Contents
Devotion & Sacred Story
Home
Library
Find
Shelf
Settings
←
Leave
Sathya Sai Speaks 1992 · Faith, the chief value man must have
Tap a verse for its meaning
IAST
Telugu
Meaning
Continuous
Faith, the chief value man must have
19 June 1992, Brindavan
1
▾
Meaning
Keep
ప్రేమస్వరూపులారా!
ఈనాటి
ప్రపంచములో
జయమునకు,
అపజయమునకు
వారి
వారి
విశ్వాసమే
మూలకారణము.
‘మానవ’
అంటే
నమ్మకము
కలవాడు.
కానీ,
అట్టి
మానవునియందు
వుండవలసిన
ప్రధాన
విలువైన
నమ్మకమును
మానవుడు
యీనాడు
కోల్పోయినాడు.
చిన్న
చిన్న
విషయములందుకూడను
మానవుడు
అమితమైన
విశ్వాసము
కలిగి
జీవిస్తున్నాడు.
కానీ,
ఒక్క
ఆధ్యాత్మిక
విషయమునందు
మాత్రమే
యీనాటి
మానవునకు
విశ్వాసము
లేకపోతున్నది.
మార్కెట్టుకు
వెళ్లి
కూరగాయలు
తీసుకుని
యింటికి
రావాలంటే
ఎంతో
నమ్మకము
వుండాలి.
కనుకనే
‘తిరిగి
తాను
వస్తాను’
అనే
నమ్మకముచేతనే
మానవుడు
మార్కెట్టుకు
వెడుతున్నాడు.
మానవుడు
యింత
చిన్న
విషయమునుకూడా
నమ్ముతున్నాడు.
అయితే,
మార్కెట్టుకు
వెళ్లి
తిరిగి
యింటికి
చేరుతామనే
గ్యారంటీ
ఎవరికీ
లేదు.
ఏ
యాక్సిడెంటో
జరిగి
యింటికి
రాలేకపోవచ్చు.
యీ
విధంగా
నమ్మకము
లేనిదానిపైన
అమితమైన
నమ్మకము
పెట్టుకుంటున్నాడు,
మానవుడు.
యీనాడు
ఒక
యింటికి
పునాది
వేస్తే
రెండవ
సంవత్సరము
దీనిని
పూర్తి
చేస్తాను
అనే
నమ్మకముచేతనే
ఆ
యింటికి
పునాది
వేస్తున్నాడు,
మానవుడు.
అయితే
వచ్చే
సంవత్సరమువరకు
తాను
వుండగలననేటువంటి
విశ్వాసము
దేనిపై
వుంటున్నది?
యిట్టి
నమ్మకము
లేని
ప్రాకృత
విషయములందు
మానవుడు
అన్నింటిని
విశ్వసిస్తున్నాడు.
నిత్యసత్యమైన,
దివ్యమైన
దైవమునందు
మాత్రము
యిట్టి
నమ్మకమును
మానవుడు
కోల్పోతున్నాడు.
నమ్మకము
వుండవలసినది
దివ్యత్వముపైన.
లోకసంబంధమైన
విషయాలు
కదలిపోయేవి,
క్షణభంగురమైనవి.
నమ్మదగినవి
కావు.
కానీ
నమ్మతగనటువంటివాటిపైన
నమ్మకము
పెరుగుతున్నాది.
2
▾
Meaning
Keep
నమ్మతగిన
దానిపైన
నమ్మకము
తరుగుతున్నది.
యీ
నమ్మకము
లేకపోవటముచేతనే
మానవుడు
నిత్యజీవితములో
తాను
అన్నింటియందు
అపజయమును
పొందుతున్నాడు.
అభిమానపాశమును
ఎవ్వరూ
తప్పించుకొనలేరు
దీనికి
ఒక
చిన్న
ఉదాహరణము.
పూర్వము
షిరిడీయందు
వుండినప్పుడు
శివదాస్
అనే
ఒక
విద్యార్థి
వుండేవాడు.
అతను
బి.ఎ
ప్యాసైనాడు.
తిరిగి
ఎల్.ఎల్.బికి
పోవాలని
చాలా
ప్రయత్నము
చేశాడు.
ఆనాడు
లాయర్సు
అంటే
చాలా
గొప్ప
గౌరవము.
‘లా’
అనేది
వారియందే
ఆవిర్భవిస్తుందని
ప్రజల
విశ్వాసము.
కనుకనే
వారిని
ఎంతో
గౌరవించేవారు,
ప్రజలు.
వారు
చెప్పే
ప్రతి
పదము
సత్యమైనదని,
ధర్మమైనదని,
న్యాయమైనదని
ప్రజలయొక్క
విశ్వాసము.
యీనాటి
లాయర్సు
అంతా
లయ్యర్సుగా
మారుతున్నారు.
యీ
లాయర్సును
నమ్ముకున్నవారు
తమ
జీవితమునే
కోల్పోతున్నారు.
అందుకోసమనే
ఒకరు
అన్నారు
“యమధర్మరాజు
దగ్గరకు
పోయినవాడైనా
తిరిగి
వెనుకకు
వస్తాడేమోగానీ
లాయరు
దగ్గరకు
వెళ్లినవాడు
వెనుకకు
రాలేడు”,
అని.
ఈనాడు
దయ,
ధర్మము,
న్యాయము,
నీతి
అనేవి
దిగజారిపోయాయి.
ధనమే
ప్రధానము.
గౌరవమే
ప్రధానము.
నీతి
నిజాయితీలకు
ప్రాధాన్యత
యివ్వలేక
పోతున్నారు.
ఆ
శివదాస్
అనేవాడు
ఎల్.ఎల్,బి
పరీక్షకు
కూర్చున్నాడు.
అతని
స్నేహితుడైన
ఒక
సత్మిత్రుడు
బాగల్‌కోటలో
వుండేటువంటివాడు.
అతను,
యితను
పరీక్షకు
కట్టుకున్నారు.
శివదాస్
బాబాపైన
చాలా
విశ్వాసము
కలవాడు.
బొంబాయిలో
పరీక్ష
వ్రాయటానికి
పోవాలి.
ముందుగా
షిరిడీకి
ప్రయాణమయ్యాడు
శివదాస్.
షిరిడీ
చేరాడు.
బాబాకు
నమస్కరించాడు.
చాలా
బాధగా
కంటిధారలు
కార్చుకుంటూ
‘బాబా!
నీవు
నన్ను
రక్షించాలి’
అన్నాడు.
బాబా
చెప్పాడు,
‘ఎందుకు
విచారిస్తున్నావు,
భయపడకు.
పరిపూర్ణమైన
విశ్వాసముతో
ఒక్కతూరి
నమస్కారము
చేయి.
నేను
చూచుకుంటాను,’
అని.
భగవద్గీతయందుకూడను
అర్జునుడు
అనేక
విధములైన
వ్యామోహములలో
మునిగి
బంధువులు,
మిత్రులు
అనే
మోహముచేత
యుద్ధము
చేయుటకు
కొంతవరకు
జంకాడు.
అభిమాన,
మమకారములు
యీ
అర్జునుని
వెనుకకు
నెడుతూ
వచ్చాయి.
చెప్పాడు
కృష్ణుడు.
ఎంతగానో
బోధించాడు.
యీ
అభిమానమనేది
మహా
పాశము.
3
▾
Meaning
Keep
Also in his talks
(5)
9 October 1986
Man's transformation is itself the transformation of the universe
12 September 1989
The Name of God Alone Is the Boat
21 May 1991
The Vedic Heritage Of India
8 September 1996
The Unseen Divinity Is the Basis of the World Fashioned as the Seen
11 September 1998
Speak Gently and Sweetly
యమపాశమైననూ
తప్పించుకోవచ్చుగానీ
అభిమానమనే
పాశమును
ఎవరూ
తప్పించుకోలేరు.
