Contents
Devotion & Sacred Story
Home
Library
Find
Shelf
Settings
←
Leave
Sathya Sai Speaks 1988 · Through Sacrifice Comes the Divinity Called Immortality
Tap a verse for its meaning
IAST
Telugu
Meaning
Continuous
Through Sacrifice Comes the Divinity Called Immortality
11 July 1988, Prasanthi Nilayam
1
▾
Meaning
Keep
తనదు
తప్పు
తాను
తరచంగ
సుజ్ఞాని
పరుల
తప్పులెల్ల
వెదకు
వాడు
తనను
తెలియ
లేడు
తన
తప్పు
తెలియడు
ఇతని
కంటె
మూర్ఖుడవని
మేలు.
పుష్టిని,
అందమును
బట్టి
గొడ్డుకు
విలువనిస్తారు.
కాని
మనిషికి
బుద్ధిని
బట్టి
విలువ
వుంటుంది.
బుద్ధి
పెరుగు
కొలది
మానవత్వము
అభివృద్ధి
గాంచుతుంది.
బుద్ధి
తరుగు
కొలది
పశుత్వము
అభివృద్ధి
అవుతుంది.
వెదురు
కఱ్ఱకు
ఎత్తును,
లావును
చూసి
విలువనిస్తారు.
కానీ
చెఱుకునకు
రసమును
బట్టి
విలువ
నిస్తారు.
ఈ
నాటి
మానవత్వమునకు
బుద్ధి
యొక్క
తత్వాన్ని,
ప్రవర్తనను
గుర్తించుకోలేక
పోవటం
చేతనే
మానవుని
విలువ
దిగ
జారి
పోతున్నది.
ఆకారము
మానవాకారము,
బుద్ధి
పశు
బుద్ధి.
దీనిని
ద్విపాద
పశువు
అంటారు.
కనుకనే
ఆకారము
మానవాకారముగా
వున్నప్పుడు
బుద్ధి
కూడను
మానవ
బుద్ధియే
అభివృద్ధి
పరచుకోవాలి.
ఇది
త్యాగము
చేతను,
యోగము
చేతను
మనకు
ప్రాప్తిస్తుంది.
త్యాగము
మానవుని
జీవితములో
ఒక
ప్రధానమైన
పాత్ర.
ఏనాటికైనా
వస్తువు
తననైనను,
తాను
వస్తువునైనను
త్యాగము
చేయక
తప్పదు.
తాను
అట్టి
త్యాగమనస్కుడు
కానప్పుడు
ప్రపంచమే
బలవంతముగా
అతని
చేత
త్యాగము
చేయిస్తుంది.
ఇది
తప్పునది
కాదు.
అయితే
యీ
త్యాగము
దేనిని
త్యాగము
చేయాలి?
బాహ్యమైన
వస్తువులనా
త్యాగము
లేక
ఆలుబిడ్డలనా
త్యాగము
లేక
ఆస్తిపాస్తులనా
త్యాగము.
కాదు
కాదు.
ఇవి
త్యాగము
చేయుటం
అతి
సులభము.
మానవుడు
పట్టుపట్టి
ప్రయత్నించిన
యివి
సులభముగా
త్యాగము
చేయగలడు.
కాని
యీ
త్యాగము
త్యాగము
కాదు.
ఇది
ఒక
భోగము
కావచ్చు
లేక
రోగము
కావచ్చు.
మనం
చేయవలసిన
త్యాగము
యేమిటి?
అంతర్ముఖమైన
కామక్రోధ
లోభము
యీ
మూడింటిని
త్యాగము
చేయాలి.
కామం
కర్మనాశనం,
క్రోధం
జ్ఞాననాశనమ్
లోభం
భక్తినాశనం.
ఈ
desire
కోరిక
అనేది
కర్మలను
నిర్మూలం
గావిస్తుంది.
ఏ
కర్మ
చేయతగినది,
ఏ
కర్మ
చేయ
తగనిది
అనే
విచారణా
జ్ఞానం
కోల్పోతుంది.
ఈ
కోరిక
అనేది
విచక్షణాజ్ఞానాన్ని
కోల్పోతుంది.
కనుకనే
కర్మయొక్క
యదార్థ
స్వరూపాన్ని
కోల్పోతుంది.
కనుకనే
ఉపనిషత్తులు
మొట్టమొదలు
కర్మకు
నమస్కరించు
అని
చెప్పాయి.
