Contents
Devotion & Sacred Story
Home
Library
Find
Shelf
Settings
←
Leave
Sathya Sai Speaks 1992 · Strive to cultivate equal-mindedness!
Tap a verse for its meaning
IAST
Telugu
Meaning
Continuous
Strive to cultivate equal-mindedness!
15 June 1992
1
▾
Meaning
Keep
His poems 312
Also in his talks
(4)
8 March 1987
Learning without Viveka, knowledge without discernment, does not shine
27 March 1990
More potent than portents
25 December 1990
Love: Sacrifice: Unity
21 August 1996
The Five Elements Are the Very Forms of the Paramātma
పొగకు
మూలము
నిప్పుల
పుంజముండ
రైలుబండిని
నడిపించు
డ్రైవరుండ
ఆటొమేటికు
లైటుకు
అధిపుడుండ
ఒకడు
జగతిని
సృష్టింప
నుండవలదె?
దివ్యాత్మస్వరూపులారా!
గొప్ప
విజ్ఞానవేత్త,
ఆధ్యాత్మిక
పరిధియందుకూడా
అత్యంత
ఉన్నతస్థాయి
అందుకొన్నవాడు,
సోక్రటీస్.
ఇతనికి
ప్రథమ
శిష్యుడు
ప్లేటో.
అతని
శిష్యుడు
అలెగ్జాండరు.
ఒకరి
తరువాత
ఒకరు
చక్కని
ఆదర్శమును
ఒక్కొక్క
మార్గములో
అందిస్తూ
వచ్చారు.
ప్లేటో
ఒకనాడు
ధ్యానములో
కూర్చున్నాడు.
అతనికి
ఒక
పవిత్రమైన
5'3"
పొడుగు
ఉన్న
వ్యక్తి
కనిపించాడు.
ఎవరో
తాను
గుర్తించుకోలేక
పోయాడు.
మూడు
పేర్లు
చెప్పాడు.
మీ
శిష్యులందరికి
యీ
మూడు
తప్పని
సరిగా
బోధించాలి
అన్నాడు.
ఆ
మూడు
ఏమిటి
Truth,
Goodness,
Beauty.
ఇవే
సత్యం
శివం
సుందరం.
ఆనాటినుండి
అందరికి
యీ
మూడింటిగురించి
చెప్పుతున్నాడు.
దీనినే
అలెగ్జాండరు
అనుసరిస్తూ
వచ్చాడు.
అరిస్టాటిల్
గొప్ప
ఆధ్యాత్మిక
చిత్తము
గలవాడు.
అతని
శిష్యుడైన
అలెగ్జాండరు
భారతదేశముపై
దండెత్తి
రావటానికి
ప్రయత్నించాడు.
అప్పుడు
అరిస్టాటిల్
‘అలెగ్జాండర్!
భారతదేశము
చాలా
పవిత్రమైనది.
చాలా
పుణ్యభూమి,
త్యాగభూమి.
దీనిపై
దుర్భావములచేత
దండెత్తడానికి
ప్రయత్నించవద్దు.
కాని,
నీవు
సందర్శించాలనుకుంటే
ఒక్కతూరి
వెళ్లిరా!
అంతేగాని
భారతదేశములో
అధికారముగా
ప్రవేశించి
జనులకు
ఏమాత్రము
శ్రమ
యివ్వకూడద’న్నాడు.
2
▾
Meaning
Keep
శిష్యుని
కోరాడు,
‘భారతదేశమునకు
వెడుతున్నావు.
భారతదేశమునుండి
కొన్ని
బహుమతిగా
తీసుకురావాలి.’
‘తప్పక
తీసుకొని
రాగలను’
అన్నాడు
అలెగ్జాండరు.
‘ఒకటి
భగవద్గీత,
రెండవది
మహాభారతము,
మూడవది
భక్తుల
పాదధూళి,
నాల్గవది
గంగా
జలము,
అరిస్టాటిల్‌కు
భారతీయ
సంస్కృతిపట్ల
విశేషమైన
గౌరవ,
విశ్వాసములు
ఉండేవి.
చాలామంది
షిరిడీ
సాయిబాబా
ఆజానుబాహుడని
వర్ణిస్తూ
వచ్చారు.
ఆయన
షిరిడీలో
1854లో
ప్రవేశించాడు.
అప్పటికి
బాబాకు
16
సం॥లు.
కానీ
ఎవరూ
ఆయనను
గుర్తించలేదు.
షిరిడీలో
ఉండి
భిక్షమెత్తి
తినటము,
వచ్చిన
వారికి
ఆకులు
అలములు
ఔషధముగా
యివ్వటం,
ఈ
విధముగా
కాలము
గడుపుతూ
వచ్చాడు.
బాబాను
గుర్తించినవారు
లేరు.
బిక్షానికి
వస్తున్నాడు,
పోతున్నాడని
అనుకున్నారు.
రోగము
నివారణ
గావించుకున్నవారు
వైద్యుడని
అనుకున్నారు.
తిరిగి
1855లో
షిరిడీ
వదిలాడు.
ఎక్కడికి
పోయాడో
ఎవరూ
విచారించలేదు.
అతనిపై
ధ్యాస
ఎవరికి
లేదు.
సరే
అయిపోయింది.
ఔరంగబాద్
జిల్లాలో
‘ధూప్’
అనే
గ్రామములో
ఒక
శ్రీమంతుడు
ఉండేవాడు.
ఆ
శ్రీమంతుడు
ఎక్కడకు
వెళ్లినా
గుఱ్ఱమునెక్కి
వెళ్ళేవాడు.