మన్మనా
భవ
మద్భక్తో
మద్యాజీ
మాం
నమస్కురు
మామేవైష్యసి
యుక్త్వైవ
మాత్మానం
మత్పరాయణః
‘అర్జునా!
ఒక్కతూరి
నాకు
నమస్కారము
చెయ్యి.
నీ
సర్వబాధలు
నాకప్పగించు.
నేను
చూచుకుంటాను.
ఎందుకు
నీవు
భయపడుతున్నావు.
నన్నే
ధ్యానిస్తూ
వుండ’మని
చెప్పాడు,
భగవద్గీతలో
కృష్ణ
పరమాత్మ.
షిరిడీలోకూడా
బాబా
‘నాయనా!
ఎందుకు
నీవు
భయపడుతున్నావు?
దృఢమైన
విశ్వాసముతో
నమస్కరించి
వెళ్లు.
తప్పక
నీవు
ప్యాసు
అవుతావు’
అన్నాడు.
అదొక్కమాట
మాత్రమే
తీసుకున్నాడు,
శివదాసు.
బొంబాయి
వచ్చాడు.
తాను,
తన
మిత్రుడు
యిద్దరు
పరీక్షకు
కూర్చున్నారు.
మిత్రుడు
పరీక్ష
అయిన
తరువాత
యీ
శివదాసుకు
ప్రశ్నలు
వేశాడు,
‘ఎట్లా
వ్రాసావు?
ఫలాని
ప్రశ్నకు
ఏమి
జవాబు
వ్రాసావు’
అని.
పిల్లలు
ఒకరికి
ఒకరు
చెప్పుకుంటారు.
ఒక్కదానికికూడను
జవాబు
యివ్వలేదు,
శివదాసు.
‘ఏయ్
నీవు
ఫేలైపోతావు’
అన్నాడు.
‘నేను
ఫెయిల్
కాను,’
అని
గట్టిగా
చెప్పాడు.
అప్పుడా
మిత్రుడు
‘జవాబు
యివ్వని
వాడవు
ప్యాసౌతానని
ఏ
ధైర్యముతో
చెబుతున్నావు,’
అన్నాడు.
‘నాకు
ఏ
ధైర్యము
అక్కరలేదు.
నేను
వ్రాసినా
వ్రాయక
పోయినా
తప్పక
ప్యాసౌతాను’
అని
దృఢవిశ్వాసంతో
చెప్పాడు.
అప్పుడు
మిత్రుడు
మళ్లీ
‘ఏ
విధంగా
చెబుతున్నావు’
అని
అడిగాడు.
‘బాబా
చెప్పాడు.
బాబా
మాటయే
నాకు
ప్రధానమన్నాడు’.
అదే
సత్యము.
తప్పక
తను
చేస్తాడు.
హేళనచేస్తూ
పోయాడు,
మిత్రుడు.
‘ఏమీ
వ్రాయకుండా
పోతే
యే
బాబాకూడా
నిన్ను
ప్యాస్
చేయలేడు.
చాలా
అబద్ధము’
అన్నాడు.
‘నా
నమ్మకము
నాది.
నమ్మకములో
మూఢనమ్మకము
వుంది,
మంచి
నమ్మకము
వుంది.
బాబాది
ఒక్క
వాక్కు.
‘సత్యమ్
ఏకమ్.
కనుక
బాబా
చెప్పినదే
నాకు
ప్రధానమైనది,
ప్రమాణము’
అనుకున్నాడు.
స్నేహితుడు
తిరిగి
హేళనచేస్తూ
‘తట్టలో
పెట్టుకున్న
పదార్థము
పొట్టలోకి
వస్తుందా?
నీవు
చేయవలసిన
ప్రయత్నము
నీవు
చేయాలి
కదా!
భగవంతుడు
కాదు,
ఎవరు
ఏమీ
చేయలేరు.
నీ
బాబా
నీకు
వూరికే
చెప్పాడు’
అన్నాడు.
‘నేను
అన్ని
ప్రశ్నలకు
జవాబులు
కరెక్టుగా
వ్రాశాను.
4
▾
Meaning
Keep
నేను
ఫస్ట్‌క్లాసులో
వస్తాను.
నీకు
వచ్చేది
జీరోనే’
అన్నాడు.
‘నీవు
ఏమైనా
అనుకో!
నాకు
జీరో
వచ్చినా
నన్ను
హీరోగా
చేస్తాడు
బాబా’
అని
అత్యంత
విశ్వాసంతో
పలికాడు,
శివదాసు.
సరే!
అంతటితో
ఈ
వాదన
ముగించి
వెళ్లిపోయారు.
హోటలుకు
వెళ్లి
టిఫిన్
తీసుకున్నారు.
బాగల్‌కోటకు
వెళ్లిపోయాడు,
మిత్రుడు.
శివదాస్
మన్మాడ్
వెళ్లాడు.
చివరకు
మిత్రుడు
ఫెయిల్
అయిపోయాడు,
శివదాస్
మంచి
మార్కులతో
ప్యాస్
అయ్యాడు.
అప్పుడు
మిత్రుడు
యోచించాడు.
‘అరే!
నేను
పొరపాటు
పడ్డాను.
నేను
అనవసరంగా
మాట్లాడాను.’
అని
మరల
పరీక్షకు
కట్టుకున్నాడు.
ప్యాసై
పోయాడు.
తరువాత
పెళ్ళి
అయింది,
కొడుకు
పుట్టాడు.
పది
సంవత్సరములు
అయిపోయింది.
శివదాస్
ప్రతి
సం॥ము
షిరిడీకి
పోయేటువంటివాడు.
ప్యాస్
అయిన
తరువాత
శివదాస్
షిరిడీకి
వెళ్లి
‘స్వామి!
మీ
అనుగ్రహముచేత
ప్యాస్
అయినాను
కానీ,
నేను
ఆ
పరీక్ష
వ్రాయలేదు,
మీరే
వ్రాసారు’,
అన్నాడు
బాబాతో.
‘అవును,
నేనే
వ్రాసింది.
నీవు
ప్యాసైనానని
అహంకారపడుతున్నావేమో,
నేను
ప్యాస్
చేశాను
నిన్ను.
నేను
ప్యాసైనానని
అనుకోటంలో
తప్పు
వుంది’
అన్నాడు.
‘ఎప్పటికి
అహంకార
పడవద్దు
పో!’
అన్నాడు.
మానవునికి
ప్రధానమైన
ఆస్తి
దైవానుగ్రహమే!
శివదాస్
బొంబాయిలోనే
ప్రాక్టీసు
చేసుకుంటూ
మంచి
అభివృద్ధిలోకి
వచ్చాడు.
అతని
మిత్రునికి
పెండ్లయింది,
కొడుకు
పుట్టాడు.
తానుకూడను
బొంబాయి
వచ్చి
ప్రాక్టీసు
ప్రారంభించాడు.
వీరు
పాత
మిత్రులు
కనుక
తరుచు
కలుసుకునేవారు.
యీ
లోపల
మిత్రునికి
పుట్టిన
కుమారుడు
రెండు
మూడు
సం॥లు
చక్కగా
పెరిగి
మరణించాడు.
ఒకే
కుమారుడు.
చాలా
బాధ
పడ్డాడు.
పిచ్చివాడుగా
తయారయ్యాడు.
ప్రాక్టీసు
వదలిపెట్టాడు.
అన్ని
విధాలా
బాధపడుతూ
వచ్చాడు.
‘నా
కుమారుడు
పోయె,
నా
జీవితమే
వ్యర్థమైపోయింది.
