Contents
Devotion & Sacred Story
Home
Library
Find
Shelf
Settings
←
Leave
Sathya Sai Speaks 1988 · In hardships and in pains, strive to turn the mind another way!
Tap a verse for its meaning
IAST
Telugu
Meaning
Continuous
In hardships and in pains, strive to turn the mind another way!
26 August 1988, Onam, Prasanthi Nilayam
1
▾
Meaning
Keep
ప్రేమస్వరూపులారా!
రాత్రివేళలందు
జగత్తునకు
ప్రకాశమునందించేది
చంద్రుడు.
పగలు
లోకమునకు
ప్రకాశమునందించేది
సూర్యుడు.
త్రిలోకములకు
ప్రకాశము
నందించేది
ధర్మము.
సుపుత్రుడే
కులమును
వుద్ధరించటానికి
తగినవాడు.
వెలయు
వనములోన
మలయజంబన్నట్లు
గుణవంతుడైన
కుమారుడు
తన
కులమును
సంరక్షించటమే
కాకుండా
జగత్తునకు
కూడను
ఆదర్శవంతుడుగా
రూపొందుతాడు.
కనుక
మానవత్వమునందు
దివ్యత్వమును
విశ్వసించి
పవిత్రతను
అందుకోటం
కర్తవ్యము.
మానవ
జీవితములో
ప్రధానమైనది
కాలము.
ఈ
అనంతమైన
కాలమునందు,
అగాధమైన
దివ్యత్వమునందు,
ఆద్యంతములు
లేని
పరతత్వమునందు
ఏకత్వమును
వహించటమే
మానవుని
ప్రధాన
కర్తవ్యము.
మానవజీవితము
కేవలము
భౌతికమైన
ఆనందముల
నిమిత్తమై
రాలేదు.
దేహము,
మనస్సు,
అహంకారము
యీ
మూడింటి
కలయికయే
మానవుడు.
ఇలాంటి
మానవత్వమును
మనము
సార్థకము
చేసుకొనుటకై
తగిన
కృషి
చేయాలి.
కర్మాచరణకు
కాయము
అత్యవసరము.
జగత్తు
యొక్క
విషయములు
తెలుసుకొనుటకు
మనస్సు
ఆధారము.
ఈ
రెండిటికి
దృక్పథాన్ని
చేకూర్చేది
ఆత్మ.
కనుక
యీ
మూడింటి
యందు
వున్న
అంతరార్థమును
మనము
గుర్తించి
మానవత్వమును
వహించాలి.
ఇక్కడ
చేయుట,
తెలుసుకొనుట,
వుండుట
అనే
మూడును
విశిష్టమైన
పదములు.
ఈ
మూడింటి
తత్వమే
మానవాకారము.
ఈ
మూడింటి
యొక్క
సమ్మిళితమైన
శక్తి
ద్వారానే
మానవత్వము
బహిర్గతమవుతుంది.
ఈ
త్రిశక్తుల
యొక్క
భిన్నత్వము
ఏకత్వము
ఒక్క
ఆత్మతత్వమునందు
మాత్రమే
వుంది.
ఇలాంటి
పరిస్థితులయందు
మానవత్వము
యెంత
విశిష్టమైనదో
మీరు
గుర్తించాలి.
ఇది
కేవలము
విశిష్టము
మాత్రమే
కాదు.
దివ్యత్వమైనది.
ఇలాంటి
దివ్యమైన
మానవత్వమును
మనం
కొంతవరకైనా
గుర్తించటానికి
ప్రయత్నించాలి.
కనుక
మానవుడనగా
శరీరము,
మనస్సు,
ఆత్మ
యొక్క
సమ్మిళితమైన
స్వరూపమే
అనే
సత్యమును
మనం
గుర్తించాలి.
ఈ
మనస్సునకు
నాలుగు
విధములైన
స్థితులుంటున్నాయి.
దీనినే
అంతఃకరణ
అని
కూడను
చెబుతూ
వచ్చారు.
మనస్సు,
బుద్ధి,
చిత్తము,
అహంకారము
యివే
దీని
యొక్క
వికారస్వరూపములు.
అయితే
యీనాల్గు
కూడను
ఒక్క
మనస్సే
ధరిస్తున్నది.
చేయునది
దేహమైనా,
తెలుసుకొనునది
మనస్సైనా,
వున్నది
ఆత్మ
అయినప్పటికి
యీ
మూడింటి
యందు
అధిష్ఠానమైన
శక్తి
ప్రసరిస్తూ
వుంటుంది.
సంకల్ప
వికల్పములతో
కూడినప్పుడు
దీనినే
మనస్సు
అంటున్నాము.
2
▾
Meaning
Keep
బుద్ధి
అనగా
కేవలము
విచారణాశక్తితో
కూడినది.
ఏది
మంచిది,
ఏది
చెడ్డది
అనే
విషయమును
గుర్తింప
చేస్తుంది.
ఇలాంటి
బుద్ధియొక్క
తత్వము
కొంతవరకు
మనస్సు
యొక్క
స్వరూపమే.
ఇక
చిత్తము.
నిరంతరము
చింతించటమే
చిత్తము
యొక్క
స్వభావము.
ఇంక
అహం.
అనగా
ఆత్మ.
ఇది
సర్వత్రా
నిండినది.
దీనినుండి
ఆవిర్భవించినదే
అహంకారము.
అహంకారమనగా
నేను.
అనే
తత్వాన్ని
జగత్తునకు
వ్యాప్తం
చేస్తుంది.
ఏతావాతా
యీనాల్గు
కూడను
మనస్సు
యొక్క
ఆకారములే.
ఒకే
బ్రాహ్మణుని
వంట
చేస్తున్నప్పుడు
వంట
బ్రాహ్మణుడు
అంటాము.
దేవాలయములలో
పూజ
చేసే
బ్రాహ్మణుని
పూజారి
అంటాము.
శాస్త్రములలో
వుపదేశమును
అందించేవారిని
శాస్త్రులు
అంటాము.
మహాపాండిత్యముతో
కూడిన
వ్యక్తిని
పండితుడంటారు.
వీరి
పనులు,
వీరి
ఊహలు,
వీరియొక్క
తత్వము
భిన్నభిన్నముగా
కన్పించినప్పటికి
అందరు
కూడను
బ్రాహ్మణులే.
అదేవిధముగనే
మనసు,
బుద్ధి,
చిత్తము,
అహంకారము
యీపదములు
అనేక
రూపములతో
నానాత్వమును
అనుభవిస్తూ
వుండినప్పటికి
యివి
ఆత్మయొక్క
చిహ్నములే
అనే
సత్యాన్ని
గుర్తించాలి.
ఇది
మనస్సు
యొక్క
ప్రభావము
అనే
దానిని
మనము
చక్కగా
విచారించాలి.
వేదాంతము
మనయేవ
మనుష్యాణాం
కారణం
బంధమోక్షయోః
అన్నది.
బంధమునకుగాని,
స్వేచ్ఛకుగాని
మనస్సే
ఆధారము,
సత్యము.
ఇంతేకాదు.
మనో
మూలమిదం
జగత్.
మనస్సు
యెట్టిదో
మనిషి
అట్టి
వాడౌతాడు.
దీనినే
యద్భావం
తద్భవతి
అన్నారు.
దీనినే
ఆంగ్లములో
so
think
of
the
man
and
so
is
the
man.
ఇలాంటి
పవిత్రమైన
తత్వము
అన్ని
దేశములందు
కూడను
సమత్వముగా
ప్రకటిస్తూ,
ప్రచారము
చేస్తూ
వచ్చినవి.
ఈ
యొక్క
మనస్సు,
బుద్ధి,
అహంకారము,
చిత్తమునకు
అధిపతి
ఒకడు
వుంటున్నారు.
అది
లేక
యీనాల్గు
క్షణకాలం
కూడను
జీవించటానికి
వీలుకాదు.
దీనినే
ప్రజ్ఞ
అన్నారు.
ఈ
ప్రజ్ఞ
యొక్క
తత్వాన్ని
మనము
చక్కగా
అర్థము
చేసుకోవాలి.
ప్రజ్ఞ
అనగా
మేధస్సు
అని,
తెలివి
అని,
వివేకము
అని
అనేక
రకములుగా
దీనికి
పేరులు
పెట్టి
ప్రచారము
చేస్తూ
వస్తున్నారు.
