Contents
Devotion & Sacred Story
Home
Library
Find
Shelf
Settings
←
Leave
Sathya Sai Speaks 1988 · True happiness comes only when man's vision turns towards the Paramātma
Tap a verse for its meaning
IAST
Telugu
Meaning
Continuous
True happiness comes only when man's vision turns towards the Paramātma
18 March 1988, Ugādi, Bombay
1
▾
Meaning
Keep
His poems 328
Also in his talks
(3)
20 July 1988
All learning without practice is useless
26 May 1990
Buddhi the Charioteer
4 April 1992
Neither swelling with joy nor sinking in sorrow: winning equanimity is the aim of Ugādi
మనసు
నిర్మలంబు
మంచికి
మార్గంబు
మనసు
నిర్మలంబు
మహిత
శక్తి
నిర్మలంబు
మనసు
వుండినది
ముఖ్యంబె
మరచి
బోకు
డిట్టి
మంచిమాట
…
మానవజీవిత
వికాసమునకు
మహత్తరమైన
ప్రక్రియ
ఆత్మవిశ్వాసమే.
ఈనాడు
యిట్టి
ఆత్మ
విశ్వాసము
కోల్పోవటం
చేత
జీవితము
అస్తవ్యస్తమైన
మార్గములో
ప్రయాణము
సలుపుతున్నది.
మానవుడు
పుట్టినప్పుడు
ఎట్టి
దుర్గుణములు
లేక
నిర్గుణ
స్వరూపుడై
వుంటాడు.
కాని
కాలము
గడచిన
కొలది,
ఆహారము
మారిన
కొలది,
అభిరుచులు
అభివృద్ధి
అయ్యేకొలది
మానవ
జీవితము
కొంత
పెడమార్గము
పడుతుంది.
సహవాస
దోషము
మానవునకు
…
దుర్గుణములను
అభివృద్ధి
చేయుట
కవకాశము
నందిస్తుంది.
ఇలాంటి
దుర్గుణములే
మానవునకు
యీనాడు
కేవలము
ఒక
అభిలాషగాను,
అభిరుచిగాను
యేర్పడుతూ
వచ్చాయి.
అప్పుడే
మానవుని
యందు
రాగ
ద్వేషములు
చోటు
చేసుకుంటున్నాయి.
తదుపరి
చదువు
సంధ్యలు
ప్రారంభము
కాగానే
దానితో
పాటు
ఆకర్షణ
అభిమానము,
అహంకారము,
మమత్వము
అనే
దుర్గుణములు
శరీరములో
ఆపాద
మస్తకము
వరకు
కూడ
వ్యాపించి
వీర
నాట్యము
ఆడుతూ
వుంటాయి.
విద్యయొక్క
విశిష్టత
వివేకమనే
విషయమును
మరచిపోయి
కేవలము
తనకు
తానే
పెద్దగా
భావించుకొని
తనకంటె
ఎవరు
పెద్దలు
లేరని
భావిస్తూ
వుంటాడు.
…నే
యువకులైన
వారు
యేదో
స్నేహము
నందు
పరుగులెడుతూ
వుంటారు.
యవ్వనమత్తులో
ఉన్మత్తులై
ఎదుటి
వారిని
ఒక
గడ్డి
పోచకంటె
హీనముగా
చూస్తూ
వుంటారు.
మానవుడు
మానవుడుగా
బ్రతకవలెనన్న,
మనిషి
మనిషిగా
జీవించవలెనన్న
అమితమైన
కష్టములను,
నష్టములను,
అరిష్టములను
ఎదుర్కొనవలసి
వస్తుంది.
అంతే
జీవితములో
యెదురయ్యే
ఎదురు
దెబ్బలకు,
అదురు
దెబ్బలకు
తట్టుకొని,
నెట్టుకొని
ముందుకు
సాగే
మానవుడే
సరైన
మానవుడని
గుర్తించటానికి
వీలవుతుంది.
కాని
మానవుడు
యీనాడు
అట్టి
కష్టములకు
నష్టములకు,
నిందలకు,
నిష్టూరములకు
లొంగిపోయి,
యింద్రియములకు
బానిసై
కేవలము
ఆడంబరములకు,
అహంకారములకు
అవకాశము
నందించి
జీవితమును
వ్యర్థము
గావించుకొనుచున్నాడు.
ఈనాటి
మానవుడు
అల్లరి
చిల్లరి
చిత్తమునకు,
విషయములకు
లొంగిపోతున్నాడు.
ఈనాటి
మానవుని
యొక్క
దాహము
వివాహము.
ఇలాంటి
దాహమునకు
దాసుడై
మానవత్వమును
మరచిపోతున్నాడు.
అయితే
యీనాటి
మానవుడు
నేను
మానవుడనా
అనే
ప్రశ్న
వేసుకుంటే
సరైన
జవాబు
యే
మానవునియందు
లభించటము
లేదు.
2
▾
Meaning
Keep
పవిత్రమైన
మానవత్వము
యీనాడు
అర్థము
చేసుకొనలేక
కేవలం
అల్లర
చిల్లర
విషయములలో
ప్రవేశించి
తన
దివ్యత్వము
పవిత్రమైన
ఆత్మతత్త్వాన్ని
విస్మరిస్తున్నారు.
కాని
అనిత్యము,
అశాశ్వతము,
అసత్యమైన
సుఖ
సంతోషము…
ఎల్లలు
దాటి
నిత్య
సత్య
నిర్మలమైన
ఆత్మ
తత్త్వాన్ని
మరచిపోతున్నారు.
…ములందు
మానవునికే
మాత్రము
ఆనందము
లభించటము
లేదు.
సర్వం
ఆత్మమయం
సుఖం,
సర్వం
ప్రకృతి
మయం
దుఃఖం.
