Contents
Devotion & Sacred Story
Home
Library
Find
Shelf
Settings
←
Leave
Sathya Sai Speaks 1991 · Goodness is the principle of God
Tap a verse for its meaning
IAST
Telugu
Meaning
Continuous
Goodness is the principle of God
12 February 1991, Mahāśivarātri, Prasanthi Nilayam
1
▾
Meaning
Keep
“ఈ
ప్రకృతి
యందు
దివ్యత్వమైన
దైవము-
నువ్వుల
మధ్య
నూనె
ఉన్నట్లుగా,
పాల
మధ్య
నెయ్యి
ఉన్నట్లుగా,
పూలయందు
పరిమళము
ఉండినట్లుగా,
ఫలమునందు
మధుర
రసము
ఉండినట్లుగా,
కట్టెల
మధ్య
నిప్పు
చేరినట్లుగా—
ఉన్నాడనే
సత్యాన్ని
గుర్తించాలి”.
“కనిపించే
జగత్తులోన
కనబడనటువంటి
చైతన్యమే
ఆత్మ
యగును.
అదే
రీతిగనే,
మణులలోపల
చేరిన
సూత్రమువలె—
విశ్వమంతయు
విష్ణువు
వ్యాపించి
ఉన్నాడు.”
ప్రేమస్వరూపులారా!
ఈశ్వరేచ్ఛకు
ప్రకటనయే
-
ఈ
సృష్టి.
దీనికే
ప్రకృతి
అని
పేరు.
అనగా
ఈ
ప్రకృతి
అంతయూ
ఈశ్వరేచ్ఛ
స్వరూపమే.
ఈ
ప్రకృతి
యందు
పుట్టిన
ప్రతీప్రాణికి
ఈశ్వరీయ
గుణమే
ఉండాలి
-
ఉండితీరాలి.
ఈశ్వరేచ్ఛను
ప్రకటన
గావించే
నిమిత్తమై
మానవుడు
ఈ
ప్రపంచములో
మూర్తీభవించాడు.
విత్తనము
మొలకెత్తి,
అందులోని
సౌందర్యం
పుష్పంగా
వికసించినట్లు,
ఈ
మొక్క,
ఆకులు,
కొమ్మలు,
రెమ్మలు
పుష్పము
యొక్క
పరిణామ
దశలే.
అటులనే
సమస్త
సృష్టికి
దైవమే
బీజము.
అట్టి
దైవము
ప్రతి
ప్రాణి
యందు
విత్తనము
వలె
ఉంటుండి,
దానియొక్క
చిగుళ్ళే
గుణములుగా
వికసించి,
కొమ్మలు,
రెమ్మలే
భక్తి,
శ్రద్ధలుగా
ఉండి—
“సచ్చిదానందమే”
పుష్పముగా
వికసిస్తూ
వస్తుంది.
విత్తనము-
మొక్క
కావలెనన్న
దీనికి
భూమి,
జలము
తోడు
కావాలి.
అటులనే
మానవుని
యందున్న
దివ్యత్వమనే
విత్తనము
మొక్కగా
ఏర్పడి,
వృక్షముగా
అభివృద్ధిపొంది,
‘సచ్చిదానందం’
అనే
పుష్పము
వికసించవలెనన్న,
దీనికి
భక్తి,
శ్రద్ధ
అనేవి
రెండూ
తోడుకావాలి.
2
▾
Meaning
Keep
Also in his talks
(16)
7 February 1980
Be human
19 February 1987
When the jīva is joined with God, he becomes the very form of akṣara
20 March 1988
Bhārat is the home of Satya and Dharma
24 June 1989
Foster Prema and Share It
17 February 1990
Prema itself is God
21 May 1990
The Moving Temple
14 August 1990
Role of the Avatars
29 May 1991
Prasnopanishad - Answers To The Sixth Student
29 August 1992
Life is fulfilled only when one born saying ‘Koham’ attains the experience of ‘Soham’
22 June 1996
Service to Society Is the Mark of True Humanness
11 July 1996
Lack of Values is the Cause of Violence in the World
22 April 1998
The Puṣṭi, Samiṣṭi and Pravāha Jīvas
11 May 1998
Recognise the Oneness in Samaṣṭi and in Vyaṣṭi
14 August 1998
Prema Alone Is the Path, Prema Alone the Goal
8 October 1998
Good Resolves Are Themselves the Human Values
1 January 2000
Virtue is the adornment of man
ఆధ్యాత్మికము
—
భక్తి
మానవత్వమనేది
కేవలం
దైవము
వైపున
మనస్సును
మరల్చటం
కాదు.
మానవుని
యందు
దైవము
అవతరించాలి.
ఈశ్వరశక్తి
అనంత
ఆవిర్భావ
కళలే
మానవత్వం.
అనంత
వ్యక్తీకరణములోపల
కొన్ని
కిరణముల
స్వరూపమే
మానవుడు.
ఇట్టి
దివ్యమైన
మానవత్వమును
గుర్తించుకొనలేక,
కేవలం
లౌకికమైన,
భౌతికమైన,
తుచ్ఛమైన
వాంఛల
నిమిత్తమై
పవిత్రమైన
జీవితాన్ని
నిరర్థకం
గావించుకొంటున్నాము.
ఆధ్యాత్మికము
అంటే
ఏమిటి?
చైతన్యము
యొక్క
అప్రతిహత
సాహసమే.
మానవుని
వెలుపల
నుండి,
లోపల
నుండి
వెలువడే
ఈ
దివ్యమైన
చైతన్యమును
స్వచ్ఛముగా
ప్రకటించటమే
ఆధ్యాత్మికము.
ఆధ్యాత్మికమనగా
మానవుని
యందు
శేషించివుండిన
పశుత్వమును
దూరము
చేసి,
దివ్యత్వమును
అభివృద్ధి
గావించుకోవటమే
ఆధ్యాత్మికము.