ఇది
సరికాదు.
ఈ
ప్రజ్ఞ
తాత్కాలికమైన
ప్రజ్ఞయే
కాని
శాశ్వత
ప్రజ్ఞకాదు.
వేదాంతములో
వుండిన
ప్రజ్ఞ
స్వరూపము
శరీర
కణములందు,
మనస్సునందు,
ఆత్మయందు
సమత్వమై
ప్రకాశిస్తూ
వుంటుంది.
కనుక
యీ
ప్రజ్ఞకు
ఒక
విధమైన
శక్తి
వుంది.
ఈ
ప్రజ్ఞతత్వమును
మనము
గుర్తించుకున్నప్పుడే
ప్రజ్ఞానం
బ్రహ్మ
తెలుసుకోగలము.
ఈ
ప్రజ్ఞ
అనే
దానికి
ఆత్మ
అనేదానికి
కాని
బ్రహ్మము,
సత్యము
అనేదానికి
గాని
భేదములు
లేవు.
కనుకనే
దీనిని
constant
integrated
awareness.
అనగా
అన్నింటియందును
సమత్వముగా
చేరినది
కనుక
యిలాంటి
ప్రజ్ఞ
మానవునియందు
వున్నది.
ఈనాటి
మానవుడు
తన
తత్వమునే
మానవత్వమునే
తెలుసుకోలేని
సమయములో
యింక
దైవత్వమును
యేరీతిగా
గుర్తించగలడు.
మొట్టమొదట
మానవత్వమును
సరిగా
చక్కగా
గుర్తించటానికి
ప్రయత్నించాలి.
మానవుడు
సామాన్యమైన
స్వరూపుడు
కాదు.
జంతూనాం
నరజన్మ
దుర్లభమ్
యిన్నికోట్ల
జీవరాసులందు
కూడను
ఒక్క
మానవత్వమే
విశిష్టతతో
కూడివుంటుంది.
ఇలాంటి
బలమైన,
విశిష్టమైన
తత్వాన్ని
మనము
తెలుసుకొనుటకు
ప్రయత్నించాలి.
3
▾
Meaning
Keep
మానవునియందే
సత్యమున్నది.
జ్ఞానమున్నది.
అనంతము
వుంటుంది.
అదే
బ్రహ్మతత్వము.
దీనినే
సత్యం
జ్ఞాన
మనంతం
బ్రహ్మ
అన్నారు.
ఇలాంటి
మార్గములను
అనేక
విధములుగా
బోధిస్తూ
జగత్తునకు
ధర్మ
సంస్థాపనార్థమై
అనేక
మహర్షులు
పాటుపడుతూ
వచ్చారు.
ఇంకను
మానవునియందు
మరి
మూడు
ప్రధానమైన
స్థానములుంటున్నాయి.
కళ,
తత్వజ్ఞానం,
మతము.
ఈ
మూడింటి
యొక్క
ఏకత్వమే
మానవాకారము.
దీనిని
మనము
గుర్తించటానికి
కొన్ని
రకములైన
సాధనలు
చేసుకోవాలి.
కళ
అనగా
art,
Philosophy,
మతము
యీ
మూడింటి
యొక్క
సమత్వము
యేమిటి?
Philosophy
అంటే
సత్యదర్శనము
అంటున్నాము.
ఈ
సత్యము
ఎటువంటి
సత్యము?
చూచినది
చూచినట్లుగా,
విన్నది
విన్నట్లుగా,
చెప్పినది
చెప్పినట్లుగా
చేయటం
సత్యమని
భావిస్తున్నాము.
ఈ
సత్యము
క్షణక్షణమునకు
మారుతూ
వుంటుంది.
కాని
త్రికాలబాధ్యం
సత్యం
అన్నారు.
అన్ని
కాలములందు
కూడను
సమత్వముగానే
వుంటుంది.
ఇలాంటి
పవిత్రమైన
మానవత్వము
యొక్క
అంతరార్థమును
మనము
క్షణక్షణమునకు
జ్ఞప్తికి
తెచ్చుకోవాలి.
మానవునియందే
బ్రహ్మతత్వము
వుంది.
మానవుడే
జ్ఞానస్వరూపుడై
వున్నాడు.
ఈ
ఆత్మతత్వమనేది
సర్వత్రా
దీనిలో
వ్యాపించి
వుంటుంది.
ఈ
సత్యమును
మనము
గుర్తించటానికి
ప్రయత్నించాలి.
ఒక
శిల్పి
ఒక
శిలను
తీసుకొని
అనేకవిధములుగా
మలుస్తూ
వచ్చాడు.
కొన్ని
దినములు
గడచిన
తరువాత
అందులో
నుంచి
ఒక
కృష్ణుని
బొమ్మను
తీసాడు.
అయితే
యీ
కృష్ణుని
బొమ్మ
బయటనుండి
వెళ్ళి
లోపల
ప్రవేశించిందా
లేక
రాతినుండి
బయటకు
వచ్చిందా?
కాదు.
కాదు.
రాయి
నిమిత్తమాత్రము.
మానవునియందున్న
ఒక
కళ,
మానవునియందున్న
ఒక
రూపము
అందులో
చెక్కి
దానిని
ప్రకటింప
చేస్తూ
వస్తున్నాడు.
ఈ
విగ్రహము
చేయుటకు
పూర్వము
యీ
విగ్రహమును
పూర్తిగా
తన
మనసులో
చిత్రించుకోవాలి.
ఈ
విధముగా
చిత్రించుకున్న
తరువాతనే
ఆ
యొక్క
కళాస్వరూపుడు
దానినుండి
ఒక
విగ్రహమును
తయారు
చేస్తున్నాడు.
ఇక్కడ
రాయి
ముఖ్యమా?
లేక
విగ్రహము
ముఖ్యమా?
యీ
శిల్పి
ముఖ్యమా?
శిల్పియే
ప్రధానము.
కనుకనే
యీ
మూడింటి
యందున్న
ప్రధాన
తత్వమును
మనము
గుర్తించుకుంటే
మిగిలినవన్నీ
నిమిత్తమాత్రంగా
రూపొందుతాయి.
Experiences,
Experiencer,
Experience
దీనినే
See,
seen
and
seeing
అన్నారు.
అనగా
చూచినవాడు,
చూపబడినటువంటిది,
చూపు
యీ
మూడింటి
యొక్క
ఏకత్వమే.
కనుక
మానవునియందు
సమస్త
కళలు
కూడను
యిమిడి
వుంటున్నవి.
అందుకోసమే
వేదాంత
ప్రబోధకులు
చెప్పారు
Heart
is
inside
art
is
outside.
ఈ
art
అంతా
heart
నుండి
వచ్చినటువంటిదే.
కనుక
సమస్త
సృష్టి
కూడను
మానవునియందు
యిమిడి
వుంటున్నది.
ఇలాంటి
దివ్యత్వమును
గుర్తించటానికి
ప్రయత్నించినవాడే
పవిత్రమైన
వ్యక్తి.
ఆ
మనిషికి
పరులనిగాని
తనదనికాని
భేదము
వుండదు.
అప్పుడే
సత్యపాలన,
సత్యజీవితము
సార్థకమవుతుంది.
సిద్ధాశ్రమము
కేరళలో
ప్రధానమైనది.
అక్కడే
విష్ణువు
వామనావతారమును
ధరించిన
స్థానము.
4
▾
Meaning
Keep
అక్కడ
సాక్షాత్కారము
చేయించుకున్న
స్థానము
కనుకనే
దీనికి
సిద్ధాశ్రమము
అని
పేరు
వచ్చింది.
ఇట్టి
ఆశ్రమము
యొక్క
ప్రభావము
వలనే
కేరళ
దేశము
ప్రశాంత
జీవితమును
గడుపుతూ
వచ్చింది.
ఆనాడు
దీనికి
అధిపతియైన
మహారాజు
ప్రహ్లాదుని
మనుమడు.
ఇతని
తండ్రి
విరోచనుడు.
ఈ
రాజే
బలిచక్రవర్తి.
ఈ
బలిచక్రవర్తి
కాలములో
ఆ
రాజ్యములో
ఎట్టి
లోపములు
లేక
సుఖశాంతులతో
ఆనందమును
అనుభవించేవారు.
