Contents
Devotion & Sacred Story
Home
Library
Find
Shelf
Settings
←
Leave
Sathya Sai Speaks 1987 · For spiritualism, the Ātma alone is the basis
Tap a verse for its meaning
IAST
Telugu
Meaning
Continuous
For spiritualism, the Ātma alone is the basis
25 December 1987, Christmas
1
▾
Meaning
Keep
పలు
మతములవారిచటికి
నలుమూలలనుండి
వచ్చినయభయములతో
కలిమిలేమియు
తలపక
పలు
బాధల
కోర్చియుంద్రు
బాబాకొరకై.
నాస్తికభావము
నల్గడ
నిస్తులమైయుండి
విషయములందున్
ఆస్తికభావము
నెలకొల్పి
నిస్తులమైయుండె
సాయి
నిశ్చలప్రేమన.
ప్రేమస్వరూపులారా!
మానవులందరు
దేహనిర్మాణములో
యెట్టి
బేధము
లేకపోయినప్పటికిని
సంస్కారమునందును,
భావమునందును,
తలంపులందును
యనేక
బేధములుగా
కనుపించుచున్నది.
మానవ
సమూహమే
దేశము.
పై
సత్యమే
దేహమునకుకూడను
అన్వయిస్తుంది.
భూగోళవాతావరణమునందు
యెట్టి
బేధములు
లేకపోయినప్పటికిని
దేశప్రజల
జీవన
విధానమునందు
యనేక
బేధములు
మనకు
కనుపించుచున్నవి.
ఇట్టి
భిన్నత్వమే
మానవత్వమునకు
గుర్తు.
సత్యము
ఒక్కటే.
ఇది
అవాఙ్మనసగోచరమైనది.
త్రికాలసాధ్యమైనది.
ఈ
సత్య
పదార్థమును
గుర్తించే
నిమిత్తమై
యనేకమంది
జిజ్ఞాసులు
యనేక
విధమైన
మార్గములందు
దీనిని
ప్రయత్నములు
సలుపుతూ
వచ్చారు.
జిజ్ఞాసులైన
మానవులయందు
యనేక
విధములైన
బేధములు
కనుపించుచున్నది.
ఈ
బేధములు
ప్రకృతికి
ఒక
వికారములు
కానేరవు.
ఈ
బేధములన్నియు
ప్రకృతియొక్క
ఔన్నత్యమునకు
సోపానములే.
ఇట్టి
బేధత్వమనేది
మానవునియందు
వుండటంచేతనే
ఐకమత్యమునకు,
ఏకత్వమునకు
అనేక
ప్రయత్నములు
సలుపుతూ
వస్తున్నారు.
బ్రాహ్మణాం
అనేకత్వం.
బ్రాహ్మణులనగా
ఒక
వర్ణమునందుగానీ
లేక
పద్ధతులయందుగానీ
వుండినవారుకాదు.
సత్యపదార్థమునందు
సరైన
విషయములో
దానిని
జిజ్ఞాసగా
సల్పి
సత్యాన్ని
గుర్తింపజేయువారు
బ్రాహ్మణులనియు
దీని
అంతరార్థము.
ఏదేశమువారైనను
కావచ్చును.
ఏ
కాలము
వారైనను
కావచ్చును.
సత్
జిజ్ఞాసను
సల్పువారు
బ్రాహ్మణులని
గుర్తించాలి.
ఏకత్వమును
భిన్నత్వముగా
భావించి,
యనేకత్వాన్ని
పెంచి,
దివ్యత్వాన్ని
విస్మరించటం
యిది
సరైన
మార్గము
కాదనికూడను
ఖండించింది
శృతి.
దీనిని
యేకం
సత్
విప్రాః
బహుధా
వదంతి.
2
▾
Meaning
Keep
ఒక్క
సత్యమునే
అనేకమంది
యనేక
విధములుగా
ప్రబోధిస్తూవచ్చింది.
ఇట్టి
జిజ్ఞాసనుండి
వెలువడినదే
ప్రాచీనమైన
షట్దర్శనములు.
ఇట్టి
పవిత్రమైన
వైదిక
సాంప్రదాయమును
యీనాడు
దర్శించటంగానీ
లేక
విచారించుటగానీ
తగిన
సమయము
కానేరదు.
ఈ
షట్దర్శనములయొక్క
మార్గములు
భిన్నముగా
వుండినప్పటికిని
గమ్యము
ఒక్కటే
అనే
సత్యమును
కూడను
ప్రబోధిస్తూ
వచ్చింది.
కానీ
యీనాడు
దేశము
భిన్నత్వముతోగూడి
అభావమనే
వాదముతో
వుండటంచేత
యిలాంటి
షట్దర్శనములయొక్క
సాధనలకు
అవకాశము
లభించటంలేదు.
భౌతికవాదము
ప్రపంచములో
వ్యాపించటంచేత
యీ
షట్దర్శనములయొక్క
ప్రభావము
గుర్తించటానికి
తగిన
వాతావరణము
కూడను
యేర్పడలేకపోతున్నది.
భౌతిక
వాదమనగా
కేవలము
పంచేంద్రియములే
ప్రధాన
లక్ష్యమునందుంచుకొని,
యీ
పంచేంద్రియముల
కలయికచేతనే
చైతన్యము
యేర్పడుచున్నదనియు,
యీ
చైతన్యపరిణామమునకు
కేవలము
భౌతికపరిణామమే
మూలాధారమనియు,
యిలాంటి
పరిణామతత్వము
ఆశించేవారు
భౌతికవాదులనియు
దీని
సిద్ధాంతము.
భౌతికవాదమనేది
జడస్వరూపము.
ఇది
పరిమితమైన
శక్తితోకూడినది.
పరిమితశక్తితోకూడిన
పంచేంద్రియములనుండి
చైతన్యప్రభావమనేది
ఆవిర్భవించటమే
అవైదికము.
కనుకనే
యిది
భౌతికవాదమును
ఖండించుచూ,
యిది
సత్యమైనది
కాదనియు,
జడమైన
పరిమితముతోకూడినదనియు,
దీనిని
విమర్శించుచూ
ఆధ్యాత్మికవాదము
ప్రారంభమవుతూ
వచ్చింది.
ఆధ్యాత్మికవాదమునకు
ఆత్మయే
ఆధారము.
ఇది
అపరిమితమైనది.
ఇలాంటి
అపరిమితమైన
ఆత్మతత్వాన్ని
ప్రబోధించుచూ
పరిమితమైన
భౌతికవాదము
యిది
కేవలము
ఒక
జడస్వరూపాన్ని
నిరూపిస్తూవచ్చింది.
అనగా
యీ
మూలచైతన్యమునందు
మూడు
విధములైన
చైతన్యము
ఒక
భాగముతో
కూడిన
జడము
అనేదానిని
శృతి
నిరూపిస్తూవచ్చింది.
కనుకనే
చైతన్యము
జడమును
కదలింపజేయుచున్నదిగాని
జడము
చైతన్యమును
ఆవిర్భవింపజేయటంలేదనే
సత్యమును
ఆధ్యాత్మికవాదము
నిరూపిస్తూవచ్చింది.
ఊర్ధ్వమూలమ్
అధఃశాఖ
అని
యీ
భగవద్గీతలో
చెప్పినట్లుగా
కొమ్మలు
క్రింద
వేర్లు
పైన
అనే
వాదమునకు
కూడను
యిదే
ప్రమాణము.
చైతన్యమే
జడమును
కదలింపజేయుచున్నదిగాని,
ఉద్భవింపజేయుచున్నదిగాని
జడము
చైతన్యమును
ఆవిర్భవింపచేయటంలేదు.