కనుకనే
మానవుని
యొక్క
దృష్టి
పవిత్రమైన
పరమాత్మ
తత్త్వము
వైపు
మరల్చినప్పుడే
నిజమైన
సుఖము
అతనికి
ప్రాప్తిస్తుంది.
ఈనాటి
మానవుడు
పుణ్యఫలము
నాశిస్తున్నాడుగాని
పుణ్య
కార్యములందు
ముందంజ
వేయుటం
లేదు.
పాపఫలమును
విస్మరిస్తున్నాడు
కాని
పాప
కర్మలాచరించటానికి
ముందంజ
వేస్తున్నాడు.
చెప్పుట
ఒకటి
చేయుట
మరొకటి.
దాని
వల్లనే
మానవత్వము
అడుగంటి
పోతుంది.
అవకాశ
వాదమునకు
పాల్పడుతున్నాడు
మానవుడు.
తాను
తిని
సంతృప్తి
పడటం
లేదు.
పశుపక్షి
మృగాదులు
తాము
తమ
తిండి
తాము
తిని
ఆనందమును
అనుభవిస్తున్నాయి.
పశుపక్షి
మృగాదులు
కేవలము
దాచుకొనే
స్వార్థము
గాని
దోచుకునే
దౌర్భాగ్యము
గాని
వాటికి
లేదు.
కాని
మానవుడు
అట్లు
కాదు.
తాను
తిని
సంతోషించటమే
కాకుండా
అనేక
విధములుగా
కొన్ని
తరములకు,
కొన్ని
యుగములకు
కూడను
సరిపడే
పదార్ధములను
ప్రోగు
చేసుకుంటున్నాడు.
తనకే
కాకుండా
తన
పంచవర్ష
ప్రణాళికను
…
స్థితియందు
కూడను
తాను
ఐదు
తరములు
వచ్చినా,
ఐదు
జగము…
మారినా,
అరగని
తరగని
వస్తు
వాహనములను
ప్రోగు
చేసుకుంటున్నాడు.
జీవిత…
క్షణ
భంగురము.
ఏనాడు,
ఎప్పుడు,
ఏరీతిగా
తాను
అంత్యమగునో
చెప్పలేము.
క…
అనిత్యమైన
పదార్థములు
ప్రోగు
చేసుకోటంలో
తాను
అనేక
విధములుగా
అవస్థల
పాలౌతున్నాడు.
ఎన్ని
కష్టములనైనా
ఓర్చుకొని
లౌకికమైన,
భౌతికమైన
పదార్ధములను
ప్రోగు
చేసుకుంటున్నాడు
గాని
నిత్య
సత్యమైన
దైవత్వమును
అభివృద్ధి
గావించుకోటానికి
క్షణ
కాలమైనా
వినియోగించటము
లేదు
మానవుడు.
ఈనాడు
ప్రపంచములో
కరవు
కాటకములకు
కారణము
యేమిటి?
చుట్టూ
వుండిన
ఆశలే
మూల
కారణము.
కూటి
పేదనుండి
కోటీశ్వరుని
వరకు
కూడను
యీ
ఆశలు
పెరిగిపోతున్నవి.
పండితుని
మొదలు
పామరుని
వరకు,
బాలుని
మొదలు
వృద్ధుని
వరకు
యీ
ఆశలు
పెరిగి
పోతున్నవి.
నేను
గొప్ప
గాయకుడు
కావాలి.
నేను
గొప్ప
నటుడు
కావాలి.
నేను
గొప్ప
వ్యాపారస్తుడు
కావాలి.
నేను
గొప్ప
అధికారి
కావాలి.
నేను
గొప్ప
విద్యావంతుడు
కావాలి.
ఈ
విధమైన
కోరికలు
కోరుతూ
కోరుతూ
కేవలము
చీమల
పుట్టల
వలె
పెరిగిపోతున్నాయి
కోరికలు.
ఆశలు
పడటం
తప్పులేదు.
కాని
మితిమీరిన
ఆశలు
అతిప్రమాదమును
కలిగింపచేస్తాయి.
3
▾
Meaning
Keep
ప్రతి
మానవునకు
ఆహారము
అవసరమే.
ఈ
ఆహారము
బంధింప…
పదార్థము
కాదు.
కాని
అట్టి
పవిత్రమైన,
అమృతమైన
ఆహారము
మితముగా
భుజించినప్పుడే
తనకది
ఆరోగ్యమును
అందిస్తుంది.
కాని
అతిగా
భుజించినప్పుడు
అదే
విషముగా
మారిపోతుంది.
కోరికలు
మితమైన
రీతిగా,
హితమైన
రీతిగా
ఆశించినప్పుడు
మానవుడు
తన
శాంతి
సుఖములు
అనుభవించగలడు.
కానీ
నాగరికత
కాలము
పెరిగిన
కొలది
మానవత్వములోని
మృదుత్వము,
మధురత్వము
క్షీణించి
పోతున్నది.
ఇట్టి
ఆధునిక
యుగము
కేవలము
సుఖశాంతులను
దూరము
గావించుచున్నది.
వైజ్ఞానిక
శాస్త్రము
పెరిగిపోయినదని
విఱ్ఱవీగుతున్నాము
కాని
యిది
వెఱ్ఱితనము.
వీటి
యొక్క
అనుకూలములు
యేదో
కొంతవరకు
మనము
అనుభవించవచ్చునే
గాని
యిది
ఆత్మశాంతిని
అనుగ్రహించలేదు.
కార్లు
వచ్చాయి.
వీడియోలు
వచ్చాయి,
సినీమాలు
వచ్చాయి,
ప్లేనులు
వచ్చాయి.
కాని
వీటివల్ల
మనశ్శాంతి
కలుగుతున్నదా!
ఏదో
కొంత
వరకు
ఆనందమునివ్వవచ్చు.
అనుకూలములు
చేకూర్చవచ్చుగాని
ఆత్మశాంతి
వీటివల్ల
లభించేది
కాదు.