ఎవరికోసం
నేను
సంపాదించాలి?
యీ
సంపాదన
నేను
ఎవరికి
యివ్వాలి?
నాకేమీ
ప్రయోజనం
లేదు
జీవితము,’
అని
చాలా
విరక్తి
పడుతూ
వచ్చాడు.
శివదాస్
అతని
దగ్గర
చేరి
‘నీవు
చాలా
పొరపాటు
పడుతున్నావు.
ఒకసారి
షిరిడీకి
రా!’
అన్నాడు.
‘నాకు
ఆ
నమ్మకాలంతా
లేవు’
అన్నాడు
అతని
మిత్రుడు.
‘సరే!
నా
కోసమైనా
నీవు
రమ్మ’ని
చాలా
తొందరపెట్టాడు.
5
▾
Meaning
Keep
మిత్రుడైనందుకు
దైవత్వమును
అతనికి
అందించటము
మిత్రత్వమునకు
ప్రధానమైన
లక్షణము.
ధనము
యివ్వటము
కాదు,
మిత్రత్వమునకు
విలువ.
కష్టాలలో
తోడుపడడంకాదు,
మిత్రత్వమునకు
విలువ.
కష్టసమయములందు
భగవంతుని
చూపించటము,
భగవంతుని
ప్రేమించటము
యిది
ప్రధానమైన
ధర్మము.
ఆధునిక
యుగములోపల
ఈ
పద్ధతి
మారిపోయింది.
‘దైవమును
విడువు
మంచివాడవైపోతావు,
ధనము
సంపాయించు,
మంచి
సహాయము
చేస్తాను,’
అని
భౌతికమైన,
ప్రాకృతమైన
విషయాలకు
సహాయము
చేస్తారు,
మిత్రులు.
‘ఉద్యోగము
యిప్పిస్తాను,
వ్యాపారంలో
భాగస్వామిని
చేసి
పెట్టుబడి
నేను
పెట్టుకుంటాను,’
అని
సహాయము
చేస్తారు.
యిటువంటి
సహాయములు
వానికి
వురితో
సమానము.
తాత్కాలికముగా
వీడు
సహాయము
చేస్తున్నాడేగానీ
వానిని
లేనిపోని
బురదలో
ముంచినట్టవుతుంది.
మరింత
ఆశలలో
ముంచి
వీడిని
మోసము
చేసినట్లైపోతుంది.
ధనము,
గృహము
అన్ని
విధములైన
సౌకర్యములు
లోకరీతిగా
వుండవలసినదే!
కాని,
ప్రధానమైన
ఆస్తి
దైవానుగ్రహమే!
కనుక,
‘నేను
ఎన్ని
విధాలైన
ప్రయత్నించి
బాబా
దగ్గరకు
తీసుకుపోతాను.
నీవు
సిద్ధము
కమ్మ’ని
చెప్పాడు.
ఇలా
ఒక
నెల,
రెండు
నెలలు
రాత్రింబవలు
ఎంతో
బోధించాడు.
ఆ
మిత్రుడు
చెప్పాడు,
‘నన్ను
పిచ్చివానిని
చేయవద్దు.
యిబ్బంది
పెట్టవద్దు.
నేను
చాలా
అశాంతితో
వుంటున్నాను.
ఈ
రకములైన
విషయములు
నాకు
బోధించి
నన్ను
మరింత
పిచ్చివానిని
చేయకు.
రేపటినుండి
నీవు
ఏమైనా
బాబా
బోధలు
చేశావంటే
నీకు,
నాకు
స్నేహము
వుండదు,
తెగిపోతుంది’
అన్నాడు.
చాలా
మంచివాడు
శివదాస్.
‘నాకుకూడా
నీ
స్నేహము
అక్కరలేదు.
కాని,
నీవు
దైవమార్గములో
ప్రవేశిస్తే
నాకు
అదే
చాలు.
ఏమైనా
నన్ను
విమర్శించు,
ఏమైనా
నన్ను
నిందించు.
కానీ
నేను
మంచి
మార్గము
బోధించకుండా
వుండను’
అన్నాడు.
యీ
విధముగా
బోధిస్తుంటే
ఆ
మిత్రుని
భార్య
విని
‘ఎందుకండీ
మీరింత
మూర్ఖంగా
ప్రవర్తిస్తున్నారు?
అతను
మంచిమాటలే
బోధిస్తున్నాడుగానీ,
ఏ
విధమైన
చెడుమార్గము
బోధించలేదు
కదా!
మహనీయుల
దర్శనము
చేయటానికి
వెళ్ళమంటున్నాడు
తప్ప
చెడ్డ
బోధలు
యేమీ
చేయటంలేదు.
కనుక
ఏమి
తప్పువుంది?
వెళ్లి
చూసిరండి’
అని
చెప్పింది.
లోకములో
యిప్పుడు
ఎలా
వుందంటే,
సాక్షాత్
భగవంతుడు
వచ్చి
చెప్పినా
వినరుగానీ
భార్య
చెప్పుతే
వింటారు.
6
▾
Meaning
Keep
Wife
is
life
అనుకుంటారు.
కాని,
wife
knife
గా
మారుతుందని
వారికి
తెలియదు.
ఆమె
చెప్పేటప్పటికి
‘సరే’
అన్నాడు.
చెప్పాడు,
‘రెండవదినము
వస్తాను.
నేను
వూరికే
చూచి
వచ్చేస్తాను.
అక్కడ
వుండను’
అన్నాడు.
అప్పుడు
శివదాసు
‘పరిపూర్ణ
విశ్వాసముతో
నీవు
రా!
తప్పక
నీకు
అన్ని
కష్టాలు
తీరుతాయి’
అని
చెప్పాడు.
పోయారు,
మన్మాడ్
స్టేషనులో
దిగారు.
అక్కడినుండి
పదిమైళ్ళు
పోవాలి.
టాంగాలో
పోవాలి.
యిద్దరూ
కూర్చున్నారు.
షిరిడీ
చేరేంతవరకూ
బాబా
సమాచారాన్ని
శివదాస్
చెపుతూ
వచ్చాడు.
“కన్నులు
మూసుకుంటే
నా
కొడుకు
ఎదురుగా
వస్తున్నాడు.
నాకెవరూ
కన్పించటంలేదు.
శివదాస్!
నన్ను
వూరికే
డిస్టర్బ్
చెయ్యకు”
అన్నాడు
మిత్రుడు.
అప్పుడు
చెప్పాడు,
శివదాస్:
‘పోయిన
కుమారుడిని
నువ్వు
ఎందుకు
తలంపులో
పెట్టుకుంటావు?
పుట్టక
పూర్వము
ఆ
కుమారుడు
వున్నాడా?
పుట్టక
మునుపు
లేడు.
చచ్చిన
తరువాత
లేడు.
మధ్యలో
వచ్చాడు,
మధ్యలో
పోయాడు.
ఇదంతా
కదలిపోయే
మేఘములవంటివి.
కాని,
భగవంతుడు
నువ్వు
పుట్టక
మునుపు
వున్నాడు.
నువ్వు
చచ్చిన
తరువాతకూడా
ఉంటాడు.
నీ
జీవితమంతా
తోడుగా
వుంటాడు.
కనుక,
భగవంతుడు
Omnipresent.
Past,
present,
future
మూడు
కాలములలో
వుంటున్నాడు.
యివన్నీ
వర్తమానంలో
కనిపించేవే
కాని
భూతములో
లేదు,
భవిష్యత్తులో
లేదు.
మంచువలె
నిలిచేటటువంటివాటికోసం
నీవు
బాధపడుతున్నావు.
ఇవి
కేవలం
ఎండమావులవంటివి.
ఎండమావులను
చూచి
ఎంత
దూరం
పోయినా
నీ
దాహం
తీరుస్తాయా?’
