Contents
Devotion & Sacred Story
Home
Library
Find
Shelf
Settings
←
Leave
Sathya Sai Speaks 1991 · Keep evenness in remembering the Name
Tap a verse for its meaning
IAST
Telugu
Meaning
Continuous
Keep evenness in remembering the Name
13 February 1991, The morning after Mahāśivarātri, Prasanthi Nilayam
1
▾
Meaning
Keep
ప్రేమస్వరూపులారా!
ఇంద్రియములతో
కూడిన
ఈ
పాంచభౌతిక
శరీరము
మనస్సు
నుండి
వేరుకాదు.
ఈ
శరీరమును
మనస్సు
తన
విలాసార్థమై
నిర్మించుకొన్న
భవనము.
సమస్త
ఉపాధులకు
మనస్సే
మూలకారణం.
మనస్తత్త్వమును
పురస్కరించుకొనియే
జగత్తు
జరుగుచున్నది.
ఈ
మనస్సు
సంకల్ప,
వికల్పములతో
కూడిన
స్వరూపము.
సంకల్పబీజము
చేతనే,
కర్మఫలము
సిద్ధిస్తుంది.
కర్మవిత్తనము
చేతనే
భావములు
ఏర్పడుతూ
ఉంటాయి.
భావబీజం
వలననే,
అభ్యాసం
ప్రాప్తిస్తుంది.
అభ్యాసబీజము
చేతనే,
శీలం
చేకూరుతుంది.
శీలబీజము
చేతనే,
అదృష్టము
కలుగుతుంది.
మానవుని
అదృష్ట
-
దురదృష్టములు
శీలముపైననే
ఆధారపడి
ఉంటుంది.
శీలమే
అన్నింటికిని
కారణం.
మనస్సు
-
శీలము
-
సంకల్పం
శీలమునకు
అభ్యాసములే
మూలం.
అభ్యాసములకు
భావములే
కారణము.
భావములకు
సంకల్పములే
మూలం.
సమస్త
సంకల్పములు
కర్మల
చేతనే
ఏర్పడుచున్నవి.
కనుకనే-
“కర్మాను
బంధీని
మనుష్యలోకే”
అన్నారు.
మానవ
జీవితమంతయు,
కర్మ
చేతనే
కట్టబడియున్నది.
“నీరులేని
పంట
అస్థిత్వము
-
ఎంత
మిథ్యామాత్రమో,
మనస్సులేని
జీవితము
అస్థిత్వము
-
అంత
మిథ్యామాత్రమే”.
నీరులేని
పంట,
కరెంటు
లేని
వైరు,
పండితుడులేని
బడి,
దేవుడులేని
గుడి,
మనస్సులేని
జీవితం
అంతా
వ్యర్థం.
దేవుడు
లేకుండా
మందిరం
నిర్మించరు.
పంతులు
లేకుండ
విద్యార్థిచేరడు.
కరెంటు
లేకుండా
వైరు
ఉండదు.
నీరు
లేకుండా
పంట
పండదు.
మనస్సు
లేకుండా
జీవితము
నిండదు.
కనుక
అన్నింటికి
మూలకారణము
మనస్సే.
మన
అదృష్ట
-
దురదృష్టములన్ని
మనస్సుపైన
ఆధారపడి
ఉన్నవి.
మనస్సును
నిర్మలంగా
ఉంచుకోవటం,
సంకల్పములను
పవిత్రముగా
ఏర్పరచుకోవటము
మానవునికి
ప్రధానమైన
విధి.
మనస్సును
మిత్రునిగా
చేసుకో
క్రూరుడు,
దయారహితుడు,
కఠినహృదయుడైన
రత్నాకరుడు
మహర్షుల
బోధల
చేతను,
వారి
సంకల్పముల
చేతను
తాను
వాల్మీకిగా
మారగలిగినాడు.
అతని
సంకల్ప
ప్రభావము
చేతనే
పవిత్రమైనటువంటి
రామాయణ
మహాఘట్టమును
వ్రాయుటకు
నాయకుడుగా
తయారు
కాగలిగినాడు.
