Contents
Devotion & Sacred Story
Home
Library
Find
Shelf
Settings
←
Leave
Sathya Sai Speaks 1989 · Rāma, Dharma embodied
Tap a verse for its meaning
IAST
Telugu
Meaning
Continuous
Rāma, Dharma embodied
14 April 1989, Śrī Rāma Navamī and the New Year, Kodaikanal
1
▾
Meaning
Keep
ప్రేమస్వరూపులారా!
శ్రీరామ
చరిత్రము
వినని
భారతీయుడు
కాని,
రామమందిరము
లేని
గ్రామముగాని
కానరాదు.
అనాది
కాలము
నుండి
భారతదేశములో
రామతత్త్వము
ఆదర్శవంతమైన
జీవిత
తత్త్వముగా
విశ్వసించి
ప్రతివ్యక్తి
క్షణక్షణము
తన
జీవితమును
పవిత్రము
గావించుకొనుచు
వస్తున్నాడు.
ఆధ్యాత్మిక
చిత్తము
లేని
భారతీయుని
కేవలము
ఒక
నిరర్థకమైన
జీవిగా
భారతదేశము
విశ్వసిస్తూ
వస్తోంది.
మధు,
మాధవ
అనేటువంటి
రెండు
నెలల
మార్పులే
వసంత
ఋతువు.
వసంత
ఋతువు
అనగా
సూర్యుడు
మేష
వృషభరాసులందు
ప్రవేశించటము.
ఈ
రాశులే
శుక్రరాశి
అని
కూడా
చెప్పుతారు.
ఈ
శుక్రరాశి
యందు
కేవలము
నీలవర్ణముతో
కూడినటువంటి
తెలుపుగా
వుండిన
జీవితమును
ప్రబోధిస్తుంది.
ఈ
నీలవర్ణముతో
కూడినటువంటి
భగవతత్త్వం
లోకము
యొక్క
విశాలతత్త్వం,
ఆరోగ్యం,
ఆనందం
సూచించు
మూల
చిహ్నముగా
ప్రబోధిస్తూ
వస్తుంది.
శుక్రుడు
మీనములో
ప్రవేశించినప్పుడు
శ్రీ
రామచంద్రుడు
జననమొందుట
సంభవించినది.
లోకమున
శాంతి
భద్రతలు
అందించే
నిమిత్తమై
మానవత్వమున
నున్న
దివ్యతత్త్వమును
ఆవిర్భవించే
నిమిత్తమై
రామతత్త్వము
ఆవిర్భవించినది.
ఈ
రామతత్త్వమునందు
ఈ
వసంత
ఋతువు
చాలా
ప్రధానమైనది.
పండిన
ఆకులు
రాలి
లేత
చిగురు
మహా
కళకళలాడే
చిగురు
ప్రపంచానికి
ఆనందాన్ని
అందించే
చిగురు
యీ
వృక్షములలో
అభివృద్ధి
అవుతాయి.
సూర్యబింబము
యీ
దళములపై
బడినప్పుడు
యిది
కేవలము
సువర్ణమైన
జగత్తుగా
రూపొందుతుంది.
అంతేకాక
ప్రపంచమునే
ఒక
సౌందర్యముగా
నిరూపిస్తుంది
ఈ
వసంత
ఋతువు.
‘రామో
విగ్రహవాన్
ధర్మః’
ధర్మమే
రామ
స్వరూపమును
ధరించి
ఈ
జగత్తులో
ఆవిర్భవించినది.
ధర్మము
వేరు,
రాముడు
వేరు
కాదు.
రాముడు-
ధర్మం
అవినాభావ
సంబంధములు.
అన్యోన్యాశ్రయములు
అయివున్నవి.
రామ
చరిత్రము
రెండు
విధములుగా
వుంటున్నది.
ఒకటి
పూర్వభాగము.
రెండవది
ఉత్తర
భాగము.
