Contents
Devotion & Sacred Story
Home
Library
Find
Shelf
Settings
←
Leave
Sathya Sai Speaks 1988 · One Who Cannot Understand Man Cannot Know Mādhava
Tap a verse for its meaning
IAST
Telugu
Meaning
Continuous
One Who Cannot Understand Man Cannot Know Mādhava
29 April 1988
1
▾
Meaning
Keep
ధర్మజుడు
నరకమునకు
పోయేటప్పటికి
అక్కడ
అందరూ
నరకయాతన
అనుభవిస్తూ
ఆర్తనాదములు
పెట్టుతున్నారు.
ఎప్పుడైతే
ధర్మజుడు
నరకాన్ని
చేరుకున్నాడో
అక్కడివారందరికి
ఒక
విధమైనటువంటి
మానసిక
వుల్లాసము
కలిగింది.
అందుకు
కారణమేమనగా
ధర్మజుడు
నరకములో
అడుగపెట్టటమే!
యింతలో
ధర్మజుని
నరకప్రారబ్ధము
పూర్తయినది.
ఇక
స్వర్గలోకమునకు
పోవాలి.
అటువంటి
సమయములో
నరకవాసులంతా
ధర్మజుని
నరకములోనే
వుండిపొమ్మని
కోరారు.
అప్పుడు
ధర్మజుడు
తన
పుణ్యఫలమునంతా
నరకవాసులకు
ధారపోశాడు.
ఫలితంగా
వారి
పాపములంతా
నశించి
వారు
స్వర్గవాసమునకు
అర్హులయ్యారు.
కుక్కనుమాత్రం
వదలలేదు.
ధర్మజుడు
స్వర్గమునకు
వెళ్ళేటప్పుడు
కూడా
తనవెంట
వస్తున్న
కుక్కను
వదలకపోతే
నేనుకూడా
స్వర్గ
ప్రవేశము
చెయ్యను
అన్నాడు.
అప్పుడు
ఆ
కుక్క
తనయొక్క
నిజ
స్వరూపాన్ని
అనగా
యమధర్మరాజు
స్వరూపాన్ని
ధరించి
‘ఓ
ధర్మజా!
నేను
నిన్ను
పరిక్షించకోరి
ఈ
ఆకారాన్ని
ధరించాను.
నీయొక్క
ధర్మనిరతి
మూడు
లోకములు
వ్యాపించును’,
అన్నది.
ఆనాటినుండి
ధర్మజుని
ఖ్యాతి
జగద్వ్యాప్తి
అయింది.
పాండవులయొక్క
త్యాగమువలననే
భారతదేశమునకు
ఇంతటి
కీర్తి
లభించినది.
పాండవులు
13
సం॥లు
అరణ్యవాసములోపల
ఒక్క
క్షణమైనను
వృధా
చేయలేదు.
ఆ
సమయములో
వారు
తపస్సులు
చేసి
చాలా
శక్తిని,
అస్త్రాలను
సంపాదించారు.
అర్జునుడు
గాండీవాన్ని
సంపాదించగలిగాడు.
ఒక
చిన్న
ఉదాహరణము.
అర్జునుడు
ఒంటి
స్తంభముపైన
కూర్చొని
తపస్సు
చేస్తున్నాడు.
అగ్ని
వచ్చి
ఆ
స్తంభాన్ని
దహించివేసింది.
అయినను
అతడు
ఏమాత్రము
చలించలేదు.
అర్జునునియొక్క
నిగ్రహశక్తికి
మెచ్చి
అగ్ని
అతనికి
దాసోహము
అయ్యింది.
ఒక
అప్సరస
వచ్చి
‘నీ
వలన
నాకు
పుత్రుడు
కావలెను’
అన్నది.
2
▾
Meaning
Keep
‘నావలన
ఎందుకు,
నన్నే
పుత్రుడుగా
స్వీకరించమ’న్నాడు
అర్జునుడు.
