Contents
Devotion & Sacred Story
Home
Library
Find
Shelf
Settings
←
Leave
Sathya Sai Speaks 1990 · What Is Freedom?
Tap a verse for its meaning
IAST
Telugu
Meaning
Continuous
What Is Freedom?
31 May 1990, Summer Course 1990, Brindavan
1
▾
Meaning
Keep
His poems 17
Also in his talks
(3)
2 June 1973
Vairāgya from Moha, and Serenity of Mind
26 June 1988
Excessive desire is the loss of reason; measured desire is great ease
10 September 1996
Vairāgya Is Found Only in the Presence of God
తామరాకుపై
తళతళలాడే
నీటి
బొట్టువలె
నిలకడ
లేనిది
బ్రతుకభిమానపు
పొరల
కొంపరా
దిగులు
దుఃఖముల
తెరరా
లోకము
హరి
గోవిందా
హరి
గోవిందా
హరి
గోవిందా
అనరా
మందా!
విద్యార్థులారా!
ఆధ్యాత్మికమంటే
ఏమిటో,
వ్యక్తిగతమైన
స్వాతంత్ర్యమంటే
యేమిటో
యీ
రెండింటి
యొక్క
యదార్థ
స్వరూపాన్ని
గుర్తించటం
సామాన్య
మానవులకు
సాధ్యము
కాదు.
ఈ
ఆధ్యాత్మికమనగా
కేవలము
వంటరితనమనిగాని,
ఏకాకి
జీవితమనిగాని
భావించరాదు.
యావత్
మానవ
జీవితము
మధ్య
ప్రేమ
బీజములు
నాటి
కాంతి
ప్రసూనములు
వికసింపజేసి
పవిత్ర
ప్రేమను
ప్రజలకు
అందించటమే
యీ
ఆధ్యాత్మికము
యొక్క
అంతరార్థము.
ఇందులో
ప్రత్యేకమైన
దివ్యత్వమునే
మనము
విచారించినప్పుడు
యిక్కడ
ఆధ్యాత్మికమునిగాని
వ్యక్తిగతమైన
స్వాతంత్ర్యమునిగాని
రెండు
లేవు.
ఇంతవరకు
జరిగిన
డిబేటులో
హృదయమంటే
ఏమిటో
వారు
గుర్తించి
వర్తించలేదు.
స్వాతంత్ర్యమనేది
వేదికపైన
తన
యొక్క
భావమును
ప్రకటించటమే
స్వాతంత్ర్యమని
భావించారు.
స్వాతంత్ర్యమన్నది
యీ
జగత్తునందు
ఎవ్వరికి
లేదు.
కాని
రాజకీయంగా
స్వాతంత్ర్యమని
ఒక
పేరు
వచ్చింది.
ఈ
స్వాతంత్ర్యమనగా
ఏమిటి?
విదేశీయుల
పరిపాలన
నుండి
వారిని
పంపి
స్వదేశీయుల
పరిపాలనను
స్వీకరించటము
స్వాతంత్ర్యమని
భావించారు.
ఇది
వ్యక్తిగతమైన
freedom
కాదు.
fundamental
స్వాతంత్ర్యము
కాదు.
కేవలము
అహంకార
తత్వమును
ప్రకటించే
నిమిత్తమై
కొన్ని
ఆచరించిన
చర్యలు
మాత్రమే.
విదేశీయులు
పోయిన
తరువాత
స్వదేశీయులు
స్వాతంత్ర్యము
పొందినారనుకున్నాము.
ఎందులో
స్వాతంత్ర్యము
పొందాము.
కేవలము
స్వాతంత్ర్యము,
స్వాతంత్ర్యము
అన్నంత
మాత్రమున
ప్రయోజనమేమి
లేదు.
ఐక్యతను
సాధించినప్పుడే
స్వాతంత్ర్యము
ప్రయోజనమవుతుంది.
ఐక్యమును
సాధించక
స్వాతంత్ర్యము
స్వాతంత్ర్యమనుకుంటే
యిది
కేవలము
పదము
యొక్క
స్వాతంత్ర్యమే
గాని
నిజ
స్వాతంత్ర్యము
కాదు.
2
▾
Meaning
Keep
స్వాతంత్ర్యమనేది
హృదయ
స్థాయి
నుండి
ఏర్పడాలి.
హృదయమంటే
ఏమిటి?
కేవలము
రక్తమాంసములతో
కూడిన
యీ
గుండె
కాదు.
హృదయమనగా
ఒక
స్థానమునకుగాని
ఒక
కాలమునకుగాని
ఒక
దేశమునకుగాని
సంబంధించినది
కాదు.
సర్వత్ర
సర్వకాలములందు
కూడను
సర్వదేశములందు
కూడను
సర్వవ్యక్తులందు
కూడను
సమత్వముగా
వుండే
దివ్యతత్వమే
హృదయము.
ఈ
హృదయమునకు
రూపము
లేదు.
కాని
మానవుని
యొక్క
దేహమునందు
దేనిని
మనము
హృదయముగా
భావిస్తున్నామో
అది
మధ్యలో
వచ్చి
మధ్యలో
పోయేది.
దేనిని
గుర్తిస్తే
సర్వమును
గుర్తించినవాడౌతాడో
అంతటి
దివ్యతత్వమును
గుర్తించటమే
నిజమైన
స్వాతంత్ర్యము.
‘యథా
అండాండే
తథా
బ్రహ్మాండే’
అన్నారు.
అండాండమనగా
వ్యక్తిగతమైనది
బ్రహ్మాండమనగా
సమిష్టిస్వరూపము.
తనను
తాను
గుర్తించుకున్న
వ్యక్తి
సర్వమును
గుర్తించగలడు.
ఐతే
తానంటె
ఎవరు?
ఈనాటి
మానవుడు
ప్రపంచములో
సర్వమును
తెలుసుకొనుటకు
ప్రయత్నిస్తున్నాడు.
సర్వము
తెలియునని
విశ్వసిస్తున్నాడు.
ఒకవేళ
తెలియకపోతే
తెలుసుకొనుటకు
ప్రయత్నిస్తున్నాడు.
కాని
మానవుడు
తానెవరో
తన
తత్వమేమిటో
తెలుసుకొనకుండా
సర్వమును
తెలుసుకొనుటకై
ప్రయత్నిస్తున్నాడు.
ఉపనిషత్తునందు
ఉద్దాలకుడనే
మహాపండితుడు
తన
కుమారుడైన
శ్వేతకేతుని
విద్యాభ్యాస
నిమిత్తమై
యింకొక
గురువు
దగ్గరకు
పంపినాడు.
పన్నెండు
సంవత్సరములు
చక్కగా
సర్వవిద్యలు
గ్రహించాడు.
కాని
అన్ని
తెలుసునని
విఱ్ఱవీగి
వెఱ్ఱివాడై
తన
తండ్రి
దగ్గరకు
వచ్చి
‘నాన్నా!
నేను
సర్వవిద్యలు
నేర్చుకున్నాను’
అన్నాడు.
అప్పుడు
నాన్న
ప్రశ్నించాడు.
‘నాయనా!
ఏమి
తెలిసిన
సర్వమునూ
తెలిసినట్లవుతుందో
దానిని
నీవేమైనా
చదువుకున్నావా’
అన్నాడు.
శ్వేతకేతుడు
కొంత
అహంకారము
నుండి
క్రింద
దిగాడు.
అన్నింటికంటె
విద్యా
అహంకారము
వెఱ్ఱితలు
వేస్తూ
వుంటుంది.
అప్పుడు
లోకజ్ఞానము
కంటె
ఆత్మజ్ఞానము
బ్రహ్మజ్ఞానము
అవసరమని
తన
కుమారుడైన
శ్వేతకేతునికి
చక్కగా
బోధించాడు.
ఒక
చిన్న
ఉదాహరణము.
ఎవరినైనా
మనము
చూచినప్పుడు
మీరెవరండి
అని
ప్రశ్నించినప్పుడు
అతను
నేనెవరో
నాకు
తెలియదంటే
మనము
ఏమని
భావిస్తాము.
అదే
విధముగనే
నీవెవరో
నీకు
తెలియనప్పుడు
యితరమైన
దానిని
గురించి
తెలుసుకొనుటకు
ప్రయత్నించినప్పుడు
నీవు
కూడ
ఆ
పిచ్చివాని
కంటె
పిచ్చివాడవు
కదా.
కనుక
మొట్టమొదట
తనను
తాను
గుర్తించుకోటానికి
ప్రయత్నించాలి.
3
▾
Meaning
Keep
లేక
దానికి
జవాబు
చెప్పవచ్చు.
ఫలాని
రామయ్యను
అని
చెప్పవచ్చు
నేను
రామయ్యను
అన్నప్పుడు
రామయ్య
దేహము
యొక్క
పేరు.
నేను
అనేది
ఎవరు?
రామయ్యకు
నేను
అనేది
ప్రత్యేకముగా
ఒకటి
వుంటున్నది
కదా.
ఆ
యొక్క
నేను
తత్వాన్ని
మాత్రము
గుర్తించాలి.
