Contents
Devotion & Sacred Story
Home
Library
Find
Shelf
Settings
←
Leave
Sathya Sai Speaks 1990 · Life must be bound by discipline
Tap a verse for its meaning
IAST
Telugu
Meaning
Continuous
Life must be bound by discipline
31 January 1990
1
▾
Meaning
Keep
జీవితము
నియమ
బద్ధమై
వుండాలి.
నియమమే
లేకుండిన
జీవితము
నిరర్ధకమైన
జీవితముగా
రూపొందుతుంది.
'నశ్రేయో
నియమం
వినా'
నియమమే
లేకపోతే
శ్రేయస్సు
వుండదు.
తమిళ
దేశములో
తమిళ
వేదము
తిరుక్కురళ్.
దీనిని
రచించిన
వాడు
తిరువళ్ళురు.
ఇతను
తన
జీవితములో
ఒక
విధమైన
నియమాన్ని
పాటిస్తూ
వుండే
వాడు.
ప్రతి
దినము
తాను
భుజించే
సమయములో
ఒక
చిన్న
కప్పులో
నీరు
పెట్టి
ఒక
సూదిని
ప్రక్క
పెట్టమనే
వాడు
భార్యను.
నిత్యము
భార్య
పెట్టేది.
కాని
ఒక్కదినము
కూడ
యితను
ఉపయోగించలేదు.
ఒకనాడు
యీమెకు
సందేహము
కలిగింది.
అతను
చాలా
ఆనందముగా
వున్న
సమయములో
ఏమండి
దినము
నీరు
సూది
పెట్టమంటున్నారు
ఒక్కదినమైనా
మీరు
వాడటం
చూడ
లేదు.
ఇది
పెట్టమనటంలో
కారణం
ఏమిటా
ఆయన
చెప్పాడు
నేను
భుజించే
సమయములోపల
అన్నము
మెతుకు
క్రింద
పడిపోతే
దానిని
సూదితో
యెత్తి
ఆ
నీటిలో
కడిగి
తిరిగి
దానిని
భుజించాలనే
ఉద్దేశ్యములో
నేను
ఆ
విధంగా
నియమాన్ని
పాటించుకాని
యీ
నీటికి
సూదికి
యేమాత్రము
పని
కలుగ
లేదు.
అది
నా
అదృష్టము
అన్నాడు.
అదే
విధముగా
జీవితములో
ఒక
విధమైన
నియమాన్ని
పాటించినప్పుడే
మనము
దేనిని
వ్యర్థము
గావించకుండా
పవిత్రము
గావించటానికి
అవకాశము
కలుగుతుంది.
ఐతే
యీనాటి
భక్తులు
ప్రవర్తన
దీనికి
విరుద్ధముగా
వుంది.
కేవలము
నామస్మరణ
చేస్తూ
వుంటారు.
భజన
చేస్తుంటారు.
జపము
చేస్తుంటారు.
ధ్యానము
చేస్తుంటారు.
కాని
తద్వారా
భగవంతుని
కృప
వారికి
లభించలేదని
విచారములో
వుంటారు.
దీనికి
చక్కని
ఉదాహరణము
రామాయణములో
వుంది.
హనుమంతుడు
లంకలో
ప్రవేశించాడు.
తానంతా
తిరిగి
తిరిగి
కట్టకడపటికి
మంచి
సౌందర్యముగా
వున్న
ఉద్యానవనములో
తులసి
వనము
చాలా
ఆకర్షణీయముగా
వుంది.
తులసి
వనము
చూసి
హనుమంతునికి
చాలా
ఆశ్చర్యము
వేసింది.
ఈ
రాక్షసులకు
తులసికి
యేమి
సంబంధము.
చిన్నరూపమును
ధరించి
ఆ
తులసి
వనములో
ప్రవేశించాడు.
ఆ
తులసి
వనములో
ప్రవేశించేటప్పటికి
ఆ
తులసి
వనములో
యెక్కడపైన
చూసినా
శ్రీరామ
శ్రీరామ
అని
రామనామము
లిఖించి
వుంది.
చూశాడు.
ఏమి
రావణుని
మాయా
లేక
నా
రామ
చంద్రుని
మహిమనా?
లంకలో
రాముని
పూజించే
వారున్నారా?
అని
ఆశ్చర్య
పడ్డాడు.
కిటికి
దగ్గరకు
పోయి
చేరాడు.
అప్పటికి
bed
room
లో
విభీషణుడు
బ్రహ్మ
ముహూర్తములో
లేవటానికి
ప్రయత్నిస్తున్నాడు.
2
▾
Meaning
Keep
తిరిగి
శ్రీరామ
శ్రీరామ
అన్నాడు.
లంకలో
రామ
భక్తులు
కూడా
వుంటున్నారా
అని
హనుమంతుడు
ఆనందముననుభవించాడు.
ఇంకా
కొంత
సేపు
అక్కడే
కూర్చున్నాడు.
లేచినాడు
విభీషణుడు.
ఈలోపల
హనుమంతుడు
లోపల
ప్రవేశించాడు.
ఈ
హనుమంతుడు
కూడను
శ్రీరామ
శ్రీరామ
అని
ప్రవేశించాడు.
ఈ
నామము
వినేటప్పటికి
విభీషణునికి
చాలా
ఆనందము
వేసింది.
అతను
రామ
అన్నాడు
ఇతను
రామా
అన్నాడు.
ప్లస్
ప్లస్
ఈ
రెండు
నామములు
చేరి
మరింత
ఆనందమయమైన
నామముగా
రూపొందింది.
అక్కడ
వారిద్దరికి
సంభాషణ
జరిగింది.
నీవెవరు
నీవెవరు
అని
ప్రశ్నించుకున్నారు.
విభీషణుడు
చెప్పాడు
నేను
రావణుని
సోదరుడను
అన్నాడు.
హనుమంతుడు
చెప్పాడు
నేను
రామదాసుడను
అని.
రామదాసు
అని
చెప్పేటప్పటికి
విభీషణునికి
ఆనందము
వేశింది.
