Contents
Devotion & Sacred Story
Home
Library
Find
Shelf
Settings
←
Leave
Sathya Sai Speaks 1989 · Observe discipline
Tap a verse for its meaning
IAST
Telugu
Meaning
Continuous
Observe discipline
20 June 1989, Prasanthi Nilayam
1
▾
Meaning
Keep
ఇంద్రియంబులు
మనసు
నిలిపిన
అంధుడైనను
ముక్తి
పొందును
ఇంద్రియంబుల
నిగ్రహించని
చంద్రుడైన
పతనమొందును
కన్ను
విప్పి
చూడరోరన్నా
ఈ
సాయి
దేవుని
యెన్నగా
యెందైన
కలడన్నా
మున్ను
షిరిడి
నేడు
పర్తి
ఉన్నవాడని
పేరెగాని
తన్ను
భావన
చేయు
భక్తుల
కన్నులందే
మెలగునన్నా
కన్ను
విప్పి
చూడరోరన్నా!
విద్యార్థులారా!
భారతీయ
సాంప్రదాయమునందు
ధర్మ,
అర్థ
కామ
మోక్షములనే
చతుర్విధ
పురుషార్థములు
మానవునకు
అత్యంత
ప్రధానము.
కానీ
వీటిని
సర్వ
మానవులు
అనుసరించుటకు,
ఆనందించుటకు
తగిన
శక్తి
సామర్థ్యములు
లేకపోవచ్చును.
మానవునకు
ప్రధానమైన
చతుర్విధానములున్నవి.
వాటిని
సక్రమముగా
అర్థము
చేసుకొనుటకు
ప్రయత్నించినప్పుడే
ధర్మార్థ
కామ
మోక్షములు
కూడను
సులభముగా
ఆచరించుటకు
వీలవుతుంది.
ఇప్పటి
విద్యార్థులకు
యివి
చాలా
అవసరము.
వీటిని
అర్థము
చేసుకున్నప్పుడే
సమస్తాన్ని
కూడను
వీరు
అర్థము
చేసుకోగలరు.
వీటిని
అర్థము
చేసుకోలేకపోవటం
చేత
అనేక
రకములైన
అనర్థములు
ప్రవేశించి
మానవుని
యదార్థమును
మరచిపోతున్నారు.
మొదటిది
మైత్రి.
రెండవది
కరుణ.
మూడవది
ముదిత.
నాల్గవది
ఉపేక్ష.
ఇదే
ప్రతి
మానవునకు
అత్యవసరమైన,
ప్రధానమైన
చతుర్విధాలైన
ధర్మములు.
ఐతే
వీటికి
తగిన
అర్థములు
చెప్పేవారు
లేకపోవటం
చేతను,
చింతించే
శక్తి
సామర్థ్యములు
లేకపోవటం
చేతను,
మైత్రి
అనగా
ఒక
విధమైన
friendship
అని
ఒక
విధమైన
స్నేహమని
మాత్రము
భావిస్తున్నారు.
స్నేహమంటే
ఏమిటి?
ఎవరితో
స్నేహము
చెయ్యాలి,
ఎట్లా
చేయాలి
అనే
సత్యాన్ని
మొత్తము
విచారించాలి.
అందరితోను
స్నేహము
చేయకూడదు.
తనకు
సరైన
సమానత్వాన్ని
గుర్తించే
స్నేహము
చెయ్యాలి.
తన
వయసుకు,
తన
సంపదకు
తన
ఆరోగ్యమునకు,
తన
చదువుకు,
తన
పరిస్థితికి
తగినవారితోనే
స్నేహము
చెయ్యాలి.
అధికులతోగాని,
చిన్నవారితోగాని
స్నేహము
చేయకూడదు.
ఇది
స్నేహమునకు
సరియైన
అర్థము.
అధికులతో
స్నేహము
చేసినప్పుడు
అతను
నిన్ను
లొంగదీసుకొనుటకు
ప్రయత్నించవచ్చు.
దీనికి
విరుద్ధము
జరిగినప్పుడు
నీ
స్నేహమునకు
భంగము
కలుగవచ్చు.
చిన్నవారితో
స్నేహము
చేసినప్పుడు
నీవు
వాళ్లను
అదుపులో
పెట్టుటకు
ప్రయత్నించవచ్చును.
2
▾
Meaning
Keep
వాడు
దానికి
అంగీకరించకుండా
పోయినప్పుడు
తిరిగి
యీ
స్నేహము
భిన్నము
కావచ్చును.
కనుకనే
వయస్సు,
స్థితి,
సంపద,
విద్య
యిలాంటి
పరిస్థితులు
సమానముగా
వుండినవారితో
స్నేహము
చేసినప్పుడే
అది
శాశ్వతమైన
స్నేహముగా
రూపొందుతుంది.
ఇంక
కరుణ.
ఈ
కరుణను
యిష్టము
వచ్చినట్లుగా
మనము
ప్రసరింప
చేయకూడదు.
మనకంటె
చిన్నవారిపైన
కరుణను
చూపాలి.
వయసునందు
సంపదయందు,
దేహమునందు,
చదువునందు
యింక
పరిస్థితులయందు
కూడను
మనకంటె
తక్కువస్థాయి
యందు
వుండినవారి
పైననే
మనము
కరుణ
చూపాలి.
అప్పుడే
యీ
కరుణకు
విలువ
అధికమవుతుంది.
కరుణయొక్క
స్థాయి
కూడను
బలపడుతుంది.
ఇంక
ముదిత.
ముదిత
అనగా
అనేకమంది
మనకంటె
కొంత
అధికముగా
వుంటుంటారు.
ఈ
అధికులను
చూచి
మనము
ఆనందించాలి.
మనకంటె
ఆరోగ్యములో
చక్కగా
వుండిన
వ్యక్తిని
చూచినప్పుడు
మనము
ఆనందించాలి.
మనకంటె
అధిక
సిరిసంపదలలో
కూడిన
వారిని
చూచి
మనము
ఆనందించాలి.
మనకంటె
అధికస్థానములో
వున్న
అధికారులను
చూచి
మనము
ఆనందించాలి.
మనకంటె
వుత్తమమైన
మార్కులను
అందుకొనే
వ్యక్తిని
చూచి
మనము
ఆనందించాలి.
కనుక
ముదిత
అంటే
మనకంటె
అధికులను
చూచి
అసూయ
పడకుండా
యింకే
విధమైన
దుర్భావములను
ప్రవేశ
పెట్టకుండా
ఆనందించేటువంటిదే.
ఇంక
ఉపేక్ష.
అపేక్ష
ఉపేక్ష
అంటారు.
అపేక్ష
అంటే
యిష్టపడటం
ఉపేక్ష
అంటే
యిష్టపడకుండా
పోవటము.
చెడ్డ
చేసేవారిని
మనము
యేమాత్రము
యిష్టపడకూడదు.
ఇతరులకు
కీడు
చేసేవారిని
చూచినప్పుడు
మనము
యిష్ట
పడకూడదు.
దుర్బుద్ధులతో
దురాలోచనలతో,
దుష్ప్రవర్తనతో,
దుశ్చింతలతో
మెలిగే
వ్యక్తులను
చూచి
మనము
యేమాత్రము
కూడను
స్నేహముగా
తీసుకోకూడదు
అంగీకరించకూడదు.