ప్రజలను
ప్రాణసమానముగా
పాలించేవారు.
అడిగినవారికి
లేదనే
పదము
ఆ
కేరళ
దేశములో
వుండేది
కాదు.
ఏది
అడిగినా
కూడను
ఆనందముగా,
హృదయపూర్వకముగా
యిచ్చేశక్తి
ఆ
కేరళ
రాజ్యమునకు
వుండేది.
అలాంటి
బలిచక్రవర్తి
భక్తి
ప్రపత్తులను
చూచి
పరీక్షింపగోరి
భగవంతుడు
అవతరిస్తాడు.
అడిగేటువంటివాడు
చాలా
అల్పుడైపోతాడు.
అతను
మహా
విష్ణుస్వరూపుడైనప్పటికిని
యితరులను
ఆశించటానికి
పోతున్నాడు.
కనుక
అతను
చాలా
పొట్టివాడైపోయాడు.
ఇతని
రాకను
చూచి
బలిచక్రవర్తి
ప్రశ్నిస్తాడు.
స్వామి!
ఎందుకోసం
వచ్చారు?
నా
రాజ్యములో
తమరికి
ఏమి
కావాలి?
మీ
సేవలు
యేమైనా
చేసుకోటానికి
అవకాశమిస్తారా?
అన్నాడు.
నాయనా!
నాకు
ఏమీ
అక్కరలేదు.
మూడడుగుల
స్థలము
యిమ్మన్నాడు.
అప్పుడు
ఏమి
స్వామి
అనుగ్రహించి
నా
దగ్గరకొచ్చి
మూడడుగుల
భూమినా
అడగటము.
ఇది
నాకు
సంతృప్తిగా
లేదు.
మీకు
కావలసినది
ఏమైనాసరే
వజ్రములో,
వైఢూర్యములో,
బంగారమో
ఏది
అడిగినా
నేనిస్తానన్నాడు.
వామనుడు
నాకేదీ
అక్కరలేదన్నాడు.
ప్రక్కన
గురువైన
శుక్రాచార్యుడు
వున్నాడు.
బలిచక్రవర్తికి
చెప్పాడు.
స్వామి!
అంత
త్వరగా
మీరు
మాట
యివ్వకూడదు.
వచ్చినవాడు
కేవలము
ఒక
బ్రాహ్మణుడు
కాదు.
ఇతను
బ్రాహ్మణుడని
నీవు
భ్రమిస్తున్నావు.
అతను
దైవస్వరూపుడు
అన్నాడు.
కాని
బలి
చెప్పాడు.
ఏమైనా
సరే
భూమి
ఆకాశము,
ఆకాశము
భూమిగా
మారినాసరే
నేను
నా
మాటను
తప్పేవాడను
గాను
అన్నాడు.
ఇక్కడ
బలిచక్రవర్తి
పదములందు
చక్కగా
మనము
గుర్తించవలసినది
ఒకటి
వుంది.
పండితులు
పండితులని
మహావిద్యావంతులుగా
వుండవచ్చును.
వారు
అనేకమందికి
గురువులు
కావచ్చును.
కాని
ఆచరణకు
మాత్రము
రాలేరు.
కనుకనే
ఆచరించని
గురువులకంటె
ఆచరించే
భక్తులే
ఉత్తములన్నారు.
గురువాజ్ఞను
వుల్లంఘించి
భగవంతునికి
ఏమైనా
యివ్వటానికి
నేను
సిద్ధమే
అన్నాడు.
అతను
భగవత్
స్వరూపుడని
చెప్పావు.
భగవత్
స్వరూపుడే
యీ
వామనమూర్తి
అయితే
నేను
మహాధన్యుడనైపోతాను.
దేనివలననగా
అలాంటి
ప్రభువైన
పరమాత్ముడే
దాసుని
వద్దకువచ్చి
నాకిది
కావాలని
చేయిచాపినప్పుడు
క్రింద
వుంటుంది
అతని
చేయి,
యిచ్చేవాని
చేయి
పైన
వుంటుంది.
అదే
నా
భాగ్యము
అన్నాడు.
ఇట్టి
సత్యాన్ని
గుర్తించినవాడు
బలిచక్రవర్తి.
ఆనాడు
కాలకాలమునకు
వర్షము
కురిసి,
పంటలు
పండి
ఆనందముగా
జీవితము
గడిపేటువంటి
కాలము.
ఇప్పటికి
కూడను
ప్రకృతి
సౌందర్యము
ఒక్క
కేరళ
దేశమందే
ఆనందమునందిస్తుంది.
సంవత్సరమునకు
ఎన్నో
వర్షములు
అక్కడ
కురుస్తూ
వుంటాయి.
ఎక్కడ
చూచినా
అరటితోటలు.
టెంకాయ
తోటలు.
యింక
ప్రకృతి
సౌందర్యమంతా
వుట్టిపడినట్లుగా
వుంటుంది.
కేరళ
దేశములో
అందమె
ఆనందం.
5
▾
Meaning
Keep
ఆనందమె
జీవిత
మకరందం
అన్నారు.
అనగా
యీ
అందమె
మానవుని
ఆకర్షిస్తుంది.
ఆనందమును
అందిస్తుంది.
ఏమిటి
యీ
ఆనందము
అనగా
భగవంతుడు
సృష్టించిన
ప్రకృతే
మనకు
పెద్ద
బ్యూటీ.
సుందరమైనది.
ఈ
కేరళ
దేశమునందు
అలాంటి
చక్రవర్తి
వుండటంచేత
కేరళ
ప్రజలు
ఆనాడు
సుభిక్షమైన
ఆనందమును
అనుభవించేవారు.
కేరళ
దేశములో
మూడు
అవతారములు
పుట్టినవి.
పరశురాముడు
కూడను
కేరళయందే.
తాత్కాలికముగా
ప్రజలకు
ఆనందమును
అందించి,
భక్తిప్రపత్తులను
అభివృద్ధి
గావించుకొనే
నిమిత్తమై
నారసింహుడుగా
పుట్టినది
కేరళలోనే.
వామనుడు
కూడను
అవతారమే.
ఒక్కచిన్న
రాష్ట్రమైన
కేరళయందే
మూడు
అవతారములుద్భవించాయి.
దైవత్వమనేది
ప్రతి
మానవుని
హృదయమందు
హత్తుకొని
పోవాలి.
కేవలం
రాజకీయములలో
దురాశలభివృద్ధియైపోయి
తమయందున్న
ఐకమత్యమును
అన్యోన్యతను
కృశింపజేసి
ఆధ్యాత్మిక
తత్వానికి
అనేక
ఆటంకములు
కల్గినట్లుగా
జరుగుతూ
వస్తోంది
నేడు.
అయినప్పటికిని
కేరళ
ప్రజలు
పట్టినపట్టు
పట్టి
సాధించటానికి
దీక్షను
బూని
నాటిమొదలు
నేటివరకు
కూడను
యీ
ఓణం
పండుగను
జరుపుకుంటూ
వస్తున్నారు.
ఇందులో
మరొక
సూక్ష్మార్థము
వుంది.
మూడడుగులు
అడిగేటప్పటికి
తీసుకోమని
చెప్పాడు.
ఒక
అడుగు
క్రింది
భాగమంతా
ఆక్రమించుకున్నాడు.
రెండవది
పై
భాగమంతా
ఆక్రమించుకుంది.
మూడవ
పాదమునకు
స్థానము
లేదు.
ఎందుకంటె
నేను
వున్నాను.
నేను
వున్న
స్థానము
నా
భాగముగానే
వుంటుంది
కాని
దీనిని
తీసుకోటానికి
వీలుకాదు.
కనుక
తను
వున్న
హద్దులో
స్థలమును
బలిచక్రవర్తి
యివ్వలేకపోతున్నాడు.
చక్కగా
యోచించి
అడిగినవాడు
భగవంతుడు,
యిచ్చేది
నేను
భగవంతునిలో
అడిగించుకోటము
నేను
యివ్వటము
ఎంత
అదృష్టము.అని
అనుకున్నాడు.
లేచి
తలవంచి
స్వామి!
మీ
మూడవ
అడుగు
యిక్కడ
నా
తల
మీద
పెట్టండి
అన్నాడు.
అనగా
యిందులోవున్న
అంతరార్థము
మానవునియందు
దైవత్వము
ఒకటి
వుంటుంది.