అందుచేతనే,
అతని
కీర్తి
ప్రతిష్ఠలు
జగద్విఖ్యాతిని
గాంచినవి.
శ్లోకదాతుడు
వాల్మీకిగా
తయారైతే,
లోకదాతుడు
ఈశ్వరుడుగా
మారినాడు.
2
▾
Meaning
Keep
ఈ
హేతువుచేత,
లోకదాతకు
సమానమైన
స్థాయికి
శ్లోకదాతుడందుకోగలిగినాడు.
ఇట్టి
పవిత్రమైన
ఉన్నత
స్థాయిని
పొందుటకు
కారణమేమి?
అతని
సంకల్పమే
మూలకారణం.
సంకల్పము
పవిత్రమైనప్పుడే,
సమస్త
అదృష్టములు
మనలను
చేరుతాయి.
ఈ
సంకల్పములు
దుష్టమైనవిగా
ఉండినప్పుడే,
సమస్త
దురదృష్టములు
మన
వెంట
చేరుతాయి.
కనుక,
కలిసి
వచ్చినవేళ,
మట్టి
కనకమేయగును.
కర్మచాలకున్నచో
కట్టియే
పామై
గ్రాలును.
మన
సంకల్ప,
వికల్పముల
వల్లనే
అదృష్ట,
దురదృష్టములు
మనలను
వెంటాడుతూ
ఉంటాయి.
వీటన్నింటికి
ఇంద్రియములే
మూలకారణం.
మనము
ఇంద్రియములను
స్వాధీనం
చేసికోవలెనన్న,
దీనికి
Master
అయినటువంటి
మనస్సును
అరికట్టుకోవాలి.
మనస్సును
మిత్రునిగా
చేసుకోవాలి.
శివరాత్రి
అంటే
ఏమిటి?
విద్యార్థులు,
విద్యార్థినిలు
నేటి
రాత్రంతయూ
ఎంతో
అత్యంత
భక్తి
శ్రద్ధలతో
గానము
చేసినారు.
భగవత్
నామమునందు
సమత్వాన్ని
వహించి
దివ్యత్వాన్ని
చేపట్టి
దైవత్వాన్ని
చేరండి.
ఈనాడు
ఎంతో
పవిత్రమైన
సుదినం.
పూర్ణచంద్రుని
రాత్రి
“పూర్ణిమ”
అంటారు.
రాత్రి
అంటే
ఏమిటి?
రాత్రి
అనగా
చీకటితో
కూడినదని
అర్థం.
ఈనాడు
శివరాత్రి
అనగా
నేమి?
మంగళకరమైన
రాత్రి.
నేటి
రాత్రంతయూ
భగవన్నామ
స్మరణచేత
పవిత్రము
చేసుకొనుటచేత
ఇది
మంగళకరమైన
రాత్రిగా
పేర్కొన్నారు.
ఈ
భగవన్నామమును
ఎంత
పరిశుద్ధమైన
హృదయముతో
ఎంత
పవిత్రమైన
భావముతో
ఉచ్చరిస్తారో,
అంతకు
అంత
పవిత్రత,
పుణ్యము
మనకు
లభిస్తుంది.
ఆ
పవిత్రతను
పొందినప్పుడు
జీవితంలో
సర్వమూ
పవిత్రమైపోతుంది.
ఒక్కదానిలో
విజయాన్ని
సంపాదిస్తే,
అన్నింటిలో
విజయాన్ని
సాధించగలము.
భగవన్నామం
ఎవ్వరు
పాడినా
అనుసరించు
ఈనాడు
లోకములో
మనకు
నూతన
విద్యలు
అవసరం
లేదు.
అట్లే,
నూతన
సమాజ
స్థాపనకూడా
అక్కరలేదు.
మనకున్న
గుణములు
చక్కదిద్దుకుంటే
దేశమే
బాగుపడుతుంది.
యువకుల
యందు
అహంకారము,
దురభ్యాసము,
దుశ్చింతలు
దూరం
గావించుకోవాలి.
బజారులో
ఉన్న
బిక్షకుడు
భగవన్నామము
చేసుకొంటూ-
చక్కగా,
హాయిగా
గానము
చేస్తాడు.
