Contents
Devotion & Sacred Story
Home
Library
Find
Shelf
Settings
←
Leave
Sathya Sai Speaks 1991 · The yugas and human life
Tap a verse for its meaning
IAST
Telugu
Meaning
Continuous
The yugas and human life
17 March 1991, Ugādi, Prasanthi Nilayam
1
▾
Meaning
Keep
“విశ్వవిభుని
యందు
—
విశ్వమంతా
ఏరీతిగా
వెలుగుచుండునో,
అదే
రీతిగనే
ఆతని
ప్రేమ
విశ్వవ్యాప్తమై
ప్రకాశించుచుండును.
అట్టి
విశ్వవిరాట్స్వరూపుని
మైత్రి
విడదీయరాని
స్నేహము
వంటిదని
చెప్పవలె.
ఈ
మాట
సత్యమైనమాట
అదే!
సాయిమాట.
కనిపించే
జగత్తులో—
“ఆత్మస్వరూపుని
చైతన్యము”,
మణులలోపల
సూత్రము
రీతిగ
కనబడ
కుండా
వెలుగొందుచుండును.
అదే
విధముగనే,
పరమాత్ముని
-
ప్రకృతి
ఈ
“ప్రజోత్పత్తి”
రూపమున
విశ్వవ్యాప్తమై,
వ్యాపించి
ఉన్నది”.
ప్రేమస్వరూపులారా!
కనిపించే
ప్రపంచమును,
ప్రపంచముగా
చూచేవారే
పామరులు.
ఇది
సామాన్యపు
సాధన.
ప్రపంచమును
పరమాత్మ
దృష్టితో
గుర్తించటమనేది
విశేషమైన
వివేక
సాధన.
“సర్వం
ఖల్విదం
బ్రహ్మ”
“విశ్వం
విష్ణుస్వరూపం”—
ఈ
వేదోక్తులను
పురస్కరించుకొని
జగత్తంతయు
పరమాత్మ
స్వరూపమనే
విశ్వసించాలి.
భారతీయుల
దృష్టిలో
పరమాత్మ
కానటువంటిది
ఏ
ఒక్కటీ
లేదు.
కానీ
ఇట్టి
పవిత్ర
సత్యాన్ని
గుర్తించలేని
అజ్ఞానులు—
భారతీయులను
చెట్లను,
పుట్టలను,
గుట్టలను,
గోవులను,
పాములను,
పక్షులను—
పూజిస్తారని
కొందరు
అవహేళన
చేస్తారు.
కానీ
సత్యతత్త్వమును
గుర్తించుకొనే
దివ్యత్వము
మానవునియందు
క్షీణించిపోవుచున్నది.
ఏ
దేశమునందు
గాని,
ఏ
మతమునందు
గాని
ఈ
రకమైన
సాంఘిక
న్యాయము
ఎక్కడా
కనిపించుట
లేదు.
ఊర్ధ్వ
దృష్టిని
పెంచుకో
మానవుని
యందు
పశుత్వం,
మానవత్వం,
దైవత్వము
అనే
మూడు
తత్త్వములు
ఇమిడి
ఉంటున్నవి.
మొదటిది
అడుగు
భాగముది
పశుత్వం.
ఈ
పశుత్వం
నిరంతరం
భూమినే,
క్రిందభాగమునే
చూస్తుంది.
తన
దృష్టి
అంతా
అడుగు
భాగము
వైపునే
ఉంచుతుంది.
2
▾
Meaning
Keep
అనగా
తాను
అధోగతి
తత్త్వాన్నే
అనుభవించటానికి
ఆశిస్తుంది.
మధ్యస్థాయి
యందున్నదే
మానవత్వము.
మానవుడు
నిరంతరం
ఊర్ధ్వ
దృష్టినే
పెంచుకోవాలి.
అప్పుడే
తనపైన
ఉన్న
దివ్యత్వము
తనకు
అర్థమౌతుంది.
కానీ
దురదృష్టవశాత్తు
మధ్యనున్న
మానవుడు
అడుగుదృష్టినే
అభివృద్ధి
పరచుకొంటున్నాడు
గానీ,
ఊర్ధ్వ
దృష్టిని
ఏమాత్రము
పోషించుకొనుటకు
ప్రయత్నించుటలేదు.
కనుక
మానవుడు
తన
దృష్టిని
ఉన్నతమైన,
ఉత్తమమైన
ఊర్ధ్వదృష్టిని
అభివృద్ధి
పరచుకోవాలి.
మానవ
జీవితము
క్షణికమైనది
కాదు.
నూరు
సంవత్సరముల
పంట.
ఐతే
మానసిక
ప్రవృత్తి
క్షణికమైనది
కాదు.
ఈ
మానసిక
ప్రవృత్తి
అనేక
జన్మలనుండి
మానవుని
వెంటాడుతున్నటువంటి
జంట
వంటిది.
ఇట్టి
అతీతమైన
కాలమునకు
సంబంధించిన
కాయము
మనస్తత్త్వమైనప్పటికిని,
మానవుడు
తరించవలెనంటే
ఒక్క
క్షణము
చాలు.
సత్యతత్త్వమును
గుర్తించుకొనుటకు
ఒక్క
క్షణమే
చాలు.
“యదృశ్యం
తన్నశ్యం”
కనిపించునదంతయూ
కేవలం
నశించునదే.
అసత్యమైన
జగత్తును
సత్యముగా
భావించి,
విశ్వసించి
సత్య
సంబంధమైన
ఆత్మతత్త్వమును
విస్మరించటం
చేతనే
మానవుడు
కాలమునకు
లొంగిపోవుచున్నాడు.
అపకారికి
ఉపకారం
చేయాలి
మానవుడు
మానవుడు
కాదు,
“దైవం
మానుష
రూపేణా”
దైవమే
మనుష్యాకారము
ధరించి
దివ్యత్వమైన
ఆత్మతత్త్వమును
వెదికే
నిమిత్తమై
ఈ
కాయమును
ప్రసాదించినటువంటిది.
