Contents
Devotion & Sacred Story
Home
Library
Find
Shelf
Settings
←
Leave
Sathya Sai Speaks 1988 · Through selfless sevā, humanness attains divinity
Tap a verse for its meaning
IAST
Telugu
Meaning
Continuous
Through selfless sevā, humanness attains divinity
15 February 1988, Prasanthi Nilayam
1
▾
Meaning
Keep
ప్రేమస్వరూపులారా!
మానవుని
ఉత్తేజపూరితునిగాను,
ఉన్నత
మానవునిగను
తీర్చిదిద్దేది
సేవ.
మానసిక
శక్తిని,
బుద్ధియొక్క
శక్తిని
వికసింపచేసి
ప్రకటింపజేయునదే
యీ
నిస్వార్ధసేవ.
అప్రయత్నముగా
దైవత్వమును
అనుభవింపచేస్తుంది,
యీ
సేవ.
వజ్రము
ప్రకాశించవలెనన్న
అనేక
విధములుగా
కోతలు
కోయవలసివస్తుంది.
అదే
విధముగా
మానవత్వము
వికసించవలెనన్నను,
ప్రకటించవలెనన్నను
సమాజ
సేవలో
పాల్గొనాలి.
నీ
సేవ
ప్రపంచమునకేమాత్రము
అవసరము
లేదు.
సేవలు
చేయకపోతే
ప్రపంచము
నిలచిపోయే
స్థితిలో
లేదు.
కానీ,
సేవలు
దేనికోసం?
మీ
నిమిత్తమై
మీరు
సేవలు
చేయాలి.
మీ
మానసిక
పవిత్రతకోసము,
నిర్మలత్వముకోసము
సేవను
ఆచరించాలి.
ఈ
సేవ
అనేకత్వములోని
ఏకత్వమును
గుర్తింపచేస్తుంది.
ఐకమత్యమును
అభివృద్ధి
గావిస్తుంది.
ఈ
ఐకమత్యమే
నిర్మలత్వానికి
మార్గమవుతుంది.
ఈ
నిర్మలత్వమే
దివ్యత్వమును
అందుకోగలుగుతుంది.
కనుకనే
Unity,
Purity,
Divinity
యీ
మూడింటి
యొక్క
సమ్మిళితమైన
స్వరూపమే
మానవత్వము.
శరీరము
రావటము
కేవలము
స్వార్థముకోసము
కాదు
ఈ
అన్నింటికి
నిస్వార్ధసేవ
అత్యవసరము.
ఈ
పవిత్రమైన
నిస్వార్ధ
కర్మలచేత
మానవత్వము
దివ్యత్వమును
అందుకుంటుంది.
‘పరోపకారార్థమిదం
శరీరమ్’.
శరీరము
రావటము
కేవలము
స్వార్ధముకోసము
కాదు.
మన
బుద్ధిని,
మన
మనస్సును
మన
నిమిత్తమై
యే
విధముగా
ఉపయోగపెట్టుకుంటున్నామో
అదే
మనోబుద్ధులను
పరుల
నిమిత్తము
ప్రవేశపెట్టి
దానిని
పవిత్రము
గావించుకోవాలి.
స్వార్ధ
పరార్ధములతో
కూడినదే
యీ
నిస్వార్ధ
కర్మ.
స్వార్ధములేక
పరార్ధము
ప్రారంభము
కాదు.
కనుక
స్వార్థమును
మనము
విసర్జించనక్కరలేదు.
ఐతే
యీ
స్వార్ధమును
యే
విధమైన
ప్రీతితో
అనుభవిస్తున్నామో
అదే
ప్రీతితో
నిస్వార్ధమైన
పరార్ధమునందుకూడను
ప్రవేశపెట్టాలి.
2
▾
Meaning
Keep
దీనికి
ఐదు
విధములైన
గుణములు
అత్యవసరము.
మొట్టమొదటిది,
ప్రపత్తి.
అదే
dedication.
రెండవది
devotion,
మూడవది
discipline,
నాల్గవది
discrimination,
ఐదవది
determination.
ఈ
ఐదు
కూడను
మానవుని
సేవలో
పంచప్రాణములుగా
రూపొందుతాయి.
ఈ
‘డ’కార
పంచకములను
మనము
చక్కగా
ప్రవేశపెట్టినప్పుడు
పంచభూతములేకాకుండా,
పంచ
ప్రాణములేకాకుండా
పంచకోశములుకూడా
పవిత్రమవుతాయి.
నైతిక,
ధార్మిక,
ఆధ్యాత్మిక,
లౌకిక,
వైజ్ఞానిక
ఇలా
అన్ని
రంగములందు
యీ
పంచప్రాణములు
అత్యవసరము.
ఈ
ఐదు
విధములైన
మార్గములే
లేక
ఏ
కార్యము
మనము
చేయలేము.
సేవలో
పాల్గొనవలెనన్న
మొట్టమొదట
అహంకారమును
త్యాగము
చెయ్యాలి.
మొట్టమొదటిది
dedication.
దేనికి?
భగవంతునికా
లేక
ప్రపంచమునకా
లేక
పనికా?
దేనికి
dedication
చెయ్యాలి?
ప్రతి
ఒక్క
పనిని
మొట్ట
మొదట
మనము
dedication
చెయ్యాలి.
మానవుడు
ఏ
కార్యములో
ప్రవేశించినప్పటికిని
మొట్టమొదట
పెనుభూతముగా
వచ్చి
అడ్డము
తగులుతుంది,
బుద్ధి.
అదే
అహంకారము.
ఈ
అహంకారమును
మొట్టమొదట
dedication
చెయ్యాలి.
అహంకారమును
త్యజించినప్పుడే
మనము
యే
కార్యము
చేసినా
పవిత్రమైన
కార్యముగా
రూపొందుతుంది.
అహంకారము
వుండినంతవరకు
మానవునకు,
ఆత్మ
తత్త్వమునకు
యేమాత్రము
సంబంధ
బాంధవ్యము
చేకూరదు.
అహంకారము
వుండిన
వ్యక్తి
ఆత్మతత్త్వమును
అర్థము
చేసుకోలేడు.
ఆనందమును
కూడను
అనుభవించలేడు.
కనుక,
మొట్టమొదట
యే
కార్యములో
ప్రవేశించినప్పటికి
యీ
అహంకారమును
త్యాగము
చేయాలి.
విద్యాహంకారముగాని,
కుల
అహంకారముగాని,
మత
అహంకారముగాని,
ధన
అహంకారముగాని,
రాజ్య
అహంకారముగాని,
సౌందర్య
అహంకారముగాని,
యీ
విధముగా
ఎనిమిది
విధములైన
అహంకారములుంటున్నాయి.
యీ
అష్టవిధములైన
అహంకారమును
మొట్టమొదట
మనము
త్యాగము
చెయ్యాలి.
ఈ
అహంకారము
ఎంతవరకు
శాశ్వతము?
3
▾
Meaning
Keep
గొప్ప,
ధనము
వున్నదని
అహంకారపడవచ్చు.
ఈ
ధనము
ఎంతకాలము?
విద్య
వున్నదని
అహంకారము
వుండవచ్చు,
కాని
ఆవిద్యను
ఉపయోగము
చేయకపోతే
ప్రయోజన
మేమిటి?
కనుక,
యీ
విధముగా
అహంకార
పడటానికి
అవకాశమే
లేదు
మానవునకు.
అహంకారము
కేవలము
అజ్ఞాన
స్వరూపమే!
కనుక,
మొట్టమొదట
మనము
అహంకారము
నిర్మూలము
గావించటానికి
ప్రయత్నించాలి.
అహంకారము
నిర్మూలము
గావించుకున్నప్పుడే
సేవలో
మనకు
నడుము
వంగుతుంది.
అహంకారము
వుండినంతవరకు
నడుము
వంగదు.
తలవంచము.
ఏనాడు
మనము
నడుము
వంచి,
తలవంచి
పనిచేస్తామో
ఆనాడే
అహంకారము
నిలిచిపోతుంది.
కనుక,
సేవలో
పాల్గొనవలెనన్న
మొట్టమొదట
అహంకారము
త్యాగము
చెయ్యాలి.
అహంకారము
నిర్మూలమైనప్పుడే
పరిశుద్ధమైన
భక్తి
ప్రారంభమవుతుంది
రెండవది
devotion
అంటే
యేమిటి?
జపము
చేయటమో,
భజన
చేయటమో
వ్రతములు
చేయటమో
యీ
మాత్రమే
devotion
అనగా
భక్తి
అని
మనం
అనుకుంటున్నాము.
