Contents
Devotion & Sacred Story
Home
Library
Find
Shelf
Settings
←
Leave
Sathya Sai Speaks 1991 · Worldly learning and spiritual learning
Tap a verse for its meaning
IAST
Telugu
Meaning
Continuous
Worldly learning and spiritual learning
14 January 1991, Makara Saṅkrānti, Prasanthi Nilayam
1
▾
Meaning
Keep
“విద్యనేర్చిన
వాడనని
విఱ్ఱవీగవద్దు.
భాగ్యవంతుడనని
పలుకవద్దు.
ధనవంతుడనని
తరచు
గర్వించవద్దు.
పుత్రవంతుడనని
పొగడుకోవద్దు.
నేను
దాతనటంచు
చెప్పుకోవద్దు.
స్వామిభృత్యుడనంచు
పొంగవద్దు.
శౌర్యవంతుడనని
సంతోషపడవద్దు.
కార్యశూరుడనంచు
భావింపవద్దు.
ప్రపంచంలో
నీవు
నలుగురికి
మెప్పుగా
నడచుకొన్నచో,
ఆ
నళినదళనేత్రుడు
నిన్ను
ఆకర్షించి,
దీవింపగలడు.”
ప్రేమస్వరూపులైన
విద్యార్థినీ,
విద్యార్థులారా!
అధ్యాపకులారా!
“భగవంతుడు
అంతటా
అనేకమైన
పాదములతో,
హస్తములతో,
ముఖములతో,
శిరస్సులతో,
కన్నులతో,
చెవులతో—
వ్యాపించి
ఉన్నాడు”.
ఈ
సత్యాన్ని
మానవుడు
గుర్తించుకోలేక
తానేమేమో
చేయుచున్నానని,
ఏమేమో
తలంచుచున్నానని,
ఇది
ఎవ్వరికీ
తెలియదని
భ్రమించుచున్నాడు.
భగవంతుణ్ణి
కనుమరుగు
చేయటానికి
ఎవ్వరికి
సాధ్యంకాదు.
ఆతడు
అన్నింటినీ
గుర్తిస్తున్నాడు.
సర్వభూతముల
యందు
లోపల
వెలుపల
వ్యాపించియున్న
భగవంతుని
మరుగుపరచుటకు
వీలులేదు.
జీవులు
వేరు
వేరుగా
ఉండినప్పటికీ
దైవము
తాను
ఒక్కడుగనే
ఉన్నాడు.
తనను
తాను
ఏనాడు
విభజించుకోలేదు.
జగత్తులో
దైవమునకంటే
మనకు
అతి
సన్నిహితుడైనవాడు
మరొకరులేరు.
తల్లిదండ్రుల
కంటే
అతి
సన్నిహితుడు,
ఆప్తుడు
దైవము
తప్ప
మరొకరు
వేరులేరు.
ఇట్టిదైవమును
మరచిన
పాపము
వచ్చును.
అవిశ్వాస
అహంకార
మేఘాలు
అజ్ఞానియైన
మానవుడు
“భగవంతుడు
సర్వవ్యాపి,
సర్వశక్తిమయుడు,
సర్వజ్ఞుడు”
అయినచో
మాకెందుకు
గోచరించడు?
అని
ప్రశ్నిస్తూ
ఉంటాడు.
ప్రకాశించే
సూర్యునకు
తన
కిరణములద్వారా
ఏర్పడిన
మేఘములు
అడ్డు
తగిలి
సూర్యుని
కనిపించకుండా
చేస్తాయి.
కానీ
అంతమాత్రముచేత,
సూర్యుడు
లేడని
భావించటానికి
వీలులేదు
కదా!
అటులనే
మానవుని
యందు
ఆవిర్భవించిన
అవిశ్వాస,
అహంకారములనే
మేఘములు
భగవంతునకు
అడ్డుతగులుటచేత
భగవంతుడు
గోచరించడు.
మన
అవిశ్వాసము,
అహంకారములే
అతనిని
కనిపించకుండ
చేయుచున్నవి.
జంఝూమారుతము
వీచినంతనే
మేఘములు
కదలి,
సూర్యుడు
ఏ
విధముగా
మనకు
గోచరించునో,
అటులనే
ప్రేమ,
విశ్వాసములనే
గాలి
సోకినచో
-
అహంకార,
అవిశ్వాసాలనే
మేఘాలు
తొలగిన
దైవం
కనిపించును.
