Contents
Devotion & Sacred Story
Home
Library
Find
Shelf
Settings
←
Leave
Sathya Sai Speaks 1991 · The Ideal Figures of the Rāmāyaṇa
Tap a verse for its meaning
IAST
Telugu
Meaning
Continuous
The Ideal Figures of the Rāmāyaṇa
24 March 1991, Śrī Rāma Navamī, Prasanthi Nilayam
1
▾
Meaning
Keep
“మీరు
చూడాలనుకొంటే-
‘పరమాత్మ’నే
చూడాలికాని,
ఇతర
చూపులు
చూచుట
వెఱ్ఱితనము.
మీరు
నడవాలనుకొంటే-
‘భగవంతుని’తో
నడవాలికాని,
వేరు
మార్గాలలో
నడచుట
వెఱ్ఱితనము.
మీరు
పలకాలనుకొంటే-
‘సత్యాన్నే’
పల్కాలికాని,
వేరు
పల్కులు
పల్కుట
వెఱ్ఱితనము.
మీరు
పాడాలనుకొంటే-
‘తత్త్వాల’నే
పాడాలికాని,
వేరు
పాటలు
పాడుట
వెఱ్ఱితనము.
సాధు
సద్గుణసంపన్నులైన
ఓ
సభ్యులారా!
మీరు
వినగోరిన-
‘హరిభజన’
వినాలి.
మీరు
చూడగోరిన-
‘దైవాన్ని’
చూడాలి.
మీరు
చేరదలచిన-
‘దైవాన్ని’
చేరాలి—
ఇంతకు
మించిన
‘పరతత్త్వం’
లోకంలో
మరెక్కడా
కానరాదు”.
“చక్కెరకంటే,
తేనెకంటే,
వెన్నకంటే-
తీపితనము,
రుచికరము
కల్గినట్టిది-
‘శ్రీరాము’ని
నామమే.
అట్టి
నామాన్ని
తనివితీరా
ఎన్ని
సారులు
పల్కినా-
అంతకంతకు
సంతృప్తి
కలిగిస్తుంది.
అంతేకాదు-
ఆ
నామాన్ని
నోటితో
పల్కగా
పల్కగా,
మిక్కిలి
కమ్మతనం
కలిగిస్తుంది-
ఆ
నామము
‘అమృతమే’
అని
యనిపిస్తుంది.
అట్టి
నామాన్ని-
ప్రతి
నిత్యం
మనసార
స్మరించి
తరించండి”.
ప్రేమస్వరూపులారా!
ఈ
ప్రపంచమున
గల
సమస్త
పదార్థములు
మార్పు
చెందునవి.
ఒకనాటికి
సమస్త
ప్రాణులు
నశించవలసినదే.
కానీ
ఆదర్శము,
పవిత్రమైన
ఆశయము,
ఎంత
కాలమైనప్పటికినీ
మానవహృదయాలలో
సజీవమై
రాణిస్తూనే
ఉంటుంది.
ఆదర్శము,
పవిత్రమైనదానిని
పొందవలెనన్న
అనేక
కష్టములకు,
నష్టములకు,
దుఃఖములకు,
నిందలకు,
నిష్ఠూరములకు-
గురికావలసి
వస్తుంది.
ఇట్టి
ఆశయాలు,
ఆదర్శాలు
అనేక
విధములైన
కష్టములకు,
నష్టములకు
నెట్టుకొని,
తట్టుకొని
సాగటంచేతనే
ఈనాటికి
లోకంలో
దేదీప్యమానంగా
ప్రజాహృదయాలలో
రాణిస్తూనే
ఉన్నాయి.
ఈ
ప్రపంచములో
యుగములు
మారినా,
జగములు
కదిలినా,
జీవితములు
నశించినా-
‘ఆశయాలు
ఆదర్శాలు’
సజీవమై
ప్రకాశిస్తూనే
ఉంటాయి.
2
▾
Meaning
Keep
బుద్ధి
-
వివేకము
భుజబలంతో,
జనబలంతో,
ధనబలంతో-
సాధించలేని
ఘనకార్యములను
బుద్ధిబలముతో
సాధించుటకు
ఎంతైనా
అవకాశం
ఉంటున్నది.
బుద్ధిబలము
యొక్క
ప్రధానమైన
గుణము
వివేకము.
ఇట్టి
వివేకతత్త్వమును
మానవుడు
సత్యాన్వేషణ
చేతనే,
ధర్మాసక్తి
వలననే
దీనిని
అభివృద్ధి
గావించుకొనవచ్చును.
సత్యాభిరుచి
లేకుండా
వివేకమును
పోషించుటకు
ఎవరికీ
వీలుకాదు.
ప్రపంచములో
సూర్యచంద్రాదులు
ప్రకాశిస్తూ
ఉంటున్నారు.
ఎవరికివారు
ప్రకాశము
ఉన్నదని
భ్రమిస్తున్నారు.
కానీ
ప్రకాశించే
ఈ
ప్రకృతి
సంబంధమైన
సూర్యచంద్రాదులకు
అతీతమైన,
అగమ్యమైన,
అనంతమైన
ఒక
ప్రకాశము
మరొకటి
గలదని
మానవులు
గుర్తించుకొనలేకపోతున్నారు.
ప్రాకృతమైన
సూర్యుడు
స్వప్రకాశకుడు
అని
భావిస్తున్నారు.
ఆ
సూర్యప్రకాశముచేతనే
చంద్రుడు
ప్రకాశిస్తున్నాడు.
చంద్రుడు
స్వప్రకాశకుడు
కాకపోయినప్పటికిని,
సూర్యప్రకాశము
చేతనే
చంద్రుడు
వెలుగొందుచున్నాడు.
అదే
విధముగనే
బుద్ధి,
వివేకముల
యొక్క
ప్రకాశము
ఒకదానినొకటి
అనుసరించి
స్వప్రకాశస్థితిని
పొందుచున్నదని
మానవులు
భ్రమించుచున్నారు.
వివేకప్రకాశము
బుద్ధివలన
కలుగుచున్నది,
బుద్ధిప్రకాశము
ఆత్మచేత
కలుగుచున్నది.
కానీ
అజ్ఞానులైన
మానవులు
బుద్ధి,
వివేకము
యొక్క
ప్రకాశమును
మాత్రమే
లక్ష్యమునందుంచుకొని
ఆధారమైన,
అతి
ప్రధానమైన
ఆత్మతత్త్వాన్ని
విస్మరించుట
చేతనే
మానవత్వాన్ని
కోల్పోవుచున్నారు.
“దైవం
మానుషరూపేణ”
ఆ
ఆత్మనే
ఉనికి,
ఆ
ఆత్మనే
బ్రహ్మము,
ఆ
ఆత్మనే
పరతత్త్వము,
ఆ
ఆత్మనే
పరమాత్మ,
ఆ
ఆత్మనే
అవతారతత్త్వము.