ఆ
నేను
అనేదే
హృదయము.
నేను
అనేదే
ఆత్మ.
నేను
అనేదే
బ్రహ్మము.
ఈ
హృదయము
సర్వత్ర
వుండినది.
ఒక
చిన్న
ఉదాహరణము.
ఒక
చిత్రకారుడు
ఒక
కాగితముపైన
చక్కగా
ఒక
నర్తకిని
చిత్రించాడు.
ఇక్కడ
కాలు
వంగింది
చేయి
వంగింది.
వేలు
వంగింది.
అనేక
రకములుగా
నృత్యము
చేసినట్లుగా
చిత్రించాడు
తల
తిప్పినట్లుగా
కనుపించింది.
కాలు
వంచినట్టుగా
కనుపించింది.
చేయి
వంచినట్టుగా
కనుపించింది.
వేలు
వంచినట్టుగా
కనుపించింది.
అన్ని
వంపులతోను
హెచ్చు
తగ్గులతోను
కనుపించింది
ఆ
చిత్రము.
దృశ్యమునకు
హెచ్చు
తగ్గులుగా
కనుపిస్తున్నాదిగాని
ఆ
కాగితము
మనము
తడిమి
చూస్తే
ఏ
హెచ్చు
తగ్గులు
లేవు.
కొన్ని
చిత్రముల
లోపల
పర్వతాలు
కూడను
ఎత్తుగా
తగ్గగా
పల్లముగా
యీ
విధముగా
కనుపిస్తుంటాయి.
కాని
కాగితమును
మనము
అంటి
చూస్తే
యిందులో
యేమాత్రము
హెచ్చు
పల్లములు
లేవు.
అదే
విధముగనే
యీ
హృదయమునందు
యీ
జగత్తనేది
హెచ్చు
పల్లములు,
మంచి
చెడ్డలు,
పాపపుణ్యములు
సత్యాసత్యములు,
కష్టసుఖములు
యీ
విధమైన
వ్యత్యాసములు
మనకు
కనుపిస్తూ
వుండినప్పటికిని
హృదయస్థాయి
యందు
యిందులో
యేమాత్రము
బేధములు
కనుపించవు.
ఆది
అంత్యము
లేనిది
మధ్యలో
కనుపించినప్పటికిని
అది
కూడా
లేనటువంటిదే.
ఇది
ఒక
టంబ్లరు
అంటాము.
దీనికి
రూపము
ఒకటి
నామము
ఒకటి
వుంటున్నాది.
ఇది
రూపము
టంబ్లరు
అనేది
నామము.
ఈ
రూపనామములు
తీసివేస్తే
వుండేది
ఏమిటి?
వెండి
మాత్రమే.
ఇది
టంబ్లరు
కాక
పూర్వము
వెండే.
టంబ్లరు
సమయమునందు
యిది
వెండే.
దీనిని
చెడగొట్టి
ముద్దగా
చేసినప్పుడు
అది
వెండే.
యిది
ఆది
అంత్యమునందు
వెండిగానే
వుంటున్నాది.
మధ్యలో
వచ్చినదే
యీ
రూపము.
కనుకనే
దీనికి
మిథ్యాజగత్తు
అని
పేరు
వచ్చింది.
జగత్తునందు
ఏకం
సత్.
వున్నది
ఒకటే.
రెండవది
వుంటేనే
కదా
స్వాతంత్ర్యమో
బంధనో
అనేది
కనుపిస్తుంది.
ఈ
బంధము,
స్వాతంత్ర్యము
అనేవి
మనోకల్పితాలు.
విద్యార్థులారా!
సూర్యుడు
లేనప్పుడే
చంద్రునకు
మనము
విలువ
యిస్తాము.
సూర్యుడే
వుండినప్పుడు
చంద్రుని
ఎవరు
చూడరు.
పోనీ
సూర్యుడు
లేనప్పుడు
చంద్రునికి
విలువ
యిస్తున్నామంటే
దేనివల్ల
విలువ
యిస్తున్నాము.
చంద్రుడు
స్వతః
ప్రకాశకుడు
కాదు.
4
▾
Meaning
Keep
సూర్యుని
యొక్క
కిరణములు
చంద్రుని
మీద
పడినప్పుడే
చంద్రుడు
ప్రకాశిస్తున్నాడు.
అదే
విధముగానే
మనము
ఆత్మాన్వేషణా
సమయమునందే
చంద్రుడనే
మనస్సుకు
మనము
విలువనిస్తున్నాము.
ఇదే
వేదమునందు
చంద్రమా
మనసో
జాత
చక్షోసూర్యోరజాయత
ఈ
మనస్సుకు
చంద్రునకు
వుండిన
బింబప్రతిబింబముల
సంబంధమును
వేదము
యీ
రీతిగా
నిర్ణయించింది.
కనుక
మనము
ఆత్మవిచారము
లేనంత
వరకు
కూడను
మనస్సుకే
ఎక్కువ
బలమును,
ఎక్కువ
సమయమును
ఎక్కువ
ప్రాధాన్యమును
యిస్తున్నాము.
కనుక
యీ
మనస్సనేది
స్వతసిద్ధమైన
ప్రకాశము
కాదు.
కనుక
మనస్సు
వుండిన
వానికే
స్వాతంత్ర్యము,
బంధన.
మనస్సు
వుండిన
వానికే
ఆధ్యాత్మికము,
పారమార్థికము,
లౌకికము.
మనస్సు
వుండిన
వానికే
ప్రకృతి
పరతత్వము
మనసు
వుండినవానికే
స్త్రీ
పురుషుడు
అనే
బేధభావము.
సర్వద్వందము
కూడను
యీ
మనస్సు
వలననే
యేర్పడినది.
ఈనాడు
లోకములో
స్వాతంత్ర్యము
రెండు
రకములుగా
వుంటున్నది.
ఇప్పుడు
కొంతవరకు
వాదన
జరిగింది.
ప్రభుత్వ
సంబంధమైన
స్థాయిలోపల
యిది
యీ
రీతిగా
చెయ్యాలి
యిది
యీ
రీతిగా
చెయ్యాలి
కొన్ని
కొన్ని
నిబంధనల
చేత
కొన్ని
కొన్ని
స్వాతంత్ర్యములను
అనుభవిస్తున్నాము.
దీనిని
మనము
స్వాతంత్ర్యమని
చెప్పటానికి
వీలు
లేదు.
ఇక్కడ
అంతా
కేవలము
ఒక
rules
and
regulations
అని
వుంటున్నాది.
ఇక
వ్యక్తిగతమైన
దానిని
విచారణ
చేస్తే
యిది
కూడను
స్వాతంత్ర్యము
కాదు.
ఇది
కేవలము
మానవుని
సంకల్పము
యొక్క
ప్రభావము.
ఇది
తన
మనోభీష్టములను
నెరవేర్చుకొనే
నిమిత్తమై
అనుసరించే
స్వార్థము.
అందులో
కూడను
స్వార్థము
లేదు.
ఒకడు
చాలా
బీదవాడుగా
వుంటున్నాడు.
ఆ
బీదవాడుగా
వుండినప్పుడు
వానికి
కొంత
అన్నము
కావాలి.
ఎవరిని
అడిగినా
పెట్టరు
అప్పుడు
నా
ఆకలిని
తీర్చుకొనే
నిమిత్తము
దొంగతనము
చేస్తాను
నాకిది
స్వాతంత్ర్యము
అంటాడు.
తన
స్వార్థమును
పురస్కరించుకొని
నేను
యీ
విధముగా
దొంగతనము
చేయవచ్చని
అనుకుంటున్నాడేగాని
తన
conscience
అనేది
ఒప్పుకోటం
లేదు.
తన
conscience
ఒప్పుకోనప్పుడు
స్వాతంత్ర్యము
ఎట్లా
అవుతుంది.
ఇది
కేవలము
ఒక
బంధనలో
కూడిన
స్వాతంత్ర్యముగానే
వుంటుంది.
కనుక
మానవత్వములో
నిజమైన
స్వాతంత్ర్యము
ఎప్పుడు
వస్తుందంటే
యీ
మనస్సును
నిర్మూలము
గావించినప్పుడే
నిజమైన
స్వాతంత్ర్యము
వస్తుంది.
స్వ-యిచ్ఛ
స్వేచ్ఛ.
అదే
స్వేచ్ఛ
అంతేగాని
దేహేంద్రియ
మనో
బుద్ధులతో
ఆచరించే
కర్మలన్ని
స్వాతంత్ర్యములు
కాదు.
5
▾
Meaning
Keep
కొన్ని
కొన్ని
వాటి
యందు
law
of
nature
ప్రకృతిననుసరించి
కొన్ని
మనము
ఆచరిస్తూనే
వుంటాము.
ఇది
కూడను
స్వాతంత్ర్యము
కాదు.
Law
of
nature
ఒకటి
Rules
and
regulations
మరొకటి.
ఈ
రెండింటి
మధ్యలోనే
మానవ
జీవితము
సాగుతున్నది.