2
▾
Meaning
Keep
ఇట్టి
అవిశ్వాస,
అహంకార
మేఘములు
దూరము
గావించుకొనే
నిమిత్తమై
కొన్ని
విధములైన
సాధనలు
మనము
సల్పాలి.
ఆధ్యాత్మిక
మిత్రుడు
లౌకికమైన
మిత్రులు
ఎంతమంది
ఉండినప్పటికీ
ఆధ్యాత్మిక
మిత్రుడనేవాడు
లేకపోతే
ఈ
మిత్రులందరూ
నిరుపయోగమే.
ఆధ్యాత్మిక
మిత్రుడు
భగవంతుడు
ఒక్కడు
ఉండెనా,
లోకమంతా
నీకు
మిత్రత్వమే.
దైవమనే
మిత్రుణ్ణి
నీవు
దూరముగా
చేసుకొంటే,
జగత్తంతా
శత్రుత్వంగా
మారిపోతుంది.
కనుక
దైవమనే
మిత్రత్వమును
మీరు
సంపాదించుకొనుటకు
తగిన
పోరాటం
చెయ్యండి.
ఆ
పోరాటమునకు
విశ్వాస
ప్రేమలే
ప్రధానమైన
సూత్రములు.
క్రిందా,
మీదా,
చుట్టూ
అగ్ని
మండుతూ
ఉండినప్పటికిని,
దానిని
తప్పించుకొని,
ఏ
విధముగా
మోటారు
సైకిలుపై
లోపల
దూరినారో,
అదే
విధముగనే,
బాహ్యమైన,
ప్రాపంచికమైన
ఎన్ని
చిక్కులుండినప్పటికి,
వానిని
తప్పించుకొని
దైవత్వము
అనే
దానిలో
ప్రవేశించినప్పుడే
మన
లక్ష్యమును
సాధించినవారమవుతాము.
ఇందువలన
మీరు
ఆనందించడమే
కాకుండా
ప్రజలను,
తల్లిదండ్రులను,
ప్రేక్షకులను
కూడా
ఆనందపరచిన
వారవుతారు.
మీరూ
ఆనందమును
అనుభవించవచ్చును.
దివ్యమైన
మిత్రుడు
భగవంతుడే
భగవంతుని
మించిన
మిత్రుడు
ఇంకొకడు
లేడు.
దూషణ,
భూషణ
తిరస్కారములకు
ఏమాత్రము
తాను
చిక్కునటువంటివాడు
కాదు.
తాను
ప్రతిఫలాపేక్షతో
మానవుని
త్యజించుట
లేదు.
“సుహృత్”
అని
భగవంతునికి
ఒక
పెద్ద
టైటిల్
(బిరుదము).
అనగా
పరమ
మిత్రుడు
భగవంతుడు.
భక్తుని
నుండి
ఎట్టి
ఫలితమునూ
తాను
ఆశించడు.
ప్రతిఫలాపేక్ష
లేక
వ్యక్తులను
ఆదరించే
మిత్రుడు
భగవంతుడు
ఒక్కడే.
అట్టి
మిత్రుని
విశ్వసించటానికి
మానవుడు
ఏమాత్రం
అంగీకరించుటలేదు.
ఏ
మానవుడు
అట్టి
మిత్రుని
అంగీకరించి
దరిచేరి
అతని
బోధనలను
ఆచరించునో,
అనుష్ఠించునో,
అట్టివానికే
ఆ
దివ్యమైన
మిత్రత్వము
అర్థమవుతుంది.
అట్టి
విశ్వాసమే
నిజమైన
జ్ఞానము.
ఇహలోకంలో
సంపాదించుకొనే
విద్య,
పరలోకంలో
ముక్తిని
సంపాదించుకొనే
“బ్రహ్మవిద్య”
ఈ
రెండింటియందు
ఉత్తీర్ణుడైనవాడే
నిజమైన
మానవుడు.
బయట
మిత్రత్వమునకు
నీవు
ఎంత
ప్రాకులాడుతున్నావో,
ఆధ్యాత్మిక
మిత్రత్వమైన
దైవత్వమునకు
నీవు
అంతకంటే
అధికముగా
కృషి
చేయాలి.