ఇంతలోపల
హనుమంతుడు
ప్రశ్నించాడు.
నీవు
రామనామాన్ని
జపిస్తున్నావు
కాని
రామ
శబ్దాన్ని
నీవు
చక్కగా
యోచించుకున్నావా
అని
ప్రశ్నించాడు.
విభీషణుడు
నేను
ఎన్నో
సంవత్సరముల
నుంచి
రామ
నామాన్ని
జపిస్తున్నాను.
నిరంతరము
రామనామము
లేకుండా
ఏ
క్రియయందు
నేను
చేరను.
ఇది
నా
నియమము
అన్నాడు.
నాకు
యింకా
రామానుగ్రహము
లభించలేదు.
రామ
దర్శనము
కూడను
ప్రాప్తించలేదు.
అప్పుడు
చెప్పాడు
హనుమంతుడు
'రామనామాన్ని
చింతిస్తున్నావు.
రామ
నామాన్ని
జపిస్తున్నావు.
రామ
కార్యమునేమైనా
చేస్తున్నావా?
రామ
నామము
స్మరించినప్పుడు
రామకార్యము
కూడను
చెయ్యాలి.
రామనామము
పాజిటివ్.
రామకార్యము
నెగటివ్.
ఈ
రెండూ
చేరినప్పుడే
పాజిటివ్
నెగటివ్
చేరినప్పుడే
ఫలితము
వస్తుంది.
నీవు
రామ
కార్యములో
ప్రవేశించక
నామములోనే
వుంటుంటే
లభించే
ప్రాప్తి
ఏమాత్రము
వుండదన్నాడు.
కేవలము
నోటితో
రామరామ
అని
స్మరిస్తున్నావు.
నా
దేహములో
ప్రతి
రోమము
రామ
నామము
స్మరిస్తున్నది.
నామము
స్మరించినంత
మాత్రమున
కాదు.
నేను
రామ
కార్యములోపల
నిమగ్నమై
వుంటున్నాను.
కనుకనే
రామానుగ్రహమునకు
పాత్రుడనైనాను.
ఏమి
రామ
కార్యము
చేయాలని
విభీషణుడు
అడిగాడు.
నీ
ఆరాధ్య
దైవమైన
రాముని
యొక్క
పత్నిని
నీ
సోదరుడైన
రావణుడు
తెచ్చి
లంకలో
పెట్టుకున్నప్పుడు
ఆమెను
విముక్తి
గావించే
నిమిత్తమై
నీవు
ఏమైనా
చేశావా?
రామ
రామ
అని
రామనామమును
మాత్రమే
స్మరిస్తున్నావు.
రామ
పత్ని
యొక్క
బాధను
నీవేమైనా
తలంచినావా!
ఆమె
యొక్క
విషయములో
నీవు
యేమైనా
శ్రద్ధను
వహించావా?
లేక
నీ
సోదరునికి
బుద్ధి
చెప్పటానికి
పూనుకున్నావా?
ఏమి
ఉపయోగము
నీ
రామభక్తి.
రామనామము
చెప్పినంత
మాత్రమున
ప్రయోజనము
లేదు.
ఆ
నామమునకు
తగిన
క్రియను
ఆచరించాలి.
అందువల్లనే
నీకు
రామ
దర్శనము
కలుగలేదు.
చూడు
నాకు
నీకు
భేదమిది.
నీవు
తల్లి
దర్శనము
చేశావు.
3
▾
Meaning
Keep
నేను
తండ్రి
దర్శనము
చేశాను.
నేను
రాముని
దర్శించాను.
నీవు
సీతను
దర్శించావు.
నేను
సీతను
దర్శించలేదు.
నీవు
రాముని
దర్శించలేదు.
సీత
దర్శనము
నాకు
చేయించు
రామ
దర్శనము
నీకు
చేయిస్తాను
అన్నాడు.
తల్లి
తండ్రుల
దర్శనము
మనకు
లభిస్తుంది.
ఈ
తల్లి
తండ్రుల
యొక్క
దర్శనము
మనము
పొందిన
తరువాత
దైవానుగ్రహము
మనకు
సులభంగా
లభిస్తుంది.
విభీషణా
'నా
తల్లి
ఎక్కడ
వుందో
చూపు'.
అప్పటి
నుండి
విభీషణుడు
రామకార్యములో
పాల్గొన్నాడు.
అప్పటినుండే
రావణునికి
బుద్ధి
చెప్పటానికి
పూనుకున్నాడు.
సీత
దగ్గర
…ent
గా
వుండటానికి
విభీషణుని
భార్య
సరమను
వుంచాడు.
తన
బిడ్డ
త్రిజటను
సీత
సేవలో
వుంచాడు.
ఈ
విధముగా
తన
భార్యను
బిడ్డను
సీతాసేవలో
వుంచి
రావణునికి
బుద్ధి
చెప్పి
అనేకరకములుగా
రావణునిలో
ద్వేషము
పెంచుకున్నాడు.
రామకార్యములో
అప్పటినుండే
పాల్గొన్నాడు.
రామనామము
చేసి
రామకార్యములో
పాల్గొనకపోతే
యీ
రామ
నామము
అనేది
టేపురికార్డు
గ్రామఫోను
మాదిరి
వుంటుంది.
కనుక
భగవంతుని
నామముతోబాటు
భగవంతుని
కార్యములో
కూడను
మనము
పాల్గొనాలి.
కార్యమును
ఆచరించక
కేవలము
నామము
వుచ్ఛరించినంత
మాత్రమున
మనకు
ఏమాత్రము
ప్రయోజనము
లేదు.
ఇంద్రియములు
చాలా
బలమైనవి.
మరొక
ఉదాహరణ
కూడా
వుంటున్నది.
మన
దేహమంతా
దివ్యత్వమైన
ఆత్మ
తత్వముతో
నిండి
వుంటున్నది.
ఇది
ఎట్లా
అంటే
దీనికి
మహాభారతమే
ప్రమాణము.