జగత్తులో
మహత్తరమైన
యంత్రములు
వుంటున్నవి.
ఈ
యంత్రములనుండి
యనేక
విధములైన
శక్తివంతమైన
శక్తిపాశాన్ని
ఆవిర్భవింపజేస్తున్నది.
ఈ
యంత్రములవల్లనే
భూమండలము
ప్రదక్షిణము
చేయటంగాని,
చంద్రమండలము
చేరటంగాని
సంభవిస్తూవచ్చింది.
అయితే
యీ
యంత్రములు
జడరూపమైనవి.
అయితే
యీ
యంత్రములు
స్వతసిద్ధమైన
స్వరూపాన్ని
ధరించి
యీ
విధమైన
ఫలితములు
అందించుచున్నవా
అని
ప్రశ్నించినప్పుడు
యివి
యే
మాత్రముకూడను
స్వతసిద్ధమైనవి
కావని
నిరూపిస్తూవచ్చింది.
అట్టి
శక్తివంతమైన
యంత్రములు
నిర్మించినవాడు
మానవుడే.
3
▾
Meaning
Keep
అట్టి
శక్తివంతమైన
యంత్రములు
నడిపించినవాడూ
మానవుడే.
మానవుడు
చైతన్యస్వరూపుడు.
కనుక
యీ
చైతన్యమునుండియే
జడమైన
యంత్రములు
కదలటానికి
ప్రయత్నించుచున్నవిగాని
జడమునుండి
చైతన్యము
ఆవిర్భవించటం
కాదనే
సత్యాన్ని
మనకు
స్పష్టము
చేయుచున్నది.
అన్నింటికి
మానవుడే
ప్రమాణము,
మానవుడే
ఆధారము,
మానవుడే
గమ్యము.
అనే
సత్యాన్నికూడను
మనము
గుర్తించటానికి
వీలవుతుంది.
పశువలె
ప్రకృతికి
వశమై
కేవలము
ఒక
బంధితుడై
భాసించటము
కాదు
మానవత్వముయొక్క
విశిష్టత.
నరత్వమునుండి
నారాయణత్వము
పొంది,
ప్రకృతికి
వశుడు
కాక
ప్రకృతిని
పరిపాలించే
అధిపతిగా
తాను
తయారయ్యే
అధికారము
అతనికున్నది.
బుద్ధిమంతుడైన
మానవుడు,
సంసారమునకు
బద్ధుడై
నేను
అన్ని
విధములైన
కష్టములకు
లోబడినానని
యేడ్చటము
మానవుని
కర్తవ్యముకాదు.
సంసారము
నిన్ను
బంధించినదని
విలపిస్తున్నావు.
సంసారమునకు
చేతులుగాని,
కన్నులుగానీ,
కాళ్లుగాని,
నోరుగాని
లేదు
కబళించటానికి.
నీ
సంకల్పములే
నీ
బంధనలకు
మూలకారణము.
కానీ
సంసారము
కాదనే
సత్యాన్నికూడను
స్పష్టము
చేయుచున్నది.
ఇలాంటి
బాహ్యమైన
చింతలకు
మనము
లోబడి
నిత్యసత్యమైన
దివ్యత్వాన్ని
మనము
విస్మరిస్తూ
వస్తున్నాము.
సమస్తము
ఆత్మనుండియే
ఆవిర్భవిస్తున్నది.
లోకములో
ప్రతి
పదార్థముకూడను
పుట్టుటకు
పూర్వము
లేదు.
ఈ
పదార్థము
నశించిన
తరువాతకూడను
లేదు.
ఆద్యంతములలేని
పదార్థము
మధ్యలో
మాత్రము
లేనట్టుగానే
మనము
భావించాలి.
మధ్యకాలములో
కనుపించేటివన్నియు
భ్రమస్వరూపమే
గాని
బ్రహ్మస్వరూపము
కాదు.
సముద్రము
ఒడ్డున
ముత్యపు
చిప్పను
చూచి
వెండి
బిళ్లని
భావిస్తుంటాము.
వెండి
బిళ్లని
భావించినప్పుడుకూడను
అది
ముత్యపు
చిప్పనే.
దీనికి
పూర్వము
అది
ముత్యపు
చిప్పనే.
కేవలము
నీ
భ్రాంతి
మాత్రమే
అది
వెండి
బిళ్లగా
భావించిందేగాని
అది
వెండి
బిళ్ల
కాదు.
అదే
విధముగనే
మనము
యీనాడు
జగత్తని
అనుభవిస్తున్న
యివన్నికూడను
కేవలము
అపోహలు
మాత్రమేకాని
యివి
ఆత్మస్వరూపము
కాదు.
నిత్యసత్యమైన
బ్రహ్మతత్వమే
యీ
జగత్
స్వరూపములో
మనకు
నిరూపిస్తూవస్తుంది
కాని
జగత్
వేరు
బ్రహ్మము
వేరు
కానేరదు.
సర్వం
విష్ణుమయం
జగత్
అనగా
సర్వము
దైవత్వమనే
సత్యాన్ని
గుర్తించినప్పుడు
ప్రతి
భాగముకూడను
బ్రహ్మనే.
ప్రతి
వృక్షము
కల్పవృక్షమే.
కర్మక్షేత్రముకూడను
పుణ్యక్షేత్రమే.
ఇట్టి
యేకత్వమైన
దివ్యత్వాన్ని
గుర్తించే
నిమిత్తమై
మనము
సాధన
సల్పుతున్నామని
భావిస్తున్నాము.
దివ్యాత్మను
గుర్తించే
నిమిత్తమై
మనము
చేసే
సర్వసాధనలుకూడను
అని
మనము
భావిస్తున్నాము.
మనము
చేసే
సమస్త
సాధనలుకూడను
దైవము
తెలుసుకొనుటకై
కాదు.
ఈ
సాధనలవల్ల
దైవత్వాన్ని
నీవు
గుర్తించలేవు.
కేవలము
నీ
అల్పతృప్తి
నిమిత్తమై
నీవు
ఆచరించే
సాధనలే
కాని
ఆత్మనిమిత్తమై
ఆచరించేవి
కాదనే
సత్యాన్ని
గుర్తించాలి.
నీవు
చేసే
భజనలుగాని,
నీవు
చేసే
ధ్యానములుగాని,
నీవు
సలిపే
జపములుగాని
దైవము
నిమిత్తము
కాదు.
4
▾
Meaning
Keep
నీ
నిమిత్తమై
నీవు
ఆచరిస్తున్నావు.
నీ
తృప్తి
నిమిత్తమై
నీవు
ఆచరిస్తున్నావు.
భగవంతుడు
ఆశించేది
ఒక్కటి
లేదు.
భగవంతునికి
ఆశలే
లేవు.
భగవంతుని
తృప్తిపరచటానికి
అది
కాదు
మార్గము.
భగవంతుడు
నీ
కంటె
ప్రత్యేకించి
వేరుగా
లేడు.
అట్టి
అజ్ఞానమునకు
ఆలవాలమైన
రాగద్వేషములను
నీవు
విస్మరించుకున్న
నీకు
నీవే
సాక్షిగా
రూపొందుతావు.
నీ
రాగద్వేషములే
దైవానికి
నిన్ను
దూరము
గావించుచున్నది.
నీ
రాగద్వేషములను
నీవు
నిర్మూలము
గావించుకున్న
నీవే
దైవత్వముగా
రూపొందుతావు.
అంతేకాని
దైవత్వముకొరకై
యనేక
సాధనలు
సలిపి
నిత్యసత్యమైన
బ్రహ్మతత్వాన్ని
పొందాలనేది
కేవలము
భ్రమ
మాత్రమే.