ఈవిధంగా
చాలా
బాగా
బోధ
చేస్తూ
వచ్చాడు.
ఈ
బోధలు
ఆ
మిత్రునికి
మెల్లగా
కొంచెం
కొంచెం
లోన
ప్రవేశిస్తూ
వచ్చాయి.
ఇద్దరూ
షిరిడీ
చేరారు.
మిత్రుడు
టాంగా
దిగి
ఒక
చెట్టుక్రింద
కూర్చున్నాడు.
శివదాస్
ఒక్కడే
లోపలికెళ్లాడు.
బాబాకు
నమస్కారం
చేశాడు.
‘స్వామీ!
నేనొక
మిత్రుడిని
తెచ్చాను,’
అని
చెప్పాడు.
బాబా
కోపంగా
“ఛీ!
ఛీ!
జావ్,
జావ్,
సైతాన్!”
అన్నాడు.
ఈ
కోపం
సహజం
అనుకున్నాడు.
తరువాత
మిత్రుడిని
తీసుకుని
వచ్చాడు.
చూచాడు
ఆ
మిత్రుడిని,
బాబా.
లేచి
కర్ర
తీసుకున్నాడు.
గట్టిగా
అరచాడు
‘వానిని
బయటకు
వెళ్ళగొట్టండి!’
అని.
భయం
వచ్చేసింది,
మిత్రునికి.
తన
మిత్రుడైన
శివదాసుపై
బాగా
కోప్పడినాడు:
‘చెప్పాను
కదా,
రాను
రాను
అని.
7
▾
Meaning
Keep
ఇంతమందిలో
నాకవమానం
అయిపోయింది.
ఇది
నాకు
జీవితములో
మాయని
మచ్చ’
అన్నాడు.
బయటికి
పోయి
మఱ్ఱిచెట్టుక్రింద
కూర్చున్నాడు.
‘ఏం
చేయను
బాబా!
అక్కడ
లోపల
వుండలేను,
అలాగని
చావిడిలో
వుండలేను’
అనుకుని
బయటికి
వచ్చాడు.
ఇంతలో
బాబా
‘ఏయ్
సర్దార్!
జావ్
జావ్’
అన్నాడు.
అని
ఒకడిని
దగ్గర
వున్నవానిని
పంపించాడు.
వాని
పేరే
శ్యామ్.
వాడు
వంటకూడా
వండేవాడు.
స్వామికెప్పుడూ
దగ్గరుండేవాడు.
‘వాడిని
మొట్టమొదట
వూరి
పొలిమేరలవరకూ
తరిమేసెయి,’
అని
చెప్పాడు.
సరే
అనుకుని
మిత్రుడు
టాంగా
ఎక్కి
కూర్చున్నాడు.
శివదాస్
చాలా
బాధ
పడ్డాడు.
కానీ,
తనలో
తాను
‘ఏదో
కారణం
లేనిదే
యిలా
జరగదు,’
అని
అనుకున్నాడు.
శివదాస్కూడా
వెళ్లి
టాంగాలో
కూర్చున్నాడు.
వారిరువురూ
మన్మాడ్
చేరి,
అక్కడినుండి
వారి
వూరు
బొంబాయి
చేరుకున్నారు.
అక్కడకు
చేరిన
తరువాత
శివదాస్
మాట
అంటే
అతనికి
గిట్టటం
లేదు.
శివదాస్తో
చెప్పాడు,
టాంగా
దిగిన
తరువాత:
‘శివదాస్,
నువ్వు
మా
యింటికెప్పుడూ
రావద్దు’
అన్నాడు.
అందుకు
శివదాస్
‘రావద్దు
అని
చెప్పటానికి
నీకు
అధికారం
లేదు.
నా
డ్యూటీ
నాది.
నేను
నా
మిత్రుడిని
బాగు
చేయాలనుకుంటే
నా
పట్టుదల
నేను
వదలను.
నేను
ఏ
చెడు
మాటలు
నీకు
బోధించటం
లేదు.
దుర్మార్గమును
నీకు
ప్రబోధించటంలేదు.
భగవంతుడిని
చేరమని
కోరుతున్నాను.
అది
నా
పరిపూర్ణ
విశ్వాసము.
నీవు
వినవచ్చు,
వినకపోవచ్చు.
ఏనాటికైనా
ఒక
బీజంగా
నీలో
ఈ
మాట
నిలిచిపోతుంది.
కాబట్టి
యిది
నా
డ్యూటీ,’
అని
తిరిగి
సాయంకాలం
వెళ్ళాడు.
‘నీవు
దీనికేమాత్రం
బాధపడవద్దు.
ఏదో
నీలో
వుండే
పాపమును
పరిహారం
చేసేందుకు
బాబా
యీ
రకంగా
చెపుతున్నారు.
బాబా
కారణం
లేని
కార్యంలో
ఏమాత్రం
ప్రవేశించడు.
తిట్టినా,
కొట్టినా,
ఏమి
చేసినాకాని
నీవు
పోయి
బాబా
పాదములు
పట్టుకో!
ఆ
పాదము
మాత్రం
నీవు
వదలకు.
ఈ
సంసారమునైనా
వదులు,
జీవితమునైనా
వదులు.
కాని,
ఆ
పాదములు
మాత్రము
వదలకు,’
అని
శివదాస్
చాలా
గట్టిగా
చెప్పాడు.
దైవభక్తిలేనివాడు
రాక్షసునితో
సమానము
మూడు
దినములైన
తర్వాత
ఆ
మిత్రుని
భార్యకు
ఒక
సన్యాసి
స్వప్నంలో
వచ్చాడు.
ఆమె
ఎప్పుడూ
బాబాను
చూడలేదు.
8
▾
Meaning
Keep
తలకు
బట్ట
కట్టుకున్నాడు.
కర్ర
చేతిలో
పట్టుకున్నాడు.
వచ్చేసి
‘అమ్మా!
నువు
చాలా
బాధ
పడ్తున్నావు.
నీవు
మంచి
దానివే!
కానీ,
నీకు
భర్తగా
ఒక
రాక్షసుడు
చిక్కాడు.
వాడికి
దైవమనికాని,
భగవంతుడనికాని,
భక్తికాని,
విశ్వాసంకాని
ఏమాత్రం
లేవు.
కనుకనే
నీ
కుమారుని
నీవు
పోగొట్టుకున్నావు.
తిరిగి
నీ
కుమారుడు
నీకు
కావాలనుకుంటే
తప్పక
షిరిడీ
వచ్చి
చేరు.
నీ
పోయిన
కుమారుడే
నీకు
లభిస్తాడు.’
తెల్లవారి
లేచింది.
“ఏమండీ!
ఎవరో
ఒక
సన్యాసి
నాకు
కలలో
వచ్చాడు.
తలకు
ఒక
బట్ట
కట్టుకున్నాడు.
కఱ్ఱ
చేతితో
పట్టుకున్నాడు.
నీవు
రాక్షసివంట.
రాక్షసునివంటి
వానిని
వివాహం
ఆడటం
చేతనే
నీ
కుమారుని
నీవు
పోగొట్టుకున్నావు.
దైవభక్తి
లేనివాడు
రాక్షసుడు
కాక
మరేమిటి?
కనుక
నీవు
షిరిడీ
వచ్చేసేయి,’
అని
చెప్పాడు.
‘మనము
షిరిడీకి
పోదామండి’
అన్నది.
అతను
చెప్పాడు,
‘నాకింకొక
అవమానం
కల్గవలెనని
వుందా?’
అన్నాడు.
‘పోయిన
కుమారుడు
తిరిగి
వస్తాడని
చెప్పాడు.