రెండవది
అహంకారము
వుంటుంది.
కనుక
అహంకారము
నిర్మూలము
చేసి
ఆత్మ
స్వరూపములో
చేర్చుకున్న
సువిషయమే
యీ
బలిచక్రవర్తి
మోక్షము.
నేను
యివ్వకపోతే
భగవంతుని
విశ్వసించినవాడనే
కాను.
నా
సర్వస్వము
భగవంతుడే.
అతడు
సత్యస్వరూపుడు
కనుక
సత్యమే
నాయొక్క
ఆధారము.
అదే
స్వామి
కూడ
చెప్పుతూ
వుంటారు.
సత్యమే
నా
ప్రచారము.
ధర్మమే
నా
ఆచరణ.
ప్రేమయే
నాయొక్క
స్వరూపము.
శాంతమే
నా
స్వభావము.
ఏతావాతా
భగవంతుడు
ఏది
చేసినా
ధర్మమే
కారణము.
తనలో
స్వార్థము
లేదు.
ఏది
చేసినా
భగవంతునిది
స్వార్థరహితమైన
పనే.
ఇలాంటి
భగవంతునియందు
యేవిధమైన
వాంఛలు
లేకుండా
చేయటంవల్ల
యిదియే
ప్రధానమైన
సత్యస్వరూపమన్నారు.
ఈ
సత్యమే
భగవత్
స్వరూపకముగా
భావించి
సత్యాచరణలో
ప్రవేశించమన్నారు.
ఇంతకాలము
నా
రాజ్యపరిపాలనలో
ప్రజలే
నాకు
ప్రధానమని
భావించాను.
మానవ
సేవయే
మాధవసేవగా
విశ్వసించాను.
ఇంతకాలము
నిన్ను
నేను
మరచాను.
6
▾
Meaning
Keep
His songs 30
నిను
నేమరచితి
స్వామి
-
నీ
పదములనే
నేమరచితినే
నిను
నేమరచితి
స్వామి.
పసితనమందున
తెలియక
కొంత
-
పెరిగిన
పిమ్మట
సంసార
చింత.
వృధా
అగునయ్యా
యీ
కాలమంతా
-
నీ
పదముల
చేరుట
నామనోచింత.
నా
చింత
అంతయు
నీ
పాదముల
దగ్గర
చేరుట.
బాల్యములో,
పెరిగిన
తరువాత
వ్యామోహములో
పడి
కొంతవరకు
భగవంతుని
మరచవచ్చు.
బలిచక్రవర్తిలో
యిలాంటి
సాత్విక
భావములు,
పవిత్రమైన
భావములు,
అనంతమైన
మంచిగుణములు
అతనిలో
కనుపిస్తూ
వచ్చాయి.
ఇక్కడెవరైనా
దానము,
ధర్మము
చేయటానికి
పూనుకున్నప్పుడు
ఎలాంటి
పరిస్థితులయందుగాని
మనము
అడ్డు
చెప్పరాదు.
కనుకనే
దానము
యివ్వటానికి
పూనుకున్న
బలిచక్రవర్తిని
శుక్రాచార్యులు
అడ్డుపెట్టటానికి
వచ్చాడు.
ఈ
దానమునకు
అడ్డు
చెప్పిన
కారణం
చేతనే
అతనికి
ఒక
కన్ను
పోయింది.
దానము,
ధర్మము
యిలాంటి
త్యాగములో
మానవుడు
అతి
అభివృద్ధి
కావాలి.
దాన
ధర్మము
లేక
తనువు
శాశ్వతము
కాదు.
మనము
త్యాగము
చేసుకోటానికే
యీ
దేహము
మనకు
అవతరించింది.
మనయందున్న
సమస్త
శక్తులు
కూడను
మనో
బుద్ధి
అహంకార
దివ్యత్వమైన
శక్తులన్నిటిని
మనము
భగవంతునికి
అర్పించాలి.
ఆ
త్యాగమే
మనకు
యోగముగా
రూపొందుతుంది.
త్యాగము
చేయని
మానవుడే
యీనాడు
కష్టములు,
దుఃఖములు,
విచారములు
అనే
రోగములలో
మునిగిపోతున్నాడు.
భగవంతుని
యొక్క
విశ్వాసము
ప్రతి
మానవునికి
అత్యవసరము.
ఆ
నమ్మకము
వుండినప్పుడే
మానవుడు
మాధవుడుగా
మారిపోతాడు.
భగవంతుడు
యేది
చేసినప్పటికి
అంతా
కూడను
లోకకళ్యాణమునకే.
ఆ
సత్యాన్ని
గుర్తించలేకపోతున్నారు
మానవులు.
ఏదో
తన
నిమిత్తమై
తాను
చేసుకుంటున్నాడని
భావిస్తున్నారు.
తనకు
ఎవ్వరూ
యివ్వనక్కరలేదు.
ఏ
కారణముచేత
నిన్ను
అడిగాడో
ఆ
కారణమును
నీవు
గుర్తించుకోలేదు.
కాని
అతనికి
వెళ్ళేముందు
ప్రజల
యొక్క
ప్రేమ,
అనుబంధము
చాలా
అడ్డుపెట్టాయి.
కేరళవారు
కూడా
కొంత
గమనించుకోకుండా
వుండవచ్చును.
ఈ
బలిచక్రవర్తి
తమ
రాజ్యాన్ని
అంతను
వామనమూర్తికి
యిచ్చే
సమయములో
అక్కడ
సిపాయిలు
అనగా
వారి
రక్షకభటులు
వామనమూర్తిని
చంపటానికి
ప్రయత్నించారు.
నా
రక్షకభటులకు
యిలాంటి
బుద్ధులా
రావటం
అని
బలిచక్రవర్తి
వారిని
మందలించారు.
సత్యమే
మానవుని
యొక్క
ప్రధానమైన
రూపము.
Truth
is
God.
ప్రేమయే
భగవంతుని
ఆకారము.
ఈ
ప్రేమ
కళలే
సర్వకళలయందు
లీనమైపోతాయి.
కనుకనే
Love
is
God.
Live
in
Love
అన్నారు.
ఈ
దానము,
ధర్మము
మానవుని
యొక్క
త్యాగమునకు
చిహ్నము.
నీవు
త్యాగము
చేసినంత
మాత్రమున
ఒరిగిపోయేది
యేమీ
లేదు.
నీవు
యెంత
త్యాగము
చేస్తావో
అన్ని
వేలరెట్లు
నీకు
అభివృద్ధి
లభిస్తుంది.
అయితే
యీ
అభివృద్ధి
కావాలనే
భావములో
మీరు
త్యాగము
చేయరాదు.
7
▾
Meaning
Keep
Also in his talks
(4)
15 September 1986
The inner meaning and greatness of the festival of Onam
21 August 2002
'I' Itself Is Divinity
14 April 2006
Fix your mind on Divinity; place your trust in Oneness
16 August 2006
The one who dwells in the body is the God of gods
ఒక
వడ్లగింజ
భూమిలో
నాటినప్పుడు
160
వడ్లగింజలు
పుడుతున్నాయి.
ఒక
విత్తనము
మనము
భూమిలో
పెట్టినప్పుడు
అది
మహావృక్షముగా
మారి
వందల
కాయలు
కాస్తాయి.
అదేవిధముగా
స్వార్థరహితముగా
యే
అల్పత్వమైన
పదార్థాన్ని
అర్పితము
చేసినప్పటికిని
అదియే
అనంతముగా
రూపొందుతుంది.
భగవంతునివి
నిగ్రహ
అనుగ్రహ
స్వరూపాలు.
ఆశ,
పేరాశలతో
అహంకార
ఆడంబరముల
నాచరించేది
మానవత్వము.
కనుక
యీనాడు
భక్తి
కూడను
ఒక
వ్యాపార
రంగముగా
రూపొందుతోంది.
భగవంతుడా!
నీకు
యిన్ని
టెంకాయలు
కొడతాను
నా
కోరిక
తీర్చమంటాడు.
ఓ
భగవంతుడా!
నాకు
లాటరీ
చీటి
పదిలక్షలు
వచ్చిందంటే
నీకు
పదివేలు
యిస్తాను
అంటాడు.
భగవంతునికి
యీ
పదివేల
రూపాయలు
తక్కువయ్యా
వీడిచ్చేది.