ఏ
ఆత్మ
నిమిత్తమై
ఈ
దేహము
ప్రసాదించెనో,
అట్టి
దేహము
ఈనాడు
“అన్నం”
నిమిత్తమై
ఆరాటపడుతూ
ఆత్మను
విస్మరిస్తూ
వస్తున్నది.
మానవుడు
తరించుటకు
బదులు
గమ్యమునకు
అతిదూరమైపోతున్నాడు.
సకల
వేద
శాస్త్రములు
గౌరవించవలసిన
మార్గమును
ప్రబోధిస్తూ
వచ్చినవి.
గౌరవించిన
వారినే
గౌరవించటం
-
అగౌరవించిన
వారిని
గౌరవించటం
ఇది
శాస్త్ర
సమ్మతం.
కానీ
అగౌరవించిన
వారినే
గౌరవించటం,
గౌరవించిన
వారిని
-
అగౌరవించటం
ఈ
కలియొక్క
ప్రభావము.
ఉపకారికి
ఉపకారము
చేయుట
విపరీతము
కాదు,
నెపమెన్నక
అపకారికి
ఉపకారము
చేయటమే
నేర్పరితనము.
అపకారము
చేసినవారికి
ఉపకారము
చేయటము
ఈ
అపకారమును
ప్రోత్సహించినట్లు
అవుతుంది
కదా!
అని
భావించవచ్చును.
కాదు
-
కాదు.
అపకారికి
ఉపకారము
చెయ్యాలి.
అట్లుకాక
అపకారము
చేసిన
వారికి
తిరిగి
మనము
అపకారము
చేసినప్పుడు
నీవు
ఉపకారివి
ఏ
రీతిగా
కాగలవు?
అతను
అపకారి
అయినప్పుడు
నీవు
కూడా
అపకారియే
కాగలవు.
కనుక
నీ
ఉన్నత
స్థాయిని
నీవు
కోల్పోవుతున్నావు.
అతను
అపకారి
అయినప్పటికినీ,
నీవు
ఉపకారము
చెయ్యి,
అప్పుడే
నీవు
ఉపకారి
కాగలవు.
నీ
ఉన్నత
వ్యక్తిత్వము
నీవు
పోషించుకొన్నవాడవు
కాగలవు.
కనుక
వ్యక్తిత్వమును
అభివృద్ధి
పరచుకొనే
నిమిత్తమై
అపకారికి
ఉపకారం
చేయుటం,
అగౌరవించిన
వారిని
గౌరవించటం
మానవుని
ప్రధానమైన
లక్షణం.
3
▾
Meaning
Keep
From
Bhaja Govindam, verse 14
సత్యాన్ని
చక్కగా
గుర్తించు
ఈనాటి
మానవుడు
ఇట్టి
సత్యాన్ని
చక్కగా
గుర్తించటానికి
ప్రయత్నించటంలేదు.
సత్యాన్ని
అసత్యంగా,
అసత్యాన్ని
సత్యంగా
విశ్వసిస్తున్నాడు.
ఉదాహరణ:
ఏవిధమైన
పనులు
చేయకుండను
భుజించి
హాయిగా
కాలాన్ని
గడపాలని
ఆశిస్తాడు.
ఇందులో
ఎంత
అసత్యమున్నదో
మనము
గుర్తించటానికి
ప్రయత్నించాలి.
ఎట్టి
కర్మలు
ఆచరించక
సుఖంగా
నేను
భుజించి,
ఆనందమును
అనుభవించాలని
ఆశించటంలో
ఎంత
అసత్యముంది?
భుజించటం
కర్మ
కాదా!
గాలి
తీసుకోవటం
కర్మ
కాదా!
నడచటం
కర్మ
కాదా!
మాట్లాడటం
కర్మ
కాదా!
కర్మ
చేస్తూ
నేను
ఎట్టి
కర్మలు
చేయటం
లేదని
భ్రమిస్తున్నాడు.
ఇది
ఎంత
విచిత్రమైన
చిత్రం.
కర్మ
ఆచరిస్తూ,
నేను
ఆచరించటము
లేదని
భావిస్తున్నాడు.
కర్మ
ఆచరించక
క్షణమైనా
ఈ
కాయము
ఉండుటకు
వీలుకాదు.
కాయము
కర్మచేత
కట్టబడినది
కనుక
కర్మచేసే
తీరాలి.
చూచేదంతా
భగవత్స్వరూపమే
“పశ్యన్న
పిచ
న
పశ్యతి
మూఢః”
అన్నారు.
అనగా
భగవంతుని
చూస్తూ,
అనుభవిస్తూ,
ఆనందిస్తూ—
భగవంతుని
చూడాలని-
చూడాలని
భ్రమిస్తున్నాడు.
వీడు
మూఢుడు
కాక
మరేమిటి?
చూచేదంతా,
అనుభవించేదంతా,
ఆనందించేదంతా
భగవత్స్వరూపము
కాదా?
భగవత్స్వరూపమంటే
ప్రత్యేకమైనది
ఎక్కడ
ఉన్నది?
ఆనందమే
భగవత్స్వరూపం.
దృశ్యమే
భగవత్స్వరూపము.
జగత్తే
భగవత్స్వరూపం.
కనుకనే
“పశ్యన్న
పిచ
న
పశ్యతి
మూఢో”.
ఇదే
విధంగా
కర్మనాచరిస్తూ
నేను
కర్మను
ఆచరించటము
లేదని
అనుకుంటున్నాడు.
భగవంతుని
చూస్తూ
నేను
భగవంతుని
చూడాలని
భ్రమిస్తున్నాడు.
దీనికి
మూడు
విధములైన
కారణములుంటున్నాయి.
మల,
విక్షేప,
ఆవరణములని
మూడు
స్థితులు.
మానవజీవితం
సందేహాల
పుట్ట
మలమనగా
అద్దముపైన
కప్పబడిన
దుమ్మును
మనము
తుడిచినప్పుడే
పోతుంది
గాని,
తుడవకపోతే
పోదు.
మన
పరిశుద్ధమైన
హృదయమునందు
లోకసంబంధమైన,
త్రిగుణాత్మకమయిన
జగత్తత్త్వములు
ఆవరించి
ఉంటున్నాయి.