దైవమునకు
-
ప్రకృతికి
మధ్యనున్న
భేదమును
నిర్మూలముచేసి,
సమరసము
గావించటమే
ఆధ్యాత్మికము.
ఇట్టి
దివ్యమైన,
భవ్యమైన,
స్థితిని
పొందుటకే
భక్తి
అవసరము.
భక్తి
అనగా
ఏమిటి?
మానవుని
మనస్తత్త్వమునందు
ఈశ్వరత్వం
అవతరించాలి.
తన
మనస్సును
భగవంతుని
యందు
స్థిరంగానిల్పే
నిమిత్తమై
చేసే
ప్రక్రియలే
భక్తి
స్వరూపాలు.
లౌకికమైన
వాంఛలు
నెరవేర్చుకొనే
నిమిత్తమై
ప్రాకృతమైన
విషయవాసనలు
అనుభవించే
నిమిత్తమై
దైవమును
స్మరించటమనేది
భక్తి
కాదు.
తన
యందు
పూర్ణమై
ఉండిన
సచ్చిదానంద
స్వరూపమును
ఆవిర్భవింప
చేసుకొని
అనుభవించటమే
భక్తి.
“దేవుడనగ
వేరు
దేశమందునలేడు-
దేవుడనగ
తనదు
దేహమందె”
ప్రాచీన
కాలము
నుండి
మానవుడు
బాహ్యమైన
అర్థమునే
ఆధారముగా
చేసుకొని,
లౌకికమైన
ఆచారములే
ప్రధానముగా
భావించుకొని
జీవించుతూ
రావటం
చేతనే,
నిత్య
సత్యమైన
చైతన్య
తత్త్వాన్ని
తాను
విస్మరిస్తూ
వచ్చాడు.
గుణబద్ధమైన
మానవుడు
దైవాన్ని
విస్మరిస్తాడు.
ఆధ్యాత్మికబద్ధమైన
మానవుడు
ప్రకృతిని
విస్మరిస్తాడు.
గుణబద్ధమైన
మనస్సును
మనము
ఈశ్వర
బద్ధమైన
మనస్సుగా
మార్చుకోవటం
ఆధ్యాత్మికము.
ఇట్టి
దివ్యత్వమే
జగత్తునకు
ప్రధానం
అనే
సత్యాన్ని
గాఢంగా
విశ్వసించాలి.
మంచితనమునకు
మారుపేరే
దేవుడు.
తన
మంచితనమును,
తన
యందున్న
పవిత్రమైన
గుణములను
విశ్వసించి,
ఆచరించి,
ఆనందించుకోవటమే
ఈ
చేతనా
శక్తి
యొక్క
ప్రభావం.
కనుక
ఆధ్యాత్మికమనగా,
భక్తిప్రపత్తులనగా-
సత్యమైన
అర్థమును
గుర్తించలేనివారు
నూటికి
నూరుమంది
ఉంటున్నారు.
జీవితమంతయు
బాహ్యమైన,
లౌకికమైన
విషయ
వాసనలలో
మునిగిపోతున్నప్పుడు,
దివ్యమైన
భావము
తనకు
ఏరీతిగా
గోచరిస్తుంది?
కానీ,
క్రమక్రమేణా
కొంతవరకైనా
దీనికి
సాధన
అత్యావసరము.
ఈ
ప్రపంచములో
కణము
కణము
నందు,
జీవితములోని
క్షణము
క్షణము
నందు
నిరంతరం
తేజోమయమూర్తిని
ఆవిర్భవింప
చేసుకొన్నప్పుడే
మానవత్వం
సార్థకమవుతుంది.
3
▾
Meaning
Keep
చాతకపక్షి
-
స్వాతిబిందువు
భగవంతునకు
నివాసమైన
శుద్ధమానసం
ప్రతి
భక్తునకు
పవిత్రమై
…
మానవుని
మనస్సున
పవిత్రమైన,
శాశ్వతమైన,
సత్యమైన
తలంపులు
ఆవిర్భవింప
చేసుకోవాలి.
ఇట్టి
పవిత్రమైన
భావములను
ఎవ్వరు
తనయందు
ఆవిర్భవింప
చేసుకొనునో,
అట్టివాని
జన్మయే
సార్థకము.
చాతకపక్షి
స్వాతి
వర్షబిందువునకై
అనేక
కష్టములను
అనుభవిస్తుంది.
కారుమేఘములు
చూచినంతనే,
తన
దీక్షను
ప్రారంభిస్తుంది.
ఈ
ధరణిలో
కావలసినంత
జలము
ఉంటున్నది.
కానీ,
ఈ
చాతకము
ఈ
మలినజలమును
ఆశించదు.
స్వాతి
కార్తిలోని
స్వాతిబిందువుకై,
జలధరం
నుండి
కురిసిన
ఈ
శుద్ధమైన
వర్షబిందువునే
ఆశించునుగానీ-
నిల్చిన
నీరునుగానీ,
ప్రవహించే
నీరునుగానీ
తాను
ఆశించలేదు.
భయంకరమైన
ఉరుములకు
తాను
ఏమాత్రము
భయపడదు.
మిరుమిట్లుగొలిపే
మెరుపులకు
తాను
వెరువదు.
అదరక-బెదరక,
కదలక
స్థిరమైన
భావముతో
మేఘబిందువులకై
తాను
తపస్సు
చేస్తుంది.
ఆ
జలబిందువుకై
“పీ-పీ”
అని
తన
ఆనందమును
వ్యక్తం
చేస్తుంది.
ప్రీతికి
ప్రతినిధి
ఈ
చాతకము.
