Contents
Devotion & Sacred Story
Home
Library
Find
Shelf
Settings
←
Leave
Sathya Sai Speaks 1988 · Merging the Mind in the Ātma Is the Rāma Principle
Tap a verse for its meaning
IAST
Telugu
Meaning
Continuous
Merging the Mind in the Ātma Is the Rāma Principle
30 April 1988
1
▾
Meaning
Keep
ధర్మము
సత్యముపైన
ఆధారపడియున్నది
‘రమయతే
ఇతి
రామః’
‘రా’
అనగా
ఆత్మ.
‘మ’
అనగా
మనస్సు.
మనస్సును
ఆత్మలో
చేర్చటమే
రామతత్త్వము.
మనువుయొక్క
పుత్రుడు
ఇక్ష్వాకుడు
రఘువంశమునకు
మూలపురుషుడు.
అతని
కుమారుడు
దిలీపు
చక్రవర్తి
చాలా
పరాక్రమశాలి.
జగత్తునంతాకూడను
తన
ఆధీనములో
ఉంచినవాడు.
సగరుడు,
రఘు,
దశరథుడు,
అజ
మహారాజు
వీరందరు
సూర్యవంశములో
చాలా
ప్రధానమైనటువంటివారు.
భగీరథుడు
సగరునియొక్క
కుమారుడు.
ఇతను
పవిత్రమైన
గంగను
భూమికి
తెచ్చిన
వీరుడు.
ఈ
రఘువంశములో
ప్రతీ
వ్యక్తి
ఒక
ఆదర్శమును
చాటుతూ
వచ్చారు.
భృగు
మహర్షి
మరియు
భగీరథునియొక్క
తత్త్వానికి
వ్యత్యాసముండదు.
‘ఆడినమాట
తప్పకూడదని,
సత్యమే
దైవస్వరూపమని,
విశ్వమంతయూ
సత్యములోనే
ఇమిడియున్నదని
భావించి
సత్యమునే
సాక్షాత్కరించుకుంటే
సర్వమును
సాధించినవారమవుతాము’,
అని
భావించినవారు
మరియు
‘సత్యంనాస్తి
పరోధర్మః’
అనే
సూక్తిని
ప్రపంచానికి
చాటినటువంటివారు
రఘువంశపు
రాజులు.
సత్యాన్ని
సాక్షాత్కరించుకున్న
వ్యక్తి,
సత్యముగురించి
సర్వమును
ధారపోసిన
వ్యక్తి
హరిశ్చంద్రుడు
ఈ
రఘువంశమునందు
జన్మించినవాడు.
సామాన్యమైనటువంటి
ప్రజలు
ఈ
సత్యమార్గమును
సరియైనటువంటి
రీతిలో
అనుసరించటానికి
అవకాశముండదని
మానవులకు
పురుషార్థములైనటువంటి
కొన్ని
మార్గములు
ప్రబోధించి,
శాసించి,
సాధనయందు
సాక్షాత్కరింపవచ్చని
ధర్మ,
అర్థ,
కామ,
మోక్షములని
నాలుగు
మార్గములను
నియమిస్తూ
వచ్చారు.
యుగములు
మారుకొలది
వీటియొక్క
భావములు
మారుతూ
వచ్చాయి.
అజ్ఞానముచేత
ఆశలను
పెంచుకొని
అవి
నిరాశలు
కాగా
కృంగి,
కృశించి,
తన
శక్తి
సామర్థ్యములనే
విస్మరించి
తద్వారా
మానవత్వాన్ని
కోల్పోతూ
వచ్చారు.
మానవత్వమనే
దాంట్లో
ప్రత్యేకమైనటువంటిది
ధర్మము.
ఈ
ధర్మము
దేనిపైన
ఆధారపడియున్నదనగా
సత్యముపైన
ఆధారపడియున్నది.