అతని
పేరే
చాంద్భాయి
పటేల్.
ఇతను
పనిపైన
ఔరంగబాద్
వెళ్లాడు.
అతను
ప్రభుత్వము
పనిమీద
వెళ్లి
ఒకచోట
గుఱ్ఱమును
చెట్టుకు
కట్టి
తన
పని
తాను
చేసుకోవడం
మొదలుపెట్టాడు
ఐదారు
దినములు
దానిని
గమనించలేదు.
ఈలోపుగా
గుఱ్ఱము
తప్పించుకుని
ఎక్కడికో
వెళ్లిపోయింది.
ఎక్కడికి
పోయింది
తెలియలేదు.
అంతా
వెతికించాడు.
తానే
స్వయంగా
వెతికాడు.
గుఱ్ఱమంటే
చాలా
యిష్టము,
చాంద్భాయిపటేల్కు.
గుఱ్ఱము
పోయేటప్పటికి
ఆహారముకూడా
తీసుకోలేదు.
దేనిపైనైనా
అభిమానం
వస్తే
యీ
విధంగా
బాధలుకూడా
వెంటాడుతుంటాయి.
అభిమాన
మమకారములతో
వచ్చే
బాధలు
ఈ
రకంగా
వుంటాయి.
అయితే
గుఱ్ఱముయొక్క
జీను
చిక్కింది.
జ్ఞాపకార్థముగా
దాన్ని
మోసుకొని
తిరిగి
వస్తున్నాడు
ధూప్
గ్రామానికి.
దట్టమైన
అడవిలో
తాను
ప్రవేశించాడు.
ఒక
పెద్ద
మామిడి
వృక్షము
ఉంటున్నది.
దట్టముగా
ఉంటున్నాది.
దానిక్రింద
ఒక
ఫకీరు
కూర్చున్నాడు.
ఇతను
పోతుంటే
‘ఏమి
భాయ్
యిటురా!’
అన్నాడు.
కొంచెము
సేపు
కూర్చొని
సేద
తీర్చుకోమన్నాడు.
3
▾
Meaning
Keep
చాంద్భాయిపటేల్కూడా
అలసిపోయాడు.
వృక్షము
క్రింద
ఫకీరు
ప్రక్కన
కూర్చున్నాడు.
బాబా
దగ్గర
చిలుము
ఉంటున్నది.
అగ్ని
కావలసి
వచ్చింది.
చేతికఱ్ఱతో
నేలపై
కొట్టాడు.
అగ్ని
వచ్చింది.
చిలుముకు
నీరు
కావాలి.
తిరిగి
కఱ్ఱతో
కొట్టాడు.
నీరు
వచ్చింది.
నీరు,
నిప్పు
ఉపయోగించి
చిలుము
తయారుచేశాడు.
చాంద్భాయిపటేల్కుకూడా
యిచ్చాడు.
‘ఎక్కడకు
వచ్చావు,
ఎందుకు
పోతున్నావు’
అని
అడిగాడు.
‘జీను
మాత్రము
వేసుకున్నావు,
గుఱ్ఱము
ఏమైంది,
నీవే
గుఱ్ఱమా?’
అన్నాడు.
అతను
చాలా
విచారించాడు.
ఇతను
మహనీయుడుగా
ఉంటున్నాడని
గుర్తించి
‘ఈ
జీను
జ్ఞాపకార్థంగా
తీసుకుపోతున్నాను,’
అన్నాడు.
‘ఛీ!
చూడు,
పో!
నీ
గుఱ్ఱము
ప్రక్కన
చెట్టుక్రిందే
ఉంటున్నది’
అన్నాడు.
అక్కడకు
పోయి
చూస్తే
యితన్ని
చూస్తూ
అరుచుకుంటూ
వస్తున్నది
గుఱ్ఱము.
ఆ
గుఱ్ఱమును
తీసుకొని
దానిపై
జీను
వేసుకున్నాడు.
‘స్వామీ!
మీ
ఉపకారమునకు
బదులుగా
నా
ఆతిథ్యం
తీసుకోవాలి.
మీరు
మా
గ్రామానికి
రావాలి’
అన్నాడు.
అతనిని
వెనుక
కూర్చో
పెట్టుకొని
ధూప్
గ్రామము
చేరాడు.
ఆ
ధూప్
గ్రామములోనే
బాబా
3
సం॥లు
ఉన్నాడు.
ఎవరికి
తెలియదు.
అప్పుడు
చాంద్భాయిపటేల్
మేనల్లుడికి
వివాహము
కుదిరింది.
పెండ్లికుమార్తె
గ్రామము
షిరిడీ.
అక్కడ
పెండ్లి
జరుగుతుంది.
అందరు
బండ్లు
కట్టుకొని
షిరిడీ
వెళ్లారు.
1858లో
బాబా
మరల
షిరిడీలో
అడుగుపెట్టాడు.
అందరూ
బండ్లు
దిగుతున్నారు.
బాబాకూడా
దిగాడు.
అతని
పేరు
ఎవరికి
తెలియదు.
మహల్సాపతి
చూచాడు,
‘ఆయియే
సాయి’
అన్నాడు.
‘సాయి’
ఆయన
పెట్టిన
పేరు.
అప్పటినుండి
బాబా
1918
వరకు
షిరిడీ
వదలలేదు.
బాబా
షిరిడీలో
ఉన్నప్పుడు,
దాస్‌గణు
అనే
పోలీస్
ఆఫీసర్
షిరిడీకి
వస్తూ
పోతూ
ఉండేవాడు.
కోపర్గాంలో
పనిచేసుకుంటూ
వుండేవాడు.