‘తస్మై
నమః
కర్మణే’
ఏపని
మొదలుపెట్టినా
ఆపనికి
మొట్టమొదలు
నమస్కరించి
తరువాత
ఆ
పనిలో
ప్రవేశించమన్నారు.
ఎందుకోసం?
ఈ
కర్మ
పవిత్రమైనదిగను,
పరులకు
ఉపకారమైనదిగను,
పరులకు
హాని
కలిగించనిదిగను,
నాకు
ప్రాప్తించిన
యీ
ప్రాప్తికి
సహాయకారిగను
వుండాలని
యీ
కర్మకు
నమస్కరించాలి.
2
▾
Meaning
Keep
కాని
యీనాటి
మానవుడు
సమాజమునుండి
తనకు
యేమి
ఫలితము
లభించును
అని
ఫలిత
వుద్దేశ్యముతోనే
కర్మలో
ప్రవేశిస్తున్నాడు.
కాని
మానవుడు
కోరవలసినది
అది
కాదు.
నానుంచి
యీ
సమాజమునకు
ఏమి
వుపకారము,
ఏమి
సహాయము,
ఏమి
మంచి
జరుగుతోంది
అనే
వుత్తమ
భావంతో
చిత్తమును
సరిదిద్దుకోవాలి.
కోరిక
యీ
వుత్తమ
భావమునకు
తగిన
వుత్తేజము
యివ్వలేకుండా
పోతుంది.
కనుకనే
మనం
చేయవలసిన
కర్మల
లోపల
అనేక
విధములైన
దోషములు
యిముడ్చుకుంటున్నాయి.
దీనిని
పురస్కరించుకొనియే
కామం
కర్మనాశనమ్
అన్నారు.
క్రోధము.
ఈ
క్రోధము
మానవుని
ఒక
పిచ్చివానిగా
రూపొందింపచేస్తుంది.
ఈ
క్రోధము
బలవత్తరమైన
శక్తి
కలిగినది.
కనుక
మొట్టమొదలు
దీనిని
త్యాగము
చేయాలి
మనము.
మూడవది
లోభము.
ఎంత
సంపాదించినా,
ఎంత
శక్తి
కల్గి
వుండినా
త్యాగమనేది
లోభమునకేమాత్రం
గిట్టదు.
పరులనుండి
పుచ్చుకొనుటకు
మాత్రమే
సిద్ధముగా
వుంటుంది
కాని
లోభము
పరులకిచ్చుకొనుటకు
యేమాత్రం
సమీపమునకు
రాదు.
నాయింటికి
వస్తే
యేమి
తెస్తావు
నీయింటికి
వస్తే
యేమి
యిస్తావు
అంటుంది
యీ
లోభము.
కనుక
మీయింటికి
వచ్చినా
నాకు
ఆదాయమే,
నీవు
మాయింటికి
వచ్చినా
నాకు
ఆదాయమే
కావాలి.
ఈ
విధమైన
పేరాశతో,
దురాశతో
కూడినది
ఈ
లోభము.
ఇలాంటి
దుర్గుణముల
నభివృద్ధి
పరచే
లోభమును
మనము
త్యాగము
చేయాలి.
దీనినే
వైరాగ్యమన్నారు.
వైరాగ్యమనగా
ఏమిటి?
రాగమునకు
విరుద్ధమైనదే
వైరాగ్యము.
ఈ
దేహభ్రాంతి
తప్పుకాదు.
బంధు
భ్రాంతి
యిది
కూడను
దోషము
కాదు.
కుటుంబ
భ్రాంతి
యిది
కూడను
దోషము
కాదు.
తల్లి
తండ్రులను
ప్రేమించవలసినదే
సోదర
సోదరీమణులను
ఆశించవలసినదే.
నీయొక్క
దేహమునకు
ఆరోగ్యము
చేకూరాలని
నీవు
కోరవలసినదే.
ఈ
రాగమునకు
కొంతవరకు
హద్దు
వుండాలి.
పరిమితి
వుండాలి.
సంగీతములో
పలుమార్లు
వింటుంటాము.
ఈ
రాగం
పాటకు
అవసరమే.
కాని
మితి
మీరిన
రాగము
తీస్తే
వినేవానికి
రోగం
వస్తుంది.
కొండంత
రాగం
తీసి
గోరంత
పదము
చెప్పాడుట.
కనుక
పాటకు
తగినంత
రాగము
వుంటుండాలి.
వంటకు
తగినంత
మంట
వుండాలి.
పప్పుకు
తగిన
వుప్పు
వుండాలి.