2
▾
Meaning
Keep
మమకారముచేతను,
అభిమానముచేతను,
వ్యామోహముచేతను
ఆడినమాట
తప్పడానికి
పూనుకున్న
దశరథునకు
కుమారుడైనటువంటి
రాముడు
సత్యమును
పోషించటము,
సత్యమును
నిలబెట్టడము,
సత్యాన్ని
జగత్తునకు
నిరూపించటము
రఘువంశముయొక్క
ధర్మములని,
వాటిని
రక్షిస్తానని,
వాటిని
కాపాడే
నిమిత్తము
సర్వమును
త్యాగము
చేస్తానని
దీక్ష
పూనాడు.
కాలమును
అందరు
అనుసరించవలసినదేగాని
కాలము
ఎవ్వరిని
అనుసరించదు
‘కాలకాల
ప్రపన్నానాం
కాలః
కిం
న
కరిష్యతి’
అని
కాలాన్ని
జయించటము,
కాలాన్ని
సాధించటము
మానవునియొక్క
ప్రధానమైన
కర్తవ్యము.
అయితే
కాలము
ఎవ్వరికి
బంధువుకాదు.
కాలము
ఎవ్వరికి
లొంగదు.
కాలము
ఎవ్వరికొరకు
ఆగదు.
కాలమునకు
జాతిమతకులభేదము
ఏమాత్రములేదు.
కాలమునకు
ఎటువంటి
ప్రతిజ్ఞ
లేదు.
కాలమును
అందరూ
అనుసరించవలసినదేగాని
కాలము
ఎవ్వరిని
అనుసరించదు.
కనుక,
కాలమును
పవిత్రము
గావించటానికి
కాయమును
ధరించిన
మానవుడు
కర్మనే
కర్తవ్యముగా
విశ్వసించి
కాయాన్ని
అర్పితము
చేయాలి.
కాలకర్మకారణ
కర్తవ్యములచేతనే
మానవత్వము
ముడిపడివుంటున్నది.
ఇట్టి
మానవత్వానికి,
దివ్యత్వానికి
సంబంధముంటున్నది.
మానవునకు
మానవునకు
మధ్య
మనస్సే
తెర.
కనుక,
మనస్సనేటువంటిదానిని
సక్రమమైన
మార్గములో
ప్రవేశపెట్టినప్పుడు
మానవులమధ్య
సత్సంబంధములు
ఏర్పడటానికి
వీలవుతుంది.
దీనిని
పురస్కరించుకునియే
‘మనయేవ
మనుష్యాణాం
కారణం
బంధమోక్షయోః’
అన్నారు.
కాలగర్భములో
ధర్మములన్నియూ
కలిసిపోయినవి.
‘సమస్త
లోకాః
సుఖినో
భవంతు’
అనే
హైందవ
సాంప్రదాయము
ఈనాడు
సంకుచితమైన
మార్గములో
ప్రయాణము
చేస్తున్నది.
విశాలత్వమైనటువంటిది
విరిగిపోయింది.
మానవత్వము
మరుగున
పడిపోయింది.
దివ్యత్వము
గాలికి
రాలిపోయింది.
ధర్మసూత్రములన్నియుకూడను
ఏమాత్రము
అర్థముకాకుండా
పోతున్నవి.
లోకములో
నూటికి
99
శాతము
పురుషార్థములలో
మూడవదైన
కామమునే
కోరుకుంటున్నారు.
ఈ
ఆశలు
పెరిగిపోవటంచేతనే
ధర్మ,
అర్థములను
మరచిపోతున్నారు.
ఇంక
మోక్షముగురించి
చెప్పనక్కరలేదు.
3
▾
Meaning
Keep
ఈ
వాంఛలు
వృక్షపుకొమ్మలపైన
నిద్రించేటువంటి
స్థితి.
ఈ
మత్తులోపల
ఏ
క్షణములో
క్రిందకు
కూలిపోతారో?
ఈ
సత్యాన్ని
మానవుడు
గుర్తించుకోలేకపోతున్నాడు.
దీనివలన
ధర్మార్థములుకూడను
పెడమార్గము
పడుతున్నాయి.
తాను
నిర్ణయించుకున్నదే
ధర్మమని,
తాను
ఆర్జించినదే
ధనమని,
తాను
అనుభవించినదే
సుఖమని,
తాను
అర్థము
చేసుకున్నదే
దివ్యత్వమని
భావిస్తున్నారు.
