Contents
Devotion & Sacred Story
Home
Library
Find
Shelf
Settings
←
Leave
Sathya Sai Speaks 1991 · Time and duty
Tap a verse for its meaning
IAST
Telugu
Meaning
Continuous
Time and duty
1 January 1991, New Year's Day, Prasanthi Nilayam
1
▾
Meaning
Keep
“సంపదలు,
ఆపదలు,
రాకపోకలు
సర్వమూ
కాలమును
అనుసరించును.
మంచి
చెడ్డలు
కాలమునకు
అధీనములు.
కాలము
లొంగదీయనిది
ఏ
ఒక్కటీలేదు”.
“ఈశ్వరుడు
కాలస్వరూపుడు”
దివ్యాత్మస్వరూపులారా!
కాలము
భగవంతుని
స్వరూపము.
భగవంతుని
“కాలస్వరూపాయనమః”
అని
ఋషులు
వర్ణిస్తూవచ్చారు.
కనుకనే
కాలమును
“సంవత్సరః”
అని
పిలుస్తూవచ్చారు.
లోకమునందుగల
చరాచర
పదార్థములన్నియు
భగవంతునియందే
ఇమిడి
ఉన్నవి.
అందుచేతనే
భగవంతుని
“కాలగర్భుడ”ని
అంటూవచ్చారు.
భగవంతుని
“ధీరోత్తమ”
అని
ఋషులు
వర్ణిస్తారు.
ధీరోత్తముడు
అనగా
సంవత్సర
స్వరూపుడని
అర్థం.
ధీరుడనగా
తెలివితేటలు
కలవాడనిగాని,
మేధాశక్తి
గలవాడనిగాని
భావించరాదు.
మానవుని
ధీశక్తిని
ఎవరు
భగవంతునివైపు
మరల్చి
ఆనందమును
అనుభవించెదరో,
అట్టి
వ్యక్తిని
మాత్రమే
‘ధీరుడు’
అని
వేదం
చెప్పుతూ
వచ్చింది.
భక్తుల
యోగ్యతలు
పురస్కరించుకొని,
దానికి
తగిన
ఫలితమును
అనుగ్రహించేవానికి
“కాలస్వరూపుడు”
అనిపేరు.
కాలము
-
జీవితము
మనకు
కాలమే
భగవత్స్వరూపుడు.
కాలము
కంటే
మించిన
భగవత్స్వరూపము
ఇంకొకటిలేదు.
మనకు
పుట్టుక,
జీవితము,
గిట్టుట—
అన్నీ
కాలములోనే
ఇమిడి
ఉంటున్నవి.
కాలమును
భగవత్స్వరూపంగా
విశ్వసించి,
కాలమును
పవిత్రం
గావించే
కర్మలు
ఆచరించాలి.
ఒక్క
క్షణమైన
మనము
వ్యర్థం
చేయరాదు.
కాలమును
వ్యర్థంచేస్తే,
జీవితమే
వ్యర్థమైపోతుంది.
పవిత్రమైన
జీవితములో
మనం
అనుభవించే
ఈ
ఫలితములన్నీ
మన
కాలానుగుణ్యంగావస్తాయి.
మన
కర్మలయొక్క
ఫలితమే
మన
అనుభూతులు.
ఆనందంగాని,
దుఃఖముగాని,
హెచ్చుతగ్గులుగానీ
మన
కర్మల
యొక్క
ప్రభావమే.
2
▾
Meaning
Keep
కాబట్టి
మంచి
చెడ్డలు
మన
హస్తమునందే
ఉంటున్నవి.
మనము
ఎట్టి
కర్మలు
ఆచరిస్తామో,
అట్టి
ఫలితములను
మనం
అందుకుంటాము.
ఏవిధంగా
కాలాన్ని
సార్థకం
చేసుకుంటామో,
ఆవిధమైన
ఫలమును
మనము
పొందుతాము.
కాలస్వరూపుడైన
ఈ
సంవత్సరస్వరూపుని
మనం
అనుభవించటానికి
ప్రయత్నించాలి.
ఆదర్శ
జీవితం
-
ఆధ్యాత్మిక
జీవితం
భగవంతుడు
లౌకిక
సంపదలకుగాని,
లౌకిక
అధికారములకుగాని,
లౌకికమైన
శక్తులకుగాని
లొంగునటువంటివాడు
కాదు.
ఒక
ఆధ్యాత్మిక
చిత్తమునకు
మాత్రమే
ఆతడు
లొంగితీరును.
లోకములో
మనము
గడచిన
రాత్రులనే
తిరిగి
అనుభవిస్తున్నాము,
మనము
గడచిన
పగళ్ళనే
తిరిగి
అనుభవిస్తున్నాము,
కడిగిన
ముఖమునే
తిరిగి
కడుగుతున్నాము,
తిన్న
కడుపునకే
తింటున్నాము.
మనము
గడచిన
సంవత్సరమునే
తిరిగి
గడుపుకొంటున్నాము.
కానీ
మనము
ఉత్కృష్టమైన,
ఆదర్శవంతమైన
జీవితమును
గడుపుకొనుటకు
ప్రయత్నిస్తున్నామా?
ప్రయత్నించుట
లేదు.
ఈ
విధముగా
కాలాన్ని
గడుపుతూపోయిన-
జీవితము
యొక్క
సార్థకత,
ఆదర్శము,
పరమావధి
ఏమిటి?
ఈ
విషయమై
ఏ
వ్యక్తియును
అధికముగా
యోచించుటకు
ప్రయత్నించుటలేదు.
కనుకనే
ఈనాడు
యోచించవలసినది
ఉత్తమమైన,
ఆదర్శవంతమైన
జీవితాన్ని
ఆధ్యాత్మిక
అనుభూతులతో,
ఆదర్శప్రాయముగా
మన
ఆనందాన్ని
అందించటానికి
ప్రయత్నించాలి.
