Contents
Devotion & Sacred Story
Home
Library
Find
Shelf
Settings
←
Leave
Sathya Sai Speaks 1992 · Foster the principle of Prema in the heart
Tap a verse for its meaning
IAST
Telugu
Meaning
Continuous
Foster the principle of Prema in the heart
21 June 1992, Informal talk to students, Brindavan
1
▾
Meaning
Keep
(త్రయీ
బృందావనంలో
స్వామి
ఒకసారి
విద్యార్థులతో
ఇష్టాగోష్టిగా
ప్రసంగిస్తున్నప్పుడు
వారు
‘స్వామీ!
ఈ
ప్రపంచంలో
ఆదర్శవంతుడైన
వ్యాపారస్తుడు
ఎవరైనా
ఉన్నారా?
ఆదర్శ
వ్యాపారస్తుడంటే
ఎలా
ఉండాలి
చెప్పండి’
అని
ప్రశ్నించారు.
అందుకు
సమాధానంగా
స్వామి........)
ప్రేమస్వరూపులారా!
30
ఏండ్లకు
పూర్వము
జపానువారు
అలక్ష్యంగా
వస్తువులు
తయారుచేసి
ప్రపంచానికి
సరఫరా
చేయటం
మొదలుపెట్టారు.
ఆ
వస్తువులలోపల
ఏమాత్రము
క్వాలిటీ
లేదు.
చివరకు
జపాను
వస్తువులంటే
ప్రపంచములోపల
చాలా
అలసత్వభావము
ఏర్పడిపోయింది.
ప్రజలందరు
వాటిని
గురించి
చాలా
అసహ్యంగా
మాట్లాడుతూ
వుండేవారు.
ఇది
ఎంతవరకు
వెళ్ళిందంటే
జపాను
వస్తువులంటే
ఎవరూ
కొనటానికి
ముందుకు
రాలేదు.
దీనివలన
దేశానికికూడా
చెడ్డ
పేరు
వచ్చింది.
వ్యాపారస్తులు
చక్కని
క్వాలిటీ
వస్తువులు
తయారు
చేస్తే
దేశానికి
చక్కని
పేరు
ఉంటుంది.
వ్యాపారస్థులు
క్వాలిటీ
లేకుండా
కేవలము
స్వార్థము,
స్వప్రయోజనముతో
వస్తువులు
ఉత్పత్తి
గావించినప్పుడు
దేశానికికూడను
చెడ్డ
పేరు
వస్తుంది.
ఆ
తరువాత
జపానీయులు
ఈ
పరిస్థితిని
గమనించి
లోతుగా
విచారణ
చేశారు.
పట్టుపట్టి
తమ
ఉత్పత్తులలో
క్వాలిటీని
చక్కగా
తీర్చి
దిద్దుకోవాలని
దీక్ష
పట్టారు.
క్రమక్రమేణా
జపానుకు
మంచి
పేరు
వచ్చింది.
తలచినది,
చెప్పినది,
చేసినది
ఒక్కటి
కావటమే
త్రికరణశుద్ధి
ఏమిటి
‘క్వాలిటీ’
అంటే?
నోటితో
చెప్పినది
మనస్సుతో
చింతించటం,
మనస్సు
చింతించినది,
చేతితో
చేయటం.
యీ
మూడింటియొక్క
ఏకత్వమునే
వారు
క్వాలిటీగా
భావించారు.
2
▾
Meaning
Keep
దీనినే
ఆధ్యాత్మికమందు
‘త్రికరణశుద్ధి’
అంటారు.
యిదే
ముఖ్యంగా
భావించారు.
వారు
తలచినది,
చెప్పినది,
చేసినది
ఒక్కటి
కావటంచేత
వస్తువుల
క్వాలిటీ
పెరిగిపోయింది.
క్వాలిటీ
పెరిగిన
తరువాత
జపాన్‌కు
మంచి
పేరు
వచ్చింది.
ఎట్టి
సహవాసమో,
ఎట్టి
సంబంధమో,
అట్టి
స్థితిని
పొందుతాయి
వ్యాపారములో!
అలాగే
యూరోపులోని
పశ్చిమ
జర్మనీలోకూడా
వ్యాపారము
చాలా
ప్రశాంతముగా,
తమ
తమ
కర్తవ్యమును
నిర్వర్తించుకుంటూ
చక్కగా
జరుగుతూ
వచ్చింది.
రెండవ
ప్రపంచయుద్ధము
ముగిసిన
తరువాత
పశ్చిమ
జర్మనీ
తూర్పు
జర్మనీ
ప్రజలతో
స్నేహము
జరిపింది.
తూర్పు
జర్మనీ
ప్రజలు
సోమరిపోతులు.
పశ్చిమ
జర్మనీ
ప్రజలు
చాలా
కష్టించి
పనిచేసేవారు,
తెలివైనవారు.
వారికి
పనులలో
ఉత్సాహము
అధికముగా
వుండేది.
కానీ
తూర్పు
జర్మనీ
ప్రజలకు
పనులలో
ఉత్సాహమనేది
లేదు.
వీరితో
సంబంధమైన
తరువాత
పశ్చిమ
జర్మనీవారుకూడను
తమ
పేరు
ప్రతిష్టలను
పాడు
చేసుకున్నారు.
కారణం
ఏమిటి?
మంచివారు
మంచివారితో
కూడితే
మంచి
మరింత
మంచిగా
మారుతుంది.
మంచివారు
చెడ్డవారితో
చేరినప్పుడు
వారుకూడను
చెడ్డగా
మారటానికి
వీలవుతుంది.
మంచివారితో,
ఉత్తములతో
స్నేహం
చేస్తే
మనముకూడా
మంచివారు,
ఉత్తములుగా
మారిపోతాము
యీ
మంచి
చెడ్డలలోపల
క్వాంటిటీ
మరియు
క్వాలిటీ
ఉన్నాయి.