ఇట్టిదానిని
ప్రయత్నరూపంతో
తుడిచినప్పుడే
పోతుంది.
కానీ
మనము
తుడుచుటకు
బదులు
ఆ
మలమును
మరింత
అధికముగా
చేర్చుకుంటున్నాము.
కనుక
నిత్య
సత్యమై
ప్రకాశించే
ఆత్మ
తత్త్వము
మనకు
అగోచరంగా
వుంటున్నది.
ఇంక
విక్షేపమనగా
ఏమిటి?
నిరంతరం
చలించేటటువంటిది.
ఈ
చలించటం
అంటే
ఏమిటి?
గుణముల
యొక్క
స్వభావము,
రాగద్వేషముల
యొక్క
ప్రభావము,
మనస్సుపైన
తిరిగి
తద్వారా
ప్రతి
దానియందు
కూడ
సందేహము
సందేహము.
మానవుని
జీవితము
అంతయూ
కేవలము
అనుమానములతోనే
నిండి
ఉంటున్నది.
ఏది
చేయాలని
తలచుకొన్నప్పటికీ,
‘ఇది
అవుతుందో
కాదో?
చేయగలనో
లేదో?’
అనే
అనుమానం
అతనిని
ఆవరించి
ఉంటున్నది.
కారణం
ఏమిటి?
సంపూర్ణ
విశ్వాసము
లేక
పోవటమే
దీనికి
కారణము.
సంపూర్ణమయిన
విశ్వాసమే
వుండి
వుంటే,
యిట్టి
సందేహములకు
అవకాశమే
వుండదు.
4
▾
Meaning
Keep
కనుక
మానవుడు
సందేహ
నిమిత్తమై
కొన్ని
విధములైన
అభివృద్ధులను
తనకుతానే
ప్రోత్సహించుకుంటున్నాడు.
మానవుడు
తనను
తానే
నమ్మలేని
పరిస్థితికి
దిగజారిపోతున్నాడు.
తన
Pocket
లో
ఉన్న
ధనమును
తాను
విశ్వసించలేక-
నా
జేబులో
ఉంటే
పోతుందేమో
అని,
‘నీ
జేబులో
పెట్టుకో’
అని
ఇంకొకరి
జేబులో
పెడుతున్నాడు.
పోనీ
ఇతని
జేబులో
పెట్టి,
అది
భద్రముగా
ఉంటుందని
ధైర్యముగా
ఉంటాడా?
లేదు,
‘అతను
తిరిగి
యిస్తాడా?
యివ్వడో?’
అని
తిరిగి
సందేహము.
కనుక
మానవ
జీవితమంతయు
సందేహాల
పుట్టగా
తయారౌతున్నది.
ఈ
సందేహమనే
పుట్టలోపల
రాగద్వేషములనే
సర్పాలు
ప్రవేశిస్తున్నాయి.
కనుక
మన
జీవితము
ఒక
పుట్టగా
తయారైపోయింది.
ఈ
పుట్టనుండి
ఎప్పుడు
రాగద్వేషములు
వెలువడుతాయో
చెప్పలేని
స్థితిలో
ఉంది.
ఈ
రాగద్వేషములే
మానవుని
కట్టివేస్తున్నాయి.
ఈ
రాగద్వేషములకు
కారణం
సందేహమే.
కనుక
మానవుడు
ఈనాడు
గాఢమైన
విశ్వాసమును
అభివృద్ధి
పరచుకోవాలి.
దైవముపైన
విశ్వాసం
లేకపోయినప్పటికి
పరవాలేదు.
తనపై
తనకు
విశ్వాసము
అభివృద్ధిచేసుకోవాలి.
తన
విశ్వాసమే
దైవ
విశ్వాసము.
హద్దులేని
వాంఛలు
కోరవద్దు
ఇంక
మూడవది
ఆవరణము.
ఏమిటి
మనలను
ఆవరించినది?
కోరికలే
మనలను
ఆవరించినవి.
మానవుడు
ఈ
కోరికలచేత
కట్టబడి
ఉంటున్నాడు.
తన
వెనుక,
క్రింద,
పైన
కోరికలు
ఆవరించి
ఉంటున్నాయి.
ఏమిచేసినా
ఏమి
చూచినా,
ఏమి
చెప్పినా,
ఏమి
తలచినా,
ఏ
విధమైన
స్థితిలో
ఉండినప్పటికీ,
ఈ
వాంఛ
అనేది
ఏనాటికి
కదలటం
లేదు.
ఈ
కోరికలనే
దానిలో
మానవుడు
కట్టబడి
ఉంటున్నాడు.
ధనవాంఛ,
అధికారవాంఛ,
ఆరోగ్యవాంఛ,
కీర్తివాంఛ
యింకా
యింకా
ఎన్నెన్నో
ఆ
వాంఛలంతా
తిరుగుతూ
ఉంటాయి.
వాంఛలు
దోషము
కాదు.
వాంఛలు
ఉండవలసినదే.
వాంఛలకు
కొంత
హద్దు
వుంటుంది.
ఈ
హద్దులేని
వాంఛలచేతనే
మానవుడు
కట్టబడిపోతున్నాడు.
ఈవిధమైన
వాంఛలు
క్రమక్రమేణా
తగ్గించుకోవటానికి
ప్రయత్నించాలి.
మానవునిబంధనాలు
-
ఈషణత్రయాలు
సర్వకర్మలు
నీవు
ఆచరించు.
ప్రాపంచిక
సంబంధమైన
సుఖములు
సర్వమూ
నీవు
అనుభవించు.
కానీ
సర్వకర్మల
ఫలితము
భగవంతుని
తత్త్వమే
అని
గుర్తించు.
ఏకర్మలు
చేసినప్పటికి
భగవత్ప్రీత్యర్థమని
భావించు.
ఈ
త్యాగం
వలన
మానవత్వము
కొంతవరకు
వికసిస్తుంది.
