
ప్రజ్ఞచేతనే
తాను
వున్నట్లుగా
వునికిని
గుర్తిస్తూ
వుంటాడు.
ఆనందమును
తదుపరి
అనుభవిస్తూ
వుంటుంటాడు.
సర్వేంద్రియములుకూడను
స్తంభించి
వుంటుంటాయి.
ఉచ్ఛ్వాసనిశ్వాసస్వరూపములోపల
ప్రజ్ఞాపాత్రుడైన
పరమాత్ముడు
అనుభవిస్తుంటాడు.
ప్రజ్ఞస్వరూపుడే
బ్రహ్మ
కనుక
ప్రజ్ఞానం
బ్రహ్మ
అని
తెలుపుతూ
వచ్చింది.
ఈ
యొక్క
ప్రజ్ఞకే
మనము
నిరంతరము
వుండిన
తెలివితేటలు
శాశ్వతమైన
ఆనందము
అని
దీనిని
నిరూపిస్తూ
వచ్చారు.
ఈ
ప్రజ్ఞనే
జాగ్రదవస్థయందు
శరీరమునందును
ఇంద్రియములతోకూడిన
అంతః
కరణయందును,
ఆత్మయందును
సమత్వముగా
వుండటంచేత
దీనికి
constant
Integrated
awareness
అన్నారు.
ఈ
ప్రజ్ఞాస్వరూపుడుగా
వుండటంచేత
అతనికి
ప్రాజ్ఞుడు
అని
పేరు
పెట్టారు.
కనుక
ప్రాజ్ఞుడు
అనేది
కేవలం
ఒక
బ్రహ్మస్వరూపమే.
అదే
ఆత్మస్వరూపము.
ఈ
బ్రహ్మస్వరూపంగాని,
ఆత్మస్వరూపంగాని
గోచరం
కావటంలేదే
అని
మనము
సందేహించవచ్చును
అక్కడకూడను
ప్రణవస్వరూపమనేది
వుండటంచేత
యీ
బ్రహ్మ,
ఆత్మస్వరూపములు
అభిన్నముగా
వుంటున్నాయి.
ప్రణవము
యేరీతిగా
మనకు
కనిపిస్తున్నాది.
వినిపిస్తున్నాది.
ప్రణవము
కన్పించేది
కాదు.
భక్తిని
తినిపించేది.
ఓంకారము
వినిప్పించేది.
ఈ
కన్పించే
జగత్తుగాని,
విన్పించే
శబ్దముగాని,
అనిపించే
మాటలుకాని,
అనుభవింపచేసే
హృదయముగాని
యివన్నియు
యీ
ప్రణవములో
లీనమై
వుంటున్నవి.
ఈగాఢనిద్రయందు,
సుషుప్తియందుకూడను
మన
ఉచ్ఛ్వాసనిశ్వాసములు
జరుగుతేవుంటున్నవి.
ఈ
ఉచ్ఛ్వాసనిశ్వాస
స్వరూపుడైనవాడే
ఓంకారస్వరూపుడు.
కనుక
యీ
ఓంకారమనేది
యీ
బ్రహ్మస్వరూపాన్ని,
ఆత్మస్వరూపాన్ని
ప్రకటితం
గావిస్తూ
వస్తున్నది.
సృష్టి
అంతయు
ఓంకారముతోనే
నిండి
వున్నది.
అందువలననే
యీ
సుషుప్తియందుకూడను
ప్రాజ్ఞస్వరూపుడై
వుండటంచేత
యిందులో
ఆత్మ
సాక్షాత్కరించినట్లుగా
నిరూపిస్తూవున్నది.
నాల్గవది
తురీయము.
తురీయావస్థ
అనగా
నాల్గవ
స్థానమని
అర్థము.
ఇది
యేమిటి.
ఇది
యేవిధమైన
స్వరూపముతో
వుండి
వుంటుంది.
ఇది
సర్వమును
లీనము
గావించుకొని
కేవలము
పూర్ణానందాన్ని
అనుభవిస్తుంటాది.
ఆనందస్వరూపమును
ధరించి
వుంటుంది.
అద్వైతానందముతో
కూడి
వుంటుంది.
వర్ణనాతీతమైన
స్థితిలో
వుంటుంది.