నిజమైన
భక్తుడు
ఇట్టి
తపస్సును
ఆచరించాలి.
ఇట్టి
దీక్షను
వహించాలి.
ఆశించిన
ఆనందమును
అనుభవించటానికి
ఈ
కఠోరమైన
సాధన
చెయ్యాలి-
లోక
సంబంధమైన
మెప్పులకు
గాని,
సుఖములకు
గాని,
విషయ
వాసనలకు
గాని,
పరువు
ప్రతిష్ఠలకుగాని
తమ
పవిత్రమైన
జీవితమును
పాడు
చేసుకోరాదు.
బంగారమువంటి
మానవ
జీవితమును
భగవత్
నామమనే
‘గీటురాయి’పైన
గీటుపెట్టాలి.
ఇట్టి
సులలితమైన
మార్గమును
అనుభవించక,
అతికష్టతరమైన
మార్గమునే
తాను
ఆచరిస్తూ
తనయొక్క
విలువైన
జీవితమును
నిరుపయోగము
చేసుకొంటున్నాడు.
మానవుడు
-
మానవుడే
కాదు.
మానవు…
దేవుడు.
తనయందున్న
దైవత్వాన్ని
క్రమక్రమేణా
విషయ
వాసనలలో
వ్యర్థము
చేసుకొంటున్నాడు.
అందుచేత
తనలో
ఆవిర్భవించిన
దివ్యమైన
భావాన్ని
సాత్త్వికమైన
మార్గములో
ప్రవేశపెట్టాలి.
చీమ
ప్రతి
ఒక్కడు
“దేవుడు
-
దేవుడు”
అనే
పదములను
మాత్రమే
ఉచ్చరిస్తున్నాడే
గాని,
“దేవుడు”
అన్న
ఆపదమును
తెలుసుకోవటానికి
తగిన
కృషి
చేస్తున్నాడా?
మంచితనమునకు
మారుపేరే
దేవుడు.
ఆ
మంచితనము
మనలో
ఎంత
ఉంది?
అది
లేనప్పుడు
ఈ
దైవత్వం
ఎట్లా
అర్థమవుతుంది?
ప్రతిదానికి
ఒక
స్వానుభవం
కావాలి.
లోతుగా
ప్రవహించే
గంగాజలంలో
చిన్నచేప
పైన
తేలుతూ
ఆనందముగా
ఆడుకుంటూ
ఉంటుంది.
ఆ
ఈత
తెలిసిన
చేపకు
లోతు
సంగతి
అక్కరలేదు.
కానీ
పెద్దశరీరమైన
ఏనుగైనా
గంగలో
మునిగినప్పుడు
కొట్టుకొనిపోతుంది.
ఆ
జలప్రవాహము
నుండి
రక్షించుకొని,
ఆ
ప్రవాహము
ద్వారా
తాను
రక్షింపబడే
శక్తిసామర్థ్యములను
గుర్తించాలి.
మట్టిలో
చక్కెర
కలిసినప్పుడు
చిన్న
చీమ
ఆ
చక్కెరను
తాను
వేరుగావిభజిస్తుంది.
చక్కెర
రుచి
ఆ
చీమకు
తెలిసినది
కనుకనే,
ఆ
చక్కెరను
ఇసుక
నుండి
వేరుచేస్తుంది.
4
▾
Meaning
Keep
కానీ,
ఆ
చక్కెర
మాధుర్యమును,
రుచిని
తెలియని
ఎంత
పెద్దప్రాణి
అయినా
ఆ
చక్కెరను
వేరుచేయుటం
సాధ్యముకాదు.
ఆవిధముగనే
దైవప్రేమను,
దైవానందమును,
సచ్చిదానందమును
చక్కగా
అనుభవించినవాడు,
ఈ
అనవసరమయిన,
లౌకికమయిన
మార్గములో
పోగలడా?
అది
తెలియనివాడే
ఈ
లౌకికములోపల
ప్రవేశిస్తాడు.
అది
తన
యందే
వుంటున్నది.
అన్ని
పవిత్రమైన,
దివ్యమయిన
భావములు
తన
నుండియే
ఆవిర్భవిస్తాయి.
ఆత్మ
వజ్రమువంటిది
అనేక
ముఖములతో
ప్రకాశమును
వెదజల్లేటటువంటి
వజ్రము
యొక్క
కాంతి
ఎటువంటిదో,
ఆత్మ
యొక్క
కాంతి
అటువంటిది.
ముఖములు
వేరు,
వేరుగానీ,
వజ్రం
ఒక్కటే.
అదే
విధముగనే,
ఆత్మఅనే
ఈవజ్రము
నుండి
అనేక
నామములనే
కిరణములు
ప్రకాశిస్తూ
ఉంటాయి.
జగత్తంతయూ
ఒక్క
సచ్చిదానంద
స్వరూపమే.
కానీ,
మానవుడు
కామ
క్రోధాది
గుణములకు
వశుడై
తన
యందున్న
‘సచ్చిదానందనిధి’ని
తానుదూరము
చేసుకొంటున్నాడు.
మానవుడు
ఈ
సత్యాన్ని
గుర్తించుకోలేక
రెండు
గుఱ్ఱములమీద
సవారిచేసి
ప్రమాదమునకు
గురియైపోతున్నాడు.
ఈనాటి
పరమభక్తులకు
ప్రకృతీ
కావాలి,
పరమాత్ముడూ
కావాలి.
ప్రకృతి
వేరుగాలేక,
పరమాత్మలోనే
ఉన్నదన్న
సత్యాన్ని
గుర్తించివుంటే—
ప్రకృతిని
ప్రత్యేకంగా
కోరేవాడు
కాదు
ఈ
మూర్ఖుడు.
