Contents
Devotion & Sacred Story
Home
Library
Find
Shelf
Settings
←
Leave
Sathya Sai Speaks 1988 · Humanness is itself the embodiment of consciousness!
Tap a verse for its meaning
IAST
Telugu
Meaning
Continuous
Humanness is itself the embodiment of consciousness!
16 February 1988, Mahāśivarātri, Prasanthi Nilayam
1
▾
Meaning
Keep
His poems 229
Also in his talks
(1)
23 November 1988
Tormenting the Living Being and Worshipping God Is Not Right
భానుతేజముకంటె
భాసిల్లుచుండును
మంచు
తెలుపుకంటె
మించియుండు
ఆకాశమునకంటె
అతి
సూక్ష్మమైయుండు
సర్వజీవులలోన
పర్వియుండు
పరమాత్మలేనిది
పరమాణువును
లేదు
అంతట
నిండి
తానంటకుండు
పరమాత్మ
సందర్శ
భవ్య
వికాసము
లోకములు
మూడింట
నిండియుండు
బ్రహ్మమందున
నీవు
నీలోన
బ్రహ్మ
బ్రహ్మయే
నీవు
నీవె
బ్రహ్మయగును
ఇంత
కన్నను
వేరెద్ది
ఎఱుకపరతు
సాధుసద్గుణగణ్యులౌ
సభ్యులార
!
ప్రేమ
స్వరూపులారా
!
అనేక
రూపనామములతో
గోచరించుచున్న
యీ
చరాచర
ప్రపంచమంతయూ
కూడను
బ్రహ్మనుండి
అభివ్యక్తమైనది.
బ్రహ్మముచేత,
బ్రహ్మలోపలనుండి
అభివ్యక్తమైన
బ్రహ్మమే
యీ
ప్రపంచము.
ఈ
బ్రహ్మము
అభివ్యక్తమునకు
పూనుకున్నప్పుడే
సత్
చిత్
ఆనందము
ఏర్పడుతుంది.
ఎట్టి
ఆధారము
లేక
తనంతట
తాను
వుండటమే,
సత్!
వుండుటయేకాక
యెందుకున్నది
అనే
విషయము
తెలుసుకొని
స్వరూప
జ్ఞానముతో
ప్రబోధలు
గావించునదే
చిత్.
స్వరూప
జ్ఞానమే
ఆనందము.
అయితే
బ్రహ్మ
పదార్ధము
అభివ్యక్తము
కావటానికి
కారణం
ఏమిటి?
ఇది
కేవలము
తనయొక్క
వునికిని
చెప్పుకోటమే!
దీనినే
self
evolution
అన్నారు.
ఇక
ఆనందమన్నది
ఒక్కతూరి
ప్రపంచములో
వుట్టిపడునదికాదు.
ఇది
కేవలము
తెరలు
తెరలుగా
వచ్చి
క్రమక్రమేణా
పరిణామము
పొందుతుంది.
2
▾
Meaning
Keep
ఇట్టి
పరిణామమునే
అధ్యాత్మిక
పరిణామము
అన్నారు.
ఈ
spiritual
evolution
అనేది
యీనాడు
ప్రతి
మానవునియందు
ప్రత్యేకమైన
ఒక
స్థానమును
చేకూర్చుకొని
వున్నది.
మానవుడు
పంచకోశములతో
కూడినవాడు
నిజముగా
మానవత్వమంటే
చైతన్య
స్వరూపమే!
సర్వత్ర
వుండిన
చైతన్యమే
సర్వజీవులయందు
కూడ
వున్నది.
సర్వజీవులయందున్న
చైతన్యమే
సర్వత్ర
వున్నది.
మానవుడనగా
కేవలము
శరీర,
మనోబుద్ధుల
సంఘాతము
కాదు.
మానవుడు
అన్నమయ,
ప్రాణమయ,
మనోమయ,
విజ్ఞానమయ,
ఆనందమయ
కోశములలో
దాగివున్నాడు.
అయితే
యిక్కడ
ఉపనిషత్తులు
యీ
పంచకోశములను
అతి
గౌరవముగను,
అతి
పవిత్రమైనవిగను,
దివ్యమైనవిగను,
అర్థవంతమైనవిగను
తెలుపుతూ
వచ్చినవి.
మనము
భుజించిన
ఆహారము
భౌతికరూపము
ధరించినప్పుడు
దీనిని
ఒక
విధమైన
స్థూలదేహము
అని
చెబుతూ
వచ్చింది.
తదుపరి
ప్రాణమయ,
మనోమయ,
విజ్ఞానమయములు
యీ
మూడింటియొక్క
కూడిక
చేతనే
లింగ
స్వరూపము
యేర్పడుతూ
వచ్చింది.
దీనినే
vital
body
or
sense
body
అంటారు.
యింక
మూడవది
స్వరూప
జ్ఞానముతో
వుండినదానిని
ఆనందమయ
కోశము
అని
చెప్పారు.
అయితే
ప్రాణమయ,
మనోమయ,
విజ్ఞానమయములు
యీ
మూడింటిని
తన
అదుపులో
వుంచుకున్న
తత్త్వము
ఒకటుంది.
అదే
అంతరాత్మ.
ఈ
అంతరాత్మనే
‘చైతన్య
పురుషుడు’
అని
చెప్పవచ్చు.
ఈ
చైతన్య
పురుషుడు
ఎక్కడ
వున్నాడు?
‘హృదయేగుహ్యం’
అనగా
హృదయములో
వుంటున్నాడు,
యీ
చైతన్య
పురుషుడు.