సాధనే
సాధ్యము
-
సాధ్యమే
సాధన
సాధనలు
చేస్తున్నాము.
ఈ
సాధనల
యొక్క
ఫలితమేమిటి?
అని
ప్రశ్నించుకుంటే,
మనకేమాత్రం
అర్థం
కావటములేదు.
ఇవన్నీ
మానసిక
సంతృప్తి
నిమిత్తమై
ఆచరించే
ప్రక్రియలే.
నా
ఉద్దేశ్యంలో
సాధన-సాధ్యము
అని
లేనేలేవు.
సాధనే
సాధ్యము,
సాధ్యమే
సాధన.
ఈ
సాధనలో
ఏదో
ఒక
సాధనచేసి,
తద్వారా
దివ్యమైన
అనుభూతిని
అందుకోవాలనే
భ్రమనే
పొందుచున్నారు.
ఇది
మానసిక
అల్పతృప్తి
మాత్రమే.
మనము
సాధన
చేయవలెనన్న
అనాత్మభావమును
త్యజించటమే
నిజమైన
సాధన.
మన
దృష్టిని
అనాత్మనుండి-
ఆత్మ
వైపునకు
మరల్చటమే
సాధన.
ఈనాడు
ప్రపంచములో
అనేక
విధములైన
జ్ఞానములు
పొందుచున్నాము.
కానీ,
ఇవన్నీ
సరియైన
జ్ఞానములు
కావు.
ఇది
ఏ
పదార్థజ్ఞానమో
కావచ్చు
లేక
ఏ
విషయ
జ్ఞానమో
కావచ్చును,
ఇంకే
విధమైన
పరిశోధనా
జ్ఞానమో
కావచ్చు.
కానీ,
ఆత్మజ్ఞానమనేది
నిజమైన
జ్ఞానం.
ఆత్మ
వేరు,
జ్ఞానము
వేరుకాదు.
ఆత్మయే
జ్ఞానము,
జ్ఞానమే
ఆత్మ.
కాబట్టి
ఆత్మజ్ఞానమే
నిజమైన
జ్ఞానము.
వేదమునందు
సత్యం,
జ్ఞానం,
అనంతం,
బ్రహ్మ
అన్నారు.
ఈ
సత్యము,
జ్ఞానం,
అనంతం,
బ్రహ్మ—ఒక్క
పరమాత్మునికి
ఇవన్ని
భిన్నమైన
పేర్లు.
ఇవి
పర్యాయపదములు
మాత్రమే.
ఈ
నాలుగు
వేరువేరుకాదు.
ఏ
సాధన
చెయ్యాలి?
ఏ
సాధన
చెయ్యాలి?
జపమా?
ధ్యానమా?
యోగమా?
యజ్ఞమా?
మరియేమిటి?
ఈ
చేసే
ధ్యానములన్ని
మానసిక
తృప్తికోసమే.
3
▾
Meaning
Keep
మనస్సు
ఉండినంత
వరకు
ఆత్మతత్త్వము
అర్థము
కానేరదు.
నీవు
మనస్తత్త్వాన్ని
మరచిపోతూరావాలి.
మైండు
అంటే
ఏమిటి?
ఇది
సంకల్ప,
వికల్పాత్మకమైన
స్వరూపమే.
ఈ
సంకల్ప,
వికల్పాలను
త్యజించినప్పుడే
ఆత్మతత్త్వము.
మనం
ఈ
సంకల్ప
వికల్పములు
ఎప్పుడు
త్యజించగలము?
సుషుప్తి
స్థితిలో
త్యజించగలము.
ఆ
సుషుప్తినే
కారణస్వరూపము
అన్నారు.
జాగ్రత్త
దేహస్వరూపము,
స్వప్నము
భ్రాంతిస్వరూపము.
కారణమును,
కర్తను,
కర్తవ్యాన్ని
మరచినప్పుడు
అదే
కారణ
స్వరూపమైపోతుంది.
విచారణ
చేతనే
దీనిని
సాధించాలి
కాని
వేరే
విధానములతో
సాధించడానికి
వీలుకాదు.
ఈ
మనస్తత్త్వాన్ని
సరియైన
దారిలో
పెట్టుకోవాలి
అంటే,
సత్కర్మలలో
ప్రవేశించాలి.
సత్కర్మలు
చేస్తూ
ఉంటే,
సద్భావాలు
ఆవిర్భవిస్తాయి.
అదే
“యద్భావం
తద్భవతి”.
సరియైన
భావములు
మనలో
ఆవిర్భవించినప్పుడు,
సత్యమైన
తత్త్వము
మనకు
అర్థమవుతుంది.
సూర్యతేజస్సు
—
చంద్రతేజస్సు
జ్ఞానమనగా
ఏమిటి?
స్వస్వరూప
అనుసంధానమే
నిజమైన
జ్ఞానం.
ఈ
జ్ఞానమందు
మనస్సును
ఏకము
చేయుటయే
భక్తి.
భావరహితమైనదే
జ్ఞానము.
మనము
ఈ
సంకల్పములను
క్రమక్రమేణా
అదుపులో
పెట్టుకొనుటకు
ప్రయత్నము
చేయటమే
జ్ఞానమార్గము.
జ్ఞానమునందు,
భక్తియందు
ఒకే
తేజస్సు
ఆవిర్భవిస్తుంది.
సూర్యుని
తేజస్సే
చంద్రునిలో
ప్రకాశిస్తుంది.
కానీ
సూర్యునిలోని
తేజస్సు
వేడిగాను,
ప్రకాశముగాను
ఉంటుంది.
ఇదే
తేజస్సు
చంద్రునిలో
ప్రవేశించినప్పుడు
చల్లగా
హాయిగా
కనిపిస్తుంది.
కానీ
చంద్రునియందు,
సూర్యునియందు
ఉన్నది
ఒకే
తేజస్సు.