కానీ
ఆకారము
లేని
ఆత్మతత్త్వము
స్వర్గమునందుగాని,
వైకుంఠమునందుగాని
లేక
కైలాసమందుకాని
ఉండినంత
మాత్రమున
ప్రజలకు
ఏమాత్రము
ప్రయోజనం
లేదు.
ఆకారములేని
ఆత్మతత్త్వాన్ని
ఆరాధించుటకు
ఏమాత్రము
అవకాశము
ఉండదు.
కనుకనే
అట్టి
ఆకారము
లేని
ఆత్మతత్త్వము—
ఒక
ఆకారమును
ధరించి,
మానవులలో
అనుకూలముగను,
అనుగుణ్యముగను,
వారికి
సన్నిహితముగను,
తగిన
సహకారముగను—
ఒక
రూపాన్ని
ధరించి
వచ్చినదే
ఈ
రామావతారము.
మానవులకు
అందుబాటులో
లేని
అవతారతత్త్వమును
మానవులు
గ్రహించలేరు.
మానవులకు
అందుబాటులో
ఉండే
నిమిత్తము,
వారికి
అనుగుణమైన
మార్గము
అనుసరించే
నిమిత్తము
ఆకారమును
ధరిస్తుంది
అవతారము.
నిజముగా
నిర్గుణ
నిరాకారమైన
తత్త్వము
మానవుడు
గుర్తించుటకు
సాధ్యము
కాదు.
దురదృష్టవశాత్తు
నిర్గుణ
నిరాకారమైన
ఆత్మతత్త్వము
ఆకారము
ధరించినప్పటికిని,
తమ
స్వభావమును
పురస్కరించుకొని,
తమ
మానవత్వాన్ని
దానికి
అనుసరింప
చేసుకొని,
సామాన్యమైన
మానవత్వంగా
భావించుకొనే
దురదృష్టవంతులు
లోకంలో
లేకపోలేదు.
“మావలెనే
ఆకారానికి
కన్నులు,
చెవులు,
ముక్కు,
నోరు—
ఉంటున్నవి.
మావలెనే
భుజిస్తున్నారు,
సంచరిస్తున్నారు,
మాట్లాడుతున్నారు.
కాబట్టి
ఈ
అవతారమునకు
మాకు
ఎందులో
వ్యత్యాసము
ఉంటున్నది?”
అనే
సంకుచిత
భావము
చేత
ఈనాటి
మానవులు
ఈ
దివ్యత్వమును
దూరము
గావించుకొంటున్నారు.
అసలు
దైవత్వమంటే
ఏమిటో
గుర్తించుకొనుటకు
ప్రయత్నించాలి.
“దైవం
మానుషరూపేణ”
మనుష్య
రూపమును
ధరించి
రావటం
చేతనే,
మనుషులు
మాధవత్వాన్ని
విశ్వసించుటకుగాని,
చేరుటకుగాని,
అనుభవించుటకుగాని
చక్కని
అవకాశము
ఉంటుంది.
జీవితమును
అనంతముతో
హెచ్చించినప్పుడు,
అదే
దైవత్వముగా
మారిపోతుంది.
3
▾
Meaning
Keep
భారతీయుల
మతము
దైవము,
విరాట్స్వరూపుడు,
హిరణ్యగర్భుడు
అనేవి
ప్రత్యేకముగా
ఎక్కడో
ఒక
లోకంలో
లేవు.
అన్నీ
మానవునియందు
ఇమిడి
ఉంటున్నవి.
అసలు
తన
స్వస్థానమును
మరచి,
మధ్యస్థానములో
గడచినటువంటి
కాలములో
తిరిగి
స్వస్థానమునకు
చేర్చే
నిమిత్తమై
ఏర్పడునటువంటివే
ఈ
మతములు.
భారతీయ
దివ్యమైన
మతములకు
అనేకమంది
అనేక
అర్థములు
ప్రబోధించి,
దాన్ని
విమర్శించి,
యథార్థమైన
సత్యాన్ని
విస్మరించి,
అనర్థములతో
కూడిన
అసత్యమును
విశ్వసించి
ఈ
మతమునకు
ఒక
విధమైన
విలువనే
లేకుండా
చూచుకొంటున్నారు
మానవులు.
మతమనగా
తన
స్వస్థానమునకు
తిరిగిచేర్చటమే
మత
స్వభావము,
మతలక్ష్యము.
భగవంతునితో
చేరటమే
Religion.
కనుక
ఈ
Religion
అంటే
ఏవోకొన్ని
పద్ధతులచేత,
కొన్ని
సిద్ధాంతములచేత,
కొన్ని
నిబంధనలచేత
ఏర్పడిన
ఒక
కఠినమైన
శిక్షగా
భావిస్తున్నారు.
కాదు-కాదు.
మనం
మరచినటువంటి
మన
స్వస్థానమును
జ్ఞాపకంగావించి,
తిరిగి
మన
స్వస్థానమును
చేర్చేటటువంటి
పవిత్రమైన
మార్గమే
ఈ
మతము.
పవిత్రమైన
అంతరార్థమే
“తత్
త్వం
అసి”
దానిని
దీనితో
చేర్చటమే
తత్త్వమసి.
“ప్రజ్ఞానం
బ్రహ్మ”;
ఆ
దివ్యమైన,
ఆ
భవ్యమైన,
ఆ
నవ్యమైన-
“ప్రజ్ఞానతత్త్వాన్ని”
తిరిగి
జ్ఞాపకం
గావించుకొనుటయే
మతము.
“అయం
ఆత్మా
బ్రహ్మ”
అనెడు
ఆత్మతత్త్వమును
బోధించేటటువంటిదే
ఈ
మతము.
అనగా
“నేను”
అనే
జీవతత్త్వము
బ్రహ్మతత్త్వముగా
విశ్వసింప
చేయడమే
మతము
యొక్క
అంతరార్థము.
అంతేకాదు-
“అహం
బ్రహ్మాస్మి”
నేనే
తిరిగి
ఆ
బ్రహ్మతో
చేరిపోతున్నాను,
రెండూ
ఒక్కటే
అనే
సత్యాన్ని
ప్రబోధించునదే
ఈ
మతము
యొక్క
అంతరార్థము.
కనుకనే
ఋగ్వేద,
యజుర్వేద,
సామవేద,
అథర్వణ
వేదముల
యొక్క
ప్రమాణములను
చక్కగా
యథార్థముగా
నిరూపింపజేసి
జీవతత్త్వము
దైవత్వముతో
ఏకీభావము
గావించేటటువంటి
దివ్యమైన
మార్గమే
భారతీయుల
మతము.
అవతారములెందుకు
వస్తాయి?
