Contents
Devotion & Sacred Story
Home
Library
Find
Shelf
Settings
←
Leave
Sathya Sai Speaks 1988 · Prakṛti itself is the direct proof of God's existence
Tap a verse for its meaning
IAST
Telugu
Meaning
Continuous
Prakṛti itself is the direct proof of God's existence
12 July 1988
1
▾
Meaning
Keep
తిండికోసం
పెక్కు
త్రిప్పలు
పడుచుందురు
ప్రకృతి
సుఖము
లెల్ల
పొందగోరు
మీరు
చేర
దైవముకడ
చేయరు
యత్నంబు
ఉన్నమాట
తెలుపుచున్న
మాట
భుక్తి
చదువుల
నెంతో
భక్తితో
చదివేరు
ముక్తి
చదువులకెవ్వడు
ముందుకురాడు
విద్యార్థులారా!
ప్రపంచము
భగవంతునియొక్క
విశాలస్వరూపము.
మానవునియొక్క
బుద్ధిని
వికసింపచేసుకొని
భగవత్
సృష్టిపైన
మరల్చినప్పుడు
విచిత్రమైనటువంటి
సృష్టియొక్క
క్రమము
అర్థమవుతున్నది.
ఈ
సృష్టిక్రమమును
అర్థము
చేసుకోటమే
సరియైన
విద్యగా
మనము
గుర్తించుకోవాలి.
మొట్టమొదట
మనకు
జడమైన
కొండలు,
పర్వతములు
గోచరిస్తాయి.
ఇందులో
చైతన్యము
మనకు
కనిపించదు.
రెండవది,
వృక్షములు.
ఇందులో
చైతన్యము
వున్నది
కాని,
అది
ఒక
ప్రదేశమునుండి
మరొక
ప్రదేశమునకు
ప్రయాణము
సలుపలేదు.
మూడవది,
జంతువులు.
ఇందులో
చైతన్యము
వుండటమేకాక
అవి
ఒక
ప్రదేశమునుండి
మరొక
ప్రదేశమునకు
ప్రయాణము
చేయుట
సంభవిస్తుంది.
నాల్గవది,
మానవుడు.
ఇతనియందు
పరిపూర్ణ
చైతన్యము
వుండటముకాక
ఒక
విచిత్రమైన,
అమోఘమైన,
అద్భుతమైన
విషయము
విశిష్టతగా
వుంటున్నది.
అదియే
సుభాషితములు.
మొదటిది
జడము,
రెండవది
చైతన్యము,
మూడవది
సంచలనము,
నాల్గవది
సుభాషితములు.
ఈ
సృష్టియొక్క
క్రమమును
అర్థము
చేసుకున్న,
మానవత్వము
ఎంత
విశిష్టమైనట్టిదో,
ఎంత
దుర్లభమైనట్టిదో,
ఎంత
అమోఘమైనట్టిదో
మనము
గుర్తించవచ్చు.
2
▾
Meaning
Keep
అక్షరములన్నిటికి
ఆది
‘ఓం’
అనే
అక్షరమే!
పూర్వము
మహర్షులు
అనేక
విధములైనటువంటి
తపస్సులు
ఆచరించి,
విచారణ
సలిపి
తమయొక్క
దివ్యత్వముచేత
సర్వము
గుర్తించి
మానవత్వము
అతి
దుర్లభమైనదనేటువంటి
విషయాన్ని
జగత్తునకు
ప్రబోధిస్తూ
వచ్చారు.
‘వేదాహమేతం
పురుషం
మహాన్తమ్,
ఆదిత్యవర్ణం
తమసః
పరస్తాత్’
అన్నారు.
అనగా
మానవత్వముయొక్క
విశిష్టతను
ఒక
దైవత్వముతో
పోల్చుకొని
అది
ప్రకాశవంతమైనదిగను,
ప్రశాంతమైనదిగను,
అజ్ఞానమునకు
ఆవరణగా
యున్నటువంటిదిగను
భావించి
ప్రచారము
సలుపుతూవచ్చారు.