హృదయమనగా
మన
భౌతిక
శరీరమునకు
సంబంధించిన
గుండెకాదు.
ఇది
ఆధ్యాత్మిక
హృదయము,
అనంతమైన
హృదయము,
సర్వవ్యాపకమైన
హృదయము.
సర్వజ్ఞత్వమైన
హృదయము.
దీనినే
శృతులు
‘ఆత్మ’
అని
చెబుతూ
వచ్చాయి.
అయితే
యీ
చైతన్య
పురుషునకు
అనేక
విధములైన
రూపములని
ఈశావాశ్యోపనిషత్తు
వివరించుతూ
వచ్చింది.
శుద్ధసత్త్వ
చైతన్యమే
సాయితత్త్వము
భౌతిక
చైతన్యముతోకూడిన
ఆత్మకు
అన్నమయ
పురుషుడని
పేరు.
ఇక
రెండవది,
ప్రాణమయముతో
కూడిన
ఆత్మను
ప్రాణస్వరూపుడు
అని
చెబుతూ
వచ్చింది.
దీనినే
life
consciousness
అన్నారు.
3
▾
Meaning
Keep
మనోచేతనముతో
కూడిన
ఆత్మకు
మనో
పురుషుడని
చెబుతూ
వచ్చింది.
Mental
consciousness.
ఇంక
నాల్గవది
అతిమానుషరూపమైనది.
అతీత
మానసత్వమని
దీనికి
పేరు.
అతీత
మానసత్వముతో
కూడిన
చైతన్యమును
అతి
మానుష
స్వరూపము
అన్నారు.
వేదములు,
ఉపనిషత్తులు
దీనిని
అనేక
విధములుగా
వివరిస్తూ
వచ్చాయి.
దీనినే
‘బృహత్’
అనికూడను
చెబుతూ
వచ్చారు.
దీనినే
‘ఋతం’
అని
చెబుతూ
వచ్చారు.
దీనినే
‘సత్యమ్’
అని
చెబుతూ
వచ్చారు.
ఇలాంటి
అతీతమైన,
అతి
మానస
స్వరూపమైన
పురుషత్వమును
దివ్యత్వముగా
పోల్చుకుంటూ
వచ్చారు.
ఈ
అతీతమైనది
Super
mind
అంటారు
ఇలాంటి
Supermind
తత్త్వమును
విజ్ఞానమయ
పురుషుడన్నారు.
ఈ
విజ్ఞానమయ
పురుషుడు
తరువాత
ఆనందమయ
పురుషుడు
వుంటున్నాడు.
అదే
supermind
consciousness.
క్రమక్రమేణా
దీనిని
Universal
consciousness
అని
చెబుతూ
వచ్చారు.
అనగా
విశ్వవ్యాప్తమైన
చైతన్యస్వరూపుడు.
ఈ
అన్నింటికి
మించి
ఒక
చైతన్యము
వుంటున్నది.
అదే
చిత్
తపస్.
ఇది
అన్ని
చైతన్యములకును
మూలాధారమైన
చైతన్యము.
All
effective
will
అన్నారు
దీనిని.
ఇట్టి
చైతన్య
స్వరూపమును
ధరించిన
దాన్ని
Super
divine
life
అన్నారు.
శుద్ధ
సత్త్వచైతన్యము
అన్నారు.
అదే
సాయి
తత్త్వము
ఆ
స్థాయి
యందుండిన
తత్త్వము
చేయలేనిది
ఒక్కటి
కూడను
వుండదు.
ఈ
శుద్ధ
తత్త్వమనేది
సర్వశక్తులతో
కూడినది.
ఇట్టి
శుద్ధ
తత్త్వాన్ని
గుర్తించుకోటానికి
ప్రయత్నించటమే
ప్రతి
మానవునియొక్క
కర్తవ్యము.
దీనిని
గుర్తించటానికి
చక్కని
మార్గములుంటున్నాయి.
మానవుని
దృష్టి
నిరంతరము
బాహ్యప్రపంచమునందే
ప్రవేశిస్తుంటాది.
అట్టి
బయటి
ప్రపంచములోపల
ప్రసరించే
దివ్యదృష్టిని
అంతర్ముఖము
గావించాలి.
తన
యందున్న
చైతన్య
తత్త్వమును
తాను
ఆవిర్భవింపజేసుకోవాలి.
అలా
ఆవిర్భవింపజేసుకున్న
దివ్యచైతన్యమునకు
తాను
అర్పితము
గావాలి.
దీనిని
సాధించాలనే
దీక్ష
చాలా
కచ్చితంగా
పెట్టుకోవాలి.
దీనిని
realisation
of
the
inner
divine
అన్నారు.
కనుక
మనలో
అంతర్ముఖమైన
దివ్యత్వమును
మొట్టమొదట
అభివృద్ధి
గావించుకోటానికి
ప్రయత్నించాలి.
4
▾
Meaning
Keep
ఒకే
భగవంతుడు
సర్వజీవులయందు
భిన్న
భిన్న
రూపములతో
ఉన్నాడనే
సత్యమును
గుర్తించుకోవాలి
ఇంక
రెండవది,
తన
యొక్క
జీవితములో
అవ్యక్తముగా
వుండిన
చైతన్యమే
సర్వత్ర
అవ్యక్తముగా
వున్నదనే
సత్యాన్ని
గుర్తించాలి.