అవతారతత్త్వములన్నీ
ఇట్టి
ఏకత్వమును
బోధించే
నిమిత్తమై,
భిన్నత్వమును
దూరంగాచేసే
నిమిత్తమై
దివ్యత్వమును
ప్రకాశింపచేసే
నిమిత్తమై,
ఆత్మతత్త్వాన్ని
ప్రకటించే
నిమిత్తమై—
అవతరిస్తూ
ఉన్నాయి.
అవతరించటమనగా
దైవము
మానవస్థాయికి
దిగిరావటమే.
ఆ
స్థాయికి
దిగినంతమాత్రమున
అవతారతత్త్వమునకు
ఎట్టి
కళంకము
ఉండదు.
ఆ
అవతారములకు
ఎట్టి
విలువలు
ఏమాత్రము
క్షీణించవు.
దీనికొక
ఉదాహరణ:
చంటిబిడ్డ
భూమిపై
ఆడుకుంటూ
ఉంటుంది.
ఆ
బిడ్డ
యొక్క
తల్లి
తాను
పెద్దదాన్ని
కదా!
అని
అహంకరించి
ఆ
బిడ్డతో—
“నీవు
ఎగిరితే”
తాను
ఎత్తుకుంటానంటే,
ఆ
బిడ్డ
ఎగరగలదా?
కాని,
ఆ
బిడ్డపైనున్న
ప్రేమతో
ఆ
తల్లియే
వంగి,
బిడ్డను
ఎత్తుకుంటుంది.
కేవలము
ఆ
తల్లి
వంగినంత
మాత్రమున,
ఆ
బిడ్డకు
ఆ
తల్లి
లొంగిపోయినట్లవుతుందా?
కాదు.
కాబట్టి,
దివ్యస్థానాన్ని
పొందలేని
అశక్తులైన
మానవులను
అనుగ్రహించే
నిమిత్తమై,
దైవం
మానవాకారమును
ధరించి
వారి
స్థాయికి
దిగివస్తుంది.
దైవము
మానవాకారమును
ధరించి,
వాని
స్థాయికి
దిగివచ్చినంత
మాత్రమున
ఆ
అజ్ఞాని
కేవలం
తనకోసమే
లొంగివచ్చినట్లుగా
భావిస్తాడు.
ఆ
రీతిగా
వచ్చుట
“వంగటమే
కాని,
లొంగటం
కాదు”.
ఈరీతిగా
రావడము-
భగవంతుని
అనుగ్రహప్రభావమేకాని
ఆతడు
లొంగి
వశమైపోవుట
కాదు.
ఎప్పటికీ,
ఆతని
గుణాలు,
పవిత్రశక్తులు
తరగకుండా
స్వస్వరూపంగానే
ఉంటాయి.
ఏయే
ప్రదేశములలో,
ఏయే
పరిస్థితులలో,
ఏయే
కాలములలో,
ఏ
విధమైన
శక్తిని
ప్రకటించవలెనో,
అక్కడ,
ఆయా
దేశకాల
ప్రభావములను
పురస్కరించుకొని
ప్రకటిస్తూనే
ఉంటాడు.
4
▾
Meaning
Keep
ప్రాపంచిక
సంబంధమైన
వ్యక్తులతో
ఆతడు
ఆడుతూ,
పాడుతూ,
నడుస్తూ
ఈ
విధముగా
ఉన్నంత
మాత్రమున
ఆ
సుప్రీంస్టేజి
యొక్క
శక్తులెక్కడా
పోవు.
కాని
తక్కువబుద్ధి
కలిగినవారికే
ఇవన్నీ
భిన్నములుగా
కనిపిస్తాయి.
రాముడు
పామరునివలె
బాధపడటం,
వియోగము
సంభవించినప్పుడు
వికారము
పొందడం
మున్నగునవి
రామాయణంలో
ఎక్కువగా
కనిపిస్తాయి.
కానీ,
ఇవన్నీ
రాముడు
ఎందుకోసం
చేసినాడంటే,
తన
సాటి
మానవులకు
సహజమైన
ధర్మప్రపత్తిని
ప్రబోధించే
నిమిత్తమై,
వ్యక్తులేవిధంగా
ప్రవర్తించాలనే
ఆదర్శాన్ని
అందించే
నిమిత్తమై
ఈ
రీతిగా
ప్రదర్శిస్తూ
వచ్చాడు.
పితృవాక్య
పరిపాలన
—
సీతాపరిత్యాగము
రామాయణము
ప్రతి
గృహానికి,
ప్రతి
కుటుంబానికి,
అత్యవసరమైన
ఆదర్శాన్ని
అందించిన
మహాకావ్యము.
తండ్రి
-
కొడుకులు,
భార్యా
-
భర్తలు,
అన్నదమ్ములు,
రాజు
-
ప్రజలు,
తోడికోడండ్రు—
మున్నగువారలు
ఏరీతిగా
మసలుకోవాలనే
విషయాన్ని
తెల్పేదే
రామచరిత్ర.
ఈ
విధంగా
అన్ని
గృహాలలో
ఏకత్వాన్ని
పోషించి,
దివ్యత్వాన్ని
అనుగ్రహించి,
దైవత్వంగా
మార్చినటువంటిదే
ఈ
అవతారతత్త్వం.
ఎప్పుడో
తన
పినతల్లికి,
దశరథుడు
ఇచ్చిన
మాట
నెరవేర్చటానికి
రాముడు
సంసిద్ధుడైనాడు.
తాను
మహారాజుకాగల
ఆ
క్షణములో,
అట్టి
పవిత్రమైన
సదవకాశమును
త్యాగముచేసి
అరణ్యానికి
వెళ్ళాడు.
సర్వజ్ఞుడు,
సర్వవ్యాపకుడు,
సర్వశక్తిమయుడైన
రాముడు
రాజ్యపాలనకు
తగినసమర్థుడు.
అట్టి
సర్వసమర్థత
తనలో
ఉండినప్పటికీ,
తండ్రివాక్యమును
నిలబెట్టే
నిమిత్తమై,
తన
సర్వస్వమును
త్యాగంచేసి
అరణ్యానికి
వెళ్ళాడు.
ఇది
ఆదర్శవంతమైన
చర్య.
పితృవాక్య
పరిపాలనలో
ఇక్ష్వాకుల
వంశము
ప్రసిద్ధి
గాంచినదనే
సత్యాన్ని
రాముడు
నిలబెట్టినాడు.
ఆ
సత్యాన్ని
నిలబెట్టే
నిమిత్తమై
రాముడు
ఎన్ని
కష్టములైనా,
ఎన్ని
నష్టములైనా
సహించి,
భరించి,
తట్టుకొని,
నెట్టుకొని-
ముందునకు
సాగిపోయినాడు.