కనుక
మనము
జగత్తులో
యనేక
విధములైన
సాధనచతుష్టయములు
యేర్పడినవి.
యమ,
నియమ,
ప్రాణాయామ
ప్రత్యాహారమనే
సాధనలంతా
యేర్పడినవి.
శ్రవణ,
మనన
నిదిధ్యాసలుకూడను
యేర్పడినవి.
అయితే
యివన్నికూడను
యే
నిమిత్తమై
యేర్పడినవి.
దేనికోసం
యేర్పడినవి
అని
మనము
విచారించినప్పుడు
యివి
దైవదర్శన
నిమిత్తముకదా
యని
మనము
విశ్వసించవచ్చును.
కాదు
కాదు.
ఈ
సాధన
చతుష్టయములుగాని,
యమనియమాది
సాధనలుగాని
యివన్నీ
మనస్సును
కప్పి
వుండిన
రాగద్వేషములను
నిర్మూలముగావించేవి.
మానవత్వానికి
కప్పిన
మాలిన్యము
తుడిచే
నిమిత్తము.
చిత్తశుద్ధి
యేర్పడిన
తక్షణమే
తనయొక్క
స్వరూపాన్ని
తాను
గుర్తించుకోగలడు.
ఎంతకాలము
అహంకారమమకారములు
యీ
చిత్రమును
కప్పివుండునో
అంతవరకు
దైవత్వాన్ని
యేమాత్రముకూడను
గుర్తించుకోలేడు.
కనుకనే
అట్టి
దైవత్వముయొక్క
యేకత్వాన్ని
గుర్తించే
నిమిత్తమై
యీ
సాధనలు
యేర్పడినవనే
సత్యాన్ని
మనము
గుర్తించాలి.
మానవులందరు
యేకోన్ముఖులైపోయి
దివ్యత్వమైన
ఆత్మతత్వాన్ని
దర్శించటానికి
ప్రయత్నించాలి.
మానవత్వములో
ఆదర్శవంతమైన
ఐకమత్యమును
మనము
సాధించాలి.
ఈ
విధమైన
ఐకమత్యమును
మనము
సాధించినప్పుడే
దివ్యత్వమనే
ఆత్మతత్వము
మనకు
ప్రకాశిస్తుంది.
మనము
ఆత్మస్వరూపులుగానే
వున్నాము.
ఆనందస్వరూపులుగానే
వున్నాము.
అమృత
బిందువులుగానే
వున్నాము.
అమరస్వరూపులుగానే
వున్నాము.
కానీ
దానిని
గుర్తించలేకుండా
చేసే
నిమిత్తమై
యీ
రాగద్వేషములు
దానిని
ఆవరించినవి.
ఈ
ఆత్మతత్వాన్ని
కప్పిన
యీ
అజ్ఞానమును
మనము
దూరము
గావించుకోవాలి.
మనము
చేసే
తప్పొప్పులను
క్షమించుమని
పరమాత్మను
కోరుకోటం
యిలాంటి
సహజమైన
స్థాయిలో
జరుగుతూ
వస్తున్నది.
ఇదే
పద్ధతి
క్రిష్టియన్సులోపల
అనాదికాలమునుండి
అభివృద్ధిగావిస్తూవస్తుంది.
ఇందులో
భక్తులు
తప్పులు
చేయటము,
భగవంతుని
తప్పులు
క్షమించమని
ప్రార్థించటము,
భగవంతుడు
క్షమించినట్టుగా
అనుగ్రహించటము
యివన్నీకూడను
సహజమైన
భ్రమస్థాయియందు
మాత్రమే
అభివృద్ధిగావిస్తూవస్తున్నారు.
కొన్ని
చర్చిలలోపలకూడను
యనేకమంది
చేసిన
తప్పులు
తాము
ప్రార్థించినప్పుడు
ఆ
పోప్
లేక
ప్రీస్టు
నిన్ను
నేను
క్షమించానని
చెప్పి
వారికి
చెప్పటము,
దానితో
వారు
తృప్తిపడి
యీ
క్షమాపణకు
యింత
ధనమని
చెల్లించటము
జరుగుతూ
వస్తున్నాది.
5
▾
Meaning
Keep
Repentant
అనగా
యేమి?
నా
తప్పుల
క్షమించుము.
నేను
తప్పులు
చేశాను
అని
అంగీకరించి
దానిని
క్షమాభిక్షను
పొందే
దానికి
Repentant
అంటారు.
ఇలాంటి
దానినంతా
కూడను
మన
ప్రాచీనకాలమునుండి
భారతదేశమునందు
మనము
అనుసరిస్తూవస్తున్నాము.
ఏదో
కొని
మొక్కులు
చేసుకోటం,
ఆ
మొక్కులు
చెల్లించిన
తరువాత
మన
కష్టములు
నివారణ
కావటము
అనేది
కేవలము
ఒక
అల్పభావముతోకూడిన
భ్రాంతులు
మాత్రమే.
ఇలాంటి
పవిత్రదేశమునందు
కూడను
ఆయాకాలములందు
యిలాంటి
భ్రాంతులనంతా
అభివృద్ధిగావించుకొని
ఆ
భ్రాంతులయందే
తాను
బంధితుడైపోతున్నాడు.
ఇలాంటి
భ్రాంతులను
మనము
నిర్మూలము
గావించుకోవాలి.
మనము
కేవలము
మూఢవిశ్వాసముల
చేత
కాలమును
వ్యర్థము
గావించరాదు.
నిజమైన
సత్యస్వరూపమును
మనము
తెలుసుకోటానికి
ప్రయత్నించాలి.
ఇలాంటి
సత్యస్వరూపాన్ని
తెలుసుకొనే
నిమిత్తమై
కొన్ని
విధములైన
విచారణలను
కూడను
సల్పాలి.
ఈ
యువకులయందు
యిలాంటి
పవిత్రమైన
భావాలు
దినదినానికి
అభివృద్ధిగావించాలి.
క్రీస్తునకు
పూర్వము
అనేకమంది
మహనీయులందరు
కూడను,
యిలాంటి
పవిత్రమైన
దివ్యప్రబోధలు
సల్పి
ప్రజలలో
వుండిన
యేకత్వాన్ని
అభివృద్ధి
పరచటానికి
తగిన
కంకణం
కట్టుకున్నారు.
క్రీపూ
400
సంవత్సరములయందు
సోక్రటీసు
అనేవాడు
తత్వవేత్త
వుండేవాడు.
ఈ
సోక్రటీస
ప్రథమశిష్యుడే
అరిస్టాటిల్.
ఈఅరిస్టాటిల్
శిష్యుడే
అలగ్జాండరు.
వారందరు
ఆ
కాలమునుండి
కూడను
దివ్యమైన
ప్రబోధలు,
పవిత్రమైన
దివ్యత్వాన్ని
జనులకు
విచారణ
సల్పి
ప్రబోధించే
నిమిత్తమై
యనేక
విధముల
పాటుపడుతూ
వచ్చారు.
సత్యమునకు
జీవితము
అంకితముగావించినవారు.
సోక్రటీసు
యువకులను
దగ్గరకు
చేర్చుకొని
వారిని
యనేకవిధములైన
నయభయప్రేమలచేత
విశ్వాసములచేత
యీ
ఆధ్యాత్మిక
తత్వాన్ని
హృదయానికి
అందించటానికి
ప్రయత్నించినవారు.