అయితే
చంద్రుడు
ఉండినప్పుడు
సూర్యుడు
కనిపించడు,
సూర్యుడు
ఉండినప్పుడు
మనకు
చంద్రుడు
కనిపించడు.
ఈ
సూర్యునియందు,
చంద్రునియందు
ప్రతిబింబింపజేసే
తత్త్వం
ఆత్మతత్త్వము
ఒక్కటే.
సూర్య
తేజస్సు
జ్ఞానమునకు,
చంద్ర
తేజస్సు
భక్తికిని
పోల్చుకొన్నారు.
జ్ఞానం
ప్రకాశవంతముగానూ,
భక్తి
ఆనందస్వరూపముగానూ
నిలుస్తూ
ఉంటుంది.
భక్తి,
జ్ఞానములు
అనేవి
రెండూ
ఒకే
పదార్థం
యొక్క
ప్రారంభ
అంత్యములే.
జ్ఞాత
ఒక్కడే
బాహ్య
జగత్తునకు
మాత్రము
కర్త,
కర్మ,
క్రియ
అనుకొంటున్నాము.
ఇది
భక్తి
యొక్క
లక్షణమే.
కర్త
-
సాధకుడు,
కర్మ-
సాధన,
క్రియారూపంలో
సాక్షాత్కరింప
జేసుకోవటమే
గమ్యం.
దీనిని
జ్ఞానము,
జ్ఞేయము,
జ్ఞాత
అన్నారు.
ఈ
మూడు
ఒక్కటే.
మూడు
స్థాయిలయందు
దీనిని
మూడు
రూపములలో
దర్శించుకొనుచున్నాము,
ఉదాహరణః
(చేతిరూమాలు
చూపిస్తూ)
ఇది
ఏమిటి?
వస్త్రం.
ఇది
వస్త్రం
కాదు.
ఒక్కొక్క
దానిని
వేరు
వేరుగా
తీసినప్పుడు
ఇది
దారముగా
ఉంటుంది.
ఇది
దారము
కాదు.
ఇది
పత్తి
నుండి
వచ్చినది.
పత్తిలేక
దారము
కాలేదు.
దారములేక
వస్త్రం
కాలేదు.
ఈ
మూడు
ఒక్కటే.
కేవలం
మన
ఉపయోగార్థం
ఈ
విధమైన
రూపములను
అనుభవిస్తున్నాము.
మూడింటి
యందుండిన
జ్ఞాత
ఒక్కడే.
మనము
చేసే
సాధనలన్నింటి
యందు
ఎన్నియో
అనుభూతులను
అనుభవిస్తున్నామని
భ్రమిస్తున్నాము.
4
▾
Meaning
Keep
ఈ
అనాత్మభావమును
త్యజించుటకు
మనము
పూనుకోవాలి.
పార్వతి
తపస్సు
లోకసంబంధమైన
శక్తి
సామర్థ్యముల
పైన
మనం
ఆధారపడకూడదు.
భగవంతుడు
ఆత్మశుద్ధిని
మాత్రమే
గ్రహించునుకాని,
లౌకికమైన
ప్రయత్నములకు
తాను
ఏమాత్రము
లొంగడు.
విష్ణుపురాణమునందుగాని,
శివపురాణమునందుగాని
పార్వతి
అత్యంత
లోక
సౌందర్యవంతురాలనిపేరు.
ఇట్టి
సౌందర్యవంతురాలనని
తాను
భ్రమించి,
తన
సౌందర్యముచేత
శివుని
వశము
చేసుకోవాలని
అహంకారముతో
అనేక
ప్రయత్నములు
చేసింది.
ఎన్ని
ప్రయత్నములు
చేసినప్పటికీ,
అందులో
తాను
విఫలమైపోయింది.
ఈ
సత్యాన్ని
గుర్తించి
తన
అహంకారమును
తగ్గించుకొని,
తన
శరీరమును
కొన్ని
విధములైన
తపస్సులచేత
తపింప
జేసుకుంది.
ఎండకు,
గాలికి
ఎండి,
వానకు
తడిసిపోయి,
చలికి
వణికిపోయి
అనేక
రకములైన
అవస్థలు
అనుభవించి,
తన
శరీరమును
శుష్కింపజేసుకొంది.
మనస్సును
మాత్రం
ఈశ్వరునియందు
లగ్నము
చేసుకుంది.
అప్పుడామె
అహంకారము
నిర్మూలనమైనదని
ఈశ్వరుడు
గుర్తించి
తన
అర్ధాంగిగా
తన
దేహంలో
అర్ధభాగముగా
నిలచిపొమ్మని
చెప్పాడు.
అనగా
దీనియొక్క
అర్థమేమిటి?
ప్రకృతియే
పార్వతి.
ఈ
ప్రకృతి
అత్యంత
సౌందర్యవంతమైనది.
ఇట్టి
అందమైన
ప్రకృతి
అనేక
విధములైన
అహంకారములకు
పాల్పడి
అందరిని
ఆకర్షింపజేసుకుంటుంది.
అందరి
అభిమానం
పొందుటచేత,
అహంకారం
మరింత
అధికంగా
హెచ్చి
ఉంటుంది.
సర్వమునకు
కర్త
ఒక్కడే
ఈ
ప్రకృతియందు
పుట్టిన
ప్రతిమానవుడు
అహంకారమయుడై
జీవితమును
గడుపుతూ
ఉంటాడు.
యౌవ్వన
అహంకారము,
విద్యా
అహంకారము,
ధన
అహంకారము,
సౌందర్య
అహంకారం,
బల
అహంకారం,
రాజ్య
అహంకారము—
ఇంకా
ఇంకా
అనేకమైన
అహంకారములు
ఉంటాయి.
విద్యా
అహంకారము
భగవంతుని
అత్యంత
దూరం
గావిస్తూవస్తుంది.
ఇట్టి
అహంకారమునకు
గురైన
వ్యక్తులు
ఎవ్వరూ
దివ్యత్వమును
పొందటానికి
అర్హత
పొందలేరు.