అనగా
జాగ్రత్,
స్వప్న,
సుషుప్తి
తురీయములు
ఆత్మకు
నాల్గు
పాదములుగా
భావిస్తూవచ్చారు.
అదేవిధముగా
ఓంకారమునకుకూడను
నాల్గు
పాదములుంటున్నవి.
అకార,
ఉకార,
మకార
యింక
తురీయావస్థలో
వున్నది
అధిరతము.
అధిరతమనగా
యేమిటి?
అకార,
ఉకార,
మకారము
కూడిన
తక్షణమే
యేర్పడు
ధ్వనికే
యీ
అధిరత
అంటారు.
అకారమనేది
ఓంకారమునకు
మొదటి
ధ్వని.
ఈ
శబ్దప్రపంచమునకు
అది
ప్రధానమైన
మూలాధారము.
శబ్దతరంగములలోపల
అది
ప్రధానమైనది.
ఇది
అన్ని
అక్షరములకు
మొదటి
స్థానమున
కూడినది.
ఇది
జాగ్రదవస్థతో
కూడిన
విరాటుస్వరూపుడుగా
విశ్వసిస్తూ
వచ్చింది.
ఇతనే
విష్ణువుగా
రూపొందుతుంది.
జాగ్రత్
ప్రపంచమునకు
అకారము
మూలాధారము.
ఇది
విరాట్
స్వరూపునియొక్క
సన్నిహిత
సంబంధము.
ఇంక
స్వప్నావస్థయందు
వున్న
రకారము,
ఉకారము.
ఈ
ఉ
కారము
అనేది
ఓంకారములో
రెండవ
ధ్వని.
5
▾
Meaning
Keep
ఈ
ఉకారత్వమనేది
తేజస్వరూపాన్ని
ధరించి
వుంటుంది.
సర్వస్వమును
ప్రకటింపచేస్తుంది.
దీనికి
అంధకారమనేదే
లేదు.
మ
కారము
యీ
ఓంకారములో
మూడవ
అక్షరము.
సూత్రస్థానమును
ప్రకటిస్తూ
వస్తుంది.
సర్వులయందును
వున్న
అంతర్భావమును
ప్రకటింపచేస్తూవస్తుంది.
సూత్రప్రాయుడని
దీనికి
మరొక
పేరు.
అంతర్యామి
అనియు
మరొకపేరు.
అనగాయేమిటి!
సూత్రములయందు
దారము
ఏకంగా
చేరినట్లు
ప్రతి
జీవునియందు
యీ
మకారమనే
సూత్రము
సర్వత్రా
చేరి
వుంటున్నాది.
అందువలననే
యితనికి
సూత్రాత్ముడనికూడను
మరొక
పేరు.
ఇతనికి
రూపములేదు.
అలాంటి
తత్వాన్ని
నిరూపిస్తూ
వస్తుంది
యీ
మకారము.
అకార,
ఉకార
మకారములు
చేరిన
తరువాత
ఒక
ధ్వని
వినిపిస్తుంది.
ఇది
యే
యీయొక్క
తురీయావస్థకు
సంబంధించినది.
ఇదియే
ఓంకారము.
కనుక
అకార,
ఉకార,
మకారములతో
కూడిన
ఓంకారమునకు
నాల్గు
పాదములు.
కనుక
ఆత్మకు,
బ్రహ్మకు,
యీ
ఓంకారమునకు
నాల్గు
పాదములున్నవి.
కనుక
చతుర్ముఖుడు
బ్రహ్మ
అని
నిరూపిస్తూ
వచ్చింది.
దానినే
శబ్దబ్రహ్మమని
కూడను
నిరూపిస్తూ
వచ్చాయి.
శబ్దబ్రహ్మమునందే
గానబ్రహ్మ
లీనమై
వుంటుంది.
దీనికి
యనేకవిధములైన
వర్ణనలుకూడను
చేస్తూవచ్చింది.
ఇతనియొక్క
అష్టగుణములలోపల
ప్రధానమైనది
యీ
శబ్దబ్రహ్మము.
శబ్దబ్రహ్మము
ఒకదానిలో
నిలచినది
కాదు.
సర్వత్రా
వ్యాపించినది.