మంచివాడేగానీ
షిరిడీకి
వచ్చి,
పోయే
వాళ్ళను
దూషించేవాడు.
ఒక
ఫకీరు
దగ్గరకు
యింతమంది
వస్తున్నారని
హాస్యము
చేస్తూ
వచ్చాడు.
ఆయన
మంచి
పాటలు
పాడుతుండేవాడు.
స్టేషనులో
ఉన్నా
ఏదో
ఒకటి
పాడుతుండేవాడు.
మధ్యమధ్య
హరికథలుకూడా
చెప్పేవాడు.
మంచి
కంఠం.
ఆయన
పాటలు
వినడానికి
జనం
ఎక్కువగా
వచ్చేవారు.
మధ్యమధ్య
భగవంతుని
నమ్ముకోండి
అని
చెప్పేవాడేగానీ,
ఈ
ఫకీరు
దగ్గరకు
పోకూడదని
చెప్పాడు.
ఈ
వార్త
బాబాకు
తెలిసిపోయింది.
4
▾
Meaning
Keep
‘స్వామీ!
దాసుగణు
యీ
విధంగా
ఉన్నాడు,
చాలా
కష్టంగా
ఉంది
మాకు
వినేటందుకు,’
అని
భక్తులు
బాబాకు
చెప్పేవారు.
ఆ
రోజుల్లో
భక్తులు
ప్రతి
ఒక్కరు
స్టేషనునుండే
రావాలి.
కోపర్గాం
స్టేషను,
మన్మాడ్
స్టేషను
అని
రెండు
ఉంటున్నాయి.
ఏ
రైలు
స్టేషనులో
దిగినా
ఒకటి
9
మైళ్లు,
రెండవది
పది
మైళ్లు.
బస్సులు
లేవు.
టాంగాలోనైనా
పోవాలి
లేక
నడచి
రావాలి.
యిలా
వచ్చే
వాళ్ళ
మనస్సుకు
కష్టమవుతూ
వచ్చింది,
దాసగణు
యిలా
చెబుతుంటే.
ఒకనాడు
షిరిడీలో
శ్రీరామనవమి,
ముస్లింల
బక్రీద్
పండుగ
రెండూ
జరిగాయి.
రెండూ
ఒకే
రోజు
జరిపారు.
బాబా
ఉండేది
మసీదు.
మసీదులోకి
హిందువులు
రాకూడదని
మహమ్మదీయులు
అడ్డు
చెప్పేవారు.
బాబా
మహమ్మదీయుడని
వారి
ఉద్దేశ్యము.
ఎందుకంటే
ఆయన
ఎప్పుడూ
‘అల్లా
మాలిక్’
అనేవాడు.
కనుక,
మహమ్మదీయుడనుకున్నారు.
అయితే
మరికొంత
సేపటికి
‘బ్రహ్మవిత్’
అనేవాడు.
అది
చూచి
హిందువులు
అతన్ని
హిందువు
అనుకునేవారు.
ఈ
పండుగలకు
దాస్గణును
కోపర్గాంనుండి
షిరిడీలో
డ్యూటీ
వేశారు.
వచ్చాడు,
దాస్‌గణు.
దూరంగా
నిల్చున్నాడు.
అప్పుడు
బాబాకు
పల్లకీ
ఊరేగింపు
వుండేది.
పల్లకీపైన
కూర్చోబెట్టి
తీసుకొనిపోయేవారు
భక్తులు.
చూచాడు,
దాస్‌గణు.
బాబా
‘ఆవో,
ఆవో’
అని
పిల్చేటప్పటికి
అతనికి
కొంచెం
యిదై
పోయింది.
ఎందుకంటే
guilty
conscience.
అతడు
బాబాను
తిడుతూ
ఉండేవాడు.
అప్పుడు
బాబా
‘భయపడవద్దు,
నేను
ఫకీరును.
నా
దగ్గరకు
యింతమంది
పిచ్చిపట్టి
వస్తున్నారు.
నీకూ
పిచ్చిపట్టి
వచ్చినావా?’
అన్నాడు.
పల్లకీ
పైనుండే
కఱ్ఱ
విసిరాడు.
‘సైతాన్!
నాలుక
ఉందని
యిష్టము
వచ్చినట్లు
మాట్లాడటమా!
నాలుక
మంచి
మాటలు
ఉచ్చరించేటందుకు!
నాలుకను
అపవిత్రమైన
వాటిలో
ఉపయోగపెడుతున్నావా?
పోలీస్
డ్యూటీ
కాదు,
విరుద్ధంగా
ప్రవర్తిస్తున్నావు’
అని
గట్టిగా
తిట్టాడు.
అందరికి
తెలిసిపోయింది
దాస్గణును
తిడుతున్నాడని.
దాస్గణుకుకూడా
కోపం
వస్తున్నాది.
‘ఇంతమందిలో
నన్ను
తిడుతున్నాడే,
దోషముంటే
వంటరిగా
పిల్చి
చెప్పవచ్చు
కదా!’
అని
అతనికి
బాధ
కల్గింది.
బాబా
మళ్లీ
‘వంటరిగా
పిలవాలా
నిన్ను?
పల్లకి
ఊరేగింపు
అయిన
తరువాత
పిలుస్తాను’
అన్నాడు
బాబా.
అప్పుడు
దాస్‌గణు
‘నేను
అనుకున్నాను.
అనుకున్నది
వెంటనే
చెప్పాడు
బాబా.
ఇతను
బికారి
కాదు’
అని
అనుకున్నాడు.
పల్లకీ
దిగుతూనే
నానాకు
చెప్పాడు
దాస్గణును
పిలవమని,
బాబా.