నిరహంకారులు
మాత్రమే
దివ్యత్వమును
పొందే
వ్యక్తులు.
వాల్మీకి,
నందుడు,
కుచేలుడు,
విదురుడు,
హనుమంతుడు,
తిన్నడు,
శబరి
ఈ
మొదలైన
వారందరూ
నిరహంకారులు.
స్వామి
భక్తిపరాయణులు.
కాబట్టి
మనకు
ఈ
భౌతిక
జగత్తునందు,
ఏవిధమైన
అధికారంలేదు.
ఈ
కనిపించేవన్నియూ
అనిత్యములే.
అశాశ్వతములే.
మనము
అనేక
విధములైన
అహంకారములను
పెంచుకొని,
అధఃపతనమైపోతున్నాము.
కర్త,
కర్మ,
క్రియ
స్వభావమును
విసర్జించి,
సర్వమునకు
కర్త
ఒక్కడే,
ఈ
సత్యాన్ని
గుర్తించాలి.
ఇచ్చేవాడు
తానే,
పుచ్చుకునేవాడు
తానే,
ఇవ్వబడే
పదార్థము
తానే.
అంతా
దివ్యమైన
భావమే
అయినప్పుడు
ఇంక
రెండవ
పదార్థము
ఎక్కడ
ఉంటుంది?
“విశ్వం
విష్ణు
స్వరూపం”
“సర్వం
ఖల్విదం
బ్రహ్మ”
ఇట్టి
ఏకాత్మ
భావమును
మనము
అభివృద్ధి
పరచుకోవాలి.
5
▾
Meaning
Keep
ఇచ్చినదితానే
పుచ్చుకొన్నది
తానే
కృతయుగము,
త్రేతాయుగము,
ద్వాపరయుగము,
కలియుగము
అని
నాలుగు
యుగములుగా
మనము
విభజించుకొన్నాము.
ఈ
నాలుగు
ప్రత్యేకించినవి
కాదు.
మన
అనుభూతుల
నిమిత్తమై
మనము
నిర్ణయించుకొన్నవే.
కలియుగమునకుకానీ,
కృతయుగమునకుకానీ,
ప్రత్యేకమైన
స్వరూపములు
లేవు.
ప్రజల
స్వభావములను
పురస్కరించుకొనియే
ఈ
నాలుగు
యుగములు
ప్రారంభమవుతూవచ్చాయి.
కృతయుగమునందూ
రాగద్వేషాలు
కలిగిన
వ్యక్తులున్నారు.
ఈ
కలియుగమునందూ
శాంతస్వభావములు
కలిగినవారు,
నిత్య
సత్య
స్వభావములు
కలిగినవారు
ఉన్నారు.
అన్ని
యుగములకు
భగవంతుడే
ఆది.
ఈ
యుగములకంతా
ఆది
కనుకనే,
ఇతనికి
“యుగాది”
అని
పేరు.
యుగాదిని
ఒక
పండుగగా
విశ్వసించి
అనుభవిస్తూ
వస్తున్నాం.
అన్ని
భగవంతుని
స్వరూపములే.
భగవంతుడు
కాని
రెండవ
పదార్థమేలేదు.
ఇచ్చినది
తానే,
పుచ్చుకొన్నది
తానే.
మానవుడు
ఈ
సత్యాన్ని
గుర్తించుకోలేక
ఇచ్చినప్పుడు
పొంగిపోవుచున్నాడు,
పుచ్చుకొన్నప్పుడు
క్రుంగిపోతున్నాడు.
కనుక
పొంగి
కృంగనటువంటి
సమతత్త్వాన్ని
మనము
అనుభవించాలి.
మన
తెలివితేటలు
పురస్కరించుకొని
అహంకారం
మరింత
అభివృద్ధి
పరచుకోరాదు.
మన
తెలివితేటలు
లౌకికమైన
తెలివితేటలే.
కాని
ఒకరి
తెలివితేటలు
మరొకరి
తెలివితేటల
కంటే
మరింత
అధికముగా
కనిపిస్తాయి.
ఎంత
అధికమైనా,
ఎంత
అల్పమైనా
కేవలం
హెచ్చుతగ్గులు
మాత్రమే
కనిపిస్తున్నాయి
కానీ,
అన్నింటి
స్వభావము
ఒక్కటే.
అందుచేతనే,
ఈ
జగత్తును
“అనిత్యం
అసుఖం
లోకం”
అన్నారు.
‘తెలుపు
-
నలుపుల’
తారతమ్యం
ఒక
రాజు
తన
రాజ్యంలో
ఎవరు
మేధాశక్తి
కలిగినవారో
పరీక్షించాలని
సభలు
జరిపి,
అందరిని
ఒక
చోటచేర్చి,
వారిని
ఒక
ప్రశ్న
వేశాడు-
ఈ
ప్రపంచములో
అన్నింటి
కంటే
తెలుపైనది,
నలుపైనది
ఏది?
ఒక్కొక్క
మేధావి
ఒక్కొక్కరీతిగా
చెప్పుతూ
వచ్చాడు.
ఒకరు
పాలన్నారు.
మరొకరు
ప్రత్తి
అన్నారు.
ఇంకొకరు
ఆకాశము
అన్నారు.
అందరిలో
మరొకడు
పక్షి
అన్నాడు.
ఏవేవో
వారివారికి
తోచినట్లుచెప్పుతూ
వచ్చారు.
కానీ,
ఇవన్నియూ
లోకసంబంధమైన
వస్తువులే.
ఆ
సభలో
ఒక
పరమ
భక్తుడు
ఉండటం
జరిగింది.
ఈ
రీతిగా
సమాధానం
చెప్పాడు—
“రాజా!
నేను
తెలివితేటలు
కలిగిన
వాడనుకాను.
నాకేమైనా
ఇంతో-అంతో
తెలివి
ఉంటే
అదికూడా
భగవంతుడు
అనుగ్రహించిన
వరమే.