విష్ణుస్వరూపమైన
విశ్వాన్ని
మనము
ప్రేమించాలి.
అనగా
ఏమిటి?
విష్ణుత్వమనగా
సర్వవ్యాపకత్వమని
అర్థము.
అనగా
సర్వమానవులయందు
దైవత్వమును
మనము
గుర్తించాలి.
‘విశ్వం
విష్ణు
స్వరూపం,
భజసేవాయాం’.
అది
భక్తియొక్క
వుత్పత్తి.
అహంకారము
నిర్మూలమైనప్పుడే
పరిశుద్ధమైన
భక్తి
ప్రారంభమవుతుంది.
ఎప్పుడు
యీ
భక్తి
మనలను
అభివృద్ధిగావింపచేస్తుందో
అప్పుడే
discipline,
అనగా
క్రమశిక్షణ.
క్రమశిక్షణ
(discipline)
అనేది
మన
జీవితములో
ఒక
భాగముగా
ఉండాలి
Discipline
అనగా
ఏమిటి?
ఒక
నియమము.
నియమము
లేకుండా
యే
కార్యము
మనము
ఆచరించలేము.
ఆ
విధముగా
నియమమును
మీరి
నడచుకుంటే
కొన్ని
ప్రమాదములకు
గురిఅవుతాము.
కొంత
అనానుకూలములుకూడను
సంభవించవచ్చు.
నియమము
అత్యవసరమైనది.
‘న
శ్రేయో
నియమం
వినా’
అన్నారు.
నియమము
లేకపోతే
శ్రేయస్సు
ఉండదు.
ప్రతిదానికికూడను
ఒక
నియమము
అవసరము.
నిజానికి,
మన
జీవితమే
ఒక
నియమములో
అభివృద్ధి
పొందుతున్నది.
ఆ
నియమమే
లేక
యిది
రోగముగా
మారిపోతుంది.
ఇప్పుడు
మన
టెంపరేచరు
చూడండి.
98.4°F
వుంటున్నది.
perfectly
normal
అంటాము.
4
▾
Meaning
Keep
ఈ
విధముగా
వుండినపుడే
healthy
body.
99°F
వచ్చిందా,
రోగము
బయలుదేరింది.
మన
Blood
Pressure
120
/
80
అనేది
perfectly
normal.
కొంచెం
క్రింద
98
లేక
85
వచ్చెనా
నార్మల్కు
విరుద్ధమైపోతుంది.
రోగము
ప్రారంభమవుతుంది.
అదే
విధముగా
గుండెకొట్టుకోటంకూడాను.
కొంచెం
ఎక్కువైందా,
heart
weak
అయింది.
eye
sight
కూడాను.
ఎంత
వరకునో
అంత
మాత్రమే
చూడగలరు.
ఎక్కువ
వెలుగు
చూస్తే
రెటీనా
burn
అయిపోతుంది.
ఇంక
eardrums
కూడా
అంతే?
ఈ
విధముగా
ఒక్కొక్కటి
మనదేహములోని
భాగములు
విచారణ
చేస్తే
అన్ని
వాటివాటి
నియమము
ననుసరించియే
వుంటున్నాయి.
కనుక,
యీ
విధముగా
చూస్తే
మన
లైఫ్
అంతా
పైకి
లిమిటెడ్‌గా
ఉంటున్నది.
అయినపుడు
ఆధ్యాత్మికములో
లిమిట్
లేకపోతే
ఎట్లా
కుదురుతుంది.?
కనుక,
discipline
కు
సంబంధించిన
Rules
and
Regulations
సత్యసాయి
ఆర్గనైజేషన్‌లో
uniform
గా
వుంటుండాలి.
ఒక
State
లో
ఒక
విధంగాను,
మరొక
State
లో
మరొకవిధంగాను
వుండకూడదు.
సేవలు
వేరుగా
వుండవచ్చు,
స్థానములు
వేరుగా
వుండవచ్చు.
కానీ,
మన
ఆశయములు
ఒకే
standard
గా
వుంటుండాలి.
ఎక్కడ
సాయీ
సంస్థలకు
పోయినప్పటికి
చాలా
వినయముగా,
విధేయతగా
పెద్దలను
గౌరవిస్తూ
యిక
parents
దగ్గర
చక్కగా
మాట్లాడుతూ
ప్రేమతత్త్వాన్ని
ప్రకటించాలి.
ఒక
బజారులో
తిరగనీ,
హాస్పటలుకు
పోనీ
లేక
మార్కెట్‌కు
పోనీ,
మన
ప్రవర్తనబట్టి
మన
behaviour
ను
బట్టి
మన
discipline
బట్టి
మనం
సత్యసాయి
ఆర్గనైజేషన్వారమని
కొత్తవారుకూడా
వూహించగలగాలి.
Discipline
అనేది
Shadow
వలె
మనలను
అనుసరించాలి.
అదే
విధముగా
మన
discipline
అనేది
యింటిలోగాని
బజారులోగాని,
ఆఖరుకు
విదేశాలకు
వెళ్లినాగాని
ఒక్కటిగానే
Shadow
మాదిరి
రావాలి.
Discipline
is
a
way
of
life.
ఇది
మన
లైఫ్‌లో
ఒక
భాగముగా
వుండాలి.
మన
అంతరాత్మను
మనం
అనుసరించాలి
Devotion,
మరియు
discipline
ఈ
రెండింటిని
అనుసరించేదిగా
వుండాలి.
discrimination
ఎట్లా?
ఏ
పని
చేసినా
is
it
good
or
bad,
is
it
right
or
wrong
అని
discrimination
చెయ్యాలి.
ఈ
discrimination
చేయకుండా
discipline
గాని,
discipline
లేకుండా
devotion
గాని,
devotion
లేక
dedication
గాని
ఉండటానికి
వీలులేదు.
5
▾
Meaning
Keep
కనుక,
మనకు
యీ
discrimination
చాలా
అవసరము.
ఎప్పుడు
యీ
discrimination
పనికివస్తుంది?
మంచి
చెడ్డలు
కలసినప్పుడు,
darkness
and
light
చేరినప్పుడు,
heat
and
cold
రెండూ
ఉన్నప్పుడు
యీ
విధముగా
రెండు
పదార్ధములు
చేరినప్పుడే
అక్కడ
discrimination
పనికివస్తుంది.
మానవునియందు
మంచి,
చెడ్డ
రెండు
చేరినాయి.
ఈ
good
and
bad
మధ్య
మనము
discrimination
చెయ్యాలి.
ఈ
discrimination
ఎలా
చెయ్యాలంటే
mind
తో
కాదు.
బుద్ధితో
కాదు,
మన
conscience
తో
చేయాలి.
బుద్ధిని
మనం
సాధారణముగా
discrimination
power
గా
అనుకుంటున్నాము.
కాని,
బుద్ధి
discriminate
చేసిన
తరువాతకూడను
మనం
conscience
agree
చేయకుండా
వుండవచ్చు.
కనుక,
అన్నిటికంటె
ప్రధానమైనది
మన
conscience.
ఇదే
మన
Master.
చాలా
ప్రధానము.
అందువలనే
follow
the
Master
అని
చెప్పారు.
who
is
your
Master
?
your
conscience
is
your
Master
నీ
ఆత్మ
నీయొక్క
గురువు.
నీ
ఆత్మ
నీ
యొక్క
దైవము.
ఎక్కడనుండి
వచ్చినది?
ఎందుకోసం
దీనికింత
పవిత్రత
వచ్చిందంటే
యీ
conscience
అనేది
consciousness
నుండి
వచ్చింది.
ఈ
consciousness
అనేది
సర్వత్రా
నిండినటువంటిది.
కానీ,
యీనాడు
మనము
consciousness
ను
follow
చేయటంలేదు.
ఇంద్రియములను
అనుసరిస్తున్నాము.
చూసింది
చూసినట్లు
follow
చేయకూడదు.
విన్నది
విన్నట్లు
follow
చేయకూడదు.
ఈ
senses
నుండి
వచ్చిన
matter
ను
అంతా
conscience
కి
అప్పచెప్పాలి.
ఈ
conscience
మనకు
సరియైన
answer
అందిస్తుంది.
ఒక
చిన్న
ఉదాహరణ.
ఒక
దొంగ
ఒకరాత్రి
ఒకరింటికి
వెళ్లి
దొంగతనము
చేశాడు.
రెండవ
దినము
పోలీసు
అతనిని
పట్టుకున్నాడు.