పాలలోనే,
నెయ్యి
ఉన్నదనే
సత్యాన్ని
గుర్తిస్తే,
పాలు
చేతిలో
పెట్టుకొని
నేతికోసం
ప్రాకులాడడు.
పారాయణకాదు—ఆచరణ
కావాలి
ఈనాటి
భక్తులు,
ఈనాటి
సాధకులు
ఈ
పవిత్రమయిన
సత్యాన్ని
గుర్తించుకోలేకపోతున్నారు.
శాస్త్రములు,
వేదములు,
ఉపనిషత్తులు
భాగవతం,
భారతం,
గ్రంథరాజము,
ఖురాను,
ఇత్యాది
గ్రంథములే
ప్రధాన
లక్ష్యములుగా
ఉంచుకొని,
గ్రంథముల
యొక్క
ఆజ్ఞలనే
శిరసావహిస్తున్నారేగానీ,
ఆచరణ
మాత్రం
శూన్యమవుతున్నది.
ఈలాంటి
వ్యక్తులంతా
అంధులని
చెప్పవచ్చు.
శాస్త్రములో
భగవంతుని
తత్త్వము
ఈ
రీతిగా
చెప్పబడింది,
ఉపనిషత్తులలో
భగవంతుని
గుణగణములు
ఈరీతిగా
వర్ణించి
ఉంది
అని
తెలుసుకొన్నంత
మాత్రమున
తాను
తెలివిగల
వాడవుతాడా?
గ్రంథములు
చూస్తున్నాడే
గానీ,
తన
ఆచరణ
చూడటంలేదు.
అంధుడు
ప్రపంచము
ఉన్నదని
వింటున్నాడేగానీ,
ప్రపంచమును
వాడు
చూడలేదు.
ఈ
అంధునికి
మరియు
ఈ
ఉపనిషత్సారం,
ఈ
వేదసారం,
శాస్త్రసారం
చదివి,
ఉపదేశము
చేసేవానికి
ఏమాత్రము
భేదము
లేదు.
కేవలం
భౌతికమయినశరీర
అంధుడు
వీడు,
మానసిక
శరీర
అంధుడు
తాను.
ఎన్నో
ఉపనిషత్తులు
చదివినాను,
ఎన్నో
వేదములు
చూచాను,
ఎన్నోశాస్త్రములు
చదివాను
అంటున్నాడేకానీ,
ఆచరణలో
శూన్యమే.
ఈగ్రంథములన్నీ
ఆచరణ
యోగ్యములైనవేగానీ,
కేవలం
పారాయణ
గ్రంథాలు
మాత్రంకావు.
కానీ,
ఈనాటి
మానవులందరూ
ఈ
పవిత్రమైన
గ్రంథములను
పారాయణ
గ్రంథములుగా
ఉపయోగపెడుతున్నారు.
5
▾
Meaning
Keep
ప్రేమ
స్వరూపులారా!
శాస్త్రములు
చదువవలసినదే,
వేదములను
అభ్యసించవలసినదే,
ఉపనిషత్తులను
చూడవలసినదే
కానీ
వాటిని
పారాయణ
గ్రంథములుగా
మనము
పఠించరాదు.
ఈనాడు
“గీతాపారాయణ
చేయండి
చేయండి”
అంటారు.
ఇటువంటి
మూర్ఖగురువులు
పుట్టుట
చేతనే,
మూర్ఖ
శిష్యులు
తయారైపోతున్నారు.
పారాయణచేస్తే
వచ్చిన
ఫలితమేమిటి?
“లడ్డు,
లడ్డు”
అని
పారాయణ
చేస్తే
లడ్డు
నీచేతికి
వస్తుందా?
మద్రాసుకు
పోవాలనుకొని
రోడ్డుపై
“మద్రాసు
మద్రాసు”
అంటే
మద్రాసు
చేరుతావా?
నీవు
ఆ
రోడ్డులో
ప్రయాణం
చేయాలి.
అనేకమంది
మూర్ఖజనులంతా
పారాయణ
అని
మొదలు
పెట్టారు.
లలితాసహస్రపారాయణ,
దేవీసహస్ర
పారాయణ,
గీతా
పారాయణ-
ఇవన్నీ
పారాయణ
చేసిన
లాభమేమిటి?
నూరు
శ్లోకాలు
చెప్పేబదులు
ఒక్కశ్లోకము
నీవు
ఆచరణచేయి.
ఆచరణలేని
పారాయణ
అనర్థము.
సత్
చిత్
ఆనందము
యొక్క
సంపూర్ణమయిన
అర్థము
మనం
గుర్తించాలి.
సత్
-
భగవంతుడు.
చిత్
జీవాత్మ.
ఈ
సత్
చిత్
రెండూ
కలిసినప్పుడే
ఆనందము.
సత్
సత్గా,
చిత్
చిత్గా
ఉంటే
ఆనందము
నీకెక్కడ
లభ్యమవుతుంది?
దుఃఖమే
ప్రాప్తిస్తుంది.
భక్తులు
-
సాధకులు
నీవు
లైటు
కావాలని
ఆశించినప్పుడు,
బల్బు
ఉండాలి,
కరెంటు
ఉండాలి.
ఈ
రెండింటిని
Connect
చేసినప్పుడుకదా!
నీకు
లైటు
లభిస్తుంది.
బల్బు
చేతిలో
పెట్టుకొని,
నాకు
లైటు
రావాలంటే
ఎట్లా
వస్తుంది?
ఇది
కేవలం
మూర్ఖత్వం.
“ఎవరో
ఒక
శ్రీమంతుడు
ఒక
గాడ్రేజి
బీరువాలోపల
ముఖ్యమైన,
విలువైన
ఆభరణాలంతా
పెట్టుకొన్నాడు.
దాని
బీగము
చెవులు
తన
మొలలో
కట్టుకొన్నాడు.