తన
ప్రపంచమునకు,
తన
ప్రక్కన
వున్న
వాని
ప్రపంచమునకు
మధ్యలో
మాయ
లేక
యింకే
విధమైన
భ్రమయో
ఒక
అడ్డుగోడగా
నిలచి
వున్నది
అనే
దానిని
గుర్తించి
ఆ
అడ్డుగోడను
తీసివేయటానికి
తగిన
ప్రయత్నము
చేయాలి.
అప్పుడే
తన,
పర
అనే
భేదము
లేకుండా
ఏకత్వమును
కొంతవరకు
అనుభవించటానికి
ప్రయత్నిస్తాడు.
‘అహంయేవ
యిదం
సర్వం’
నేనే
యీ
సర్వమునందు
వుండినవాడిని,
యీ
సర్వము
నా
యందే
వున్నది
అనే
స్థితికి
తాను
వస్తాడు.
‘నేనే
దైవము
దైవమే
నేను’
‘నేనే
బ్రహ్మ
బ్రహ్మమే
నేను’
నాకు,
బ్రహ్మకు
వ్యత్యాసము
లేదు
అనే
స్థాయికి
చేరి
‘ఒకే
దేవుడు
సర్వులయందుకూడను
భిన్న
రూపములతో
వున్నాడు’
అనే
సత్యము
గుర్తించుకోవాలి.
దీనినే
realisation
of
the
cosmic
divine
అన్నారు.
ఈ
రెండవ
స్థాయిని
మనము
సాధించిన
తరువాత
మూడవది
ఒకటి
వున్నది.
దీనిని
ఆరోహణ,
అవరోహణ
అన్నారు.
ఈ
ascend
and
descend
అనే
దానిలో
క్రిందికి
రావటము,
పైకి
పోవటము.
బ్రహ్మ
పదార్ధమే
బాహ్య
జగత్తుగా
రూపొందుతూ
వచ్చింది
మానవునకు
యీ
లోకములో
ఆరు
విధములైన
మనసులు
వుంటున్నవి.
ఒకటి
సామాన్యమైన
మనస్సు.
రెండవది
అతీతమైన
మనస్సు
super
mind
మూడవది
ఉన్నతమైన
మనస్సు,
higher
mind.
నాల్గవది
ప్రకాశవంతమైన
మనస్సు,
Illuminated
mind.
ఐదవది
స్వయం
స్మరణ
మనస్సు,
Intuitive
mind
యింక
ఆరవది
ఉపరిభాగములో
వున్న
మనస్సు,
Over
mind
.
ఈ
ఆరు
మనస్సులు
కూడను
మొట్టమొదట
సామాన్య
మనస్సునుండి
ప్రారంభమై
over
mind
వరకు
రావటము.
అనగా
ఉపరిభాగమైన
మనస్సువరకు
రావటము
తిరిగి
ఉపరిభాగమైన
మనస్సు
నుంచి
సామాన్యమైన
మనస్సువరకు
దిగి
రావటము.
యీ
విధముగా
క్రిందకు
రావటము,
పైకి
పోవటము
యీ
రెండింటియొక్క
చేరిక
కలిగినప్పుడే
పరిపూర్ణమైన
మానవత్వము
కలుగుతుంది.
యిదే
ఆరోహణ,
అవరోహణ
అన్నారు.
అయితే
యీ
రెండింటిని
చేర్చటమే
పరిపూర్ణత్వము.
అప్పుడే
‘పూర్ణమదః
పూర్ణమిదం
పూర్ణాత్పూర్ణ
ముదచ్యతే’.
అంతా
పూర్ణమే
అయిపోతుంది.
5
▾
Meaning
Keep
ఈ
చైతన్యము,
ఆ
చైతన్యము
అనే
భేదము
లేదు.
సర్వము
చైతన్యమయమే!
కారణమేమనగా
బ్రహ్మ
పదార్ధమే
యీ
బాహ్యజగత్తుగా
రూపొందుతూ
వచ్చింది.
ప్రకృతియొక్క
క్రమానుగతమైన
వికాసమే
పరిణామము
ఈనాడు
ప్రపంచమంతయు
పరిణామవాదమును
గురించి
అనేక
విధములుగా
చర్చించుచున్నారు.
పరిణామ
వాదమును
అందరూ
విశ్వసిస్తున్నారు.
అయితే,
యీ
ప్రకృతియొక్క
పరిణామ
తత్త్వము
మనము
కొంతవరకు
గుర్తించటానికి
ప్రయత్నించాలి.
పరిణామమనగా
యేమంటే
ప్రకృతియొక్క
క్రమానుగతమైన
వికాసమే
పరిణామము.
దీనికి
ఒక
చిన్న
ఉదాహరణము.
పదార్ధమునుండి
ప్రాణము
పుట్టింది.
ప్రాణమునుండి
మనస్సు
పుట్టింది.
అయితే
పదార్ధము
అంటే
ఏమిటి?
ప్రాణము
కప్పుకున్న
తెరయే
పదార్ధము.
వడ్లు
అంటే
ఏమిటి?
పొరతో
కప్పుకున్న
బియ్యమును
వడ్లు
అంటాము.
ఈ
పొర
వుండినంతవరకు
వడ్లంటున్నాము.
పొర
తీసివేస్తే
బియ్యము
అవుతాయి.
కాబట్టి,
పదార్ధమనే
పొరను
కప్పుకొని
ప్రాణము
వుంటున్నది.
ఏతావాతా
యీ
పదార్ధమునుండి
ప్రాణము
పుడుతూవచ్చింది.