యివన్నియు
తన
సంకల్పములపైననే
ఆధారపడియున్నవి.
ఈ
సంకల్పములు
ఎక్కడనుండి
వస్తున్నవి?
కన్నులు
చూస్తున్నవి,
చెవులు
వింటున్నవి,
నోరు
మాట్లాడుతున్నది.
ఇవి
కేవలము
యింద్రియములయొక్క
ధర్మమా?
లేక
యింద్రియములవెనుక
ఏమైనా
ఆధారమున్నదా?
కన్నులయొక్క
ధర్మమే
అయినప్పుడు
మృతదేహమునకు
కన్నులున్నవికదా,
అది
చూస్తున్నదా?
చెవులున్నవికదా,
అది
వింటున్నదా?
కాదు
కాదు.
ఈ
యింద్రియములకు
వెనుక
ఒక
చైతన్యముంటున్నది.
చైతన్యమనగా
ఏమిటి?
సర్వస్వమును
గుర్తించినటువంటి
శక్తికే
చైతన్యము
అని
పేరు.
ఇట్టి
దివ్యత్వమైనట్టి
శక్తి
మానవునిలో
అణుస్వరూపములో
వుంటున్నది.
‘అణోరణీయాన్
మహతో
మహీయాన్’
అని
అణువులో
అణువుగాను,
ఘనంలో
ఘనముగాను
ఉంటున్నది.
దీనినే
విచారణ
చేస్తే,
ఒక
మఱ్ఱిచెట్టుయొక్క
విత్తనము
చాలా
చిన్నదిగా
ఉంటున్నది.
చీమ
తలలో
పదవవంతు
ఉంటున్నది.
అటువంటి
సూక్ష్మమైనటువంటి
విత్తనము
విశాలమైనటువంటి
వృక్షముగా
రూపొందుతూయున్నది.
ఇంతపెద్ద
వృక్షము
ఆ
చిన్న
విత్తనములోనే
సూక్ష్మంగా,
గోప్యంగా,
అవ్యక్తంగా
యుంటున్నది.
కాలముతో
కలవటంచేత
అనంతమైనరూపము
ధరించింది.
దీనికి
ఏమిటి
కారణము?
కాలమే
కారణము.
కాలమును
అనుసరించటంవలన
అల్పము
అనంతముగా
మారిపోయింది.
కాలము
దైవస్వరూపము.
కనుకనే
‘కాలాయ
నమః,
కాలకాలాయ
నమః,
కాలదర్పదమనాయ
నమః,
కాలాతీతాయ
నమః,
కాలస్వరూపాయ
నమః’.
కాలమునకు
యిన్ని
విధములైన
పేర్లు
గలవు.
దైవమునకు
ఏ
విధముగా
పేర్లు
గలవో
అదే
విధముగా
ఈ
కాలమునకు
పేర్లు
గలవు.
మార్గములు
వేరు,
మతములు
వేరు,
మతులు
వేరు;
గమ్యము
ఒక్కటే!
ఇటువంటి
సత్యత్వాన్ని
నిరూపించినటువంటిదే
రామాయణం.
4
▾
Meaning
Keep
అంతరార్థముతో
చూస్తే
జీవితమంతా
రామాయణమే!
రామాయణములోపల
దూరదృష్టితో
మనము
చూచినప్పుడు,
భౌతికమైన
భావముతో
అర్థము
చేసుకున్నప్పుడు
ఇది
మనకు
ఒక
పవిత్రమైన
చరిత్రగా
రూపొందుతుంది.
కాని,
అంతర్భావముతో
చూస్తే
మీయొక్క
జీవితమంతా
రామాయణమే!
మొట్టమొదట
దశరథుడు
అనగా
కర్మేంద్రియములు
ఐదు,
జ్ఞానేంద్రియములు
ఐదు
కలసి
దశేంద్రియములకు
రథమైనటువంటి
దేహము.
ఈ
దేహము
ఒక
విధమైన
వాంఛతో
వరించింది,
మూడు
గుణములగు
సత్వ,
రజ,
తమో
గుణములకు
ప్రతీకలైన
కౌసల్య,
సుమిత్ర,
కైకేయి.