ఈ
విజ్ఞానమునకు
మనస్సనేది
లేదు.
ఆత్మ
అనేది
అర్థమే
కాదు
వారికి.
పవిత్రమైన
హృదయము
అసలే
లేదు.
పవిత్ర
మనస్సనేది
లేనిదే
విజ్ఞాన
శాస్త్రము.
ఎప్పుడు
కూడను
పదార్థము
యొక్క
పరిశోధన.
ఈ
పరిశోధన
యందే
తన
పవిత్రమైన
మానవత్వము
వ్యర్థము
చేసుకుంటున్నారు.
కను…
ఈ
పదార్థముల
వల్ల
పరమార్థమైన
దివ్యత్వమును
మానవుడు
అందుకోలేడు.
అసూయ,
ద్వేషము,
అహంకారము
యిలాంటి
దుర్గుణములనే
అభివృద్ధి
గావించుకుంటున్నాడు.
కనుక
యీ
విధమైన
కామ
క్రోధ
లోభములను
క్రమక్రమేణా
మనము
దూరము
చేసుకొనుటకు
ప్రయత్నించాలి.
ఈనాటి
మానవుడు
ప్రపంచములో
స్వేచ్ఛా
విహారము
సల్పాలని
ఆశిస్తున్నాడు.
స్వేచ్ఛ
అనగా
యేమిటి?
యిష్టము
వచ్చినట్లుగా
సంచరించటమా
లేక
జీవించటమా?
ఇంద్రియములకు
లోను
కావటమా?
ఇంద్రియములను
తన
యిష్టము
వచ్చినట్లుగా
అనుభవించటానికి
ప్రయత్నించటము
స్వేచ్ఛయని
భావిస్తున్నాడు
యీనాటి
వెఱ్ఱి
మానవుడు.
ఇంద్రియములకు
వశమైన
వాడు
కేవలము
బంధి…
స్వేచ్ఛ
ననుభవించేవాడు
కాదు.
ఇంద్రియములను
తన
అదుపులో
వుంచుకొని
…
నిజమైన
స్వేచ్ఛా
మానవుడు.
ఇంద్రియములను
అదుపులో
వుంచుకోవాలి.
స్వేచ్ఛా
విహారమునకు
అవకాశము
నందించరాదు.
ఇంద్రియములకు
బానిసై
స్వేచ్ఛా
విహారము
సలుపుతున్నాడంటే
యింద్రియముల
యొక్క
తత్త్వము
యేమిటో
గుర్తించలేని
అంధుడే
వీడు.
నిజముగా
ఏకత్వమును
అనేకత్వముగా
భావించి,
దివ్యత్వమును
విస్మరించి
అపవిత్రములో
మునుగుతున్నాడు
యీనాటి
మానవుడు.
అనేకత్వములోని
యేకత్వమును
గుర్తించటానికి
ప్రయత్నించాలి
మానవుడు.
కన్నులు
పక్షి
మృగాదులకు
కూడా
వుంటున్నాయి.
పవిత్రమైన
మానవ
జన్మ
అని
చెప్పి
కూడను
తోలు
కన్నులతోనే
చూడటం.
చీమలకు,
దోమలకు
కన్నులుంటున్నాయి.
కాని
మానవుడై
పుట్టిన
వాడు
పవిత్రమైన
నేత్రములతో
పవిత్రమైన
దృశ్యములను
చూడాలి.
4
▾
Meaning
Keep
మానవునకు
అందించిన
సమస్త
యింద్రియములు
కూడను
సరైన
మార్గములో
ప్రసరింప
చేయాలి.
భారతీయ
పవిత్రమైన
చరిత్రల
లోపల
రామాయణ,
భాగవత,
భారత
గ్రంథములు
చాలా
ఆదర్శమైన
గ్రంథములు.
వీటిలో
వున్న
ఆదర్శములను
మానవుడు
గుర్తించటానికి
ప్రయత్నించటం
లేదు.
వింటున్నాడు.
ఉపన్యసించుచున్నాడు.
తానే
బోధిస్తున్నాడు.
కానీ,
అంతరార్థమేమిటో
గుర్తించటానికి
ప్రయత్నించటము
లేదు.
రామాయణములోని
రావణుడు
కాముడు.
దీనికి
మూలకారణమేమంటే
రావణాసురునికి
కావలసిన
సౌఖ్యములు,
సంతోషములు,
భోగములు,
బలములు
అన్నీ
వుంటున్నవి.
అతని
యొక్క
శక్తితో
ఎదిరించేవాడు
లేడు.
మహా
భక్తుడు.
ఇలాంటి
గొప్ప
గుణములు
కలిగిన
రావణుని
యందు
కామము
…
వశము
చేసుకుంది.
కనుకనే
యిన్ని
సంపదలు
వుండినప్పటికిని
జనబలము,
ధనబలము,
బుద్ధిబలము,
అంగబలము,
సర్వబలములు
వుండినప్పటికి
తాను
తన
వంశమునే
నాశనము
చేసుకున్నాడు,
కామము
చేత
భాగవతమందు
హిరణ్యకశిపుడు.
అతని
కంటె
దేవుడు
మరొకడు
లేడని
సమస్త
లోకములు
తానే
దేవునిగా
విశ్వసించాలని
ప్రయత్నించాడు.
తనను
మించిన
నారాయణుడు
లేడని
చెప్పి
నారాయణ
ద్వేషిగా
మారిపోయాడు.
అనేక
విధములుగా
పరిశోధనలు
చేశాడు.
ఇతను
హరిద్వేషి.
కాని
కట్టకడపటికి
యేమయ్యాడు.
హరిని
ద్వేషించటము.
యిదే
క్రోధము.
క్రోధమంటే
హిరణ్యకశిపుడే
ఇంక
భారతమునందు
దుర్యోధనుడు.