పప్పు
ఎంత
వుందో
వుప్పు
అంతవేస్తే
తినటానికి
వీలు
కాదు.
అదే
విధముగనే
మన
రాగము
కూడను
ఎంతవరకో
అంత
వుండాలి.
ఈ
నాడు
యీ
రాగము
మితిమీరి
పోతోంది.
తన
దేహ
భ్రాంతి
గాని,
తన
బంధు
భ్రాంతి
గాని,
తన
కుటుంబ
భ్రాంతి
గాని,
తన
విద్యా
భ్రాంతి
గాని,
తన
జ్ఞాన
భ్రాంతి
గాని
యీ
భ్రాంతులనేవన్నీ
ఒక
హద్దును
దాటి,
ఒక
పరిమితము
దాటి
ప్రయాణము
చేస్తున్నాయి.
కనుకనే
యీ
రాగమును
అదుపులో
వుంచుకోవాలి.
కాని
మానవత్వంలో
మనము
కోరవలసిన
దానికి
కూడా
కొంత
limits
లో
వుండాలి.
నశ్రేయో
నియమం
వినా
ఇది
దురాశగా
మారి
పోతుంది.
ఈ
దురాశ
దుఃఖమునకు
హేతువు
అవుతుంది.
కనుక
మనము
రాగమును
కొంతవరకు
పరిమితమునకు
తెచ్చుకున్నప్పుడే
అది
వైరాగ్యమనే
దానిగా
మారిపోతుంది.
3
▾
Meaning
Keep
వైరాగ్యమనగా
ఏమిటి?
వైరాగ్యమనగా
వస్తువు
యొక్క
సంబంధమును
మనము
మరచి
వస్తువునందున్న
అంతర్
శక్తిని
లక్ష్యము
నందుంచుకోటమే
వైరాగ్యము.
పదిమంది
దుర్మార్గుల
లోపల
ఒక్కడైనా
సన్మార్గుడు
వుంటాడు.
పదిమంది
సన్మార్గుల
లోపల
ఒక్కడైనా
దైవ
భ్రాంతి
కల్గిన
వాడుంటాడు.
పదిమంది
దైవ
భ్రాంతి
వున్నవారిలో
ఒక్కడైనా
దైవప్రీతి
కల్గి
వుంటాడు.
పది
మంది
భగవత్ప్రీతి
కలిగినవారిలో
ఒక్కడైనా
భగవంతుని
అనుభవించాలని
ఆశించేవాడుంటాడు.
భగవంతుని
ప్రేమను
అనుభవించాలి
అనుకునే
పదిమందిలోపల
ఒక్కడైనా
సర్వసంగ
పరిత్యాగి
వుంటాడు.
సర్వసంగ
పరిత్యాగము
చేసినప్పుడే
భగవత్
ప్రేమకు
అర్హుడౌతాడు.
కనుకనే
త్యాగేనైకే
అమృతత్వ
మానసుః
అన్నారు.
ఈ
త్యాగము
చేతనే
అమృతత్వమనే
దైవత్వము
మనకు
ప్రాప్తిస్తుంది.
అయితే
దీనిని
యేరీతిగా
మనము
వైరాగ్యం
చేయాలి?
ప్రపంచము
వస్తు
సమూహము.
ఇది
కేవలము
ఒక
జడస్వరూపము.
జగత్తును
మన
యింద్రియములంతా
అనుభవిస్తున్నాయి.
ఇంద్రియములన్నీ
జడమైనవే.
చూచే
నేత్రము
జడమే.
వినే
చెవులు
జడమే.
పలికే
నాలుక
జడమే.
గంధమును
ఆస్వాదించే
ముక్కు
కూడా
జడమే.
కడపటికి
దేహమంతా
జడమే.
ఇందులో
ఒక
చైతన్యమనేది
మనస్సు,
బుద్ధి,
చిత్తము,
అహంకారము
యీ
నాల్గింటి
యొక్క
సమ్మిళితమైన
స్వరూపము.
ఆచైతన్యమును
అందించటము
చేతనే
యీ
జడమంతా
పని
చేయగలుగుతోంది.
స్థూలమైన
జగత్తునంతా
ఒక
జడముగా
మనము
భావించాలి.
ఇంక
సూక్ష్మమైన
మనో,
బుద్ధి,
చిత్త,
అహంకారములు
యివి
మాయా
స్వరూపములు.
మాయ
అనగా
ఏది
లేదో
అదే
మనకు
వుండినట్టుగా
కనుపించటము.