ఈ
మహాభారతము
లోపల
భగవద్గీత
నాభిగా
నిల్చింది.
దీనికి
మూల
కారణము
భౌతికంగా
విచారించినప్పుడు
మనదేహము
సత్యధర్మ
స్వరూపుడైన
ధర్మరాజు.
ప్రకృతి
యొక్క
శక్తి
ద్రౌపది.
పవన
కుమారుడైన
భీముడు
అంతఃకరణ
యొక్క
తత్వము.
అదే
ఉచ్ఛ్వాస
నిశ్వాసములలో
కూడిన
ప్రాణము.
అర్జునుడు
మనో
బుద్ధుల
యొక్క
బలము.
నకుల
సహదేవులు
ఒకరు
కర్మేంద్రియములు
మరొకరు
జ్ఞానేంద్రియములు.
కర్మేంద్రియములు
జ్ఞానేంద్రియములు
ప్రత్యేకముగా
వున్నాయి.
మనో
బుద్ధులు
వేరైపోయినాయి.
ఇక్కడ
దివ్యశక్తి
అనేది
దూరమై
పోయింది.
కేవలము
సత్యధర్మములనే
మాటలచేత
మనము
కాలమును
వ్యర్థము
చేస్తున్నాము.
ఏనాడు
నకులుడు,
సహదేవుడు,
అర్జునుడు,
భీముడు,
ద్రౌపది
ధర్మరాజుని
అనుసరిస్తూ
పోయారో
అప్పుడే
యీ
భగవద్గీత
మనలో
ప్రారంభమవుతుంది.
మహాభారతమునకు
నాయకుడు
భగవంతుడే.
ఈ
భగవంతుడే
యీ
ఐదు
మార్గములను
ఏకత్వము
గావిస్తూ
వస్తున్నాడు.
కనుక
మనలో
సత్యధర్మములనే
ధర్మరాజు
వున్నాడు.
ఆత్మశక్తి
అనే
ద్రౌపది
కూడా
మనలోనే
వుంటున్నది.
4
▾
Meaning
Keep
ప్రాణమనే
భీముడు
మనలోనే
వుంటున్నాడు.
మనోబుద్ధులనే
అర్జునుడు
మనలోనే
వుంటున్నాడు.
కర్మేంద్రియ
జ్ఞానేంద్రియములనే
నకుల
సహదేవులు
వుంటున్నారు.
కర్మేంద్రియ
జ్ఞానేంద్రియములు
అంతఃకరణ
మనో
బుద్ధులు.
వీటిని
ఏకం
చేసి
ఆత్మవైపున
ధర్మస్వరూపుడైన
భగవంతుడుపైన
మరల్చినదే
కృష్ణ
సాక్షాత్కారము.
ఇది
మానవుని
ప్రధానమైన
నియమము.
ఈనాడు
ఇన్నింటి
యేకత్వమునకు
మనము
ప్రయత్నము
చేయటం
లేదు.
అన్ని
భిన్నత్వంగా
భిన్నత్వంగా
మనము
విభాగము
చేస్తున్నాము.
అందువలనే
మానవత్వములో
దివ్యత్వమనేది
కనుపించటంలేదు.
దేవుడు
దేవుడని
మనము
భగవంతుని
భక్తులని
భావిస్తున్నాము
కాని
భగవంతునికి
ప్రీతికరమైన
కర్మలు
మనము
ఏమి
చేస్తున్నాము.
భగవంతుని
ఆజ్ఞను
మనము
యేమి
అనుసరిస్తున్నాము?
దేనిని
అనుసరించటం
లేదు.
ఈ
ప్రేమ
తత్వాన్ని
మనము
యేమాత్రము
విచారించటం
లేదు.
భక్తులు
భక్తుల
మని
అనుకుంటున్నాము.
అనుకున్నంత
మాత్రమున
ప్రయోజనము
లేదు.
అనుకున్న
భావమును
ఆచరణలో
వుంచాలి.
ఆచరణ
లేకపోతే
అంతా
వ్యర్థమై
పోతుంది.
మనము
క్రియారూపములో
ప్రవేశపెట్టాలి.
తద్వారా
దాని
మాధుర్యము
పొందటానికి
అర్హులమవుతాము.
చేతిలో
చెరకు
పట్టుకొని
where
is
sugar
అంటే
ఎక్కడలభిస్తుంది.
ఆ
చెరకును
తీసుకొని
చక్కగా
రసము
తీసి
బాగా
అగ్నిలో
వేసి
పాకము
చేసినప్పుడు
ఇది
sugar
గా
మనకు
తయారౌతుంది.
ఇప్పుడు
మనము
చేసే
నామస్మరణ
ఎట్లా
వుందంటే
పిలచి
అడుగ
నీకు
పెట్టునా
బెల్లంబు
పిప్పిగొట్టి
రసము
పీల్చకున్న
జాతి
వజ్రమైన
సానబెట్ట
వలెను.
అదే
విధముగనే
చెరకు
బెల్లం
పెట్టమంటే
పెట్టదు.
అది
బాగా
రసం
చేసి
పిప్పి
చెయ్యాలి.
నీ
హృదయం
నుంచి
భగవ
దనుగ్రహమనే
ఆనందము
నీవు
పొందాలంటే
నాకు
కావాలి
ఆనందము
నాకు
కావాలి
ఆనందము
అంటే
రాదు.
హృదయాన్ని
చక్కగా
మథనం
చెయ్యాలి.
అప్పుడే
అందులోంచి
దివ్యమైన
భావమనే
రసము
మనలో
ఆవిర్భవిస్తుంది.
అదే
'రసోవైసః'
ఈ
రసము
ఎక్కడ
వుంటున్నది?
మనలో
రసస్వరూపుడైన
భగవంతుడు
ఒకడు
వుంటున్నాడు.
అతనికే
అంగీరస
అని
పేరు.
ప్రతి
అంగమునందు
రసస్వరూపుడై
వున్నాడు.