ఈనాటి
మానవునకు
మానవత్వము
బోధించటానికి
మనము
ప్రయత్నించాలిగాని,
కేవలం
వేదాంతముగాని
యింకే
విధమైన
శాస్త్రములుగాని
బోధించి
ప్రయోజనము
లేదు.
5వ
సంవత్సరము
పిల్లవానికి
మొదటి
తరగతి
పుస్తకముతో
బోధించినప్పుడే
వానికి
అర్థమవుతుందిగాని
10వ
తరగతి
పుస్తకంతో
బోధిస్తే
వానికి
ఏమి
అర్థమవుతుంది?
ఈనాటి
మానవుడు
1వ
తరగతి
విద్యార్థిగా
ఉంటున్నాడు.
ఇతనికి
కేవలము
ధనేషణ,
దారేషణ,
పుత్రేషణ
ఈ
ఈషణత్రయం
చేతనే
తాను
కట్టబడి
పోతున్నాడు.
ఈ
ఈషణత్రయములే
మానవుని
బంధనములుగా
నిలిచిపోతున్నాయి.
5
▾
Meaning
Keep
దీనికంటే
అధికమైనది,
ఉత్తమమైనది
వానికి
ఏమీ
కనిపించుట
లేదు.
కట్టకడపటికి
తాను
మానవుడా?
కాదా?
అనే
విషయంలో
కూడా
తాను
విశ్వసించటం
లేదు.
“నేను”
—
ఆత్మతత్త్వం
తనకంటే
దైవము
ప్రత్యేకముగా
లేడు.
మానవుడు
వృద్ధుడుగాని,
యువకుడుగాని
లేక
చిన్నపిల్లవాడుగాని,
స్త్రీగాని,
రాజుగాని,
రైతుగాని,
భిక్షకుడుగాని—
తనను
తాను
విచారించుకొని
చెప్పుకొను
సమయంలో
ప్రతిఒక్కరు
‘నేను-నేను’
అనే
పదమును
ఉచ్చరిస్తారు.
నేను
భిక్షకుడను,
నేను
రాజును,
నేను
స్త్రీని,
నేను
పురుషుడను,
నేను
వృద్ధుడను,
నేను
చిన్న
బాలుడను—
ఈ
అన్నింటియందును
‘నేను’
అనేటటువంటి
సమత్వమైన
తత్త్వం
ఉచ్చరించబడుతూ
ఉన్నది.
ఈ
“నేను”
అనే
తత్త్వమే
ఆత్మతత్త్వ…
ఆ
నేను’
అనే
తత్త్వమును
సరిగా
గుర్తించుకొనలేక—
తెల్లవారిలేచినది
మొదలు,
రాత్రి
పరుండునంత
వరకూ
ఈ
‘నేను’
అనే
పదమును
ఉపయోగ
పెడుతున్నాడు
మానవుడు.
ఆ
‘నేను’
అనే
పదమును
వ్యర్థంగా
ఉపయోగ
పెడుతున్నాడు.
కనుక
జీవితమే
వ్యర్థమైపోతున్నది.
ఇది
నా
దేహము
అంటున్నాడు.
నా
దేహమనుకొన్నప్పుడు,
దేహమునకు
తనకు
ఒక
ప్రత్యేకమైన
తేడా
ఉంటున్నది
కదా!
నీవు
దేహముకంటే
ప్రత్యేకముగా
ఉంటున్నావు
కదా!
నీవెవరు?
ఈ
విధమైన
సత్యమైన
విచారణలో
ఏమానవుడు
ప్రవేశించటము
లేదు.
మధురమైన
దైవత్వానికి
మధురత్వం
అందించు!
ప్రాచీన
కాలము
నుండి
భారతీయులు
పవిత్రమైన
పర్వదినముల
తత్త్వమును
కేవలం
పారమార్థికంగా
అనుభవిస్తూవచ్చారు.
ఒక
చిన్న
ఉదాహరణ:
ఈ
పర్వదినములయందు
భారతీయులు
భగవంతునకు
నైవేద్యములు
చేస్తూ
ఉంటారు.
కానీ
ఈ
నైవేద్యములు
తీపి
పదార్థములు
మాత్రమే
నైవేద్యం
పెడుతూ
ఉంటారు.
ఏమీలేకపోతే
చక్కెరో
పటికబెల్లమో,
ఒక
అరటిపండో-
భగవంతునికి
నైవేద్యముగా
పెడుతూ
ఉంటారు.
ఈ
మధురమైన
పదార్థములు
భగవంతునికి
అర్పితము
చేయుటలో
అంతరార్థము
ఏమిటి?
“భగవంతుడు
మధురహృదయుడేతప్ప,
మరొక
హృదయం
కలిగినటువంటివాడు
కాదు”
అని
అర్థం.
కనుక
భక్తిరసామృతముతో
కూడినదిగా
ఉంటుండాలి.
“వచనం
మధురం,
నయనం
మధురం,
హృదయం
మధురం,
మధురాధిపతే!
మధురం
మధురం!”
మధురత్వమనేది
దివ్యత్వమునకు
ఒక
చిహ్నము.
కానీ
ఈ
మధురమైన
దైవత్వానికి
మధురత్వాన్ని
అందించటానికి
మానవుడు
ఏమాత్రము
సంసిద్ధంగా
ఉండటం
లేదు.
పెట్టిన
పటికబెల్లం
తిరిగి
తానే
భుజించటానికి
ప్రయత్నిస్తాడు
మానవుడు.
ఇది
స్వార్థం.
స్వార్థమునందే
ఈ
పరార్థమును
కూడ
అనుభవిస్తూ
వస్తున్నాడు.
కనుక
మానవుడు
స్వార్థము
లేకుండా
పరార్థాన్ని
చేబట్టడం
లేదు.
6
▾
Meaning
Keep
కొబ్బరికాయ
కొట్టుటలో
భారతీయుల
పరమార్థం
భారతీయుల
ప్రధాన
చిహ్నం
కొబ్బరికాయ
కొట్టడం.
ఐతే,
ఈ
కొబ్బరికాయ
తత్త్వాన్ని
మనము
చక్కగా
విచారించాలి.