అది
నాదికాదు.
అందరి
తలలలో
తెలివిని
చేర్చినటువంటివాడు
భగవంతుడే.
కానీ,
ఆ
తెలివిని
దుర్వినియోగపరచుకొనేవారు
కొంతమంది.
సద్వినియోగపరచుకొనేవారు
కొంతమంది
అని
చెబుతూ,
మహారాజా!
అన్నింటికంటే
తెలుపైనది
పగలు
(Day),
అన్నింటికంటే
నలుపైనది
రాత్రి
(Night)
అని
చెప్పినాడు.
ఈ
జగత్తులో
ఉండేటటువంటిది
ఇదే-
తెలుపుపగలు,
నలుపు
రాత్రి.
ఈతెలుపు
నలుపులలోనే
మన
జీవితం
అంతం
గావించుకొంటున్నాం.
తెలుపుపోతూనే
నలుపు,
నలుపు
పోతూనే
తెలుపు
వస్తాయి.
6
▾
Meaning
Keep
ఈ
తెలుపు
నలుపులను
సాధించినవారు
ఎవరు
ఈలోకములో?
అతనే
భగవంతుడు.
తెలుపు
నలుపులతో
కూడిన
దానిని
“దినము”
అని
అన్నారు.
ఈ
తెలుపు
నలుపులను
సాధించినవానిని
“దైవము”
అని
అన్నారు.
దినమునకు
దైవమునకు
ఉన్న
వ్యత్యాసము
ఒక్కటే.
దైవమునకు
Day
and
Night
లేదు.
అనగా
రాత్రింబవళ్ళులేవు.
దినమునకు
Day
and
Night
ఉంటున్నవి.
ఈ
రాత్రి
పగలు
సాధించుటలో
ఉండే
వివేకము,
విజ్ఞత
భగవంతుని
అనుగ్రహమే”
అన్నాడు.
ఏ
తెలివితేటలు
లేనివాడు,
ఏ
ఇతిహాస
పురాణములు,
శాస్త్రములు
చదువని
ఈ
మూర్ఖుడు
చెప్పినది
ఏవిధంగా
రైటుఅవుతుంది?
అని
పండితులు
అహంకారముతో,
ఆవేశంతో
తమ
బాధను
వ్యక్తంచేసినారు.
వెంటనే
వీరందరూ
రాజు
దగ్గర
ఈ
రీతిగ
Complaint
చేసినారు—
“రాజా!
ఈ
అజ్ఞాని,
మూర్ఖుడు
చెప్పినది
మీరు
విశ్వసించకూడదు.
దీనికొక
ప్రమాణము,
ఒక
నిదర్శనము
నిరూపించాలని”
పల్కినారు.
ఈనాడు
నైతిక,
ధార్మిక,
ఆధ్యాత్మిక,
భౌతిక,
వైజ్ఞానిక—
అన్ని
రంగములయందు
పరిశోధనలు
చాలా
ప్రధానమన్నారు.
ఈ
పరిశోధనలు
అన్నీ,
ప్రాకృత
సంబంధమైనవే.
కనుక
దీనిని
పరిశోధన
చేసి
ఇది
సత్యమా?
అసత్యమా?
నిర్ణయించాలని
పండితులు
చాలా
పట్టుపట్టినారు.
పండితుల
మాటలను
రాజు
అనుసరిస్తూ
వచ్చాడు,
“నాయనా!
పరమ
భక్తుడా!
దీనికి
ఏమిటి
ప్రమాణము?
ఏరీతిగా
దీనిని
సత్యమని
చెప్పగలవు?”
అని
ప్రశ్నించాడు.
“మహారాజా!
నాకు
ఒక్క
దినము
కాలము
ఇవ్వండి”
అని
అన్నాడు.
రాజు
‘సరే!
తీసుకో’మన్నాడు.
రెండవది
అడిగాడు
భక్తుడు-
“ఆ
దినములో
నేను
ఎటుపోయినా,
ఏమిచేసినా,
ఎవరూ
ఏమీ
అడ్డు
చెప్పకూడదు.
ఇదే
నా
పరిశోధనల
యొక్క
ఇష్టమని”
తెలిపినాడు.
అతని
ఇష్టమును
రాజుగారు
అంగీకరించి,
ఆరాజ
భవనమునకు
ఫలానా
వ్యక్తి
వచ్చినప్పుడు
ఎవ్వరూ
అడ్డుచెప్పకూడదు,
అతను
ఏమిచేసినా
ఎవ్వరూ
ఆతనికి
అడ్డు
చేయకూడదని
అందరికీ
చెప్పాడు.
రెండవ
దినం
మహారాజు
మధ్యాహ్నం
భోజనంచేసి
పడకగదిలో
విశ్రాంతి
తీసుకొంటున్నాడు.
అదే
సమయమందు
ఈ
వ్యక్తి
ఒక
పాత్రలో
పాలుపోసుకొన్నాడు.
వెంటనే
బయలుదేరి
ఆ
మహారాజు
పడకగదిలోపల
ఆ
పాలగిన్నెనుపెట్టి,
పడకగదికి
ముందు
భాగమున
ఒక
చంటిబిడ్డను
తెచ్చి,
కొట్టికొట్టి
ఏడిపించుటకు
ప్రారంభించినాడు.
ఆ
చంటిబిడ్డ
రోదన
వల్ల
ఆ
మహారాజునకు
నిద్రాభంగము
కలిగినది.
రాజు
పట్టరానికోపంతో
ముందు
వెనుకలు
గమనించకుండా
పరిగెత్తుకొని
వస్తున్నాడు.
‘ఇంత
అల్లరిచేసేవారెవరు?’
అంటూ
ఆ
వచ్చే
సమయంలో
ఆ
పాలగిన్నెను
కాలితో
తన్నాడు.