మానవుని
బుద్ధి
కేవలం
ఒక
మానవాకారాన్నే
ధరింప
చేస్తుంది.
యివన్నీ
మాయగా
కనుపిస్తుంది.
ఉన్నది
లేనట్టుగా
లేనిదానిని
వున్నట్టుగా
భ్రమింప
చేస్తుంది.
ఈ
మాయకు
మరొక
పేరు
అజ్ఞానము.
అజ్ఞానమనగా
ఏమిటి?
కేవలం
సత్యము
కాని
దానిని
సత్యముగా
భ్రమింప
చేయుటము.
అసత్యమును
సత్యముగా
నిరూపింప
చేయుటము.
నేను
దేహమును
ధరించాను,
నాకంటె
ముందు
అనేకమంది
మరణిస్తున్నారు.
అనేకమంది
రోగములతో
పీడింపబడుతున్నారు.
కంటితో
చూస్తున్నాము.
చెవులతో
వింటున్నాము
కాని
మనము
శాశ్వతముగా
వుంటామని
భ్రమిస్తున్నాము.
ఇదే
అజ్ఞానము.
అందరూ
పోతున్నప్పుడు
మనము
మాత్రము
పోమా?
అందరి
దేహములు
అశాశ్వతమైనప్పుడు
మన
దేహము
మటుకు
శాశ్వతమెలా
అవుతుంది?
ఈ
మాయను
ప్రవేశింప
చేయటం
చేతనే
అనిత్యము
నిత్యముగా,
నిత్యము
అనిత్యముగా
భ్రమింప
చేస్తుంది.
కనుక
యీ
సూక్ష్మ
రూపమైనదంతా
మాయనే.
స్వప్నము
సూక్ష్మరూపము.
స్వప్నములో
ఎన్నో
అనుభవిస్తున్నాము.
స్వప్నకాలమునకు
మాత్రమే
అవి
సత్యముగా
నిరూపిస్తున్నాయి.
జాగ్రత
వచ్చేటప్పటికి
వాటన్నింటిని
మనము
మరచి
పోతున్నాము.
అలక్ష్యం
చేస్తున్నాము.
అప్పుడు
సత్యము
అనుకున్నది
జాగ్రత్తలో
అసత్యముగా
వుంటుంది.
స్వప్నములో
భయపడిన
వ్యక్తి
జాగ్రతలో
ధైర్యముగా
అనుభవిస్తున్నాడు.
ఇదియే
మాయయొక్క
స్వభావము.
ఇదే
మాయయొక్క
రహస్యము.
కనుకనే
ప్రత్యక్షము,
భౌతికము,
జాగ్రత
యివి
జడము.
4
▾
Meaning
Keep
స్వప్నము,
సూక్ష్మము
యివి
అంతా
మాయ.
ఇంక
కారణము.
ఈ
కారణమనేది
ప్రతిబింబము.
ఈ
ప్రతిబింబమునకు
యేవిధమైన
చైతన్యము
లేదు.
ప్రతిబింబమునకు
రూపము
లేదు.
నామము
లేదు.
దానికి
సుఖము
లేదు.
దుఃఖము
లేదు.
ఇలాంటి
దానిని
కట్టుకొని
మనము
యేమి
అనుభవించటము?
జాగ్రత
చూస్తామా
జడము.
సూక్ష్మము
చూస్తామా
మాయ.
కారణము
చూస్తామా
ప్రతిబింబము.
ఈ
మూడింటిలో
నాకు
సంబంధము
లేదు.
దీనికి
అతీతమైనది
మహాకారణము.
అదే
పరతత్వము.
ఆ
పరతత్వములో
వున్న
ఆత్మ,
యీ
జడములో
వుండిన
ఆత్మ
రెండునూ
ఒక్కటే.
ఇట్టి
ఏకత్వమును
గుర్తించటమే
వైరాగ్యము
అన్నారు.
కనుక
మనం
వదలిపెట్టి
పోవటము
కాదు
వైరాగ్యము.
ఉన్నదానిలో
వున్న
సత్యమును
గుర్తించటమే
వైరాగ్యము.
రాగరహితము
గావించుకోటమే
వైరాగ్యము.
ఎంతో
మనము
సాధించాము.
ఎంతనో
మనము
సంపాదించాము.
ఎంతనో
మనం
అనుభవించాము.
ఇవన్నీ
యెక్కడకు
పోయినాయి?
ఎక్కడ
వున్నాయి?
ఎందుకు
మనము
వదలుతున్నాము?