పూర్వభాగములో
బలవంతుడైన
వాలిని,
శక్తివంతుడైన
రావణుని
మహావీరుడైన
పరశురాముని
మున్నగు
వీరులను,
ధీరులను
జయించినటువంటి
శూరుడు
శ్రీరాముడు.
కేవలము
భుజ
బలమందే
గాక
బుద్ధిబలముతో
బాటు
గుణబలమును
కూడా
యీ
మహావీరుడు
సాధించినాడు.
రాముని
యొక్క
గుణసంపత్తును
యీ
విధముగను
వర్ణించుటకు
వల్లకాదు.
భగవదాకారమునకు
ఆరు
విధములైన
శక్తులు
వుంటున్నాయి.
ఒకటి
సమగ్రమైన
ఐశ్వర్యము,
రెండవది
ధర్మము.
2
▾
Meaning
Keep
మూడవది
కీర్తి,
నాల్గవది
సంపద.
ఐదవది
జ్ఞానము,
ఆరవది
వైరాగ్యము.
ఈ
ఆరు
గుణములతో
కూడినటువంటి
షడైశ్వర్య
సంపన్నుడు
భగవంతుడు.
ఈ
ఆరు
గుణములను
ఒకదాని
వెంటనొకటి
అనుసరించి
సమత్వమైన
స్వరూపమును
ధరించినవాడు
శ్రీరామచంద్రమూర్తి.
ఏ
యుగమునందుగాని,
ఏ
జగమునందుగాని
ఈ
అవతారములు
ఈ
షడైశ్వర్యముల
స్వరూపములను
ధరించియే
భగవంతుడు
అవతరిస్తూ
వుంటాడు.
మానవజన్మ
చాలా
పవిత్రమైనటువంటిది.
విశిష్టమైనటువంటిది.
విలువైనటువంటిది.
జీవించతగినటువంటిది.
దేహనిర్మాణమునందే
కాక
మేధాశక్తి
యందు
కూడా
మానవుడు
మహా
విశిష్టమైనటువంటివాడు.
కాని
యిట్టి
విశిష్టమైన
మానవత్వమునకు
ఆయుః
ప్రమాణము
అతిస్వల్పముగా
వున్నది.
దీనిని
ఎవ్వరూ
మరువరానిది.
ఈ
మానవత్వమునకు
అందించినటువంటి
దివ్య
మేధస్సును
ఈ
ఆయుః
ప్రమాణము
వున్నంతలోనే
దీనిని
సద్వినియోగపరచి
సరియైన
సార్థకత
పొందాలి.
మానవ
శరీరము
నీటి
బుడగవంటిది.
ఏ
నిముషములో
యీ
నీటి
బుడగ
శిథిలమవుతుందో
తెలియదు.
ఈ
జీవితము
వున్నంత
లోపలనే
మానవత్వమును
సార్థకము
గావించుకొనుటకై
ప్రతి
వ్యక్తి
ప్రయత్నించాలి.
మానవ
శరీరము
ధరించినటువంటి
ప్రతి
వ్యక్తి
సత్యాన్ని
పాటించాలి.
పాలించాలి;
అనుసరించాలి.
ఈ
మానవతా
విలువల
యొక్క
ప్రధాన
విషయము.
అసలు
మానవత్వమంటే
ఏమిటి?
మనసు,
మాట,
క్రియ
అన్ని
ఒక్కటిగా
అతికియుండుట.
మనసు
వేరు,
మాట
వేరు,
క్రియ
వేరు
అయిన
ప్రయోజనమేమిటి?
తలచిన
తలపులు
మాటలతో
వుచ్ఛరించి,
ఉచ్ఛరించిన
మాటలు
క్రియలలో
ఆచరించాలి.
దీనినే
మనస్యేకం,
వచస్యేకం,
కర్మణ్యేకం
మహాత్మనం.
అట్టి
మహాత్ముడే
రాముడు.
మనస్యన్యత్,
వచస్యన్యత్,
కర్మణ్యన్యత్
దురాత్మనం.