5
▾
Meaning
Keep
దాస్‌గణు
బూట్లు
విప్పి
వచ్చాడు.
‘నీకు
ఏమి
పని
ఉంది
ప్రపంచంలో?
ఈనాటినుండి
ఇక్కడే
నిల్చిపో,’
అన్నాడు.
‘స్వామీ!
నాకు
డ్యూటీ
వుంటున్నాది.
నాకు
ప్రమోషను
వస్తున్నాది,’
అన్నాడు.
‘ప్రమోషను
కావాలా
నీకు’
అన్నాడు.
దాస్‌గణు
‘చాలాకాలం
పని
చేశాను.
ప్రమోషనుకు
అవకాశం
ఉంది,’
అన్నాడు.
‘అయితే,
అది
వచ్చిన
తరువాత
వస్తావా?’
అన్నాడు
బాబా.
‘తప్పక
వస్తాను.’
అన్నాడు,
దాస్‌గణు.
‘ప్రమాణం
చెయ్యి,
ఒకే
మాట-సరే
పో!
నేను
పంపిస్తాను
ఆర్డర్’
అన్నాడు,
బాబా.
దాస్‌గణు
షిరిడీలో
డ్యూటీ
అయిపోగానే
కోపర్గాం
వెళ్లాడు.
ఒక
వారంలోనే
ప్రమోషన్
వచ్చింది.
ఔరంగాబాద్
వెళ్లాడు.
ప్రమోషన్
వచ్చింది,
ప్రమాణం
మరచిపోయాడు.
తన
పనులు
చేసుకోటం,
పార్టీలు
చేసుకోటం.
బాబా
కులకర్ణిని
పంపించాడు,
దాస్‌గణు
దగ్గరకు.
ఈ
కులకర్ణి
రాయబారము
జరిపేవాడు.
పూర్వము
నానాను
పిల్చుకు
రావటానికికూడా
కులకర్ణీయే
వెళ్లాడు.
ఇతను
పోయి
‘దాస్‌గణు!
స్వామి
పిలుస్తున్నారు,’
అన్నాడు.
‘నేను
మరచిపోయినా
బాబా
మరచిపోలేదే’
అని
బాధ
పడ్డాడు,
దాస్‌గణు.
‘డ్యూటీలో
ఉంటున్నాను.
లీవు
తీసుకొని
వస్తాను.
నేను
పనిలో
వుండినంతవరకు
నా
డ్యూటీ
నేను
చక్కగా
చేయాలి
కదా!’
అన్నాడు.
‘ఏమి
చెప్పావు,
దాస్‌గణు!
ప్రమోషన్
వచ్చిన
తరువాత
వస్తానన్నావు.
6
నెలలు
అయింది.
యిక్కడికి
రావడానికి
ప్రయత్నం
చేయలేదు!’
అని
బాబా
ప్రశ్నించాడు.
‘స్వామీ!
అధికారం
కదా!
ఒక్కసారి
దీన్ని
అనుభవించాలని
ఉంది.
కొంతకాలం
పోయిన
తరువాత
తిరిగి
వస్తాను,’
అన్నాడు.
సరే
వెళ్లు
అన్నాడు,
బాబా.
వెళ్లాడు.
అక్కడికి
వెళ్లేటప్పటికి
ఒక
పెద్ద
ఎంక్వైరీ
వచ్చింది.
ఏమిటి?
దొంగలు
తీసుకుపోయిన
సొత్తు
చిక్కింది.
పోలీసుస్టేషనులో
పెట్టారు,
ఆ
సొత్తు.
రెండవదినము
ఆ
వస్తువులు
లేవు.
స్టేషనుకు
దాస్‌గణు
ఇన్చార్జ్!
ఎక్కడికి
పోయినాయి?
దాస్‌గణు
పాపం
నిరపరాధి.
అయినప్పటికి
యితనిదే
బాధ్యత
అని
అతనిపై
వారెంటు.
‘ఇంతకాలం
బ్రతికి,
పేరుప్రతిష్టలు
తెచ్చుకోవాలని
అనుకుంటే
నాకు
అపకీర్తి
వచ్చిందా’
అని
బాధపడ్డాడు.
నిద్రకాదు,
మెలకువకాదు.
ఆ
స్థితిలో
బాబా
మాటలు
వింటున్నాడు.
‘సైతాన్!
యోచన
చేస్తున్నావా
యిప్పుడైనా,’
అని
ప్రశ్నించాడు
బాబా.
ప్రతి
దానికి
‘సైతాన్,
సైతాన్’
అనేవాడు,
ఆయన.
ఇప్పుడు
నేను
‘దున్నపోతు,
దున్నపోతు’
అంటుంటాను.
‘సైతాన్’
మాత్రమే
కాదు
‘బేటా’
అనే
పదంకూడా
ఉపయోగించేవాడు,
బాబా.
6
▾
Meaning
Keep
ఆ
బేటాకు
బదులు
ఇప్పుడు
నేను
‘బంగారు,
బంగారు’
అంటున్నాను.
అప్పుడు
బాబా
‘ఇది
నేను
చేసిన
పనే!
నీ
గౌరవాన్ని
నీవు
నిలుపుకొని,
మర్యాదగా,
చెడ్డరిమార్కు
రాకుండా
చూడాలంటే
తెల్లవారి
బయలు
దేరు
షిరిడీకి’
అని
బోధించాడు.
ఇతను
బయలుదేరి
షిరిడీ
చేరాడు.
పోయిన
వస్తువులు
అక్కడే
వున్నాయి.