దాని
వలన
మనకొచ్చిన
ఫలితమేమిటి?
ఈ
విధమైన
విచారణ
సల్పినప్పుడు
యీ
వస్తువులు
కాని,
విషయములుగాని,
వ్యక్తులుగాని
కేవలం
ఒక
తెర
బొమ్మల
వంటివేనని
గుర్తించుకోటానికి
వీలవుతుంది.
మధ్యలో
వచ్చి
పోయేవి
కదలిపోయే
మేఘముల
వంటివే.
ఈ
మానసిక
తత్వమనే
దానిని
చక్కగా
గుర్తించటానికి
మీరు
ప్రయత్నించాలి.
ఒక
చెంబులో
నీరు
పోసుకుని
సముద్రములో
కలిపినప్పుడు
యింక
తిరిగి
ఆ
చెంబు
నీరు
మనం
తీసుకోటానికి
సాధ్యము
కాదు.
పొగ
ఆకాశములో
చేరిన
తర్వాత
తిరిగి
దానిని
వెనుకకు
తీసుకోలేము.
తినిన
ఏపిల్
పండును
మనము
జీర్ణించుకున్నాక
ఆ
పండు
మనకు
లభించదు.
కాని
మనస్
తత్వాన్ని
మాత్రం
తినటానికి
సాధ్యము
కాదు.
కలపటానికి
వీలు
కాదు.
చేరటానికి
అవకాశం
లేదు.
మనసును
ఒకరు
అనుభవించటానికి
సాధ్యము
కాదు.
దానిని
అరికట్టుకోటానికి
శక్తి
లేదు.
సమస్త
మానవులు,
సమస్త
జీవులు
మనస్సుకు
స్వాధీనము
కావలసినదేగాని
మనసును
అరికట్టుకోటం
ఎవరికీ
సాధ్యము
కాదు.
అయితే
మనో
నిగ్రహమని
ఎందుకు
పెట్టారు?
అది
నిగ్రహించటం
కాదు.
అలక్ష్యము
చేయటమే
నిగ్రహించటము.
దానిని
కంట్రోలు
చేయటం
సాధ్యము
కాదు,
గాలిని
ఎవరు
చేతిలో
పట్టుకోగలరు?
అదే
విధముగనే
అనంత
స్వరూపమైన
యీ
మనస్
తత్వమును
ఎవరు
నిగ్రహించుకోగలరు?
సంకల్ప
వికల్పములతో
కూడినది
మనస్సు
అనే
సత్యాన్ని
తెలుసుకొన్నప్పుడు
సంకల్పములు
లేకుండా
చేసుకోటమే
ఆయొక్క
మనసును
నిగ్రహించుకోటం.
ఈ
సంకల్పములు
రాగముతో
కూడినవే.
రాగము
వుండినంతవరకు
వైరాగ్యము
మనకు
లభించదు.
అయితే
ఆ
రాగాన్ని
కూడను
కొంత
అదుపులో
పెట్టుకోవాలి.
మనకు
కారు
వుంది.
ఆక్సిలరేటర్
నొక్కితే
స్పీడ్‌గా
పోతుంది.
కాని
రోడ్డు
యొక్క
పరిస్థితిని
curves
ను
ups
and
downs
ను
మనము
లక్ష్యములో
పెట్టుకొని
ఆ
ఏక్సిలరేటర్
ఎంతవరకో
అంత
use
చేయాలి.
మనము
వున్నది
జగత్తులో.
ఈ
జగత్తు
అనేక
ఒడుదుడుకులు
కలిగినది.
అనేక
దుఃఖ
సంతోషములతో
కూడినది.
దానిని
పురస్కరించుకొని
మన
మనస్సును
కొంతవరకు
అదుపులో
వుంచుకోటానికి
ప్రయత్నించాలి.
ఆక్సిలరేటర్
లేక
driving
జరుగదు.
5
▾
Meaning
Keep
వుండాలి
కాని
దానిని
అదుపులో
వుంచుకొని
మనము
ప్రయాణం
చేయాలి.
అదే
విధముగనే
మైండ్
మనకు
వుండాలి.
దానిని
తగిన
రూపంలో
మనము
వుపయోగించుకోటానికి
ప్రయత్నించాలి.
ఈ
నాడు
మన
మనసు
యిష్టానుసారంగా
వుపయోగించుకోటం
చేతనే
అనేక
విధములైన
దుఃఖములకు,
విచారములకు,
కష్టములకు
గురౌతున్నాము.