అట్టి
మిత్రుని
నీవు
సాధించినప్పుడే
“సుహృత్”
అనే
తత్త్వం
నీలో
అభివృద్ధి
అవుతుంది.
జ్ఞాన
ఫలం
జ్ఞానం,
జ్ఞేయం,
జ్ఞాన
గమ్యం
అంటారు.
దీనినే
వేదాంత
పరిభాషయందు
వేరు
వేరు
పేర్లతో
బోధిస్తూ
వచ్చింది.
ఇందులో
ప్రధానమైనది
ఆసక్తి
కావాలి.
రెండవది
సాధనలు
సల్పాలి.
తదుపరి
ఆరూఢుడు
దాని
ఫలితమును
పొందిన
వాడవుతాడు.
మనము
దీనిని
విద్యార్థి
స్థితి
యందే
తీసుకొనవలెనన్న
(విద్యార్థి
-
అధికారి
-
పెన్షనర్)
విద్యార్థి
దశయందు
విద్యను
శ్రద్ధతో
అభ్యసించి
తద్వారా
విద్యయందున్న
రహస్యమును
గుర్తించుకోవాలి.
ఇట్టి
దానిని
అధికార
స్థానమునందు
అనుభూతితో
అందించాలి.
అదియే
ఉద్యోగ
లక్షణము.
కర్తవ్యమును
నిర్వర్తించటము,
క్రమము
తప్పక
ఆచరించటము,
స్వార్థరహితమైన
పనులలో
ప్రవేశించటము,
క్రమశిక్షణతో
తానీ
ఉద్యోగము
చేసినప్పుడే,
ఉద్యోగము
విరమించుకొన్న
తరువాత
పెన్షన్
పొంది
సుఖశాంతులను
అనుభవించగలడు.
అదే
విధముగనే
ఆధ్యాత్మిక
మార్గమందు
ఆసక్తిని
పొందటమే
విద్యార్థి
స్థాయి.
దీనిని
పొందే
నిమిత్తమై
తగిన
కృషి
చెయ్యాలి.
గుర్తించిన
సత్య
సాధనలను
ఆచరణలో
పెట్టాలి.
3
▾
Meaning
Keep
అప్పుడే
మనకు
“జ్ఞానఫలం”
అనే
దివ్యత్వము
ప్రాప్తిస్తుంది.
జ్ఞానమే
భక్తి,
జ్ఞేయమే
ఇక్కడ
ఉద్యోగము,
జ్ఞానఫలమే
పెన్షన్.
జ్ఞానమనే
విద్యను
మనము
అభ్యసించాలి.
అభ్యసించిన
ఈ
జ్ఞానాన్ని
అనుభూతిలో
ఉంచాలి.
అదే
జ్ఞేయము.
ఈ
రెండింటి
యందు
ఉత్తీర్ణుడైనప్పుడే
జ్ఞానఫలమనే
దివ్యత్వము
మనకు
అర్థమవుతుంది.
అదే
సత్
చిత్
ఆనందమనే
పెన్షన్
మనం
పొందవచ్చును.
వాదములు
-
మూడు
విధములు
“వాదః
ప్రమాదితః”.
వాదం
అనేది
మూడు
విధాలుగా
ఉంటున్నది.
ఒకటవది
వాదము,
రెండవది
గర్వం,
మూడవది
వివాదము.
ఈ
మూడింటి
యందు
సరియైన
సత్యాన్ని
గుర్తించుకొన్న
వ్యక్తికి
ఎట్టి
సందేహములు
కలుగవు.
వాదమనేది
సత్యాన్ని
తెలుసుకొనే
నిమిత్తమై,
తత్త్వమును
అర్థము
గావించుకొనే
నిమిత్తమై,
రాగ
ద్వేష
రహితమైన
మాటలతో
తాను
వాదోపవాదములు
చేస్తూఉంటాడు.
ఇది
కేవలం
ఆపేక్ష
సహితమైన
ఆనందముతో
చేసే
వాదన.