మానసిక
వ్యవహారముచేతను,
ధ్యానముచేతను,
తపస్సుచేతను
వారిచే
గుర్తింపబడినటువంటివి,
రెండు
విషయములు.
మొదటిది,
అక్షరము.
రెండవది,
అంకె.
ఈ
అక్షరమునందు
మొట్టమొదటిది
‘ఓం’.
సమస్త
అక్షరములుకూడను
ప్రధమాక్షరమైనటువంటి
ప్రణవమునుండియే
ఆవిర్భవిస్తూ
వచ్చాయి.
అన్ని
అక్షరములకు
ఆది
అక్షరము
ప్రణవమే.
‘ఓం’
అనే
అక్షరములేకుండా
ఏ
అక్షరముకూడా
వుచ్ఛరించుటకు
వీలుకాదు.
మన
పిల్లలు
భజనలో
హార్మోనియం
వాయిస్తూ
వుంటారు.
ఈ
హార్మోనియంలోపల
ఒకవైపు
గాలి
నింపుతూ
వుంటారు.
మరొకవైపున
రీడ్సుఅంతా
వత్తుతూ
వుంటారు.
ఈ
రీడ్సు
వత్తినప్పుడు
‘సరిగమపదనిస’
అని
వుచ్చరిస్తున్నది.
‘సరిగమపదనిస’
అనే
ఈ
సప్తాక్షరములకు
ఆధారము
ఏమిటి?
నింపినటువంటి
గాలి.
అదే
‘ఓంకారము’.
ఓంకారమనేటువంటి
గాలినుండి
ఈ
‘సరిగమపదనిస’
అనే
సప్త
స్వరములు
వచ్చాయి.
అదే
విధముగనే
అంకెలందుకూడను
1,
2,
3,
4,
5,
6,
7,
8,
9,
10
అని
వుచ్చరిస్తున్నాము.
ఈ
అన్నింటియందుకూడను
1
మాత్రమే
ప్రధానము.
మిగిలినవన్నీకూడను
ఈ
1కి
రూపాంతరములు.
9లో
1
తీసివేస్తే
8
అయింది.
8కి
1
చేరిస్తే
9
అయింది.
రావటము,
పోవటము
ఒక్కటే!
వుండటము
ఒక్కటే!
ఆ
ఒక్కటినే
ఆది,
అంత్యము,
ఆస్తికము
అని
చెబుతూ
వచ్చారు.
ఇది
ఒక్కటే
దైవత్వము
అని
నిరూపిస్తూ
వచ్చారు.
అదియే
ఈ
జగత్తునకు
బీజము
అన్నారు.
పొట్టులేకుండా
విత్తనము
వుండదు.
3
▾
Meaning
Keep
కనుక
ఈ
పొట్టుతోకూడినటువంటిదే
విత్తనము.
పొట్టుతో
కూడి
వుండటంచేత
లోపలవున్న
విత్తనము
మనకు
కనిపించదు.
ఆ
పొట్టే
ప్రకృతి.
అందులోనే
వుంటున్నది
దైవత్వమనే
విత్తనము.
మన
దృష్టి
ప్రకృతి
అనే
పొట్టుపైన
వుండినంతవరకు
మనకు
విత్తనము
గమనించుటకు
వీలుకాదు.
ఈ
దివ్యత్వముయొక్క
తత్త్వము,
ప్రకృతి
తత్త్వముచేత
కప్పబడియున్నది.
ఇట్టి
ప్రకృతియొక్క
తత్త్వాన్ని
మనము
గుర్తించడానికి
తగిన
ప్రయత్నము
చెయ్యాలి.
దీనినే
ఉపనిషత్తులు
‘ఈశావాస్య
మిదం
సర్వం’
అన్నారు.
అనగా
ప్రపంచమంతాకూడను
ఉండినటువంటిది
ఒకే
ఒక్క
విత్తనము.