తాను
బిక్షకుడు
(Beggar)
కానీ,
“భగవన్నామము”
బిక్షకుడు
(Beggar)
కాదు.
ఆ
నామమును
ఎవ్వరైనా,
ఎప్పుడైనా
గానము
చేసినా,
హాయిగా
శ్రవణము
చేయవచ్చును.
పాత్రను
చూడరాదు.
పదార్థాన్ని
చూడాలి.
ఎవరు
పాడుచున్నారని
మనం
విచారించనక్కర
లేదు.
అదేవిధముగా
ఎవరు
పాడినాసరే,
ఆ
దివ్యనామాన్ని
అనుసరించాలి.
ఈ
నియమాన్ని
ఇక్కడ
ఉండినప్పుడు
మాత్రమేకాదు-
“అడవులందున్న,
ఆకసమందున్న,
గుట్టమీదనున్న,
పల్లెయందున్న,
పట్టణమందున్న,
నట్టేట
నిలిచియున్న,
మందిరమందున్న,
మఠమునందు
ఉన్న,
ఎక్కడ
ఉన్నప్పటికి”—
ఆ
నామచింతనలో
సమత్వాన్ని
పాటించాలి.
నామస్మరణలో
సమత్వాన్ని
మనము
పాటించినప్పుడు,
సర్వవిధములా
సమత్వాన్ని
మనం
పొందవచ్చును,
అభివృద్ధిని
గావించుకోవచ్చును.
యవ్వనం
కదలిపోయే
మేఘం
ప్రేమస్వరూపులారా!
వృద్ధాప్యములో
మన
దేహం
క్షీణిస్తుంది.
మనస్సు
భ్రమిస్తుంది.
ఆసమయములో
మనము
ఏ
చింతన
చేయలేము.
ఏ
విధమైన
నిగ్రహ
శక్తిని
సాధించలేము.
ఇది
అసాధ్యం.
అనేక
మంది
పెద్దలు
రిటైర్
అయినతరువాత,
భగవత్కార్యములో
పాల్గొనవచ్చునని,
భగవచ్చింతన
చేయవచ్చునని
తాత్సారం
చేస్తారు.
ఈనాడు
ప్రయత్నపూర్వకముగా
సాధించినప్పుడే,
మనము
రిటైర్మెంటు
తీసుకొన్న
తరువాత
దీనిని
సాధించటానికి
వీలౌతుంది.
3
▾
Meaning
Keep
మొదట-
‘సిపాయి’గా
చేరినవారు,
రిక్రూటింగులో
తాను
ట్రైనింగు
పొందనప్పుడు,
యుద్ధభూమిలో
కత్తిని
చేపట్టి
ఏ
రీతిగా
విజయాన్ని
సాధించగలుగుతాడు?
యవ్వన
వయస్సులో,
ఇది
ఒక
రిక్రూటింగువంటిది.
ఇందులో
సరియైన
పద్ధతిలో
తర్ఫీదు
పొందాలి.
“పద
పదమని
కాలకింకరులు
పాశములాగెడు
వేళ,
దబ
దబ
బయట
పెట్టుడికలాభంలేదని
చెప్పెడువేళ,
లబలబ
ఆలుబిడ్డలు
ఏడ్చెడువేళ
హరినామము
నోటపల్కుట
సాధ్యమా?”
కాదు.
కాబట్టి
అప్పుడు
హరినామము
చెప్పుకోవచ్చునని
పల్కితే,
మనకు
ఏ
రీతిగా
సాధ్యమౌతుంది?
అట్లు
వీలుపడదు.
కాబట్టి
మన
జీవితకాలములో
మనము
చేసిన
అభ్యాసమే,
అంత్యకాలములో
మనకాదరణగా
నిలుస్తుంది.
కనుక
ఈ
యవ్వనము
చాలా
పవిత్రమైనది.
కానీ,
అమితకాలము
నిలిచేటటువంటిది
కాదు.
అదికూడ
మితకాలమే
-
కొంత
కాలమే.
యవ్వనం
కదలిపోయే
మేఘమువంటిది.