అట్టి
దురాత్ముడే
రావణుడు.
మానవుడు
ఆచరించవలసినటువంటి
సత్కర్మలను
మనస్సు
నందు
తలచి,
వాక్కులతో
వుచ్ఛరించి
క్రియలలో
ఆచరించాలి.
ఇట్టి
మానవత్వాన్ని
మనము
పోషించాలి.
రామాయణమునందు
ప్రధానమైనటువంటివి
సత్య-ధర్మములు.
భారతీయుల
యొక్క
ప్రాణ
సమానమైన
వేదములు
సత్యంవద-
ధర్మంచర
అనేటువంటి
ప్రబోధలు
సలుపుతూ
వచ్చినవి.
సత్యము
నిలబెట్టే
నిమిత్తమై
దానిని
పాలించేటువంటి
ప్రయత్నము
లోపల
శ్రీరాముడు
అయోధ్యను
వదలి
అడవికి
వెళ్ళినాడు.
సమస్త
ధర్మములకు
సత్యమే
ఆధారము.
సత్యాన్
నాస్తి
పరోధర్మః.
ఇక్ష్వాకుని
వంశములో
తన
తండ్రి
ఆడినమాట
తప్పినాడనే
అపకీర్తి
పాలుకాకుండా
దేశనిమిత్తమై,
వంశనిమిత్తమై,
సమాజనిమిత్తమై,
సత్యవాక్య
పరిపాలకుడై
శ్రీరామచంద్రుడు
నిలిచాడు.
శ్రీరామచంద్రుని
జీవితములో
ప్రప్రథములో
తనయొక్క
పండ్రెండు
వర్షములలో
మూడు
విధములైనటువంటి
స్త్రీతత్త్వములు
తటస్థ
పడినవి.
3
▾
Meaning
Keep
తాను
యాగ
సంరక్షణార్థమై
విశ్వామిత్రునితో
ప్రయాణమై
వెళ్ళుచున్నప్పుడు
తాటకి
అనే
స్త్రీ
తటస్థపడినది.
ఆ
తాటకిని
నిర్మొహమాటంగా,
నిర్దాక్షిణ్యముగా
హత
మార్చినాడు.
విశ్వామిత్రుని
యాగ
సంరక్షణ
జరిగిన
తరువాత,
మిథిలా
పురమునకు
వెళ్ళే
సమయము
లోపల
రాయిగా
మారిన
అహల్య
తటస్థించినది.
ఆమెకు
జీవితము
కలిగించి,
ఆమెయొక్క
దోషములను
పశ్చాత్తాపముచే
పరిహారం
గావించి
ఆమెను
పతిని
చేర్చి
వెళ్ళినాడు.
మిథిలాపురము
చేరిన
తర్వాత
సీత
తటస్థించినది.
ఆమెను
ఎట్టి
విచారణ
చేయక
అనుగ్రహముతో
స్వీకరించాడు.
దీనియొక్క
అంతరార్థమేమిటి?
బాల్యమునందే
యువకుడుగా
వుండినప్పుడే
యీ
విధమైన
సాధనను
ఆదర్శప్రాయుడిగా
లోకానికి
అందించినటువంటి
మూర్తి
శ్రీరామచంద్రమూర్తి.
రామునకు
మొట్టమొదట
తటస్థ
పడినటువంటి
‘తాటకి’
తమోగుణము.
తమోగుణమును
హతమార్చాడు.
ఇంక
రాయిగా
మారిన
‘అహల్య’
రజోగుణము.
రజోగుణమునకు
బుద్ధి
నేర్పి
ఆమె
స్వస్థానమునకు
అందించి,
సంరక్షణగా
ఆమె
దోషమును
పరిహారము
గావించి
వెళ్ళినాడు.
సాత్వికమైన
‘సీత’ను
తాను
అనుగ్రహించినాడు.