అంతేగాని
ఎవరికి
వారు
నేను
స్వతంత్రుడను
నేను
స్వతంత్రుడను
అని
అనుకోటానికి
వీలు
లేదు.
దివ్యత్వము
ఒక్కటి
మాత్రమే
స్వాతంత్ర్యము.
దానిని
కూడను
స్వాతంత్ర్యమని
చెప్పటానికి
వీలులేదు.
ఉన్నది
ఒక్కటే
ఆ
పదమునకు
అక్కడ
స్థానమే
లేదు.
ఒక
చిన్న
ఉదాహరణము.
కొంతమంది
అంటూ
వుంటారు
నేను
స్వామికి
సంపూర్ణ
శరణాగతుడనై
పోయినాను
కాని
నా
బాధలు
తగ్గలేదు,
నా
దుఃఖములు
నివారణ
కాలేదు.
నా
కష్టములు
నివారణ
కాలేదు.
అని
అనుకుంటారు.
నా
యొక్క
భావమునందు
యిది
శరణాగతి
కానేరదు.
నిజముగా
శరణాగతి
యైతే
నా
బాధలు
తగ్గలేదు.
నా
కష్టములు
తీరలేదు
అనే
ప్రశ్నకు
అవకాశము
లేదు.
ఇంకా
కొంతమంది
నేను
ధ్యానములోపల
కొంతవరకు
సమాధిని
పొందుతున్నాను
అంటాడు.
సమాధి
అంటే
యేమిటి?
ప్రాకృతమైన
దృష్టి
యందు
ప్రాకృతమైన
వ్యక్తులు
రచించిన
గ్రంథములందు
సమాధి
తత్వాన్ని
అనేక
రీతులుగా
వర్ణించవచ్చును.
ధ్యానములో
వుండి
తన్మయత్వాలుగా
పడిపోవచ్చును.
కాని
సమాధిలో
వున్నాడనుకుంటాము.
దీనికి
సమాధి
అనే
పేరు
సార్థక
నామము
కాదు.
ఇది
కేవలము
ఒక
emotion
కావచ్చు
లేక
హిస్టీరియా
కావచ్చు.
లేక
ఫిట్సు
కావచ్చు.
లేక
weakness
కావచ్చు.
కాని
యిది
సమాధి
కానేరదు.
సమాధి
అనగా
ఏమిటి?
మనస్సును
ఆత్మలో
చేర్చటమే
సమాధి.
ఆత్మస్థితి
యందు
రెండు
అనేది
యిక్కడ
కనుపించదు.
సమ-ధీ
ఒకే
సమానత్వమైన
బుద్ధి
సుఖదుఃఖములనుగాని,
ఆదాయనష్టములనుగాని,
పాపపుణ్యములనుగాని,
ప్రకృతి
పరమాత్మలనిగాని
యేమాత్రము
బేధములుండవక్కడ.
ఆత్మస్థితి
యందు
మాత్రమే
అది
సమత్వమును
పొందుతుంది.
అదే
నిజమైన
స్వభావము.
కనుక
మానవ
జీవితములో
మనము
దేనిని
పొందాలని
ఆశిస్తున్నామో
పొందే
దాని
నిమిత్తమై
యే
విధమైన
దాని
అనుసరిస్తున్నామో
యీ
విధమైన
భావములు
వుండినంత
వరకు
కూడను
యిది
కేవలము
మానసిక
వికారములే.
మనసు
వుండినంత
వరకు
స్వాతంత్ర్యము
ఎవరికి
లేదు.
ప్రాకృతమైన
మార్గములో
యిది
నా
స్వాతంత్ర్యము,
నా
ధనము
నేను
అతనికి
యిస్తున్నాను
యిది
నా
స్వాతంత్ర్యము
అనుకోవచ్చు.
ఇది
స్వాతంత్ర్యము
కాదు.
అది
స్వేచ్ఛ
కాదు.
మనోభావములో
యేర్పడిన
కొన్ని
సహజ
సాత్విక
గుణములు.
6
▾
Meaning
Keep
మనస్సు
అన్ని
గుణముల
యొక్క
మిశ్రమమై
వుంటున్నాది.
ఒక్కొక్క
సమయములో
ఒక్కొక్క
గుణము
అభివృద్ధియై
వుంటున్నాది.
అతనికి
నేను
ఒక
రూపాయి
యివ్వాలని
సంకల్పించుకుంటాను.
దానికి
ఎవరి
యిష్టము
అక్కరలేదు
నా
స్వాతంత్ర్యము
అంటాము.
ఇదంతా
స్వాతంత్ర్యమునకు
సంబంధించినది
కాదు.
వాని
యొక్క
పరిస్థితిని,
వాని
యొక్క
ప్రార్థనను
కొంతవరకు
మనస్సు
అంగీకరించి
తద్వారా
నీవు
యిచ్చే
ఒక
దానమే
గాని
నిజమైన
స్వాతంత్ర్యము
కాదు.
కనుక
మానవుని
యందు
స్వేచ్ఛ
అనేది
వుండటానికి
వీలే
లేదు.
జస్టిస్
కస్తగిరి
చెప్పింది
ఒక
వ్యక్తి
ఒక
కఱ్ఱను
చేతిలో
పెట్టుకొని
తాను
exercise
చేస్తున్నాడు.
అది
తన
కాంపౌండులో
చేసుకోవచ్చును.
తన
terrace
పైన
చేసుకోవచ్చును.
యిది
స్వాతంత్ర్యము
కావచ్చును.
అదే
కఱ్ఱను
తీసుకుని
మధ్య
బజారు
లోపల
త్రిప్పుతూ
కూర్చుంటే
పోలీసులు
వచ్చి
అరెస్టు
చేసి
పిచ్చివాడని
జైలులో
పెడతారు.
ఇది
పబ్లిక్
రోడ్డులో
చేసేది
స్వాతంత్ర్యము
కాదు.
గవర్నమెంటు
రూల్సు
అండ్
రెగ్యులేషన్సుకు
విరుద్ధముగా
చేసినట్టవుతుంది.
తన
కాంపౌండులో
తన
టెర్రస్
పైన
చేయటం
కూడను
స్వాతంత్ర్యము
కాదు.
ఇది
కేవలము
తన
యిష్టము.
ఇష్టమునకు
స్వాతంత్ర్యమునకు
చాలా
వ్యత్యాసము
వుంటున్నది.
ఇష్టము
వస్తువును
బట్టి
స్వార్థమును
బట్టి
వినియోగించుకోవచ్చును.
కనుక
యే
వస్తువైనా
గాని
ఏ
స్థానమందైనా
గాని
ఏ
వ్యక్తి
యందైనాగాని,
ఏ
కాలమందైనా
గాని
తన
హృదయ
భావమునుండి
వచ్చినది
నిజమైన
స్వాతంత్ర్యము.
ఇది
హృదయము
నుండి
ఆవిర్భవించాలి.
హృదయాన్ని
వదలి
ఏదో
లౌకికమైన
స్థితిగతులను
పురస్కరించుకొని
యిది
స్వతంత్ర్యమనుకోటం
కేవలము
పేరుకు
స్వాతంత్ర్యమేగాని
ప్రవర్తనలో
స్వాతంత్ర్యము
దీనికి
లేదు.
మానవ
జీవితములో
వున్నతమైన
స్థాయిని
పొందిన
వ్యక్తులకు
మేధాశక్తులు
కేవలము
యెక్కడనుండియో
వచ్చినవి
కావు.
అన్ని
తన
నుండి
వుద్భవించినవే.
ఒకానొక
సమయములో
అర్జునుడు
కృష్ణుని
ప్రశ్నిస్తాడు
‘చంచలం
హి
మనః
కృష్ణ
పమాది
బలవధృఢమ్’
కృష్ణా!
యీ
చంచలమైన
మనస్సు
చేత
దేనిని
సాధించలేక
పోతున్నాము.
ఏ
చిన్న
కార్యమునందైనను
మనము
విజయాన్ని
సాధించాలంటే
అచంచల
హృదయుడు
కావాలి.
చంచల
చిత్తముతో
సాధించలేము.
నేను
చాలా
బలహీనుడని
అనుకుంటాము.
నేను
కేవలము
కొన్ని
విధములైన
సాధనల
చేత
సాధించాననుకుంటాము.
విద్యార్థులారా!
ఎవరు
కూడను
ఏది
సాధించినప్పటికి
ఒకరివల్ల
ఒకరు
సాధించామనుకోటం
అజ్ఞానము.
7
▾
Meaning
Keep
సర్వము
నీయందే
వుంటున్నాది.
నీయందుండిన
దానిని
నీవు
బహిర్గతము
గావించుకోటమే
నీవు
చేసే
ప్రయత్నము.
వున్నది
ఒక్కటే
అయినప్పుడు
దేనిని
పొందటానికి
వేరే
సాధనలు
ఎందుకు.
మనస్తత్వమునుండి
అవిద్యా
భావమును
దూరము
గావించుకోటమే
మనము
చేయవలసిన
సాధన.
ఈ
మానసిక
వృత్తులను
అరికట్టుకోటమే
సాధన.
సర్వము
నీయందే
వుంటున్నది.