సంకుచితమైన
భావములు
కాని
లేక
సందేహ
భావములు
కాని
లేకుండ,
తమ
విశ్వాసమును
అభివృద్ధి
పరచుకొనే
నిమిత్తమై
వాదన
చేస్తూ
ఉంటారు.
ఇది
సహజవాదన.
రెండవది
గర్వవాదన.
తన
మాట
మాత్రమే
తాను
నెగ్గించుకొనవలెనని,
పరుల
యొక్క
మాటలు
ఖండించవలెనని-
సంకుచితమైన
భావంతో,
రాగ,
ద్వేషములతో
వాదించేటటువంటిది.
పరులను
ఓడించడమే
తన
ప్రధాన
లక్ష్యముగా
భావిస్తాడు.
తన
తత్త్వము
సత్యమా?
అసత్యమా?
అనే
విచారణ
ఏమాత్రం
చెయ్యడు.
ఇంక
మూడవది.
నిరంతరము
పరులను
దూషించడము,
పరులు
చెప్పినదానిని
ఖండించడము,
సత్యమా?
అసత్యమా?
అనే
విచక్షణా
జ్ఞానము
లేకుండగా
ఉంటాడు.
దీనిని
వితండ
వాదమంటారు.
ఇట్టి
మానవులు
ఈ
జగత్తునందు
అనాదికాలం
నుండి-
కాలంతోబాటు
కర్మలను,
కర్మలతోబాటు
కాయమును
అనుభవిస్తున్నారు.
నాలుగు
తత్త్వాలు
మనం
విజయాన్ని
చేకూర్చుకొనవలెనన్న
నాలుగు
తత్త్వములు
మనము
అర్థం
చేసుకోవాలి.
“యాస్తిక,
ఆస్తిక,
ఆస్తిక-నాస్తిక,
నాస్తిక”
—
అని
నాలుగు
విధములు
కలవు.
1.
“యాస్తిక”-
అనగా
పవిత్రమైన
భగవత్
వీచికలు
సుగంధముతో
మనకు
ఆనందమును
అందించుచున్నప్పుడు,
ఈ
సుగంధము
ఎక్కడ
నుండి
వచ్చుచున్నది?
అన్న
విచారణ
సల్పి,
ఆ
సుగంధము
ఏ
జన్మస్థానము
నుండి
మనకు
వెలువడుచున్నది-
అనే
విచారణ
చేయటము.
వెతికి
వెతికి
ఆ
సుగంధము
ఏ
పుష్పము
నుండి
వచ్చుచున్నదో,
ఆ
పుష్పాన్ని
పట్టడం.
అనగా
వేద
శాస్త్ర
ఇతిహాస
పురాణముల
యొక్క
తత్త్వమును,
ఈ
పొదలనూ
చక్కగా
విచారణ
చేసి,
ప్రతీ
పొదయందు,
ఈ
సుగంధ
పుష్పము
ఎక్కడ
ఉన్నది?
అని
ఏక
లక్ష్యముతో
వెతకడమే.
ఈ
వెతికినప్పుడు
చిక్కినదే
యాస్తికత్వము.
అనగా
వెతికి
ఆ
సత్యాన్ని
గుర్తించి
దానిని
పొందడమే
యాస్తికత్వము.
2.
“ఆస్తికత్వము”
అనగా
వాసన
గుర్తించి
ఇది
ఎక్కడ
ఉన్నది?
ఎక్కడ
ఉన్నది?
అని
జీవితమంతా
వెదకుతూ
ఉండటమే
ఆస్తికత్వము.
3.
“ఆస్తిక
-
నాస్తికత్వము”
అనగా
కొంతకాలము
ఈ
వాసనను
చూచి
ఎక్కడ
ఉన్నది?
అని
వెతికి
నిరాశతో,
నిస్పృహతో
ఈ
విచారణ
వదలుకోవడము.
అట్టివానికి
వాసనకూడ
తెలియదు.
వాసన
లేక
పోలేదు.
వాసన
ఉన్నదికాని,
ఆతనికి
ఆవరించిన
రోగము
యొక్క
ప్రతిఫలమే.
ఈనాటి
విద్యార్థి
స్థితి
కేవలము
వాసన
అనుభవిస్తున్నాడు.
కొంతమంది
దానిని
వెదకడానికి
ప్రయత్నము
చేస్తున్నారు.