పది
కప్పుల
పాలలో
ఒక
కప్పు
నీరు
కలిపినప్పుడు
పాలలో
ఉన్న
క్వాలిటీ
నీళ్ళకు
చేరిపోతుంది.
కనుక,
ఆ
కప్పు
నీరు
కలిపి
మొత్తం
11
కప్పులకు
పాల
ధర
వచ్చింది.
అట్లా
కాకుండా
పది
కప్పుల
నీళ్ళలో
ఒక
కప్పు
పాలు
కలిపితే,
నీళ్ళ
క్వాంటిటీ
మరియు
క్వాలిటీ
జాస్తిగా
వుంటుంది.
దీనిలో
క్వాంటిటీ
వున్నది
గాని
క్వాలిటీ
లేదు.
ఒక
కప్పు
పాలు
10
కప్పుల
నీళ్ళతో
చేరటంవలన
పాల
విలువ
తగ్గిపోయి
నీళ్ళ
విలువ
పెరిగింది.
మంచివారితో,
ఉత్తములతో
స్నేహము
చేసుకుంటే
మనముకూడా
ఉత్తములు,
మంచివారమవుతాము.
ఈ
తూర్పు
జర్మనీవారు,
పశ్చిమ
జర్మనీవారు
క్రమక్రమేణా
అమెరికన్సుతో
కలసిపోయారు.
అమెరికన్సుకు
ఆడంబరములు,
ఆశలు
అధికమేగాని
పనిపై
శ్రద్ధ
తక్కువ.
వారికి
ఆకర్షణ,
ఆశలుకూడా
ఎక్కువ.
3
▾
Meaning
Keep
కానీ
పశ్చిమ
జర్మనీవారికి
అంత
ఆశలు
లేవు.
తమయొక్క
పేరు,
ప్రతిష్టలు
అభివృద్ధి
చేసుకోవాలని
వారు
కుతూహలపడేవారు.
ఈ
విధంగా
పశ్చిమ
జర్మనీవారు
చాలా
ఉత్తములుగా
వుండేవారు.
క్రమక్రమేణా
వారియొక్క
క్వాలిటీకూడా
క్షీణించిపోయింది.
మనిషికి
విలువలేకుండా
ధనమునకు
విలువ
ఉండి
ప్రయోజనమేమిటి?
పూర్వము
జపానీస్
అమెరికాను
ఆశ్రయించారు.
వారు
అన్ని
పనులుకూడా
అమెరికాలోనే
నేర్చుకున్నారు.
నేర్చుకున్నారుకాని,
అమెరికావారికంటే
పనితనంలో
నిపుణులైపోయారు.
కారణమేమిటంటే,
అమెరికన్సుకి
మేధాశక్తి
అధికంగా
వుంది
కాని,
పనిపైన
శ్రద్ధ
లేదు.
ఈ
జపానీస్
పనిపైన
శ్రద్ధ
పెంచుకున్నారు.
కనుక
ఏ
అమెరికాలో
పని
నేర్చుకొని
వెళ్ళారో,
ఆ
అమెరికానే
మించిపోయారు.
కారణమేమిటి?
ఇక్కడ
ఒక
విధమైన
శ్రద్ధ.
శ్రద్ధే
కాకుండా
మానవతా
విలువలుకూడా
వారు
పోషించుకున్నారు.
అమెరికావారికి
ధనముపైన
మక్కువ
ఎక్కువ.
ధనమునకు
ఎక్కువ
విలువ
యిస్తారు.
కాని,
జపానీస్
మానవతా
విలువలకు
ఎక్కువ
విలువ
యిస్తారు.
అంతే
కాకుండా
వారు
పేరు,
ప్రతిష్టలకోసం
ప్రాకులాడుతారు.
అమెరికన్సుకు
పేరు
ప్రతిష్టలు
అవసరము
లేదు.
వాళ్ళకు
ధనమే
మూలం.
ఎలాగైనా
ధనం
సంపాయించాలి
అన్నదే
వారి
తాపత్రయము.
ఫలితంగా
వారు
డబ్బును
సంపాదిస్తున్నారు
కాని
విలువలను
గురించి
విచారించడం
లేదు.
ధనానికి
విలువ
యిస్తున్నారుకాని,
ధనముయొక్క
విలువను
గుర్తించడం
లేదు.
దీనికి
భిన్నంగా
జపానీస్
మనుషులకు
విలువ
యిస్తున్నారు
కాని
ధనమునకు
వారు
ఎక్కువగా
చూసుకోవటం
లేదు.
ఇదీ
వారి
మధ్యనున్న
భేదము.
ఈ
ప్రపంచములో
ధనము
అవసరమేకాని,
మనుషులకు
విలువనిస్తూ
ధనానికి
విలువ
యివ్వాలి.
అమెరికన్సు
అంతా
ధనముయొక్క
విలువ
చూస్తూ,
మనిషికి
విలువ
యిస్తున్నారు.
‘ఇతను
గొప్ప
ధనికుడు
అంటున్నారు.
కాని,
అతనిలో
మానవతా
విలువలు
ఉన్నాయా
లేదా,’
అని
చూడటం
లేదు.
ఏదో
ధనమునకు
విలువ
యిస్తున్నారు.
ఇంతే
కాకుండా,
అటువంటి
వ్యక్తియొక్క
వ్యాపారానికికూడా
అనేక
విధాలుగా
ప్రభుత్వం
ప్రోత్సాహమునిస్తున్నది.
అట్టివానికే
ఎక్కువగా
కాంట్రాక్టులు,
గవర్నమెంట్ద్వారా
జరిగే
లాభాలు
అందుతున్నాయి.
వారినే
ఏజెంట్స్‌గా
తీసుకుంటారు.
ఇది
చాలా
పెద్ద
తప్పు.
వ్యాపారము
చూడాలి,
మనిషియొక్క
విలువనుకూడా
చూడాలి.