మధ్యలోవచ్చి,
మధ్యలో
పోయేటటువంటిదే
ఈ
యవ్వనం.
మన
భావములను
పరిశుద్ధపరచుకొనుటకు
తగిన
కృషి
చెయ్యండి.
సామూహిక
భజన
ప్రాశస్త్యం
ఒక్క
సత్యసాయి
ఇన్స్టిట్యూట్
నందు
మాత్రమే
పవిత్ర
భావాలు
ఉంటున్నాయి.
కానీ
ఆ
పవిత్రమైన
సూత్రమును
మరింత
పవిత్రము
గావించుకోవటము
అత్యంతవసరము.
ఈ
జగత్తును
భగవన్నామము
తప్ప
కాపాడగలిగినది
మరొకటిలేదు.
ఈ
జగత్తును
కాపాడుటకు
ఆయుధములు
కాదు,
ఈ
జగత్తును
కాపాడేది
బాంబులు
కావు,
ఈ
జగత్తును
భగవదనుగ్రహము
మాత్రమే
కాపాడుతుంది.
ఆ
అనుగ్రహమునకు
పాటుపడుట
మానవుని
కర్తవ్యం.
కనుక
ప్రార్థన
చాలా
ప్రధానమైనది.
రాగ,
తాళములతో
బాటు
భావమును
చేర్చినప్పుడే,
దివ్యమైన
రాగముగా
రూపొందుతుంది.
లేకపోతే
భావములేని
రాగం
రోగంతో
సమానం.
అహంకారమును
దూరమునెట్టి,
ఆడంబరమును
అణగద్రొక్కి,
వినయ
విధేయతలతో,
భక్తి
శ్రద్ధలతో
భగవన్నామాన్ని
స్మరించాలి.
అదే
నిజమైన
పద్ధతి.
ఆ
భగవన్నామముయొక్క
విషయాన్ని
చక్కగా
గుర్తించి
వర్తించాలి.
త్యాగరాజు
చెప్పాడు-
“తెలిసి
రామ
చింతన
చేయవే
మనసా”.
అదే
విధముగనే
నిజజీవితములో,
“చూచి
త్రొక్కు,
తెలిసి
మ్రొక్కు”.
మీరందరూ
ఏక
కంఠంతో
పాడినప్పుడు,
ఎంత
మనస్సు
యొక్క
Vibration
దివ్యమైన
దివ్య
శక్తి
ఎన్ని
విధాలుగా
రాణిస్తుంది?
ఈ
ఐకమత్యంతో
కూడిన
Vibration
సర్వత్రా
వ్యాపించిందంటే—
జగత్తే
మార్పు
చెందుతుంది.
ఒక్కొక్కరుగా
పాడుతూవుంటే,
ఆ
దివ్యమైన
శబ్దం
హృదయం
స్తంభించిపోతుంది.
కనుకనే
గురునానక్
సామూహిక
భజన
అనే
దానిని
ప్రారంభించినాడు.
అందుచేతనే
అందరి
గానస్వరూపం
ఏకమైనప్పుడు,
అది
ఒక
దివ్యత్వంగా
మారిపోతుంది.
క్వాంటిటి
కాదు
-
క్వాలిటి
కావాలి
ప్రేమస్వరూపులారా!
జీవితము
అనేది
ఒక
కాగితము
వంటిది.
కానీ,
ఇదొక
పరిశుద్ధముగా
ఉండే
కాగితము
కాదు.
అనేక
జన్మల
సంస్కారములు,
అనేక
జన్మల
ఫలములు
అగోచరంగా
చిత్రించబడినవి.
అవ్యక్తముగా
ఉండేటటువంటిది.
కానీ,
ఈ
కాగితమునకు
ఒక
వైపున
భావము,
రెండవ
వైపున
శబ్దము.
భావము
లేకుండా
శబ్దము,
శబ్దము
లేకుండా
భావము
చెయ్యాలంటే—
శబ్దమును
విడిచి
భావము
ఉండదు,
శబ్దమును
వదలి
భావమును
చిత్రించడానికి
వీలు
కాదు.
ఒక
కాగితమునకు
ఇరుప్రక్కల
ఉండేటటువంటిది.