ఈ
ప్రాణమునుంచే
మనస్సు
పుడుతూ
వచ్చింది.
ప్రతి
మానవుని
పరిణామము
పదార్ధమునుండి
ప్రాణమువరకు
తిరిగి
ప్రాణమునుండి
మనస్సువరకు
జరుగుతూ
వస్తుండాది.
కానీ,
అక్కడనుండికూడను
పరిణామము
జరిగి
చివరకు
పూర్తికావాలి.
ఈ
పరిణామము
పూర్తి
కానప్పుడు
మానవత్వము
పూర్తికాదు.
ఈ
మనస్సునుండి
అతీతమైన
మనస్సుకు
రావాలి.
అతీత
మనస్సునుండి
సచ్చిదానంద
మనస్సువరకు
వెళ్లాలి.
అంతవరకు
వెళ్లకుండిన
వీడు
పరిపూర్ణ
మానవుడు
కాడు.
ఏదైన
ఒక
ఫలము
పిందెగా
పుట్టి
కాయగా
తయారై
పరిపక్వస్థితికి
రావాలంటే
దానిలో
మాధుర్యము
రావాలి.
పరిపూర్ణమైన
ఫలముగా
అయినప్పుడు
చెట్టునుండి
ఫలము
వేరైపోతుంది.
అదే
వైరాగ్యము.
ఆ
సచ్చిదానందస్థితి
మనలో
ఆవిర్భవించాలి.
ఆ
సచ్చిదానంద
స్థితిని
మానవుడు
యేనాడు
అనుభవిస్తాడో
అదే
పవిత్రమైన
శివరాత్రి.
ఇక,
అన్ని
రాత్రులు
చీకటి
రాత్రులే!
కనుక,
తనయందున్న
అపరిపక్వమైన
మానవత్వమును
పరిపక్వస్థితికి
తెప్పించుకోవాలి.
ఇలాంటి
పరిపక్వ
స్థితికి
రావాలంటే
మనము
యీనాడు
వున్న
మానసికస్థాయినుండి
ఒక
అతీత
మానసికస్థాయికి
వెళ్ళాలి.
6
▾
Meaning
Keep
మనస్సుయొక్క
పరిణామమే
మానవుని
జీవితము.
ఈ
పరిణామములో
అనేక
రకములైన
మార్పులు,
చేర్పులు
జరుగుతూ
వుంటాయి.
ప్రపంచములో
విద్యుత్శక్తి,
అణుశక్తి
వున్నదని
కొద్ది
కాలముక్రితమే
తెలుసుకున్నాము.
కాని,
మనకు
తెలియకుండా
పోయినంతమాత్రమున
విద్యుత్శక్తి,
అణుశక్తి
లేదని
చెప్పటం
మూర్ఖత్వము
కాదా!
యీనాడు
మానవుడు
మనఃస్థాయిలోనే
వుండటంచేత
తనకు
తెలియనివన్నీ
ప్రపంచములో
లేవు
అని
వాదిస్తున్నాడు.
ఇదే
మూర్ఖత్వము!
తెలియనివి
లేవని
చెప్పటానికి
ఎవ్వరికి
యేమాత్రంకూడను
అధికారం
లేదు.
నిన్న
తెలియనిదానిని
యీనాడు
మనం
తెల్సుకున్నాము.
ఈనాడు
తెలియనిది
రేపు
తెలుసుకోవచ్చు.
తెలుసుకొనుటకై
ప్రయత్నించాలి
గాని
తెలియని
దానిని
లేదని
చెప్పటము
పెద్ద
అజ్ఞానము.
ఈ
అజ్ఞానము
ఎప్పుడు
మనకు
సంభవిస్తుంది?
దేహభిమానమునే
లక్ష్యములో
వుంచుకున్న
వ్యక్తిని
యిలాంటి
అజ్ఞానము
ఆవరిస్తుంది.
ఇది
కేవలము
ఆహారముచేత
యేర్పడిన
దోషము.
మానవుడు
నిజముగా
సచ్చిదానంద
స్వరూపుడే!
దీనికంటె
యింకా
అతీతమైనది
ఒకటివుంది.
దానినే
‘లింగదేహము’
అన్నారు.
మానవుడు
యిలాంటి
దేహమువరకు
ప్రయాణము
చెయ్యాలి.
దీనినే
subtle
body
అన్నారు.
క్రమక్రమేణా
ప్రయాణము
సల్పుతూ
ఆనందస్థితికి
చేరుకోవాలి.
ఆనందమే
అన్నింటికి
మూలాధారము.
ఈనాడు
జగత్తులో
కన్పించే
ప్రతి
పదార్ధమునందుకూడను
యీ
ఆనందము
సూక్ష్మరూపములో
వుంది.
మనము
ఉపనిషత్తులు
చదువుతున్నాము.
భగవద్గీత
పఠిస్తున్నాము.
బ్రహ్మసూత్రములను
వల్లిస్తున్నాము.
మనలో
కల్గిన
మార్పు
యేమిటి?
ఈ
మార్పు
లేనివన్నీకూడను
వ్యర్ధమైనవే
కనుక
క్రమక్రమేణా
యీ
పరిణామమనేది
మనలో
కలగాలి.
మనము
ఎన్ని
విధములైన
సాధనలు
చేసినప్పటికిని
మనోస్థాయియందే
వుంటుంటే
యింక
ముందుకు
పోవటానికి
ఏది
మార్గము?
Super
Mind
వరకు
మనము
వెళ్లాలి.