కాబట్టి
దీనికోసమైనా
మీరు
రండి,’
అన్నది.
తెల్లవారి
లేచి
టిఫిన్
తీసుకున్నాడు.
శివదాస్
యింటికెళ్ళాడు.
శివదాస్
‘నన్ను
మీ
యింటికి
రావద్దని
చెప్పినా
నువ్వు
మా
యింటికి
రావటం
చాలా
ఆనందంగా
వుంది’
అన్నాడు.
ఏమి
వచ్చావు?
అని
చాలా
ఆప్యాయంగా
పిలచి
టిఫిన్
అవీ
పెట్టాడు.
‘నా
భార్యకు
స్వప్నంలో
ఒక
సన్యాసి
కనబడి
షిరిడీకి
రమ్మని
చెప్పాడు,’
అన్నాడు.
‘అతను
సన్యాసి
కాదు,
బాబానే;
తిరిగి
షిరిడీ
పోదామ’న్నాడు.
తిరిగి
అందరూ
ప్రయాణమయినారు.
షిరిడీకి
వచ్చేటప్పటికి
యితనికి
భయం,
బాధ
పట్టుకున్నాయి.
తను
టాంగాలోనే
కూర్చుండి
భార్యను,
శివదాస్‌ను
మసీదులోనికి
పంపించాడు.
నవ్వుతూ
మాట్లాడాడు
సాయిబాబా,
యీ
భార్యతో.
‘నీ
కుమారుడు
పోయిన
విషయం
నాకు
తెల్సుకదా!
రాత్రి
నేను
వచ్చాను
కదా
అక్కడికి,
9.30కి
పూర్వము.
తిరిగి
ఆ
కుమారుడినే
నీకిస్తాన’ని
చెప్పాడు
బాబా.
ఆమె
‘నీ
రూపమే
నాకు
కలలో
వచ్చింది
బాబా!
నీవే
నాకు
కలలో
వచ్చినది,
నీవు
సర్వాంతర్యామివి’
అని
వర్ణిస్తూ
వచ్చింది.
‘ఈ
మాటలే
నీవు
నాకు
కలలో
చెప్పావు,’
అని
చాలా
ఆనందించినది.
అప్పుడు
శివదాస్
తన
మిత్రుని
‘బాబా
చాలా
సంతోషంగా
వున్నారు.
ఇది
తగిన
సమయం’
అని
సైగచేసి
పిలిచాడు.
అతడు
నెమ్మదిగా
బాబా
దగ్గరకు
వచ్చాడు.
బాబా
మళ్లీ
‘ఏయ్!
సైతాన్
జావ్’
అని
చాలా
గట్టిగా
చెప్పాడు.
కొన్ని
విషయాలు
గట్టిగా
చెప్పాడు.
9
▾
Meaning
Keep
‘వ్రాసినా
వ్రాయక
పోయినా
పరీక్ష
పాస్
చేస్తావా?
అన్నావు
కదా,
నువ్వు!
పురుష
ప్రయత్నం
వుండాలని
చెప్పావు
కదా!
అటువంటప్పుడు
నీ
కొడుకుని
నువ్వు
ఎందుకు
రక్షించుకోలేకపోయావు?
ఇది
పురుష
ప్రయత్నంతో
వచ్చిందా?
భగవంతుని
సంకల్పంతో
జరిగింది.
అహంకారంతో
వున్న
నీవు
ఫెయిల్
అయిపోయినావు.
పరిపూర్ణ
విశ్వాసంతో
వున్న
శివదాస్
పాస్
అయినాడు.
శివదాస్
నా
భక్తుడు.
అతనిని
యింత
అవమానం
చేయటమా?
నన్ను
చేసినా
ఫరవాలేదు.
నా
భక్తులను
చేస్తే
సహించను.
జావ్,
సైతాన్!’
అని
అరిచాడు.
కట్టె
విసిరేశాడు,
తలకు
తగిలింది.
భగవంతుడు
కారణం
లేని
కార్యము
చేయడు
ఎప్పుడు
ఆ
కఱ్ఱ
తలకి
తగిలినదో
మిత్రుని
మనసు
మారిపోయింది.
భగవంతుడు
కారణం
లేనిదే
కార్యం
చేయడు.
బుఱ్ఱ
పగిలేటప్పటికి
చాలా
బాధ
వచ్చేసింది.
వెనక్కి
తిరిగాడు.
‘మీరు
కొట్టండి,
చంపండి.
ఏమైనా
నేను
మీ
పాదములు
వదలను,’
అన్నాడు.
‘నీవే
నా
గతి.
నా
జీవితంలో
నేనింక
మిమ్మల్ని
మరువలేను.
మీరే
నాకు
దిక్కు,’
అని
గట్టిగా
పట్టేశాడు.
అప్పుడు
నవ్వాడు,
బాబా.
‘ఈ
భావం
వచ్చేదానికోసం
నేనింత
శిక్ష
యిచ్చాను.
చెఱకును
పట్టుకుని
బెల్లం
కావాలంటే
వస్తుందా?
మిషన్‌లో
వేసి
బాగా
క్రష్
చేశాక
రసంలా
వస్తుంది.
ఆ
రసాన్నికూడా
వూరికే
వదలకూడదు,
ఎండిపోతుంది.
అగ్నిలో
వేసి
దానిని
బాగా
మాడ్చాలి.
అప్పుడది
శాశ్వతంగా
బెల్లంగా
అయిపోతుంది.
ఈ
శరీరము
ఒక
చెఱకువంటిది.
నా
శిక్ష
ఒక
మిషన్.
దానిని
క్రష్
చేశాను.
రెండవ
శిక్ష
ఏం
చేసింది?
బాయిల్
చేసింది.
మూడవది
బెల్లం
చేసింది.
కనుక
యిన్ని
పనులు
చేస్తేకాని
మీ
పాడు
బుద్ధి,
చెడుబుద్ధి
మారదు.
ఆ
నమ్మకం
వచ్చేదానికోసం
యిన్ని
పనులు
చేశాను.
ఇప్పుడు
చెప్పు,
ఏం
కావాలి
నీకు?’
అని
అడిగాడు.
మిత్రుడు
చెప్పాడు;
నాకేది
అక్కరలేదని.
‘లోపల
విత్తనం
వుంటే
ఏనాడైనా
మొక్క
తిరిగి
వస్తుంది.
కనుక,
ఆ
విత్తనం
లేకుండా
పోవాలి.
నీకు
అదే
కుమారుడిని
తిరిగి
యిస్తున్నాను.
వచ్చే
సంవత్సరం
బిడ్డను
ఎత్తుకుని
రా!’
అన్నాడు
బాబా.
భార్య
చాలా
సంతోషించింది.
వీనికికూడా
లోపల
వుంటున్నాది
ఆ
కృతజ్ఞత.
కనుక
బాబా
పాదములకు
నమస్కారం
చేశాడు,
వచ్చాడు.
వచ్చిన
దగ్గరనుండీ
తెల్లవారి
మొదలు
రాత్రివరకు
బాబా
చింతనే!
10
▾
Meaning
Keep
మూడవ
నెలలోపలే
ఈమెకు
గర్భం
ప్రారంభమైనది.
సరే
సంవత్సరం
తిరిగేలోపలనే
ఇదివరకు
పోయిన
కుమారునికి
ఎక్కడెక్కడ
ఏ
మచ్చలవీ
వున్నాయో
ఆ
మచ్చలతోనే
పుట్టాడు,
కుమారుడు.
ఆ
కుమారుడిని
ఎత్తుకొని
తిరిగి
షిరిడీకి
వచ్చాడు.
షిరిడీ
వచ్చి
పాదాలపైన
పెట్టి
‘నీ
ప్రసాదమే!’
అన్నారు.