దొంగలు
వచ్చారు.
ఈపెట్టెను
పదిమంది
సాయంపట్టుకొని
ఎత్తుకొని
లారీలో
వేసుకొని
వెళ్లిపోయినారు.
వెంటనే
ఈ
తెలివి
తక్కువ
మనిషి
ఏమనుకొన్నాడంటే,
నా
మొలలో
మాత్రం
బీగంచెవులు
ఉన్నాయి,
పెట్టె
తీసుకొనిపోతే
నాకేమి?
అని
అనుకొన్నాడు”.
ఈరీతిగా
భక్తులు,
సాధకులు
వుంటున్నారు.
దేవుడు
ఎక్కడ
వున్నాడు?
నేను
గ్రంథాలు
చదువుచున్నాను,
శ్లోకాలంతా
కంఠస్థము
చేసుకొన్నాను;
కాబట్టి
దేవుడు
నాదగ్గరనే
వున్నాడు.
ఈ
శ్లోకార్థములకు
సంబంధమయిన
ఆచరణ
ఏ
ఒక్కటియైన
ఉండాలి
కదా!
ఈనాడు
ఆచరణ
లేదు.
ఎక్కడికి
పోయినప్పటికిని
మన
తుచ్ఛభావాలే
మన
తలంపుకి
వస్తూ
ఉంటాయి.
ఆధ్యాత్మిక,
సామాజిక
సమన్వయం
ఈనాడు
లోకములో
ఆధ్యాత్మికమంటే
లౌకికముతో
ఏమాత్రము
సంబంధము
లేదని
భావిస్తారు.
లౌకికమంటే
ఆధ్యాత్మికంలో
యేమాత్రము
అనుభవము
లేదని
చూస్తారు.
ఇది
చాలా
పొరపాటు.
ఆధ్యాత్మికం,
సామాజికం
రెండింటి
యొక్క
సమరసమే
నిజమయిన
దివ్యత్వము.
దేశ
సమైక్యతగాని,
జాతి
సమగ్రతగాని,
ఆధ్యాత్మికమనే
ఆధారము
చేతనే
లభిస్తుంది.
సామాజిక
జీవితమునకు,
ఆధ్యాత్మిక
జీవితమునకు
అనుబంధమనేది—
దివ్యత్వమే.
ప్రపంచ-
పరమాత్మల
సంబంధ
బాంధవ్యమనేది
అవినాభావ
సంబంధము,
అన్యోన్యాశ్రయము.
6
▾
Meaning
Keep
కాబట్టి
దైవము
వేరు
ప్రకృతి
వేరు
-
అనే
విభాగము
గావించరాదు.
ప్రకృతి
యందు
పరమాత్ముని
దర్శించడానికి
ఒక
ఉదాహరణః—
ఇది
ఒక
టంబ్లరు.
దీని
రూపాన్నే
చూచినప్పుడు,
ఇది
టంబ్లరని
మీరు
చెప్పగలరు.
ఈ
టంబ్లరుకు
ఆధారం
ఏమిటి?
అనుకొంటే
వెండి
అని
తెలుస్తుంది.
వెండిని
చూచిన
వారికి
టంబ్లరు
ఏమాత్రము
గుర్తుకు
రాదు.
టంబ్లరు
చూచేవారికి
వెండి
ఏమాత్రం
గుర్తుకు
రాదు.
రెండూ
తెలిసినవాడే
వెండి
టంబ్లరు
అని
రెండూ
కలిపిచెప్పుతాడు.
కాబట్టి
టంబ్లరు,
వెండి
రెండూ
ఒక్కటే.
ఆకారాన్ని
చూచేవారు
కొందరు,
ఆధారాన్ని
చూచేవారు
మరికొందరు.
పరమాత్ముడు
లేక
ప్రకృతి
లేదు.
ఈనాడు
ప్రకృతినే
చూచేవారు
అధికంగా
వుంటున్నారు.
ఈ
ప్రకృతి
పరమాత్మ
స్వరూపమని
భావించేవారు
చాలా
తక్కువ.
నేను
అనేక
పర్యాయములు
చెప్పుతూ
వుంటాను.
ఇది
యేమిటి?
అంటే
ఇది
వస్త్రము
అంటారు.
కానీ
ఈ
వస్త్రమునకు
ఆధారము
ఏమిటి?
దారము.
వస్త్రమును
చూస్తారుగాని,
దారము
చూడరు.
దారంలేక
వస్త్రం
కాలేదు.
వెండిలేక
టంబ్లరు
కాలేదు.
మట్టిలేక
కుండ
కాలేదు.
బ్రహ్మములేక
ప్రకృతి
లేదు.
కనుకనే
అట్టి
సత్య
స్వరూపాన్ని,
అట్టి
సత్య
తత్త్వాన్ని
గుర్తించుకునే
స్వభావం
ప్రతీమానవునియందు
ఆవిర్భవించాలి.
ఇంద్రియాలను
జయించు
ఇంద్రియములు
మిమ్మల్ని
స్వాధీనము
చేసుకొని
మిమ్మల్ని
నడిపిస్తున్నవి.
ఈ
సత్యాన్ని
గుర్తించి
ఇంద్రియములను
మీరు
స్వాధీనపరచుకొని,
ఇంద్రియాలను
నడిపించండి.
మీరు
ఇంద్రియాలకు
స్వాధీనము
కాకూడదు.
ఇంద్రియములు
మీ
స్వాధీనమై
ఉండాలి.
అప్పుడే
ఈ
సత్యాన్ని
గుర్తించటానికి
సాధ్యమౌతుంది.
ఎప్పుడు
చూచినా
ఇంద్రియాల్ని
అనుసరిస్తూ-
అనుసరిస్తూ
పోతుంటే,
ఏమి
గతైపోతుంది?