కొంతమంది
వాసన
ఉన్నది,
మాకంతే
చాలు;
పుష్పాన్ని
వెదకనక్కర
లేదని
విరమించుకొంటున్నారు.
ఇది
ఆస్తిక—నాస్తికత్వము.
4
▾
Meaning
Keep
4.
“నాస్తికత్వము”
అనగా
మరికొంతమంది
ఈ
లౌకికము,
భౌతికమే
మనకు
ప్రధానముకాని,
ఈ
విధమైన
ఆస్తికత్వమనే
సుగంధము
మాకు
అక్కరనే
లేదని
భావిస్తున్నారు.
ఇట్టివారే
నాస్తికులు.
కేవలము
ఈలాంటి
వారు
జీవితమంటే
ఏమిటో
గుర్తించుకోలేకపోవుచున్నారు.
తినటం,
త్రాగటం,
ధనం
వృద్ధి
చేసుకోవడం,
సుఖమును
అనుభవించడం
—
ఇదే
జీవిత
లక్ష్యముగా,
పరమావధిగా
భావిస్తున్నారు.
ఈలాంటివాడు
కేవలము
మాయ
మానవుడేకాని,
మాధవ
మానవుడు
కాదు.
ఆకార
మానవుడేకాని,
సాకార
మానవుడు
కానేరడు.
ఇది
నాస్తికత్వము.
స్థూలదేహం-
సూక్ష్మదేహం
దీనికి
శారీరక,
మానసిక
తత్త్వాలు
కొంతవరకు
సహాయకారిగా
ఉంటాయి.
ఆరోగ్యమైన
దేహమందు
ఆరోగ్యమైన
భావాలే
అభివృద్ధి
అవుతూ
ఉంటాయి.
కనుక
ఆటలు
ఆడటము,
పాటలు
పాడటము
ఆనంద
ఆరోగ్యముల
నిమిత్తమై
ఏర్పడినవనే
సత్యాన్ని
గుర్తించుకోవాలి.
మనకు
స్థూల
దేహముతోబాటు
సూక్ష్మ
దేహము
ఒకటి
ఉన్నది.
ఈ
సూక్ష్మ
దేహమునకు
తగిన
కృషి
చెయ్యాలి.
అదే
ఆధ్యాత్మిక
రంగములో
మనము
దివ్యత్వముతో,
దైవత్వములో
చేరే
ఆటలు.
ఈ
ఆటలలో
సమైక్యత,
సమరసము,
సంతోషము
అనే
మూడు
ఫలితములుంటాయి.
దేహమనే
పాత్రను
ఆరోగ్యంగా,
ఆనందముగా
ఉంచుకోవడానికి
ఆటలు
అత్యవసరము.
సద్గుణములు,
సద్బుద్ధి,
సత్యనిరతి,
భక్తి,
కర్తవ్య
పాలనము—
ఈ
ఆటల
యందే
విద్యార్థి
నేర్చుకొనుటకు
అవకాశము
కల్పింపబడును.
ఇవే
సూక్ష్మ
దేహమునకు
తగిన
ఆనంద
ఆరోగ్యములు
అందిస్తాయి.
విద్యార్థులు
ఆటలతోపాటు
గుణములు
పోషించుకోవటానికి
తగిన
కృషి
చెయ్యవలెను.
ఆటలలో
మీకింత
పట్టుదల,
ఇంత
శ్రద్ధ
ఏ
రీతిగా
ఉంటున్నవో,
అదే
రీతిగా
అంతకంటే
అధికముగా
ఆధ్యాత్మిక
మార్గములో
మీ
పట్టుదల,
శ్రద్ధలు
అభివృద్ధి
గావించుకోవాలి.
ఈ
భౌతిక
విద్యలన్నియూ
భౌతిక
ప్రపంచమునకు
మాత్రమే
తోడ్పడుతాయి.
మానసిక
సంబంధమైన
శాంతిభద్రతలు
చేకూర్చే
విద్య
ఆధ్యాత్మిక
విద్యయే.
ఇదే
జీవిత
పరమావధి.
వైస్-ఛాన్సలర్స్
-
త్రయం
మన
సరాఫ్
పరమ
భక్తుడు.
5
సం
॥
నుండి
మీకందరకూ
తెలుసు.