ఈ
అతీత
మనస్సులో
మనము
ప్రవేశించినప్పుడే
మనము
ప్రపంచమునకు,
పరమాత్మ
తత్త్వమునకు
వుండిన
సంబంధ
బాంధవ్యము
యేమిటని
కొంతవరకునైనా
అర్థము
చేసుకోగలము.
నిజముగా
మనము
సచ్చిదానంద
స్వరూపులమే!
మన
వునికి
నిరంతరము
వుంటూనే
వుంది.
‘జాగ్రదవస్థలో
నేను
వున్నాను’
అని
నీవు
చెబుతున్నావు.
7
▾
Meaning
Keep
నిద్రావస్థలో
నీ
శరీరమును
నీవు
మరచిపోయావు.
కానీ
అక్కడ
‘నీవు’
వుంటున్నావు.
స్వప్నావస్థయందు
కూడను
నీవు
వుంటున్నావు.
ఈ
మూడు
స్థానములందుకూడను
నీ
వునికి
యే
మాత్రము
మారలేదు.
ఆ
సత్యమును
నీవు
గుర్తించటానికి
ప్రయత్నించాలి.
అట్టి
పవిత్రమైన
సత్యమును
గుర్తింపచేయటానికి
ప్రయత్నం
చేసినప్పుడే
యీ
విధమైన
సాధనలన్నీ
ఫలిస్తాయి.
మనం
చేసే
సాధనలద్వారా
యే
స్థాయికి
మనం
చేరుతున్నాము,
ఏ
విధమైన
పరిణామము
మనలో
జరిగింది,
అనే
విషయాన్ని
మనము
విచారించాలి.
ఈ
ఆరోహణ,
అవరోహణలలోపల
మనయొక్క
జీవితమును
క్రమక్రమేణా
ప్రవేశపెట్టాలి.
ఈ
మానసికస్థాయినుండి
పరిపూర్ణమైన
ఉపరిస్థాయికి
మనము
వెళ్లాలి.
అలాంటి
పవిత్రమైన
దివ్యస్థాయికి
చేరటానికి
చాలా
ప్రయత్నం
చేయాలి.
ఆధ్యాత్మిక
మార్గముకంటె
సులభమైన
మార్గము
జగత్తులో
లేదు
ప్రేమస్వరూపులారా!
ఇది
మీకు
చాలా
కష్టమని
భావించుకోవచ్చు.
నిజముగా
శ్రద్ధపెడితే
యిది
చాలా
సులభమైన
మార్గము.
అధ్యాత్మిక
మార్గముకంటె
అతి
సులభమైన
మార్గము
యీ
జగత్తులో
కానరాదు.
శ్రద్ధ
లేకపోవటంచేత
యివన్నీ
మనకు
కష్టముగాను,
భారముగాను
అనిపిస్తున్నాయి.
పట్టుబడితే
యిలలో
సాధించలేనిది
ఒక్కటీ
లేదు.
దీనినే
‘శ్రద్ధావాన్
లభతే
జ్ఞానమ్’
అన్నారు.
కనుక
‘నేను
నిరంతరము
చైతన్య
స్వరూపుడను,
సచ్చిదానందము
నా
దివ్య
ఆకారము’,
అని
మీరు
స్మరిస్తూండాలి.
ఈనాడు
మానవుడు
తన
స్వస్వరూపమును
మరచి
కేవలము
దేహేంద్రియ
మనోబుద్ధులయొక్క
భావములే
దృష్టియందు
వుంచుకున్నాడు.
మన
భావములన్నింటికి
మూలాధారమై
సచ్చిదానందము
వుంటుంది.
ఆనందము
మనయొక్క
రూపమే!
కనుకనే
మానవుడు
నిరంతరము
ఆనందమునే
ఆశిస్తున్నాడు.
జగత్తంతయు
పరబ్రహ్మస్వరూపము.
పరబ్రహ్మ
పదార్ధమువలనే
పరబ్రహ్మ
పదార్ధములోనే
ఆత్మపుట్టింది.
అయితే
యీ
పరబ్రహ్మము
పదార్ధముగా
మనకు
గోచరిస్తున్నది.
ఈ
పదార్ధమునుండియే
పరార్ధము
కూడను
ప్రారంభమవుతుంది.
దీనినే
పరిణామస్థితి
అన్నారు.
ఒక
కోడిగ్రుడ్డు
వుంది.
అది
చూస్తే
మనకొక
పదార్ధముగా
గోచరిస్తుంది.
కాని
క్రమక్రమేణా
దాని
యొక్క
పరిణామము,
స్థితిగతులు
చేయవలసిన
రీతిగా
చేసినప్పుడు
అందులోనే
ఒక
ప్రాణంకూడను
ఆవిర్భవిస్తుంది.
8
▾
Meaning
Keep
ఈ
సృష్టిలో
కనుపించే
ప్రతి
పదార్ధములోకూడను
ఒక
విధమైన
చైతన్య
శక్తి
వుంటుంది.
సర్వత్ర
నిండిన
చైతన్యమును
మన
మీనాడు
తెలుసుకోవాలి.
తనయందున్న
చైతన్యమే
సర్వత్ర
వుందనే
సత్యాన్ని
గుర్తించాలి.
యీ
చైతన్యతత్వమును
ప్రయత్నపూర్వకముగా
సాధించాలి.
అహంకారము
ఉండినంతవరకు
ఆత్మతత్త్వము
అర్థము
కాదు
ఇప్పుడు
ఉన్నత
మనస్సు
అనేది
వుంది.