ఈ
నిగ్రహశక్తి
వలన
పంచభూతములుకూడను
అర్జునునికి
స్వాధీనము
అయిపోయినవి.
అందువలననే
యీనాడుకూడను
వురుములు,
గర్జనలు
వచ్చిన
సమయములో
అర్జునుని
తలచుకుంటారు.
మంచి,
చెడుల
విచారణ
చెయ్యటమే
విద్యయొక్క
ప్రధానలక్ష్యము
దుర్యోధనుడు
చాలా
పాపములు
చేసినప్పటికిని,
సూర్యుని
పుత్రుడైన
కర్ణునికి
చాలా
సహాయము
చేశాడు.
మత్స్యయంత్రము
కొట్టే
సమయములోపల
ద్రౌపది
‘మత్స్యయంత్రము
కొట్టినవాడు
క్షత్రియుడైనా
అయియుండాలి
లేదా
మహారాజుగానైనా
యుండాలి.
ఈ
రెండుకానివానికి
దానిని
ఛేదించే
అధికారములేదు’,
అన్నది.
కర్ణుడు
వచ్చాడు.
‘నీవు
క్షత్రియుడవా,
నీది
ఏ
రాజ్యము’,
అని
అడిగారు.
‘నేను
సూతవంశమువాడను’
అని
బదులిచ్చాడు.
అర్జునునకు
సరియైన
సాటి
కర్ణుడు
అని
దుర్యోధనుడికి
ఒక
నమ్మకం
కలిగింది.
కర్ణుడు
అవమానముతో
వెనుతిరిగి
వస్తున్నాడు.
అప్పుడు
దుర్యోధనుడు
కర్ణుని
అంగరాజుగా
పట్టాభిషేకము
చేశాడు.
ఆనాటినుండి
కర్ణుడు
దుర్యోధనునకు
మిత్రుడుగా
వుంటున్నాడు.
‘పదిమందిలో
నాకు
పరాభవము
కలిగినప్పుడు
నీవు
నా
గౌరవాన్ని,
ప్రాణాన్ని
నిలబెట్టావు.
నా
ప్రాణం
వున్నంతవరకు
నీకు
సేవ
చేస్తూ
నిన్ను
కాపాడతాన’ని
కర్ణుడు
దుర్యోధనునికి
వాగ్దానము
చేశాడు.
సర్వశక్తులు
నీకే
అర్పితము
చేస్తాను
అన్నాడు.
మనలో
మంచి,
చెడ్డ
భావములు
వస్తుంటాయి.
కాని
ఏది
మంచి,
ఏది
చెడు
అనే
విచారణ
చెయ్యాలి.
ఆ
విచారణశక్తి
శూన్యమైపోతే
చెడును
పెంచుకుంటారు,
మంచిని
విసర్జిస్తారు.
మంచి
చెడులయొక్క
విచారణ
చెయ్యటమే
విద్యయొక్క
ప్రధాన
లక్ష్యము.
శివునివద్దనున్న
పాశుపతాస్త్రము.
జనకుడివద్దనున్న
శివధనుస్సు,
అర్జునుడివద్దనున్న
గాండీవము
అన్నియూ
ఒక్కటే!
ఒకనాడు
వైకుంఠమునకు
సనక,
సనందన,
సనత్కుమారులు
చిన్న
పిల్లలుగా
వచ్చినప్పుడు
ద్వారపాలకులైన
జయవిజయులు
వారిని
అడ్డుకున్నారు.
ఎందుకంటే,
వారు
దిగంబరులుగా
వున్నారు.
అప్పుడు
వారు
చెప్పారు,
‘మాకు
సర్వత్రా
సంచారము
చేయటానికి
అధికారముంటున్నాది’
అని.
జయవిజయులకు
విష్ణువు
అంటే
ప్రీతి,
అభిమానము.