ఆ
సమయమున
ఆతనికి
ఆ
పాలగిన్ని
కనిపించలేదు
పాపం.
“రాజా!
పగటి
కంటే
పాలు
చాలాతక్కువ
తెలుపు
కలిగినవి
కనుక,
పాలయొక్క
తెలుపు
నీకు
కనిపించలేదు.
ఈ
పాలు
ఎక్కువ
తెలుపైనవే
అయితే,
మీకు
ఎందుకు
కనిపించలేదు?
పగటి
తెలుపు
కంటే
ఈ
పాల
తెలుపు
తక్కువైనది.
పాలకంటే
పగలు
చాలా
తెలుపైనది.
కాబట్టి,
ఈ
విషయానికి
మీరు
ఒప్పుకొనక
తప్పదు”
అన్నాడు
భక్తుడు.
7
▾
Meaning
Keep
ఆకాశములో
నక్షత్రాలు
పగలు
కూడా
ఉంటాయి.
పగటి
వెలుతురు
చాలా
ప్రకాశంగా
ఉండుటచేత
నక్షత్రాలు
కనిపించుట
లేదు.
పగలుదాటి
రాత్రి
అయ్యేటప్పటికి
నక్షత్రాలు
కనిపిస్తున్నాయి.
అందుచే
పగటితెలుపు
కంటే,
తెలుపైనది
జగత్తులో
మరొకటిలేదు.
ఈ
పగటి
తెలుపే
జ్ఞానము.
రాత్రి
నలుపే
అజ్ఞానము.
ఈ
జ్ఞానాజ్ఞానములకు
రెండింటికీ
అతీతమైనదే
దివ్యత్వం,
అదే
దైవత్వం.
అట్టి
దైవత్వమును
విస్మరించి,
ఈ
లౌకికమైన
వస్తువాహనాదుల
పైన
వక్రమార్గము
చేత
కాలాన్ని
దుర్వినియోగంచేసి
అనుభవిస్తున్నాము.
దివ్యత్వాన్ని
పొందాలంటే,
దివ్యతత్త్వంతోనే
దివ్యత్వము
పొందాలి.
చెప్పేదొకటి
-
చేసేదొకటి
ఈనాటి
మానవుడు
నేను
ఆత్మస్వరూపుడనని
చెప్పుతూ
ఉంటాడు.
కానీ,
దేహ
సంబంధమైన
పనులు
చేస్తున్నాడు.
చెప్పేది
ఒకటి
చేసేది
మరొకటి.
ఇది
సత్యమని
ఎట్లా
చెప్పగలరు?
The
proper
study
of
mankind
is
man
అదే
Thought,
word
and
deed.
మనో,
వాక్కాయ
కర్మలంటే
ఇవే.
ఈ
మూడింటి
ఏకత్వం
కావాలి.
అట్టి
ఏకత్వమును
పొందాలనుకొంటే,
ఆత్మతత్త్వమును
అర్థంచేసికోవాలి.
ఆ
ఆత్మయే
కాలము.
కాలము
భగవంతుడు.
కనుక
కాలమును
సార్థకం
గావించుకొనే
కర్మలను
చేయాలి.
ఇంతకు
మించిన
మంచి
సాధన
మరొకటిలేదు.
కాలమును
సత్ప్రవర్తనచే,సదాలోచనచే,
సత్కర్మలచే
మనము
సార్థకము
గావించుకోవాలి.
“సత్సంగత్వే
నిస్సంగత్వం,
నిస్సంగత్వే
నిర్మోహత్వం,
నిర్మోహత్వే
నిశ్చలతత్త్వం,
నిశ్చలతత్త్వే
జీవన్ముక్తిః”
కాబట్టి,
దీనికి
సత్సంగం
అత్యవసరము.
ఈ
సత్సంగమే
లేకపోతే,
ఉత్తమమైన
భావాలు
మనలో
ఆవిర్భవించవు.
ఎటువంటి
సమాజంలోచేరితే,
అటువంటి
స్వభావాలే
మనము
పొందుతాము.
ఈ
సందర్భమునకు
అనుగుణ్యంగా
ఐన్స్టీన్
‘Tell
me
your
company,
I
shall
tell
what
you
are.’
అని
చెప్పినాడు.
నీవు
ఎటువంటి
సంఘములో
చేరుతావో,
అటువంటి
వాడవని
నిర్ణయం
చేయవచ్చును,
చేసికోవచ్చును.
మంచివారితో
చేరు.
భగవద్భక్తిని,
భగవద్భావాన్ని
నీలో
నింపుకో.
దివ్యమైన,
భవ్యమైన
సంబంధము
పెంచుకో.
ఇదే
నిజమైన
సాధన.
ఆత్మసాక్షాత్కారం
జ్ఞానమంటే
ఏమిటి?
తన
తత్త్వమును
తాను
తెలుసుకోవటమే.
అదే
నిజమైన
జ్ఞానం.
స్వస్వరూప
అనుసంధానమే
జ్ఞానము.
నిరంతరము
ఆ
స్వరూపమును
చింతించడమే
సాక్షాత్కారము.
సాక్షాత్కారమంటే
సాక్షాత్
ఆకారమే
సాక్షాత్కారం.
Self
అంటే
ఏమిటి?
ఆత్మ.
Self-realisation
కావాలి,
I
అదే
Self.
‘I’
అనేదెవరు?
దేహమా
I,
మనస్సా
I,
బుద్ధా
I,
ఆత్మనా
I?—
ఈ
అన్నింటియందు
విచారణ
చేస్తే,
ఆత్మయే
I.
కనుక
ప్రపంచములోపల
లౌకికమైన
I
ఒకటి,
ఆధ్యాత్మికమైన
I
ఒకటి
రెండు
I
లు
ఉన్నాయి.
ఈ
ప్రాకృతమైన
I
ఏమిటంటే
EYE
ఇది
మూడు
అక్షరాలుకలది.
ఆధ్యాత్మిక
I
one
letter
I.