దుర్గుణములు
దురాలోచనలు
దుష్ప్రవర్తనలు
కలిగిన
వారిని
మనము
యేమాత్రము
యిష్టపడకూడదు.
ఈ
నాల్గింటిని
మనము
చక్కగా
ఆచరణలో
పెట్టినప్పుడు
యింతకంటె
గొప్ప
పురుషార్థములు
మరొకటి
లేవు.
సరి
సమానమైన
వానితో
స్నేహము
చేయటము,
తక్కువ
వానిపైన
కరుణ
చూపటము,
ఎక్కువ
వాని
ఆధిక్యము
చూచి
ఆనందించటము,
దోషులను
చూచి
దూరముగా
వుండటము
యీ
నాలుగే
నిజమైన
పురుషార్థములు.
ఈ
పురుషార్థములలో
మనము
చక్కగా
సక్రమముగా
ప్రవర్తించటం
లేదు.
కనుకనే
మనయొక్క
స్థితిగతులు
దిగజారి
పోతుండాయి.
విద్యార్థిగాని
లేక
మరొక
వ్యక్తిగాని
తాను
ధరించే
దుస్తులుగాని,
తాను
ధరించే
నగలుగాని
తాను
తన
దేహమునుగాని
నిరంతరము
పరిశుద్ధముగా
నుంచుకొనుటకు
ప్రయత్నించాలి.
3
▾
Meaning
Keep
ఇది
బహిశ్శౌచము.
యింత
మాత్రం
కాదు.
మన
చిత్తము
కూడను
శుద్ధి
గావించుకోవాలి.
మన
భావములను
పరిశుద్ధి
చేసుకోవాలి.
కనుకనే
అంతర్బహిః
పరిశుద్ధి
అనేటువంటిది.
ఈ
అంతః
పరిశుద్ధిని
మనము
ఏరీతిగా
గావించుకొచ్చు?
బయట
వున్న
మాలిన్యాన్ని
కడుక్కోవచ్చు,
తుడుచుకోవచ్చు.
కానీ
లోన
వున్న
మాలిన్యాన్ని
మనము
ఏ
రీతిగా
తెలుసుకోగలము!
ఏ
రీతిగా
చూడగలము?
ఏ
రీతిగా
దీనిని
పరిశుద్ధము
చేయగలము?
దీనికి
సరియైన
మార్గము
ఒక్కటే
ఒక్కటి.
ప్రతి
జీవియందు
ప్రతి
ప్రాణియందు
క్రిమికీటకాదులు
మొదలుకొని
సర్వప్రాణులయందు
వున్నది
భగవంతుడే
అనే
విశ్వాసాన్ని
మనము
అభివృద్ధి
పరచుకుంటే
యీ
చిత్తశుద్ధి
కలుగుతుంది.
ఈశావాస్యం
అన్నిటియందు
వసించినవాడు
భగవంతుడే.
ఈ
సత్యాన్ని
మనము
చక్కగా
గుర్తించి
వర్తించినప్పుడే
మనము
చిత్తశుద్ధి
గావించుకొన్న
వారమౌతాము.
అఖండ
సచ్చిదానంద
స్వరూపమైన
దివ్యత్వము
సర్వత్రా
వుంటున్నాది.
అందులో
ఏది
మంచిదని
ఏది
చెడ్డదని
ఎవరు
నిర్ణయించగలరు?
ఒకవేళ
యిది
మంచి
యిది
చెడ్డదని
నిర్ణయించటానికి
పూనుకున్నప్పుడు
దీనికి
ఏదో
రెండవ
పదార్థము
ఒకటి
వుండినప్పుడే
మంచి
చెడ్డ
అని
నిర్ణయించుటకు
సాధ్యమవుతుంది.
రెండవ
పదార్థము
యిక్కడ
లేదే.
కనుక
దేనిని
మంచి
దేనిని
చెడ్డ
అని
నిర్ణయించటానికి
వీలౌతుంది.
ఈ
విధముగా
విచారణ
చేసినప్పుడు
రెండవ
పదార్థము
ఒకటి
వున్నదని
అజ్ఞానులు
భావిస్తుంటారు.
అదే
దేహాభిమానము.
ఈ
దేహమనేది
రెండవది
వున్నది
అనుకున్నప్పుడే
యిది
చెడ్డది
అది
మంచిది
అనే
మంచి
చెడ్డ
నిర్ణయానికి
ప్రవేశిస్తాడు.
కాని
దివ్యత్వాన్ని
మంచి
చెడ్డలని
చెప్పటానికి
ఎవరికి
సాధ్యము
కాదు.
ఎవరు
నిర్ణయించలేరు.
ఒక
చిన్న
ఉదాహరణము.
ఒక
మట్టి
పాత్ర
వుంటుండాది.
చెక్క
పాత్ర
వుంటుండాది.
కాపర్
పాత్ర
వుంటుండాది.
ఇత్తడి
పాత్ర
వుంటుండాది.
వెండిపాత్ర
వుంటుండాది.
ఈ
అన్ని
పాత్రల
నిండుకు
నీరు
పెట్టినప్పుడు
అన్ని
పాత్రలయందు
ఒకే
సూర్యుడు
వెలుగుతున్నాడు.
ఏ
పాత్రలో
వుండిన
సూర్యుడు
చెడ్డవాడని,
ఏ
పాత్రలో
వుండిన
సూర్యుడు
మంచివాడని
నీవు
ఎట్లు
నిర్ణయించగలవు?
పాత్రలకు
తగిన
విలువను
నీవు
అందించవచ్చు.
ఈ
మట్టిపాత్ర
చాలా
తక్కువ
వెల,
యీ
బంగారు
పాత్ర
ఎక్కువ
వెల.
ఈ
విధముగా
దానికి
వెలనందించటానికి
సాధ్యమవుతుందేగాని
యిందులో
కనుపించే
ప్రతిబింబమైన
సూర్యునికి
యే
విధముగా
వెలనందించటానికి,
ఏ
విధముగా
మంచిచెడ్డలు
నిర్ణయించటానికి
సాధ్యమవుతుంది?
ఇక్కడ
మంచి
చెడ్డ
ఏమిటి?
పాత్రలు
ప్రకృతికి
సంబంధించినవి.
ఈ
సూర్యుడు
పారమార్థికమైన
సంబంధము.
కనుకనే
పాత్రలు
చెడ్డవి.
సూర్యుడు
మంచివాడు.
సూర్యుడు
అనంతమైన
ప్రేమ
సముద్రము.
జీవుడు
ప్రేమస్వరూపుడు.
ఈ
పాత్రనే
లేక
నీరు
నిలువలేదు.
నీరే
లేకుండిన
సూర్యుని
ప్రతిబింబాన్ని
మనము
చూడలేము.
4
▾
Meaning
Keep
కాబట్టి
సూర్య
ప్రతిబింబాన్ని
దర్శించటానికి
పాత్ర
మనకత్యవసరము.
ఈ
పాత్ర
లోపల
జలము
కూడను
అవసరమే.
ఈ
జలమే
మనస్సు.
ఈ
పాత్రనే
మన
దేహము.
ఇందులో
ప్రతిబింబించే
సూర్యుడే
మన
ఆత్మ.
కనుక
అందరియందు
వుండిన
ఆత్మ
ఒక్కటేగాని
యిందులో
భేదములు
పాత్ర
భేదములు
మాత్రమే.