ఈ
ఉన్నత
మనస్సంటే
యేమిటి?
జగత్
భావములనుండి
దివ్యభావములో
ప్రవేశించటానికి
పూనుకోవటమే
ఉన్నత
మనస్సవుతుంది.
దీనికి
ఒక
చిన్న
ఉదాహరణము
matter
+
Mind
యిది
సామాన్య
జీవితము.
కానీ
matter
+
Being
అదే
అతీత
మనస్సు.
ఈనాడు
మనస్సుతోనే
కాకుండా
మన
యొక్క
దివ్యత్వముతో
వునికితో
దానిని
గుర్తించటానికి
ప్రయత్నించాలి.
ఈ
మనస్సు
కేవలం
ఒక
విధమైన
అయోమయ
స్థితిని
కల్పిస్తుంది.
అనేక
విధములుగా
ఆకర్షిస్తుంది.
అనేక
విధములైన
గుణములను
పురికొల్పుతుంది.
అభిమాన,
మమకారములను
పెంచుతుంది.
అహంకారమువరకు
తీసుకుని
పోతుంది.
ఇట్టి
అహంకారములోపల
కన్నుమిన్ను
కానక
నిత్యానిత్య
విషయ
పరిశీలన
మర్చిపోతాడు,
మానవుడు.
ఈత
చెట్టు
తన
మెడకు
కల్లు
కుండను
కట్టుకుంటుంది.
కానీ
అది
చాలా
జంభంగా
నిల్చి
వుంటుంది.
ఇది
సిగ్గు
చేటు
కదా!
కట్టుకొని
వున్నది,
కల్లుకుండ!
ఇక
జంభము
ఎక్కడనుండి
వచ్చింది?
ఇది
బుద్ధి
తక్కువ
కాదా!
ఈ
విధముగా
విషయవాసనలు,
అహంకారము
అనే
వాటిని
మెడకు
కట్టుకొని
‘నేను
ఒక
మానవుడను,
మానవుడను’
అని
చెప్పుకుంటున్నాము.
ఇది
ఎంత
సిగ్గు
చేటు!
అహంకారము
ఏనాడు
చంపుకుంటామో
ఆనాడే
ఆత్మస్థితి
అనేది
మనము
గుర్తించుకోటానికి
వీలవుతుంది.
అహంకారము
వుండినంతవరకు
ఆత్మ
విషయము
అర్థమే
కాదు.
అర్థము
కానివాడు
ఎన్ని
గ్రంథములు
చదివినా,
ఎన్ని
ఉపన్యాసములు
విన్నా,
ఎంత
పేరు
పొందినా,
కేవలం
వ్యర్ధుడే.
ఈ
అహంకారమును
మొట్టమొదట
చంపుకోవాలి.
అప్పుడే
మనలో
చైతన్యమనేది
ఆవిర్భవిస్తుంది.
మనలో
వున్న
చైతన్యము
జగత్
సర్వత్రా
వుంటున్నది.
ఆ
ఏకాత్మభావమైన
చైతన్యమును
మన
మీనాడు
గుర్తించటానికి
ప్రయత్నించాలి.
9
▾
Meaning
Keep
దేహములు
మార్పుచెందవచ్చును,
దాని
దేహి
మార్పుచెందనివానిగా
ఉంటాడు
ప్రేమస్వరూపులారా!
మనము
అనేక
సాధనలు
చేస్తున్నాము.
ఈ
జగత్తంతా
అనిత్యము
అంటున్నాము.
ఈ
జగత్తంతా
భ్రమ
అంటున్నాము.
ఈ
జగత్తును
మిధ్య
అంటున్నాము.
చాలా
పొరపాటు.
నేను
సత్యము.
నీవు
సత్యము.
ఈ
జగత్తంతా
సత్యమే!
అంతా
చైతన్యమయమే!
ఇదంతా
బ్రహ్మ
పదార్ధముయొక్క
స్వరూపమే!
ఈ
ఏకాత్మ
భావాన్ని
మనము
అభివృద్ధిపరచుకున్నప్పుడే
అంతో
యింతో
దివ్యత్వమనేది
మనకు
అర్థమవుతుంది.
‘ఈ
జగత్తంతా
మిధ్య,
యిదంతా
అనిత్యము,
యిది
ఒకమాయ’,
అని
యీ
విధముగా
చెప్పుకుంటూ
పోతుంటే
యిది
కేవలము
ప్రజలను
వంచితము
చేసేది
అవుతుంది.
యిది
తప్పు.
సత్య
ప్రమాణము
కాదు.
అయితే
ఈ
మిధ్యయైన
జగత్తునందు
నీ
మిధ్యా
ప్రబోధలెందుకు?
అదే
మిధ్యయై
పోతుందిగదా,
మరి!
కాదు,
కాదు
ఇది
సత్యమే!
‘సత్యస్య
సత్యం’
సత్యములోని
సత్యమే
యిది.
మిధ్యములోని
సత్యము
కాదు.
సత్యములోని
మిధ్యను
కాదు.
జగత్తులోని
యీ
సత్యమును
మనము
గుర్తించుకున్నప్పుడు
మనలో
వున్న
సత్యాన్ని
గుర్తించుకోటానికి
ఒక
అర్హత
కలుగుతుంది.
జగత్తు
సత్యమే!
ఆకారములు
మారవచ్చును,
పదార్ధములు
మార్పుకావచ్చు,
దేహములు
కొంతవరకు
మార్పు
రావచ్చును,
కాని
దేహి
మార్పు
చెందనిదిగా
వుంటాడు.