కానీ
తప్పించుకునే
నిమిత్తమై
‘నేను
రాత్రి
పోలేదు,
దొంగతనము
చేయలేదు.
నేను
ఆ
వస్తువులు
తేలేదని’
వాదిస్తాడు.
యీ
వాదన
బుద్ధి,
మనసులతో
యేకమైన
వాదన.
కాని
conscience
మాత్రము
‘నీవు
రాత్రి
పోయావు.
ఫలాన
వస్తువు
తెచ్చి
ఫలానా
చోట
పెట్టావు’,
అని
truth
చెపుతుంది.
కనుకనే
యీ
conscience
నుండి
మనము
discriminate
చేయాలి.
అప్పుడు
self
satisfaction
బయలుదేరుతుంది.
Self
satisfaction
చాల
అవసరము.
ఈ
self
satisfaction
ఎప్పుడు
వస్తుంది?
self
confidence
develop
చేసుకుంటే
వస్తుంది.
ఈ
self
satisfaction
వచ్చినప్పుడే
self
sacrifice
చేస్తాడు.
6
▾
Meaning
Keep
ఎప్పుడు
self
sacrifice
చేస్తావో
అప్పుడే
self
realisation
వస్తుంది.
కనుక,
మొట్టమొదట
ప్రతి
వ్యక్తికి
self
confidence
అత్యవసరం.
ఈ
confidence
తో
మనము
discriminate
చెయ్యాలి.
కనుక
dedication,
devotion,
discipline,discrimination
యివి
అన్నీ
ఒకదానికొకటి
సన్నిహిత
సంబంధము
కల్గి
వుంటాయి.
ఇవి
అన్నీకూడా
అన్యోన్యరీతిలో
మెలగాలి.
అవినాభావ
సంబంధముగా
వుండాలి.
అప్పుడే
మానవుని
ఆలోచనా
విధానములో
ఒక
విధమైన
దృఢత్వము
బయలుదేరుతుంది.
అప్పుడది
determination
అంటారు.
Determination
అంటే
పట్టుదల.
యీ
పట్టుదల
అన్నింటికి
పనికిరాదు.
ఏదంటే
అది
పట్టుదలతో
మనం
చేయకూడదు.
discrimination
చేసి
good
అని
తెలిసాక
దానిపైన
పట్టుపట్టాలి.
ఇది
తప్పు
అని
discriminate
చేశాక
ఆ
తప్పు
చేయాలని
పట్టుపడితే
చెడిపోతారు.
కనుక,
మంచి
అని
నీ
హృదయానికి
తెలిశాక
దానిపై
పట్టుపట్టి
సాధించడానికి
పూనుకో!
ఈ
విధంగా
ప్రతిక్రియకు
యీ
ఐదు
అత్యవసరమైనవి.
ఇవన్నీ
చేరి
మానవత్వాన్ని
సార్థకము
చేస్తున్నాయి.
మానవత్వాన్ని
దివ్యత్వంగా
మార్చటానికి
యీ
ఐదు
అత్యవసరము.
మనం
యేపని
చేసినా
మనకు
తృప్తికరమేకాక
మిగతావారికికూడా
తృప్తికరంగా
వుండేదిగా
వుండాలి.
కొన్ని
ఉదాహరణములు.
డాక్టర్సు
వున్నారు.
ఈ
డాక్టర్సు
అనేకమంది
పేషంట్లను
చూస్తారు.
దేనికోసం?
యిది
సేవకాదు,
వారి
వృత్తి.
సేవ
అనగా
ఏమి?
బాధపడేవారిని
ఆ
బాధలనుండి
విముక్తి
గావించటం.
కానీ
ఆ
రిలీఫ్
మనము
యిస్తున్నామా
లేదా,
అదే
discrimination
చేయాలి.
ఒక
చిన్న
ఉదాహరణము.
ఒక
పేషంటును
నీవు
చక్కగా
పరీక్ష
చేశావు.
B.P.
చూశావు
E.C.G.
చూశావు
అన్నీ
చూశావు.
నీకు
తృప్తి
అయినది.
అన్నీ
చూశాక
అయ్యా!
నీయొక్క
heart
enlarge
అయిందంటే,
వానికి
దుఃఖము
వస్తుంది.
అప్పుడు
నీవు
సేవ
చేసినవాడివి
అవుతావా?
బాధపెట్టినవాడివి
అవుతావా?
డాక్టరుగా
వున్నవారు
ఆ
విధముగా
చెప్పకూడదు,
పేషెంటుకి.
దానిని
నివారణగావించే
ఉపాయములు
బోధించు.
‘అయ్యా!
నీకు
బ్లడ్‌ప్రెషరు
ఎక్కువ
కావటంవలన
యిలావుంది.
బ్లడ్‌ప్రెషరు
తగ్గించుకోవటానికి
ప్రయత్నించాలి.
వర్రీస్ని
తగ్గించుకో’మని
ఉపదేశించి
దానికి
తగిన
మందులిస్తే
కొంతవరకు
తృప్తి
అవుతుంది.
అంతే
గాని,
నీవు
అతని
హార్టు
ఎన్లార్జి
అయిందని
చెప్పి
ఎన్ని
ఔషధములిచ్చినా
వాని
మనోవ్యాధి
తగ్గదు.
7
▾
Meaning
Keep
పేషెంటుకి
మనం
యీ
విధముగా
యేనాడు
చెప్పకూడదు.
వానికి
ధైర్యాన్ని
బోధించాలి.
అదీ
ఒక
విధమైన
ఔషధమే.’
ఆ
విధంగా
పేషంటును
బాగుపరచే
దానిలో
మనం
యెంతైన
ప్రయత్నించాలి.
పవిత్రమైన
భావములు,
ప్రవర్తనలు
అభివృద్ధిపరచడానికి
అధ్యాత్మికమే
సరియైన
మార్గము
ఈనాడు
మానవునికి
సైకలాజికల్‌గా
ఎన్నో
రోగాలు
వస్తున్నాయి.
మానవునికి
వచ్చే
రోగములలో
అధిక
భాగము
మానసిక
విశ్రాంతి
లేకపోవటంవల్ల
వచ్చినవే!
90%
మనసుకు
రెస్టు
లేదు.
ఇది
meditation
పైన
books
చదువుతే
వచ్చేది
కాదు.
లేక
గురువు
బోధిస్తే
వచ్చేదికాదు.
మెడిటేషన్
అనేది
బయటనుండి
కూరేది
కాదు.
లోపల
వుండేటువంటిది.
ఒక
విధమైన
ఆత్మవిశ్వాసము
కలిగినప్పుడే
మెడిటేషన్
ఈజీగా
మనకు
కుదిరిపోతుంది.
కనుక
మనము
విశ్వాసాన్ని
పెంచుకోవాలి.
ఆ
విశ్వాసములో
ఎవరిని
మనము
బాధించకుండా
చూసుకోవాలి.
ఈ
వచ్చిన
బాధను
నివారణ
గావించే
ఉపాయములు
బోధించాలి.
చాలామంది
డాక్టర్సుకూడా
యిక్కడ
సమావేశమయ్యారు.
కనుక,
వారుకూడా
అర్థం
చేసుకునేటట్లు
బోధించాలి.
డాక్టర్లు
ముఖ్యముగా
పేషెంట్లదగ్గర
నవ్వు
ముఖముతో
మాట్లాడాలి.
నవ్వుతూ
మాట్లాడి
వారికి
ధైర్యాన్ని
యివ్వాలి.
Don't
worry
అని
చెప్పాలి
రోగులకు.
What
is
the
shape
of
worry!
It
is
a
mentally
created
fear.
Don't
worry
అని
రోగులకు
ఎంకరేజిమెంటు
ధైర్యము
యివ్వాలి.
ఒక
పేషెంటు
డాక్టరు
దగ్గరకు
చాలా
బాధగా
వచ్చాడనుకుందాము.
పల్సు
చూశాడు
డాక్టరు.
మామూలుగా
డాక్టరు,
నవ్వుతూ
పల్సు
చూస్తుంటే
వాడు
డాక్టరు
ముఖం
చూస్తాడు.
రోగి
నీ
ముఖం
వాచ్
చేస్తుంటే,
నీ
ముఖం
వానిని
భయపెట్టేటట్టు
వుంటే
వాడక్కడే
collapse
అయిపోతాడు.
పూర్వము
ఆరోగ్యముగా
వున్నవాడుకూడా
ఈ
డాక్టరుయొక్క
behaviour
వల్ల
అనారోగ్యములో
పడిపోవచ్చు.