ఈ
విధానము
అనేక
ప్రమాదములకు
గురౌతుంది.
అనేక
అశాంతులు
అనుభవిస్తుంది.
దివ్యమైన
భావాన్ని
మరుగు
పరుస్తుంది.
ప్రతి
వ్యక్తి
తనయొక్క
దోషములను
తాను
గుర్తించటానికి
ప్రయత్నించడు.
తన
దోషములను
సమర్థించుకొని,
పరుల
యందున్న
సుగుణములను
కూడా
దోషములుగా
రూపొందింపచేస్తాడు.
కనుకనే
మానవుడు
దానవుడుగా
మారిపోతున్నాడు.
మానవుడు
పశువుగా
మారిపోతున్నాడు.
తన
తప్పును
తాను
సమర్థించుకొనుటకై
అనేక
విధములైన
పాట్లుపడుతాడు.
ఏ
స్థానము
నందున్నాము,
ఏమి
చేస్తున్నాము,
ఏ
లోటు
కలిగింది?
అనే
విచారణ
ఏమాత్రం
చేయడు.
అన్నింటికిని
మూలకారణము
స్వార్థమే.
ఏ
పదార్థమును
తాను
ప్రేమించినప్పటికిని,
పదార్థనిమిత్తమై
పదార్థములను
ప్రేమించుటలేదు.
తన
నిమిత్తమై
పదార్థములను
ప్రేమిస్తున్నాడు.
ఏ
వ్యక్తిని
ప్రేమించినప్పటికిని,
వ్యక్తి
నిమిత్తమై
వ్యక్తిని
ప్రేమించుటలేదు.
తన
నిమిత్తమై
వ్యక్తిని
ప్రేమిస్తున్నాడు.
భగవంతునిపైన
కూడా
ఇదే
స్థితి.
భగవంతుని
ప్రేమిస్తున్నాను
-ప్రేమిస్తున్నాను
అంటున్నాం.
కాదు
కాదు.
తన
నిమిత్తమై
భగవంతుని
ప్రేమిస్తున్నాడు.
కాని
భగవంతుని
నిమిత్తమై
తాను
ప్రేమించేవాడు.
తన
తత్త్వమును
మరచిపోవాలి.
నిజమైన
ప్రేమకు
అనురాగం
ఉండదు.
7
▾
Meaning
Keep
తన
నిమిత్తమయి
తాను
ప్రేమించే
ప్రేమను
అనురాగమని
అంటారు,
భగవంతుని
నిమిత్తమై
ప్రేమించేదానిని
ప్రేమ
అంటారు.
ప్రేమకు
అనురాగమునకు
ఇంత
వ్యత్యాసము
ఉంటుంది.
కృతజ్ఞత
-
కృతఘ్నత
స్వార్థము,
స్వప్రయోజనము
ఈ
రెండే
మానవుని
ప్రధానమైన
గుణములు.
తద్వారానే
దివ్యమైన
శక్తిని
గుర్తించుకొనలేకపోతున్నాడు.
ఎన్ని
సాధనలు
చేసినప్పటికిని,
ఎన్ని
గ్రంథములు
పఠించినప్పటికిని,
ఎన్ని
ధ్యానములు
చేసినప్పటికిని,
ఎన్ని
జపములు
ఆచరించినప్పటికిని,
ఎన్ని
భజనలు
చేసినప్పటికినీ—
లోతుగా
పాతుకుపోయిన
స్వప్రయోజన
మాలిన్యమనేది
అంత
సులభంగా,
శుభ్రము
కాలేదు.
తనలో
ఉండిన
దుర్గుణములను,
దుర్భావములను,
దురాలోచనలను
దూరము
గావించినప్పుడే,
ఆ
దివ్యత్వమనేది
ఆవిర్భవిస్తుంది.
కృతఘ్నత
అన్నదే
ఒక
పెద్ద
పాపం.
ఈ
పాపమే
మానవుని
తలవంచి
అనేక
విధములైన
బాధలకు
గురిచేస్తుంది.
ఎవరివలన
నేను
ఈ
స్థాయికి
రాగలిగితినని,
ఎవరివలన
నేను
ఈ
కీర్తిని
అనుభవించగలిగితినని,
ఇంతటి
అభివృద్ధికి
ఎవరు
కారణం?
అనే
ఉపకారమును
మరచిపోతున్నారు.
ఈ
ఉపకారమును
మరచినవాడు
దైవదృష్టిలో
చచ్చినవానితో
సమానము.
కనుక
కృతజ్ఞతలేనివాని
జీవితము
చావుతో
సమానము.
ఎవరివల్ల
నీవు
ఈ
ఉపకారమును
పొందావో,
వారికి
కృతజ్ఞతను
నీవుచూపించాలి.
ఈనాడు
నీవు
పెద్దవాడు
కావచ్చును,
విద్యావంతుడు
కావచ్చును,
నీవు
ధనవంతుడవు
కావచ్చును,
అధికారివి
కావచ్చును—
కానీ,
ఈ
స్థాయి
ఎవరివలన
వచ్చింది?
అనేవిషయం
మరచిపోవుచున్నారు.
కనుకనే
మానవుడు
తన
విలువలనన్నింటిని
నిర్మూలం
చేసుకొంటున్నాడు.
ఈ
అహంకారము,
ఆడంబరము,
అత్యాశ
మానవత్వాన్ని
పూర్తిగా
భస్మం
చేస్తోంది.
తల్లిదండ్రులు
ప్రేమ
స్వరూపులారా!
మీ
అహంకారములు,
అభిమానములు
దూరముచేసి
ప్రేమ
తత్త్వాన్ని
అభివృద్ధిని
గావించుకొని,
స్వార్థాన్ని
విడిచి
పెట్టండి.