4
▾
Meaning
Keep
మనిషికి
విలువ
లేకుండా
ధనమునకు
విలువ
యిచ్చి
ఏమి
ప్రయోజనం?
జన్మలు
మారినా
కర్మలు
మారటం
లేదు
దీనికొక
చిన్న
ఉదాహరణము.
షిరిడీ
కథ
ఒకటి
చెప్పుతాను.
అది
ఎండాకాలం.
షిరిడీగ్రామానికి
ప్రక్కన
గోదావరి
కాలువగా
పారుతున్నది.
ఆ
నది
ఒడ్డున
సాయంకాలం
బాబా
నడుస్తూ
పోతున్నాడు.
బాబా
జతలోపల
యీ
శ్యామ్
వచ్చాడు.
కొంతదూరం
పోయాక
కాలువ
ఒడ్డున
యిద్దరూ
కూర్చున్నారు.
అక్కడ
ఒక
కప్ప
గట్టిగా
అరుస్తూ
వచ్చింది.
శ్యామ్
చెప్పాడు.
‘బాబా!
చాలా
ప్రమాదంలో
ఉన్నది
యీ
కప్ప’
అని.
బాబా
చెప్పాడు,
‘నాకు
తెల్సునురా!
ఒక
పెద్ద
నల్ల
త్రాచు
పట్టింది
దాన్ని.
అది
మింగలేకుండా
వుంది,
ఇది
తప్పించుకోలేకుండా
ఉంది.
దానివల్ల
యిట్టి
గొడవ
జరుగుతున్నది.’
కప్పకు
తప్పించుకునే
శక్తి
లేదు.
పాముకు
కప్పను
మింగే
శక్తి
లేదు.
అందువలన
రెండింటికీ
బాధనే!
కనుక
దీనివల్ల
కప్ప
గట్టిగా
అరుస్తోంది.
‘అయ్యో
దానిని
తప్పించండి
స్వామీ!’
అన్నాడు,
శ్యామా.
‘ఆ!
లేస్తాను’
అని
లేచి
దాని
దగ్గరకు
పోయి
తిడుతూ
వచ్చాడు,
బాబా!
అది
‘నల్లత్రాచు,
చాలా
ప్రమాదమైనది.
మీరు
దగ్గరకు
పోవద్దు’
అన్నాడు,
శ్యామా.
ఇంకా
‘కర్రతో
దానిని
కొట్టకండి!
చాలా
ప్రమాదం’
అన్నాడు.
అప్పుడు
బాబా
‘శ్యామా!
నాకు
తెలుసును,’
అని
చెప్పి
దగ్గరకు
పోయి,
‘ఒరే!
వీరభద్రప్పా!
నీకు
యిన్ని
జన్మలెత్తినాకూడా
యింకా
దుర్బుద్ధి
పోలేదురా!
అరే!
చెన్నబసప్పా!
యిన్ని
జన్మలు
మారినా
నీకుకూడా
యీ
యీర్ష్య
తగ్గలేదు.
సిగ్గు
లేదా
యింకా,
యిన్ని
జన్మలెత్తినా!
పోండి’
అనేటప్పటికి
పాము
కప్పను
విడచి
పొదలలోనికి
పోయింది.
కప్ప
దానికది
వెళ్ళిపోయింది.
అప్పుడు
శ్యామా
బాబాను
‘యిది
ఏమి?
ఈ
వీరభద్రప్ప,
చెన్నబసప్ప
ఎవరు?
మీరు
చెప్పినవెంటనే
తక్షణమే
వెళ్ళిపోయాయే!’
అని
ప్రశ్నించాడు.
అందుకు
సమాధానంగా
బాబా
‘దీనికొక
పెద్ద
చరిత్ర
ఉందిరా,
శ్యామా!
పూర్వము
మథుర
గ్రామములో
ఒక
శివ
దేవాలయం
ఉండేది.
ఈ
మథురలో
కృష్ణుని
ప్రభావం
ఎక్కువగా
ఉండేది.
అందరూ
కృష్ణ
విగ్రహాలే
ప్రతిష్టించేవారు.
5
▾
Meaning
Keep
కాలక్రమేణా
ఆ
శివమందిరం
కూలిపోయింది.
గ్రామస్థులందరూ
చేరి,
(అది
చాలా
చిన్న
పల్లె)
డబ్బు
కూడబెట్టారు.
డబ్బును
వసూలు
చేసి
ఆ
గ్రామంలో
ఉన్న
ఒక
శ్రీమంతుని
చేతికిచ్చి.
‘యింత
డబ్బు
మా
దగ్గర
పెట్టుకుందుకు
వీలుకాదు.
స్వామీ!
మీ
దగ్గర
పెట్టుకోండి.
మీరే
యీ
మందిరాన్ని
చక్కగా
నిర్మించండి’
అని
చెప్పారు.
ఇంత
డబ్బు
దగ్గరకొచ్చేటప్పటికి
అతనికి
చాలా
ఆనందమైంది.
ఈ
శ్రీమంతుడు
ధనమునకు
మాత్రమే
విలువ
యిచ్చేవాడు.
అతనికి
దయాదాక్షిణ్యములు
అనేవి
లేవు.
పరమ
పిసినారి.
ఒక్క
నయాపైసాకూడా
త్యాగం
చేసే
స్వభావం
లేదు.
బిచ్చగాడు
వస్తే
వానిమీదకు
కుక్కను
వదలిపెట్టేవాడు.
ఈ
విధంగా
అతడు
చాలా
కఠినమైనవాడు.
కాని,
గ్రామానికి
పెద్దవాడు,
శ్రీమంతుడు
కాబట్టి
యింత
డబ్బు
తమ
గుడిసెలలో
పెట్టుకోవటం
మంచిది
కాదు
అని
భావించి
యీ
డబ్బు
అంతటికి
అతనినే
అధికారిగా
చేశారు.