కనుకనే
పవిత్రమైన
భావములు,
పవిత్రమైన
ప్రవర్తనలు,
పవిత్రమైన
నడతలు,
పవిత్రమైన
వూహలు
అభివృద్ధిపరచటానికి
ఒక్క
ఆధ్యాత్మికమే
సరియైన
మార్గము.
ఆధ్యాత్మికమనేది
ప్రత్యేకముగా
ఒక
మతము
కాదు,
అందరియందు
ఉండే
దివ్యశక్తి
Spirituality
అనేది
ఒక
religion
కాదు,
spirituality
అనేది
అందరియందు
వుండే
సమత్వమైన
దివ్యశక్తి.
8
▾
Meaning
Keep
కనుక,
దీనికి
భగవత్ప్రీతి
కావాలి
అన్నారు.
దైవప్రీతి,
పాపభీతి
అన్నాము.
ఐతే
యీ
దైవము
ఎక్కడ
వున్నాడని
మనము
భావించాలి?
‘ఏకోవసి
సర్వభూతాంతరాత్మ.’
అందరియందువున్న
దైవాన్ని
మనము
ప్రేమించాలి.
కనుక
దీనియొక్క
అంతరార్థము
యేమంటే
ప్రతి
మానవుని
మనం
ప్రేమించాలి.
ప్రతి
జీవిని
మనము
ప్రేమించాలి.
ఎవరిని
మనం
ద్వేషించినా
దైవమును
ద్వేషించిన
వారమవుతాము.
ఒక్కడే
పరమాత్మ
అందరియందు
వుండేది.
దైవప్రీతి
అనగా
దైవానికి
ప్రత్యేకమైన
ప్రీతికాదు.
ప్రతి
జీవిని
ప్రీతిగా
చూసుకోటమే
దైవప్రీతి.
ఆ
ప్రేమను
మనము
అభివృద్ధిపరచుకుంటే
పాపభీతి
సహజంగా
యేర్పడుతుంది.
నేను
వేరు,
అతను
వేరు
అనే
భిన్నభావము
యేర్పడినపుడు
ద్వేషము
ఏర్పడుతుంది.
అప్పుడు
పాపమనేదికూడా
ప్రవేశిస్తుంది.
సర్వులను
ప్రేమించేటప్పటికి
పాపమనే
పదమునకు
అవకాశమే
లేదు.
కనుక
యీ
పాపమనేది
చేయకుండా
వుండటానికి
సర్వులను
ప్రేమించటానికి
ప్రయత్నించాలి.
ఒక
వ్యక్తి
కొన్ని
దోషములు
చేయవచ్చు.
చేయరాని
పనులు
చేయవచ్చు.
అయితే,
దేహము
ఈ
విధమైన
ప్రవర్తనలో
వున్నా,
దేహి
ఎప్పుడూ
నిర్మలంగానే
వుంటున్నాడు.
నీ
ఉపాధిని
మాత్రమే
నీవు
ఆధారము
చేసుకోవద్దు.
అందరియందు
వున్న
దివ్యత్వాన్ని
నీవు
దృష్టిలో
పెట్టుకో!
ఈ
దైవప్రీతి
అభివృద్ధిపరచుకుంటే
పాపభీతి
Shadow
వలె
వెంటాడుతుంది.
మనయొక్క
నడతలు,
యెక్కడకు
వెళ్లినా
పవిత్రమైన
నడతలుగా
వుంటాయి.
అలాంటివారిని
సమాజముకూడా
గౌరవిస్తుంది.
మన
నడతలచేతనే
మనము
కీర్తిని
సంపాయించగలము.
సమాజంలో
ఉంటున్నప్పుడు
మన
స్వతంత్రముతోబాటు
ఎదుటివారి
స్వాతంత్ర్యమును
కూడా
గౌరవించాలి
మానవునికి
రెండు
విధములైన
Character
వుండాలి.
Individual
Character,
మరియు
National
Character.
National
Character
అంటే
యేమిటి?
మనదేశముయొక్క
పవిత్రత.
‘నాది
పవిత్రమైన
భారతదేశము.
నా
పవిత్రమైన
భారతదేశము
కర్మయోగముతో
కూడినది.
ఇది
త్యాగయోగముతో
కూడినది.
ఇది
దైవముతో
కూడినది’,
ఇలాంటి
విశ్వాసమును
మనము
డెవలప్
చేసుకుంటూ
పోవాలి.
దేశమునకు
ఏ
విధమైన
చెడుపేరు
రాకుండా
చూచుకోవాలి.
దానికి
తగినట్లుగా
వ్యక్తిగతమైన
పవిత్రతను
పెంచుకోవాలి.
ఈ
Individual
Character
ఒక
విధమైన
స్వాతంత్ర్యముతో
కూడి
వుంటుంది.
9
▾
Meaning
Keep
దీనినే
Individual
freedom
అన్నారు.
National
Character
అనేది
fundamental
law
అన్నారు.
ఈ
fundamental
law
నీకు,
నాకు,
వానికి
అందరికి
సమానమే!
Individual
freedom
లోపల
నీవు
ఏ
పేరు,
యేమైన
పెట్టుకోవచ్చు.
ఏ
కర్మలైన
ఆచరించుకోవచ్చు.
కానీ
fundamental
law
అందరికి
సంబంధించినది.
నీవు
నీ
యింటిలో
నీ
ఆరాధ్య
దైవమును
ఆరాధించుకో!
నీ
సిద్ధాంతములు,
నీ
భావములు,
నీ
discipline
నీవు
చక్కగా
ఆచరించుకో!
కానీ,
సమాజములో
వుండినప్పుడు
సమాజముయొక్క
క్షేమమును,
సంతృప్తిని
దృష్టిలో
పెట్టుకోవాలి.
Duty
అంటే
యేమిటనుకున్నారు?
ఏదో
ఆఫీసుకు
పోవటము,
తన
పని
తాను
చేసుకోటం
యిదికాదు,
Duty
యొక్క
లక్షణము.
మన
స్వతంత్రము
మనకు
యెంత
ప్రధానమో,
ఎదుటివారి
స్వతంత్రము
వారికికూడా
అంత
ప్రధానమే!
అందువలన
వారి
స్వతంత్రమునకు
అడ్డుతగిలే
స్వాతంత్ర్యము
మనము
అనుభవించరాదు.
అదీ
నిజమైన
స్వాతంత్ర్యము.
దీనికి
చిన్న
ఉదాహరణము.
నీకు
కరాటే
ఆడుకోవాలని,
కసరత్తు
చేయాలని
ఆశ
పుట్టింది.
నీ
యింటిలో
నీ
యిష్టము
వచ్చినట్లు
కరాటే
ఆడవచ్చు.
కానీ,
పబ్లిక్
రోడ్డుమీద
నీవు
కరాటె
మొదలుపెడితే
నిన్ను
పోలీసులు
తీసుకుపోతారు.
కరాటే
ఆడుకోటానికి
నీకు
యెంత
స్వాతంత్ర్యము
వుందో
నీ
కరాటేనుండి
తప్పించుకోటానికి
ఎదుటివానికికూడా
అంతే
స్వాతంత్ర్యము
వుంది.
నీవు
ఎదుటవాని
స్వాతంత్ర్యమునకు
భంగము
కలిగించావు.
కనుక,
పోలీసులు
అరెస్టు
చేశారు.
ఆధ్యాత్మికములోకూడను
మన
freedom
ను
మనము
అనుసరించినా
యితరుల
freedom
కు
మనము
అడ్డు
తగలకుండా
వుండాలి.
ఈ
Spiritual
freedom
లోపల
ఎవరికి
free
వుండకూడదు.
ఎందుకంటే,
వారివారి
స్వాతంత్ర్యము
వారికి
వుండాలి.
ఈ
ప్రపంచములో
ప్రతి
మానవునికి
ఒక
విధమైన
స్వాతంత్ర్యము,
పరివర్తన
వుంటుండాది.
యీ
ఆధ్యాత్మిక
విషయములోపల
ఎవరికి
వారికి
స్వాతంత్ర్యము
వుంది.
సత్యసాయి
సంస్థలలోని
సభ్యులందరూ
ఎవరి
బాధ్యతలు
వారు
నిర్వహించే
workers
యే!
ఐతే
మనసంస్థ
యొక్క
నిబంధనలు
అందరు
సమానముగానే
ఆచరించాలి.
సంస్థలో
ఇప్పుడు
అందరూ
active
workers
అని
పెట్టుకున్నాము.
ఈ
workers
అని
ఎందుకు
పెట్టుకున్నాము?