ఈ
విధమైన
మార్గములో
యువకులందరూ
పెడమార్గము
పట్టవచ్చని
చెప్పి
ఆనాటి
ప్రభువులందరు
యీ
సోక్రటీసు
మార్గము
చాలా
విపరీతమైన
మార్గమని,
యువకులను
పాడుచేస్తున్నాడని
యనేక
విధములుగా
విమర్శించి
కట్టకడపటికి
సోక్రటీసును
ఒక
జైలులో
వుంచారు.
కానీ
తాను
చేసేది
సత్యమార్గమని,
సత్యప్రబోధమని,
దైవత్వమే
లేకపోతే
జగత్తే
లేదనే
సత్యాన్ని
తాను
గట్టిగా
చాటుతూ
వచ్చాడు.
కాని
ఒకానొక
సమయములోపల
కొంతమంది
తనయొక్క
అనుచరులంతాకూడను
స్వామి!
ఈ
జైలునుండి
యేదైనా
ఒక
విధముగా
మిమ్మల్ని
తప్పించటానికి
ప్రయత్నంచేస్తాము.
మీరు
యీ
రాజ్యమునుండి
వేరు
రాజ్యమునకు
వెళ్లమని
చెప్పి
యనేక
విధములుగా
ప్రయత్నించారు.
తాను
చెప్పాడు
‘
ఛీ!
యీ
భౌతికమైన,
యీ
అల్ప
జీవితనిమిత్తమై
నేను
అసత్యమునకు
పాటుపడటమా.
6
▾
Meaning
Keep
His poems 14
పోకన్మానదు
దేహము
ఏ
విధమున్
పోషించి
రక్షించినన్
రాకన్మానదు
హానివృద్ధులు
మహారణ్యంబునందాగినన్.
ఎంతకాలము
మనము
పోషించుకున్నప్పటికిని,
aircondition
roomలో
కూర్చున్నప్పటికిని,
సర్వసౌకర్యములతో
కూడిన
వసతులలో
వుండినప్పటికి
యీ
కాలము
వచ్చేటప్పటికి
నిల్చటానికి
వీలుకాదు.
నిజముగా
నాకు
అభివృద్ధియే
ప్రాప్తించినట్లైన
అడవిలో
వుండినా
నాకు
అభివృద్ధి
ప్రాప్తిస్తుంది.
కనుక
యీ
దేహసంరక్షణ
నిమిత్తమై
యీ
యుక్తులకుగానీ,
యీ
యోగమునకుగాని,
యీ
విశిష్టతకుగాని
నేను
యే
మాత్రము
కట్టుబడను.
దైవము
యే
రీతిగా
నిర్ణయిస్తాడో
ఆ
రీతిగానే
నడచుకుంటానన్నాడు.
ఈ
సత్యసూక్తులను
చక్కగా
అనుసరించి
అన్ని
విధాలా
ప్రజలకు
బోధించినవాడే
అరిస్టాటిల్.
అతని
ఆజ్ఞను
తూచతప్పక
నడచినవాడే
అలగ్జాండరు.
ఆనాటి
కాలములో
జీససు
రాకపూర్వము
అరిస్టాటిల్యొక్క
ప్రబోధలు
రోములో
చాలా
అధికముగా
జరుగుతూవుండేది.
జీససు
వచ్చిన
తరువాత
కొంతకాలము
యీ
ప్రజల
సేవ
నిమిత్తమై
తాను
యనేకవిధములైన
కష్టములకు
గురికావటము,
తదుపరి
ప్రభుత్వముయొక్క,
మఠాధిపతులయొక్క
ప్రోద్బలముచేత
తన
దేహాన్ని
చాలించటము
జరిగింది.
దేహము
యేనాటికి
శాశ్వతము
కాదు.
మన
ఆస్తిపాస్తులు
అంతకంటె
శాశ్వతముకాదు.
ధనవస్తుకనకవాహనాదులంతాకూడను
బంధించునవేగాని,
మనకు
బాధలు
కల్గించేవేగాని,
శాంతిని
చేకూర్చేవి
కాదు.
రోములో
జీసస్
నిరంతరము
ధనవంతులైనవారిని
విమర్శిస్తూ,
ధనవంతులైన
వారియొక్క
చర్యలను
ఖండిస్తూ
ధనహీనులకు
తగిన
సహాయము
చేయుటకు
అన్ని
విధములా
పాటుపడినవాడు.
ఒకనాడు
తాను
సంచారములో
మార్తా,
మేరీ
అనే
యిద్దరు
అక్క
చెల్లెండ్ర
యింటికి
భోజనానికి
వెళ్లాడు.
ఇట్టి
మహనీయుడు
మా
యింటికి
యేతెంచినాడని
వారు
ఆనందముతో
అతనికి
అవసరమైన
ఆహారాన్ని
కల్పించటానికి
శ్రద్ధను
వహించారు.
మేరీ
చెప్పింది:
యింటికి
వచ్చిన
అతిథిని
వంటరిగా
వుండటం
మంచిదికాదు.
నీవు
అతనితో
సంభాషిస్తూవుండు,
నేను
వంటనంతా
సకాలములోపలనే
అందిస్తానంది.
ఇంటికి
వచ్చినవాడు
సామాన్యుడు
కాదు.
దైవాంశ
సంభూతుడు.
అతనిని
ఆనందపెట్టాలనుకుంటే
హృదయపూర్వకమైన
కర్మలచేతనే
ఆనందించగలడు.
అతని
దగ్గర
బూటకాలు
నాటకాలు
పనికిరావు.
అందువల్ల
హృదయపూర్వకముగా
ప్రతి
పదార్థముకూడను
పరిశుద్ధమైన
భావముతో
తాను
చేయటంలో
కొంతకాలం
గడచింది.
రాత్రి
కావచ్చింది.
ఆ
రాత్రి
సమయములోపల
యెవ్వరికి
తెలియకుండా
నాయొక్క
సమస్యను
పరిష్కారము
చేసుకోవాలని
ఒక
ధనవంతుడు
జీసస్
దగ్గరకు
వచ్చాడు.
అతను
చెప్పే
ప్రబోధలు
అతి
సూక్ష్మంగా
వుంటాయి.
ప్రజలందరు
చూస్తే
యింత
ధనవంతునికికూడను
కోరికలున్నవా
అని
హాస్యాస్పదమునకు
గురి
అవుతానేమోనని
యెవ్వరు
చూడకుండా
వుండే
రాత్రి
పదిగంటల
సమయములోపల
మార్తా,
మేరీ
అనే
వారింటికి
ప్రవేశించాడు
యీ
శ్రీమంతుడు.
7
▾
Meaning
Keep
జీసస్
ప్రశ్నించాడు.
ఎందుకు
నాయనా
యిక్కడకు
వచ్చావు?
స్వామీ
ధనమున్నది.
భవనమున్నది.
తగిన
అనుకూలములున్నవి.
కాని
నాకు
మనశ్శాంతి
లేక
యనేక
సమస్యలంతా
నన్ను
బాధిస్తున్నాయి.
ఈ
సమస్యల
పరిహారమునకు
యేదైనా
మార్గము
చూపించమన్నాడు.
నవ్వుతూ,
నవ్వుతూ
ఒక
చిన్న
మాట
చెప్పాడు.
ఓ
ధనవంతుడా
నీ
సమస్యల
పరిహారమునకు
ఒక
చిన్న
మార్గము
వుంది
నీవు
చేయగలవా
అన్నాడు.
నీ
ఆస్తిపాస్తులను
బీదలకు
పంచిపెట్టు
యిది
నీ
సమస్యలకు
పరిహారమన్నాడు.
నీవు
యీ
ధనము
యీ
ఆస్తిపాస్తులు
యెంతవరకు
పెంచుకుంటున్నావో
అంతవరకు
నీ
సమస్యలు
పెరిగిపోతాయేగాని
యేమాత్రము
పరిహారము
కావటానికి
వీలులేదు.