భగవంతుడు
ఆశించేది,
కోరేది,
అనుగ్రహించేది
సాత్వికమే.
ఈ
సాత్వికాన్నే
అభిలషిస్తాడు.
దానినే
పోషిస్తాడు.
అట్లు
కానివాడు,
ఒక్కొక్కరియందు
ఒక్కొక్క
గుణము
ప్రసరిస్తూ
వస్తుంది.
తాటకి
తమోగుణము.
అహల్య
రజోగుణము.
సీత
సాత్వికము.
నేటి
మానవుని
యందు
తమో,
రజో,
సాత్విక
మూడింటి
యొక్క
చేరికనే
పెరిగియున్నది.
మానవ
తత్త్వమందు
మనలో
వున్నటువంటి
తమోగుణమే
తాటకి.
మొట్టమొదట
తాటకిని
సంహరించాలి.
తమోగుణమనగా
ఏమి?
సత్యాన్ని
అసత్యముగా
భావించటము,
అధర్మాన్ని
ధర్మముగా
విశ్వసించటం,
చెడ్డను
మంచిగా
భావించటము
తమోగుణము
యొక్క
సహజ
లక్షణములు.
ఈ
జగత్తు
అనిత్యమైనప్పటికి,
దీనిని
మనము
నిత్యముగా
సత్యముగా
విశ్వసిస్తున్నాము.
ఇదియే
ప్రధానమైన
తమోగుణము.
విచారణ
శక్తి
హీనుడై,
రాగ
ద్వేషములకు
గురియై
తనయొక్క
యిచ్ఛానుసారముగా
సంచరించటము
రజోగుణము.
తొందరపాటు
పడుట
రజోగుణము
యొక్క
సహజ
లక్షణము.
ఈ
తొందరపాటు
లోపల
మన
మనేక
విధములైనటువంటి
కష్టనష్టములకు
గురికాగలము.
కాలము
కూడ
వ్యర్థము
చేస్తున్నాము.
తద్వారా
మనము
అశాంతికి
గురికాగలము.
తొందరపాటు
లేకుండా
జీవించటానికి
ప్రయత్నించాలి.
నిత్యా
నిత్య
విషయ
పరిశీలన
సల్పాలి.
దీనికే
Haste
makes
waste.
waste
makes
worry
so
dont
be
in
a
hurry.
దైవ
విషయములందు
మాత్రము
అతిశాంతముగా
నిశ్చలముగా,
నిర్మలముగా
ప్రశాంతముగా
దానిని
పొందటానికి
తగిన
కృషి
చెయ్యాలి.
అశాంతస్య,
కుతః
సుఖమ్.
అశాంతి
కలిగినటువంటి
వానికి
సుఖమే
లేదు.
ఈ
శాంతి
మనకేరీతిగా
లభిస్తుంది.
అశాంతికి
మూలకారణము
అసంతృప్తి.
అసంతృప్తో
ద్విజో
నష్టః.
4
▾
Meaning
Keep
అసంతృప్తి
వలన
రెండు
నష్టము
లుంటున్నాయి.
అశాంతి
ఒకటి.
అసుఖము
ఒకటి
యేర్పడుతాయి.
కనుక
మానవుడు
వున్నదానితో
తృప్తి
పడి
దానితోనే
అనుసరించి
ఆనంద
మనుభవించే
స్థితికి
రావాలి.
మితిమీరిన
ఆశలతో
మతి
చెరవకూడదు.
త్యాగరాజు
శాంతమూ
లేక
సౌఖ్యము
లేదు
అని
గానం
చేశాడు.
త్యాగరాజు
మహా
రామభక్తుడు.
శ్రీ
రామచంద్రుని
భక్తుడైన
త్యాగరాజు
ఎన్నో
విధములైన
అనుభూతులను
తాననుభవించి
లోకానికి
అందిస్తూ
వచ్చాడు.
రామ
అనే
తత్త్వమునకు
కొన్ని
అర్థములు
గుర్తించాలి.