కనుక
దేహమునందు
ప్రతి
అంగమునందు
వుండిన
ఆ
రసము
చక్కగా
మథనము
చేసి
దానిని
మనము
ఆనందమయముగా
మార్చుకోవాలి.
మనో
దేహ
బుద్ధులనంతా
మనము
చక్కగా
మననము
చెయ్యాలి.
ఈనాడు
కాలు
కదల
కూడదు.
గడప
కదలకూడదు.
నయాపైస
ఖర్చు
కాకూడదు.
కైవల్యము
పుట్టి
వడిలో
…వాలి.
5
▾
Meaning
Keep
అది
మన
ఆశ.
ఎట్లా
లభిస్తుంది.
మనం
ఏమి
చేస్తున్నాం.
దీనికి
తగిన
ఫలమును
ఏమి
పొందుతున్నాం.
ఏ
కార్యములో
మనం
పాల్గొంటున్నాం.
మనము
నామస్మరణతో
బాటు
కార్యములో
కూడను
ప్రవేశించాలి.
అదే
మన
నియమము.
ఈ
రెండింటియందు
భిన్నత్వము
చూడకూడదు.
నెగటివ్,
పాజిటివ్
యీ
రెండింటి
యొక్క
ఏకత్వముగా
మనము
అనుభవించాలి.
కనుకనే
ప్రతివిషయానికి
ఒక
నియమమనేది
వుండాలి.
ఎలాంటి
పరిస్థితిలో
గాని
ఆ
నియమాన్ని
మనం
వుల్లంఘించరాదు.
ఎన్నో
అడ్డాలు
మనకు
రావచ్చు.
ఎన్నో
విధములైన
ఆటంకములు
మనము
ఎదుర్కొనవలసి
వస్తుంది.
అప్పుడే
దీనికి
మనము
అర్హులమవుతాము.
ఏమిటి
ఆ
నియమములు.
చెప్పిన
మాటను
నడుచుకోటం,
యిచ్చిన
మాటను
కాపాడుకోటం
మనము
భగవంతునికి
ఎన్ని
యిచ్చినాగాని
ఋణము
తీరదు.
కరియప్ప
చెప్పాడు
ఎంత
చేసినాగాని
యీ
కృతజ్ఞత
చెల్లదు
అని.
కాని
హృదయపూర్వకముగా
చేసే
ఒకటి
చేసినా
చాలు.
ఏ
దోక్రిందపడిన
వస్తువు
తీసి
యిస్తే
thanks
అంటాము.
దప్పిక
అవుతే
ఒక
టంబ్లరు
నీరు
యిస్తే
thanks
అంటాము.
చిన్న
పనులకంతా
మనము
thanks
చెబుతున్నాము.
పంచభూతముల
నందించి,
పంచకోశముల
నిచ్చి
పంచప్రాణాలనిచ్చి,
యీ
ప్రాపంచిక
సంబంధమైన
సర్వవిధములైన
సుఖసంతోషముల
నందించి
నీ
గాలి
నీతిండి
అన్నింటిని
అందించిన
భగవంతునికి
నీవు
యే
కృతజ్ఞత
చూపిస్తున్నావు.
నీవు
ప్రాపంచికంగా
ఎక్కడో
వుండిన
పోల్
నుండి
నీయింటికి
కరెంటు
తీసుకుంటే
నీవు
దానికి
tax
కడుతున్నావు.
ఎక్కడో
బజారులో
పోతున్న
pipe
నుండి
water
తీసుకుంటే
water
tax
కడుతున్నావు.
డ్రైనేజి
వుపయోగించుకుంటే
tax
కడుతున్నావు.
నీవు
ఒక
fan
పెట్టుకొని
కరెంటు
వుపయోగపెడితే
యిన్ని
యూనిట్లు
అని
ఖర్చవుతుంది.
నీ
fan
limit
గానే
వుంటున్నది.
కరెంటు
limit
గానే
వుంటున్నది.
కాని
భగవంతుడు
యిచ్చిన
గాలి
ఎన్ని
fans
కు
సమానమవుతుంది.
ఎన్ని
పంపుసెట్టులు
పెట్టి
కొట్టినా
ఒక్కతూరి
కుంభవర్షము
కురిసినప్పుడు
లభించినంత
నీరు
లభిస్తుందా!
కనుక
యింత
నీరు
యింత
గాలి
ఏదో
రూములో
లైటు
పెట్టుకుంటే
రూములోనే
లైటు
వుంటుంది.
కాని
ప్రపంచానికంతా
లైటు
యిస్తున్నాడు
సూర్యుడు.
దీనికి
ఏమి
tax
కడుతున్నావు.
లైటు
ఫ్రీ.
గాలి
ఫ్రీ,
వాటర్
ఫ్రీ
అనే
యింత
free
గా
యిచ్చినప్పుడు
నీవు
భగవంతునికి
యేమి
యిస్తున్నావు.
ఆ
మాత్రం
మనకు
gratitude
లేకపోతే
యింక
మనము
మానవుడని
ఎట్లా
చెప్పుకోవాలి.
ప్రాపంచికంగా
యింత
విద్య
చెప్పించి
బట్టలు
యిచ్చి
అన్నము
పెట్టి
యిన్ని
చేసినందుకే
gratitude
లేదు.
యింక
యింత
చేసినందుకు
gratitude
ఎందుకు
వస్తుంది.
మొట్టమొదట
విద్యార్థులకు
gratitude
అనే
నియమము
వుండాలి.
ఈ
యొక్క
నియమాన్ని
మీరు
పాటిస్తూ
పోతే
అభివృద్ధిలోకి
వస్తారు.
కాని
ప్రత్యేకమైన
ప్రధానమైన
…
gratitude
లేదు.
6
▾
Meaning
Keep
gratitude
లేక
యేమాత్రము
మానవత్వము
కాదు.
హనుమంతుడు
కూడను
అదే
చెప్పాడు.
భగవత్కార్యములో
ఎన్ని
అడ్డులు
తగిలినప్పటికిని
…
తుచ్ఛముగా
మనము
భావించాలి.