దానినే
కృష్ణుడు
అర్జునునికి
ఉపదేశము
చేసినది.
అర్జునా!
నీవు
పుట్టినప్పుడు
విలువిద్య
తెలియదు
నీకు.
మీరందరు
పుట్టినప్పుడు
యీ
విద్యలన్ని
నేర్చుకొనిరాలేదు.
క్రమక్రమేణా
ఏదో
గొప్ప
విద్యలు
మీరు
నేర్చుకున్నారని
భావిస్తున్నారు.
ఇవి
నేర్చుకున్నవి
కాదు.
నీయందున్నవి
నీవు
ఆవిర్భవింపచేసినవి.
అర్జునా!
నీకు
ద్రోణాచార్యుడు
విలువిద్య
నేర్పించినాడని
భావిస్తున్నావు.
ద్రోణాచార్యుడు
నీకు
విద్యలు
నేర్పలేదు.
నీయందుండిన
దానినే
తాను
బయటకు
చూపించాడు.
నీలో
లేని
దానిని
ఏ
గురువైనా
సరే
ఏ
మహత్తరమైన
శక్తిగలవాడైనా
సరే
లేని
దానిని
తెప్పించటానికి
వీలుకాదు.
అదృష్టము
కాని
దురదృష్టముగాని,
ఆనందముగాని
దుఃఖముగాని
యివన్నియు
మనయందున్నవే.
ఇప్పుడు
ఒక
బావి
తవ్వినాము.
ఈ
బావి
నూరు
అడుగులు
తవ్వేటప్పటికి
నీరు
వచ్చింది.
ఆ
నీరును
నీవు
తెప్పించావా.
నీరు
అక్కడ
వుండనే
వున్నది.
దానికి
నీకు
మధ్యనున్న
మట్టి
తీసివేయటం
వలన
నీరు
కనుపించింది.
అంతేగాని
నీవు
కొత్తగా
ఆ
నీటిని
సృష్టించలేదు.
అదే
విధముగా
అర్జునా
నీలో
వున్న
దివ్యశక్తిని
నీవు
మరచినావు.
నీవు
మరచటానికి
కారణము
ఏమిటి?
దేహాతాదాత్మ్యము
పొందటం
వలనే.
నీవు
మరచిపోయావు
కనుక
ప్రతి
ఒక్కటి
కూడను
దివ్యత్వముగాని,
పవిత్రముగాని,
అపవిత్రముగాని,
దుఃఖముగాని,
ఆనందముగాని
మనలో
వుండినవే.
ఇది
నేను
స్వతంత్ర్యమనుకుంటే
యిది
నీకు
స్వాతంత్ర్యము
కాదు.
వున్నదే
అది.
ఇది
స్వేచ్ఛ
అనుకుంటే
యిది
స్వేచ్ఛ
కాదు.
కర్తృత్వము.
కనుక
free
will
అని
చెప్పటము
లోపల
దీనికి
అర్థమే
లేదు.
free
will
అనేది
ఒక్కటే.
అదే
హృదయస్థాయి.
అది
ఎప్పటికి
వున్నది.
ఒకసారి
వచ్చి
ఒకసారి
పోయేది
కాదు.
మనోభావము
వుండినంత
వరకు
మానవుని
భావ
భావములు
అభివృద్ధి
పొందుతూ
వుంటాయి.
కనుక
మనస్సు
యొక్క
స్వాతంత్ర్యములే
గాని
మనిషి
యొక్క
స్వాతంత్ర్యములు
కాదు.
సంపత్తు
చెప్పారు.
ఒక
స్టూడెంటు
తాను
ఏదో
ఒక
విధముగా
కూర్చుని
ప్రశ్న
వేసి
ఆన్సరు
తెప్పించుకొనుటకు
అతనికి
స్వాతంత్ర్యము
వుంది
అని.
యిది
స్వాతంత్ర్యమని
చెప్పటానికి
వీలు
లేదు.
తెలియని
విషయము
తెలుసుకోటానికి
ప్రయత్నించాడు.
ఈ
ప్రయత్నించే
విధానములో
కూడను,
తాను
అడిగే
పద్ధతిలో
కూడ
కొంతవరకు
మార్చుకోవాలి.
8
▾
Meaning
Keep
వినయ
విధేయతలను
పురస్కరించుకొని
తాను
సరైన
స్థితిగతులను
పురస్కరించుకొని
ప్రశ్నించటములో
కూడను
ఒక
నిబంధన
వుంటున్నాది.
ప్రశ్న
అడగటము
దానికి
జవాబు
చెప్పించుకోటము
స్వాతంత్ర్యమనుకుంటున్నాము.
స్వాతంత్ర్యము
కాదు.
ఇది
విద్యావిధానములో
వుండిన
నిబంధన.
మీ
కర్తవ్యమిది.
కర్తవ్యమునకు
స్వాతంత్ర్యమునకు
వ్యత్యాసము
వుంటున్నాది.
సంబంధము,
నిర్బంధము,
కర్తవ్యము
అని
మూడు
రకములుగా
వుంటున్నది.
ఐతే
యీ
మూడింటికి
వున్న
వ్యత్యాసము
యేమిటి?
ఇప్పుడు
ఒక
Sunday
వచ్చింది.
నీ
friends
అందరిని
పిలిచి
టీపార్టీ
పెట్టాలనుకున్నావు.
ఆనాడు
నాలుగు
గంటలకు
అన్ని
ఏర్పాట్లు
చేసుకున్నావు.
high
temperature
వచ్చింది.
అప్పుడు
తక్షణమే
యీ
friendsకి
ఫోను
చేశావు.
నాకు
టెంపరేచరు
అధికముగా
వుంటున్నాది
యీనాడు
టీపార్టీ
మానుకున్నాను
అన్నాడు.
ఇది
స్వాతంత్ర్యము
అనుకుంటున్నాము.
ఇష్టమైతే
పెట్టుకోవచ్చు
యిష్టము
లేకపోతే
మానుకోవచ్చు.
నీవు
ఆఫీసులో
వుంటున్నావు.
అక్కడ
కూడను
అధికముగా
టెంపరేచరు
వచ్చింది.
అదేనాడు
నీ
డైరెక్టరు
నీ
ఆఫీసును
విజిట్
చేస్తున్నాడు.
నీవు
అప్పుడు
లీవ్
తీసుకోటానికి
వీలు
కాదు.
డాక్టరు
దగ్గరకు
పోయి
మాత్రలు
వేసుకుని
యింజక్షను
తీసుకొని
జ్వరముతోనే
ఆఫీసుకు
పోవాలి.
ఇది
నిర్బంధము.
మూడవది
కర్తవ్యము.
ఏదో
కొన్ని
కారణాల
వలన
భార్యాభర్తలు
పోట్లాడారు.
యీ
కోపవశము
చేత
భర్త
ఆమెను
రెండు
కొట్టాడు.
ఆమె
యేడ్చుకుంటూ
బెడ్
రూముకి
పోయి
పడుకుంది.
వంట
చేయలేదు.
పురుషుడు
డ్రాయింగు
రూములో
కూర్చున్నాడు
చాలా
కోపంగా
వున్నాడు.
విషయములో
వచ్చిన
కోపం
ఒకటి
ఆకలితో
వచ్చిన
కోపం
ఒకటి
యీ
రెండు
చేరి
తాను
restless
గా
వుంటున్నాడు.
ఆ
సమయమునకు
తగినట్లుగా
ఒక
friend
వచ్చాడు.
అతను
వచ్చేటప్పటికి
నవ్వుతూ
hello
come
on
అన్నాడు.
కూర్చోమని
చెప్పాడు
ఫ్రెండ్‌తో
నవ్వుతూ
వుత్సాహంగా
మాట్లాడుతూ
అతనితో
కాలము
గడిపి
లోపలికి
పోయాడు
నా
ఫ్రెండు
వచ్చాడు
కాఫీ
చెయ్యి
అన్నాడు
కోపంగా.
ఫ్రెండుతో
ఆనందముగా
వున్నది
భార్యకు
తెలియకూడదు.
భార్యతో
కోపంగా
వున్నది
ఫ్రెండుకు
తెలియకూడదు.
ఇది
కర్తవ్యము.
ఈనాడు
సంబంధము
పోయింది.
నిర్బంధము
పోయింది.
కర్తవ్యము
అంతకంటె
పోయింది.
యిదే
ధర్మనాశనము.
యిదే
ధర్మగ్లాని
అన్నారు.
భార్యతో
పోట్లాడిన
వ్యక్తి
డ్రాయింగు
రూమ్‌లో
వుంటే
ఫ్రెండు
వచ్చినాడంటే
get
out
అంటే
యీ
friendకి
పిచ్చి
పట్టిందేమో
అనుకుంటాడు.
సమయస్ఫూర్తిగా
మన
యొక్క
భావములనుగాని
మన
యొక్క
చర్యలుగాని
మార్చుకొనే
విధానమే
కర్తవ్యము.
9
▾
Meaning
Keep
ఈ
విధమైన
చర్యలలో
నిర్బంధము,
సంబంధము,
కర్తవ్యము
యీ
మూడింటి
యందు
మానవునకు
స్వాతంత్ర్యము
లేదు.