క్రమక్రమేణా
నెలలు
జరుగుతూ
వచ్చాయి.
ఆ
శ్రీమంతుడు
మందిర
నిర్మాణంగురించి
ఏమాత్రం
చింతించటం
లేదు.
గ్రామస్థులంతా
అతని
వద్దకు
పోయి
‘ఏం
చేస్తున్నారు?
ఇంకా
మందిర
నిర్మాణం
ఏమీ
ప్రారంభించలేదే’
అని
అడుగుతూ
వచ్చారు.
అతనికి
స్వంత
ఎద్దుల
బండి
ఒకటి
ఉంటే
దానితో
యిసుక,
మట్టి
పోయించాడు.
ముక్కలుముక్కలు
అయిపోయిన
యిటుకలు
పోయించాడు.
పని
ప్రారంభించాడు
కాబోలు
అని
గ్రామస్థులంతా
అనుకుంటూ
వచ్చారు.
కాని,
అక్కడితో
ఆగిపోయింది.
ఆ
పాతమందిరం
దగ్గర
త్రవ్వలేదు.
ఏమీ
చేయలేదు.
ఇదంతా
చూసి
గ్రామస్థులు
‘ప్రభూ!
ఏమి?
యింకా
ఎప్పుడు
ప్రారంభిస్తారు?’
అని
అడిగారు.
అందుకు
శ్రీమంతుడు
‘ఎక్కడరా?
డబ్బంతా
అయిపోయింది.
ఇసుకకు
అయిపోయింది.
మట్టికి
అయిపోయింది.
ఇటుకలకు
అయిపోయింది.
ఇంకా
సున్నం
అదీ
తెప్పించాలి.
ఇంక
మందిరం
ఎలా
కట్టేది?’
అన్నాడు.
శ్రీమంతుడు
యీ
విధంగా
మాట్లాడుతూ
ఉంటే
ప్రజలేమి
చేస్తారు
పాపం?
వాళ్ళు
చాలా
బీద
ప్రజలు,
శక్తి
లేనటువంటివారు.
ఏమీ
మాట్లాడలేక
వారిలో
వారు
గుసుగుసలాడుతూ
వచ్చారు.
‘ఇంత
పెద్ద
మనిషి
యీ
విధంగా
చేస్తున్నాడే’
అని
వారిలో
వారు
మధనపడ్డారు.
వారికి
అతనిపైన
గౌరవం
తగ్గుతూ
వచ్చింది.
ఒకనాడు
ఈశ్వరుడు
ఆ
శ్రీమంతుని
భార్యకు
స్వప్నంలో
కన్పించాడు.
‘అమ్మా!
నీ
భర్త
ప్రజల
డబ్బునంతా
తీసుకుని
యీ
విధంగా
అసత్యమాడుతున్నాడు.
6
▾
Meaning
Keep
నాకు
మందిరం
అక్కరలేదు.
కాని,
ప్రజలు
నా
మందిర
నిమిత్తమై
చాలా
బాధపడ్తున్నారు.
నాకు
మందిరం
అక్కరలేదు.
కాని,
భక్తులు
మందిరాన్ని
కోరుతున్నారు.
భక్తులు
తమ
శక్తిసామర్థ్యములకు
తగినట్లుగా
డబ్బును
ప్రోగుచేశారు.
ప్రజలకింత
ద్రోహం
చేయకూడదు.
అతనేదో
చేశాడు.
కాని,
నీకు
నీ
పుట్టింటివారు
యిచ్చిన
నగలున్నాయి.
దానిని
అమ్మి
నీవైనా
యీ
మందిరాన్ని
కట్టించు’
అన్నాడు.
ఆమె
తెల్లవారి
లేచి
భర్తకు
చెప్పింది
‘నాకిలా
స్వప్నం
వచ్చింది’
అని.
స్వప్నమే
కాదు,
ప్రత్యక్షంగాకూడా
ఎవరు
చెప్పినా
వినేటువంటి
స్వభావం
కాదు,
ఆమె
భర్తది.
‘ఏయ్
నీకు
కల
వచ్చింది
కదా!
కలలో
వచ్చిన
దానికి
ఎందుకింత
భయపడ్తావు?
నిజంగా
ఈశ్వరుడే
కనుక
నాకు
కలలో
వచ్చి
చెపుతే
నేను
తప్పకుండా
కట్టిస్తా’
అని
చెప్పాడు.
యీ
విధంగా
మూర్ఖవాదన
చేసే
పిసినారులు
జగత్తులో
చాలామంది
ఉన్నారు.
‘భగవంతుడు
చెప్పేటట్టుంటే
నా
ఎదురుగా
వచ్చి
చెప్పనీ,
తనకి
గుడి
కట్టమని’
అని
వాదిస్తారు.
యీ
దరిద్రుడికి
భగవంతుడు
వచ్చి
చెప్తాడా?
సర్వులకూ
సిరిసంపదలు
అందించేవాడు
భగవంతుడే!
ఆ
భగవంతుడు
వచ్చి
యితని
దగ్గర
చేయి
చాపాలిట!
కనుక,
అతని
భార్యకూడా
అతనికేమీ
చెప్పలేకపోయింది.
మరల
రెండవ
దినము
ఆమెకు
తిరిగి
కలలో
వచ్చాడు,
ఈశ్వరుడు.
‘నీ
భర్త
యిదంతా
కల్ల
అంటున్నాడు.
ఈ
కలలంతా
కల్లలు
కాదు.
నిజమైనటువంటివి.
నువు
నా
మందిరం
కట్టించు.
ప్రజలను
సంతోషపెట్టు.
నీకు
సర్వ
సౌఖ్యములు
అందిస్తాను’
అన్నాడు.
ఆమె
తిరిగి
తెల్లవారి
లేచి
భర్తకు
చెప్పింది,
‘గతరాత్రికూడా
శివుడు
వచ్చాడు.