రామాజ్ఞను
తీసుకొని
వానరులందరి
అనుమతి
పొంది
సముద్రము
…నే
శ్రీరామచంద్రునికి
నమస్కారము
చేసి
పర్వతము
నెక్కి
సముద్రముపైన
ఎగిరినాడు.
రామనామముతోబాటు
రామకార్యములో
కూడ
దుమికాడు.
కొంచెము
దూరము
పోయేటప్పటికే
ఒక
పర్వతము
అడ్డు
వచ్చింది.
అది
మైనాక
పర్వతము.
ఆ
పర్వతము
ఎవరు?
హనుమంతుని
తండ్రియైన
వాయువు
పర్వతమును
రక్షించే
నిమిత్తము
దానిని
విసిరినాడు
సముద్రములోనికి.
అన్ని
పర్వతములు
నశించినాయి
గాని
మైనాక
పర్వతము
నశించలేదు.
అందువల్ల
ఆ
మైనాక
పర్వతము
నేను
తండ్రికి
gratitude
చెప్పటానికి
వీలు
లేకపోయింది.
ఆ
తండ్రి
కుమారునకైనా
కృతజ్ఞత
నందించుకోవాలని.
అవకాశము
లభించిందని
ఆ
పర్వతము
పైకివచ్చింది.
రెండు
చేతులు
జోడించి
ఓ
హనుమ!
మీరు
రామకార్యములో
నిమగ్నమైనారు.
కొంత
సేపు
నాపైన
విశ్రాంతి
తీసుకొని
సముద్రములో
ఎక్కడ
విశ్రాంతి
తీసుకోటానికి
వీలవుతుంది,
కనుకనే
నేను
లోపలనుంచి
వచ్చాను
నా
కొండపైన
విశ్రాంతి
తీసుకొని
మంచి
ఫలము
లు
భుజించి
తదుపరి
నీవు
లంకా
ప్రయాణము
సల్పుమన్నాడు.
అప్పుడు
హనుమంతుడు
చెప్పాడు
రామాజ్ఞను
నేను
శిరసా
వహించాను.
రామ
కార్యము
పూర్తి
గావించే
వరకు
నాకు
శాంతిగాని
విశ్రాంతిగాని
అక్కర
లేదు.
కనుక
నన్ను
వదలిపెట్టమని
చెప్పాడు.
రామ
కార్యము
నాకు
ముఖ్యము.
నా
దేహ
విశ్రాంతి
నాకవసరము
లేదు.
రామునకు
అర్పితము
చేశాను
యీ
దేహమును.
కనుక
తిరిగి
సీతాన్వేషణ
సలిపిన
తరువాత
ఆనందముతో
వచ్చి
నీతో
విశ్రాంతి
తీసుకుంటాను
గాని
యిప్పుడు
నా
కార్యమునకు
అడ్డు
తగల
వద్దని
నమస్కారము
చేశాడు.
ఆ
తరువాత
నీవు
రామకార్యములో
నిమగ్నమైనావు
కనుక
నేను
ఏమాత్రము
ఆటంకము
చెప్పనని
ఆ
మైనాకము
కూడను
నమస్కరించింది.
భగవత్కార్యమునకు
నేను
యేమాత్రము
అడ్డు
తగలను.
తిరిగి
తాను
వెడుతుంటే
సింహిక
అనే
రాక్షసి
మరొకటి
వచ్చింది.
వచ్చి
ఏమంది?
అతన్ని
ఆశ్రయించి
మంచి
మాటల
చేత
'హే
హనుమ
నేడు
నీవు
నాకు
ఆహారముగా
కావాలి'.
హనుమంతుడు
యేమాత్రము
భయపడలేదు.
'నన్ను
ఆహారముగా
వినియోగించుకొనుటలో
నాకు
ఎట్టి
అభ్యంతరము
లేదు.
కాని
ఒకటి
నేను
రామ
కార్యార్థమై
ప్రయాణమై
పోతున్నాను.
సీతాన్వేషణ
సల్పి
రామునికి
అప్పజెప్పి
తరువాత
తనకు
ఆహారముగా
వస్తానన్నాడు.
నన్ను
యిప్పుడు
వదలమన్నాడు.
సింహిక
చెప్పింది,
ఇది
ఏమిటి
నాకు
ఆకలివేసినప్పుడు
నీవు
ఆహారంగా
కాకుండా
సీతను
చూడటమంటు,
తిరిగి
యీ
వార్తను
రామునకందించి
తరువాత
నీవు
వచ్చేటప్పటికి
నేను
ఆకలికి
ఎట్లా
తట్టు…ను.
7
▾
Meaning
Keep
నేను
ఒప్పుకోనంది.
ఇది
నన్ను
మోసగించే
మాటలంది.
ఛీ
నేను
మోసగాడినా.
రామనామము…
లీనమైనప్పుడు
యింతకంటె
పాపము
లేదని
హనుమంతుడు
చాలా
బాధపడ్డాడు.
భగవంతుడు
…లో
వున్నాడు
అనే
వానికి
మోసమనేది
వుండదు.
భగవత్కార్యములో
ప్రవేశించిన
వానికి
యే
నియమములు
అడ్డురావు.
వాడు
ప్రాణమైనా
త్యాగము
చేయటానికి
సిద్ధముగా
వుంటాడు.
అందువల్ల
హనుమంతుడు
యేమి
చెప్పాడు?
"భుజించమన్నాడు.
భుజించమని
పెద్ద
పర్వతము
వలె
తన
యొక్క
శరీరమును
పెంచుకున్నాడు.
ఈ
సింహిక
అంతకంటె
యింకా
పెద్ద
దేహాన్ని
పెంచింది.
ఈ
పెద్ద
శరీరము
పెంచేసరికి
నేను
ఆహారముగా
నీలో
చేరలేనని
మాట
యిచ్చాడు.
కనుక
యీ
promise
దక్కించుకోవాలి.
అని
హనుమంతుడు
చిన్న
రూపము
చేసి
ఆ
సింహికలో
చేరి
మరి
బయటకు
వచ్చేశాడు.