దీనికి
కారణం
ఒకడు
office
bearer
అని,
యింకొకరు
worker
అని
వుంటే
యీ
office
bearerకు
కొంచెం
అహంకారము
రావచ్చు.
10
▾
Meaning
Keep
అందువలన
యిక్కడ
అందరూ
workers!.
ఐతే
కొన్ని
నిబంధనలు
అమలుజరిపేవారు
లేకపోతే
మన
వర్కు
జరగదు.
ఎవరెవరి
స్థానములకు
తగిన
work
వారు
చెయ్యాలి.
అందరూ
సేవకులే!
సమానమని
కాదు
యిక్కడ.
దీనికి
చిన్న
వుదాహరణము.
ఒక
డాక్టరు
వున్నాడు.
నర్సు
వుంది,
ఒక
కాంపౌండరుకూడా
వున్నాడు.
ఈ
నర్సు,
కాంపౌండరు,
డాక్టరు
ముగ్గురు
వర్కర్సే!
ఐతే,
డాక్టరు
కత్తి
తీసుకొని
పొట్టకోస్తాడు.
నర్సు
రోగికి
ఏ
సమయానికి
యేదేది
అందించాలో
అవి
అందిస్తుంది.
కాంపౌండరు
యేమి
చేస్తాడు.
ఆ
క్లీనింగు
అవీ
చేస్తూ
తన
పని
తాను
చేసుకుంటాడు.
ముగ్గురు
చేసేది
పనే!
ఐతే,
అందరూ
వర్కర్సేనని
నర్సు
పోయి
పొట్ట
కోయటానికి
ప్రయత్నము
చేస్తే
పేషెంటు
బ్రతకడు.
అదేరీతిగా
State
President
వున్నాడు.
District
Convenor
వుంటున్నాడు.
State
Convenor
వుంటున్నాడు.
వీరందరూ
వర్కర్సే!
కానీ,
వారివారి
స్థానములలోపల
వారు
యే
విధమైన
ఆర్డర్సు
వేయాలో
అవి
మాత్రమే
వారు
చేయాలి.
ఒక
లక్ష్యమును
పెట్టుకొని
ఎవరి
పనులు
వారు
చెయ్యాలి.
మన
పని
మనము
చెయ్యాలి.
ఏ
పని
చేయించాలో
ఆ
పనిలో
స్వయముగా
తాను
దగ్గర
వుండి
వారితో
చేయించటము
అది
నీ
డ్యూటినే.
State
President
వుంటున్నాడు.
తాను
State
President
ను
కదా
అని
వూరికే
ఆర్డర్సు
వేసి
యింట్లో
కూర్చోటంకాదు.
ఆయన
సూపర్వైజ్
చేయాలి.
అదే
ఆయన
duty,
తాను
నడుము
వంచి
సేవాదళములో
పనిచేయనక్కరలేదు.
పని
చేయించాలి.
అది
duty,
ఈ
responsibility
తనపైన
వుంటున్నది.
ఆ
విధముగా
అందరూ
వర్కర్సే!
ఇప్పుడు
చూడండి.
నేనూ
ఒక
వర్కరే!
తెల్లవారి
ఏడుగంటలకు
వస్తాను.
అంతా
సర్వే
చేస్తాను.
అది
నావర్కు.
నేను
వర్కు
చేస్తూనే
వుంటున్నాను!
మీ
వర్కు
మీరు
చెయ్యాలి.
ఇదే
ideal
work.
అందరూ
చేరి
ఒకే
వర్కు
చేయాలని
కాదు,
వారి
వారి
స్థాయికి
తగిన
వర్కు
వారు
చెయ్యాలి.
అట్లు
కాకుండా
సాయిబాబా
అందరు
వర్కర్సు
అని
చెప్పారని
ఎవరో
సేవాదళము
‘మీరు
వంగి
పనిచేయండి’,
అని
అనటానికి
వీలులేదు.
అది
మంచిది
కాదు.
మనము
యే
వ్యక్తికి
ఎప్పుడెప్పుడు
ఎక్కడెక్కడ
ఏ
respect
యివ్వాలో
ఆ
respect
ను
వారికి
యిస్తూ
వుండాలి.
అది
మన
డ్యూటీ.
ఒకరి
కొకరు
చక్కగా
respect
యిచ్చుకుంటూ
పోవాలి.
ఎందుకంటే
ఆ
respect
అందరియందు
వున్న
దైవభావమే!
State
President
సేవాదళమునకు
respect
యివ్వాలి.
11
▾
Meaning
Keep
సేవాదళ్
State
President
కు
respect
యివ్వాలి.
ఈ
respect
అనేది
one
way
traffic
కాదు.
ఇచ్చి
పుచ్చుకోవాలి.
ఈనాడు
సాయీ
సంస్థలు,
సాయి
భక్తులసంఖ్య
అధికము
కావటంచేత
కొన్ని
విధముల
డిసిప్లినులు
ఖచ్చితముగా
అమలు
చేయవలసి
వచ్చింది.
నిజానికి
సాయికి
ఆర్గనైజేషన్‌తో
ఎట్టి
సంబంధము
లేదు.
ఈ
సాయి
ఆర్గనైజేషన్
మీకు
సంబంధమే!
మీరు
ఆదేశము
యివ్వమని,
గైడెన్సు
యివ్వమని
కోరటంచేత
మీకు
గైడెన్సు
యిస్తున్నామేగాని
లేకపోతే
ఆర్గనైజేషన్‌కు,
మాకు
సంబంధము
లేదు.
సంస్థను
మీ
నిమిత్తమై
మీరు
ఏర్పాటుచేసుకున్నారు.
మీరు
నియమించుకున్న
నియమాల్ని
మీరు
చక్కగా
పాటిస్తూరావాలి.
ఈనాడు
దేశము
చాలా
అల్లకల్లోల
పరిస్థితులలో
వుంది.
కనుక
యీ
discipline
అనే
పవిత్రమైన
భావమును
ప్రపంచములో
మనము
అందరికి
పంచాలి.
ఈనాడు
కేవలము
బోధించి
ప్రయోజనము
లేదు,
గ్రంథములను
ప్రింటుకొట్టి
పంచి
ప్రయోజనము
లేదు,
ఆచరించి
చూపించాలి.
అదే
ఆధునిక
యుగమునందు
సరియైన
విధానము.
Modern
age
లోపల
ప్రతి
ఒక్కరు
ప్రతి
ఒక్కటి
గమనిస్తూవుంటారు.
కనుక,
మొట్టమొదట
మనము
చేయవలసినది
see
no
evil,
do
no
evil,
do
what
is
good,
talk
no
evil,
see
what
is
good;
talk
what
is
good;
that
is
the
way
to
God.
ఈ
రకమైన
జీవనమునకు
మనము
సంసిద్ధులు
కావాలి.
మనము
మంచినే
చూడాలి,
మంచిలో
ప్రవేశించాలి,
ఎప్పుడూ
మంచినే
ప్రపంచానికి
పంచాలి.
సాయి
సంస్థలో
మీరెంత
సిన్సియర్‌గా
పనిచేస్తారో
అంత
ఫలితము
మీకు
వస్తుంది
యింకొకటి
మీరు
చక్కగా
గుర్తించాలి.
ఈ
సాయి
ఆర్గనైజేషన్సు
సాయికి
సంబంధించినవని
మీరు
భావించరాదు.
సాయి
ఆర్గనైజేషన్
మీ
స్వంతముగా
భావించాలి.
ఈ
సాయి
ఆర్గనైజేషన్‌లో
నేను
మెంబరు,
నేను
ప్రెసిడెంటు,
యీ
రకమైన
హెచ్చుతగ్గు
భావములు
పెట్టుకోకూడదు.
నా
స్వంత
సంస్థ
అనే
ఫీలింగుతో
మీరు
యీ
సంస్థలో
పని
చెయ్యాలి.
నీవు
ఒక
హాస్పటలులో
డాక్టరుగా
వుంటావు.
అంత
మాత్రమే
నా
పని
అని
పెట్టుకోకూడదు.
సాయిసంస్థలు
యీ
జన్మకుమాత్రమే
కొంచెం
సంబంధముగా
వుండవచ్చు.
కానీ
ఆర్గనైజేషన్‌లో
నీవు
చేసిన
పుణ్యసంబంధమైన
ఫలితము
ఎన్ని
జన్మలకో
మీవెంట
రావచ్చును.
ఈ
పుణ్యమనేది
కేవలము
భగవంతుని
బ్యాంకులో
డిపాజిట్
చేసుకున్నది.