అక్కడనే
మనకు
బుద్ధి
అత్యవసరము.
బుద్ధి
మానవుని
యొక్క
శక్తిని
అభివృద్ధి
పరుస్తుంది.
మానవత్వమనగా
బుద్ధి
యొక్క
ప్రభావమే.
ఆ
బుద్ధి
యొక్క
ప్రభావము
సమస్త
జగత్తును
తనలోనే
ఆవరింప
చేసుకుంటుంది.
ఇదే
మనసు
యొక్క
రహస్యము.
మనము
ప్రపంచమంతా
చుట్టాము.
హైదరాబాద్
అంతా
తిరిగాము,
మద్రాసంతా
తిరిగాము
బొంబాయి
అంతా
తిరిగాము.
అనేక
పర్వతములు
చూశాము,
నదులు
చూశాము.
యింకా
ఎన్నెన్నో
చూశాము.
ఎన్ని
దృశ్యాలు
మనము
చూశామో.
ఎంతమంది
వ్యక్తులను
మనము
చూశామో.
ఎన్ని
పదార్థములు
చూశామో.
అవన్నీ
కూడ
అతి
సూక్ష్మ
స్వరూపమై
మన
మైండ్
లో
ప్రింటు
అయిపోయాయి.
ఇంత
చిన్న
మైండ్
లోపల
యింత
ప్రపంచము
యొక్క
దృశ్యాన్ని
ఏవిధముగా
నీవు
యిముడ్చుకున్నావు?
ఇంత
పెద్ద
పర్వతము
నీ
మనసులో
వుండటానికి
యెక్కడైనా
చోటు
వుందా!
అనగా
మనస్సంటే
ఎంత
విశాలమైనదో
మనము
గుర్తించవచ్చు.
ప్రపంచమంతా
మనలోనే
యిమిడి
వుంది.
కనుకనే
మనో
మూల
మిదం
జగత్.
జగత్తంతా
మనసు
యొక్క
ప్రభావమే.
ఆ
జగత్తులో
నేను
కూడ
ఒకడను.
ఇంత
మనోమయమైన
యీ
జగత్తులో
యీ
దేహం
ఎంతటిది?
ఈ
విధమైన
విశాలతను,
కొంత
అణుత్వమును
మనము
చక్కగా
విచారించినప్పుడే
చక్కగా
వైరాగ్యము
మనకు
లభిస్తుంది.
ఇంత
విశాలమైన
ప్రపంచములో
యీ
దేహము
ఎంతటిది!
ఈ
అణుమాత్రంగా
చూచినప్పుడు
మనకు
ఎంత
అవమానంగా
తోస్తుంది.
కనుకనే
వేదాంతము
అణోరణీయాన్
మహతో
మహీయాన్
మహత్తులో
చాలా
మహత్తరమైనది.
అణువులలో
చాలా
సూక్ష్మమైనది,
ఈ
రెండింటిలో
వున్న
తత్వము
ఒక్కటే.
మఱ్ఱి
చెట్టు
చాలా
పెద్దదిగా
వుంటుంది.
మద్రాసులో
మీరు
చూచి
వుండవచ్చు.
ధిసాఫికల్
సొసైటిలో
పెద్ద
వృక్షము.
కాని
అందులో
వున్న
విత్తనం
చాలా
చిన్నది.
ఈ
చిన్న
విత్తనములోనే
పెద్ద
మహావృక్షము
యిమిడి
వుంది.
ఈ
పెద్దవృక్షములో
చిన్న
విత్తనము
యిమిడి
వుంది.
అదే
విధముగనే
మన
మనస్సు
అతి
స్వల్పంగా
నీవు
భావించవచ్చును.
అందులోపలనే
అనంతత్వము
వుంటుంది.
ఈ
అనంతత్వమైన
యీ
జగత్తులో
అల్పత్వమైన
చిన్న
అణుస్వరూపమైన
మనస్తత్వము
కూడా
యిమిడి
వుంటుంది.
అది
నేనే
నేను
అదే.
ఈ
దేహ
భ్రాంతి
వుండినంతవరకు
యీ
ఆనందము
యీ
ఏకత్వము
మనకు
అర్థము
కాదు.
స్థూలమైన
దృష్టి
వుండినంతవరకు
కూడను
యీ
అనంతత్వము
మనకు
అర్థము
కాదు.
చిన్న
ఉదాహరణము.
ఒక
పెద్ద
సిమ్మెంటు
తొట్టె
వుంది.