EYE
అనేది
దేహసంబంధమైనది.
ఏకాక్షరం
I
అదే
ఆత్మ.
8
▾
Meaning
Keep
ఆత్మను
గుర్తించుకోవటమే,
నేను
అనుకోవటమే
నిజమైన
I.
అదే
ఆత్మసాక్షాత్కారము.
నరుడు
-
నారాయణుడు
ఈ
ఆత్మ
అనేది
ఎక్కడ
నుండి
వచ్చినది?
నరుడు
అనగా
ఆత్మయే.
ఈ
ఆత్మనుండే
ఆకాశాది
భూతములంతా
ఆవిర్భవించాయి.
ఆకాశాది
భూతములను
నారములని
పిలుస్తూ
వచ్చారు.
ఈ
నారములకు
నిలయుడైనవాడే
నారాయణుడు.
పంచభూతములతో
కూడిన
నరుడే
నారాయణుడు.
శబ్ద,
స్పర్శ,
రూప,
రస,
గంధాదులన్నీ
ప్రతి
మానవుని
యందును
ఉంటున్నాయి.
నరుడనగా
ఆత్మ
అనే
అర్థం.
ఆత్మ
అనగా
ఆనందమయమైనది.
ఇట్టి
శాశ్వతమైన
ఆనందము
ఈ
జగత్తునందు
మనకు
కానరాదు.
మనం
అనుభవించేది
తాత్కాలికమైన,
క్షణభంగురమైన
ఆనందమే.
ఇంద్రియములచేతను,
వస్తువులచేతను,
విషయముల
చేతను,
వ్యక్తులచేతను
అనుభవించే
ఆనందం.
వ్యక్తులే
అశాశ్వతము.
విషయములే
అశాశ్వతము.
పదార్థములే
అశాశ్వతము.
అశాశ్వతమైన
వస్తువుల
నుండి
శాశ్వతమైన
ఆనందము
మనం
యేరీతిగా
పొందగలము?
కనుక
సత్యమైన
తత్త్వం
నీ
యందే
ఉన్నది.
అట్టి
సత్యతత్త్వాన్ని
పొందటము
కోసమే,
సాధన
అత్యవసరము.
బింబము
-
ప్రతిబింబము
ప్రతిబింబాలు
మారుతున్నాయికాని,
బింబాలు
ఏనాటికీ
మారవు.
కదిలే
జలములోపల
సూర్యుడు
కదిలినట్లుగా
కనిపిస్తాడు,
స్థిరమైన
జలములోపల
స్థిరమైన
సూర్యుడు
కనిపిస్తాడు.
మాలిన్యమైన
జలములోపల
మాలిన్యమైన
సూర్యుడుగా
కనిపిస్తాడు.
ఈ
కనిపించే
మాలిన్యం
సూర్యునిదికాదు.
కదిలే
సూర్యుడు
సాక్షాత్తు
ఆ
సూర్యుడు
కాదు.
ఇవన్నీ
ప్రతిబింబములు
మాత్రమే.
ఈ
దేహమే
ఒక
పాత్ర,
ఈ
మనస్సే
ఇందులోని
ద్రవపదార్థం,
దీనిలో
కనిపించే
ఆత్మతత్త్వమే
ప్రతిబింబము.
మనస్సు
స్వభావమును
పురస్కరించుకొని
స్థిరముగను,
అస్థిరముగను
లేక
మాలిన్యముగను,
రూపొందుతుంది.
సరియైన
భావములు
మనలో
ఆవిర్భవించినప్పుడు
సత్యమైన
తత్త్వము
మనకు
అర్థమవుతుంది.
చాలామందికి
ఆధ్యాత్మిక
విషయాలు
అంతగా
అర్థము
కావు.
పైమూడింటి
యందు
ఉండిన
ఏకత్వమును
గుర్తించుటకు
ప్రయత్నించాలి.
అచరం
-
చరం
“అచరం
చరమేవచ”
కదలకుండా
ఉండేవాడు,
కదిలేవాడు
భగవంతుడే.
కదిలించేవాడు
భగవంతుడే.
కదిలేవాడు
తానైనప్పుడు
అచలుడని
ఎట్లా
చెప్పుతారు?
స్థిరమైనవాడంటే,
చరమైనవాడని
ఎట్లా
చెప్పుతారు?
ఈ
రెండింటికి
చాలా
విరుద్ధము.
స్థిరమైనవాడు
భగవంతుడు
కానీ,
కదలుచున్నాడు.
దీనికి
వేదాంతము
చక్కని
ఆదర్శమును
అందిస్తూ
వచ్చింది.
మన
స్వప్నావస్థ
యందు
మన
స్వరూపము
అనేక
రకములుగా
కదలుతూ
ఉంటుంది.
పనులు
చేస్తూ
ఉంటుంది.
ఎన్నో
విధములుగా
చలిస్తూ
ఉంటుంది.
నడుస్తున్న
దేహము
ప్రక్కపైన
స్థిరముగా
ఉంటుంది.
ఇక్కడ
స్థిరం,
అక్కడ
చరం,
చరం
స్థిరమేవచ-
రెండూ
ఒక్కటే.
ఒక
అవస్థలో
చలిస్తూ
ఉంటున్నది.
9
▾
Meaning
Keep
మరొక
అవస్థ
లోపల
స్థిరంగా
ఉంటుంది.
అదే
విధముగా
వేదాంతమునందు
శారీరక
దృష్టిలోపల
చలించటం,
బ్రహ్మ
భావములో
స్థిరంగా
ఉండటం.
ధ్యానము
అనేది
ఏమి?
బ్రహ్మ
భావంచేత
స్థిరమైన
తత్త్వమును
పొందటమే
ధ్యానము
యొక్క
అంతరార్థము.
ఇట్టి
వేదాంత
వాక్కులు
ఎన్ని
విధములైన
అంతరార్థములనే
ప్రబోధిస్తూ
ఉంటాయి.