సర్వుల
ఆస్తిని
తానే
అనుభవించాలని,
ఆనందించాలని
ఆశపడేవాడు.
త్యాగము
అనేది
యితనికి
యే
మూలను
కనుపించదు.
ఇతను
లోభి.
ఈ
లోభియైన
దుర్యోధనుడు
కడపటికి
యేమైపోయాడు.
సర్వము
నిర్మూలము
గావించుకున్నాడు
రామాయణములో
రావణుడు
కామము.
భాగవతమందు
హిరణ్యకశిపుడు
క్రోధము.
భారతమునందు
దుర్యోధనుడు
లోభి.
ఒక్కొక్క
చరిత్రయందు
ఒక్కొ…
కామము,
క్రోధము,
లోభము
వుండినాది.
కాని
యీ
కలియుగమునందు
ప్రతి
మానవునియందు
కామ
క్రోధ
లోభమనేవి
నిండి
నిబిడీకృతమై
వుంటున్నాయి.
అలాంటి
మానవులు
రామాయణము
పఠించి
యేమి
ప్రయోజనము,
భాగవతము
పఠించి
యేమి
ప్రయోజనము?
మహాభారతము
పఠించి
యేమి
ప్రయోజనము.
కామ,
క్రోధ,
లోభములు
నిర్మూలముగా
గావించాలి.
ఇదే
యీనాటి
కలియుగ
మానవుని
యొక్క
ధర్మము.
ఇలాంటి
ధర్మము
కలిగిన
మా…లోకము
యేనాడు
సాధించలేదు.
ఎట్టివారు
నిన్ను
సాధింపగా
లేరు
ధర్మము
ఎప్పుడు
నీవు
తప్పకుండు
భారతమ్ములోని
మహాభాగ్యమిదెకదా
5
▾
Meaning
Keep
ఈ
ధర్మమనేది
యెంత
పవిత్రమైనదో
మానవుడు
యేమాత్రము
విచారించటము
లేదు.
ధర్మము
చాలా
పవిత్రమైనది
కనుకనే
మానవునకు
ఆధారమైనది.
కనుకనే
ధర్మక్షేత్రే
కురుక్షేత్రే
అని
మొట్టమొదట
ధర్మముతో
ప్రారంభించాడు
కృష్ణుడు,
భగవద్గీతను.
ఎలాంటి
పవిత్ర
హృదయమైనా
యీ
ధర్మమును
విశ్వసిం…
యేమాత్రము
వెనుదీయడు.
యుద్ధమునకు
సిద్ధమైన
దుర్యోధనుడు
తనతల్లియైన
గాంధారికి
నమస్కారము
చేయటానికి
వస్తున్నాడు.
తల్లికి
నమస్కరిస్తే
తల్లి
దీవించింది.
యతో
ధర్మస్తతో
జయః
అంది.
ఎక్కడ
ధర్మమో
అక్కడ
జయమవుతుంది
నాయనా
అంది.
నీకు
జయము
కావాలని
కోరలేదు
ఆమె.
ఈనాటి
తల్లులు
దుర్మార్గులు,
దుష్టులు,
దురాచార
సంపన్నులు
అయినా
కుమారులైనప్పటికి
తన
కుమారునికి
జయమే
కలగాలి
అని
ఆశిస్తూ
వుంటారు.
ఇది
నిజమైన
తల్లి
యొక్క
లక్షణమా?
గురువునకు
వచ్చి
నమస్కారము
చేశాడు.
ఆయన
చెప్పాడు.
యతో
ధర్మస్తతో
కృష్ణ
యతో
కృష్ణస్తతో
జయః
అన్నాడు.
అనగా
ఎక్కడ
ధర్మమో
అక్కడ
కృష్ణుడు.
ఎక్కడ
కృష్ణుడో
అక్కడ
విజయము
అన్నాడు.
అనగా
ధర్మము
దైవ
స్వరూపము.
రాముడు
అరణ్యమునకు
వెళ్ళుటకు
పూర్వము
కౌసల్యకు
వచ్చి
నమస్కారము
చేశాడు.
నాయనా
ఎవరు
నిన్ను
రక్షించలేరు.
నీ
ధర్మమే
నిన్ను
రక్షిస్తుంది
అన్నది.
ధర్మమంటే
ముట్టవద్దు,
ముట్టకూడదనే
యీ
సదాచార
సంపన్నమైన
…
ఏది
యితరులు
తనకు
చేస్తే
బాధ
కలుగుతుందో
ఆ
యొక్క
పని
యితరులకు
చేయకుండా
వుంటుండాలి.
ఇతరులు
తనకు
యేది
చేస్తే,
యే
విధముగా
ప్రవర్తిస్తే
తనకు
ఆనందమవుతుందో
అలాంటి
ప్రవర్తన
యితరులకు
తాను
చేయాలి.
ఇతరులు
మాత్రము
తనను
గౌరవించాలి
కాని
తాను
యితరులను
గౌరవించనక్కరలేదా?
కనుకనే
మనము
అందరియందు
వుండిన
దైవత్వమును
ధర్మరూపకముగా
విశ్వసించి
ఆదరించాలి.
ఈనాడు
ప్రపంచము
కేవలము
గుణవంతులైన
స్త్రీ
పురుషులపైననే
ఆధారపడి
వుంటున్నాది.
ఇలాంటి
గుణవంతులైన
స్త్రీ
పురుషులు
ఎప్పుడు
అభివృద్ధి
అవుతారు!
చిత్తశుద్ధి,
శీలము
కలిగిన
సమయమునందే
యీ
స్త్రీ
పురుషులు
గుణవంతులుగా
మారతారు.
ఇలాంటి
చిత్తశుద్ధి,
శీలము
దేనిపైన
ఆధారపడి
వుంటున్నది?
నీతి,
నిజాయితీలపైనే
ఆధారపడి
వుంటున్నది.