ఇందులోనే
వీని
అజ్ఞానం
ప్రకటితమవుతుంది.
పదిలక్షల
రూపాయలు
నాకు
భగవంతుడిస్తే
నేను
పదివేలు
యిస్తాను.
అందించేది
ఎవరు?
ఇట్టి
వ్యాపారం
చేత
మానవుడు
బంధింపబడుతున్నాడు.
భగవంతుని
నీవే
కావాలి
నీవు
తప్ప
అన్యులు
నాకు
అక్కరలేదు.
నీవు
ఒక్కడివే
వుండిన
జగత్తంతా
నా
వశమైపోతుంది.
భగవంతునికి
యిచ్చేది
యేమీలేదు.
బ్రహ్మాండమంతయు
ప్రబలుచుండెడి
తనకు
ఆలయంబు
నమర్చ
నలవియగునె
కోటిసూర్యుల
కాంతి
మేటిగల్గిన
తనకు
ప్రమిద
దీపము
నెవరు
పట్టగలరు.
సర్వజీవులయందు
సంచరించెడు
తనకు
సరైన
పేరిడ
సాధ్యమగునె
సర్వజలంబుల
సంచరించెడు
తనకు
స్నానంబు
చేయించ
సాధ్యమగునె
అజహరాదులకైనను
అందనట్టి
యిట్టి
తనరూపు
కనుగొన
నెవరితరము.
కనుక
ఎవ్వరూ
ఏమీ
యివ్వనక్కరలేదు.
ఇవ్వవలసినది
ఒక్కటే
ప్రేమ.
ఆ
ప్రేమ
కూడను
నీది
కాదు.
భగవంతుని
వరప్రసాదముగా
అందుకున్న
వస్తువు.
తనది
తనకు
అర్పితము
చేయటానికే
యింత
స్వార్థమైపోతే
యిది
మహత్తరమైన
వ్యక్తిత్వానికి
లోటు.
కనుక
వామనమూర్తి
యొక్క
తత్వమునందు,
బలిచక్రవర్తి
గుణములందు
వున్న
కొన్ని
చక్కని
విషయాలను
మనం
గుర్తించాలి.
ఈ
శుక్రాచార్యుడు
చెప్పినప్పుడు
చెప్పాడు.
స్వామి!
హరుడుగాని
హరిగాని
లేక
నరుడు
కాని
యీ
మాటను
నేను
తప్పను.
నా
జీవితము
అర్పితమై
పోతుంది.
ఇంక
అతనికి
యిచ్చే
తీరాలి
అన్నాడు.
కనుక
భగవంతునికి
అర్పితము
చేసే
విషయములో
మాత్రము
మీరేమాత్రము
వెనుకంజ
వేయరాదు.
అది
కేవలం
నీకు
నీవు
అర్పితము
చేసుకున్నవాడివే
అవుతావు
కాని
భగవంతునికి
అర్పితముగాదు.
అని
సత్యమును
కూడను
తాను
ప్రకటితము
గావిస్తూ
వచ్చాడు.
8
▾
Meaning
Keep
ఆడిన
మాట
తప్పకూడదని.
ఈనాటి
పరిస్థితులందు
విశ్వాసము
చూస్తామా
అంటే
బాలన్స్
లేకుండా
పోతున్నది.
అన్నింటికి
doubts,
doubts.
సందేహములు,
సందేహములు.
ఈ
సందేహముల
పుట్టలో
పుట్టినవాడు
కేవలము
చీమస్వరూపుడే
అయిపోతాడు.
ఇది
అల్పత్వముగా
రూపొందుతుంది.
సంకుచిత
భావముగా
తెలుస్తుంది.
విశాలమైన
హృదయాన్ని
అభివృద్ధి
పరచుకోవాలి.
కనుక
ప్రజలనాదరించే
దానిలో
మహాధర్మస్వరూపుడు
బలిచక్రవర్తి.
సత్యము,
ధర్మము
యీ
రెండు
కూడను
ఒకదానినొకటి
పెనవేసుకున్న
ధర్మములు.
ప్రేమస్వరూపులారా!
ఈనాడు
ఓణం
ఒక
పవిత్రమైన
దినముగా
మనము
భావించి
పండుగగా
అనుభవిస్తున్నాము.
అయితే
బలిచక్రవర్తి
గుణములను,
అతని
ఆదర్శములను
మనము
ఆచరణలో
పెట్టి
భగవంతుని
పూజిస్తే
మరింత
ఉత్తమమైన
స్థితి
చిక్కుతుంది.
దైవస్వరూపమైన
మానవత్వానికి
సేవ
చేయక
యీ
దివ్యత్వము
యేరీతిగా
చిక్కుతుంది.
కనుక
దైవము
యొక్క
ఆజ్ఞను,
దైవము
యొక్క
శాసనమును
తుచ
మీరు
పాటించాలి.
దీనినే
ఉత్తిష్టత,
జాగ్రత
అన్నారు.
చీకటి
అనే
అజ్ఞానములో
నీవు
నిద్రిస్తున్నావు.
లెమ్ము
నా
ఆజ్ఞ
పాలింపుము.
ఎక్కడ
త్యాగమున్నదో
అక్కడే
దైవం
వానికి
అనుగ్రహిస్తాడు.
ఈనాడు
త్యాగమనేది
పేరుకు
కూడను
వహించరు.
త్యాగము
యీనాడు
సన్నగిల్లిపోయింది.
స్వార్థము
బాగా
పెరిగిపోయింది.
ఈ
స్వార్థము
వుండినంతవరకు
దైవత్వము
మనకు
కనుపించదు.
భగవంతునిది
స్వార్థరహితమైన
ప్రేమ.
ఇది
అంతా
ప్రకృతి.
ఈ
ప్రకృతి
అంతా
కూడను
పరమాత్ముని
యొక్క
ప్రతిబింబమే.
ఈ
ప్రకృతి
శాసకుడు
భగవంతుడే.
ఈ
భూమికి
మహత్తరమైన
శక్తి
వుంది.
ఎవరైనాసరే
కోటీశ్వరుడు
కాదు,
కూటిపేద
కాదు
కాలుజారితే
దెబ్బ
తగలక
తప్పదు.
ఇది
ప్రకృతి
యొక్క
తత్వము.
ఈ
దేహములు
కూడను
ప్రకృతి
యొక్క
స్వరూపములే.
కనుక
జారిపడినప్పుడు
దేహమునకు
దెబ్బలు
తగులుతుంటాయి.
అంతమాత్రముచేత
మనము
దీనికి
విచారించరాదు.
ఇది
ప్రకృతి
యొక్క
తత్వము.
అందులోనే
వుంటుంది
భగవంతుని
తత్వము.
భగవంతుడు
నిగ్రహించగలడు.
భక్తుడు
నిగ్రహించలేడు.
మీకు
తెలుసును.
స్వామి
యీనాలుగు
దినములనుండి
క్రిందకు
రాలేదని
అనేకమంది
అనేక
భావాలతో
అనేక
అభిప్రాయములను
మనసునందుంచుకొని
బాధపడుతున్నారు.
నిజముగా
విచారిస్తే
స్వామి
యొక్క
నిగ్రహశక్తి
ఎలాంటిది
అనేది
మీకు
అర్థమవుతుంది.
బాత్రూమ్లో
సోప్
కాలిక్రింద
పడింది.
నాయొక్క
స్వభావమేమంటే
రాత్రి
అందరికి
నమస్కారము
యిచ్చి
పంపిన
తరువాత
నా
డోర్
నేనే
వేసుకొని
బోల్టు
వేసుకుంటాను.
మరి
తెల్లవారి
నా
కాలకృత్యములన్నీ
తీర్చుకొని
స్నానము
చేశాక
నేనే
వచ్చి
తలుపులు
తీస్తాను.
అలాంటి
పరిస్థితిలో
ఏదో
జారిపడిపోయాను.
ఇది
ప్రకృతి
యొక్క
నియమము.
క్రిందపడితే
దానియొక్క
స్వభావము
స్వభావమే.
అగ్ని
వేడిగా
వుంటుంది
అంటే
యిది
విచిత్రము
కాదె.
వేడితనము
అగ్నికి
సహజము.
ఐస్
చల్లగా
వుంటుంది
అంటే
చల్లదనము
దాని
స్వభావము.