అప్పుడు
పోలీసులు
షిరిడీకి
వచ్చారు,
ఎంక్వైరీకి.
‘దాస్‌గణు
తప్పుకాదు;
అతను
ప్రామిస్
మరచిపోవటంచేత
అతనికి
శిక్షకోసం
కనిపించకుండా
నేనే
చేశాను.
తిరిగి
కనిపించేటట్టు
నేనే
చేశాను’
అని
బాబా
పోలీసులకు
వివరించాడు.
అప్పటినుండి
దాస్‌గణు
షిరిడీలో
ఉండిపోయినాడు.
అతడు
కవి,
మంచి
పాటలు
పాడేవాడు.
బాబా
గురించి
హరికథలు
చెబుతూ
పల్లెలంతా
తిరిగేవాడు.
అంతకు
పూర్వము
ఎవరైనా
బాబా
దగ్గరకు
వెడుతుంటే
వారినంతా
తిడుతూ
వుండేవాడు.
ఇప్పుడు
అందరిని
బాబా
దగ్గరకు
రమ్మని
కోరుతూ
వచ్చాడు.
‘షిరిడీకి
రాకపోతే
పాపము
చేసినవారే!
షిరిడీకి
పోతే
జన్మసార్థకమవుతుంది’
అని
హరికథలు
చెబుతూ
యీ
విషయాలన్నీ
చెప్పేవాడు.
ఈ
ప్రభావము
విని
అనేకమంది
బాబా
దగ్గరకు
వచ్చారు.
ఒకనాడు
బాబా
మఱ్ఱి
చెట్టుక్రింద
కూర్చున్నాడు.
కొంతమంది
భక్తులుకూడా
ఉన్నారు.
అందులో
దాస్గణుకూడా
ఉన్నాడు.
ఎవరైనా
ప్రశ్నలు
వేస్తే
జవాబు
చెప్పటము,
మధ్యమధ్య
దాస్గణును
పాడమని
చెప్పటం.
అందరూ
సైలెంటుగా
ఉన్నారు.
ఇంతలో
ఒక
బల్లి
అరిచింది.
అందరు
ఆ
సౌండుపై
ధ్యానం
పెట్టారు.
భజన
సమయంలో
చిన్న
శబ్దమైనా
వినిపిస్తుంది.
కొందరు
అడిగారు,
‘స్వామి!
బల్లి
శబ్దములో
ఏదో
అంతరార్థము
ఉంటున్నాది
బల్లి
అరిస్తే
మంచా
చెడ్డా’
అని
ప్రశ్న
వేశారు.
బల్లి
అరిస్తే
చాలామంచిది
అంటారు,
మనవాళ్లు.
ప్రజలలో
విశ్వాసములు
యీ
విధంగా
ఉన్నాయి.
అరచటంలో
ఉన్న
అంతరార్థం
ఏమిటి
అన్నారు.
‘సైతాను!
ఆమాత్రం
తెలియదా!
ప్రతివానికి
ఒక
విశ్వాసం
ఉంటుంది.
ఒక
కార్యము
జరిగినప్పుడు
ఉత్సాహపడుతుంటారు.
నీ
బిడ్డలు
నీ
యింటికి
వస్తున్నారంటే
ఎంత
సంతోషమవుతుంది!
భార్యాబిడ్డలు
యింటికి
వస్తున్నారంటే
ఎంత
ఎంత
సంతోషమవుతుంది!
అట్లనే
ఆ
బల్లి
సంతోషంగా
ఉంటున్నాది!
ఈ
సంతోషమునకు
కారణం
ఏమిటి?
ఔరంగాబాద్నుండి
తన
చెల్లెలు
వస్తున్నాది’
అని
బాబా
చెప్పాడు.
7
▾
Meaning
Keep
Also in his talks
(4)
30 July 1988
Sacrifice itself is the true yoga
28 September 1990
Revelations about the Sai Avatar
27 September 1992
The Shirdi Sai Saga
23 August 1996
Only He Who Bows to God's Command Can Experience Divinity in Full
ఔరంగాబాద్
ఎక్కడ?
బల్లికి
చెల్లెలు
ఎక్కడ?
చెల్లెలు
వస్తుందని
తెలుస్తే
అది
సంతోషంగా
ఉంటుంది.
బల్లికి
తెలిసే
శక్తి
ఉంది.
అంతలో
పటేలు,
పటేలు
భార్య
యిద్దరూ
వచ్చారు,
దర్శనమునకు.
టాంగా
దిగారు.
ఔరంగాబాద్నుండే
వచ్చారు.
టాంగా
దిగి
గుఱ్ఱమునకు
దాణా
వేయాలని
సంచి
తీసాడు.
దానిలో
ఒక
బల్లి
ఉంది.
యిది
పాకి
ఆ
బల్లి
దగ్గరకు
పోయింది.
రెండూ
ఆనందముగా
ఉన్నాయి.
ఈ
విషయము
దైవత్వమునకు
తప్ప
ఎవరికి
అర్థముకాదు.
బాబాకు
బల్లి
భాష
తెలుసు.
అంతేకాదు,
ఆయనకు
అన్ని
భాషలు
తెలుసునని
అక్కడ
హరికథ
ప్రారంభించాడు.
బాబాను
అడిగాడు.
‘మీ
చరిత్ర
వ్రాయాలి,
హరికథగా!
మీరు
ఎక్కడ
పుట్టారు?
తల్లితండ్రులెవరు?
ఎక్కడ
పెరిగినారు?’
అని
అడుగుతూ
వచ్చాడు,
దాస్‌గణు.
అందుకు
బాబా
‘నాకు
పుట్టుక
లేదురా!