ఇది
మూడు
రకములైన
స్థాయిలలో
ఉంటున్నది.
పైన
కఠినమైన,
దట్టమైన
పీచు,
దానిలోపల
మరింత
కఠినమైన
చిప్ప,
దానిలోపలనే
తెల్లని
పరిశుద్ధమైన
కొబ్బరి.
ఈ
మూడు
ఒకదానినొకటి
ఆశ్రయించి
ఉంటున్నాయి.
పైన
పీచును
తీయాలనుకొంటే,
సామాన్యంగా
అది
తీయటానికి
వీలుకాదు.
సూటియైన
కత్తితో
పైపీచును
ప్రయత్నపూర్వకంగా
తీయాలి.
అది
తీసిన
తరువాత
ఒక
గట్టిచిప్ప
ఉంటుంది.
ఆ
చిప్పను
మనము
చేతులతో
పగులకొట్టటానికి
వీలుకాదు.
ఇందు
నిమిత్తమై
ఒక
కఠినమైన
రాయినిగాని,
ఖడ్గమునుగాని
ఉపయోగించాలి.
అది
కొట్టిన
తరువాతనే
పరిశుద్ధమైన
తెల్లని
కొబ్బరి
మనకు
కనిపిస్తుంది.
ఐతే
ఈ
కొబ్బరికాయ
మనము
దేనికోసం
కొంటున్నాం?
పై
పీచుకోసం
కొంటున్నామా?
లేక
లోపలి
చిప్పకోసం
కొంటున్నామా?
కాదు
-
కాదు.
అన్నింటి
కంటే
ఆధారమైన
కొబ్బరి
కోసం
కొంటున్నాం.
కనుక
ఈ
రెండింటి
యొక్క
ఆధారము
దీని
ఆధేయ
తత్త్వములో
ఇమిడి
ఉంటున్నది.
మన
శరీరం
ఒక
కొబ్బరికాయ
వంటిది.
త్రిగుణాత్మకమైన
ప్రకృతి
ఈ
పైదేహం.
అదే
స్థూలదేహం.
తదుపరి
అవిద్య
అజ్ఞానమనే
సూక్ష్మదేహము
మరొకటి
ఉంటున్నది.
దీనికి
దేహమనే
పీచు
తీయాలంటే-
దీనికి
వైరాగ్యం
అనేది
కావాలి.
దేహ
విషయములో
మనము
వైరాగ్యము
పూనాలి.
ఇంక
సూక్ష్మమైనది
మనస్తత్త్వం.
దీనికి
సత్కర్మలు
ఆచరించాలి.
సదభ్యాసములలో
మనము
ప్రవేశించాలి.
సచ్చింతన
మనం
చెయ్యాలి.
మొదటిది
అన్నమయ
ప్రాణము,
అదే
స్థూల
దేహము.
దీనిని
సూక్ష్మమైనదిగా
పోల్చుకోవాలంటే-
5కోశములు
ఉంటున్నాయి.
ఈ
పంచకోశములందు
మొట్టమొదటి
కోశమే
అన్నమయకోశం,
అది
స్థూలమైనది.
ప్రాణమయ,
మనోమయ,
విజ్ఞానమయములు.
ఈ
మూడింటి
చేరికయే
ఈ
విజ్ఞానమయము.
ఇంక,
కారణదేహము-
అదే
ఆనందమయకోశము.
స్థూలదేహము
పీచువంటిది.
సూక్ష్మదేహం
కేవలం
చిప్పవంటిది,
కారణదేహమే
కొబ్బరివంటిది.
ఆ
కొబ్బరియే
ఆత్మస్వరూపం.
అదే
నిర్మలం,
నిశ్చలం.
ఆత్మ
అనే
కొబ్బరి
నిమిత్తమై
ఈ
ప్రాణమయ,
మనోమయ,
విజ్ఞానమయములనే
చిప్పలను
మనము
కొంతవరకు
కాపాడుకోవలసి
వచ్చింది.
దీనిపైనున్న
స్థూలదేహమనే
పీచును
భద్రం
చేసుకోవలసి
వచ్చినది.
కానీ,
దురదృష్టవశాత్తు
చిప్పపైన,
పీచుపైన
మన
దృష్టిపోతున్నది
గాని,
లోపలి
కొబ్బరిపైన
మన
దృష్టిపోవటం
లేదు.
మన
ప్రాచీన
సాంప్రదాయంలో
కొబ్బరికాయ
కొట్టటమనగా
ఏమిటి?
దేహముపైన
వైరాగ్యము,
మనస్సుపైన
ఒక
విధమైన
సాత్విక
ప్రవర్తన
రెండింటి
ద్వారానే
ఆత్మ
అనే
పరిశుద్ధమును
మనము
పొందవచ్చును
అనే
గుర్తుచేతనే
కొబ్బరికాయను
మనము
కొడుతున్నాము.
ఆత్మస్థాయిని
మనం
చేరాలనుకొంటే,
మొట్టమొదట
మనము
విషయ
వాసనలనే
చిప్పను
దూరం
చెయ్యాలి.
7
▾
Meaning
Keep
ఆ
చిప్పను
మనం
వేరుచేయటానికి
పూర్వము
త్రిగుణాత్మకమైన
ప్రకృతి
భావాన్ని
మనము
వేరు
చెయ్యాలి.
వైరాగ్యమనే
దానికి
పూనుకోవాలి.
వైరాగ్యము
అనగా
అన్ని
వదలిపెట్టి
అరణ్యమునకు
పారిపోవటం
కాదు.
అన్నింటియందు
దైవభావాన్ని
భావించుకోవటమే
వైరాగ్యము.
మనము
-
వాడు
సమానమైపోతాము
మానవునికి
సద్భావములు
అత్యవసరం.
తనలో
ఉండిన
దోషములను
నిర్మూలన
గావించుకోవాలి.
దివ్యత్వమైన
ఆత్మభావాన్ని
మనం
అభివృద్ధిపరచుకోవాలి.
ఎవరిని
మనం
ద్వేషించకూడదు.
ద్వేషించిన
వానిని
కూడా
నీవు
ప్రేమించు.