లేక
ఒక
tank
లోకి
పోయి
మనము
చూస్తున్నాము.
అందులో
చూస్తే
మన
ప్రతిబింబము
ఆ
జలములో
కనుపిస్తుంది.
నీవు
ఏమంటున్నావు?
అది
నేనే
అంటున్నావు.
కాని
విచారణ
చేసినప్పుడు
అది
నేను
కాదు.
అది
నేనే
నేను
అది
కాదు.
6
▾
Meaning
Keep
ఇందులో
వున్న
వ్యత్యాసమును
గుర్తించాలి.
అది
నేనే
నీయొక్క
దేహమును
భ్రమించుకొని
అది
నేనే
అంటున్నావు.
అది
నేనే
అంటున్నప్పుడు
ఆప్రతిబింబమును
కఱ్ఱ
తీసుకొని
ఎంతమంది
కొట్టినా
నీకేమి
ఏడుపు
రాదు.
దెబ్బ
తగలదు.
ఆ
ప్రతిబింబమును
ఎవరైనా
వచ్చి
దూషిస్తే
నీకు
కోపం
వస్తుంది.
కొడితే
దెబ్బ
తగలదు
కాని
తిడితే
మాత్రం
దెబ్బ
తగులుతుంది.
కొట్టినప్పుడు
అది
నేను
కాదు.
తిట్టినప్పుడు
నేను
అదే.
ఇదే
వేదాంతములో
వున్న
రహస్యము.
అనగా
హృదయమును,
ఆత్మతత్వాన్ని
ఏకత్వముగా
గుర్తించుకున్నప్పుడు
ఎవరికి
ఏబాధ
కల్గినా
అది
నాదే.
కాని
దేహభ్రాంతితో
వున్నప్పుడు
ఎవరేమనుకున్నా
అది
నాది
కాదు.
ఈ
విశాలమైన
ప్రబోధలు
గావించేదే
వేదాంతము.
ఇట్టి
పవిత్రమైన
నిత్యమైన,
సత్యమైన
తత్వాన్ని
గుర్తించుకోటానికే
యీ
విధమైన
కొన్ని
సమావేశములలో
పాల్గొనాలి.
ఈ
సమావేశములో
మీరు
విన్న
విషయములు
కన్న
విషయములు
కొంత
హృదయములో
భద్రము
చేసుకోవాలి.
కనుకనే
శ్రవణ,
మనన
నిధిధ్యాస
అనే
యీ
మూడు
ప్రధానమైన
సూత్రములను
బోధిస్తూ
వచ్చింది
వేదాంతము.
శ్రవణమనగా
వినటము.
విన్నదానిని
తిరిగి
స్మరించుకోటం
మననం.
చింతించిన
దానిని
ప్రాక్టికల్
లో
పెట్టటం
నిధిధ్యాస.
వంటరూపములో
చేసిన
వంటను
డైనిగ్
హాలులో
తెచ్చిపెట్టుకోటం.
కిచెన్
రూమ్
లో
చేయటమే
ఒక
శ్రవణము.
శ్రవణము
చేసినంత
మాత్రమున
ప్రయోజనము
లేదు.
కిచెన్
రూమ్
లో
కావలసినంత
వంట
ఉన్న
మాత్రమున
ప్రయోజనము
లేదు.
దానిని
డైనింగ్
హాల్
లోకి
తెచ్చి
ప్లేటులో
పెట్టుకోవాలి.
అదే
మననం.
తినాలి
అదే
నిధిధ్యాస.
వంట
వండటము,
పెట్టుకోటము,
అనుభవించటము.
అదే
జ్ఞాతుం,
ద్రష్టుం,
ప్రవేష్టుం.
అమ్మగారు
వచ్చి
చెప్పారు.
నాయనా!
నీకోసం
పాయసము
చేశాను,
పులిహార
చేశాను,
వడలు
చేశానని.
అది
విన్నావు.
ఆ
వినటమే
జ్ఞాతుం.
అవన్నీ
తెచ్చి
తట్టలో
పెట్టుకున్నావు.
బాగా
చూశావు
ఇది
ద్రష్టుం.
చూడటమే
కాకుండా
ప్రవేష్టుం.
లోపలకు
పోవాలి.
అప్పుడే
మనకు
పుష్టి,
సంతుష్టి
లభిస్తుంది.
పెద్దలు
చెప్పిన
విషయముగాని,
పిల్లలు
చెప్పిన
విషయములుగాని
కొంతవరకు
మనము
విని
చక్కగా
దానిని
మననము
చేసి
ఒకటి
రెండైనా
ప్రాక్టికల్
లో
పెట్టటానికి
ప్రయత్నించాలి.