ఉపాధి
భేదములు
మాత్రమే.
ఈ
విధముగా
మనము
విచారము
చేయటానికి
పూనుకున్నప్పుడు
ప్రతి
ఒక్క
దోషము
కూడను
దేహ
మనస్సులతోనే
యేర్పడుతున్నాది.
కొన్ని
పాత్రలలో
మలినమైన
జలము
వుండవచ్చును.
కొన్ని
పాత్రలయందు
చంచలముగా
కదిలే
జలము
వుండవచ్చును.
కొన్ని
పాత్రలయందు
పరిశుద్ధమైన
జలము
వుండవచ్చును.
పరిశుద్ధ
జలములో
కనుపించే
సూర్యుడు
సాత్వికమని,
చలించే
జలములో
కనుపించే
సూర్యుడు
రాజసికమని,
మలినమైన
జలములో
కనుపించే
సూర్యుడు
తమోగుణమని
నీవు
నిర్ణయించుకోవచ్చు.
కనుక
మనము
యీనాడు
పరిశుద్ధము
చేసుకోవలసినది
యేమిటి?
మనము
యీ
రజోగుణము,
తమోగుణములనే
చంచలత్వ
మాలిన్యములు
లేకుండా
మనస్సును
పరిశుద్ధము
చేసుకోటానికి
తగిన
కృషి
చేయాలి.
ఇది
ఏ
రీతిగా
పరిశుద్ధము
చేయవలెను?
ఏ
రీతిగా
నిశ్చలత్వాన్ని
సాధించాలి?
ఈ
నిశ్చలత్వమునకు
నిర్మలత్వమునకు
మనము
చేయవలసిన
సాధన
యేమిటి?
ఈనాడు
మానవుడు
తన
దోషములను
తాను
కప్పిపుచ్చుకోటానికి
ప్రయత్నిస్తున్నాడు.
పరుల
దోషములను
వెతకటానికి
ప్రయత్నిస్తున్నాడు.
ఈ
రెండు
గుణములు
వుండినంతవరకు
యితని
హృదయము
యేమాత్రము
పరిశుద్ధము
కాదు.
ఇట్టి
మానవునకు
నిశ్చలత్వము
యేమాత్రము
ప్రాప్తించదు.
తనయందున్న
దోషములను
యితరులయందున్న
మంచిని
గుర్తించటానికి
ప్రయత్నించిన
వాని
హృదయమే
పరిశుద్ధము,
పవిత్రము,
నిశ్చలము
అవుతుంది.
కానీ
యీనాటి
మన
ప్రయత్నములన్నీ
భౌతికమైనవి,
ప్రాకృతమైనవి,
ఆడంబరమైనవిగను
ఆచరిస్తున్నాము.
ఈ
ఆడంబరమే
మానవుని
అథః
పతనము
గావిస్తుండాది.
ఎన్ని
విధముల
ప్రయత్నము
చేసినప్పటికి
ఆత్మతత్వాన్ని
మనం
అర్థము
చేసుకోలేకపోతున్నాము.
ఒక
విద్యార్థి
చెప్పాడు
స్వామి
తత్వము
అర్థము
చేసుకోటం
కష్టమైనప్పటికిని
దానిని
మనము
అనుసరించినప్పుడు
ఆ
ప్రాప్తిని
మనం
పొందవచ్చును
అన్నాడు.
ఐతే
యిది
పొందటానికి
తగిన
మార్గమేది?
స్వామికిని
మీకును
వుండిన
సంబంధ
బాంధవ్యము
లోపల
యేదో
ఒక
తప్పు
వున్నదని
ఆ
విద్యార్థి
చెప్పాడు.
ఈ
దోషము
యెక్కడ
వుంటున్నాది?
అనేక
మంది
అనేక
రకములుగా
భావించవచ్చు
ఊహించవచ్చును.
నీవు
ఎలాంటి
పరిస్థితియందు
వుండినప్పటికిని
దానిని
నీవు
గ్రహించి
సహించి
దానిని
సాధించే
వుపాయానికి
ప్రయత్నించాలి.
అట్లు
కాకుండా
నీలోనే
దోషములు
అభివృద్ధి
గావించుకుంటూ
వస్తే
ఎలాంటి
ప్రదేశములో
వుండినప్పటికిని,
ఎలాంటి
సంఘములో
వుండినప్పటికిని
ఎలాంటి
దివ్యమైన
మందిరములయందు
వుండినప్పటికిని
యిది
యేమాత్రము
వీలుకాదు.
5
▾
Meaning
Keep
ఎన్ని
దోమలు
వుండినప్పటికిని
ఆ
దోమలున్న
గదిలో
దోమతెర
కట్టుకుంటే
యీ
దోమల
బాధ
మనకు
యేమాత్రము
వుండదు.
దోమలు
వుండినప్పటికిని
దోమతెర
కట్టుకున్నప్పుడు
మనకు
బాధ
వుండదు.
కానీ
దోమ
తెరలోనే
దోమలుంటే
దీని
ఎవరు
సాధించటానికిగాని,
తప్పించటానికిగాని
సాధ్యము
కాదు.
అదేవిధముగనే
మీరు
దోమతెరలో
దోమలు
చేర్చుకున్నారు.
దోమతెర
ఎందుకోసం
కట్టుకున్నావు.
దోమల
నుండి
తప్పించుకునే
నిమిత్తమై
దోమతెర
కట్టుకుని
ఆ
దోమలను
దోమతెరలోనే
పెట్టుకుంటే
ఎవరి
దోషము?
కనుక
మనము
చేసే
విధి
విధానములో
విజ్ఞాన
ప్రజ్ఞానములు
లేకుండా
మనం
ప్రవర్తిస్తున్నాము.
అందరికి
భక్తి
ప్రపత్తులు
వుండవచ్చును.
స్వామి
అంటే
చాలా
ప్రేమ
వుండవచ్చును.
కాని
ప్రేమ
వుండినంత
మాత్రమున
చాలదు.
ప్రవర్తన
అత్యవసరము.
అట్టివారికి
భగవత్తత్వాన్ని
చక్కగా
గుర్తించుకున్నప్పుడే
దీన్ని
సరైన
మార్గములో
వుంచుకోటానికి
వీలవుతుంది.
మనము
రోడ్డులో
ప్రయాణమై
పోతుంటాము.
రోడ్డు
ప్రక్క
పెద్ద
వృక్షము
వుంటుండాది.
ఈ
వృక్షమంతా
చక్కగా
కళకళలాడుతూ
వుంటుంది.
చక్కని
జీవకళలో
వుట్టి
పడుతుండాది.
మరొక
ప్రక్క
చిన్న
వరిపైరు
వుంటుండాది.
రెండు
దినములు
నీరు
కట్టకుండా
పోవటంచేత
వరి
పైరంతా
ఎండిపోయినట్టుగా
కనుపిస్తుండాది.
అంత
పెద్దచెట్టు
యింత
పచ్చగా
కళకళలాడటమేమిటి,
యీ
చిన్నపైరు
ఒక్క
దినం
నీరు
లేకపోవటం
చేత
యీవిధముగా
కృంగిపోవటం
యేమిటి?
దీని
అంతరార్థమును
మనము
చక్కగా
విచారణ
చేసినప్పుడు
యీ
పెద్ద
వృక్షము
వేర్లు
నీటిమట్టము
వరకు
దిగిపోయినాయి.