3
▾
Meaning
Keep
అందువలన
వారిని,
ప్రేమతోనే
మీరు
విష్ణువును
ద్వేషించురుగాక!’
అని
శాపమిచ్చినారు,
మునులు.
వారే
హిరణ్యాక్ష-హిరణ్యకశిపులుగా,
రావణ-కుంభకర్ణులుగా,
శిశుపాల-దంతవక్రులుగా
మూడు
యుగములలో
మూడు
జన్మములు
పొంది
చివరకు
ముక్తులై
మరల
వైకుంఠము
చేరుకున్నారు.
భగవంతుడు
ధర్మసంస్థాపన
నిమిత్తమై
కొన్ని
కార్యములు
చేస్తూంటాడు
దైవకార్యములో
ప్రతికార్యమునకు
ఒక
కారణముంటున్నాది.
మహాభారతములో
కృష్ణుడు
ధర్మజునితో
‘అశ్వత్థామ
హతః’
అని
గట్టిగాను
‘కుంజరః’
అని
మెల్లగాను
చెప్పమన్నాడు.
అశ్వత్థామ
మరణవార్త
విన్న
ద్రోణాచార్యుడు
తనయొక్క
అస్త్రములను
విడచిపెట్టాడు.
అప్పుడు
ధర్మజుడు
అడిగాడు,
‘కృష్ణా!
ఇది
ధర్మమా!’
అని.
కృష్ణుడు
చెప్పాడు:
“ఈ
యుద్ధములో
నాకు
వచ్చే
లాభముకాని,
నష్టముకాని
లేదు.
మీరు
నావారు,
వారు
నావారుకాదని
భేదభావములేదు.
కేవలము
ధర్మసంస్థాపన
నిమిత్తమై
నేను
కార్యములు
చేస్తుంటాను.
నాకు
కర్తవ్య
కర్మలు
లేవు.
నేనుగాని
కర్మలు
చేయకపోతే
ప్రకృతంతయు
స్తంభించిపోతుంది.
ప్రకృతిలో
ప్రవృత్తి,
నివృత్తియొక్క
తత్త్వములను
సన్మార్గములో
పెట్టాలంటే
నేను
కర్మలు
చేయవలెను”.
యుద్ధము
ముగిసిన
తరువాత
కృష్ణుడు
ధర్మజునకు
వివరించి
చెప్పాడు.
“ద్రోణాచార్యుడు
పాండవులకు,
కౌరవులకు
గురువే
కాని
ఆయన
బ్రాహ్మణుడు;
క్షత్రియుడు
కాదు.
అతనికి
యుద్ధము
చేసే
అధికారములేదు.
అంతేకాకుండా
శిష్యులతో
యుద్ధము
చేయడం
అధర్మము.
ఆ
విధముగా
ద్రోణుడు
ధర్మము
తప్పినాడు.
యుద్ధములో
కొన్ని
ధర్మములుంటున్నాయి.
ఎవరు
ఎవరితో
యుద్ధము
చేయవలెనని
నిర్ణయిస్తారో
వారితో
మాత్రమే
యుద్ధము
చేయవలెనుగాని,
తన
యిష్టానుసారము
యుద్ధము
చేయకూడదు.
యుద్ధభూమిలో
వున్నంతవరకు
మాత్రమే
శత్రువులు.
యుద్ధవిరామము
తరువాత
అందరూ
బంధువులే!”
ఘటోత్కచుడు,
భీముడు
మరియు
హిడింబికి
పుట్టినవాడు.
అతడు
రాక్షసుడు.
యుద్ధములో
పాల్గొన్నాడు.
యుద్ధములో
సాయంత్రమువరకు
పోరాడుతున్నాడు.
చీకటి
అయ్యేకొలది
అతని
శక్తి
ఎక్కువవుతూవచ్చింది.
చాలా
భీభత్సము
సృష్టిస్తున్నాడు.
వాడిని
చంపే
బలము
ఎవ్వరికి
లేదు.