సమాజము
యొక్క
స్థితిగతులను
బట్టి
మన
ప్రవర్తనలను
మనము
మార్చుకుంటున్నాము.
కనుక
మనకు
స్వాతంత్ర్యమంటే
ఆత్మస్థాయియే
స్వాతంత్ర్యము.
నీవు
ఆత్మభావమును
లక్ష్యమునందుంచుకొని
నీవు
యే
కార్యమైనా
చేయి
నీవు
తప్పక
స్వతంత్రముగా
వుంటావు.
Individual
freedom
అనిగాని
spiritual
freedom
అనిగాని
రెండు
వేరువేరుగా
లేవు.
ఆధ్యాత్మికమే
స్వాతంత్ర్యము.
స్వాతంత్ర్యమే
ఆధ్యాత్మికము.
ఇవి
రెండు
వేరుగా
వుండటానికి
వీలు
కాదు.
ఇవి
ఎట్లా
వుంటున్నాయనగా
ఒకే
పదార్థము
అనేక
భిన్నస్వరూపాలను
ధరించింది.
పాలు
వున్నాయి.
పెరుగు
చేసుకున్నాము.
పెరుగు
చిలికాము.
వెన్న
వచ్చింది.
మజ్జిగ
నిల్చింది.
పాలుగా
వున్నది
పెరుగు
కావటము
వెన్న
కావటము
మజ్జిగ
కావటము
యిన్ని
రూపాలు
చెందింది.
ఐతే
యిన్ని
రూపములలో
వున్న
పాలు
ఒక్కటే.
అదే
విధముగనే
సాలోక్యం,
సారూప్యం,
సామీప్యం,
సాయుజ్యం
యీ
నాలుగు
కూడ
భిన్నభిన్న
రూపములు
ధరించిందిగాని
నాలుగు
చేరి
ఒక్కటే.
ఐతే
ఒకదానికొకటి
సోపానములు.
సాలోక్యం
భగవచ్చింతన
చేస్తున్నాం
భగవంతుని
చింతన
చేస్తూ
చేస్తూ
యేమైపోతుంది
సామీప్యం.
స్వామి
చింతన
చేస్తూ
స్వామి
దగ్గరగా
పోవాలని
ఆశ
పుడుతుంది.
సామీప్యము
తరువాత
స్వామిలో
ఐక్యము
కావాలి
స్వామి
వలె
వుండాలి
అని
ఆశిస్తావు.
ఈ
సారూప్యం
పొందాలని
ఆశించిన
తరువాత
సాయుజ్యము
కావాలని
ఆశిస్తావు.
ఇవన్నియూ
ఒకదాని
యొక్క
భిన్న
స్వరూపములేగాని
వేరువేరు
కాదు.
కనుక
మానవునకు
యీ
భౌతిక
జగత్తునందు
స్వాతంత్ర్యము
వున్నదంటే
యిది
వెఱ్ఱి
స్వాతంత్ర్యమనే
చెప్పవచ్చు.
అహంకార
స్వాతంత్ర్యమని
చెప్పవచ్చు.
అభిమాన
స్వాతంత్ర్యమని
చెప్పవచ్చు.
నా
బిడ్డపైన
నాకు
స్వాతంత్ర్యము
వుంటున్నదని
నేను
కొట్టవచ్చు
తిట్టవచ్చు.
నా
భార్యపైన
నాకు
స్వాతంత్ర్యము
వుందని
నేను
ఆమెను
కొట్టవచ్చు
తిట్టవచ్చు.
ఇది
కేవలము
మీ
భ్రాంతియేగాని
నీకు
యీ
అధికారము
లేదు.
మంచిని
చెప్పవచ్చు.
మంచిని
బోధించవచ్చు.
కొట్టటము
తిట్టటము
నా
స్వాతంత్ర్యమనుకోటం
యిది
కేవలము
తెలివి
తక్కువ
నిజముగా
మానవుడుగా
వుండినవాడు
మానవునిగా
బ్రతకాలనుకుంటే
యీ
విధమైన
అహంకార
చర్యలు
మానినప్పుడే
మానవుడుగా
వుద్ధరిస్తాడు.
నిజముగా
నాకు
స్వాతంత్ర్యము
వుంది
అని
అనుకుంటే
నీ
యిష్టము
నీకెంత
స్వాతంత్ర్యమో
ఆమె
యిష్టము
ఆమెకంత
స్వాతంత్ర్యమే
కదా.
బయటవారి
స్వాతంత్ర్యమును
అణగద్రొక్కి
నీ
స్వత్వమును
పెంచుకోవాలనుకోటం
నీ
స్వార్థము
కదా!
10
▾
Meaning
Keep
నిజమైన
స్వాతంత్ర్యమంటే
యేమిటి?
బయటవారి
స్వాతంత్ర్యమునకు
అడ్డుతగలకుండటమే
నిజమైన
స్వాతంత్ర్యము.
కనుక
యిట్టి
స్వాతంత్ర్యము
లోకములో
యిట్టి
మానవునకు
కనుపించదు.
ఎవరైనా
గలాటా
చేస్తుంటే
పోలీసువాడు
వచ్చి
పట్టికొడతాడు.
ఇది
నాకు
అధికారము
వుంది
యిది
నా
స్వాతంత్ర్యమంటాడు.
కాని
అతనికి
అధికారము
కాదు
అతనికి.
తప్పొప్పులు
నిర్ణయించటమే
అధికారము
అతనికి.
అది
కూడా
అతనికి
అధికారము
కాదు.
ప్రభుత్వము
యొక్క
నిబంధనలను
పురస్కరించుకొని
తాను
చరిస్తాడు.
ఈ
విధముగా
ఒకదానికొకటి
ఒకదానికొకటి
పైనపైనే
వుండటం
చేత
ఎవరికినీ
స్వాతంత్ర్యము
లేదు.
అందరికంటె
వున్నత
స్థాయి
యందున్నవానిదే
స్వాతంత్ర్యము.
ఐతే
అతనికి
రెండవదనేది
లేదు
కనుక
అక్కడ
కూడ
స్వాతంత్ర్యమనేది
లేదు.
కనుక
యీ
రెండు
విధములుగా
విచారించినప్పుడు
లోకములో
ఎవ్వరికిని
స్వాతంత్ర్యము
లేదు.
ఇక
నిత్య
జీవితములో
Individual
freedom,
fundamental
law
అని
రెండింటిని
మనము
అనుసరిస్తున్నాము.
జీవనోపాధి
నిమిత్తమై
ఆచరించే
చర్యలు.
ఇవి
వుండవలసినదే
కాని
ఎవరు
కూడను
విసర్జించటానికి
వీలు
లేదు.
Road
traffic
అనుసరించుకొని
మనము
ప్రయాణము
చెయ్యాలి.
సంజయ
సహాని
చెప్పాడు.
ఒక
Lady
middle
road
మీద
నడుస్తూ
యిది
స్వాతంత్ర్యమనింది.
కాని
అది
స్వాతంత్ర్యము
కాదు.
గవర్నమెంటు
నిర్ణయానికి
విరుద్ధము
జరిగినట్టవుతుంది.
ఆ
విరుద్ధముగా
జరిగినప్పుడు
గవర్నమెంటైనా
పనిష్మెంటు
యిస్తుంది
ఏ
లారీ
అయినా
కొట్టి
పనిష్మెంటు
వస్తుంది.
కాని
దాని
తత్ఫలితము
మనము
అనుభవించవలసి
వస్తుంది.
ఇక్కడ
కర్తృత్వము,
భోక్తృత్వము
అనే
ఫలితములను
మనము
అనుభవించవలసి
వస్తుంది.
కనుక
మానవునకు
యే
విధముగా
యోచించినప్పటికిని
స్వాతంత్ర్యమనేది
ఎక్కడ
కూడను
లేదు.
స్వాతంత్ర్యమనే
పదమునకు
అర్థమే
వానికి
తెలియదని.
స్వాతంత్ర్యమే
వుండిన
మానవుడు
జగత్తుకే
రాడు.
వానికి
జన్మమే
లేదు.
ఎప్పుడు
యీ
దేహమును
ధరించి
యీ
జగత్తుకు
వచ్చాడో
స్వాతంత్ర్యము
లేదు.
జయమ్మ
చెప్పింది.
ఒక
పశువును
మధ్య
గూటానికి
కట్టి
పెట్టేస్తే
అది
ఒక
పదడుగుల
త్రాడైతే
పది
అడుగుల
దూరమే
పోగలదుగాని
ఆ
గూటము
చుట్టూ
తిరగవచ్చు.
గూటము
దగ్గరకు
వెళ్ళవచ్చును;
మధ్యలోనికి
పోవచ్చును,
కాని
దూరము
పోలేదు.
కాబట్టి
దానికి
స్వాతంత్ర్యము
ఎక్కడ
వుంది.
ఒకటి
గూటము
వుంది
రెండవది
తగులు
వుంది
మెడకు.
ఇది
స్వాతంత్ర్యము
కాదు.