కనుక
ఉపనిషత్తుయొక్క
తత్త్వమును
మనము
చక్కగా
అర్థము
చేసుకోవలెనన్న
నిత్య
జీవితములో
సత్యమైనటువంటి
విషయాల్ని
గుర్తించటానికి
ప్రయత్నించాలి.
ఈ
ప్రకృతి
దేని
నిమిత్తమై
ఏర్పడినటువంటిది?
కనబడని
మానవత్వమునకు
ఒక
దివ్యత్వమును
చేకూర్చి,
నిజ
తత్త్వాన్ని
గుర్తింపజేసి
కర్తవ్యాన్ని
నిర్వర్తించే
నిమిత్తమై
ప్రకృతి
తోడ్పడుతున్నాది.
పర్వతములు
చిన్న,
చిన్న
రాళ్లుగా
తయారై
మానవునకు
గృహ
నిర్మాణమునకై
సహాయము
చేస్తున్నాయి.
వృక్షములు
తమయొక్క
కొమ్మలు,
రెమ్మలు
ముక్కలు,
ముక్కలుగా
చేసుకొని
గృహ
నిర్మాణమునకు
మరియు
మిగిలినవి
వంట
చెఱకుగాకూడను
వుపయోగపడుతూ
మానవునకు
సహాయము
చేస్తున్నాయి.
ఈ
విధంగా
చైతన్యస్వరూపుడైన
భగవంతుని
సృష్టిలో
చీమ
మొదలు
ఏనుగువరకు
వుండినటువంటి
ప్రతీ
జీవికూడను
మానవునకు
వుపకారము
చేస్తూ
వచ్చాయి.
గోవులు
పవిత్రమైనటువంటి
క్షీరమును
మానవులకు
అందించి
పుష్టిని,
సంతుష్టిని
చేకూరుస్తూ
వచ్చాయి.
ఎద్దులు
భూమిని
దున్నుటకు
మానవునికి
సహాయము
చేసి
పంటలు
పండించి
మానవునకు
సహాయము
చేస్తూ
వున్నాయి.
గొఱ్ఱెలు,
మేకలు,
కోళ్లు,
చేపలు,
చిన్న
చిన్న
పక్షులు
ఇవన్నీకూడను
మానవునకు
ఆహారముగా
రూపొందుతూ
వస్తున్నాయి.
ఈ
విధముగా
మనము
విచారణ
చేస్తే
సృష్టియందున్నటువంటి
ప్రతీ
జీవికూడను,
ప్రతీ
పదార్ధముకూడను
మానవుని
జీవనమునకు
వుపకరిస్తూ
వస్తున్నాయి.
ప్రకృతియే
మనకు
ఉత్తమమైన
గురువు
ఇంత
మాత్రమే
కాదు,
సూర్యచంద్రాదులుకూడను
మానవునకు
సేవలనందిస్తూ
వస్తున్నాయి.
4
▾
Meaning
Keep
ఇక్కడ
మహర్షులంతాకూడను
సూర్యుడిని
ప్రత్యక్షదైవముగా
భావిస్తూ
దానినే
గాయత్రీ
మంత్రమునందు
ప్రధాన
దేవతగా
పరిగణిస్తూ
వచ్చారు.
సూర్యచంద్రాదులుకూడను
మానవునకు
అనేక
విధములుగా
సేవలు
చేస్తున్నారు.
సూర్యుడు
లేకపోతే
జగత్తంతా
చీకటే!
చీకటిలో
మనము
పనులు
చేసుకోలేము.
కనుకనే
సూర్యప్రకాశముచేత
దేహాల్ని
పోషించుకుంటూ,
జగత్తును
అనుభవిస్తూ
మనము
అనేకరకములైనటువంటి
కర్తవ్యములు
నిర్వర్తించుకుంటూ
వస్తున్నాము.
దేవుడైన
సూర్యుడే
మానవునకు
సేవలు
చేస్తూ
మానవుని
ఉద్ధారణకోసమని
అనేక
విధములైన
వుపకారములుచేస్తూ
వారిని
ఉద్ధరిస్తూంటే
ఈనాడు
మానవుడు
ఏవిధముగా
వుంటున్నాడు?