ధనమును
పెంచుకొని
యేమి
చేయగలవు.
ఏనాటికైనా
వాటిని
విసర్జించి
పోకతప్పదు.
అలాంటి
తుచ్ఛమైన
ధనమునకై
నీవు
జీవితాన్ని
అపవిత్రము
గావించుకుంటున్నావు.
కన్న
కుమారుడుగాని,
కట్టుకున్న
భార్యగానీ
ధనము
వున్నంతవరకే
నీకు
గౌరవముగాని
తదుపరి
నిన్ను
యెవరు
ఏమాత్రము
గౌరవించరు.
దైవధనమే
నీ
నిజ
ధనము.
ధర్మధనమే
నీ
నిజధనము.
అనుగ్రహమనే
ప్రేమధనాన్ని
నీవు
పొందు.
మనము
యీనాడు
సంపాదించవలసినది
భగవంతుని
ప్రేమధనాన్ని
మాత్రమే.
ఎంతటి
భౌతికధనము
వుండినప్పటికి
యెంతటి
శరీరధనము
వుండినప్పటికి
ప్రయోజనము
లేదు.
ఈ
విధముగా
శ్రీమంతులకు,
ధనవంతులకు
బోధించి
యీవిధముగా
బీదలకంతాకూడను
సహాయము
గావిస్తూవచ్చాడు
జీసస్.
కనుక
జీసస్
చుట్టూ
యెప్పుడు
బీదప్రజలుండేవారేకాని
శ్రీమంతులు
వుండేవారు
కాదు.
Peter
చేపలు
పట్టే
జాలరి.
Mathew
Thomas
వీరందరు
సామాన్యమైన
ప్రజలే.
కాని
కట్టకడపటికి
జీసస్
శక్తిసామర్థ్యములు
వెంటనే
జంటనే
వుంటుండి
గుర్తించినవారు
యేదో
కొద్దిమంది
మాత్రమే.
ఇవన్ని
క్రోడీకరించుకొని
John
అనేవాడు
మొట్టమొదట
బైబిల్
రాస్తూవచ్చాడు.
St
Pal
యింకొక
బైబిల్
రాస్తూ
వచ్చాడు.
వీరందరు
వినికిడిద్వారా
వచ్చిన
విషయాలను
క్రోడీకరిస్తూ
వచ్చారు.
Mathew
tax
collector
అతను
తన
దగ్గర
క్రోడీకరించుకొన్న
విషయాన్ని
తీసుకొని
అతను
ఒక
బైబిలు
రాసాడు.
కాని
ఒకరు
రాసినదానికి
యింకొకరు
రాసినదానికి
యేమి
సంబంధము
లేకుండా
వుంటున్నాది.
ఈ
జీసస్
ప్రపంచమునకు
ఒక
విధమైన
ఆదర్శమును
నిరూపించే
వ్యక్తి
అని
నిరూపించారు.
ఇతను
కేవలము
భగవంతుడు
పంపించిన
దైవదూతగా
విశ్వసిస్తూవచ్చారు.
దానికి
తగినట్టుగా
జీసస్
I
am
messenger
of
God
అన్నాడు.
కాని
ఆ
మెసెంజరు
యే
పని
చేశాడు.
మెసెంజరు
పని
మాత్రమే
చేశాడు.
దైవత్వముయొక్క
తత్వాన్ని
ప్రజలకు
చాటుతూవచ్చాడు.
కాని
యీనాడు
మెసెంజర్సు
అని
పేరు
పెట్టుకొని
దైవానికి
విరుద్ధముగా
మనము
ప్రవర్తిస్తున్నాము.
దీనినే
ప్రధానముగా
తీసుకొని
St
Pals
రోమ్‌లో
పోయి
మొట్టమొదట
యీ
జీసస్
గురించి
ప్రచారము
సలుపుతూ
వచ్చాడు.
St
Pal
జీసస్కు
మొట్టమొదట
పరమ
విరోధి.
జీసస్
పేరు
విన్నాగాని,
జీసస్
భక్తులను
చూచినా
అతను
మండిపడేవాడు.
8
▾
Meaning
Keep
ఒకనాడు
St
Palకు
స్వప్నములో
వచ్చి
‘అయ్యా
నన్ను
ద్వేషిస్తున్నావా?
దైవాన్ని
ద్వేషిస్తున్నావా?
నేను
ఎవరు
దైవమెవరు.
ఒక
జ్యోతినుండి
వెలువడిన
అగ్ని
కణములు
ప్రతి
మానవుడు.
కనుక
నేను
నీవు
సర్వముకూడను
దైవస్వరూపమే.
నిన్ను
నీవు
దూషించుకుంటున్నావేగానీ
నన్నుకాదు’
అన్నాడు.
ఈ
విధముగా
స్వప్నములోపల
అతనికి
చాలా
పరివర్తన
కలగటంచేత
రెండవదినమునుంచి
జీసస్పైన
విశ్వాసము
అభివృద్ధి
గావించుకుంటూ
వచ్చాడు.
నా
యీ
శేష
జీవితమును
దైవప్రచారములోపలనే
అంకితము
గావించాలని
ఆనాటినుండికూడను
బాగా
పట్టుపట్టాడు.
మొట్టమొదట
Romeలో
ప్రవేశించి
జీసస్ప్రచారము
సల్పినవాడు
యీ
పాల్.
ఆనాటి
పరిస్థితులలో
Rome
యేవిధముగా
వుండేది.
అంతా
భారతీయ
సంస్కృతిని
పురస్కరించుకొని
జీవించుచుండెడివారు.
తల్లితండ్రులను
గౌరవించటము,
సత్యమును
పలకాలి,
పెద్దలను
గౌరవించాలి,
గురువును
విశ్వసించాలి.
దైవాన్ని
ప్రేమించాలి.
దైవమనేవాడు
ఒకడు
కాదు.
ఎవరి
భావానికి
సంబంధించిన
రీతి
వారు
దైవాన్ని
ప్రార్థించుకోవచ్చని
వారియొక్క
నియమము.
ఈనాటి
భారతీయులు
అనేకమంది
విమర్శిస్తూవుంటారు.
ఏమి
భారతదేశములోపల
యింతమంది
దేవుళ్లు,
యిన్ని
రూపాలా,
యిన్ని
ఆరాధనలా,
యిన్ని
మార్గములా
అని
విమర్శిస్తూవుంటారు.
దైవము
ఒక్కడేగాని
వారి
వారి
అభిప్రాయములను
పురస్కరించుకొని,
వారి
వారి
ఆశయములను
పురస్కరించుకొని
వారి
ప్రీతిపూర్వకమైన
మార్గాన్ని
అనుసరించే
నిమిత్తమై
యనేక
రూపనామములు
విశ్వసిస్తూవచ్చారు.
ఎవరికి
వారికి
స్వాతంత్ర్యాన్ని
యిస్తూ
వచ్చింది.
ఒకరిని
ఒకరు
బంధించటంలేదు.
ఇది
యెందుకోసమో
భారతదేశం
చక్కని
జవాబునందించింది.
ఒక
చిన్న
ఉదాహరణము.
ఒక
సైజుకు
తగిన
బుష్కోటును
నీకు
యిచ్చారు.
కానీ
యీ
బుష్కోటును
అందరూ
ధరించాలంటే
యిది
సాధ్యమవుతుందా.
ఒకనికి
టైట్
కావచ్చును.
ఒకనికి
లూజ్
కావచ్చును.
ఎవరి
సైజుకు
తగినట్టుగా
వారు
బుష్కోటును
కుట్టించుకోవచ్చును
అనుకోటంలో
యెంత
న్యాయం
వుంటున్నాది.