అప్పుడు
బాబా
‘యికపైన
నీ
‘లా’
లో
మార్పు
చేసుకో!
ఒక
‘లా’
లో
యింత
లాభం,
యింత
నష్టం
అని
ఒక
హద్దు
పెట్టుకో!
అంతేకాని
ఏనాడూ
అసత్యం
చెప్పనివారిచేత
నీవు
అసత్యం
పలికించరాదు.
సత్యహరిశ్చంద్రుడు
వచ్చినా
లాయర్సు
వానిచే
అబద్ధం
ఆడిస్తారు.
కనుక,
అలాంటి
గుణములు
వుండకూడదు.
న్యాయంగా
నీవు
విచారణ
చేయి.
ఆ
న్యాయార్జన
నీవు
పొందుతావు.
అంతేకాని
వారిని
పీడించి
డబ్బు
తీసుకోకూడదు.
ఎక్కడైనాకాని
నీవు
చూడు.
లాయర్సు
బిడ్డలు
కాని,
అల్లుళ్ళు
గాని
ఎవరికో
ఒకరికి
పిచ్చి
పట్టకుండా
వుండనివారు
వారిలో
వుండరు.
ఎవరో
ఒకరైనా
పిచ్చివాడుంటాడు.
లేకపోతే
ఈ
విధమైన
దోషాలవల్ల
లాయర్సుకు
అసలు
బిడ్డలైనా
లేకుండా
పోతారు.
కనుక
యిలాంటివన్నీ
చక్కగా
విచారణ
చేసుకో!’
అని
బోధించాడు.
అప్పటినుండి
ఆ
మిత్రుడు
బాబాకు
మంచి
భక్తుడుగా
మారిపోయాడు.
శివదాస్
చాలా
ఆనందించాడు.
నా
మిత్రునికి
యింతమాత్రం
ఉపకారం
చేయగలిగానని
చాలా
ఆనందించాడు.
భగవంతుని
చింతనతో
జరిగేది
కళ్యాణము
తర్వాత
శివదాస్కుకూడా
పెండ్లి
అయింది.
ఇద్దరూ
షిరిడీ
వచ్చారు.
‘నీకు
రెండు
చేతులే
మొదలు
యిచ్చాను.
ఆ
రెండు
చేతులతోనే
నన్ను
పూజ
చేస్తున్నావు.
పెండ్లి
అయిన
తర్వాత
యీ
రెండు
చేతులుకూడా
ముడుచుకోకూడదు’
అని
బాబా
అతనిని
హెచ్చరించాడు.
ఈ
ఆధునిక
యుగంలో
యిదొక
చెడు
అలవాటు.
పెండ్లి
అయిన
తర్వాత
యింక
స్నేహితులు
వుండరు,
వాళ్ళకు.
ఇంతకు
పూర్వం
స్నేహితులు
వుంటారు.
పెండ్లి
అయ్యాక
యింక
స్నేహితులు
వుండరు.
‘యిలాంటి
దానిలో
నీవు
పోకూడదు,
నాల్గు
చేతులతో
పూజ
చేయాలి.
పూర్వం
నువ్వు
రెండు
చేతులతోనే
చేస్తున్నావు.
ఇప్పుడు
నాల్గు
చేతులతో
చెయ్యాలి.
ఆమెనుకూడను
భక్తురాలిగా
నీవు
మార్చుకోవాలి
అప్పుడే
నీకు
పెండ్లి
అయినందుకు
సార్థకము.
11
▾
Meaning
Keep
కళ్యాణము
అంటారు.
పెండ్లి
చేసుకుని
ప్రాకృతమైన
జీవితం
గడుపుతూ
వుంటే
అది
కళ్యాణం
కాదు,
అశుభం
అవుతుంది.
భగవంతుని
చింతనతో
జరిగేది
కళ్యాణము.
అది
చాలా
బాగా
అవుతుంది,’
అని
చెప్పి
అతనిని
పంపించాడు
బాబా.
పెండ్లి
అయిన
తర్వాత
మాట్లాడుకుంటారు
కదా!
భార్యాభర్తలు.
‘మనం
భక్తిగా
వుండాలి.
నాకు
భగవంతుడే
గురువు.
షిరిడీసాయి
బాబాయే
నాకు
గురువు’
అని
భార్యకు
చెప్తూ
వచ్చాడు.
అందుకు
‘ఇంత
చిన్న
వయస్సులోనే
యీయన
సన్యాసులవెంట
తిరుగుతున్నాడే’
అని
ఆమెలో
ఆందోళన
ప్రారంభమైనది.
‘ఇంత
చిన్న
వయస్సునుంచీ
మీకెందుకు?
రిటైరు
అయ్యాక
కావాలంటే
మీరు
సన్యాసుల
దగ్గరకు
పోవచ్చు’
అన్నది.
అతను
ఒకే
మాట
చెప్పాడు,’
నా
భక్తికేదైనా
అడ్డువేస్తే
నిన్నుకూడా
వదుల్తాను.
కాని,
నేను
బాబాను
వదలను.’
ఆమెయందు
మార్పు
వచ్చేవరకు
అలా
మాట్లాడేంతవరకూ
ఆమెతో
ఒక్కమాటైనా
మాట్లాడటం
మానేశాడు.
అట్టి
నమ్మకం
అతనిది.
ఆమె
అనుకుంది,
‘ఇతనికి
ఏమాత్రం
యిబ్బంది
కల్గించకూడదు’
అని.
అలాగే
ప్రవర్తిస్తూ
వచ్చింది.
షిరిడీకి
పోవటం,
రావటం
యీ
రకమైన
ప్రయాణాలలో
వీరిద్దరూ
సంతోషంగా
వున్నారు.
క్రమక్రమేణా
అతడు
తన
వృత్తిలో
చాలా
పెద్దవాడయిపోయాడు.
ఒకానొక
సమయంలో
బాబాకు
ఒక
చిక్కు
వచ్చింది.
ఏమీ
చిక్కు
కాదది!
దొంగలంతా
దొంగతనం
చేసి
ధనము
మూట
కట్టుకుని
వెళ్ళిపోతున్నారు.
వాళ్ళని
పోలీసులు
పట్టుకున్నారు.
పోలీసులు
పట్టుకునేటప్పటికి
ఆ
సామానంతా
వాళ్ళ
చేతిలోకి
వెళ్ళిపోయింది.
పోలీసులు
ఎంక్వైరీ
చేస్తూ
‘మీరిది
ఎక్కడనుండి
తీసుకుని
వచ్చారు?’
అని
దొంగలను
అడిగారు.
వారికి
ఏమీ
చెప్పటానికి
తోచక
‘బాబా
యిచ్చారు,’
అన్నారు.
బాబా
యిచ్చాడనేటప్పటికి
బాబాను
పట్టుకున్నారు.
పోలీసులు
బాబా
దగ్గరకొచ్చి
‘మీరు
ఫలానివాళ్ళకి
యీ
సామానులు
యిచ్చారా?’
అని
అడిగారు.
“అవును,
నేనే
యిచ్చాను”
అన్నాడు,
బాబా.
అంటే
ఆయన
ఉద్దేశం
ఏమిటి?
‘అందరికీ
తానే
యిచ్చేది.
ప్రతి
ఒకరికీ
తానే
యిస్తున్నాడు.’
అందువలన
‘వీరికే
నేనే
యిచ్చాను
ఆ
సామాను’
అని
చెప్పాడు.
పోలీసులు
తిరిగి
‘ఈ
సామానులు
ఎక్కడ
మీకు
చిక్కాయి?’
అన్నారు.
‘నా
దగ్గరే
వున్నాయి’
అన్నాడు
బాబా.