దాస్‌గణు!,’
అని
చెప్పాడు.
‘అయితే
మీ
పేరు
ఏమిటి?’
‘నా
పేరు
బాబాయే!’
‘ఎక్కడనుంచి
వచ్చారు?’
‘దేవునినుండి.’
ఈ
విధంగా
వారిద్దరిమధ్య
సంభాషణ
జరిగింది.
బాబా
‘నేను
వచ్చానేగానీ
పుట్టలేద’న్నాడు.
ఈ
విధంగా
జవాబు
చెబుతే
ఎవరికీ
తెలీదు.
ఒకతూరి
దాస్‌గణు
బాబాను
ఈవిధంగా
కీర్తించాడు:
పత్రిగ్రామ
సముద్భూతం
-
ద్వారకామాయి
వాసినం
భక్తాభీష్టప్రదం
దేవం
-
సాయినాథం
నమామ్యహం
అప్పుడు
బాబా
పత్రిలో
పుట్టాడని
తెలిసింది.
ఆనాడు
జరిగినవి
అన్నీ
యీనాడు
కంటికి
కనిపించకుండా
క్రమక్రమేణా
జరుగుతున్నాయి.
‘తిరిగి
మరి
ఎన్ని
సంవత్సరాలకు
పుడతావు’
అన్నాడు.
అప్పుడు
‘8
సం॥ల
తరువాత’
అన్నాడు.
అంతవరకు
ఎక్కడ
వుంటావు
అడిగాడు.
‘నీ
చుట్టూ
ఉంటాను,
అదే
నా
పని’
అన్నాడు.
ప్రశాంతినిలయ
నిర్మాణం
1950లో
పూర్తి
చేశారు.
ఆ
నిర్మాణ
సమయంలో
సిమ్మెంటు
చిక్కటంలేదు.
ఇనుము
చిక్కటంలేదు.
అప్పుడు
గోపాల్‌రెడ్డి
(బెజవాడ)
ట్రాన్స్‌పోర్టు
మంత్రిగా
ఉన్నాడు.
హాలుకు
గర్డర్సు
కావాలి.
చిక్కటం
లేదు.
గోపాల్‌రెడ్డి
చెప్పాడు,
“మధురలో
ఒక
బ్రిడ్జికోసమని
నాలుగు
గర్డర్సు
పెట్టినాము.
అవి
మీరు
తీసుకొండి”
అని.
అవి
పెనుకొండ
వచ్చాయి.
అక్కడనుండి
40,
50
అడుగులు
పొడవున్న
గర్డర్సు
పుట్టపర్తి
ఎలా
వస్తాయి?
ఆ
రోజుల్లో
పుట్టపర్తికి
బండ్ల
దారిలేదు.
8
▾
Meaning
Keep
కాలిబాటకూడా
లేదు.
తీసుకురావాలి.
లారీలు
ఎలా
తిరుగుతాయి
పల్లెలలో?
చాలా
కష్టం.
హనుమంతరావు
చాలా
బాధ
పడుతున్నాడు.
ఆయన
ట్రాన్స్‌పోర్టు
కమీషనరు.
రామచంద్రన్
రీజనల్
ట్రాన్స్‌పోర్టు
ఆఫీసరు.
బ్రేక్
ఇన్స్పెక్టరు
భీమసేన్.
వీరు
ముగ్గురు
మీటింగు
పెట్టుకున్నారు
ఎలా
తీసుకురావాలని.
పంటపొలములలోనుండి
తీసుకొని
వస్తే
వారికి
పంటనష్టము
యివ్వాలి,
అని
ఆలోచించారు.
నేను
చెప్పాను,
‘హనుమంతరావు!
ఏమీ
చింతించకు,
ఆ
సదుపాయము
నేను
చేస్తాను’
అని.
తాను
చాలా
సంతోషించాడు.
ఎప్పుడు
స్వామి
అనుజ్ఞ
యిస్తాడు
అని
కాచుకొని
ఉన్నాడు.
అప్పుడు
తుంగభద్ర
ఆనకట్ట
కడుతున్నారు.
తిరుమలయ్యంగార్
అని
చీఫ్
యింజనీరు.
ఆయన
ముఖ్యమైనవాడు.
అక్కడ
ఒక
క్రేను
తుంగభద్రకు
పోయి
వెనుకకు
మద్రాసు
పోతున్నాది.
ఒకరోజు
ముందు
రామచంద్రన్‌తో
చెప్పాను,
“క్రేను
బళ్ళారినుండి
మద్రాసు
పోవాలంటే
అనంతపురంనుంచి
పోవాలి.
ఆ
దారిలో
క్రేను
తీసుకువస్తుంటే
సరిగ్గా
రామచంద్రన్
యింటిదగ్గర
నిల్చిపోయింది.
ఆ
రోజుల్లో
వారానికి
మూడు
కూపన్లు
మాత్రమే
యిచ్చేది
పెట్రోలు.
పెట్రోలు
కొరత
కనుక
కూపన్లు
యిచ్చేవారు.
నాకు
నెలకు
1
గేలను
మాత్రమే
యిచ్చేవారు.
నాకు
9
వ
సం॥మే
డ్రైవింగ్
లైసెన్సు
యిచ్చారు.
లైసెన్సు
యివ్వటానికి
ఏవిధంగా
టెస్టు
చేశారు?
నాకు
ఒక
చిన్నకారు
ఉండేది.
అది
నడుపడానికి
నాకు
లైసెన్సు
యివ్వాలి,
అని
పట్టు
పట్టాను.