నేను
పడినా,
మీరు
పడినా
ఎవరు
పడినా
కూడను
యీదెబ్బ
తగలక
తప్పదు.
9
▾
Meaning
Keep
దీని
ఎలా
యీ
శాసనమంటే.
ఒక
IG
Police
వుంటాడు.
ట్రాఫిక్
బోర్డులో
అనేక
నియమాలు
నియమిస్తారు.
ఈ
పోలీసువారే
యీ
చట్టాన్ని
నియమించారు.
ఒక
circle
దగ్గర
Keep
left
అని
వ్రాసి
వుంటారు.
ఈ
శాసనమును
ఎవరిచ్చారో
ఆ
అధికారి
కూడను
Keep
leftలోనే
పోవాలి.
కాని
rightలో
పోకూడదు.
అదేవిధముగా
భగవంతుడు
ప్రకృతికి
అందించిన
చట్టములో
తాను
కూడా
దానిని
అనుసరించే
తీరాలి.
అది
ఆచరించే
సమయములో
యిలాంటి
కొన్ని
యిబ్బందులు
కలుగుతూ
వుంటాయి.
స్వామి
నిగ్రహమంటే
యేమిటి
మీకు
తెలుసును.
దేహమునంతా
కూడను
నిలబెట్టి
నిలబడగలిగే
శక్తినిచ్చేది
యీ
జాయింట్.
దీనిని
హిప్
అంటారు.
నేను
బాత్రూమ్లో
పడిన
తక్షణమే
ఎవరు
లోపలకు
రావటానికి
లేదు
బోల్టు
వేసుకున్నాను
నేను.
నన్ను
నేను
నిగ్రహించుకొని
లేచాను.
లేచి
బోల్టు
తెరిచాను.
మీరు
ఆనందించవలసిన
విషయములేగాని
స్వామి
నిగ్రహమునకు
బాధపడరాదు.
కాలు
జారి
క్రింద
పడిన
తక్షణమే
తల
పడిపోయింది.
Straightగా
నిల్చున్నవాడిని
నిల్చుకున్నట్లుగా
పడిపోయాను.
అలాంటి
పరిస్థితిలో
రాధాకృష్ణ
చూసి
(నావెంట
వుండే
విద్యార్థి)
డాక్టర్సు
వచ్చారు.
నాకు
తెలుసు.
మీరేమీ
చూడనక్కరలేదు.
నేను
అనుభవించే
తీరాలి.
నేను
తప్పక
నిగ్రహించుకోవాలి.
ఇది
ఒక
ఆదర్శము
My
life
is
My
message.
డాక్టర్లు
X-ray
తీయాలన్నారు.
డా
॥
చారి,
డా
॥
కృష్ణమూర్తి
యిద్దరు
కూడను
ప్రార్థించి
స్వామి
యేదైనా
ఒక
చిన్న
కెమేరా
ఒకటి
తెప్పించి
యిక్కడైనా
చూడవలసిందే
తప్ప
మేము
వదలము
అని
ప్రార్థించారు.
వారి
బాధను
చూసి
సరే
యిష్టం
చేసుకోండి
అన్నాను.
వెంటనే
బెంగుళూరు
లైటినింగ్
కాల్
బుక్
చేసే
సరికి
ఒక్క
నిముషములో
వచ్చింది.
వెంటనే
Xray
plant
తీసుకొని
వచ్చారు.
తీసేటప్పటికి
యిది
విరిగిపోయింది.
ఆ
విరిగిపోయిన
ఎముక
దగ్గర
ఎవ్వరైనా
టచ్
చేయటానికిగాని,
కదలించటానికిగాని
వీలుకాదు.
అనుభవించినవానికి
మాత్రమే
తెలుసు.
డాక్టర్సుకు
మాత్రమే
తెలుసు.
దీనికి
మా
డాక్టర్సు
చెప్పారు
4
వారములు
bed
restలో
వుండాలి.
నాకు
rest
అంటే
యేమిటో
తెలీదు.
నాకు
rest
కావలసిన
అవసరము
లేదు.
నా
పనులు
నేను
చేసుకుంటానన్నాను.
కాని
వారు
భక్తులు
యింకా
అందరూ
వున్నారు.
గోపాలరావు
వచ్చాడు.
నరసింహన్
వచ్చాడు.
వీరందరు
చూసి
స్వామి!
తప్పక
rest
తీసుకోవాలన్నారు.
కేరళనుండి
యిన్నివేలమంది
భక్తులు
భక్తిప్రపత్తులతో
ప్రశాంతి
నిలయము
చేరితే
నేను
లోపల
కూర్చోటం
యిది
నా
ధర్మం
కాదు.
అందరిని
సంతోషపెట్టే
నిమిత్తమై
నేను
తప్పక
వారిని
చూస్తాను
అన్నాను.
అయితే
యీ
నొప్పి
అనేది
మీరు
విచారిస్తే
మానవమాత్రుడు
సహించలేడు.
చాలామంది
నాకు
letter
వ్రాసారు.
స్వామి!
తమకు
సంభవించిన
యీ
వ్యాధిని
త్వరగా
నివారణ
చేసుకోవాలి
అన్నారు.
నాకు
ఎట్టిరోగము
లేదు.
రాదు.
ఏదో
యీ
విధముగా
అజాగ్రత్తవల్ల
జరిగిందే
తప్ప
నాకు
ఎప్పుడూ
వ్యాధులనేవి
లేవు.
స్వామికి
జబ్బు
చేసింది
జబ్బు
చేసింది
అంటే
జబ్బు
చేయటం
యేమిటి?
నాకు
జబ్బేలేదు.
నా
పనులు
నేను
యిప్పుడు
కూడా
చేసుకుంటూనే
వున్నాను.
సోఫామీద
కూర్చోటము
తెల్లవారి
వచ్చిన
మూడు,
నాలుగు
వేల
జాబులన్ని
చదవటము
అదే
నా
rest.
నేను
కూర్చునేది,
పండుకునేది
భోజనము
చేసేది
అన్నీ
ఒక్క
సోఫాలోనే
యిప్పుడు.
10
▾
Meaning
Keep
కాలు
క్రిందమోపటానికి
వీలుకాదు.
ఇంత
కఠినమైన
బాధను
నవ్వుతూ
నవ్వుతూ
నేను
నిగ్రహిస్తున్నానంటే
యిదే
సరైన
ఆదర్శము.
ఇంకా
కొంతమంది
ఆలోచిస్తున్నారు.
స్వామి
భూత
భవిష్యద్వర్తమానములను
గుర్తించినవాడు
కదా
యీ
భవిష్యత్తులో
యేమి
జరుగుతుంది
స్వామికి
తెలియదా
అని
కొంతమంది
ప్రశ్నించుకుంటున్నారు.
భవిష్యత్తు
కాని,
గడచిపోయిన
కాలముగాని
నేనేమాత్రము
విచారించను.
కనుకనే
భక్తులకు
కూడను
నేను
బోధిస్తూ
వుంటాను
Past
is
past
forget
the
past.
దానిని
ఆలోచించటము
మానివేయి.
Future
is
not
sure.
Do
not
think
of
the
future.
ఈ
futureని
గురించి
యోచించకూడదు.
గతమును
యోచించకు.
వర్తమానాన్ని
పెట్టుకొని
నీవు
బ్రతుకు.
అదేవిధముగనే
నేను
భవిష్యత్తును
యెప్పుడూ
యోచించలేదు.
ఒక
చిన్న
ఉదాహరణము.
రామావతారములో
రేపటి
దినము
సూర్యోదయములోపల
రాముని
పట్టాభిషేకము
జరుగుతుందని
వ్యాప్తిగావించింది.
ఆ
తెల్లవారి
పట్టాభిషేకము
చేయించుకోవలసిన
సమయములోపల
సర్వసంగ
పరిత్యాగియై
అడవులకు
వెళ్ళాడు.
ఇక్కడ
ఒక
చక్కని
ఆదర్శమును
మీరు
గుర్తించాలి.
అట్టి
సమత్వాన్ని
ఒక్క
దైవము
తప్ప
యితరులు
పాటించలేరు.
అనుసరించలేరు.
దైవము
యేమైనా
చేయగలడు.