నాకు
సకల
సౌభాగ్యములనంతా
అందిస్తాన’న్నాడు
అని.
అందుకామె
భర్త
‘అయితే
మొట్టమొదట
సకలసౌభాగ్యాలు
అందించమను.
తర్వాత
గుడి
కడతాను’
అన్నాడు.
సరే!
యీ
విధంగా
అంటూ
వుంటే
ఆమె
మొండిపట్టు
పట్టింది.
‘నా
తల్లివైపు
వారిచ్చిన
నగలంతా
ఉన్నాయి.
అవన్నీ
అమ్మి
ఈశ్వరునికి
మందిరం
కట్టిస్తాను.
నీ
డబ్బు
ఒక్క
నయాపైసాకూడా
నేను
ముట్టను’
అన్నది.
‘సరే!
ఆ
నగలంతా
ఎంతవుతుందో!
వాటిని
నేనే
తీసుకుని
నీకు
డబ్బిస్తాను’
అన్నాడు.
ఆ
నగలు
బయటికి
పోవటం
అతనికి
యిష్టం
లేదు.
ఆమె
పాతకాలం
మనిషి,
పాపం!
వాటికి
ఎంత
విలువ,
ఎంత
బరువు
యివన్నీ
ఆమెకు
తెలీదు.
ఆ
నగలన్నీ
రాగి
కలిసినవని,
ఇంకా
ఏవో
అవీ
యివీ
చెప్పి
మొత్తం
వెయ్యి
రూపాయలు
చేస్తాయని
చెప్పాడు.
7
▾
Meaning
Keep
‘సరే!
ఏదో
అదైనా
నాకివ్వండి,
మందిరం
నేను
కట్టించుకుంటాను’
అంది.
ఇంతకు
పూర్వం
వడ్డీ
వ్యాపారం
చేసేవాడు,
ఆ
శ్రీమంతుడు.
ఒక
బీద
ముసలావిడకు
400
వందలు
రూపాయలు
అప్పు
ఇచ్చాడు.
ఆమె
ఆ
400
వందలు
రూ॥లు
అప్పు
తీర్చలేకపోవటంతో
ఆమెకుండే
2
ఎకరముల
భూమిని
యితను
స్వాధీనం
చేసుకున్నాడు.
అది
చాలా
విలువ
చేసే
భూమి.
అంత
విలువ
చేసే
భూమిని
400
వందలు
రూ॥లకు
తాకట్టు
పెట్టుకున్నాడు.
ఆ
ముసలావిడ
ఒకటే
ఏడుపు,
‘నా
జీవితం
ఎలా
నడుస్తుంది?
జీవితమంతా
ఆ
భూమిపైననే
ఆధారపడి
జీవిస్తున్నాను.
ఇది
తీసుకున్నాడే’
అని
చాలా
బాధపడింది.
ఇప్పుడు
భార్య
కాబట్టి
యీ
శ్రీమంతుని
ఏమీ
చేయలేకపోయింది
పాపం!
కాని,
భర్తపైన
పట్టలేని
కోపం
వస్తోంది.
కోపం
వచ్చి
ఏమి
ప్రయోజనం?
పేదవాని
కోపం
పెదవికి
చేటు!
కోపం
వస్తే
పెదవులు
కొరుకుతాం,
పెదవులకే
నష్టం.
అలాగే
ఏమీ
చేయలేకుండా
పోయింది.
అయితే
అపకారానికి
అపకారమే
తగులుతూ
ఉంటుంది.
దానినుండి
ఎవరూ
తప్పించుకోలేరు!
ఒకరోజు
రాత్రి
పెద్దగాలి,
వర్షము
వచ్చింది.
తమ
యిల్లు
కూలిపోయి
శ్రీమంతుడు,
అతని
భార్య
ఇద్దరూ
చనిపోయారు.
అదే
సమయానికి
ఆ
పేదరాలైన
ముసలి
ఆమెకూడా
తన
గుడిసె
పడిపోయి
మరణించింది.
మరు
జన్మలో
యితడు
వీరభద్రుడిగా
పుట్టాడు.
ఆమె
చెన్నబసప్పగా
పుట్టింది.
శ్రీమంతుని
భార్య
ఆలయపూజారి
కూతురిగా
పుట్టింది.
అప్పుడు
వారికి
యిదంతా
తెలియదు.
కొంతకాలం
అయినాక
యీ
అమ్మాయి
పెరుగుతూ
వచ్చింది.
ఈ
అమ్మాయికి
పూజారి
పెళ్ళి
చేయాలని
ప్రయత్నించాడు.
ఒకరోజు
రాత్రి
ఈశ్వరుడు
స్వప్నంలో
పూజారికి
కన్పించి,
‘నీ
బిడ్డను
వీరభద్రప్పకు
యిచ్చి
పెండ్లి
చెయ్యి’
అన్నాడు.
ఆ
విధంగా
పూజారి
తన
కుమార్తెను
వీరభద్రప్పకిచ్చి
పెండ్లి
చేశాడు.
దీనికి
తగినట్లుగా
మందిరం
యజమాని
భార్య
గర్భంలో
యీ
బీదరాలైన
ముసలామె
చెన్నబసప్పగా
జన్మించింది.
ఈ
విధంగా
ఉన్న
సమయంలో
అప్పుడుకూడా
యీ
భూమి
వ్యాపారం
చేస్తూ
వచ్చాడు,
వీరభద్రప్ప.
వ్యాపారం
చేస్తూ
ఉంటే,
ఒకరోజు
అతని
భార్య
‘నాకు
భగవంతుని
మందిరం
కట్టాలని
ఉంది’
అని
చెప్పింది.
యింకా
ఆమెకు
ఆ
సంకల్పం
పోలేదు.
జన్మలు
మారినా
సంకల్పాలు
ఉంటాయట!