కనుక
మన
స్వాతంత్ర్యమనేది
కేవలము
ఒక
హద్దులలో
కూడి
వుంటున్నాది.
11
▾
Meaning
Keep
కనుక
యీ
హద్దులలో
కూడిన
దానిని
స్వాతంత్ర్యము
అని
చెప్పకూడదు.
నిబంధన
అని
చెప్పవచ్చు.
ఈనాడు
పదముల
యొక్క
అర్థాన్ని
సరిగా
తెలుసుకోలేక
పోతున్నాము.
నిజముగా
హృదయమనే
దానికి
సరియైన
అర్థము
తెలుసుకుంటే
దీనికి
ఏదో
ఒక
హద్దులో
పెట్టటానికి
కాదు.
నీలో
ఏ
హృదయము
వుందో
ఎదుటి
వాని
యందు
అదే
హృదయముంది.
నీ
యొక్క
దృష్టి
యందు
కూడను
యిదే
హృదయము
వుంది.
సర్వుల
యందు
ఒకే
హృదయమే
వుంటున్నాది.
సర్వుల
యందు
ఒకే
హృదయము
వుండినప్పుడు
సర్వుల
భావములు
ఒకటిగానే
రావాలి
కదా.
ఈ
భావములు
మనోకల్పితములు.
విద్యార్థులారా!
ఈ
దేహములు
యీ
భావములు
ఈ
చర్యలు
అన్ని
కూడను
మనసుతో
వచ్చినవే
కాని
హృదయముతో
వచ్చేవి
కావు.
heart
అంటే
physical
heart
ఒకటి
వుంటున్నాది;
spiritual
heart
ఒకటి
వుంటున్నాది.
Physical
heartకి
సంబంధించినది
కాదు
యీ
heart
అంటే.
ఇది
spiritual
heart
అనగా
సర్వత్రా
వుండినది.
దీనికి
రూపము
లేదు
గాని
అన్ని
రూపములు
తానే.
అన్నింటిలోను
తాను
ఏకమై
వుంటున్నాది.
ఏ
విధంగా
అంటే
ఒక
చక్కెర
పాకము
చేసి
ఆ
చక్కెర
పాకము
చేత
ఏనుగు,
కుక్క,
నక్క,
పులి,
గుఱ్ఱము
అని
అన్ని
విధములుగా
ప్రింటు
కొట్టినాము.
చిన్న
చిన్న
పిల్లలంతా
వచ్చి
నాకు
కుక్క
కావాలి,
నక్క
కావాలి,
పులి
కావాలి,
ఏనుగు
కావాలి
ఒక్కొక్కరు
ఒక్కొక్కటి
తీసుకొని
భుజిస్తారు.
కాని
ఆ
పిల్లల
దృష్టి
లోపల
యివి
కేవలము
ఒక
విధమైన
జంతువులుగా
కనుపిస్తున్నాయి
గాని
చక్కెరలో
యీ
జంతుస్వరూపమే
లేదు.
ఇది
ఏనుగు
అన్నాడు.
ఇది
జింక
అన్నాడు.
ఇది
పులి,
యిది
సింహము
అన్నాడు.
ఇది
కేవలము
వారి
దృష్టి
యొక్క
కల్పితములే.
చక్కెరలో
ఎట్టి
బేధము
లేదు.
అదే
హృదయము.
ఈ
బేధములన్ని
నీ
యొక్క
మానసిక
ప్రతిబింబములే.
ఒకరిని
నీవు
ద్వేషిస్తున్నావంటే
అది
నీ
యొక్క
ప్రతిబింబమే.
ఒకరిని
ప్రేమిస్తున్నావంటే
అది
నీ
ప్రతిబింబమే.
ఒకరిని
హాస్యము
చేస్తున్నావంటే
అది
నీ
ప్రతిబింబమే.
కనుక
నీ
యొక్క
reaction
rebound
reflection
మనకు
యీ
జగత్తునందు
స్వరూప
స్వభావములుగా
కనుపిస్తున్నాయి.
కనుక
యీ
Reaction,
Reflection,
Reboundను
విసర్జించి
Reality
అనే
హృదయాన్ని
మనము
పట్టుకుంటే
యీ
బేధములు
ఎంతమాత్రము
కలుగవు.
భగవంతునకు
ఎట్టి
బేధములు
లేవు.
కాని
వ్యక్తి
యొక్క
చర్యలను
పురస్కరించుకొని
వ్యక్తి
యొక్క
పూజలను
పురస్కరించుకొని,
వ్యక్తి
యొక్క
భావములు
పురస్కరించుకొని,
వ్యక్తి
యొక్క
ప్రార్థనలు
పురస్కరించుకొని
తాను
దానికి
తగినట్లుగా
నటిస్తూ
వుంటాడు.
భగవంతునికి
ఆగ్రహము
లేదు
ఇష్టము
లేదు
అయిష్టము
లేదు.
12
▾
Meaning
Keep
ఈ
యొక్క
తత్వమునందు
ప్రతి
ఒక్కటి
నీ
ప్రతిబింబము
యొక్క
స్వరూపములే.
దేహమును
ధరించటము
చేత
అవతారములందు
కూడను
కొన్ని
reactions,
reflections,
rebounds
వుంటాయి.
ఈ
అవతారమునందు
కూడను
Reaction,
reflection,
rebound
వుండాలి.
ఐతే
యీ
భౌతికమైన
జగత్తునందు
ఆదర్శవంత
జీవితమును
అందించే
నిమిత్తమై
యీ
రకమైన
చర్యలు
చెయ్యాలి.
భగవంతునికి
ఒక
కులమునిగాని
యితడు
బ్రాహ్మణుడు
యితడు
క్షత్రియుడు
యితడు
వైశ్యుడు
యీమె
స్త్రీ
యితను
పురుషుడు,
యితను
బాలుడు,
యితను
వృద్ధుడు
అనే
బేధభావములు
కేవలము
లౌకిక
జగత్తునకు
మాత్రమే
సంబంధించినవిగాని
భగవంతునికి
యిట్టి
సంబంధము
లేదు.
రాముడు
క్షత్రియ
వంశములో
పుట్టినాడు,
కృష్ణుడు
యాదవ
వంశములో
పుట్టినాడు
సాయి
బాబ
మా
క్షత్రియ
వంశములో
పుట్టాడు
యీ
విధముగా
అనుకోటము
కేవలము
కించిత్
భావములే.
భగవంతునికి
అట్టి
బేధములు
యేనాడు
లేవు.
ఎప్పుడు
రావు.
కనుక
దివ్యమైన
ఆత్మతత్వమును
మనము
అర్థము
చేసుకుంటే
యీ
సంకుచితమైన
మార్గమునకు
ఏమాత్రము
అవకాశము
యివ్వరు.
ఇవన్ని
సంకుచితమైన
తత్వములు
సంకుచితమైన
భావములు.
కనుక
యీ
విశాలమైన
జగత్తునందు
విశాలమైన
భావములు
మనము
పెంచుకొని
విశాలమైన
ఆత్మ
తత్వమును
మనము
అర్థము
చేసుకోవాలి.
కనుక
ఆధ్యాత్మికమనగా
కేవలము
ఒక
సంకుచితమైన
స్థాయిలో
మనము
విచారించరాదు.
ఏదో
పూజలు
చేయటము,
భజనలు
చేయటము,
ధ్యానము
చేయటము
యివన్ని
ఆధ్యాత్మికమునకు
చిహ్నములుగా
మనము
భావిస్తున్నాము.
ఇవన్ని
మానసిక
వికారములే.
మనోతృప్తి
నిమిత్తమై
మనము
ఆచరించే
చర్యలే.
భగవంతుడే
మాకు
మాత.
భగవంతుడే
మాకు
పిత
భగవంతుడే
మా
స్నేహితుడు.
ఈ
విధముగా
అనేక
రకములుగా
వర్ణిస్తూ
వుంటాము
భగవంతుని.
దేవుడు
తల్లి
తండ్రి
స్నేహితుడు
యీ
విధమైన
భావాలు
ఎందుకు.
నీవే
నేను
నేనే
నీవు
అనుకుంటే
పోతుంది
కదా.
అయితే
You
and
I
are
one
అంటే
యిక్కడ
సరిగా
సరిపోదు.
ఇది
ఆధ్యాత్మికము
పూర్తి
ఖండిస్తుంది.
You
and
I
are
we.
అవుతుందిగాని
one
కాదిక్కడ.
నీలోన
నేను
వున్నాను.
నాలోన
నీవు
వున్నావు
యిరువురు
చేరినప్పుడు
ఒకటై
పోతాము.
We
and
we
are
one.
అక్కడ
రెండు
యేమంటే
భౌతికమైన
దేహమును
ధరించిన
శరీరము
ఒకటి
అందులో
ఆధారమైన
ఆత్మతత్వము
ఒకటి
వుంటున్నాది.
అదే
we.
ఇక్కడ
కూడను
భౌతిక
సంబంధమైన
దేహమును
ధరించటము
చేత
యిది
ఒకటి
వుంటున్నాది.