స్వార్థం
వుండాలి-ఎంతవఱకో
అంతవఱకు-
నియమమే
లేకపోతే,
మానవుడు
చాలా
ప్రమాదములకు
గురౌతాడు.
ఈనాటి
మానవత్వములో
‘తల్లి-తండ్రి’
అనే
గౌరవము
పూర్తిగా
శూన్యమయిపోయింది.
పెంచి,
పెద్దచేసి
రక్తాన్ని,
కూడు,గుడ్డలను
పంచియిచ్చి,
అనేక
విధముల
పోషించిన
తల్లిదండ్రులనే
తృప్తి
చేయలేనటువంటి
ఈ
మూర్ఖుడు
చచ్చినవానితో
సమానముకాక,
ఇంక
బ్రతికినవానితో
ఎట్లా
సమానమవుతాడు?
మన
శాస్త్రములన్ని-
“మాతృ
దేవోభవ,
పితృ
దేవోభవ,
ఆచార్య
దేవోభవ,
అతిథి
దేవోభవ”
అని
పల్కినవి.
మాతాపితరులను
సరియైనదృష్టిలో
పెట్టుకోలేనివాడు
ఇంకేమి
ప్రయోజనము?
కాబట్టి,
తాను
ఏరీతిగా
తల్లిదండ్రుల
గర్భమునుంచి
జన్మించినాడో,
అదేరీతిగనే
ఈ
సమాజము
కూడ
ఆ
సచ్చిదానందము
అనెడు
గర్భము
నుండియే
ఆవిర్భవించినది.
8
▾
Meaning
Keep
“శి-వ-రా-త్రి”
ఈ
ప్రపంచమంతా
పరమాత్మ
స్వరూపముగా
మీరు
విశ్వసించండి.
ఇదియే
శివరాత్రి
మహాత్మ్యం.
మానవునికి
ఉండిన
పదిఇంద్రియములే
ఇన్ని
విధములైన
మార్గములలో
ప్రవేశపెడుతున్నాయి.
అనేక
పర్యాయములు
చెప్పాను.
శి
-
వ
-
రా
-
త్రి
నాలుగు
పదాలు.
ఈ
వర్ణాక్షరములందు,
సంఖ్యాక్షరములందు
అనేక
సంబంధ
బాంధవ్యములుంటున్నాయి.
“శ”
అనగా
5
సంఖ్య.
“వ”
అనగా
4
సంఖ్య.
“…”
అనగా
2
సంఖ్య.
ఈ
5+4+2=11
అవుతుంది.
పంచ
కర్మేంద్రియములు,
పంచ
జ్ఞానేంద్రియములు,
మనస్సు
కలిపి
11
అవుతుంది.
ఈ
పదకొండే-
ఏకాదశరుద్రులు.
ఈ
రుద్రులు
చేసే
పని
ఏమిటి?
మానవు…
విషయ
వాసనలలోనెట్టి,
తుచ్ఛమయిన
వాంఛలను
పెంచి,
భౌతిక
జీవితంలో
పడవేస్తుంది.
ఈ
11కు
అతీతమైనది
మరొకటి
ఉంటున్నది.
అది
“త్రి”.
అదియే
పరమాత్మ.
ఈ
పంద్రెండవ
దానిని
మనము
పట్టినప్పుడే,
మనము
ఈ
ఇంద్రియములను
సాధించినవారమవుతాము.
ఈపంద్రెండు
మాత్రం
మనం
జాగ్రత్తగా
పెట్టుకోవాలి.
జాగరణ
శివరాత్రి
-
శివరాత్రి
మంగళకరమైన
రాత్రి.
దేనివలన
మంగళకరం?
ఈ
దినము
చతుర్దశి.
16
కళలలో
15
కళలు
అంతర్ధానమై
ఒక్క
కళమాత్రమే
కన్పిస్తుంది.
ఇది
అతిసమీపమయిన
మార్గం.
అతి
సన్నిహితమైన
మార్గం.
అలాంటి
సమయంలోపల
ఈ
ఒక్కరాత్రి
అయినా
ఈ
పదియింద్రియాలను,
మనస్సును
మనము
వశంచేసుకుంటే,
తప్పక
మనకు
దివ్యత్వం
ప్రాప్తిస్తుంది.
ఈ
ఒక్కరాత్రియైనా
ఏ
లౌకిక
భావమునకు
చోటివ్వక
మనస్సును
స్వాధీనం
చేసుకుని,
తగిన
స్మరణచేస్తే,
తప్పక
అందులో
దివ్యమయిన
తత్త్వము
ఆవిర్భవిస్తుంది.
దీనినే
‘జాగరణ’
అన్నారు.
నిజమైన
జాగరణ
ఇంద్రియాలను
స్వాధీనం
చేసుకొని,
పరతత్త్వములో
మనస్సు
నిలపటమే
జాగరణ.
ఇట్టి
జాగరణ
చేసేవారు
ఏ
కోటికో,
ఏ
నూటికో
ఒక్కరు
ఉండినా
చాలు.
“కే-శ-వ”
దివ్యాత్మస్వరూపులారా!
మీరు
దివ్యాత్మస్వరూపులే!
కానీ
వాంఛలు
ప్రాకృతమైనవి
కనుకనే,
ఈ
విధమైన
మానవులుగా
రూపొందుతూ
వచ్చారు.
ఈ
ప్రాకృతమైన
విషయాలు
మీరు
అనుభవించండి.
ఆ
అనుభవమును
దైవముగానే
భావించండి.
ఏ
దైవనామమును
మీరు
భేదంగా
చూచుకోవద్దండి.
“రామ!
అనండి,
కృష్ణా!
అనండి,
గోవిందా!
అనండి”—
ఏమనుకొన్నప్పటికీ,
ఇవన్నీ
దైవనాములే.