శరీరం
క్షీణించినప్పటికీ
సంకల్పాలు
మటుకు
ఉంటాయట!
వజ్రసంకల్పములు,
ఎన్ని
యుగములైనా
కదులుతుంటాయి.
8
▾
Meaning
Keep
వాటికి
చావులేదు.
కనుక,
ఈమె
‘నేను
మందిరం
కట్టాలని
అనుకుంటున్నాను.
దానికి
మీరు
సహాయం
చేస్తారా?’
అని
అడిగింది.
ఈమె
మందిరం
కట్టాలని
అనుకున్నప్పుడు
ఆ
యజమాని
పుట్టాడు.
చెన్నబసప్ప
‘నేను
సాయం
చేస్తాను,
భూమి
యిస్తాను.
మందిరం
నీవు
కట్టు’
అన్నాడు.
మందిరం
కట్టడానికి
ఏదో
ఆ
చేయి
ఈ
చేయి
అన్నీ
కలిసి
మందిరం
కట్టవచ్చు.
కట్టడానికి
ప్రయత్నించారు.
మందిరము
కట్టడానికి
ముందు
భూమి
వ్రాయించుకో’
అన్నాడు,
వీరభద్రప్ప.
చెన్నబసప్పమాత్రం
‘ముందు
డబ్బు
యిచ్చేయి,
నేను
భూమి
యిస్తాను’
అంటాడు.
‘భూమి
తీసుకో
అని
వీడు,
డబ్బు
తీసుకురా
అని
వాడు,’
ఈ
రకంగా
ఎవరెవరి
స్వార్థానికి
వారు
ప్రాకులాడుతూ
వచ్చారు.
దీనికి
కోపం
వచ్చి
చెన్నబసప్పకు,
వీరభద్రప్పకు
పోట్లాట
జరిగింది.
అవి
పాత
వాసనలు.
వారికి
తెలీదు.
ఆ
వాసనలు
లోపలినుండి
ఉప్పొంగి
వస్తున్నాయి.
వీళ్ళకు
తెలీదు.
పాతవాసనలయొక్క
ప్రభావం
ఈ
విధంగా
వచ్చేటప్పటికి
వాళ్లిద్దరు
అక్కడకూడా
పోట్లాడుతూ
వచ్చారు.
చివరకు
యిరువురూ
చనిపోయారు.
తరువాత
వీరభద్రప్ప
త్రాచు
పాముగా
పుట్టాడు.
చెన్నబసప్ప
కప్పయి
పుట్టాడు.
యిక్కడకూడా
వారిద్దరూ
పోట్లాడుతూనే
ఉన్నారు.
ఈ
విధంగా
జన్మలు
మారినా,
కర్మలు
మారటం
లేదు.
కనుక
స్వార్థం,
స్వప్రయోజనం
ఉన్నవారు
ఎంతటి
ఉన్నతస్థాయికి
పోయినా
వారి
అల్పబుద్ధి
మాత్రం
తొలగిపోదు.
కనుక,
అల్పబుద్ధులను
దూరం
చేసుకోవాలంటే
మంచివారితో
స్నేహం
చేయాలి.
జన్మలు
మారినా
అల్పబుద్ధులే
ఉంటాయి,
కొందరికి
కొన్నిసార్లు
మంచివారితో
చేరినప్పటికినీ
నీ
చిత్త
వృత్తులు,
రోత
బుద్ధులుకూడా
ఒక్కసారి
పోయేటువంటివి
కావు.
నిత్యము
మనము
నీరు
త్రాగే
గ్లాసుని
అప్పటికప్పుడు
కడిగి
వేస్తే
శుభ్రం
అయిపోతుంది.
ఒక్క
నిమిషంలో
తుడిచేయవచ్చు.
కాని,
స్టోరురూములో
వేసిన
పాతసామాన్లు
అంతా
ఉంటాయి
చూడండి,
వారం
రోజులు
తోమినాకూడా
ఆ
పాత్రలు
పరిశుద్ధం
కావు.
ఎందువల్ల?
పాతవాసన.
ఎన్నో
ఏళ్ళనుండీ
ఆ
మాలిన్యం
దానికి
పట్టిఉంది.
ఎన్ని
జన్మలయొక్క
వాసనలో
మానవునియందు
ఉండటంచేత
వాడు
ఉత్తమ
జన్మలో
పుట్టినా
అల్ప
బుద్ధులే
ఉంటాయి
కాని,
ఉత్తమ
బుద్ధులు
రావు.
9
▾
Meaning
Keep
ఉత్తమ
జన్మము,
ఉత్తమ
బుద్ధులు
అనేవి
చాలా
అదృష్టవంతులకే
లభ్యం
అవుతాయి.
జన్మలు
ఉత్తమమైనవి
రావచ్చు,
బుద్ధులు
మాత్రం
అల్పబుద్ధులే
ఉంటాయి.
కనుక,
‘శ్యామా!
నీవు
ఉత్తమ
భావాలను
పెంచుకోరా!’
అన్నాడు,
బాబా.
‘నాకెట్టి
ఆశలు
లేవు
స్వామీ!
మీ
పాదాల
దగ్గరే
నా
జీవితం
గడచిపోవాలి.
నేను
మరణించటం
కూడా
మీ
పాదాలదగ్గరే
మరణించాలి.
ఈ
ఒక్క
కోరిక
తప్ప
నాకింక
ఏ
కోరిక
లేదు’
అన్నాడు,
శ్యామ్.
అప్పుడు
బాబా
‘ఆ!
సైతాన్!
మంచి
కోరికే
కోరావు.
ఆ
కోరికనే
చలించకుండా
పెట్టుకో!
ఎట్టి
పరిస్థితులలో
కూడా
నాకది
కావాలి,
యిది
కావాలి,
అది
చేయి,
ఇది
చేయి
అనే
కుటుంబవాంఛలు
మాత్రం
నీవు
పెట్టుకోకు!’