ఈ
నిగ్రహమువలన
యెంత
బాధ
వుండినప్పటికి
దానిపైన
మనసు
పెట్టలేదు.
దానిపైనే
మనస్సంతా
వుంటే
యింకా
ప్రమాదమై
పోతుంది.
ఇంకా
బాధ
ఎక్కువౌతుంది.
మనస్సును
మరల్చటమే
యీ
బాధకు
సరైన
మందు.
కదలినప్పుడు
పెద్ద
shock
కొట్టినట్లుగా
కొట్టుతుంది.
భక్తులు
వ్రాసిన
letters
తీసుకొని
చదువుతూ
వుంటాను.
దీనిని
స్వామి
ఒక్క
క్షణములో
బాగుచేసుకోవచ్చు
కదా
అని
భక్తులు
ఆశిస్తూ
వుంటారు.
నేనంత
స్వార్థపరుడను
గాను.
ఇతరులకు
దెబ్బతగిలితే
నేను
తక్షణమే
వారికి
నివారణ
చేస్తున్నానా?
దీనికి
కొంతకాలమని
వుంటుంది.
కాలము
తీరేవరకు
దానిని
అనుభవించవలసినదే.
అయితే
ప్రార్థనల
చేత
ఆ
బాధను
నిగ్రహించుకోవచ్చు.
ఈ
ప్రాకృతము
లోపల
యేమి
జరిగినప్పటికిని
mindను
మరల్చుకోటానికి
ప్రయత్నించాలి.
మనస్సును
దుఃఖముపైనా,
విచారముపైనా
యేమాత్రము
మరల్చని
వ్యక్తిత్వాన్ని
మనము
పెంచుకోవాలి.
వీటిపైన
మన
మనస్సు
యేమాత్రము
ప్రసరింప
చేయకూడదు.
ఆత్మచింత
సుఖం.
దేహ
చింత
దుఃఖము.
అందువలన
దేహ
నిమిత్తమై
మనము
worry
కారాదు.
నిమిష
నిమిషమునకు
నీచులూరునెగాని
పునుగు
జవ్వాజులు
పుట్టబోవు.
దేహబాధలు
వస్తూ
వుంటాయి
పోతూ
వుంటాయి.
నా
బాధను
నేను
వెంటనే
నయము
చేసుకుంటే
సాయిబాబా
ఎంత
స్వార్థపరుడు
తన
బాధకాబట్టి
నివారణ
చేసుకున్నాడు.
ఇతరుల
బాధను
నివారణ
చెయ్యటం
లేదు
అంటారు.
మీ
దేహబాధగాని
మరి
యే
దేహబాధగాని
దానికి
ఉపశాంతి
చేసి,
నిగ్రహము
నేర్పి,
బలము
నందించవచ్చునే
గాని
దానిని
నివారణ
చేయకూడదు.
ఎంతకాలము
వుండాలో
అంతకాలము
వుంటుంది.
తరువాత
అది
నయమైపోతుంది.
ఈ
నాలుగు
దినములనుండి
కూడా
యీ
మనస్సే
దానిపైన
లేదు.
11
▾
Meaning
Keep
నేను
ఏ
కార్యక్రమములు
పెట్టలేదు.
కాని
అనేకమంది
భక్తులు
కోరటం
చేతనే
నేను
బయటకు
రాకుండా
వుంటున్నాను.
ఒక్కొక్క
సమయములోపల
నేను
మరొకరి
బాధను
తీసుకుంటాను.
నేను
నా
ఆనందము
కోసము
యీ
troubles
తీసుకొంటున్నానుగాని
యిందులో
force
లేదు.
కాని
అన్నింటియందు
మానసిక
control
అత్యవసరమనే
విషయాన్ని
ప్రతి
ఒక్కరూ
గుర్తించాలి.
మనం
యేవ
మనుష్యాణాం
కారణం
బంధమోక్షయోః
అన్నారు.
బలిచక్రవర్తి
ఆశయాలను
ఆచరించి
అనుభవించవలసిందేగాని
ఏదో
పాయసము,
పరమాన్నాలు
చేసుకోటమని
కాదు.
అతను
ఆచరించినది
సత్యము.
అతను
చేసినది
సత్యము.
అతను
చేసినది
త్యాగము.
ఈ
త్యాగము,
సత్యము
మనము
మన
జీవితములో
సమన్వయము
చేసుకొని,
వీటిని
మనము
ఆచరణలో
పెట్టాలి.
ప్రజలను
విడిచిపెట్టేముందు
ప్రతి
సంవత్సరము
శ్రావణమాసము
శ్రవణ
నక్షత్రము
తిథి
కూడా
చేరినప్పుడు
వస్తాను
అన్నాడు.
దాని
జ్ఞాపకార్థమై
కేరళ
ప్రజలంతా
కూడా
అతన్ని
ఆరాధించటము
అతనిని
ప్రసన్నుని
గావించుటకు
చేసుకొనే
చర్యకే
ఓణమని
పేరు.
ప్రేమస్వరూపులారా!
ఏ
విధమైన
బాధలు
వచ్చినప్పటికి
మీరు
లెక్కచేయకుండా
మనసును
మార్చుకోటానికి
ప్రయత్నించండి.
అదే
My
life
is
My
message.
అది
చూపే
నిమిత్తమై
యిన్ని
విధములైన
నిగ్రహములను
ప్రదర్శిస్తున్నాను.
శరీరము,
మనస్సు,
ఆత్మ
యీ
మూడింటి
సమ్మిళితమైన
స్వరూపమే
మానవత్వమని
గుర్తించండి.
దేహము
లేకపోతే
మనస్సు,
ఆత్మ
కూడా
గోచరము
కావు.
మనస్సు
లేకపోతే
శరీరము,
ఆత్మ
మనకు
యేమాత్రము
అర్థము
కావు.
ఆత్మ
లేకుండా
వుండటానికి
వీలులేదు.
అదే
అన్నింటికిని
మూలాధారమైనది.
కనుక
యీ
మూడింటిని
మనము
చక్కగా
సమన్వయము
చేసుకొని
సత్యమైన
జీవితములో
మనము
ప్రవేశించాలి.
మనము
కాలమును
వ్యర్థము
చేయరాదు.
చాలామంది
పిల్లలు
హాస్టలునందు,
ప్రైమరీ
స్కూలునందు
స్వామికోసమై
ప్రార్థనలు
చేస్తూ
వచ్చారు.
స్వామి
బాగుకావాలంటే
ఏ
దేవతలను
ప్రార్థించాలి.
ఈ
సందిగ్ధావస్థలో
భక్తులు
అన్ని
దేవతలను
ప్రార్థిస్తున్నారు.
విద్యార్థులారా!
ప్రజలారా!
ఇది
కేవలము
ప్రార్థనల
చేత
సరిపోయేది
కాదు.
మీరు
యేనాడు
స్వామి
యొక్క
తత్వాన్ని,
సత్యాన్ని
గుర్తించుకుంటారో
ఆనాడే
మీకు
యీ
విధమైన
బాధలు
సోకవు.
స్వామి
సర్వదేవతా
స్వరూపులు
కదా
అని
మా
హాస్టలులో
MBA
పిల్లలు
గాయత్రి
మంత్రము
చేస్తూ
వచ్చారు.
ఈ
సమయములో
వీరి
మనస్సులు
వీరి
బుద్ధులు
యే
విధముగా
చలిస్తాయో,
యే
విధముగా
భ్రమిస్తాయో
చూడాలి.
ఇలాంటి
భావాలు
మీకు
అప్పుడప్పుడు
రావటము
దానికి
తగిన
నివారణ
చేసుకోటము.
ఈ
విధముగా
ప్రశాంతమైన
జీవితాన్ని
గడపాలి.
స్వామి
దయాప్రేమలు
మీపై
నిండుగా
దండిగా
వుంటున్నాయి.
లేకపోతే
నన్ను
తక్షణమే
బెంగుళూరు
తీసుకుపోవాలని
ప్రయత్నించారు.
నేను
చెప్పాను
కొన్నివేలమంది
పరమభక్తులైన
కేరళా
భక్తులు
వస్తుంటే
నేను
తప్పించుకొని
వెళ్ళటం
సాధ్యము
కాదు
నేను
వెళ్ళను
అని
చెప్పాను.
12
▾
Meaning
Keep
భక్తుల
ఆనందమే
నా
ఆనందము.