ప్రజలలో
ఉండిన
ప్రేమను,
విశ్వాసమును
అభివృద్ధిని
గావించుకొనే
నిమిత్తమై
ఇన్ని
రకములైన
మార్గాలను
అనుసరిస్తూ
వచ్చాడు.
ఒక
అల్పుడైన
చాకలివాడు
రామునిపైన
ఎదో
ఒక
తెలియనటువంటి
“నింద”
వేసేటప్పటికి,
“నా
ప్రజలలో
ఒక
అల్పుడైనవాడే,
ఈ
విధమైన
మాటలతో
బాధిస్తూ
ఉండగా,
ఇంక
నా
ప్రజలలో
ఈ
రహస్యం
ఎంత
నిగూఢంగా
దాగి
ఉన్నదో
కదా!”
అని
భావించుకొని,
లోకం
నిజతత్త్వాన్ని
గుర్తించుకొనే
నిమిత్తమై
సీతను
అరణ్యానికి
పంపగలిగినాడు.
అందుచేతనే,
శ్రీరామచంద్రుడు
ప్రజాపరిపాలన
చేయుటలో
చాలా
ప్రతిష్ఠగాంచిన
మహారాజైనాడు.
ఈనాడు
అప్రయోజకులు,
అశక్తిపరులు
ప్రజాపరిపాలన
చేయాలని
సంసిద్ధులుగా
ఉంటుండి
దానిని
ఆశిస్తారు.
ఇది
కేవలము
ఒక
దుర్మార్గం.
ఈనాటి
భారతదేశము
ఇంతటి
దుస్థితికి
దిగజారటానికి
ఇదే
ముఖ్యకారణము.
అప్రయోజకుల
పరిపాలన
చేతనే,
భారతదేశం
మరింత
దిగజారిపోయింది.
ప్రజాపరిపాలన
చేయుటకోసం
గుణవంతులైన,
స్వార్థాన్ని
త్యాగం
చేయగలిగిన
పవిత్ర
పురుషులు
రావాలి.
ఇట్టి
ఆదర్శాన్ని
నిరూపించినవాడే
శ్రీరాముడు.
ప్రజలకు,
తనకు
ఉండిన
సన్నిహిత
సంబంధబాంధవ్యమును
చక్కగా
గుర్తించుకొని
వర్తించిన
మూర్తి
ఈ
చక్రవర్తి.
అన్నదమ్ముల
అనురాగం
రామచంద్రుని
అన్నతమ్ముల
ఐకమత్యము,
అనురాగము
వర్ణింపరానిది.
పినతల్లి
ఆజ్ఞప్రకారము
రాముడు
నారచీరలను
ధరించి,
తాపసవేషము
వేసుకొని
అరణ్యమునకు
వెళ్ళవచ్చు,
కాని
లక్ష్మణునకు
ఎవ్వరి
ఆజ్ఞలేదు,
తాను
ఎవ్వరిని
అనుసరించవలసిన
అవసరము
లేదు.
5
▾
Meaning
Keep
కానీ,
తన
సోదరుడైన
రాముడు
ఈ
విధమైన
స్థితిలో
ఉండినప్పుడు,
“నేను
సుఖముగా
ఈ
రీతిగా
అయోధ్యలో
జీవించుట
నా
ధర్మం
కాదు”
అని
భావించుకొని,
తనకు
తల్లి,
భార్య
ఉండినప్పటికిని
తానుకూడా
తన
సర్వస్వమును
త్యజించి
రామచంద్రుడే
నా
ప్రాణమని
విశ్వసించి,
రామచంద్రునితో
తాపసవేషమును
ధరించి
అరణ్యాలకు
వెళ్ళినాడు.
అంతేకాకుండా,
లక్ష్మణుడు,
“రాముడులేని
అయోధ్య
నాకు
అరణ్యమే,
రాముడున్న
అరణ్యమే
నాకు
అయోధ్య”
అని
విశ్వసించినాడు.
నిద్రాహారములు
మానుకొని
లక్ష్మణుడు-
రాత్రింబవళ్ళు
ఆ
అరణ్యంలో
“సీతారాముల
సేవ”
చేస్తూ
వచ్చాడు.
ఈనాటి
కాలంలో
“రాముడు
ఆనాడు
అరణ్యానికి
పోతేపోయాడు
కానీ,
నాకు
మాత్రము
చక్కగా
దక్కింది
కదా!”
అని
భావించి
వచ్చే
లాభాన్ని
దక్కించుకోవటానికి
ఎన్నెన్నో
ఉపాయాలు
చేస్తారు
ఈనాటి
సోదరులు.
“ప్రాపర్టీ”
కోసమని
ఒకరికొకరు
పోరాడి
Supreme
Court
వరకు
వెళ్ళుతారు.
ఉన్న
ప్రాపర్టీ
పాడు
చేసుకుంటారు.
వారిద్దరికీ
అనుభవించే
యోగము
ఉండదు.
కట్టకడపటికి
తినటానికి,
ఉండటానికి
లేక,
“తిత్తి
బోడి,
నెత్తి
బోడి”
అనే
సామెత
రీతిగా,
ఇద్దరూ
Supreme
Court
లో
ఈ
ధనమంతా
పాడు
చేసుకుంటారు.
లోకంలో
ఈ
విధమైన
దుర్మార్గములో
ప్రవేశించే
సోదరులుంటారు.
అట్టి
సోదరులకు
రాముడు
ఆదర్శవంతమైన
దానిని
లక్ష్మణుని
ద్వారా
అందిస్తూవచ్చాడు.
సీతారాముల
సంవాదం
శ్రీరామచంద్రుడు
ప్రతీ
కుటుంబానికి,
భార్యాభర్తలలో
ఉన్న
సంబంధమును,
కర్తవ్యమును-
తన
ద్వారా
అందిస్తూ
వచ్చాడు.
ఎండ
కన్నెరుగని
సీత.
అతి
సుకుమారి.
అట్టి
సీత
దట్టమైన
అరణ్యానికి
రాముడు
వెళ్ళే
సమయమందు
తానుకూడా,
అరణ్యములో
ప్రవేశించి
తన
“పతిసేవ”
చేయాలని
ఆశించింది.
కానీ,
రాముడు
ఎన్ని
విధములుగనో-
ఆమెకు
సమాధానము
చెబుతూవచ్చాడు,
“సీతా!
మేము
పురుషులము,
వెళ్ళేది
దండకారణ్యము.
ఆ
అడవిలో
క్రూరమృగాలు,
రాక్షసులు
భయంకరమైన
శబ్దాలు
చేస్తూ
ఉంటారు.
అనేకరకములైన
క్రూరమృగాలంతా
విహరిస్తూ
ఉంటాయి”.