వీరే
దశరథునకు
ముగ్గురు
భార్యలు.
ఈ
ముగ్గురు
భార్యలకు
ధర్మార్థకామమోక్షములను
నలుగురు
రామ,
లక్ష్మణ,
భరత,
శత్రుఘ్నులుగా
పుట్టారు.
రాముడు
ఋగ్వేదమునకు,
లక్ష్మణుడు
యజుర్వేదమునకు,
భరతుడు
సామవేదమునకు,
శత్రుఘ్నుడు
అథర్వణవేదమునకు,
నలుగురు
నాలుగు
వేదస్వరూపములుగా
వున్నారు.
వీరు
లోకసంరక్షణార్థమై
యజ్ఞయాగాదిక్రతువులను
జరిపే
నిమిత్తమై
జన్మించారు.
ప్రాచీనకాలములో
మనోవాక్కాయకర్మలు
ఏకమై
పూజలు
చేసేవారు
కౌశిక
మహారాజు
తన
సర్వమును
త్యజించి,
తపస్సు
ఆచరించి,
మహర్షి
విశ్వామిత్రునిగా
మారాడు.
ఇతను
గాయత్రీ
మంత్ర
ప్రోక్త.
‘గాయంతాః
త్రాయతే
ఇతి
గాయత్రి’
అన్నారు.
గాయత్రికి
మూడు
పేర్లు.
గాయత్రి,
సావిత్రి,
సరస్వతి.
గాయత్రి
అనగా
ప్రాణమునకు
దేవత.
సావిత్రి
అనగా
ప్రాణమునకు
మాత.
సరస్వతి
అనగా
వాక్దేవతా
స్వరూపిణి.
కనుక
జీవునకు,
ప్రాణమునకు,
వాక్కునకు
అధిపతి
గాయత్రి.
‘గాయత్రీం
ఛందసాం
మాతా’
అనగా
సమస్త
వేదములకు
గాయత్రి
మాతృస్వరూపిణి.
గాయత్రి
నామములలోపల
పంచముఖీ
అని
ఒక
పేరు
వున్నది
అనగా
ఐదు
ముఖములుగా
వుంటున్నది.
ఒకటి
‘ఓం’,
రెండవది
‘భూర్భువస్సువః’,
మూడవది
‘తత్సవితుర్వరేణ్యం’,
నాల్గవది
‘భర్గోదేవస్య
ధీమహి’,
ఐదవది
‘ధియోయోనః
ప్రచోదయాత్’.
గాయత్రిని
నవవర్ణిణిగాకూడా
వర్ణించారు.
‘ఓం,
భూర్,
భువః,
సువః,
తత్,
సవిత్,
వరేణ్యం,
భర్గో,
దేవస్య
అనునవి
నవవర్ణిణి.
‘ధీమహి’
అనునది
ధ్యానం.
ఈ
నవవర్ణములను
ధ్యానించటంవలన
నవగ్రహములు
వశమైపోయినవి.
కడపటిది
ప్రార్థన
‘ధియోయోనః
ప్రచోదయాత్’
అనగా
నాయొక్క
బుద్ధిని
అభివృద్ధి
పరచమని
ప్రార్థనచేయటం.
5
▾
Meaning
Keep
ఇలాంటి
పవిత్రమైన
గాయత్రి
మంత్రమును
విశ్వమునకు
అందించటంచేత
విశ్వమునకే
మిత్రుడైనాడు,
విశ్వామిత్రుడు
అని
పేరు
వచ్చింది.
అయితే
వీటియొక్క
అంతఃస్వరూపాలు
ఏమిటి?
విశ్వామిత్రుడనగా
ప్రేమస్వరూపుడు.
కౌశికుడనగా
వాంఛలతోవున్నవాడు
కాబట్టి
అంతవరకు
రాముని
చూడలేదు.
ఏనాడైతే
సర్వస్వమును
త్యజించి
సర్వసంగపరిత్యాగిగా
మారినాడో
ఆనాడు
రాముని
దర్శనం
లభించింది.
తనయొక్క
దీక్షను
సాధించుటకొరకై
రాముని
దగ్గరకు
చేరాడు.