(ఎందుకంటే
శ్యామ్‌కి
పెళ్ళి
లేదు.)
‘నీవు
యీ
పెండ్లి
పిచ్చిలో
ప్రవేశించవద్దు.
పెండ్లి
పిచ్చిలో
నీవు
ప్రవేశిస్తే,
తల్లీ
యిష్టం
ఉండదు.
తండ్రి
యిష్టం
ఉండడు.
భగవంతుడూ
యిష్టం
ఉండడు.
స్నేహితులు
యిష్టం
ఉండరు.
ఆ
పిచ్చి
అలాంటింది.
పెండ్లి
పిచ్చి
పట్టిన
వాళ్ళే
తక్షణం
వదలిపెట్టి
పోతూ
ఉంటారు.
కారణాలు
ఏమి
చెప్తారు?
‘తండ్రికి
ఆరోగ్యం
సరిలేదు.
తల్లికి
ఆరోగ్యం
సరిలేదు.
వారిని
చూసుకునే
వారెవరు
లేరు.
కనుక
నేను
యింటికి
పోతున్నాను’
అంటారు.
వానితో
వచ్చింది
పెండ్లిరోగం.
అది
రావటంచేతనే
ఏదో
సాకులు
చెప్పి
వెళ్ళిపోతుంటారు.
కాని
డైరక్టుగా
చెప్పరు,
కారణం
యిది
అని.
వాళ్ళకుకూడా
అది
డైరక్టుగా
తెలీదు,
పాపం!
పరోక్షంగా
వచ్చేస్తుంది.
యీ
పెండ్లిరోగం
కనుక
వస్తే
ఏమైపోతావో
శ్యామా!’
అన్నాడు,
బాబా.
ఆ
హితబోధలు
విన్న
శ్యామా
‘నాకలాంటి
ఆశలే
లేవు
స్వామి!
ఒకే
ఆశ
ఉంది.
మీ
సేవలు
చెయ్యాలి’
అని
విన్నవించుకున్నాడు.
‘మంచిది,
చెయ్యి’
అన్నాడు,
బాబా.
వెంటనే
శ్యామా
ఆయన
పాదాలపైన
పడ్డాడు.
బాబా
మూడుతూర్లు
శ్యామా
తలపైన
తట్టాడు.
ఎందుకు
మూడు
తూర్లు
తట్టాడంటే
భౌతిక
శాంతి,
మానసిక
శాంతి,
ఆధ్యాత్మిక
శాంతి,
యీ
మూడింటియందు
శాంతి
కావాలి.
శారీరకంగా
శాంతి
అంటే
అన్ని
సదుపాయములు
వున్నాయి.
కాని
మానసికంగా
శాంతి
లేదు.
ఐశ్వర్యము
ఉండికూడా
శాంతి
లేదు.
తిండి
ఉండికూడా
ధనకనకవస్తు
వాహనాదులుండికూడా
మానసిక
శాంతి
లేకపోతే
ప్రయోజనం
ఏమిటి?
10
▾
Meaning
Keep
మానవునికి
శారీరక,
మానసిక,
ఆధ్యాత్మిక
శాంతులు
మూడూ
ఉండాలి
ధృతరాష్ట్రుడికి
కావలసినంత
ధనకనక
వస్తువాహనాదులున్నాయి.
కాని
కౌరవులకి,
పాండవులకి
మధ్య
జరుగబోయే
యుద్ధము
అతని
హృదయంలో
చిచ్చుమాదిరిగా
ఉండి
బాధిస్తోంది.
కనుక,
మానసిక
శాంతి
ఉండాలి.
మానసిక
శాంతి
ఉంది.
దైవచింతన
చేస్తున్నాము.
కాని
శారీరకంగా
ఆరోగ్యం
లేదు.
ఎన్ని
విధాల
పూజలు
చేస్తున్నాం!
అయితే
శరీరంలో
ఆరోగ్యం
లేకపోతే
యిక
మానసిక
శాంతి
ఎలా
వస్తుంది?
అంతేకాక
యీ
రెండింటికి
తగినట్లుగా
ఆధ్యాత్మిక
భావమే
హృదయంలో
లేకపోతే
ఉపయోగం
లేదు.
ఆరోగ్యం
బాగుండి,
దృఢంగా
వున్నాడు
దుర్యోధనుడు.
కావలసినంత
ధనం
ఉంది.
ఆధ్యాత్మిక
భావం
యింతమాత్రం
కూడా
లేదు.
ధర్మరాజువంటి
ధర్మవంతుడిని
నిందించటం,
పాండవుల
చెడ్డను
కోరుకోవటం,
వారికి
కృష్ణుడు
సహాయం
చేస్తున్నాడని
కృష్ణునిపైనకూడా
ద్వేషము
పెంచుకోవటం,
యీ
విధమైన
దుర్భావములతో
కూడివుంటే
ఎన్ని
ఉంటే
ఏమి
ప్రయోజనము?
శారీరకంగా,
మానసికంగా,
ఆధ్యాత్మికంగా
మూడింటియందు
కూడా
తగిన
పుష్టి,
సంతుష్టి
ఉండాలి.
ఇలాంటి
శాంతి
కోసమని
బాబా
మూడుసార్లు
తట్టాడు,
శ్యామా
తలపైన.
నమస్కారం
చేసి
లేచాడు,
శ్యామా.
ఎన్నడూ
లేనంత
ఉల్లాసం
వచ్చింది
అతనికి.
బాబా
షిరిడీలో
చిన్న
ఒక
చెక్కపైన
పడుకుండేవాడు.
దాని
పొడవు
5
మూరలు,
వెడల్పు
8
ఇంచిలు.
దీనిని
పైన
ఉండే
దూలానికి
గుడ్డ
పీలికలతో
వ్రేలాడగట్టి
దీనిపైన
పడుకునేవాడు.