ప్రకృతినుండి
సర్వ
సౌఖ్యములు
అనుభవిస్తూ
వున్నాడు.
ప్రకృతినుండి
సమస్తమైన
సేవలను
చేయించుకుంటున్నాడు,
మానవుడు.
అట్టి
మానవుడు
ప్రకృతికి
ఏ
విధమైన
కృతజ్ఞతలను
అందిస్తున్నాడు?
దైవానికి
ఏ
విధమైన
కృతజ్ఞతలను
చేకూరుస్తున్నాడు?
అట్టి
దైవమునే
తాను
మరచిపోతున్నాడు.
కనుకనే
మానవుడు
అనేక
విధములైనటువంటి
దుఃఖములకు,
కష్టములకు
గురి
అవుతున్నాడు.
సర్వ
సుఖములను
ప్రపంచమునుండి
పుచ్చుకుంటున్నాడేగాని,
ప్రపంచమునకుగాని,
పరమాత్మకుగాని
ఇచ్చుకొనేటువంటి
చిత్తము
అతనియందు
అభివృద్ధి
కాలేదు.
ఇది
ఈనాటి
మానవునియొక్క
కృత్రిమమైన,
క్రూరమైనటువంటి
వికారము.
కనుక
మానవత్వములో
విశిష్టమైనటువంటి
ప్రకృతియొక్క
తత్త్వాన్ని
అర్థము
చేసుకోవటము
ప్రప్రధమములో
గుర్తించుకోవాలి.
అపకారికే
వుపకారము
చేయమని
చెప్పినప్పుడు,
ఉపకారికి
అపకారము
చేయటము
ఎంత
అపకారము!
కనుక
ఈనాడు
మానవునిగా
రూపొందింపబడుతున్నాడేగాని,
మానవునిగా
నిరూపింపబడుటలేదు.
ఇదియే
ప్రకృతియొక్క
ప్రబోధలు.
కనుకనే
ప్రకృతియే
మనకు
ఉత్తమమైన
గురువు.
ఎందుకంటే
మనకు
అనేక
విధములైనటువంటి
బోధలు
సలుపుతూ
వుంటాది,
ప్రకృతి.
తాను
ఎటువంటి
ప్రతిఫలములను
ఆశించటము
లేదు.
దేవుడు,
దేవుడు
అంటే
ఎక్కడున్నాడు?
ఒక
వ్యక్తి
ఇంకొక
వ్యక్తిని
విచారిస్తూ
వచ్చాడు:
‘నాయనా!
నీ
తండ్రి
ఎవరూ’
అని
ప్రశ్నించాడు.
‘మా
తండ్రి
ఫలానావాడు’
అని
రెండవ
వ్యక్తి
సమాధానము
చెప్పాడు.
‘అతను
నీ
తండ్రియని
ఏ
విధముగా
నిరూపిస్తావు,
సాక్ష్యము
ఏమిటి?’
అని
మొదటి
వ్యక్తి
మరల
ప్రశ్నించాడు.
5
▾
Meaning
Keep
‘దీనికి
నా
తల్లియే
ప్రమాణము.
నా
తల్లి
చెప్పిన
వాక్యమే
సత్యమ’ని
చెప్పాడు.
తండ్రి
ఎవరూ
అని
తల్లితప్ప
అన్యులెవరూ
నిర్ణయించలేరు.
ఇంటిని
మనము
చూస్తున్నప్పుడు,
ఇంటిని
కట్టినవాడు
ఒకడుండాలి
కదా!
కట్టినవాడు
లేకుండా
ఇల్లు
ఎలా
తయారౌతుంది.
కనుక
ప్రకృతిలో
సృష్టికర్త
అనేవాడు
ఒకడుండాలి
కదా!
సృష్టి
అంతయు
లోక
కళ్యాణమునకు
ఏర్పడినదేగాని,
లోక
నిర్మూలనకు
కాదు
ఈ
పంచభూతములకు,
పంచకోశములకు,
పంచప్రాణములకు,
పంచేంద్రియములకు
ఎవరు
దీనికి
అధిపతి?