అసలు
మానవజన్మమునకు
మూలకారణమేమిటి?
చేసిన
పాపము,
అనుభవించిన
తాపము,
అజ్ఞానము
యీ
మూడే
కారణములు
అదే
ర-అ-మ
ఈ
మూడు
చేరినప్పుడే
రామ
అయిపోతుంది.
‘ర’
అనగా
అగ్ని
బీజము.
‘అ’
చంద్ర
బీజము.
‘మ’
సూర్య
బీజము.
అగ్నిబీజము
యేమి
చేస్తుంది?
సమస్తము
భస్మము
చేస్తుంది.
కనుక
మానవుడు
చేసిన
పాపములను
భస్మము
చేసేది
రకారము.
మానవుడు
అనుభవించిన
తాపమును
చల్లార్చి
శాంతిని
చేకూర్చేటువంటిది
చంద్రబీజము.
అదే
‘అ’
కారము.
సూర్యుడు
అజ్ఞానమనే
అంధకారమును
నిర్మూలము
గావించి
ప్రకాశవంతమైన
వెలుగును
అందించేటువంటివాడు.
రామ
అనే
నామము
మన
పాపమును,
తాపమును,
అజ్ఞానమును
కూడ
ఒక్కతూరి
పరిహారము
చేస్తుంది.
రామ్
అనేటువంటి
పదము
లోపల.
రా
అనగా
మనో
ద్వారము
తెరుస్తూ
వుంటుంది.
ఈ
‘రా’
అనే
ద్వారము
నుండి
మనము
చేసేటువంటి
పాపములు
అన్ని
బయట
పడిపోతున్నాయి.
అంతేకాదు
బయటపోయినటువంటి
యీ
పాపములు
తిరిగి
లోపలికి
ప్రవేశించకుండా
‘మ్’
పాపమును
పరిహారము
గావించి
బయటకు
తరిమే
నిమిత్తమై
ప్రయత్నిస్తుంది.
పోయిన
పాపములు
తిరిగి
ప్రవేశించకుండా
వుండే
నిమిత్తమై
ద్వారమును
మూసి
వేస్తుంది.
రామ
నామమునకుండిన
మాధుర్యము,
రామ
నామమునకు
వుండిన
పవిత్రత,
రామ
నామమునకు
వుండిన
దివ్యత్వము
అర్థము
చేసుకొని
వర్తించాలి.
కనుకనే
‘తెలిసి
రామ
చింతన
చేయవే
మనసా’
అని
త్యాగరాజు
పల్కాడు.
తెలుస్తే
చాలా
సుఖము.
తెలియక
పోయినను
రామనామము
పాపములను
పరిహారము
చేస్తుంది.
కాబట్టి
రామ
మాధుర్యాన్ని
మనము
ఆనందమైన
హృదయంతో,
నిశ్చలమైన,
నిర్మలమైన
నిస్వార్థమైన
భావంతో
దానినారగించటానికి
ప్రయత్నించాలి.
ఈ
మానవుని
యందు
రెండు
రకములైన
పక్షులు
ప్రవేశించాయి.
ఒక
పక్షి
నేను-
నాది
స్వార్థము,
స్వప్రయోజనములతో
అహంకారముతో
సంచరించునది.
ఇది
కేవలం
నశించునది.
శాశ్వతమైన
‘నేను’
కాదు.
రెండవది
‘నేను-నాది’
రాగ
ద్వేష
రహితమైనది.
దీనినే
సూర్యుడనే
రాముడు
అనుసరిస్తాడు.
ఈ
నూతన
వత్సరమందు
అనేక
రాష్ట్రములందు
వేప
మామిడి
పూత
ఇలాంటివన్నీ
కలిపి
కొన్ని
రకములైన
సుఖఃదుఃఖములు
సమత్వముగా
భావించే
నిమిత్తమై
యీనాడు
ఆ
గుజ్జునంతా
భుజిస్తారు.