ఈ
మూడింటి
యొక్క
యేకత్వమే
నిజమైన
ఆనందమునకు
మూలము.
విద్యార్థులారా!
వైరాగ్యమనగా
మనము
అన్నింటిని
వదలి
ఎక్కడికో
పోవటం
కాదు.
మనము
వుండిన
స్థితియందే
వుండి
వస్తువు
యొక్క
తత్వాన్ని
మరచి
దాని
యొక్క
యదార్థమైన
సారమును
మనము
అనుభవించటమే
వైరాగ్యము.
పదార్థ
దృష్టిని
మీరు
పెట్టుకోకండి.
పరార్థ
దృష్టిని
పెంచుకోండి.
వస్తువు
యందున్న
విషయ
రహస్యమును
గుర్తించుకోటమే
వైరాగ్యము.
చిన్న
ఉదాహరణము.
మార్కెట్టుకు
వెళ్లి
ఒక
మామిడి
పండు
తెచ్చుకున్నాము.
ఈ
మామిడి
పండుకు
వెల
నేనే
యిచ్చాను.
నా
డబ్బులు
నేనిచ్చాను.
ఎవరిదగ్గరా
దొంగిలించుకొని
రాలేదు.
ఎవరి
డబ్బో
నేను
యివ్వలేదు.
ఇది
నాడబ్బు
అని
అహంకార
పడవచ్చు.
మామిడి
పండు
కొనుక్కొని
తెచ్చావు.
అది
తినే
సమయములో
నీవు
ఏమి
చేస్తావు?
ఆ
జ్యూస్
మాత్రమే
నీవు
స్వీకరిస్తావు.
7
▾
Meaning
Keep
విత్తనమును,
పై
బెండును
పారవేస్తావు.
mango
కొనవద్దనలేదు.
మామిడి
ఫలమును
కొను.
అది
భుజించు.
సారాన్ని
స్వీకరించు.
నిస్సారమును
విసర్జించు
ఇదే
వైరాగ్యము.
అట్లుకాకుండా
నేనే
డబ్బు
పెట్టి
కొనుక్కున్నానని
ఆ
విత్తనం
కూడా
తినటానికి
ప్రయత్నిస్తే
అది
యెంత
మూర్ఖత్వము
అవుతుంది.
కనుకనే
యీ
వైరాగ్యమనేది
నిత్యానిత్య
విషయ
పరిశీలన
చేసి
ఏది
స్వీకరించవలసినది,
ఏది
విసర్జించవలసినదే
discrimination
power
లేకపోతే
అది
కేవలము
ఒక
మూర్ఖత్వముగా
రూపొందుతుంది.
ఆ
discrimination
power
తో
ఏది
స్వీకరించాలి,
ఏది
విసర్జించాలి
అని
నిర్ణయము
చేసుకోటమే
వైరాగ్యము.
కనుక
వైరాగ్యమంటే
తప్పు
అర్థముగా
మీరు
తీసుకోకూడదు.
అన్నీ
వదలిపెట్టి
అరణ్యములకు
పోవటమని
మీరు
భావించరాదు.
అన్నింటియందు
దైవత్వమును
మీరు
అనుభవించండి.
దైవత్వమును
దృష్టిలో
వుంచుకోండి.
అదే
నిజమైన
వైరాగ్యము.
అంతేగాని
ఏదో
మనం
ఆలుబిడ్డలను
వదలిపెట్టి,
ఆస్తిపాస్తులను
వదలిపెట్టి
సర్వసంగ
పరిత్యాగులమై
అరణ్యమునకు
పోవటం
కాదు.
అరణ్యము
మాత్రం
ప్రపంచము
కాదా?
అక్కడంతా
మనుషులు
లేకపోవటం
వలన
చెట్లు
పెరిగాయి.
ఇక్కడ
మనుషులు
వుండటం
వలన
చెట్లు
కొట్టేస్తున్నారు.
అంతేగాని
అది
కూడా
ప్రపంచములో
భాగమే.
కనుక
మనము
చేసే
విధానములో
మంచి
చెడులు
విచారణ
చేసి
అనుభవించటానికి
ప్రయత్నము
చేయాలి.
Previous
←
To be happy here, hematāraka vidyā; to be happy hereafter, Brahma vidyā
Next
Prakṛti itself is the direct proof of God's existence
→