ఇవన్నీకూడా
సక్రమముగా
జరిగిపోతూ
వస్తున్నాయి.
రాత్రి,
పగలు
ఎన్ని
చక్కని
ఉపదేశములు
చేస్తూ
వస్తున్నాయి.
తమ
క్రమాన్ని
తప్పకుండా
నడుస్తూ
వస్తున్నాయి,
ఋతువులు.
సరియైనటువంటి
రీతిగా
సక్రమముగా
నడుస్తూ
మానవునికి
చక్కని
ఉపదేశము
చేస్తున్నాయి.
కనుక
భగవంతుడు
వున్నాడు
అనే
సత్యాన్ని
నిరూపించటానికి
ప్రకృతియే
మనకు
ప్రత్యక్ష
ప్రమాణము.
ఈ
ప్రకృతిని
ఏ
వ్యక్తికూడను
నడపటములేదు,
వుంచుకోటములేదు.
భగవంతునియొక్క
యిచ్ఛానుసారమే
అది
జరుగుతూ
వుంటుండాది.
మానవుని
యొక్క
కృత్రిమమైనటువంటి
యంత్రములు
స్వల్పకాలములో
నశించిపోతున్నాయి.
ఈనాటి
వైజ్ఞానికుడు
అనేక
విధములైనటువంటి
గ్రహములను
కనిపెట్టాడు.
ఈ
గ్రహములంతాకూడను
కృత్రిమమైనటువంటివే!
కొంతకాలమయ్యేటప్పటికి
కూలిపోయేటటువంటివే!
కాని,
నిజమైనటువంటి
గ్రహములు
ఏనాడు,
ఏ
స్థితియందు,
ఎప్పుడు,
ఎవరు,
ఏ
విధముగా
సృష్టించారో
ఎవరికీ
తెలియదు.
నాటినుంచి
నేటివరకూ
కాలానికి
ఎటువంటి
వుపద్రవములు
కలగనివ్వకుండా
చక్కగా
తమ
కర్తవ్యమును
నిర్వర్తించుకుంటూ
వస్తున్నాయి.
కనుక,
ఈ
సృష్టియంతయుకూడను
కేవలము
లోకకళ్యాణనిమిత్తమై
ఏర్పడినటువంటిదేకాని,
లోకనాశనమునకై
ఏర్పడినటువంటిదికాదు.
లోక
నిర్మాణముకై
ఏర్పడినటువంటివాడు,
దైవము.
ఆయన
సృష్టించిన
గ్రహములన్నీకూడను
లోకోద్ధారణము
గావించుచున్నాయి.
కాని
ఈనాటి
వైజ్ఞానికుడు
కనిపెట్టిన
గ్రహములన్నికూడను
లోక
నిర్మూలము
గావిస్తూ
వస్తున్నవి.
తన
శక్తి
సామర్ధ్యములు
లోక
నిర్మూలమునకు
పనికి
వస్తున్నవి
కాని
నిర్మాణమునకు
వుపయోగించటం
లేదు.
6
▾
Meaning
Keep
దీనికి
కారణము
యేమిటి?
దీనికి
అహంకారమే
మూలకారణము.
‘నేను,
నేను,
నేను’.
‘నేను
చేస్తున్నాను,
నేను
చూస్తున్నాను,
నేను
అనుభవిస్తున్నాను.
నేనే
దీనికి
మాష్టరు’
అనే
భావమే
ఈ
నిర్మూలమునకు
మూలకారణము.
విద్యార్థులైనటువంటి
వారియందు
ఒంటిలో
బలముండినంతవరకు
కంటిలో
కొవ్వుంటాది.
ఈనాటి
మానవుడు
కండబలమును,
గుండెబలమును
గురించి
విఱ్ఱవీగుతున్నాడుగాని,
దైవబలమును,
ధర్మబలమును
గురించి
విచారించటములేదు.
ఇది
ఎంతకాలము?