13
▾
Meaning
Keep
యిందులో
ఆత్మతత్వము
వుంటున్నాది.
ఇది
కూడా
we.
కనుకనే
యీ
రెండింటి
యొక్క
తత్వాన్ని
గుర్తించుకుంటే
నీవు
తల్లి
తండ్రి
స్నేహితుడు
యీ
రకమైన
సంబంధములే
మనకు
అక్కర
లేదు.
కనుక
యిరువురు
ఒక్కరే.
యిరువురు
అనేది
లేదు.
రెండుగా
కనుపించినప్పటికి
అందులో
ఒక్కటే.
ఇక్కడనే
నీకు
ప్రత్యక్షముగా
యివి
రెండుగా
కనుపిస్తున్నాయి
(స్పీకరులు)
కాని
యివి
రెండూ
చేరి
ఒకటిగానే
వినిపిస్తున్నాయి.
కనుపించటము
రెండు
వినుపించటం
ఒక్కటే.
కనుక
దేహాత్మ
భావము,
యీ
హృదయ
తత్వము
రెండింటిని
ఒకటిగా
చేర్చాలి.
అదే
మనము
చేయవలసిన
సాధన.
విద్యార్థులారా!
ఆధ్యాత్మికమనగా
దైవములో
ఏకము
కావటమే.
దైవము
నీవు
వేరు
కాదు.
నీవే
దైవము
దైవమే
నీవు.
ఈ
విశ్వాసము
యీ
స్థాయినుండి
అభివృద్ధి
పరచుకొన్నప్పుడు
యింక
యే
విధమైన
ప్రార్థనలు
చేయనక్కరలేదు.
కాని
కొంతమంది
వచనముల
ద్వారా
పలుకుతారుగాని
నీవు
నేను
ఒకటే
అని
ఆచరణలో
శూన్యము.
ఒక
గురువు
ఒక
శిష్యునకు
మంత్రోపదేశము
చేశాడు
శివోహం.
ఈ
శివోహం
అనే
పదమును
వుచ్చరించమన్నాడు
స్వామి!
శివోహం
అంటే
అర్థమేమిటి
అన్నాడు
శిష్యుడు.
శివోహం
నేనే
శివుడను.
ఆ
నిజమే
నేనే
శివుడను
నేనే
శివుడను
అనుకుంటున్నాడు.
నిజముగా,
హృదయపూర్వకముగా
తాను
దివ్యత్వాన్ని
గుర్తించి
విశ్వసించి
స్మరించటమే
అనుకుంటే
ఎట్టి
బేధములు
అక్కడకు
రావు.
ఒక
స్నేహితుడు
వచ్చాడు.
శివోహం
అని
వుచ్చరించుకుంటూంటే
అయ్యా
ఏమి
దీని
అర్థమన్నాడు.
శివోహం
అంటే
నేనే
శివుడు
అని
అర్థము
చెప్పాడు.
నీవే
శివుడైతే
ఆ
పార్వతి
నీకు
యేమి
కావాలి
అన్నాడు.
నిజముగా
విశ్వసించినవాడైతే
పార్వతి
కూడా
నేనేనని
చెప్పవచ్చు
కదా.
పార్వతి
నీకేమవుతుందంటే
అపరాధమపరాధమని
పార్వతి
నాకంటె
గొప్పదని
అన్నాడు.
ఇట్టి
దేహ
సంబంధము
పురస్కరించుకుంటే
యీ
వికారాలన్ని
బయలుదేరతాయి.
కనుక
యీ
విధమైన
తల్లి
తండ్రి
యీ
భావములే
మనకు
అక్కరలేదు.
ఈ
భౌతిక
సంబంధము
ఏమాత్రము
మనము
అభివృద్ధి
పరచుకోరాదు.
నీవే
నేను
నేనే
నీవు
యీ
రకమైన
సంబంధమును
పెంచుకుంటే
బ్రహ్మవిత్
బ్రహ్మైవ
భవతి.
ఇంక
ఎట్టి
బేధములకు
అవకాశమూ
వుండదు.
ఇదే
నిజమైన
స్వాతంత్ర్యము.
యిదే
నిజమైన
స్వేచ్ఛ
అదే
స్వ-యిచ్ఛ
కనుక
స్వేచ్ఛ
అనేది
కేవలము
ఎక్కడో
వుండినది
కాదు.
మనము
సంపాయించుకున్నది
కాదు.
మనమే
స్వేచ్ఛ.
అందువలనే
భగవద్గీత
లోపల
ధర్మము
సంబంధమనుసరించి
చెబుతూ
స్వధర్మము,
పరధర్మము
అన్నాడు.
14
▾
Meaning
Keep
పరధర్మమనగా
దేహధర్మము.
స్వధర్మమనగా
ఆత్మధర్మము.
అంతేగాని
స్వధర్మమంటే
క్షత్రియ
ధర్మము
వైశ్యధర్మము,
శూద్రధర్మము
యీ
కులధర్మములకు
సంబంధించినది
కాదు.
స్వ-ధర్మము.
ఆత్మధర్మము.
ఆత్మధర్మము
ఎప్పటికి
భయమును
అందించదు.
ఈ
దేహధర్మము
ననుసరించినప్పుడే
భయము
మనకు
ఆవిర్భవిస్తుంది.
కనుక
గీత
యొక్క
శ్లోకములనుగాని
లేక
పదముల
యొక్క
అర్థములనుగాని
చక్కగా
గుర్తించి
వర్తించినప్పుడు
ఎట్టి
బాధలకుగాని
ఎట్టి
కష్టములకుగాని
మనము
గురికాము
కాన
మన
దివ్యత్వమును
దివ్యత్వముగానే
భావించాలి.
అప్పుడు
ఎట్టి
దుఃఖములకుగాని,
కష్టములకుగాని
నిష్ఠూరములకుగాని
యేమాత్రము
మనకు
అవకాశము
చిక్కదు.
విద్యార్థులారా!
మీకు
తెలియకపోవచ్చు.
దివ్యత్వమునకు
ఒక్కటి
కూడను
మార్పు
వుండదు.
మీరు
నమ్మినా
నమ్మకపోయినా
దుఃఖము
అంటే
యేమిటో
నాకు
తెలియదు.
కష్టమంటే
యేమిటో
నాకు
తెలియదు.
నిందలు
నిష్ఠూరములు
చేస్తున్నారంటే
బాధ
అంటే
యేమిటో
నాకు
తెలియదు.
అది
వాని
యిష్టము.
పూజ
చేయటము
నీ
యిష్టము.
ఎవరి
యిష్టము
వారిది
దీనికెందుకు
బాధపడాలి.
నా
భావము
ఏమంటే
గట్టిగా
తిడితే
గాలిలో
పోతుంది.
తనలో
తాను
తిట్టుకుంటే
తనకే
తగులుతుంది.
నా
వరకు
రాదే
అది
నేనెందుకు
బాధపడాలి.
ఈ
విధమైన
సత్యమైన
తత్వాన్ని
గుర్తించుకున్నప్పుడు
మాత్రము
విచారము
వుండదు.
స్వామి!
నాకు
చాలా
బాధగా
వుంటున్నాది
అని
ఏడుస్తారు
చాలా
సంతోషం
అంటాను.
అన్నింటికి
సంతోషమే.
స్వామి
మా
వారు
చనిపోయారు
చాలా
సంతోషం.
ఈ
సంతోషమనేది
అన్నింటికిని
సమత్వమే.
ఒక్కొక్కప్పుడు
అనుకుంటాను
చాలా
దుఃఖపడుతున్నారు
బాధపడుతున్నారు
ఆ
దుఃఖము
అంటే
ఎట్లా
వుంటుందోనని.
దగ్గరకే
రాదు
అది.
లేకపోతే
స్వామికి
తగిన
స్వామికి
సంబంధించిన
విచారము
లోపల
ఏ
విధమైన
అల్లకల్లోలములు
జరుగుతూ
వుంటాయి.
అనేకమంది
అనేక
రకములైన
భావములలో
వుంటుంటారు.
ఒకవైపున
పూజించేవారు
ఒకవైపున
దూషించేవారు.
ఇది
ఒక
పర్వతము
అదే
ఒక
పర్వతము.
కాని
యీ
పర్వతములు
రెండూ
కూడను
గుంతలు
వుంటున్నాయి.
ఒక
దగ్గర
మట్టి
గుట్ట
కావాలంటే
క్రింద
గుంత
వుండాలి
కదా.
ఈ
గుంత
మట్టే
గుట్ట
మట్టి.
గుట్ట
మట్టే
గుంత
మట్టి.
రెండూ
సమానమే.
ఈ
రకమైన
తత్వమే
నిజమైన
ఆత్మతత్వము.
ఐతే
ఒక్కొక్కప్పుడు
పిల్లలు
చేసే
పనులు
బట్టి
కొంచెము
కోపపడినట్టుగా
చేస్తాను.
బయటనేగాని
లోపలనుండి
వచ్చినది
కాదు.
ఒక్కొక్కరితో
నెలల
కొద్ది
నేను
మాట్లాడను.