నేను
ఆహారముగా
వచ్చేశాను.
నీవు
నన్ను
భుజించలేదు.
నా
బాధ్యత
తీరిపోయింది.
తిరిగి
దానిని
లెక్క
చేయకుండా
ప్రయాణము
చేస్తూ
వచ్చాడు.
లక్ష్యమంతా
రామ
కార్యముపైనే
వుంటుంది.
కోటదగ్గరకు
చేరాడు.
అక్కడ
లంకి…
వుంటున్నాది.
ఈ
లంకిణిని
చూచేటప్పటికి
హనుమంతుడు
యిక్కడ
కాపలా
వాళ్లు
వుంటున్నారు
అనుకున్నాడు.
చిన్న
రూపమును
ధరించి
కోటపైన
ఎగిరాడు.
అక్కడనుంచి
తిరిగి
లోపలకు
పోవటానికి.
అక్కడ
లంకిణి
చూచింది.
ఓ
కోతీ
దొంగా
నను
చూసి
పోతున్నావా?
దొంగలంది.
దాంతో
హనుమంతునికి
చాలా
కోపం
వచ్చేసింది.
చాలా
కష్టపడ్డాడు.
సింహిక
చెప్పింది
నీవు
మోసం
చేయటానికి
వస్తున్నావని.
లంకిణి
నీవు
దొంగా
అంటున్నాది.
ఛా!
నేను
రామ
భక్తుడను.
నేను
రామదాసుడను.
నేను
దొంగను
కాదు.
ఒక్కొక్క
పదానికి
కూడను
ఎంతెంత
విలువనిస్తూ
వచ్చాడో
హనుమంతుడు
కోపం
వచ్చి
లంకిణి
దగ్గరకు
వచ్చాడు.
ఎవరు
దొంగ
నేనా
నీరాజా?
ఎవరు
లేని
సమయం
చూచుకొని
సీతను
దొంగతనంగా
తెచ్చుకున్నాడు.
దొంగను
చంపే
కోసం
వచ్చాను
నేను
అన్నాడు.
నేను
దొంగను
కాను
అట్లా
తన
సత్యాన్ని
నిరూపించుకుంటూనే
వచ్చాడు.
ఆమెతో
పోరాడాడు.
రామా
అని
ఒక్కతూరి
…
గుండుపైన
కొట్టాడు.
లంకిణి
క్రిందపడిపోయింది.
అప్పుడు
లంకిణి
క్రిందపడిపోయింది.
అప్పుడు
లంకిణి
చెప్పింది.
నేను
బ్రహ్మ
సమావేశము
లోపల
ప్రవేశించాను.
మేము
మా
రాజు
ప్రాణము
ఎప్పుడు
పోతుందని
ప్రార్థించాము.
అప్పుడు
బ్రహ్మ
చెప్పాడు,
మీ
లంకకు
ఒక
కోతి
ప్రవేశిస్తుంది.
అతను
నిన్ను
ఒక్క
వేటులో
చంపుతాడు.
ఆ
కోతి
వల్లనే
అంతా
భస్మమై
పోతుంది.
కనుక
అప్పుడే
రావణుని
మరణము
ప్రారంభమవుతుంది.
ఈనాడు
సత్యము
నాకు
బోధపడుతున్నాది.
నీ
చేతిలో
నేను
దెబ్బలు
తిని
నా
ప్రాణం
వదలటం
యింతకంటె
నాకు
భాగ్యమేమి
అని
హనుమంతుని
కాళ్లు
గట్టిగా
పట్టుకొంది.
అది.
రావణుని
అంత్యము
ప్రారంభమైంది.
కనుక
బ్రహ్మ
వాక్యము
ఏనాటికి
తప్పదు.
8
▾
Meaning
Keep
బ్రహ్మవాక్యము
యేనాటికి
రాక్షసులకైనా
సరే
దేవతలకైనా
సరే
సత్యవాక్కును
చాటుతూ
వచ్చాడు
హనుమంతుడు.
నేడు
కాకపోయినా
రేపటికి
తప్పదు.
కనుక
భగవత్కార్యముల
లోపల
ఒక
నియమాన్ని
పూనాలి.
ఈ
నియమము
లేక
మనము
యే
కార్యమును
సాధించలేము.
ప్రతి
వయస్సునందు,
బాల్యమునందును,
యవ్వనమునందు,
కౌమారమందు,
వార్ధక్యమందు
ఒక
విధమైన
నియమమును
పెట్టుకోవాలి.
విద్యార్థులు
ముఖ్యముగా
కృతజ్ఞతను
పెట్టుకోవాలి.
ఈ
కృతజ్ఞత
లేకపోతే
క్రూరమృగము
కంటె
హీనమై
పోతుంది
మన
బ్రతుకు.
భగవత్
నామముతో
బాటు
భగవత్
కార్యములో
మనము
ప్రవేశించాలి.
కనుక
భగవత్
నామము,
భగవత్
కార్యము
రెండింటి
యొక్క
ఏకత్వము
మానవుని
నిజమైన
దివ్యత్వము.
హనుమంతుడు
నామస్మరణ
చేస్తున్నాడు.
నామము
చాలని
వూరుకున్నాడా
లేదే.
ఇరవై
నాలుగు
గంటలు
రామసేవ
చెయ్యాలి.
రామసేవ
తప్ప
అన్యసేవ
అతనికి
అక్కరలేదు.
ఆ
సేవ
ఒక్కదినమైనా
లేక
తాను
వుండలేదు.
నామములోనే
తృప్తి
కాలేదు.
రామనామ
నామి
యొక్క
ఏకత్వము
అతనికి
నిరూపిస్తూ
వచ్చాడు
హనుమంతుడు.
నామము
చక్కెర.
కార్యము
జలము.
కార్యమంటే
కదలిపోయ
జలమని.
జలమెంతైనా
నీవు
త్రాగలేవు.
చక్కెర
ఎంతైనా
నీవు
తినలేవు.