ఒకానొకసమయంలో
నానా
ఆ
బల్లను
తెచ్చి
యిచ్చాడు.
అప్పట్లో
ఆయన
తహసీల్దారుగా
పని
చేస్తున్నాడు.
బాబా
దానిపైన
పండుకునేవాడు.
శ్యామా
బాబా
ఒళ్ళు
పడ్తున్నపుడు
బాబా
శరీరములోంచి
ఒక
విధమైన
కాంతి
వచ్చి
శ్యామా
శరీరంలోనికి
ప్రవేశించేది.
శ్యామా
కూడా
తన
శరీరంలో
ఏదో
కరెంటు
ప్రవహించినట్లుగా
భావించేవాడు.
బాబాయొక్క
అనుగ్రహమే
తనలో
ప్రవేశిస్తున్నదని
గుర్తించాడు.
అప్పటినుండి
తాను
బాబాకు
ఎంతో
సేవ
చేస్తుండేవాడు.
వంటకూడా
చేసేవాడు.
ఒకనాడు
బాబా
ఒంటరిగా
ఉండటం
చూసుకుని
శ్యామా
బాబాను
ఒక
ప్రశ్న
అడిగాడు:
‘స్వామీ!
నా
జీవితం
నీ
సమక్షంలో
ఆనందంగా
గడుపుతున్నాను.
కాని,
కాలము
ఎలా
నిర్ణయించినదో
ఎవరికీ
తెలీదు.
నాకు
ఎక్కువ
కాలం
జీవించాలని
లేదు.
నేను
నీలో
ఐక్యమై
పోవాలి.’
‘ఆ!
జావ్,
జావ్.’
అని
అభయమిచ్చాడు
బాబా.
శ్యామా
మర్నాడు
భోజనం
చేశాడు.
ప్రసాదం
బాబా
దగ్గరనుండి
తీసుకున్నాడు.
ఆరోగ్యంగా
ఉన్నాడు.
బాబా
కాళ్ళు
పడుతూ
పడుతూ
ఉండగానే
ఆఖరిశ్వాస
వదిలాడు.
11
▾
Meaning
Keep
అప్పుడే
బాబా
‘ఈ
శ్యామ్
నన్ను
వదలకూడదు.
నేనుకూడా
శ్యామ్‌ని
వదలకూడదు’
అని
ప్రక్కన
ఉండే
గుఱ్ఱానికి
‘శ్యామా’
అని
పేరు
పెట్టాడు
బాబా.
ఎందుకంటే
బాబా
రాత్రింబవళ్ళు
‘శ్యామ్,
శ్యామ్’
అని
పిలిచేవాడు.
తనకు
ఎదురుగా
లేని
శ్యామ్‌ని
తాను
ఎలా
పిలిచేది
అనుకుని
ఆ
పేరు
యింకొక
దానికి
పెట్టి
పిలుస్తాను
అని
బాబా
నిర్ణయించుకున్నాడు.
ఆ
విధంగా
బాబా
గుఱ్ఱానికి
‘శ్యామా’
అనే
పేరు
వచ్చింది.
మనసనే
పాత్రలో
ప్రేమ
అనే
కళాయి
లేకపోతే
అంతా
పాడయిపోతుంది!
‘ఓం
నమశ్శివాయ’
అని
పంచాక్షరీ
మంత్రంకాని,
‘ఓం
నమో
భగవతే
వాసుదేవాయ’
అనికాని,
‘ఓం
నమో
నారాయణాయ’
అని
కాని
బాబా
ఎన్నడూ
బోధించేవాడు
కాదు.
‘ఎప్పుడూ
మంచిగా
ఉండండి.
మంచిగా
బ్రతకండి.
మంచి
పేరు
తెచ్చుకోండి’
అని
బోధించేవాడు.
అదే
మానవునికి
ఉండవలసిన
నిజమైన
భక్తి.
ఆ
మంచి
పేరు
లేకుండా
ఎన్ని
జపాలు
చేసి
ఏమి
ప్రయోజనం?
ధ్యానం
చేసి
ప్రయోజనం
ఏమిటి?
ఇవి
అన్నీ
మనసుద్వారా
చేస్తున్నారు.
కనుక
మనసును
మంచిగా
పెట్టుకోండి!
మనసును
మంచిగా
పెట్టుకుని
ఆ
మనసులో
ప్రేమతత్త్వాన్ని
నింపుకోండి!
మంచి
కూరగాయలు
తెచ్చారు.
మంచి
చింతపండుకూడా
తెచ్చారు.
ఉప్పుకూడా
తెచ్చారు.
మంచి
పాత్ర
ఉంది.
వంటవాడు
చూస్తే
నలభీమపాకం
చేసే
వంటవాడు.
ఇవన్నీ
ఉపయోగించి
సాంబారు
వండాడు.
సాంబారు
వండేటప్పటికి
చిలుము
పట్టింది.
దేనివల్ల?
కూరగాయల్లో
తప్పా?
వండటంలో
తప్పా?
ఉపయోగించిన
పదార్థంలో
తప్పా?
కాదు
కాదు.
పాత్రలో
కళాయి
లేదు.
ఆ
కళాయి
లేని
పాత్రలో
పులుసు
వండటంచేత
అంతా
విషం
అయిపోయింది.
కనుక
శ్రవణం,
కీర్తనం,
విష్ణుస్మరణం,
అర్చనం,
వందనం,
పాదసేవనం,
దాస్యం,
స్నేహం,
ఆత్మనివేదనం
యీ
నవవిధభక్తులు
గొప్పవే
అయినా
మనసనే
పాత్రలో
ప్రేమయనే
కళాయి
లేకపోతే
అంతా
పాడయిపోతుంది!
కనుక
హృదయంలో
ప్రేమతత్త్వాన్ని
పెంచుకోవాలి!
Previous
←
Faith, the chief value man must have
Next
God alone is the true Guru
→