దానివల్ల
దీనికి
యేమాత్రం
చింత
లేకుండా
చక్కగా
కళకళలాడుతుండాది.
ఈ
చిన్నపైరు
వేర్లు
నీటిమట్టం
వరకు
దిగలేదు.
కాబట్టి
యిది
పైపైనే
యెండి
పోతుండాది
అని
తెలుస్తుంది.
ఎవరి
మనస్సు
హృదయం
వరకు
దిగుతుండాదో
వారి
జీవితం
కళకళలాడుతుంది.
కిలకిల
నవ్వుతుంది.
ఎవరి
మనసు
భగవంతుని
ప్రేమవరకు
చేరకుండా
వుంటుంటాదో
వారి
జీవితము
విలవిల
తన్నుకుంటుంది.
మలమల
మాడుతుంది.
కనుక
యీ
ఆనందమునకు,
యీ
దుఃఖమునకు
వుండిన
కారణము
ఏమిటి?
మనం
చెప్పిన
మాటలను
చర్యలలో
చూపకుండా
వుండటానికి
కారణమేమిటి?
మన
మనస్సు
అంతలోతుగా
దిగిపోలేదు.
కేవలము
పైపైనే
వుంటుండాది.
వేర్లు
కూడా
వున్నాయో
లేదో
చెప్పటము
కష్టము.
భరతుడు
కేకయ
రాజ్యము
నుండి
అయోధ్యకు
వచ్చాడు.
వచ్చి
తండ్రి
మరణవార్త
విన్నాడు.
ఈ
మరణమునకు
కారణమేమని
తల్లిని
ప్రశ్నించాడు.
ఆమె
ఒక
గొప్ప
ఘనకార్యము
చేసినట్టుగా
‘నాయనా
దీనికి
నేనే
కారణము.
నీకు
రాజ్యమునిచ్చి
నిన్ను
ఉన్నత
స్థాయికి
చేర్చే
నిమిత్తమే
నేను
యీ
కోరిక
కోరినాను.
అప్పుడు
చింత
చేత
మీ
నాన్నగారు
మరణించారన్నది.
తన
దృష్టికి,
తన
భావమునకు
అది
ఘనముగా
వుండవచ్చును.
6
▾
Meaning
Keep
కాని
భరతుని
మనసుకు
అది
కఠినముగా
కన్పించింది.
‘క్రూరురాలా!
చెట్టును
కొట్టి
కొమ్మను
నాటటం
యేమైనా
బుద్ధితనమా?’
అన్నాడు.
అదేరీతిగా
దైవత్వమనే
దాన్ని
మీరు
త్రుంచుతున్నారు.
ప్రకృతి
తత్వమనే
కొమ్మలు
నాటి
చూపిస్తున్నారు.
భరతుడు
కైకను
యింకా
యేవిధముగా
నిందించాడో
తెలుసునా?
‘సూర్యవంశము
కీర్తిని
నిలబెట్టటానికి
వచ్చిన
దానవు
కాదు.
సూర్యవంశపు
కీర్తిని
శూన్యము
గావింప
వచ్చిన
దానవు
నీవు’
అన్నాడు.
అదే
విధముగనే
మనము
భక్తులము,
భక్తులమని
వస్తున్నాము.
భక్తి
ప్రపత్తులు
నిలబెట్టే
నిమిత్తమై
మనము
వస్తున్నామా
లేక
స్వార్థ
స్వప్రయోజనముల
నిమిత్తమై
వస్తున్నామా
అనే
విషయాన్ని
మనం
విచారిస్తే
నీకు
నీకే
జవాబు
దొరుకుతుంది.
ఈనాటి
విద్యావిధానము
లోపల
అనేక
మార్పులు
కలుగుతున్నాయి.
కాని
యీ
మార్పులన్నీ
కూడను
ఎక్కడకు
కొనిపోతున్నాయి?
మానవత్వాన్ని
పతనము
గావించే
స్థానమునకు
గొనిపోతున్నాయి.
మన
ప్రాచీన
సాంప్రదాయమంతా
హాస్యాస్పదంగా
చూస్తున్నాము.
మన
శాస్త్రములు,
మన
ధర్మములు
అమాయకులైన
ప్రజలను
మోసగించే
నిమిత్తమై
ఏర్పడిన
తంత్రములుగా
భావిస్తున్నారు.
చాలా
పొరపాటు
చాలా
పొరపాటు.
ప్రాచీన
సాంప్రదాయములు
ప్రాచీన
సదాచారములు,
ప్రాచీన
ధర్మములన్నీ
కూడను
మానవోద్ధార
నిమిత్తమై
యేర్పడినవి.
మానవత్వాన్ని
మహితత్వంగా
మార్చే
నిమిత్తమై
యేర్పడినవి.
ఈనాటి
విద్యావిధానములో
పరిశోధనలు
అధికమై
పోతున్నాయి.
ప్రత్యక్ష
ప్రమాణాన్ని
ఆశిస్తున్నారు.
ప్రతి
ఒక్కటి
పరిశోధన
చెయ్యాలి.
ఇందులో
ప్రత్యక్షము
మనకు
చాలా
ప్రమాణము.
ప్రత్యక్ష
ప్రమాణమునకు
లొంగనిది
మనము
యేమాత్రము
విశ్వసించకూడదు.
ఈ
విధమైన
సిద్ధాంతములలో
గ్రుడ్డి
మానవులు
మునిగిపోతున్నారు.
మూర్ఖ
జీవులు
దీనినే
విశ్వసిస్తూ
వస్తున్నారు.
ఈనాటి
పరిస్థితి,
యీనాటి
వాతావరణము
యీ
విధమైన
స్థితిగతులలో
చిక్కుకొని
వుంటుండాది.
నిజమే
ప్రత్యక్ష
ప్రమాణము
అత్యవసరమే.
కాని
భారతీయ
సంస్కృతి
యందు
కేవలం
రూపము
మాత్రమే
కాదు
దానికి
సాధన
కూడా
వుంటుండాలని
బోధిస్తూ
వచ్చింది.
దానినే
ఉపనిషత్తులు
‘రసోవైసః’
రస
స్వరూపమనేది
లేకుండా
యిదంతా
నీరసమేను
అని.
మీరు
చూడవచ్చును.
ఈనాడు
ప్రత్యక్ష
ప్రమాణము
చాలా
సత్యమైనదని
భావిస్తుంటారు.
plastic
grapes
అంతా
వున్నాయి
plastic
mangoes
వున్నాయి
plastic
bananas
వున్నాయి.
ఇది
ప్రత్యక్ష
ప్రమాణమే
కదా!
రూపం
కనబడుతోంది
కదా!
నీవు
భుజిస్తున్నావా?
కారణమేమిటి?
ఆకారమున్నదిగాని
దాని
సారము
లేదు.
ఈనాటి
experiments
యీ
plastic
fruits
వంటివి.
దీంట్లో
భగవత్తత్వమనే
రసము
లేకుండా
పోతుండాది.
దీనినంతా
వీరు
నిజమని
అంగీకరిస్తున్నారంటే
యెంత
తెలివితక్కువ
వాళ్లో
మీరు
యోచించండి.
ఇంతేకాదు
ప్రత్యక్షంగా
కొన్ని
చూడటానికి
సాధ్యము
కానటువంటివి
సత్యస్వరూపాన్ని
ధరించాయి.