కొంతమంది
మూర్ఖులు
“శైవులు—వైష్ణవులు”
అని
భేదాలు
పెట్టుకొని,
“శివనామము”ను
ఏమాత్రము
స్మరించరు,
వినరు.
ఈ
భేదాలు
మాత్రము
దూరం
చేయండి,
అభేద
తత్త్వాన్ని
అందించి,
ఆనందించండి.
మాయా
వాదమునకు
గానీ,
అద్వైతవాదమునకు
గాని,
సాంఖ్య
వాదమునకు
గాని,
చార్వాకమునకుగాని,
అన్నివాదములకు
కేశవనామము
ప్రధానం
అన్నారు.
ఇదియే
మూలాధారము
అన్నారు.
ఏమిటి
ఈ
కేశవనామములో
ఉన్న
అంతరార్థము?
క-
ఈశ-
వ-
ఇతికేశవ
క-
బ్రహ్మ,
ఈశ-
ఈశ్వరుడు,
వ-
విష్ణువు.
ఈ
సృష్టి
స్థితి
లయములకు
అంతా
కేశవనామమే
ఆధారము.
శూన్యవాదమునకు
ఈ
కేశవ
నామమే
ఆధారము.
ఈలాంటి
అంతరార్థములను
గుర్తించుకొనలేకపోవుచున్నాడు
నేటి
మానవుడు.
9
▾
Meaning
Keep
శివకేశవుల
అభేదతత్త్వం
“ఎద్దునెక్కినా
-
గ్రద్దనెక్కినా
ఇద్దరు
ఒక్కటే
ఓ
నరుడా!
‘లింగ
లింగ
-
శివలింగ
లింగ’
యని
‘రంగని’
తిట్టకు
ఓ
మనసా!
ధన
ధాన్యంబులు
ఎన్నివున్నను
దరికిరావురా
ఓ
నరుడా!
పరమపావన
పరమశివుని
శరణనుము
ఓ
నరుడా!
పరమేశ్వరుని
శరణుజొచ్చు.
అదే
జీవిత
పరమానందం.
అప్పుచేసుకొని
యాత్రలు
చేయుట
తప్పు
తప్పురా!
ఓ
నరుడా!
జీవాత్మ
లోన-పరమాత్మ
కలడని
చక్కగ
తెలియుము
ఓ
నరుడా!
ఆడంబరములు
ఆవల
నెట్టి
ఆత్మ
దర్శనము
చేయుమురా!
జాగుచేయక
జీవితమంతయు
“ఓగుచుక్క”
వలె
గడుపుమురా!
చదువుసంధ్యలు
ఎన్ని
నేర్చినా,
స్వామి
సేవలు
దొరకవురా!
మధురమైన
ఆ
నామము
తలచిన
మార్గమునకే
చూపునురా!
చెప్పేమాటలు
పెడచెవిని
పెట్టి,
తప్పులు
చేయకు
ఓ
నరుడా!
అగ్నివంటి
ఈ
సత్యము
కనుగొని
గొప్ప
మార్గమున
నడువుమురా!”
అట్టి
దివ్యమైన,
పవిత్రమైన
మార్గాన్ని
అనుసరించి,
తరించి,
వరించి,
భ్రమించి—
ఆనందాన్ని
అనుభవించండి.
అన్ని
నామముల
సారము
ఒక్కటే
‘శివ-శివ’
యని
రంగని
తిట్టకూడదు.
‘రంగ-రంగా!
ఓ
పాండురంగా!’
యని
శివుని
తిట్టకూడదు.
ఈనాడు
అట్లులేదు.
‘శివ-శివ’
యంచును
రంగని
తిట్టుదురు.
ఇది
సరియైన
భక్తి
కాదు.
దైవత్వం-
అనేకత్వంలో
ఉండిన
ఏకత్వమే.
ఈనాటి
భక్తి
అంతా
సంకుచితమైన
మార్గంలోనికి
దిగజారిపోయినది.
రాముడన్న
వానికి
-
కృష్ణుడంటే
ఇష్టం
లేదు.
కృష్ణుడన్న
వానికి
-
రాముడంటే
ఇష్టంలేదు.
ఈ
విధమైన
భావములున్నవాడు
నిజమైన
మానవుడే
కాదు.
మానవుడు
కానటువంటివానికి
మాధవత్వము
ఎట్లా
అర్థమవుతుంది?
“నాకు
రాముడంటే
చాలా
ఇష్టము.
రామనామం
చెప్పినా,
చేసినా
ఆనందభాష్పాలు
రాల్తాయి”
అంటారు.
కానీ,
ఆ
రామనామాన్ని
మార్కెట్టులో
పెట్టి
అమ్ముతున్నారు.
ఆ
దివ్యమైన
రామనామాన్ని-
చెవిలో
ఉపదేశం
చేయటం
-
చేతిలో
డబ్బులు
గుంజటం.
ఇటువంటి
తుచ్ఛమైన
మార్గాన్ని
ప్రక్కకు
నెట్టండి.
ఇట్టి
ప్రబోధలు
మీరు
ఏమాత్రము
వినవద్దు.
సర్వులయందు
దైవము
ఉంటున్నాడు.
అందరిని
గౌరవించండి,
అందరిని
ప్రేమించండి.
అన్నింటిని
మీరు
ఆనందంగా
అనుభవించండి—
“అన్ని
నామముల
సారము
ఒక్కటే”
అని
భావించండి.
ఈ
భావంతోనే
భగవన్నామాన్ని
స్మరించండి.
ఆ
భజనల
చేతనే
మానవత్వము
ఏకత్వమయిపోతుంది.
Previous
←
The Glory of Chanting the Name of the Lord
Next
Keep evenness in remembering the Name
→