రాముడు
యజ్ఞసంరక్షణ
నిమిత్తము
విశ్వామిత్రునితో
బయలుదేరాడు.
యజ్ఞమనగా
త్యాగము.
‘స్వాహా’,
‘స్వాహా’
అనగా
సర్వమును
అగ్నికి
త్యాగము
చేయటం.
ఇందులో
అంగయజ్ఞము
అని
ఒకటున్నది.
‘నేత్రం
సమర్పయామి’
అనగా
నేత్రము
సమర్పించినాను
అని.
కనుక,
దైవము
తప్ప
అన్య
దృశ్యములతో
నాకు
సంబంధము
లేదు.
‘శ్రోత్రం
సమర్పయామి’
అనగా
నీ
నామము
తప్ప
అన్యము
శ్రవణము
చేయను.
‘హస్తం
సమర్పయామి’
అనగా
నీ
కర్మలు
తప్ప
అన్యము
నాశ్రయించను.
‘హృదయం
సమర్పయామి’
అనగా
ఇందులో
నీకు
తప్ప
ఇతరులకు
స్థానములేదు.
కాని,
యీనాడు
ఈ
అంగపూజలు
ఏ
రీతిగా
మారిపోతున్నాయి?
ఆలనాడు
సత్యకాలములో
మనోవాక్కాయకర్మలు
ఏకమై
చేసేవారు.
కాని
యీనాడు
కలికాలములో
చెప్పడం
ఒకటి,
చేయటం
మరొకటి.
వీటిని
మనము
అనుసరిస్తున్నాము,
విశ్వసిస్తున్నాము,
ఆనందిస్తున్నాము.
యీనాడు
పూజా
సమయములో
‘నేత్రం
సమర్పయామి’
అంటున్నాము.
ఒక
పుష్పము
తీసుకొని
నేత్రమునకు
ముట్టి
ఆ
పుష్పమును
అర్పితము
చేస్తున్నాము.
చెప్పేది
నేత్రం
అర్పించేది
పుష్పము.
ఈ
విధముగా
మారిపోతూ
వచ్చింది.
రామాయణము
కేవలము
గ్రంథమేకాదు,
మానవుని
నిత్యజీవితంలో
ఇమిడియుంటున్నది
రామాయణములోపల
ఆత్మకే
‘రామా’
అని
పేరు.
మనము
వాడుకలోకూడా
‘ఆత్మారామునికే
తెలుసు’
అంటుంటాము.
సత్య,
ధర్మములను
సంరక్షించే
నిమిత్తమై
రాముడు
శివధనస్సును
విరచడానికి
పోయాడు.
శివం
అనగా
మంగళము.
మంగళమును
అందుకునే
నిమిత్తమై
వెళ్ళాడు.
మనము
భూమిపైన
ఆధారపడివుంటున్నాము.
భూదేవిని
పూజిస్తున్నాము.
6
▾
Meaning
Keep
సీత
అనగా
భూజాత.
సీత
విదేహ
మహారాజుయొక్క
పుత్రిక.
విదేహుడు
అనగా
దేహము
లేనివాడు.
దేహములేనిదంటే
మనస్సే.
సర్వత్రా
సంచరిస్తుంది.
మనస్సునందే
జ్ఞానము,
అజ్ఞానము
ఉద్భవిస్తున్నాయి.
ఈ
మనస్సులో
కలిగిన
బ్రహ్మజ్ఞానము
ఆత్మను
చేరుకుంది.
అనగా
సీతారాములు
ఏకమైనారు.
సీతారాములు
జీవితమనే
అరణ్యములో
ప్రవేశించారు.
ఇందులో
అనేక
రకములైన
కామ,
క్రోధ,
లోభములనే
గుణములు
ఆవిర్భవిస్తుంటాయి.
ఇది
ఒక
సంసారసాగరముగా
రూపొందుతుంది.
ఈ
సాగరములో
మునిగినప్పుడు
బ్రహ్మజ్ఞానమనే
సీతను
పదితలల
రావణాసురుడు
అపహరిస్తాడు.