కేవలము
ఒకదానినే
అందరు
అనుభవించాలి
అనేది
కేవలము
నిర్బంధము
అవుతుంది.
అనేక
అననుకూలములు
యేర్పడుతాయి.
గుడ్డ
ఒకటేగానీ
సైజులు
వేరు
వేరుగా
వుండవచ్చు.
అదే
విధముగా
ఆత్మ
ఒక్కటే
ఆరాధనలు
వేరు
వేరుగా
వుండవచ్చు.
అభిరుచులు
వేరు
వేరుగా
వుండవచ్చును.
ఇలాంటి
సిద్ధాంతమే
రోమ్‌లో
వుండేది.
క్రమక్రమేణాకూడను
యీ
ఏకత్వమనే
సిద్ధాంతమును
వారు
అనుభవిస్తూ
ఆనందిస్తూ
అది
పంచిపెడుతూ
వచ్చారు.
ఈ
Pal
ప్రారంభములో
అనేక
హింసలను
గురయ్యాడు.
చెప్పకూడదుకాని
ఒక
బోనులో
సింహాన్ని
పెట్టి
సింహానికి
వారు
అందించారు.
అంత
హింసలు
పెడుతూవచ్చారు.
కాని
కట్టకడపటికి
సత్యాన్ని
గుర్తించారు.
ఆ
సత్యాన్ని
గుర్తించి
ఆనాటినుండి
యీ
క్రీస్తుమతమనే
దానిని
రోమ్‌లో
అభివృద్ధి
గావించుతూవచ్చారు.
అక్కడనే
యీ
భగవంతుని
అంశము
ప్రతీ
మానవునియందు
వున్నదని
దానినే
Persona
అని
పిలుస్తూవచ్చారు.
9
▾
Meaning
Keep
Also in his talks
(1)
15 June 1989
Safeguard human values
Persona
అనగా
పవిత్రమైన
దివ్యాంశము
అని.
ఒక
దివ్యమైనవారిని
Persona
అని
గౌరవముగా
పిల్చేవారు.
ఆ
Persona
నుండియే
Person
వచ్చింది.
ఆ
Person
నుండి
Personality
అనేది
వచ్చింది.
కాబట్టి
Person
అంటే
యేమిటి.
పవిత్రమైన
దివ్యత్వముతోకూడినవాడు
Person.
ప్రతి
మానవుడు
పవిత్రమైన
దైవాంశస్వరూపమే.
అలాంటి
దివ్యత్వమైన
ఆత్మస్వరూపాన్ని
మనము
యీనాడు
మరచిపోయాము.
మరచినదానిని
తిరిగి
మనము
జ్ఞప్తికి
తెచ్చుకోవాలి.
ఆ
జ్ఞప్తికి
తెచ్చుకోటానికి
దీనికి
కప్పిన
మాయను
మనము
నిర్మూలము
గావించుకోవాలి.
ఆ
కప్పిన
మాయ
యేమిటి?
మన
ద్వేషము,
అసూయ,
స్వార్థము.
ఈ
మూడింటిని
మనము
నిర్మూలము
గావించుకోవాలంటే
ఒక్క
ప్రేమ
తప్ప
అన్యమార్గములేదు.
ఆ
ప్రేమచేతనే
సర్వధైర్యము
మనకు
ప్రాప్తిస్తుంది.
ఒకానొక
సమయములో
మఠాధిపతి
జీసస్‌ను
పిలిపించుకున్నాడు.
నీవు
Jewsకి
రాజా
అని
ప్రశ్నించాడు.
నేను
ఆ
విధంగా
చెప్పటంలేదు.
అయితే
నీవు
అందరికి
తప్పుడు
మార్గము
ప్రబోధము
చేస్తున్నావు.
యేమంటే
నీ
ద్వారా
ప్రతి
ఒక్కడు
స్వర్గానికి
పోవాలని
చెబుతున్నావు
యిది
చాలా
తప్పు
అన్నాడు.
జీసస్
ఒకే
మాట
చెప్పాడు.
Seek
the
kingdom
of
Heaven.
అన్నాడు.
Where
is
that
అన్నాడు.
Kingdom
of
Heaven
is
with
in
YOU,
with
in
me,
within
everybody.
కనుక
ఈ
Kingdom
of
Heaven
మనలోనే
వుంటున్నది.
అలాంటి
ప్రబోధ
చేసే
నేను
నా
ద్వారానే
Kingdom
of
Heaven
అని
చెప్పటం
అసంభవమైన
విషయమన్నాడు.
ఈ
ధైర్యము
యే
విధముగా
వచ్చింది.
సత్యమువల్లనే
ధైర్యము
యేర్పడుతుంది.
సత్యము
యెక్కడనుండి
వస్తుంది.
శాంతమువల్లనే
వస్తుంది.
శాంతము
యెక్కడనుండి
వస్తుంది.
ప్రేమతోనే
సంభవిస్తుంది.
ఈ
ప్రేమ
యెక్కడనుండి
వస్తుంది.
నమ్మకమువల్లనే
వస్తుంది.
కనుకనే
Where
there
is
confidence
there
is
Love
Where
there
is
Love
there
is
Peace
Where
there
is
Peace
there
is
Bliss
Where
there
is
Bliss
there
is
GOD.
ఈ
విధమైన
మార్గమునందు
దైవత్వము
మనము
పొందాలంటే
విశ్వాసము
అభివృద్ధికావాలి.
దైవత్వమనేది
భారతదేశమునందు
బ్రహ్మ
విష్ణు
మహేశ్వర
స్వరూపములంటున్నారు.
మనము
విశ్వసిస్తున్నాము.
ఈ
ముగ్గురు
మూడు
ఆకారాలు
ధరించి
సినిమా
actors
మాదిరి
దర్శనమివ్వటానికి
లేరు.
ఈ
రూపాలు
చూచిన
వారు
యెవ్వరూ
లేరు
యీ
జగత్తులో.
ఇవి
ఒక
విధమైన
విశ్వాసము
అభివృద్ధిపరచే
నిమిత్తము
యేర్పడినటువంటివే.
ఇవి
కేవలము
ఒక
భ్రాంతియే.
అయితే
యీ
బ్రహ్మ,
విష్ణు
మహేశ్వరులు
ప్రతి
ఒక్కరి
హృదయమునందు
వుంటున్నారు.
హృదయేశుడే
ఈశుడన్నారు.
అనగా
హృదయమే
ఈశ్వరత్వము.
హృదయమే
ఆత్మతత్వము.
హృదయమే
దివ్యత్వము.
10
▾
Meaning
Keep
హృదయమే
ప్రేమతత్వము.
not
physical
heart,
spiritual
heart.
ఈ
spiritual
heart
అపరిమితమైనది.
అదియే
ప్రేమతత్వము.
ఆ
ప్రేమకు
హద్దనే
లేదు.
నీ
సంక్షిప్తమైన
భావాలతో
నీవు
దానికి
హద్దు
నిర్మించుకుంటున్నావుగాని
నిజముగా
దానికి
హద్దులు
లేవు.
ఆ
హృదయమునుండి
ఆవిర్భవించినదే
మనసు.
మనసు
యెక్కడ
వుంటున్నది.
సర్వత్రా
వుంటున్నది.
మనోమూలమిదం
జగత్.
జగత్తంతా
వ్యాపించినది
మనస్సే.
ఈ
మైండ్‌ని
విష్ణువు
అన్నారు.
విష్ణువు
అనగా
సర్వవ్యాపకుడు.
సర్వాంతర్యామి.
హృదయమునుండి
పుట్టినది
మనసు.