ఆధ్యాత్మిక
తత్త్వముపైన
ఆధారపడి
వుంటున్నాయి.
కనుక
ఆధ్యాత్మిక
తత్త్వముపైనే
నీతి
నిజాయితీ
నిల్చి
వుంటున్నాయి.
ఈనాడు
ఆత్మవిశ్వాసమే
యెక్కడా
కనుపించటం
లేదు.
ఆత్మవిశ్వాసము
వుండినట్టుగా
నటిస్తున్నారేగాని
యిది
యేమాత్రము
ఆచరించటానికి
ప్రయత్నించటం
లేదు.
కనుక
యే
మంచి
విషయమునైననూ
ఆచరణలో
పెట్టినప్పుడే
అది
చిత్తశుద్ధి.
ఈనాటి
ప్రపంచము
మూడింటిపైన
ఆధారపడి
వుంటున్నది.
కావి
…ఖాకీ.
కావి
అనగా
యేమి?
సమస్త
మానవులకు
ధర్మోపదేశము
గావించే
సన్న్యాసత్వము
అడుగంటి
పోయింది.
వారి
సంస్కృతి
పూర్తిగా
నశించిపోయింది.
ఖాదీ
అనగా
…
ఈ
పరిపాలకుల
లోపల
నీతి
నిజాయితీ
పూర్తి
నిర్మూలమవుతూ
వుంటుండాది.
6
▾
Meaning
Keep
…ట్రీ
అండ్
పోలీసు.
రక్షకులైన
వారు.
వారియందు
కూడను
క్రమశిక్షణ
పూర్తి…తున్నది.
దేశము
యేరీతిగా
రక్షింపబడుతుంది!
దేశము
యేరీతిగా
అభివృద్ధి
గావిస్తుంది?
ఇంక
దేశము
యేరీతిగా
సుఖశాంతుల
ననుభవిస్తుంది!
కనుకనే
సుబోధలు
గావించే,
ధర్మబోధలు
గావించే,
ఆత్మబోధలు
గావించే
సన్న్యాసులు
యీనాడు
అభివృద్ధి
కావాలి.
ఆనాడు
శంకరాచార్యులు
అలాంటి
పవిత్రమైన
మార్గమును
అవలంబించటం
చేతనే
అనేకమందికి
ఆదర్శవంతమైన
జీవితమును
అందించాడు.
ఆనాటి
మహారాజులు
అనేక
రకములుగా
గురువులను
ఆశ్రయించి,
మహాపురుషులనాశ్రయించి
వారి
సుబోధలను
ఆచరణలో
పెట్టుకుంటూ
వచ్చారు.
కనుక
వారిలో
ఒక
విధమైన
త్యాగభావము
అభివృద్ధి
కావాలి.
పాలకుల
యందు
నీతి
నిజాయితీ
నిర్మూలమైపోతున్నాయి.
వీరు
యేనాడు
నీతి
నిజాయితీలతో
ప్రవర్తిస్తారో
ఆనాడే
దేశప్రజలంతా
సుఖశాంతులననుభవిస్తారు.
అవినీతి,
అసత్యము
యీనాటి
యొక్క
education
యీ
స్థితికి
తెప్పించినవి.
ఈ
విద్యావిధానము
కేవలము
గ్రంథ
పరిచయము
వరకే
ప్రయాణము
చేస్తున్నదిగాని,
ఆచరణయందు
యేమాత్రము
లేదు.
కేవలము
పొట్టకూటి
నిమిత్తము
ప్రాకులాడుతున్నారేగాని
చిత్తశుద్ధి
నిమిత్తము
యేమాత్రము
ప్రయత్నించటము
లేదు.
తన
హృదయాన్ని
పవిత్రము
గావించుకోటానికి
తగినదే
సరియైన
విద్య.
కనుక
యీనాడు
ప్రతి
మానవుడు
కూడను
సమాజములో
ప్రవేశించి
సేవలద్వారా
నీతి
నిజాయితీని
పెంచటానికి
ప్రయత్నించాలి.
Living
in
God
అదే
Spirituality.
Living
with
God
అదే
education.
Living
for
God
అదే
Service.
ఈ
మూడింటి
యందు
దైవత్వము
కూడి
వుంటుండాది.
ఈనాడు
దైవత్వము
ఎక్కడా
కనుపించటము
లేదు.
అందుకోసమే
దేశమంతా
దయ్యముగా
మారి
పోతుండాది.
ఎక్కడ
చూచినా
అల్లర్లు,
ఎక్కడ
చూచినా
అశాంతి.
ఎక్కడ
చూచినా
విప్లవములు.
ఎక్కడ
చూచినా
మారణ
హోమాలు.
కారణము
యేమిటి?
అన్నింటికి
ఆధారమైన
విద్యావిధానము
పూర్తి
నిర్మూలమై
పోయింది.
ఇది
కేవలము
కృత్రిమమైన
విద్యగా
రూపొందుతున్నాది.
మానవత్వము
లేని
మానవుడుగా
తయారౌతున్నాడు.
నిజముగా
మానవునకు
కావలసినది
మానవత్వమే.
మానవత్వము
లేనివాడు
ప్రాణము
లేని
జీవుడే.
కనుక
యీనాడు
మానవత్వమును
ప్రతి
వీధి
వీధి
వాడ
వాడ
ప్రచారము
చేయటానికి
ప్రతి
ఒక్క
మానవుడు
ప్రయత్నపూర్వకముగా
సాధించాలి.
ఇది
దేశము
కోసము.
దేశ
సౌభాగ్యము
కోసము.
దేశ
సౌభాగ్యమును
ఆశించే
వ్యక్తులు
యే
కొద్ది
మంది
వుండినా
చాలును.
భారతదేశము
పవిత్రమైన
దేశముగా
ఆదర్శము
నందిస్తుంది.