అప్పుడు
సీత
చెప్పింది,
“నా
దగ్గర
“పురుష
సింహము”
ఉండినప్పుడు,
క్రూరమృగాలు
నన్నేమి
చేయగలవు?
అన్ని
మృగాలు
మృగరాజైన
సింహానికి
భయపడవలసిందే
కదా!
అందులో-
నీవు
‘పురుష
సింహుడవు’
కనుక,
నాకు
ఎట్టి
భయాలు
చెప్పనక్కర
లేదు”
అని
స్పష్టంగా
చెప్పివేసింది.
తిరిగి
రాముడు,
“నీవు
ఏనాడూ
అరణ్యాలు
చూడలేదు.
అక్కడి
రాక్షసులు
చాలా
భయంకరమైన
వేషాలుధరించి
ఉంటారు.
నేను
నిన్ను
రక్షించుకొనుట
చాల
కష్టమవుతుంది”
అని
అన్నాడు.
తిరిగి
సీత,
“పదునాల్గు
లోకాలు
రక్షించే
నీకు,
ఒక్క
సీతను
రక్షించుకొనుట
చేతకాదా?
ఇది
పిరికితనము
కాదా?”
అని
చెప్పి,
తానుకూడా
వస్తానని
చెప్పింది.
ఈ
విధంగా
ఒక్కొక్క
మాటకు
ఒక్కొక్క
మాటను
సమాధానముగా
చెప్పుకుంటూ
తన
భర్తతో
వెళ్ళడానికి
ఉపాయము
పన్నుతూ
వచ్చింది.
కానీ
ఇంకా
శ్రీరామచంద్రుడు
తన
ధోరణిని
మార్చకుండా,
ముందునకు
సాగిస్తూనేపోయాడు,
“సీతా!
నా
తల్లిదండ్రులు
నా
వియోగము
చేత
మహాదుఃఖాన్ని
పొందుతున్నారు.
కాబట్టి
నాకు
బదులుగా,
నా
తల్లిదండ్రులకు
సేవచేస్తూ-
అయోధ్యలోనే
ఉండమని”
చెప్పాడు.
వీరిద్దరి
సంభాషణకు
పూర్వము,
రాముడు
కౌసల్యతో
మాట్లాడిన
సందర్భములో,
ఆమెకోసం
ఎన్ని
నీతులు
రాముడు
బోధించాడో,
అవన్నీ
సీత
వినడం
జరిగింది.
6
▾
Meaning
Keep
రాముడు,
“అమ్మా!
నేను
తండ్రి
ఆజ్ఞప్రకారము
అరణ్యానికి
వెళ్ళుచున్నాను”
అని
చెప్పి,
నమస్కారం
చేయడం
జరిగింది.
అప్పుడామె
రాముని
చూచి,
“నాయనా!
లేకలేక
కలిగిన
కుమారుడవు.
అనేక
యజ్ఞయాగాదుల
చేత
లభించిన
వరప్రసాదుడవు.
అట్టి
నిన్ను
క్షణమైనా
వదలిపెట్టి
ఉండలేను”
అని
కౌసల్య
రాముని
రెండు
చేతులు
పట్టుకొని
బ్రతిమాలుకొంది.
అప్పుడు
రాముడు,
కౌసల్యకు
చక్కని
నీతులెన్నో
చెబుతూ
వచ్చాడు,
“సతికి
పతియే
దైవం.
తల్లికి
పుత్రుడు
ఎంత
ప్రియమైనవాడైనప్పటికీ,
భర్తకంటే
అధికుడు
కాదు.
కనుక
“ఆత్మానాం
పుత్రనామాసి”
తండ్రి
యొక్క
ఆత్మయే
పుత్రుడుగా
పుట్టాడు.
నేను
కేవలం
ప్రతిబింబమే,
కానీ
నా
తండ్రి
బింబము,
నా
తండ్రి
సేవ
చేయటమే
నీ
ప్రధాన
ధర్మము
కానీ,
నా
వెంట
అరణ్యానికి
రావడం
నీకు
ధర్మం
కాదు”
అని
“స్త్రీ
ధర్మాన్ని”
రాముడు
నిష్కర్షగా,
అనేక
రకాలుగా
బోధించడం
జరిగింది.
ఇక్కడ
సీత
విషయములో
మాత్రము,
‘నీవు
అత్తమామల
సేవ
చేస్తుండమని’
రాముడు
చెప్పేటప్పటికి,
సీతకు
ఆ
విషయాలన్నీ
చక్కగా
గుర్తుకు
వచ్చి,
“రామా!
తల్లికి
ఒక
బోధ,
నాకొక
బోధ
ఉంటుందా?
“పతి
సేవయే”
సతికి
ప్రాణమని
అక్కడ
నీవు
బోధించినావు
కదా!
ఒక్క
కౌసల్యకు
మాత్రమే
ఆ
బోధకు
సంబంధమై
ఉంటుందా?
నాకు
మాత్రము
దానితో
సంబంధం
లేదా?
నా
పతిసేవయే
నా
ప్రధానమైన
ప్రాణము.
కనుక
నా
కోసం
నీవు
ఏమాత్రము
బాధ
పడనక్కర
లేదు.
నీ
మాట
నీవు
దక్కించుకొనే
నిమిత్తమై
నన్ను
నీ
వెంట
అరణ్యానికి
తీసుకొనిపొమ్మని”
చెప్పి,
“తండ్రివాక్యం
పరిపాలించే
నిమిత్తమై
నీవు
వెళ్ళుతున్నావు,
పతివాక్యం
పరిపాలించే
నిమిత్తమై
నేను
వస్తున్నాను”
అని
చెప్పింది.
కనుక
ఇట్టి
సతీపతుల
అనుబంధ,
సంబంధబాంధవ్యములను
ఇంత
పవిత్రమైన
ఆదర్శముగా
రాముడు
నిరూపిస్తూ
వచ్చాడు.
రామాయణంలో
-
భరతుని
పాత్ర
ఇక్ష్వాకుల
వంశం-
సత్యపరిపాలనలో
ప్రసిద్ధి
గాంచినటువంటిది.
సత్కీర్తిని
సాధించినటువంటిది.
కనుక
ఆనాటి
కులాలు,
కుటుంబాలు
ఇంత
విశ్వాసాలతో
జీవిస్తూ
వచ్చాయి.
కైక
తన
కుమారుడైన
భరతునకు
రాజ్యం
కట్టపెట్టాలని
కోరినప్పటికీ,
ఆతడు
అంగీకరించలేదు.
‘తండ్రి
ఇచ్చిన
రాజ్యమే,
తల్లి
కోరిన
రాజ్యమే’
వచ్చింది
కదా!