అనగా
ఈశ్వరత్వమునుండి
వచ్చినది
విష్ణుత్వము.
మనసునుండి
ఆవిర్భవించినవాడే
బ్రహ్మ.
అతనే
అహం.
కనుక
యీ
అహంనుండి
యన్ని
ఆవిర్భవిస్తాయి.
బ్రహ్మ
విష్ణువు
నాభినుండి
పుట్టినవాడని
అంటున్నాము.
అనగా
మనసుయొక్క
చంచలస్థానమునుండి
వచ్చినదే
యీ
అహము.
ఏతావాతా
హృదయమే
ఈశ్వరుడు.
మనసే
విష్ణువు.
మనయొక్క
అహంకారము
బ్రహ్మ.
సశివ,
సబ్రహ్మ
సవిష్ణు.
ఇదియే
వశిష్ఠ
రామాయణముకూడను
చెప్పుతూ
వచ్చింది.
కాని
ప్రతి
ఒక్కటికూడను
మన
హృదయమునందే
వుంటున్నవి.
బ్రహ్మ,
విష్ణు,
మహేశ్వరులనేవారు
ప్రత్యేకమైనవారుకాదు.
మన
హృదయమే
ఈశ్వరునిగా
భావించుకోండి.
మన
మనసే
విష్ణువుగా
తలంచుకోండి.
మనయొక్క
అహమునే
బ్రహ్మగా
తలచుకొనిన
మనము
యే
తప్పులుకూడను
చేయటానికి,
యే
పొరపాట్లుకూడను
చేయటానికి
అవకాశము
వుండదు.
మనసు
చాలా
పవిత్రమైనది.
కనుకనే
మనయేవ
మనుష్యాణాం
కారణం
బంధమోక్షయోః
అని
మోక్షమునకుకూడను
అర్హతగలిగినది
యీ
మనసు.
ఈ
మనసును
ఆవరించిన
మాలిన్యము
కప్పి
పుచ్చటముచేత
యిది
పెడమార్గము
పడుతున్నది.
మనసును
పరిశుద్ధము
చేసుకుంటే
యింతకు
మించిన
సాధన
మరొకటిలేదు.
ముందొకటి
వెనుక
ఒకటి
మనము
మనసున
భావించరాదు.
తన
పెద్ద
దోషములైనా
తాను
కప్పిపుచ్చుకోటం
పరుల
చిన్న
దోషమైనా
గొప్పదిగా
భావించుకోటం
యీ
విధమైన
దుర్గుణములచేత
మనసు
మాలిన్యముతో
దట్టంగా
అట్టకట్టుకుపోతున్నాది.
కనుక
మనము
మనసు
పరిశుద్ధము
చేసుకునే
మార్గములే
యీ
సాధనలన్ని.
ఈ
మనసును
యేనాడు
మనము
పరిశుద్ధము
గావించుకొందుమో
మనకు
మనమే
దైవస్వరూపాన్ని
అనుభవించగలము.
దైవము
మనకంటె
వేరుగాలేడు.
దైవము
నీలో
లేడు.
నీకు
వెలుపల
లేడు.
నీవే
దైవము.
ఇలాంటి
విశ్వాసమును
మనము
అభివృద్ధిగావించుకుంటూ
రావాలి.
మొట్టమొదట
అహంపండితాః
అనగా
నేనుకూడను
పండితుడనే
అన్నాడు.
పూర్తి
విచారణ
చేసుకున్న
తరువాత
అహంనపండితాః
నేను
పండితుడనుకాను
అన్నాడు.
నేను
కేవలము
మానవుడని
భావిస్తున్నావు.
కొంతకాలము
పోయిన
తరువాత
నేనుకూడను
దివ్యత్వాన్ని
కావచ్చును
అనుకొని
అనుభవిస్తున్నావు.
నేను
దివ్యత్వమే
అనే
నిశ్చలమైన
స్థితికి
వస్తున్నాము.
ఇదే
జీసస్
చెప్పిన
ప్రధానమైన
మార్గము.
మొట్టమొదట
I
am
the
messenger
of
God
అన్నాడు.
క్రమక్రమేణా
I
am
son
of
God
అన్నాడు.
తదుపరి
I
and
my
father
are
one
అన్నాడు.
ఈ
విధమైన
సోపానములు
దాటి
ఆ
దివ్యత్వములో
తాను
ఐక్యతను
పొందాడు.
11
▾
Meaning
Keep
కనుక
కాలసర్పము
కాటువేయకపూర్వమే,
జీవిత
నావ
మునగక
పూర్వమే,
యీ
పడవకు
చిల్లులు
పడి
శిథిలముకాక
పూర్వమే
మనము
ఆ
దివ్యత్వాన్ని
పొందటానికి
తగిన
ప్రయత్నము
చెయ్యాలి.
మనము
కాలమును
వ్యర్థము
చేయరాదు.
కాలము
యెవరికిని
ఆగేదికాదు.
కాలము
నిన్ను
అనుసరించేదికాదు.
నీవే
కాలాన్ని
అనుసరించాలి.
కాలమునకు
అతీతమైనవాడు
దైవము.
అట్టి
దైవత్వాన్ని
మనము
శరణుజొచ్చినప్పుడే
దివ్యత్వమనే
ఆత్మతత్వమును
అర్థము
చేసుకోగలము.
కాన
యీనాటి
మనయొక్క
అర్పితములు,
యీనాటి
మన
పూజలు
యీనాటి
మన
ప్రార్థనలు
యుక్తులతో
భగవంతునికూడను
మోసపరచే
మార్గములో
ప్రయత్నము
చేస్తున్నారు.
ఈ
ఆడంబరములకుగాని,
అహంకారములకుగాని
భగవంతుడు
చిక్కడు.
అహంకారము
వుండినంతవరకు
ఆత్మతత్వాన్ని
నీవు
గుర్తించలేవు.
ఏనాడు
అహంకారము
నిర్మూలము
గావింతువో
ఆనాడే
నీకు
ఆత్మదర్శనమవుతుంది.
అహంకారము
దట్టమైన
అట్టువంటిది.
ఆ
తెరను
పూర్తి
నిర్మూలము
గావించునంతవరకు
నీకు
ఆత్మానందము
లభించదు.
ప్రేమస్వరూపులారా!
మనలో
వుండిన
అహంకారము
నిర్మూలము
గావించుకోండి.
ఎవరిగురించి
అహంకారముతో
వున్నావు.
నీ
అహంకారము
యెంతమాత్రము.
ఇంత
విశ్వాన్ని
చూచి
నీవు
అహంకారపడటము
యెంత
అజ్ఞానము.
దేనిలో
నీవు
బలవంతుడు.
శరీరములో
బలవంతుడా.
గుణములో
బలవంతుడా.
పనిలో
బలవంతుడా.
ధనములో
బలవంతుడా.
విద్యలో
బలవంతుడా.
దేనియందు
బలవంతుడు
తాను.
దైవబలములేని
బలవంతుడు
బలవంతుడా.
కాదు
దుర్బలుడు.
కనుక
మనము
యేమి
చేసినప్పటికి
అంతా
దైవబలముగానే
భావించుకోటం
యిది
సరైన
మార్గము.
అందులోనే
మనకు
శాంతి
చేకూరుతుంది.
ధనములో
మనకు
శాంతి
లేదు.
చదువుతో
మనకు
శాంతి
లేదు.
అధికారముతో
శాంతి
లేదు.
మరింత
దాన్ని
అంటగట్టి
యనేకవిధములైన
బంధనలలో
తోసేదేగాని
యిది
నిర్భయుని
గావించేదిగాదు.