ఈనాడు
యువకుల
లోపల
యిలాంటి
విశ్వాసము
అభివృద్ధి
కావాలి.
ఈనాడు
ప్రపంచములో
యింత
అల్లకల్లోలములకు
యింత
అశాంతికి
కారణము
యేమిటో
గుర్తించటానికి
ప్రయత్నించాలి
పెద్దలు.
7
▾
Meaning
Keep
వారి
కర్తవ్యమేమిటో
వారు
గుర్తించటానికి
ప్రయత్నించటం
లేదు.
వృద్ధులైన
వారు
నిరంతరము
గతమునే
చింతిస్తూ
పోతున్నారు.
యువకులైన
వారు
యేదో
భవిష్యత్తులో
ప్రపంచాన్ని
వుద్ధరించే
వారుగా
నిరూపిస్తున్నారు.
ప్యాసైన
తక్షణమే,
ఉద్యోగమైన
తక్షణమే
…
తక్షణమే
యింకా
యింకా
యేమిటో
…
future
కోసమని
జీవితమును
వ్యర్థము
చేసుకుంటున్నారు.
చదివి
యేమి
చేస్తున్నారు.
ఏదో
డిగ్రీ
అనే
భిక్షాపాత్ర
తీసుకొని
ఆఫీసులవెంట
ఉద్యోగమనే
భిక్షను
అడుగుతున్నారు
ఈ
యువకులంతా
సమాజసేవలో
ముందుకు
ప్రవేశించరాదు.
మన
సోదర
సోదరీమణులకు
ఎందుకు
ఆదర్శమును
నిరూపించరాదు?
దీనికి
తగినట్లుగా
తల్లితండ్రులు
కూడను
పెడమార్గము
పట్టిస్తున్నారు.
పిల్లలను
అనవసరముగా
యీ
విదేశములకు
పంపటము.
వారి
ఆశ
యేమిటి!
డబ్బు.
డబ్బు.
ఈ
విధంగా
డబ్బును
సంపాయించటానికే
యీ
తెలివితేటలు
వుపయోగపెడుతున్నారు
గాని
గుణమును
సంపాయించటానికి
యేమాత్రము
ప్రయత్నించటము
లేదు.
వెళ్ళే
సమయములో
ఒక్క
కాసైనా
తీసుకుపోతాడా!
తనది
కాని
ధనమునకు
తాను
యెందుకింత
ఆశపడాలి.
కనుక
సమస్త
అనర్ధములకు
మూలకారణము
వృద్ధులు
గతాన్ని,
యువకులు
భవిష్యత్తును
యోచిస్తున్నారుగాని
వర్తమానాన్ని
మరచిపోతున్నారు
యిద్దరూ.
ఈ
వర్తమానము
చాలా
ప్రధానమైనది.
ఇది
present
not
ordinary
present.
ఇది
omni
present.
ఎందుకనగా
గతము
యొక్క
ఫలితము
వర్తమానములో
వస్తున్నాది.
వర్తమానములో
చేసే
ఫలితము
భవిష్యత్తులో
వస్తుంది.
కనుక
వర్తమానం
చక్కగా
వుంటే
దేశము
సుభిక్షముగా
వుంటుంది.
ఏ
పెద్దలు
కూడను
యీ
కార…టానికి
ప్రయత్నించటం
లేదు.
అన్నింటిని
నియమించే
మానవుడు
యీనాడు
అధోగతికి
దిగజారిపోతున్నాడు.
అన్నింటి
కంటె
విలువైనవాడు
మానవుడు.
బంగారుకు
విలు…
మానవుడే.
డైమండ్‌కు
విలువనిచ్చేది
మానవుడే.
అందరికి
విలువనిచ్చే
మానవునికి
విలువలేకుండా
పోయింది.
తన
విలువ
తాను
పోగొట్టుకుంటున్నాడు.
ఇలాంటి
విలు…
మానవుడు
దేనికి
విలువ
యిచ్చి
యేమి
ప్రయోజనము.
ఇది
కేవలము
మూర్ఖత్వముగానే
వుంటున్నాది.
కనుక
మొట్టమొదట
యీ
అహంకారాన్ని,
ఆడంబరాన్ని
అణగద్రొక్కాలి.
Purity,
divinity
ని
పెంచాలి.
సహనము,
సానుభూతితో
మనము
జీవించాలి.
తోటి
మానవునితో
మనము
ప్రేమతో
సంచరించాలి.
అదే
brotherhood
of
man,
fatherhood
of
God.
ఏనాడు
దైవత్వము
యొక్క
విశ్వాసాన్ని
అభివృద్ధిపరచుకొందురో
ఆనాడే
మన
దేశము
తిరిగి
అభివృద్ధిగాంచగలదు.
కనుక
దేశము
నిమిత్తమై
మనము
పాటుపడాలి.
ఈనాటి
మానవుడు
తాను,
తన
కుటుంబము
అంత
వరకే
ప్రయాణము
చేస్తున్నారు
గాని
సమాజము
వరకు
ప్రయాణము
చెయ్యటంలేదు.
సమాజమునకు,
మనకు
వుండిన
సన్నిహిత
సంబంధ
బాంధవ్యము
యేమిటో
అర్థము
చేసుకోవాలి.
సమాజము
లేకపోతే
నీవెక్కడ?
నీవు
పుట్టటము,
పెరగటము,
నశించటము
అంతా
సమాజము
నందే
జరుగుతుండాది.
8
▾
Meaning
Keep
అలాంటి
ఆధారమైన
సమాజాన్ని
మనము
మరచిపోతున్నాము.
మనము
చేసే
ప్రతి
క్రియ
కూడను,
ప్రతికర్మ
కూడను
సమాజము
వరకు
ప్రయాణము
చెయ్యాలి.
సమ్
ఆజమ్
అదే
సమాజము.