ఈ
విధంగా
సంభాషణ
జరుగుతూ
వుంటే,
కొంతమంది
‘ఏమిటి
బాబా
యీలా
అంటున్నారు?
యివన్నీ
నా
దగ్గరే
వున్నాయి
నేనే
యిచ్చాను,
వీళ్ళంతా
నా
వాళ్ళే
అని
యీరకంగా
చెప్తున్నారే,’
అని
లాయర్స్‌లో
సందేహాలు
ప్రారంభమయినాయి.
12
▾
Meaning
Keep
అప్పుడు
బాబాను
కోర్టుకు
తీసుకుని
పోవాలి,’
అని
నిర్ణయించారు.
కాని,
యీ
శివదాస్
చాలా
పట్టుపట్టాడు
‘బాబాను
కోర్టుకు
తీసుకువెళ్ళరాదు’
అని.
కోర్టు
వారికి
ఒక
పిటిషన్
పంపించాడు
ఒక
కమీషన్
పెట్టాలని.
కమీషన్
పెట్టాలనుకున్నప్పుడు
యిక్కడ
కాకా
దీక్షిత్
బ్రదరు
ఒకడు
వుండేవాడు.
బాయిజీని
కమీషనర్‌గా
వేశారు.
ఇతనికి
బాబా
గురించి
బాగా
తెలుసు.
బాబాను
ఏవేవో
ప్రశ్నలు
వేస్తూ
వచ్చాడు.
అన్నిటికి
బాబా
‘ఇవి
నేను
యిచ్చినవే!
వారు
దొంగలు
కారు.
వాళ్ళు
నాదగ్గరకొచ్చి
అడిగారు,
నేనిచ్చాను’
అని
యీ
రకంగా
చెప్తూ
వచ్చాడు.
కమీషనరు
కొంత
యోచన
చేసి
‘యిదంతే!
బాబా
ఆధ్యాత్మికంగా
జవాబులు
చెపుతున్నాడు’
అనుకున్నాడు.
‘స్వామీ!
ఇది
ప్రాకృతమైన
కోర్టు.
ఇలా
జవాబు
చెప్పకూడదు.
మీరిచ్చారా
లేదా?
మీ
దగ్గరకు
వాళ్ళు
వచ్చారా?
లేదా?
అది
చెప్పండి’
అన్నాడు.
అప్పుడు
‘బాబా
తప్ప
ప్రపంచము
ఎక్కడుందిరా?
లా
లోపల
సైతాన్
వున్నాడు.
నేను
తప్ప
ప్రపంచము
ఎక్కడుంది?’
అని
చెప్పేశాడు.
ఆ
మాటలు
విన్న
గవర్నమెంట్
ప్లీడరు
‘ఈ
పిచ్చివానితో
మనకింక
పనిలేదు.
మనం
వెళ్దామ’ని
చెప్పాడు.
బాబా
ఒక
పిచ్చివాడని
నిర్ణయించాడు.
వాళ్లు
వెళ్ళిపోతూవుంటే
బాబా
పిలిచాడు.
‘అన్ని
సామానులు
మా
దగ్గరున్నాయి.
నీ
కిచ్చినది
నేను
కాదా?’
అని
యీరకంగా
చెపుతూ
వచ్చాడు.
ఇలా
‘నీకిచ్చింది
నేను
కాదా?
అతనికి
యిచ్చినది
నేను
కాదా?’
అని
యీరకంగా
చెప్తూ
ఉంటే
‘సరే!
ఈయనకింక
యీ
పిచ్చి
మరీ
పెరిగి
పోతోంది’
అని
గవర్నమెంటు
ప్లీడరు
టాంగాలో
కూర్చుని
వెళ్ళిపోయాడు.
నమ్మకం
లేకపోతే
ఎంత
భక్తి
ఉన్నా,
ఎన్ని
రకముల
సేవలు
చేసినా
ప్రయోజనం
లేదు
ఇంక
ఈ
కమీషన్వల్ల
ప్రయోజనం
లేదు,
ఈయనని
బొంబాయి
పిలచి
అక్కడే
ప్రశ్నించాలి,
అని
కోర్టు
సమన్లు
షిరిడీకి
పంపించారు.
ఫలాని
తారీఖులోపల
ఫలాని
టైముకి
మీరు
కోర్టులో
హాజరవ్వాలి
అని.
అక్కడుండే
భక్తులంతా
చాలా
బాధపడ్డారు.
దాసుగణు
ఎప్పుడూ
బాబావెంట
వుండేవాడు.
అతడు
ఏడ్చటం
మొదలుపెట్టాడు,
‘బాబాను
కోర్టుకు
పంపటమా?’
అని.
అప్పుడు
బాబా
‘ఏయ్
బైటో!
నీపాటికి
నువు
వుండు.
నేను
పోతాన’న్నాడు.
రేపటిదినము
9
గం॥లకు
బొంబాయి
ఫలాని
స్టేషన్లో
వుండాలి
అని
నిర్ణయించుకుని
టిక్కెట్టు,
అవీ
రెడీ
చేసుకుంటున్నాడు.
13
▾
Meaning
Keep
టాంగావాడు
టాంగా
తెచ్చి,
‘స్వామీ!
రేపు
ఉదయం
9
గం॥లకు
మనం
అక్కడ
వుండాలి’
అన్నాడు.
అప్పుడు
బాబా
‘నాకు
టాంగా
అవీ
వద్దు.
నేను
అందులో
ప్రయాణం
చేయను.
నా
మటుకు
నేను
పోతాను’
అన్నాడు.
ఎవరికీ
ఏమీ
మాట
చెప్పేటందుకే
భయం.
చాలా
కోపంగా
వున్నాడు
బాబా.
రాత్రి
10
గం॥లయింది.
రైలు
వెళ్లిపోయింది.
బాబానెవరూ
పలకరించలేదు.
లోపలకి
వెళ్ళాడు.
తలుపు
మూసుకున్నాడు.
తలుపు
తీయలేదు.
‘ఏదో
నీరు
కావాలనో,
కోర్టుకు
వెళ్ళాలనో
ఏదో
అడగాలి
కదా,’
అని
దాసగణు
బాధపడ్తున్నాడు.
ఇది
పొడిగించడం
ఎలా
సాధ్యమవుతుంది?
తెల్లవారి
బాబా
తలుపు
తెరచి
లోపలకి
వచ్చాడు.
‘ఏయ్!
నేను
బొంబాయి
పోవాలి’
అన్నాడు.
‘బొంబాయి
పోవాలంటే
ఒక
దినం
కావాలి.
24
గం॥లు
కావాలి.
అవి
నాకు
అక్కరలేదు,
నేను
పోతున్నాను’
అన్నాడు.
కూర్చున్నాడు.
పోతానంటే
టాంగా
తెచ్చారు.
బయటికి
రాలేదు.
టాంగా
ఎక్కలేదు.
ఏమీ
చేయలేదు.
కూర్చున్నాడు.
ఎవరొచ్చినాగాని
పొమ్మని
అరుస్తున్నాడు.
అంతకోపం!
‘జావ్’
అంటాడు,
పోకుంటే
తక్షణమే
కర్ర
తీసుకుని
కొడ్తాడు.
వెంట
తరిమి,
తరిమి
మరీ
కొడ్తాడు.
అందువల్ల
ఎవ్వరూ
దగ్గరకు
పోలేదు.
అందరూ
బయటనే
వున్నారు.
10
గం॥లయిన
తర్వాత
లోపలకొచ్చారు.
‘కేసు
అయిపోయింది’
అన్నాడు.
ఆనాడే
9.30
గం॥లకు
కోర్టులో
బాబా
హాజరు
అయ్యాడు.
గవర్నమెంటు
ప్లీడరు
ఎదురు
ప్రశ్నలు
అన్నీ
వేశాడు.