ఇతను
ఇక్కడకు
రాకపూర్వం
మానవతా
విలువలను
(Human
Values)
గూర్చి
అనేక
గ్రామములకు
వెళ్ళి,
అనేక
రకాలుగా
ప్రచారం
చేసి,
ఎంతో
సేవ
చేసినవాడు.
కేవలము
ఇక్కడికి
స్వామి
యొక్క
దయ,
ప్రేమల
నిమిత్తమై
వచ్చినవాడు.
ఉద్యోగ
నిమిత్తమై
వచ్చినవాడు
కాదు.
ఈ
వయస్సులో
శేష
జీవితాన్ని
పవిత్రమైన,
ఆదర్శవంతమైన
జీవితంగా
తాను
అనుభవించి,
ఆనందించి,
అదే
ఇతరులకు
అందించాలనేదే
అతని
ముఖ్య
లక్షణము.
అతను
పిల్లలలో
పిల్లవాడు,
ఉపాధ్యాయులలో
ఉపాధ్యాయుడు,
భక్తులలో
భక్తుడు.
ఇట్టి
వ్యక్తి
వైస్-ఛాన్సలర్‌గా
విద్యాలయానికి
రావడం
పిల్లల
అదృష్టం.
గవర్నమెంటు
నిబంధనలను
పురస్కరించుకొని
ఈనాటి
నుండి
Vcగా
విరమించుకోవడానికి
పూనుకొన్నాడు.
అతని
స్థానంలో
అటువంటి
పవిత్రమైన
హృదయం
కలిగినటువంటివాడే,
తన
శేష
జీవితమును
స్వామి
సన్నిధిలో
గడుపుకొని,
తన
జీవితమును
సార్థకము
గావించుకోవాలనే
ఉద్దేశ్యముతో
మన
సంపత్
వచ్చినాడు.
ఈనాటి
నుండి
అతను
ఈ
స్థానమును
స్వీకరిస్తున్నాడు.
వీరిద్దరిని
గూర్చి
బృందావనం
క్యాంపస్
ప్రిన్సిపాల్
శ్రీ
కె.
అనిల్
కుమార్
కొంతసేపు
మాట్లాడగలడు.
వీరిద్దరూ
సేవాభావముతో
ఇందులో
పాల్గొనుచున్నారేకాని,
తాము
చేసే
పని
జీతముల
నిమిత్తమై
కాదని
చెప్పవలె.
వీరిరువురు
గౌరవార్థముగా
Work
చేసేవారు.
కాబట్టి
సంపత్
తన
జీవితాన్ని
మన
ఇన్స్టిట్యూట్లో
మిమ్ములను
ఆదర్శమైన
విద్యార్థులుగా
తీర్చిదిద్దాలనే
ఉద్దేశ్యంతో,
అతనికి
లభించిన
ఉన్నత
పదవులు,
ఉత్తమ
పదవులు
విసర్జించి
ఇందులో
ప్రవేశించినాడు.
5
▾
Meaning
Keep
ఇటువంటి
ఉత్తమ
వైస్-ఛాన్సలర్
మనకు
లభించడము
మీ
యొక్క
మహాభాగ్యము.
మన
విశ్వవిద్యాలయము
ప్రారంభమైనప్పటి
నుండి
మహాపండితుడు,
కవి,
అన్ని
విధములైన
శక్తి
సామర్థ్యములు
కలిగినవాడు
గోకాక్
అనే
అతను
మొట్ట
మొదట
మన
ఇన్స్టిట్యూట్నకు
వైస్-ఛాన్సలర్‌గా
నియమింపబడ్డాడు.
అతని
తరువాత
భక్తి
ప్రపత్తులతో
సరియైన
సేవను
అందించడానికి
వచ్చినవాడు
సరాఫ్.
ఈనాటి
నుండి
లౌకికంగా,
భౌతికంగా,
ఆధ్యాత్మికంగా,
వైజ్ఞానికంగా
ఉత్తీర్ణుడైన
సంపత్
Vc
పదవి
స్వీకరిస్తున్నాడు.
మన
విశ్వవిద్యాలయమునకు
ఈ
ముగ్గురు
‘ముమ్మూర్తుల’
స్వరూపముగా
భావింపవచ్చును.