అని
భరతుడు
ఆనందించక,
జ్యేష్ఠ
పుత్రుడైన
రామచంద్రుడు
పరిపాలించవలసిన
రాజ్యాన్ని
అన్యాయంగా,
అక్రమంగా
తాను
పరిపాలించడం
ఇక్ష్వాకుల
వంశమునకే
‘అపకీర్తి’
అని
త్యజించి
తృణీకరించినాడు.
అంగీకరించక
పోవటమే
కాకుండా,
ఆ
రాజ్యములో-
నేను
అడుగు
పెట్టను,
ఆ
సింహాసనమును
నేను
చూడను.
తుచ్ఛమైన
ఈ
రాజ్యం
కోసమై,
మా
తాతముత్తాతలనాటి
నుండి
వచ్చిన
“సత్కీర్తిని”
నేను
మట్టిపాలు
చేయుదునా?
నేడు
“తండ్రి
ఆజ్ఞను”
పరిపాలించే
నిమిత్తమై
రాముడు-
అరణ్యాలకు
వెళ్ళినప్పుడు,
నేనుకూడా
“కులకీర్తిని”
రక్షించే
నిమిత్తమై
అరణ్యానికి
వెళతాను.
కాబట్టి
ఈ
రాజ్యము
నాకు
అక్కరలేదు”
అన్నాడు.
చిట్టచివరకు
“నంది”
గ్రామానికి
ధర్మసమ్మతముగా
“శ్రీరామ
పాదుకలు”
తెచ్చి
సింహాసనముపైన
పెట్టి,
తాను
తాపస
వేషమును
ధరించి
కాలమును
గడుపుతూ
వచ్చాడు.
ఈ
విధముగా
లభించిన
అవకాశమును
ఎవ్వరైనా
తప్పించుకుంటారా?
వెతుకుతూ
వచ్చిన
సంపదను
ఎవ్వరైనా
కాలదన్నుకుంటారా?
కాదు-కాదు.
ఇది
సంపద
కాదు.
నాకిది
“అపకీర్తి”
అనే
సత్యాన్ని
భరతుడు
చక్కగా
గుర్తించి,
వర్తించినాడు.
కాబట్టి
ఒక్కొక్క
కుటుంబానికి,
ఒక్కొక్క
వ్యక్తి
తన
కర్తవ్యాన్ని
ఏరీతిగా
నిర్వహించాలనే
ఆదర్శాన్ని
రామాయణం
చక్కగా
అందిస్తోంది.
7
▾
Meaning
Keep
ఊర్మిళ
త్యాగం
లక్ష్మణుని
భార్య
ఊర్మిళ.
ఈమె
మహాసాధ్వి.
లక్ష్మణుడు
తాను
“రామ
సేవ”
చేసే
నిమిత్తమై
రామునితో
అడవులకు
వెళ్ళుచున్నానని
తెల్పినంతనే,
ఆతని
భార్య
ఊర్మిళ
వినయముతో
తలవంచి
నమస్కరించి,
“అయ్యో!
నాకట్టి
భాగ్యం
కలుగలేదు.
కాబట్టి
మీరైనా
వెళ్ళిరండి”
అని
చక్కగా
తెల్పింది.
అటుతరువాత
తానుకూడా
వెళ్ళాలనే
ఆశ
కలిగినప్పటికీ,
ఈ
విధంగా
తిరిగి
లక్ష్మణునికి
తెల్పుకొంది,
“నేను
మీ
వెంటవస్తే,
సీతారాముల
సేవ
మీరు
చేయుటలో
నేను
అభ్యంతరము
కలిగించిన
దానిని
అవుతాను.
అందుచేత
ఎట్టి
అభ్యంతరము
లేకుండా
మీరు
సీతారాముల
సేవ
చేసే
నిమిత్తమై,
మీతో
రాకుండా
నేను
అయోధ్యలో
ఉంటాను”
అని
మనస్ఫూర్తిగా
తన
అంగీకారమును
తెల్పుకొన్నది.
సీతకంటే
మహాత్యాగము
చేసిన
వ్యక్తి
ఊర్మిళ.
మాతృ
దీవెన
అన్నగారైన
శ్రీరామునితో
అరణ్యవాసానికి
బయలుదేరుచున్న
సమయమందు
లక్ష్మణుడు
తన
తల్లియైన
సుమిత్ర
పాదములకు
నమస్కారము
చేసి,
“అమ్మా!
ఆశీర్వదించు”
అని
కోరాడు.
అప్పుడు
సుమిత్ర
ఈ
విధంగా
ఆశీర్వదించింది,
“నాయనా!
శ్రీరామచంద్రుడు
లేని
ఈ
అయోధ్య
నాకు
అరణ్యము.
ఆ
శ్రీరామచంద్రునితో
కూడిన
ఆ
అరణ్యమే
నీకు
అయోధ్య.
ఆనందముగా
సేవ
చేసుకో.
నేను
చాలా
ఆనందముగా
నీకు
వీడ్కోలు
చేస్తున్నాను”
అని
పల్కింది.
ఏ
తల్లియైనా
ఆ
రీతిగా
పంపగలదా?
పంపలేదు.
ఇటువంటి
పవిత్రమైన
హృదయాలు
కలిగిన
కుటుంబమే
ఆ
శ్రీరామచంద్రుని
కుటుంబము.
శ్రీరామచంద్రుడు
తన
తల్లియైన
కౌసల్య
దగ్గరకు
వచ్చి
నమస్కారము
చేసాడు.
పుత్రవాత్సల్యము
చేత
తన
కుమారుడు
భగవంతుడని
తెలిసినప్పటికిని,
దేహసంబంధమైన
వాత్సల్యము
పెల్లుబుకుట
చేత
ఈ
విధముగా
ఆశీర్వదించింది,
“నాయనా!
తారకాసురుని
పరాక్రమ
శక్తిని,
భుజబల
సంపదను
క్రుంగదీయుటకై
బయలుదేరిన
విఘ్నేశ్వరునికి
ఆ
గౌరీదేవి
ఇచ్చిన
‘వీరరక్ష’,
మాతృదాస్యమును
మాన్పించుటకై
గరుత్మంతుడు
బయలుదేరు
వేళ
ఆతని
తల్లియైన
వినత
ఆతనికి
ఇచ్చిన
‘విమలరక్ష’
మున్నగు
రక్షలన్నియూ
నీపాలిట
అంగరక్షలై,
ధీరక్షలై,
శ్రీరక్షలై
శ్రీరామరక్షగా
నిన్ను
కాపాడుగాక”
అని
ఈరీతిగా
ధన్యమైన,
దివ్యమైన
రక్షలెన్నింటినో
పెట్టి
ఆశీర్వదించి
శ్రీరాముని
సాగనంపినది.
ఈ
విధంగా
ఆ
శ్రీరామచంద్రుని
తల్లి,
పినతల్లులు,
సోదరులు,
వారి
భార్యలు
ఎన్నో
విధములైన
ఆనందములతో
ఆతనికి
వీడ్కోలు
చేసారు.