ఆఖరికి
అర్జునునిగురించి
దాచిపెట్టిన
అస్త్రాన్ని
ఘటోత్కచునిపైన
కర్ణుడు
ప్రయోగించాడు.
4
▾
Meaning
Keep
యుద్ధములో
ప్రారంభదశలో
కౌరవులకు
విజయము
వరించింది.
పాండవులు
చింతించుచూ
కృష్ణుని
ప్రార్థించారు.
“మంచికి
ప్రారంభములో
చిక్కులు
వస్తాయి.
చెడు
ప్రారంభములో
ఆనందాన్నిస్తుంది.
అది
కొంతకాలమే
కాబట్టి,
మీరు
మీయొక్క
కర్తవ్యాన్ని
చేసుకుంటూ
రండి”
అన్నాడు,
కృష్ణుడు.
భగవంతునికి
అర్పించిన
పదార్థము
అక్షయమవుతుంది
ఒకానొక
సమయములోపల
పాండవులు
అరణ్యవాసములో
వుండినప్పుడు
వారిని
చూడడానికి
కృష్ణుడు
వెళ్ళాడు.
పాండవులు
తమ
బాధలగురించి
విన్నవించుకున్నారు.
ధర్మజుడు
చెప్పాడు,
‘మేము
మగవాళ్ళము
ఎటువంటి
కష్టములకైనా
ఓర్చుకొని
జీవితము
గడుపగలము.
కాని,
ద్రౌపది
స్త్రీ
కనుక
ఆమె
ఈ
బాధలను
తట్టుకోవటము
చూసి
మేము
సహించుకోలేకపోతున్నాము.
ఏదైనా
ఒక
ఉపాయము
చెప్పమ’న్నాడు.
కృష్ణుడు
ఒక
ఆకు
తీసుకొని
దానిమీద
‘ఎప్పటికి
వుండవు’
అని
వ్రాసి
జాగ్రత్తగా
మడచి
ధర్మజునకు
యిచ్చాడు.
‘నీకు
ఎటువంటి
కష్టములు
వచ్చినా
బాధపడకుండా
ఆ
ఆకును
తీసి
చూడు.
నీ
కష్టములు
తీరిపోతాయి’,
అన్నాడు.
ఒకనాడు
దుర్వాసుడు
దుర్యోధనుని
ఆతిథ్యము
తీసుకోటానికి
హస్తినాపురము
వెళ్ళాడు.
కాని,
అక్కడ
కుటిల
బుద్ధితో
దుర్వాసుని
క్రోధమునకు
పాండవులు
గురికావాలని
ఆలోచించి
దుర్యోధనుడు
పాండవులవద్దకు
ఆతిథ్యముకొరకు
దుర్వాసుని
పంపించాడు.
దుర్వాసుడు
తన
వారందరిని
తోడుపెట్టుకొని
పాండవులవద్దకు
వెళ్లాడు.
తాను
స్నానమాచరించి
వచ్చేలోపల
తన
వారందరికి
భోజనము
సిద్ధము
చేయమని
ఆదేశించి
నదికి
వెళ్లిపోయాడు.
అప్పటికే
పాండవులు
తమయొక్క
భోజనము
సమాప్తిచేసుకున్నారు.
వారివద్దనున్న
అక్షయపాత్ర
దినమునకు
ఒక్కతూరి
మాత్రమే
ఆహారమునందిస్తుంది.
ఈ
సంకట
పరిస్థితిలో
ధర్మజుడు
ఆ
ఆకును
తీసి
చూశాడు.
అందులో
‘ఎప్పటికి
వుండవు’
అని
వ్రాసి
వున్నది.
ద్రౌపది
కృష్ణుని
ప్రార్థించింది.
కృష్ణుడు
ప్రత్యక్షమై
‘నాకు
ఆకలిగా
వున్నది
ఏమైనా
భోజనమునకు
వున్నాయా
యివ్వండి’,
అని
అన్నాడు.