7
▾
Meaning
Keep
ఒక
దుఃఖమనుకోండి
లేక
ఆనందమనుకోండి
దీనికి
రూపము
లేదు.
దీనికి
యేదీ
ప్రత్యక్షము
కాదు.
దీనికి
రూపం
లేదు
ప్రత్యక్షం
కాదు
కాబట్టి
నమ్మకూడదంటే
నీ
నమ్మకంపైని
ఆధారపడి
వుంటాయా
యీ
దుఃఖ
ఆనందములు.
నీవు
దుఃఖముగా
వుండవచ్చును.
నీ
మిత్రుడు
వచ్చి
దుఃఖమునకు
యేమి
రూపో
చూపండి
లేకపోతే
నిన్ను
నమ్మనంటాడు.
‘ఒరే
పిచ్చివాడా!
నీవు
నమ్మితే
నమ్ము
వదలితే
వదులు
దుఃఖము
మాత్రం
నన్ను
బాధిస్తుండాది.
దీనిని
యేరీతిగా
చూపటానికి
వీలవుతుంది!”
అంటావు.
ఈ
విధముగా
విచారణ
చేస్తూపోతే
తన
మనస్సనేది
తనకు
కనుపిస్తున్నాదా?
తన
బుద్ధి
తనకు
కనుపిస్తున్నాదా?
ఈ
అంతఃకరణ
తనకు
కనుపిస్తున్నాదా?
దీన్ని
యేరీతిగా
తాను
విశ్వసిస్తున్నాడు.
నా
మనసు
ఎక్కడెక్కడకో
పోతుండాదట.
మనసు
కనుపించటం
లేదే.
దీన్ని
ఎట్లు
నమ్ముతున్నావు.
దీనికంతా
అనుభూతులే
మూలకారణము.
ఈనాటి
విద్యలంతా
యీ
విధమైన
స్థితిలో
అభివృద్ధి
గావటం
చేతనే
మానవత్వము
మరుగునపడిపోతున్నాది.
ప్రతి
పదార్థమునందు
కూడను
మనము
పరతత్వాన్ని
విశ్వసించాలి.
ఈ
పరతత్వముపైన
విశ్వాసము
లేని
మానవుడు
ప్రాకృతమైన
జీవితములో
వ్యర్థ
జీవితము
గడిపినవాడే.
ఒకానొక
సమయములోపల
శివాజీ
సమర్థ
రామదాసునకు
కొంత
ధనము,
కొన్ని
వస్తువులు,
ఆభరణములు
పంపించినాడు.
ఇతను
నిరంతరము
దాన
ధర్మములందు
కాలము
గడిపేవాడు.
పవిత్రమైన
త్యాగము
పూనిన
వ్యక్తి.
అతను
చాలా
బీదవాడు.
సర్వసంగ
పరిత్యాగి.
అలాంటి
వ్యక్తి
మంచి
కార్యములు
చేస్తున్నాడని
శివాజీ
అంగీకరించాడు.
ఆ
త్యాగికి
యిలాంటివన్నీ
పంపించినప్పుడు
తాను
యెంతైనా
సద్వినియోగము
చేస్తాడు,
అతడు
పాపం
అనాథుడని
తన
పరివారముతో
చెప్పి
పంపించాడు.
వీరంతా
పల్లకీలో
తీసుకొని
వెళ్లి
అతని
యింటి
ముందు
దింపారు.
సామానంతా
యింటిలో
వుంచారు.
నలుగురు
మోసుకొనిపోయి
పల్లకిని
ముందు
పెట్టారు.
రామదాసు
నది
నుండి
స్నానం
చేసి
యింటికి
వచ్చాడు.
అక్కడున్న
శివాజీ
పరివారమును
చూచాడు.
‘ఎవరండి
మీరు?
ఎందుకోసమొచ్చారు.
మా
యింటిలో
వున్నది
యిద్దరే.
మేమిద్దరము
క్షేమముగా
వున్నాము.
నలుగురు
మోసుకొనిపోయే
యీ
వాహనము
యిక్కడెందుకు
తెచ్చారు?
అన్నాడు.
నలుగురు
మోసుకొనిపోయే
వాహనమంటే
శ్మశానమునకు
తీసుకొనిపోయే
వేదిక.
అప్పుడు
వారు
చేతులు
జోడించుకొని
మహానుభావా
శివాజీగారు
పంపినారు
యిక్కడికి.
మీరు
అనాథులుగా
వుండటం
చేత
మీరు
చేసే
కార్యములు
చాలా
వుత్తమంగా
వుండటం
చేత
దానికి
తగిన
సామగ్రినంతా
పంపిరమ్మన్నారు.
స్వామి
పైకి
చూచాడు
ఫక్కున
నవ్వాడు.
‘రామా!
నీ
యంతటి
గొప్ప
దేవుడే
నాకు
గొప్ప
నాథుడుగా
వుంటుండగా
నేను
అనాథుడని
ఎట్లా
భావించాడు!
8
▾
Meaning
Keep
ఈ
శివాజి.
ఇంతగొప్ప
జగత్పతియైన
భగవంతుడే
నా
పతిగా
వుండినప్పుడు
నేనెట్లా
అనాథనౌతాను.
సర్వులకు
నీవే
పతివి.
ఒకడెవడైనా
అనాథుడున్నాడని
విచారణ
చేసుకుంటే
ఆ
అనాథుడవు
నీవే
అన్నాడు.
కారణమేమనగా
నీకింకొక
నాథుడు
లేడు.
సర్వజగత్తుకు
నీవే
నాథుడు.
నీవే
జగన్నాథుడవు.
నీవే
లోకనాథుడవు.
నీవే
ప్రాణనాథుడవు.
నీవే
దేహనాథుడవు.
విశ్వనాథుడవు
నీవే.
సర్వమునకు
నాథుడైన
నీవున్నావు.
నీకింకొక
నాథుడు
లేడు.
కాబట్టి
రామా
నీవే
అనాథుడు.
కనుక
యీ
సామానంతా
నీవే
తీసుకొని
పొమ్మన్నాడు.
ఈ
విధమైన
విశాల
భావములు
సాధించిన
వ్యక్తులు,
ప్రపత్తి
గలిగిన
సాధకులు
ఆనాటివారు.
ఈనాటి
వ్యక్తులలో
కేవలము
మాటలగారడి
తప్ప
మనసు
యేమాత్రము
పరిపక్వస్థితికి
రావటం
లేదు.
‘మాటలు
చూస్తే
కోటలు
దాటుతాయి,
కాలు
చూస్తే
గడపదాటదు!’
అన్నాడు.
చెప్పవచ్చు
కోటి
చెయ్యరు
ఒక్కటి.’
కాని
మనము
చేస్తున్నామా?
Duty
devotion
భగవంతునికి
అర్పితము
చెయ్యాలి.
Dedication
అన్నాడు
గోపీచంద్రం.
devotion
వుండవచ్చు
కాని
duty
డ్యూటిగా
చేస్తున్నారా?
duty
చేయనప్పుడు
devotion
వుండి
యేమి
ప్రయోజనము.
ఒక్కొక్కని
ఒక్కొక్క
రూమ్
మానిటర్‌గా
పెట్టాము.
తన
రూములో
వుండిన
వ్యక్తులంతా
ఏడెనిమిది
మంది
నిన్న
భజనకు
వచ్చారా!