పది
తలలు
అనగా
కామము,
క్రోధము,
లోభము,
మోహము,
మదము,
మాత్సర్యములు
అనే
అరిషడ్వర్గములు,
మనస్సు,
బుద్ధి,
చిత్తము,
అహంకారము
అనే
అంతఃకరణములు.
ఈ
పది
గుణములు
కలవాడే
రావణుడు.
ఈ
పది
గుణములు
చేరి
జ్ఞానమనే
సీతను
అపహరిస్తుంది.
జ్ఞానమనే
సీత
అదృశ్యమయ్యేటప్పటికి
ఆత్మ
అనే
రాముడు
వెతకడానికి
బయలుదేరాడు.
ఈ
ప్రయాసలో
అజ్ఞానం,
ప్రజ్ఞానం
అనే
వాలి
సుగ్రీవులు
వాదన
వేస్తూవుంటారు.
ప్రజ్ఞానమనే
సుగ్రీవునితో
స్నేహముచేసి
వాలి
అనే
అజ్ఞానాన్ని
తుదముట్టిస్తాడు.
తిరిగి
సీతను
అన్వేషణ
చేయటంలో
మోహమనే
సాగరము
అడ్డుతగులుతుంది.
మోహమనే
సాగరాన్ని
దాటడానికి
ధైర్యమనే
హనుమంతునితో
స్నేహము
చేసుకుంటాడు.
తద్వారా
మోహమనే
సాగరాన్ని
దాటగలిగాడు.
లంకలో
సత్త్వ,
రజ,
తమోగుణములనే
ముగ్గురు
అన్నదమ్ములుంటారు.
రజో,
తమోగుణములైన
రావణ
కుంభకర్ణులను
హతమార్చి
సత్త్వగుణమైన
విభీషణునకు
పట్టాభిషేకము
చేస్తాడు.
గడచిన
కాలములో
బ్రహ్మజ్ఞానమైన
సీత
అనుభవజ్ఞానముగా
రూపొందుతుంది.
అప్పుడు
రామునితో
చేరి
హృదయమనే
సింహాసనముపై
పట్టాభిషేకము
జరుగుతుంది.
మనకుండినటువంటి
గ్రంథజ్ఞానము,
వ్యవహారజ్ఞానము,
లోకజ్ఞానము
ఇవన్నియూ
బ్రహ్మత్వము
అనుకుంటున్నాము.
కాదు
కాదు.
ఇవన్నియూ
అనుభవజ్ఞానముతో
చేరినప్పుడే
దివ్యత్వము
సిద్ధిస్తుంది.
కాబట్టి
రామాయణము
కేవలము
గ్రంథములోనేకాదు
మానవజీవితములోనే
యుంటున్నది.
7
▾
Meaning
Keep
అర్థకామమోక్షములందు
ధర్మము
ప్రధానంగా
ఉండాలి
‘రామో
విగ్రహవాన్
ధర్మః’
అన్నారు.
మన
జీవితము
ధర్మమార్గములో
ప్రవేశించాలి.
ధర్మముతోనే
అర్థమును
సాధించాలి.
ధర్మార్థములతోనే
కామమును
జయించాలి.
ధర్మార్థకామములచేతనే
మోక్షములో
ప్రవేశించాలి.
అర్థకామమోక్షములయందుకూడను
ధర్మము
ప్రధానముగా
వుండాలి.
ధర్మము
సర్వత్రా
అంతర్వాహినిగా
ఉంటూ
ఆనాడు
నాలుగు
పురుషార్థములు
అయినాయి.
ఈనాడు
కలికాలములో
వాటిని
రెండు
పురుషార్థములుగా
మార్చాలి.
ధర్మఅర్థములను
రెండింటిని
ఒకటిగా
చేయాలి.
కామమోక్షములను
రెండింటిని
ఒకటిగా
చేయాలి.
ధర్మముకోసం
అర్థాన్ని
సాధించాలి.
మోక్షాన్నే
మనము
కామించాలి.
మోక్షకామములు
రెండూ
ఒకటైపోవాలి.
ధర్మాన్ని
అర్థముపైన
మరల్చాలి.
ఇదే
మన
శాస్త్రధర్మము.