ఆ
అక్షయపాత్రను
ఒకసారి
క్షుణ్ణంగా
చూడమన్నాడు,
ఏమైనా
వుంటుందని.
అప్పుడు
ఆకుముక్క
ఒకటి
దానిలో
యుండటం
చూసి
అది
తిని
అక్షయము
అన్నాడు.
నదిలో
స్నానము
చేస్తున్న
దుర్వాసుడు
మరియు
వారి
శిష్యులందరి
ఆకలి
తీరిపోయినది.
5
▾
Meaning
Keep
దీనివలన
మనం
తెలుసుకోవలసినది,
భగవంతునికి
ఏమి
యిచ్చినప్పటికిని
అది
అక్షయముగా
మారిపోతుంది.
భగవంతుడు
ఏమి
చేసినా
దానికొక
కారణముంటుంది
ఒక
సంక్రాంతి
దినమునాడు
కృష్ణుడు,
సత్యభామ,
రుక్మిణి,
ద్రౌపది
అందరూ
కలసి
చెఱకులు
తింటున్నారు.
ఆ
సమయములో
చెఱకు
కోస్తున్న
కృష్ణుని
చిటికెన
వేలుకు
గాయం
తగిలినది.
దానికి
కట్టు
కట్టడానికి
సత్యభామ,
రుక్మిణి
గుడ్డను
తీసుకురావటానికి
చెలికత్తెలను
పంపించారు.
కాని
వెంటనే
ద్రౌపది
తన
క్రొత్తచీరను
చింపి
కృష్ణునియొక్క
చిటికెన
వేలికి
కట్టు
కట్టింది.
ఆ
ఉపకారమును
పురస్కరించుకొని
కౌరవసభలో
ద్రౌపదిని
నిర్వస్త్రను
చేయడానికి
ప్రయత్నించిన
సమయంలో
ఆమెకు
కృష్ణుడు
అక్షయముగా
చీరలను
అందించి
కాపాడాడు.
కాబట్టి
మనము
భగవంతునికి
ఏమి
సమర్పించుకున్నను
దానిని
తిరిగి
అందుకోటానికి
అధికారముంటున్నాది.
భగవంతుడు
చేసిన
ప్రతికార్యమునకు
ఒక
కారణముంటుంది.
కర్ణునకు
ఒక
శాపముంటుంది.
తన
గురువు
అయిన
పరశురామునకు
తాను
బ్రాహ్మణుడనని
నమ్మించి
అతని
వద్ద
విద్యలు
నేర్చుకున్నాడు.
కడపటికి
అతడు
క్షత్రియుడని
తెలిసింది.
తనను
వంచించి
నేర్చుకున్న
విద్యలు
నిష్ప్రయోజనమవుతాయని
పరశురాముడు
కర్ణునికి
శాపమిచ్చాడు.
యుద్ధసమాప్తము
అయిన
తరువాత
ఒకనాడు
కృష్ణుడు
అర్జునుని
రథము
దిగమన్నాడు.
అర్జునునికి
అహంకారమువలన
ముందు
నువ్వు
దిగమన్నాడు
ఈ
విధముగా
వాదోపవాదములు
జరిగిన
తరువాత
ఆఖరికి
అర్జునుడు
రథము
దిగాడు.
కృష్ణుడు
రథమునుండి
దిగినవెంటనే
ఆ
రథము
భస్మమయినది.
కారణం,
కర్ణునియొక్క
అస్త్రములవలన
అర్జునుని
రథము
ఏనాడో
భస్మము
అయివుండేది.
కాని
కృష్ణుడు
దానిని
కాపాడుతూ
వస్తున్నాడు.
అప్పుడు
అర్జునుడు
తన
అహంకారము
విడిచి
కృష్ణుని
వేడుకున్నాడు.