నీవు
అమృత
పుత్రుడవు
“వాసః”
అనగా
నీ
నివాసమెక్కడ?
అని
అర్థం.
అయ్యా!
నీ
నివాసమెక్కడ?
అంటే
“South
Prashanthi
లోపల,
ఫలానా
రూంలో
ఉన్నాను”
అని
ఈ
విధంగా
నీ
నివాసమును
గూర్చి
సమాధానము
చెప్పుకోవడం
కాదు.
కాని
ఈనాడు,
“వాసః”-అంటే
జగత్
సంబంధమైన
వాసంగా
భావిస్తున్నారు.
“సర్వజీవుల
వాసము
భగవంతుని
యందే-
నేను
భగవంతుని
యందు
వాసము
చేస్తున్నాను”.
‘అయ్యా!
నీవెవ్వరు?’
అంటే
నేనొక
రెడ్డిని,
రాజునని
చెప్పుట
సహజం
కానీ,
ఇవి
దేహ
సంబంధమైనవి
మాత్రమే
కానీ,
ఆత్మకు
సంబంధమైనవి
మాత్రము
కాదు.
ఇవన్నీ
లౌకికజగత్తునందు
ఉపయోగపెట్టుకునే
తత్త్వములు.
నీవు
రెడ్డివీ
కాదు,
నీవు
రాజువూ
కాదు.
నీవు
ఆత్మ
స్వరూపుడవు.
కాబట్టి
నీవు
అమృత
పుత్రుడవని
వేదం
చెప్పింది.
నీ
హృదయాంతరాళానికి
పయనించు
మన
దేహములో
ఉండిన
రక్తం
సరఫరా
కావటానికి
మనమేమి
సాధనలు
చేస్తున్నాము?
మన
ఉచ్ఛ్వాస,
నిశ్వాసములు
కూర్చున్నా,
నడుస్తున్నా,
నిద్రపోతున్నా,
అవి
సహజంగా
జరిగిపోతూనేయున్నాయి.
ప్రయత్నంతో
లభించేటటువంటివి
కాదే!
కాబట్టి
దైవ
చింతలు
అప్రయత్నముగా
సహజముగా
రావాలి.
“సహజం”
-
అనగా
ప్రయత్నం
కానిదానితో
జరిగేది.
అభ్యాసము
(Practice)
వల్ల
అప్రయత్నంగా
జరిగిపోతూనే
ఉంటాయి.
అలాంటిది
కాదు.
బుద్ధి
పూర్వకంగా
జరగాలి.
కొంతమంది
“నస్యం”
వేసుకుంటారు.
వారికి
అప్రయత్నంగా,
ఆ
చెయ్యి
అక్కడకు
పోతూనే
ఉంటుంది.
కొంతమంది
ఊరికే
జపం
చేస్తూ
చేస్తూనే
ఉంటారు.
ఇది
Unconcience
లో
జరుగుతుంది.
ఇది
నిజమైన
జపము
కాదు.
బుద్ధిపూర్వకంగా
సరియైన
రీతిలో
జరగాలి.
ఇది
Unconcience
ఉండకూడదు.
Superconcience
లో
జరగాలి.
అప్పుడే
ఇది
సహజమైనది.
అయితే
మనం
ఆ
స్టేజికి
రాగలమా?
అని
యోచించనక్కరలేదు.
నిజంగా
ఆపట్టుదల
పట్టితే
మీరు
తప్పక
సాధించవచ్చు.
తప్పక.
ఎట్టి
సందేహములేదు.
మనము
సరియైన
పట్టు
పట్టుటలేదు.
లౌకిక
విషయాలకై
పట్టుపడుతున్నాము.
లక్షల
మైళ్ళ
“అంతరిక్ష”
యానము
చేయాలంటే,
కావలసినంత
సాధన
చేస్తున్నాము.
కానీ
ఒక
యించైనా
“హృదయాంతరాళానికి”
ప్రయాణం
చేయుటలేదు.
ఇది
నిజమైన,
సరియైన
సాధన.
ఎన్ని
సంపాదించినా,
ఎంత
తెలివితేటలు
కలిగినా,
ఎంత
చదివినా-
యేమి
ప్రయోజనం
లేదు.
ఇవన్నీ
లోకానికి
సంబంధించినవే.
ఇవన్నీ
లోకంలో
సుఖశాంతులు
మాత్రమే
అందించగలవు.
కానీ
ఆత్మశాంతిని
అందించ
లేవు.
10
▾
Meaning
Keep
భగవత్చింతన
చేయండి
ఆత్మశాంతి
ఒక
దైవం
చేతనే
మనకు
లభ్యమవుతుంది.
ఈనాడు
నూతన
సంవత్సరమనుకుంటే,
సంవత్సరమనేది
నూతనకాలం.
ఇది
కేవలం
దైవస్వరూపమే.
“సంవత్సరం”
అనగా
దైవం
అని
అర్థం.
కనుకనే—
“కాలాయనమః
కాలకాలాయనమః
కాలదర్పదమనాయనమః
కాలాతీతాయనమః
కాలనిర్మాతాయనమః”
అని
వేదవాక్యం.
కాబట్టి
అంతాకాలమే
ముఖ్యకారణం.
మీరు
కాలాన్ని
పవిత్రం
చేసుకొనే
కర్మలు
ఆచరించండి.
ఎవ్వరినీ,
సాధ్యమైనంతవరకు
బాధించకుండా
చూచుకోండి.
ఏమిచేసినా,
ఏదిచేసినా
ఆ
ఫలితం
మనమే
అనుభవిస్తాం.
ఏ
కోపమో,
తాపమో,
ఈర్ష్యనో,
అసూయనో,
డంబమో—
వచ్చినప్పుడు
భగవత్
చింతన
చేయండి.
Previous
←
Love: Sacrifice: Unity
Next
Worldly learning and spiritual learning
→