కనుక
భావముతో
కూడిన
శబ్దము
రావాలి.
ఈ
విధమైన
గానముచేత,
ఈ
విధమైన
స్మరణచేత,
ఒక్క
“శివరాత్రి”నాడు
మాత్రమే
కాదు,
నిత్య
భజనల
యందు
కూడా
అందరూ
కంఠమెత్తి
పాడాలి.
భగవంతుడు
కంఠమెందులకు
ఇచ్చినాడు?
కేవలము
అసత్యమును
పలుకుటకు
కాదు,
ఇతరుల
చింతలు
వల్లించటానికి
కాదు,
భగవన్నామమును
పలుకుటకొరకే.
4
▾
Meaning
Keep
అట్లే
కన్నులిచ్చినది
భగవంతుని
చూడటానికే.
చెవులిచ్చినది,
మంచి
విషయాలు
శ్రవణము
చేయటానికే.
నోరు
ఇచ్చినది
భగవంతుని
స్మరించటానికే.
“సమ్యక్
కీర్తనం
ఇతిసంకీర్తనం”
అన్నారు.
సంకీర్తనమనగా
ఏమిటి?
హృదయమునువిప్పి
మనలో
ఉన్నటువంటి,
శబ్దమును
ఏమాత్రమూ
కించపరచకుండా,
స్వేచ్ఛగా,
నోరూర,
నోరార
భగవంతుని
నామస్మరణ
చేయటమే.
మనకున్న
శబ్దాన్ని
అరికట్టి
మనము
గానము
చేయకూడదు.
స్వేచ్ఛగా,
తన
స్వరమెట్లుందో,
అదేరీతిగా
అపస్వరమౌతుందనే
యోచన
లేకుండా
పాడాలి.
లోకులు
భావ,
రాగ,
తాళాన్ని
చూస్తే
-
భగవంతుడు
హృదయాన్ని
చూస్తాడు.
కనుక
ఏ
హృదయముతో
నీవు
పాడుచున్నావో,
ఆ
హృదయాన్ని
మాత్రమే
చూస్తాడు.
హృదయము
Quality,
రాగ
-
తాళ
-
భావములు
Quantity.
కనుక
మనము
Quality
ని
పెంచుకోవాలి.
దుర్మార్గుల
దుష్ప్రచారములు
నమ్మకండి
ఈనాడు
మరొక
విషయాన్ని
మీకు
హెచ్చరింపదలచుకొన్నాను-
“సాయి
స్వభావం
ఏనాడూ,
ఎవ్వరికీ,
ఏ
విధమైన
అపకారము
కాని,
కీడు
కాని,
ఇంకా
ఏ
విధమైన
బాధలుకాని
కల్పించేది
కాదు”.
కొంతమంది
బయట
దేశమువారు,
ఈ
దేశమువారు,
స్వామి
ఏదో
ఇది
చెప్పారు,
అది
చెప్పారు—
ప్రపంచము
కొంత
కాలములో
మునిగిపోతుందని,
పెద్దపెద్ద
అవాంతరాలు
కలుగుతాయని,
దేశము
అనేక
అవస్థలకు
గురి
అవుతుందని
స్వామి
చెప్పినట్లుగా
చెప్పి,
కరపత్రములువేసి
పంచి
పెడుతున్నారు.
ఇటువంటి
భావములు
కాని,
ఇటువంటి
సంకల్పములుకాని
సాయిలో
ఏనాటికి
రావు
-
రాబోవు,
రాలేవు.
ఇవి
పనిలేనివారు
కల్పించుకొనే
పనులు.
ఏనాడూ
మీరు
నమ్మకండి.
అట్లే
కొంత
కాలములో
దేశమంతా
మునిగిపోతుందని,
12
మంది
విద్యార్థులను
పంపించి
దీనిని
సరియైన
పద్ధతిలో
తీర్చిదిద్దుతానని
ఇటువంటివి
ఒక
90
Points
print
కొట్టి
అందరికీ
పంచుతున్నారు
ఆ
దుర్మార్గులు.
భక్తులైనవారు
కూడా
దీనిని
నమ్ముతూ
వస్తున్నారు.