శబ్దబ్రహ్మమయి
చరాచరమయి,
జ్యోతిర్మయి,
వాఙ్మయి,
నిత్యానందమయి,
పరాత్పరమయి,
మాయామయి,
శ్రీమయి
అని
దీనికి
అష్టసంబంధమైన
శక్తులు
కల్గినటువంటిది.
ఇలాంటి
ఓంకార
తత్వమును
ప్రతి
హృదయమునందు
ప్రతిష్టింపచేసుకుని
తాను,
తన
శబ్దము,
తన
వాక్కు,
తన
దృష్టి
సర్వము
ప్రణవనాదమే
అనే
సత్యాన్ని
మనము
గుర్తించినప్పుడే
ఈ
సామవేదమును
గుర్తించిన
వారమౌతాము.
సామవేదములోని
యీ
ప్రణవనాదమును
చక్కగా
అర్థము
చేసుకున్న
వ్యక్తులు
మాత్రమే
తత్వజ్ఞులు
కాగలరు.
ఇందున్న
తత్వాన్ని
గుర్తించుకొనక
యేదో
బాహ్యమైన
సాధనలచేత
మనము
యీ
తత్వజ్ఞానాన్ని
పొందలేము.
ఇంట
జ్యోతి
వెలుగుచునుండ
పొరుగుయింటి
అగ్గి
అడుగనేల
ఇక్కడే
జగత్
స్వరూపుడైన
ప్రణవ
స్వరూపుడు
వుండగా,
బాహ్యసంబంధమైన
ఆచారములుగాని,
విచారములుగాని,
సాధనలుగాని
యెందుకు.
ఇట్టి
సర్వశక్తిమయుడు,
సర్వవ్యాపకుడు
అయిన
భగవంతుడు
శబ్దస్వరూపుడై
నాయందు
వుంటున్నాడు
ప్రణవాకారములో
అనే
విశ్వాసమును
మనము
పెంచుకోవాలి.
కనుకనే
యీ
విధమైన
ప్రణవమును
అపవిత్రము
గావించకుండా
వుండే
నిమిత్తమై
అధిక
శబ్దముచేత,
అధిక
మాటలచేత
యీ
ప్రణవాకారశక్తిని
మనము
వ్యర్థము
గావించరాదని
చెప్పింది.
చూచినప్పటికి
ప్రణవాకారమే.
విన్నప్పటికి
ప్రణవాకారమే.
చెప్పినప్పటికి
ప్రణవాకారమే.
కనుకనే
చెడ్డ
చూడరాదు.
తానెప్పుడు
వినగరాదు
విశ్వమందు.
మూడు
కోతులుగల
మూర్తిని
చూడరా.
6
▾
Meaning
Keep
ఒకటి
చెవులు
మూసుకొని
వుంటుంది.
ఒకటి
కన్నులు
మూసుకొని
వుంటుంది.
ఒకటి
నోరు
మూసుకుని
వుంటుంది.
కోతులే
యిట్టి
మంచి
మాటలు
యనేక
విధములుగా
బోధనలు
చేస్తున్నాయి.
అతిభాష
మాట్లాడవద్దు.
ఈ
ప్రణవనాదాన్ని
వ్యర్థము
గావించవద్దు.
శ్రావ్యమైన
శబ్దములు
వినగల్గిన
యిట్టి
మన
చెవులు
అపశబ్దమును
వినటానికి
యేమాత్రము
అంగీకరించవద్దని
చెవులు
మూసుకుంటాయి.
పరదూషణగాని,
పరులను
హేళన
చేయటముగాని,
పరులను
నిందించటంగాని
పరులను
హాస్యాస్పదముగా
చూచే
పలుకులు
కాని
మన
నోటినుండి
రారాదు.
కేవలము
మన
energy,
energy
అంటే
అదే
దైవశక్తి
మనము
వ్యర్థము
గావించిన
వారమవుతాము.
ప్రణవస్వరూపమైన
ఆ
శబ్దమునే
వ్యర్థము
గావించినప్పుడు
యీ
జన్మము
సార్థకమెట్లవుతుంది
అదే
విధముగనే
వినటంగాని,
పలకటంగాని,
చూడటంగాని
మంచిది
కాదు.
చెడ్డవి.