యిది
పదార్ధముల
మార్పుచేత
కలిగే
పరిణామము
కానీ,
సమస్త
పదార్ధములకు
మూలాధారమైన
సత్యము
ఒక్కటి
వుంటున్నాది.
అదే
‘అస్తి
భాతి
ప్రియం’.
అదే
‘సత్
చిత్
ఆనందము’.
అదే
‘సత్యం,
శివం
సుందరం’.
దివ్యమైన
మనస్సునుండి
సచ్చిదానందమువరకు
మన
ప్రయాణము
సాగిస్తూ
ఉండాలి
మార్పుచెందే
దేహమును
ఆధారముగా
చేసుకొని
జగత్తంతా
మిధ్యయని,
జగత్తంతా
అసత్యమని,
జగత్తంతా
మాయ
అని
చెప్పకూడదు.
మాయ
ఎట్లా
అవుతుంది?
ఇది
కేవలం
చైతన్య
పదార్ధమునుంచే
బ్రహ్మపదార్ధమునుంచే
ఆవిర్భవించింది.
పిల్లల
ప్రీతి
నిమిత్తమై
మార్కెటులోపల
చిలుకలు,
పక్షులు,
మృగములు
యింక
అనేక
విధములైన
చక్కెర
బొమ్మలను
చేసి
పెడతారు.
ఒకరు
ఒక
దానిని
ఆశించి
చప్పరించవచ్చు.
ఒకరు
పక్షి
అని
భ్రమించి
ఆ
పక్షిని
చప్పరించవచ్చు.
ఇంకొకరు
యింకొక
విధముగా
భావించి
చప్పరించవచ్చును.
ఆ
రూపనామములు
మార్పు
చెందుచున్నవిగానీ
అందరూ
చప్పరించేది
చక్కెరయొక్క
స్వరూపమే!
10
▾
Meaning
Keep
ఇవన్నీ
చక్కెర
బొమ్మలు.
ఆ
చక్కెరయే
బ్రహ్మ
పదార్ధము.
పరిణామము
సహజమే!
కానీ,
దానిలోని
మాధుర్యముకూడా
దానికి
సహజమే!
ఈ
విధముగా
పరిణామము
చెందే
దేహము
పరిపూర్ణమైన
దివ్యత్వమును
అనుభవిస్తుండాది.
ఎంతకాలమైనప్పటికి
మనము
ఈ
ప్రైమరీక్లాసులో
కూర్చొని
యేదో
కొన్ని
సాధనలు
చేసుకుంటూ
కూర్చోటం
చాలదు.
క్రమక్రమేణా
ఉన్నత
స్థాయికి
పోవటానికి
ప్రయత్నం
చేయాలి.
కేవలము
ఒక
పదార్ధమునుంచి
ప్రాణమువరకు
గంతువేసింది,
ఈ
చైతన్యము.
ప్రాణమునుంచి
మనస్సువరకు
గంతులు
వేసింది,
ఈ
బ్రహ్మతత్త్వము.
అంతటితోటే
నిల్చిపోతే
మానవుడు
పరిపూర్ణుడు
కాదు.
తాను
చేరవలసిన
గమ్యమును
చేరాలి.
తిరిగి
గంతువెయ్యాలి,
ఆ
మనస్
తత్వమునుండి
దివ్యమైన
మనస్సుకు,
దివ్యమైన
మనస్సునుండి
సచ్చిదానందమువరకు
తన
ప్రయాణము
సాగిస్తూ
పోవాలి.
ఈ
మారుతూ
వుండే
పదార్ధములనే
మనము
ఆధారముగా
తీసుకొని
వుండరాదు.
అలావుంటే
మనము
అనేక
రకములైన
యిక్కట్లకు
గురికావలసివస్తుంది.
అన్నింటికి
మూలాధారమైన
తత్త్వముతో
మనము
సంబంధమేర్పరచుకోవాలి.
మనము
ఈనాడు
పరార్ధ
పరిశోధనలు
సల్పాలి
ప్రతి
మానవుడుకూడను
తన
సాధనస్థాయిని
ఉత్తమమైన,
పవిత్రమైన
ఉపరిభాగమైన
over
mind
వరకు
పెంచుకుంటూ
రావాలి.
దీనినే
‘విజ్ఞానమయము’
అన్నారు.
Super
intellectual
mind,
దీనినే
విజ్ఞానమయ
కోశము
అన్నారు.
ఈ
విజ్ఞానమయ
కోశములో
మనము
ప్రవేశించాలి.
ఈనాటి
విజ్ఞానము
ఇది
కాదు.
ఆధునిక
విజ్ఞానము
పదార్ధ
పరిశోధనా
విజ్ఞానము.
కానీ
Super
intellectual
mind
అనేది
పరార్ధ
పరిశోధన
మార్గము.
మనము
ఈనాడు
పరార్ధ
పరిశోధనలు
సల్పాలి.
అదీ
నిజమైన
విజ్ఞానమయకోశము.
ఆ
విజ్ఞానమయకోశములో
మనము
పరిపూర్ణులమైతిమా
అదియే
ఆనందమయ
కోశము.
అదియే
Super
conscious
mind
అన్నారు.
ఆ
విధమైన
స్థితిని
పొందాలి.
ఇది
చాలా
సులభమైన
మార్గము.
నీవది
కష్టముగా
భావించుకోవచ్చుగాని
ప్రయత్నము
చేయకపోవటంచేతనే
అది
కష్టముగా
అనిపిస్తున్నాది.