‘తుమ్మినంతనే
తూలిపోవు
ఓ
తొమ్మిది
తొఱ్ఱెల
తోలుబొమ్మ.
తైతైతై
తైబొమ్మ.
దీని
తమాషా
చూడరా
తోలుబొమ్మ’.
ఇదేనా
మానవత్వము?
ఎంతకాలముంటాదీ
శక్తి,
యీ
పుష్టి?
ప్రేమ
యిచ్చుకోవటమేగాని,
పుచ్చుకోవటము
యెరుగదు
‘అందము,
ప్రాయము,
ఇంద్రియశక్తియు
వుందని
నిక్కకు
రోరన్నా!
ముందున్నదిరా
ముసలితనమ్మను
ముసుళ్లపండగ’
అన్నాడు,
ఒకకవి.
మనము
యువకులము,
యువకులము
అని
ఆనందము
అనుభవించుచుండగనే
ముంచుకొని
వస్తున్నది,
ముసలితనము.
‘మసలలేవు,
కనుమసకలు,
మోమున
ముడతలుపడి
తల
నెరిసెనుకదా!
ముసలికోతి
అని
నిను
పసివారు
ముసి
ముసి
నవ్వగా
ముసిరే
బొమ్మ!’
ఎంతకాలము
మనము
అనుభవిస్తాము?
బాల్యములో
ఆటలు,
పాటలు,
చదువులు,
సంధ్యలు
అనేటువంటివి
అనుభవిస్తుండగనే
యవ్వనము
వచ్చి
చేరిపోతుండాది.
నేను
యవ్వనుడని
కేవలము
గర్వముతో
సర్వమును
మరచి
పెద్ద,
చిన్న
అనేటువంటి
విచక్షణాభావము
లేకుండా
విఱ్ఱవీగుతుండగనే
ముసలితనము
ప్రారంభమవుతున్నాది.
ఏది
స్థిరమిక్కడ?
ఏది
సత్యమిక్కడ?
అన్నీకూడా
మార్పుచెందుతున్నటువంటివే!
ఈ
ప్రకృతిలో
అన్నీ
కదలిపోయే
మేఘములే!
ఒక్కటైనా
స్థిరములేదు.
నీయొక్క
పవిత్రతే
స్థిరము.
ఇట్టి
పవిత్రము
అనేటువంటి
పదమును
అందుకున్నటువంటి
మానవుడు
ఎంత
అపవిత్రముగా
నడుచుకుంటున్నాడో
మీరు
యోచించవచ్చు.
పవిత్రత
మనకు
ఎప్పుడు
లభిస్తుంది?
హృదయానికి
హృదయము,
ప్రేమకు
ప్రేమ
అందించినప్పుడే
పవిత్రత
వస్తుంది.
మన
ప్రేమ
త్రికోణ
స్వరూపమైనటువంటిది.
7
▾
Meaning
Keep
త్రిభుజములతో
కూడినటువంటిది.
ఈ
ప్రేమ
ఫలితాన్ని
ఆశించదు.
ఫలితమును
ఆశించేటువంటి
ప్రేమగా
వుండినప్పుడే
ఆ
వ్యక్తియందు
భయము
ప్రవేశిస్తుంది.
ఫలాపేక్షరహితముగా
ప్రేమను
అందించేటువంటివానికి
భయమనేటువంటిదే
వుండదు.
ప్రేమ
యిచ్చుకునేటువంటిదే
కాని
పుచ్చుకోటమనేది
యెరుగదు.
అట్టి
ప్రేమకు
భయమనేటువంటిది
ప్రవేశించదు.
ప్రేమకు
ప్రేమనే
ఫలితము.
ఈ
మూడే
నిజమైన
ప్రేమకు
పటుత్వమైన
శక్తులు.
కాని,
ఈనాటి
ప్రేమ
ఫలితాన్ని
ఆశిస్తుండాది.
భయభ్రాంతులతో
నిండిపోయుండాది.
ఏదో
ఒక
లక్ష్యాన్ని
పెట్టుకొని
మనం
ప్రేమిస్తున్నాము.