భీష్ముడు
వదలిన
అస్త్రముల
తాకిడికి
తట్టుకొనలేక
అర్జునుడు
కృష్ణుని
స్మరించుకుని
‘ఏ
కృష్ణుడైతే
నన్ను
సృష్టించాడో
ఆ
కృష్ణుడే
నన్ను
రక్షించాలి,
ఏ
కృష్ణుడైతే
నాకు
శిక్షణ
యిచ్చాడో
అతడే
నాకు
రక్షగా
వుండాలి’
అని
వేడుకున్నాడు.
భీష్ముని
ప్రతాపమును
చూచి
అర్జునుడు
బలహీనుడైనాడు.
6
▾
Meaning
Keep
Also in his talks
(3)
23 June 1989
The Essence of the Vedas Is the Sound of the Flute
5 October 1992
What man must seek is real, eternal happiness
10 September 2002
The Inner Meaning of Vināyaka Worship
అప్పుడు
కృష్ణుడు
ఆవేశముతో
రథము
దిగి
‘భీష్ముని
నీవు
చంపుతావా
లేక
నన్ను
చంపమంటావా’
అన్నాడు.
ఇది
అర్జునునకు
ఒక
విధమైన
ఉద్రేకము
తెప్పించుటకు
చేసినదే
కాని
మరొకటి
కాదు.
అదే
విధముగా
భగవంతుడు
చేసిన
ప్రతి
చర్యకు
ఒక
గూఢార్థము
మరియు
కొన్ని
కారణములు
వుంటాయి.
కృష్ణుడు
తనను
చంపుతానని
రథము
దిగివస్తున్నప్పుడు
భీష్ముడు
కృష్ణుని
ఈ
విధంగా
వర్ణించాడు:
కుప్పించి
ఎగసిన
కుండలమ్ముల
కాంతి
గగన
భాగంబెల్ల
గప్పికొనగ
నురికిన
నోర్వక
యుదరంబులోనున్న
జగముల
వ్రేగున
జగతి
కదల
జక్రంబు
చేబట్టి
చనుదెంచు
రయమున
పైనున్న
పచ్చని
పటము
జార
నమ్మితి
నా
లావు
నగుబాటు
సేయక
మన్నింపుమని
క్రీడి
మరల
దిగువ
కరికి
లంఘించు
సింహంబు
కరణి
మెరసి
నేడు
భీష్ముని
చంపుదు
నిన్ను
గాతు
విడువుమర్జున
యనుచు
మద్విశిఖవృష్టి
దెరలి
చనుదెంచు
దేవుండు
దిక్కు
నాకు
కృష్ణుడు
చంపడానికి
వచ్చినప్పుడుకూడా
భీష్ముడు
‘కృష్ణుడే
నన్ను
రక్షించుగాక’,
అని
వేడుకుంటున్నాడు.
ఎందుకంటే
శిక్షించేది
తానే,
రక్షించేది
తానే
అని
తెలుసుకున్నవాడు
కాబట్టి.
అతడే
జ్ఞాని,
భీష్మాచార్యుడు.
తన
తత్త్వమును
తాను
గుర్తించినవాడే
దైవత్వాన్ని
గుర్తించగలడు
ఆత్మజ్ఞానముపొందిన
తరువాతకూడా
బయట
ఎవరు
వెతుకుతారో
వారు
అజ్ఞాని.
జీవాత్మవేరు,
పరమాత్మవేరుకాదు,
ఏకాత్మగా
రావాలి.
చేసేవాడొకడు,
చేయించుకున్నవాడొకడు
కాడు.
7
▾
Meaning
Keep
కాబట్టి,
ఏ
పని
చేసినా,
ఏ
వస్తువును
చూచినా,
ఏ
కార్యములో
ప్రవేశించినా
అంతా
దైవకార్యముగానే
భావించాలి.
ఆ
దైవత్వాన్ని
ప్రత్యేకముగా
చూడాలంటే
సాధ్యముకాదు.