వీలుకాదు,
లైసెన్సుకు
సరైన
వయస్సు
వుండాలన్నారు.
అప్పుడు
నేను
‘డ్రైవింగు
ముఖ్యము
కాని
వయస్సు
ముఖ్యము
కాద’న్నాను.
ఈ
అబ్బాయి
డ్రైవింగ్
ఎలా
చేస్తాడో
చూడాలి
అని
ట్రాన్స్‌పోర్టు
కమీషనరు,
ఆఫీసరు,
బ్రేక్ఇన్స్పెక్టరు
ముగ్గురు
వెనుక
కూర్చున్నారు.
నా
ప్రక్క
ముందర
సీటులో
ఎస్.పి.
కూర్చున్నాడు.
డ్రైవు
చేశాను.
అర్ధగజములోపలనే
త్రిప్పాలి,
వెనుకకు
పోవాలి
అని
పెట్టాడు.
లైను
గీసిన
ప్రకారము
వచ్చేశాను.
కారులో
వుండేవారు
చప్పట్లు
కొట్టారు.
జీపులో
పోయి
సర్టిఫికేట్టు
తెచ్చి
ఇచ్చారు.
ఈ
లోపుగా
ఆ
క్రేను
చెడిపోయింది.
స్టార్టు
చేసేటప్పుడు
సౌండు
వస్తున్నాది.
స్వామి
చెప్పాడు
రాత్రి
జాగ్రత్తగా
వుండమని;
కనుక
తలుపు
తెరచి
చూచాడు
డ్రైవరు.
సరే
అని
క్రేను
రిపేరు
చేసి
పెనుకొండ
తీసుకువెళ్లి
చిత్రావతి
దాటించి
పుట్టపర్తి
తీసుకువచ్చారు.
ఇది
కొత్తగా
ఉంటున్నాది,
పల్లె
జనమునకు.
అందరూ
పరుగెత్తి
వచ్చారు.
క్రేను
తెచ్చి
అక్కడ
ఉంచి
వెళ్లిపోయారు.
9
▾
Meaning
Keep
కానీ
గర్డర్సు
పైన
పెట్టటానికి
మరింత
చిక్కువచ్చింది.
రెండు
అంతస్థుల
ఎత్తు
ఉంటున్నాది.
25
అడుగులు
ఎత్తు
ఉంటున్నాది.
‘ఈ
గర్డర్సు
25
అడుగులు
ఎలా
ఎత్తాలి,’
అని
హనుమంతరావు
చాలా
బాధ
పడుతున్నాడు.
‘నీవు
చింతించకు,
అది
నా
బాధ్యత,’
అని
చెప్పాను.
పాతమందిరంలో
ఉంటున్నారు,
టెంట్సు
వేసుకొని.
గర్డర్సు
తెల్లవారు
ఝామున
5
గం॥లకు
పైన
పెట్టాలి.
ఎవరు
చూడకుండా
రావాలి
అని
ప్లాను
వేసుకున్నాను.
నేను
వెళ్లాను.
4
గర్డర్సు
పైన
ఎక్కడ
నిల్చుకోవాలో
అక్కడ
నిల్చుకున్నాయి.
ఇది
చూడాలని
హనుమంతరావుకు
చాలా
ఆశ.
కాని
నేను
6
గం॥లకు
వచ్చి
‘హనుమంతరావు!
పోయి
చూడు
ఒకతూరి’
అన్నాను.
హనుమంతరావు,
రామచంద్రన్
అక్కడకు
పోయి
చూచారు.
అంత
ఎత్తుకు
గర్డర్సు
ఎట్లా
పోయినాయి!
ఆశ్చర్యపడ్డారు.
షిరిడీలోకూడా
అట్లే
జరిగింది.
ఒక
దినము
మహమ్మదీయులు
హిందువులను
తరిమి
కొట్టాలని
వచ్చారు.
మహమ్మదీయులందరికి
మహల్సాపతి
అంటే
ద్వేషము.
మహల్సాపతిని
కొట్టారు.
చూచాడు
బాబా.
అబ్బా
అబ్బా
అంటూ
వచ్చాడు
బాబా.
మహల్సాపతి
అబ్బా
అనలేదు,
అమ్మా
అనలేదు.
ఆ
దెబ్బలన్నీ
బాబాకు
తగిలాయి.
బాబా
వీపుపై
దద్దుర్లు
వచ్చాయి.
బయటకు
వచ్చాడు.
‘ఒక
తట్టు
పూజించటము,
ఒక
తట్టు
కొట్టటమా?
అల్లామాలిక్
అని
అల్లానే
కొడుతున్నారా
మీరు?’
అని
బాధగా
ప్రశ్నించాడు.
చూచారు,
రక్తం
కారుతున్నాది.
‘తప్పు
చేశాం
క్షమించండి!’
అన్నారు.
మహమ్మదీయులు
మసీదు
అనుకుంటున్నారు.
కాదు,
కాదు
హాలు
ఒకటి
కట్టాలి
అని
నిర్ణయించాడు,
బాబా.
అప్పుడు
మంచి
ధనవంతుడు,
బూటీ.
బూటీ
మందిరం
కట్టాడు.
అది
కట్టే
సమయంలో
వర్షాలు
విరివిగా
కురిసాయి.
బాబా
‘నేను
మసీదులో
ఉండను,
మూడవదినమే
మందిరం
తయారుకావాల’న్నాడు.
ఏమి
చెయ్యాలో
ఎవరికి
తెలీదు.
వర్షములు
వస్తున్నాయి.
రెండవరోజు
పైకప్పు
పడింది.