యిది
వారి
రోగమునకు
తగిన
మందు.
15
▾
Meaning
Keep
ఎందుకంటె
వారిని
సరి
చేసే
నిమిత్తమై
యీ
రకమైన
మందును
వుపయోగపెట్టాలి.
స్వామి
ఎందుకు
నాతో
మాట్లాడటం
లేదు.
అడిగే
అధికారం
నీకెక్కడ
వుంది.
అది
నా
యిష్టం
యిప్పుడు
దీనికి
ఒక
చిన్న
ఉదాహరణము.
ఒక
డాక్టరు
దగ్గరకు
నలుగురు
పేషెంట్లు
వచ్చారు.
నలుగురికీ
కడుపునొప్పి.
బాహ్యదృష్టిలో
చూస్తే
అందరికి
కడుపునొప్పి.
ఒకడు
వచ్చేటప్పటికి
ఆ
డాక్టరు
యేమి
చేస్తాడు
చూస్తాడు
పరీక్షిస్తాడు
నాయనా
యేమీ
లేదు
hot
water
fomentation
చేస్తే
సరిపోతుందని
అంటాడు.
వానిని
పంపించేస్తాడు
తక్షణమే.
ఇంకొకడు
నాకు
కడుపునొప్పి
అని
వస్తాడు.
వానికి
సోడా
బైకార్బు,
మెగసల్ఫు
రెండు
కలిపి
యిచ్చి
gas
trouble
వెళ్ళిపోతుంది
అంటాడు.
మూడవ
వాడు
వస్తాడు.
నాయనా
salt
యిస్తాను
రెండు
తూర్లు
బేధులై
తగ్గిపోతుంది
వెళ్ళమంటాడు.
నాల్గవ
వాడు
వస్తాడు.
Immediate
గా
operation
చేయాలంటాడు.
ఏమి
వీనిపైన
ద్వేషమా
డాక్టరుకు
కాదు
కాదు
వీని
జబ్బు
వేరే
ఎపిండిసైటస్.
తక్షణమే
ఆపరేషన్
చెయ్యాలి.
అదే
విధముగనే
ఒక్కొక్కరి
భావములను
ఒక్కొక్కరి
చర్యలను
ఒక్కొక్కరి
తలంపులను
పురస్కరించుకొని
వారికి
తగినది
నేనందిస్తాను.
ఒక్కొక్కరిని
చూడనే
చూడను.
ఒక్కొక్కరితో
మాటాడనే
మాట్లాడను.
ఒక్కొక్కరు
యిటు
వస్తే
అటు
పోతాను.
ఇవన్ని
నేను
చేసే
prescriptions
ఎందుకోసం
యిస్తున్నాను.
నాలో
ఒక
నియమము
వుంటున్నాది.
నా
మాటకు
చాలా
విలువ.
మీరు
యివ్వకపోయినా
నా
మాటకు
నేను
విలువ
యిస్తాను.
కనుక
నా
మాటను
సరిగా
నడుచుకోనప్పుడు
నేను
వారితో
మాట్లాడి
వారితో
నా
మాటను
waste
చేయటం
యిష్టము
వుండదు.
కనుక
నా
మాటను
నేను
కాపాడుకొనే
నిమిత్తము
నేను
మాట్లాడకుండా
వుంటాను
కొన్ని
కారణాలు
బట్టి.
స్వామి
నాతో
మాట్లాడటం
లేదని
మాత్రమే
చెప్పుకుంటారు
గాని
నేను
స్వామి
ఆజ్ఞను
నడచుకోలేదని
ఎందుకనుకోకూడదు.
కేవలము
యిది
one
way
traffic
కాదు.
give
and
take
రెండింటిని
విచారణ
చెయ్యాలి
సమత్వమంటే
నేను
యీ
విధముగా
చేయటం
చేతనే
స్వామి
నాతో
మాట్లాడటం
లేదు
అనే
దానిని
నీవు
గుర్తించుకుంటే
నీవు
మున్ముందు
యిక
చేయకుండా
వుంటావు.
కాని
యీనాటి
భక్తులు
ఆ
విధముగా
చేయటం
లేదు.
స్వామి
మాట్లాడటం
లేదు.
స్వామి
మాట్లాడటం
లేదు.
అదే
చూస్తున్నారు
గాని
తాను
చేసిన
తప్పులు
తాను
గుర్తించటానికి
ప్రయత్నించటం
లేదు.
కనుక
మొదట
స్వామి
మాట్లాడమని
కోరనక్కరలేదు.
నీవు
ఆ
తప్పు
చేయకుండా
వుండు
స్వామి
వచ్చి
మాట్లాడుతాడు.
వర్షానికి
మనము
ప్రార్థించుకుంటే
వంకలు
వాటంతటవే
పారి
ప్రవహిస్తాయి.
వర్షమునకు
ఒక
ప్రార్థన,
వంకలు
ప్రవహించటానికి
ఒక
ప్రార్థన.
16
▾
Meaning
Keep
Also in his talks
(1)
12 July 1996
Namasmarana is the Greatest Sadhana in the Kali Yuga
యిన్ని
ప్రార్థనలు
చేయనక్కరలేదు.
ఆజ్ఞను
శిరసావహించుకుంటే
అనుగ్రహము
అక్కడే
లభిస్తుంది.
విద్యార్థులారా!
మొట్టమొదట
మీ
మాటలకు
మీరు
విలువ
పెట్టుకోండి.
మాటలకు
విలువ
సంపాయించుకోండి.
మాటను
విలువస్థాయిలో
వుంచుకోండి.
రెండు
కన్నులున్నాయి.
రెండు
చూడవచ్చు
మీరు.
రెండు
చెవులున్నాయి
రెండు
వినవచ్చు
మీరు.
కాని
నాలుక
ఒక్కటే
వుంది.
కనుక
మాటకు
ప్రాణము
సత్యము
కోటకు
ప్రాణము
శుభటకోటి
ధరిత్రిన్
జాతికి
ప్రాణము
మానము
నోటుకు
ప్రాణంబు
వ్రాలు
మన
signature
లేకపోతే
ప్రామిసరీ
నోటుకు
value
ఎక్కడ
వుంది.
కనుక
మన
మాటకు
సత్యమే
ప్రాణము.
అప్పుడే
సత్యమేవ
జయతే.
కనుక
దైవ
తత్వమును
గుర్తించాలనుకుంటే
అందరికి
అర్థమయ్యేది
కాదు.
దైవము
దేనికి
కృంగడు.
పొంగడు.
ప్రపంచమంతా
వచ్చి
దూషించినా
నేను
కృంగను.
ప్రపంచమంతా
వచ్చి
వర్ణించినా
నేను
పొంగను.
నా
సత్యము
నాది.
కృంగి
పొంగేవారికి
వారిలో
వున్న
దోషమే
reaction.
దోషము
లేనప్పుడు
ఎందుకు
కృంగాలి
ఎందుకు
పొంగాలి.
కనుకనే
యీ
హృదయాస్థాయి
యందుండినది
ఒక్కటే
అదే
పవిత్రము
అనే
విశ్వాసమును
మనము
బలపరచుకుంటే
యింక
యే
విధమైన
విచారమునకు
అవకాశమే
వుండదు.
విద్యార్థులారా!
క్రమక్రమేణా
మన
summer
course
classes
అంతా
ముగించటానికి
సమీపిస్తున్నాయి.
అందువల్ల
యిలాంటి
అవకాశమనేది
దుర్లభము.
దీనిని
పురస్కరించుకొనియు
నేను
కొంచెము
అధిక
కాలము
తీసుకొని
సంభాషించటానికి
అవకాశము
యిస్తున్నాను.
ఇంక
వున్నది
రెండు
దినములే.
ఈ
రెండు
దినముల
లోపల
కూడను
స్వామి
యొక్క
నిజతత్వాన్ని,
నిజబోధలను,
నిజాకారాన్ని
సరియైన
రీతిలో
గుర్తింపచేయటానికి
తగినంత
అవకాశము
వుంటున్నాది.
దానిని
మీరు
అర్థము
చేసుకుంటే
యింక
దేనిని
మీరు
అర్థం
చేసుకోనక్కరలేదు.
కుమ్మరింటికి
పోయి
కుండలన్ని
మట్టితోనే
చేసినవని
అర్థం
చేసుకుంటే
కుండ
యేదైనా
పేరు
పెట్టుకోవచ్చు.
ఆధారము
ముందు
చూడాలి.
కనుక
స్వామి
యొక్క
ఆధారతత్వాన్ని
మీరు
కొంతవరకు
గుర్తించటానికి
తగిన
కృషి
చేయండి.
17
▾
Meaning
Keep
కేవలము
ఆధేయమును
మాత్రము
గుర్తించటానికి
ప్రయత్నించనక్కరలేదు.
ఆధేయము
మార్పు
చెందేటువంటిది.
ఆధారమే
మార్పు
చెందనటువంటిది.
అదే
సత్యము.
అదే
నిత్యము.
అదే
ఆత్మ.
అదే
హృదయము.
అదే
నేను.
Previous
←
Self-knowledge
Next
Practice and Precept
→