తన
తత్త్వాన్ని
తాను
గుర్తించిన
తరువాతనే
దైవత్వాన్ని
తెలుసుకోటానికి
అవకాశము
ఏర్పడుతుంది.
నిన్ను
నీవు
తెలుసుకోలేకపోయినప్పుడు
దైవాన్ని
ఏ
విధముగా
తెలుసుకోగలవు?
ఒకడు
భగవంతుని
తెలుసుకోవటానికి
తపస్సు
చేసుకుంటూ
వచ్చాడు.
కళ్ళుమూసుకొని
ధ్యానములో
మునిగిపోయాడు.
కొంతకాలము
తరువాత
భగవంతుడు
ఒక
చిన్న
గొల్లపిల్లవాని
రూపంలో
వచ్చి
ఆ
వ్యక్తిని
అడిగాడు,
‘నీవు
ఏమి
చేస్తున్నావు?’
అని.
‘తపస్సు
చేస్తున్నాను’,
అన్నాడు,
ఆ
వ్యక్తి.
‘ఎందుకు
తపస్సు
చేస్తున్నావు?’
అని
అడిగాడు.
‘భగవంతుని
గురించి
తెలుసుకోటానికి
తపస్సు
చేస్తున్నాను’,
అన్నాడు.
మరల
కొంతకాలము
తరువాత
ఆ
పిల్లవాడు
వచ్చి
‘ఏమి
తెలుసుకున్నావ’ని
ప్రశ్నించాడు.
అప్పుడు
ఆ
తపస్వి
చెప్పాడు.
‘భగవంతుని
గురించి
తెలుసుకోవటం
కష్టము
అని
తెలుసుకున్నాన’ని
చెప్పాడు.
అప్పుడు
పిల్లవాడు
అడిగాడు,
‘నీ
కళ్ళ
ఎదురుగా
ఎవరున్నారు?’
అని.
‘గోపాలుడున్నాడు’
అని
బదులిచ్చాడు.
‘గోపాలుడనగా
ఎవరు?
గోవులను
పాలించువాడు
అని
అర్థము.
అనగా
జీవులను
పాలించువాడు’
అని
బోధపరచాడు
ఆ
బాలుడు.
‘ఇన్నాళ్లు
నేను
కళ్లు
మూసుకొని
తపస్సు
చేశాను.
కాని
కళ్ళ
ఎదురుగా
వున్న
భగవంతుని
తెలుసుకోలేకపోయాను’
అని
తన
మూర్ఖత్వమును
తెలుసుకున్నాడు.
మానవుని
అర్థము
చేసుకోలేనివాడు
మాధవుడిని
తెలుసుకోలేడు.
సర్వత్ర
వుండినటువంటిది
భగవత్తత్త్వమే!
పూర్వం
ఉత్తరప్రదేశ్లోపల
మన్సూర్
అనే
వ్యక్తి
వుండేవాడు.
అతను
‘సర్వత్రా
భగవంతుడున్నాడు,
దేవుడు
లేనట్టి
పదార్థము
కాని,
దేవుడు
లేని
స్థానముకాని,
తనది
కాని
రూపము
కాని,
తనది
కాని
నామము
కాని
జగత్తులో
లేనేలేదు’,
అనే
గట్టి
విశ్వాసము
గలవాడు.
‘సర్వం
విష్ణుమయం
జగత్’
అని
నమ్మకము
గలవాడు.
అతను
‘అనల్
హక్వా,
అనల్
హక్వా,
అనల్
హక్వా’,
అనగా
‘నేనే
దేవుడు,
నేనే
దేవుడు,
నేనే
దేవుడు’
అని
తలుస్తున్నాడు.
చాలామంది
వీడు
పిచ్చివాడని
అనుకున్నారు.
అతడు
తన
బోధనలయందు
వేదాంతముయొక్క
రహస్యాన్ని
చెపుతున్నాడు.
8
▾
Meaning
Keep
‘నీవు
వెలుపల
చూశావా!