బాబా
జవాబులు
చెప్పాడు.
అంతా
లీగల్‌గా
చెప్పేశాడు.
అప్పుడు
కేసుని
కొట్టివేశారు.
రెండవదినము
బాయిజీ
వచ్చేశాడు.
‘స్వామీ!
నిన్నటిదినం
మీరు
జవాబులు
చాలా
కరెక్టుగా
చెప్పారు.
మిగిలిన
భక్తులంతా
బాబా
రాలేదే!
నిన్నటి
దినమంతా
యిక్కడే
వున్నారే’
అనుకున్నారు.
వీడు
ఎంక్వయిరీ
ప్రారంభించాడు.
‘బాబా
స్టేషన్లో
టిక్కెట్టు
తీసుకున్నాడా?
ఎక్కడ
వచ్చాడు?
ఎక్కడ
దిగాడు.
బొంబాయిలో
కోర్టులోనికి
ఎప్పుడొచ్చాడు?’
అని.
ఎక్కడా
ఏమీ
క్లూ
దొరకలేదు.
ఆ
ఎదురు
ప్రశ్నలు
వేసిన
లాయరుకూడా
బాబా
భక్తుడే!
ఇంతకాలం
బాయిజీ
కాకాజీకి
బ్రదరు
అయినా,
కాకాజీ
ఎప్పుడూ
షిరిడీలోనే
వుండేవాడు
అతని
కుమారుడే
మన
బృందావనంలో
వుండే
దీక్షిత్.
అతను
10
సం॥లు
యిక్కడే
బృందావనంలో
వుండి
మరణించాడు.
అతని
భార్యకూడా
యిక్కడే
వుంది.
20
సం॥లునుండి
యిక్కడే
వుంది.
14
▾
Meaning
Keep
నేను
మొన్న
మే
నెలలో
కొడైకెనాల్
వెళ్ళినపుడు
ఆమె
యిక్కడే
మరణించింది.
వీళ్లంతా
అతని
పరమభక్తులుగా
ఉండినారు.
కనుక,
ఒక్కొక్క
దానికి
నమ్మకం
అంత
ప్రధానం.
ఈ
నమ్మకం
లేకపోతే
ఎంత
భక్తి
వున్నా,
ఎన్ని
రకముల
సేవలు
చేసినా
ఉపయోగం
లేదు.
పైతట్టు
చేసే
ధ్యానము,
జపము,
పూజలు
కాదు,
ప్రధానం!
ఏమి
చేయకపోయినా
ఫరవాలేదు.
ఆ
నమ్మకం
ఉంచి
చెప్పిన
మాట
వినటం
కావాలి.
ఆ
విధమైన
నమ్మకంతో
వుండటంచేతనే
శివదాస్
యింతమందిని
యీరకంగా
భక్తులుగా
మార్చగలిగాడు.
అతనే
క్రమక్రమేణా
‘ప్రహ్లాద్’
అనే
పేరుతో
పిలువబడేవాడు.
బాబా
అతనిని
‘ప్రహ్లాద్’
అని
పిలిచేవారు.
విశ్వాసమే
ఊపిరి
ఈ
ప్రహ్లాద్
ఒకసారి
హరిశ్చంద్రగుట్ట
అనే
స్థలానికి
షికారుకి
వెళ్ళాడు.
అక్కడ
అతనికి
దాహం
వేసింది.
దాహం
వేసేటప్పటికి
చుట్టు
ప్రక్కల
చూశాడు.
నీరు
లేదు,
ఒక
చోట
నీరు
సన్నగా
ప్రవహించటం
చూశాడు.
ఆ
సమయంలో
బాబాను
తలుచుకోలేదు.
అక్కడికి
వెళ్ళాడు.
చేతికి
అందటం
లేదు,
నీరు.
నీరు
శుభ్రంగా
వుంది.
క్రింద
అంతా
తేమగా
వుంది.
ఎట్లా
నీరు
త్రాగటమా
అని
తాను
పండుకొని
నీరు
పడే
దగ్గర
నోరు
పెట్టి
త్రాగటానికి
ప్రయత్నిస్తూ
వుంటే,
మెడలో
వున్న
బాబా
యిచ్చిన
లాకెట్
క్రింద
పడింది.
అప్పుడు
బాబా
గుర్తుకు
వచ్చాడు.
బాబా
జ్ఞాపకం
వచ్చేటప్పటికి
‘బాబా!’
అని
గట్టిగా
అరిచాడు.
‘ఏమైంది
సైతాన్!
యిక్కడే
వున్నాను
నేను,’
అన్నాడు
బాబా.
‘నీరు
కావాలా?
తీసుకో,’
అని
చెంబుతో
నీళ్ళు
యిచ్చాడు.
‘బాబా!
నా
కోసం
యిక్కడికి
వచ్చావా?’
అని
చాలా
బాధ
పడ్డాడు,
అతడు.
‘నీ
కోసమే
వచ్చాను’
అన్నాడు
బాబా.
ఇంతలో
బాబాకు
నమస్కారం
చెయ్యాలని
వంగాడు.
కాని
బాబా
అక్కడ
లేడు.
అప్పటినుండి
యీ
ప్రహ్లాద్
ఎక్కడికీ
పోలేదు.
ఈ
ప్రాపంచిక
సంబంధమైన
వాంఛలను
అన్నీ
వదలిపెట్టేశాడు.
ఆయన,
ఆయన
భార్య
యిక్కడే
స్థిరపడిపోయారు.
ప్రహ్లాద్
మరణించిన
తర్వాత
ఆయన
భార్య
శేష
జీవితం
అక్కడే
గడిపింది.
ఆమెపేరే
లక్ష్మీబాయి.
బాబాకు
వంకాయ,
రొట్టె
యివన్నీ
చేసేది.
ఈ
వంకాయి,
రొట్టె
అంటే
బాబాకు
చాలా
యిష్టం.
బాబా
అడిగేసరికి
రెడీ
చేసి
వుంచేది,
పాపం!
ఎప్పుడూ
రెడిగా
పెట్టుకునేది
ఆమె,
ఎప్పుడు
బాబా
అడుగుతాడో
ఏమోనని.
15
▾
Meaning
Keep
అడిగినపుడు
‘లేదు’
అని
చెప్పకూడదు.
బాబాకు
‘లేదు,
కాదు’
అని
ఎవరైనా
చెప్తే
చాలా
కోపం
వచ్చేస్తుంది.
అందరూ
బాబా
చెప్పేదానికి
ఒప్పుకోవాలి.
ప్రతి
ఒక్కరూ
యస్,
యస్
అని
రావాలి.
శ్యామకర్ణ
అని
పూర్వం
ఒక
గుఱ్ఱం
వుండేది.
శ్యామ్
పోయిన
తర్వాత
యీ
గుఱ్ఱానికి
శ్యామ్
అని
పేరు
పెట్టాడు
బాబా.
ఇలా
ప్రతీ
దానికి
ఎన్నెన్నో
కారణాలున్నాయి.
ఈనాడు
ఏమేమి
జరుగుతున్నాయో
అవి
అన్నీ
ఆనాడు
జరిగినటువంటివే!
కనుక,
దైవభక్తి
అన్నది
వుండినంత
మాత్రాన
చాలదు.
ఆ
విశ్వాసం
వుండాలి.
ఆ
విశ్వాసమే
ఊపిరి.
శ్వాస
వుండికూడా
విశ్వాసం
లేకపోతే
వాళ్లు
ప్రాణం
లేనటువంటివారే!
అది
living
death!
వున్నదానిని
చక్కగా
అనుభవించండి.
Previous
←
Strive to cultivate equal-mindedness!
Next
Foster the principle of Prema in the heart
→