వాడు
నన్ను
ద్వేషించాడు,
“వాడు
చెడ్డవాడు
-
వాడు
చెడ్డవాడు”
అనుకొని,
నీవు
కూడా
వానిని
ద్వేషిస్తే-
వానితోబాటు
నీవూ
చెడ్డవాడవు
అవుతావుగానీ,
నీవు
మంచివాడవు
ఎట్లా
అవుతావు?
ఏచెడ్డభావంతో
ఒక
వ్యక్తి
ప్రవర్తిస్తాడో,
మనంకూడా
ఆ
చెడ్డభావంతో
ప్రవర్తించినచో-
మనము,
వాడు
సమానమైపోతాము.
అటువంటివానితో
నీవు
దూరంగా
ఉండు.
నీవు
ద్వేషించనక్కరలేదు.
భారతీయ
సంస్కృతియందు
ప్రధానమైన
దివ్యతత్త్వం
ఏమంటే—
“అనేకత్వంలోని
ఏకత్వమును
గుర్తించటమే
ఆత్మతత్త్వమని”
అన్నారు.
ఇలాంటి
అనేకత్వములోని
ఏకత్వమును
మనము
మానవత్వముగా
భావించినప్పుడే,
అదే
దివ్యత్వముగా
మనకు
సాక్షాత్కరిస్తుంది.
భారతీయుల
పర్వదినములు
ప్రాచీన
కాలము
నుండి
మనము
అనేకవిధములుగా
అనుభవిస్తూ,
ఆచరిస్తూ
వస్తున్నప్పటికిని,
మనలోపలి
భావాలు
మాత్రం
ఎక్కడవి
అక్కడే
ఉంటున్నాయిగాని,
ఏమాత్రము
పరిశుద్ధము
కావటం
లేదు.
భగవద్భావం
చేత
సర్వం
సాధించవచ్చు
ఈ
సంవత్సరం
పేరు
ప్రజోత్పత్తి.
ప్రజోత్పత్తి
అనగా
ప్రజలను
ఉత్పత్తి
చేయటమే.
దానికి
ఏ
విధమైన
అడ్డులేదు.
వృద్ధి
అవుతూనే
వున్నది.
ప్రజోత్పత్తి
రానక్కర
లేదు.
దీనినే
ప్రజాపతి
అని
కూడా
అంటున్నారు.
ప్రజాపతి
అనగా
బ్రహ్మ
స్వరూపమని
అర్థము.
ప్రజాపతి
అనేది
ఈ
సంవత్సరము
యొక్క
పేరు.
బ్రహ్మ
స్వరూపమైనది.
పేరు
మంచిదేగాని,
ఆ
పేరునకు
తగిన
ఫలితములు
లేవు.
ఈ
సంవత్సరముయొక్క
పేరును
చూచి
ఆనందిస్తే
ఏమి
ప్రయోజనం?
ఒకని
పేరు
“ధర్మరాజు”
అంతా
అధర్మమే.
మరొకడు
“సౌందర్యరాజన్”
అని
పేరు
పెట్టుకొన్నాడు.
అతడు
మహావికార
స్వరూపుడు.
అదే
విధముగనే-
పేరులో,
రూపములో,
ప్రవర్తనలో
ఎంత
వ్యత్యాసము
కనబడుతోంది!
ప్రజాపతి
పేరు
చాలామంచిగా
ఉంటున్నది.
కానీ
ఈ
సంవత్సరము
లోపల
మహాఘోరమైన
విషయాలు
జరుగుతాయి.
చోరుల
బాధ
అధికమైపోతుంది.
ప్రాకృతమైన
వికృతులు
అనేకంగా
మారిపోతూ
వస్తాయి.
మంచి
చెడ్డగా
మారిపోతుంది.
రాజకీయ
కల్లోలములకు
హద్దు
అనేదే
ఉండదు.
విపరీతమైన
మార్పులు
చెందుతాయి.
అగ్నిప్రమాదములు,
భూకంపములు—
ఈ
సంవత్సరములో
చాలా
అధికముగా
ఉంటాయి.
కానీ
ఈ
మార్పుల
కోసమై
మనం
ఏ
మాత్రము
భయపడనక్కర
లేదు.
ఇవి
ప్రాకృతమైన
ధర్మములే.
విరుద్ధమైనది
ఏమీకాదు.
8
▾
Meaning
Keep
దానిని
ఉపయోగించుకునే
విధానములో
మనము
సరిగ్గా
ఉపయోగించుకోవాలి.
ఈ
లోకం
ద్వంద్వ
వికారములతో
కూడినది.
శీతోష్ణములు
రెండూ
ఉంటున్నవి.
ఏ
ఏ
సమయములో
ఏ
ఏ
గుణములు
రావాలో
అది
విజృంభిస్తుంది.
అంతమాత్రంచేత
మనం
విరుద్ధమని
భావించ
రాదు.
మన
రాయలసీమలో
మార్చి
నెలలో
చాలా
వేడిగా
ఉంటుంది.
ఊటీ,
కొడైకెనాల్లో
చాలా
చల్లగా
ఉంటుంది.
ఈ
శీతోష్ణములు
రెండూ
సమానములే.
కానీ
ప్రదేశములు
వేరువేరు.
అదే
రీతిగనే
మన
భావాలు
మంచి,
చెడ్డలుగా
మారటానికి
అవకాశమున్నది.
ఒక
మనిషి
ఉలెన్షర్టు
కుట్టించుకొన్నాడు.
అదే
మనిషి
Thin
Cotton
Shirt
కుట్టించుకున్నాడు.
రెండూ
నా
షర్టులే
అని
చెప్పి
ఈ
ఎండలోపల
ఉలెన్
కోటు
వేసుకుంటాడా?
అది
తెలివితక్కువ
కదా!
తన
డ్రస్సే
అయినప్పటికి
చలికాలంలో
ఈ
ఉలెన్
కోటు
వేసుకోవాలి.
కొంచెము
వేడిలోపల
Thin
Cotton
Shirt
వేసుకోవాలి.