ఇవి
యముఖ్యమైన
సాధనలోపల
నిత్యజీవితములో
మనము
అభివృద్ధిపరచుకోవాలి.
అవసరమైనవారి
విషయములో
మనము
ప్రవేశించరాదు.
ఈ
సత్యాన్ని
తాను
గుర్తించటానికి
ప్రయత్నించాలి.
ఇలాంటి
నిజ
తత్వమును,
నిత్యజీవితములోపల
సాధనకు
అనుగుణ్యమైన
మార్గములను
ప్రబోధిస్తూ
వచ్చింది
యీ
సామవేదము.
అన్ని
వేదములయందు
యీ
సామవేదము
ఉత్కృష్టముగా
భావిస్తూవచ్చింది.
కనుకనే
అట్టి
సామవేద
స్వరూపుడు
నేను
అని
కృష్ణపరమాత్ముడు
చెప్పిన
విషయము.
వేదానాం
సామవేదోస్మి.
అనగా
నేను
సామవేదమును
అని,
వేదములలో
నేను
ప్రధానమైన
స్థానమును
వహించినానని
కూడను
గీతాచార్యునియొక్క
నుడివి.
దైవత్వాన్ని,
దివ్యత్వాన్ని,
పవిత్రాన్ని
ప్రకటితం
గావించి,
ప్రచారం
సల్పి,
ప్రబోధలు
చేసి
ఆనందాన్ని
అందించేది
యీ
సామవేదము.
మన
మాటలన్నియుకూడను
కేవలము
ఒకవిధమైన
హృదయానందాన్ని
అందించేవిగా
వుంటుండాలి.
ఇతరులనే
మాత్రము
బాధింపచేసేవిగా
వుండకూడదు.
ఆ
విధమైన
మాటలు
లోన
మనం
ప్రవేశపడితే
మనం
మనుషులమే
కాదు.
నీకిష్టము
లేనప్పుడు
యితరులయొక్క
చింతన
నీవు
మానేసెయి.
అంతేకాని
యిష్టములేనివారి
గురించి
అనేకంగా
నీవు
మాట్లాడటం,
వారిని
పరిహాసించటం,
వారిని
నిందించటం,
వారిని
దూషించటము
యిది
మహాపాపమని
నిరూపిస్తూ
వచ్చింది
యీ
సామవేదము.
మంత్రములు
వల్లించినంత
మాత్రమున
ప్రయోజనము
లేదు.
నిత్యజీవితములో
పల
యేది
అవసరమైన
విషయములో
అవి
మనం
వేదములనుండి
గ్రహించాలి.
మంత్రాలను
ఉచ్ఛరించుకుంటూ,
కాలమును
వ్యర్థము
గావించుకుంటూ,
క్రియలో
మనము
ఆచరణ
లేకుండా
పోయినా
యీ
మంత్రములయొక్క
ఫలితమునేమాత్రము
కూడను
అనుభవింపము
ఏదో
గ్రామఫోను
రికార్డులు
వాయించినట్లుగా
మనం
మంత్రములు
చెప్పవచ్చును.
మానవునియొక్క
జీవితము
ఒక
యంత్రము
ఒక
మంత్రము
ఒక
తంత్రము.
ఇలాంటి
పవిత్రమైన
జీవితములోపల
దివ్యమైనవాటిని
పవిత్రమార్గములో
ప్రవేశపెట్టి
జీవితాన్ని
ధన్యము
గావించుకోవాలి.
ఇలాంటి
పవిత్రమైన
వేదములు
యే
ఒకటి
రెండో
మాత్రమే
నాడు
జగత్తులో
వ్యాపించి
వుంటున్నాయి.
7
▾
Meaning
Keep
His poems 180
Also in his talks
(1)
4 January 1987
The Bhagavad Gītā is a book to be practised
వాని
రస
స్వరూపమైన
సారమును
మనము
గ్రోలి,
తద్వారా
తిరిగి
క్షీణించుచున్న
యీ
వేదములను
పునరుద్ధరింపచేయుటమే
మన
కర్తవ్యము.
దీనికి
మనము
కంకణము
కట్టుకొని
సరైన
మార్గములో
ప్రవేశపెట్టాలి.