5
▾
Meaning
Keep
ఈ
వసంత
ఋతువు
నందు
మామిడిపూత
కోయిలకూత
మనిషికి
చాలా
ఆనందాన్ని
కలిగిస్తుంది.
ఈ
వసంత
కాలమునందు
కోయిల
కూత
కూసినట్లుగా
మరొక
కాలమునందు
కూయదు.
‘కోయిలకూత’
ప్రతి
కర్ణమునకు
ఆనందము
కలిగిస్తుంది.
ఈ
కూతయొక్క
అంతరార్థము
యేమిటి?
ఒక
కాకి
వచ్చి
మన
యింటిపైన
వాలి
కూస్తుంటే
రాయిపట్టి
విసురుతాము.
కాని
కోయిలకూస్తే
హాయిగా
కర్ణములు
యిచ్చి
ఆనందముగా
వింటాము.
కాకి
మన
సొత్తు
కాజేయలేదు.
కోకిల
మనకు
రత్న
కిరీటము
పెట్టలేదు.
నోరు
మంచిదౌతే
పేరు
మంచిదౌతుంది.
కాబట్టి
మానవుడు
నోటిని
మంచిదిగా
మార్చుకోవాలి.
మంచిమాట,
మాధుర్యమైనమాట,
తీయనైనమాట,
శాంతిని
గొలిపేమాట
అదియే
దివ్యత్వాన్ని
కనుగొనే
బాట.
అట్టి
మానవుని
హృదయమునందే
శ్రీరామచంద్రుడు
తిష్ఠవేసి
కూర్చున్నాడు.
నారదుడు
ఒకానొక
సమయములో
విష్ణువును
సందర్శించి
‘స్వామీ!
నేను
త్రికాలములందు
సంచరిస్తాను.
ఈ
లోక
వార్తలు
నీకేరీతిగా
అందించాలి
నీ
permanent
address
ఏమిటి?
ఇక్కడా
అక్కడా
అని
Branch
addressలు
యిస్తావు.
Branch
addressలు
నాకక్కరలేదు.
అక్కడ
వుండవచ్చు
లేకపోవచ్చు’
అన్నాడు
నారదుడు.
అప్పుడు
వెంటనే
విష్ణువు
చెప్పాడు
‘నారదా!
వ్రాసుకో.
నా
ఎడ్రస్సు
మద్భక్తాః
యత్ర
గాయన్తి
తత్ర
తిష్ఠామి
నారద’
ఎక్కడ
నా
భక్తులు
మధురమైన
కంఠముతో,
నిర్మలమైన
భావములతో
నన్ను
స్మరిస్తారో
అదే
నా
పర్మినెంటు
ఎడ్రస్సు.
భగవంతుడు
కైలాసవాసి,
వైకుంఠవాసి,
బదరీవాసి,
కేదారవాసి’
అని
యేమేమో
చెప్పుతారు.
ఇవన్నియు
కేరాఫ్
ఎడ్రస్సులే.
కాని
direct
address
హృదయమే.
‘ఈశ్వరస్సర్వ
భూతానామ్’
‘ఈశావాస్య
మిదం
సర్వమ్’
వాసుదేవ
సర్వమిదం.
ఎక్కడ
చూచినా
వున్నాడు
కనుక
మన
హృదయంలోకూడ
వున్నాడు.
కనుక
హృదయానికి
ఆత్మారాముడని
పేరు
వచ్చింది.
ఆత్మ
స్వరూపమును
రమింపచేసినది
కనుకనే
రామ
అనే
పేరు.
మనము
యేపని
చేసినా
బయట
వారి
తృప్తి
కోసము
కాక,
యితరుల
ఆనందము
కోసము
కాక
నీ
ఆత్మ
తృప్తి
నిమిత్తమై
చేయాలి.
అదియే
దైవతృప్తి.
దానిదే
conscience
అన్నారు.
కాని
యిలాంటి
తృప్తి
మనము
పొందాలంటే
తనపై
తనకొక
దృఢమైన
విశ్వాసము
కలగాలి.