ఈ
వినియోగించుకొనే
విధానంలో
మార్పులు
వస్తున్నాయి.
ఈ
ప్రజాపతి
అనే
సంవత్సరములో
మన
భావాలు
సద్వినియోగం
చేసుకోవాలి.
ఎట్టి
బాధలైనా,
ఎట్టి
కష్టములైనా,
ఎట్టి
దుఃఖములైనా
“భగవద్భావము”
చేత
సర్వమును
సాధించవచ్చు.
చాలా
మంది
ఈ
విషయాన్ని
నమ్మలేరుగాని,
ఇది
నమ్మి
జీవిస్తే
ఇంతకంటే
సుఖము
లేదు.
కానీ
అందరూ
ఈ
సత్యాన్ని
గుర్తించుకోలేరు.
పోనీ
అంతో
ఇంతో
గుర్తించుకుంటే,
అంతే
చాలు.
ఒక్క
దినంలో
నాల్గు
యుగాల
మార్పులు
ఉగాది
అంటే
కృతయుగ,
త్రేతాయుగ,
ద్వాపరయుగములకు
సంబంధించినది,
ఏదో
కొన్నివేల
సంవత్సరముల
క్రిందట
కృతయుగము
పోయింది,
అటుతరువాత
కొన్ని
వేల
సంవత్సరాల
క్రిందట
త్రేతాయుగం
పోయింది
అని
అనుకొంటూ-
యుగాల
క్రింద,
కాలము
క్రింద
మనము
గడుపుతున్నాము.
ప్రేమస్వరూపులారా!
ఏదో
కొన్ని
వేల
సంవత్సరాల
క్రిందట
కృత,
త్రేతా,
ద్వాపర,
కలియుగములు
వచ్చినవి
కాదు.
ఇవన్నీ
కేవలం
“కేలండరులో”
వారాలు
వస్తూన్నట్లుగా
ఈ
యుగములు
కదలుతూనే
ఉంటాయి.
ఇప్పుడు
ఈ
కలియుగం
పోతూనే
తిరిగి
కృతయుగము
వస్తుంది.
ఇది
వేల
సంవత్సరములకు
సంబంధించినది
కాదు.
జీవితములోపల
చక్కగా
విచారిస్తే,
నిత్యము
ఒక్క
దినంలో
24
గంటలలోపల
నాలుగు
యుగాలు
మారిపోతున్నాయి.
(1)
తెల్లవారుఝామున
నాలుగు
గంటల
నుండి
మధ్యాహ్నం
పన్నెండు
గంటల
వరకు
కృతయుగము.
మానవుడు
ధర్మమును
నాలుగు
పాదములలోపల
నడచటానికి
తగిన
శక్తిసామర్థ్యం
కలిగి
ఉంటుంది
ఆ
కాలం,
(2)
మధ్యాహ్నము
పన్నెండు
గంటల
నుండి
సాయంత్రం
ఆరు
గంటల
వరకు
ఇది
త్రేతాయుగము.
ఇక్కడ
ధర్మము
ఒక
పాదము
క్షీణించిపోతుంది.
అనగా
మానవ
దేహములో
ఉండిన
శక్తులు
కొంత
నశించి
పోతాయి.
అక్కడ
3
పాదములు
మాత్రమే
సంచరిస్తూ
ఉంటాయి,
(3)
సాయంకాలము
ఆరు
గంటల
నుండి
రాత్రి
పన్నెండు
గంటల
వరకు
అది
ద్వాపరయుగము.
9
▾
Meaning
Keep
అప్పుడు
రెండు
పాదములతోనే
ఉంటుంది
ధర్మం.
అనగా
శారీరక,
మానసిక
సంబంధములైనదంతా
చల్లబడి
ప్రాణమయ,
విజ్ఞానమయ
మనేటటువంటివి
రెండుమాత్రమే
అక్కడ
సంచరిస్తూవుంటాయి.
(4)
ఆతరువాత
రాత్రి
పన్నెండు
గంటల
నుండి
తెల్లవారి
నాలుగు
గంటల
వరకు
కలియుగం.
ఈ
కలియుగములో-
ఒక్క
పాదము
మాత్రమే
వుంటుంది.
ఏమిటి
ఆ
ఒక్క
పాదము
యొక్క
ధర్మం?
మైమరచి
గురకలు
కొట్టుకుంటూ
నిద్రపోవటమే
దాని
ధర్మం.
బ్రహ్మ
అనాది
కృతయుగము
యొక్క
కాలం
18,32,000.
త్రేతాయుగము
యొక్క
కాలం
14,68,000.
ద్వాపరయుగము
యొక్క
కాలం
8,32,000.
కలియుగము
యొక్క
కాలం
4,63,000.
ఇవన్నీ
కూడితే
ఎంత
అవుతుందో,
అది
బ్రహ్మకు
ఒక్క
పగలు
అని,
ఈలాంటివి
అన్నీ
చేరినప్పుడు-
బ్రహ్మకు
నూరు
సంవత్సరములు
అన్నారు.
కనుక
ఈ
విధముగా
చూచుకొంటే,
మానవత్వము
అర్థము
చేసుకోవటానికి
ఏమాత్రం
వీలు
కాదు.
ఎవరు
బ్రహ్మ?
సోహమే
బ్రహ్మ.
ఈ
బ్రహ్మ
యొక్క
వయస్సు
అనాది.
అనగా
బ్రహ్మకు
అనేక
కోట్ల
సంవత్సరములు
ఒక
పగలు.
ఈ
విధంగా
మనము
ఆలోచిస్తే,
బ్రహ్మ
అనాదికాక
మరియేమిటి?
కనుకనే
“బ్రహ్మ
అనాది”
అని
పేరు
పెట్టారు,
ఈనాటి
సైంటిస్టులంతా
ఏదో
పెద్ద
విజ్ఞానమును
బోధించినవారమని,
విజ్ఞానమును
గుర్తించుకొన్నవారమని,
ఈ
అనాదికి
ఒక
కాలమును
నిర్ణయిస్తూ
వస్తున్నారు.