నీ
లోపల
చూశావా!’,
అని
కొందరు
పండితులు
అతనిని
ప్రశ్నించారు.
‘అంతర్బహిశ్చతత్సర్వమ్
వ్యాప్య
నారాయణస్థితః’
అన్నాడు.
వేదములోని
అక్షరసత్యాన్ని
అతను
చెపుతూ
వస్తున్నాడు.
కనుక,
ఇతనిని
పిచ్చి
వాడని
ఏ
విధముగా
అనుకోవచ్చు?
‘దేవుని
రూపము
ఏ
విధముగా
వుంటుంది’,
అని
అడిగారు.
‘దేవుడు
ఆనందస్వరూపుడు’
అన్నాడు.
ఆనంద
స్థితియే
భగవత్స్వరూపము
అన్నాడు.
ఇతనియొక్క
ప్రచారము
రాజ్యమంతా
వ్యాపించిపోయినది.
‘అహం
బ్రహ్మాస్మి’,
‘తత్త్వమసి’,
‘ప్రజ్ఞానం
బ్రహ్మ’,
‘అయమాత్మ
బ్రహ్మ’,
‘నేనే
దైవము’
ఇవే
అతను
బోధిస్తూవచ్చాడు.
అక్కడవున్న
పండితులందరూ
అతనిపైన
ద్వేషము
పూని
రాజుగారి
దగ్గరకు
వెళ్ళి
ఫిర్యాదు
చేశారు,
‘ఒక
ఫకీరు
వచ్చి
మమ్మల్నందరిని
అవమానము
పరుస్తున్నాడు’,
అని.
ఫకీరు
అంటే
ఎవరు,
ఫికరు
లేనటువంటివాడు.
అనగా
చింత
లేనటువంటివాడు
అని
అర్థము.
అతనికి
ఎటువంటి
చింతలేదు.
రాజు
వేసిన
ప్రతి
ప్రశ్నకు
అతను
కేవలం
‘అనల్
హక్వా’
అని
జవాబు
యిస్తున్నాడు.
రాజు
సమక్షములో
పండితులు
వేదాలనుండి,
పురాణాలనుండి,
శాస్త్రాలనుండి
వేసినటువంటి
ప్రశ్నలకు
వారికికూడా
తెలియనటువంటి
రహస్యాలను,
అర్థాన్ని
చెబుతూ
వచ్చాడు.
పండితులందరు
ఇవి
విరుద్ధమైన
అర్థాలు
అని
వాదించారు.
రాజు
ఒప్పుకున్నాడు.
ఎందుకంటే
సంస్థానములో
నున్న
పండితులు
చెప్పిందే
సరియైనదని
భావించాడు
రాజు.
కవి
అనగా
ఎవరు?
పదములుకూర్చునటువంటివాడు
కాదు,
‘క్రాంత
దర్శినః
కవిః’,
అనగా
‘త్రికాలములను
దర్శించినవాడు
కవి’
అన్నాడు.
అతనే
భగవంతుడు.
‘పురాణః’
అంటే
ఏమిటీ?
‘దేహము
అనేటువంటి
పురములో
నఖ,
శిఖ
పర్యంతము
సంచరించినటువంటి
చైతన్యశక్తియే
పురాణము.
దేహములోనున్నటువంటి
ప్రతి
అణువులో
తనయొక్క
చైతన్యముంటుంటాది.
అదే
పురాణతత్వము.
Constant
Integrated
Awareness
అనగా
ప్రజ్ఞ.
అదే
God.
నీ
food
లో
వున్నాడు.
నీ
head
లో
వున్నాడు.
నీ
blood
లో
వున్నాడు.
నీ
బుద్ధిలో
వున్నాడు.
సర్వత్రావుండినటువంటిది
భగవత్తత్త్వమే.
Previous
←
The Land That Loves God Is Bhārata
Next
Merging the Mind in the Ātma Is the Rāma Principle
→