ప్రేమకు
అనిత్యమైన,
అశాశ్వతమైనటువంటి
పదార్ధములు
లక్ష్యములుగా
పెట్టుకుంటే
మనకు
ఈ
విధమైనటువంటి
జీవితమే
సంభవిస్తుంది.
ప్రేమకు
ప్రేమనే
మనము
లక్ష్యములో
వుంచుకోవాలి.
ప్రేమ
శాశ్వతమైనటువంటిది.
నీవు
ప్రేమస్వరూపుడవు,
సత్యస్వరూపుడవు,
దైవస్వరూపుడవు.
ఈ
సత్యాన్ని
చక్కగా
విశ్వసించి
దానికి
తగినటువంటి
ప్రయత్నము
సలిపినప్పుడే
మన
ప్రేమ,
మన
జీవితము
ధన్యమవుతుంది,
సార్ధకమవుతుంది.
జగత్తును
మనము
చక్కగా
గుర్తించినవారమవుతాము.
కృతజ్ఞత
నేర్పనటువంటి
చదువులు
వ్యర్థమైనవి
మనము
చదివినటువంటి
చదువులు,
నడచినటువంటి
నడతలు,
చేసినటువంటి
చర్యలు,
చూచినటువంటి
దృశ్యములు,
విన్నటువంటి
విషయములు,
తలంచినటువంటి
సంకల్పములు
అంతా
దైవత్వముగానే
విశ్వసించాలి.
ఇదియే
శరణాగతికి
సరియైనటువంటి
అర్థము.
కన్నులతో
చూచినటువంటిది,
చెవులతో
విన్నటువంటిది,
మనస్సుతో
అనుభవించినటువంటిది
ఇవన్నీకూడను
దైవత్వముయొక్క
చిహ్నములుగానే
విచారించాలి.
‘ప్రతి
వ్యక్తియందుకూడను
దైవమున్నాడు’
అనేటువంటి
సత్యాన్ని
మనము
గాఢముగా
విశ్వసించాలి.
దైవము
అందించినటువంటి
ఈ
ఫలితమునకు
తగినటువంటి
కృతజ్ఞతను
చూపటానికి
సిద్ధముగా
వుంటుండాలి.
భగవంతుడు
ఈ
ప్రపంచమునకు
ఎంతో
కాలమునుండి
ప్రాణవాయువునిచ్చి
మనయొక్క
జీవితాలను
రక్షిస్తున్నాడు.
పెద్ద
ఫేను
పెట్టితే
ఆ
గాలి
వీచితే
ఏదో
కొంత
దూరమునకు
పోతుందే
కాని
భగవంతుడు
అందించేటువంటి
పెను
గాలి
జగత్తంతయు
ఒక్కతూరి
వుర్రూతలూగిస్తుంది.
8
▾
Meaning
Keep
ఈ
గాలిని
ఎవరు
సృష్టించారు.
ఇక్కడ
మూడు
రకములైనటువంటి
జ్యోతులుంటున్నాయి.
భగవంతుడు
అందిచ్చినటువంటి
జ్యోతి,
సూర్యుడు.
జగత్తంతాకూడను
ప్రకాశిస్తున్నాడు.
మనము
ఎంత
వోల్టేజు
బల్బు
వేసుకున్నప్పటికిని
మన
రూములో
వుండవచ్చు.
బయటవుండవచ్చు.
బజారుకు
పోవచ్చు.
వూరంతకు
లైటు
యిస్తుందా?
పంపుసెట్టు
పెట్టితే
ఏదో
కొంత
దూరమునకు
మాత్రమే
నీరు
వస్తుంది.
అదే
కుంభవర్షము
కురిస్తే
గంగంతా
ప్రవహిస్తుంది.
ఈ
జలమును,
వాయువును,
వెలుతురును
అందించేటువంటివారు
ఎవరు?
ఇవన్నీకూడను
అనుభవిస్తున్నామే
కాని
దానికి
కృతజ్ఞతగా
మనము
ఏమి
యిస్తున్నాము?