నాకు
ప్రత్యేకమైన
ఆనందము
లేదు.
నేను
కోరను.
ఈ
దేహమును
ఎందుకు
లక్ష్యము
చెయ్యాలి.
మరొకటి
మీరు
గుర్తించాలి.
ఈ
దేహము
నాది
కాదు.
ఇది
మీది.
కనుక
నేను
దీనిలో
యేమాత్రము
ప్రవేశించకూడదు.
మీ
దేహములు
నావి.
కష్టములో,
బాధలో,
దుఃఖములో
దేహములో
ప్రవేశించినప్పుడు
ఆ
దేహము
నాది
నాది
అన్న
భావమున్నప్పుడే
అనేక
విధమైన
బాధలు
కలుగుతాయి.
భక్తుని
హృదయములో
ప్రతిష్ఠింపబడి
వున్నవాడు
భగవంతుడు.
కనుక
భక్తులైనవారు
యిలాంటివి
నేడు
కాదు
రేపు
కాదు,
ఎన్నటికి
స్వామిని
బాధపెడతాయన్న
అనుమానానికి
చోటుయివ్వకండి.
ఏవీ
నన్ను
యేనాడు
బాధించవు.
అయితే
దేహరీతిగా
ప్రాకృతమైన
దానిలో
వస్తుంటాయి,
పోతుంటాయి.
అవి
passing
clouds.
కనుక
దైవత్వాన్ని
చక్కగా
అర్థము
చేసుకొంటె
అయ్యో
యీ
బాధలే
యీ
విధముగా
కష్టపడుతున్నారే
యీ
medicine
తీసుకోవాలే
స్వామి
అన్న
భావాలే
రావాలి.
అయితే
భక్తి
వుండటము
చేత,
స్వామిపైన
అమితమైన
ప్రేమ
వుండటం
చేత
వారు
యెంతో
వాత్సల్యముతో
ప్రేమతో
మీరు
rest
తీసుకోండి
స్వామి
rest
తీసుకోండి
అని
చెప్పుతూ
వుంటారు.
నాకు
రెస్టువద్దు.
నేను
ఎప్పుడూ
అరెస్టు.
అరెస్టు
అనగా
రెస్టు
లేకుండా
వుండటమే.
అది
నా
message
అది
నేను
ఆచరిస్తున్నాను.
ఇప్పటికి
కూడా
నేను
rest
తీసుకోటం
లేదు.
మీకు
తెలియకపోవచ్చును.
కదలకూడదని
చెప్పుతే
నేను
ఐదు
గంటలకే
లేచి
పళ్ళు
తోముకోటము,
కాలకృత్యములు
తీర్చుకోటము,
స్నానము
చేయటము
అన్నీ
జరిగిపోతూనే
వున్నాయి.
అందరూ
కూడా
ఆనందములో
మీమీ
బాధలు
మరచి
సాధ్యమైనంతవరకు
వుల్లాసంగా
కాలము
గడపండి.
స్వామికి
యేమాత్రము
బాధలు
లేవు.
శారీరకముగా
యిలాంటివి
వస్తుంటాయి
పోతుంటాయి.
తల
క్రింద
పడటం
చేత
తల
పగిలిపోవాలి.
మీకు
యదార్థాన్ని
చెబుతున్నాను.
ఆ
మొజాయిక్
ఫ్లోర్పైన
టప్
అని
పడిపోయింది.
పెద్ద
శబ్దము
వచ్చింది.
డాక్టరు
కృష్ణమూర్తి
చెప్పాడు
స్వామి
ఫోటో
తియ్యాలి
తల
వాచింది
సరైన
పరిస్థితిలో
లేదు
అని
అడుక్కున్నాడు.
నా
తల
వాచిందని
యెవ్వరికి
తెలియదు.
నాకు
అక్కరలేదని
చెప్పాను.
భక్తులకు
ఏమాత్రము
సంతోషమియ్యలేకపోయానే
అన్నదే
నా
బాధ.
కనుక
అన్నింటిని
నిగ్రహించే
శక్తి
స్వామిలో
వున్నప్పుడు
యిది
బాధ
అని
మీరు
యెట్లు
తలుస్తున్నారు.
స్వామి
బాధపడుతున్నాడే
అని
దేహరీతిగా
భావిస్తున్నారేగాని
ఆత్మవరకు
ప్రయాణము
కావటం
లేదు.
స్వామికి
యేదీ
జరగదు,
ఏదీ
అవదు
అన్న
ధైర్యముతో
వుండాలి.
ఈ
ప్రతి
ఒక్కటి
కూడా
భక్తులకు
అందించే
ఆదర్శాలే.
కష్టము
వచ్చినప్పుడు
మీరు
యేడ్వనవసరము
లేదు.
సుఖము
దుఃఖము
ఎక్కడనుండి
పుట్టిందో
దాన్ని
లక్ష్యములో
పెట్టుకోవాలి.
సుఖముగాని
దుఃఖముగాని
మనను
ఆనందపెట్టేవి
కాదు.
కాని
మానవులు
సుఖాన్ని
ఆనందాన్ని
స్వాగతం
చేస్తారు.
కాని
దుఃఖాన్ని
బాధలను
send
off
చేస్తారు.
13
▾
Meaning
Keep
ఐతే
స్వామిలో
వున్న
తత్వము
సమతత్వమని
మీరు
తెలుసుకోవాలి.
ఈ
రెండు
పెట్టినటువంటి
స్థానమే
హృదయము.
హృదయాన్ని
కంట్రోల్
చేసుకుంటే
యీ
బాధలు
మనలను
యేమాత్రము
బాధించవు.
కనుక
నిరంతరము
మీరు
నామ
సంకీర్తన
చేయండి.
స్వామికి
బాధ
కలిగిందే
అని
జపములు,
ధ్యానములు
చేస్తే
ప్రయోజనము
లేదు.
ఇది
artificialగా
వుంటుంది.
స్వామికి
బాధలు
యేనాటికి
వుండవు.
నేను
నటన
చేస్తున్నాను
అన్న
సత్యాన్ని
మీరు
గుర్తించాలి.
ఈనాడు
వరలక్ష్మి
వ్రతము
కూడ
శ్రావణ
శుక్రవారము.
చాలా
పవిత్రమైనవి
చేరినవి.
దేహానికి
యిటువంటివి
వస్తూ
వుంటాయి
పోతూ
వుంటాయి.
మీరు
వీటిని
లెక్క
చేయకూడదు.
నేను
అసలే
లెక్కచేయను.
మరొక
చిన్న
ఉదాహరణ.
ఇంతసేపు
యిక్కడ
నిల్చుని
వుండటమే
పెద్ద
miracle.
కాళ్ళు
లాగుతున్నాయి.
కావలసినంత
బాధ
వున్నది.
కాని
నేను
మీతో
సంభాషిస్తూ
వుండటము
వలన
నాకు
బాధ
యేమీ
తెలియటము
లేదు.
కనుక
మీరు
కూడా
కష్టములందు
బాధలందు,
దుఃఖములందు
మనస్సును
మరొకవైపుకు
మరల్చటానికి
కృషి
చెయ్యాలి.
అది
మీకు
నేర్పించే
నిమిత్తమై
నేను
యీనాడు
మీతో
మాట్లాడుతున్నాను.
నిరంతరము,
సర్వదా,
సర్వకాలములందు
భగవంతుని
నామ
సంకీర్తన
చేయండి.
అందరూ
కలసిమెలసి
జీవించండి.
నామము
అమృతముకంటె
అతిరుచ్యమైనది.
ఆ
మధురమైన
నామాన్ని
నాలుకపైన
నాట్యమాడించండి.
స్వామికి
ఏ
బాధలు
లేవు.
మీరు
యేమాత్రము
విచారించనక్కరలేదు.
కేరళ
ప్రజలు
ఏమాత్రము
బాధపడకూడదు.
మూడు
దినములు
స్వామి
దర్శనము
దొరకలేదని
బాధపడింది.
మాలో
ఏదో
లోపము
వున్నది.
ఇది
మా
మంచికోసమే
జరిగింది
అన్న
వుత్తమ
భావాలను
పెంచుకోండి.
లోకసేవ
చేయండి.
Previous
←
Only when the individual is virtuous does society take shape as a virtuous society
Next
The body itself is a temple!
→