ప్రయత్నము
చేయండి.
నా
మాటలు
వినండి.
దాన్ని
అనుసరించండి.
దానిని
నేను
చూపుతాను.
అంతేగాని,
మాటలు
మాత్రమే
విని
ఆచరణలో
పెట్టకపోతే
గమ్యము
చేరలేరు.
11
▾
Meaning
Keep
ప్రకృతియొక్క
క్రమ
పరిణామ
వికాసమే
యీ
జగత్తు
మనకు
పరిపూర్ణమైన
స్థితి
యీ
ఉపరిభాగమునందే
కలుగుతుంది.
ఇది
ఒక
పుష్పము.
ఇది
పుట్టినప్పుడు
మొగ్గగా
వుంది.
ఇది
మొగ్గగా
వుండినప్పుడు
దీనియొక్క
వాసన
వేరే
విధముగా
వుంటున్నది.
ప్రకృతియొక్క
పరిణామము
చేత
క్రమక్రమేణా
పరిపూర్ణ
స్థితికి
వచ్చేటప్పటికి
దానిలో
పరిమళముకూడను
సుగంధముగా
మారిపోతుంది.
పెరుగుతూ
పెరుగుతూ
వస్తే
దానిలో
పవిత్రత
పెరుగుతూ
వస్తుంది.
ఈ
పరిణామము
ప్రతి
పదార్ధమునకు,
ప్రతి
వ్యక్తికి,
ప్రతి
విషయమునకు
వుంటున్నది.
అప్పటికప్పుడు
పుట్టిన
బిడ్డ
ఆకారము
వేరుగా
వుంటుంది.
అప్పుడు
పేరుకూడను
వేరుగా
వుంటుంది.
ఆశిశువును
పసిబిడ్డ
Child
అంటాము.
ఆ
బిడ్డ
క్రమక్రమేణ
ప్రకృతి
పరిణామము
ననుసరించి
పెరిగి
పది
సంవత్సరములవరకు
వచ్చేటప్పటికి
పేరుకూడా
మారుతుంది.
అప్పుడు
Boy
అని
పిలుస్తాము.
ఇంకా
పెరుగుతూ
పోయి
ముప్పై
సంవత్సరములు
వచ్చేటప్పటికి
Man
అని
పిలుస్తాము.
చివరకు
75
సంవత్సరములు
వచ్చేటప్పటికి
grand
father
అని
పిలుస్తాము.
ఈ
విధంగా
పరిణామమును
పురస్కరించుకొని
రూపనామములుకూడను
మారుతుంటాయి.
కనుక,
మొదటిస్థితిలో
వుండిన
మనసు
పరిణామస్థితివల్ల
Supermind
గా
మారిపోతుంది.
తరువాత
higher
mind
గా
వచ్చేస్తుంది.
తరువాత
Intellectual
mind
గా
వచ్చేస్తుంది.
అయితే
యీ
అన్నింటియందు
వున్నది
ఒక్కటే!
Child,
man,
grand
father
ఒక
వ్యక్తియే!
అదే
యేకత్వము.
యివన్నీ
పరిణామము
యొక్క
స్వరూపములు.
కనుక
ప్రకృతియొక్క
క్రమ
పరిణామ
వికాసమే
యీ
జగత్తు.
ఈ
చైతన్యమంతా
కేవలము
బ్రహ్మ
పదార్థముయొక్క
చైతన్యమే!
ప్రేమ
స్వరూపులారా!
ఈ
బ్రహ్మ
పదార్ధముయొక్క
చైతన్యమును
ప్రతి
వ్యక్తి
కూడను
చవిచూడడానికి
తగిన
కృషి
చేయండి.
అదే
సత్యము.
అదే
జ్ఞానము.
అదే
అనంతము.
కనుక,
యీ
అనంతమైన
తత్త్వాన్ని
కొంతవరకు
గుర్తించటానికి
పూనుకోండి.
మనస్సు
క్రమక్రమేణా
దివ్యమార్గములో,
పవిత్రమైన
మార్గములో
కొంత
సాధనలు
చేస్తూ
వుంటుంటే
మొదటి
స్థానమునుండి
పవిత్ర
స్థానమునకు
చేరుకుంటుంది.
నామస్మరణ
ఎందుకోసం
పెట్టారు?
12
▾
Meaning
Keep
నిరంతరము
జగత్
చింతన
చేయకుండా
కొంతవరకునైనా
భగవత్
చింతన
చేస్తూవుంటే
యీ
మనస్సు
క్రమేణా
ఉన్నతస్థాయికి
చేరుతుంది.
ఈ
రాత్రి
అంతా
పవిత్రమైన
నామస్మరణ
చేస్తే
మీ
మనస్సుకూడను
వున్నతమైన
Super
mind
కాకపోయినప్పటికి,
Higher
mind
కాకపోయినప్పటికి,
ఒక
పవిత్రమైన
mind
స్థాయికైనా
చేరుకోగలుగుతుంది.
ఉన్న
స్థాయికంటె
కొంచెము
ఉత్తమస్థాయికి
చేరుతుంది.
‘సత్యం
జ్ఞాన
మనంతం
బ్రహ్మా’
తత్త్వాన్ని
మనస్సునందు
నిరంతరము
చింతించుచూ,
జపించుచూ,
తరించటానికి
ప్రయత్నం
చేయండి.
Previous
←
Through selfless sevā, humanness attains divinity
Next
The mansion of life rests on four walls: birth, karma, Dharma and Brahman
→