ఇట్టి
విషయాలు
ఎవ్వరూ
నమ్మకూడదు.
అనవసరంగా
ఒకరి
నోటి
నుండి,
మరొకరికి
చెప్పుకొని
ఈ
రీతిగా
Propagate
చేస్తున్నారు.
మనకు
ఇష్టములేని
ఇటువంటి
విషయాలు
వినకూడదు.
వినటముగాని,
మరొకరి
దగ్గర
మాట్లాడుకొనుటగాని,
అది
కేవలము
వారి
Weakness
యొక్క
ప్రభావము
కాగలదు.
శత్రువులెవ్వరు?
మిత్రులెవ్వరు?
ప్రపంచమునకు
ఏ
తొందరలులేవు.
ఏ
బాధలు
రావు-రాబోవు.
ఏదో
ఇంత
విశాలమైన
ప్రపంచములో
మధ్య
మధ్య
ఇటువంటివి
జరుగుతూనే
ఉంటాయి.
ఇరాక్
ఇరాన్
గొడవలు,
10
సంవత్సరముల
నుండి
జరుగుతూనే
ఉన్నవి.
ఇది
పెద్ద
యుద్ధముగా
మనము
విశ్వసించకూడదు.
మన
భారతదేశములో
పంజాబులో
కూడా
ఈ
రీతిగానే
జరుగుతూనే
ఉన్నది.
ఇది
ఒక
పెద్ద
యుద్ధమా?
కేవలము
వ్యక్తిగతమైన
దోషములు,
ఈ
రకమైన
మార్గాన్ని
సాధిస్తూ
వస్తున్నాయి.
భారతదేశమునుగాని,
మరేదేశమునుకాని
మన
సద్భావాలే
రక్షించి
కాపాడే
బాంబులు.
మనకు
సద్భావములు
కలిగి
ఉంటే
సర్వమూ
రక్షింపబడుతుంది.
నిజంగా
శత్రువులెవ్వరు
అట్లే
మిత్రులెవ్వరు?
మన
పాపములే
మనకు
శత్రువులు,
మన
పుణ్యములే
మనకు
మిత్రులు.
ఈ
పాప
పుణ్యములు
ఎల్లప్పుడు
మన
వెంట
నీడవలె
వెంటాడుతునే
ఉంటాయి.
కాబట్టి
శత్రువులు
మనకు
ఏ
దేశము
నందూ
లేరు.
మన
భావములే
మనకు
శత్రువులు.
మన
భావములను
పరిశుద్ధము
గావించుకొని
సరియైన
జీవితాన్ని,
ఆదర్శవంతమైన
జీవితాన్ని
అందించాలి.
5
▾
Meaning
Keep
సాయిసంకల్పం
—
వజ్రసంకల్పం
విద్యార్థులు
చాలా
బాగా
పాడినారు.
అనంతపురం
కాంపస్,
బృందావనం
కాంపస్,
ప్రశాంతి
నిలయం
కాంపస్,
చాలా
బాగా
భజనలో
పాల్గొని,
అన్ని
విధాలా
భక్తి
శ్రద్ధలు
చూపించినారు.
సాయి
అనుగ్రహమనే
బ్యాంకులో
ఎంత
విలువైనవి
ఉన్నవో,
ఎంత
విలువైనవి
మీకు
అందించడానికి
సంకల్పించుకొన్నాడో,
కాబట్టి
సాయి
సంకల్పానికే
మీరు
వదలి
పెట్టండి.
ఎంతో
పవిత్రమైన,
విలువైన
అనుగ్రహ
వజ్రాన్ని
అందించటానికి
సిద్ధముగా
ఉండినప్పుడు
అల్పమైన,
స్వల్పమైన
కోరికలు
మీరు
కోరనక్కర
లేదు.
సాయి
అనుగ్రహమునకు
మీరు
వదలిపెడితే,
అన్ని
అనుగ్రహములు
ఆతనిలో
లీనమైపోయి,
ఆతడన్నివిధాల
మీకు
సుఖశాంతులను
అందిస్తాడు.
Previous
←
Goodness is the principle of God
Next
Proceed With Courage
→