మానవ
జీవితము
ఉత్కృష్టమైనది,
సౌజన్యమైనది,
సౌశీల్యమైనది.
ఇట్టి
నిత్యజీవితములో
'జంతూనాం
నరజన్మ
దుర్లభం'
దుర్లభమైన
మానవజన్మ
యెత్తికూడను
సత్యమైన
వాక్కులను
మనమే
మాత్రము
శ్రవణము
చేయక,
విచారణ
చేయక
జీవితము
నిరర్థకం
గావించుకోటం
సరైన
కర్మము
కాదు.
భగవంతునిపైన
భక్తిని
మనము
అభివృద్ధి
పరచుకోవాలి.
భక్తి
యే
లేకుండిన
యీ
విద్యలన్నికూడను
నిరర్థకములే.
మనము
వుచ్ఛరించినంత
మాత్రమున
ప్రయోజనము
లేదు.
దైవభక్తిని
మనం
పెంచుకోవాలి.
మనకు
కావలిసినవంతా
గంట
కొట్టినట్లుగా
కంఠముతో
అనవచ్చును.
కాదు.కాదు
నాదము
రావాలి.
నాదమునే
వేదముగా
భావించాలి.
నాదములో
లీనము
గావాలి.
అదియే
మనయొక్క
సమాధి.
ఆ
సమత్వాన్ని
మనము
భావించాలి.
సమత్వాన్ని
పెంచుకోవాలి.
సమత్వాన్ని
పంచుకోవాలి.
అదియే
మానవునియొక్క
ప్రధానమైన
కర్తవ్యము.
ప్రేమస్వరూపులారా!
ప్రధానముగా
మానవునిలో
వుండవలసినవి
రెండు
లక్షణములు
భక్తి,
త్యాగము.
త్యాగములేనిదే
భక్తి
రాదు.
దీనినే
నకర్మణా
నప్రజయా
ధనేన
త్యాగేనైకే
అమృతత్వ
మానసుః
కాబట్టి
యీ
అమృతత్వాన్ని
అనుభవించాలంటే
త్యాగము,
త్యాగము.....
స్వార్థము,
స్వప్రయోజనము
యీ
రెండింటిద్వారానే
మానవుడు
బంధింపబడుతున్నాడు.
స్వార్థమును
యెప్పుడు
నీవు
విడచిపెడతావో
అప్పుడే
బంధము
వుండదు.
ప్రాణము
క్షణభంగురము,
కరగిపోయే
మంచువంటిది.
మన
ఆస్తులన్నియుకూడను
కదలిపోయే
మేఘములవంటివి.
వీటి
నిమిత్తమై
మనము
యీవిధమైన
శ్రమలు
పడి
కట్టకడపటికి
దివ్యమైన
జీవితాన్ని
నీవు
వ్యర్థముగావించుకోవద్దు.
ఏ
సేవయందైనాకూడను
నీవు
త్యాగము
పూని
పరులకు
సేవ
చేసి
సమాజాన్ని
మెప్పించి
సమాజముయొక్క
ఆనందాన్ని
అనుభవించే
వ్యక్తిగా
నీవు
తయారుకావాలి.
ఎంతకాలమైనా
ఉద్యోగము,
ఉద్యోగము...
ఏమిటి
యోగములేని
ఉద్యోగము.
నీకు
కుటుంబము
వుంది.
నీకు
ఒకవిధమైన
బాధ్యత
వుంది.
కర్తవ్యము
వుంది.
ఉద్యోగం
చేసుకోవచ్చు.
కాని
అవసరమైనప్పుడు
వుద్యోగమునైనా
త్యాగము
చేసి
దేశముయొక్క
సేవలోపల
మనం
పాల్గొనాలి.
అన్నీ
వదలిపెడితే
నా
సంసారాన్ని
చూచే
వారెవరు.
అంత
విశ్వాసమే
లేకపోతే
నీ
సంసారమెట్లా
బాగుపడుతుంది?
నారు
పోసిన
వాడు
నీరు
పొయ్యడా.