సమ్
ఏకత్వము.
ఆజమ్
అనగా
గమనము.
ఏకత్వగమనమే
సమాజము.
అందరియొక్క
ఏకత్వమే
మన
సమాజము.
సమాజమును
విడిచిపెట్టి
మనము
క్షణమైనా
బ్రతకటానికి
వీలులేదు.
తన
నుండి
తన
కుటుంబము,
తన
కుటుంబము
నుండి
సమాజము,
సమాజము
నుండి
దేశము,
దేశము
నుండి
విశ్వము,
ఏనాడు
మానవుని
యందు
మానవత్వము
అభివృద్ధిగాంచునో
ఆనాడే
దేశము,
సమాజము,
విశ్వము
కూడను
సుఖశాంతులననుభవిస్తుంది.
ఈ
మానవత్వమనేది
యెక్కడో
కనపర్చటానికి
వీల్లేదు.
ఒక
విత్తనము
భూమిలో
పెట్టి
నీరుపొయ్యాలి.
అప్పుడే
అది
మొక్కగా
వస్తుంది.
కాని
ఆ
విత్తనము
టిన్‌లో
పెట్టి
నీరుపోస్తే
మొక్కగా
వస్తుందా?
అదే
రీతిగా
మానవత్వమనేది
ఆధ్యాత్మికమనే
భూమియందు
అభివృద్ధి
కావాలిగాని
లౌకికమైన
భూమియందు
యిది
అడుగంటి
పోతుంది.
కనుక
మానవత్వాన్ని
మనం
అభివృద్ధి
గావించుకోవలెనన్న
ఆధ్యాత్మిక
శక్తిని
మనము
అభివృద్ధి
గావించాలి.
ఆత్మవిశ్వాసము
మనము
అభివృద్ధి
గావించాలి.
మానవుడంటే
కేవలము
శరీరము,
మనస్సు,
బుద్ధి,
చిత్తము
అనేది
మాత్రమే
కాదు.
అన్నింటికంటె
అధికమైన
ఆత్మతత్త్వము.
ఈ
ఆత్మనే
మన
కండరముల
యందు,
మన
అంతఃకరణ
యందు,
మన
…సమస్తమునందు
వ్యాపించి
వుంటున్నది.
దీనినే
constant
integrated
awareness
అన్నారు.
నిజమైన
ఆత్మతత్త్వాన్ని
మరచిపోతే
మనసెక్కడ
వుంది.
దేహము
ఎక్కడ
వుంది?
అంతఃకరణ
ఎక్కడ
వుంటుంది.
ఈ
ఆత్మ
లేక
యేమీ
లేదు.
ఈ
యింద్రియములన్నీ
కేవలము
జడమైనవే.
ఈ
జడమైన
యింద్రియముల
లోపల
ఆత్మతత్త్వమనే
ప్రకాశము
ప్రవేశించి
తద్వారా
యింద్రియముల
చేత
పని
చేయించుచున్నాము.
రాత్రి
నీవు
నిద్రపోతున్నావు.
నీకు
కన్నులుంటున్నాయి.
ఒక
స్వప్నము
వచ్చింది.
ఆ
స్వప్నములో
చూచేవాడు
ఎవరు?
ఈ
కన్నులేనా
కాదే.
ఆ
స్వప్నములో
మాట్లాడేవాడు
ఎవరు!
నీ
నోరు
కాదు.
ఆ
స్వప్నములో
వినే
వాడు
ఎవరు!
నీ
చెవులేనా
కాదు.
ఈ
జడమైన
చెవులు
లౌకికమైన
విషయములు
వింటున్నాయి.
ఈ
జడమైన
కన్నులు
భౌతికమైన
విషయములు
చూస్తున్నాయి.
జాగ్రత్
స్వప్న
సుషుప్తి
యందు
వుండిన
ఆధారమైన
తత్త్వము
యీనాడు
మనము
మరచిపోతే
ఆత్మాన్వేషణ
మనము
మరచిపోతే
నిజముగా
మన
మానవత్వము
వ్యర్ధమనే
చెప్పవచ్చు.
నిరంతరము
భౌతికములోనే
మన
జీవితము
వ్యర్థము
గావించరాదు.
అంతర్దృష్టిని
అభివృద్ధి
గావించుకోవాలి.
అది
లేకపోతే
జీవితము
యేమాత్రము
మాన…
కాదు.
ఎన్ని
సంవత్సరముల
నుండియో
మానవులు
సాధనలు
చేస్తున్నారు.
ధ్యానము
చేస్తున్నారు,
భజనలు
చేస్తున్నారు,
జపము
చేస్తున్నారు.
దీని
వలన
కలిగిన
ఫలితమేమిటి?
ఏ
కించిత్తైనా
మనము
మారగలిగామా?
మనలో
కలిగిన
మార్పు
ఏమిటని
ఎవరికి
వారు
పరీక్షలు
సల్పుకోవాలి.
9
▾
Meaning
Keep
సత్కర్మలు
ఆచరిస్తున్నామే
గాని,
సత్క్రియలలో
ప్రవేశిస్తున్నామే
గాని
లోపల
యేమాత్రము
పరివర్తన
రావటం
లేదు.
లోకసంబంధమైన
ప్రభావములకు
మనము
చాలా
బానిసలమై
పోతున్నాము.
ఈ
ప్రభావాన్ని
…ంచి
…
మరచిపోతున్నాడు
మానవుడు.
కనుక
స్వభావమును
మనము
అభివృద్ధి
పరచుకోవాలి.
స్వభావమే
ఆత్మ
భావము,
ఆత్మ
సర్వుల
యందు
వుండినట్టుగానే
మనము
భావించాలి.
ఈనాడు
నూతన
సంవత్సరమని
భావిస్తున్నాము.
ఉగాది
అంటున్నాము.
ఇది
చంద్రమానమునకు
సంబంధించినది.