ఎప్పుడు
యీ
satisfaction
వస్తుందో
అప్పుడే
sacrifice
చేస్తాడు.
ఎప్పుడు
త్యాగం
చేయునో
అప్పుడే
దైవత్వాన్ని
పొందగలడు.
కనుక
self-confidence
ఆత్మవిశ్వాసమే
ఒక
పునాది.
Self
satisfaction
ఒక
wall.
Self
sacrifice
ఒక
roof.
Self
Realisation.
మొట్టమొదట
self
confidence
కావాలి.
మన
విశ్వాసము
క్షణక్షణమునకు
కదులుతూ,
మెదలుతూ
వుండకూడదు.
ఎట్టి
కష్టములు
వచ్చినా,
ఎన్ని
బాధలు
సంభవించినా,
ఎన్ని
నిందలు,
నిష్ఠూరములకు
గురైనా
మన
విశ్వాసము
ఒక్కటిగానే,
స్థిరంగా
వుండాలి.
6
▾
Meaning
Keep
పాండవులు
ఎన్ని
కష్టాలకు
గురైనారు.
కాని
అన్ని
కాలములందు
కృష్ణ
నామమును
వారు
వదులలేదు.
కృష్ణ
చింతన
మానలేదు.
పోతన
తాను
వ్రాసిన
భాగవతాన్ని
సామాన్య
మానవునికి
అంకితము
చేయక
శ్రీరామచంద్రునికే
అంకితము
చేసినాడు.
నాది
ప్రత్యేకమన్నది
యేదీ
లేదు.
అంతా
నీదే.
ఇచ్చినా
నీవే
పుచ్చుకున్నా
నీవే.
అన్న
సంపూర్ణ
శరణాగతియే
పోతన
తత్త్వము.
అనేకమంది
యాత్రలు
చేస్తూ
వుంటారు.
అక్కడ
గంగాజలము
తీసుకుని
కేశవాయనమః,
నారాయణాయనమః,
మాధవాయనమః,
గోవిందాయనమః
అని
భగవంతునికే
యివన్నీ
అర్పిస్తుంటారు.
గంగనీరు
తీసుకొని
గంగకే
యిచ్చేస్తుంటారు.
ఇంక
దేనిని
ప్రత్యేకముగా
యిచ్చేది
వుంది.
ఏ
హృదయమును
భగవంతుడు
యిచ్చాడో
నిజంగా
ఆ
హృదయాన్ని
భగవంతునికి
అర్పించాలి.
అదే
శరణాగతి.
శరణాగతి
తత్త్వములోపల
లక్ష్మణుడు
శ్రీరామచంద్రునికి
సరియైన
సోదరుడు.
సోదరతత్త్వములో
యింత
ప్రేమతత్త్వాన్ని
అభివృద్ధి
పరచుకొన్నట్టివాడు.
శ్రీ
రామచంద్రుడంటే
లక్ష్మణునకంత
ప్రేమ.
సర్వమూ
త్యాగము
చేసి
రామునితో
అరణ్యమునకు
వెళ్ళినాడు.
రామతత్త్వమనేది
ప్రతి
మానవునకు
ఒక
ఆదర్శమైన
జీవితాన్ని
అందిస్తూ
వచ్చింది.
రావణవధ
జరిగిన
తరువాత
విభీషణ,
సుగ్రీవ,
జాంబవంత,
అంగద
మున్నగువారు
వచ్చి
‘రామచంద్రా!
నీవు
యీ
విజయమును
సాధించినావు.
అయోధ్యను
భరతుడేలుచున్నాడు.
ఈ
లంక
స్వర్గం
కంటె
మించినదిగా
వుంటున్నది.
స్వర్ణమయముగా
వుంటున్నది.
కనుక
తమరిక్కడనే
వుండి
యీ
లంకయొక్క
పరిపాలన
సాగించండి’
అన్నారు.