రామచరిత్రలో
మనము
ముఖ్యముగా
గుర్తించవలసినది,
ఆ
కుటుంబాల
సమైక్యత.
కుటుంబము
ఐకమత్యముతో
ఉంటే
గ్రామము
ఐకమత్యముగా
ఉంటుంది.
గ్రామాలు
ఆనందముగా
ఉండినప్పుడే,
దేశము
ధర్మముగా
ప్రకాశిస్తుంది.
“కులగౌరవము
కోసము
కొడుకునైనా
వదలుకో,
గ్రామము
యొక్క
క్షేమము
కోసము
కుటుంబాన్నైనా
త్యాగము
చేయి,
దేశక్షేమానికి
గ్రామాన్నైనా
త్యాగం
చేయి”
ఇదే
విదురుడు
చెప్పిన
నీతి.
ఆనాడు
ఇంతటి
నీతి
నిజాయితీలతో
రామపరిపాలన
కొనసాగింది.
భగవంతుడు
స్వార్థరహితుడు
భగవంతుడు
శిక్షించవచ్చు,
రక్షింపవచ్చు,
ఆనందపెట్టవచ్చును.
దంతవక్త్ర,
శిశుపాలాదులను
సంహరించాడు-
పాండవులను
రక్షిస్తూ
వచ్చాడు.
ప్రహ్లాదుని
రక్షిస్తూ
వచ్చాడు-
హిరణ్యాక్ష,
హిరణ్యకశిపులను
సంహరించాడు.
రావణ,
కుంభకర్ణులను
శిక్షించాడు-
విభీషణునికి
పట్టము
కట్టాడు.
గోపికలను
ఏడిపించాడు-
గోపాలురకు
ఆనందమును
అందించాడు.
ఈనాటి
ప్రజలలోపల
అడుగడుగునా
సందేహాలే,
అనుమానాలే.
8
▾
Meaning
Keep
“దేవుడెందుకు
ఇట్లా
చెయ్యాలి?”
అని
ప్రశ్నించుకుంటారు.
అంతేకాదు,
దేవునికి
తనకు
చాలా
భిన్నముగా
చూచుకొంటారు.
భగవంతుని
దివ్యత్వం,
అనంతతత్త్వం
గుర్తించినవారికి
ఇటువంటి
సందేహాలకు
అవకాశమే
ఉండదు.
అనంతతత్త్వమును
గుర్తించుకోలేని
అల్పబుద్ధులే
ఇటువంటి
యోచనలు
చేస్తారు.
వారి
జీవితమంతా
అల్పత్వముతోనే
అంత్యమైపోతుంది.
కనుక
మీరు
ఈ
అల్పత్వమును
దూరం
చేసుకోవాలి.
దైవము
స్వార్థరహితముగా
ఏమి
చేసినా
దోషం
లేదు.
ఇవన్నీ
ఎందుకు
చెయ్యాలనే
ప్రసక్తి
లేదు.
ఇవన్నీ
ఆతని
లీలలో
ఒక
విధమైన
భావాలే.
దైవములో
స్వార్థమనేది
ఏ
భాగమునందు
కూడా
లేదు.
ఆదర్శవిద్యార్థి
ప్రాచీన
కాలములో
ఒక
పెద్ద
గురువు
ఉండేవాడు.
అనేకమంది
శిష్యులు
అతని
వద్దచేరి
విద్యలను
అభ్యసించేవారు.
శిష్యులందరూ
గురువుగారిని,
“మా
తండ్రి,
మా
సర్వస్వము
మీరే”
అని
స్తుతించేవారు.
కొంతకాలము
జరిగిన
తరువాత
శిష్యుల
విద్యాభ్యాసము
పూర్తియైనది.
వారందరూ
గురువుగారి
వద్ద
శెలవు
తీసుకొని
వారి
వారి
ఇండ్లకు
బయలుదేరినారు.
శిష్యులు
వెళ్ళే
సమయములో
గురువుగారు
ప్రతి
ఒక్కరికి
ఒక
నామాన్ని
ఉపదేశము
చేసి,
ఆ
నామాన్ని
ఎల్లప్పుడూ
స్మరించుకోమని
చెప్పినాడు.
శిష్యులు
ఎవరింటికివారు
వెళ్ళిన
తరువాత
“గురుదేవుని”
గూర్చి
గుర్తు
చేసుకోవటం
తక్కువైపోయింది.
మరికొంత
కాలమైన
తరువాత
గురువుగారికి
అంత్యకాలము
సమీపించినది.
శిష్యులందరికీ
రమ్మని
కబురు
పంపినాడు.
రమ్మని
కబురు
రాగానే
దగ్గరగా
ఉన్నవారంతా
తక్షణమే
వచ్చి,
అందరూ
గురువుగారి
చుట్టూచేరి
ఎక్కడలేని
Anxiety
ప్రదర్శించినారు.
వీరి
ఆర్భాటము,
తాపత్రయము
చుట్టూ
ఉన్న
పెద్దలంతా
గమనిస్తూనే
ఉన్నారు.
ఒక
శిష్యుడు
మాత్రము
చాలాదూరముగా
ఉండినవాడగుటచేత,
వెంటనే
రావటానికి
వీలుకాక
చాలా
ఆలస్యమైపోయింది.
ఆ
శిష్యుడు
గురుదేవుని
వద్దకు
సాధ్యమైనంత
తొందరగా
చేరుకోవాలనే
తపనతో
బయలుదేరాడు.
గురువుగారి
గ్రామానికి
మార్గమధ్యములో
ఒక
నది
మహోధృతంగా
ప్రవహిస్తోంది.
నదీతీరానికి
చేరుకున్నాడు.
ఈతన్ని,
అక్కడ
ఉన్న
వారందరూ
నదిలోనికి
దిగవద్దని,
చాలా
ప్రమాదకరమని
హెచ్చరిస్తున్నారు.
కానీ
ఈ
శిష్యుడు
ఇవేమీ
పట్టించుకోలేదు.
ఏమాత్రమూ
ఆలస్యము
చేయకుండా
గురువుగారిచ్చిన
నామాన్ని
స్మరించుకొంటూ
ఆ
నదిలో
పడ్డాడు.
ఆశ్చర్యం!
ఆ
నదిలోని
నీరు
ఆతని
మోకాలు
దాటలేదు.
అతడు
అవతల
గట్టునకు
చేరుకున్నాడు.
గట్టుపైన
ఉన్న
ప్రజలంతా
ఈ
అద్భుతాన్ని
కళ్ళారా
చూచి,
ఈతడెవ్వరో
మహాత్ముడని,
మహిమాన్వితుడే
అని
విశ్వసించి,
ఆతని
వెంటబడ్డారు.