బ్యాంకులో
డిపాజిట్
డ్రా
చేస్తే
అయిపోతుంది.
కాని
యీ
పుణ్యధనమనేదానిని
భగవంతుని
బ్యాంకులో
ప్రోగుచేసుకున్నవారికి
జన్మజన్మలకు
అవదు.
12
▾
Meaning
Keep
కనుక,
యీ
సేవయే
మీకు
ప్రధానము.
నీవు
యీ
సంస్థలో
వుండినా,
వుండకపోయినా,
ఎక్కడ
వున్నా
దీనికి,
నీకు
సన్నిహిత
సంబంధ
బాంధవ్యము
వున్నట్లుగా
భావించాలి.
ఇది
నీ
జన్మహక్కు.
కనుక,
‘ఈ
సంస్థ
నాది’
అనే
భావముతో
మీరిందులో
ప్రవేశించాలి.
నీకు
కొంత
నష్టము
కల్గుతే
నీకెంత
బాధ
కలుగుతుందో
యీ
సంస్థలో
యేదైన
కొంతదారి
తప్పితే
అదికూడా
నీ
కంత
బాధగా
వుండాలి.
చాలామంది
ఆ
విధముగా
భావించటం
లేదు.
ఇక
మున్ముందైనా
యీ
శ్రద్ధాభక్తులను
అభివృద్ధిపరచి
యిందులో
ప్రవేశించి
దీనిని
జగత్తుకే
ఒక
ఆదర్శవంతమైనదిగా
మీరు
నిరూపించాలి.
మీరెంత
సిన్సియర్‌గా
పనిచేస్తారో
అంత
ఫలితము
మీకు
వస్తుంది.
ప్రేమ
ఉన్నచోట
ద్వైతభావము
ఉండదు
ఒకనొక
సమయములో
తులసీదాస్
చెప్పాడు
‘బేటా!
కామ్
కర్నేసే
మేవా
మిల్తాహై!’
అని.
‘మేవా’,
అంటే
ఒక
స్వీటు
పేరు.
దైవ
సేవ
చేస్తే
యేమి
స్వీటు
వస్తుంది?
దైవప్రేమ
అనే
స్వీటు
మనకు
చిక్కుతుంది.
కనుక,
‘నేను
ఆ
ప్రేమ
అనే
మిఠాయి
కోసము
సేవచేస్తున్నాను,’
అన్నాడు.
కనుక,
ఆ
ప్రేమ
అనే
sweet
అందుకోటానికి
ప్రతి
ఒక్కరూ
సిద్ధముగా
వుండాలి.
ఇలాంటి
ప్రేమ
నిమిత్తమై
మనము
పరమాత్మను
ప్రేమించాలి.
పదార్ధము
కోసము
కాదు,
పరమాత్మను
ప్రేమించవలసినది.
ప్రేమకోసము
ప్రేమించాలి.
ప్రేమకు
మూడు
రకములైన
ఫలితములుంటున్నాయి.
ప్రేమకు
భయము
లేదు.
ప్రేమ
యిచ్చుకునేదే
గాని
పుచ్చుకోటానికి
సిద్ధముగా
వుండదు.
ప్రేమకు
ప్రేమయే
ఫలితము,
మరొకటి
ఫలితము
లేదు.
కనుక,
ప్రేమ
యింత
నిస్వార్ధమైనది.
ప్రేమ
వున్నచోట
ద్వేషము
వుండదు.
ప్రేమ
వున్నచోట
difference
వుండదు.
ద్వైతభావమే
వుండదు.
ఎక్కడ
ద్వైతభావము
వుంటుందో,
యిదినాది
యిది
సాయి
ఆర్గనైజేషన్ది
అని
భేదభావము
వస్తుందో,
అక్కడ
ప్రేమ
లేదని
అర్థము.
ప్రేమతో
ఉన్నచోటనే
మనకు
శాంతి
లభిస్తుంది.
ఇక్కడ
శాంతికి,
మీకు
మధ్యలో
అడ్డము
కోరిక
వుంటున్నాది.
కోరిక
పోయేంతవరకు
శాంతి
లభించదు.
చూడండి
I
want
peace,
అంటారు.
ఈ
వాక్యములో
peace
యిక్కడ
వుంది.
I
యిక్కడ
వుంది.
మధ్యలో
want
అనే
desire
వచ్చి
చేరింది.
కనుక
నీవు
peace
ను
చేరాలంటే
మధ్యలో
కోరిక
అడ్డము
వుంది.
ఈ
desire
ను
తీసివేస్తే
నీవు,
peace
ఏకమై
పోతావు.
13
▾
Meaning
Keep
I
and
you
are
one.
ఆ
desire
లో
difference
వుండకూడదు.
Spiritual
desire
మరియు
worldly
desire
అని
వేరు
చేయవద్దు.
మన
శాంతి
మన
ప్రవర్తనపైన
ఆధారపడి
ఉంటున్నది
ఈ
ప్రేమను
పెంచుకోటానికి
మనము
ప్రయత్నించాలి.
ఈ
ప్రేమయే
నిజమైన
భక్తి.
కనుక,
దైవప్రేమను
పెంచాలి.
చిన్నపిల్లల
హృదయాలలో
యీ
ప్రేమ
బీజము
నాటాలి.
పెద్దలయొక్క
అనుభూతులను
వారికి
బోధించాలి.
Great
saints
యొక్క
జీవిత
చరిత్రలు,
నీతి
కధలు
వారికి
చెప్పాలి.
సత్యవాక్కును
వారికి
బోధించాలి.
కనుక,
బాలవికాస్కూడను
అభివృద్ధి
గాంచాలి.
ఈ
బాలవికాస్
క్రమక్రమేణా
పెరుగుతే
భారతదేశము
సర్వదేశములకు
ఆదర్శముగా
వుంటుంది.
దీనిని
మనము
ఈనాడు
తయారుచెయ్యాలి.
సేవ,
సేవ,
సేవకత్వానికి
మించిన
నాయకత్వము
మరొకటి
లేదు.
Love
all
serve
all
ఇదే
మనకు
కావలసినది.
అందరిని
ప్రేమించాలి.
అందరిని
సేవించాలి.
ఈ
సేవించటము,
ప్రేమించటముకంటె
జీవితమునకు
మరొక
సాక్షాత్కార
మార్గము
లేదు.
ఏది
religion
అంటే
realisation
is
religion.
అదే
మనము
పొందాలి.
మన
peace
భగవంతుడు
యిచ్చిన
gift
కాదు.
It
depends
on
what
you
talk
and
produce
in
action.
నీ
thoughts
పైన
నీ
action
పైనా
ఆధారపడివుంటుంది.
నీవు
ప్రేమగా,
మంచి
thoughts
develop
చేస్తే
peace
అక్కడే
వుంది.
వేరు
విధముగా
think
చేస్తివా
పూర్తిగా
అశాంతి
పొందుతావు.
కనుక
మనశాంతి
మన
ప్రవర్తనపైన
ఆధారపడి
వుంటున్నాది.
కనుక
మనము
peaceful
గా
వుండాలంటే
మన
thoughts,
action,
peaceful
గా
వుండాలి.
మీరందరు
సంస్థ
కార్యక్రమాలను
నెరవేరుస్తే
భేదాభిప్రాయాలకు
తావువుండదు
మరొకటి,
State
Presidents
చాల
ప్రధానముగా
చూసుకోవలసినది.
యిందులాల్
షా
బాధ్యత
తీసుకొని
శ్రమపడి
ఎంతో
చేశాడు.
ఈనాడు
సత్యసాయి
సంస్థ
యింత
పెద్దవృక్షముగా
వుంటుందంటే
దానికి
కారణము
వారి
పోషణే!
అయితే,
సంస్థాపరంగా
యెన్నో
వడిదుడుకులు
వస్తూనే
ఉన్నాయి,
యింత
ప్రపంచములో.
దీనికి
State
Presidents
కూడా
సరైన
Co-operation
యివ్వటంలేదు.
ప్రతి
తూరి
నేను
చూస్తున్నాను.
ప్రతి
letter
నేను
చూస్తున్నాను.
14
▾
Meaning
Keep
ఇందూలాల్షా
స్టేటు
ప్రెసిడెంట్సుకి
అనేక
ఉత్తరాలు
రాస్తూ
వుండేవారు.
ఫలాన
దీనివలన
యేమైన
objection
వుందా,
అనానుకూలములు
వుంటుండాదా,
మీరు
తెలుపవలసినదని
రాసేవారు.
కానీ
యీ
letter
కు
wrong
reply
చేసేవారు.