అప్పుడు
రాముడు
పిచ్చివాడా!
కేవలము
తన
తల్లి
కురూపిగా
వుంటుందని
యేదో
ఒక
అందమైన
దానిని
తన
తల్లి
అని
పిలవటానికి
వీలౌతుందా?
నా
భారతదేశము
పేదరికముగా
వుండవచ్చు.
జననీ
జన్మభూమిశ్చ
స్వర్గాదపి
గరీయసి.
స్వర్గము
కంటె
మించినటువంటిది
నా
జన్మభూమి.
నా
కన్నతల్లి,
నా
జన్మభూమి
ఆ
స్వర్గముకంటె
మించినవి.
ఇది
మాత్రము
నేను
మరువలేను,
వదలలేను.’
ఇటువంటివన్నియు
సామాన్య
మానవునకు
ఒక
ఆదర్శము
నందించిన
మూర్తి
శ్రీరామచంద్ర
మూర్తి.
ఈనాడు
రాంరాంరాం
అని
స్మరిస్తాముగాని
రాముని
ఆదర్శములను
ఆచరణ
యందు
మాత్రం
పాటించటం
లేదు.
కష్టములలోనే
అధికంగా
భగవంతుని
స్మరించటానికి
వీలవుతుంది.
సంకటం
వస్తే
వెంకటరమణా
అంటాము.
అలాంటి
కష్టములు
వస్తేనే
భగవంతుని
స్మరిస్తాము.
కష్టములూ
వుండాలి.
నష్టములు
వుండాలి.
విచారణ
కలగాలి.
దానిని
మనము
నిగ్రహించుకోవాలి.
అదే
మన
శక్తి
సామర్థ్యములు
అదే
మన
సాధన
యొక్క
ప్రధానమైన
లక్ష్యము.
శ్రీరామచంద్రుడు
చక్రవర్తిగా
వుండినను,
దశరథ
మహారాజు
కుమారుడుగా
వుండినను,
మిథిలాపుర
మహారాజు
అల్లునిగా
వుండినను
తాను
యిన్ని
కష్టములకు
గురికావటానికి
కారణమేమిటి?
7
▾
Meaning
Keep
ఆ
కష్టముల
వల్లనే
సత్యమును,
ధర్మమును
నిలబెట్టుకొని
ఒక
ఆదర్శము
నిరూపించాడు.
పాండవులనేక
కష్టములకు
గురికావటముచేతనే
వారి
కీర్తి
ప్రతిష్ఠలు
జగద్వ్యాప్తి
పొందటమైనది.
ఈ
అనుభూతిని
మనము
పొందాలనుకుంటే
మనము
కష్టాలను
ఎదుర్కొనాలి.
కొండల
వంటి
పాపములను
కూడ
ఒక్కతూరి
రామనామముతో
భస్మమై
పోతాయి.
ఈ
రామనామముగానీ,
దైవనామముగాని
ఏదో
ఒక
గ్రామఫోను
ప్లేటు
మాదిరి,
టేప్
రికార్డు
మాదిరి
స్మరించరాదు.
హృదయపూర్వకంగా
స్మరించాలి.
మానవులు
మానవజన్మ
ఎత్తినందులకు
యిటువంటి
దివ్యమైన
అవతారములు
యీ
భారతదేశములో
కలిగినందులకు
సార్థకమైన
ఒక
భావాన్ని
అనుభవించాలంటే
ఆచరణ
వుండి
దానిని
ప్రచార
ప్రబోధలు
సల్పాలి.
ప్రేమతో
స్మరించాలి.
ధీశక్తితోగాని,
యుక్తితోగాని,
పాండిత్యముతోగాని,
పదవులతోగాని
భగవంతుని
సాధించటము
సాధ్యము
కాదు.
ఒక్క
ప్రేమ
చేతనే
సాధించవచ్చును.
Previous
←
Recognise the One in the many!
Next
Talk to Westeners
→