శాస్త్రమనగా
ఏమిటి?
మన
దేహమును
శాసించినటువంటిదానిని
సక్రమమైన
మార్గములో
నడచుకోటమే
శాస్త్రము.
చాతుర్వచనము
శాస్త్రము.
నీవు
ధర్మాన్ని
అనుసరించకపోయినపుడు
నీ
హృదయమే
నిన్ను
హెచ్చరిస్తూవుంటుంది.
నీవు
తప్పుచేసినప్పుడు
లోకముముందర
నీవు
ఆనందముగా
కనిపించవచ్చు.
కాని
నీవు
చేసిన
దోషమునకు
నీ
అంతరంగము
నిన్ను
వారిస్తుంది.
సర్వత్రానిండినటువంటి
చైతన్యమే
‘సత్’.
దానిని
సరియైనటువంటిరీతిలో
అర్థము
చేసుకోవటమే
‘చిత్’.
‘సత్,
చిత్’యొక్క
స్వరూపమే
ఆనందము,
ప్రేమ.
అదే
భగవత్స్వరూపము.
దీనికే
మనము
అనేక
రూపములు,
నామములు
పెడుతున్నాము.
సత్,
చిత్,
ఆకారము,
నామము.
దీనినే
వేదాంత
పరిభాషలో
‘అస్తి,
భాతి,
ప్రియము’
అన్నారు.
రూపనామములు
మారుతుంటాయి.
సత్,
చిత్,
ఆనందము
మారడానికి
వీలులేదు.
అదే
Immortality.
దానిని
మనము
ఎక్కడో
వెతకనక్కరలేదు.
అది
మన
దేహమునందే
ఉన్నది.
దేహమునుండే
పుట్టింది
ఆత్మ
అనగా
దేహాన్నే
సంరక్షిస్తున్నాడు.
దేహమువలనే
ఆత్మను
గుర్తించటానికి
సాధ్యమవుతుంది.
కనుక
దేహము
ఒక
పనిముట్టులాంటిది.
వశిష్టుడు
రెండు
పదములు
చెప్పాడు.
‘భిక్షాన్నం
దేహరక్షార్థం’,
‘వస్త్రం
శీతనివారణం’.
ఆహారం
దేహ
రక్షణకోసమని.
కేవలం
ఆహారమే
మనకు
ప్రధానంకాదు.
జీవితముకోసం
ఆహారంకావాలి
గాని
ఆహారంకోసం
జీవితంకాదు.
ఈనాడు
మన
విద్యలు,
జీవితాలు
ఆహారంకోసం
ప్రయత్నించినట్లు
వుంటుండాది.
కనుక
మనయొక్క,
విద్యలు,
శక్తిసామర్థ్యములు
ఎవరికోకాదు
మనము
అర్పితముచేసుకోవటం.
8
▾
Meaning
Keep
మనవి
మనకే
అర్పితం
చేసుకోవాలి.
భగవంతుడు
కేవలము
ప్రేమ
ప్రభావానికి
మాత్రమే
చిక్కుతాడు
‘తం
ఏవ
శరణం
గచ్ఛ’
అనగా
నీకు
నీవు
శరణాగతి
కావాలి.
నీ
రాముడు
నీలోనే
వున్నాడు,
నీవే
రాముడవు.
నీవు
అన్నింటిని
రమించుతున్నావు.
రమించేగుణము
వున్నవాడు
రాముడే.
దేనిని
ఏ
విధముగా
రమించాలి
అనే
విషయాన్ని
తెలిపేదే
ధర్మము.
ధర్మవిరుద్ధమైనది
enjoyకాదు.
Enjoy
ఎప్పుడొస్తుందంటే
joyని
end
చేసినప్పుడు.
End
joy
is
real
enjoy.
కనుక
ఆ
ఆకర్షణశక్తి
మన
హృదయములోనే
వుంటున్నది.
చెడ్డదానిని
ఆకర్షించవద్దు.
చెడు
చూసినపుడు
ఆకర్షణగా
వుండవచ్చు
కాని
ఆ
దోషమును
అంతరాత్మ
హెచ్చరిస్తుంది.
భయముతోకూడినది
real
enjoy
కాదు.