ప్రార్థనకు
attend
అయినారా
తాను
చూచుకున్నాడా?
ఇక
తానేమి
duty
చేశాడు.
ఇలాంటి
మానిటర్లే
యీ
విధమైన
పెడమార్గము
పట్టిస్తే
యింక
పిల్లలు
యేవిధముగా
అభివృద్ధి
కాగలరు.
వీనికి
చెప్పే
అధికారం
యేవిధముగా
వుంటుంది.
వీని
భక్తి
యెక్కడుంటుండాది?
ఈనాడు
సీటిచ్చేంతవరకు
కాళ్లు
వేళ్లు
పడతారు.
సీటిచ్చిన
తరువాత
చదువయ్యేంతవరకు
తల్లిదండ్రులు,
వ్యక్తులు
చాలా
భక్తి
ప్రపత్తులు
ప్రదర్శిస్తారు.
చదువు
పూర్తి
అయిపోయిదంటే
నాటకాలు
ప్రారంభిస్తారు.
మా
తండ్రికి
వళ్లు
సరిలేదు.
మా
తండ్రికి
కనుదృష్టి
సరిలేదు.
పాపం
ఎవరూ
లేరు.
వాళ్లను
యింటికిపోయి
చూచుకోవలసిన
బాధ్యత
వుంది.
ఈ
ప్లాను
వేస్తారు.
ఇంతకాలము
వాళ్ల
తండ్రిని
ఎవరు
చూచారు?
నీ
చదువయ్యేంతవరకు
మాత్రం
తండ్రి
బాగుండి
చదువైపోగానే
చెడిపోతాడా?
దీనికి
తగినట్టుగా
తల్లితండ్రులు
కూడను
తాళము
శృతి.
చదువైపోయిన
తరువాత
అక్కడ
వాడెందుకు?
ఇక్కడ
వచ్చేస్తే
ఏ
మూడువేలో,
నాలుగువేలో,
ఐదువేలో
సంపాదించేసి
మా
తలపైన
కొడతాడు
కదా
అనే
దురాశతో
వారు
కూడను
ఆ
విధముగా
ప్లాను.
తల్లితండ్రుల
దగ్గర
పోకూడదని
నేను
చెప్పటం
లేదు.
తల్లితండ్రుల
సేవ
చేయవలసినదే.
కాని
సక్రమమైన
మార్గాన్ని
అనుసరించి
తల్లితండ్రుల
దగ్గర
చేరండి.
వారి
దగ్గర
పోవటానికి
యిక్కడ
వదలటానికి
అసత్యమైన
డ్రామాలు
మాత్రం
ఆడకండి.
అది
నాకిష్టం
లేదు.
ఈ
విధమైన
డ్రామాలాడటమనేది
కేవలము
భగవద్రోహముగా
వుంటుంది.
భక్తి
భక్తి
అని
అనుకుంటున్నారేగాని
పిల్లలు
చాలామందికి
భక్తంటే
యేమిటో
అర్థము
కావటము
లేదు.
9
▾
Meaning
Keep
స్వామికెదురుగా
కేవలం
సంతృప్తయ్యేటువంటి
డ్రామాలు
చేస్తే
స్వామి
తృప్తి
పడతారనుకుంటారు.
ఒట్టిమాటలు
వాడు
కాదన్నా
-
ఈ
సాయి
దేవుడు
బుట్ట
బొమ్మల
చూడ
బోడన్నా
గట్టు
చేర్చుమటన్న
వారిని
గట్టి
ఓడను
పట్టి
చూడగ
పట్టు
బట్ట
కట్టి
భక్తుల
చుట్టు
తిరిగే
పొట్టి
స్వామిని
కన్ను
విప్పి
చూడరోరన్నా.
ప్రతి
చిన్న
విద్యార్థి
యీ
పెద్ద
విద్యార్థులను
కలసుకొని
పెడమార్గం
పడుతున్నారు.
శరీరము
నందు
పెద్దవారే.
క్లాసునందు
పెద్దవారే.
డిగ్రీలందు
పెద్దవారే.
మరి
యిక్కడ
నివాసము
చేసిన
దానిలో
కూడను
పది
సంవత్సరములు
పన్నెండు
సంవత్సరములు
పెద్దవారే.
ఇప్పుడు
చూడండి.
అక్కడ
శరీరము
చూడండి.
అతనిని
నేను
భీముడని
పిలుస్తాను.
అతనేమన్నా
ప్రార్థనకు
పోతున్నాడా?
అతనొక
రూమ్
లీడరు.
ఇట్లాంటి
వారంతా
లీడర్సుగా
తయారౌతే
యెంత
మంది
పిల్లలు
పాడైపోతారు.
ఇక
యీ
క్రమశిక్షణను
వీరేమి
అభివృద్ధి
చేయగలరు?
ఈ
క్రమశిక్షణయే
మాకు
ప్రధానమైన
subject.
ఏ
విధంగా
మీరు
సిగ్గులేకుండా
వచ్చి
మాట్లాడుతున్నారో
నాకర్థము
కావటం
లేదు.
చెప్పటమంతా
చాలా
గొప్పగా
చెబుతారు.
ఏమిటి
వీడి
experience.
స్వామికి
తృప్తిగానటువంటి
experience
ఎందుకు?
ఎవరైనా
రిజిష్టరు
కవరు
వ్రాసి
పోస్టు
చేసినారంటే
అది
చేరినట్లా
లేదా
అనే
దానికి
ఎక్నాలెడ్జిమెంటు
వాపసు
రావాలి.
అది
రానప్పుడు
యిది
చేరిందా
లేదా
అని
యేరీతిగా
మీరు
భావించవచ్చును.
తనకు
తాను
భక్తుడనుకోవచ్చును.
కానీ
నానుంచి
రావాలి
నీవు
భక్తుడవయ్యా
అని.
ఎక్నాలెడ్జిమెంటు
రావాలి.
అది
రావటమే
లేదే.
నీవెట్లు
భక్తుడవు?
అది
వచ్చే
స్థితిని
తెప్పించుకున్నవాడే
నిజమైన
భక్తుడు.
కనుక
నా
వుద్దేశ్యమేమంటే
రిజిష్ట్రారు,
వైస్ఛాన్స్లరు
వీరంతా
కూడను
ముందు
చేయవలసినదేమంటే
ఎనిమిది
తొమ్మిది
సంవత్సరముల
నుంచి
ఇక్కడ
వున్న
వారందరిని
యిక్కడ
నుంచి
పంపించాలి.
వారిలో
సరియైన
వారున్నారు
కొంతమంది
వున్నారు
పాపం.
వాళ్లను
పెట్టుకొని
మనం
పనులు
చేస్తాం.
మన
డిసిప్లిన్
మన
డివోషన్
మన
డ్యూటీని
అనుసరించినవారే
యిక్కడుండాలి.
మా
సంస్థ
కేవలము
ఒక
సత్రము
కాదు.
చావడి
కాదు.
ఆదర్శవంతమైన
జీవితమును
నిరూపించే
వ్యక్తులు
మాత్రము
యిక్కడుండాలి.
ఇంతకాలము
ఓపిక
పట్టుకున్నాము.
మారుతారు
మారుతారని
యెంతో
ఆశించినాను.
మీరింక
మారేస్థితిలో
లేరు.
కనుక
యీ
విధముగా
మారవలసిందే.