చక్కెర
జలము
కలిపి
పానకము
ఆనందముగా
త్రాగ
వచ్చు.
ఈ
రెండింటి
యొక్క
ఏకత్వము
ఒక
సిరప్.
అదే
రామ
రసము.
అదే
దివ్యరసము.
అదే
బ్రహ్మరసము.
రామనామము,
రామసేవ
యీ
రెండింటిలో
మనం
పాల్గొనాలి.
విభీషణునిలో
రామ
నామస్మరణ
చేసినంత
మాత్రమున
లాభము
లేదు.
రామ
సేవలో
పాల్గొనమని
హనుమంతుడు
అతన్ని
ప్రవేశపెట్టాడు.
రామ
సేవలో
పాల్గొనటం
చేతనే
విభీషణుడు
తిరిగి
రామసన్నిధిని
పొందగలిగాడు.
పరుగెత్తి
వచ్చాడు
రాముని
దగ్గరకు.
చూస్తున్నారు
వానరులంతా.
తిరిగి
హనుమంతుడు
యేమైనా
వస్తున్నాడేమో
అనుకున్నారు.
కాదు
రాక్షసుడు.
వచ్చి
దిగాడు.
ఇతనిని
రాముని
దగ్గరకు
పోనీయక
చాలామంది
వానరులు
అడ్డుపెట్టారు.
అప్పుడు
తిరిగి
రామరామ
అని
ఆర్తిగా
పిలిచాడు.
సుగ్రీవుని
పంపించాడు
అతని
వార్త
తెలుసుకు
రమ్మని.
సుగ్రీవుడు
ఆవృత్త
సమాచారము,
రావటానికి
తగిన
కారణము
అతను
ఎవరు
ఏమి
అన్ని
వివరాలు
గ్రహించుకు
వచ్చాడు.
చెప్పాడు
సుగ్రీవుడు
రామా
రావణుని
సోదరుడట.
అతని
పేరు
విభీషణుడు.
అతను
నీ
శరణార్థియై
వచ్చాడు.
కాని
యివి
నమ్మదగిన
మాటలు
కావు.
రాక్షసుడు
ఏమిటి
శరణాగతి
కావటమేమిటి?
గుడ్లగూబ
ఏమైనా
పగలు
చూస్తుందా?
రాత్రి
పూటనే
దానికి
కళ్లు
కనబడతాయి.
పగలు
కనుపించుతాయా?
కాబట్టి
రాక్షసులనేవారు
గుడ్లగూబలు.
చీకటి
యిష్టముగాని
వెలుతురు
యేమాత్రము
యిష్టముండదు.
9
▾
Meaning
Keep
అలాంటి
వానికి
నీవు
శరణాగతికి
వప్పుకొన
కూడదు.
జాంబవంతుని
పిలిచాడు
రాముడు.
'ఏమి
జాంబవంతా!
నీ
సలహా
ఏమిటి?'
అడిగాడు.
'ప్రభువు
యొక్క
ఆజ్ఞ'
అన్నాడు.
ఈ
విధముగా
ఒక్కొక్కరిని
అడిగేటప్పటికి
అందరు
కూడ
అంగీకరించక
వారిని
చంపి
పంపండి
అన్నారు.
తక్షణమే
రాముడు
చెప్పాడు.
'సరి
కాదు.
రామనామాన్ని
స్మరించుకుంటూ
రామసన్నిధిని
ఆశిస్తూ
నా
యొక్క
సన్నిధే
తన
పెన్నిధిగా
భావించుకొని
నా
దగ్గరకు
వచ్చాడు.
తక్షణం
అతనిని
వదలండి'
అన్నాడు.
రామా
నీవాడను,
నీవాడను
అన్నాడు.
అప్పుడు
చెప్పాడు
'నీ
వాడని
ఒకపరి
అన,
ఎవ్వాడైన
ఏలుదు
వానిన్'.
అడిగాడు
అంగదుడు.
ఎవరు
అంగదుడు?
వాలి
కుమారుడు.
'స్వామి
యిప్పుడేమో
నేను
నీవాడని
వచ్చాడు.
నీవు
అతనిని
రక్షిస్తున్నావు.
అతనికే
లంక
యిచ్చి
రాజ్య
పట్టాభిషేకము
చేస్తానంటున్నావు.
కాని
రేపు
రావణుడే
వచ్చి
నీ
పాదములపైన
బడి
నేను
నీవాడు
స్వామి
అంటే
రావణునికి
ఏమి
యిస్తావు'
అన్నాడు.
'రావణుడు
వచ్చి
నేను
నీవాడనంటే
అప్పుడు
రావణునకు
ఏ
రాజ్యమిస్తావు?
నిజంగా
రావణుడే
వచ్చి
నేను
నీవాడు
స్వామి
అంటే
నేను
భరతుని
చేతులు
పట్టుకొని
అయోధ్యను
రాజుగా
చేస్తాను
రావణుని
అన్నాడు.
కనుక
నీవాడని
ఒక్కతూరి
అంటే
చాలు
వానికి
ఎంతైనా
కూడను
అందించాలని
సిద్ధముగా
వుంటాడు
భగవంతుడు
ఇంతకాలము
స్మరణ
చేశాడు.
ఈనాడు
అతనికి
శరణాగతికి
వస్తున్నాడు
విభీషణుడు.
యుద్ధము
లోపల
యీ
సీత
కోసం
కదా
నీవు
పోరాడుతున్నావని
యీ
సీతను
ముక్కలు
చేస్తానని
యుద్ధ
భూమిలోనే
ముక్కలు
చేసి
ముక్కలు
ముక్కలు
చేసి
పారవేశాడు.
లక్ష్మణుడు,
రాముడు
చూచారు.
అయ్యో
సీత
పోయిందే
ముక్కలు
ముక్కలు
చేశాడే
అనుకున్నారు.
అప్పుడు
విభీషణుడు
చెప్పాడు.
'సీతను
ముట్టటానికి
వానికి
ఏమి
అధికారమున్నది.