పుస్తకముల్
పఠించితి
పూర్తిగ
చూచితి
సర్వశాస్త్రముల్
నిస్తులమైన
విద్యలు
నేర్చితి
నంచును
గర్వమేల
నీ
హస్తయుగంబు
మోడ్చి
పరమాత్మను
భక్తితో
కొల్వలేని
యీ
ప్రస్తుత
విద్యలన్నియు
నేటికి
నిరర్థకంబులు
మానవా.
కనుక
మన
విద్యలుగాని,
మన
ఆస్తిపాస్తులుగాని
నిజముగా
భగవత్
విశ్వాసమే
లేకపోతే
యివన్నియు
కూడను
కేవలము
భూమిలో
మట్టి
చేరినట్టుగా
యీ
అవస్థలకు
మనం
గురియైపోతున్నాము.
8
▾
Meaning
Keep
శ్రీమంతుడైనా
కూడను
యీ
దేహమును
వదలిపోయే
సమయం
ఒక
పిడికెడు
మట్టైనా
గాని
పోవటంలేదు.
కాని
పోయేవి
రెండే
రెండు.
పుణ్యము,
దైవానుగ్రహము.
ధర్మము
కీర్తిని
మనము
సాధించాలి.
లోకములో
జీవనం
అస్థిరం.
యవ్వనం,
ధనము
అస్థిరం.
ధారాపుత్రాదులే
అస్థిరం.
ఇవన్ని
అస్థిరాలే.
కీర్తి
ఒకరివలన
వచ్చేది
వంటిది
గాదు.
పరులవల్ల
పోయేది
గాదు.
మీరు
అనుకోవచ్చును.
మావల్ల
స్వామికి
కీర్తి
వచ్చిందని.
మీవల్లే
కీర్తి
రావచ్చును.
మీవల్లే
కీర్తి
పోవచ్చును.
ఇది
చాలా
పొరపాటు.
కీర్తి
ఒకరివల్ల
వచ్చేది
కాదు.
ఒకరివలన
పోయేటువంటిది
కాదు.
అది
నానుండి
వచ్చినదే.
నా
ఆనందం
నానుంచి
వచ్చినదే.
ఒకరినుండి
వచ్చినది
కాదు.
ప్రతి
మానవుడు
తన
కీర్తి
అపకీర్తులు
తన
ప్రవర్తననుంచే
వచ్చినవి
కాని
యితరులనుంచి
వచ్చినవి
కావు.
దిగుమతిచేసుకున్నవి
కావు.
కనుక
మనము
సత్ప్రవర్తనను
అభివృద్ధిపరచుకొని,
సత్సంగములో
చేరి
సత్కర్మలు
ఆచరించినప్పుడే
మనకు
సత్కీర్తి
లభిస్తుంది.
దుస్సంగము,
దురాలోచనలు,
దుర్భావములు,
దుష్కర్మలు
ఆచరిస్తుంటే
మీకు
కీర్తి
యెట్లా
వస్తుంది?
అపకీర్తియే
నీయొక్క
పట్టము.
అందరితో
చెడ్డ
చెడ్డ
అని
బ్రతికేదానికంటె,
పది
మందితో
మంచి
అనిపించుకొని
చావటమే
మంచిది.
అయితే
మానవుడు
సర్వత్ర
వుండిన
ప్రణవాకారాన్ని
ధరించి
ప్రణవశబ్దమునే
ఉచ్ఛ్వాసనిశ్వాసములుగా
విశ్వసించి
అనుభవించే
మానవుడు
యీ
దుర్మార్గములో
ప్రవేశించరాదు.
సామవేదము
చెప్పినవన్నీ
యేమిటి!
సర్వత్రా
నిండినటువంటి
పరమాత్ముడు
నీయందుకూడను
వుంటున్నాడు.
శబ్దస్వరూపుడై
వుంటున్నాడు.
అతను
లేని
స్థానం
లేదు.
అతనిది
గాని
స్థానం
లేదు
అనే
సత్యాన్ని
మీరు
విశ్వసించి,
యీ
ప్రణవాన్ని
ఉపాసనగా
చేసి
తద్వారా
యీ
ప్రణవములో
ఐక్యంకావాలని
ఆశించి
ఆశీర్వదిస్తూ
నా
ప్రసంగాన్ని
విరమిస్తున్నాను.
Previous
←
Understand the Sai principle well
Next
We must feel that we have offered up our Ajñāna in the homa-pit
→