వీరు
ఎట్టి
వాంఛలు
లేకుండా,
ఎటువంటి
పదవీ
వాంఛలు
లేకుండా,
త్యాగభావముతో
పదవిని
స్వీకరించిన
వ్యక్తులు.
విద్యార్థులారా!
వైస్-ఛాన్సలర్స్
“Come
and
go
but
Swami's
Love
Comes
and
Grows”.
ఎంతమంది
వైస్-ఛాన్సలర్స్
మారినప్పటికి,
వారి
ప్రేమకు
స్వామి
ప్రేమకు,
వారి
హృదయానికి—స్వామి
హృదయానికి
సన్నిహిత
సంబంధ
బాంధవ్యమనేది
పెరుగునేకాని,
మారదు.
‘వైస్-ఛాన్సలర్స్’
ఛైర్స్
పేర్లు
మారవచ్చునేమో
కాని,
వారి
హృదయాలు
ఎప్పటికీ
మారడానికి
వీలుండదు.
కనుకనే
మన
సరాఫ్
ఈ
విధమైన
ఉద్దేశ్యముతో
ఉండడము
చేత,
అతనిని
బయటకు
పంపుటలేదు.
అతని
“శేషజీవిత”
మంతా
స్వామిసేవ
యందు,
సమాజసేవ
యందు
ఆనందముగ
అంకితము
గావింకోవాలనే
ఉద్దేశ్యంతో
ఉండటముచేత,
అతనిని
మా
‘సెంట్రల్
ట్రస్టులో’
పెట్టుకొని
తద్వారా
యూనివర్సిటీకి
తగిన
సంబంధ
బాంధవ్యములు
పెట్టే
నిమిత్తమై
నిర్ణయించుకొన్నాము.
కనుక
సరాఫ్
బయట
ప్రదేశానికి
వెళ్ళుతాడేమోనని
మీరు
ఏమాత్రం
విచారపడనవసరము
లేదు.
వీరిరువురు
కేవలం
స్వామి
అండదండలు
ఆశించి
వచ్చినవారు.
కాబట్టి
వీరిద్దరూ
“రామ
లక్ష్మణుల”వలె
ఈ
కార్యములలోపల
తగిన
అభివృద్ధిని
తెస్తారని
ఆశిస్తున్నాను.
విద్యార్థులు
స్వార్థ,
స్వప్రయోజనముల
నిమిత్తమై
ప్రాకులాడరాదు.
పశు,
పక్షి,
మృగాదులకైనా
స్వార్థరహిత
భావమున్నది.
ఈనాటి
విద్యావంతులలోపల
విశాలమైన
భావములు
ఎక్కడా
కనపడుటలేదు.
Life
is
challenge.
బయట
ప్రపంచానికి
పోయినప్పుడు,
మీ
భావాలకు
అడ్డుతగిలేటటువంటి
భావాలను
ఎదుర్కొని
విజయాన్ని
సాధించి,
బలాన్ని
మీరు
పెంచుకోవాలి.
దీనికి
తగిన
రీతిగా
మన
విద్యాసంస్థలో
అధ్యాపకులు,
వైస్-ఛాన్సలరు,
రిజిస్ట్రారు,
కంట్రోలర్
వీరందరూ
తగిన
ఉత్సాహ
ప్రోత్సాహము
లందించుచూనే
ఉన్నారు.
కాబట్టి
విద్యార్థులు
తగిన
కంకణమును
కట్టుకోవటానికి
ప్రయత్నించాలి.
ఈనాటి
ప్రపంచములో
సరియైన
విద్యను,
సరియైన
ఆదర్శమును
నిరూపించాలి
విద్యార్థులు.
విద్యార్థులారా!
పవిత్రమైన
హృదయాలు
కలిగిన
వైస్-ఛాన్సలర్లను
సరియైన
రీతిలో
మీరు
గౌరవించుకొని,
వారి
ఆదేశములను
అందుకొని
తద్వారా
మీరు
ఉన్నత
స్థాయిని
అందుకుంటారని
నేను
ఆశిస్తూ,
ఆశీర్వదిస్తూ
నా
ప్రసంగాన్ని
విరమిస్తున్నాను.
Previous
←
Time and duty
Next
Prema, beyond all describing
→