హృదయానికి
సంపూర్ణమైన
తృప్తినిచ్చేదే
నిజమైన
enjoy.
ఆ
హృదయస్థితినే
వేదములు
‘ఆత్మ’
అని
పేరు
పెట్టింది.
అన్ని
జీవులందు
వుంటున్నది
ఆత్మ.
‘ఏకో
దేవః
సర్వ
భూతేషు
గూఢః’
హృదయమునందు
అంగుష్టరూపుడై
వుంటున్నది.
అందరూ
అనుకుంటున్నారు,
‘హార్టులో
ప్రాణమున్నదని’
కాదు
కాదు.
అది
ఒక
మైన్స్విచ్
మాత్రమే.
పురుషసూక్తములో
చెప్పినట్లు
‘నీలతోయద
మధ్యస్థ
విద్యుల్లేఖేవ
భాస్వరః’
అనగా
నల్లని
మేఘములమధ్య
ఒక్కతూరి
మించుమించుమని
తెల్లగా
వుంటున్నాది.
అంతేకాదు
మన
వెన్నెముకలో
33
పూసలు
వుంటున్నవి.
9
నుండి
12వ
పూస
మధ్యలో
సుషుమ్ననాడి
వుంటున్నది.
అది
చాలా
ప్రకాశవంతమైనది.
అందుకే
సుషుమ్ననాడిని
కోటిసూర్యకాంతి
అని
పేరు
పెట్టారు.
అంతటి
తేజోవంతమైనశక్తి
మన
దేహములో
అణుమాత్రముగా
వుంటున్నది.
అక్కడ
నున్న
ప్రాణశక్తివలన
మన
దేహములో
అంగములన్నియు
పనిచేస్తున్నవి.
ప్రతి
అంగమునందు
రసస్వరూపముగా
వున్నాడు
కనుక
భగవంతుని
‘అంగీరసాయ
నమః’
అన్నారు.
ఆ
అంగీరసుడు
అప్రమేయుడుగా
వుంటున్నాడు
అనగా
ఎట్టి
ప్రమేయాలకు
చిక్కడు.
కేవలము
ప్రేమ
ప్రభావానికి
మాత్రమే
చిక్కుతాడు.
ఆ
నమ్మకమొక్కటి
చాలు.
కనుకనే
త్యాగరాజుకూడా
చెప్పాడు.
‘నమ్మక
చెడినవారున్నారు
కాని
నిన్ను
నమ్మి
చెడినవారు
లోకాన
లేరు
లేరు
లేరు’
అన్నాడు.
‘నిన్నెందు
వెతికెదరా’
అని
వెతుకుతూ
వెతుకుతూ
పోయినాడు.
ఆఖరికి
ఎక్కడకెళ్లినా
‘వున్నావు
రామా!’
అని
ముందు
వెనక
తోడైవున్నావు
అని
నమ్మాడు.
9
▾
Meaning
Keep
‘కలడన్నవారికి
కలడు
కలడు,
లేడన్నవారికి
లేడు
లేడు’
లేనంతవరకు
లేనట్లుగానే
వున్నాడు.
వున్నాడనుకోగానే
రాముడు
చిక్కాడు.
హిరణ్యకశిపుడు
జగత్తంతా
శోధించాడు.
కాని,
కనిపించలేదు.
కారణం
నారాయణుడు
లేడని
వెతికాడు.
ప్రహ్లాదుడు
‘ఇందుగలడందులేడని
సందేహము
వలదు
చక్రి
సర్వోపగతుండు
ఎందెందు
వెతికిన
అందందే
గలడు’
అను
నమ్మకముతో
ఉన్నాడు.
కనుక,
ఎక్కడ
వెతికినా
అక్కడే
చిక్కాడు.
దీనికి
భావమే
ప్రధానము.
No
అనువానికి
No
అనురా
Yes
అనువానికి
Yes
అనురా.
No,
Yesలు
మన
నోటికే
గాని
సాయికి
సర్వం
SSS.
Previous
←
One Who Cannot Understand Man Cannot Know Mādhava
Next
Humanness Is the United Form of Mind, Word and Deed
→