రాష్ట్రముల
అధ్యక్షులు
అంతా
బాగుందని
రాసినది
ఒక్కటి,
చెప్పేది
మరొకటి.
ఈ
విధముగా
State
Presidents
యిందులాల్షా
మైండ్
చెడగొట్టారు.
నేనే
ఎన్నో
letters
చూచాను.
ఈ
Human
values
వల్ల
బాలవికాస్‌కు,
భజనకు
యేమైనా
యిబ్బంది
కలుగుతుందా?
మీ
అభిప్రాయము
తెలుపవలసినదని
ఆయన
ఒకప్పుడు
అడిగారు.
ప్రతి
స్టేట్
ప్రెసిడెంట్
‘ఏమీ
అభ్యంతరము
లేదు,
బాగా
వుంది’,
అని
గంగిరెద్దు
మాదిరి
తలతిప్పారు.
ఆ
letters
నేనుకూడా
చూచాను.
ఈ
విధముగా
State
Presidents
wrong
reports
యివ్వకూడదు.
సత్యము
యేమిటో
వారు
తెలుసుకోవచ్చు,
తప్పు
లేదు.
సత్యమును
మూసిపెట్టేది,
అసత్యమును
తెలుపుకుంటూ
రావటం,
యీ
స్టేటు
ప్రెసిడెంట్సు
వాళ్ళు
తమ
తమ
సాధక
బాధకాలను
explain
చేయవచ్చు,
‘యిలావుంది
అలా
వుంది’,
అని
చెప్పే
అధికారం
వాళ్ళకు
వుంది.
కానీ
ఆ
విధంగా
explain
లేదు,
inspire
లేదు,
complaint
మాత్రం
వుంటున్నది.
యిలాంటి
complaint
యింక
మున్ముందు
రాకూడదు.
ఈ
వృక్షాన్ని
మీరు
కాపాడుకుంటూ
వెళ్ళండి.
మీలో
మీరు
సంప్రదించుకోండి.
ఒక్కొక్కరి
అభిప్రాయం
ఒక్కొక్కలా
వుంటుంది.
కనుక,
మీరందరు
చేరి
ఒక
నిర్ణయానికి
రావాలి.
ఏనాటికైనా
అందరూ
దీనిలో
ప్రవేశించి
కోపరేటివ్‌గా
పనిచేయవలసిందే!
యిప్పుడుకూడా
ఈ
విషయాన్ని
గురించి
యిందులాల్
షా
చాలా
తెలివితేటలతో,
అనుభవముతో
యెన్నో
ప్లానులు
వేశాడు.
అతని
అభిప్రాయాలు
అతని
ఆదేశాలు
మీరు
తు.చ.
తప్పక
పాటించవలసివుంటుంది.
మున్ముందు
సంస్థలన్నీ
సరియైన
స్థితిలోకి
రావాలంటే
అందరం
కలసిమెలసి
పనిచేయాలి.
ఇంత
పెద్ద
ఆర్గనైజేషన్
వున్నప్పుడు
మనిషికి,
మనిషికి
మధ్య
అభిప్రాయ
భేదాలు,
యేదో
ఒక
సమయంలో
చిరాకు
రాక
తప్పదు.
నేనూ
ఒకోతూరి
బుస్సు
మంటుంటాను.
ఆ
రకంగా
చేయకపోతే
పని
జరగదు.
మీరంతా
మంచి
పనులు
చేస్తుంటే
కోపానికి
అవకాశమే
వుండదు.
కాని,
మీరు
చేయటం
లేదు.
కనుకనే
కోపానికి
అవకాశము
యిస్తున్నారు.
మీ
పనులు
మీరు
సక్రమంగా
చేస్తే
తప్పక
అన్నీ
smooth
గా
sweet
గా
ప్రశాంతముగా
జరుగుతాయి.
యిది
ఒక్కరి
చేతిలో
జరిగేది
కాదు.
ఒక
పుష్పమే
హారము
కాదు,
అనేక
పుష్పాలు
చేరాలి.
15
▾
Meaning
Keep
కొన్ని
కొన్ని
విషయాలలో
కొంత
అలక్ష్యము
చేస్తూ
వుంటారు.
ఒక్కొక్క
State
కు
ఒక్కొక్క
Trust
కూడా
పెట్టాము.
ఇది
నా
కోసం
కాదు,
అంతా
మీదే!
ఏ
పని
చేసినా
మీ
కోసమే!
ఆ
భావము
మీలో
రావాలి.
‘ఇది
మాది,
స్వామిది
కాదు.
స్వామి
మావాడు.
మావాడైనప్పుడు
యిదంతా
మాదే’
అనే
భావము
మీలో
అభివృద్ధి
కావాలి.
మిమ్మల్ని
నమ్ముకొని
దీనిలో
మన
శక్తియుక్తులన్నీ
పెట్టినప్పుడు
మీరు
దీనికి
తగినట్లుగా
చేయకపోతే
యెంతనో
అపకారము
జరిగినట్లు
అవుతుంది.
చిన్న
example
మీకు
చెపుతున్నాను.
సత్యసాయి
సంస్థల
నిర్వహణ
ప్రపంచమునకు
ఆదర్శమైనరీతిలో
ఉండాలి
ఒక్కొక్క
State
లో
ఒక్కొక్క
Property
వుంటున్నాది.
నా
కోసం
కాదు,
మీ
కోసమే!
మందిరాలు
కట్టాము.
స్థలాలు
వున్నాయి.
ఇంకా
కొన్ని
వసతులున్నాయి.
ఇవన్నీ
మీ
కోసం
యేర్పరచినవి.
ఇవన్నీ
ఏ
State
లో
వున్నాయని
ఎవరికి
వారు
విచారణ
చేసుకోటంలేదు.
ఒక
example
మీకు
చెపుతున్నాను.
మద్రాసులో
సుందరమని
ఒక
బిల్డింగు
కట్టాము.
ఆ
బిల్డింగు
కట్టి
ఆరు
సంవత్సరములపైన
అయింది.
ఆ
Land
మేము
కొని
ఇరవై
సంవత్సరములైంది.
దీని
కొక
Trust
పెట్టాము.
దానికి
కన్వీనరు
వున్నాడు.
అందరు
వుంటున్నారు.
వారు
చూసుకుంటున్నారని
Central
Trust
వారు
గమ్మున
వుంటున్నారు.
నిన్నటి
దినము
మాకు
నోటీసు
వచ్చింది.
‘యిరవై
సంవత్సరములనుండి
మునిసిపల్
టాక్సు
కట్టటం
లేదని,’
చూడండి!
యీ
విధముగా
వుంటే
యిది
యెంత
అవమానకరమవుతుంది.
పోనీ,
మాకు
చెప్తే
మేమైనా
కట్టివేసేవారమే!
అదే
రీతిగా
యే
స్టేట్‌లో
వున్న
ఆస్తులను
ఆ
స్టేట్
అధికారులు
చక్కగా
చూసుకోవాలి.
దీనికి
టాక్సు
కట్టారా
లేదా
అనే
విషయాలు
చూసుకోవలసిన
బాధ్యత
వారిపైన
వుంది.
ఆ
విధముగా
వారి
బాధ్యతలు
సక్రమంగా
నెరవేర్చక
వుంటే
ట్రస్టుకు
ఉపకారము
చేసినట్లా?
అపకారము
చేసినట్లా?
వారి
చేతినుండి
ఒక్క
నయాపైస
కట్టనక్కరలేదు.
మేము
ఎవరికీ
ధనవిషయములో
యే
విధమైన
బాధ్యత
యివ్వటంలేదు.
మిగతా
సంస్థలవారు
ఎన్ని
చందాలు
వేసి
కడుతున్నారు!
మేము
చందాలకవకాశమే
యివ్వటము
లేదు.
యీ
విధముగా
వుండటంవల్ల
నాకు
నష్టమని
కాదు.
మేము
టాక్సు
కడతాము
కాని,
సత్యసాయి
ఆర్గనైజేషన్‌కు
యెంత
చెడ్డపేరు
వచ్చినట్లవుతుంది?
16
▾
Meaning
Keep
ఆర్గనైజేషన్
యెంత
స్ట్రిక్టుగా,
ఖచ్చితంగా
డిసిప్లిన్‌గా
జరుగుతున్నది,
అనేది
ప్రభుత్వానికికూడా
ఒక
ఆదర్శముగా
అందించాలి.
మన
ఆర్గనైజేషన్
చూసి
గవర్నమెంటుకూడా
ఫాలో
చెయ్యాలి.
దానినే
నేను
ఆశిస్తున్నాను.