వారందరిని
ఎలాగో
తప్పించుకొని
గురువుగారి
ఆశ్రమాన్ని
చేరుకొన్నాడు.
ఈ
శిష్యుణ్ణి
చూచి
మిగిలిన
శిష్యులందరికీ
విస్మయం
కలిగింది.
అంతగా
ప్రవహిస్తున్న
నదిని
ఈతడేవిధంగా
దాటి
రాగలిగినాడో
వారికి
అర్థం
కాలేదు.
శిష్యుడు
గురువుగారి
పాదములు
పట్టుకొని
నమస్కరించి,
వినమ్రుడై
నిలిచాడు.
గురువుగారు,
“నాయనా!
అంత
ప్రమాదకరముగా
ప్రవహించే
ఆ
నదిని
ఎట్లా
దాటగల్గి
నన్ను
చేరగలిగావు?”
అని
ప్రశ్నించారు.
శిష్యుడు,
“స్వామీ!
మీ
ఉపదేశమే
నన్ను
నదిని
దాటించి,
సురక్షితంగా
తమ
సన్నిధికి
చేర్చింది”
అన్నాడు.
వెంటనే
మిగిలిన
శిష్యులలో
గుసగుసలు
ప్రారంభమైనాయి.
“మన
గురువునకెంత
పక్షపాతబుద్ధి!
ఒక్కనికి
మాత్రము
ప్రత్యేకమైన,
మహత్తరమైన
శక్తినిచ్చి,
మనకు
మాత్రము
ఒక
సాధారణమైన
మంత్రమును
తలంచుకోమని,
తాను
కాలం
గడుపుచున్నాడు”
అని
గురువుగారిని
దూషించుటకు
మొదలుపెట్టారు.
9
▾
Meaning
Keep
గురువుగారు
దీనిని
గ్రహించి,
“నాయనలారా!
మీకిచ్చిన
మంత్రమే
ఆ
పిల్లవానికి
కూడా
ఇచ్చాను.
నాలో
ఎట్టి
పక్షపాతబుద్ధి,
భేదంగాని
లేదు.
నాది
విశాలమైన,
నిస్స్వార్థమైన
హృదయము”
అని
పల్కి
ఆ
శిష్యునిచూచి,
“నాయనా!
నీకేనామాన్ని
ఇచ్చానో
వీరందరికీ
చెప్పు”
అని
అడిగినాడు.
ఆ
శిష్యుడు
గురువుగారిచ్చిన
నామాన్ని
మిగిలిన
శిష్యులందరికీ
తెలియజేశాడు.
అందరూ
విన్నారు.
వీరందరికీ
ఇచ్చిన
నామము
కూడా
అదే.
అయితే
వీరందరూ
ఆ
నామము
యొక్క
మహత్తును
విశ్వసించి,
సరిగా
గుర్తించనందున
దానిని
ఉపయోగించుకొనలేకపోయినారు.
కాని
ఈ
శిష్యుడు
మాత్రము
ఆ
నామమును
ఉపదేశించిన
గురుదేవుని,
“ఆదర్శకుడు”గా
భావించుకొని,
“నా
గురువే
నాకు
ఆదర్శకుడు”
అనే
విశ్వాసముతో
ఆదర్శవిద్యార్థిగా
మసలుకొన్నాడు.
ఆ
విశ్వాసమే
ఆతనిని
రక్షించినదిగాని
నామములో
ఏమాత్రము
భేదము
లేదు.
నామాలలో
భేదాలు
పెట్టుకొని
ఎన్ని
సాధనలు
చేసినా
నిష్ప్రయోజనమే!
విశ్వాసము
అత్యవసరము.
విశ్వాసములేని
నామాన్ని
ఎన్ని
సార్లు
స్మరించినప్పటికీ
ప్రయోజనం
లేదు.
కాబట్టి
నమ్మకము
ప్రధానం.
ప్రతీవ్యక్తి
ఆదర్శప్రాయుడు
కావాలి
ఎన్ని
చదువులు
చదివినప్పటికీ,
దురదృష్టవశాత్తు
దైవాన్ని
మాత్రము
నమ్మడానికి
పూనుకోవటం
లేదు.
ఈనాటి
తెలివితేటలు,
విజ్ఞాన
వివేకములంతా
అల్పమైన
వానిని
నమ్మటానికి
పనికివస్తున్నాయి.
అధికమైన,
ఉత్తమమైన,
అభివృద్ధిని
పొందే
ఆదర్శవంతమైన
దానిని
నమ్మటంలేదు.
కనుక
ఈనాటి
మానవుడు
ఇన్ని
అవస్థలకు
గురికావలసి
వస్తున్నది.
కాబట్టి
నమ్మకము
పెట్టుకోవాలి.
శ్రీరాముని
ఆదర్శముపైన
నమ్మకము
పెట్టుకొనుట
చేతనే,
ఎన్నివేల
సంవత్సరములు
అయినప్పటికిని,
ఈనాటికి
“రామ”
అంటే
అందరూ
గౌరవిస్తున్నారు.
ఎన్ని
యుగాలు
మారినప్పటికీ,
ఆదర్శాలు
చెక్కుచెదరవు.
ఆదర్శవంతమైన
జీవితముగా
మనము
రూపొందింపజేసుకోవాలి.
ప్రతీ
వ్యక్తి
ఆదర్శప్రాయుడు
కావాలి.
కేవలం
ఆడంబర
మానవుడు
కారాదు.
ఈ
ఆడంబరము
మాని,
ఆత్మవిశ్వాసమును
అభివృద్ధిపరచుకోవాలి.
ఏనాడు
మనము
దైవత్వమును
చింతిస్తామో,
ఆనాడే
మనకు
“రామ
యుగము”
రాగలదు.
అందరూ
రామస్వరూపులే
అవుతారు.
రాముడనగా
దశరథ
కుమారుడు
రాముడు
కాదు.
ఆత్మనే
రాముడు.
అందుకనే
“ఆత్మారామా”
అంటారు.
రమింపజేసేవాడే
రాముడు.
ఆకర్షింపచేసేవాడే
రాముడు.
కనుక
రామజననమనగా
ఏమిటంటే
ఏనాడు
పవిత్రమైన,
ఆదర్శవంతమైన
భావాలు
మనలో
పెంచుకొంటామో
ఆనాడే
రామచింతన,
రామజననము
కాగలదు.
కనుక
ప్రేమచేత
భగవంతుని
పొందండి.
భగవంతుని
పొందడానికి
ప్రేమతప్ప
మరొకటి
ఏదీ
ప్రధానమైన
సాధన
ఈ
లోకంలో
లేదు.
Previous
←
The yugas and human life
Next
Blessed Is The Person Who Has Shuddhi, Shanti, And Perseverance
→