ఇంక
స్థలాన్ని
మార్చవలసిందే.
వారికీ
సంతృప్తి
అవుతుంది.
ఎందుకంటె
వాళ్లకు
కూడను
యీ
వయస్సు
వచ్చినప్పుడు
యేదో
పాస్
చేసుకున్నాం
ఏదో
పోస్టుగ్ర్యాడ్యుయేషన్
అయిపోయింది.
10
▾
Meaning
Keep
తరువాత
పిహెచ్డి
డిగ్రీ
తీసుకున్నాం.
ఇంక
కావలసింది
ఒక్కటే.
ఇంక
వాళ్ల
దృష్టి
అదే
వాళ్ల
ఏకాగ్రత.
పెండ్లి
కావాలి.
ఈ
marriage
madness
తలలో
చేరేటప్పటికి
వీళ్లకు
దేవుడూ
కనబడడు
దైవము
కనబడదు.
సంతోషము.
కానీ
తల్లితండ్రులకైనా
సేవ
చేయండి.
అక్కడ
తల్లితండ్రులకు
కాక
యిక్కడ
స్వామికి
సంతృప్తి
కాకుండా
తాను
సంతృప్తి
లేకుండా
కేవలం
కుక్కలవలె
జీవితాన్ని
గడుపుకుంటుంటే
యెవరికేమి
సుఖము?
వాళ్ల
దగ్గర
నుంచి
మేము
యేమాత్రము
ఆశించటం
లేదు.
పి.హెచ్.డి
boysకు
కూడ
మేమే
డబ్బు
యిస్తున్నాము.
మేమే
చదివిస్తున్నాము.
ఈ
విధముగా
వుంటున్నప్పుడు
అలాంటి
వాళ్లను
యెందుకిక్కడ
పెట్టుకోవాలి.
కనుక
యీ
విషయములో
మాత్రము
యింకపైన
సరియైన
కట్టుదిట్టము
లేకపోతే
సంస్థను
మూసి
వేయవలసి
వస్తుంది.
మంచి
పిల్లలు
తక్కువ
మంది
వుండినా
చాలును.
వారిని
పెట్టుకొనే
మనము
కాలము
గడుపుకొందాం.
నేను
సాయంకాలము
ప్రతిదినము
యీ
విధమైన
వుపదేశాలు
చేయాలనుకోటానికి
యిదే
మూలకారణము.
పిల్లలతో
మాట్లాడించటం,
పిల్లలలో
వున్న
దోషాలు
పిల్లలకే
చూపటం.
నిజమైన
గురువు
యెవరంటే
తన
దోషములు
తనకు
చూపినవాడే
నిజమైన
గురువు.
తన
దోషములను
తాను
అంగీకరించి
మంచివి
మంచివని
చెప్పి
తాను
చక్కగా
అంగీకరిస్తే
ఆ
శిష్యులను
చాలా
చెడగొట్టిన
వాడౌతాడు.
ఈ
discipline
అంతా
మీ
భవిష్యత్తు
రాజమార్గమునకు
చేర్చేటువంటిది.
కానీ
అది
మీరు
గుర్తించుకోటం
లేదు.
జీవితాన్నే
మీరు
పతనం
చేసుకుంటున్నారు.
విద్యార్థులందరు
చక్కగా
గుర్తించవలసిన
విషయము.
ఈ
సంస్థయందు
నియమించిన
నియమములు
తు-చ
నడచుకోటం
యిష్టమున్నవారు
వుండవచ్చును.
లేనివారు
వెళ్లవచ్చును.
మీకు
శ్రమ
వుండదు.
కానీ
మీ
విద్య
పూర్తయ్యేంతవరకు
మాత్రం
మంచిగా
అంగీకరించి
అనేక
రకములుగా
ప్రోమిసులు
చేస్తారు
కాని
యివన్నీ
మిస్లే.
ఒక్కడైనా
ప్రోమిసను
నడచుకున్నవాడు
లేడు.
కొత్తగా
భక్తిగా
వచ్చిన
పిల్లలు
యెంతమందో
వుంటున్నారు
పాపం.
వారి
హృదయాలను
వారి
భావాలను
మీరు
అశుద్ధ
పరచకండి.
వారు
నిశ్చల
నిర్మల
నిస్వార్థమైన
భక్తితో
యిక్కడ
ప్రవేశించారు.
మీరందరు
స్వార్థము,
స్వప్రయోజనము
నిమిత్తమై
యీ
డ్రామాలాడుతున్నారు.
మీ
భావములంతా
కూడను
ఆ
క్రొత్త
విద్యార్థులందు
చేరకుండా
చూచుకోటానికి
ప్రయత్నించండి.
ప్రతి
మానవునికి
భగవద్విశ్వాసమే
గాఢముగా
వుంటుంటే
యిలాంటి
దుర్భావములు,
యీ
దుశ్చేష్టలు
వానిలో
ప్రవేశించటానికే
వీలులేదు.
స్వామిపై
మీకు
నిజమైన
ప్రేమనే
వుంటుంటే
స్వామి
ఆజ్ఞను
ప్రాణము
పోయినా
సరే
యేమాత్రము
మార్చకూడదు.
దీన్ని
బట్టి
గుర్తించటానికి
వీలౌతుంది
యిది
నిజమైన
ప్రేమ
కాదు.
ఇది
కేవలము
కృత్రిమమైన
ప్రేమగా
వుంటుండాది.
ఈ
కృత్రిమ
ప్రేమ
స్వామిని
యేమాత్రము
వంచించ
లేదు.
మిమ్మల్ని
మీరే
వంచించుకున్న
వారౌతారు.
నిన్ను
నీవు
మోసము
చేసుకోవద్దు.
11
▾
Meaning
Keep
నీకు
నీవు
ద్రోహము
చేసుకోవద్దు.
‘నొప్పించక
తానొవ్వక
తప్పించుక
తిరుగువాడు
ధన్యుడు
వేమా!’
అన్నారు.
నీవూ
నష్టపడకుండా,
యితరులను
నొప్పించకుండా
నీవూ
పతనము
కాకుండా,
యితరులు
కూడను
పతనము
కానీయకుండా
చూచుకొనే
మార్గాన్ని
మనము
వెతకాలి.
కనుకనే
‘త్రోవ
వెతుకుకొనుట
దొడ్డ
బుద్ధి’
అన్నాడు
ప్రహ్లాదుడు.
ఏ
త్రోవ
వెతుక్కోటం.
క్రొత్తగా
మనం
వెతకనక్కర
లేదు.
వచ్చిన
త్రోవ
వెతుక్కోటమే.
ఎక్కడ
నుంచి
వచ్చాము!
ఆత్మ
నుంచి
వచ్చాము.
తిరిగి
ఆ
స్థానానికి
వెళ్లాలి.
అదే
త్రోవ
మనము
చూసుకోవాలి.
కానీ
యీనాడు
వచ్చిన
స్థానము
ఒకటి.
ప్రయాణం
మరొక
స్థానానికి
పోతున్నాము.
కనుకనే
మన
జీవితం
చాలా
యిక్కట్లకు
గురైపోతున్నాది.
మనం
వచ్చిన
త్రోవను
వెతుక్కోవాలి.
ఇదే
యీనాడు
మీకిచ్చే
వుపదేశము.
ఇది
ద్వాదశాక్షర
మంత్రము.