మానవుడు
నవగ్రహముల
పైన
ఆధారపడి
వుంటున్నాడు.
ఈ
నవగ్రహములు
కూడను
మానవునికి
కూడి
వచ్చినప్పుడే
మానవత్వము
దివ్యత్వముగా
మారిపోతుందని
భావిస్తున్నాడు.
జ్యోతిష
శాస్త్రములోపల
యీ
గ్రహములను
ప్రధానముగా
చూస్తారు.
అదృష్టవశాత్తు
యీ
సంవత్సరము
రాజు,
మంత్రి,
సైన్యాధిపతి,
శుక్రుడు,
బుధుడు
ముఖ్యమైన
వారు
అధిపతులుగా
వున్నారు.
నవగ్రహముల
లోపల
ఐదు
గ్రహములు
చాలా
ముఖ్యమైన
స్థానములలో
వచ్చారు.
ఇది
దేశమునకు
చాలా
వుపయోగకరమైనదిగను,
ఉత్సాహకరమైనదిగను
శుభకరమైనదిగను
నిరూపిస్తూ
వచ్చాయి.
భవిష్య…
యొక్క
యిది
మానవులపై
ఆధారపడి
వున్నదిగాని
గ్రహములపైన
ఆధారపడి
లేదు.
ఈనాడు
మానవునికి
వున్నవి
నవగ్రహములు
కాదు
రెండే
గ్రహములు.
ఆ
రెండే
రాగద్వేషములు.
ఈ
రాగద్వేషములు
మనము
అణచివేస్తే
అన్నిగ్రహాలు
మన
హస్తగతమవుతాయి.
కనుక
రాగద్వేషాలను
మొట్టమొదట
అరికట్టుకోండి.
మానవత్వములోపల
సహన
భావమును
పెంచుకోండి.
నిజమైన
శాంతమును
బలపరచుకోండి.
ప్రేమ
తత్త్వము
పెంచుకోండి.
ప్రేమకు
మించిన
ప్రాణము
మరొకటి
లేదు.
సత్య
ధర్మ
శాంతి
అహింస
ప్రేమ
పైననే
ఆధారపడి
వుంటున్నాయి.
దైవప్రీతి,
పాపభీతి,
సమాజనీతి
ప్రేమపైనే
ఆధారపడి
వుంటున్నాయి.
కనుక
మనము
ప్రేమమయులుగా
మారినప్పుడే,
ప్రేమ
జగత్తుగా
మారినప్పుడే
జగత్తునందు
శాంతి
సుఖములు
అనుభవించగలము.
కనుక
నూతన
సంవత్సరము
కోసమై
ఒక
సంవత్సరము
కాచుకోనక్కరలేదు.
సంవత్సరమంతా
పన్నెండు
నెలలపైన
ఆధారపడి
వుంటున్నాది.
ఈ
పన్నెండు
నెలలోపల
ఒక్కొక్క
నెల
ముప్పై
దినములపైన
ఆధారపడి
వుంటున్నాది.
ఈ
దినము
ఇరవైనాలుగు
గంటలపైన
ఆధారపడి
వుంటున్నాది.
గంట
అరవై
నిముషముల
మీద
ఆధారపడి
వుంటున్నాది.
నిముషము
అరవై
సెకండ్లపైన
ఆధారపడి
వుంటున్నది.
కనుక,
ఒక్కొక్క
సెకండు
కూడను
నూతనమే.
సెకండు
లేకపోతే
నిముషమే
లేదు.
నిముషము
లేకపోతే
గంటలు
లేవు.
గంటలు
లేకపోతే
నెల
లేదు.
నెల
లేకపోతే
సంవత్సరము
లేదు.
కావున
క్షణముల
పైనే
జీవితము
ఆధారపెట్టుకోవాలి.
క్షణక్షణము
ప్రేమమయులుగా
వుండి
తోటి
మానవులందరిని
ప్రేమగా
మాట్లాడి,
ప్రేమగా
పలకరించి,
ప్రేమ
విషయములు
విని
సంతోషముగా
మన
జీవితము
గడపాలి.
ఈ
ద్వేష
అసూయలకేమాత్రము
అవకాశము
నందించరాదు
10
▾
Meaning
Keep
తరువాత
మానవుడు
గుర్తించవలసినది
నేను
మానవుడు
నేను
మానవు…ంచాలి.
I
am
man
అనేది
half
truth
మాత్రమే.
యింక
అర్ధసత్యము
ఎక్కడవుంది?
I
am
not
animal
యిది
అర్ధసత్యము.
ఈ
రెండర్థములు
చేరినప్పుడే
full
manగా
నీవు
తయారౌతావు.
కనుక
I
am
man,
I
am
not
animal
అని
ఈ
భావానికి
నీవు
వచ్చినప్పుడే
animal
భావములు
నీలో
ప్రవేశించకుండా
వుంటావు.
నీవు
మానవుడని
చెప్పుకుంటూ
పశువు
పనులు
చేయటం
యిది
పవిత్రమైనదేనా.
ఎంత
హీ…నది.
ఎంత
అవమానకరమైనది.
నీవు
మనిషివని
చెప్పుకొని
పశువు
పనులు
చేయటం
యిది
నీకు
తగినదేనా.
చెప్పటం,
చేయటం
సంగా
వుంటున్నాది
పశువు.
నీవు
…ఒకటి
చేయటం
మరొకటి
animal
is
better
than
you.
కనుక
ఆవిధ…
పెడమార్గము
పట్టకుండా
నేను
మానవుడనే
సత్కీర్తి
సాధించు
ప్రేమనే
ప్రాణముగా
విశ్వసించు.
ప్రేమతో
నిత్యజీవితమును
అనుభవించు.
Previous
←
One who would live in happiness and Śānti must practise control of the senses
Next
No Learning Greater than Prema
→