ఎందుకంటే
గవర్నమెంటు,
తన
స్థాయిలో
వుంటుంది.
మన
స్థాయిలో
మనము
పనిచేస్తూ
పోతే
గవర్నమెంటుకూడా
మేలుకోటానికి
అవకాశము
వుంటుంది.
కనుక,
మనం
జగత్తుకు
ఒక
ఆదర్శవంతమైన
మార్గాన్ని
అందించాలి.
ఆ
బాధ్యత
తీసుకొని,
పవిత్రమైన
మార్గములో
నడపటానికి
ప్రతి
ఒక్కరూ
సిద్ధముగా
వుండాలి.
‘ఇది
నా
చేతనౌతుందో
లేదో!’
అని
మాత్రం
వెనుకంజ
వేయరాదు.
ఇది
పిరికితనము.
ముందంజనే
వేయాలి.
దైవము
ఎప్పుడూ
ప్రేమ
స్వరూపమే!
ఏదో
జరిగినవన్నీ
జరిగిపోయాయి,
పొరపాట్లు.
ముందు
యింక
యీ
పొరపాట్లు
రాకుండా
చూచుకోవాలి.
దైవము
ఎప్పుడుకూడా
ప్రేమ
స్వరూపమే!
ఏనాడు
ఆగ్రహం
లేదు.
అనుగ్రహమే!
కొన్ని
కొన్ని
సమయములలో
వారికి
తెలుపవలసిన
బాధ్యత
వుంటుంది.
కనుక,
ప్రతి
ఒక్కరు
యీ
సేవలో
జీవితమును
అంకితము
చేయాలి.
సాయి
సంస్థలవారు
మూడింటిని
ప్రధాన
లక్ష్యముగా
పెట్టుకోవాలి.
Spiritual
activity,
educational
activity,
service
activity.
ఈ
మూడింటిని
త్రినేత్ర
స్వరూపముగా
మనం
చూసుకోవాలి.
బాలవికాస్
చక్కగా
బోధించాలి.
ఈ
ఇరవై
సంవత్సరములనుండి
ఒక్క
బాలవికాస్,
మహిళా
విభాగములలో
మాత్రమే
ఒడిదుడుకులు
లేకుండా
పనులు
జరుగుతున్నాయి.
కానీ
యీ
మగవారు
చేసే
పనులలోనే
అన్నీ
అవకతవకలు
జరిగిపోతున్నాయి.
ఆడవారు
చాలా
సిన్సియర్‌గా,
డివోటెడ్గా
చేస్తున్నారు.
ఈ
విషయములోనే
కాదు,
ఈ
జగత్తులో
యిప్పుడన్ని
విషయాలలో
వారే
ముందంజ
వేస్తున్నారు.
వారు
ప్రత్యేకమైన
ఏకాగ్రత
అలవర్చుకుంటున్నారు.
పిల్లలను
పెంచే
అలవాటు
వారికుండటంవలనే
యీ
విధమైన
పవిత్రతను
అభివృద్ధి
చేయడానికి
తగిన
వుత్సాహ,
ప్రోత్సాహములు
వారికున్నాయి.
యిక
మున్ముందు
యీ
మగవారుకూడా
వారికంటె
ముందంజ
వేయటానికి
ప్రయత్నించాలి.
ఒకరికొకరు
కలసిమెలసి
యీ
సంస్థలను
దేశమంతటా
వ్యాప్తి
గావించటానికి
ప్రయత్నించాలి.
17
▾
Meaning
Keep
ఐకమత్యముతో,
ప్రేమభావముతో,
దైవతత్త్వముతో
దివ్యమైన
మార్గాన్ని
మీరు
దేశానికి
అందిస్తారని
నేను
ఆశిస్తూ
ఆశీర్వదిస్తూ
నా
ప్రసంగాన్ని
విరమిస్తున్నాను.
సృష్టిని
మార్చటం
ఎవరి
తరము
కాదు,
మన
దృష్టిని
మార్చుకోవాలి
ఒకటి
మాత్రం
మీరు
దృష్టిలో
పెట్టుకోండి.
వెలుతురులో
వస్తువులను
చూస్తే
కనుపిస్తాయికానీ
చీకటిలో
కనుపించవు.
కనుక
యీ
light
అంటే
Love,
Love
Love,
ప్రేమదృష్టితో
మీరు
చూడండి.
అన్నీ
మీకు
వివరంగా
కనిపిస్తాయి.
ఈ
selfishness
అనే
darkness
లో
చూస్తే
మీకేమీ
కనుపించవు.
సమీపములో
వున్నా
కనుపించదు.
సృష్టి
అంతయు
మన
దృష్టిలోనే
వుంది.
కనుక,
మనం
దృష్టిని
మార్చుకోవాలి.
సృష్టిని
మార్చటం
ఎవరి
తరము
కాదు.
ప్రేమదృష్టిని
పెంచుకుంటే
అంతా
ప్రేమయే!
ద్వేషదృష్టిని
పెంచుకుంటే
అంతా
ద్వేషమే!
కనుక,
మన
సంస్థలలో
ప్రతి
ఒక్కరూకూడా
ఒక
నూతనమైన
కూలింగ్
గ్లాసెస్,
అదే
ప్రేమదృష్టి
అనే
అద్దాలు
పెట్టుకోండి!
అందరూ
sisters
and
brothers
వలె
మెలగుతారు.
అందరికి
ప్రభువు
ఒక్కడే!
దైవము.
కనుకనే
brotherhood
of
man,
fatherhood
of
God
అన్నారు.
యీ
రెండింటిని
పెంచుకోండి.
డాక్టర్సు
చాలా
బాగా
సేవ
చేశారు.
సంవత్సరమునకొక
పర్యాయమైనా
వచ్చి
పల్లెలలో
వారి
బాధలనంతా
నివారణ
చేయడానికి
పూనుకోటం
చాలా
గొప్ప
త్యాగమే!
ఇక్కడ
మాత్రమేగాక
మీరు
తిరిగి
మీ
మీ
స్వగ్రామాలకు
పోయినప్పుడు
అక్కడ
weekly
once
పల్లెలలో
ప్రవేశించి
free
work
చేయటానికి
పూనుకోండి.
Medical
camps
లో
రోగులను
చూడటం
గొప్పతనం
కాదు.
పల్లెలలో
దిక్కు
లేకుండా,
ఏ
విధమైన
మందులు
లేకుండా,
అనారోగ్యముతో
జీవితమును
అంత్యము
గావించుకునేవారిని
చూడటమే
గొప్ప
త్యాగము!
ఈ
డాక్టర్సు
అంతా
ఒక
కమిటీగా
యేర్పడి
సమీపములో
వున్న
పల్లెలకు
పోయి
అక్కడకూడా
రోగులను
చూడడానికి
ప్రయత్నించండి.
ఇక్కడ
మాత్రమే
మనవారు
కారు.
దేశములో
వున్న
అందరూ
మనవారే!
ఈనాడు
గొప్ప
గొప్ప
డాక్టర్సు
అంతా
వచ్చి
వారి
కాలమును,
కర్మనూ,
కర్తవ్యమును
సద్వినియోగం
చేసుకుంటున్నారు.
నిజంగా
డాక్టర్సు
డిగ్రీ
తీసుకున్నందుకు
యీ
విధమైన
సర్వీస్
ఒక
సార్థకం.
ఎంతో
మంది
డాక్టర్సు
వున్నారు.
కాని,
వారిలో
కొంతమందికే
యీ
అవకాశం
చిక్కటం
వారి
అదృష్టం.
18
▾
Meaning
Keep
ఐతే
కొన్ని
కొన్ని
భయాలు
మాత్రం
రోగులలో
ప్రవేశ
పెట్టకుండా
చూచుకోండి.
మాటవరసకు
మీ
బ్లడ్
సర్కులేషన్
నిలచిపోయిందని
యీ
మాదిరి
చెప్పకండి.
వారికి
చెప్పకుండా
వాటి
నివారణకు
తగిన
మందు
యివ్వండి.
చాలా
సంతోషము.
మీ
డాక్టర్సు
అంతా
ఒక
ప్రక్క
కూర్చోండి.
నా
ప్రేమ
అనేది
ఒక
తట్టలో
పెట్టి,
దయ
అనేది
ఒక
గ్లాసులో
పోసి
తాగటానికి
టంబ్లర్లు,
తినటానికి
ఒక
తట్ట
మీకు
అందిస్తున్నాను.
Previous
←
The Five D's
Next
Humanness is itself the embodiment of consciousness!
→