దైవమును
నమ్మినవాడే
నిర్భయుడు
అతనే
అభయుడు.
ఆ
విశ్వసించనివారంతా
దుర్బలురే.
వారు
పడుతున్న
అవస్థలు
మనము
చూస్తూనే
వున్నాము.
కనుక
దైవ
విశ్వాసాన్ని
మనము
పెంచుకొని
దైవత్వాన్ని
చింతించి
దివ్యత్వముతో
జీవితాన్ని
గడుపు.
ఈ
చదువు
సంధ్యలుకూడ
వుంచుకోవచ్చు.
కాని
నిజంగా
మనము
చేసే
పొరపాటు
యేమిటి?
దైవాన్ని
వెతికే
బుద్ధితో
మనము
ధనాన్ని
అనుసరిస్తున్నాము.
ఆత్మను
వెతకవలసిన
బుద్ధితో
మనము
అన్నాన్ని
వెతుకుతున్నాము.
ఆత్మ
వుంటే
సర్వము
వుంటున్నాది.
ఆత్మాన్వేషణ
చేయకుండా
అన్నాన్వేషణ
చేయటం
కేవలము
అజ్ఞానమే
కదా.
నీ
ముఖమును
చూచుకోమని
నీకొక
అద్దము
యిస్తే
ఆ
అద్దము
యింకొకరి
ముఖము
ముందర
పెడితే
నీ
ముఖము
యెట్లా
కనపడుతుంది.
యీ
అద్దాన్ని
యితరులకంతా
అన్వయింపచేస్తున్నావేకాని
నీకు
నువ్వు
చూసుకోటానికి
ప్రయత్నం
చేయటంలేదు.
తన
దోషాన్ని
తను
వెతుకొన్నటువంటివాడే
ధన్యుడు.
తన
తప్పును
తాను
చూసుకున్నవాడు
ధన్యుడు.
పరులయందు
మంచిని
చూచే
వాడు
ధన్యుడు.
12
▾
Meaning
Keep
కాని
పరులయందు
చెడ్డను
చూడటం,
తనయందు
చెడ్డ
వుండినప్పటికి
మరుగు
చేసుకోటం
యిది
మానవునియొక్క
కర్తవ్యము
కాదు.
అందరియందు
నీవు
మంచిని
చూడు.
ఎవరిని
నీవు
దూషించవద్దు.
సర్వభూత
తిరస్కారం
కేశవం
ప్రతిగచ్ఛతి.
ఎవరిని
దూషించినా
నీవు
దైవాన్ని
దూషించినవాడవౌతావు.
అందరితోను
ప్రేమతో
వుండి
సాధించు.
మానవజీవితము
చాలా
పవిత్రమైనది.
ఇలాంటి
జీవితాన్ని
మనము
వ్యర్థము
గావించకూడదు.
ఎన్నో
దేశములనుండి
యిక్కడకు
చేరినారు.
ఏమి
తక్కువై
యిక్కడకు
చేరినారు.
ధనము
తక్కువ
లేదు.
అనుకూలాలకు
తక్కువ
లేదు.
ఆనందానికి
తక్కువ
లేదు.
ఇవన్ని
భౌతికమైనవే
కాని
ఆనందమనేది
ఆత్మరూపమైనది.
వారికి
యెక్కడా
లభించలేదు.
అది
ఒక్క
ఆత్మయందు
మాత్రమే
యీ
ఆనందము
మనకు
లభ్యమౌతుంది.
కనుక
మన
దృష్టినంతను
ఆత్మవైపుకు
మరల్చాలి.
ఆత్మ
అంటే
యేమిటి.?
విశాలత్వమే
మన
ఆత్మతత్వము.
నేను
నా
వారు
అనే
సంకుచిత
భావాన్ని
నిర్మూలంచెయ్యాలి.
అందరూ
నావారే.
అందరూ
దైవబిడ్డలే.
అందరకు
తండ్రి
ఒక్కడే.
కాని
బిడ్డలనేకము.
కాపాడే
ప్రభువు
ఒక్కడే
అనే
సత్యాన్ని
గుర్తించాలి.
ఒక్క
ప్రేమనే
సరైన
మార్గము.
సేవలే
సరైన
మార్గము.
మన
సింగ్
చెప్పాడు.
Love
of
God.
Fear
of
sin,
Morality
in
Society.
యీ
మూడే
మనకు
ముఖ్యము.
దైవత్వమును
మనము
ప్రేమించితిమా
యింక
పాపము
యొక్క
భయము
యేర్పడుతుంది.
దైవప్రేమలేని
వానికే
పాపమునందు
యేమాత్రము
భీతి
వుండదు.
దైవప్రీతి
కలిగినవాడు
మానవుడు.
ఆ
ప్రీతి
కోల్పోతే
వాడు
దానవుడౌతాడు.
దానినుంచి
భయమనేదే
వుండదు.
వాడు
చేసేదంతా
పాపములే.
ఈ
పాపము
చేయటమువలన
సమాజములో
యెట్లు
గౌరవింపబడతాడు.
కనుక
పాపభీతి
కలగాలంటే
దైవప్రీతి
మనము
సంపాదించుకోవాలి.
దైవప్రీతితో
మనకు
పాపభీతి
అభివృద్ధి
అవుతుంది.
పాపభీతివల్ల
సమాజములో
గౌరవాన్ని
పొందుతాము.
ఎట్టి
తప్పులు
చేయడు.
యీ
మూడింటియొక్క
స్వరూపమే
ముమ్మూర్తి
స్వరూపము.
ఇలాంటి
ముమూర్తి
స్వరూపమే
త్రికరణశుద్ధి
అన్నారు.
త్రికరణశుద్ధితో
మనము
చేసే
పూజలతో
మానవత్వముతో
దివ్యత్వమును
పొందవచ్చు.
కనుక
మనము
ప్రేమను
అభివృద్ధిపరచుకోవాలి.
ఈ
ప్రేమకంటె
మించినది
మరొకటిలేదు.
ఏ
దేశమువారైనా,
ఏ
తెగవారైనా,
ఏ
మతమువారైనా,
ఏ
యొక్క
సాంప్రదాయమువారైనా
అందరికి
ప్రేమ
ఒక్కటే.
ఏ
మతమువారుకూడను
ప్రేమను
ధిక్కరించమని
చెప్పరు.
ఏ
దేశము
వారైనను
ప్రేమను
ఉల్లంఘించమని
చెప్పరు.
ఏ
తెగవారుకూడను
ప్రేమను
తిరస్కరించమని
చెప్పరు.
ప్రేమలేకపోతే
జీవితమేలేదు.
కాబట్టి
యీ
ప్రేమచేతనే
మీరందరు
యిక్కడకు
చేరగలిగారు.
కనుక
యీ
ప్రేమను
మనము
బలపరచుకోవాలి.
ఈ
ప్రేమనే
మీకు
దైవము.
Love
is
GOD
Live
in
Love.
కనుక
మీరు
ప్రేమతో
దైవత్వాన్ని
యే
నామము
మీకిష్టమో,
యే
రూపము
మీకిష్టమో
యే
మార్గము
మీకిష్టమో
దానిని
నీవు
అనుసరిస్తూ
పోవటములో
తప్పులేదు.
మన
హృదయానికి
నచ్చినదే
మనకు
ప్రీతి.
కనుక
మీరు
ఆ
హృదయాన్ని
అనుసరించుకుంటూ
ఆ
హృదయప్రేమను
మీరు
అందుకుంటూ,
ఆ
హృదయప్రేమలోనే
లగ్నముకండి.
Previous
←
Man is part of God Himself!
Next
Life is fulfilled only when every action is done to please God
→