‘త్రోవ
వెతుకు
కొనుట
దొడ్డ
బుద్ధి’
పన్నెండక్షరాలు.
ఆ
త్రోవను
వెతుక్కోండి.
ఏ
స్వామి
దయను
మీరు
దూరం
చేసుకున్నారో,
ఏ
స్వామి
ప్రేమను
మీరు
దూరం
చేసుకున్నారో,
ఏ
స్వామి
మనసును
మీరు
నొప్పించినారో
ఆ
ప్రేమను,
ఆ
దయను,
ఆ
స్థానమును
చేరటానికి
తగిన
యిదిని
మీరు
వెతుక్కోండి.
నాకెప్పుడు
unhappy
లేదు.
Always
happy.
ఐతే
యీ
పిల్లలు
యీ
విధముగా
పాడౌతున్నారే
అనే
వుద్దేశ్యంతో
బాధ
వుంటుండాది.
happy
లేని
వారికి
happy
అందించండి.
అంతేగాని
నాకోసం
నీ
happy
నాకక్కర
లేదు.
అనేకమంది
birthday
వస్తుంది.
Happy
birthday
happy
birthday
అంటుంటారు.
విదేశీయులంతా
పాపం.
నేను
చెప్తుంటాను.
I
am
always
happy.
నాకు
నీ
happy
అక్కరలేదు.
happy
లేని
వారికి
happy
నియ్యండి.
ఇప్పుడేం
చేస్తున్నారు
మీరు?
మీ
తల్లితండ్రులకు
happy
లేదు.
మీకూ
happy
లేదు.
మీ
చుట్టుపరిసరములలో
వుండేవారికి
happy
లేదు.
ఇలాంటి
జీవితాన్ని
మనం
యెందుకు
గడపాలి.
ఎక్కడికైనా
పోయి
మీరు
happyగా
వుండండి.
తల్లితండ్రులకు
happy
నివ్వండి.
ఇంతకాలము
వుండినందుకిక్కడ
యీ
ఒక్క
వుపకారమైనా
మీ
తల్లితండ్రులకు
చేయండి.
విద్యార్థులందరు
చక్కని
క్రమశిక్షణ
పాటించి
చెడ్డను
ఒప్పుకోకుండా
పెద్దలను
గౌరవిస్తూ
చిన్నలపైన
కరుణ
చూపుతూ
సరి
సమానులపైన
సరియైన
మైత్రిని
మీరు
పెంచుకోండి.
ఇదే
మైత్రి,
కరుణ,
ముదిత,
ఉపేక్ష.
ఇవి
నాలుగు
కూడను
చతుర్విధ
పురుషార్థములు.
ఈ
పురుషార్థములను
మీరు
చక్కగా
సార్థకము
గావించుకుంటే
మీ
జన్మయే
సార్థకమవుతుంది.
కానీ
మీరు
ఒకరికొకరు
సరిసమానమైన
వారితో
సమానమైన
భావాన్ని
పెంచుకోండి.
ద్వేషాలు
పెంచుకోకండి.
అసూయాభావాలు
పెంచుకోకండి.
ఆడంబరమైన
నాటకాలు
ఆడకండి.
అహంకారానికి
చోటివ్వకండి.
వినయముగా,
విధేయతగా
వుండండి.
‘విద్యా
వినయ
సంపన్నే’
వినయమనేదే
లేదు.
ప్రశాంతి
నిలయము
వచ్చినప్పుడు
మాత్రమే
దీనిని
ప్రదర్శిస్తున్నారు.
నిన్నటి
దినము
చెప్పటం
చేత
నిన్నరాత్రి
ఎట్లా
వుంది?
హాస్టలంతా
నిశ్శబ్దంగా
వుంటుండాది.
ఈ
విధమైన
పరిస్థితులు
కేవలము
ఒకటి
రెండు
దినములు
మాత్రమే.
12
▾
Meaning
Keep
మన
discipline
ఆ
విధముగా
వుండకూడదు.
నీ
నీడ
యే
విధముగా
నిన్ను
వెంటాడుతుందో
మన
discipline
మన
వెంటనే
వుంటుండాది.
మన
నీడ
వంటిదిగా
వుంటుండాలి.
ఇక్కడ
వుంటుండు.
మార్కెట్టుకు
పో.
బజారుకు
పో;
యింటికి
పో;
యింకెక్కడికైనా
పో.
నీ
shadow
నీవెంట
వస్తుంటాది
కదా!
అదేరీతిగా
యీ
discipline
వెంటనే
వుంటుండాలి.
ఇదే
సత్యమైన
discipline.
ఇప్పుడు
మీరు
ప్రకటించేదంతా
కూడను
కృత్రిమమైన
discipline.
నేను
ప్రదర్శనను
కోరటం
లేదు.
నిదర్శనను
కోరుతున్నాను.
కించిత్తైనా
సరే.
దానికి
సరియైన
విలువనిచ్చే
సారముంటుండాలి.
కనుక
మీరు
మీ
ప్రవర్తనయందు,
మీ
మాటలయందు,
మీ
చేష్టలయందు
అన్నింటియందు
కూడను
సరియైన
భావాన్ని
పెట్టుకోండి.
మీరే
బాగుపడతారు.
ఇదే
నిజమైన
చదువు.
ఈ
చదువు
లేకుండా
కేవలము
ప్రాకృతమైన
చదువులు
యెన్ని
సంపాదించుకున్నప్పటికిని,
ఎన్ని
చదివినప్పటికిని
ప్రయోజనము
లేదు.
ఏదో
ధనమును
సంపాదించవచ్చును.
ప్రాకృతమైన
అనుకూలములు
చేసుకోవచ్చును.
కానీ
మానసిక
శాంతి
ఎవరిస్తారు!
మానవునికి
శాంతి
అతి
ప్రధానమైనది.
నిత్యము
మీరు
భజనలోగాని,
యింకెక్కడగాని
చెప్తూనే
వుంటుంటారు.
‘శాంతి
శాంతి
శాంతిః’
యీ
మూడు
తూర్లు
చెప్పటంలో
వుండిన
అంతరార్థమేమిటి?
దేహరీతిగా
శాంతి,
మనోరీతిగా
శాంతి,
ఆత్మరీతిగా
శాంతి.
ఇదే
మూడు
తూర్లు
శాంతి
కావాలి.
అదికూడా
ఏరీతిగా?
అదికూడా
శాంతిగానే
వుంటుండాలి.
శాంతి
శాంతిగానే
వుంటుండాలి.
శాంతి
శాంతి
శ్శాంతిః
యిట్లు
పోవాలిగాని
శాంతి
శాంతి
శాంతి
యీ
శాంతిలో
కూడను
క్రోధము
వుంటుంటే
యిక
శాంతి
నీకెక్కడ
లభిస్తుంది.
కనుక
యీ
P.hd
పిల్లలందరు
తగిన
జాగ్రత్తను
వహించి
క్రమక్రమేణా
మీమీ
స్థానాలకు
పోవటానికి
తగిన
యేర్పాట్లు
చేసుకోండి.
దీనికి
మున్ముందు
తగిన
రీతిగా
తగిన
చర్య
రిజిష్ట్రారు,
వైస్
ఛాన్స్లర్
తీసుకోవాలి.
Previous
←
The one who sways is the jīva; the one who does not sway is God
Next
Live as an Ideal
→