ఆమెను
చంపటానికి
కూడను
అధికారము
లేదు.
ఆమె
జగన్మాత.
అది
రాక్షస
మాయ.
ఈ
విధముగా
రాముని
సన్నిధిలో
వుంటుండి
రావణుని
రాక్షస
మాయలు
బోధిస్తు
చెప్తుతూ
దానిని
ఎదుర్కొంటూ
వచ్చాడు.
అదే
రామ
కార్యములో
పాల్గొనటం.
రావణుడు
చేసే
ఫిట్లు
అన్నీ
రామునకు
ఫిట్లు
అని
చెప్పుకుంటూ
వచ్చాడు.
సత్యమును
చెప్పుతూ
వచ్చాడు.
నాకింక
సోదరులు
లేరు.
దేహము
అనిత్యము.
అస్థిరము.
నేను
నీవాడను
జీవితమంతా
నీవాడనే.
ఈ
విధముగా
ప్రతి
సాధకుని
హనుమంతుడు
ప్రో…కుంటూ
వచ్చాడు.
రామరామ
అంటున్నావు.
ఈ
రామనామ
సారము
నీకు
యేమి
అర్థమవుతుంది
ఏమి
అర్థము
కాదు.
రామకార్యములో
పాల్గొను.
వానరులనందరిని
రామకార్యములో
చేర్చాడు.
ఎలాంటి
వాడు
జాంబవంతుడు?
రామనామము
చేస్తున్నాడు.
రామకార్యములో
పాల్గొన్నాడు.
జాంబవంతునికి
116
సంవత్సరములు.
ఆ
కాలమానానికి
లెక్కవేస్తే
జాంబవంతునికి
5000
సంవత్సరములు.
10
▾
Meaning
Keep
మనం
యిరవై
సంవత్సరములకే
తాత
అయిపోతున్నాం.
కారణం
ఏమిటి?
భగవత్
నామములో,
భగవత్
కార్యములో
దానిని
అంత్యము
గావించుకున్నాడు.
ఆ
నామమే
వానికి
ఆయువు
నిస్తూ
వచ్చింది.
అలాంటి
వారినందరిని
రామసేవలో
నిమగ్నము
గావించాడు.
ఈనాడు
మనకు
దృఢమైన
భక్తి
లేదు
యితరులకు
ఏమి
చెప్పుతాం.
యింకా
పని
పోని
మాటలు
చెప్ప
వుండే
…టలుండగాను
పని
చేస్తాము.
కనుక
మానవుల
కంటె
వానరులే
ఎంతో
గొప్పవారు.
ఇప్పుడు
కూడా
అంతే.
చిన్న
ఉదాహరణ
చూడండి.
చిన్న
బిడ్డ
వచ్చేసింది
సాయిగీత
మన
ప్రశాంతినిలయానికి.
…రులో
తీసుకు
వచ్చారు.
పదకొండు
దినములై
పుట్టి.
అప్పటినుండి
నాదగ్గరే
వుండేది.
అప్పటి
నుండి
జబ్బు
చేయలేదు
తనకు.
మన
రోడ్డు
లోపల
వేర
కార్లు
వస్తుంటాయి
పోతుంటాయి.
కాని
బెంగుళూరు
నుండి
నా
కారు
వస్తుందంటే
బంధము
తెంపుకొని
రోడ్డు
మీదకు
వస్తుంది.
అది
విశ్వాసము.
అరుస్తూ
వుంటుంది.
ఎంతమందికో
తెలుసు.
కారు
వస్తుంటే
అరుస్తుంది.
కారణం
ఏమిటి
కృతజ్ఞత.
దానికి
వుంది.
ఇంతే
కాదు.
15
సంవత్సరముల
క్రిందట
మద్రాసు
గవర్నరు
రెండు
జింకలు
పంపించాడు
భార్యభర్తలు.
మొట్టమొదట
యిక్కడే
వుంటుండేవి.
వాటి
సంతతే
యివన్నీ.
20
సంవత్సరములు
ఆ
జింకకు.
మొన్న
మధ్యాహ్నం
మీరు
ఎవ్వరూ
లేరు.
అక్కడకు
వెళ్లాను.
ఎప్పుడు
వెళ్లినా
అదే
ముందు
వచ్చేది
నాదగ్గరకు.
చాలా
old
deer.
మధ్యాహ్నం
అరటిపండ్లు,
ఏపిల్సు
దానికి
బాగా
తినిపించాను.
తినే
సమయంలో
అది
ఏడ్చింది.
నా
కాళ్లను
నాకింది.
మరి
పదినిముషాలో
చచ్చిపోయింది.
చూశారా!
దానికి
తగినట్లుగా
నేను.
అన్నం
తినేసి
తిరిగి
క్రిందకు
ఎప్పుడు
దిగను.
నిన్న
మధ్యాహ్నం
కాలేజి
వెనుకే
గొయ్యి
తీయించి
సమాధి
కట్టించాను.
ఏ
జబ్బు
లేదు.
నేను
పిలిచేటప్పటికి
దగ్గరకు
వచ్చింది
పాపం.
పండు
తినింది.
ఏపిల్
తినింది.
అరటిపండు
తినింది.
తినే
సమయంలో
ఏడ్చింది.
నేను
ముఖం
తుడిచాను.
మింగింది
కాళ్లు
నాకింది.
మృగానికి
ఎంత
కృతజ్ఞత.
మనుష్యులకు
లేదు.
ఈనాడు
చదువులు,
తెలివితేటలు
పెరిగిపోవటం
వలన
స…ము
కరిగిపోతూ
వస్తుంది.
తెలివితేటలు
పెరిగి
మానవత్వము
తరిగిపోయింది.
మానవత్వమంత
కేవలము
పశుత్వములో
చేరిపోయింది.
పశుత్వము
మానవునిలో
ప్రవేశించింది.
కనుక
మీరు
కూడను
తగిన
గుణము
పెంచుకొండి.
Previous
←
The end of Education is Character
Next
Love All and Serve All
→