తెల్లవారితే
వర్కర్సందరు
‘ఎవరు
వేశారు,
ఎవరు
వేశారు,’
అని
ఆశ్చర్యపోయారు.
‘నేనేనోయి’
అన్నాడు,
బాబా.
‘లేబరులేకుండా
పైకప్పు
ఎలా
వేశారు
స్వామి,’
అన్నారు.
‘నేనే
మాష్టరు,
నేనే
వర్కరు’
అన్నాడు.
అప్పుడు
తెలిసింది.
బూటీ
కూడా
ఉన్నాడు.
చాలా
ఆశ్చర్యపడి
‘బాబా
సాక్షాత్
భగవంతుడు,’
అనుకున్నాడు.
ఒక
దినము
భగవంతుడని,
రెండవదినము
కాదని
భావించే
మానవుని
మైండు
మంకీ
మైండు.
ఈ
విచిత్రాలు
జరిగినప్పుడు
‘దేవుడు,
దేవుడు’
అంటారు.
10
▾
Meaning
Keep
His poems 441
కానీ,
వారికి
ఏవైనా
బాధలు
జరిగినప్పుడు
భగవంతుడు
కాదంటారు.
మానవుని
మనస్సు
చపలమైనది.
అందువల్లనే
పుట్టపర్తిలో
చెప్పాను.
ఔను
అనువారికి
అవుననురా
కాదనువారికి
కాదనురా
నో
ఎస్సులు
నీ
నోటికిగాని
సాయికి
సర్వము
ఎస్
ఎస్
ఎస్.
ఔను
అంటే
ఔనంటాడు,
నో
అన్నవారికి
నో
అంటాడు.
ఎస్,
నోలు
రెండు
ఒకే
నాలుకనుండి
వచ్చినవే!
మనస్సు
ప్రభావమువల్ల
వస్తుంటాయి.
వేదాంతములో
‘మనయేవ
మనుష్యానాం
కారణం
బంధమోక్షయోః’
అన్నారు.
అన్నింటికి
మనస్సే
కారణము.
కష్టములందు,
సుఖములందు,
దుఃఖములందు,
ఆనందములందు
ఎప్పుడూ
ఒకే
స్థిరచిత్తుడై
ఎవడు
ఉంటాడో
అతనికి
అన్నీ
ఎస్లే!
సుఖము
వచ్చినపుడు
పొంగటము,
దుఃఖము
వచ్చినపుడు
కృంగటము,
రెండూ
ఎప్పుడు
ఉంటాయో
వాడు
ఎప్పుడూ
గడియారపు
పెండ్యులంవలె
ఉంటాడు.
నీవు
చలించని
మనస్సును,
భ్రమించని
దృష్టిని
పెంచుకోవాలి.
వేవరింగు
మైండు
లేకుండా
ఎవడుంటాడో
వాడు
స్థిరచిత్తుడు.
వానియందు
నేను,
నాయందు
వాడు
ఎప్పుడూ
ఉంటారు.
అట్టి
స్థిరచిత్తుడై
ఉన్నాడు
దాస్‌గణు.
ఎన్నో
కష్టాలు
వచ్చాయి.
అయినప్పటికి
‘నేను
బాబాను
వదలను.
నా
జీవితము
యిక్కడే
పోవాలి,’
అని
కట్టకడపటివరకు
నిల్చినవాళ్లు
దాస్‌గణు,
మహల్సాపతి,
అబ్దుల్,
కాకా
దీక్షిత్,
నానా,
యీ
ఐదుగురు.
ఆనందమునకు
ఆనందము
ఆహ్లాదమునకు
ఆహ్లాదము,
ప్రేమకు
ప్రేమ,
కోపానికి
కోపం
అన్నీ
బాబాయందు
ఉండేవి.
షిరిడీలో
బాబా
నవ్వింది
ఎవరూ
ఎప్పుడూ
చూడలేదు.
అప్పట్లో
హిందువులు,
మహమ్మదీయులు
విరుద్ధంగా
వుండేవారు.
బాబా
ఎప్పుడు
ఏమంటాడో
అని
అందరికి
భయం.
అందువల్ల
బాబా
కోపాన్ని
ప్రదర్శిస్తూ
వచ్చాడు.
అంతేగానీ
బాబాకు
అసలు
కోపంలేదు.
ఏది
చెప్పినా,
ఏది
చూసినా
వారి
మంచికోసమేగానీ
తన
కోసంకాదు.
ఆ
భావముతో
ఉండినవాడే
పైకి
వస్తాడు.
అట్లు
కాకుండా
స్వామి
కోపపడ్డాడే,
స్వామి
యిలా
చేశాడే
యీ
రకంగా
పోతే
అవుట్.
11
▾
Meaning
Keep
ఫుట్‌బాల్
ఆడుతుంటారు.
యిటూ
అటూ
రెండు
పోల్సు
పెడతారు.
రెండింటికి
మధ్యలో
బాల్
పోతే
గోల్.
అటువైపు,
యిటువైపు
పోతే
అవుట్.
నాయొక్క
దీనిలో
రెండింటికి
మధ్యలో
వచ్చిన
వాడే
గోల్.
కష్టమునకు,
సుఖమునకు
మధ్యలో
వుండాలి.
అటో
యిటో
పోతే
అవుట్.
‘ఏమి
చేసినా
నా
మంచికోసం’
అనే
భావన
ఉన్నవాడు
ఎప్పటికైనా
గోల్
తీసుకుంటాడు.
ఆ
సమచిత్తాన్ని
పెంచుకోటానికి
తగిన
కృషి
చేయండి.
Previous
←
Power Of Divine Love
Next
Faith, the chief value man must have
→