మన
టవలు
క్రిందపడిపోయి
తిరిగి
ఎవరైనా
మనకు
అందిస్తే
మనము
థేంక్స్
అంటాము.
ఎవరైనా
చిన్న
వస్తువు
యిచ్చినాసరే
మనము
థేంక్స్
అంటాము.
చిన్న
చిన్న
దానికే
మనము
థేంక్స్
చెబుతున్నామే,
భగవంతుడు
నిత్యసత్యమైనటువంటియొక్క
మన
జీవితాధారమైనటువంటి
మానవత్వమును
ఉద్ధరించేటువంటి
వుపకారములు
చేస్తుంటే
ఎవరు
థేంక్స్
చెబుతున్నారు?
ఇది
మానవునకు
యుండవలసినటువంటిదా,
ఇది
విద్యలకు
వుండవలసిన
వివేకమా,
విద్యావంతులకు
వుండవలసిన
విచక్షణయా?
కాదు
కాదు.
మనము
వినయముతో,
విధేయతతో
ఎవ్వరికైనా
వుపకారము
చేసినటువంటివారికి
తగినటువంటి
రీతిగా
కృతజ్ఞత
నందించాలి.
ఈ
కృతజ్ఞతే
లేనటువంటి
చదువులు
కేవలము
చెత్త
చదువులు.
చదివించేటటువంటివారు
తల్లితండ్రులు,
చదువు
చెప్పేటటువంటివారు,
గురువులు.
చదువునందించి,
చదువునందుకోటానికి
సహాయము
చేసేటువంటివాడు
దైవము.
కనుకనే
తల్లి,
తండ్రి,
గురువు,
దైవము
అని
మాతృదేవో
భవ,
పితృదేవో
భవ,
ఆచార్యదేవో
భవ
అని
వేదములు
చెపుతున్నాయి.
వీటిని
వల్లించటములో
నున్నటువంటి
అంతరార్ధము
యేమిటి?
తల్లితండ్రులకు
కృతజ్ఞత
చూపాలి,
గురువులకు
తగినటువంటి
గౌరవము
నందించాలి.
దైవాన్ని
నమ్మి
జీవించాలి.
కాని,
ఈనాడు
నీయొక్క
దేహముపై
ఆధారపడి,
బుద్ధి
మరియు
తెలివితేటలపై
ఆధారపడి
నీవు
జీవిస్తున్నావని
విఱ్ఱవీగుతున్నావు.
ఇది
వెఱ్ఱితనమని
గుర్తించాలి.
విద్యార్థులారా!
ప్రకృతియొక్క
సత్యస్వరూపాన్ని
ఒక్కతూరి
విశాలమైనటువంటి
దృష్టితో
చూడటానికి
మనము
ప్రయత్నించాలి.
9
▾
Meaning
Keep
కేవలము
సంకుచితమైనట్టి
దృష్టితో
చూడకూడదు.
కన్ను
ఒక
యించికూడను
లేదు.
కాని
అంత
చిన్న
నేత్రము
ఎంత
విశాలమైన
ప్రపంచమును
చూస్తున్నాదో
చూడండి.
ఈ
కన్నుకూడను
నీకు
చక్కని
బోధ
చేస్తున్నాది:
‘ఒరే!
పిచ్చివాడా!
నేను
ఇంత
చిన్నగా
వుంటుండి
విశాలమైన
జగత్తును
చూస్తుంటే,
ఇంత
పెద్ద
శరీరము
కలిగిన
నీవు
సంకుచితముగా
చూస్తున్నావు.
ఎంత
వెఱ్ఱివాడవురా!’
అని
విమర్శిస్తూ
వుంటుండాది.
హృదయాన్నికూడా
విశాలము
గావించుకోవటానికి
తగిన
కృషి
చేయండి.
మన
చిత్తమును
భగవంతునికి
అర్పితము
చేసుకోటానికి
ప్రయత్నము
చేయండి.
Previous
←
Through Sacrifice Comes the Divinity Called Immortality
Next
Only when man changes will the world change
→