ఇప్పుడు
అన్ని
కోట్లు
అంటుంటే
ఎవరు
ఎంచుకొన్నవారమవుతాము?
దీనికంటే
‘అనాది’
అని
చెబితే,
ఎంత
సులభముగా
ఉంటుంది?
అనాది
అని
చెప్పినవాడు
“మొరటువాడు”,
ఇన్ని
కోట్ల
సంవత్సరములంటే
“సైంటిస్టు”.
ఇది
ఈనాటి
ప్రచారప్రబోధలు.
భగవంతుడు
కాలస్వరూపుడు
కృతయుగ,
త్రేతాయుగ,
ద్వాపరయుగ,
కలియుగములంతా—
ఒక్క
దినంలోపల
మార్పు
చెందినటువంటివే.
కనుకనే
కాలమునకు—
“భగవత్స్వరూపుడు”
అని
పేరు.
యుగములకు
‘ఆదివాడు’
కనుకనే—
“ఉగాది”
అని
పేరు
వచ్చింది.
“యుగాదైనమః”
అని
భగవంతునికి
పేరు.
కాలముతో
కూడినవాడు
భగవంతుడు.
కాలమునే
ఆత్మగా
విశ్వసించినవాడు
భగవంతుడు.
కనుకనే
అతనిని—
“కాలాత్మకాయనమః”
అన్నారు.
ఆ
కాలమునే
తన
గర్భమునందు
ధరించినవాడు
కనుకనే—
“కాలగర్భుడు”
అని
భగవంతునికి
పేరు.
కనుకనే—
“కాలకాల
ప్రపన్నాయనమః”
అన్నారు.
కాలమనే
తత్త్వము
కాయమును
మ్రింగివేస్తుంది.
కానీ,
కాలమునే
మ్రింగేటటువంటివాడు
భగవంతుడు
అని—
“కాయమును
మ్రింగేది
కాలము-
కాలమును
మ్రింగేవాడు
భగవంతుడు”.
శిక్షలు
-
రక్షలు
ప్రేమస్వరూపులారా!
సంవత్సరాది
పండుగ
అంటే
ఏమిటి?
భగవంతుని
పేరుతో
వచ్చేదే
సంవత్సరాది
పండుగ.
కనుకనే
కాలమంతా
భగవంతుని
స్వరూపమే.
10
▾
Meaning
Keep
భగవంతుని
యొక్క
సహస్రనామములలో
కూడను
‘సంవత్సరాయనమః’
అని
ఒక
పేరుంది.
సహస్రనామముల
లోపల
కాలకాలాయనమః,
కాలదర్పదమనాయనమః
కాలాతీతాయనమః,
కాలస్వరూపాయనమః-
ఇవన్నియూ
భగవంతుని
యొక్క
పేర్లే.
కనుక
సంవత్సరాది
పండుగ
అనగా
పరమాత్ముని
పేరుతో
వచ్చిన
పండుగ.
సంవత్సరములో
ఈ
నష్టములు,
ఈ
కష్టములు,
ఈ
సుఖములు
జరుగుతాయని
ఏమాత్రము
భయపడనక్కర
లేదు.
భగవంతుడే
సంవత్సర
రూపములో
దిగి
వస్తున్నాడు.
అందులో
చెడ్డ
జరిగేటటువంటిది
చెడ్డ
జరుగవచ్చు,
మంచి
జరిగేటటువంటిది
మంచి
జరుగవచ్చును.
శ్రీ
మహావిష్ణువు
ప్రత్యక్షమై
ధృవునికి,
ప్రహ్లాదునికి
ఆనందాన్ని
అందిస్తాడు.
కానీ,
హిరణ్యకశిపుని,
భస్మాసురుని
భస్మం
చేస్తాడు.
అక్కడ
ఆనందమును
అందించినది
ఆ
విష్ణువే,
ఇక్కడ
భస్మం
చేసినది
ఆ
విష్ణువే.
కాని,
వారి
వారి
గుణములను
పురస్కరించుకొని,
శిక్షలు-
రక్షలు
జరుగుతూ
ఉంటాయి.
ఎక్కడ
భగవంతుడో
అక్కడ
ఆనందం
హృదయమును
ఆనందమయముగా
మనం
మార్చుకోవాలి.
అదే
స్వర్గము.
“తన
సంతోషమే
స్వర్గం,
తన
దుఃఖమే
నరకము”.
స్వర్గ,
నరకములు
రెండూ
ప్రత్యేకంగా
లేవు.
మన
ఆనందమే
స్వర్గము.
కనుకనే
మనము
ఎప్పుడూ
ఆనందముగానే
ఉండాలి.
ఈ
ఆనందము
మనకు
లభించాలంటే,
నిరంతరం
భగవచ్చింతన
ఉండాలి.
ఎక్కడ
భగవంతుడో
అక్కడ
ఆనందం.
ఈనాడు
మనము
సంవత్సరాదిపండుగ
చేసుకొంటున్నామంటే
మధురమైన
భావాలచేత,
దివ్యమైన
చింతనలచేత
దైవత్వమును
మన
హృదయంలో
ప్రతిష్ఠగావించుకోవాలి.
దైవాజ్ఞను
శిరసావహించి
ఆచరిస్తే,
ఇంతకంటే
సాధన
మరొకటి
లేదు.
‘ఇది
చేయమని
చెప్పితే,
అది
చేస్తే
అక్కడ
విరుద్ధం
వచ్చేస్తుంది’.
విపరీతమైన
ఫలితంలోపల
విపరీతము
ప్రారంభిస్తుంది.
ఈ
విపరీతంలో
వికారం
పుడుతుంది.
వికారంలో
ఆకారం
మరచిపోతాము.
ఆకారం
మరచిపోయినప్పుడు
అన్నీ
పాపాలే
చేస్తాము.
కనుక
ఆజ్ఞను
శిరసావహించి
ఆచరిస్తే,
ఇంతకంటే
మించిన
ఆనందం
లోకంలో
మరొకటి
లేదు.
Previous
←
Proceed With Courage
Next
The Ideal Figures of the Rāmāyaṇa
→